
దర్శకధీరుడు రాజమౌళి సినిమా 'ఆర్ఆర్ఆర్' క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇంకా ఆ చిత్రంలోని 'నాటు నాటు సాంగ్' అయితే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఓ రేంజ్‌లో ఊపేసింది. విదేశీయులు సైతం ఆ పాటకు డ్యాన్స్ చేయకుండా ఉండలేకపోయారు. ఈ పాటకు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. అయితే అచ్చం అలాగే స్టెప్పులు వేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆనాటి బ్లాక్ అండ్ వైట్ కాలంలోని ఓ వీడియో నెటిజన్లు షేర్ చేయగా అది కాస్తా వైరలవుతోంది. ఆ వీడియోలోని స్టెప్పులు చూస్తే అచ్చం నాటు నాటు సాంగ్‌ను తలపిస్తున్నాయి. మీరు కూడా ఆ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment