
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలపై అంచనాలు ఓ రేంజులో ఉన్నాయి. ప్రస్తుతం చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే తారక్ కొరటాల శివతో మూవీ చేస్తున్నాడు. #NTR30 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాతో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ టాలీవుడ్‌కు పరిచయం కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్ వదిలాడు తారక్. వస్తున్నా.. అంటూ తాను సెట్స్‌లో అడుగుపెట్టిన వీడియోను రిలీజ్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్న వాయిస్ వింటేనే గూస్‌బంప్స్ వస్తున్నాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.
కాగా ఈ చిత్రానికి హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్న విషయం తెలిసిందే! కెన్నీ బెట్స్ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా, బ్రాడ్ మిన్నిచ్ వీఎఫ్‌ఎక్స్ సూపర్ వైజర్‌గా పని చేస్తున్నారు. కల్యాణ్ రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇకపోతే మిర్చితో డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కొరటాల శివ.. తొలి సినిమాతోనే మంచి మార్కులు పట్టేశాడు. స్వతాహాగా రైటర్ కావడంతో ఈ సినిమాలో డైలాగ్స్ కూడా తనే రాశాడు. తర్వాత మహేశ్‌బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను, ఎన్టీఆర్‌తో జనతా గ్యారేజ్, చిరంజీవితో ఆచార్య సినిమాలు చేశాడు.
Great to be on sets again with Koratala Siva ! pic.twitter.com/uKNFNtKyZO
— Jr NTR (@tarak9999) April 1, 2023
Comments
Please login to add a commentAdd a comment