Video Song
-
ఏడిపించేస్తున్న బుజ్జితల్లి వీడియో సాంగ్
-
సిరివెన్నెల స్మృతిలో 'స్వప్నాల నావ' సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్
మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన దర్శకులు వీఎన్ ఆదిత్య తాజా ప్రాజెక్టు 'స్వప్నాల నావ'. శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డల్లాస్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గోపీకృష్ణ కొటారు ఈ సాంగ్‌ను రూపొందించారు. అంతే కాకుండా గోపికృష్ణ కుమార్తె శ్రీజ ఈ పాటను ఆలపించడంతో పాటు నటించారు.ఈ'స్వప్నాల నావ' థీమ్ దివంగత స్టార్ లిరిసిస్ట్ అయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దివ్య స్మృతికి అంకితంగా దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందించారు . ఈ పాటకు ప్రముఖ సినీ నిర్మాత శ్రీమతి మీనాక్షి అనిపిండి సమర్పకులుగా వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకుడు పార్థసారథి నేమాని. యశ్వంత్ ఈ పాటకి సాహిత్యం అందించారు.'సిరివెన్నెల సీతారామశాస్త్రి' అంటే దర్శకులు వి.ఎన్.ఆదిత్యకు ఎంతో అభిమానం. ఆయన సూపర్ హిట్ సినిమా 'మనసంతా నువ్వే' లో కూడా సిరివెన్నెలతో గుర్తుండిపోయే ఓ పాత్రని చేయించారు. ఇప్పుడు 'స్వప్నాల నావ' తో సిరివెన్నెల గొప్పతనాన్ని, అభిమానాన్ని చాటుకున్నారు. అందుకే ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ లభిస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో 1 మిలియన్ వీక్షణలు వచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
ఓ బుజ్జి తల్లీ వీడియో సాంగ్ విడుదల
‘గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నాప్రాణం... నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం...’’ అంటూ భావోద్వేగంతో సాగుతుంది ‘బుజ్జి తల్లీ..’ పాట. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ‘తండేల్’.చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లీ...’ పాట వీడియోను శనివారం విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జావేద్ అలీ పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. -
‘స్పప్నాల నావ’.. ‘సిరివెన్నెల’కు అంకితం
ప్రముఖ దర్శకుడు వీ.ఎన్. ఆదిత్య(VN Aditya) ‘స్వప్నాల నావ’ అనే పాటను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు. డల్లాస్‌లో స్థిరపడిన తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపీ కృష్ణ కొటారు నిర్మాణ సంస్థ ‘శ్రీ క్రియేటివ్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్’లో రూపొందుతున్న తొలి వీడియో సాంగ్ ఇది. గోపీ కృష్ణ కుమార్తె శ్రీజ కొటారు పాడి, నటించబోతున్న ఈ పాటకు పార్ధసారధి నేమాని స్వరాలు సమకూర్చగా.. యశ్వంత్ సాహిత్యం అందజేశారు. ఈ మ్యూజిక్ వీడియోకి బుజ్జి.కే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. పూర్తిగా అమెరికాలోని డల్లాస్ నగరంలో చిత్రీకరించిన స్వప్నాల నావ పాట పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భగా జరిగిన వీడియో లాంచ్ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని నిర్మాత గోపీకృష్ణ కొటారు, కుమారి శ్రీజ కొటారును అభినందించారు.సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Seetharama Sastry ) భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన భావజాలం ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతుందన్నారు గోపీకృష్ణ . ఆయనే ఉండి ఉంటే యువతరానికి తన సాహిత్యం ద్వారా ఎలాంటి సందేశం ఇస్తారన్న ఆలోచనలో నుంచే స్వప్నాల నావ పాట చేయాలనే భావన కలిగిందని గోపికృష్ణ తెలిపారు.పార్ధసారథి నేమాని మాట్లాడుతూ.. ప్రతి చిన్న విషయానికి యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్రిగారిలాంటి గొప్ప వ్యక్తి ఇచ్చిన సాహిత్యాన్ని ప్రేరణగా తీసుకుని పిల్లల కోసం ఈ పాట చేశామన్నారు. ఈ పాటను ఆలపించిన శ్రీజకు ప్రొఫెషనల్ సింగర్ అయ్యే లక్షణాలు ఉన్నాయని పార్ధు ప్రశంసించారు. ఎన్నో పెద్ద సినిమాలకు దర్శకత్వం వహించిన వీఎన్ ఆదిత్య ఈ పాటకు దర్శకత్వం వహించడం గొప్ప విషయమన్నారు పార్ధసారథి.దర్శకుడు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. ఎన్నిసార్లు కిందపడితే అంతగా మనిషి పైకి వస్తాడని అన్నారు . గోపీకృష్ణ కొత్త ప్రయాణం మొదలుపెట్టారని.. ఆయన జర్నీ సక్సెస్ కావాలని వీఎన్ ఆదిత్య ఆకాంక్షించారు. శ్రీజ ప్రతిభ, గాత్రం చూస్తే ప్రొఫెషనల్ సింగర్‌గా అనిపించిందే కానీ అప్పుడే అరంగేట్రం చేసిన యువతిలా కనిపించలేదని ప్రశంసించారు. ‘‘స్వప్నాల నావ’’ పాటను వీలైనంత త్వరగా చిత్రీకరణ జరిపి మీ ముందుకు తీసుకొస్తామని ఆదిత్య వెల్లడించారు. -
డీజే టిల్లూ ‘కొట్టూ కొట్టూ...’
పలమనేరు (చిత్తూరు): ఓంశక్తి మాల ధరించి అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులకు డీజే టిల్లూ డ్యాన్సు చుక్కలు చూపించిన సంఘటన ఆదివారం పలమనేరులో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. పలమనేరు రెవెన్యూ డివిజన్లోని చౌడేపల్లి మండలం పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన 34 మంది ఓంశక్తి భక్తులు ప్రైవేటు బస్సును రూ.1.25లక్షలకు మాట్లాడుకొని ఆలయాల సందర్శనకు ఈ నెల 22న బయల్దేరారు. బస్సు అద్దెకు చెల్లించిన మొత్తం పోగా మిగిలిన పదివేలను స్వగ్రామంలో బస్సు దిగినాక ఇస్తామని తెలిపారు. ఈ టూరిస్ట్ బస్సు తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల సందర్శనానంతరం బయలుదేరింది. ఈ నేపథ్యంలో బాగేపల్లి వద్ద డ్రైవర్ అరవింద్ డీజిల్‌కు డబ్బులిస్తేనే బస్సు కదులుతుందని ఆపేశాడు. దీంతో ప్రయాణికులు, డ్రైవర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీనిపై ఆగ్రహించిన బస్సు డ్రైవర్ మహిళలపై దాడికి దిగాడు. తనకు డబ్బులు మొత్తం ఇస్తేనే బస్సు కదులుతుందని తెగేసి చెప్పారు. వారు ఇవ్వకపోవడంతో కర్ణాటకలోని ధర్మస్థలం వద్ద ప్రయాణికులను బస్సులోంచి దింపేశాడు. దీంతో పిల్లాపాపలతో వారంతా రాత్రిపూట రోడ్డుపై పడుకోవాల్సి వచ్చింది. ఆపై అందరూ కలిసి డబ్బులు సమకూర్చుకుని అదే బస్సులో ప్రయాణం మొదలు పెట్టారు. మార్గమధ్యంలో బస్సులోని వారు డీజే టిల్లు వీడియో సాంగ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే బస్సులో వీడియో పనిచేయడం లేదని డ్రైవర్ చెప్పాడు. అప్పుడేమో అన్నీ ఉన్నాయని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అని మళ్లీ డ్రైవర్‌తో ప్రయాణికులతో గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలో బస్సులోని కొందరు యువకులు డీజే టిల్లు డ్యాన్స్‌లు మొదలు పెట్టారు. దీంతో డ్రైవర్ బస్సును పలమనేరు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద ఆపేసి తమ యజమానికి ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న యజమాని, డ్రైవర్లు స్థానిక యూనియన్ నాయకులతో కలసి సమస్యను పరిష్కరించారు. బస్సు గ్రామానికి వెళ్లిన తరువాత మిగిలిన అద్దె ఇచ్చేలా నిర్ణయించారు. దీంతో ఓంశక్తి భక్తులు ఊరు చేరుకున్నారు. -
కిందపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇటీవలే కేరళలో షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం విజయ్ వీడీ12 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఆ తర్వాత టాక్సీవాలా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల దర్శకత్వాల్లోనూ సినిమాలు చేసేందుకు విజయ్ దేవరకొండ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ ముంబయిలో సందడి చేశారు. ఓ ఈవెంట్‌కు హాజరైన విజయ్ అనుకోకుండా స్టెప్స్‌పై కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అయితే విజయ్‌కి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. విజయ్ కిందపడ్డ వెంటనే పక్కనే ఉన్నవాళ్లంతా అలర్ట్ అయ్యారు. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లారు.తొలిసారి మ్యూజిక్ ఆల్బమ్‌లో విజయ్‌అయితే విజయ్ దేవరకొండ ఓ మ్యూజిక్ ఆల్బమ్ వీడియోలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. తన కెరీర్లో మొదటిసారి హిందీ మ్యూజిక్ వీడియో సాంగ్‌లో విజయ్ కనిపించనున్నారు. ఈ సాంగ్‌లో విజయ్ దేవరకొండకు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ నటిస్తోంది సాహిబా పేరుతో హిందీ వీడియో సాంగ్‌కు ఫేమస్ బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సాంగ్‌కు సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తుండగా..త్వరలోనే ఈ పాటను విడుదల కానుంది. ఈ ఈవెంట్ కోసమే విజయ్ ప్రస్తుతం ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by F I L M Y G Y A N (@filmygyan) -
దేవర తాండవం.. ఫుల్ వీడియో అదిరిపోయిందిగా!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన మాస్ యాక్షన్ చిత్రం దేవర పార్ట్-2. సెప్టెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ భామ, శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. సముద్రం బ్యాప్‌డ్రాప్‌లో వచ్చిన దేవర బాక్సాఫీస్ వద్ద రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.తాజాగా ఈ మూవీ నుంచి దేవర తాండవం అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ తన స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ ఫ్యాన్స్ ఈ ఫుల్ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించారు. దేవరలో శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.ఓటీటీకి దేవరనవంబర్ 8 నుంచే దేవర ఓటీటీలో సందడి చేయనుంది. ఇప్పటికే స్ట్రీమింగ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. త్వరలోనే బాలీవుడ్ ప్రేక్షకులకు సైతం దేవరను అందుబాటులోకి తీసుకురానుంది. -
ఆ.. చుట్టమల్లే పాట వీడియో సాంగ్ వచ్చేసింది..
జూనియర్ ఎన్టీఆర్ 'దేవర' సినిమాలో బ్లాక్‌బస్టర్ అయిన సాంగ్స్‌లో చుట్టమల్లే పాట ముందు వరుసలో ఉంటుంది. ఈ పాటకు థియేటర్లు సైతం ఊ కొడుతూ ఊగిపోయాయి. అంతలా యూత్‌ను పిచ్చెక్కించిన ఈ పాట ఫుల్ వీడియోను శనివారం రిలీజ్ చేశారు. విడుదలైన నిమిషాల్లోనే మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.ఈ పాటలో తారక్, జాన్వీ కపూర్ల కెమిస్ట్రీ అదిరిపోయింది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించాడు. శిల్పరావు గాత్రం ఈ రొమాంటిక్ మెలోడీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. దేవర సినిమా విషయానికి వస్తే సెప్టెంబర్ 27న విడుదలైన ఈ మూవీ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ .కె నిర్మించారు. -
దేవర ఆయుధ పూజ.. ఫుల్ వీడియో వచ్చేసింది!
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన ఫుల్ యాక్షన్ మూవీ దేవర పార్ట్-1. ఇటీవల థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీలో బాలీవుడ్ భామ జాన్వీకపూర్ హీరోయిన్గా నటించింది. ఎన్టీఆర్ సరసన తనదైన నటన, డ్యాన్స్‌తో అభిమానులను మెప్పించింది. ప్రస్తుతం దేవర విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతోంది.అయితే తాజాగా దేవర టీమ్ ఆయుధ పూజ సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాట ఫుల్ వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేసింది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్‌లో వ్యూస్‌పరంగా దూసుకెళ్తోంది. ఇంకేందుకు ఆలస్యం ఆయుధ పూజ ఫుల్ వీడియో సాంగ్ చూసేయండి. కాగా.. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ పార్ట్-2 కూడా ఉందని దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే ప్రకటించారు. The most celebrated #AyudhaPooja video song is here! 🔥 https://t.co/LYPF5fA8Se #Devara #BlockbusterDevara— Devara (@DevaraMovie) October 22, 2024 -
'శ్రీమతి గారు' మెలోడీ సాంగ్ వీడియో రిలీజ్
దుల్కర్ సల్మాన్ లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. 90స్ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీసిన ఈ సినిమాని దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇదివరకే 'శ్రీమతి గారు' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు దాని పూర్తి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.(ఇదీ చదవండి: 'సిటాడెల్' ట్రైలర్.. ఫైట్స్ అదరగొట్టేసిన సమంత)'సర్' మూవీ తీసిన వెంకీ అట్లూరి.. 'లక్కీ భాస్కర్' తీశాడు. అందులో మాస్టారూ మాస్టారూ పాట లాంటి మెలోడీ గీతాన్నే ఇందులో అనుకున్నాడో ఏమో గానీ.. 'శ్రీమతి గారు' పాట అలాంటి ఫీల్ ఇచ్చింది. వింటుంటే భలే అనిపించింది. (ఇదీ చదవండి: బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక.. ప్రభుత్వంతో కలిసి) -
'మార్ ముంత.. చోడ్ చింత'.. కేసీఆర్ డైలాగ్ అదిరిపోయింది!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని మోస్ట్ అవేటైడ్ చిత్రం 'డబుల్ ఇస్మార్ట్'. ఈ మూవీని ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ సరసన కావ్యా థాపర్ కనిపించనుంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటికే స్టెప్ మార్ అనే పాటను రిలీజ్ చేసిన టీమ్ తాజాగా మరో సాంగ్‌ను విడుదల చేసింది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా.. రాహుల్ సిప్లిగంజ్, కీర్తన శర్మ ఆలపించారు. అయితే ఈ సాంగ్ మధ్యలో మాజీ సీఎం కేసీఆర్ వాయిస్ డైలాగ్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది.కాగా.. పూరి- రామ్ కాంబోలో 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ భారీగా వసూళ్లు సాధించింది. దీంతో ఈ మూవీకి కొనసాగింపుగా డబుల్ ఇస్మార్ట్‌తో రామ్ పోతినేని ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. Yo boys! #MaarMunthaChodChinta …Enjoy! https://t.co/9IMWg4rcUb-USTAAD #DoubleIsmart Shankar pic.twitter.com/IjB7f6gWtV— RAm POthineni (@ramsayz) July 16, 2024 -
'కల్కి 2898 ఏడీ'.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు రోజుల్లో ఏకంగా రూ.725 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. కేవలం ఉత్తర అమెరికాలోనే 13.5 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ సినిమాను తెరకెక్కించారు.తాజాగా ఈ మూవీ నుంచి ఓ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. కల్కి 2898 ఏడీ చిత్రంలోని హోప్ ఆఫ్ శంబల అనే వీడియోసాంగ్ విడుదలైంది. వారణాసి, కాంప్లెక్స్, శంబల.. ఈ మూడు ప్రపంచాల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీని రూపొందించారు. కాగా.. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. The hope begins with her…#HopeOfShambala Video Song from #Kalki2898AD out now 🎵🔗 https://t.co/BxcYCLzjW9#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/YOhI2a9OmM— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 4, 2024 -
కమల్ హాసన్ భారీ బడ్జెట్ చిత్రం.. ఆ క్రేజీ సాంగ్ వచ్చేసింది!
కమల్ హాసన్ నటిస్తోన్న తాజా చిత్రం ఇండియన్- 2(భారతీయుడు-2). ఈ సినిమాను శంకర్ డైరెక్షన్లో భారతీయుడు మూవీకి సీక్వెల్‌గా తీసుకొస్తున్నారు. ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్ , రెడ్ జెయింట్ బ్యానర్స్‌పై పాన్ ఇండియా చిత్రంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నుంచి ‘క్యాలెండర్ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో దక్షిణాఫ్రికా మోడల్, 2017లో మిస్ యూనివర్స్ విజేత డెమి-లీ టెబో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను చంద్రబోస్ రాయగా.. శ్రావణ భార్గవి ఆలపించారు.కాగా.. 28 ఏళ్ల క్రితం భారతీయుడు చిత్రం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కమల్ హాసన్, శంకర్ కాంబోలో వస్తోన్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూలై 12న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఈ చిత్రంలో ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్, కాజల్ అగర్వాల్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతమందిస్తున్నారు. -
లొంగని రాక్షసుడు
ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ లీడ్ రోల్స్‌లో నటించారు. కళానిధి మారన్ నిర్మించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జూన్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, ‘అడంగాద అసురన్ (లొంగని రాక్షసుడు) పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు.ఈ పాటకు లిరిక్స్ రాయడంతో పాటు ఈ చిత్ర సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పాడారు ధనుష్. ‘‘అడంగాద అసురన్’ పాటను ఏఆర్ రెహమాన్‌గారు రెడీ చేసినప్పట్నుంచి, మీతో (ప్రేక్షకులు) ఈ పాటను షేర్ చేసుకునేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ పాటను ఇప్పుడు రిలీజ్ చేశాం’’ అంటూ ‘ఎక్స్’లో షేర్ చేశారు ధనుష్. -
రొమాన్స్‌తో రెచ్చిపోయిన స్టార్ డైరెక్టర్.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా!
లియో మూవీతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్. తాజాగా నటుడి అవతారమెత్తాడు. తన తొలి వీడియోలోనే రొమాన్స్‌తో రెచ్చిపోయారు. హీరోయిన్ శృతి హాసన్‌తో కనగరాజ్ చేసిన రొమాన్స్ చూసి ఫ్యాన్స్ షాకవుతున్నారు. వీరిద్దరు ఇనిమేల్ పేరుతో ఓ మ్యూజిక్ వీడియో తీసుకురానుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఇందులో ఈ జంట రొమాన్స్‌లో మునిగితేలారు. తాజాగా రిలీజైన ఇనిమేల్ ప్రోమో చూస్తే లోకేశ్, శృతి రెచ్చిపోయి నటించినట్లు అర్థమవుతోంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఈ వీడియోను రూపొందిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో మ్యూజిక్ పెద్దగా లేకపోయినా.. వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రోమో చూసిన ఫ్యాన్స్ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి వీడియోలోనే లోకేశ్ రెచ్చిపోయాడంటూ పోస్టులు పెడుతున్నారు. కేవలం 18 సెకన్లు మాత్రమే ఉన్న ప్రోమో తెగ వైరలవుతోంది. కాగా.. ఇనిమేల్ ఫుల్ సాంగ్ మార్చి 25న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా.. లోకేశ్ కనగరాజ్ తన తదుపరి చిత్రాన్ని రజినీకాంత్‌తో తెరకెక్కించనున్నారు. #Inimel the game begins from 25th March. Mark the Moment! Streaming exclusively on https://t.co/UXpv3RSFt6#Ulaganayagan #KamalHaasan #InimelIdhuvey #Inimelat25th@ikamalhaasan @Dir_Lokesh @shrutihaasan #Mahendran @RKFI @turmericmediaTM @IamDwarkesh @bhuvangowda84 @philoedit… pic.twitter.com/LCAju1D2eq — Raaj Kamal Films International (@RKFI) March 21, 2024 -
ఈగల్...ఆన్ హిజ్ వే!
రవితేజ హీరోగా నటించిన యాక్షన్ ఫిల్మ్ ‘ఈగల్’. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్యా థాపర్ మరో కథానాయిక. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నవదీప్, మధుబాల, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రధారులు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 9న విడుదల కానుంది. శుక్రవారం (జనవరి 26) రవితేజ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘ఈగల్’ సినిమాలోని ‘ఈగల్స్ ఆన్ హిజ్ వే.. ఇట్స్ టైమ్ టు డై...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. సంగీత దర్శకుడు దేవ్ జాంద్ నేతృత్వంలో ఈ పాటకు ఇంగ్లిష్ లిరిక్స్ రాసిన జార్జినా మాథ్యూయే ఆలపించారు. ఈ సంగతి ఇలా ఉంచితే... రవితేజ బర్త్ డే సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ విడుదలైంది. -
గుంటూరు కారం కుర్చీ మడతపెట్టి సాంగ్
-
గ్రామీణ ప్రేమకథగా వస్తోన్న 'రాధా మాధవం'..!
వినాయక్ దేశాయ్, అపర్ణా దేవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధా మాధవం'. ఈ చిత్రానికి దాసరి ఇస్సాక్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను గోనాల్ వెంకటేశ్ నిర్మిస్తున్నారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. తాజాగా ఈ చిత్రం నుంచి వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 'నువ్వు నేను' అంటూ సాగే ఈ పాటను విడుదల చేశారు. ఈ పాటను వసంత్ వెంకట్ బాలా రాయగా.. సమీరా భరద్వాజ్, రవి జీ ఆలపించారు. కాగా.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి 'నేల మీద నేను ఉన్నా' అంటూ సాగే సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. జనవరి నెలలోనే ఈ మూవీని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ చిత్రంలో మేక రామకృష్ణ, జయ ప్రకాశ్, ప్రియ, నవీన్, రవి శివతేజ, సుమన్, రాచర్ల లాస్య, ధనుష్ ఆచార్య, రాచర్ల మహేష్, శ్రీకాంత్ పర్కాల, సతీష్ కొల్లిపల్లి, శ్రీను, అడెపు మణిదీప్, చిరంజీవి, కామనగరి జ్యోతి, సురభి శ్యామల కీలకపాత్రలు పోషిస్తున్నారు. -
సలార్ మూవీ ఫస్ట్ సాంగ్
-
తమన్నాకు పోటీగా క్యూట్ బేబీ.. స్టెప్పులతో అదరగొట్టేసింది!
మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే లస్ట్ స్టోరీస్-2 వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించింది. బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సిరీస్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో చిరంజీవి సరసన భోళాశంకర్, మరోవైపు తమిళ స్టార్ రజనీకాంత్ జంటగా జైలర్‌లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నువ్వు 'కావాలా' అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఈ రోజుల్లో వాళ్లతో నటిస్తేనే క్రేజ్ వస్తుంది: మాళవిక) అయితే ఈ సాంగ్‌లో తమన్నా తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టింది. తాజాగా ఈ వీడియో సాంగ్‌ను చూసిన ఓ చిన్నారి స్టెప్పులతో అదరగొట్టింది. టీవీలో సాంగ్ చూస్తూ స్టెప్పులకు తగినట్లుగా డ్యాన్స్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయగా.. తమన్నా సైతం అభినందించకుండా ఉండలేకపోయింది. ఈ క్యూట్ బేబీ కూడా పోటీకీ వస్తుందని ఊహించలేదంటూ ఆ ట్వీట్ రిప్లై కూడా ఇచ్చింది మిల్కీ బ్యూటీ. ఇది చూసిన కొందరు సినీ ప్రియులు చిన్నారిని అభినందిస్తున్నారు. కాగా.. తమన్నా, రజనీకాంత్ నటించిన జైలర్ ఆగస్టు నెలలో రిలీజ్ కానుంది. (ఇది చదవండి: స్టార్ హీరోపై ఆరోపణలు.. రూ.10 కోట్ల పరువునష్టం కేసు!) Competition has never looked this cute 😍😍😍 https://t.co/UO4Xm2PJFK — Tamannaah Bhatia (@tamannaahspeaks) July 8, 2023 -
నువ్వు కావాలయ్యా అంటూ దుమ్ములేపిన తమన్నా
కొంచెం ఆట కావాలా? కొంచెం పాట కావాలా? అంటూ ఊర మాస్ స్టెప్పులతో తమన్నా అదరగొట్టారు. రజనీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’లోని ‘నువ్వు కావాలయ్యా..’ అంటూ సాగే పాట ఇది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘జైలర్’ చిత్రం ఆగస్టు 10న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘రా.. నువ్వు కావాలయ్యా.. నువ్వు కావాలి’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. రజనీకాంత్, తమన్నా మధ్య ఈ పాట సాగుతుంది. అనిరుధ్ రవిచంద్రన్ స్వరపరచిన ఈ పాటకు అరుణ్ రాజా కామరాజ్ సాహిత్యం అందించగా శిల్పా రావు, అనిరుధ్ పాడారు. జానీ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతులు సమకూర్చారు. ‘జైలర్’లో శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్, జాకీ ష్రాఫ్, సునీల్, రమ్యకృష్ణ, మిర్నా మీనన్ కీలక పాత్రలు పోషించారు. -
ఓ వయ్యారి వన్నెలాడి..
శివ కోన, ప్రభాకర్, కునల్ కౌశల్, నేహా దేశ్ పాండే ముఖ్య తారలుగా, ప్రాచి కెథర్, అభిలాష్ బండారి, రమ్య దినేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘రాజుగారి కోడిపులావ్’. శివకోన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. అనిల్ మోదుగ మరో నిర్మాత. కాగా ఈ సినిమాలోని ‘సునో సునామీ’ పాట లిరికల్ వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘ఔరౌర కన్నె కోడి.. ఓ వయ్యారి వన్నెలాడి’ అంటూ ఈ పాట సాగుతుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ మని స్వరపరచిన ఈ పాటకు మల్లిక్ వల్లభ లిరిక్స్ అందించగా ఎన్సీ కారుణ్య, వైశాలి శ్రీ ప్రతాప్ పాడారు. -
కలయా.. నిజమా..
సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘కాలింగ్ సహస్ర’. ఈ చిత్రంలో డాలిశ్య హీరోయిన్. అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, పమిడి చిరంజీవి, కటూరి వెంకటేశ్వర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కలయా నిజమా..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. మోహిత్ రెహమానిక్ స్వరపరచిన ఈపాటకు లక్ష్మీ ప్రియాంక సాహిత్యం అందించగా, కేఎస్ చిత్రపాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల కష్టం ఈ సినిమా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు భిన్నంగా డిఫరెంట్ జానర్లో రూపొందిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘చిత్రగారుపాడిన తర్వాత ఈపాటకు మరింత అందం వచ్చింది. ఈపాట టైమ్‌లో ఆమెకు ఆరోగ్యం సరిగ్గా లేక΄ోయినా నాలుగు గంటలు ప్రాక్టీస్ చేసి, మరీపాడారు’’ అన్నారు మోహిత్ రెహమానిక్. ‘‘నిర్మాతలుగా మాకు ‘కాలింగ్ సహస్ర’ తొలి అడుగు. మాకు ఇదొక స్వీట్ మెమొరీ’’ అన్నారు వెంకటేశ్వర్లు. ‘‘సినిమా ఎంగేజింగ్‌గా ఉంటుంది’’ అన్నారు శివ బాలాజీ. డాలిశ్య, లక్ష్మీ ప్రియాంక, సినిమాటోగ్రాఫర్ సన్నీ, యూ ట్యూబర్ రవితేజ తదితరులుపాల్గొన్నారు. -
ఒక వర్ణం చేరెలే...
‘రెయిన్ బో చివరే.. ఒక వర్ణం చేరెలే...’ అంటూ కారులో వెళుతూ, దారిలో కలిసినవారితో సరదాగా గడుపుతూ పాడుకుంటున్నారు సిద్ధార్థ్, దివ్యాంశా కౌశిక్. ఈ ఇద్దరూ జంటగా నటించిన ‘టక్కర్’ చిత్రంలో పాట ఇది. సినిమాలో వచ్చే ఈ నాలుగో పాట వీడియోను శుక్రవారం రిలీజ్ చేశారు. చిత్ర సంగీతదర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరపరచిన ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. బెన్నీ దయాల్, వృషబాబు పాడారు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారు. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
రింగా రింగా రోసే..
కార్తీక్ రాజు, సిమ్రన్ చౌదరి, ఐరా హీరోహీరోయిన్లుగా నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘అథర్వ’. మహేశ్ రెడ్డి దర్శకత్వంలో నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్ నూతలపాటి ఈ సినిమాను నిర్మించారు. త్వరలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. కాగా ఈ చిత్ర సంగీతదర్శకుడు శ్రీ చరణ్ పాకాల పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ‘రింగా రింగా రోసే.. పిల్లా నిన్నే చూసే.. చిట్టిగుండె కూసే..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. శ్రీ చరణ్ పాకాల బాణీఅందించిన ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం అందించగా, జావేద్ అలీ ఆలపించారు. మాస్టర్ రాజ్‌కృష్ణ కొరియోగ్రాఫర్. ఈ పాట విడుదల సందర్భంగా హీరో కార్తీక్ రాజు మాట్లాడుతూ– ‘‘రింగా రింగా రోసే..’ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాం’’ అన్నారు. ‘‘హీరో చిన్నతనం నుండి హీరోయిన్ను ప్రేమిస్తుంటాడు కానీ చెప్పలేకపోతాడు. చివరికి తన ఫీలింగ్‌ను ఈ పాటతో చెప్పే ప్రయత్నం చేస్తాడు’’ అన్నారు మహేశ్‌రెడ్డి. ‘‘త్వరలోనే రిలీజ్ కానున్న మా సినిమాను ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు సుభాష్. ‘‘ఈ చిత్రంలో చాలా ఎమోషన్స్ ఉన్నాయి’’ అన్నారు సిమ్రన్ చౌదరి. -
కయ్యాలే...కయ్యాలే
సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్ జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘టక్కర్’. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఫ్యాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 26న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం నుంచి ‘కయ్యాలే...కయ్యాలే’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇటీవల చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. నివాస్ కె. ప్రసన్న సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ లిరిక్స్ అందించిన ఈ పాటను నిరంజన్ రామనన్ ఆలపించారు. ఈ సినిమాకు సహనిర్మాత: వివేక్ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్. -
లుంగీ డ్యాన్స్.. ముగ్గురు అదరగొట్టేశారుగా!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా గ్లోబల్ స్టార్ చెర్రీ కూడా కనిపించడం ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. సాధారణంగా లుంగీ డ్యాన్స్ అంటే ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమానే గుర్తుకొస్తుంది. అందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే స్టెప్పులే గుర్తుకొస్తాయి. అయితే ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్ సెట్ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్ టీమ్. ఇందులో రామ్ చరణ్ స్పెషల్ పాటకు స్టెప్పులు వేయడం హైలెట్‌గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. (ఇది చదవండి: సల్మాన్ ఖాన్ సినిమాలో 'బతుకమ్మ' పాట.. క్షణాల్లోనే వైరల్) ఆ సాంగ్‌లో రామ్ చరణ్, సల్లు భాయ్, వెంకటేశ్ కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు డ్యాన్స్ చేయటం పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్స్ కలిసి డ్యాన్స్ చేయడం నా లైఫ్‌లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ చెర్రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ముగ్గురు హీరోలు ఓకే పాటలో కనిపించడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడదామా...గడపకు బొట్టేట్టి తోరణాలు కట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది. One of my most precious on screen moments. Love you Bhai ❤️ Dancing with these absolute legends... #Yentamma song out now.https://t.co/9gSJhidu0y@BeingSalmanKhan @hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani pic.twitter.com/raRa2zl8Zy — Ram Charan (@AlwaysRamCharan) April 4, 2023 -
ముద్దులతో రెచ్చిపోయిన షణ్ముక్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యూట్యూబ్ స్టార్‌గా గుర్తింపు పొందిన షణ్ముఖ్ జశ్వంత్ బిగ్‌బాస్ ఎంట్రీతో మరింత పాపులర్ అయ్యాడు. అతని ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగినా రన్నరప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ దీప్తి సునయనతోబ్రేకప్ అయిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-5 నుంచి బయటకొచ్చాక దీప్తి షణ్నూకి గుడ్‌బై చెప్పేసింది. తాము కెరీర్‌పై దృష్టిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పేసి విడిపోతున్నట్లు ఇద్దరూ ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ కలిసి జంటగా ఎక్కడా కనిపించలేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. ఎవరికీ వారే సొంతంగా యూట్యూబ్ సాంగ్స్ చేస్తున్నారు. కానీ తాజాగా షణ్ను పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఓ రొమాంటిక్ సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన అభిమానులకు షాక్ ఇచ్చారు. ఇది చూసిన అతని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 'అయ్యయ్యో' అనే పేరుతో సాంగ్ రీలీజ్ చేశాడు షణ్ముక్. ఇందులో ఫణి పూజిత అనే అమ్మాయితో ఫుల్ రొమాంటిక్‌గా నటించాడు. ఆ సాంగ్‌లో షణ్ను ముద్దులతో రెచ్చిపోయాడు. (ఇది చదవండి: ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ షణ్నూ పోస్ట్‌కి దీప్తి సునయన రిప్లై ఇస్తుందా?) ఇది చూసిన కొందరు ఫ్యాన్స్ దీప్తిని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే దీప్తి బాధపడుతుంది బ్రో అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇది చాలా టూమచ్ బ్రో.. ఇదంతా దీప్తి మీద రివెంజ్ కోసమేనా అని కొందరు కామెంట్స్ చేశారు. 'అరే ఏంట్రా ఇది' అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్ చేయగా.. ఇది చూస్తే దీపు చాలా ఫీల్ అవుతుంది బ్రో అంటూ పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7) -
బిచ్చగాడు 2: బికిలి బికిలి అంటూ గొంతెత్తిన హీరో
‘వీళ్లే బికిలి బికిలి బిలి బిలి.. బికిలి బికిలి బిలి బిలి...’ అంటూ పాడారు విజయ్ ఆంటోని. 2016లో విజయ్ ఆంటోని హీరోగా రూపొందిన తమిళ చిత్రం ‘పిచ్చైక్కారన్’ తెలుగులో ‘బిచ్చగాడు’గా విడుదలై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శశి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పుడు ‘బిచ్చగాడు’కు సీక్వెల్‌గా ‘బిచ్చగాడు 2’ వస్తోంది. విజయ్ ఆంటోని నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై ఫాతిమా విజయ్ ఆంటోని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బికిలి’ అనే పాట మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేశారు. భాష్యశ్రీ రాసిన ఈ పాటకు మ్యూజిక్ కంపోజింగ్, సింగర్ విజయ్ ఆంటోనీయే కావడం విశేషం. ఇక పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన ధనబలంతో వారిని బానిసలుగా చేసి, డబ్బు ఉందన్న అహంకారంతో తిరిగేవాళ్లకు తాను బికిలీ అని పేరు పెట్టినట్లు విజయ్ ఆంటోని పేర్కొన్నారు. -
పాట చాలా బాగుంది
తేజ్ బొమ్మదేవర, రిషికా లోక్రే జంటగా బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మాధవే మధుసూదన’. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘హోయ్.. అలాంటి అందం ఇలాంటి నేల మీద ఎలాగు పుట్టినాదో. ఏమో ఏమిటో...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను హీరో నాగచైతన్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘ఈ పాట చాలా బాగుంది. తేజ్‌కు కంగ్రాట్స్. మంచి ఎమోషనల్ లవ్‌స్టోరీగా రూపొందిన ఈ సినిమా విజయం సాధించాలి. చంద్ర అండ్ టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. వికాస్ బాడిస స్వరపరచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడారు. -
కల్యాణ్‌రామ్ అమిగోస్ మూవీ.. వీడియో సాంగ్ రిలీజ్
బింబిసార సూపర్ హిట్ తర్వాత నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'అమిగోస్'. ఈ చిత్రం ద్వారా మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో అభిమానుల ముందుకు వస్తున్నారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్ సినిమాపై మాంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ చిత్రం నుంచి ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఏక ఏక అంటూ సాగే సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఫిబ్రవరి 10న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. What is better than friendship? A friendship of 3 Doppelgangers 🧍♂️🧍♂️🧍♂️ #YekaYeka Full video Song from #Amigos out now ❤️ - https://t.co/CZXcgPneal@NANDAMURIKALYAN @AshikaRanganath #RajendraReddy @GhibranOfficial #AnuragKulkarni @ramjowrites @MythriOfficial @saregamasouth pic.twitter.com/bG6Kq0rg1b — Suresh Kondeti (@santoshamsuresh) January 20, 2023 -
'కుమ్మేసే పఠాన్ వచ్చేశాడు'.. మరో సాంగ్ రిలీజ్
బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, నటి దీపికా పదుకొణె జంటగా నటించిన చిత్రం 'పఠాన్'. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తోంది. ‘కుమ్మేసే పఠాన్ వచ్చేశాను’ అంటూ సాగే ఈ సాంగ్న్ హిందీ, తమిళం, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌లో షారుక్, దీపిక పదుకొణె డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. వచ్చే ఏడాది జనవరి 25న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది ఈ చిత్రం. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన మొదటి పాట ‘బేషరమ్ రంగ్’ తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. -
'18 పేజెస్' అప్డేట్.. 'నీ వల్ల ఓ పిల్ల' అంటున్నా నిఖిల్
నిఖిల్ సిద్దార్థ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజెస్'. జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ కథ అందించారు. ఆయన శిష్యుడు, కుమారి 21ఎఫ్ డైరెక్టర్ సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ వల్ల ఓ పిల్ల' అనే సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ఈ పాట ద్వారా కొత్త రచయిత తిరుపతిని ఇండస్ట్రీకి పరిచయం చేసింది జీఏ పిక్చర్స్. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు, పోస్టర్స్ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. యూత్‌లో బాగా బజ్ క్రియేట్ ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 17న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఇవాళ ఈ సినిమాలోని నాలుగో పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23న థియేటర్లలో ఈ సినిమా సందడి చేయనుంది. -
బాలయ్య 'వీరసింహారెడ్డి'.. ఆ సాంగ్ చూసేయండి..!
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఇవాళ విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం ఆ వీడియో లిరికల్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని చిత్రయూనిట్ ప్రకటించింది. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నారు. -
'పిల్ల కొంచెం టైం ఇవ్వు' అంటున్న నిఖిల్.. లిరికల్ సాంగ్ రిలీజ్
నిఖిల్, అనుపమ జంటగా నటిస్తున్న చిత్రం '18 పేజీస్'. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తుండగా.. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి "టైం ఇవ్వు పిల్ల" అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటను తమిళ స్టార్ హీరో శింబు ఆలపించారు. ప్రతీ ఒక్కరి లైఫ్‌లో ప్రేమించడం ఎంత కామనో , బ్రేకప్ కూడా అంతే కామన్. అలా బ్రేకప్ అయినా కుర్రాడు పాడే పాటే "టైం ఇవ్వు పిల్ల కొంచెం టైం ఇవ్వు" అనే పాటను శింబు ఆలపించారు. ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు "కుమారి 21ఎఫ్" చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే విడుదలై టీజర్, 'నన్నయ్య రాసిన' అనే పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మంచి అంచనాలను నెలకొల్పిన ఈ చిత్రాన్ని క్రిస్ట్మస్ కానుకగా డిసెంబర్ 23 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. -
అలాంటి సినిమాలే సక్సెస్ అవుతాయి.. సింగర్ సునీత
ఆనంద్ రవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం 'కొరమీను'. ఈ సినిమాకు శ్రీపతి కర్రి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ వచ్చేసింది. తెలిసిందేలే అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి బింబిసార దర్శకుడు వశిష్ట, సింగర్ సునీత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు శ్రీపతి కర్రి మాట్లాడుతూ.. 'మా టీమ్‌కి సపోర్ట్ చేయటానికి వచ్చిన దర్శకులు వశిష్టగారికి, సింగర్ సునీత గారికి థాంక్స్. సినిమాకు కథ ప్రధానం. అది బావుంటే అన్నింటినీ అదే తీసుకొస్తుంది. ఆనంద్ రవి అంత మంచి కథను ఇచ్చారు. ఆయన దగ్గరే విషయాలు నేర్చుకున్నా. మా గురువుగారినే డైరెక్ట్ చేశా. కథను చక్కగా డ్రైవ్ చేసేది టీమ్.' అని అన్నారు. నిర్మాత సమన్య రెడ్డి మాట్లాడుతూ..'ఆనంద్ రవి కథ చెప్పినప్పుడు బావుందనిపించింది. కీ రోల్లో శత్రు, విలన్‌గా హరీష్ ఉత్తమన్గా తీసుకోవాలని అనుకున్నాం. ఇక హీరోగా ఆనంద్ రవిగారు అద్భుతంగా చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది.' అని అన్నారు. (ఇది చదవండి: 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?'.. ఆసక్తికరంగా కొరమీను టైటిల్ పోస్టర్) దర్శకుడు వశిష్ట మాట్లాడుతూ..'ప్రతినిధి, నెపోలియన్ సినిమాలకు రైటర్‌గా, హీరోగా సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు స్టోరి, స్క్రీన్‌ప్లే అందించి హీరోగా కూడా నటించారు. ఈ సినిమాతోనూ సక్సెస్ సాధిస్తారని భావిస్తున్నా. నిర్మాత, దర్శకుడితో సహా అందరికీ ఆల్ ది బెస్ట్.' అని అన్నారు. సింగర్ సునీత్ మాట్లాడుతూ..'ఈరోజుల్లో మంచి కంటెంటే హీరో. చిన్న సినిమా, పెద్ద సినిమా అనే గీతలు చెరిగిపోయాయి. కంటెంట్ బావుంటే కొత్త నటీనటులతో చేసిన మూవీ అయినా ప్రపంచ వ్యాప్తంగా పేరుని సంపాదించుకుంటోంది. అటువంటి లిస్టులో కొరమీను సినిమా కూడా చేరుతుంది. మన జీవన విధానానికి దగ్గరగా ఉండే సినిమాలు సక్సెస్ అవుతాయి.' అని అన్నారు. హీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. 'కొరమీను సినిమాలో మీసాల రాజుకి మీసాలు ఎందుకు తీసేశారనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశా. ఈ ప్రపంచమంతా సినిమాల్లో మర్డర్ మిస్టరీ, కిడ్నాప్ మిస్టరీలుంటాయి. కానీ ఓ మనిషికి మీసాలు ఎవరు తీసేసుంటారనే కాన్సెప్ట్ ఎక్కడా లేదు. కథ పుట్టిందే అక్కడ నుంచే. పేదవాడికి, గొప్ప వాడికి మధ్య జరిగే గొడవను కథలో తీసుకున్నాం. సినిమాలో చివరి ముప్పై నిమిషాలు ఎంతో కీలకం. మీరు సినిమా చూస్తే సర్ ప్రైజ్ అవుతారు. డిసెంబర్ 31న సినిమాను చూసి న్యూ ఇయర్‌ను హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.' అని అన్నారు. 'కొరమీను' కథ విషయానికి వస్తే... జాలరిపేట అనే మత్స్యకారుల కాలనీకి కొత్తగా వచ్చిన పోలీస్ మీసాల రాజు మీసాలు ఎవరు తీసేశారనేది ఆసక్తికరంగా ఉండనుంది. ఓ డ్రైవర్, అహంకారం, బాగా డబ్బున్న అతని యజమాని, వైజాగ్‌లో శక్తివంతమైన పోలీసు - ఈ ముగ్గురి పాత్రల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. మంచి కంటెంట్‌తో వస్తున్న చిత్రమిది. -
Top Gear: నువ్వు నా వెన్నెల...
‘వెన్నెల వెన్నెల.. నువ్వు నా వెన్నెల.. దైవమే ప్రేమగా పంపేనే నిన్నిలా...’ అంటూ సాగుతుంది ‘వెన్నెల వెన్నెల...’ పాట. ఆది సాయికుమార్, రియా సుమన్ జంటగా కె.శశికాంత్ డైరెక్షన్లో రూపొందిన ‘టాప్ గేర్’ చిత్రంలోని పాట ఇది. సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అదించగా, సిధ్ శ్రీరామ్ పాడారు. కేవీ శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 30న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీలోని ‘వెన్నెల వెన్నెల’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి. -
సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..
‘నన్ను పట్టుకుంటే జారిపోతుంటాను... ఒంపుసొంపులున్న పాదరసమే నేను.. నన్ను ముట్టుకుంటే నిప్పునవుతుంటాను.. సొట్టబుగ్గలున్న అగ్గిపెట్టే నేను..’ అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశారు హెబ్బా పటేల్. ఇంద్రసేన హీరోగా నటిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ ‘శాసనసభ’. ఇందులో ఐశ్వర్యారాజ్ భకుని, రాజేంద్ర ప్రసాద్, సోనియా అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషించారు. తులసీరామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాతలు. రవి బసూర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నన్ను పట్టుకుంటే..’పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ స్పెషల్ సాంగ్‌లో హెబ్బాపటేల్ మంచి స్టెప్పులు వేశారు. కాసర్లశ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ, సంతోష్ వెంకీ, ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బసూర్ పాడారు. ప్రేమ్‌రక్షిత్ నృత్యరీతులు సమకూర్చారు. -
ఆల్భమ్ సాంగ్‌లో రెచ్చిపోయిన ఉర్ఫీ జావేద్.. తీవ్ర వ్యతిరేకత.. కేసు నమోదు
సోషల్ మీడియా సెన్సేషన్, హిందీ బిగ్‌బాస్ ఓటీటీ ఫేం ఉర్ఫీ జావేద్ తన తీరుతో మరోసారి వివాదంలో నిలిచింది. తాజాగా ఆమె నటించిన ఓ అల్బమ్ సాంగ్‌పై పలు సామాజిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ పాటలో ఉర్ఫీ చీరకట్టు, డాన్స్‌పై అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఈ మేరకు న్యూఢిల్లీ పోలీస్ స్టేషన్లో అక్టోబర్ 23న ఆమెపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఈ వీడియోలో ఉర్ఫీ తీరు లైంగిక చర్యలను ప్రోత్సహించేలా ఉందంటూ సదరు ఫిర్యాదు దారుడు పేర్కొన్నారు. చదవండి: పెళ్లిలో నటి పూర్ణ వేసుకున్న బంగారం ఎంతో తెలుసా? కాగా ఉర్పీ జావేద్ నటించిన ‘హాయే హాయే యే మజ్బూరీ’ అనే అల్భమ్ సాంగ్ అక్టోబర్ 11న రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె రెడ్ కలర్ చీర కట్టులో కనిపించింది. ఉర్ఫీ విభిన్న వస్త్రాధారణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్రవిచిత్రమైన డ్రెస్సింగ్‌తో ఆమె తరచూ ట్రోల్స్ బారిన పడుతుంది. తాజాగా ఈ పాటలో సైతం ఆమె చీరకట్టులో ఫుల్ గ్లామర్ షో చేసింది. దీంతో ఉర్పీ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ వీడియోలో ఆమె డ్రెస్సింగ్, డాన్స్ తీరు లైంగిక పరంగా రెచ్చగొట్టెలా ఉందంటూ పలువురి నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. చదవండి: ఆర్థిక ఇబ్బందులు.. నగలు అమ్మి ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడ్డా: ప్రగతి ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో తనపై వచ్చే నెగిటివిటిపై గతంలో ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ ఇవేవి తనని బాధించలేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై సైతం స్పందిస్తూ తన డ్రెస్సెంగ్, ఫ్యాషన్ పట్ల చాలా గర్వంగా ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఈ ట్రోల్స్ నాపై ఎలాంటి ప్రభావం చూపలేవు. నా ఫ్యాషన్ తీరు పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. విమర్శలు, వివాదాలు నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను ఏం చేసినా, ఏం పోస్ట్ చేసిన దాన్ని అందరు పెద్ద సమస్యగా చిత్రీకరిస్తూనే ఉంటారు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. -
Sedyam: ఆకట్టుకుంటున్న ‘రైతే రాజు’ పాట
గౌతమ్ గిరినందన్, కుషాల్ తేజ, నీల రమణ, గాయత్రి రమణ హీరో హీరోయిన్ గా చంద్రకాంత్ పసుపులేటి దర్శకత్వం వహిస్తున్న‘సేద్యం’. రాయలసీమ ప్రాంతంలో జరిగిన కొన్ని యాదార్థ సంఘటలన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జి పి ఆర్ సినిమాస్ పతాకం పై మహేష్ రెడ్డి గోరకాటి, గాజుల పద్మావతి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ రైతే రాజు’ అయితే పాటని విడుదల చేశారు మేకర్స్. ‘అమ్మకే అమ్మరా..అన్నదాత అవ్వగా.. పుడమినే దున్ని తాను అన్నమే పెట్టగా..’ అంటూ సాగే ఈ పాట రైతుల దీనస్థితిని వివరిస్తుంది. పాట విడుదల సందర్భంగా.. ఈ సందర్బంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ సేద్యం సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ లో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాలో మొత్తం 6 పాటలు ఉన్నాయి. ఇందులోని మొదటి రైతే రాజు పాటను ఈరోజు రిలీజ్ చేశాం. ఈ చిత్రాని మొత్తం రాయలసీమ లో చిత్రిరించం. అందరికి నచ్చే అందమైన కథ’ అని అన్నారు. -
నాటు నాటు సాంగ్.. బ్లాక్ అండ్ వైట్ కాలం నాడే కుమ్మేశారు..!
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా ఆ చిత్రంలోని 'నాటు నాటు సాంగ్' అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్లో ఊపేసింది. విదేశీయులు సైతం ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయారు. ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అయితే అచ్చం అలాగే స్టెప్పులు వేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలంలోని ఓ వీడియో నెటిజన్లు షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది. ఆ వీడియోలోని స్టెప్పులు చూస్తే అచ్చం నాటు నాటు సాంగ్‌ను తలపిస్తున్నాయి. మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి. -
అప్పుడు అందరం బాగుంటాం
కృష్ణ, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల దర్శకత్వంలో సి. యశోదమ్మ, టి. చేతన్ నిర్మించిన చిత్రం ‘నేచర్’. ఈ సినిమాలోని ‘నిన్నే చూడందే..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఈ పాటను రిలీజ్ చేసిన అలీ మాట్లాడుతూ – ‘‘నాకు ఇళయరాజాగారి పాటలంటే ఇష్టం. ఈ పాట ఆయన పాటలను గుర్తు చేసింది. యం.ఎల్. రాజా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ‘నేచర్’ టైటిల్ బాగుంది. ప్రకృతి బాగుంటే మనందరం బాగుంటాం’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే ఓ కుర్రాడు ప్రేమలో పడ్డాక ఎన్ని కష్టాలు పడ్డాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? అన్నది ఈ సినిమా కథ’’ అన్నారు అశ్విన్ కామరాజు. ‘‘ఈ సినిమాకు పని చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా’’ అన్నారు ఎమ్ఎల్ రాజా. ‘‘సుధాకర్, రవి టీచర్స్. ఈ సినిమాకి ఇద్దరూ చక్కటి కథను రెడీ చేశారు’’ అన్నారు గౌతమ్ రాజు. -
హే సీతా-హే రామ.. ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన అద్భుతమైన ప్రేమ కావ్యం ‘సీతారామం’. ఆగస్ట్ 5న విడుదలైన ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ సందడి చేస్తోంది. ఈ ప్రేమ కావ్యానికి సాధారణ ప్రజలు మాత్రమే కాదు సినీ సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఇప్పటికీ ఎంతో సినీ, రాజకీయ ప్రముఖులు సీతారామంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏకంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారంటే సీతారామం ఏస్థాయిలో గుర్తింపు పొందిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చదవండి: విషాదం.. యువ నటి ఆత్మహత్య, వైరల్‌గా మారిన సూసైడ్ నోట్ మరి ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఎక్కడ చూసిన సీతారామం పాటలే చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తున్న ఈ మెలోడియస్ సాంగ్స్ నుంచి సీతామాహాలక్ష్మి-రామ్ ప్రేమ గురించి నిర్వరించిన అద్భుతమైన ప్రేమ గీతం హే సీతా-హే రామ... తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను వదిలింది చిత్ర బృందం. పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో హీరో, హీరోయిన్ల మధ్య చిత్రీకరించిన ఈ పాట సినిమాకే హైలేట్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకే విడుదలైన క్షణాల్లోనే ఈ పాట లక్షల్లో వ్యూస్ రాబట్టి యూట్యూబ్ ట్రెండింగ్ జాబితాలో చేరింది. మరి ఈ అందమైన ప్రేమ గీతంపై మీరు ఓ లుక్కేయండి. -
పాన్ ఇండియా సాంగ్‌గా రకుల్ ప్రీత్ సింగ్ వీడియో సింగిల్..
Rakul Preet Singh Comments On Mashooka Video Song: అతికొద్ది సమయంలోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం బాలీవుడ్లో పాగా వేసిన ఈ పంజాబీ భామ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అయితే తెలుగు ప్రేక్షకులను పలకరించి మాత్రం ఏడాది కావొస్తోంది. రకుల్ చివరిగా వైష్ణవ్ తేజ్‌కు జోడిగా 'కొండపొలం' చిత్రంతో అలరించింది. అయితే ఇటీవల సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ డింపుల్ వద్ద రకుల్ డ్యాన్స్ నేర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు షార్ట్ డ్యాన్స్ వీడియోస్ అప్లోడ్ చేసి ఆకట్టుకుంది ఈ ఫిట్నెస్ భామ. అయితే తాజాగా మషూక అనే మ్యూజిక్ వీడియో చేసింది రకుల్. ఈ మ్యూజిక్ సింగిల్‌లో అల్ట్రా గ్లామరస్‌గా కనిపించి, డ్యాన్స్‌తో ఫిదా చేసింది. ఈ మ్యూజిక్ వీడియో గురించి ఒక ఛానెల్‌తో శనివారం (ఆగస్టు 6) ప్రత్యేకంగా మాట్లాడింది. 'మొదటగా ఈ పాటను హిందీ పాప్ సాంగ్గానే రూపొందించాలనుకున్నా. కానీ, నాకు స్టార్డమ్ కట్టబెట్టిన తెలుగు, తమిళ ప్రేక్షకుల కోసం ఆ రెండు భాషల్లోనూ రూపొందించి పాన్ ఇండియా సింగిల్‌గా తీర్చిదిద్దాం. తెలుగు, తమిళ పరిశ్రమపై నాకున్న ప్రేమను తెలియజేసేందుకు ఇదో అవకాశంగా ఉపయోగించుకున్నా' అని రకుల్ ప్రీత్ సింగ్ తెలిపింది. కాగా ఈ వీడియో సాంగ్‌ను రకుల్ బాయ్‌ఫ్రెండ్, నిర్మాత జక్కీ భగ్నానీతో కలిసి రూపొందించడం విశేషం. చదవండి: బ్రేకప్ రూమర్స్..టైగర్ ష్రాఫ్ అదిరిపోయే స్టంట్స్! దిశా రియాక్షన్ ఇదే! ఆ హీరోతో జోడి కట్టనున్న డైరెక్టర్ శంకర్ కుమార్తె -
'అదిరిందే' అంటూ అదరగొట్టిన నితిన్, కృతీ శెట్టి..
Macherla Niyojakavargam: హిట్లు ప్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్. ఆయన తాజాగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. బ్యూటీఫుల్ హీరోయిన్స్ కృతీ శెట్టి, కేథరిన్ థ్రేసా కథానాయికలుగా అలరించనున్న ఈ మూవీకి ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచగా.. ఇటీవల విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక 'రారా రెడ్డి' అనే సాంగ్ అయితే అధిక వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఈ పాటలో వచ్చే 'రాను రాను అంటూనే చిన్నదో' అనే బీట్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ మారింది. ఈ పాటతో టాలీవుడ్ స్టార్ హీరోల స్టెప్పులను సింక్ చేస్తూ అనేక వీడియోలను రిలీజ్ చేశారు. అవి కూడా నెటిజన్లను విపరీతంగా ఎంటర్టైన్ చేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ విడుదలైంది. 'అదిరిందే పసిగుండే' అంటూ సాగే ఫుల్ వీడియో సాంగ్‌ను శనివారం (జులై 23) ఉదయం రిలీజ్ చేశారు. ఈ పాటలో నితిన్, కృతీశెట్టి తమ డ్యాన్స్‌తో అదరగొట్టారు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించగా పాటను సంజిత్ హెగ్డే ఆలపించారు. ఫ్యాక్షన్, పొలిటికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
"బ్రహ్మాస్త్రం" నుంచి అందమైన మెలోడీ సాంగ్..
Brahmastra: Kumkumala Video Song Released: భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్‌గా బాలీవుడ్లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా "బ్రహ్మాస్త్ర". ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ తొలిసారి జంటగా నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారని టాక్. ఇదివరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా "బ్రహ్మాస్త్రం" చిత్ర యూనిట్ "కుంకుమల" వీడియో పాటను విడుదల చేసింది. ప్రీతమ్ స్వరపరచిన ఈ గీతాన్ని "సిద్ శ్రీరామ్" ఆలపించారు. తెలుగులో చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 9న రిలీజ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ చిత్రానికి దర్శక దిగ్గజం రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. చదవండి: పిల్లలు వద్దనుకోవడంపై ఉపాసన క్లారిటీ.. అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. మళ్లీ పొట్టి దుస్తుల్లో రష్మిక పాట్లు.. వీడియో వైరల్ -
20 ఏళ్ల ప్రయాణం.. ఇది మామూలు విషయం కాదు: దిల్ రాజు
‘‘జయం’(2002) సినిమాతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఇంత పోటీలో కూడా నితిన్ సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. ‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. నితిన్, కృతీశెట్టి, కేథరీన్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానుంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘రా రా రెడ్డి.. ఐ యామ్ రెడీ’ పాట లిరికల్ వీడియోను ‘దిల్’ రాజు విడుదల చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించిన ఈ పాటను లిప్సిక ఆలపించారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట రిలీజ్ సందర్భంగా నితిన్ మాట్లాడుతూ– ‘‘నా అభిమానుల కోసం ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నంబర్స్ పెట్టాం. ‘రా రా రెడ్డి..’ పాటలో నా ‘జయం’ చిత్రంలోని ‘రాను రాను అంటూనే..’ పాటను రిపీట్ చేయడం ప్రత్యేకంగా అనిపించింది. అంజలి కాలికి గాయమైనప్పటిMీ ఫ్లోర్ మూమెంట్స్‌ని హార్డ్‌వర్క్‌తో కంప్లీట్ చేశారు’’ అన్నారు. ‘‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు రాజశేఖర్ రెడ్డి. -
‘మ..మ.. మహేశా..’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దాదాపు రూ. 200 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ మూవీకి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర విజయంలో పాటలు కూడా కీలకపాత్ర పోషించాయనడంలో అతిశయోక్తి లేదు. తమన్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలన్ని సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ‘మ.. మ.. మహేశా’ అనే మాస్ బీట్ సాంగ్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ యూట్యూబ్‌లో విడుదల చేశారు. చదవండి: ఇంటింటికి సబ్బులు అమ్ముకుంటున్న స్టార్ నటి ఐశ్వర్య శ్రీకృష్ణ, జోనితా గాంధీ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటలో మహేశ్, కీర్తి సురేశ్ డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇటీవలే విడుదలైన మురారి వా, పెన్నీ వీడియో సాంగ్స్ మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను అమెజాన్ ప్రైం భారీ రేటుకు దక్కించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా జూన్ 23 నుంచి ఉచితంగా అందుబాటులోకి తీసుకురానుంది ఆమెజాన్. చదవండి: విషాదం.. అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయిన సింగర్ దంపతులు -
'తుఫాన్' ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. చూశారా !
KGF 2: Yash Starrer Toofan Full Song Released: కన్నడ స్టార్ హీరో యశ్, శాంత్ నీల్ డైరెక్షన్లో వచ్చి బాక్సాఫీస్ వద్ద తుఫాన్ సృష్టించిన చిత్రం 'కేజీఎఫ్ 2'. ఓ పక్క అత్యధిక వసూళ్లు రాబట్టగా మరోపక్క విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. బాలీవుడ్లో రూ. 400 కోట్లకుపైగా వసూళ్లను కొల్లగొట్టింది. అంతేకాకుండా ఇటీవలే వెయ్యి కోట్ల క్లబ్లో కూడా చేరింది ఈ మూవీ. ఇండియాలోని అన్ని భాషల్లో కలుపుకుని రూ. 900 కోట్లు దాటగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 1170 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సినిమాలోని డైలాగ్‌లు, యాక్షన్ సీన్లు, యశ్ యాక్టింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పాటలు అన్ని సినిమాకు హైలెట్ అయ్యాయి. 'కేజీఎఫ్ 2'లోని ప్రతి పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటీవల అమ్మ పాట, మెహబూబా సాంగ్‌లను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా తుఫాన్ పాటను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తుఫాన్ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, శ్రీనిధి శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు. చదవండి: 'కేజీఎఫ్ 3' ఉందా ? లేదా ?.. మరో నిర్మాత ఏమన్నాడంటే ? -
ఆడవాళ్లు మీకు జోహార్లు న్యూ వీడియో సాంగ్ రిలీజ్
-
అదరగొడుతున్న దివి ‘సిలక ముక్కుదానా’ సాంగ్
బిగ్‌బాస్ బ్యూటీ దివి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్ హాట్ అందాల ఫొటోషూట్లను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా దివి ఓ ఫోక్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సాంగ్ ప్రోమోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్ వీడియో బయటకు వచ్చింది. దివి లంగాఓణి, ఫుల్ జ్యూవెల్లరి, ముక్కపుడకతో పాటకు చిందేలిసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ సందడి చేస్తోంది. విడుదలైన 2 గంటల్లోనే ఈ పాట 44 వేలకు పైగా వ్యూస్ రాబట్టి దూసుకుపోతోంది. ‘సిలక ముక్కుదానా.. అని ముద్దుగా పిలుస్తాడే’ అంటూ తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పాటకు దివి మాస్ స్టేప్పులతో ఇరగదీసింది. కాసర్ల శ్యాం లిరిక్స్ రాసిన ఈ పాటను గాయనీ హారిక నారాయణ్ ఆలపిచింది. శేఖర్ మాస్టర్ దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించాడు. -
Trishanku: హీరోగా రకుల్ సోదరుడు.. ఫస్ట్ సాంగ్ విడుదల
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ హీరోగా నటిస్తోన్న చిత్రం `త్రిశంకు`. ప్రాచి తెహ్లాన్ , రష్మీ గౌతమ్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమన్, మహేష్ ఆచంట, నవీన రెడ్డి కీలకపాత్రలు పోషిస్తున్నారు. శ్రీ కృష్ణ గొర్లె దర్శకత్వంలో గణేశ్ క్రియేషన్స్, ఎ.యు అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్లపై లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరి అయినీడి కో ప్రొడ్యూసర్. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ని స్టార్ హీరో రానా దగ్గబాటి విడుదల చేశాడు. ‘ఏడు రంగుల ఓ ఇంద్రధనస్సులా’ అంటూ సాగే ఈ పాటకి భాష్యశ్రీ లిరిక్స్ అందించగా, రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. సునీల్ కశ్యప్ చక్కటి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా దర్శకుడు శ్రీ కృష్ణ గొర్లె మాట్లాడుతూ.. నాకు ఈ సినిమా అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి పాత్ర ఎంతో చక్కగా రూపుదిద్దుకుంది. అడగ్గానే ఈ చిత్రంలోని పాటను విడుదల చేయటానికి ఒప్పుకున్న హీరో దగ్గుబాటి రానా గారికి ధన్యవాదాలు అని అన్నారు. నిర్మాతలు లండన్ గణేష్ మరియు నల్ల అయ్యన్న మాట్లాడుతూ.. దర్శకుడు శ్రీ కృష్ణ చెప్పిన పాయింట్ ఎంతో బాగా నచ్చింది. ఈ సినిమాలో మంచి మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి. చిత్రం ఎంతో బాగా వచ్చింది. మా చిత్రంలోని తొలి పాటను విడుదల చేసిన రానా గారికి కృతజ్ఞతలు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అన్ని వివరాలను వెల్లడిస్తాం అన్నారు. -
‘జలజల పాతం’ మేకింగ్ కష్టాలు, వీడియో వైరల్
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతి శెట్టీ జంటగా నటించిన చిత్రం ‘ఉప్పెన’. ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం వంద కోట్లపైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇటీవల సినిమా విడుదలైన నెలరోజుల తర్వాత నుంచి ఉప్పెన టీం సినిమాలోని డిలీటెడ్ సీన్స్, పాటల మేకింగ్ వీడియోలను విడుదల చేస్తూ ప్రేక్షకులలో అసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ మూవీ రోమాంటిక్ సాంగ్ ‘జల జల పాతం నువ్వు..’ మేకింగ్ వీడియోను షేర్ చేసింది చిత్ర యూనిట్. సిల్వర్ స్క్రీన్‌పై సముద్రం మధ్యలో హీరోహీరోయిన్లు పండించిన రోమాన్స్ అంతా ఇంతా కాదు. ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పడానికి ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఫుల్ సాంగ్‌కు వచ్చిన వ్యూస్ యే నిదర్శనం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించగా.. శ్రేయాఘోషల్, జాస్ ప్రీత్ జాజ్ ఆలపించిన ఈ పాట ఫుల్ వీడియోను ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. విడుదలై గంటల వ్వవధిలోనే లక్షల్లో వ్యూస్ సంపాదించింది. అంతగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ పాట మేకింగ్ కోసం మూవీ టీం బాగానే చేమటోడిచ్చినట్లు తెలుస్తోంది ఈ తాజా మేకింగ్ వీడియో చూస్తుంటే. ఇక సహజమైన సముద్రాన్ని చూపించేందుకు మన దర్శకుడు బుచ్చి ఎంతగా కృషి చేశారో మీరే చూడండి. చదవండి: ఖమ్మంలో ‘బేబమ్మ’ సందడి.. ఉప్పెనలా ఎగసిపడ్డ జనం ‘ఉప్పెన’ డిలీటెడ్ సీన్.. ఆ అమ్మాయి కాళ్లు పట్టుకున్న వైష్ణవ్ -
‘ఛోరా చకోర’మాస్ సాంగ్‌కి సూపర్ రెస్పాన్స్
అరవింద్ కృష్ణ, శ్రీజితా ఘోష్ జంటగా సుకు పూర్వజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘శుక్ర’. రుజల ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిల్మ్ ఫ్యాక్టరీపై అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాలోని ‘ఛోరా చకోరా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘‘క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. మైండ్ గేమ్స్ నేపథ్యంలో ఉంటుంది. ‘ఛోరా చకోర’ పాటలో చాందినీ భతిజ డ్యాన్సులు, ఎక్స్ప్రెషన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పాట ఆడియన్స్‌కు మంచి రిలీఫ్ ఇవ్వనుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా మధుర ఎంటర్టైన్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్లో విడుదలకు సిద్ధమవుతోంది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఆశీర్వాద్, కెమెరా: జగదీశ్ బొమ్మిశెట్టి. -
‘చావు కబురు చల్లగా’ శివర్రాతి గిఫ్ట్ వచ్చేసింది
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ కుర్ర హీరో కార్తికేయ, హీరోయిన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం 'చావు కబురు చల్లగా' మూవీ టీం శివరాత్రి గిఫ్ట్ ఇచ్చేసింది. ఈ సినిమాలోని నాలుగోపాటను గురువారం రిలీజ్ చేసింది. బుల్లితెర బ్యూటీ అనసూయ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజా గా ఈ సినిమాకి సంభిందించి ‘ఫిక్స్ అయిపో’ ఫుల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన స్టయిల్లో ఆలపించిన ఈ గీతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన టీజర్లు, మూడు పాటలు ఈ సినిమాపై భారీ హైప్‌నే క్రియేట్ చేశాయి. (ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే!) కౌశిక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమని, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, భద్రం, మహేష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం డ్రైవర్‌గా, లావణ్య నర్సుగా కనిపిచనున్నారు. ఈ సినిమా మార్చి 19న విడుదలకు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. -
అల్లు అర్హ ‘అంజలి’ వీడియో సాంగ్.. ట్రెండింగ్‌లో
అల్లు అర్హ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో పరిచయం అక్కరలేని పేరు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అయిన అర్హ.. చిన్నతనంలోనే తన క్యూట్‌నెస్‌తో ఇప్పటికే అభిమానుల్లో బోలెడంత క్రేజ్ సంపాదించింది. ఆమె ఏం చేసిన సోషల్ మీడియాలో ఓ ట్రెండ్ క్రియెట్ చేస్తుంది. నేడు(నవంబర్ 21) అర్హ తన నాలుగో పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన యూట్యూబ్ ఛానల్లో ఓ వీడియో సాంగ్ రిలీజ్ చేశాడు. 1990లో విడుదలైన క్లాసిక్ మూవీ అంజలి సినిమాలోని ‘అంజలి అంజలి అంజలి’ అనే పాట ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాటలో బేబీ షామిలీ తన నటనతో అందరిని మంత్రముగ్దులను చేసింది. తాజాగా ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌ను అల్లు అర్హతో మళ్లీ రీ క్రియేట్ చేసి వీడియో సాంగ్‌ను విడుదల చేశాడు. చదవండి: కూతురు బర్త్‌డేకు సర్ఫ్రైజ్ ఇచ్చిన అల్లు అర్జున్ ఈ పాటలో ఆర్హ క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం పాత సినిమా పాట మాదిరిగానే చిన్న పిల్లలందరిని కూడగట్టి సరికొత్తగా షూట్ చేశారు. ఇందులో అర్హతోపాటు తన సోదరుడు అయాన్ కూడా నటించారు. చివర్లో అల్లు అర్జున్ ఎంట్రీ ఇవ్వడం పాట మొత్తానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో తాతయ్యలు అల్లు అరవింద్, కేసీ శేఖర్ రెడ్డి కూడా కనిపించారు. ఇక గణేశ్ స్వామి కొరియోగ్రఫీ చేసిన లేటెస్ట్ అంజలి వీడియో సాంగ్‌కు సూర్య సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: చిన్నారి స్వాతంత్య్ర యోధులు -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
పాత్రలు కల్పితం
పవన్ తేజ్ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో రాజేష్ నాయుడు నిర్మించారు. మేఘన హీరోయిన్గా నటించారు. ఈ సినిమాలోని ‘కన్నయే కళ్లు..’ ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ –‘‘థ్రిల్లింగ్ ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రమిది. పవన్ తేజ్‌కి ఒక పర్ఫెక్ట్ లాంచింగ్ మూవీ అవుతుందని భావిస్తున్నాం. మా చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సునీల్ కుమార్ విజువల్స్, తాజుద్దీన్ సయ్యద్ మాటలు మా చిత్రానికి హైలైట్’’ అన్నారు. ‘‘రాజేష్ నాయుడుగారి సహకారంతోనే సినిమాను రిచ్‌గా తీయగలిగాం. ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అభిరామ్.ఎమ్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కృష్ణ పామర్తి. -
కాటుక కనులే మెరిసిపోయే..
కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. దర్శకురాలు సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ సినిమాను తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల చేయనున్నారు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటిస్తుండగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, పిల్లా పులి సాంగ్ వీడియో ప్రోమో, టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. (మోహన్‌బాబు నా గాడ్ ఫాదర్: సూర్య) ఈ క్రమంలో సూర్య పుట్టిన రోజు(జూలై 23) కానుకగా ‘కాటుక కనులే’ అంటూ సాగే మరో రొమాంటిక్ సాంగ్ వీడియో ప్రోమోను విడుదల చేసింది చిత్ర బృందం.‘‘కాటుక కనులే మెరిసిపోయే.. పిలడా నిను చూసి.. మాటలు అన్నీ మరచిపోయా నీళ్లే నమిలేసి.. ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టు.. గుండెకెంత సందడొచ్చెరా...’’ అంటూ సాగే ఈ పాట హీరోహీరోయిన్ల ప్రణయ బంధానికి అద్దం పడుతోంది. సూర్య, అపర్ణ తమ సహజ నటన, నాచురల్ లుక్స్‌తో కట్టిపడేశారంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. -
లెటజ్ ఫైట్ కరోనా
సినిమా పరిశ్రమలో రోజువారీ వేతనాలు అందుకునే కార్మికులకు అండగా ‘’కరోనా క్రైసిస్ చారిటీ’ ఏర్పాటు చేసి, స్టార్స్ అందరూ విరాళాలు ప్రకటించి, వారికి భరోసా అందిస్తున్నారు. ఇప్పుడు సామాన్యుల్లోనూ జోష్ నింపడానికి ఓ పాటను రికార్డ్ చేశారు. చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కలసి ’’లెటజ్ ఫైట్ కరోనా’’ అనే వీడియా సాంగ్ లో కనిపించారు. ‘వియ్ గోనా ఫైట్ కరోనా ఏదేమైనా.. చిన్నదిలే మనలో ఉన్నా ధైర్యం కన్నా జాగ్రత్తలు పాటిస్తూ ఎదురిద్దాం చిన్నా..’’ అంటూ ఈ పాట సాగుతుంది.. ఈ పాటను కోటి కంపోజ్ చేసి స్టార్స్‌తో కలసి పాడారు. ఈ పాటను ఎవరి ఇంట్లో వారు ఉండి షూట్ చేశారు. -
ప్రదీప్ సాంగ్‌ను ఆవిష్కరించిన మహేష్..
యాంకర్ ప్రదీప్ మాచీరాజు హీరోగా తెరకెక్కుతున్న తొలి చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ . ఎస్వీ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రదీప్ సరసన అమ్రిత హీరోయిన్గా నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మ్యూజికల్ పోస్ట్‌ర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి తొలి వీడియో సాంగ్‌ను సూపర్‌స్టార్ మహేష్ బాబు ఆవిష్కరించారు. ఈ 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం నుంచి మొదటి సాంగ్ లాంచ్ చేస్తున్నందకు ఆనందంగా ఉందని మహేష్ తెలిపారు. పాట చాలా బాగుందన్న మహేష్.. ప్రదీప్‌తోపాటు చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. తమ పాటను ఆవిష్కరించినందుకు చిత్రబృందం మహేష్‌కు ధన్యవాదాలు తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో సందడి చేస్తుంది. ‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ సాగే ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. సునీత, సిద్ శ్రీరామ్ పాడారు. కాగా, బుల్లితెరపై యాంకర్‌గా ప్రదీప్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్న క్రమంలో.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. -
ఈనాడు పండుగే పండుగ
సాక్షి, హైదరాబాద్: ఖైదీ సినిమా భారీ విజయంతో తెలుగులో మరోసారి మంచి జోష్ మీద ఉన్న కార్తీ త్వరలోనే దొంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్‌ను అందుకునేందుకు సిద్ధమవు తున్నాడు. కార్తీ అప్ కమింగ్ మూవీ ‘దొంగ’ సినిమా పోస్టర్స్‌కి, టీజర్‌తోపాటు రూపీ రూపీ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ప్రేక్షకుల అంచనాలు ఇలానే ఉన్నాయి. కార్తీకి నిఖిలా విమల్ జంటగా నటిస్తున్న మరో సూపర్ హీరోయిన్ జ్యోతిక (హీరో సూర్య భార్య), సత్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా ఈనాడు పండగే పండగే అనే వీడయో పాటు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అన్సన్ పాల్, ఇలావరసు, అమ్మూ అభిరామి, షావుకారు జానకి, సీత, అశ్వంత్ అశోక్ కుమార్, రమేష్ తిలక్ తదితరులు నటిస్తున్నఈ చిత్రానికి జోసెష్ దర్శకత్వం వహిస్తుండగా, వయాకామ్ 18 స్టూడియోస్, ప్యారలల్ మైండ్స్ ప్రొడక్షన్ పతాకాలపై తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరులో అన్ని భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాహిత్యాన్ని రామజోగయ్యశాస్త్రి అందించగా రంజింత్ గోవింద్ స్వరాలు కూర్చారు. ఎప్పటిలాగానే గాయని చిన్మయి శ్రీపాద తన స్వరంలో మెలోడీతో మ్యాజిక్ చేశారు. ఒకవైపు కేరళ అందాలు అలరిస్తోంటే.. రూపి రూపి పాటలో లాంగ్ హెయిర్‌తో..విలక్షణంగా ఆకట్టుకున్న కార్తీ తాజా సాంగ్‌లో మాత్రం రఫ్ లుక్‌తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు. -
‘జార్జ్‌రెడ్డి’ లిరికల్ వీడియో సాంగ్ ప్రోమో
చరిత్ర మరచిపోయిన విద్యార్థి నాయకుడి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తున్న సినిమా జార్జ్‌రెడ్డి. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా పోరాడి, లక్ష్య సాధనలో ప్రాణాలర్పించిన జార్జ్ రెడ్డి.. ఈ జనరేషన్‌కి తెలియకపోవచ్చేమో కానీ, 1965 నుంచి 1975 వరకు ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఆయన జీవితం గురించి తెలుసు. అలాంటి ఉద్యమ నాయకుడి గురించి ఈ తరం తెలుసుకునేలా రూపొందిస్తున్న సినిమా.. ‘జార్జ్ రెడ్డి’.. (ఏ మ్యాన్ ఆఫ్ యాక్షన్) . తాజాగా ఈ సినిమాలోని తొలి లిరికల్ సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్.. వాడి చూపుల్లో ఉంది చెగువేరా ట్రెండు’ అంటూ సాగే ఈ పాటను మంగ్లీ ఆలపించగా.. మిట్టపల్లి సురేందర్ సాహిత్యం అందిచారు. తాజాగా ఈ పాట ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ మారింది. నెటిజన్లను ప్రోమో విశేషంగా ఆకట్టుకుంటోంది. దసరా సందర్భంగా చిత్ర యూనిట్ ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ట్రైలర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చిత్రం పోస్టర్‌ను మంగళవారం నందికొట్కూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి ఆవిష్కరించారు. దీంతో ‘జార్జ్ రెడ్డి’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు పేరుగుతున్నాయి. ఈ చిత్రం నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్రానికి కెమెరా: సుధాకర్ యెక్కంటి, సంగీతం: సురేష్ బొబ్బిలి, నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్, అసోసియేటెడ్ ప్రొడ్యూసర్స్: దాము రెడ్డి, సుధాకర్ యెక్కంటి, సహ నిర్మాత: సంజయ్ రెడ్డి. -
ఓ సొగసరి...
రక్షిత్, నక్షత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘పలాస 1978’. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధ మీడియా పతాకంపై ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘ఓ సొగసరి...’ అనే మొదటి లిరికల్ వీడియో సాంగ్‌ని ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విడుదల చేశారు. ఈ సందర్భంగా ధ్యాన్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘రియలిస్టిక్ కథలకు టైం పీరియడ్ కూడా తోడైతే ఆ కథలు విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి కొన్ని ఆసక్తికరమైన అంశాల చుట్టూ అల్లుకున్న కథాంశంతో మా సినిమా వస్తోంది. 1978లో పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. మా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు, లేటెస్ట్ సెన్సేషన్ పల్లెకోయి బేబీ కలిసి ‘ఓ సొగసరి...’ పాటను పాడారు. బాలుగారు 30ఏళ్లు వెనక్కి వెళ్లి తన గాత్రాన్ని వినిపిస్తే, బేబీ గాత్రం పాటకు ఓ ఫ్రెష్‌నెస్‌ను తీసుకువచ్చింది. లక్ష్మీ భూపాల్‌గారు ఈ పాటను చక్కగా రాశారు. కరుణ కుమార్‌కు ఇది తొలి చిత్రమైనా, రచయితగా సాహిత్యలోకంలో ఆయన అందరికీ తెలిసిన వ్యక్తి’’ అన్నారు. రఘు కుంచె, తిరువీర్, జనార్థన్, లక్ష్మణ్, శృతి, జగదీష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: తమ్మారెడ్డి భరద్వాజ, కెమెరా: అరుల్ విన్సెంట్. -
‘ఎవరెస్ట్ అంచున’ ఇరగదీసిన పూజా హెగ్డే
సాక్షి, హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్నా 'మహర్షి' మూవీకి సంబంధించి ఒక వీడియో సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. హీరో మహేష్‌బాబు ట్విటర్లో ఈ వీడియోన్ పోస్ట్ చేశారు. మే 9న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీలోని హీరోయిన్ పూజా హెగ్డే, హీరో మహేష్‌పై చిత్రీకరించిన ‘ఎవరెస్ట్ అంచున’ డ్యూయెట్ సాంగ్ వీడియో ప్రివ్యూ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్మయి శ్రీపాద, డీఎస్పీ ఈ గీతాన్ని ఆలపించారు. కాగా ఇప్పటికే విడుదలైన టీజర్ ఆరు మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించింది. జగపతి బాబు, రావు రమేశ్ ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, అల్లరి నరేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. Enjoy :) #EverestAnchunahttps://t.co/ptzglkWuL8 — Mahesh Babu (@urstrulyMahesh) April 19, 2019 -
‘థూ నీ బతుకు చెడా’ వైరల్.. కళాకారుడి ఆవేదన!
సాక్షి, హైదరాబాద్ : విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, తిట్లు.. ఎన్నికలంటే ఇవి ఎప్పుడూ ఉండేవే. కానీ ఈసారి ఎన్నికల్లో వీటితోపాటు సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు.. నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో స్ఫూప్ వీడియోలతో, మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. రాజకీయ జోకులు, సెటైర్లకు కొదవే లేదు. ఈ క్రమంలో కళాకారులు, గాయకుల పాటలనూ, వీడియోలనూ వినియోగించుకుంటున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి.. దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా తన అనుమతి లేకుండానే తన పాటకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ వైరల్ చేస్తుండటంతో ఓ కళాకారుడు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తప్పుడు ఉద్దేశాలతో సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా తన పాటను వైరల్ చేస్తుండటంపై ఆయన తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆదేశ్ రవి.. కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత, కళాకారుడు, గాయకుడు. చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా తెరకెక్కుతున్న ‘తుపాకీ రాముడు’ సినిమాకు సహా రచయితగా డైలాగ్‌లు అందించారు. ఆ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రవి గత ఏడాది‘థూ.. మీ బతుకు చెడా’ అని ఓ సెల్ఫీ వీడియో పాటను రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేశారు. సమాజంలో క్షీణిస్తున్న నైతిక విలువల్ని ఎత్తిచూపుతూ.. స్వార్థపూరితంగా వ్యవహరించే మనుషుల ధోరణిని వ్యంగ్యంగా నిలదీస్తూ.. ఆవేదనతో ఈ వీడియో పాటను ఆయన రూపొందించారు. ‘దేవుడికి మొక్కుతవ్.. ప్రజల సొమ్ము నొక్కుతవ్’... ‘కమీషన్లు కొట్టి.. కట్టలుకట్టలు పేర్చి.. సచ్చినప్పుడు పట్టుకుపోతవ్రా.. థూ నీ బతుకు చెడా.. థూ నీ బతుకు చెడా..’ అంటూ ఆయన పోస్టుచేసిన పాటను అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒరిజనల్ వీడియో సాంగ్ స్క్రీన్ షాట్.. ఇన్సెట్లో (ఆదేశ్ రవి) కానీ, ఎన్నికల నేపథ్యంలో ఆదేశ్ రవి పాటను మార్ఫింగ్ చేసి ‘పీకినవ్ తియ్’ అనే ఫేస్బుక్ పేజీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హుస్నాబాద్ ఎన్నికల సభలో ‘థూ.. మీ బతుకులు చెడా’ అని కేసీఆర్ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదేశ్ రవి వీడియో పాటను సీఎం కేసీఆర్‌కు ఆపాదిస్తూ.. ఆయనను కించపరిచేలా.. దూషించేలా వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలియడంతో కలత చెందిన ఆదేశ్ రవి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఫేస్బుక్ పేజీ ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే, వాట్సాప్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ‘నా పాటను మార్ఫింగ్ చేసి.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి నేను పాడినట్టు కల్పించడం షాక్ గురిచేసింది. రాజకీయ ప్రచారాల కోసం ఇలా కళాకారుల సృజనను దుర్వినియోగపరచడం ఎంతమాత్రం సబబు కాదు’ అని ఆదేశ్ రవి అన్నారు. రాజకీయాలు, ఎన్నికలు ఎలా ఉన్నా వ్యక్తులపై బురద జల్లేవిధంగా, విద్వేషాలు పెంచేవిధంగా వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు.. ఏదీఏమైనప్పటికీ ఈ ఒక్క వీడియో అనే కాదు.. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను కించపరిచేలా అనేకమైన మార్ఫింగ్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదేశ్ రవి ఒరిజనల్ పాటను ఇక్కడ చూడొచ్చు.. -
గుమ్మడికాయ కొట్టేశారు
‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటొని’. శ్రీనువైట్ల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ (సివిఎమ్) నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టేశారు. హీరో హీరోయిన్లపై హైదరాబాద్‌లో చిత్రీకరించిన చివరి పాటతో షూటింగ్ పూర్తయింది. సోమవారం శ్రీనువైట్ల పుట్టిన రోజు కానుకగా ‘అమర్ అక్బర్ ఆంటొని’ పాత్రలను పరిచయం చేస్తూ, ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథ, భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రవితేజ మూడు వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. ఈ గెటప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన వచ్చింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. లయ, సునీల్, ‘వెన్నెల’ కిశోర్, రఘుబాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: పవ్రీణ్ మర్పూరి, సీఈఓ: చెర్రీ, కెమెరా: వెంకట్ సి దిలీప్, సంగీతం: ఎస్ఎస్ తమన్. -
ఫస్ట్‌లుక్ 13th August 2018
-
విజిల్‌పోడు సాంగ్‌కు క్లాసికల్ టచ్ ఇస్తే!
-
బీకాంలో ఫిజిక్స్ పుస్తకాలతో సినిమా పాట..
జలీల్ ఖాన్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు కాబోలు. బీకాంలో ఫిజిక్స్ చదివానని ఓ ఇంటర్వ్యూలో చెప్పి వార్తల్లోకి ఎక్కారు. ఆ సమయంలో 'ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులుగా చదివి బీకామ్ డిగ్రీ సాధించా'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఖాన్ 'బీకామ్ ఫిజిక్స్' వ్యాఖ్యలపై చాలా మంది పొట్టచక్కలయ్యేలా నవ్వుకున్నారు. బీకామ్ ఫిజిక్స్‌పై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చాయి. ఈ సంఘటన జరిగి ఇటీవలే ఏడాది పూర్తైన దాని జోరు ఏమాత్రం తగ్గలేదు. ఎల్లప్పడు సరికొత్తగా వాడుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఓ సినిమా పాటలోను బీకామ్ ఫిజిక్స్‌ను వాడేశారు. ఊహలు గుసగుసలాడే ఫేమ్, యువహీరో నాగ శౌర్య తాజా చిత్రం ఛలో సినిమాలోని ఓపాటలో విద్యార్ధులు బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలు పట్టుకొని ఉంటారు. ఛలో సినిమా విషయానికొస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్నారు. రస్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. ఉషా మూల్పూరి నిర్మతగా వ్యహరిస్తున్నారు. స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అనే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. పాటలో నాగ శౌర్య, రస్మికను ఆటపట్టించే సన్నివేశంలో విద్యార్థులందరూ బీకామ్ ఫిజిక్స్ పుస్తకాలను పట్టుకొని ఉంటారు. -
దుమ్ము రేపుతున్న’డీజే’ లేటెస్ట్ వీడియో సాంగ్
-
విశాఖలో విడుదలైన సందేశాత్మక వీడియో
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
వార్ మూవీ ‘డంకర్క్ డంకర్క్ : ట్రైలర్ 1 :: నిడివి : 2 ని. 18 సె. :: హిట్స్ : 1,19,12,322 ఇంటర్స్టెల్లార్.. సైన్స్ ఫిక్షన్. ఇన్సెప్షన్.. క్రైమ్ థ్రిల్లర్. ది డార్క్ నైట్.. సూపర్‌హీరో యాక్షన్. ఈ మూడు చిత్రాలను తీసిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ ఇప్పుడు ‘డంకర్క్’ అనే చారిత్రక యాక్షన్ మూవీని తీస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 21న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ ట్రైలర్ యూట్యూబ్‌లో రెండు రోజుల క్రితమే విడుదలైంది. నోలన్ బ్రిటిష్–అమెరికన్. ‘డంకర్క్’ బ్రిటిష్ వార్ ఫిల్మ్. చరిత్రలో ప్రసిద్ధి కెక్కిన ‘డంకర్క్ ఎవాక్యుయేషన్’ (కోడ్ నేవ్ : ఆపరేషన్ డైనమో) ఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు నోలన్. డంకర్క్ అనేది ఫ్రాన్స్ రేవు పట్టణం. 1940లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ నాయకత్వంలోని శత్రువుల ధాటిని తట్టుకోలేక డంకర్క్ తీరప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల 30 వేల సంకీర్ణదళ సైనికులు ఖాళీ చేసి వెళ్లవలసి వచ్చింది. ఆ బ్రిటిష్ మహా ఓటమినే నోలన్.. డంకర్క్కు కథగా ఎన్నుకున్నారు. ‘వియ్ సరౌండ్ యు’ అని ప్రింట్ అయి ఉన్న పాంప్లెట్స్ గాలిలోంచి ఎగిరి వచ్చి, డంకర్క్లో మోహరించిన బ్రిటిష్ సైనికుల తలల మీద పడుతుండగా ట్రైలర్ మొదలవుతుంది. అప్పటికే ఎటాక్ మొదలై ఉంటుంది. డంకర్క్ ఒడ్డు నుంచి శవాలు కొట్టుకొస్తుంటాయి. ఇక అక్కడి నుంచి మిత్రరాజ్యాలకు, శత్రుదేశాలకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, మధ్య మధ్య దళపతుల వ్యూహాత్మ ఎత్తుగడలను ట్రైలర్లో చూడొచ్చు. హసీనో కా దీవానా : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 23 సె. :: హిట్స్ : 1,89,93,433 జనవరి 25న విడుదలకు సిద్ధం అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాబిల్’ (కేపబుల్ అని అర్థం) రెండో పాట ‘హసీనో కా దీవానా’ వీడియో ఈ వారం విడుదలైంది. హృతిక్‌రోషన్, ఊర్వశీ రాటెల ను మీరు ఈ పాటలో చూడొచ్చు. ఇద్దరూ కలసి పాడరు కానీ, ఊర్వశి పాడుతుండగా హృతిక్ వచ్చి ఆ నైట్ క్లబ్‌ను పేల్చేస్తాడు. మొత్తం పాటంతా ఊర్వశిదే. అందరిలా నవ్వు, సంతోషం, ప్రేమ నిండిన హృతిక్ జీవితం ఊహించని మలుపు తిరిగి పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. తను పుట్టి గుడ్డివాడినని తెలిసి కూడా తను ఏర్పరచుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి తెగిస్తాడు. ఈ కథంతా వీడియోలో ఉండదు కానీ, వీడియో స్టార్టింగ్‌లో హృతిక్ తన విరోధికి వార్నింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. అక్కడి నుంచి కథ కొంత అర్థం అవుతుంది. ఐటమ్ గర్ల్ పాట పాడుతుండగా హీరో అక్కడికి రహస్యంగా చేరుకుని విలన్లను మట్టుపెట్టే సన్నివేశం చాలా సినిమాల్లో ఉండేదే. కానీ ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంది. డైరెక్షన్ సంయజ్ గుప్తా. హీరోయిన్ యామీ గౌతమ్. సెల్ఫ్ డ్రైవింగ్ ఉబర్ రన్నింగ్ రెడ్ లైట్ నిడివి : 30 సె. :: హిట్స్ : 10,63,009 డ్రైవర్ ఉండని వాహనాలు ఎంతవరకు సురక్షితం? ఎంతవరకు అవి సురక్షితమో కచ్చితంగా చెప్పలేం అని తాజాగా జరిగిన ఒక ‘టెస్ట్ డ్రైవ్’ రుజువు చేసింది. ఉబర్ కంపెనీ తన ‘సెల్ఫ్ డ్రైవింగ్’ కారును ప్రయోగా త్మకంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక రోడ్డు మీదకు వదిలినప్పుడు ఈ విషయం స్పష్టమయింది. ఈ వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమౌ తుంది. ముందు ఉబర్ కారు వెళుతోంది. వెనుక డ్యాష్ క్యామ్ (డ్యాష్ బోర్డ్ కెమెరా) ఉన్న కారు ఫాలో అవు తోంది. ఉబర్ కదలికల్ని రికార్డ్ చేస్తోంది. ఉబర్‌లో డ్రైవర్ లేడు. ఆటోమేటిక్ డ్రైవింగ్. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. జీబ్రా లైన్‌కు ఇవతలే వాహనాలన్నీ ఆగిపోవాలి. ఆగిపోయాయి. డ్యాష్ క్యామ్ ఉన్న కారు కూడా ఆగింది. కానీ ఉబర్.. రెడ్ లైట్‌ను ఫాలో కాకుండా ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం మన రజనీ సినిమా ‘రోబో’ లోని ఓ సన్నివేశాన్ని గుర్తు తెచ్చేలా ఉంది! ఇక్కడ ఉబర్ కూడా కనీసం తనలో ఫీడ్ చేసిన సూచనలను కూడా ఫాలో కాలేకపోయింది. ‘అయితే ఇది మానవ తప్పిదం మాత్రమేనని, టెస్ట్ సెల్ఫ్–డ్రైవ్ కోసం కారు లోపల కూర్చున్న డ్రైవర్ సరైన ఇన్ఫర్మేషన్ని ఫీడ్ చెయ్యకపోవడంతో అలా జరిగిందని ఉబర్ ఒక ప్రకటన విడుదల చేసింది. లేడీ గాగా : మిలియన్ రీజన్స్ నిడివి : 4 ని. 12 సె. :: హిట్స్ : 66,90,412 యాంబియన్ట్ మ్యూజిక్ అనే మాట వినే ఉంటారు. ట్యూన్ ఉండదు. బీట్ ఉండదు. మనసును నెమ్మదిపరుస్తుంది. ఒక మూడ్‌లోకి తీసుకెళుతుంది. లేడీ గాగా లేటెస్ట్ ఆల్బమ్‌లోని సాంగ్.. ‘మిలియన్ రీజన్స్’ ఓ యాంబియన్ట్ మ్యూజిక్ వీడియో. గాగా తెలుసు కదా! అమెరికన్ పాప్ సింగర్. ‘బ్యాడ్ రొమాన్స్’, ‘పర్ఫెక్ట్ ఇల్యూజన్స్’ వంటి పాప్ గీత గుచ్ఛాలతో యువహృదయాలను సేదతీర్చిన గాగా ఇప్పుడు ‘మిలియన్ రీజన్స్’తో మన ముందుకు వచ్చారు. ఓ ఎడారి. పైన సూర్యుడు. గాగా ఆ ఎండలో నేలపై వెల్లకిలా పడుకుని, తల పట్టుకుని ఉన్నప్పుడు, పక్కనే హై వే మీదుగా వెహికిల్స్ వస్తూ ఉండడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ సీన్లో పియానోతో పాట మెల్లగా ముందుకు సాగుతుంది. ‘నిన్ను వెళ్లనివ్వడానికి నువ్వు నాకు పదిలక్షల కారణాలు చూపుతున్నావు’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ‘వెళ్లిపోవడానికి నాక్కూడా కోటి కారణాలు ఉన్నాయి’ అని గాగా గాత్రం మంద్రస్థాయిలో ప్రతిధ్వనిస్తుంది! గాగా ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘జోయాన్’లోని ఈ మిలియన్ రీజన్స్ సాంగ్‌ను వినేందుకు, చూసేందుకు ఒక్క రీజన్ చాలు. లవ్! విడిపోయి, మళ్లీ కలుసుకోవాలని తపించే అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ పాట తప్పక నచ్చుతుంది. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
కాలా చష్మా: వీడియో సాంగ్ నిడివి : 2 ని. 53 సె. హిట్స్ : 1,74,22,271 బుర్ర ఖరాబ్‌గా ఉంటే రిఫ్రెష్ కొట్టడానికి వెంటనే ఒకసారి యూట్యూబ్‌లోకి వెళ్లండి. ఈవారం పాపులర్స్లో కాలా చష్మా సాంగ్‌ని చూడండి. నల్ల కళ్లజోడు పెట్టుకుని కత్రీనా కైఫ్, సిద్ధార్త్ మల్మోత్రా, తక్కిన గుంపు కలిసి పాడే ఈ వీడియో సాంగ్ మిమ్మల్ని మీ సీట్లో స్థిమితంగా కూర్చోనివ్వదు. అందుకు ప్రధాన కారణం మ్యూజిక్. ఇంకొక అత్యంత ప్రధానమైన కారణం.. కత్రీనా డాన్స్ చూశాక మీకే తెలుస్తుంది. సెప్టెంబర్ 9న విడుదల కాబోతున్న ‘బార్ బార్ దే ఖో’ చిత్రంలోని ఈ స్పెప్పుల టణ్గ్ టణ్గ్ సాంగ్ కు మ్యూజిక్‌ని పునఃసృష్టించింది బాద్షా. (ఒరిజినల్ కంపోజింగ్ ప్రేమ్ హర్దీప్). అమ్రిక్ సింగ్, కుమార్ కలిసి రాసిన ఈ పాటను అమర్ ఆర్షి బాద్షా, నేహా కక్కర్ తమ స్వరంలోంచి ఒలికించారు. నిత్యా మెహ్రా అనే కొత్త బాలీవుడ్ దర్శకురాలు తీస్తున్న ఈ రొమాంటిక్ డ్రామా ఎలా ఉండబోతోందో తెలుసుకోడానికి ‘కాలా చష్మా’ చూస్తే సరిపోతుంది. జీ మ్యూజిక్ కంపెనీ ఈ వీడియోను రిలీజ్ చేసింది. నిత్య గతంలో ‘లైఫ్ ఆఫ్ పై’కి అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేశారు. జాకబ్ సార్టోరియస్: హిట్ ఆర్ మిస్ నిడివి: 4 ని. 18 సె. హిట్స్: 67,61,552 13 ఏళ్ల సోషల్ మీడియా స్టార్.. జాకబ్ సార్టోరియస్.. మ్యూజిక్ లవర్స్‌కి ఇప్పుడొక ఫ్రెష్ లుక్. ‘స్వెట్‌షర్ట్’ తర్వాత ఈ పిడుగు విడుదల చేసిన ఈ ‘హిట్ ఆర్ మిస్’ చూస్తున్నపుడు కనుక మీకు ఇతడి బుగ్గల్ని పట్టి లాగాలన్న ఆలోచన కలిగితే అది మీ దోషం కాదు. పాటలోని ప్రలోభం.‘పెద్దవాళ్లం అయ్యాక జీవితం కష్టంగా ఉంటుందని, ఫన్ అనేది కిడ్స్‌కి మాత్రమే పరిమితం అనీ విన్నాను. కానీ పెరిగి, పెద్దవుతున్న కొద్దీ నాకు తెలుస్తున్నదేమిటంటే.. అలా అని కచ్చితంగా చెప్పలేం’ అంటూ కోరస్‌తో సాంగ్ మొదలవుతుంది. ఈ చిన్నారి అమెరికన్ గాయకుడిలో హాలీవుడ్ నటనకు కావలసిన కళ లన్నీ పుష్కలంగా ఉన్నాయి. ‘లెటజ్ నాట్ వర్రీ అబౌట్ టుమారో’ అని పెద్ద వేదాంతిలా ఇతడు చెప్పడమూ చూడ్డానికి ముచ్చటగా ఉంటుంది. ఒంటి మీద పింక్ షర్ట్, దాని పైన బ్లూ కోటు వేసుకుని, కారులో వెళుతూ పాటకు తగ్గట్టు ఫీలింగ్స్‌ని పాస్ చేస్తుండే జాకబ్‌ని చూస్తుంటే... మెక్సికన్ సింగర జస్టిన్ బీబర్‌కి త్వరలోనే గట్టి పోటీ తగలబోతోందనే అనిపిస్తుంది. ప్రిమిటివ్ టెక్నాలజీ: ఫోర్జ్ బ్లోయర్ నిడివి : 4 ని. 31 సె. హిట్స్ : 36,15,316 నెట్లో ‘ప్రిమిటివ్ టెక్నాలజీ.వర్డ్‌ప్రెస్’ అనే సైట్ ఉంటుంది. అందులోకి వెళ్లి చూస్తే అంద మైన ఆదిమానవ లోకంలోకి వెళ్లినట్లే. ఇప్పటి టెక్నాలజీ అంతా అప్పటి ఐడియాల పుణ్యమే కాబట్టి.. సైట్ చూడ్డానికి ఇంట్రెస్టుగా ఉంటుంది. ఎలా బతికాం? ఎలా బతుకుతున్నాం అని తెలుస్తుంది. బతికి ఉన్న కాలమే బెటర్‌గా ఉంది, బతుకుతూ ఉన్న కాలం కంగాళీగా ఉంది అని కూడా అనిపించవచ్చు. ఈ సైట్ నిర్వాహకులు రెండు రోజుల క్రితం ‘ఫోర్జ్ బ్లోయర్’ (కొలిమి) ప్రాథమిక రూపాన్ని యూట్యూబ్‌లోకి అప్లోడ్ చేశారు. అడవిలో నిప్పుని సృష్టించే ఈ వీడియో.. మిమ్మల్ని కూడా ఇలాంటి ఒక ప్రయోగానికి ప్రేరేపించినా ఆశ్చర్యం లేదు. అంత టెంప్టింగ్గా ఉంది. వీడియో అర్థం కాకపోతే... కింద టెక్స్ట్‌ను బట్టి విషయాన్ని ఫాలో అవొచ్చు. కాన్యే వెస్ట్-ఉల్ఫ్స్ (బాల్మైన్ కాంపెయిన్) నిడివి : 7 ని. హిట్స్ : 32,52,503 కాన్యే వెస్ట్ అమెరికన్ సింగర్. సాంగ్ రైటర్. ఆయన తాజాగా విడుదల చేసిన వీడియో సాంగ్ ఉల్ఫ్స్. రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి వచ్చింది. ఫ్రెంచి ఫ్యాషన్ కంపెనీ బాల్మెయిన్ కోసం ఆయన ఈ వీడియోను రూపొందించారు. కాన్యేకి ఏమిటి సంబంధం? ఆయన సుప్రసిద్ధ డిజైనర్ కూడా. ఇక వీడియోలోని విశేషాలు. కొంచెం కిక్క్ కోరుకునేవారు ఒంటరిగా, గది తలుపులు వేసుకుని ఈ మ్యూజిక్ వీడియోను చూడొచ్చు. విన్నా చాలు.. వణుకులోంచి సన్నగా వెన్ను... సారీ, వెన్నులోంచి సన్నగా వణుకు మొదలవుతుంది. కొన్ని నిమిషాలయ్యాక కన్నీళ్లూ వచ్చేస్తాయి. భయంతో కాదు. ఎమోషన్‌తో. ‘యు టర్న్డ్ అవుట్. యూ టూ వైల్డ్’ అని కాన్యే కళ్లు ధారగా వర్షిస్తుంటాయి. ఈ బ్లాక్ అండ్ వైట్‌లో మీకు లైఫ్‌లోని చాలా కలర్స్ కనిపిస్తాయి. -
ఈ వారం యూట్యూబ్ హిట్స్
జగ్ ఘూమేయా : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 45 సె. హిట్స్ : 25,30,517 అతడికి ఆమెపై ఉన్నది నిజమైన ప్రేమ. లక్షల మందిలో అతడికి ఉన్నది ఆమె ఒక్కరే. అతడు సల్మాన్‌ఖాన్. ఆమె అనుష్కాశర్మ. ఆమెను గుండెల్లో నింపుకుని అతడు పాడే పాట ‘జగ్ ఘూమేయా తారే న కోయీ’. సుల్తాన్ చిత్రం లోని పాట ఇది. సినిమా రంజాన్‌కు విడుదలవుతోంది. ఈ అందమైన ప్రణయగీతాన్ని రాసింది ఇర్షాద్ కమిల్. సంగీతం విశాల్ శేఖర్. పాడింది రహత్ ఫతే అలీ ఖాన్. ‘నేను ప్రపంచమంతా తిరిగాను. కానీ నీలాటి అమ్మాయిని నేను కలవలేదు..’అనే అర్థంతో పాట సాగుతుంది. ఒక మల్లయోధుని చుట్టూ అల్లుకుని ఉండే ఈ కథలో.. మానవజన్మలోని ప్రతి భావోద్వేగమూ ప్రతిఫలిస్తుందని యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇంతకు ముందే ప్రకటించింది. అది నిజమేనని ఈ వీడియోలో సల్మాన్ కళ్లు ఒలికించే భావాలను బట్టి నిర్థారణ చేసుకోవచ్చు. జస్టిన్ బీబర్ - కంపెనీ నిడివి : 3 ని. 27 సె.; హిట్స్ : 1,50,90,066 ఈ ఏడాది మార్చిలో విడుదలైన కెనడా యువ పాప్ గాయకుడు జస్టిన్ బీబర్ నాలుగో స్టుడియో ఆల్బమ్ ‘పర్పస్’లోని ఈ ‘కంపెనీ’ సాంగ్ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. బీబర్‌తో ఐదుగురు గేయ రచయితలు కలిసి కూర్చుని ఈ ఎలక్ట్రోపాప్కి సాహిత్యాన్ని అందించారు. కంపెనీ అంటే ఇక్కడ మ్యాజిక్ కంపెనీనో, మరొకటో కాదు. మనుషుల సాన్నిహిత్యం. ‘మన మధ్య దగ్గరితనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుందా...’ అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ సాంగ్, మధ్య మధ్యలో మన హృదయపు లోతుల్లోకి దిగబడి, ఆత్మీయ భావనలను జివ్వున ఎగజిమ్ముతూ... చివరికొచ్చేసరికి... ‘కారణం ఏమీ లేదు.. ఊరికే నీతో మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది.. మనం టచ్‌లో ఉన్నామా లేమా అని కాదు.. అలా అనిపిస్తుంది. ఇంతకీ మనల్ని మనం నిలబెట్టుకోగలమా..’ అనే సందేహంతో ఎండ్ అవుతుంది. 82 ఇయర్ సింగర్ షాక్స్ నిడివి : 3 ని. 25 సె.; హిట్స్ : 53,80,232 యూత్ పవర్.. యూత్ పవర్ అని ఎప్పుడూ వింటుంటాం. ఏజ్డ్ పవర్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వినాల్సిందే. జాన్ హెట్లింజర్ అనే ఈ 82 ఏళ్ల అమెరికన్ సింగర్.. ‘ది అమెరికాస్ గాట్ టాలెంట్’ (ఎ..జి.టి) వేదిక మీద తన గానాలాపనతో ఎలా ప్రేక్షకులను షాక్‌కు గురిచేశారో మీరు చూసి తీరవలసిందే. ఎ.జి.టి. అనే సంస్థ రియాలిటీ టెలివిజన్ సీరీస్‌ని షూట్ చేసి ఛానెళ్లకు ఇస్తుంటుంది. అసాధారణమైన, చిత్రవిచిత్రమైన టాలెంట్లను మాత్రమే వెదకి పట్టుకునే ఎ.జి.టి.కి ఈసారి హెట్లింజర్ దొరికాడు. షో ఆరంభం కాగానే వరుస ప్రశ్నలతో అతడికి విసుగెత్తించి, నీరసం తెప్పించాలని ప్రయత్నించిన న్యాయనిర్ణేతలు చివరికి వారే అలసిపోయి చెవులు మూసుకోవలసి వచ్చింది. అంతగా ఆ పెద్దాయన ఏం అదరగొట్టాడబ్బా? చిన్న క్లూ. గతంలో అతడు ఏరోస్పేస్ ఇంజినీర్. ఇప్పుడు కనిపెట్టండి. లేదంటే యూట్యూబ్‌లోకి వెళ్లి చూడండి. కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్ నిడివి : 2 ని. హిట్స్ : 1,54,55,058 సెలీనా గోమెజ్‌ను అమితంగా ఆరాధించే అబ్బాయిలు.. సందేహంలేదు... ఈ ఆల్బమ్‌లో ఆమె చూపించే కైండ్‌నెస్‌తో.. దె కిల్ దెమ్సెల్వ్స్! 23 ఏళ్ల ఈ అమెరికన్ యాక్ట్రెస్ కమ్ సింగర్ తన కొత్త ఉద్వేగభరిత జీవన పోరాట గీతం ‘కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్’ను యూట్యూబ్‌కి ఎక్కించిన కొన్ని గంటలకే హిట్లు యాభై లక్షలు దాటి పోయాయి. ఇక అక్కడి నుంచి ఈ నాలుగు రోజులుగా వీక్షకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తన రెండో స్టుడియో ఆల్బమ్ రివైవల్ కోసం సెలీనా ఈ పాటను రికార్డు చేశారు. పాప్ సంప్రదాయం ప్రకారం ఒక బృందంగా ఏర్పడిన సృజనశీలురు పాటకు అందమైన అక్షరాలను సమకూర్చారు. ‘ఈ ప్రపంచమంత దరిద్రపుకొట్టు ప్రదేశం ఇంకొటి లేదు. ఆ సంగతి నీకు తెలుసు. నాకు తెలుసు. అలాగని హృదయంలోని కారుణ్యాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి. నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని కింద పడేయ్. కిల్ దెమ్ విత్ కైండ్‌నెస్’ అని చెబుతుంది సెలీనా గోమెజ్.. ఈ బ్లాక్ అండ్ వైట్ వీడియోలో. ఆమె వదనంలోని దయాదాక్షిణ్యాలను మిస్ కాకండి. ‘వివో’ కంపెనీ దీనిని హోస్ట్ చేసింది.