RRR
-
ఆర్ఆర్ఆర్కి నిధుల కొరత లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్‌ను వచ్చేనెల ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రీ బడ్జెట్ సమావేశాలను చేపట్టారు. గురువారం సచివాలయంలో ఆయా శాఖలకు కేటాయింపులకు సంబంధించి రహదారు లు – భవనాలు, బీసీ సంక్షేమ శాఖల మంత్రులు, అధికారు లతో సమావేశమయ్యారు, ఆర్‌అండ్‌బీకి సంబంధించి ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని భట్టి, ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికా రులను ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డు సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) 3డి డిజైన్లు వంటి పనులను సత్వరం పూర్తిచేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశా రు.ఎంత వేగంగా పనులు చేపడితే అంత వేగంగా నిధులు మంజూరు చేస్తామని భట్టి అధికారులకు భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ శాఖకు ఉన్న ఆస్తులపై నివేదిక రూపొందించాలని, విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వచ్చే రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం మేరకు రోడ్లు, భవనాల శాఖ అధికారులు పనులు చేపట్టి నిధులు సద్వినియోగం చేయాలని ఆదేశించారు.కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఆర్అండ్బీ శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఏవియేషన్ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు తెలిపారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్‌రాజ్, డిప్యూటీ సీ ఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్, సెక్రటరీ దాసరి హరిచందన, ఆర్థిక శాఖ సెక్రటరీ హరిత తదితరులు పాల్గొన్నారు.హాస్టళ్ల, గురుకులాల బకాయిలు చెల్లిస్తాం..అద్దె భవనాల్లో కొనసాగుతున్న సంక్షేమ హాస్టళ్ల, గురుకులాల అద్దె బకాయిలు వెంటనే చెల్లిస్తామని అందుకు, ప్రతిపాదనలు తీసుకురావాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ప్రీబడ్జెట్ సమావేశం నిర్వహించారు. బీసీ స్టడీ సెంటర్లు ఉద్యోగ కల్పన కేంద్రాలుగా ఉండాలని భట్టి అధికారులను ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాబ్ క్యాలెండర్‌ను అనుసరించి స్టడీ సెంటర్లలో కోచింగ్ నిర్వహించాలని కోరారు.డీఎస్సీ, బ్యాంకింగ్ వంటి పరీక్షలపైన దృష్టి సారించాలని ఆదేశించారు. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు.. వాటి నిర్వహణకు అవసరమైన చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సమావేశంలో చర్చించారు. ఆర్టీసీ ఆస్తులు, నిర్వహణ, ఆదాయ వనరులపై మంత్రులు అధికారులను అడిగారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్ ఆర్ ఆర్ రికార్డు బ్రేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం ..!
-
సీక్రెట్స్ ఆఫ్ ఆర్ఆర్ఆర్ బై రాజమౌళి
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్ ఒకటి. ఈ డాక్యుమెంటరీ గురించి తెలుసుకుందాం.తన ఉనికిని తెలిపేందుకు ఓ గదిలో నలుగురు ముందు చప్పట్లు కొడితే ఆ నలుగురికి తన విషయం తెలియవచ్చు. కానీ అదే ఉనికి ప్రపంచానికి తెలియాలంటే సరిగ్గా రాజమౌళిలా ఆలోచించాలి. భారతదేశానికి ఒకప్పుడు సినిమా ప్రమోషన్‌ను ఓ వినూత్న పంథాలో పరిచయం చేసిన బాలీవుడ్ దిగ్గజం అమిర్ ఖాన్ కూడా తాను ఈ విషయంలో రాజమౌళినే ఫాలో అవుతాననడం దీనికి ఓ నిదర్శనం. చరిత్ర అనేది రాజమౌళి ముందు ఉన్నది తరువాత ఉంటుంది, కానీ ఆ చరిత్రలో రాజమౌళికి ఓ చెరగని పేజీ ఉంటుందనేది మాత్రం నిర్వివాదాంశం.తెలుగు సినిమా వైభవాన్ని ఎన్నో అంతర్జాతీయ వేదికలపైన నిలిపిన శిల్పి రాజమౌళి. మరీ ముఖ్యంగా తెలుగు సినిమాకి ఆస్కారమే లేదన్న ఆస్కార్ పురస్కారాన్ని అద్భుతంగా అందించిన అత్యున్నత దర్శకులు రాజమౌళి. తన సినిమా అంటేనే ఓ సంచలనం. మరి... ఆ సంచలనం వెనకున్న సీక్రెట్ తెలుసుకోవాలని ప్రతి దర్శకుడితో పాటు సామాన్య ప్రేక్షకుడికి కూడా ఆసక్తి ఉంటుంది. ఆ కోవలోనే రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి సంబంధించిన తన కష్టాన్ని ఓ చక్కటి డాక్యుమెంటరీ రూపంలో ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ పేరిట నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంచారు.దాదాపు రెండున్నర గంటల పై నిడివి ఉన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను నాలుగేళ్ల పాటు తీశారు. ఈ డాక్యుమెంటరీలో ఆ సినిమా మొత్తాన్ని ఎలా తీశారో రాజమౌళి వ్యాఖ్యానంతో పాటు సినిమాలోని నటీనటులు టెక్నీషియన్్స కూడా వివరిస్తూ చూపించడం ఎంతో బాగుంది. తన ఈ ‘ఆర్ఆర్ఆర్’ ప్రయాణానికి సంబంధించి ఎన్నో తెలియని, చూడని అద్భుత విషయాలను ప్రేక్షకులకు అందంగా అందించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి... ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన ఫుటేజ్ కొన్ని గంటల రూపంలో ఉంటే దానిని ఎడిట్ చేసి, గంటన్నర నిడివితో అందించారట. ఈ సమాజమనేది ఓ సృష్టి.ప్రతిరోజూ మన మనుగడ ఈ సృష్టికి అనుగుణంగానే ఉంటుంది. ఓ రకంగా సినిమా అన్నది కూడా ఓ సృష్టే. ఓ దర్శకుడి ఆలోచనకు ప్రతిరూపమే సినిమా అన్న ఓ అద్భుత సృష్టి, కానీ ఈ సినిమా సృష్టిలో ఎంతోమంది కష్టం ఉంటుంది. మరి... అటువంటి సినిమాను ఏ విధంగా రూపొందించారో ఆ రహస్యాలు మీరు కూడా తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్ – బిహైండ్ అండ్ బియాండ్’ని చూసేయండి. వర్త్ టు వాచ్ అండ్ ప్రిజర్వ్ ద డాక్యుమెంటరీ ఫర్ ది ఫ్యూచర్ కిడ్స్. – ఇంటూరు హరికృష్ణ -
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
పుష్ప -2 క్రేజ్.. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్-2 అల్‌టైమ్ రికార్డ్స్ బ్రేక్!
బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతోంది. ఈనెల 5న థియేటర్లలోకి పుష్ప-2 సరికొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కు దాటేసిన పుష్ప-2 తాజాగా మరో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1400 కోట్ల మార్క్‌ను అధిగమించింది.సుకుమార్- బన్నీ కాంబోలో వచ్చిన ఈ సినిమా నార్త్‌లోనూ తగ్గేదేలే అంటోంది. రిలీజైన మొదటి రోజు నుంచే రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటివరకు హిందీలో ఎప్పుడు లేని విధంగా రూ.561 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన తొలి డబ్బింగ్ మూవీగా నిలిచింది. అంతే కాకుండా రెండోవారం వీకెండ్లో రూ.100 కోట్ల సాధించిన తొలి హిందీ చిత్రంగా ఘనతను సొంతం చేసుకుంది. (ఇది చదవండి: పుష్ప2 'పీలింగ్స్' సాంగ్ వీడియో విడుదల)కేజీఎఫ్-2, ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ బ్రేక్..ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్-2 సాధించిన రికార్డ్‌ను పుష్ప-2 దాటేసింది. కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్స్‌ను కేవలం పదిరోజుల్లోనే అధిగమించింది. అంతేకాకుండా రాజమౌళి బ్లాక్‌బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ (రూ.1309) కోట్ల రికార్డ్‌ను సైతం తుడిచిపెట్టేసింది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత మూవీ వసూళ్లు మరింత పెరిగినట్లు తెలుస్తోంది. The BIGGEST INDIAN FILM is on a rampage at the box office ❤🔥#Pushpa2TheRule grosses 1409 CRORES GROSS WORLDWIDE in 11 days 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/eJusnmNS6Y#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil… pic.twitter.com/bWbwb50sj4— Pushpa (@PushpaMovie) December 16, 2024 -
ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేయాలి
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగంలో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రింగ్‌రోడ్డు కోసం చౌటుప్పల్ జంక్షన్ వద్ద 184 ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. ఆ భూములు, ఇళ్ల స్థలాలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏ మాత్రం సరిపోదని తెలిపారు. ట్రిపుల్ ఆర్ బాధిత రైతులు శనివారం హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి తమ సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించిన తర్వాత వారి అంగీకారంతోనే భూ సేకరణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 26న దివ్యాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహించే మహాధర్నాకు రావాల్సిందిగా ఆ సంస్థ ప్రతినిధులు శనివారం హరీశ్‌రావును కలిసి ఆహ్వానించారు. వారి సమస్యలపై కూడా పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దివ్యాంగులను నమ్మించి మోసం చేసిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్‌ను రూ.4 వేల నుంచి రూ.6 వేలకు పెంచుతామని ప్రకటించి.. ఏడాది అవుతున్నా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ప్రకటించారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు మళ్లీ పూర్వ వైభవం
మూసీ సుందరీకరణ, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ.. హైదరాబాద్ స్థిరాస్తి రంగాన్ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లడం ఖాయం. ఈ బృహత్తర ప్రాజెక్ట్‌లు వచ్చే ఏడాదిలో ప్రారంభమవుతాయి. దీంతో రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుందని భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య(క్రెడాయ్) జాతీయ కార్యదర్శి గుమ్మి రాంరెడ్డి అన్నారు. ‘సాక్షి రియల్టీ’తో ఆయన ఇంటర్వ్యూ విశేషాలివీ.. –సాక్షి, సిటీబ్యూరోప్రభుత్వ ఆస్తులు, జలాశయాల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అవసరమే. కానీ, దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చిన తీరే గందరగోళాన్ని సృష్టించింది. హైడ్రా ప్రభావం ప్రాజెక్ట్‌లపై కంటే కస్టమర్ల సెంటిమెంట్‌పై ఎక్కువ ప్రభావం చూపించింది. రియల్టీ మార్కెట్ సైకిల్ వ్యవస్థ. వరుస ఎన్నికలు, కొత్త ప్రభుత్వ విధానాల అమలులో జాప్యం, అధిక సరఫరా కారణంగా 2024లో రియల్టీ మార్కెట్ స్తబ్దుగానే ఉంది. కానీ, ఇప్పుడు ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది.ఇప్పటికే మూసీలోని అక్రమ నిర్మాణాలు, నిర్వాసితులకు పరిహారం తదితర అంశాలపై హైకోర్టు నుంచి అడ్డంకులు కూడా తొలగాయి. దీంతో మూసీ పునరుజ్జీవానికి ప్రభుత్వం ముందడుగులు వేస్తోంది. రెండోదశ మెట్రో విస్తరణ పనులను జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ట్రిపుల్ ఆర్ నిర్మాణం, 14 వేల ఎకరాల్లోని ఫ్యూచర్ సిటీలను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆయా ప్రాజెక్ట్‌లతో నగరం మరింత అభివృద్ధి చెందడంతోపాటు కొత్త మార్గాలు, ప్రాంతాల్లో రియల్ అవకాశాలు మెరుగవుతాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి.లుక్ ఆల్ డైరెక్షన్స్.. ఏ నగరమైనా సమాంతరంగా అభివృద్ధి చెందాలి. కానీ, మౌలిక వసతుల కల్పనలో హెచ్చుతగ్గుల కారణంగా అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. దీంతో హైదరాబాద్‌లో వెస్ట్, సౌత్ జోన్లో భూముల ధరలు బాగా పెరిగాయి. అందుబాటు ధర లేదు. సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితి లేదు. అందుకే పాలసీల్లో కొన్ని మార్పులు తేవాలి. ఔటర్ గ్రోత్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరికీ సొంతింటి కల సాకారమవుతుంది. అక్కడ భూముల ధరలు తక్కువగా ఉన్నాయి. గత ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. కానీ, కార్యరూపం దాల్చలేదు. ఈ ప్రభుత్వం లుక్ ఆల్ డైరెక్షన్ అమలు చేయాలి. రింగ్‌రోడ్డు చుట్టూ మొత్తం గ్రిడ్ రోడ్లు వేస్తే అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగి సామాన్యుడికి సొంతింటి కలను సాకారం చేసుకునే అవకాశాలు మెరుగవుతాయి.పెట్టుబడులకు సౌత్ బెటర్.. కోకాపేట, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం వంటి పశ్చిమ ప్రాంతాల్లో స్థలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. ఇక్కడ సామాన్యులు కొనే పరిస్థితి లేదు. రేవంత్ ప్రభుత్వం కొత్త విధానాలు, అభివృద్ధి పనులతో వచ్చే ఏడాది కొత్తూరు, షాద్‌నగర్, ఆదిభట్ల, ముచ్చర్ల వంటి దక్షిణ ప్రాంతాలు బాగా అభివృద్ధి అవుతాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ధరలు తక్కువగా ఉన్నందున సామాన్య, మధ్యతరగతి వారు స్థలాలు కొనుగోలు చేయడం ఉత్తమం. వెస్ట్ జోన్లో అపార్ట్మెంట్ కొనే ధరకే చ.అ.కు రూ.7–9 వేలకే సౌత్‌లో విల్లా వస్తుంది. అంతేకాకుండా ఓఆర్ఆర్తో ప్రధాన నగరం నుంచి 30–40 నిమిషాల ప్రయాణ వ్యవధిలోనే సౌత్‌కు చేరుకోవచ్చు. -
ఆర్ఆర్ఆర్కు అరుదైన గౌరవం
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌లోని ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ సినిమా హాల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితం కానుంది. వచ్చే ఏడాది మే 11న ఈ మూవీ స్క్రీనింగ్ ఉంటుందని ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ ప్రకటించింది. అలాగే ఈ కార్యక్రమంలో రాయల్ ఫిల్ హార్మోనిక్ ఆర్కెస్ట్రాతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి లైవ్ కన్సర్ట్ ఇవ్వనున్నారు.కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 2022 మార్చి 25న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో (నాటు నాటు పాటకు గాను) ఎమ్ఎమ్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్ ఆస్కార్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. పలు అంతర్జాతీయ, జాతీయ అవార్డులు కూడా లభించాయి. కాగా ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ సినిమా ఐకానిక్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో 2019లో ప్రదర్శితమైన విషయం తెలిసిందే. -
ఆర్ఆర్ఆర్ హీరోయిన్‌తో దేవర.. ఫోటో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం దేవర పార్ట్-1. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలవుతోంది.దీంతో దేవర టీమ్ మూవీ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగానే బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో ఎన్టీఆర్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ భేటీకి బాలీవుడ్ భామ ఆలియా భట్ కూడా హాజరైంది. దేవర కా జిగ్రా అంటూ జూనియర్‌తో ముచ్చటించారు ఆలియా, కరణ్ జోహార్. దీనికి సంబంధించిన ఫోటోను దేవర టీమ్ ట్విటర్లో పోస్ట్ చేసింది. జిగ్రా పేరుతో తెరకెక్కించిన చిత్రంలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు. దీంతో ఓకేసారి రెండు చిత్రాలకు ప్రమోషన్స్ నిర్వంచినట్లైంది. దేవర కోసమే జిగ్రా రిలీజ్ తేదీని వాయిదా వేశారు మేకర్స్.కాగా.. దేవర ట్రైలర్ ఈ రోజు సాయంత్రమే విడుదల కానుంది. ట్రైలర్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేవర టీమ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే వస్తోంది. మరికొద్దిసేపట్లోనే దేవర ట్రైలర్ అభిమానులను అలరించనుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్‌చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. #Devara ka #Jigra pic.twitter.com/zxtNLluw9u— Devara (@DevaraMovie) September 10, 2024 -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం194 కి.మీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రగతిపై ఎంతో ప్రభావం చూపించే రీజినల్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మారుతోంది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రణాళిక ప్రకారం దక్షిణ భాగం రింగ్‌రోడ్డు విస్తీర్ణం 189.25 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రాథమికంగా రూపొందించిన ప్రతిపాదన ప్రకారం దాని విస్తీర్ణం 194 కిలోమీటర్లకు పెరిగింది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి–తూప్రాన్–చౌటుప్పల్) 158 కిలోమీటర్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రూపొందించిన అలైన్మెంట్ ప్రకారం 194 కిలోమీటర్ల వరకు పెరిగింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వికారాబాద్ జిల్లాను కూడా కలుపుతూ దక్షిణ భాగం అలైన్మెంట్ రూపొందించినట్లు స్పష్టమవుతోంది. కొత్తగా కొన్ని గ్రామాలను కలపడం వల్ల విస్తీర్ణం పెరిగినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తర భాగానికి సంబంధించిన భూ సేకరణ కార్యక్రమం కూడా దాదాపు పూర్తయింది. త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా దక్షిణ భాగం వైపు ఎన్హెచ్ఏఐ క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి 189.25 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారికి సంబంధించిన మ్యాప్‌లను సిద్ధం చేసింది. వాటిని ప్రభుత్వ ఆమోదానికి పంపించాల్సిన సమయంలోనే లోక్‌సభ ఎన్నికలు రావడంతో ఆగిపోయింది. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ను తామే నిర్మించుకుంటామంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. అంతేకాక దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ నిర్మాణంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పేరిట ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించారు. ఎన్హెచ్ఏఐ రూపొందించిన అలైన్మెంట్లో పేర్కొన్న పలు గ్రామాలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన మ్యాప్ ప్రకారం రహదారి బయటకు వెళ్లగా, కొన్ని గ్రామాలు లోపలికి వచ్చాయి. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తే ఇందులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. -
మేరా భారత్ మహాన్
-
సంగారెడ్డి పెద్దపూర్‌లో టెన్షన్.. టెన్షన్
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్‌లో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు కోసం అధికారులు భూ సేకరణ సర్వే చేస్తున్నారు. రైతులు సర్వేను ఆడుకున్నారు. సర్వేను అడ్డు కోవడంతో అక్కడి ఉదిక్తత వాతావరణ నెలకొంది. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. భూ సర్వే ఆడుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేసి. డీసీఎంలో తరలించారు. రెండ్రోజుల క్రితం రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) కోసం ప్రజాభిప్రాయ సేకరణలోను భూములు ఇవ్వబోమని రైతుల ఆందోళన చేశారు. -
ఇదీ ప్రభాస్ రేంజ్! ఆర్ఆర్ఆర్ రికార్డునూ బ్రేక్ చేసిన కల్కి
-
ఐఎఫ్ఎఫ్ఎమ్కి అతిథిగా రామ్‌చరణ్
రామ్‌చరణ్‌కి అరుదైన గౌరవం దక్కింది. ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్’ (ఐఎఫ్ఎఫ్ఎమ్) 15వ ఎడిషన్‌లో ఈ హీరో గౌరవ అతిథిగా పాల్గొననున్నారు. ‘‘రామ్‌చరణ్ వస్తున్నారు. ‘నాటు నాటు..’ పాటకు డ్యాన్స్ చేయడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ఎక్స్ వేదికగా ‘ఐఎఫ్ఎఫ్ఎమ్’ తెలియజేసింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి 25 వరకు మెల్బోర్న్లో ఈ చిత్రోత్సవం జరగనుంది.ఈ వేడుకలో రామ్‌చరణ్ అతిథిగా పాల్గొనడంతో పాటు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకుగాను ‘ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్’ అవార్డును కూడా అందుకోనున్నారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్ స్పందిస్తూ– ‘‘భారతీయ సినిమా గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంతర్జాతీయ వేదికపై సెలబ్రేట్ చేసుకునే ‘ఐఎఫ్ఎఫ్ఎమ్–2024’లో భాగం అవుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. మన చిత్ర పరిశ్రమకుప్రాతినిధ్యం వహించనుండటం నా అదృష్టం. ‘ఆర్ఆర్ఆర్’ విజయం విశ్వవ్యాప్తం. మెల్బోర్న్లో ప్రేక్షకులను కలుసుకునేందుకు ఎంతో థ్రిల్లింగ్‌గా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు. -
ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్ -2023.. ఉత్తమ చిత్రాలు ఏవో తెలుసా?
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును దక్కించుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ మరో ఘనతను దక్కించుకుంది. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్- 2023లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఇవాళ ప్రకటించిన 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి, ఉత్తమ యాక్టర్స్‌గా ఎన్టీఆర్, రామ్‌చరణ్ సంయుక్తంగా ఆవార్డ్ అందుకోనున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల విజేతలను కూడా ప్రకటించారు. ఏయే సినిమాకు అవార్డులు దక్కాయో ఫుల్ లిస్ట్ చూసేయండి.68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్-2023 విజేతలు వీళ్లే..తెలుగు..ఉత్తమ చిత్రం- ఆర్ఆర్ఆర్ఉత్తమ దర్శకుడు- ఎస్ఎస్ రాజమౌళిఉత్తమ నటుడు- రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్(ఆర్ఆర్ఆర్)ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ఉత్తమ నటి - మృణాళ్ ఠాకూర్ (సీతారామం)ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)ఉత్తమ సహాయ నటి - నందితాదాస్ (విరాట్ పర్వం)ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)తమిళంఉత్తమ చిత్రం - పొన్నియిన్ సెల్వన్- 1ఉత్తమ నటుడు- కమల్ హసన్ (విక్రమ్)ఉత్తమ నటి- సాయి పల్లవి (గార్గి)ఉత్తమ దర్శకుడు- మణి రత్నం (పొన్నియిన్ సెల్వన్ -1)ఉత్తమ సంగీత దర్శకుడు- ఏఆర్ రెహమాన్ (పొన్నియన్ సెల్వన్- 1)ఉత్తమ సహాయ నటుడు -(మేల్) కాళి వెంకట్ఉత్తమ సహాయ నటి - ఊర్వశిఉత్తమ చిత్రం క్రిటిక్స్- కదైసి వ్యవసాయిఉత్తమ యాక్టర్ క్రిటిక్స్ - ధనుష్ (తిరు), మాధవన్(రాకెట్రీ)ఉత్తమ నటి క్రిటిక్స్- నిత్యా మీనన్ (తిరు)ఉత్తమ గేయ రచయిత- తమిరైఉత్తమ గాయకుడు- సంతోష్ నారాయణ్ (తిరు)ఉత్తమ గాయని - అంతనా నందిఉత్తమ తొలి చిత్ర నటుడు- ప్రదీప్ రంగనాథ్ఉత్తమ తొలి చిత్ర నటి - అదితి శంకర్ (విరుమన్)ఉత్తమ సినిమాటోగ్రఫీ- సెంథిల్, రవి వర్మన్ కన్నడఉత్తమ చిత్రం -కాంతారఉత్తమ నటుడు- రిషబ్ షెట్టి (కాంతార)ఉత్తమ నటి - చైత్ర జే అచార్ఉత్తమ దర్శకుడు - కిరణ్ రాజ్ (777 ఛార్లీ)ఉత్తమ సహాయ నటుడు- అచ్యుత్ కుమార్ఉత్తమ సహాయ నటి - మంగళఉత్తమ సంగీత దర్శకుడు - అజనీష్ఉత్తమ గేయ రచయిత - నాగేంద్ర ప్రసాద్ఉత్తమ గాయకుడు - సాయి విగ్నేశ్ఉత్తమ గాయని- సునిధి చౌహాన్ఉత్తమ చిత్రం (క్రిటిక్స్)- ధరణి మండలఉత్తమ నటుడు క్రిటిక్స్- నవీన్ శంకర్ఉత్తమ నటి క్రిటిక్స్- సప్తమి గౌడమలయాళంఉత్తమ చిత్రం- నా తన్ కేస్ కోడుఉత్తమ నటుడు- కుంచకో బోబన్ ( నా థన్ కేస్ కోడు)ఉత్తమ నటి - దర్షన రాజేంద్రన్ (జయజయజయజయహే)ఉత్తమ దర్శకుడు- రతీస్ బాలకృష్ణన్ (నా థన్ కేస్ కోడు)ఉత్తమ సహాయ నటుడు- ఇంద్రాన్స్ (ఉడల్)ఉత్తమ సహాయ నటి -పార్వతి తిరువోతు (ఫుజు)ఉత్తమ సంగీత దర్శకుడు- కైలాష్ మీనన్ (వాషి)ఉత్తమ గేయ రచయిత- అరుణ్ అలత్ (హృదయం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - ఉన్ని మీనన్ (భీష్మ పర్వం)ఉత్తమ ప్లేబాక్ సింగర్ - మృదుల వారియర్ (పాథోన్పథం నోట్టండు)ఉత్తమ ఫిలిం (క్రిటిక్స్)- అరిఇప్పుఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అలెన్సియర్ లే లోపెజ్ (అప్పన్)ఉత్తమ నటి (క్రిటిక్స్) -రేవతి (భూతకాలం) -
ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించండి
సాక్షి, న్యూఢిల్లీ: రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని, హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి(ఎన్‌హెచ్)ని ఆరు వరుసలుగా విస్తరించాలని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్హెచ్ఏఐ) వార్షిక ప్రణాళికలో ట్రిపుల్ ఆర్కు నిధులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో గడ్కరీతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణ, నూతన జాతీయ రహదారుల ప్రకటన, పలు ఎన్‌హెచ్‌ల పనుల ప్రారంభం తదితర అంశాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. సంగారెడ్డి నుంచి నర్సాపూర్ – తూప్రాన్ – గజ్వేల్ – జగదేవ్‌పూర్ – భువనగిరి – చౌటుప్పల్ (158.645 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారని, దాని భూ సేకరణకయ్యే వ్యయంలో సగ భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని రేవంత్ చెప్పారు. ఈ భాగంలో తమ వంతు పనులు వేగవంతం చేశామన్నారు. చౌటుప్పల్ నుంచి అమన్‌గల్ – షాద్‌నగర్ – సంగారెడ్డి వరకు (181.87 కి.మీ.) రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని రేవంత్ కోరారు. హైదరాబాద్ (ఓఆర్ఆర్ గౌరెల్లి జంక్షన్) నుంచి వలిగొండ – తొర్రూర్ – నెల్లికుదురు – మహబూబాబాద్ – ఇల్లెందు – కొత్తగూడెం వరకు రహదారిని (ఎన్‌హెచ్–930పీ) జాతీయ రహదారిగా ప్రకటించారని, ఇందులో కేవలం ఒక ప్యాకేజీ కింద 69 కి.మీ.కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి వివరించారు.హైదరాబాద్ వాసులు భద్రాచలం వెళ్లేందుకు 40 కి.మీ. దూరం తగ్గించే ఈ రహదారిని జైశ్రీరామ్ రోడ్‌గా వరంగల్ సభలో గడ్కరీ చెప్పిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ఈ మార్గంలో మిగిలిన మూడు ప్యాకేజీలకు (165 కి.మీ) టెండర్లు పిలిచినందున వెంటనే పనులు ప్రారంభించాలని కోరారు. గంటన్నరకుపైగా జరిగిన ఈ సమావేశంలో రేవంత్‌రెడ్డి వెంట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ ఉన్నారు.రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య..హైదరాబాద్–విజయవాడ (ఎన్‌హెచ్ 65) జాతీయ రహదారిని గత ఏప్రిల్‌లోగా ఆరు లేన్లుగా విస్తరించాల్సి ఉందని గడ్కరీ దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య కీలకమైన ఈ రహదారిలో వాహనాల రద్దీతో ప్రమాదాలు చోటు చేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.విపరీతమైన రద్దీ ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనతో వాహన రద్దీ తగ్గిందని, తమకు సరైన ఆదాయం రావడం లేదంటూ కాంట్రాక్ట్ సంస్థ ఆరు వరుసల పనులు చేపట్టడం లేదన్నారు. ఎన్హెచ్ఏఐ, కాంట్రాక్ట్ సంస్థ మధ్య వివాదాన్ని పరిష్కరించి త్వరగా ఆరు లేన్లుగా విస్తరించాలని కోరారు.ఐకానిక్ బ్రిడ్జి.. ఎలివేటెడ్ కారిడార్ కల్వకుర్తి నుంచి కొల్లాపూర్ – సోమశిల – కరివెన – నంద్యాల (ఎన్‌హెచ్–167కే) మార్గాన్ని జాతీయ రహదారిగా ప్రకటించి 142 కి.మీ. పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారని గడ్కరీకి రేవంత్‌రెడ్డి తెలిపారు. మిగిలిన 32 కి.మీ.పనులకు, ఐకానిక్ బ్రిడ్జికి టెండర్లు పిలిచారని, ఆ పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే హైదరాబాద్ నుంచి తిరుపతికి 70 కి.మీ. దూరం తగ్గుతుందని వివరించారు. కల్వకుర్తి–నంద్యాల రహదారి (ఎన్‌హెచ్–167కే) హైదరాబాద్–శ్రీశైలం మార్గంలో ఉన్న రహదారిలో (ఎన్‌హెచ్ 765కే) 67 కిలోమీటర్ వద్ద (కల్వకుర్తి) ప్రారంభమవుతుందని, ఎన్‌హెచ్ 167కే జాతీయ రహదారి పనులు చేపట్టినందున, హైదరాబాద్ – కల్వకుర్తి వరకు ఉన్న (ఎన్‌హెచ్ 765కే) రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి–కరివెన వరకు జాతీయ రహదారి పూర్తయ్యేలోపు హైదరాబాద్ – కల్వకుర్తి రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ – శ్రీశైలం (ఎన్‌హెచ్ 765) మార్గంలో 62 కిలోమీటర్లు ఆమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్టు పరిధిలో ఉందని, అటవీ అనుమతులు లేక అక్కడ పనులు చేపట్టలేదని కేంద్ర మంత్రికి వివరించారు. ఈ మార్గంలో నిత్యం ఏడువేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తాయని, ఈ నేపథ్యంలో ఆమ్రాబాద్ ప్రాంతంలో 4 లేన్ల ఎలివేటెడ్ కారిడార్‌కు అనుమతులు మంజూరు చేయాలని రేవంత్ కోరారు. మంథనికి చోటివ్వండిమంథని నుంచి సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారని, మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ సభాపతి శ్రీపాదరావు గతంలో ప్రాతినిధ్యం వహించారని గడ్కరీకి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటివరకు జాతీయ రహదారుల చిత్రంలో మంథనికి చోటు దక్కలేదన్నారు. జగిత్యాల–పెద్దపల్లి–మంథని–కాటారం రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని, తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ రహదారి పూర్తయితే ఎన్‌హెచ్–565, ఎన్‌హెచ్–353సీ అనుసంధానమ వుతాయని, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు అనువుగా ఉంటుందని, దక్షిణ కాశీగా గుర్తింపుపొందిన కాళేశ్వరం క్షేత్రానికి అనుసంధానత పెరుగుతుందని సీఎం వివరించారు.గడ్కరీ దృష్టికి తీసుకెళ్లిన ఇతర అంశాలుతెలంగాణను కర్ణాటక, మహారాష్ట్రను అనుసంధానించే హైదరాబాద్–మన్నెగూడ నాలుగు వరుసల జాతీయ రహదారిగా (ఎన్‌హెచ్–163) ప్రకటించడంతో భూ సేకరణ పూర్తి చేశాం. టెండర్లు పిలవడం పూర్తయిన ఎన్జీటీలో కేసు వలన పనులు ప్రారంభం కాలేదు. సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ మార్గం పనులు వెంటనే ప్రారంభించాలి. సేతు బంధన్ స్కీం కింద 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన 12 ఆర్వోబీలు/ఆర్‌యూబీలను వెంటనే మంజూరు చేయాలి. జగిత్యాల–కాటారం (130 కి.మీ.), దిండి – నల్లగొండ (100 కి.మీ.), భువనగిరి – చిట్యాల (44 కి.మీ), చౌటుప్పల్ – సంగారెడ్డి (182 కి.మీ), మరికల్–రామసముద్రం (63 కి.మీ.), వనపర్తి – మంత్రాలయం (110 కి.మీ.), మన్నెగూడ – బీదర్ (134 కి.మీ.), కరీంనగర్–పిట్లం (165 కి.మీ.), ఎర్రవెల్లి క్రాస్ రోడ్ – రాయచూర్ (67 కి.మీ.), కొత్తపల్లి–దుద్దెడ (75 కి.మీ.), సారపాక – ఏటూరు నాగారం (93 కి.మీ.), దుద్దెడ – రాయగిరి క్రాస్ రోడ్ (63 కి.మీ.), జగ్గయ్యపేట – కొత్తగూడెం (100 కి.మీ.), సిరిసిల్ల – కోరట్ల (65 కి.మీ.), భూత్పూర్ – సిరిగిరిపాడు (166 కి.మీ.), కరీంనగర్ – రాయపట్నం (60 కి.మీ.) మొత్తం 1617 కి.మీ. జాతీయ రహదారులను అప్‌గ్రేడ్ చేయాలి. రూ. 4 వేల కోట్లతో ఆరు లేన్ల పనులు: కోమటిరెడ్డితెలుగు రాష్ట్రాల రాజధానులు హైదరాబాద్–అమరావతి మధ్య ఆరు లేన్ల పనులను ఒకట్రెండు నెలల్లో ప్రారంభిస్తామని, అలాగే ఎక్స్‌ప్రెస్ వే కూడా నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి గడ్కరీతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరు లేన్ల మార్గాన్ని రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో పూర్తిచేయనున్నట్లు తెలిపారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ కూడా నిర్మిస్తామని వెల్లడించారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. 2016లో ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరిచిపోయిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విషయంలో కదలిక వచ్చిందని తెలిపారు. యుటిలిటీ చార్జీలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని కేంద్రమంత్రికి వివరించగా.. అందుకు కేంద్ర మంత్రి స్పందిస్తూ.. తామే భరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడమే తమ లక్ష్యమని, జవాబుదారీతనంగా పనిచేయడం తెలుసు కాబట్టే ఇంతమంది మంత్రులం ఢిల్లీకి వచ్చామని కోమటిరెడ్డి చెప్పారు.వారంలోపు అన్ని శాఖలతో సమావేశం: భట్టిరాష్ట్ర రహదారులకు సంబంధించి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని, అన్ని శాఖల నుంచి ఒకే సారి క్లియరెన్స్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గడ్కరీతో రాష్ట్రానికి సబంధించిన రోడ్ల విస్తరణ గురించి మాట్లా డామన్నారు. ట్రిపుల్ఆర్, హైదరాబాద్ – అమరావతి ఆరు లేన్లుగా మార్చడం, హైదరాబాద్–కల్వకుర్తి రోడ్డు తదితర అంశాలపై గడ్కరీతో సుదీర్ఘంగా చర్చించామని భట్టి చెప్పారు. -
Kalki 2898 AD: రీలీజ్‌కు ముందు ఇన్ని రికార్డులా?
-
'రామ్ చరణ్' రిజక్ట్ చేసిన 5 సినిమాలు ఏంటో మీకు తెలుసా..?
ప్రతి హీరో దగ్గర తమ కెరీర్లో తిరస్కరించిన ప్రాజెక్ట్‌ల జాబితా ఉంటుంది. అదే క్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లిస్ట్‌లో కూడా కొన్ని రిజక్ట్ చేసిన సినిమాలు ఉన్నాయి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 'చిరంజీవి కుమారుడి'గా అరంగేట్రం చేయడం నుంచి మెగా పవర్‌స్టార్‌గా భారీ అభిమానులను సంపాదించుకోవడం.. ఆపై ఇప్పుడు RRR తో గ్లోబల్ స్టార్‌గా తనను తాను స్థాపించుకోవడం వరకు, రామ్ చరణ్ నిజంగా తన సినిమా ప్రయాణంలో చాలా దూరం చేరుకున్నారు. అయితే రామ్ చరణ్ తన సినీ కెరీర్లో తిరస్కరించిన ఐదు సినిమాల గురించి తెలుసుకుందాం. గౌతమ్ తిన్ననూరి సినిమాను రిజక్ట్ చేసిన చరణ్ RRR సినిమాతో భారీ విజయం అందుకున్న రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ జెర్సీ ఫేమ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేయవలసి ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి విజయం తర్వాత మాస్ అప్పీల్ ఉన్న కథ కోసం చరణ్ కోరుకున్నారట. దీంతో గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్‌కు ఓకే చేయలేదని వార్తలు వచ్చాయి. తరువాత అదే కథను విజయ్ దేవరకొండకు ఆయన వివరించాడట. అది ఇప్పుడు VD12గా రూపొందనుందని నివేదికలు చెబుతున్నాయి. రామ్ చరణ్‌కి వివరించిన స్క్రిప్ట్ స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్ కోలీవుడ్‌లో 'వారణం ఆయిరం' చిత్రంలో సూర్య నటించారు. తెలుగులో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' పేరుతో 2008లో విడుదలైంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. తమిళ్ వర్షన్ కంటే టాలీవుడ్లోనే ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ సినిమా విడుదలై దాదాపు 16 సంవత్సరాలు అయింది. రీసెంట్గా తెలుగులో రీ-రిలీజ్ చేసినా థియేటర్లు హౌస్‌ఫుల్ అయ్యాయి. ఈ సినిమాను చూస్తున్నంత సేపు సూర్య తప్ప మరే ఇతర నటుడు గుర్తుకు రారని చెప్పవచ్చు. ఈ సినిమా ఆఫర్ మొదట చరణ్‌కు వచ్చింది. ఆ సమయంలో SS రాజమౌళితో మగధీర షూటింగ్ షెడ్యూల్ బిజీలో చరణ్ ఉన్నారు. అప్పటికే ఎక్కువ డేట్లు మగధీరకు కేటాయించడంతో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' సినిమాకు చరణ్ నో చెప్పారట. ఓకే బంగారం మలయాళం సినిమా ఓకే కన్మణి గుర్తుందా..? 2014లో విడుదలైన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది. హిందీలో 'ఓకే జాను'గా రీమేక్ అయింది. టాలీవుడ్లో 'ఓకే బంగారం' పేరుతో విడుదలైంది. ఈ కథలో హీరో పాత్రకు రామ్ చరణ్ కరెక్ట్‌గా సెట్ అవుతాడని దర్శకుడు మణిరత్నం భావించారట. మొదట ఈ కథను చరణ్‌కే ఆయన చెప్పారట. ఆ సమయంలో తన బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో అది కాస్త దుల్కర్ సల్మాన్ బోర్డులోకి వచ్చి చేరిందట. ఇందులో నిత్యా మీనన్‌తో ఆయన జతకట్టిన విషయం తెలిసిందే. అఖిల్ 'ఏజెంట్' రామ్ చరణ్ ఇటీవల తిరస్కరించిన చిత్రాలలో ఒకటి ఏజెంట్. అఖిల్‌కు ఈ సినిమా భారీ డిజాస్టర్‌ను మిగిల్చింది. ఈ చిత్రం మొదట రామ్ చరణ్ వద్దకు చేరిందట. ఏజెంట్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి అప్పటికే చరణ్‌తో ధృవ సినిమా తీసి ఉన్నాడు. దీంతో రెండో సినిమా ప్లాన్ చేయాలని ఈ కథతో చరణ్‌ను సురేందర్ రెడ్డి కలిశారట. కానీ పలు కారణాల వల్ల చరణ్ నో చెప్పారట. దీంతో ఫైనల్‌గా అఖిల్ వద్దకు ఆ ప్రాజెక్ట్ వెళ్లడం.. భారీ అంచనాలతో తెరకెక్కిన ఏజెంట్ సినిమా ఇండస్ట్రీలోనే భారీ డిజాస్టర్‌గా మిగిలిన విషయం తెలిసిందే. ఎటో వెళ్లిపోయింది మనసు 2008లో 'సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్' తిరష్కరించిన చరణ్‌తో ఎలాగైన ఒక సినిమా తీయాలని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అనుకున్నారట. సుమారు నాలుగేళ్లు నిరీక్షించి 2012లో చరణ్‌ను ఆయన కలిశారట. ఆ సమయంలో 'ఏటో వెళ్లిపోయింది మనసు' కథను వినిపించారట.. రొమాంటిక్ కామెడీగా ఉన్న కథ కావడంతో చరణ్ నో చెప్పారట. అప్పటికే ఇలాంటి కాన్సెప్ట్‌తో 'ఆరెంజ్'ను తీసిన చరణ్ ఈ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట.. ఆ తర్వాత అది కాస్త నాని వద్దకు ఆ ప్రాజెక్ట్ చేరిపోయింది. ఇందులో సమంత హీరోయిన్గా కనిపించింది. ఈ చిత్రం విమర్శకుల చేత ప్రశంసలు అందుకున్నప్పటికీ, అది వాణిజ్య పరంగా రాణించలేదు. -
‘రీజనల్’కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. వెంటనే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు రూ.2,585 కోట్లను జమ చేయాలని.. హైవే నిర్మాణం వేగంగా సాగేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు తెలంగాణలో మరో 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 4,048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బుధవారం రెండు లేఖలు రాశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే సమస్యలు కేంద్రం భారత్‌మాల పరియోజనలో భాగంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ 350 కిలోమీటర్లకుపైగా రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నిర్మి స్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయా న్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరో సగం భరించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,585 కోట్లను వెంటనే ఎన్హెచ్ఏఐకి జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 3న తాను స్వయంగా రాష్ట్ర సర్కారుకు లేఖ రాశానని, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాల అధికారులు కూడా పలుమార్లు లేఖలు రాశారని.. అయినా ఆశించిన స్పందన రాలేదని వివరించారు. రాష్ట్రవాటా నిధుల జమలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు జాప్యమై ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయన్నారు. భూసేకరణ త్వరగా చేయండి 66 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. తెలంగాణ ఏర్పాటయ్యాక గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే ఎన్డీయే సర్కారు మరో 2,500 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున 11 జాతీ య రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుక.. ఈ ఏడాది బరిలో నిలిచిన చిత్రాలివే!
గతేడాదిలో తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేశారు మన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్‌కు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కింది. అలాగే ది ఎలిఫెంట్ విష్పర్స్ అనే డాక్యుమెంటరీ సిరీస్ సైతం ప్రతిష్ఠాత్మక అవార్డ్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ అవార్డుల వేడుకకు సమయం ఆసన్నమైంది. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాగే లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరగనుంది. మార్చి 10, 2024న ఈ ఏడాది ఆస్కార్ వేడుకలు జరగనున్నాయి. ఇప్పటికే నామినేట్ అయిన చిత్రాలకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఆస్కార్ అకాడమీ.. బరిలో నిలిచిన చిత్రాల జాబితాను వెల్లడించింది. 2024 ఆస్కార్ అవార్డుల కోసం వివిధ కేటగిరీల్లో పోటీ పడే చిత్రాల జాబితాను అకాడమీ ప్రకటించింది. ఈ ఏడాది కూడా వరుసగా నాలుగోసారి జిమ్మీ కిమ్మెల్ కామెంటేటర్‌గా వ్యవహరించనున్నారు. ఇండియా నుంచి ఆస్కార్ పోటీలో ‘టు కిల్ ఏ టైగర్’ ఉత్తమ డాక్యుమెంటరీ విభాగంలో ఆస్కార్‌కు ‘టు కిల్ ఏ టైగర్’ చిత్రం నామినేట్ అయింది. భారత్‌లోని ఓ గ్రామంలో చిత్రీకరణ జరుపుకున్న ‘టు కిల్ ఏ టైగర్’ ఆస్కార్ బరిలో నిలిచింది. నిషా పహుజ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా.. గతేడాది ఇండియాకు రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే. 2024లో వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే! ►ఉత్తమ చిత్రం విభాగం అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ఒప్పైన్ హైమర్ పాస్ట్ లైవ్స్ పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ►ఉత్తమ దర్శకుడి విభాగం అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్స్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ►ఉత్తమ నటుడు విభాగం బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పైన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ►ఉత్తమ నటి విభాగం అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మాస్టోన్: పూర్ థింగ్స్ ►ఉత్తమ సహాయ నటుడు స్టెర్లింగ్ కె. బ్రౌన్ : అమెరికన్ ఫిక్షన్ రాబర్ట్ డినోరో: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ రాబర్ట్ డౌనీ జూనియర్: ఒప్పైన్ హైమర్ రేయాన్ గాస్లింగ్: బార్బీ మార్క్ రఫెలో: పూర్ థింగ్స్ ► ఉత్తమ సహాయ నటి ఎమిలీ బ్లంట్: ఒప్పైన్ హైమర్ డానియల్ బ్రూక్స్: ది కలర్ పర్పుల్ అమెరికా ఫెర్రారా: బార్బీ జోడీ ఫాస్టర్: నయాడ్ డేవైన్ జో రాండాల్ఫ్: ది హోల్డోవర్స్ ►బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రిఎట్, ఆర్థర్ హరారీ ది హోల్డోవర్స్: డేవిడ్ హేమింగ్సన్ మేస్ట్రో: బ్రాడ్లీ కూపర్, జోష్ సింగర్ మే డిసెంబర్: సామీ బరుచ్, అలెక్స్ మెకానిక్ పాస్ట్ లివ్స్: సీలింగ్ సాంగ్ ►బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ది ఫైర్ ఇన్సైడ్: ఫ్లామిన్ హాట్ ఐయామ్ జస్ట్ కెన్: బార్బీ ఇట్నెవ్వర్ వెంట్ అవే: అమెరికన్ సింఫనీ వజాజీ (ఏ సాంగ్ ఫర్ మై పీపుల్): కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్: బార్బీ ►బెస్ట్ ఒరిజినల్ స్కోర్ అమెరికన్ ఫిక్షన్ ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ కిల్లర్స్ ఆఫ్‌ది ఫ్లవర్ మూన్ ఒప్పైన్ హైమర్ పూర్ థింగ్స్ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ బాబీ వైన్: ది పీపుల్స్ ప్రెసిడెంట్ ది ఇటర్నల్మెమెరీ ఫోర్ డాటర్స్ టు కిల్ ఏ టైగర్ 20 డేస్ ఇన్ మరియా పోల్ ►బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్ ది ఏబీసీస్ఆఫ్ బుక్ బ్యానింగ్ ది బార్బర్ ఆఫ్ లిటిల్ రాక్ ఐలాండ్ ఇన్ బిట్విన్ ది లాస్ట్ రిపేష్ షాప్ నైనాయ్ అండ్ వైపో ►బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఇయల్కాపిటానో (ఇటలీ పర్ఫెక్ట్ డేస్ (జపాన్) సొసైట్ ఆఫ్ ది స్నో (స్పెయిన్) ది టీచర్స్ లాంజ్ (జర్మనీ) ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్ ( యూకే) ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అమెరికన్ ఫిక్షన్: కార్డ్ జెఫర్సన్ బార్బీ: గ్రెటా గెర్విక్, నొవా బాంబాక్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: టోనీ మెక్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లాజర్ ►బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ అటానమీ ఇఫ్ ఎ ఫాల్: లారెంట్ ది హోల్డోవర్స్: కెవిన్ టెంట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: తెల్మా స్కూన్మేకర్ ఒప్పైన్ హైమర్: జెన్నిఫర్ లేమ్ పూర్ థింగ్స్: యోర్గోస్ ►బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ బార్బీ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ నెపోలియన్ ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ ►బెస్ట్ సౌండ్ ది క్రియేటర్ మ్యాస్ట్రో మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 ఒప్పైన్ హైమర్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ► ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ది క్రియేటర్ గాడ్జిల్లా మైనస్ వన్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ వాల్యూమ్3 మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్: పార్ట్-1 నెపోలియన్ ►బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎల్కాండే : ఎడ్వర్డ్ లచ్మెన్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: రోడ్రిగో ప్రిటో మ్యాస్ట్రో: మాథ్యూ లిబ్టాక్యూ ఒప్పైన్ హైమర్: హైతీ వాన్ హోతిమా పూర్ థింగ్స్: రాబిన్ రియాన్ ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ జాక్వెలిన్ దురన్: బార్బీ జాక్వెలిన్ వెస్ట్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ జాంటీ ఏట్స్, డేవ్ క్రాస్‌మన్: నెపోలియన్ ఎలెన్ మిరాజ్నిక్: ఒప్పెన్ హైమర్ హాలీ వాడింగ్టన్: పూర్ థింగ్స్ ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ గోల్డా మాస్ట్రో ఓపెన్‌హైమర్ పూర్ థింగ్స్ సొసైటీ ఆఫ్ ది స్నో ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ ది ఆఫ్టర్ ఇన్విన్సిబుల్ నైట్ ఆఫ్ ఫార్చ్యూన్ రెడ్, వైట్ అండ్ బ్లూ ది వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ సుగర్ ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ లెటర్ టు ఎ పిగ్ నైంటీ- ఫైవ్ సెన్సెస్ అవర్ యూనిఫామ్ ప్యాచిడమ్ వార్ ఈజ్ ఓవర్! -
రాజమౌళి డైరెక్టర్ మాత్రమే కాదు.. అంతకుమించి!
దర్శకధీరుడు రాజమౌళి పేరు వినగానే మనకు ఠక్కున ఆ రెండు సినిమాల పేర్లే అందరికీ గుర్తుకొస్తాయి. ఒకటి బాహుబలి.. మరొకటి ఆర్ఆర్ఆర్. ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో రికార్డ్ క్రియేట్ చేసిన మన జక్కన్న.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాను పేరును మార్మోగించారు. అంతకుముందు తీసిన సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎవరంటే రాజమౌళి పేరే గుర్తుకొస్తుంది. అయితే ఆయన అందరూ కేవలం దర్శకుడిగానే చూస్తారు. కానీ రాజమౌళి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన తీసిన సినిమాల్లో నటుడిగా కనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మరీ ఆ సినిమాలేవి? ఏయే పాత్రలు చేశారో ఓ లుక్కేద్దాం పదండి. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి క్యామియో పాత్రల్లో 8 సినిమాల్లో నటించారు. మొదిటసారి 'సై' సినిమాలో వేణుమాధవ్ అనుచరుడిగా కనిపించారు. ఆ తర్వాత రెయిన్ బో చిత్రంలోను నటించారు. అంతే కాకుండా ఆయన డైరెక్షన్లోనే రామ్ చరణ్ మగధీర అనగనగనగా పాటలో క్యామియో ఇచ్చారు. ఇక నేచురల్ స్టార్ నానితో తీసిన చిత్రం ఈగ ప్రారంభంలోనే స్టోరీ చెప్పారు. ప్రభాస్‌తో తీసిన బహుబలి మూవీలో సారా అమ్మే వ్యక్తిగా కనిపించారు. మజ్ను మూవీలో దర్శకుడిగా క్యామియోలో దర్శనమిచ్చారు. అంతే కాదు.. ప్రభాస్ నటించిన రాధే శ్యామ్‌లో కూడా కథను స్టార్ట్ చేసేది జక్కన్ననే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో 'నెత్తురు మరిగితే ఎత్తర జెండా' అనే సాంగ్‌లో కనిపించి సందడి చేశారు. మొత్తానికి మన జక్కన్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ మాత్రమే కాదు.. మంచి నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకున్నారు. -
ఇక ‘రింగు’ కోసం నిరంతర భూపరిహారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్)లో నిరంతరాయ భూ పరిహారం పంపిణీకి మార్గం సుగమమైంది. ఇందుకు వీలుగా ఆ మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్ టవర్లు, స్తంభాల తరలింపు, నీటి కాలువల మళ్లింపు, అందుకు తగ్గ నిర్మాణాల (యుటిలిటీ షిఫ్టింగ్) కోసం రూ.364 కోట్ల మొత్తాన్ని డిపాజిట్ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కి లేఖ ఇచ్చింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఆర్థిక ఒప్పందం కుదరనుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ, ఎన్హెచ్ఏఐతో త్రైపాక్షిక ఒప్పందం త్వరలో జరగనుంది. ఇక రీజినల్ రింగురోడ్డు నిర్మాణంలో భూపరిహారంలో రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటాతోపాటు యుటిలిటీ షిఫ్టింగ్‌కు అవసరమయ్యే మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరిస్తున్నట్టుగా ఇందులో సంతకాలు చేస్తారు. దీంతో ఈ ప్రాజెక్టు తదుపరి ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగేందుకు మార్గం సుగమమవుతుంది. ఇక అవార్డ్ జారీకి శ్రీకారం: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి సంబంధించి 158.645 కి.మీ. నిడివిలో భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. బుధవారం యుటిలిటీ షిఫ్టింగ్ కోసం రూ.364 కోట్లను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించడంతో భూపరిహారం పంపిణీకి సంబంధించిన అవార్డ్ జారీచేసే కసరత్తుకు ఎన్హెచ్ఏఐ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు సంబంధించి, సేకరిస్తున్న భూముల్లోని నిర్మాణాలు, తోటలకు విలువ కట్టే ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇది పూర్తి కాగానే గ్రామాల వారీగా అవార్డు పాస్ చేస్తారు. ఆయా గ్రామాలకు సంబంధించిన భూ పరిహారంలో 50 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేస్తుంది. ఇలా రూ.2,600 కోట్ల వరకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారంలో తన వంతు వాటాగా భరించాల్సి ఉంది. ఆ వెంటనే రోడ్డు నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం–ఎన్హెచ్ఏఐ మధ్య ఏర్పడ్డ పేచీ కారణంగా దాదాపు 10 నెలలుగా రీజినల్ రింగ్‌రోడ్డు ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభం కావటంతో రోడ్డు నిర్మాణ పనులు కూడా త్వరలోనే మొదలయ్యే సూచనలు కనపిస్తున్నాయి. దీంతోపాటు దక్షిణభాగానికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భారత్‌మాల పరియోజన–1లో ఉత్తర భాగం ఉన్న విషయం తెలిసిందే. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తిస్తూ కేంద్రం ఉత్తర్వు జారీ చేయాల్సి ఉంది. దాన్ని భారత్‌మాల పరియోజన తదుపరి ఫేజ్‌లో చేర్చాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని నిర్ణయించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ జరుగుతుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.100 కోట్ల జమ.. భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బును డిపాజిట్ చే సిన తర్వాత భూపరిహారం ప్రక్రియ ప్రారంభిస్తామని గ తంలో ఎన్హెచ్ఏఐ పేర్కొంది. కానీ దీనికి రాష్ట్ర ప్ర భుత్వం సమ్మతించలేదు. మొత్తం డబ్బులు ఒకేసారి డిపాజిట్ చేయటం సరికాదని స్పష్టం చేసింది. దీంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎన్హెచ్ఐఏ ఐదు సార్లు లేఖ లు రాసినా ఫలితం లేకపోయింది. మరోవైపు గెజిట్ నో టిఫికేషన్ గడువు ముగియబోతుండటంతో ప్రాజెక్టు పెండింగులో పడిపోతుందని ఎన్హెచ్ఏఐ పేర్కొనటంతో ప్ర భుత్వం ఎట్టకేలకు రూ.100 కోట్లు జమ చేసింది. దీంతో గెజిట్లు ‘సజీవంగా’ఉండి ప్రాజెక్టు మనుగడలో ఉన్నట్టు గా పరిగణించారు. -
RRR సీక్వెల్ పై క్లారిటీ..!
-
బాహుబలి సినిమాలో బాణాలు ఎందుకు ఎక్కువగా వాడారు: బిత్తిరి సత్తి
-
RRR టీమ్‌తో బిత్తిరి సత్తి కామెడీ ఇంటర్వ్యూ
-
RRR డైరెక్టర్ SS రాజమౌళి Jr NTR గురించి.. అతను గొప్ప నటుడు..!
-
సినిమా విడుదలకు ముందు నేను భయపడ్డాను : ఎస్ ఎస్ రాజమౌళి
-
ఆర్ఆర్ఆర్పై బ్రెజిల్ ప్రెసిడెంట్ ప్రశంసలు.. రాజమౌళి ఏమన్నారంటే?
ఆర్ఆర్ఆర్ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రంతో టాలీవుడ్ స్థాయి ఏకంగా గ్లోబల్‌వైడ్‌గా మార్మోగిపోయింది. హాలీవుడ్ దర్శక దిగ్గజం కామెరూన్ సైతం ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ చిత్రంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమావేశానికి హాజరైన ఆయన.. రాజమౌళిని సైతం కొనియాడారు. లులా మాట్లాడుతూ..'ఆర్ఆర్ఆర్ సినిమా బాగా నచ్చంది. ఈ చిత్రంలోని అద్భుతమైన సన్నివేశాలు, అందమైన డ్యాన్సులు ఆకట్టుకున్నాయి. భారత్‌పై బ్రిటిష్ పాలనను చూపించినప్పటికీ.. చాలా అర్థవంతంగా ఉంది. ఆ సినిమా చూసి తెలిసిన వాళ్లందరిని ఆర్ఆర్ఆర్ అని మొదట అడిగేవాన్ని. దర్శకుడు రాజమౌళి, నటీనటులకు నా అభినందనలు' అని అన్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ తాజాగా ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాజమౌళి ట్వీట్ అయితే లులా ప్రశంసలపై రాజమౌళి స్పందించారు. ఈ మేరకు ఆయనకు థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు. ట్వీట్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ పట్ల మీ మాటలకు చాలా ధన్యవాదాలు. మీరు భారతీయ సినిమా గురించి ప్రస్తావించడం చాలా ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ను ఆస్వాదించారని చెప్పడం చాలా గర్వకారణం. మీ ప్రశంసలతో మాచిత్రబృందం సంతోషంగా ఉంది. మీరు మా దేశంలో విలువైన సమయాన్ని ఆనందంగా గడుపుతున్నారని ఆశిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలోని నాటునాటు సాంగ్‌ను ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. Sir… @LulaOficial 🙏🏻🙏🏻🙏🏻 Thank you so much for your kind words. It’s heartwarming to learn that you mentioned Indian Cinema and enjoyed RRR!! Our team is ecstatic. Hope you are having a great time in our country. https://t.co/ihvMjiMpXo — rajamouli ss (@ssrajamouli) September 10, 2023 -
సూపర్ స్టార్స్ తో ప్రత్యేక ఇంటర్వ్యూ
-
కథను మలుపుతిప్పే రోల్స్.. పాపే ప్రాణంగా రానున్న సినిమాలు
కథను కీలక మలుపు తిప్పే ‘కీ’ రోల్స్ దాదాపు ప్రతి సినిమాలోనూ ఉంటాయి. ఈ కీ రోల్స్‌కి ఏజ్‌తో సంబంధం ఉండదు. చిన్నారులు కూడా కథలో పెద్ద మార్పుకు కారణం అవుతుంటారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘బింబిసార’ వంటి సినిమాల్లో చిన్ని పాపలు కథకు ప్రాణంగా నిలిచారు. ఇలా ‘పాపే ప్రాణం’ అంటూ సాగే కథలతో రానున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. సంరక్షకుడు? ‘పసివాడి ప్రాణం, జగదేకవీరుడు అతిలోక సుందరి, అంజి’... వంటి సినిమాల్లో చిన్నారులతో చిరంజీవి చేసిన అల్లరి సన్నివేశాలు, అదే సమయంలో వారి ప్రాణ రక్షకుడుగా చేసిన సాహసాలు ప్రేక్షకులను అలరించాయి. మళ్లీ వెండితెరపై ఓ పాపకు సంరక్షకుడిగా ఉండే పాత్రలో చిరంజీవి నటించనున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్‌ను బట్టి ఇది సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రంలో ఓ పాప కీలక పాత్రలో నటించనుందని, ఈ పాప సంరక్షకుడిగా చిరంజీవి చేసే సాహసాలు అబ్బురపరచేలా ఉంటాయని టాక్. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభించి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉందని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే... వశిష్ట దర్శకుడిగా పరిచయం అయిన ‘బింబిసార’ చిత్రంలో ఓ పాప సెంట్రల్ క్యారెక్టర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. హార్ట్ ఆఫ్ సైంధవ్ శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా.. ఇలా ముచ్చటగా ముగ్గురు హీరోయిన్లు ఉన్నా కూడా హీరో ‘సైంధవ్’ మనసులో తొలి స్థానం చిన్నారి సారాదే. సారా అంటే ‘హార్ట్ ఆఫ్ సైంధవ్’ అన్నమాట. వెంకటేశ్ టైటిల్ రోల్లో నటిస్తున్న ఈ సైంధవ్ సినిమాకు ‘హిట్’ ఫ్రాంచైజీ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. సైంధవ్ హార్ట్ సారా అని చిత్ర యూనిట్ అంటోందంటే కథలో చిన్నారి సారా పాత్రకు చాలా ప్రాధాన్యం ఉంటుందని ఊహించవచ్చు. తమిళ నటుడు ఆర్య, హిందీ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్రలు చేస్తున్న ‘సైంధవ్’ చిత్రం డిసెంబరు 22న విడుదల కానుంది. హాయ్ నాన్న తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెలుగులో రూపొందుతున్న మరో చిత్రం ‘హాయ్ నాన్న’. ఈ ఎమోషనల్ మూవీలో నాని హీరోగా నటిస్తున్నారు. ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రుతీహాసన్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర కథ ఓ పాప పాత్ర చుట్టూ తిరుగుతుందని, ఈ క్రమంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయని తెలుస్తోంది. ‘హాయ్ నాన్న’ డిసెంబరు 21న రిలీజ్ కానుంది. గరుడ సాహసాలు ‘గరుడ’ సినిమా పోస్టర్ చూశారుగా.. సత్యదేవ్ వీపుపై కూర్చున్న ఓ చిన్నారి ఎంత భయంగా చూస్తుందో కదా! పైగా అది అడవి ప్రాంతం. ఆ చిన్నారి భయాన్ని పోగొట్టి, తనను సురక్షితంగా గరుడ ఎలా రక్షించాడనేది వెండితెర పైనే చూడాలంటోంది యూనిట్. సత్యదేవ్ హీరోగా క్రాంతి బాల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘గరుడ’. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో సాగే అడ్వంచరస్ మూవీగా ఈ చిత్రం ఉంటుందట. ఈ చిత్రం తొలి భాగం ‘గరుడ: చాప్టర్ 1’ త్వరలోనే రిలీజ్ కానుంది. ఇలా చిన్నారులు కీలకంగా నిలిచే చిత్రాలు మరికొన్ని ఉన్నాయి. -
ఆర్ఆర్ఆర్ 2 లేనట్టే... జక్కన్న నెక్ట్స్ టార్గెట్ ఇదే..
-
నేను చాలా అదృష్టవంతుడిని అక్క
-
మహేష్, రాజమౌళి సినిమా పై రానా సంచలన కామెంట్స్
-
ఎన్ని ప్లాప్ వచ్చిన టాలీవుడ్ ని వదిలేదే లే ....
-
ప్రభాస్ తో ప్రభాస్ కే పోటీ రచ్చ లేపుతున్న 1000 కోట్ల వార్..
-
సాహూ RRR 102 సెంటర్స్ లో 200 రోజులు
-
ఆర్ఆర్ఆర్ టీమ్‌తో అమిత్ షా భేటీ రద్దు
ఆర్ఆర్ఆర్ టీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశం చివరి క్షణంలో రద్దయింది. ఈ నెల 23న అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నట్లు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నోవాటెల్ హోటల్లో ఆర్ఆర్ఆర్ టీంతో అమిత్ షా సమావేశం కానున్నట్లు కూడా సమాచారం వెల్లడైంది. కానీ ఇప్పుడు ఈ సమావేశం రద్దయినట్లు తెలిసింది. చివరి క్షణంలో అమిత్ షా టూర్ షెడ్యూల్లో మార్పులు జరగటం వల్ల ఆయన ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా చేవెళ్ల సభకు వెళ్లనున్నట్లు, ఆ సభ తర్వాత కోర్ కమిటీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆర్ఆర్ఆర్ టీంతో సమావేశం తాత్కాలికంగా రద్దయిందని తెలుస్తోంది. ఆ తరువాత ఈ సమావేశం ఎప్పుడుంటుందనే తెలియాల్సి ఉంది. -
అవార్డు సభలో ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాత కూడా లేరు:నట్టి కుమార్
-
1000 కోట్లు లోడింగ్..బాక్సాఫీస్‌కు కలెక్షన్ల సునామీ
-
ఆస్కార్ వేడుక చేసుకోవడం నాకు చాలా వింతగా ఉంది
-
ఆస్కార్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం ఘన సన్మానం
-
ఆయన రాజమౌళి కాదు.. రాజముని
‘‘ఆస్కార్’ అవార్డు సాధించి ఎంతో మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారు డైరెక్టర్ రాజమౌళి. ఆయన రాజమౌళి కాదు.. రాజముని. ఆయన చేసిన గొప్ప ప్రయోగం (ఆర్ఆర్ఆర్) తెలుగు వారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా చాటింది’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. 95వ ఆస్కార్ వేడుకల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు..’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆధ్వర్యంలో ఆస్కార్ అవార్డు గ్రహీతలు కీరవాణి, చంద్రబోస్‌లను హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ–‘‘ఆస్కార్ అంటే ఆకాశంలో తారలాంటిది. ఆ తారని నేలకు తెచ్చిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్‌లకు అభినందనలు. తెలుగువారు గర్వపడేలా తెలుగు ఇండస్ట్రీని ఉన్నత స్థానంలో నిలిపిన వారికి ఏపీ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారి తరఫున అభినందనలు’’ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ రావాలని లక్షల మంది ఎదురు చూశారు.. ఆ అవార్డు రానే వచ్చింది. ఈ విజయాన్ని సాధించిన రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్గార్లకు అభినందనలు’’అన్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ–‘‘ఒక సినిమాకి నంది అవార్డు వచ్చిందంటే చాలా గొప్పగా అనుకుంటున్నాం. అలాంటిది తొలిసారి ఒక తెలుగు పాటకి ప్రపంచంలో అత్యున్నతమైన ‘ఆస్కార్’ అవార్డు రావడం తెలుగు ఇండస్ట్రీ గర్వపడే సమయం. ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్‌కి అభినందనలు’’ అన్నారు. ఎంఎం కీరవాణి మాట్లాడుతూ– ‘‘నాటు నాటు..’ పాటకి ‘ఆస్కార్’ అవార్డు రావడం వెనుక రాజమౌళి, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్‌చరణ్, ఎన్టీఆర్, ఉక్రెయిన్ డ్యాన్సర్స్ కృషి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నచ్చింది కాబట్టే ‘నాటు నాటు..’ పాట నచ్చింది, అవార్డు వచ్చింది. ఇది ‘ఆర్ఆర్ఆర్’ యూనిట్ సమిష్టి కృషికి లభించిన విజయం’’ అన్నారు. పాటల రచయిత చంద్రబోస్ మాట్లాడుతూ–‘‘తమ్ముడూ.. నువ్వు పాడటంపై దృష్టి పెట్టొద్దు.. రాయడంపై దృష్టి పెట్టు’ అని చెప్పిన గుర్రా శ్రీనాథ్ అన్న, ‘పెళ్లిసందడి’ సమయంలో ‘బోస్‌ని మనతోపాటు చెన్నై తీసుకెళదాం’ అంటూ రాఘవేంద్రరావుగారితో చెప్పిన కీరవాణిగార్ల మాటలు నా జీవిత గమనాన్ని మార్చి ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఆస్కార్‌ని చేతిలో పట్టుకున్నప్పుడు భారత సాహిత్య పతాకాన్ని పట్టుకున్నంత ఆనందం కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు, దర్శకులు, హీరోలు, చిత్ర పరిశ్రమలోని 24 విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆర్ఆర్ఆర్ రికార్డ్ బద్దలు.. విడుదలైన రెండు వారాల్లోనే!
దర్శకధీరుడు తెరకెక్కించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని నాటునాటు సాంగ్‌కు సైతం ఆస్కార్ అవార్డ్ కూడా దక్కింది. అయితే తాజాగా ఈ మూవీ రికార్డ్ బద్దలైంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆర్ఆర్ఆర్ ఇప్పటి వరకు 2 5మిలియన్ అవర్స్‌తో తొలిస్థానంలో ఉండగా ఆ రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. ఇటీవల రిలీజైన హైజాకింగ్ థ్రిలింగ్ డ్రామా ‘చోర్ నికల్ కే భాగా’ ఆర్ఆర్ఆర్ను అధిగమించింది. యామీ గౌతమ్, సన్నీ కౌశల్, శరద్ ఖేల్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మూవీ 29 మిలియన్ల అవర్స్ వీక్షించనట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. విడుదలైన రెండు వారాల్లోనే అత్యధికమంది వీక్షించిన తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కాగా.. మూడో స్థానంలో 22 మిలియన్ అవర్స్‌తో అలియాభట్ ప్రధానపాత్రలో నటించిన గంగూబాయి కతియావాడి నిలిచింది. -
ఇంతకన్నా ఏం కావాలి.. ఆర్ఆర్ఆర్ క్రేజ్ గురించి చెప్పడానికి!
తెలుగోడి సత్తాను ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విదేశాల్లోనూ రికార్డ్ స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా జపాన్‌లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. అక్కడి అభిమానులను ఆర్ఆర్ఆర్ విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలై 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టించింది. 24ఏళ్ల క్రితం జపాన్‌లో రిలీజ్ అయిన రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా రికార్డ్ వసూళ్లను బద్దలు కొట్టింది. ఇటీవలే అమెరికాలోని లాస్ ఎంజిల్స్‌లో జరిగిన 95వ ఆస్కార్ వేడుకల్లో నాటు నాటు పాటకు అవార్డ్ దక్కింది. అయితే తాజాగా జపాన్‌లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. జపాన్‌కు ఓ అభిమాని తన కుమారుని కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అర్థమయ్యేలా ఓ తల్లి ఏకంగా ఈ సినిమా బొమ్మలతో కూడిన స్టోరీ బుక్‌ను రూపొందించింది. కామిక్ బొమ్మల రూపంలో తయారు చేసిన ఆ బుక్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బుక్ చూస్తుంటే ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ఆర్ఆర్ఆర్కు ఎంత క్రేజ్ ఉందో అర్థమవుతోంది. View this post on Instagram A post shared by ROAR OF RRR (@ssrrrmovie) -
ఎన్ని అవార్డులొచ్చినా ఆ ఫీలింగే వేరు: ఆర్ఆర్ఆర్ టీం
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది ఈ చిత్రం. బాక్సాఫీస్‌ను షేక్ చేసి పలు రికార్డులు కొల్లగొట్టింది. ఆర్ఆర్ఆర్ దెబ్బకు రికార్డులు క్యూ కట్టాయి. తాజాగా ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో సినీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇటివలే ఆస్కార్ అవార్డ్ కూడా దక్కించుకున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ట్విటర్లో ఎన్టీఆర్, రామ్ చరమ్ పోస్టర్‌ను షేర్ చేసింది. తన అధికారిక ట్విటర్లో రాస్తూ.. 'ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై ఇప్పటికీ ఏడాది కావస్తోంది. ఇంకా ప్రపంచంలో ఎక్కడో థియేటర్లలో హౌస్‌ఫుల్‌గా సినిమా రన్ అవుతోంది. ఈ అనుభూతి అన్ని అవార్డుల కంటే పెద్దది. ఆర్ఆర్ఆర్ చిత్రంపై మీరు కురిపించిన ప్రేమకు మీకు కృతజ్ఞతలు చెప్పిన సరిపోదు.' అంటూ పోస్ట్ చేసింది. పోస్టర్లో ఈ చిత్రానికి దక్కిన అవార్డులను ప్రదర్శించారు. కాగా.. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రం పొందిన అవార్డులివే ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ డొరియన్ అవార్డ్స్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ బెస్ట్ సాంగ్ సెలబ్రిటీ ఫిల్మ్ అవార్డ్స్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ పండోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డ్స్ సాంగ్ కంపోజింగ్ ఆస్టిన్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేటర్ అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ జార్జియా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ యాక్షన్ ఫిల్మ్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ బెస్ట్ స్టంట్స్ స్పాట్ లైట్ అవార్డు సియాటెల్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ ఆన్లైన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటి బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేషన్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ హ్యుస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫీచర్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ బెస్ట్ స్టంట్ కో-ఆర్డినేషన్ టీమ్ ఉటా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫీచర్ సౌత్ ఈస్టర్న్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ టాప్ టెన్ ఫిల్మ్స్ న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ ఆన్లైన్ టాప్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ టాప్ టెన్ ఫిల్మ్స్ లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ శాటర్న్ అవార్డ్స్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ It’s been a year since #RRRMovie was released and it is still running in theatres somewhere in the world, getting housefuls. This feeling is bigger than any award, and we cannot thank you all enough for all the love you have showered throughout. ❤️ #1YearOfHistoricalRRR pic.twitter.com/hLglDr774F — RRR Movie (@RRRMovie) March 25, 2023 -
Ram Charan: రామ్ చరణ్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?
తెలుగు చిత్ర సీమను ప్రపంచానికి ఎలుగెత్తి చూపి ఆస్కార్ సొంతం చేసుకున్న 'ఆర్ఆర్ఆర్' గురించి, అందులో నటించిన నటీ, నటులను గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే చరణ్ సినిమాల గురించి తెలిసిన చాలామందికి అతడు ఎలాంటి కార్లను ఉపయోగిస్తాడు, అతని ఆస్తుల విలువ ఎంత అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. అలాంటి వారికోసం ప్రత్యేక కథనం.. చిరుత సినిమాతో తెలుగు సినీ రంగప్రవేశం చేసిన చరణ్.. మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఖైదీ నంబర్ 150 నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. అంతే కాకుండా పెప్సీ, టాటా డొకోమో, వోలానో, అపోలో జియా, హీరో మోటోక్రాప్, ఫ్రూటీ వంటి దాదాపు 34 బ్రాండ్లను అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ బాగా సంపాదిస్తున్నాడు. కొణిదెల రామ్ చరణ్ మొత్తం ఆస్తుల విలువ దాదాపు 1370 కోట్లు ఉంటుందని అంచనా. ఈయన నెల సంపాదన రూ. 3 కోట్లకంటే ఎక్కువ అని నివేదికలు చెబుతున్నాయి. RRR సినిమాలో తన పాత్ర కోసం రూ. 45 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద మన దేశంలో ఎక్కువ ట్యాక్స్ చెల్లిస్తున్నవారిలో రామ్ చరణ్ ఒకరు కావడం గమనార్హం. (ఇదీ చదవండి: సిట్రోయెన్ సి3 కొత్త ధరలు.. వాహన ప్రియులకు షాక్) రామ్ చరణ్ హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో దాదాపు 25,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బంగ్లా కలిగి ఉన్నారు. ఇందులో స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్, టెంపుల్, జిమ్, ఫిష్ పాండ్ వంటి అధునాతన సదుపాయాలు ఉన్నాయని తెలుస్తోంది. దీని విలువ రూ. 38 కోట్లు ఉంటుందని అంచనా. దీనితో పాటు ముంబైలో పెంట్ హౌస్ కూడా ఉందని చెబుతున్నారు. ఇక చివరగా రామ్ చరణ్ ఎలాంటి వాహనాలు ఉపయోగిస్తారు అనే విషయానికి వస్తే, ఈయన వద్ద దాదాపు రూ.4 కోట్ల విలువైన కస్టమైజ్డ్ మెర్సిడెస్ మేబ్యాక్ GLS 600 తో పాటు, ఆడి మార్టిన్ V8 వాంటేజ్, రోల్స్ రాయిస్ ఫాంటమ్, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆస్టన్ మార్టిన్ మరియు ఫెరారీ పోర్టోఫినో ఉన్నాయి. అంతే కాకుండా చరణ్ ఒక సొంత ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉన్నారు. -
ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ..
‘నే పాడితే లోకమే పాడదా.. నే ఆడితే లోకమే ఆడదా...’ పాటలో దమ్ముంటే లోకం పాడుతుంది.. ఆడుతుంది.. ఆ పాట విశ్వ విజేత అవుతుంది. ‘నాటు నాటు...’ అందుకో ఉదాహరణ. క్లాస్, మాస్ తేడా లేకుండా నాటు బీటు అందరి మనసుల్లోకి చొచ్చుకుపోయింది. తెలుగు పరిశ్రమ తొలి ఆస్కార్ ఆనందాన్ని చవి చూసేలా చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్, దర్శకుడు రాజమౌళి, డాల్బీ థియేటర్లో ఇతరుల కరతాళ ధ్వనుల మధ్య చిత్రసంగీతదర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్ ఆస్కార్‌ని అందుకున్నారు. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ 95వ ఆస్కార్ అవార్డు విశేషాలు తెలుసుకుందాం... అంతర్జాతీయ వేదికపై తెలుగోడి ‘నాటు నాటు’ మారుమోగిపోయింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులు అదిరిపోయాయి. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది. దాదాపు 80 పాటలను పరిశీలించి 15 పాటలను బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డు కోసం షార్ట్‌లిస్ట్ చేసింది ఆస్కార్ కమిటీ. ఈలోపు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషన్స్‌తో ‘నాటు నాటు..’ విదేశీయులకు కూడా మరింత చేరువైంది. ఈ క్రమంలోనే జనవరి 24న వెల్లడైన ఆస్కార్ నామినేషన్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ‘నాటు నాటు..’కు చోటు దక్కింది. ‘ నాటు నాటు’ పాటతో పాటు ‘టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్’ చిత్రంలోని ‘అప్లాజ్’, ‘బ్లాక్‌పాంథర్: వకాండ ఫరెవర్’లోని ‘లిఫ్ట్ మీ అప్’, ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ చిత్రంలోని ‘దిస్ ఈజ్ ఏ లైఫ్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’లోని ‘హోల్డ్ మై హ్యాండ్’ పాటలు బరిలో నిలిచాయి. అయితే వీటన్నింటినీ దాటుకుని తెలుగు ‘నాటు నాటు’ ఆస్కార్ అవార్డును తెచ్చింది. ప్రపంచ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్రకు పునాది వేసింది. ఇలా దేశానికి ఆస్కార్ తెచ్చిన తొలి చిత్రంగా, తొలి తెలుగు చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ నిలిచింది (గతంలో కొందరు భారతీయులు, ఇండో–అమెరికన్స్ ఆస్కార్ అవార్డులు సాధించినప్పటికీ అవి భారతీయ చిత్రాలు కావు). ఒక ఏషియన్ చిత్రం (ఆర్ఆర్ఆర్) నుంచి ఓ పాటకు (నాటు నాటు) అవార్డు రావడం ఇదే తొలిసారి. అలాగే నాన్–ఇంగ్లిష్ పాటల్లో ఆస్కార్ అవార్డు సాధించిన నాలుగో పాటగా ‘నాటు నాటు’ నిలిచింది. ఇక ఆస్కార్ అవార్డు సాధించిన తొలి తెలుగు వ్యక్తులుగా కీరవాణి, చంద్రబోస్ రికార్డు సృష్టించారు. అలాగే బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు సాధించిన రెండో భారతీయుడుగా కీరవాణి, రెండో గీత రచయితగా చంద్రబోస్ నిలిచారు. 2009లో జరిగిన 81వ ఆస్కార్ అవార్డ్స్‌లో ఇంగ్లిష్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’కి గాను ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఏఆర్ రెహమాన్, రచయిత గుల్జార్ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ప్రకటించిన మొత్తం 23 విభాగాల జాబితాల్లోకి వస్తే... ఉత్తమ చిత్రం: ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్ ఉత్తమ దర్శకుడు: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ నటుడు: బ్రెండెన్ ఫ్రాసెర్ (ది వేల్) ఉత్తమ నటి: మిషెల్ యో (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ ఒరిజినల్‌సాంగ్: ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’(మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్) ఉత్తమ సహాయ నటుడు: కి హుయ్ క్వాన్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సహాయ నటి: జామి లీ కర్టిస్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ క్యాస్ట్యూమ్ డిజైన్: రూథ్ కార్టర్(బ్లాక్ పాంథర్: వకండా ఫరెవర్) ఉత్తమ స్క్రీన్ ప్లే: డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఉత్తమ సినిమాట్రోగ్రఫీ: జేమ్స్‌ఫ్రెండ్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్) ఉత్తమ ఎడిటర్: పాల్ రోజర్స్ (ఎవ్రీవేర్ ఎవ్రీథింగ్ ఆల్ ఎట్ వన్స్) ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్: ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్ (జర్మనీ) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్: నవాల్నీ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్: ది ఎలిఫెంట్ విస్పరర్స్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: క్రిస్టియన్ ఎం గోల్డ్ బెక్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్ 2) బెస్ట్ సౌండ్: టాప్‌గన్: మ్యావరిక్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టయిల్: ది వేల్ బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్: పినాషియో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్: ఏన్ ఐరిస్ గుడ్ బై యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్: ద బాయ్, ద మోల్, ద ఫాక్స్ అండ్ ది హార్స్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: షెరా పాల్లే (ఉమెన్ టాకింగ్) బెస్ట్ ఒరిజినల్ స్కోర్: బ్రెటెల్‌మాన్ (ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రంట్ ఫ్రంట్) హోస్ట్ జిమ్మిపై నెటిజన్ల ఆగ్రహం ఆస్కార్ వేడుక ప్రారంభంలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తావన వచ్చినప్పుడు హోస్ట్ జిమ్మి ‘ఆర్ఆర్ఆర్’ బాలీవుడ్ మూవీ అన్నట్లుగా చెప్పారు. దీంతో నెటిజన్లు జిమ్మి కిమ్మెల్ను తప్పుపడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ తెలుగు సినిమా అని గుర్తింపు పొందిన నేపథ్యంలో ఆస్కార్‌లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డుకు హోస్ట్ అయిన జిమ్మీ బాలీవుడ్ మూవీ అనడం సరికాదని çపలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శించారు. డు యూ నో నాటు? ‘నాటు నాటు’ పాట ఎంత పాపులరో ప్రత్యేకించి చెప్కక్కర్లేదు. కానీ ఆస్కార్ వేదికపై ‘డు యూ నో నాటు?.. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారు’.. అంటూ దేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కి ఓ ప్రెజెంటర్‌గా వెళ్లిన దీపికా పదుకోన్ ‘నాటు నాటు’ పాటను పరిచయం చేశారు. వేదికపై రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ‘నాటు నాటు’ పాటను పాడగా, వెస్ట్రన్ డ్యాన్సర్స్ కాలు కదిపారు. ఈ వేడుకలో వీక్షకుల్లో ‘నాటు నాటు..’ పాట ఎంత జోష్ నింపిందంటే.. పాట పూర్తయ్యాక అందరూ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
మోదీ వల్లే ఆస్కార్ వచ్చిందని చెప్పుకుంటారేమో: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన ఈ సాంగ్‌ను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ అద్భుతంగా పాడారు. ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అందడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా యావత్ దేశం నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ సినిమా బృందానికి తెలంగాణ డిజిటల్ మీడియాడైరెక్టర్ కొణతం దిలీప్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పాటను రాసిన చంద్రబోస్‌కు కంగ్రాట్స్ చెప్పారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల సమయంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆయన షేర్ చేశారు. సినిమా విడుదల చేసేందుకు ప్రయత్నిస్తే కొడతామని, థియేటర్లకు ఎవరూ వెళ్లకొడదని వార్నింగ్ ఇచ్చారు. థియేటర్లు కాల్చేస్తాం అంటూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తుంది. అయితే సంజయ్ లాంటి మతోన్మాదులు సినిమాపై ఎలాంటి విషయం చిమ్మారో గుర్తుంచుకోవడానికి ఇదే సరైన సమయమని కొణతం దిలీప్ పేర్కొన్నారు. ఇలాంటి ధ్వేషపూరిత వ్యక్తులను దూరంగా ఉంచుదామని అన్నారు. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ఇంకేముంది నాటు నాటు పాటకు కూడా మోదీ వల్లే అవార్డు వచ్చిందని ఇలాంటి మతోన్మాద వ్యక్తులు చెప్పుకుంటారేమో’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. Not before long, the SAME Bigot will tell you the Award was given only because of Modi 😂 https://t.co/8Z0hp6FETl — KTR (@KTRBRS) March 13, 2023 -
Oscar 2023: ఆస్కార్ స్టేజీపై 'నాటు నాటు' సందడి..
వాషింగ్టన్: అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ ప్రదానోత్సవ వేడుకల్లో ఆర్ఆర్ఆర్- నాటు నాటు పాట సందడి చేసింది. అవార్డుల ప్రకటనకు ముందే స్టేజీపై ఈ పాటకు స్టెప్పులేసి అదరగొట్టారు హాలీవుడ్ డాన్సర్లు. ఈ బీట్‌కు హాలీవుడ్ నటీ నటులు ఊర్రూతలూగారు. ఆస్కార్ అవార్డుకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి నాటు నాటు పాట నామినేట్ అయిన విషయం తెలిసిందే. మన పాటకు లిస్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్), టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్ (అప్లాజ్), హోల్డ్ మై హాండ్( టాప్ గన్ మావరిక్), ఠిస్ ఇస్ ఏ లైఫ్ ( ఎవరీ థింగ్ ఏవిరివేర్ ఆల్ ఇట్ వన్స్) పాటలు గట్టి పోటీ ఇస్తున్నాయి. కాగా.. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ చిత్రం రూపొందింది. గతేడాది మార్చి 25న విడుదలైన ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది. పాన్ ఇండియానే గాక, పాన్ వరల్డ్ స్థాయిలో సినీ అభిమానులను అలరించింది. ముఖ్యంగా నాటు నాటు పాటుకు ప్రపంచ నలుమూలల నుంచి విశేష స్పందన లభించింది. ఈ క్రమంలోనే ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ పాటకు మ్యూజిక్ మాంత్రికుడు ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చారు. రాహుల్ సిప్లిగంజ్, కాళభైరవ ఈ పాటను ఆలకించారు. ఆస్కార్ స్టేజీపైనా వీరు లైవ్‌లో ఈ పాట పాడి అభిమానులను అలరించారు. -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
ఆస్కార్ వేడుకల్లో.. స్టార్ల సందడి (ఫొటోలు)
-
ఆస్కార్ వేదికపై నాటు నాటు...
ఆస్కార్ వేదికపై తెలుగు ‘నాటు నాటు’ మారుమోగనుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. 95వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో ఈ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 12న (భారతీయ కాలమానం ప్రకారం మార్చి 13) జరగనున్న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో ‘నాటు నాటు..’ పాటను పాడిన గాయకులు కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ లైవ్‌లో పాడనున్నట్లు ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. యం.యం. కీరవాణి స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోనే ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ఆస్కార్ అవార్డుల వేడుక దగ్గర పడటంతో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి తదితరులు అమెరికాలో ఉన్నారని తెలిసిది. ఆస్కార్‌కి సంబంధించిన వరుస ఈవెంట్స్‌లో పాల్గొనేందుకు రామ్‌చరణ్ కూడా ఈ నెల 12కు వరకు యూస్లోనే ఉంటారట. మరో హీరో ఎన్టీఆర్ వీరిని త్వరలో జాయిన్ కానున్నారు. అలాగే ఇటీవల ఆస్కార్ నిర్వాహకులు అవార్డుల నామినీల కోసం ఏర్పాటు చేసిన లంచ్‌కు కీరవాణి, చంద్రబోస్ హాజరైన విషయం తెలిసిందే. ఈ నెల 9న అమెరికాలో నామినీల కోసం డిన్నర్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ విందులో కీరవాణి, చంద్రబోస్ పాల్గొననున్నారు. ఎన్టీఆర్... చరణ్... హుక్ స్టెప్? ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడతారు కాబట్టి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంటే బాగుంటుందని పలువురు నెటిజన్లు పో స్ట్ చేస్తున్నారు. వీటికి తోడు ఇటీవల ఓ అమెరికా మీడియాకు రామ్‌చరణ్ ఇంటర్వ్యూ ఇస్తూ...‘‘ఇప్పటివరకు ప్రేక్షకులు మాకు చాలానే ఇచ్చారు. నా ప్రేమను ప్రేక్షకులకు చూపించడానికి ‘నాటు నాటు’ పాటను ఆస్కార్ లైవ్‌లో ప్రదర్శించడం ఓ మార్గంలా భావిస్తున్నాను. ఇది నేను వారికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్‌లా అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు. దీంతో ఆస్కార్ వేదికపై ‘నాటు నాటు’ పాటకు ఎన్టీఆర్, చరణ్ డ్యాన్స్ చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అయితే మరో ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ ‘నాటు నాటు’ పాట గురించి మాట్లాడుతూ– ‘‘ఈ పాట చిత్రీకరణ సమయంలో దాదాపు 300మందిప్రొ ఫెషనల్ డ్యాన్సర్లు సెట్స్‌లో ఉన్నారు. 7 రోజుల రిహార్సల్స్ తర్వాత 17 రోజుల పాటు ఈ పాటను షూట్ చేశాం.. ‘నాటు నాటు’ పాటను మేం ప్రదర్శించిన ప్రతిచోటా మంచి స్పందన లభిస్తోంది. అలా అని అన్ని చోట్లా చేయలేం. ఇక ఆస్కార్ నిర్వాహకులు రిక్వెస్ట్ చేస్తే, టైమ్ కలిసొస్తే ‘నాటు నాటు’ పాట పెర్ఫార్మ్ చేస్తాం. అయితే పాట మొత్తం ప్రదర్శించడం అనేది కష్టం. ఎందుకంటే ఈ పాటకు స్టెప్స్ వేసే టైమ్‌లో చాలా బ్రీత్ కావాలి, ఎనర్జీ ఉండాలి. కానీ చాన్స్ ఉంటే ‘నాటు నాటు’లోని ‘హుక్ స్టెప్’ను ఎందుకు ప్రయత్నించకూడదు? అను కుంటున్నాను’’ అని పేర్కొన్నారు. మరి.. ఎన్టీఆర్, చరణ్‌ల లైవ్ పెర్ఫార్మెన్స్ ఉంటుందా? లేదా అనేది 13న తెలిసి పో తుంది. -
ఆస్కార్ ఈవెంట్ కోసం యూఎస్ పయనమైన రామ్ చరణ్ (ఫొటోలు)
-
RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, భార్య రూహీతో " ప్రత్యేక ఇంటర్వ్యూ "
-
ఆర్ఆర్ఆర్ ఎక్కవ సార్లు చూశా.. హాలీవుడ్ నటుడు ప్రశంసలు
హాలీవుడ్ నటుడు జోనాథన్ మేజర్స్ రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్ఆర్ఆర్ సినిమాను చాలా సార్లు చూశానని తెలిపారు. చూడటంతో తన అనుభవాన్ని తెలిపారు. ఈ వారంలో జోనాథన్ నటించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాన్టుమేనియా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమానియా మూవీ అడ్వాన్స్ బుకింగ్ ఇవాళ భారత్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన టాలీవుడ్ సినిమా ఆర్ఆర్ఆర్ను ఆయన కొనియాడారు. జోనాథన్ మేజర్స్ భారతీయ చిత్రాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జోనాథన్.. తాను భారతీయ సినిమాలకు అభిమానినని.. అలాగే బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశానని వెల్లడించారు. జోనాథన్ జేమ్స్ మాట్లాడుతూ.. 'నేను భారతీయ సినిమాలు ఎక్కువగా చూస్తాను. ఎస్ఎస్ రాజమౌళి చిత్రం కాంగ్ ది కాంకరర్ దృష్టిని 'జయించిందని' చెప్పడం విశేషం. నేను ఆర్ఆర్ఆర్ చాలాసార్లు చూశాను. ఈ చిత్రాన్ని బాగా ఆస్వాదించా. ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తెరపై చూడటం నాకు చాలా నచ్చింది.' అని అన్నారు. భారతీయ చిత్రాలను చూడటానికి నేను ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటానని చెప్పుకొచ్చారు. జోనాథన్ మేజర్స్ ప్రకటనతో ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు పెరుగుతున్న ప్రజాదరణ, అంతర్జాతీయ ప్రేక్షకులపై చూపుతున్న ప్రభావానికి నిదర్శనంగా చెప్పవచ్చు. కాగా.. మార్వెల్ స్టూడియోస్ ఇండియా నిర్మించిన యాంట్-మ్యాన్ అండ్ ది వాస్ప్: క్వాంటుమేనియా సినిమా ఫిబ్రవరి 17 ఆంగ్లం, హిందీ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానుంది. -
RRRతో RR.. వైరలవుతున్న రాజస్థాన్ రాయల్స్ ట్వీట్
ఐపీఎల్ జట్టు రాజస్థాన్ రాయల్స్ నిన్న (ఫిబ్రవరి 11) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఆర్ఆర్ స్టార్ బౌలర్, టీమిండియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ యుజ్వేంద్ర చహల్, అతని భార్య ధనశ్రీ వర్మ నిన్న హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ సందర్భంగా ప్రముఖ దర్శకుడు, RRR ఫేమ్ రాజమౌళిని కలిశాడు. When RR met RRR. 🔥 pic.twitter.com/y8fjeNwibX — Rajasthan Royals (@rajasthanroyals) February 11, 2023 ఈ సందర్భంగా చహల్ దంపతులు రాజమౌళితో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను ఆర్ఆర్ యాజమాన్యం తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా నెట్టింట వైరలవుతోంది. ఈ పోస్ట్‌కు ఆర్ఆర్ యాజమాన్యం.. RR.. RRRని కలిపినప్పుడు అన్న ఆసక్తికర క్యాప్షన్‌ను పెట్టింది. కాగా, చహల్ కొద్దిరోజుల కిందట RRR మరో ఫేమ్ తారక్‌ను కలిశాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు చహల్‌తో పాటు టీమిండియా సభ్యులు సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్లు కూడా తారక్‌తో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. సూర్యకుమార్ యాదవ్ అయితే అతని భార్య కలిసి తారక్‌తో ఫోటో దిగాడు. అప్పుడు ఈ ఫోటోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. ఇదిలా ఉంటే, టీమిండియా ప్రస్తుతం స్వదేశంలో ఆసీస్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతుండగా.. టెస్ట్ జట్టులో స్థానం దక్కని చహల్ ఖాళీగా ఉన్నాడు. కాగా, 32 ఏళ్ల చహల్ భారత్ తరఫున 72 వన్డేలు, 75 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 27.13 సగటుతో 121 వికెట్లు పడగొట్టిన చహల్.. టీ20ల్లో 24.68 సగటున 91 వికెట్లు సాధించి, భారత్ తరఫున లీడింగ్ టీ20 వికెట్ టేకర్‌గా కొనసాగుతున్నాడు. -
కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్షలు ఫలించాలి: మెగాస్టార్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటేందుకు ఇక ఒక అడుగు దూరమే ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని మెగాస్టా చిరంజీవి ఆకాంక్షించారు. ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏 Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie — Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023 గర్వంగా ఉంది: ఎన్టీఆర్ అంతే కాకుండా చిత్రబృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్ లకు నా అభినందనలు తెలిపారు. Congratulations @MMKeeravaani Garu and @boselyricist Garu on achieving another well-deserved and monumental feat... This song will forever hold a special place in my heart.@ssrajamouli @alwaysramcharan #RRRMovie #NaatuNaatu #Oscars95 pic.twitter.com/YYmtD0kVou — Jr NTR (@tarak9999) January 24, 2023 గౌరవంగా భావిస్తున్నా: రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడం పట్ల నిజంగా గౌరవంగా భావిస్తున్నానని మెగా హీరో రామ్ చరణ్ అన్నారు. మన దేశానికి ఇది గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. What brilliant news! Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars. Another very proud moment for us & India. Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏 All love ❤️ — Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023 చిత్ర బృందానికి అభినందనలు: కీరవాణి నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. Congratulations to my team !! Big hugs to all 🤗 pic.twitter.com/S8g6v1Ubyv — mmkeeravaani (@mmkeeravaani) January 24, 2023 ఆనందంగా ఉంది: ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు నాటు పాట ఆస్కార అర్హత సాధించడం ఆనందంగా ఉందని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలబైరవకు కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతం: వెంకటేశ్ నాటునాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతమని హీరో వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సిగలో మరో కలికితురాయి చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు తెలిపారు. చిత్రబృందానికి అభినందనలు: బాలకృష్ణ నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు కూడా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా ప్రకాశిస్తోంది: రక్షిత్ శెట్టి భారతీయ సినిమా గర్వించదగిన క్షణామని బాలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్కేః రవితేజ కీరవాణి గారు స్క్రీన్ మీద తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని నాటునాటు డ్యాన్స్ వేసేలా చేశారని రవితేజ వేపించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. -
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) WE CREATED HISTORY!! 🇮🇳 Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe — RRR Movie (@RRRMovie) January 24, 2023 -
ఆస్కార్ రావడానికి ఆస్కారమెట్లా..?
-
నాటు నాట్ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడం చాల గర్వంగా ఉంది: మెగాస్టార్ చిరంజీవి
-
ఆస్కార్ బరిలో RRR కి పోటీ ఇస్తున్న సౌత్ సినిమాలు
-
లాస్ఎంజిల్స్లో ఆర్ఆర్ఆర్ టీం సందడి.. ఫోటోలు వైరల్
-
ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. రామ్‌చరణ్‌కు షారూక్ ఖాన్ విజ్ఞప్తి
బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ 'ఆర్ఆర్ఆర్' మూవీ ఆస్కార్ అవార్డ్‌కు నామినేట్ కావడాన్ని కొనియాడారు. దీనిపై స్పందిస్తూ మెగాస్టార్ తనయుడు రామ్‌చరణ్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే తాకేందుకు తనకు అవకాశమివ్వాలని షారూక్ విజ్ఞప్తి చేశారు. షారూక్ తన ట్వీట్లో రాస్తూ..' మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌కు ధన్యావాదాలు. మీ ఆర్ఆర్ఆర్ బృందం ఆస్కార్ ఇండియాకు తీసుకొస్తే.. ఆ అవార్డును తాకేందుకు నాకు అవకాశమివ్వండి' అంటూ ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్తో పాటు కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, గంగుభాయ్ కతియావాడి ఆస్కార్ బరిలో నిలిచాయి. ఈ ఏడాది మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. కాగా.. బాలీవుడ్ ‘బాద్షా’ షారుక్ ఖాన్, బ్యూటీ క్వీన్ దీపికా పదుకొణె జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పఠాన్. ఎన్నో వివాదాల అనంతరం ఈ మూవీ విడుదలకు సిద్ధమైంది. సెన్సార్‌తో సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఈ నెల(జనవరి) 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మించాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కూడా విడుదల చేశారు. Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!! (Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! ) Love you. — Shah Rukh Khan (@iamsrk) January 10, 2023 -
ఆస్కార్ కు అడుగు దూరంలో ఎన్టీఆర్
-
నేను తీసిన సినిమాలలో నా ఫేవరెట్ సీను అదే : రాజమౌళి
-
ఈ ఏడాది బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టిన చిత్రాలివే..!
ఈ ఏడాది చిత్ర పరిశ్రమ కలిసొచ్చిందనే చెప్పాలి. 2022లో విడుదలైన పెద్ద చిత్రాలతో పాటు చిన్న సినిమాలు సైతం బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టాయి. చిన్న సినిమా అయినా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ జాబితాలో ది కశ్మీర్ ఫైల్స్, కాంతార ముందు వరుసలో ఉంటాయి. ఇక టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ ఏడాది ప్రేక్షకుల ఆదరణ పొందిన చాలా చిత్రాలు వంద కోట్ల క్లబ్లో చేరి రికార్డ్ సృష్టించాయి. అలాగే వీటితో పాటు బాలీవుడ్ చిత్రాలు సైతం ఈ మార్క్‌ను చేరుకున్నాయి. ఈ ఏడాది వంద కోట్ల వసూళ్లు దాటిన సినిమాలేవో ఓసారి రివైండ్ చేసుకుందాం. ఈ ఏడాది వంద కోట్ల క్లబ్లో చేరిన చిత్రాలివే.. టాలీవుడ్ చిత్రాలు: ఆర్ఆర్ఆర్, సర్కారువారిపాట, భీమ్లా నాయక్, రాధేశ్యామ్, కార్తికేయ, గాడ్‌ఫాదర్ బాలీవుడ్ చిత్రాలు: ది కశ్మీర్ ఫైల్స్, బ్రహ్మస్త్ర, దృశ్యం-2, భూల్ భూలయ్యా-2, గంగూభాయ్ కతియావాడి, విక్రమ్ వేద, లాల్‌సింగ్ చద్దా, జగ్‌జగ్ జీయో తమిళ చిత్రాలు: పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, బీస్ట్, డాన్, తిరుచిత్రాంబలం, సర్దార్, వలిమై కన్నడ చిత్రాలు: కేజీఎఫ్-2, కాంతార, విక్రాంత్ రోణ, 777 ఛార్లీ, జేమ్స్ -
అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్.. రెస్టారెంట్లో సందడి
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో బిజీగా ఉన్నారు. తాజాగా న్యూయార్క్‌లోని ఓ ఇండియన్ రెస్టారెంట్లో ఆయన సందడి చేశారు. రెస్టారెంట్లో ఇండియన్ వంటకాలను ఎన్టీఆర్ ఆస్వాదించారు. అక్కడ సిబ్బందితో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు యంగ్ టైగర్. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రెస్టారెంట్ చెఫ్, సిబ్బందితో పోజులిచ్చిన ఫోటోను ఎన్టీఆర్ తన ఇన్‌స్టా స్టోరీలో పంచుకున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడిస్తూ.. "అంతర్జాతీయ పర్యటనలో అత్యుత్తమ భారతీయ ఆహారాన్ని రుచి చూశా. అమెరికాలో భారతీయ రెస్టారెంట్ వంటకాలు సూపర్. " అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఏడాది ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రం పలు రికార్డులు బద్దలు కొట్టింది. ఆ చిత్రంలోని నాటు నాటు సాంగ్- 2023 ఆస్కార్ అవార్డుల కోసం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ అయింది. అంతకుముందు ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ 2023--ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఒరిజినల్ సాంగ్ - మోషన్ పిక్చర్ నామినేషన్ జాబితాలో రెండు స్థానాలు దక్కించుకుంది. ప్రపంచంలోని టాప్ 50 ఆసియా సెలబ్రిటీల వార్షిక జాబితా- యూకేలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. -
ఆ పది సినిమాల్లో ఐదు మనవే
-
జపాన్‌లో ఆర్ఆర్ఆర్ దూకుడు.. రజనీకాంత్ రికార్డు బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రజినికాంత్ చిత్రం ముత్తు రికార్డును అధిగమించింది. (ఇది చదవండి: జపాన్‌లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్) 24ఏళ్ల క్రితం జపాన్‌లో రిలీజ్ అయిన రజనీకాంత్ ‘ముత్తు’ సినిమా 400 మిలియన్ జపనీస్ యెన్లు వసూలు చేసింది. ఇప్పటివరకు జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా ముత్తు నిలిచింది. తాజాగా ఆర్ఆర్ఆర్ ఆ రికార్డును బద్దలు కొట్టింది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న రికార్డును చెరిపేసింది. జపాన్‌లోని 44 నగరాల్లో 209 థియేటర్లలో విడుదలైన ఆర్ఆర్ఆర్ 400 మిలియన్ జపనీస్ యెన్ల(దాదాపు రూ.24కోట్లు) కంటే ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది. దీంతో రజనీకాంత్ ముత్తు సినిమా రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. -
ఆర్ఆర్ఆర్ అరుదైన ఘనత.. ఆ రెండు విభాగాల్లో నామినేట్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ మరో మైలురాయిని అందుకుంది. గోల్డెన్ గ్లోబ్స్- 2023 అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ ఉత్తమ నాన్ ఇంగ్లీష్ చిత్రం, ఉత్తమ పాటల కేటగిరీలో నామినేట్ అయింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు విభాగాల్లో నామినేట్ చేయబడింది. నాటు నాటు సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేట్ కాగా.. ఉత్తమ నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ చిత్రం విభాగంలోనూ నామినేట్ అయింది. ఈ విషయాన్ని గోల్డెన్ గ్లోబ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఉత్తమ చిత్రం - నాన్-ఇంగ్లీష్ లాంగ్వేజ్ 1.ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్ ఫ్రంట్ 2.అర్జెంటీనా, 1985 3. క్లోజ్ 4.డెసిషన్ టు లీవ్ 5. ఆర్ఆర్ఆర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – మోషన్ పిక్చర్ 1.కరోలినా, టేలర్ స్విఫ్ట్- (వేర్ ది క్రాడాడ్స్ సింగ్) 2.సియావో పాపా, (గిల్లెర్మో డెల్ టోరోస్ పినోచియో) 3.హోల్డ్ మై హ్యాండ్( టాప్ గన్: మావెరిక్) 4.లిఫ్ట్ మీ అప్, (బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్) 5.నాటు నాటు (ఆర్ఆర్ఆర్) Congratulations to the nominees for Best Picture - Non-English Language ✨ All Quiet on the Western Front ✨ Argentina, 1985 ✨ Close ✨ Decision to Leave ✨ RRR#GoldenGlobes pic.twitter.com/DfNs0VQbIs — Golden Globe Awards (@goldenglobes) December 12, 2022 Congratulations to the nominees for Best Song - Motion Picture ✨ "Carolina" - Where The Crawdads Sing ✨ "Ciao Papa" - Guillermo del Toro's Pinocchio ✨ "Hold My Hand" - Top Gun: Maverick ✨ "Lift Me Up" - Black Panther: Wakanda Forever ✨ "Naatu Naatu" - RRR#GoldenGlobes pic.twitter.com/gqG3aWwUjP — Golden Globe Awards (@goldenglobes) December 12, 2022 -
ఆర్ఆర్ఆర్ మరో ఘనత.. అంతర్జాతీయ అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ అవార్డుల పరంపర ఇంకా కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. తాజాగా లాస్ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ బెస్ట్ మ్యూజిక్ కేటగిరిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా కీరవాణి ఎంపికయ్యారు. మరోవైపు బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్లో కూడా కీరవాణి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విన్నర్‌గా అవార్డు గెలుచుకున్నారు. నిర్మాణ సంస్థలు, టాలీవుడ్ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా కీరవాణికి శుభాకాంక్షలు తెలిపారు. (ఇది చదవండి: ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం) ఇటీవలే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది ఆర్ఆర్ఆర్. అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. జపాన్, అమెరికాలోనూ విడుదలైన ఈ చిత్రం పలు రికార్డులు తన ఖాతాలో వేసుకుంది. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికైన సంగతి తెలిసిందే. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. Our very own @MMKeeravaani Garu won the prestigious @LAFilmCritics award for the Best Music Director🥳 Our utmost gratitude to the jury for recognising #RRRMovie’s chartbuster album & background score. 🎶🎼 pic.twitter.com/a9KGTsb73j — RRR Movie (@RRRMovie) December 12, 2022 -
బాహుబలి, RRR కాదు.. తెలుగులో ఫస్ట్ పాన్ వరల్డ్ సినిమా ఇదే..
-
గూగుల్ సెర్చ్‌లో ఆ సినిమానే టాప్.. ఆర్ఆర్ఆర్ ఎక్కడంటే?
బాలీవుడ్ జంట అలియా భట్, రణ్‌బీర్ కపూర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'బ్రహ్మస్త్ర-పార్ట్ 1'. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్, మౌని రాయ్ ప్రత్యేక పాత్రల్లో నటించారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకుంది. విజువల్ వండర్‌గా ఈ సినిమా పలు రికార్డులు సాధించింది. అయితే ఈ ఏడాది అత్యధికంగా గూగుల్‌లో వెతికిన చిత్రంగా నిలిచింది. కేజీఎఫ్- 2, ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారను వెనక్కినెట్టి 2022లో అత్యధికంగా గూగుల్ సెర్చ్ చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సాధించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్ 'ఇయర్ ఇన్ సెర్చ్ 2022'ని ఆవిష్కరించింది. ఈ ఏడాది 11 నెలల్లో ఎక్కువగా ట్రెండింగ్‌లో ఉన్న జాబితాను ప్రకటించింది. అధిక బడ్జెట్‌తో తెరకెక్కిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ రూ.400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ జాబితాలో రెండోస్థానంలో కేజీఎఫ్-2, మూడో స్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, నాలుగో స్థానంలో ఆర్ఆర్ఆర్, ఐదో స్థానంలో కాంతార నిలిచాయి. ఆ తరువాత వరుసగా పుష్ప-ది రైజ్, విక్రమ్, లాల్ సింగ్ చద్ధా, దృశ్యం-2, థోర్-లవ్ అండ్ థండర్ సినిమాలు ఉన్నాయి. అల్లు అర్జున్ హిట్ మూవీ పుష్ప: ది రైజ్ గతేడాది విడుదలైనప్పటికీ 2022లోనూ ఆధిపత్యం చెలాయించింది. మొదటి పది స్థానాల్లో దక్షిణాదికి చెందిన ఐదు చిత్రాలు ఉండగా.. కేవలం నాలుగు హిందీ చిత్రాలు మాత్రమే చోటు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. -
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారు.. పాతరోడ్లను కలుపుతూ 189 కి.మీలతో..
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) దక్షిణ భాగం 189.23 కి.మీ. నిడివితో నిర్మాణం కానుంది. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) అలైన్‌మెంట్‌ను ఖరారు చేసింది. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్న ఢిల్లీకి చెందిన ఇంటర్ కాంటినెంటల్ టెక్నోక్రాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన మూడు అలైన్మెంట్లలో 189.23 కి.మీ. నిడివి ఉన్న అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. దీనికి ఈ వారంలో అధికారిక ఆమోదం లభించనుంది. అనంతరం అధికారులు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు(డీపీఆర్) రూపొందించనున్నారు. జలాశయాలు.. చెరువులు.. గుట్టలను తప్పిస్తూ.. రీజినల్ రింగురోడ్డును ప్రతిపాదించిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోని జాతీయ రహదారుల విభాగం ఓ కన్సల్టెన్సీని నియమించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ప్రాథమికంగా 182 కి.మీ. నిడివితో ఓ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. ఆ తర్వాత ప్రాజెక్టు కొంత డోలాయమానంలో పడింది. అంతగా వాహనాల రాకపోకలు లేని మార్గం కావటంతో దక్షిణ భాగానికి నాలుగు వరసల ఎక్స్‌ప్రెస్ వే అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, ఆ తర్వాత కేంద్రప్రభుత్వం దక్షిణ భాగానికి ఆమోదిస్తూ గత ఆగస్టులో ఢిల్లీకి చెందిన కన్సల్టెన్సీని నియమించింది. ప్రాథమిక అలైన్మెంట్ ఆధారంగానే ఈ సంస్థ క్షేత్రస్థాయిలో పర్యటించి దానికి మార్పుచేర్పులతో మూడు వేరు వేరు అలైన్మెంట్లను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న షాద్‌నగర్, కంది, ఆమన్‌గల్.. తదితర రోడ్లలో కొంత భాగాన్ని ఆర్ఆర్ఆర్లోకి చేరుస్తూ రెండు అలైన్మెంట్లను రూపొందించింది. పాత ఎన్సల్టెన్సీ సంస్థ ప్రాథమికంగా రూపొందించిన పూర్తి గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌ను సరిదిద్దుతూ మూడో అలైన్‌మెంటును సిద్ధం చేసింది. ప్రాథమిక అలైన్మెంట్ నిడివిని పెంచనప్పటికీ, దానికి అడ్డుగా ఉన్న చెరువులు, గుట్టలను తప్పిస్తూ మార్పులు చేశారు. భవిష్యత్తులో నిర్మించే పాలమూరు ప్రాజెక్టు కాలువలను దృష్టిలో పెట్టుకుని చిన్న, చిన్న మార్పులు చేశారు. దీంతో పాత అలైన్మెంట్ కంటే దాదాపు ఏడు కి.మీ. అదనపు నిడివితో కొత్త అలైన్మెంట్ ఏర్పడింది. పాత రోడ్లను జత చేస్తూ రూపొందించిన రెండు అలైన్మెంట్లు ఆచరణ సాధ్యం కాదని ఎన్హెచ్ఏఐ తిరస్కరించింది. పూర్తి గ్రీన్‌ఫీల్డ్ మార్గంగా ఏర్పడ్డ మూడో అలైన్‌మెంట్‌ను ఎంపిక చేసింది. రూ.15 వేల కోట్ల వ్యయం? ఉత్తర భాగం నిర్మాణానికి దాదాపు రూ.9,500 కోట్లు ఖర్చవుతాయన్న ప్రాథమిక అంచనా ఉండగా, ఇటీవల కేంద్రం రూ.13 వేల కోట్లతో దానికి బడ్జెట్ రూపొందించింది. రోడ్డు నిర్మాణానికి రూ.8 వేల కోట్లు, భూసేకరణకు రూ.5,200 కోట్లు అవసరమవుతాయని పేర్కొంది. ఈ లెక్కన దక్షిణ భాగానికి రూ.15 వేల కోట్ల వ్యయం అవుతుందని అధికారిక వర్గాల అంచనా. పూర్తిస్థాయి డీపీఆర్ రూపొందించాక స్పష్టత వచ్చే అవకాశముంది. సంగారెడ్డి నుంచి కంది, నవాబ్‌పేట, చేవెళ్ల, షాబాద్, షాద్‌నగర్, ఆమన్‌గల్, మర్రిగూడ, శివన్నగూడ, సంస్థాన్ నారాయణపూర్ మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మించే దక్షిణ భాగాన్ని కేంద్రప్రభుత్వం భారత్‌మాల పరియోజన పథకం–2 కింద ఎంపిక చేసింది. -
ఆర్ఆర్ఆర్ చిత్రం మరో ఘనత.. ప్రతిష్ఠాత్మక అవార్డులు కైవసం
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' పలు రికార్డులు సృష్టించింది. ఈ చిత్రం అంతర్జాతీయ అవార్డుల పరంపరను కొనసాగిస్తోంది. తాజాగా మరో రెండు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA)లో స్పాట్లైట్ అవార్డును కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ టీం ట్విటర్ ద్వారా వెల్లడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న లాస్ ఏంజెల్స్‌లో జరగనున్న 6వ హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఈ అవార్డును అందజేయనున్నారు. మరోవైపు అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్’ ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగానూ ‘ఆర్ఆర్ఆర్’ ఎంపికైంది. ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ‘సన్‌సెట్ సర్కిల్’, ‘శాటర్న్’ అవార్డులూ గెలుచుకుంది. ఇటీవల.. న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఇండియాలో సంచలనం సృష్టించిన ఈ సినిమా విదేశాల్లోనూ విడుదలై సత్తా చాటింది. కొమురం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాల్ని స్ఫూర్తిగా తీసుకుని ఓ కల్పిత కథతో రూపొందించిన ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ అద్భుతంగా నటించారు. Thank you so much @ATLFilmCritics 🙏🏻🙏🏻 #RRRMovie https://t.co/gczgxrsmWY — DVV Entertainment (@DVVMovies) December 5, 2022 We RRR elated... 🤩 The cast and crew of #RRRMovie bags the prestigious HCA Spotlight Winner Award! We'd like to thank the @HCAcritics jury for recognising #RRRMovie ! pic.twitter.com/j5S8B2Rgvq — RRR Movie (@RRRMovie) December 6, 2022 -
జపాన్ లో బాహుబలి -2 రికార్డును తుడిచేసిన RRR
-
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. బాహుబలి-2ను వెనక్కి నెట్టి..!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రం జపాన్‌లోనూ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా బాహుబలి రికార్డును అధిగమించింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ చిత్రంగా అవతరించింది. అత్యంత వేగంగా 300 మిలియన్ల క్లబ్లో చేరిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న బాహుబలి-2 ను వెనక్కినెట్టింది. (చదవండి: RRR Collections in Japan: జపాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ఆర్ఆర్ఆర్.. కేజీఎఫ్-2ను దాటే ఛాన్స్?) జపాన్ విడుదలైన 34 రోజుల్లోనే ఆ దేశ కరెన్సీలో 305 మిలియన్ల యెన్లు.. అంటే దాదాపు రూ.17.9 కోట్లు వసూలు చేసింది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ చిత్రం ముత్తు మాత్రమే రూ.23.5 కోట్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్ నటించారు. -
ఆర్ఆర్ఆర్ సీక్వెల్.. రాజమౌళి క్లారిటీ ఇదే..!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం.. రణం.. రుధిరం). దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 24న విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు కొట్టింది. రూ.1200 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం ఇటీవలే జపాన్‌లోనూ విడుదలైంది. జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ప్రస్తుతం టాలీవుడ్ ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌పై అంతా చర్చించుకుంటున్నారు. ఈ విషయంపై తాజాగా దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. ఇటీవల చికాగోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజమౌళి మాట్లాడుతూ.. 'నా చిత్రాలకు మా నాన్నే రచయిత. మేమిద్దరం ఆర్ఆర్ఆర్-2 పై చర్చించాం. కథ రూపొందించే పనిలో మా నాన్న నిమగ్నమై ఉన్నారు.' అని అన్నారు. ఈ ప్రకటనతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందని ప్రకటించడంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. -
జపాన్‌లోనూ 'ఆర్ఆర్ఆర్' జోరు.. త్రీ ఇడియట్స్ రికార్డు బ్రేక్
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా రికార్డ్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రం జపాన్‌లోనూ దూసుకెళ్తోంది. అక్కడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా అమిర్ ఖాన్ బాలీవుడ్ చిత్రం త్రీ ఇడియట్స్ రికార్డును అధిగమించింది. జపాన్‌లో విడుదలైన 17 రోజుల్లోనే 185 మిలియన్ల జపాన్ యెన్ల వసూళ్లతో రికార్డులు సృష్టిస్తోంది. దీంతో జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో భారతీయ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' నిలిచింది. గతంలో రజినీకాంత్ నటించిన ముత్తు చిత్రం జపాన్‌లో 400 మిలియన్ల జపాన్ యెన్లు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత బాహుబలి- 2 300 మిలియన్లతో రెండో స్థానంలో ఉండగా.. తాజాగా 185 మిలియన్లతో ఆర్ఆర్ఆర్ మూడో స్థానానికి చేరింది. ఈ జాబితాలో రెండు సినిమాలు రాజమౌళి తెరకెక్కించినవే. (చదవండి: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!) అయితే ఆర్ఆర్ఆర్ మూవీ త్వరలోనే కేజీఎఫ్-2 అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలవనుందా? అనే నెట్టింట్లో పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1150 కోట్లు వసూళ్లు రాబట్టింది ఆర్ఆర్ఆర్. యష్ నటించిన కేజీఎఫ్-2 రూ.1200 కోట్లకు పైగా కలెక్షన్లతో ఆ రికార్డును బద్దలు కొట్టింది. ప్రస్తుతం జపాన్‌లో అక్టోబర్ 21న విడుదలైన ఈ చిత్రం మూడు వారాల్లోనే జపాన్ కరెన్సీలో 185 మిలియన్ల(రూ.10 కోట్లు) వసూళ్ల రాబట్టిందని ఫిల్మ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ బాలా తెలిపారు. ఇకముందు ఇదే జోరు కొనసాగిస్తే 2022లో కేజీఎఫ్ కలెక్షన్లను దాటి అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా అవతరించే అవకాశముంది. #RRRMovie is having a remarkable run at Japan Box Office, collecting 185M ¥ by 3rd weekend (17 days) with 122K+ footfalls Fastest Indian Film to achieve this & becoming the 3rd highest grossing film after Muthu & Baahubali2@ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @onlynikil pic.twitter.com/X8noPqROfb — Ramesh Bala (@rameshlaus) November 7, 2022 -
ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి..!
దర్శకధీరుడు రాజమౌళి గ్లోబల్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రం జపాన్‌లోనూ విడుదలైంది. అక్టోబర్‌లో జపనీస్ భాషలోనూ రిలీజ్ చేసింది చిత్రబృందం. సినిమా ప్రమోషన్లు కూడా భారీస్థాయిలో నిర్వహించారు. తాజాగా ఈ చిత్ర జపాన్‌లోనూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన మొదటివారంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ మూవీ ప్రమోషన్లలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి కుటుంబాలతో కలిసి సందడి చేశారు. (చదవండి: ఎయిర్‌పోర్ట్‌లో ఆర్ఆర్ఆర్ టీమ్.. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోలు వైరల్) అక్టోబర్ 21న జపాన్‌లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' మొదటి వారంలో జపాన్ కరెన్సీలో 73 మిలియన్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రం జపాన్‌లోని 44 నగరాల్లోని 209 స్క్రీన్లతో పాటు 31 ఐమ్యాక్స్ థియేటర్లలో విడుదల చేశారు. ఇది జపాన్‌లో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక థియేటర్లలో ప్రదర్శించిన సినిమాగా నిలిచింది. ఓ నివేదిక ప్రకారం విదేశీ చిత్రాల్లో జపనీస్ బాక్సాఫీస్ వద్ద ది బాడ్ గైస్, స్పెన్సర్, జురాసిక్ వరల్డ్, డొమినియన్ వంటి చిత్రాల కంటే ఆర్ఆర్ఆర్ ముందు వరుసలో నిలిచింది. జపాన్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన భారతీయ చిత్రంగా నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది. 24 ఏళ్ల క్రితం విడుదలైన రజనీకాంత్ ముత్తు.. జపాన్ బాక్సాఫీస్ వద్ద 400 మిలియన్లతో అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా మొదటిస్థానంలో నిలిచింది. 300 మిలియన్ల కలెక్షన్లతో రాజమౌళి చిత్రం బాహుబలి- 2 రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ మూవీ 3 ఇడియట్స్ 170 మిలియన్ల వసూళ్లతో మూడవ స్థానంలో సాధించింది.