
భారతీయ సంస్కృతిని కాపాడుతూ....ఇతర దేశాల్లో కూడా మన సంస్కృతి గొప్పదనాన్ని చాటిచెప్పున్న ప్రవాస భారతీయులు ఎంతోమంది. ఉరుకులు, పరుగుల జీవితంలో తనకెంతో ఇష్టమైన చిత్ర లేఖనాన్ని వదులుకోకుండా ఆదర్శవంతంగా నిలుస్తున్నారు ఐశ్వర్య భాగ్యనగర్. అమెరికాలోని టెక్సాస్ నగరం నివసిస్తున్న ఐశ్వర్య చిత్రలేఖనంతో అందరినీ ఔరా అనిపిస్తున్నారు.
ఇటీవల విడుదలైన ఆర్‌ఆర్‌ఆర్ పోస్టర్, భీమ్, రామరాజు ఫోటోలను ఎంతో అద్బుతంగా పెయింట్ చేశారు. వీటితో పాటుగా ఆమె గీసిన దళపతి విజయ్, మహానటి కీర్తి సురేష్ సహా మరెన్నో చిత్రాలు అలరిస్తున్నాయి. భారతీయ కళలపై ఉన్న ఆసక్తితో ఆమె 2016లో భరత నాట్యంలో కూడా అరంగేట్రం చేశారు. ఐశ్వర్య కుంచె నుంచి జాలువారిన పలు చిత్రాలు ఇవే..!
ఐశ్వర్య భాగ్యనగర్
చదవండి: డాలస్‌లో తానా పుస్తక మహోద్యమం