యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.
తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.
ఓటీటీకి దేవర
నవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది.
Comments
Please login to add a commentAdd a comment