breaking news
NRI News
-
పట్టాలపై ప్రియుడితో ఎన్నారై యువతి.. క్షణాల్లో ఘోరం!
న్యూయార్క్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టాలపై కూర్చున్న ఓ జంటను రైలు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో భారత సంతతికి చెందిన మలైకా చిత్రే (24)తో పాటు నేపాలీ-అమెరికన్ నవమ్ కౌల్ (24) ఉన్నారు. బలవన్మరణమా? లేదంటే మత్తులో అక్కడికి చేరారా?.. వీళ్లు పట్టాలపై ఎందుకు కూర్చున్నారు అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.లోయర్ మన్‌హాటన్‌లోని స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సౌత్ వింగ్ వైపు వెళ్తున్న నంబర్ 4 రైలు పట్టాలపై ఉన్న ఇద్దరినీ ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించగా.. ఇద్దరూ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటన తర్వాత రైలులో ఉన్న సుమారు 100 మంది ప్రయాణికులను బయటకు తరలించారు.ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో..మలైకా చిత్రే న్యూజెర్సీలోని డేటన్కు చెందినవారు. అకాడియా ఫార్మాస్యూటికల్స్‌లో ఆపరేషన్స్ స్పెషలిస్ట్‌గా పనిచేస్తున్నారు. నవమ్ కౌల్ సైరేవిల్లేకు చెందినవారు కాగా.. బ్లూమ్‌బర్గ్‌లో ఫైనాన్షియల్ డేటా అనలిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ రట్జర్స్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులే. దాదాపు ఒకే సమయంలో అక్కడి నుంచి పట్టాలు పొందారు.ఈ విషాదంతో వాళ్ల సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. నవమ్ ఎంతో స్నేహపూర్వకంగా, సరదాగా ఉండేవాడని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఆయన తల్లిదండ్రులు దాదాపు మూడు దశాబ్దాల క్రితం నేపాల్ నుంచి అమెరికాకు వలస వచ్చినట్లు తెలిపారు. మలైకా తెలివైన, చురుకైన విద్యార్థినిగా తమకు తెలుసని ఆమె కుటుంబానికి సమీపంలోని పొరుగువారు చెప్పారు. ఇంత చిన్న వయసులో ఇద్దరూ ఇలా ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తున్నారు.A tragic situation in Manhattan. Recent Rutgers graduates Navam Kaul and Malaika Chitre were killed after being struck by a southbound 4 train at Spring Street around 3:15 a.m. Sunday.Reports say Kaul went onto the tracks first and Chitre climbed down after him, apparently…— Shadab Chow 🇺🇸 (@tonyinmycity97) September 15, 2026వైరల్‌గా మారిన వీడియో..ఈ ఘటనకు ముందు ఓ వ్యక్తి తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్‌గా మారింది. అందులో మలైకా, నవమ్ ఇద్దరూ పట్టాలపై ప్రశాంతంగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. రైలు వస్తున్న సమయంలోనూ వారు అక్కడే ఉన్నారు. అయితే రైలు డ్రైవర్ మాత్రం.. మలైకా నవమ్ను తన వైపునకు లాగుతున్నట్లు, ఆమె నవ్వుతున్నట్లు కనిపించిందని చెప్పినట్లు సమాచారం.ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్నది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియలేదు. వారిలో ఒకరు ప్రమాదవశాత్తు పట్టాలపై పడిపోయి ఉండొచ్చని, ఆమెను కాపాడేందుకు మరొకరు పట్టాలపైకి వెళ్లి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. రైలు డ్రైవర్ వారిని గమనించి అత్యవసర బ్రేకులు వేసినా.. అప్పటికే రైలు సమీపంలోకి రావడంతో ఆపడం సాధ్యం కాలేదని అధికారులు తెలిపారు.మత్తులో ఉన్నారా?ఇద్దరూ పట్టాలపైకి ఎందుకు వెళ్లారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వారు మద్యం లేదంటే ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉండి ప్రమాదాన్ని గుర్తించలేకపోయారా? అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఘటనాస్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. అయితే ఆత్మహత్య కోణాన్ని కూడా పూర్తిగా కొట్టిపారేయలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: ఆ యాక్సిడెంట్‌తో స్పాట్లోనే చనిపోయేదాన్ని! -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)(TCSS) ఆధ్వర్యంలో అంతర్జాలంలో గూగుల్ మీట్ ద్వారా 14-Sep-2026 ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక చవితి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ఎంతో మంది భక్తులు కుటుంబ సమేతంగా ప్రత్యక్ష పూజలో పాల్గొన్నారు. సకల విఘ్నాలు తొలిగి అందరి పై వినాయకుని ఆశీస్సులు ఉండాలని వినాయకుడిని కోరారు. ఈ పూజను ఇండియా నుండి మహబూబ్ నగర్ కు చెందిన శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ పురోహితులు ఇరువంటి శ్రావణ్ కుమార్ శర్మ గారు అంతర్జాలం ద్వారా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శెశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు మరియు విక్రమ్ చిట్ల సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు , శివ ప్రసాద్ ఆవుల మరియు కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా క్రిష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్ , యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం మరియు సుకేందర్ నీలం మొదలగు వారు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అందరి పై శ్రీ వినాయకుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎల్లప్పుడు సొసైటీ వెన్నంటే ఉంటూ సహకారం అందిస్తున్న వారితో పాటు ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞతలు తెలియ జేశారు.ఈ వేడుకలకు సహకారం అందించిన మై హోమ్ బిల్డర్స్, కుమార్ ప్రాపర్టీస్ (ప్రాప్నెక్స్) సింగపూర్, ASBL కన్స్ట్రక్షన్ కంపెనీ, సరిగమ గ్రాండ్ ఇండియన్ రెస్టారెంట్, వజ్రా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ, ఏపీజే అభిరామి, ఏపీజే జువెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవోల్వ్, ఏ వి ఏం కన్స్ట్రక్షన్ అండ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, విజయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (కూల్ టైమ్ ఎయిర్కాన్ ఇన్స్టాలేషన్ & సర్వీస్), కామాక్షి సిల్వర్,గోల్డ్ & డైమండ్ , బులియన్ కింగ్ గార్లకు సొసైటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
బార్బెక్యూలో బీఫ్ : కెనడాలో చిక్కుల్లో భారతీయ మహిళ
కెనడాలో ఒక ప్రవాస భారతీయ మహిళ ఓవర్ యాక్షన్ నెట్టింట తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వ్యక్తిపై అనుచితంగా ప్రవర్తించిన వైనం కలకలం రేపింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కెనడాలోని సరీ నగరంలో చోటు చేసుకుంది. అసలేం జరిగింది అంటే.కెనడాలో నివసిస్తున్న రాజ్ తివానా అనే భారతీయ మహిళ, తన అద్దెదారుడితో వాగ్వాదానికి దిగింది. ఆ ఇంట్లోని తోటలో తన స్నేహితుడితో కలిసి బార్బెక్యూలో బీఫ్ వండడాన్ని తివానా అభ్యంతరం చెప్పడంతో వివాదం షురూ అయింది. తన ఇంటిని, గోడల్ని పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ వారితో గొడవకు దిగింది. అక్కడితో ఆగలేదు ఒక కర్ర ముక్కను తీసుకుని గ్రిల్ పైనుంచి ఆహారాన్ని తోసేసింది. ఆ తరువాత ఇంట్లోకి చొరబడి మరీ ఆమె రాయితో దాడిచేసింది. మస్కిటో బ్యాట్‌తోనూ ఎటాక్ చేసింది. తన యూనిట్ నుంచి వెళ్లిపోమని పదేపదే దూషించడం, అతడిపై ఎటాక్ చేయడం లాంటివి వీడియోలు రికార్డైనాయి. దీంతో బాధితుడు తన యజమానురాలు పదేపదే వేధిస్తోందని, తన పనుల్లో జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ వరుస వీడియోలను పోస్ట్ చేశాడు. ఇదీ చదవండి: జొమాటో కస్టమర్ల నెత్తిన పిడుగు, భారీ షాకిచ్చిందిగా! An Indian woman in Canada clashed with her tenant after objecting to him using a barbecue in the garden with a friend on her property. After a video of their altercation went viral, the man shared a series of clips alleging that the incident was part of a larger pattern of… pic.twitter.com/vGMtZnVSmZ— Hate Detector 🔍 (@HateDetectors) September 12, 2026తన గదిని ఖాళీ చేసి వెళ్లాలని వేడుకుంటున్నావినలేదంటూ మరో వీడియో షేర్ చేశాడు. ముందస్తు సమాచారం లేకుండానే లోపలికి వచ్చి తాళాలు మార్చేయడమే కాకుండా, చివరకు అతని ఇంటి ప్రధాన తలుపునే పూర్తిగా తొలగించిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో వీడియోలో కొంతమంది పురుషులు ఆ ప్రాంగణంలోకి ప్రవేశించడం, ఘర్షణ పడటం కూడా రికార్డైంది. అతని ఫిర్యాదు మేరకు ఈ సంఘటనకు సంబంధించి తివానాను అరెస్టు చేసినట్టు కూడా ఈ వీడియోల ద్వారా తెలుస్తోంది.ఇదీ చదవండి: నటి అమీషా తల్లి డైమండ్ నగలు చోరీ : పనిమనిషి అరెస్ట్Landlord and tenant disputes in Canada are rampant specifically in Punjabi dominated areas and properties; however this incident between Raj Tiwana and her tenant has turned the conversation exceedingly factional; entire incident is being seen from a highly racists point of view… pic.twitter.com/YKQnx07R0v— Arshdeep Singh Saini (@the_lama_singh) September 12, 2026అయితే ఈ ఘటనలో అసలు వివాదానికి కారణాలపై స్పష్టత లేదు. అలాగే దాడికి సంబంధించిన పూర్తి వివరాలు, పోలీసులు నమోదు చేసిన అభియోగాలు తదితర అంశాలపై క్లారిటీ లేదు. ఇదీ చదవండి : రూ. 250లతో చెట్టు కింద ఉచిత స్కూలు: KBC 18 కంటెస్టెంట్ ఇంట్రస్టింగ్ స్టోరీ -
ఇదేమి వింతో.. బ్రేకప్ తర్వాత రివర్స్ ట్విస్ట్..
సింగపూర్‌లో జరిగిన ఓ వింత ఘటన అందర్నీ అశ్చరపరుస్తోంది. ప్రేమలో ఉండగా ప్రేయసి కోసం ఏకంగా రూ.3.5 కోట్లు ఖర్చు చేశాడు.. విలాసవంతమైన కానుకలు, ఫస్ట్‌క్లాస్ విమాన ప్రయాణాలు, విదేశీ పర్యటనలు.. ఇలా ఆమె కోసం భారీగా ఖర్చు చేసిన భారత సంతతికి చెందిన ఓ సీఈవో.. ప్రేమ బంధం తెగిపోయిన తర్వాత ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని కోర్టుకెక్కాడు. కానీ న్యాయస్థానం మాత్రం ఇది ప్రేమలో ఇచ్చిన బహుమతులేనంటూ తీర్పు చెప్పింది. దీంతో డబ్బు తిరిగి రాకపోగా.. కోర్టు ఖర్చులు కూడా అతడే భరించాల్సి వచ్చింది. ఆయనకు కోర్టులో చుక్కెదురైంది.సీఎన్ఎన్ కథనం మేరకు భారత లాజిస్టిక్స్ సంస్థ టీసీఎల్ ఎక్స్‌ప్రెస్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ చందర్ అగర్వాల్, తన మాజీ ప్రేయసి ఫెలీషియా లీ తనకు దాదాపు $3.7 లక్షలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ సింగపూర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆమెపై ఖర్చు చేసిన మొత్తాన్ని తాను వడ్డీ లేని రుణాలుగా ఇచ్చానని.. వాటిని ఆమె తిరిగి చెల్లించాల్సి ఉందని అగర్వాల్ వాదించారు. అయితే కోర్టు మాత్రం ఆ మొత్తంలో ఎక్కువ భాగం బహుమతుల రూపంలో ఇచ్చినవేనని తేల్చింది. అగర్వాల్ దావాను కొట్టివేసింది.అగర్వాల్, లీ ఇద్దరూ తొలిసారిగా 2019లో ఓ విమాన ప్రయాణంలో కలుసుకున్నారు. ఆ తర్వాత 2022 సెప్టెంబర్‌లో వారి మధ్య ప్రేమ ఏర్పడింది. 2023 డిసెంబర్లో వారి సంబంధం ముగిసింది. లీ తనకు నమ్మకద్రోహం చేసిందని.. అందుకే తాము విడిపోయామని అగర్వాల్ పేర్కొన్నారు. వారు ప్రేమలో ఉండగా అగర్వాల్.. లీ కోసం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేశారు. అంతే కాకుండా.. లీ నివసించే ఫ్లాట్ కోసం ఓ ఫెంగ్ షుయ్ నిపుణుడికి సుమారు S$17,000 కూడా చెల్లించారు.ఈ చెల్లింపు మాత్రం రుణమేనని అగర్వాల్ వాదించారు. లీ తనను డబ్బు రుణంగా ఇవ్వాలని కోరిందని.. దాన్ని తిరిగి చెల్లిస్తానని ఆమె అంగీకరించిందని అగర్వాల్ తెలిపారు. ఇందుకు ఆధారంగా లీ ఇనిషియల్స్ ఉన్నాయని తాను పేర్కొన్న ఓ చేతిరాత ఒప్పందాన్ని కూడా కోర్టుకు ఆయన సమర్పించారు. అయితే, లీ ఆ పత్రంపై తాను సంతకం చేయలేదని స్పష్టం చేశారు. చెల్లింపులు రుణాలు కాదని.. బహుమతులేనని, అందువల్ల లీ ఆ డబ్బును అగర్వాల్‌కు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సింగపూర్ హైకోర్టు తీర్పునిచ్చింది.ఇదీ చదవండి: జైలులో తనిఖీలు.. ఫోన్‌తో దొరికేసిన ప్రజ్వల్ రేవణ్ణ -
భారతీయ అమెరికన్ దంపతుల దాతృత్వం
హూస్టన్: అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ హూస్టన్‌కు భారతీయ అమెరికన్ జంట రూ.38.25 కోట్ల (40 లక్షల డాలర్ల) విరాళాన్ని అందజేసింది. భారతీయ అమెరికన్ ఇంజినీర్ మన్మోహన్ సింగ్ కాల్సి, ఆయన భార్య మేరీ లూయిస్ షుబెర్ట్ కాల్సి ఈ మొత్తాన్ని పరిశోధన, విద్య కోసం అందజేశారని వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మొత్తంతో వర్సిటీలోని కుల్లెన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో రెండు ఎండోవ్డ్ ప్రొఫెసర్‌షిప్‌లు, ఒక ఫ్యాకల్టీ రీసెర్చ్ ఫండ్, గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లు, ఒక సెమినార్ సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. మన్మోహన్ కాల్సి వర్సిటీలో గ్రాడ్యుయేట్ చేసి, పారిశ్రామికవేత్తగా ఎదిగారని, సుదీర్ఘ కాలం వర్సిటీతో సంబంధాలు కొనసాగిస్తున్నారని డీన్ ప్రదీప్ శర్మ చెప్పారు. మన్మోహన్ కాల్సి హూస్టన్ వర్సిటీలో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీతోపాటు పీహెచ్డీ పూర్తి చేశారు. హైడ్రోడైనమిక్ రోటరీ సీలింగ్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న కాల్సి ఇంజినీరింగ్ అనే కంపెనీని ఆయన 1978లో నెలకొల్పారు. -
ఫీనిక్స్‌లో ‘రాజా 50’ : వేలాది మందిని కట్టిపడేసిన ఇళయరాజా!
శంకర నేత్రాలయ సేవలపై అవగాహన కల్పించే లక్ష్యంతో అరిజోనాలోని ఫీనిక్స్ నగరంలో ప్రముఖ సంగీత దర్శకుడు మాస్ట్రో ఇళయరాజా, ‘రాజా 50’ పేరుతో ప్రత్యక్ష సంగీత కార్యక్రమంలో ఆహూతులను అలరించింది. దాదాపు మూడు గంటలపాటు ప్రేక్షకులను తన సంగీత ప్రపంచంలో విహరింపజేశారు. ఫీనిక్స్‌లో గతంలో ఎన్నో భారతీయ సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు జరిగినప్పటికీ, ఇంత భారీ స్థాయిలో లైవ్ సింఫనీ సంగీత బృందంతో జరిగిన ఈ కార్యక్రమం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.దాదాపు 40 మంది సంగీత కళాకారులతో కూడిన బృందం ఇళయరాజాతో కలిసి వేదికను పంచుకుంది. ఒక్కో వాయిద్యం సంగీతంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇళయరాజా స్వయంగా వివరించడం ఈ కార్యక్రమాన్ని సాధారణ సంగీత కచేరీకి భిన్నంగా నిలిపింది.Arizona Financial Theatreలో జరిగిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 4వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు వివిధ భారతీయ భాషలు, ప్రాంతాలకు చెందిన కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంగీతానికి భాషా సరిహద్దులు లేవని మరోసారి చాటింది.‘రాజా 50’ ఫీనిక్స్‌లో ఒక విజయవంతమైన సంగీత కార్యక్రమంగా మాత్రమే కాకుండా, శంకర నేత్రాలయ సేవలను 4,000 మందికి పైగా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లిన ముఖ్యమైన అవగాహన వేదికగా నిలిచింది. ముఖ్యంగా MESU కార్యక్రమాన్ని పరిచయం చేయడం, దానికి సంబంధించిన వీడియోలను ప్రదర్శించడం ద్వారా సంగీత వేదికపై సేవా సందేశాన్ని కూడా వినిపించే అవకాశం లభించింది. ఇళయరాజా సంగీతం ప్రజలను ఒకచోట చేరిస్తే, ఆ అవకాశాన్ని శంకర నేత్రాలయ సేవలను మరింత మందికి పరిచయం చేయడానికి ఉపయోగించుకోవడం ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకతను ఇచ్చింది. సంగీతం, సమాజం, సేవ ఒకే చోట కలిసిన మరపురాని రాత్రిగా ‘రాజా 50’ నిలిచిపోయింది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు నేత్ర వైద్య సేవలను చేరువ చేయడంలో MESU చేస్తున్న సేవలను పరిచయం చేస్తూ, దానికి సంబంధించిన వీడియోలను కూడా వేదికపై ప్రదర్శించారు. సంగీతం కోసం వచ్చిన వేలాది మందికి శంకర నేత్రాలయ సేవా కార్యక్రమాలను చూపించగలగడం ఈ వేదికకు ప్రత్యేకమైన సామాజిక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.ఈ కార్యక్రమానికి ఫీనిక్స్‌లోని వివిధ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సంఘాలు, ఇతర భారతీయ సామాజిక సంస్థల ప్రతినిధులు, కమ్యూనిటీ నాయకులు, స్పాన్సర్లు, వాలంటీర్లు తమ వంతు సహకారం అందించారు. భాషలు, ప్రాంతాలు వేరైనా ఒక మంచి కార్యక్రమం కోసం అందరూ కలిసి రావడం ఈ విజయానికి ప్రధాన బలంగా నిలిచింది. నిర్వాహకులతో పాటు వివిధ సంఘాలు, స్పాన్సర్లు, వాలంటీర్లు, శంకర నేత్రాలయ శ్రేయోభిలాషులు, ఫీనిక్స్ భారతీయ సమాజం అందించిన సహకారం ఇందులో భాగమైంది.ఇంత పెద్ద కార్యక్రమం వెనుక ఆది మొర్రెడ్డి, అనిల్ భరద్వాజ్, విజయ్ రాజ్, చెన్నా రెడ్డి మద్దూరి, చిత్రప్రియ, సుబ్బు ఉప్పులూరి, జ్ఞాని మారుపాకుల, జెగ్గీ క్రిష్, డా. కార్తిక్ రెడ్డి దొనూర్, లక్ష్మి బొగ్గరపు, ప్రవీణ్ సామల, శరవ్ సుబ్రమణియన్, సచ్చిదానంద ప్రభు, సతీష్ పంచాక్షరం, సతి శివం, శ్యామ్ బైరా, శ్రీజిత్ శ్రీనివాసన్, గుప్తా, శ్రీని సుబ్రమణియన్, వంశీ కృష్ణ ఇరువారం, ధీరజ్ రెడ్డి పోల తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు.ఇళయరాజా సంగీత ప్రయాణానికి యాభై సంవత్సరాలు అనే సందర్భంలో జరిగిన ఈ కార్యక్రమం తరాలను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా ఆయన పాటలను ఆస్వాదిస్తున్న తరం పక్కనే నేటి యువతరం కూడా అదే సంగీతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించింది. వివిధ వయసులు, భాషలు, ప్రాంతాలకు చెందిన వేలాది మంది సంగీతంతో ఒక్కటయ్యారు. -
ప్రవాస భారతీయులకు ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదు!
నేను భారత సంతతి అమెరికా పౌరుడిని. నాకు ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డు ఉంది. మేము ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఒక ఆస్తిని విక్రయించాలనుకుంటున్నాము. అయితే, ఈ అమ్మకాన్ని పూర్తి చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి అని రిజిస్ట్రార్ కార్యాలయంలో మేము సంప్రదించిన ఒక ఏజెంట్ చె΄్పాడు. రిజిస్ట్రార్ కూడా అది తప్పనిసరి అని చె΄్పారు. ఈ నేపథ్యంలో సంబంధిత రిజిస్ట్రార్ లేదా ఇతర అధికారులకు సమర్పించేందుకు వర్తించే చట్టపరమైన నిబంధనలను స్పష్టంగా తెలియజేయగలరని కోరుతున్నాను. – సుహాస్, అమెరికా (చిత్తూరు)భారత పౌరులు కానప్పుడు ఆధార్ కార్డు మీకెలా వస్తుంది? ఆధార్ చట్టంలోని ’resident’ నిర్వచనం ప్రకారం, గత 12 నెలల్లో కనీసం 182 రోజులు భారతదేశంలో నివసించిన వ్యక్తి నివాసకులు/ ’resident’గా పరిగణించబడతారు. కేవలం OCI కార్డు గ్రహీతగా ఉండటం వల్ల ఆధార్ కార్డు పొందడం తప్పనిసరి కాదు, మీ కేసులో వీలు కూడా లేదు.ఫెమా నిబంధనల ప్రకారం OCI కార్డు గ్రహీత భారతదేశంలో (ప్రత్యేక పరిస్థితులలో తప్ప) వ్యవసాయ భూమి, తోటలు లేదా ఫాం హౌస్ మినహా ఇతర స్థిరాస్తుల కొనుగోలు; విక్రయాలు చేయవచ్చు. ఈ లావాదేవీకి ఆధార్‌ను తప్పనిసరి పత్రంగా RBI/FEMA నిబంధనలు ఎక్కడా నిర్దేశించలేదు.భారతదేశంలో ఆస్తిని విక్రయించడానికి ఎన్నారైలకు ఆధార్ కార్డు తప్పనిసరి కాదు. ఎన్నారైకి ఏదైనా భారతీయ బ్యాంకులో NRO ఖాతా ఉండటం ముఖ్యం.అధికారికంగా అవసరమైన–సూచించిన పత్రాలతోపాటు (1) ఆస్తి పత్రాలు – ఆస్తిపై అప్పులు లేవు అని ధ్రువీకరించే Encumbrance Certificarte (EC); (2) గుర్తింపు ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు – పాన్ కార్డు వంటివి ఉంటే సరిపోతుంది. అయినప్పటికీ, రిజిస్ట్రార్ ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సిందే అని పట్టుబడితే, ఆధార్ కార్డు సమర్పించనందుకు రిజిస్ట్రేషన్ పత్రాన్ని తిరస్కరిస్తూ, అందుకు గల కారణాలను – ఏ చట్టం, నిబంధన, జీఓ Government Order) లేదా ఏ ప్రభుత్వ ఉత్తర్వుల ఆధారంగా ఆధార్ కోరుతున్నారో లిఖిత పూర్వకంగా ఇవ్వాలని కోరండి. రిజిస్ట్రార్ లిఖితపూర్వకంగా తిరస్కరణ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం, ఆ ఉత్తర్వులపై జిల్లా రిజిస్ట్రార్ లేదా Inspector General of Registration (IG Registration) ముందు అప్పీల్/పిర్యాదు చేసుకొని, ఆధార్ లేకుండానే రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా సంబంధిత సబ్–రిజిస్ట్రార్‌కు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరవచ్చు. హై కోర్టుకి కూడా వెళ్ళవచ్చు.- శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.conకు మెయిల్ చేయవచ్చు. ఇవీ చదవండి: హిమధీర -
కువైట్‌లో భారీ డీజిల్ మోసం.. భారతీయులు సహా 41 మంది అరెస్ట్!
కువైట్ సిటీ: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు చెందిన వాహనాల నుంచి డీజిల్ దొంగిలించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం పట్టుకుంది. ఈ కేసులో ఓ కువైట్ పౌరుడితో పాటు భారతీయులు సహా 40 మంది ప్రవాసులను అరెస్ట్ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో డ్రైవర్లుగా పనిచేస్తున్న కొందరు బస్సులు, లారీలను ‘అంగర్’ ప్రాంతంలోని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి డీజిల్ చోరీ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఇలా సేకరించిన డీజిల్‌ను ఇతర ట్యాంకర్లలోకి తరలించి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ అక్రమ దందా కోసం ట్యాంకర్లను నెలకు 1,600 కువైటీ దినార్లకు అద్దెకు ఇచ్చింది అరెస్టైన కువైట్ పౌరుడేనని విచారణలో తేలింది. చాలాకాలంగా నిఘా పెట్టిన అధికారులు డీజిల్ చోరీ చేస్తున్న సమయంలో ప్రధాన నిందితులను పట్టుకున్నారు. అనంతరం దొంగిలించిన డీజిల్ కొనుగోలు చేసేందుకు వచ్చిన మరికొందరిని కూడా అదుపులోకి తీసుకున్నారు.అయితే, డీజిల్ దొంగతనం, విక్రయం, కొనుగోలులో భాగమైన మొత్తం 41 మందిని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ముఠా ఉపయోగించిన 38 ట్రక్కులు, బస్సులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలు, ఆర్థిక నష్టాన్ని అరికట్టడంలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టినట్లు కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.ఇవీ చదవండి: లెబనాన్‌పై విరుచుకపడ్డ ఇజ్రాయెల్.. 11 మంది మృతి -
పౌరసత్వం రద్దయిన వారికి కువైట్ గుడ్‌న్యూస్
కువైట్ సిటీ: కువైట్‌లో పౌరసత్వాన్ని కోల్పోయిన వారికి దేశంలో కొనసాగేందుకు కొత్త నివాస అనుమతి నిబంధనను తీసుకురావడానికి ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీంతో పౌరసత్వం రద్దు చేసినా లేదా వెనక్కి తీసుకున్నా, కొన్ని షరతులతో గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కువైట్‌లో నివసించేందుకు అనుమతి లభించనుంది.పౌరసత్వం కోల్పోయిన తర్వాత తమ పాత విదేశీ పౌరసత్వాన్ని తిరిగి పొందిన వారు లేదా మరో దేశ పౌరసత్వం పొందిన వారు ఈ కొత్త నిబంధన కింద సాధారణ నివాస అనుమతికి అర్హులవుతారు. అయితే ఈ అనుమతి గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి మాత్రమే ఉండనుందని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది.అయితే, నివాస అనుమతి మంజూరు చేయడం, దాన్ని పునరుద్ధరించడం వంటి అంశాలకు సంబంధించిన నిబంధనలు, నియంత్రణలను రెసిడెన్సీ అఫైర్స్ విభాగం డైరెక్టర్ జనరల్ నిర్ణయించనున్నారు. ఈ నిబంధనల ప్రకారం నివాస అనుమతి పొందిన వారు కువైట్‌లో ఉద్యోగం చేసేందుకు పాటించాల్సిన నిబంధనలను కూడా అధికారులు నిర్ణయించనున్నారు.అలాగే, సవరించిన నిబంధనలను అధికారిక గెజిట్‌లో ప్రచురించిన తర్వాత ఈ కొత్త విధానం అమల్లోకి రానుంది. దీంతో పౌరసత్వం కోల్పోయినప్పటికీ ఇతర దేశ పౌరసత్వం పొందిన వారికి కువైట్‌లో చట్టబద్ధంగా నివసించే అవకాశం లభించనుంది.ఇవి కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం! -
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బహ్రెయిన్-సౌదీ మధ్య కొత్త సౌకర్యం!
మనామా: బహ్రెయిన్ నుంచి సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు కొత్త రవాణా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. కింగ్ ఫహద్ కాజ్వే మీదుగా లైసెన్స్ పొందిన ట్యాక్సీలు నేరుగా ఇరు దేశాల మధ్య రాకపోకలు సాగించేందుకు అనుమతి లభించింది. కొత్త నిబంధనల ప్రకారం ఈ సేవలు తాజాగా అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.బహ్రెయిన్, సౌదీ అరేబియా రవాణా అధికారులు పరస్పర సమన్వయంతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు దేశాల పౌరులు, నివాసితులు, పర్యాటకులు ఇకపై సొంత వాహనాలపై ఆధారపడకుండా ట్యాక్సీల ద్వారా నేరుగా ప్రయాణించే అవకాశం ఏర్పడింది. అలాగే, రెండు దేశాల మధ్య రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని అధికారులు భావిస్తున్నారు.అయితే కాజ్వే మీదుగా నడిచే ట్యాక్సీలకు కొన్ని నిబంధనలు విధించారు. నిర్దేశించిన సాంకేతిక, భద్రత, నాణ్యత ప్రమాణాలను పాటించే లైసెన్స్ పొందిన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ట్యాక్సీ వాహనం ఐదేళ్లకు మించి పాతది కాకూడదనే నిబంధన కూడా ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే, కొత్త సేవలు అందుబాటులోకి రావడంతో కింగ్ ఫహద్ కాజ్‌వేపై ప్రయాణికుల రాకపోకలు మరింత సౌకర్యవంతంగా మారే అవకాశం ఉంది. దీంతో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతో పాటు ప్రయాణ సమయం, ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు భావిస్తున్నాయి.ఇరు దేశాల మధ్య ట్యాక్సీ రాకపోకలు పెరగడం వల్ల వాణిజ్యం, రిటైల్ వ్యాపారం, పర్యాటకం, ఎగ్జిబిషన్ రంగాలకు కూడా ప్రయోజనం కలిగే అవకాశం ఉందని బహ్రెయిన్ వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముఖ్యంగా సొంత వాహనం లేని వారు బహ్రెయిన్ నుంచి సౌదీకి, అక్కడి నుంచి తిరిగి బహ్రెయిన్‌కు సులభంగా ప్రయాణించేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. -
జయ పీసపాటి గౌరవార్థం సింగపూర్‌లో ఆత్మీయ సమ్మేళనం
సింగపూర్: హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి సింగపూర్ పర్యటన సందర్భంగా, శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం ఆదివారం సింగపూర్‌లో ఘనంగా జరిగింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది.సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరైనారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ, హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు, గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.మహిళలు మీడియా సహా వివిధ రంగాల్లో మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలవగలరని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఆదివారం కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. సింగపూర్, హాంగ్ కాంగ్ తెలుగు సంస్థల మధ్య ఇప్పటికే ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు.సింగపూర్‌తో 2016 నుంచే ప్రత్యేక అనుబంధంహాంగ్ కాంగ్లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న తనకు విదేశాల్లో జరిగిన తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటి తరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు.మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.తమకు ఆత్మీయ‘జయక్క’గా మారిన“జయ పీసపాటి ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ అభినందనలు తెలిపారు. హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలుఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు. -
మిస్సిసాగాలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
మిస్సిసాగా: కెనడాలోని మిస్సిసాగా నగరంలో శనివారం(సెప్టెంబర్ 5వ తేదీ) సాయంత్రం 6 గంటలకు వైఎస్సార్సీపీ కెనడా విభాగం ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజా సేవ, సంక్షేమ పథకాలు, నాయకత్వ పటిమ, ప్రజల పట్ల ఆయన చూపిన నిబద్ధతను నేతలు, కార్యకర్తలు ఘనంగా స్మరించుకున్నారు.ఈ కార్యక్రమం వైఎస్సార్సీపీ కెనడా అడ్వైజర్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి మార్గదర్శకత్వంలో, వైఎస్సార్సీపీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు గారి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించబడింది.కార్యక్రమ నిర్వాహకులు (వైఎస్సార్సీపీ కెనడా టీమ్):* సుబ్బారావు – వైఎస్సార్సీపీ కెనడా కో-కన్వీనర్* నూర్ గారు – వైఎస్సార్సీపీ కెనడా యూత్ వింగ్ కన్వీనర్ముఖ్య అతిథులు మరియు వక్తలుచల్లా మధుసూదన్ రెడ్డి గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ) – జూమ్ ద్వారా హాజరయ్యారుపాండుగాయల రత్నాకర్ గారు (మాజీ వైఎస్సార్సీపీ యూఎస్ఏ/ఎన్ఆర్ఐ కన్వీనర్, ఏపీ ప్రభుత్వ మాజీ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధి) – జూమ్ ద్వారా హాజరయ్యారు. డాక్టర్ ప్రదీప్ చింత గారు (వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి - ఎన్ఆర్ఐ వ్యవహారాలు) – జూమ్ ద్వారా హాజరయ్యారు. కొండం వెంకట్ రెడ్డి గారు (కెనడా కమ్యూనిటీ నాయకులు) – ప్రత్యక్షంగా పాల్గొని ప్రసంగించారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దూరదృష్టి, పేదలు, సామాన్య ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి, ప్రజాసేవలో ఆయన చూపిన అంకితభావాన్ని కొనియాడారు.ఎగ్జిక్యూషన్ టీమ్: కార్యక్రమ నిర్వహణ, వేదిక ఏర్పాట్లు, సమన్వయంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు: అస్లాం, సుమంత్, యశ్వంత్ నిమ్మకాయల, గోపిరెడ్డి కృష్ణారెడ్డి, పురుషోత్తం రెడ్డి, కృష్ణ, ఆరిఫ్, డాక్టర్ నిరంజన్ చుక్కలూరు, సుబ్బారెడ్డి దుగంపూడి, శ్రీనివాస్ కొరపోరలు.అడ్వైజర్ కమిటీ: కార్యక్రమానికి విలువైన మార్గదర్శకత్వం అందించిన సలహాదారుల కమిటీ సభ్యులు:* కృష్ణారెడ్డి పసల* రాజగోపాల్ గుంటక* విశ్వనాథ్ రెడ్డి* విజయభాస్కర్ రెడ్డి* కృష్ణ ఆలంపాటి* డాక్టర్ శివ రెడ్డిఈ కార్యక్రమంలో మిస్సిసాగాతో పాటు పరిసర ప్రాంతాల నుండి వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో చురుకైన పాత్ర పోషించిన కోర్ కమిటీ సభ్యులందరికీ, ఎగ్జిక్యూషన్ టీమ్‌కు, అడ్వైజర్ కమిటీ సభ్యులకు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
గల్ఫ్ దేశాల్లో వైఎస్సార్‌కు ఘన నివాళి
కడప: ఎడారి దేశాలైన కువైట్, దుబాయ్, ఖతార్, బహరైన్, సౌదీ అరేబియా, జుబైల్, ఒమన్ (మస్కట్)లలో దివంగత సీఎం డా. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్సార్ చేసిన సేవలను కొనియాడారు. కువైట్‌లో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో మాలియా ప్రాంతంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాలిరెడ్డి మాట్లాడుతూ.. భూమి, ఆకాశం.. సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు ప్రజల హృదయాల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సౌదీఅరేబియాలోని జుబైల్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ అభిమానులుదుబాయ్ (యూఏఈ)లోని సోనాపూర్‌లో గల్ఫ్ కో–కన్వీనర్ మహమ్మద్ జిలాన్ బాషా ఆధ్వర్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త సుధాకర్‌రెడ్డి, ప్రసన్న సోమిరెడ్డిల సమక్షంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలుచేసిన ఘనత వైఎస్సార్‌దేనని కొనియాడారు.ఖతార్ దేశంలో పితాని శ్రీను విల్లాలో వైఎస్సార్ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఖతార్ కన్వీనర్ జాఫర్ హుస్సేన్ గల్ఫ్ కో–కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇక బహరైన్‌లోని అంబేడ్కర్ క్లబ్లో వైఎస్సార్సీపీ కన్వీనర్ ఓర్సు నాగరాజు, బహరైన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం వైఎస్సార్ కృషిచేశారని తెలిపారు.దుబాయ్‌లో వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు సౌదీ అరేబియా (జుబైల్)లో కూడా వైఎస్సార్ వర్థంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ కన్వీనర్ షేక్ ఇలాహి నివాళులు అర్పించారు.ఒమన్ (మస్కట్)లో వైఎస్సార్సీపీ కన్వీనర్ భాస్కర్.. ఒమన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహానేత వర్థంతిని నిర్వహించారు. వైఎస్సార్ చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. -
జోహన్నెస్‌బర్గ్‌లో వైఎస్సార్ వర్ధంతి.. ప్రత్యేక సేవా కార్యక్రమం
జోహన్నెస్‌బర్గ్: మహానేత, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో సేవా కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్‌రెడ్డి పెట్లూరు ఆధ్వర్యంలో ఈడెన్వేల్లోని ‘ది లిటిల్ ఈడెన్’లో కార్యక్రమం జరిగింది. ప్రత్యేక అవసరాలు కలిగిన వారి సంక్షేమం, సహాయార్థం నిర్వహించిన ఈ సేవా కార్యక్రమంలో పలువురు పాల్గొని తమ వంతు సహాయాన్ని అందించారు. సేవా భావం, మానవత్వం, సమాజం పట్ల బాధ్యతను చాటేలా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించి, స్వయంగా పాల్గొని విజయవంతం చేసిన నరసింహరెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బసిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్‌రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్‌రెడ్డి ఏనుముల, హరీష్ గోరంట్ల, శ్రావణి పెట్లూరు, కరుణా బసిరెడ్డి, సుమన్ చిట్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్ రాజశేఖరరెడ్డి సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో విస్తృతంగా చాటిచెప్పడంతో పాటు ఆయన ఆశయాలను భావితరాలకు అందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు. -
NRI: తెలుగు భాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలి..
డాలస్, టెక్సస్: తానా ప్రపంచ సాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమంలో భాగంగా 95వ అంతర్జాల సమావేశం ‘తెలుగే మన వెలుగు’ అనే అంశంపై నిర్వహించారు. వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధిపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. తెలుగు భాష పరిరక్షణ, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలో సలహా కమిటీ ఏర్పాటు చేసి భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని తెలిపారు. తెలుగు భాషకు విశేష సేవలందించిన ప్రముఖుల జ్ఞాపకాలను భావితరాలకు అందించేందుకు విగ్రహాలు, స్మారక చిహ్నాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ఆంగ్ల భాష ప్రాధాన్యతను గుర్తిస్తూనే మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వ పరిపాలనలో తెలుగును విస్తృతంగా ఉపయోగించాలని, ఆంగ్లంలో వెలువడే ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే తెలుగులోకి అనువదించాలని సూచించారు. కనీసం ఐదో తరగతి వరకు మాతృభాషలో విద్యాబోధన జరిగితే పిల్లలకు భాషపై మంచి పట్టు ఏర్పడుతుందని అన్నారు.ఆచార్య శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ.. ఇతర భాషల పదాలను సులభంగా తనలో కలుపుకునే ప్రత్యేకత తెలుగు భాషకు ఉందన్నారు. తెలుగు భాష వైభవాన్ని అనేక మంది ప్రముఖులు ప్రశంసించారని, భాషను విస్తరించడంలో నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ సంచాలకులు రేగుళ్ల మల్లికార్జునరావు మాట్లాడుతూ.. తెలుగు భాష, సంస్కృతుల అభివృద్ధికి కృషి చేస్తున్న వారికి ప్రతి సంవత్సరం తెలుగు భాషా, కళారత్న పురస్కారాలు అందిస్తున్నామని తెలిపారు. గిడుగు రామమూర్తి మునిమనుమరాలు గిడుగు లక్ష్మీకాంతికృష్ణ మాట్లాడుతూ తన ముత్తాత ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని గ్రాంథిక భాష స్థానంలో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం తీసుకొచ్చారని గుర్తుచేశారు.ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సంచాలకులు మాడభూషి సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినప్పటికీ కేంద్రం నుంచి తగిన నిధులు సాధించడంలో మరింత కృషి అవసరమన్నారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య కార్యదర్శి గుంటుపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పిల్లలకు తెలుగు నేర్పేందుకు ఆధునిక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. కేవలం మార్కులకే పరిమితం కాకుండా విద్యార్థులకు భాష ఎంతవరకు అర్థమవుతోందో చూడాలని అన్నారు.సీనియర్ జర్నలిస్ట్ రమేశ్ కందుల మాట్లాడుతూ.. కాలానుగుణంగా తెలుగు భాషలో మార్పులు వస్తున్నాయని, అందరూ కలిసి భాషకు పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులకు, విజయవంతం చేసేందుకు సహకరించిన వారందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.ఇవి కూడా చదవండి: అమెరికాలో ఘనంగా మనబడి తెలుగుకు పరుగు రన్4తెలుగు 2026 -
90 ఏళ్ల వయసులో మాతృదేశానికి పయనం.. డాలస్‌లో ఘన సత్కారం!
డాలస్, టెక్సస్: అనేక దశాబ్దాలుగా పార్క్‌ల్యాండ్ హాస్పిటల్, డాలస్ కౌంటీ ఫ్యామిలీ కోర్ట్ సర్వీసెస్, డాలస్ కౌంటీ చైల్డ్ వెల్ఫేర్ తదితర సంస్థల ద్వారా ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, బాలల సంక్షేమం, కుటుంబ న్యాయస్థాన సేవలు, గృహహింస, వృద్ధుల సంక్షేమం, డయాలసిస్ సేవలు వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో విశేష సేవలందించిన ప్రముఖ సామాజిక సేవకురాలు డా. భానుమతి ఇవటూరికి డాలస్‌లో ఘన సత్కారం లభించింది. 90 ఏళ్ల వయస్సులో అమెరికాలో 50 సంవత్సరాలకు పైగా జీవితం గడిపిన ఆమె ఇకపై మాతృదేశంలో జీవించేందుకు పయనమవుతున్న సందర్భంగా ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (IANT) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, షబ్నం మాడ్గిల్, తైయాబ్ కుండావాల, సుష్మా మల్హోత్రా, సత్యన్ కళ్యాణ్ దుర్గ్; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సస్ (TANTEX) అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, శ్రీధర్ కోడెల, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు, రామకృష్ణ నూనె; అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఉత్తరాధ్యక్షులు సతీష్ రెడ్డి; నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ (NATS) పూర్వాధ్యక్షులు బాపు నూతి; తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) పూర్వాధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర, TANA బోర్డు పూర్వ కార్యదర్శి మురళి వెన్నం; కమ్యూనిటీ నాయకులు ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, డా. జగదీశ్వరన్ పుడూర్ తదితరులు డా. భానుమతి ఇవటూరిని జీవిత సాఫల్య పురస్కారంతో ఘనంగా సన్మానించారు.సభాధ్యక్షత వహించిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “సమస్యకు–పరిష్కారానికి మధ్య, వివాదానికి–అవగాహనకు మధ్య, గందరగోళానికి–స్పష్టతకు మధ్య, నిరాశకు–ఆశకు మధ్య డా. భానుమతి ఒక వెలుగుదారిగా నిలిచారు. అమెరికాలో కొత్త జీవితాన్ని నిర్మించుకోవడం అంత సులభమైన విషయం కాదు. తల్లిదండ్రులు తమతో పాటు మాతృభూమి విలువలు, సంప్రదాయాలు, ఆశలు, ఆకాంక్షలను తీసుకువస్తారు. అయితే వారి పిల్లలు మాత్రం పూర్తిగా భిన్నమైన సాంస్కృతిక వాతావరణంలో పెరుగుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత, పిల్లలపై ఉన్న ఆశలు అపార్థాలకు, చివరకు కుటుంబ కలహాలకు దారితీస్తాయి. ఈ సమస్యను ఎంతో లోతుగా అర్థం చేసుకున్న భానుమతి.. తల్లిదండ్రుల ఆశలు, అంచనాల కారణంగా పిల్లలనే దూరం చేసుకునే పరిస్థితి రాకూడదని చెబుతారు” అన్నారు.“జీవితంలో విజయం అంటే కేవలం డిగ్రీలు, పదవులు, బిరుదులు కాదు. మన వల్ల ఎన్ని కుటుంబాలకు సహాయం అందింది, ఎంతమంది జీవితాలు మెరుగుపడ్డాయి అనేదే నిజమైన విజయానికి కొలమానం. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డా. భానుమతి ఇవటూరి జీవితం. 50 సంవత్సరాలకు పైగా అమెరికాలో జీవితం గడిపి, తొమ్మిది పదులు దాటిన వయస్సులో మాతృదేశంలో తన భవిష్యత్ జీవితాన్ని గడపాలనుకోవడం హర్షనీయమైన విషయం. ఆమె మిగిలిన జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపాలని అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని డా. ప్రసాద్ తోటకూర అన్నారు.వివిధ సందర్భాల్లో డా. భానుమతి ఇవటూరితో సన్నిహితంగా పనిచేసిన ఎం.వి.ఎల్. ప్రసాద్, రావు కల్వల, సత్యన్ కళ్యాణ్ దుర్గ్, డా. కృష్ణబాబు చుండూరి, డా. కిశోర్ సుంకర, రాధికా కోడెల, రామకృష్ణ నూనె, డోరిస్ మార్షల్, స్యూ యాన్ రూత్, అవ్యం రమణి తదితరులు భానుమతి సామాజిక సేవలను కొనియాడారు.డా. భానుమతి ఇవటూరి మాట్లాడుతూ.. “అతి తక్కువ సమయంలో, వారాంతం కానప్పటికీ, ఇర్వింగ్‌లోని మైత్రీ ఇండియన్ రెస్టారెంట్లో నిర్వహించిన ఈ ఆత్మీయ సమావేశానికి దాదాపు వంద మందికి పైగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజు నా జీవితంలో ఒక మధురమైన రోజుగా మిగిలిపోతుంది. నా సుదీర్ఘ సామాజిక సేవా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు” అని అన్నారు.ఇవీ చదవండి: 8 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక! -
అమెరికాలో తెలుగు యువతి కేసులో కీలక పరిణామం
అమెరికా తెలుగు యువతి నిఖిత గోదిశాల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ ప్రియురాలి హత్య కేసులో సాప్ట్వేర్ ఇంజనీర్ అర్జున్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగ్రాలోని ఓ అపార్ట్మెంట్లో దాక్కున్న అర్జున్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు ఆధారంగా అర్జున్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసుల సహకారంతో శంకర్ గ్రీన్ రెసిడెన్షియల్ సొసైటీలో అరెస్ట్ చేశారు.అమెరికా-భారత్ నేరస్తుల అప్పగింత ఒప్పందం కింద తదుపరి చర్యలు చేపట్టనున్నారు. 2025 డిసెంబర్ 31న డబ్బు తిరిగి ఇస్తానంటూ నిఖితను పిలిచి హత్య చేశాడు. ఆర్థిక వివాదమే హత్యకు కారణమని అమెరికా అధికారులు చెబుతున్నారు. అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో నివసించే నిఖిత జనవరి 2న కనిపించకుండా పోయింది. ఆ తర్వాత మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న ఆమె మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ అపార్ట్మెంట్లోనే ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నిఖిత శరీరంపై కత్తిపోట్ల గాయాలు ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు. నిఖిత నుంచి డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేశాడనే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు ఏప్రిల్‌లో తెలంగాణలో అర్జున్‌పై మోసం కేసు నమోదైంది.దర్యాప్తులో భాగంగా కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఆగ్రాకు పంపించాం. అక్కడ ఓ ఫ్లాట్‌లో అర్జున్ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాం. మోసం కేసుకు సంబంధించి అతడికి నోటీసులు జారీ చేశాం. అదే సమయంలో అమెరికాలో అతడిపై కేసు ఉండటంతోపాటు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్‌లో ఉన్న విషయం గుర్తించాం. దీంతో కేంద్ర అధికారులకు సమాచారం అందించాం’’ అని హైదరాబాద్ పోలీసు అధికారి తెలిపారు. అర్జున్ను న్యూఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి రిమాండ్ విధించింది. నిఖిత గత నాలుగేళ్లు అమెరికాలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేసింది. -
8 ఏళ్లకే చెస్‌లో సంచలనం.. 9/9 గెలిచిన తెలుగు బాలిక!
కొలంబియాలోని మెడెలిన్‌లో ఈ ఏడాది జరిగిన క్లాసికల్ చెస్ పాన్-అమెరికన్ పోటీలో టీమ్ యూఎస్ఏ తరఫున స్వర్ణ పతకం గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలిగా 8 ఏళ్ల సరయు తలపనేని నిలిచింది. వారం రోజుల పాటు జరిగిన ఈ టోర్నమెంట్లో కఠినమైన 9 రౌండ్లను ఎదుర్కొన్న ఆమె.. ఉత్తర, దక్షిణ, మధ్య అమెరికాలోని ఏడు దేశాలకు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారులను ఓడించింది. తన విభాగంలో అరుదైన 9/9 పర్ఫెక్ట్ స్కోర్‌తో కాంటినెంటల్ ఛాంపియన్‌గా నిలిచింది.ప్రపంచకప్‌కు దక్కిన అవకాశంఈ విజయంతో ఈ ఏడాది చివర్లో జరిగే యూత్ చెస్ ప్రపంచకప్‌లో అమెరికాస్ (రెండు ఖండాలు) తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. అంతేకాకుండా అధికారిక WCM (విమెన్ కాండిడేట్ మాస్టర్) FIDE టైటిల్‌ను తాత్కాలికంగా పొందిన అతి పిన్న వయస్కుల్లో ఒకరిగా సరయు నిలిచింది.డల్లాస్‌లో ఘన స్వాగతంటోర్నమెంట్ అనంతరం డల్లాస్‌కు తిరిగి వచ్చిన సరయుకు విమానాశ్రయంలో కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఫాక్స్ 4 న్యూస్‌తో పాటు ఇర్వింగ్, ఫ్రిస్కో నగరాల మేయర్ల వంటి స్థానిక నాయకులు కూడా ఆమెను అభినందించారు. తన అభిమాన క్రీడాకారిణుల్లో ఒకరైన కరిస్సా యిప్ (నాలుగుసార్లు జాతీయ యూఎస్ మహిళల చెస్ ఛాంపియన్), అలాగే సాగర్ షా నుంచి వచ్చిన అభినందన సందేశాలతో సరయు ప్రత్యేకంగా ఆనందించింది. గత అక్టోబర్‌లో జరిగిన చెక్‌మేట్ కార్యక్రమంలో ఆమె వారిద్దరినీ కలిసింది.ఐదేళ్ల వయసులోనే చెస్‌తో పరిచయంసరయు ఐదేళ్ల వయసులో కాపెల్ చెస్ క్లబ్లో గ్రూప్ క్లాసులకు హాజరవడం ప్రారంభించింది. అప్పట్లో చెస్ ఆమెకు కూచిపూడి, పియానో, ఆర్ట్, జిమ్నాస్టిక్స్ వంటి మరో సరదా కార్యకలాపం మాత్రమే. అయితే ఓ స్థానిక చెస్ టోర్నమెంట్లో ఆమె ప్రతిభను గమనించిన అనిల్ గుట్ల.. సరయు తల్లి శ్రీలక్ష్మికి ఆమెకు మంచి సామర్థ్యం ఉందని, ప్రత్యేక వ్యక్తిగత కోచ్ అవసరమని సూచించారు.దీంతో శ్రీలక్ష్మి పరిశోధించి యూటీ డల్లాస్‌లో చెస్ స్కాలర్‌షిప్‌పై చదువుతున్న భారతీయ అంతర్జాతీయ మాస్టర్ సక్షం రౌటెలాను సంప్రదించారు. సరయు ప్రతిభను పరిశీలించిన ఆయన.. ఏకాగ్రతతో శిక్షణ ఇస్తే ఆమె అత్యున్నత స్థాయికి వెళ్లగలదని చెప్పారు.కొంతకాలం ఇతర కోచింగ్ ఎంపికలను ప్రయత్నించిన తర్వాత.. సరయుకు మరింత అంకితభావం, నైపుణ్యం ఉన్న కోచ్ అవసరమని తల్లిదండ్రులు గుర్తించారు. గత వేసవిలో సక్షం సూచనతో ఆమె ప్రస్తుత కోచ్ వద్ద శిక్షణ ప్రారంభించింది. ఆయన కూడా అంతర్జాతీయ మాస్టరే. అమెరికా వెలుపల జరిగిన సరయు తొలి అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లోనే ఆమెను అజేయ శక్తిగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.టాప్ ర్యాంక్‌లో సరయుపాఠశాల తర్వాత గంటసేపు చెస్ శిక్షణ తీసుకోవడం, వారాంతాల్లో టోర్నమెంట్లలో పాల్గొనడం ఆమె దినచర్యగా మారింది. డీఎఫ్‌డబ్ల్యూ ప్రాంతంతో పాటు టెక్సాస్, ఇతర ప్రాంతాల్లో జరిగిన టోర్నమెంట్ల ద్వారా అనుభవం సంపాదిస్తూ అంతర్జాతీయ స్థాయిలో అవసరమైన ఓర్పును పెంచుకుంది. డిసెంబర్ 2025 నాటికి అమెరికాలో 7 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్న బాలికల టాప్ 100 జాబితాలో నెం.1 ర్యాంక్ సాధించింది. జనవరి నుంచి ఏప్రిల్ 2026 వరకు అండర్-8 విభాగానికి అర్హత ఉన్న బాలికల్లో FIDE రేటింగ్ ప్రకారం ప్రపంచంలోనే నెం.1 స్థానంలో నిలిచింది.చదువుతో పాటు చెస్ శిక్షణప్రపంచవ్యాప్తంగా సరయు వయసున్న పలువురు అగ్రశ్రేణి యువ క్రీడాకారులు పూర్తి సమయం చెస్‌లో శిక్షణ పొందుతున్నప్పటికీ.. ఆమె మాత్రం తన స్నేహితుల్లాగే గ్రేట్ హార్ట్స్‌లో 3వ తరగతి చదువుతోంది. ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి, ఆ తర్వాత చెస్ శిక్షణ తీసుకుంటోంది. చెస్‌పై దృష్టి పెట్టేందుకు గత ఏడాది కూచిపూడి తరగతులకు విరామం ఇచ్చింది. అయితే వారానికి ఒకసారి పియానో తరగతులకు హాజరవుతూ.. ఇటీవల వేసవి సెలవుల్లో తైక్వాండో శిక్షణ కూడా ప్రారంభించింది.అయితే, సరయు తండ్రి హైదరాబాద్‌కు చెందినవారు కాగా.. తల్లి గన్నవరానికి చెందినవారు. అలాగే, సరయు ప్రతిభను ప్రోత్సహిస్తూ, ఆమెకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, కోచ్‌లకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఇవి కూడా చదవండి: స్టిక్కీ నోట్‌తో గిన్నిస్ రికార్డు -
అమెరికాలో తెలంగాణ యువకుల దుర్మరణం
ఎన్నారై న్యూస్: అమెరికా స్టేట్ ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వాళ్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్లని సమాచారం. మృతుల్లో ఓ యువకుడు నిజామాబాద్ వాసిగా నిర్ధారణ అయ్యింది. మిగతా ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.ఫ్లోరిడా హైవే పెట్రోల్ అందించిన సమాచారం ప్రకారం.. తెల్లవారుజామున వాళ్లు ప్రయాణిస్తున్న కారు ఓ చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తోంది. ప్రమాదం గురించి కుటుంబ సభ్యులకు అక్కడి అధికారులు సమాచారం చేరవేశారు.నిజామాబాద్ జిల్లాకు చెందిన రాహుల్.. మూడు నెలల కిందట ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. ప్రమాదంలో అతనూ మరణించినట్లు తల్లిదండ్రులకు సమాచారం అందింది. ఈ వార్తతో ముగ్గురి స్వస్థలాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాల్ని స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదీ చదవండి: నేపాల్‌లో ప్రకృతి విలయ తాండవం -
ప్రేయసి దూరమైందని అమెరికాలో ఆత్మహత్య..!
హైదరాబాద్: చదువుకునేందుకు అమెరికా వెళ్లిన ఓ యువకుడు ప్రేమించిన యువతి దూరం కావడంతో ఆ బాధ తట్టుకోలేక ఈనెల 21న ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి కుటుంబసభ్యులు, సన్నిహితులు తెలిపిన మేరకు.. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్‌నగర్ కాలనీకి చెందిన కృష్ణ, విజయలక్ష్మి దంపతుల కుమారుడు సాయిప్రదీప్(29) 2024లో మాస్టర్స్ చదువు కోసం అమెరికా వెళ్లారు. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో తన అన్న ప్రణీత్‌తో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుండి మూడు నెలల క్రితం మాస్టర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు. అమెరికాలో ఉంటున్న సిద్ధిపేటకు చెందిన యువతిని ప్రదీప్ 9 నెలల పాటు ప్రేమించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సాయి ప్రదీప్ తన తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. ముందు తల్లిదండ్రులు అంగీకరించకపోయినా చివరకు ఒప్పుకున్నారు. ఇంతలోనే ప్రేమించిన యువతి దూరంగా ఉంటోంది. సున్నిత మనస్తత్వం కలిగిన ప్రదీప్ ఇది తట్టుకోలేక మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఈ క్రమంలో ఈ నెల 21న ప్రేయసికి దాదాపు పది సార్లు ఫోన్ చేసినా స్పందించలేదు. తను చేస్తున్న జాబ్ బాధ్యతలను రెండు గంటల పాటు నిర్వర్తించాలని అన్నకు అప్పగించారు. ఆ తరువాత ఇంటికి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు ప్రణీత్ తెలిపారు. ప్రేయసి దూరం కావడంతోనే తమ్ముడు ప్రదీప్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్య చేసుకున్నాడని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో పోలీసులకు ప్రణీత్ ఫిర్యాదు చేశారని మృతుని తండ్రి కృష్ణ తెలిపారు. మృతదేహాన్ని ఈ నెలాఖరులోపు తెప్పించేందుకు ప్రయతి్నస్తున్నారు. ఇదిఆ ఉండగా ప్రదీప్‌కు చిన్నతనంలోనే కిడ్నీ సమస్య ఉండటంతో ఒక కిడ్నీని వైద్యులు తొలగించారు. సాయిప్రదీప్ తల్లిదండ్రులను కాంగ్రెస్ పార్టీ దమ్మాయిగూడ డివిజన్ అధ్యక్షుడు రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నేత హరిగౌడ్ తదితరులు పరామర్శించి ధైర్యం చెప్పారు. -
వేటూరి గీతాల వెల్లువ.. డాలస్‌లో సాహితీ మహోత్సవం!
డాలస్, టెక్సస్: ‘వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా’, ‘శుభం ఫౌండేషన్’ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ప్రిస్కో మెమోరియల్ హైస్కూల్ ఆడిటోరియంలో ‘కవికులాలంకార’ వేటూరి సుందర రామమూర్తి విరచిత 8 సినీ, సినీయేతర గీత సంపుటాల ఆవిష్కరణ, వేటూరి ప్రత్యేక పాటల నృత్యం, సంగీత విభావరి 500 మందికి పైగా హాజరైన సంగీతం, సాహిత్యాభిమానుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగువేదకవి, ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ సాహిత్య సంపుటాలను ఆవిష్కరించి, తొలి గ్రంథాన్ని విశిష్ట అతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకుడు ఎం. నాగేశ్వరరావుకు, ఆ తర్వాత ప్రత్యేక అతిథులుగా హాజరైన వామరాజు సత్యమూర్తికి, డా. కొమాండూరి రామాచారికి అందజేశారు.వేటూరి సాహిత్యాభిమానసమితి ఆఫ్ అమెరికా వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గోపాల్ పోణంగి ఆధ్వర్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ కార్యక్రమంలో ఈ సాహిత్య సంపుటాలను ప్రచురించడానికి సహాయ సహకారాలు అందించిన వారిలో హాజరైన డా. బుచ్చిబాబు పైడిపాటి, చంద్రహాస్ మద్దుకూరి, చంద్రశేఖర్ రెంటచింతల, గోకుల్ కిలారు, ప్రొఫెసర్ జగదీశ్వరన్ పుడూర్, మురళి వెన్నం, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రామకృష్ణ పొక్కునూరి, రావు కల్వల, డా. సుబ్రహ్మణ్యం బోయారెడ్డి, విజయసారధి జీడిగుంట, వినోద్ ఉప్పులను ఘనంగా సత్కరించారు.వేటూరితో సుదీర్ఘకాలం సాహిత్య ప్రయాణం చేసిన ప్రముఖ సినీగీత రచయిత, దర్శకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుతో డా. ప్రసాద్ తోటకూర నిర్వహించిన ముఖాముఖీ కార్యక్రమంలో పాత్రికేయుడిగా ఉన్న వేటూరి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఒత్తిడిమేరకు అయిష్టంగా రచయితగా సినీరంగ ప్రవేశం చేయడం, ఆ తర్వాత సినీ పరిశ్రమలో ఒక ముఖ్యభాగం అవడం, కవిపండితుడిగా వేటూరి కవితావైభవం, ఆయన కలం నుంచి అప్రయత్నంగా వేగంగా వెలువడే గీతాల వెల్లువ, ఆయన వ్యక్తిత్వం, అందరినీ గౌరవించే తత్వం ఆయనకున్న తెలుగు భాషాభిమానం గురించి మాట్లాడారు. అలాగే, పాత్రికేయుడిగా, సంపాదకుడిగా ఆయన రచనాశైలి, కేవలం వేలకొద్దీ సినిమా గీతాలేగాక ఎన్నో విలువైన వ్యాసాలు, ‘జీవనరాగం’, ‘రాబిన్ హుడ్’, ‘సిరికాకొలను చిన్నది’, ‘కొమ్మ కొమ్మకో సన్నాయి’ లాంటి విశిష్ట రచనలు, వేటూరి జీవితంలో జరిగిన కొన్ని హాస్య సంఘటనలు ఇంకా వివిధ అంశాలపై వీరి మధ్య దాదాపు గంటసేపు సాగిన చర్చా కార్యక్రమం ఆద్యంతం నవ్వులు పూయించి మంచి ప్రేక్షకాదరణ పొందింది.ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “వేటూరి రాసిన పాటలలో గొప్ప పాటలు ఏవి? అని చాట్ జీపీటీని అడిగితే - ఆయన రాసిన వేలాది పాటలలో కొన్ని గొప్ప పాటలను ఎంపిక చేయడం కష్టం అనే సమాధానం వచ్చింది. దాన్నిబట్టి వేటూరి ప్రతిభ ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు” అన్నారు. 18 సంవత్సరాల పాటు పాత్రికేయుడిగా పనిచేసిన వేటూరిని ఈనాడు జర్నలిజం స్కూల్‌కు ఆహ్వానించి అక్కడి విద్యార్థులతో మాట్లాడించే అవకాశం కలిగిందని, ఆయన జ్ఞాపకశక్తి అమోఘమని, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను ఇంటర్వ్యూ చేసిన తొలి తెలుగు జర్నలిస్ట్ వేటూరి అని, ప్రేమ, విరహం, భక్తి, తాత్వికత, శృంగారం, వేదన, ప్రకృతి, సామాజిక చైతన్యం ఇలా ఏ రకపు పాటనైనా అక్షరాలలో ఆవిష్కరించగల దిట్ట అని, “రాలిపోయే పువ్వా, నీకు రాగాలెందుకే” అనే పాటకు జాతీయ పురస్కారం అందుకున్న వేటూరి సాహిత్యం జ్ఞానపీఠ పురస్కారానికి నూటికి నూరు శాతం అర్హనీయమైనదన్నారు. వేటూరి పాటలు తెలుగుభాష ఉన్నంతవరకు చిరస్థాయిగా ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతాయి అంటూ ఘన నివాళులర్పించారు.ప్రత్యేక అతిథిగా హాజరైన వామరాజు సత్యమూర్తి మాట్లాడుతూ “డా. ప్రసాద్ తోటకూర నిర్వహణలో గత జనవరిలో హైదరాబాద్‌లో భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా కన్నుల పండుగగా జరిగిన ఈ గ్రంథాల ఆవిష్కరణ సభలోనూ, మరలా ఇప్పుడు ఇక్కడ డాలస్‌లో అత్యంత వైభవంగా జరిగిన సభలోనూ పాల్గొనడం తన అదృష్టం” అన్నారు.ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ సంగీతగురు డా. కొమండూరి రామాచారి వేటూరితో తనకున్న అనుబంధాన్ని, ఆయన గీత రచనా శైలిని ప్రశంసిస్తూ, కొన్ని పల్లవులను మధురంగా గానం చేసి వేటూరికి స్వరనీరాజనాలర్పించారు.ప్రముఖ గాయకుడు, సంగీతదర్శకుడు రాజశేఖర్ సూరిభొట్ల నిర్వహణలో సాగిన సంగీత విభావరిలో స్థానిక గాయనీ గాయకులు సంతోష్ ఖమ్మంఖర్, చంద్రహాస్ మద్దుకూరి, శిరీష కోటంరాజు, జానకి శంకర్, శ్రేయస్ సూరిభొట్ల, సాహితి కోటంరాజు పాడిన పాటలు అందరినీ అలరించాయి. రాజశేఖర్ కీబోర్డ్‌పై, ముద్దు పాయ్ కీబోర్డు, గిటార్‌పై, రాం యామిజాల, నీవ్ యామిజాల పెర్కషన్ వాయిద్యాలపై, సౌండ్ ఇంజనీర్‌గా రవి మాచ, రవి రావు భట్టిప్రోలు అందించిన సాంకేతిక సహకారం ఈ సంగీత విభావరికి మరింత శోభను చేకూర్చాయి.వేటూరి రాసిన అసంఖ్యాక అద్భుత గీతాలలో ఒక పద్నాలుగు పాటలను ఈ సంగీత విభావరిలో గానం చేశారు. వాటిలో “ఓం నమః శివాయ” (సాగర సంగమం) అనే గీతానికి గురు పరంపర స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ డైరెక్టర్ గురు మంజు హేమమాలిని చావ శిష్యులు దేవినేని వైడూర్య, సాహితి వేముల, సింధు వేముల, తేజశ్రీ అబ్బూరు అద్భుతంగా నృత్యం చేశారు.“జగతి సిగలో జాబిలమ్మకు” (పరదేశి) గీతానికి రాగ మయూరి స్కూల్ ఆఫ్ డాన్స్ అండ్ యోగా గురు సింధుజ ఘట్టమనేని శిష్యులు గ్రీష్మా అశోక్, నందిత దినేష్, సహస్ర తటవర్తి, రుషిక కాళ్ల చేసిన నృత్యం కనువిందు చేసింది.“నెమలికి నేర్పిన నడకలివి” (సప్తపది) అనే పాటకు నాట్యాంజలి కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీలత సూరి శిష్యులు ప్రియాంక పొత్తూరి, శ్రుతి పొత్తూరి, స్వప్నిక వడాలి, అంజిత నాయర్ నృత్యం అందరినీ ఆకట్టుకుంది.ఆ తర్వాత “మధుర మధురతర” (అర్జున్) అనే గీతానికి సాయి నృత్య అకాడమీ కూచిపూడి డాన్స్ స్కూల్ గురు శ్రీదేవి యడ్లపాటి శిష్యులు పల్లవి తూములూరు, సంజన కల్వకొలను నృత్యం అందరినీ అలరించింది.ఈ కార్యక్రమంలో ప్రత్యేకఅతిథులుగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్, ఫ్రిస్కో నగర మేయర్ మార్క్ హిల్, కౌన్సిల్ మెంబర్ యాన్ యాన్దర్సన్ను గోపాల్ పోణంగి, డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు. ఇదే కార్యక్రమంలో ఇటీవల కొలంబియా దేశంలో 8 సంవత్సరాల వయస్సులోపు పిల్లల కోసం జరిగిన చదరంగం పోటీలలో అమెరికా నుంచి పాల్గొని, పాన్ అమెరికన్ చాంపియన్‌గా నిలిచి బంగారు పతకం సాధించిన సరయు తలపనేనిని టెక్సాస్ రాష్ట్ర కాంగ్రెస్ మెంబర్ మాట్ షాహీన్ ఘనంగా సత్కరించి సరయు తల్లిదండ్రులు సందీప్, శ్రీలక్ష్మిని అభినందించారు.ఈ కార్యక్రమాన్ని మొత్తం ఎంసీలుగా అత్యంత ప్రతిభావంతంగా నిర్వహించిన అనీషా పోణంగి, అభినుత మద్దుకూరికి, కార్యక్రమ విజయానికి తోడ్పడిన శుభం ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులకు, కార్యకర్తలు కిశోర్ నారె, పావని నున్న, నాగరాజు నలజల, నేలకొండ రాజు, పద్మ ముప్పిడి, శాస్త్రి అనిపిండి, వివిధ ప్రసార మాధ్యమాలకు, స్కూల్ యాజమాన్యానికి గోపాల్ పోణంగి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
ఫిలిప్పీన్స్: ఇండియన్ ఎంబసీని సందర్శించిన ఎన్నారై అడ్వైజరీ కమిటీ
మనీలా: తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమం కోసం మెరుగైన వలస విధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం సభ్యులు బుధవారం ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. ఆ తర్వాత మనీలాలోని కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతోనూ కమిటీ సభ్యులు భేటీ అయ్యారు.ఈ సందర్భంగా ఉత్తమ వలస విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫిలిప్పీన్స్ దేశ వలస విధానాన్ని ఆ దేశ ఉన్నత అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కమిటీ సభ్యులకు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ వలస విధానాన్ని అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో అమలులో ఉన్న విధి విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి ఇదే తరహా మెరుగైన వలస విధానాన్ని గల్ఫ్ కార్మికుల కోసం అమలు చేసేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి వెల్లడించారు.ఫిలిప్పిన్స్ దేశ రాజధాని మనీలాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అంబసడర్ హర్ష కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్ లతో వలస కార్మికుల విధానాల అంశాలపై కమిటీ సభ్యులు సుధీర్ఘంగా చర్చించారు. గల్ఫ్ కార్మికులను సంక్షేమం కోసం ఫిలిప్పీన్స్ తరహా విధానాలను అమలు చేస్తామన్నరాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఎన్నారై అడ్వైజరి కమిటీ ఫిలిప్పీన్స్ దేశంలో పర్యటిస్తోంది.ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, నంగి దేవేందర్ రెడ్డి, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, శ్రీనివాస్ జునుగురు, లైజన్ ఆఫీసర్ ఆది కార్తీక్, తదితరులు ఈ బృందంలో ఉన్నారు. -
వైభవంగా సిలికానాంధ్ర మనబడి తెలుగు మాట్లాట అంతర్జాతీయ పోటీలు
అమెరికాలోని చార్లెట్ నగరంలో సిలికానాంధ్ర మనబడి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు మాట్లాట 2026 అంతర్జాతీయ పోటీలు హిల్టన్ చార్లెట్ ఎయిర్పోర్ట్ రిసార్ట్ ప్రాంగణంలో ఘనంగా జరిగాయి. పారుపూడి కిరణ్, తాళ్లూరి ప్రత్యూష, గొల్లపూడి సీతారామ్ నాయకత్వంలో జరిగిన ఈ పోటీల్లో అమెరికా, కెనడాలోని పలు ప్రాంతాల నుంచి 200 మందికి పైగా తెలుగు పిల్లలు పాల్గొన్నారు. దాదాపు 1000 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ప్రముఖ నటుడు, దర్శకుడు, సంగీత విద్వాంసుడు శ్రీ ప్రభల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.తెలుగు భాషా నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ పోటీల్లో పదరంగం (తెలుగు పదాలు వ్రాసే ఆట), తిరకాటం (తెలుగు ప్రశ్నోత్తరాల ఆట), ఒనిమా – ఒక్క నిమిషం మాత్రమే (తెలుగులో మాట్లాడే ఆట) అనే మూడు విభాగాల్లో బుడతలు (5–7), సిసింద్రీలు (8–11), చిరుతలు (12–16) వయోవర్గాల్లో పోటీలు జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో అమెరికా, కెనడాలోని పలు కేంద్రాల్లో జరిగిన ప్రాథమిక పోటీల్లో విజేతలైన పిల్లలు తమ కుటుంబాలతో కలిసి చార్లెట్‌కు చేరుకుని మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో వేడుకల్లో పాల్గొన్నారు.ముఖ్య అతిథి శ్రీ ప్రభల శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందజేస్తూ.. సిలికానాంధ్ర నాకు అత్యంత అభిమాన సంస్థ. మనబడి నిర్వహిస్తున్న తెలుగు మాట్లాట పోటీల స్థాయి, ఏర్పాట్లు, పిల్లల భాషా పటిమ నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. తెలుగు తెలిసిన యువతకు ఉద్యోగం, వ్యాపారం వంటి అనేక రంగాల్లో ప్రయోజనాలు ఉన్నాయి. తెలుగు తెలిసిన వారు సంగీతం, నాట్యం, నటన వంటి కళల్లో కూడా సులభంగా రాణించడాన్ని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను. తెలుగు మాట్లాట బృందం నిబద్ధత, సమర్థత అభినందనీయం అని అన్నారు. -
27 ఏళ్లుగా అమెరికాలోనే.. ICE అదుపులో ఎన్నారై మహిళ!
అమెరికాలో 27 ఏళ్లుగా నివసిస్తున్న ఓ భారత సంతతి మహిళకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్‌కార్డ్) ఉన్నప్పటికీ.. అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆమెను అదుపులోకి తీసుకుంది. అంతేకాదు.. ఆమెపై గతంలో కొనసాగిన డిపోర్టేషన్ కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఇప్పటికే కొట్టివేసినప్పటికీ ఈ అరెస్టు జరగడం చర్చనీయాంశంగా మారింది.వెంకట నరసమాంబ వాసంశెట్టి అనే మహిళను ఆగస్టు 11న సాధారణ చెక్-ఇన్‌కు హాజరైన సమయంలో ICE అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమెను జార్జియాలోని డిటెన్షన్ కేంద్రంలో ఉంచినట్లు సమాచారం. 2013 నుంచి ఆమెకు అమెరికాలో లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ (LPR) హోదా ఉంది.క్రిమినల్ రికార్డ్ లేదు..వాసంశెట్టి కుటుంబం దాదాపు మూడు దశాబ్దాలుగా అమెరికాలో స్థిరపడింది. నార్త్ కరోలినాలో ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు బోధించే ఉపాధ్యాయురాలిగా ఆమె పనిచేసినట్లు ఆమె కుటుంబ న్యాయవాది వెల్లడించారు. ఆమెకు ఎలాంటి క్రిమినల్ రికార్డు లేదని, ఇద్దరు అమెరికా పౌరులైన పిల్లలు, ఇద్దరు అమెరికా పౌరులైన మనవళ్లు ఉన్నారని తెలిపారు.ఆమె ఇల్లు, ఉద్యోగం, కుటుంబం మొత్తం అమెరికాలోనే ఉన్నాయని.. గ్రీన్‌కార్డ్‌ను వదులుకోవాలనే ఉద్దేశం ఎప్పుడూ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు చెబుతున్నారు.ఏడు నెలలు భారత్‌లో ఉన్నందుకేనా?వాసంశెట్టి 2022 జూలైలో అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు వెళ్లారు. అక్కడ ఉండగానే ఆమెకు కోవిడ్ సోకడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని న్యాయవాదులు తెలిపారు. పరిస్థితి విషమించడంతో దాదాపు రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు చెప్పారు. దీంతో ఆమె అమెరికాకు తిరిగి రావడం ఆలస్యమైంది. చివరకు 2023 ఫిబ్రవరిలో రాలీ-డర్హామ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అమెరికాకు చేరుకున్నారు. మొత్తం మీద ఆమె సుమారు ఏడు నెలలు భారత్‌లో ఉన్నారు. అయితే.. ఈ వ్యవధినే అమెరికా ప్రభుత్వం ఆమె గ్రీన్‌కార్డ్ హోదాను ప్రశ్నించడానికి ప్రధాన కారణంగా చూపినట్లు సమాచారం. అమెరికా వెలుపల ఎక్కువ కాలం ఉండటం వల్ల శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే అంశాన్ని అధికారులు పరిశీలించవచ్చు.‘అమెరికాను వదిలే ఉద్దేశమే లేదు’అయితే వాసంశెట్టి మాత్రం అమెరికాలో తన జీవితాన్ని కొనసాగించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు సమర్పించారు. భారత్‌కు వెళ్లిన సమయంలోనూ అమెరికాలో తన ఉద్యోగం, కుటుంబం, ఇల్లు వంటి సంబంధాలను కొనసాగించారని ఆమె తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. అంతేకాదు.. భారత్‌లో ఉన్న సమయంలోనే నార్త్ కరోలినాలో తన ప్రధాన నివాసంగా ఉపయోగించుకునే ఇంటిని కొనుగోలు చేసినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. తల్లిదండ్రుల అనారోగ్యం, తన ఆరోగ్య సమస్యల కారణంగా జరిగిన తాత్కాలిక ప్రయాణాన్ని అమెరికా శాశ్వత నివాసాన్ని వదులుకోవాలనే నిర్ణయంగా చూడలేమని వాదించారు.కోర్టు కేసు కొట్టేసినా.. మళ్లీ అరెస్టువాసంశెట్టిపై అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) డిపోర్టేషన్ చర్యలు ప్రారంభించింది. అయితే కేసుకు సంబంధించిన ఆధారాలను సమర్పించేందుకు కోర్టు విధించిన గడువులో DHS విఫలమైందని ఆమె న్యాయవాది తెలిపారు. దీంతో 2026 మే 19న ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి ఆమెపై కొనసాగుతున్న డిపోర్టేషన్ ప్రక్రియను ముగించారు. ఆ తర్వాత కూడా ఆమెకు విధించిన ICE చెక్-ఇన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ వచ్చారు. అలా ఆగస్టు 11న చెక్-ఇన్‌కు వెళ్లిన సమయంలోనే ICE అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.‘ఆమె గ్రీన్‌కార్డ్ హోల్డర్ కాదు’వాసంశెట్టిని అదుపులోకి తీసుకున్న తర్వాత ICE మాత్రం ఆమె గ్రీన్‌కార్డ్ హోల్డర్ కాదని వాదిస్తున్నట్లు ఆమె న్యాయవాదులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబం మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఆగస్టు 13న ఆమె తరఫు న్యాయ బృందం అత్యవసర హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై స్పందించిన ఫెడరల్ న్యాయమూర్తి.. ఆమెను నిర్బంధించడానికి ఉన్న చట్టపరమైన ఆధారాలను మూడు రోజుల్లో వివరించాలని ఇమ్మిగ్రేషన్ అధికారులను ఆదేశించారు.తర్వాత ఏం జరగొచ్చు?తాజా కోర్టు పరిణామాల ప్రకారం.. ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆదేశం వెలువడలేదు. అయితే కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇస్తే, వాసంశెట్టికి బెయిల్‌పై విడుదల కావచ్చా? అనే అంశాన్ని పరిశీలించేందుకు ఇమ్మిగ్రేషన్ జడ్జి ఎదుట బాండ్ హియరింగ్ జరిగే అవకాశం ఉంది.27 ఏళ్లుగా అమెరికాలో నివసిస్తూ.. గ్రీన్‌కార్డ్ ఆధారంగా జీవనం సాగిస్తున్న ఓ భారత సంతతి మహిళను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు అమెరికాలోనే కాకుండా భారతీయ సమాజంలోనూ చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తాత్కాలికంగా విదేశాల్లో ఎక్కువకాలం ఉండటం వల్ల గ్రీన్‌కార్డ్ హోదాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. -
డాలస్‌లో ‘హర్ ఘర్ తిరంగా’.. మార్మోగిన దేశభక్తి గీతాలు
డాలస్, టెక్సస్: డాలస్ పరిసర ప్రాంతం ఇర్వింగ్ నగరంలో నెలకొనియున్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకం వద్ద “హర్ ఘరంగ్ తిరంగా” అనే నినాదంతో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి రావు కల్వల స్వాగత శుభాకాంక్షలతో భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముందుగా సంగీత గురు సమీరా శ్రీపాద దర్శకత్వంలో వారి శిష్యులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక భారతదేశభక్తి గీతాలను శ్రావ్యంగా ఆలపించారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి “భారతదేశ స్వాతంత్ర్య సమరంలో పాల్గొని సర్వం త్యాగం చేసిన అనేకమంది అమరవీరులకు మహాత్మాగాంధీ, నెహ్రు, వల్లభభాయి పటేల్, నేతాజీ, వీర సావర్కార్, భగత్ సింగ్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి నేతలు చేసిన త్యాగాలు మరువలేనివి అంటూ ప్రవాస భారతీయలగా అమెరికా దేశ చట్టాలను గౌరవిస్తూ అమెరికా జనజీవన స్రవంతిలో భాగం కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. “ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యల్ జపంటా మాట్లాడుతూ “రెండు ప్రముఖ ప్రజాసామ్య దేశాలైన అమెరికా, భారత్‌ల మధ్య ధృడమైన సంబంధాలు నెలకొల్పడంలో ప్రవాస భారతీయలు ప్రముఖ పాత్ర వహిస్తున్నారని, ఈ రోజు భారత జాతీయగీతంతో పాటు, అమెరికా జాతీయగీతం కూడా ఆలపించడం సబబుగా ఉందంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అన్నారు.”ప్రత్యేకఅతిథిగా హాజరైన ఈనాడు దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ “ప్రవాస భారతీయలు మాతృభూమికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా వారి హృదయాలకు భారతదేశం ఎల్లప్పుడూ దగ్గరగానే ఉంటుందని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరదేశంలో విస్తరిస్తూ, భారతదేశ ప్రగతికి తోడ్పడుతున్న వారందరికీ కృతజ్ఞతలు అన్నారు. భారతదేశ విముక్తి కోసం సర్వం త్యాగం చేసిన వేలాదిమంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టారని వారికి ఈ సందర్భంగా ఘన నివాళులర్పించారు.గత 79 సంవత్సరాలలో భారతదేశంలో అక్షరాస్యత 12 శాతంనుండి 81 శాతానికి పెరిగిందని, ఒకప్పుడు ఆహార కొరతతో బాధపడిన దేశం ఈ రోజు ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార ధాన్యాల ఉత్పత్తి దారులలో ఒకటిగా మారిందని, విశ్వవిద్యాలయాల సంఖ్య 20 నుంచి 1, 200కు పైగా పెరిగిందని, విమానాశ్రయాల సంఖ్య 12 నుంచి 166 కు పెరిగిందని, ఫార్మసీ రంగంలో ఎంతో ప్రగతి సాధించి కోవిడ్ సమయంలో ఎన్నో దేశాలకు సైతం కోవిడ్ టీకాలను అందించే స్థాయికి చేరామని అన్నారు. అయితే ఇదంతా నాణానికి ఒక వైపు అని మరో వైపు రైతు సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, మెరుగైన వైద్య సేవల కొరత, అవినీతి, నల్లధనం లాంటి సమస్యలతో దేశం సతమతమవుతుందని అన్నారు. భారతదేశ ప్రగతిలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ముఖ్యమని, ఎవరికి తోచిన విధంగా వారు వేర్వేరు రంగాలలో సహకారం అందించాలని కోరారు.”ఆత్మీయఅతిథిగా హాజరైన ప్రముఖ కవి, సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు త్రివర్ణ పతాకంపై ఒక పద్యాన్ని శ్రావ్యంగా గానం చేశారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ సంఘసేవకులు వామరాజు సత్యమూర్తి ప్రవాస భారతీయులందరికి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకలలో భారతదేశ రక్షణలో సైనికులగా సేవలందించి అమెరికాలో స్థిరపడిన కల్నల్ రాకేష్ శర్మ, కల్నల్ హరవిందర్ బింద్రాలను, అలాగే 8 సంవత్సరాలలోపు పిల్లలకు కొలంబియా దేశంలో నిర్వహించిన చెస్ పోటీలలో అమెరికా దేశంనుండి పాల్గొని పాన్ అమెరికన్ చాంపియన్ గా నిల్చి, సువర్ణ పతకం సాధించిన సరయు తలపనేని ని ఇర్వింగ్ మేయర్ అల్ జపంటా, డా. ప్రసాద్ తోటకూర ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కో ఛైర్మన్ తాయబ్ కుండావాలా తన వందన సమర్పణలో ఈ కార్యక్రమం విజయవంతంగావడానికి సహకరించిన సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చినసత్యం వీర్నపు సేవలను ప్రత్యేకంగా కొనియాడారు.బోర్డు సభ్యులు కలై, మురళి వెన్నం, ముర్తుజా, రాజేంద్ర వంకావాలా, తిరుమల్ రెడ్డి, అనంత్ మల్లవరపుతో సహా ఎం.వి.ఎల్ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ పూర్వ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డా. కె. అరవిందరావు, వందలాది ప్రవాస భారతీయులు ఈ స్వాతంత్రదినోత్సవ వేడుకలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం “ఇండియా టుడే” రెస్టారెంట్ వారు అందరికీ రుచికరమైన అల్పాహారం అందజేశారు. -
బెర్లిన్‌లో ఘనంగా భారత్ దివస్ వేడుకలు
బెర్లిన్: జర్మనీలోని భారతీయ ప్రవాసులు ఆగస్టు 16న బెర్లిన్‌లోని చారిత్రక బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద భారత్ దివస్‌ను ఘనంగా నిర్వహించారు. భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్మనీ నలుమూలల నుంచి భారతీయ సంఘాలు, ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భారతదేశ ఐక్యత, వైవిధ్యం, గొప్ప సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. తెలంగాణ అసోసియేషన్ చైర్పర్సన్, వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘు చెల్లిగంటి, యూపీ అసోసియేషన్‌కు చెందిన డాక్టర్ అఖిల్ అగర్వాల్, కాశ్మీరీ సమాజానికి ప్రాతినిధ్యం వహించిన వీణా చౌదరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జర్మనీలోని పలు భారతీయ సంఘాలు, కమ్యూనిటీ సంస్థలు చురుకైన సహకారం అందించాయి.ఈ వేడుకలకు జర్మనీలో భారత రాయబారి అజిత్ గుప్తా తన సతీమణితో కలిసి హాజరయ్యారు. భారత రాయబార కార్యాలయానికి చెందిన కాన్సులర్ మంత్రి స్టాలిన్ బాబు చీకట్ల, పర్సనల్ మంత్రి డాక్టర్ మందీప్ సింగ్ తులితో పాటు పలువురు ప్రముఖ అధికారులు, అతిథులు పాల్గొన్నారు.బ్రాండెన్‌బర్గ్ గేట్ వద్ద వందలాది మంది భారతీయ ప్రవాసులు ఒకచోట చేరడంతో దేశభక్తి, ఐక్యత, సోదరభావంతో కూడిన ప్రత్యేక వాతావరణం నెలకొంది. భారతదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే రంగురంగుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేశంలోని భిన్నత్వాన్ని చాటుతూ, అందరినీ త్రివర్ణ పతాకం కింద ఒక్కతాటిపైకి తీసుకువచ్చాయి.అనంతరం బ్రాండెన్‌బర్గ్ గేట్ నుంచి శాంతి స్తూపం వరకు యూనిటీ వాక్ నిర్వహించారు. శాంతి, స్నేహం, ఐక్యత, పరస్పర సహకారం అనే సందేశాన్ని ఈ వాక్ ద్వారా చాటారు.జర్మనీలోని భారతీయ సమాజానికి ఈ వేడుక ఒక గర్వించదగిన, చిరస్మరణీయమైన సందర్భంగా నిలిచింది. భారతదేశం పట్ల తమ అనుబంధాన్ని, ఉమ్మడి వారసత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ స్ఫూర్తిని ప్రవాస భారతీయులు ఘనంగా చాటుకున్నారు.చదవండి: సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం -
రష్యా పంజా.. మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు డ్యామేజ్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరో కీలక మలుపు తీసుకుంది. తాజా డ్రోన్ల దాడితో ఇరు దేశాల మధ్య మళ్లీ యుద్ధం భీకరంగా మారింది. ఈ క్రమంలో.. క్రివీ రిహ్ స్టీల్ ప్రాంతంలో భారత సంతతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ ప్లాంట్‌పై రష్యా క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా.. 14 మంది కార్మికులు గాయపడ్డారు. ఇది ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ స్వస్థలం కూడా!. రష్యా క్షిపణి దాడి కారణంగా.. మిట్టల్ ప్లాంట్‌లోని కీలక ఉత్పత్తి విభాగాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థలు, బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలకు సంబంధించిన సదుపాయాలు ప్రభావితమయ్యాయి. దీంతో ఉత్పత్తి ప్రక్రియలను పాక్షికంగా నిలిపివేయాల్సి వచ్చింది. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు అధికారులు, నిపుణులు పరిశీలనలు ప్రారంభించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడిన వాళ్లలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇటు దాడి వల్ల జరిగిన ఆర్థిక నష్టంపై అధికారిక అంచనా ఇంకా వెలువడలేదు. అయితే భారీ పరిశ్రమ అయిన ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోవడం వల్ల మరమ్మతుల ఖర్చుతో పాటు ఉక్కు ఉత్పత్తి, ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉంది. నష్టం స్థాయిని పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. 90 ఏళ్ల చరిత్ర.. వెన్నెముకలక్ష్మీ మిట్టల్‌కు చెందిన ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్ స్టీల్ ప్లాంట్ సాధారణ పరిశ్రమ కాదు. దాదాపు 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ భారీ ఉక్కు కర్మాగారం నిర్మాణం 1931లో అప్పటి సోవియట్ యూనియన్ హయాంలో ప్రారంభమైంది. 1934 ఆగస్టులో ఇక్కడ తొలి ఉక్కు ఉత్పత్తి జరిగింది. అప్పట్లో క్రివొరిజ్స్టల్ (Kryvorizhstal) పేరుతో కొనసాగిన ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ పారిశ్రామిక రంగంలో కీలకమైన సంస్థగా ఎదిగింది.2005లో లక్ష్మీ మిట్టల్ నేతృత్వంలోని మిట్టల్ స్టీల్ సంస్థ ప్రైవేటీకరణ వేలంలో ఈ ప్లాంట్‌ను సుమారు 4.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత ఆర్సెలర్‌తో విలీనం కావడంతో ఇది ఆర్సెలర్ మిట్టల్ క్రివీ రిహ్గా మారింది. స్వాధీనం అనంతరం ఆధునీకరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, పర్యావరణ ప్రమాణాల మెరుగుదల కోసం భారీగా పెట్టుబడులు పెట్టింది. ఇనుప ఖనిజం నుంచి ఉక్కు తయారీ వరకు మొత్తం ప్రక్రియ ఒకేచోట జరిగే ఈ ప్లాంట్.. ఉక్రెయిన్ ఉక్కు పరిశ్రమకు వెన్నెముకలాంటి సంస్థల్లో ఒకటిగా నిలిచింది.ఇలాంటి వ్యూహాత్మక పరిశ్రమపై రష్యా క్షిపణి దాడి జరగడం.. కేవలం ఓ కంపెనీకి జరిగిన నష్టంగానే కాకుండా, యుద్ధ సమయంలో ఉక్రెయిన్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడికి మరో ఉదాహరణగా మారింది.డ్రోన్ దాడులకు ప్రతీకారమే..ఉక్రెయిన్ రష్యాలోని పలు ప్రాంతాలపై భారీ డ్రోన్ దాడులు చేసిన తర్వాతే ఈ క్షిపణి దాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. ఉక్రెయిన్ దాడుల్లో రష్యాలో మరణాలు సంభవించగా.. దీనికి ప్రతీకార చర్యల్లో భాగంగానే మాస్కో ఈ దాడులు చేపట్టింది. అయితే.. తాము ఉక్రెయిన్‌లో సైనిక, పారిశ్రామిక లక్ష్యాలనే టార్గెట్ చేస్తున్నామని రష్యా ఖుల్లాగా ప్రకటించుకుంటోంది. క్రివీ రిహ్‌లోని మెటలర్జికల్ ప్లాంట్ కూడా తమ లక్ష్యాల్లో భాగమని పేర్కొంది. అయితే జెలెన్స్కీ స్వస్థలాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధంలో కొత్త దశరష్యా–ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్న కొద్దీ ఇరు దేశాలు సరిహద్దులు దాటి దూర ప్రాంతాలపై దాడులను పెంచుతున్నాయి. సైనిక స్థావరాలతో పాటు విద్యుత్ కేంద్రాలు, ఇంధన వనరులు, పారిశ్రామిక సంస్థలు కూడా లక్ష్యాలుగా మారుతున్నాయి. జెలెన్స్కీ స్వస్థలమైన క్రివీ రిహ్‌పై గతంలోనూ రష్యా దాడులు చేసింది. తాజాగా మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై జరిగిన దాడి.. ఉక్రెయిన్ ఆర్థిక, పారిశ్రామిక వ్యవస్థపై యుద్ధ ప్రభావాన్ని మరోసారి స్పష్టం చేసింది. -
సేవే జీవిత ధ్యేయంగా.. శోభా, ప్రసాద్ రెడ్డి దంపతుల సేవా ప్రస్థానం
సేవను జీవిత పరమార్థంగా, దాతృత్వాన్ని జీవన విధానంగా మలుచుకున్న శోభా రెడ్డి, ప్రసాద్ రెడ్డి దంపతులు సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. భారత్‌తో పాటు అమెరికాలోనూ చిన్నారులు, పేద కుటుంబాలు, వెనుకబడిన వర్గాల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.ఇటీవల కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో పాఠశాల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ఆహార రవాణా వాహనాల కొనుగోలుకు 25 వేల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. రోజూ సుమారు 15 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే లక్ష్యంతో అక్షయపాత్ర ఫౌండేషన్ నిర్మించనున్న వంటశాలకు 2.5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. నెల్లూరు సమీపంలోని వెంకటాచలం వద్ద ఐదు ఎకరాల భూమి సమీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.అలాగే, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఉచిత పాదరక్షలు అందించే కార్యక్రమాన్ని ప్రథమ్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్లో ప్రారంభించారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని పది కేంద్రాల్లో దీనిని అమలు చేస్తున్నారు. ఆరోగ్య సేవల్లోనూ వారి సహకారం విశేషం.చెన్నైలోని శంకర నేత్రాలయ కోసం అత్యాధునిక మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు 5.5 లక్షల అమెరికన్ డాలర్ల విరాళం అందించారు. దీంతో ఈ యూనిట్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్యం, శస్త్రచికిత్సలు అందించనున్నారు. ఇప్పటికే ఏపీలో ఎనిమిది నేత్ర శిబిరాలు నిర్వహించగా, తదుపరి శిబిరాన్ని తమిళనాడులో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ యూఎస్ఏకు బోర్డు సలహాదారుగా, బ్రాండ్ అంబాసిడర్‌గా సేవలందిస్తున్నారు. అలాగే, తన సంస్థ లాభాల్లో సుమారు 13 శాతాన్ని ప్రతి ఏడాది డల్లాస్ ప్రాంతంలోని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ సేవలకు గుర్తింపుగా న్యూజెర్సీ సెనెట్, అసెంబ్లీ ఆయనను సత్కరించాయి. శంకర నేత్రాలయం ప్రతిష్ఠాత్మక ‘శంకర రత్న’ పురస్కారంతోనూ ఆయనను గౌరవించనుంది.ప్రసాద్ రెడ్డి సేవా ప్రస్థానంలో తన భార్య శోభా రెడ్డి ప్రోత్సాహం, సహకారం కీలకంగా నిలుస్తున్నాయి. చిన్నారుల సంక్షేమం, విద్య, పోషకాహారం, ఆరోగ్యం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఈ దంపతులు చేస్తున్న సేవలు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. -
బ్రిటన్ ప్రధాని సలహాదారుగా ఎన్నారై
లండన్: భారతీయ మూలాలున్న వ్యూహకర్త, మీడియా ఎగ్జిక్యుటివ్ గౌతమ్ రంగరాజన్‌ను బ్రిటన్ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. యూకే ప్రధాని ఆయన్ను స్ట్రక్చర్ అండ్ ప్రాసెసెస్ (రాజ్యాంగ వ్యవస్థలు, వ్యవహారాలు)పై ప్రత్యేక సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.వార్తా సంస్థ బీబీసీలో వ్యూహకర్తగా పనిచేసిన అనుభవమున్న రంగరాజన్ ఇప్పటికే కొత్త పదవీ బాధ్యతలు స్వీకరించారని అని యూకే ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. లేబర్ పార్టీ నేత బర్న్‌హామ్ గత నెల ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాలన వికేంద్రీకరణ చర్యల్లో భాగంగా మ్యాంచెస్టర్‌లో ‘నంబర్ 10 నార్త్’ను ప్రారంభించారు. పలు ప్రభుత్వ విభాగాల పునర్వవ్యవస్థీకరణ చేపటాట్టరు.ఎవరీ గౌతమ్ రంగరాజన్?గౌతమ్ రంగరాజన్ (Gautam Rangarajan) బీబీసీలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1993లో బీబీసీ రేడియో క్లాసికల్ మ్యూజిక్‌లో ట్రెయినీ ప్రొడ్యూసర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత బీబీసీ వేల్స్, బీబీసీ రేడియోలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2013లో గౌతమ్ రంగరాజన్ గ్రూప్ డైరెక్టర్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ పెర్ఫార్మెన్స్‌గా నియమితులయ్యారు. 2025 ఏప్రిల్ వరకు ఈ పదవిలో కొనసాగారు. గ్రూప్ డైరెక్టర్‌గా బీబీసీ మొత్తానికి సంబంధించిన వ్యూహరచనకు 10 సంవత్సరాల పాటు బాధ్యత వహించారు.2025లో బీబీసీని వీడిన తర్వాత ఫ్రీలాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. 2025 జనవరి నుంచి గ్లైండ్బోర్న్లో బోర్డ్ ట్రస్టీగా కూడా కొనసాగుతున్నారు. టెంపుల్ చర్చ్ క్వైర్తో కలిసి ఆయన పాటలు పాడారు. అలాగే పాలీఫోనీతో పాటు వెస్ట్‌మినిస్టర్ అబ్బే, సెయింట్ పాల్స్ కేథడ్రల్, విండ్సర్లోని సెయింట్ జార్జ్ చాపెల్ గాయక బృందాలతో డిప్యూటీగా కూడా పనిచేశారు. రికార్డింగ్ ప్రొడ్యూసర్‌గా కూడా ఆయన పనిచేశారు. 2012లో విడుదలైన A Festival of Psalms అనే సీడీకి కూడా ఆయన రికార్డింగ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.చదవండి: విజయ్ పార్టీలో చేరిన యువనేత -
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏబీసీ నెట్వర్క్ ఏర్పాటు..
అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ సమాజం, బిజినెస్ కమ్యూనిటీ నెట్‌వర్క్‌ను మరింతగా అనుసంధానిస్తూ సేవలందించేందుకు 'ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్'(AAA) మరియు ఆంధ్రప్రదేశ్ బిజినెస్ కమ్యూనిటీ(ABC) సంయుక్తంగా 2028–2031 కాలానికి ప్రాంతీయ డైరెక్టర్లను ప్రకటించాయి.ఆయా ప్రాంతాల్లో AAA, ABC రాష్ట్ర నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ అభివృద్ధికి ప్రాంతీయ డైరెక్టర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ప్రతి ప్రాంతీయ డైరెక్టర్‌కు ఐదు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించారు. స్థానిక నాయకత్వంతో భాగస్వామ్యం, వ్యాపారవేత్తలు–పెట్టుబడిదారులు–వృత్తి నిపుణులను అనుసంధానం చేయడం, యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడం, కొత్త అవకాశాలను సృష్టించడం వంటి అంశాలపై వారు ప్రధానంగా దృష్టి సారించనున్నారు.ఐదుగురు ప్రాంతీయ డైరెక్టర్లుబొల్లి వెంకట రామకృష్ణ (వెంకట్) – లాస్‌వేగాస్ (Las Vegas) లోని తెలుగు సమాజంలో చురుకైన సభ్యుడిగా, ఐటీ ప్రొఫెషనల్, వ్యాపారవేత్త, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్‌గా ఉన్నారు. మెంటరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వ్యాపార అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. ఆయనకు నార్త్ కరోలినా, నెవాడా, అలబామా, టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.హనుమంతు సింహబలుడు (సింహ) – ఉత్తర అమెరికా సాక్షి టీవీ చీఫ్ కరస్పాండెంట్‌గా, గతంలో UBI TV న్యూస్ డైరెక్టర్‌గా పనిచేసిన మీడియా నిపుణుడు. విశ్వసనీయ జర్నలిజం, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్కు కట్టుబడి ఉన్న ఆయనకు న్యూజెర్సీ, న్యూయార్క్, వర్జీనియా, ఇల్లినాయిస్, మిస్సౌరీ రాష్ట్రాల బాధ్యతలు కల్పించారు.దొమ్మరాజు హేమంత్ వర్మ – టెక్నాలజీ, కన్సల్టింగ్, స్టార్టప్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారవేత్తగా ఉన్నారు. ERP & Automations డైరెక్టర్‌గా, వ్యూహాత్మక కన్సల్టింగ్ సంస్థ సహ వ్యవస్థాపకుడిగా సేవలందిస్తున్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సహకారం, కమ్యూనిటీ అభివృద్ధిపై దృష్టి సారించనున్న ఆయనకు పెన్సిల్వేనియా, మేరీల్యాండ్, ఒహాయో, మసాచుసెట్స్, ఓక్లహోమా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.గొట్టిపాటి కళ్యాణ్ – 18 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఎంటర్ప్రెన్యూర్, ఐటీ ప్రొఫెషనల్. ఆపరేషన్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్లో అనుభవంతో పాటు వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆంధ్ర సంస్కృతిని పరిరక్షిస్తూ తెలుగు సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఆయనకు అరిజోనా, వాషింగ్టన్, యూటా, కొలరాడో, న్యూ మెక్సికో రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.చౌటకూరి చేతన్ రెడ్డి – ఎంటర్ప్రైజ్ టెక్నాలజీ, కన్సల్టింగ్ రంగాల్లో 20 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన టెక్నాలజీ ప్రొఫెషనల్. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులతో పాటు కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తూ, భాగస్వామ్యాలు, అవకాశాలు, స్థిరమైన కమ్యూనిటీ ప్రభావంపై దృష్టి సారిస్తున్నారు. ఆయనకు జార్జియా (Georgia), మిషిగన్, టెన్నెస్సీ, ఫ్లోరిడా, సౌత్ కరోలినా రాష్ట్రాల బాధ్యతలు అప్పగించారు.నాయకత్వం, నెట్‌వర్కింగ్‌కు ప్రాధాన్యంAAA–ABC ప్రాంతీయ డైరెక్టర్లు స్థానిక నాయకత్వంతో కలిసి పనిచేస్తూ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రొఫెషనల్స్, కమ్యూనిటీ సభ్యులను ఒకే వేదికపైకి తీసుకురావడమే కాకుండా, కొత్త భాగస్వామ్యాలు మరియు వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం చేయనున్నారు. అదేవిధంగా మెంటరింగ్, నాయకత్వ అభివృద్ధి, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్, బలమైన నెట్వర్క్ నిర్మాణం, కొత్త అవకాశాల సృష్టి వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.స్థానిక సంస్థలు, రాష్ట్ర నాయకత్వం, వివిధ రంగాల నిపుణులతో సమన్వయం చేసుకుంటూ కమ్యూనిటీకి మరింత ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 2028–2031 కాలానికి నియమితులైన ఈ ప్రాంతీయ డైరెక్టర్ల నాయకత్వంలో AAA–ABC నెట్వర్క్ మరింత విస్తరించి, ఉత్తర అమెరికాలోని ఆంధ్రప్రదేశ్ వ్యాపార, వృత్తి మరియు కమ్యూనిటీ వర్గాలను మరింత దగ్గర చేయాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. -
డల్లాస్‌లో ఘనంగా ఎస్ జానకి సంగీత నివాళి కార్యక్రమం
టెక్సస్: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో అపూర్వమైన గానమాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గానకోకిల ఎస్ జానకి (జానకమ్మ) గారికి సంగీత నివాళిగా శనివారం డల్లాస్‌లోని తెలుగు కళాభిమానులు ఒక అద్భుతమైన సంగీత కార్యక్రమాన్ని నిర్వహించారు.DGIT (Dallas Got India Talent) వ్యవస్థాపకుడు రామన్ వీరంరాజు నాయకత్వంలో, కళావాహిని వ్యవస్థాపకుడు అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమం శుభమ్ ఈవెంట్ సెంటర్ – A2B, ఫ్రిస్కోలో అత్యంత వైభవంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ వ్యాఖ్యాత పరిమళ మార్పాక జానకి గారి సంగీత ప్రస్థానానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలు, ప్రతి గీతానికి ఇచ్చిన చక్కని పరిచయాలు కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చాయి.డల్లాస్ మెట్రోప్లెక్స్‌లోని పలువురు ప్రతిభావంతులైన గాయనీ, గాయకులు జానకి గారు ఆలపించిన అజరామరమైన గీతాలతో ఆమెకు సంగీతాంజలి ఘటించారు. ప్రేమ, భక్తి, శృంగారం, జానపదం, భావోద్వేగం వంటి విభిన్న భావాలను ప్రతిబింబించే ఆమె చిరస్మరణీయ గీతాలను ఆలపిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ప్రతి గీతం ముగిసినప్పుడల్లా సభాభవనం కరతాళ ధ్వనులతో మార్మోగింది.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “ గాయనిగా శిష్ట్లా జానకి గారి విశిష్ట లక్షణాలను ఒకసారి పరిశీలిస్తే – భావ వ్యక్తీకరణ - పాటలోని ఆనందం, బాధ, ప్రేమ, భక్తి, కోపం, అమాయకత్వం ఇలా ఏ భావాన్నైనా ఆమె గాత్రంలో సహజంగా పలికించగల్గడం; గాత్ర వైవిధ్యం - హాస్యపాత్రల స్వరం, రెండేళ్ళ పసిపాప నుంచి, తొంబై ఏళ్ల వృద్ధురాలి వరకూ ఏ స్వరాన్నైనా అద్భుతంగా పలికించగల అరుదైన సామర్థ్యం; భాషలపై పట్టు - ఏ భాషలో పాట పాడినా, ఆ భాషకు చెందిన వ్యక్తే పాడుతున్నారేమో అనిపించేంత స్పష్టమైన ఉచ్చారణతో పాడడానికి నిరంతర సాధన; సంగీతదర్శకుల అభిరుచికి అనుగుణంగా - శాస్త్రీయ గీతాలు, జానపద గీతాలు, ప్రేమగీతాలు, భక్తిగీతాలు, వేగవంతమైన నృత్యగీతాలు ఇలా ఎలాంటి పాటనైనా సమాన ప్రతిభతో పాడే నైపుణ్యం; వినయం - ఎన్నో వేల పాటలు పాడి, అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నప్పటికీ, తాను నిత్య విద్యార్ధినేనంటూ ఎంతో నిరాడంబరంగా జీవించిన పుణ్యజీవి అన్నారు. 6 దశాబ్దాలపాటు 15 రకాల వివిధ భాషల్లో 50,000 కు పైగా పాటలగా సాగిన గాయనీమణి జానకి గారి గాత్ర జైత్రయాత్ర అజరామరం అంటూ ఘన నివాళులర్పించారు.” డా. ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ- ఎస్. జానకి గారి గానం భారతీయ సంగీతానికి ఒక అపూర్వమైన వరమని, ఆమె పాటలు యుగయుగాల పాటు సంగీతాభిమానులను అలరిస్తూనే ఉంటాయని కొనియాడారు.ఈ సందర్భంగా నిర్వాహకులు రామన్ వీరంరాజు మరియు అనంత్ మల్లవరపు మాట్లాడుతూ - విదేశాల్లో పెరుగుతున్న తెలుగు తరాలకు మన సంగీత, సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో కూడా భారతీయ కళలను ప్రోత్సహించే మరిన్ని నాణ్యమైన కార్యక్రమాలను నిర్వహిస్తామని వెల్లడించారు.అందమైన వేదిక అలంకరణ, అద్భుతమైన సంగీత బృందం, స్థానిక గాయనీ, గాయకుల ప్రతిభ, పరిమళ మార్పాక చక్కని వ్యాఖ్యానం, ప్రేరణాత్మక సందేశాలు, అలాగే బాల గణపవరపు అందించిన నాణ్యమైన ఆడియో సపోర్ట్ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశాయి. కార్యక్రమం ముగింపులో ప్రేక్షకులంతా నిలబడి చప్పట్లతో గానకోకిల ఎస్. జానకి గారికి తమ సంగీత ప్రణామాలర్పించారు.ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి తమ విశాలమైన వేదికను అందించడమే కాకుండా, విచ్చేసిన అతిథులు మరియు ప్రేక్షకులకు ఆతిథ్యపూర్వకంగా రుచికరమైన అల్పాహారం అందించి కార్యక్రమ విజయానికి విశేషంగా సహకరించినందుకు A2B (Adyar Anand Bhavan) యాజమాన్యానికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.DGIT (Dallas Got India Talent) మరియు కళావాహిని సంయుక్తంగా నిర్వహించిన ఈ సంగీత నివాళి కార్యక్రమం డల్లాస్ తెలుగు సాంస్కృతిక వేదికపై చిరస్మరణీయమైన సంగీత సంధ్యగా నిలిచి, జానకమ్మ ఆలపించిన అజరామరమైన గీతాల ద్వారా ఆమెకు ఘనమైన సంగీతాంజలి అర్పించిన ఒక విశిష్ట సాంస్కృతిక వేడుకగా చరిత్రలో నిలిచిపోనుంది. -
ఎన్ఆర్ఐలు పార్టీకి సేవలు అందించాలి
సాక్షి, అమరావతి: అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో గురువారం నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్ రీచ్ సమావేశానికి ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎన్ఆర్ఐ వింగ్ గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి మాట్లాడుతూ.. సోషల్ మీడియా, టెక్నాలజీ, కంటెంట్, డేటా, డిజిటల్ కమ్యూనికేషన్ రంగాల్లో నైపుణ్యం కలిగిన ఎన్ఆర్ఐలు తమ సేవలను పార్టీకి అందించాలని కోరారు. కేవలం పోస్టులు, లైకులు, షేర్లకు పరిమితం కాకుండా, స్పష్టమైన లక్ష్యాలు, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఉన్న ప్రజాభిప్రాయాన్ని వాస్తవాలు, సానుకూల కమ్యూనికేషన్, టెక్నాలజీ, సృజనాత్మక కంటెంట్‌ను విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.అమెరికాలోని షార్లెట్, నార్త్ కరోలినాలో నిర్వహించిన వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ అవుట్‌రీచ్ సమావేశంలో పాల్గొన్న ఆలూరు సాంబశివారెడి, తదితరులు -
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ షాక్!
అమెరికాలో చదువు పూర్తి చేసి ఉద్యోగం పొందాలని కలలు కనే విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయులకు కొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలో పని చేసేందుకు ఉపయోగించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) విధానంపై భారీగా 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను ట్రంప్ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.అమెరికాలో F-1 విద్యార్థి వీసాపై చదివే విదేశీ విద్యార్థులకు చదువు పూర్తయిన తర్వాత కొంతకాలం అక్కడే ఉండి తమ విద్యకు సంబంధించిన రంగంలో ఉద్యోగం చేసే అవకాశం OPT ద్వారా లభిస్తుంది. ప్రస్తుతం సాధారణ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకు OPT కింద పనిచేయవచ్చు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM) కోర్సులు చేసిన వారికి ఈ గడువు మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు ఉద్యోగ అనుభవం సంపాదించడంతో పాటు, తర్వాత H-1B వర్క్ వీసా పొందేందుకు ప్రయత్నిస్తారు.అయితే ఈ అవకాశానికి ఏకంగా 100,000 డాలర్ల ఫీజు విధించే ఆలోచన ఇప్పుడు చర్చకు వచ్చింది. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే.. అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల మార్గం మరింత ఖరీదైనదిగా మారే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంపై ఇంకా తుది ప్రకటన వెలువడలేదు.ఎవరిపై భారం పడనుంది?ప్రతిపాదిత ఫీజును విద్యార్థులే చెల్లించాలా? లేక వారిని ఉద్యోగంలోకి తీసుకునే కంపెనీలే చెల్లించాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదు. విద్యార్థులే చెల్లించాల్సి వస్తే.. చాలా మందికి ఇది అందనంత భారంగా మారే అవకాశం ఉంది. కంపెనీలు చెల్లించాల్సి వస్తే.. విదేశీ గ్రాడ్యుయేట్లను నియమించుకోవడంపై సంస్థలు వెనుకడుగు వేసే పరిస్థితి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. దీంతో అమెరికన్ విద్యార్థులకు ప్రాధాన్యం పెరిగి, అంతర్జాతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.భారతీయ విద్యార్థులపై ప్రభావం ఎంత?అమెరికా ఉన్నత విద్యకు భారతీయ విద్యార్థులు ప్రధాన వర్గంగా ఉన్నారు. ప్రస్తుతం లక్షలాది మంది భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. చాలామంది విద్యార్థులు కేవలం డిగ్రీ కోసం మాత్రమే కాకుండా.. చదువు పూర్తయ్యాక అక్కడే ఉద్యోగం చేసి అంతర్జాతీయ అనుభవం పొందాలనే లక్ష్యంతో అమెరికాకు వెళ్తున్నారు.అమెరికా విద్య కోసం కుటుంబాలు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్న నేపథ్యంలో.. OPTపై భారీ ఫీజు ప్రతిపాదన విద్యార్థులపై ఆర్థిక ఒత్తిడిని పెంచే అవకాశం ఉంది.నాలుగేళ్ల వీసా పరిమితి కూడా!OPT ఫీజు ప్రతిపాదనతో పాటు అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనల్లో మరో కీలక మార్పు కూడా తెరపైకి వచ్చింది. ఇప్పటివరకు విదేశీ విద్యార్థులు “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానంలో అమెరికాలో ఉండేవారు. అంటే.. వారు తమ కోర్సును నిబంధనల ప్రకారం కొనసాగిస్తున్నంత కాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది.తాజా ప్రతిపాదనల ప్రకారం.. విద్యార్థులకు గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు మాత్రమే ఉండే అనుమతి ఇవ్వాలనే ఆలోచన ఉంది. అంతకంటే ఎక్కువ సమయం అవసరమైతే.. హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది.ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న కారణంఅమెరికా వలస విధానాన్ని మరింత పర్యవేక్షించడం, చట్టబద్ధమైన వలస వ్యవస్థను బలోపేతం చేయడం, దేశ భద్రతను పెంచడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే విద్యా రంగ నిపుణులు మాత్రం.. ఇలాంటి నిబంధనలు అమెరికాను అంతర్జాతీయ విద్యార్థులకు తక్కువ ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.ఇప్పటికిప్పుడు ఆందోళన అవసరం లేదా?$100,000 OPT ఫీజు ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోలేదు. అయితే అమెరికా వలస విధానంలో క్రమంగా కఠినమైన మార్పులు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో చదువు పూర్తి చేసి అక్కడే కెరీర్ నిర్మించుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇకపై మార్గం మరింత ఖరీదైనదిగా, నిబంధనలతో కూడుకున్నదిగా మారే అవకాశం ఉంది. -
న్యూయార్క్‌లో వైభవంగా ఆషాఢమాస బోనాలు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్‌లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి. లాంగ్ ఐలాండ్ (నాస్సా కౌంటీ) డిప్యూటీ డైరెక్టర్ మెంగ్ లీ, లెజిస్లేటర్ రోజ్ మేరీ వాకర్, టౌన్ క్లర్క్ రాగిని శ్రీవాస్తవ ఈ వేడుకలకు అతిథులుగా హాజరయ్యారు..ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. ప్రముఖ గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, గాయకుడు సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్యలు ప్రత్యేకంగా తమ పాటలు, ప్రదర్శనలతో తెలంగాణ సంస్కృతిని ఆవిష్కరించారు.అలాగే పద్మ కోడెల చేతుల మీదుగా జరిగిన అమ్మవారి అలంకరణ, పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి. వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి. -
లండన్‌లో అట్టహాసంగా 'టాక్' బోనాల సంబురం
లండన్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్ బోనాల జాతరను వైభవంగా నిర్వహించారు. హౌంస్లౌ నగరంలోని కింగ్స్లే అకాడమిలో జూలై 19న జరిగిన ఈ వేడుకలకు బ్రిటన్ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రవాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షులు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరిగాయి. ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ జెల్లా, కమ్యూనిటీ అఫైర్స్ చైర్పర్సన్ గణేష్ కుప్పాల.. వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.వేడుకలకు ముఖ్య అతిథులుగా ఎంపీ సీమా మల్హోత్రా, భారత హైకమిషన్ ప్రతినిధి వివేక్ కుమార్, మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్ గిల్ హాజరయ్యారు. స్వదేశంలో జరుపుకున్నట్టు సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. పోతురాజు నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుటుంబ సమేతంగా అంతా కలిసి ఇలా వేడుకలు చేసుకొని రాబోయే తరాలకి తెలియజెప్పడం ఎంతో స్ఫూర్తినిస్తుందని.. బ్రిటన్ అన్ని వర్గాల ప్రజలను, సంస్కృతుల్ని ఆదరించే గొప్ప దేశమని ముఖ్య అతిథులు తమ సందేశంలో పేర్కొన్నారు. మనమంతా కలిసి మెలిసి ఐక్యంగా ఉండాలని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.టాక్ సంస్థ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, ఉపాధ్యక్షుడు సురేష్ బుడగం మాట్లాడుతూ.. ప్రవాస తెలంగాణ ప్రజలందిరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆడబిడ్డలందరూ బోనాలతో తమ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజల కోసం తాము చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించారు. టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలానికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపారు.బోనాల వేడుకలు విజయవంతం కావడం పట్ల టాక్ కన్వీనర్లు అశోక్ గౌడ్ దూసరి, నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు శుషుమ్న రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుప్రజ పులుసు, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తమకు సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. టాక్ కార్యదర్శి క్రాంతి రేతినేని వందన సమర్పణతో వేడుకలు ముగిశాయి.పవిత్ర, రాకేష్ పటేల్, సత్యం కంది, సత్యపాల్ రెడ్డి పింగళి, సత్య చిలుముల, రవి రేతినేని, రవి ప్రదీప్ పులుసు, మల్లారెడ్డి, గణేష్ పాస్తాం, నాగరాజు తౌటం, శ్రీధర్ రావు, శైలజ జెల్ల, స్నేహ, విజయలక్ష్మి, శ్వేతా మహేందర్, స్వాతీ, క్రాంతి, శ్రీ విద్య, దివ్య, ప్రవీణ్ వీర, మణితేజ, నిఖిల్ రెడ్డి, హరి గౌడ్, రంజిత్, రాజేష్ వాక, మాధవ రెడ్డి, అంజన్, తరుణ్ లూణావత్, సందీప్, ఆనంద్, లత, పావని, కార్తీక్, స్నేహ, అమరేశ్వరి, సాయిరావు, జస్వంత్, ప్రశాంత్, వినోద్ నవ్య, ఉమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. -
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
అమెరికాలో వైద్య వృత్తిలో ఉంటూ భారతీయ సంతతికి చెందిన వైద్యుడు తన వక్రబుద్ధిని చాటుకున్నాడు. ఆసుపత్రిలోని విశ్రాంతి గది (Restroom)లో రహస్యంగా కెమెరా అమర్చి, రికార్డ్ చేసి, పైశాచిక ఆనందం పొందేవాడు. చివరికి కటకటాల వెనక్కి వెళ్లాడు. ఈ కేసులో వైద్యుడికి ఆరు నెలల జైలు శిక్ష పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.నేరస్తుడు అద్వైత్ దేశ్‌ముఖ్ (Advait Deshmukh) టోలెడో యూనివర్విటీలో ఎండోయూరాలజీ, యూరోలాజిక్ ఆంకాలజీ విభాగంలో మూడో సంవత్సరం మెడికల్ రెసిడెంట్‌గా పనిచేసేవారు. జూన్ 2025లో ఓహియోలోని ప్రోమెడికా టోలెడో ఆసుపత్రిలోని ఒక యూనిసెక్స్ విశ్రాంతి గదిలో దాచి ఉంచిన ఒక సెల్‌ఫోన్‌ను ఒక ఉద్యోగి గుర్తించారు. ఆమె దాన్ని తీయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ్‌ముఖ్ దానిని లాక్కొని అది తనదేనని చెప్పాడని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ప్రోమెడికా, టోలెడో పోలీసు బృందం సంయుక్తంగా దర్యాప్తు చేపట్టింది.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్వీరి విచారణలో ఆ ఫోన్లో 2025 ఫిబ్రవరి - మే మధ్య తీసిన 80కి పైగా ఫోటోలు, వీడియోలు లభించాయి. కనీసం ఆరుగురు బాధితులను పోలీసులు గుర్తించారు. ఇతగాడి పైశాచికం 2018 నుంచే జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు ఇంకా ఎక్కువ మందే ఉండవచ్చని తెలిపారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే విశ్వవిద్యాలయం దేశ్‌ముఖ్‌ను సస్పెండ్ చేసింది. అనంతరం ఆయన మెడికల్ రెసిడెన్సీని రద్దు చేసింది. అయితే అంతర్గత విచారణ అనంతరం రెసిడెన్సీ నియామకాన్ని పునరుద్ధరించ లేదని వెల్లడించింది. కోర్టులో శిక్ష ఖరారయ్యే ముందు దేశ్‌ముఖ్ బాధితులకు క్షమాపణలు చెప్పాడు.టోలెడో ఆసుపత్రి ఉద్యోగి బాధితుల్లో ఒకరైన లిండ్సే ఈ సంఘటన తనను ఎంత కుంగదీసిందో వివరించారు. తాను ఇప్పటికీ బాత్రూమ్లలో రహస్య కెమెరాల కోసం తనిఖీ చేస్తానని, ఆ చిత్రాలు ఎక్కడికి చేరాయోనన్న ఆందోళనన తనను వెంటాడుతూనే ఉందంటూకోర్టు ముందు ఆవేదన వ్యక్తంచేశారు. సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఒక అభియోగం, రహస్యంగా వీడియో తీసిన ఏడు అభియోగాలను అంగీకరించిన తర్వాత, దేశ్‌ముఖ్‌కు జూన్‌లో కోర్టు ఈయనకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు మూడేళ్ల ప్రొబేషన్ విధించింది. అంతేకాకుండా 15 ఏళ్ల పాటు 'సెక్స్ అఫెండర్' (లైంగిక నేరస్థుడిగా) నమోదు చేసుకోవాలని, మానసిక ఆరోగ్య చికిత్స పొందాలని ఆదేశించింది.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి -
నన్ను టార్చర్ చేస్తున్నారు.. స్వదేశానికి తీసుకెళ్లండి!
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ పహాడీషరీఫ్ నుంచి బతుకుతెరువు కోసం ఒమన్ వెళ్లిన మహిళ షబ్నం బేగంకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. ఏజెంట్ చెప్పినట్లు అక్కడ జరగకపోవడంతో పాటు పగలూ రాత్రీ తేడా లేకుండా పని, హింస ఎదుర్కొంది. దీంతో యజమాని నుంచి తప్పించుకుని అక్కడి భారత ఎంబసీకి చేరిన షబ్నంబేగం తనను రక్షించాలంటూ నగరానికి చెందిన ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్‌కు సెల్ఫీ వీడియో పంపింది. దీన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఒమన్‌లోని భారత ఎంబసీతో పాటు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) దృష్టికి తీసుకువెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది.షబ్నం సెల్ఫీ వీడియోలో మాట్లాడుతూ.. ‘నా పేరు షబ్నంబేగం. మార్చి 26న ఏజెంట్ ద్వారా ఒమన్ వచ్చా. ఉద్యోగం పేరుతో ఇక్కడకు పంపాడు. ఇక్కడ పగలు–రాత్రి పని చేయిస్తున్నారు. మూడు నెలలుగా జీతం ఇవ్వట్లేదు. కనీసం మొబైల్ ఫోన్ కూడా అందుబాటులో ఉండనీయట్లేదు. నాకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరంతా చిన్న పిల్లలు. ఇక్కడ నా యజమానులు చాలా టార్చర్ చేస్తున్నారు. సరిగా తిండి కూడా పెట్టకుండా వేధిస్తున్నారు. తరచూ కొడుతుండటంతో తట్టుకోలేక పారిపోయి ఒమన్‌లోని ఇండియన్ ఎంబసీకి వచ్చి ఎనిమిది రోజులుగా తలదాచుకున్నా. ఇక్కడ ఇలా 130 మంది మహిళలం ఉన్నాం. ఏజెంట్ నా పాస్‌పోర్టు తీసుకుని తిరిగి ఇవ్వట్లేదు. దయచేసి నన్ను ఇక్కడ నుంచి తీసుకువెళ్లండి’ అంటూ వేడుకున్నారు. షబ్నం బేగంను వెంటనే హైదరాబాద్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లా ఖాన్ కోరారు. మాయ మాటలతో మోసం చేసిన ఏజెంట్ పైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఉషా వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ దంపతుల ఇంట్లో కొత్త ఆనందం వెల్లివిరిసింది. ఉషా వాన్స్ నాలుగో సంతానానికి జన్మనిచ్చారు. పుట్టింది మగ బిడ్డ అని, అతడికి ‘అలెక్ నీల్ వాన్స్’ అని పేరు పెట్టినట్లు జేడీ వాన్స్ స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆ పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి? ముఖ్యంగా భారతీయ మూలాలున్న ఉషా వాన్స్ కుటుంబ నేపథ్యంతో ‘నీల్’ పేరుకు ఏమైనా సాంస్కృతిక అనుబంధం ఉందా? అనే ఆసక్తి నెలకొంది.జేడీ వాన్స్ సోషల్ మీడియా వేదికగా శుభవార్తను పంచుకున్నారు. “ఉషా, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా పిల్లలు తమ చిన్ని తమ్ముడిని కలుసుకోవడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నారు” అంటూ ఆయన పేర్కొన్నారు. బిడ్డకు వైద్యం అందించిన వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ సెంటర్ వైద్యులు, సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.pic.twitter.com/VMCGCCRd7s— JD Vance (@JDVance) July 19, 2026ఆ పేరుకు అర్థం ఏంటంటే.. వాన్స్ దంపతులు తమ నాలుగో బిడ్డకు పెట్టిన అలెక్ నీల్ వాన్స్(Alec Neel Vance) ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అలెక్ (Alec) అనేది సాధారణంగా అలెగ్జాండర్ (Alexander) అనే పేరుకు సంక్షిప్త రూపంగా భావిస్తారు. గ్రీకు మూలాలున్న ఈ పేరుకు “రక్షకుడు”, “ప్రజలను కాపాడేవాడు” అనే అర్థాలు ఉన్నాయి.ఇక నీల్ (Neel) అనే పేరు భారతీయులకు సుపరిచితమైనది. సంస్కృతంలోని “నీల” అనే పదం నుంచి వచ్చిన ఈ పేరుకు నీలం రంగు, ఆకాశం, నీలి వర్ణం వంటి అర్థాలు ఉన్నాయి. భారత్‌లో ఈ పేరును ఎంతోమంది ఉపయోగిస్తారు. అయితే జేడీ వాన్స్, ఉషా వాన్స్‌లు ఈ పేరును ప్రత్యేకంగా భారతీయ మూలాలతో పెట్టారా? లేదంటే కుటుంబానికి సంబంధించిన మరేదైనా కారణం ఉందా? అనే విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. అయినప్పటికీ ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న వ్యక్తి కావడంతో.. ‘నీల్’ పేరు సాంస్కృతికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఆరుగురితో వాన్స్ కుటుంబంఅలెక్ రాకతో జేడీ వాన్స్, ఉషా వాన్స్‌ల కుటుంబం ఆరుగురు సభ్యులుగా మారింది. ఇప్పటికే ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఈవాన్ (Ewan) 2017లో జన్మించాడు. రెండో కుమారుడు వివేక్ (Vivek) 2020లో జన్మించగా.. కుమార్తె మిరాబెల్ (Mirabel) 2021లో జన్మించింది. ఇప్పుడు అలెక్ కుటుంబంలో నాలుగో చిన్నారి సభ్యుడిగా చేరాడు.నాలుగో బిడ్డ కోసం ఆసక్తికర కథనాలుగో సంతానం విషయంలో జేడీ వాన్స్ గతంలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అమెరికా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసే ముందు తన భార్య ఉషాతో ఈ విషయం గురించి మాట్లాడినట్లు తెలిపారు. “నాకు నాలుగో బిడ్డ కావాలని ఉషాతో చెప్పాను. అందుకు ఆమె.. ‘సరే.. కానీ నువ్వు అమెరికా ఉపాధ్యక్షుడవుతావా? లేక నాలుగో బిడ్డను పొందుతావా? రెండూ ఒకేసారి సాధ్యం కాదు’ అని చెప్పింది” అంటూ వాన్స్ సరదాగా వ్యాఖ్యానించారు. చివరకు తనకు ఉపాధ్యక్ష పదవి, నాలుగో బిడ్డ రెండూ లభించాయని ఆయన అన్నారు.ఉషా వాన్స్‌కు ఆంధ్రా మూలాలుజేడీ వాన్స్ భార్య ఉషా వాన్స్ భారతీయ మూలాలున్న అమెరికన్. ఆమె తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు కుటుంబ నేపథ్యానికి చెందినవారు. ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాల కోసం వారు అమెరికాకు వెళ్లారు. కాలిఫోర్నియాలో పెరిగిన ఉషా.. చిన్ననాటి నుంచే అమెరికా వాతావరణంలో పెరిగినా, కుటుంబం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో అనుబంధాన్ని కొనసాగించారు.అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ లా స్కూల్ (Yale Law School)లో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్‌తో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ 2013లో న్యాయ విద్య పూర్తి చేసి, 2014లో వివాహం చేసుకున్నారు. వీరి వివాహ వేడుక కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. హిందూ, క్రైస్తవ సంప్రదాయాలను కలిపి వివాహం చేసుకున్నారు.అత్తగారి కుటుంబంపై ప్రశంసలుజేడీ వాన్స్ గతంలో పలుమార్లు తన భార్య ఉషా కుటుంబం గురించి ప్రస్తావించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన ప్రశంసించారు. తన అత్తమామలు అమెరికా సమాజానికి ఎంతో సేవ చేశారని, కష్టపడి తమ స్థానాన్ని సంపాదించుకున్నారని పేర్కొన్నారు. -
అమెరికాలో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడి
అమెరికాలోని ఓ షాపింగ్ మాల్లో హైదరాబాద్ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్ టౌలిచౌకికి చెందిన సయ్యద్ సోహైల్‌పై ఓ దుండగుడు 15 సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్ సోహైల్.. వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. 37 ఏళ్ల సయ్యద్ సోహైల్.. గత రెండున్నరేళ్లుగా ఆ షాపింగ్ మాల్లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి.. అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్గా గుర్తించారు.ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి.. సోహైల్ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.Indian stabbed in US over his religionA 37-year-old Indian national Syed Sohailuddin was st*bbed more than 15 times at a kiosk inside Valley Fair Mall in West Valley City, Utah. Suspect Peter Michael Larsen, 48, allegedly told police he targeted the Muslim victim and intended… pic.twitter.com/6rso7E03XX— Piyush Rai (@Benarasiyaa) July 16, 2026 -
అమెరికాలో ఏపీ యువతి మృతి
అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి మృతి చెందింది. మృతురాలిని పల్నాడు జిల్లా వినుకొండ మండలం ఉమ్మడివరం గ్రామానికి చెందిన మక్కెన ప్రసన్నగా గుర్తించారు. ఆమె ఉన్నత చదువుల కోసం 2022లో అమెరికా వెళ్లారు. ఇటీవలే చదువు పూర్తి చేసిన ప్రసన్న ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు.న్యూజెర్సీలో ప్రసన్న తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె స్నేహితులకు గాయాలు కాగా, ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పెద్ద కుమార్తె మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రసన్న భౌతికకాయాన్ని వీలైనంత త్వరగా స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని.. సాయం అందించాలని కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రాహుల్, ఖర్గేకు ఓపెన్ లెటర్.. క్షమాపణ చెప్పాల్సిందే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జూలై 9న మెల్బోర్న్లోని మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 'మోదీ ఎయిర్వేస్' పేరుతో సిడ్నీ నుంచి మెల్బోర్న్కు ప్రత్యేక చార్టర్ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.నిర్వాహకుల్లో ఒకరైన అమిత్ కరంత్ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్, బ్రిస్బేన్, పెర్త్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్ క్రౌడ్' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్ క్రౌడ్'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.కాగా, మెల్బోర్న్లో జరిగిన 'మెల్బోర్న్ మీట్స్ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్ జసింటా అలన్ కూడా పాల్గొన్నారు. భారత్-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు. -
భారత సంతతి గూగుల్ లీడ్ ఇంజినీర్ దారుణ హత్య
అట్లాంటా: అమెరికాలో భారతీయ సంతతి మహిళ గృహ హింసకు బలయ్యారు. జార్జియాలో గూగుల్ సీనియర్ టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న భారతీయ అమెరికన్ మహిళను ఆమె భర్త తుపాకీతో కాల్చి చంపాడు. ఈ కాల్పుల్లో వారి కుమారుడు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. భార్యాభర్తల మధ్య చిన్న గొడవ చివరకు హత్యకు దారితీసింది. భర్త ఆవేశంలో తుపాకితో కాల్పులు జరపగా.. అడ్డుకోడానికి ప్రయత్నించిన కుమారుడ్ని కూడా చంపేందుకు తండ్రి ప్రయత్నించాడు.ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు కిర్క్ బి. వ్రజెసిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. జార్జియాలోని స్మిర్నా సిటీలో ఉన్న ఒక ఇంట్లో కాల్పులు జరిగినట్లు స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటలకు ముందు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు 57 ఏళ్ల శీతల్ వ్రజెసిన్ ఇంట్లో బుల్లెట్ గాయాలతో పడి ఉండటం కనిపించింది. తీవ్ర గాయాలతో ఆమె కన్నుమూశారు.గాయపడిన కుమారుడు జేసన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హత్యకు గురైన శీతల్ వ్రజెసిన్ గూగుల్‌లో ఇంజనీరింగ్ లీడర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టెక్నాలజీ రంగంలో వివిధ విభాగాల్లో ఆమెకు రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. గూగుల్‌లో చేరడానికి ముందు, ఆమె హోమ్ డిపోలో మొబైల్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించారు. కంపెనీ డిజిటల్ హోమ్ డెకర్, ఫర్నిషింగ్స్ వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించారు.ఇంగ్లాండ్, భారత్, ఘనా దేశాలలో పెరిగిన శీతల్.. ఆ తర్వాత కంప్యూటర్ సైన్స్‌లో ఉన్నత చదువుల కోసం అమెరికాలోని ప్రతిష్టాత్మక 'జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ'కి వెళ్లారు. ఆమె అట్లాంటాలో తన భర్త మరియు ఇద్దరు పిల్లలు (జేసన్, జెస్సికా)లతో కలిసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ పేటెంట్లలో ఆమె రెండు పేటెంట్లకు ఇన్వెంటర్‌గా గుర్తింపు పొందారు. -
భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్: ప్రధాని మోదీ
ఆక్లాండ్: భారత్ మార్కెట్ మాత్రమే కాదు.. లాంచ్ ప్యాడ్.. అంతర్జాతీయ వృద్ధికి భారత్ ప్రయోగాల వేదిక అంటూ ఆక్లాండ్‌లో జరిగిన ప్రవాస భారతీయుల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. భారత్-న్యూజిలాండ్' సరికొత్త ప్రయాణానికి సిద్ధంగా ఉందన్న మోదీ.. ఇరు దేశాల ముందు ‘అపారమైన అవకాశాల సముద్రం’ ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయాణ విజయానికి అసలైన దిశానిర్దేశకులు ఈ ప్రవాస భారతీయులేనంటూ పేర్కొన్నారు. ఈ దేశం నలుమూలలా భారతీయులు ఉన్నారని.. ఈ ప్రయాణం విజయవంతమవుతుందనే నమ్మకం ఉందన్నారు.న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇరుదేశాల ప్రధానుల చర్చించారు. వాణిజ్యం, పెట్టుబడులు, టెక్ సహా పలు అంశాల్లో మరిన్ని అవకాశాలపై భారత్ ఫోకస్ పెట్టింది. ఇరుదేశాల స్ట్రాటజిక్ పార్టనర్ షిప్ రోడ్ మ్యాప్-2030 ఆవిష్కరించారు. భారత్, న్యూజిలాండ్ దేశాలు శనివారం (జూలై 11, 2026) తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంపొందించుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్‌ల మధ్య జరిగిన చర్చల అనంతరం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య వార్షిక ద్వైపాక్షిక వస్తు, సేవల వాణిజ్యాన్ని రెట్టింపు చేసి రూ.35,000 కోట్లకు చేర్చాలని ఐదేళ్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి.ఈ సమావేశం ద్వారా 10 ఒప్పందాలతో కలిపి మొత్తం 18 నిర్దిష్ట ఫలితాలు వచ్చాయి. వాటిలో ప్రధానంగా రాబోయే నాలుగేళ్లలో సంబంధాలను విస్తరించుకోవడానికి ఒక రోడ్‌మ్యాప్, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర తీర సహకారాన్ని పెంపొందించుకోవడానికి కార్యాచరణ, భారత నౌకాదళం, న్యూజిలాండ్ రక్షణ దళాల మధ్య పరస్పర లాజిస్టిక్స్ మద్దతు ఒప్పందాలు జరిగాయి.ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా పెరుగుతున్న దూకుడు నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో సహకారాన్ని విస్తరించడమే ప్రధాన లక్ష్యంగా సాగిన మోదీ మూడు దేశాల పర్యటనలో ఆక్లాండ్ చివరి విడత. నిన్న రాత్రి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. ఇటీవల భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) తర్వాత ఈ పర్యటన జరగడం విశేషం. కాగా, హాకాతో ప్రధాని మోదీకి సంప్రదాయ స్వాగతం పలికారు. మావోరి సంప్రదాయ నృత్యం హాకాతో మోదీ గౌరవ వందనం స్వీకరించారు. హాకా కళాకారులను ప్రధాని మోదీ అభినందించారు. -
శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్
లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్‌ను నియమితులయ్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేపట్టారు. ఆయనను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో సభ్యుడిగా నియమించామని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.ఈ సందర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు తదితరులు లక్ష్మీ నరసింహన్ వాసన్, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌కు స్వాగతాభినందనలు తెలియచేశారు. లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.ఆయనకు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారతదేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు. -
YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఆధ్వర్యంలో డా. వై.ఎస్.ఆర్ జయంతి వేడుకలు
ఫీనిక్స్, అరిజోనా : మహానేత డాక్టర్ వై.యస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతిని YSRCP ఫీనిక్స్ ఎన్నారై కమిటీ ఘనంగా నిర్వహించింది. YSRCP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, YSRCP ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ చ ముఖ్యమంత్రి మాజీ సలహాదారు (విద్య) ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (ఎన్ఆర్ఐ వ్యవహారాలు) డాక్టర్ ప్రదీప్ చింతా గారు హాజరయ్యారు. డాక్టర్ వై.ఎస్‌కు పుష్పాంజలి ఘటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, ఆయన అద్భుతమైన జీవితం, దార్శనిక నాయకత్వం, ప్రజా సంక్షేమం పట్ల అచంచలమైన నిబద్ధతను తెలియజేస్తూ ఒక ప్రత్యేక ఆడియో-విజువల్ ప్రదర్శన జరిగింది.డా. వైయస్సార్‌తో తమ జ్ఞాపకాలను పలువురు పంచుకున్నారు. ఆయన వినయం, కరుణ, ధైర్యం, ప్రజా సేవ పట్ల అచంచలమైన అంకితభావాన్ని వారు గుర్తు చేసుకున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ను నిజమైన ప్రజానాయకుడు అంటూ ముఖ్య అతిథి ఆలూరు సాంబ శివారెడ్డి అభివర్ణించారు. సామాన్య పౌరులతో ఆయనకున్న అసాధారణ అనుబంధాన్ని, పరిపాలన పట్ల ఆయన అనుసరించిన పరివర్తనాత్మక విధానాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ నిరంతర సంక్షేమం, అభివృద్ధి కోసం డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి ఆదర్శాలను, దార్శనికతను ముందుకు తీసుకెళ్లడంలో మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ఆయన కోరారు.ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఎన్నారై చాప్టర్లను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన జగనన్న టెక్‌ఫోర్స్ కార్యక్రమాల గురించి కూడా ఆయన వివరించారు. సాఫ్ట్వేర్ నిపుణులు మరియు ఎన్నారైల కీలక పాత్రను నొక్కిచెబుతూ, పార్టీ ప్రపంచవ్యాప్త విస్తరణ,భాగస్వామ్యానికి సభ్యులు చురుకుగా పాల్గొని, తమ వంతు సహకారం అందించాలని ఆయన ప్రోత్సహించారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని తమ కుటుంబ సభ్యులు , స్నేహితులలో అవగాహన కల్పించడం ద్వారా ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో ఎన్నారైలు చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి అర్హతగల ఓటరు తమ వివరాలను సరిచూసుకుని, నమోదు ప్రక్రియను సరిగ్గా పూర్తి చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు.ముఖ్య అతిథి డా. ప్రదీప్ చింత, దివంగత డా. వై.ఎస్. స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం మరియు శాశ్వత వారసత్వం గురించి ప్రస్తావించారు. ఆయన పదవీకాలంలో ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ మరియు గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థలో అమలు చేసిన పరివర్తనాత్మక సంస్కరణల గురించి మాట్లాడారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో సోషల్ మీడియా కార్యకర్తలపై జరుగుతున్న అణచివేతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు, ప్రజా చైతన్యానికి మద్దతుగా సోషల్ మీడియా వేదికల ద్వారా చురుకుగా పాల్గొనాలని ఎన్నారైలకు పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల SIR పథకంపై ఒక వాక్‌త్రూ సెషన్‌ను నిర్వహించారు. SIR పథకం కింద ఓటరు వివరాలను ధృవీకరించుకోవడానికి, గణన పత్రాలను సరిగ్గా పూరించడానికి అవసరమైన దశలవారీ ప్రక్రియను ఆయన వివరించారు. నిర్దేశించిన కాలపరిమితిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు తమ కుటుంబ సభ్యులకు, స్థానిక సమాజాలకు మార్గనిర్దేశం చేయాలని పాల్గొన్నవారిని ప్రోత్సహించారు.డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి కమిటీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ముగిసింది. డాక్టర్ వై.ఎస్.ఆర్. ఆశించిన సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయం, సంక్షేమ ఆధారిత పాలన అనే ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతు కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను వక్తలు నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల అత్యంత ప్రియమైన నాయకులలో ఒకరికి ఈ కార్యక్రమాన్ని ఒక అర్థవంతమైన నివాళిగా మార్చడంలో పాల్గొన్న సభ్యులు, మద్దతుదారులు మరియు సామాజిక నాయకులందరికీ వైఎస్సార్సీపీ ఫీనిక్స్ ఎన్ఆర్ఐ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.ఈ కార్యక్రమంలో ధీరజ్ పోల, వంశీ ఏరువరం, చెన్నారెడ్డి మద్దూరి, సోమ శేఖర్ రెడ్డి యర్రపురెడ్డి, బోగారపు లక్ష్మీ & గురు, బలరాంరెడ్డి, శ్రీధర్ లక్కిరెడ్డి, రమేష్, శ్రీధర్ చెమిడ్తి, అంజిరెడ్డి, విఘ్నేష్, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కొండారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాసరెడ్డి, నాగేష్పొర్లక్లు పాల్గొన్నారు. శిరసనంబేడు, సాయి రోహిత్ చెరుకుమిల్లి, శ్రవణ్, విష్ణు చొప్పా, విజయ్, ప్రవీణ్, ప్రక్ష్, పురంధర్, శివ కోడూరు, నాగరాజు దాసరి, ప్రక్షా, లోకనాధ్, అనిల్ ప్రవీణ్ అవుతారు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ కార్యక్రమం ముగిసింది. -
రూ. 62 కోట్ల లాటరీ గెలిచిన భారత మహిళ
ఓ భారత మహిళ అబుదాబిలో జాక్‌పాట్ కొట్టింది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ. 62 కోట్ల లాటరీని గెలుచుకుంది. ఢిల్లీకి చెందిన కనికా అరోరా అనే గృహిణి కొన్న లాటరీ టికెట్‌కు రూ. 62 కోట్ల ప్రైజ్‌మనీ వరించింది. అబుదాబి బిగ్ టికెట్ సిరీస్‌లో భాగంగా ప్రతీనెల లాటరీ టికెట్ కొనే ఆ మహిళకు జూన్ 30వ తేదీన తీసిన లాటరీలో 25 మిలియన్ దిర్హమ్ల భారీ మొత్తం వరించింది. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకోవడంతో సదరు మహిళ ఉబ్బితబ్బిబ్బై పోతోంది. సంవత్సరాలుగా ఢిల్లీకి చెందిన ఆమె కుటుంబానికి బిగ్ టికెట్ ఎంట్రీ కొనడం నెలవారీ అలవాటుగా మారింది. గృహిణి అయిన కనికా అరోరా అబుదాబి బిగ్ టికెట్ సిరీస్ 288 డ్రాలో 25 మిలియన్ దిర్హమ్ల (AED) గ్రాండ్ ప్రైజ్ (సుమారు రూ. 62 కోట్లు) గెలుచుకుని, చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నారు.దీనిపై ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ కొన్నేళ్లుగా లాటరీ టికెట్లు కొంటూనే ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా ఆ టికెట్‌ను కొనుగోలు చేశాం. అబుదాబిలో లాటరీ టికెట్ల కొనుగోలులో ఒక రకమైన ప్రమాదం ఉన్నప్పటికీ, వాటిని మాత్రం ప్రతీనెలా కొంటూనే ఉన్నాం. ఇన్నాళ్లకు మా కల సాకారమైంది. లాటరీలో బహుమతి గెలిస్తే ఆ మొత్తాన్ని ఏం చేయాలో అనే దానిపై నా భర్త, నేను మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు నిజంగా గెలవడంతో ఎక్కడ నుంచి ప్రారంభించాలో కూడా తెలియడం లేదు. ప్రతీ ఒక్కరూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలి. మన కల ఎలా నిజమౌతుందో చెప్పలేం కదా’ అంటూ ఆనందం వ్యక్తం చేసిదామె. -
‘సర్’ ఎఫెక్ట్: 15 లక్షల ‘ప్రవాస’ ఓట్లు గల్లంతు!
గల్ఫ్ కార్మికుల ఓట్ల గల్లంతుపై అందిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కేసు నమోదు చేసింది. కరీంనగర్ టు గల్ఫ్.. ఓటు హక్కుపై నీలినీడలు కమ్ముకోవడంపై న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. 15 లక్షల మంది ప్రవాసాంధ్రుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న విషయాన్ని ఎన్హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లారు. పోర్టల్ లోపాల వల్ల వీసా పత్రాలు తిరస్కరణకు గురవుతున్నాయని న్యాయవాది రామారావు పేర్కొన్నారు. ఫామ్ 6A ఆన్లైన్ ఇబ్బందులతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదంలో గల్ఫ్ వలస కార్మికులు ఉన్నారని.. ఆయన పేర్కొన్నారు. ఓట్లతో పాటు ఆస్తుల హక్కులపైనా ప్రవాసులలో ఆందోళన నెలకొంది. అసంపూర్ణ అఫీషియల్ మ్యాపింగే కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.ప్రధానంగా ఓట్ల జాబితా సవరణ అంశానికి సంబంధించి మరింత సమయం ఇవ్వాలని ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదులో విన్నవించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనలను సరళీకృతం చేస్తే నిరక్ష్యరాస్యులు సైతం తమ ఓటు హక్కును కాపాడుకోగలుతారని, కాని పక్షంలో ఓట్ల గల్లంతు జరుగుతుందనే విషయాన్ని న్యాయవాది రామారావు ఇమ్మనేని మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. బయట దేశాల్లో ఉన్న ఇక్కడ ఓటర్లకు ఇంట్లో వాళ్ల ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చినా మాన్యువల్‌గా ఓటు నమోదు ప్రక్రియ కొనసాగేలే చూడాలన్నారు. ఓట్ల జాబితా సవరణలో భాగంగా సాంకేతిక ఆంశాల కారణంగా ఇలా ఓటు తిరస్కరణకు గురి కావడాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఈ అంశానికి సంబంధించిన ఫిర్యాదును రిజస్టర్ చేసిన ఎన్హెచ్ఆర్సీ.. తెలంగాణ సీఈఓ సుదర్శన్‌రెడ్డిని ప్రతివాదిగా చేర్చింది. -
డాలస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో డాలస్ లో నెలకొని ఉన్న అమెరికాలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలలో 350కి పైగా ప్రవాస భారతీయులు పాల్గొని విజయవంతం చేశారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కార్యదర్శి రావు కల్వల మాట్లాడుతూ.. గాంధీ మహాత్ముడు సైతం నిత్యం యోగా, ధ్యానం చేసేవారని, అలాంటి గాంధీవిగ్రహం ముందు ఈ యోగా దినోత్సవం జరుపుకోవడం సంతోషం అని అతిథులకు సాదర స్వాగతం పలికారు. కాన్సల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇవ్వడంతో ఈ తీర్మానం ఆమోదించబడింది. 2015లో మొదటి యోగా దినోత్సవం నిర్వహించినప్పటి నుంచి, ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు ఈ జూన్ 21న యోగాలో పాల్గొంటున్నారు. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలోనే పతంజలి మహర్షి ఈ యోగ సూత్రాలను భారతదేశం నుంచి ప్రపంచానికి అందించిన ఒక గొప్ప బహుమతి అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. ‘యోగా అనే పదానికి అర్థం - ఐక్యత. ఇది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య ఉన్న అనుసంధానాన్ని సూచిస్తుంది. యోగా సాధన చేయడం వల్ల శరీర సౌలభ్యం, బలం, సరైన భంగిమ, శ్వాస నియంత్రణ మెరుగుపడతాయి. అలాగే, నేటి వేగవంతమైన ప్రపంచంలో సాధారణంగా ఎదురయ్యే మానసిక ఒత్తిడులను, ఆందోళనలను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనస్సు, జీవితంపై సానుకూల దృక్పథాన్ని పెంపొం దించుకోవడానికి యోగాను మన జీవితంలో ఒక భాగంగా చేసుకుందామని మనం సంకల్పిద్దాం’ అని అన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ కో-ఛైర్మన్ మహేంద్ర రావు మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలగా ఈ గాంధీ మెమోరియల్ వద్ద క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఏటా పాల్గొనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ సభ్యులు దీపక్ కల్రా, మురళి వెన్నం, తైయబ్ కుండావాల, కళ కృష్ణమూర్తి, హరీష్ నేహతే, అనంత్ మల్లవరపు, వినోద్ ఉప్పు లతో సహా అనేక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు -
భారత్‌కు వస్తున్నారా?.. అయితే ఇది తప్పనిసరి
ఢిల్లీ: భారత్‌కు వచ్చే విదేశీ ప్రయాణికులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఎయిర్ సువిధ 2.0లో హెల్త్ డిక్లరేషన్ తప్పనిసరి చేసింది. ప్రయాణానికి 24 గంటల ముందే వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు 21 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆరోగ్య వివరాలు ఇవ్వాలి. ఇమ్మిగ్రేషన్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది.అంతర్జాతీయ ప్రయాణికుల కోసం భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) భాగస్వామ్యంతో 'ఎయిర్ సువిధ 2.0 పోర్టల్‌ను కొత్తగా అందుబాటులోకి తెచ్చింది. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించిన నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై నిఘా ఉంచేందుకు ఈ కాంటాక్ట్‌లెస్ హెల్త్ సెల్ఫ్-డిక్లరేషన్ పోర్టల్‌ను ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. ఇకపై భారతదేశానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరూ ఈ ఫామ్‌ను సమర్పించడం తప్పనిసరి.ఫామ్‌ను ఇలా నింపండి..భారతదేశానికి చేరుకోవడానికి ముందే ఈ ఎయిర్ సువిధ ఫామ్‌ను ఆన్లైన్లో పూర్తి చేయాలి. ఫామ్‌లో నమోదు చేసే వివరాలు మీ ఒరిజినల్ ప్రయాణ పత్రాలతో (పాస్‌పోర్ట్, టికెట్) సరిపోలాలి. విమానాశ్రయంలో వెరిఫికేషన్ కోసం అక్నాలెడ్జ్మెంట్ కాపీని తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి.స్టెప్ 1: వ్యక్తిగత, ప్రయాణ వివరాలుమీ పాస్‌పోర్ట్ వివరాలు, జాతీయత గత 21 రోజుల్లో మీరు ప్రయాణించిన దేశాల వివరాలను నమోదు చేయాలి. ముఖ్యంగా ఎబోలా ప్రభావిత దేశాలను సందర్శించారా అనే విషయాన్ని పేర్కొనాలి. వీటితో పాటు మీ ఫ్లైట్ నంబర్, ఇండియాలో మీరు దిగే మొదటి విమానాశ్రయం పేరు, మరియు ట్రాన్సిట్ (కనెక్టింగ్) దేశాల వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలి.స్టెప్ 2: వివరాలు, వెరిఫికేషన్భారతదేశంలోని మీ నివాస చిరునామా లేదా విదేశీ బస వివరాలు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని నమోదు చేయాలి. ఆ తర్వాత మీ మొబైల్/ఈమెయిల్‌కు వచ్చే OTP ద్వారా వివరాలను వెరిఫై చేయాలి.స్టెప్ 3: ఆరోగ్య సమాచారం మీరు గత 21 రోజుల్లో ఎబోలా ప్రభావిత దేశాల్లో పర్యటించినట్లు లేదా అక్కడ ఎవరికైనా ఈ వ్యాధి సోకినట్లు డిక్లేర్ చేస్తే మాత్రమే ఈ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏవైనా లక్షణాలు ఉన్నాయా అనే హెల్త్ సమాచారాన్ని ఖచ్చితంగా తెలియజేయాల్సి ఉంటుంది.స్టెప్ 4: రివ్యూ, సబ్మిట్మీరు ఇచ్చిన వివరాలన్నీ చట్టబద్ధంగా సరైనవేనని నిర్ధారించుకుంటూ, మీ వ్యక్తిగత, ఆరోగ్య సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి అంగీకరిస్తూ చెక్‌బాక్స్‌పై టిక్ చేయాలి. అనంతరం ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి.ఫామ్ సబ్మిట్ చేసిన అనంతరం..ఫామ్ విజయవంతంగా సబ్మిట్ అయిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్, అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అలాగే మీ మెయిల్‌కు కూడా కన్ఫర్మేషన్ వస్తుంది. ప్రయాణికులు ఈ అక్నాలెడ్జ్మెంట్ను డిజిటల్ రూపంలో ప్రింట్ తీసుకుని విమానాశ్రయంలోని హెల్త్ డెస్క్ వద్ద చూపించాల్సి ఉంటుంది. మీరు ఇచ్చిన వివరాల ఆధారంగా ఎయిర్పోర్ట్ పోర్ట్ హెల్త్ ఆఫీసర్ మీకు అవసరమైతే అదనపు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తారు. -
ఫిన్లాండ్లో విద్యార్థి మణిదీప్ రెడ్డి మిస్సింగ్
ఉన్నత విద్య కోసం ఫిన్లాండ్కు వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అదృశ్యమవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ అనే యువకుడు దాదాపు నెలరోజులకు పైగా కనిపించకుండా పోయాడు. అతని నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కాలేజీ యాజమాన్యాన్ని సంప్రదించినా సరైన సమాధానం లభించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్‌కు చెందిన మణిదీప్ రెడ్డి గుజ్జా ఉన్నత చదువుల కోసం ఫిన్లాండ్కు వెళ్లాడు. లాహ్టి (Lahti) నగరంలో ఉన్న ఎల్‌యూటీ యూనివర్సిటిలో విద్యను అభ్యసిస్తున్నాడు. అయితే మే నెల 5వ తేదీ నుంచి కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకపోయినట్లు తెలుస్తోంది. ఫోన్, సోషల్ మీడియా సహా ఏ మార్గంలోనూ అతనితో సంప్రదింపులు జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.మణిదీప్ అదృశ్యమైన విషయం గురించి కాలేజీ యాజమాన్యాన్ని, సిబ్బందిని పలుమార్లు సంప్రదించినప్పటికీ స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి గల్లంతైన విషయంపై కాలేజీ నుంచి కూడా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వారు చెబుతున్నారు.ఇప్పటికే పలు మార్గాల్లో అతడి ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్న కుటుంబ సభ్యులు, భారత విదేశాంగ శాఖతో పాటు ఫిన్లాండ్లోని భారత రాయబార కార్యాలయం జోక్యం చేసుకుని తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నెల 12వ తేదీనే హైదరాబాద్‌కు చెందిన ఓ లాయర్ మణిదీప్ మిస్సింగ్ మీద ఓ ట్వీట్ చేయడం గమనార్హం.. 🚨 MISSING IN FINLAND 🇫🇮Manideep Reddy Gujja has been missing in Finland.Family and friends are urgently seeking any information regarding his whereabouts.📍 Last Contacted: May 5, 2026🎓 University: LUT University📍 City: Lahti, FinlandContact +91 78932 87099— Nipun Tulsyan (@NipunTulsyan) June 12, 2026 -
మిస్సోరి విమాన ప్రమాదం : మృతుల్లో తెలుగు టెకీ సాయి కార్తీక వర్మ
వాషింగ్టన్: అమెరికాలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఘటనలో భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలైన ఘటన తీవ్ర దిగ్భ్రాంతి రేపింది. అమెరికాలోని మిస్సోరి (Missouri) రాష్ట్రంలో స్కైడైవింగ్ విమానం కుప్పకూలిన ప్రమాదంలో 24 ఏళ్ల భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయి కార్తీక్ వర్మ దాట్ల కూడా ఉన్నారని అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన మొత్తం 12 మందిలో ఆయన ఒక్కరే భారతీయుడు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాయి కార్తీక్ వర్మ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ 'యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరి' నుండి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, కాన్సాస్ సిటీలో హెల్త్‌కేర్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్నారు. గతంలో కాప్జెమినీ (Capgemini) లో పనిచేసిన ఆయన, ప్రస్తుతం అడ్వెంట్‌హెల్త్ (AdventHealth) సంస్థలో క్లౌడ్ మైగ్రేషన్, ఆటోమేషన్ ప్రాజెక్టులపై పనిచేస్తున్నారు. ఇదీ చదవండి : రూ. 14 వేల నుంచి రూ. 10 లక్షల స్కాం : ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వార్నింగ్కాన్సాస్ సిటీకి దక్షిణంగా 80 మైళ్ల దూరంలో ఉన్న బట్లర్ మెమోరియల్ ఎయిర్పోర్ట్ నుండి ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో విమానం టేకాఫ్ అయ్యింది. పైలట్‌తో పాటు 11 మంది స్కైడైవర్లతో ప్రయాణిస్తున్న 'పసిఫిక్ ఏరోస్పేస్ 750XL' విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిపోయింది. విమానం భూమికి దాదాపు 100 అడుగుల (30 మీటర్లు) ఎత్తులో ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఎడమవైపునకు తిరిగి, పొలాల్లో కూలిపోవడంతో మంటలు చెలరేగాయి. విమానంలో ఇంజన్ పవర్ తగ్గిపోవడం వల్లే పైలట్ హైవేపై ల్యాండ్ చేయడానికి ప్రయత్నించి ఉండవచ్చని ఎయిర్పోర్ట్ మేనేజర్ అభిప్రాయపడ్డారు. దీంతో విమానంలోవారందరూ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అమెరికా పారాచూట్ అసోసియేషన్ టెక్నాలజీ డైరెక్టర్ జెన్ షార్ప్ కూడా ఉన్నారు.ఇదీ చదవండి: ఒక్క రీల్‌కు రూ. 76 లక్షలు, లంచ్‌కి 20 లక్షలు : ఎలా?సాధారణ కమర్షియల్ విమానాల్లో ఉండేలాంటి 'బ్లాక్ బాక్స్' (డేటా రికార్డర్) ఈ చిన్న విమానంలో లభ్యం కాలేదు. దీంతో ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకోవడానికి ఇతర డిజిటల్ పరికరాలు, సాక్షుల ప్రకటనలు, వీడియోలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గురైన పసిఫిక్ ఏరోస్పేస్ 750XL అనేది సింగిల్-ఇంజిన్ టర్బోప్రాప్ విమానం. ఇది స్కైడైవింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది. ఈ విమానం ప్రమాదానికి ముందు కూడా తొమ్మిదిసార్లు విజయవంతంగా ప్రయాణించిందని విమాన ట్రాకింగ్ సంస్థ తెలిపింది.ఇదీ చదవండి: NEET UG Re-Exam 2026 మరో చదువుల తల్లి ఊపిరి ఆగిపోయింది! -
యూట్యూబర్ నందు కేసులో విస్తుపోయే అంశాలు
సాక్షి, హైదరాబాద్: జాగర్లమూడి మధుకర్, రమానందన వ్యవహారంలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. కంపెనీలు ఏర్పాటు చేసి సీవోఎస్‌లు ఇవ్వడం జాగర్లమూడి కపుల్‌కు వెన్నతో పెట్టిన విద్య అంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి లక్షల రూపాయలు నందు దంపతులు వసూలు చేశారు. యూకేలో వీసా, జాబ్స్ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారు.యూకేలో సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇస్తామంటూ నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన నందు దంపతులపై చట్టపరంగా పోరాటానికి రెడీ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌తో రమానందన మోసం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇచ్చే అర్హతను నందూస్ వరల్డ్ కిచెన్ కోల్పోయింది. జాగర్లమూడి కంపెనీలకు యూకే సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్ షిప్ ఇవ్వకుండా బ్రేక్ పడింది.యూకే వీసా కేసులో నందూస్ వరల్డ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీసా కేసులో బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తున్నారు. నేరం రుజువైతే రమానందన, మధుకర్‌కు యూకేలో పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశముంది. జైలు శిక్ష తర్వాత పాస్‌పోర్టు రద్దు చేసి ఇండియాకు పంపే అవకాశాలు ఉన్నాయి. -
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. -
లండన్‌లో భారతీయ కుటుంబం అనుమానాస్పద మరణం
లండన్‌లో విషాదం చోటుచేసుకుంది. లండన్‌లోని ఒక విలాసవంతమైన నివాస భవనంలో 36వ అంతస్తు బాల్కనీ నుండి కింద పడి భారత సంతతికి చెందిన దంపతులు, వారి తొమ్మిదేళ్ల కుమారుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపింది. ఈ ఘటన మే 27న దక్షిణ లండన్‌లోని 46 అంతస్తుల భవనంలో జరిగింది.మే 27న భవనం 36వ అంతస్తులపైనుంచి కింద పడ్డారని ప్రత్యక్ష సాక్షులు సమాచారం ఇవ్వడంతో అత్యవసర సేవా సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారామెడిక్స్ వారిని బతికించడానికి ప్రయత్నించినప్పటికీ, రాకేష్ పై (47), ఆయన భార్య అదితి పరల్కర్ (46) తొమ్మిదేళ్ల కుమారుడు సిద్ (9) అక్కడికక్కడే మరణించినట్లు నిర్ధారించారు. ఇది ఆత్మహత్యా లేక హత్య అనే సందేహాలు వెల్లువెత్తాయి.సిద్‌కు తీవ్ర అనారోగ్య సమస్యలున్నాయని, ఇదే వారి ఆత్మహత్యకు ప్రేరేపించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. రాకేశ్, ఆదితి 2020లో భారత్‌లో తమ కుమారుడికి వైద్యం చేయించారని, అయినప్పటికీ పరిస్థితి మెరుగు పడకపోవడం, ఇక దీనికి చికిత్స లేదని వైద్యులు తేల్చి చెప్పడంతో వారు లండన్‌కు తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది.ఘోర విషాదం, ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం చాలా బాధాకరం, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో యూకేలోనే పుట్టాడని, ఆ సమస్యలే వారు ఈ ఘోరానికి దారితీసి ఉండవచ్చని స్థానిక ఎంపీ నీల్ కోయల్ ఆ భవన నివాసితులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.ఈ దంపతులు ఫైనాన్స్ , నిర్మాణ రంగ కన్సల్టింగ్ విభాగాల్లో పనిచేసేవారు. ఫ్రెండ్స్ అంతా వీరిని 'ఆది' 'రాబిన్' అని పిల్చుకునే వారు. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సిద్ అనారోగ్యం విషయంలో అదితి బాగా ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నట్టు అనిపించినా, రాబిన్ ప్రశాంతంగా, పరిస్థితులను మేనేజ్ చేసేవాడని గుర్తు చేసుకున్నారు.మరోవైపు ఈ విషాదానికి కొన్ని వారాల ముందు, వీరి ఇంటినుంచి అరుపులు కేకలు వినిపించాయని పొరుగువారు పోలీసులకు చెప్పారు. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నామని, కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు ప్రకటించారు. ఇదీ చదవండి: రూ 19 కోట్లు దాచేసి : భార్యకు చుక్కలు చూపించిన భర్త -
అమెరికాలో మెరిసిన తెలుగు తేజం
టాంపా, ఫ్లోరిడా: అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో టాంపా తెలుగమ్మాయి విశేషగా నిలిచింది. అమెరికా స్టెయిన్ బ్రెన్నర్ హైస్కూల్ (ఫ్లోరిడా)లో 10వ తరగతి చదువుతున్న తెలుగు విద్యార్థిని ఇషాన్వి సబ్నివీసు అమెరికా జాతీయ స్థాయి ఇన్నోవేషన్ పోటీలో ద్వితీయ బహుమతి సాధించింది. అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మక విద్యార్థుల ఆవిష్కరణల పోటీలలో ఒకటైన ఇన్వెన్షన్ కన్వెన్షన్ యూఎస్ నేషనల్స్‌లో, 35 రాష్ట్రాల నుండి పాల్గొన్న 3 లక్షల మందికి పైగా విద్యార్థులతో పోటీపడి ఆమె ఈ ఘనత సాధించింది. దృష్టి లోపం ఉన్నవారి కోసం రూపొందించిన “ఏఐ-ఎనేబుల్డ్ స్మార్ట్ కేన్ (Smart Cane)” అనే వినూత్న ఆవిష్కరణకు గాను ఆమెకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే పేటెంట్ దరఖాస్తు దశలో ఉంది. ఇషాన్వి జాతీయ స్థాయి ప్రయాణం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో జరిగిన ప్రాంతీయ ఇన్వెన్షన్ కన్వెన్షన్ నుండి ప్రారంభమైంది.స్మార్ట్ కేన్ ప్రత్యేకతలుఈ స్మార్ట్ కేన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తులు స్వతంత్రంగా, సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడేలా ఆధునిక AI సాంకేతికతతో రూపొందించబడింది.రియల్ టైమ్ AI ఆధారిత వాతావరణ విశ్లేషణ వ్యవస్థఆన్-డివైస్ (Large Language Models) ద్వారా ప్రాసెసింగ్బ్లూటూత్ ఇయర్‌పీస్ ద్వారా వాయిస్ మార్గనిర్దేశంఇంటర్నెట్ అవసరం లేకుండా పూర్తిగా ఆఫ్‌లైన్‌లో పనిచేసే సామర్థ్యం కలిగి ఉంటుందిఅడ్డంకులను ముందుగానే గుర్తించే (Obstacle Detection) వ్యవస్థతప్పు గుర్తింపులను తగ్గించే False Detection Suppression టెక్నాలజీఒకే టచ్‌తో అత్యవసర కాల్స్ చేసే ఎమర్జెన్సీ ఫీచర్గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో కూడా ఇది సమర్థవంతంగా ఉపయోగపడే విధంగా రూపొందించబడింది. అంతేకాకుండా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మద్దతుగా ‘క్రానిక్ కనెక్ట్’ అనే నాన్-ప్రాఫిట్ కమ్యూనిటీని కూడా ఆమె స్థాపించారు. ఇషాన్వి విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగువారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఆమె సాధించిన విజయం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తోందన్నారు. మరోవైపు తెలుగు సమాజానికి గర్వకారణమవుతుందని విధ్యార్దిని ఇషాన్వి సబ్నివీసు తెలిపింది.దీనికి హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ క్వాడ్రిక్ ఐటీ యువ ఆవిష్కర్తలకు AI, టెక్నాలజీ మార్గదర్శకత్వం, సాంకేతిక సహాయం అందిందించింది. ఇషాన్వి లాంటి యువ ఆవిష్కర్తలు ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందిస్తూ భవిష్యత్ టెక్నాలజీ దిశను నిర్దేశిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు. -
కోటి రూపాయల ఉద్యోగం.. జాయినింగ్‌కు ముందే విషాదం..!
నల్గొండ జిల్లా: అమెరికాలో స్నేహితులతో కలిసి నది వద్దకు వెళ్లిన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన యువకుడు నదిలో జారిపడిన ముగ్గురు స్నేహితులను కాపాడి తాను నీటిలో మునిగి మృతిచెందాడు. వివరాలు.. శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన చెందిన కోడూరు రాజేందర్‌రెడ్డి, దుర్గాభవాని దంపతులకు అశ్రిత్‌రెడ్డి, అనురూప్‌రెడ్డి(22) సంతానం. ప్రస్తుతం వారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కవాడిపల్లిలో స్థిరపడ్డారు. రాజేందర్‌రెడ్డి ఇద్దరు కుమారులు ఉన్నత చదువుల కోసం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రానికి వెళ్లారు. అశ్రిత్రెడ్డిది గతేడాది ఎంఎస్ పూర్తికాగా.. అనురూప్రెడ్డిది ఇటీవలే కంప్యూటర్ సైన్స్‌లో ఎంఎస్ పూర్తిచేశాడు. అశ్రిత్రెడ్డికి ఉద్యోగం రాకపోగా.. అనురూప్‌రెడ్డికి ఇటీవలే కోటి రూపాయల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. కానీ ఉద్యోగానికి సంబంధించిన ఓటీపీ రాకపోవడంతో ఉద్యోగంలో చేరలేదు.స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి..అశ్రిత్‌రెడ్డి, అనురూప్రెడ్డితో పాటు మరో నలుగురు స్నేహితులు అమెరికాలో ఒకే ఇంట్లో నివాసముంటున్నారు. గత నెల 29న తన స్నేహితుడి పుట్టినరోజు వేడుక కోసమని అనురూప్‌రెడ్డి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి టెక్సాస్–లూసియానా సరిహద్దులో ఉన్న ‘టొలెడోబెండ్ రిజర్వాయర్’ వద్దకు వెళ్లారు. అక్కడ అనురూప్‌రెడ్డి ఫోన్‌కాల్ మాట్లాడుతుండగా.. అతడి ముగ్గురు స్నేహితులు సరదాగా చేపలు పడుతూ కాలుజారి నది ప్రవాహంలో కొట్టుకుపోయారు. పక్కనే ఉన్న మరో స్నేహితుడు కేకలు వేయడంతో అనురూప్‌రెడ్డి వెంటనే నీటి ప్రవాహంలోకి దూకి ముగ్గురు స్నేహితులను ఒడ్డుకు చేర్చాడు. తాను కూడా ఒడ్డుకు చేరే క్రమంలో ఫిషింగ్ వైరు కాళ్లకు చుట్టుకుని నీటిలో మునిగి మృతిచెందాడు. అక్కడి రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి 20 అడుగుల లోతున ఉన్న అనురూప్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు వెలికితీశాయి. చదువులో చురుకుఅనురూప్రెడ్డి హైదరాబాద్‌లోని గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఇంజనీరింగ్ మూడో సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ సెలక్షన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ రూ.40లక్షల వార్షిక వేతన ప్యాకేజీతో అనురూప్‌రెడ్డికి ఉద్యోగ ఆఫర్ ఇచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను కాదని అతడు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు.నేడు హైదరాబాద్‌కు రానున్న మృతదేహం..అనురూప్‌రెడ్డి మృతదేహం మంగళవారం ఉద యం హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని కవాడిపల్లిలోని వారి నివాసానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
దుబాయ్‌లో ఘోరం.. ఏడుగురి భారతీయులు మృతి
దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు మృతి చెందగా.. 9 మంది గాయపడ్డారు. "దుబాయ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమని దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పేర్కొంది.ప్రమాదానికి గల కారణాలను దుబాయ్ పోలీసు ట్రాఫిక్ జనరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జుమా సలేం బిన్ సువైదాన్ వివరిస్తూ.. సాంకేతిక లోపం కారణంగా ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో ట్రక్కు అకస్మాత్తుగా ఆగిపోయినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని చెప్పారు. ప్రమాదానికి గురైన ట్రక్కు, బస్సులను రోడ్డుపై నుండి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.బస్సు డ్రైవర్ అప్రమత్తంగా లేకపోవడం.. సరైన సురక్షిత దూరం పాటించకపోవడం వల్లే వెనుక నుంచి వచ్చి ట్రక్కును బలంగా ఢీకొట్టినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిని భారత రాయబార కార్యాలయ అధికారులు పరామర్శించారు. -
ట్రంప్ బృందం నుంచి తప్పుకున్న ఏఐ సలహాదారు
వైట్‌హౌస్ ఏఐ సలహాదారు శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా చేశారు. ఈ నెలాఖరున పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. డొనాల్డ్ ట్రంప్ పాలనలో శ్రీరామ్ కీలక పాత్ర పోషించారు. 18 నెలల పాటు ఆయన సేవలందించారు. తాను కొంతకాలం విరామం తీసుకుని,.. ఆ తర్వాత అమెరికా ఎదుర్కొంటున్న ప్రధాన ఏఐ సంబంధిత సవాళ్లపై తిరిగి పని చేస్తానంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కృష్ణన్ ప్రభుత్వంలో తన సేవను జీవితకాలపు ప్రత్యేక హక్కుగా అభివర్ణించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో సేవ చేయడం గౌరవం. ఆయన నాయకత్వం లేకపోతే మనం ఏఐ రేసులో ముందంజలో ఉండేవాళ్లం కాదంటూ ఆయన పేర్కొన్నారు.వైట్ హౌస్ ఏఐ, క్రిప్టో సలహాదారు డేవిడ్ సాక్స్‌కు కూడా ఆయన ధన్యవాదాలు తెలుపుతూ.. ఏఐ రంగంలో అమెరికా విజయం సాధించాలనే ఆయన నిరంతర మద్దతు ఎంతో కీలకమైందని.. అది కొనసాగుతూనే ఉంటుందన్నారు. తన పదవీకాలంలో తాను అభివృద్ధి చేయడంలో సహాయపడిన పలు కార్యక్రమాలను కృష్ణన్ ప్రధానంగా ప్రస్తావించారు.వీటిలో అమెరికన్ ఏఐ యాక్షన్ ప్లాన్'ను రూపొందించడం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ ఏఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉద్దేశించిన ఏఐ యాక్సిలరేషన్ పార్టనర్‌షిప్‌లను ముందుకు తీసుకెళ్లడం, 'నేషనల్ ఏఐ పాలసీ ఫ్రేమ్‌వర్క్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సహకారం అందించడం, అంతర్జాతీయంగా ఏఐ సదస్సులు, దౌత్యపరమైన చర్చల ద్వారా అమెరికన్ ఏఐ ప్రయోజనాలను ప్రోత్సహించడంలో తన పాత్రను కూడా ఆయన గుర్తుచేసుకున్నారు. కృత్రిమ మేధస్సు వేగవంతమైన పరిణామంగా కృష్ణన్ పేర్కొన్నారు.చెన్నైలో జన్మించిన కృష్ణన్.. ఎస్ఆర్ఎంఇంజనీరింగ్ కాలేజ్ నుంచి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2005లో అమెరికాకు వెళ్లారు. కృష్ణన్ ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పెరిగారు. ఆయన తండ్రి ఇన్సూరెన్స్ రంగంలో పనిచేశారు. తల్లి గృహిణి. ఆయన 21 సంవత్సరాల వయస్సులో మైక్రోసాఫ్ట్ సంస్థతో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ ఆయన విండోస్ అజూర్ వ్యవస్థకు ఫౌండింగ్ మేనేజర్‌గా పనిచేశారు.ట్రంప్ ప్రభుత్వంలో చేరడానికి ముందు, కృష్ణన్ 'ఆండ్రీసెన్ హోరోవిట్జ్' వెంచర్ క్యాపిటల్ సంస్థలో జనరల్ పార్ట్నర్గా ఉన్నారు. అంతకుముందు ఫేస్బుక్, ట్విట్టర్లలో కూడా వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా ఎలాన్ మస్క్ 'వార్ రూమ్'లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ నుండి 'ఎక్స్ గా మార్చే ప్రక్రియలో ఆయన సహాయం అందించారు. -
ప్రాణాలతో పోరాడుతుంటే.. సంకెళ్లు వేశారు!
కత్తిపోట్లకు గురై రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతున్న ఓ యువకుడికి సాయం చేయాల్సిన పోలీసులు.. అతడికే సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. బ్రిటన్‌లో వైరల్‌గా మారిన ఈ ఘటన.. ఇప్పుడు అట్లాంటిక్‌కు ఇరువైపులా రాజకీయ దుమారం రేపుతోంది. బాధితుడిని నిందితుడిగా భావించి పోలీసులు వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతుండగా.. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కేవలం ఒక హత్య కేసు మాత్రమే కాదని, పాశ్చాత్య సమాజాలు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యలకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు. గత ఏడాది డిసెంబర్లో బ్రిటన్‌లోని సౌతాంప్టన్ నగరంలో 18 ఏళ్ల హెన్రీ నోవాక్ అనే విద్యార్థిపై సిక్కు కమ్యూనిటీకి చెందిన విక్రమ్ దిగ్వా అనే 23 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో నేలపై కుప్పకూలిన హెన్రీ ప్రాణాల కోసం పోరాడుతుండగా ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. అయితే అక్కడ జరిగిన పరిణామాలు తర్వాత తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.దాడి చేసిన విక్రమ్ దిగ్వా తానే బాధితుడినని, హెన్రీ తనపై జాత్యహంకార వ్యాఖ్యలు చేశాడని పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో పోలీసులు తొలి దశలో హెన్రీనే అనుమానితుడిగా భావించినట్లు ఆరోపణలు వచ్చాయి. తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉన్న యువకుడికి బేడీలు వేసినట్లు వెలుగులోకి వచ్చిన వీడియోలు, నివేదికలు బ్రిటన్‌లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. అనంతరం హెన్రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఘాటుగా స్పందించారు. "హెన్రీ నోవాక్ మరణం విషాదకరమే కాదు.. ఆగ్రహం తెప్పించే ఘటన" అని పేర్కొన్నారు. అతడు చేయని నేరానికి ద్వేష నేరస్థుడిగా ముద్రవేశారని, అధికార యంత్రాంగం అతడిని విఫలమైందని విమర్శించారు. హెన్రీ మరణం ఒక వ్యక్తి విషాదం మాత్రమే కాదని, సమాజం ఎలా స్పందిస్తుందన్న ప్రశ్నను కూడా లేవనెత్తుతోందని వ్యాఖ్యానించారు.ఇదే సందర్భంగా యూరప్‌లో వలస విధానాలపై కూడా వాన్స్ విమర్శలు గుప్పించారు. గత కొన్ని దశాబ్దాలుగా తీసుకున్న రాజకీయ నిర్ణయాలు ఇలాంటి పరిస్థితులకు కారణమయ్యాయని అన్నారు. పాశ్చాత్య దేశాలు తమ విలువలను కాపాడుకోవడంలో విఫలమవుతున్నాయంటూ వ్యాఖ్యానించారు.వాన్స్ వ్యాఖ్యలకు ముందు అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ కేసుపై స్పందించింది. సిద్ధాంతపరమైన పక్షపాతం, రెండు రకాల పోలీసింగ్ విధానాల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించింది. దీంతో ఈ కేసు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.అయితే అమెరికా వ్యాఖ్యలను బ్రిటన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రయత్నాలను అంగీకరించబోమని ప్రధాని కీర్ స్టార్మర్ కార్యాలయం స్పష్టం చేసింది. విద్వేషాన్ని, విభజనను రెచ్చగొట్టే వ్యాఖ్యలు బాధ్యతాయుతమైనవి కావని పేర్కొంది. మరోవైపు హెన్రీ నోవాక్ కుటుంబ సభ్యులు కూడా తమ కుమారుడి మరణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించవద్దని కోరారు. ఈ విషాదం మరింత ద్వేషానికి, సామాజిక విభజనకు కారణం కాకూడదని విజ్ఞప్తి చేశారు.అయితే ఈ ఘటనపై చర్చ మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు స్పందించగా.. ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలతో ఈ కేసు మరోసారి అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. ఒక యువకుడి హత్యగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు బ్రిటన్ పోలీసుల పనితీరు, వలస విధానాలు, సామాజిక ఉద్రిక్తతలపై పెద్ద చర్చకు దారితీసింది. -
23 ఏళ్ల పోరాటం.. రూ.85 కోట్లు.. అసలేంటి ఈ కథ?
యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్‌కు తన పాత విడాకుల సెటిల్మెంట్ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది. -
న్యూజిల్యాండ్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ నగరంలో న్యూజిల్యాండ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సాధనలో ఆత్మార్పణం చేసిన అమరవీరులకు నివాళి అర్పించి, అమరవీరుల తల్లులకి మరియు తెలంగాణ ప్రజానీకానికి ఉద్యమ వందనాలు తెలియచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్, ప్రముఖ గాయని దాసరి మేఘన నాయుడు, యువ గాయకుడు సుస్వర తరంగ్ పాల్గొని తెలంగాణ ఉద్యమ పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రవాస తెలుగు ప్రజలను ఉర్రూతలూగించారు. అసోసియేషన్ అధ్యక్షులు కోడూరి చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఇండియన్ కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ మోహన్ కుమార్ సేథి ముఖ్య అతిథిగా హాజరై ప్రవాస తెలంగాణ ప్రజానీకానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కోడూరి చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో, రాష్ట్ర సాధనలో అమరులైన ఉద్యమ వీరులను త్యాగాలను స్మరించుకుని తెలుగు ప్రజల ఐక్యత గొప్పతనాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కి ఇంతకాలం నుంచి మద్దతు అందిస్తున్న ట్రాన్స్ పసిఫిక్ డైరెక్టర్ తమ్మినేని రోహిత్ రెడ్డిని సన్మానించారు. గాయని గాయకులు వందేమాతరం శ్రీనివాస్, దాసరి మేఘన నాయుడు, సుస్వర తరంగ్‌ని ఘనంగా సత్కరించారు.ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్ బాల గారు సభకు విచ్చేసిన అతిధులకు ధన్యవాదాలు తెలిపిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ పూర్వ అధ్యక్షులు పట్లోళ్ల నరేందర్ రెడ్డితో పాటు ప్రవాస భారతీయ ప్రముఖులైన రోహిత్ తమ్మినేని, దయానంద్ కటకం, జగదీశ్వర్ రెడ్డి పట్లోళ్ల, విజేత యాచమనేని, మధు ఎర్ర, వర్ష పట్లోళ్ల, స్వాతి మేకల,కావ్యా మాశెట్టి, కిరణ్మయి పద్మ, విశ్వనాథ్ అవిటి, మహమ్మద్ బిలాలుద్దీన్, హరీష్ గోపాల్, మనోహర్ కన్నం, శ్రీనివాస్ పందిళ్ళ, రమేష్ రెడ్డి రామిండ్ల, శ్రీరామ్ విజయ్, శ్రీనివాస్ గాజుల, ప్రమోద్ ఇరుగు, అనిల్ మెరుగు, రమేష్ ఆడెపు, రవి కుమార్ వట్టం, మారుతి జెల్ల, మహేందర్ రెడ్డి ద్యావ, శ్రీనివాస్ కలకోట తదితరులు హాజరయ్యారు. -
ఆటా సభలకు వైఎస్ జగన్‌కు ఆహ్వానం
సాక్షి,తాడేపల్లి: అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్(ఆటా) మహాసభలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కోఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయసింహారెడ్డి చల్లా, రామాంజుల రెడ్డి తదితరులు.. 2026 జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్న 19వ ఆటా మహాసభల ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆటా ప్రతినిధులతో వైఎస్ జగన్ ఆత్మీయంగా మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు. ఆటా సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ మహాసభలు ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.అమెరికాతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు పాల్గొనే ఈ వేడుకలు తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఆటా ప్రతినిధులు సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు, మహాసభల ఏర్పాట్ల గురించి వైయస్ జగన్‌కు వివరించారు. -
కువైట్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి
కువైట్: ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో ఓ భారతీయ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదం పట్ల కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపైకి డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో కువైట్ ఎయిర్‌పోర్టుపై జరిగిన దాడిలో భారతీయుడు మృతి చెందినట్లు భారత ఎంబసీ వెల్లడించింది.మృతుడి కుటుంబంతో సంప్రదింపులు జరుపుతోందని.. బాధిత కుటుంబానికి.. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారికి సాయం అందించడానికి కువైట్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఎంబసీ అధికారులు వెల్లడించారు. కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. ఇరాన్ అమెరికా (US) మధ్య పెరిగిన ఉద్రిక్తతల నడుమ ఈ దాడి జరిగింది. ఈ దాడిలో ఒకరు మరణించడమే కాకుండా.. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాకిన ఇరాన్ డ్రోన్లతో ప్యాసింజర్ టెర్మినల్‌కు భారీ నష్టం కలిగింది.Embassy of India in Kuwait expresses its deepest condolences at the tragic demise of an Indian national due to an attack on the airport in Kuwait today. The Embassy is in touch with the bereaved family and is closely coordinating with the Kuwaiti authorities to render all…— India in Kuwait (@indembkwt) June 3, 2026కాగా, కువైట్‌లోని అమెరికా బలగాలను లక్ష్యంగా చేసుకుని వచ్చిన పలు డ్రోన్లను తాము అడ్డుకున్నామని.. ఆ దేశం వైపు ప్రయోగించిన ఇరాన్ క్షిపణులు మార్గమధ్యంలోనే కూలిపోయాయని అమెరికా సైన్యం తెలిపింది. అమెరికా నౌకాదళానికి చెందిన ఐదో విమాన దళం ఉన్న బహ్రెయిన్‌ను లక్ష్యంగా చేసుకుని వచ్చిన క్షిపణులు, డ్రోన్లను కూడా అమెరికా, బహ్రెయిన్ బలగాలు అడ్డుకున్నట్లు పేర్కొంది. దీనికి ప్రతిచర్యగా, హార్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో ఉన్న ఇరాన్ సైనిక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌పై అమెరికా దాడులు చేసింది. -
చిన్న పొరపాటు.. లక్షకు పైగా ట్రాఫిక్ చలానా!
విదేశీ పర్యటన అంటే.. ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, అందమైన ఫొటోలు, కొత్త అనుభవాలు గుర్తుకు వస్తాయి. కానీ ఓ భారతీయ మహిళకు మాత్రం అదొక చేదు అనుభవాన్నే మిగిల్చింది. హాయిగా ఫారిన్ ట్రిప్పు పూర్తి చేసుకుని వచ్చిన ఆమెకు.. ఏడాది తర్వాత పెద్ద షాకే తగిలింది. అది చూసి ఖంగుతినడం.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అయ్యో ఆంటీ అనుకోవడం నెటిజన్ల వంతు అవుతోంది. పోన్ సప్డీ అనే మహిళ తన స్విట్జర్లాండ్‌లో పర్యటన సందర్భంగా ఎదురైన అనుభవాన్ని ఇప్పుడు నెట్టింట పంచుకుంది. ఆ సమయంలో జరిగిన ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన జరిమానా ఏడాది తర్వాత అందిందని వెల్లడించారు. ‘‘స్విట్జర్లాండ్ టూర్ నుంచి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ఇప్పుడు దాదాపు లక్ష రూపాయలకు పైగా(ఇండియన్ కరెన్సీ ప్రకారం) జరిమానా నోటీసు వచ్చింది. దీనిపై అప్పీల్ చేసే అవకాశం ఉందా? జరిమానా తగ్గించుకోవచ్చా? లేక ఆలస్య రుసుమును మాఫీ చేయించుకోవచ్చా?’’ అని ఆమె ప్రశ్నించారు.ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. లక్షలాది మంది స్పందించారు. కొందరు తమ అనుభవాలను పంచుకోగా, మరికొందరు స్విట్జర్లాండ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించారు. అక్కడ జరిమానాలు ఆదాయం, ఉల్లంఘన తీవ్రత ఆధారంగా భారీగా ఉంటాయని, అద్దె కార్లు తీసుకున్న పర్యాటకుల వివరాలను రెంటల్ కంపెనీలు అధికారులకు అందిస్తాయని పేర్కొన్నారు.Has anyone here received a traffic violation fine from Switzerland months after returning from a vacation?We just received a challan of almost ₹1 lakh, nearly a year after our trip. We’re trying to understand if there’s any way to appeal, reduce, or get it waived.— Poan Sapdi (@Poan__Sapdi) May 30, 2026‘‘జరిమానాను నిర్లక్ష్యం చేస్తే వడ్డీలు పెరుగుతాయి. భవిష్యత్తులో షెంగెన్ వీసా లేదంటే యూరప్ పర్యటనలపై ప్రభావం పడే అవకాశం ఉంది’’ అని పలువురు హెచ్చరించారు. మరికొందరు జరిమానా మొత్తంపై అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని, ముఖ్యంగా ఏడాది ఆలస్యంగా సమాచారం అందిన నేపథ్యంలో లేట్ ఫీజుపై అప్పీల్ చేసే అవకాశం ఉందని సూచించారు. దీనిపై స్పందించిన మహిళ.. ‘‘జరిమానా చెల్లించకుండా ఉండాలనుకోవడం లేదు. కానీ ఏడాది తర్వాత సమాచారం అందినందున ఆలస్య రుసుముపై అభ్యంతరం చెప్పాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.ఈ ఘటనతో విదేశాలకు వెళ్లే భారతీయ పర్యాటకుల మధ్య మరోసారి చర్చ మొదలైంది. ముఖ్యంగా యూరప్‌లో అద్దె కార్లు తీసుకునే వారు స్థానిక ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా తెలుసుకోవాలని, చిన్న పొరపాటు కూడా భారీ జరిమానాలకు దారితీయవచ్చని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సెలవుల జ్ఞాపకాలు మసకబారిపోయిన తర్వాత కూడా విదేశీ ట్రాఫిక్ కెమెరాలు మాత్రం తమ పని మరిచిపోవని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.షెంగెన్ వీసా (Schengen Visa) అనేది ఐరోపాలోని షెంగెన్ ఒప్పందంలో భాగమైన పలు దేశాల్లో ఒకే వీసాతో ప్రయాణించేందుకు అనుమతించే వీసా. ఈ వీసా ఉంటే ఒక్కో దేశానికి విడిగా వీసా తీసుకోవాల్సిన అవసరం లేకుండా షెంగెన్ ప్రాంతంలోని దేశాల మధ్య స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఈ లిస్ట్‌లో ప్రస్తుతానికి 29 దేశాలు ఉన్నాయి. పైకేసులో.. స్విట్జర్లాండ్‌లో విధించిన ట్రాఫిక్ జరిమానాను చెల్లించకుండా వదిలేస్తే భవిష్యత్తులో షెంగెన్ దేశాలకు వీసా దరఖాస్తు చేసుకునే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని నెటిజన్లు హెచ్చరించారు. -
సౌదీ నుంచి సజీవంగా వస్తాడనుకోలేదు..!
రెండు దశాబ్దాల ఆ తల్లి నిరీక్షణకు తెరపడింది. కోట్ల రూపాయల ‘బ్లడ్ మనీ’.. దీర్ఘకాల న్యాయపోరాటం, అంతర్జాతీయ స్థాయిలో సాగిన చర్చల అనంతరం అబ్దుల్ రహీమ్ చివరికి స్వదేశానికి చేరాడు. అదీ ఈద్ అల్ అదా రోజున!. ఇంకేం కోజికోడ్ విమానాశ్రయంలో ఆయన్ని చూసి కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు అల్లా సమాధానం ఇచ్చాడు” అంటూ తల్లి ఫాతిమా చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని కదిలించాయి.కేరళలోని కోజికోడ్ జిల్లా ఫెరోక్‌కు చెందిన అబ్దుల్ రహీమ్ 2006లో ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లారు. అక్కడ ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్న సమయంలో, ఆయన సంరక్షణలో ఉన్న ఓ ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారి మరణించిన ఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. సౌదీ మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. ఆ చిన్నారి సౌదీ వ్యాపారవేత్త అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి కొడుకు. ఆ బాలుడు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, వైద్య సహాయక పరికరాలపై ఆధారపడి చికిత్స పొందుతున్నాడు. ఒక సందర్భంలో ఆ చిన్నారికి అమర్చిన వైద్య సహాయక పరికరాన్ని రహీమ్ అనుకోకుండా తాకాడు. దీంతో అస్వస్థతకు గురైన ఆ బాలుడు.. మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.తాను కావాలని చేయలేదని రహీమ్ చెప్పినా కోర్టులు వినలేదు. ఈ ఘటనపై సౌదీ కోర్టు విచారణ జరిపి 2012లో ఆయనకు మరణశిక్ష విధించింది. ఈ తీర్పు తర్వాత కేసు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. కొడుకు మీద ఆశలు వదిలేసుకున్న టైంలో.. దగ్గరి బంధువు ద్వారా బ్లడ్ మనీ గురించి తెలుసుకుంది రహీమ్ తల్లి ఫాతిమా. కొందరు అధికారులు, మత పెద్దలు ద్వారా కొడుకు విడుదల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా నెలల తరబడి చర్చల తర్వాత.. రహీమ్‌కు క్షమాభిక్ష ప్రసాదించేందుకు అబ్దుల్లా అబ్దురహ్మాన్ అల్ షహ్రి బ్లడ్‌మనీకి అంగీకరించింది. కేరళలో పెద్ద ఎత్తున మానవతా సహాయ ప్రచారం ప్రారంభమైంది. ప్రవాస భారతీయులు, వ్యాపారులు, విద్యార్థులు కలిసి నిధులు సేకరించారు. మొత్తం సుమారు రూ.47 కోట్లు సమీకరించగా, అందులో రూ.34 కోట్లు ‘బ్లడ్ మనీ’గా బాధిత కుటుంబానికి చెల్లించారు. అనంతరం బాధిత కుటుంబం క్షమాభిక్ష ఇవ్వడంతో 2014లో మరణశిక్ష రద్దయింది. అయితే.. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.సౌదీ చట్టాల ప్రకారం పబ్లిక్ రైట్స్ కింద ఆయనకు అప్పటికే 20 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. దీంతో.. ఆ శిక్ష పూర్తయ్యేదాకా ఆయన ఆగాల్సి వచ్చింది. ఇటీవల ఆ శిక్షపూర్తి కావడంతో రహీమ్ విడుదల అయ్యాడు. ఈద్ పండుగ రోజున ఆయన కోజికోడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా, వందలాది మంది కుటుంబ సభ్యులు, మద్దతుదారులు అక్కడికి వచ్చి ఘన స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంటికి చేరిన ఆ క్షణం అందరినీ భావోద్వేగానికి గురిచేసింది.ఇంటివద్ద కూడా భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. తల్లి ఫాతిమా కన్నీళ్లతో కుమారుడిని ఆలింగనం చేసుకుని, “ఇన్ని సంవత్సరాల ప్రార్థనలకు ఈ రోజు సమాధానం లభించింది” అని చెప్పిన మాటలు అందరినీ కదిలించాయి. భారత రాయబార కార్యాలయం, లీగల్ కమిటీ సహకారంతో అన్ని న్యాయపరమైన ప్రక్రియలు పూర్తిచేసి ఆయన స్వదేశానికి రప్పించడంలో కీలక పాత్ర పోషించాయి. ఈ ఘటన కేరళలోనే కాకుండా విదేశాల్లో ఉన్న మలయాళీ సమాజంలో కూడా పెద్ద చర్చకు దారితీసింది.నిమిషా ప్రియా పరిస్థితి?రహీమ్ ఘటన నేపథ్యంలో.. యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిషా ప్రియా కేసు కూడా కొనసాగుతోంది. 2017లో ఓ యెమెన్ పౌరుడి మరణ ఘటనలో ఆమెపై కేసు నమోదై కోర్టు మరణశిక్ష విధించింది. అయితే కుటుంబ సభ్యులు, మానవ హక్కుల సంఘాలు, భారత ప్రభుత్వ వర్గాలు కలిసి ఆమె శిక్షను నిలిపివేయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ‘బ్లడ్ మనీ’ ద్వారా క్షమాభిక్ష సాధించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నప్పటికీ, కేసు ఇంకా తుది దశకు చేరలేదు. -
అమెరికాలో భారతీయ మహిళ హత్య
అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ స్టోర్‌లో గుజరాత్‌కు చెందిన భారతీయ మహిళ హత్యకు గురయ్యారు. మృతురాలిని బిజాపుర్ ప్రాంతంలో మెహసానా జిల్లా జంత్రాల్ గ్రామానికి చెందిన మేఘనా పటేల్‌గా గుర్తించారు. మేఘ్నా పటేల్ తన కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు. దుకాణం (స్టోర్) లోపల దుండగుడు ఆమెపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఆ వీడియోలో ఓ వ్యక్తి కస్టమర్ తరహాలో దుకాణంలోకి ప్రవేశించడం కనిపించింది. ట్రాక్‌సూట్, జాకెట్, గ్లోవ్స్ , ఫేస్ మాస్క్ టోపీ ధరించి ఉన్న ఆ వ్యక్తి.. మేఘ్నా పటేల్‌తో కొద్దిసేపు మాట్లాడిన సెకన్ల వ్యవధిలోనే ఆమెపై కాల్పులు జరిపాడు.ఆ తర్వాత అతను టేబుల్ పైనుంచి ఏదో తీసుకుని అక్కడి నుంచి పారిపోవడం కనిపించింది. ఈ కాల్పులు దోపిడీ ఉద్దేశంతోనే జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
బ్రిటన్‌లో ప్రవాస భారతీయల రికార్డు.. మేయర్లుగా తల్లీ తనయులు
లండన్: బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న తల్లీ, తనయుడు మేయర్ ఎన్నికల్లో ఘన విజయాన్ని అందుకున్నారు. భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. వీరి కుటుంబం హర్యానాకు చెందినది.వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్తక్ నుంచి పర్వీన్ రాణి కుటుంబం 2013లో బ్రిటన్‌కు వలస వెళ్లింది. పర్వీన్ రాణి కుమారుడు తుషార్ కుమార్ (23) లండన్‌లోని కింగ్స్ కళాశాలలో చదువుతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబరులో పీజీ పూర్తి చేసుకోనున్నారు. అయితే, పర్వీన్ రాణి, తుషార్ కుమార్ ఎన్నికల్లో పోటీ చేశారు.ఈ క్రమంలో ఎల్స్ట్రీ అండ్ బోరమ్వుడ్ పట్టణ కౌన్సిల్‌కు తుషార్ మేయరుగా ఎన్నికయ్యారు. వారం రోజుల తర్వాత తుషార్ తల్లి పర్వీన్ రాణి హర్ట్స్‌మేర్ బరా కౌన్సిలుకు భారతీయ మూలాలున్న తొలి మేయరుగా ఎన్నికయ్యారు. ఇలా భారతీయ కుటుంబానికి చెందిన తల్లీకుమారులు ఇద్దరూ బ్రిటన్‌లో ఒకేసారి మేయర్లుగా ఎన్నిక కావడం విశేషం. ఇక, బ్రిటన్‌లో భారతీయ మూలాలున్న అతి తక్కువ వయసు గల మేయర్‌గా తుషార్ చరిత్ర సృష్టించారు. Historic moment in UK politics! For the first time an Indian origin mother and son have become Mayors in Britain. 23 years old Tushar Kumar created history by becoming the youngest Mayor of borehamwood town council, while his mother Praveen Rani was elected mayor of Hertsmere… pic.twitter.com/Z2de5J8z7x— Neeraj Ranjan (@NeerajRanjan84) May 25, 2026 -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
సాక్షి, నల్లగొండ: విదేశాల్లో ఉన్నత చదువులు చదివి ప్రయోజకురాలై, తమకు చేదోడువాదోడుగా టుందనుకున్న కూతురు కానరాని లోకాలకు వెళ్లిపోయింది. రోడ్డు ప్రమాదం రూపంలో ఆ ఇంటి దీపం శాశ్వతంగా ఆరిపోయింది. రూ.50 లక్షలు అప్పు చేసి మరీ అమెరికా పంపిన కౌలు రైతు దంపతులకు తీరని శోకం మిగిలింది. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టుకు చెందిన నవ్య అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన యువతి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చెర్వుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్‌రెడ్డి, శోభ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. వారిలో పెద్ద కూతురు నవ్య (24) బీటెక్ పూర్తి చేయడంతో ఎంఎస్ కోసం రెండున్నర సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లింది. చిన్న కూతురు ప్రస్తుతం బీటెక్ చదువుతోంది. నవ్య చికాగో రాష్ట్రంలోని రోజ్ వెల్ యూనివర్సిటీలో రెండున్నర సంవత్సరాల నుంచి ఎంఎస్ చదువుతోంది.శనివారం రాత్రి కారులో వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనుక నుంచి మరో కారు ఢీకొట్టడంతో నవ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు స్నేహితురాలు ఆదివారం మధ్యాహ్నం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. నవ్య మృతి విషయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి సమాచారం అందించారు. తక్షణమే వారు స్పందించి అమెరికా నుంచి నవ్య మృతదేహాన్ని సొంతూరికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు నవ్య తల్లిదండ్రులు తెలిపారు.ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లి.. నవ్య 10వ తరగతి నల్లగొండలోని ఎంవీఆర్ స్కూల్లో, ఇంటర్ గీతాంజలి కాలేజీలో, బీటెక్ హైదరాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో పూర్తి చేసింది. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి ఎంఎస్ చదువుతోంది. తన కూతురు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వార్త తెలుసుకున్న శ్రీనివాస్‌రెడ్డి కుప్పకూలిపోయాడు. తన కూతురు ఉన్నత విద్యావంతురాలై విదేశంలో ఉద్యోగం చేసి ఇంటి దీపంగా వెలుగుతుంది అనుకుంటే రోడ్డు ప్రమాదం ఇంటి దీపాన్ని ఆర్పిందని నవ్య తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. చేసిన అప్పులు తీరకముందే.. గడుసు శ్రీనివాసరెడ్డి, శోభ దంపతులు సొంతంగా భూమి లేకున్నా ప్రతి సంవత్సరం 10 నుంచి 15 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట పడిస్తూ తమ ఇద్దరు కూతుళ్లను చదివిపిస్తున్నారు. రెండున్నర సంవత్సరాల క్రితం పెద్ద కూతురు నవ్యను ఉన్నత విద్య కోసం అమెరికా పంపేందుకు రూ.30 లక్షలు బ్యాంకు రుణం, రూ.20 లక్షలు ప్రైవేట్ అప్పు చేశారు. చేసిన అప్పు తీరక ముందే కుమార్తె కానరాని లోకానికి పోయిందని తల్లడిల్లిపోతున్నారు. పెద్ద కూతురు ఉన్నత విద్య చదివి ఉద్యోగం చేస్తే చిన్న కూతురికి, తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటుంది అనుకుంటే అప్పులతో పాటు కన్నీరే మిగిలిందని రోదిస్తున్నారు. -
ఘనంగా స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వార్షికోత్సవాలు
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ తన సప్తమ వార్షికోత్సవం (ఏప్రిల్25, 2026) ఘనంగా జరుపుకుంది. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ బి.వి.ఎస్. చౌదరి, రాజ్యలక్ష్మి చౌదరి సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేశారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” , విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ , యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు.అలాగే కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు. ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ రాయ్, ట్రెజరర్ v. Adesh బాబు , కళ , శివ కృష్ణ ఆలయ చైర్మన్ ,మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కాకతీయ సాంస్కృతిక పరివారం నుంచి సబ్బుపాలకుర్తి , సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుంచి క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి. సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు -
ఘనంగా తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026
తెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్, మే డే సందర్భంగా Terusan Recreation Centre వద్ద ఘనంగా ముగిసింది. ఏప్రిల్ 18 నుంచి మే 1 వరకు నాలుగు వారాంతాల్లో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో, సింగపూర్ నలుమూలల నుంచి వచ్చిన తెలుగు కార్మికులు, ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .“సైట్లో కష్టం… గ్రౌండ్లో శక్తి” అనే నినాదంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్, సింగపూర్ తెలుగు సమాజ ఐక్యత, శక్తి కృషికి ప్రతీకగా నిలిచింది.మొత్తం 18 జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో, లీలా నాగేశ్ నాయకత్వంలోని తెలుగు వారియర్స్ జట్టు విజేతగా నిలవగా, సాహు చంద్రశేఖర్ నాయకత్వంలోని మెగాయార్డ్ రైడర్స్ జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 17 మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగగా, 250కి పైగా ఆటగాళ్లు తమ ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు వరుసగా SGD1,116 మరియు SGD558 నగదు బహుమతులతో పాటు ట్రోఫీలు అందజేశారు.వ్యక్తిగత విభాగంలో బండి శ్రీనివాస్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకోగా, శ్యామ్ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా, ఆంథోనీ ఉత్తమ బౌలర్‌గా, విజ్జు ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యారు. మెగాయార్డ్ రైడర్స్ జట్టుకు చెందిన ఇద్దరు ఆటగాళ్లు వ్యక్తిగత అవార్డులు గెలుచుకోవడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సారిక ప్రసాద్ హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే రాంబాబు పాతూరి (కాకతీయ కల్చరల్ అసోసియేషన్), రత్న కుమార్ కవుటూరు (శ్రీ సాంస్కృతిక కళాసారథి), సింగపూర్ తెలుగు సమాజం పూర్వ అధ్యక్ష్యులు రంగా రవి, చౌదరి జె తదితరులతో పాటు శేషారావు గూడూరి, వినయ్ కుమార్ సూర్యదేవర, సురేంద్ర చెబ్రోలు, చంద్రశేఖర్ చిలుకూరి, హనుమంతరావు మాదాల, అమ్మయ్య చౌదరి, గంగాధర్ తాటి, సతీష్ పారేపల్లి, వేణు నార్నే తదితర ప్రముఖులు విచ్చేసి నిర్వాహకులను మరియు క్రీడాకారులను అభినందించారు.శివ ప్రసాద్ కొల్లా నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో బి వర ప్రసాద్, గిరిధర్ సరాయి, అనిల్ కుమార్ బొమ్మారెడ్డి తదితరులతో పాటు కోఆర్డినేటర్లు, లాజిస్టిక్స్ టీమ్, అంపైర్లు, స్కోరర్లు, వాలంటీర్లు అహర్నిశలు శ్రమించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సురేంద్ర చేబ్రోలు, ఉమా మహేశ్వర రావు, గురురాజ్ బనకర్, శ్రీను యాదవ్, గొర్రెపాటి లక్ష్మీ రెడ్డి అంపైర్లుగా వ్యవహరించగా, రమేష్ వ్యాఖ్యాతగా కార్యక్రమానికి మరింత ఆకర్షణ తీసుకువచ్చారు.టీం శివప్రసాద్ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ టోర్నమెంట్ విజయవంతం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, వచ్చే ఏడాది టీంను మరింత విస్తృతంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. మహిళల విభాగం ప్రవేశపెట్టడం, మెరుగైన లైవ్ స్ట్రీమింగ్, మరిన్ని సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. -
అమెరికాలో కర్నూలు యువకుడి ఆత్మహత్య
ఎన్నో కలలతో విదేశాల్లో అడుగుపెడుతున్న భారతీయులకు.. వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా మారి ఒత్తిళ్లకు గురి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధ్యక్ష పదవిలోకి వచ్చాక దారుణంగా మారింది. ఇప్పటికే పలువురు ఆ దేశం వీడుతుండగా.. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటున్నారు. ఈ క్రమంలో షికాగోలో విషాదం చోటు చేసుకుంది. షికాగోలో భారత్‌కు చెందిన ఓ టెక్కీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ యువకుడి పేరు చందు ఇరగనబోయిన(26). స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాగా దర్యాప్తు అధికారులు తెలిపారు. అతని కుటుంబ నేపథ్యం తెలియరావాల్సి ఉంది.ఇక్కడే ఓ ప్రముఖ కాలేజీలో బీటెక్ చేసిన చందు.. ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకు వెళ్లాడు. చికాగోలో డీపౌల్ యూనివర్సిటిలో ఎమ్మెస్ పూర్తి చేసి కిందటి ఏడాది జూన్ నుంచి ఓ ప్రముఖ కంపెనీలో డెవలపర్‌గా పని చేస్తున్నాడు. అయితే.. ఒంటరితనం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక పిస్టల్‌తో కాల్చుకుని ఏప్రిల్ 28న ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.ఉద్యోగం రాకపోవడంతో మనస్తాపంతో చనిపోయినట్లు కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నప్పటికీ.. స్థానిక పోలీసులు మాత్రం సూసైడ్‌కు గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉందని చెబుతున్నారు. అలాగే అతని ఉద్యోగం ఉందా? లేదా? అనే దానిపైనా ఓ క్లారిటీ రావాల్సి ఉంది. మృతదేహాన్ని భారత్‌కు పంపేందుకు తానా ఏర్పాట్లు చేస్తుండగా.. మరోవైపు చందు కుటుంబాన్ని ఆదుకునేందుకు అతని స్నేహితుడు రాజేష్ గుర్రం గోఫండ్‌మీ ద్వారా విరాళాలు సేకరిస్తున్నాడు. మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
అమెరికాలో ఇద్దరు తెలుగు వాళ్లకు ఐదేళ్ల జైలు శిక్ష!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగులపై కఠిన ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీసాల జారీ విషయంలోనూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. అయినప్పటికీ హెచ్-1బీ వీసాలు దుర్వినియోగం అవుతుండడం కలకలం రేపుతోంది.తాజాగా హెచ్-1బీ వీసాల పేరిట జరిగిన ఫ్రాడ్ కేసులో అమెరికాలోని ఇద్దరు తెలుగు వ్యక్తులు తమ నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని డబ్లిన్ నగరానికి చెందిన సంపత్ రాజీదీ, శ్రీధర్ మాడ ఈ ఫ్రాడ్ కేసులో భాగం అయినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం నిందితులిద్దరూ తమ నేరాన్ని అంగీకరించినట్లు తేలడంతో అమెరికా చట్టం ప్రకారం.. వీరికి గరిష్టంగా 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు దాదాపు 2.5 లక్షల డాలర్ల (సుమారు రూ. 2 కోట్లు) భారీ జరిమానా విధించే అవకాశముందని తెలుస్తోంది. సంపత్ రాజీదీ అమెరికాలో రెండు వీసా ప్రాసెసింగ్ కంపెనీలను నడుపుతున్నారు. అయితే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో ఉద్యోగాలు ఉన్నాయని ఫేక్ సర్టిఫికెట్స్ సృష్టించి విదేశీయులకు హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేశారు. అలాగే శ్రీధర్ మాడ.. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అగ్రికల్చర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ విభాగంలో చీఫ్ ఇన్ఫర్మేషనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. అభ్యర్థులు యూనివర్సిటీ ప్రాజెక్టుల్లో పని చేస్తారని ఫేక్ పత్రాలు అందించారు. సాధారణంగా హెచ్-1బీ వీసా పొందాలంటే అమెరికాలోని ఏదైనా ఒక సంస్థలో సదరు నిపుణుడికి ఉద్యోగం కచ్చితంగా ఉండాలి. దీన్ని ఆసరాగా చేసుకున్న శ్రీధర్ మాడ.. తనకున్న అధికారంతో యూనివర్సిటీలో ఉద్యోగాలు ఉన్నట్లు నకిలీ ధృవీకరణ పత్రాలను సృష్టించారు. ఈ విషయాలు విచారణలో తేలినట్లు అమెరికా అటార్నీ కార్యాలయం పేర్కొంది. ఇక జూన్ 2020 నుంచి జనవరి 2023 మధ్య ఈ ఫేక్ దందాను కొనసాగించినట్లు విచారణలో తేలింది.చదవండి: మలి విడత చర్చలు.. పాక్‌కు వెళ్లని జేడీ వాన్స్! -
ఇటలీలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల మృతి
బెర్గామో ప్రావిన్స్: ఇటలీలో కాల్పుల కలకలం రేగింది. ఇద్దరు భారతీయుల మృతి చెందారు. బెర్గామో ప్రావిన్స్‌లోని కోవో ప్రాంతంలో వైశాఖీ పండుగ వేడుకల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రార్థనా స్థలం(గురుద్వారా) నుండి బయటకు వస్తుండగా ఇద్దరు భారతీయ వ్యక్తులు కాల్పులకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రికి ఈ ఘటన చోటుచేసుకుంది.పారిశ్రామిక ప్రాంతంలోని గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ ముందున్న చౌరస్తాలో ఈ ఘటన జరిగింది. మృతులను కోవో నివాసి రగిందర్ సింగ్ (48), అగ్నాడెల్లోకు చెందిన గుర్మిత్ సింగ్ (48)గా గుర్తించారు. సంఘటనా స్థలంలో సుమారు 10 బుల్లెట్ కేసింగ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య చోటుచేసుకున్న గొడవ ఈ కాల్పులకు దారితీసిందని పోలీసులు భావిస్తున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా భారతీయుడేనని అతను కూడా తరచుగా ఆ గురుద్వారాకు వస్తుంటాడని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఈ కాల్పుల్లో మరో మూడో వ్యక్తికి కూడా బుల్లెట్లు తగిలి గాయపడినట్లు సమాచారం. -
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు
న్యూయార్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న 2026న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ‘డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ రాజ్యాంగ నైతికతపై దార్శనికత మరియు బహుపాక్షికవాదానికి దాని ప్రాసంగికత’ అనే థీమ్‌తో ఈ ఈవెంట్‌ను నిర్వహించారు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి,అంబాసిడర్ హరీష్ పార్వతనేని స్వాగతోపన్యాసం చేశారు. భారత పౌరులలో రాజ్యాంగ నైతికత స్ఫూర్తిని నింపడంలో డాక్టర్ అంబేద్కర్ కృషి చాలా ముఖ్యమైందన్నారు.ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు మధ్య ఉన్న ఉమ్మడి అంశాలను వివరించారు. రాజకీయ విభజన, నిరంతర సంఘర్షణలతో కూడిన ఈ క్లిష్ట సమయాల్లో రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాలన్న డాక్టర్ అంబేద్కర్ పిలుపు ఎంతో సందర్భోచితమైనదని, ఇది బహుపాక్షికవాదాన్ని బలోపేతం చేయడానికి, ఐక్యరాజ్యసమితిలో సమర్థవంతమైన సంస్కరణలు తీసుకురావడానికి, దాని ప్రధాన విభాగాలకు పునరుజ్జీవం పోయడానికి, ఐక్యరాజ్యసమితిని దాని ఉద్దేశ్యానికి అనుగుణంగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుందని రాయబారి హరీష్ చెప్పారు.ప్రముఖ సివిల్ సర్వెంట్, ప్రముఖ అంబేద్కర్ పండితుడు అయిన డాక్టర్ రాజా శేఖర్ వుండ్రు కీలకోపన్యాసం చేశారు. రెండు ప్రపంచ యుద్ధాలను, ఐక్యరాజ్యసమితి ఏర్పాటును ప్రత్యక్షంగా చూసిన వ్యక్తిగా, డాక్టర్ అంబేద్కర్ బహుపాక్షికవాదం ప్రాముఖ్యతను గుర్తించారని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం యొక్క కేంద్ర సూత్రాలను రూపొందించడంలో డాక్టర్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. ఐక్యరాజ్యసమితి చార్టర్లో పొందుపరిచిన అంతర్జాతీయ శాంతి పరిరక్షణ అనే ప్రాథమిక స్ఫూర్తి భారత రాజ్యాంగంలో కూడా ప్రతిబింబిస్తుంది. రాజ్యాంగ నైతికతను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని డాక్టర్ అంబేద్కర్ నొక్కిచెప్పారని స్పష్టం చేశారు. ఈ సందర్భంలో, బహుపాక్షికవాదం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆధారంగా అంతర్జాతీయ రాజ్యాంగ నైతికతను పెంపొందించాల్సిన అవసరం ఉందని రాజా శేఖర్ వుండ్రు అన్నారు.డాక్టర్ అంబేద్కర్ జీవితం ఒక నైతిక నిదర్శనమని, అందులో ఆయన కేవలం బాధ నుండి తప్పించుకోవడమే కాకుండా, దానిని రూపాంతరం చెందించి, ఆ గాయాన్ని జ్ఞానంగా మార్చారని హార్వర్డ్ డివినిటీ స్కూల్ విజిటింగ్ ప్రొఫెసర్, అతిథి వక్త డాక్టర్ సంతోష్ రౌత్, అభిప్రాయపడ్డారు. నేటి ప్రపంచంలో, ముఖ్యంగా బహుపాక్షికత (multilateralism) విషయంలో, డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి మరియు ఆదర్శాల గాఢమైన ఔచిత్యాన్ని డాక్టర్ రౌత్ విశదీకరించారు. ఐక్యరాజ్యసమితి ఛార్టర్ వంటి లిఖితపూర్వక గ్రంథాల స్ఫూర్తిని ఆచరణలో పెట్టడానికి దోహదపడే శక్తిగా ఆయన నైతికతను అభివర్ణించారు.వివిధ రంగాలకు చెందిన ప్రజలు ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా హాజరయ్యారు. -
అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం
వాషింగ్టన్: భారతీయ సనాతన ధర్మం గొప్పదనాన్ని, హిందూ తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన స్వామి వివేకానందుదునికి అమెరికాలో అత్యంత అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రధాన నగరాల్లో ఒకటైన సియాటెల్ నడిబొడ్డున స్వామి వివేకానందుని నిలువెత్తు కాంస్య విగ్రహం ఘనంగా కొలువుదీరింది.అమెరికా చరిత్రలో ఒక నగరపాలక సంస్థ (సిటీ గవర్నమెంట్) ఆధ్వర్యంలో అధికారికంగా ఏర్పాటు చేసిన తొలి స్వామి వివేకానంద విగ్రహం ఇదే కావడం విశేషం. ఈ చారిత్రక ఘట్టం అమెరికాలో స్థిరపడిన ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగేలా చేస్తోంది. నిత్యం లక్షలాది మంది సందర్శకులతో రద్దీగా ఉండే సియాటెల్ డౌన్ టౌన్ లోని ప్రముఖ ‘వెస్ట్ లేక్ స్క్వేర్’ వద్ద ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పారు. ప్రపంచ ప్రఖ్యాత అమెజాన్ స్పియర్స్, సియాటెల్ కన్వెన్షన్ సెంటర్, సియాటెల్ సెంటర్ మోనోరైల్ లాంటి కీలకమైన ప్రాంతాలకు అత్యంత సమీపంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.శనివారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సియాటెల్ మేయర్ కేటీ విల్సన్, భారత కాన్సుల్ జనరల్ ప్రకాష్ గుప్తా ఈ విగ్రహాన్ని సంయుక్తంగా ఆవిష్కరించారు. ప్రముఖ భారతీయ శిల్పి నరేష్ కుమార్ కుమావత్ అత్యంత ఆకర్షణీయంగా, జీవకళ ఉట్టిపడేలా ఈ కాంస్య విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఐసీసీఆర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం, అమెరికాతో భారత సాంస్కృతిక బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. 1893లో జరిగిన చికాగో ప్రపంచ మత సమ్మేళనంలో వివేకానందుడు చేసిన చారిత్రాత్మక ప్రసంగం నాటి నుంచి.. నేటి అత్యాధునిక గ్లోబల్ టెక్ హబ్ సియాటెల్ వరకు అమెరికాతో మనకున్న అనుబంధానికి ఈ విగ్రహం ఒక సజీవ ప్రతీకగా నిలుస్తుందని కాన్సులేట్ జనరల్ అభివర్ణించారు. స్థానిక పౌర ప్రముఖులు, ఎన్నారైలు, భారతీయ అమెరికన్ కమ్యూనిటీ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. -
మిస్ తెలుగు యూఎస్ఏ పోటీల విజేత అమూల్య
అమెరికాలో జరిగిన మిస్ తెలుగు యూఎస్ఏ–2026 అందాల పోటీల్లో తెలుగు యువతులు సందడిచేశారు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ చార్లెస్ డబ్ల్యూఎస్సీమాన్ సెంటర్లో ఈ పోటీలు సందడిగా జరిగాయి. హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌కు చెందిన అమూల్య బల్మూరి విజేతగా నిలిచింది. ప్రముఖ నటి లయ చేతుల మీదుగా అమూల్య టైటిల్ అందుకున్నారు. తమ కూతురు విజేతగా నిలవడం ఎంతో గర్వకారణమని తల్లిదండ్రులు శ్రీనివాస్‌రావు, రమలు తెలిపారు. ఇక మహిమ రన్నరప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. గతంలో మిస్ ఫ్లోరిడా మెజెస్టిక్, ప్యూర్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో కూడా మహిమ గుర్తింపు పొందారు. -
ప్రవాస భారతీయులకు వంశీ పురస్కారాలు
వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఇచ్చే ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలలో భాగంగా, ఈ పరాభవ నామ సంవత్సర ఉగాదికి వివిధ దేశాల తెలుగు సంస్థలనుండి సాంస్కృతిక కళారంగ విభాగాలలో విభిన్న సేవలు అందిస్తున్నవారికి "వంశీ సీల్వెల్ ప్రవాస భారతీయ ఉగాది పురస్కారాలు" ఆదివారం హైదరాబాద్ త్యాగరాయ గానసభలో అందజేశారు.ప్రముఖ సినీ నటులు డా.రాజేంద్ర ప్రసాద్, నటీమణులు సంగీత, మంజుభార్గవి, దర్శకులు రేలంగి నరసింహారావు, సినీకవి వనమాలి,ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, వివిధ రంగాల కళాకారులు కూడా ఈ ప్రతిష్టాత్మక ఉగాది పురస్కారాలతో వేదికపై సత్కరించారు.వంశీ వేదికపై 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ ప్రధాన కార్యనిర్వాహక వర్గ సభ్యురాలు, రచయిత్రి రాధిక మంగిపూడికి "సభా భారతి" బిరుదు, సంస్థ సభ్యులైన యడవల్లి శేషు కుమారి శాస్త్రీయ సంగీతంలోనూ, తంగిరాల సౌభాగ్యలక్ష్మి లలిత సంగీత రంగంలోనూ, పావని చిలువేరు సాహిత్య రంగంలోను ఉగాది పురస్కారాలను అందుకోవడం తమకెంతో గర్వకారణమని సింగపూర్ నుండి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ పురస్కార గ్రహీతలను అభినందించారు. యూకే నుండి డా. బాబురావు చౌదరి చాపరాల & భారతి దంపతులు, హాంకాంగ్ నుండి జయ పీసపాటి, ఖతార్ నుండి సాహిత్య జ్యోత్స్న కొలిపాక, యూఏఈ నుండి శ్రీకాంత్ చిత్తర్వు, శ్రీనివాస లింగం, సౌదీ అరేబియా నుండి కొనేరు ఉమామహేశ్వరరావు, అనిల్ కుమార్ కడించెర్ల, అమెరికా నుండి శ్రీనివాస్ గూడూరు, వాణి దిట్టకవి, జయరాం ఎర్రమిల్లి తదితరులు కూడా ఈ పురస్కారాలను అందుకున్నారు.ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , డా.కె వి రమణాచారి ఐఏయస్, హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం హెడ్ కామేశ్వరి, డా. వంశీ రామరాజు ,ఇతర అతిథుల చేతుల మీదుగా ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. -
ఘనంగా శంకర నేత్రాలయ 'మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్'
కొలంబస్, ఓహియోలోని హయాట్స్ మిడిల్ స్కూల్ ఆడిటోరియంలో శంకర నేత్రాలయ USA “మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫర్ విజన్” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ ఏడాది తొలి కార్యక్రమంగా నిర్వహించిన ఈ ఈవెంట్‌కు దాదాపు 400 మంది కమ్యూనిటీ సభ్యులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా భారతదేశంలోని పేద ప్రజలకు కంటి శస్త్రచికిత్సలు అందించే “అడాప్ట్-ఎ-విలేజ్” ప్రోగ్రామ్‌కు మద్దతు లభించింది.మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సేవ, కళ, సామాజిక బాధ్యతల సమ్మేళనం స్పష్టంగా కనిపించింది. ప్రారంభ ప్రసంగంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు అమర్ ఏమిరెడ్డి మాట్లాడుతూ, “కొలంబస్ నగరం సేవా భావంలో ముందుంటుంది. ఈ రోజు మనం కలిసి అనేక మందికి కంటి వెలుగు అందించే లక్ష్యంతో ఒకటయ్యాం” అని అన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షుడు బాలా రెడ్డి ఇందూర్తి మాట్లాడుతూ, “సంస్థ వాలంటీర్లకు శక్తినిస్తుంది. కొలంబస్ చాప్టర్ అందిస్తున్న మద్దతు మా సేవా లక్ష్యాలను మరింత ముందుకు తీసుకెళ్తోంది” అని తెలిపారు.నృత్య ప్రదర్శనల కళా వేదిక ప్రారంభ ప్రసంగాల అనంతరం ట్రినయనీ ఆర్ట్స్, సాయి నృత్య సంగం, మయాజ్ మస్తి డ్యాన్స్ అకాడమీ, శ్రీ వెంకటేశ్వర డ్యాన్స్ ఇనిస్టిట్యూట్, నాట్యాలయం డ్యాన్స్ స్కూల్, సాయి ఆర్ట్ గ్రూప్, స్టైల్ ఎన్ గ్రేస్ వంటి సంస్థల నుంచివచ్చిన కళాకారులు అద్భుత నృత్య ప్రదర్శనలు అందించారు. భారతీయ సాంప్రదాయ నృత్యాలు, జానపద నృత్యాలు, సినీ నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. కార్యక్రమం చివరలో కంటి చూపు ప్రాముఖ్యతను తెలియజేసే నాటిక, రజనీకాంత్ అనంతోజి నేతృత్వంలో జరిగిన గ్రాండ్ ఫినాలే అందరినీ ఆకట్టుకుంది. చెన్నైకు చెందిన ప్రొఫెషనల్ ప్లేబ్యాక్ గాయకుడు రాము, గాయని అంజనా సౌమ్య తమ మధుర గానంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు. భక్తి గీతాలు, ప్రముఖ సినిమాల ఫ్యూజన్ పాటలను సమన్వయంతో ఆలపిస్తూ, నలుపు-తెలుపు యుగం నుంచి రంగుల యుగం వరకు విస్తరించిన సంగీతాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు.శంకర నేత్రాలయ USA బ్రాండ్ అంబాసిడర్, బోర్డ్ అడ్వైజర్ ప్రసాద్ రెడ్డి కాటం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, “కంటి చూపును తిరిగి ఇవ్వడం అనేది గౌరవం, ఆశను పునరుద్ధరించే మహత్తర సేవ” అని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి కళాకారులు, వాలంటీర్లు, నిర్వాహకులు అందరూ నెలల తరబడి కృషి చేశారు. వేదిక వెనుక పనిచేసిన SNUSA కొలంబస్ టీమ్ ప్రతీ అంశాన్ని సమగ్రంగా ప్రణాళిక చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల ఈ కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు. ముఖ్యంగా అమర్ ఏమిరెడ్డి, ఆర్కే రెడ్డి, రాజా బొమ్మన నాయకత్వంలోని కొలంబస్ కోర్ టీమ్‌తో పాటు సుష్ ఉప్పుటూరి, రోహిత్ మండల, రామకృష్ణ కసర్ల, గంగరాజు బేతిన, విజయ్ సుంకాడ్, యెల్లా రెడ్డి చిట్టి, శ్రీని పడాల, వెంకట్ దురిపాల, భూపేష్ మద్దు, శంకర్ రావుల, రంగనాథ్, స్వాతి మద్దు, మహిత మద్దు, నికిత పడాల, శ్రికా దురిపాల, మహేష్ వెలిడండి, రాజ్ ముద్దాన, వినయ్, శరందీప్, వంశీ నిమ్మ, విష్ణు తూముల, శ్యామ్ దుద్దెల, లోహిత్ సాయి బురుగుపల్లి, రిషిత్ బేతిన, కీర్తన్ ముద్దాన తదితర వాలంటీర్లు విశేషంగా సేవలందించారు.స్థానిక కమ్యూనిటీ నాయకులు, సంస్థలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మద్దతు అందించారు. అలాగే ట్రెజరర్ మూర్తి రేకపల్లి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు డా. రెడ్డి ఉరిమిండి, ఆది మొర్రెడ్డి, మహిళా కమిటీ చైర్ రేఖా రెడ్డి ప్రత్యేక సహకారం అందించారు. అలాగేఎస్వీ ఆచార్య, డా. సురేంద్రన్, డా. గిరీష్ రావు, సురేష్ కుమార్, త్యాగరాజన్, దీన్ దయాళన్ మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇవిపి శ్యామ్ అప్పాలి, సెక్రటరీ వంశీ కృష్ణ ఎరువారం, పబ్లిసిటీ కమిటీ చైర్ రత్నకుమార్ కవుటూరు, గిరి కోటగిరి, నీలిమ గడ్డమనుగు కలిసి సంయుక్తంగా ఆడియో, వీడియో, మీడియా ప్రచారాన్ని సమర్థంగా నిర్వహించారు. చివరగా ఈ కార్యక్రమం శంకర నేత్రాలయ యూఎస్ఏ సేవా లక్ష్యాన్ని మరింత బలపరచింది.చదవండి: న్యూజెర్సీలో ఘనంగా శంకర నేత్రాలయ సంగీత–నృత్య సేవా కార్యక్రమం -
మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలిన భారత సంతతి జడ్జి
భారతీయ మూలాలున్న ఓ కౌంటీ జడ్జి అమెరికాలో మనీ లాండరింగ్ కేసులో దోషిగా తేలాడు. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్ బెండ్ కౌంటీ జడ్జి కేపీ జార్జ్ ప్రచార నిధులను వ్యక్తిగత ఖర్చులకు వాడినట్లు జ్యూరీ నిర్ధారించింది. దీంతో ఆయనపై మూడో స్థాయి ఫెలనీ కేసు నమోదైంది. టెక్సాస్ చట్టం ప్రకారం ఈ నేరానికి రెండు నుండి పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10,000 డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రాసిక్యూటర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. జార్జ్ తన ప్రచార ఖాతా నుండి 46,000 డాలర్లకు పైగా మొత్తాన్ని వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి గృహ సంబంధిత చెల్లింపులు, వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. ఆయన తరఫు న్యాయవాదులు ఈ మొత్తాన్ని ప్రచారానికి ఇచ్చిన వ్యక్తిగత రుణాల రీయింబర్స్‌మెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అయితే, జ్యూరీ గంటల తరబడి జరిపిన విచారణ అనంతరం ఆయనను దోషిగా తేల్చింది. శిక్షను జూన్ 16న ఖరారు చేయనున్నట్లు ప్రకటించింది.తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు జార్జ్‌ను కోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదలయ్యారు. అమెరికా చట్టాల పరంగా, జార్జ్ దోషిగా తేలిన వెంటనే పదవి నుంచి తొలగింపుకు అర్హుడు. అయితే అధికారికంగా శిక్ష విధించే వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. -
టోక్యోలో ఘనంగా ఉగాది పండుగ
జపాన్‌లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్‌లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జపాన్‌కు చెందిన స్థానికులు కూడా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉగాది సందర్భంగా సంప్రదాయం ప్రకారం ఉగాది పచ్చడిని తయారు చేసి, దాని ప్రాముఖ్యతను పాల్గొన్న వారికి వివరించారు. అలాగే రాశి ఫలాలను వినిపిస్తూ కొత్త సంవత్సరానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అనంతరం వివిధ రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి అందరూ కలిసి భోజనం చేశారు.పిల్లల కోసం బ్యాగ్ జంపింగ్ వంటి వినోదాత్మక పోటీలు నిర్వహించగా, పెద్దల కోసం టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు.కార్యక్రమం అనంతరం కొత్తగా వచ్చిన కుటుంబాలు పరస్పరం పరిచయం చేసుకుని, విదేశాల్లో భారతీయ సంప్రదాయాలను ఎలా కొనసాగించాలన్న దానిపై చర్చించారు. ఈ వేడుకల ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడిందని నిర్వాహకులు తెలిపారు. వివిధ దేశాల ప్రజలు కలిసి సంస్కృతులను పంచుకోవడం ద్వారా పరస్పర అవగాహన పెరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన TAJ(Telugu association of Japan)కమిటీ సభ్యులకు, అలాగే పాల్గొన్న అందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. -
సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
సింగపూర్‌లోని తెలుగు వాసులు ఈ ఏడాది ఉగాది పండుగను సంప్రదాయానికి అనుగుణంగా, ఆత్మీయంగా మరియు వైభవంగా జరుపుకున్నారు. మార్చి 19, 20, 2026 తేదీలలో ఈ ఉత్సవాలు చాంగీ రామర్ దేవాలయం, సెంగ్కాంగ్ మురుగన్ దేవాలయం, యిషున్ మహా మారియమ్మన్ దేవాలయం మరియు శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయాల్లో ఘనంగా నిర్వహించబడ్డాయి.ప్రత్యేకంగా, టీమ్ శివ ప్రసాద్ సభ్యులు మొదటిసారిగా నాలుగు దేవాలయాల్లో ఒకేసారి ఉగాది వేడుకలను నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి మరియు ప్రసాదాన్ని పంపిణీ చేశారఈ కార్యక్రమం ద్వారా భక్తి, ఆనందం, ఐక్యత మరియు సాంప్రదాయాల పట్ల గౌరవం మరోసారి ప్రతిఫలించింది. సమాజంలోని సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసి పండుగను జరుపుకోవడం అందరి హృదయాలను ఆనందంతో నింపింది.ఈ ఉత్సవాల ద్వారా సాంప్రదాయం, సంస్కృతి, భక్తి మరియు ఐక్యత మరింత బలపడగా, ప్రతి కుటుంబానికి సంతోషం, ఆరోగ్యం, శాంతి కలగాలని ఆకాంక్ష వ్యక్తమైంది. ఈ ఆశయంతో, సింగపూర్‌లో టీమ్ శివ ప్రసాద్ సభ్యులు 2026 ఉగాది వేడుకలను విజయవంతంగా ముగించారు. -
మైనర్లపై వేధింపులు.. అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్
అమెరికాలోని న్యూ మెక్సికో రాష్ట్రంలో మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్ వేధింపులకు పాల్పడుతున్న ముఠాను శాంటా ఫే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయగా, అందులో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన 26 ఏళ్ల బల్కం నాగరాజుగా గుర్తించారు. పోలీసుల ప్రత్యేక విభాగం (Special Victims Unit) ఆన్లైన్లో మైనర్లుగా నటిస్తూ ఈ అండర్‌కవర్ ఆపరేషన్ చేపట్టారు. పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుంటున్న వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది.నాగరాజుపై అమెరికా చట్టాల ప్రకారం కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇలాంటి కేసులు అమెరికాలో అత్యంత కఠినంగా పరిగణించబడతాయి. మైనర్లకు సంబంధించిన నేరాలు అక్కడి చట్టవ్యవస్థలో చాలా తీవ్రమైనవిగా భావించబడతాయి. ఇలాంటి కేసులో ఇరుక్కుంటే, అది కేవలం అరెస్టుతో ముగియదు. బెయిల్ దొరకడం చాలా కష్టం. దీర్ఘకాలికంగా విచారణలు కొనసాగుతాయి. వీసా రద్దు, డిపోర్టేషన్, శాశ్వత నిషేధం వంటి పరిణామాలు ఎదురవుతాయి. భవిష్యత్తు సర్వనాశనం అవుతుంది. -
అల్ఫారెట్టాలో వైభవంగా ‘నాట్యాంజలి-2026’
అల్ఫారెట్టా, జార్జియా: స్థానిక నటరాజ నాట్యాంజలి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక నృత్యోత్సవం నాట్యాంజలి-2026’ అల్ఫారెట్టాలోని డెన్మార్క్ హైస్కూల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి 700 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. మూడు సేవా సంస్థలకు నిధులు సమీకరించేందుకు తమ మద్దతు తెలిపారు.ఈ నృత్యోత్సవంలో 168 మంది విద్యార్థులు పాల్గొని 28 రంగురంగుల కూచిపూడి నృత్య ప్రదర్శనలు చేశారు. నాలుగేళ్ల చిన్నారుల నుండి 45 సంవత్సరాల వయస్సు గల కళాకారుల వరకు పాల్గొనడం ద్వారా భారతీయ శాస్త్రీయ నృత్యకళను అన్ని తరాల మధ్య విస్తరింపజేయాలనే అకాడమీ లక్ష్యం ప్రతిఫలించింది. ఈ కార్యక్రమం ద్వారా సమీకరించిన నిధులను శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ఫర్ ది డిసేబుల్డ్ చిల్డ్రెన్, ది ప్లేస్, శంకర నేత్రాలయ(యూఎస్ఏ) సేవా సంస్థలకు అందజేయనున్నారు.ఈ వేడుకల్లో బాల ఇందుర్తి, మాధవి ఇందుర్తి (శంకర నేత్రాలయ యూఎస్ఏ ప్రతినిధులు), గిరిధర్ కొటగిరి (ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా అధ్యక్షులు), జ్యోత్స్న పాలకుర్తి (గేట్స్ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ తెలుగు ఎంట్రప్రెన్యూర్స్ చైర్మన్), రమణ గంద్ర (గేట్స్ అధ్యక్షులు), సునీత పోట్నూరు (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా అధ్యక్షురాలు), ఆది శ్రీనివాసన్ (ఒస్మోస్ యుటిలిటీస్ సర్వీసెస్ అధ్యక్షులు), శ్రీరామ్ రోయ్యాల, క్రిస్టీ ఫెరెన్సీ (ప్రెసిడెంట్ అండ్ సీఈఓ), జనార్ధన్ పన్నెల (శాంతినికేతన్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రతినిధి) పాల్గొన్నారు. -
సింగపూర్‌లో ఘనంగా ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూర్ ఆధ్వర్యంలో ‘శంకరాభరణం వెండితెర నవల’ పుస్తకావిష్కరణ కార్యక్రమం ప్రముఖ దర్శకులు కె. విశ్వనాథ్ గారి తనయులు కే నాగేంద్రనాథ్ చేతుల మీదుగా ఆదివారం సాయంత్రం 43, బర్గండీ క్రిసెంట్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 70 మంది దర్శకుడు కె. విశ్వనాథ్ అభిమానులు హాజరయ్యారు.సంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ, కె. నాగేంద్రనాథ్‌తో తనకు దాదాపు పదేళ్లకు పైగా అనుబంధం ఉందని తెలిపారు. సామవేదం షణ్ముఖ శర్మ 2017లో సింగపూర్ విచ్చేసిన సందర్భంగా నిర్వహించిన శివపదం కార్యక్రమానికి ఆయన అందించిన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వీడియో సందేశాలు అందించిన పుస్తక రచయిత, ప్రముఖ దర్శకులు సీనియర్ డైరెక్టర్ వంశీకి, ‘శంకరాభరణం’ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తనయులు ఏడిద రాజాకి ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్య అతిథి కె. నాగేంద్రనాథ్ మాట్లాడుతూ శంకరాభరణం’ చిత్రం విడుదల సమయంలో వచ్చిన ఈ పుస్తకం అప్పట్లో తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందిందని తెలిపారు. ప్రస్తుతం పుస్తక రచయిత వంశీని సంప్రదించి పునర్ముద్రణ చేయించామని చెప్పారు. విశ్వనాథ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించామని, దానికి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలు, విశేషాలు వినిపించడంతో ఇది ఒక అచ్చ తెలుగు పండుగలా అనిపించిందని తెలిపారు.ఈ సందర్భంగా తొలి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విచ్చేసినసంస్కార భారతి అధ్యక్షులు రమణమూర్తి కి, తెలుగు సమాజం పూర్వ అధ్యక్షులు బి.వి.ఆర్. చౌదరి దంపతులకు, తంగిరాల రాజశేఖర్, సౌభాగ్యలక్ష్మి దంపతులకు కె. నాగేంద్రనాథ్ చేతుల మీదుగా అందజేశారు.కార్యక్రమంలో ‘శంకరాభరణం’ చిత్రంలోని గీతాలను చంద్రహాస్ ఆనంద్, షర్మిల, కిరీటి దేశిరాజు, సౌభాగ్యలక్ష్మి, శేషు యడవల్లి ఆలపించగా, శేషశ్రీ వీణపై ఒక గీతాన్ని వాయించి ప్రేక్షకులను అలరించారు. అలాగే దర్శకుడు కె. విశ్వనాథ్ తో ఉన్న వ్యక్తిగత పరిచయాలను పూజా కండ్రప, రామచంద్రరావు ప్రేక్షకులతో పంచుకోగా, చిత్ర మరియు పుస్తక విశేషాలను వేణు రెడ్డి, రాధికా మంగిపూడి, రాంబాబు పాతూరి, శేషు యడవల్లి, సుబ్బు పాలకుర్తి, కోనాల కాళీకృష్ణ తదితరులు వివరించారు.కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల కోసం రాజశేఖర్–సౌభాగ్యలక్ష్మి దంపతులు ప్రత్యేకంగా తెలుగు వంటకాలతో భోజనాన్ని సిద్ధం చేశారు. ఈ ఏర్పాట్లలో శ్రీలలిత, మాధవి పాలకుర్తితోపాటు, సుబ్బు పాలకుర్తి వ్యాఖ్యాతగా వ్యవహరించగా, రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ్, సత్య జాస్తి, రాజ్ కుమార్ తదితరులు సహాయ సహకారాలను అందించారు. -
లండన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
లండన్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘‘సహకారం, స్నేహం, సిస్టర్హుడ్-మహిళల విజయానికి మూడు బలమైన స్థంభాలు.” అనే భావంతో యూకేలో నివసిస్తున్న తెలుగు మహిళలు “తెలుగు లేడీస్ యుకే” ఫేస్బుక్ గ్రూప్ ద్వారా కలుసుకుని ఘనంగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. మహిళా సాధికారత, పరస్పర సహకారం, సోదరీమణుల ఐక్యతకు ప్రతీకగా ఈ వేడుక నిలిచింది.సాయం కోరే వారికి, సహాయం అందించే వారికి వారధిగా నిలిచిన తెలుగు లేడీస్ ఇన్ యుకే గ్రూపున శ్రీదేవి మీనావల్లి 15 ఏళ్ల క్రితం స్థాపించారు. ప్రస్తుతం ఈ గ్రూపులో యూకేలో నివసిస్తున్న ఐదు వేలకుపైగా తెలుగు మహిళలు సభ్యులుగా ఉన్నారు. యూకేకు కొత్తగా వచ్చిన తెలుగు ఆడపడుచులకు ఆదరణగా నిలిచి, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తూ విద్య, వైద్యం, ఉద్యోగ రంగాలలో సహాయం చేయడం ఈ గ్రూప్ ప్రధాన ఆశయమని శ్రీదేవి తెలిపారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిచి ముందుకు సాగాలనే సంకల్పంతో ఈ వేదిక అనేకమందికి ధైర్యం, మార్గదర్శనం అందిస్తోంది.ఈ సంవత్సరం యూకేలోని పలు ప్రాంతాల నుండి 300కు పైగా తెలుగు మహిళలు పాల్గొని ఆటపాటలతో, ఫ్యాషన్ షో తో సందడి చేశారు. కార్యక్రమంలో నిర్వహించిన ఇన్స్పైరింగ్ స్టోరీస్ సెగ్మెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, మహిళలు తమ జీవిత ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, విజయ కథలను పంచుకుని అందరికీ స్ఫూర్తినిచ్చారు. అలాగే ప్రముఖ బ్రాండ్స్‌తో జరిగిన ఫ్యాషన్ షో కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమ ప్రాంగణంలో షాపింగ్ స్టాళ్లు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జ్యోతి సిరపు, లక్ష్మి చిరుమామిళ్ల, సువర్చల మాదిరెడ్డి, స్వాతి డోలా, స్వరూప పంతంగి, శిరీష టాటా, దీప్తి నాగేంద్ర, , సవిత గుంటుపల్లి, చరణి, జ్యోతి బాలుసు తదితరులు పాల్గొన్నారు. -
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్‌పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్‌కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్‌గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
రణరక్కసి కోరల్లో ప్రవాసాంధ్రులు
రాజంపేట : పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం ఉమ్మడి కడప జిల్లా వాసులు లక్షలాదిమంది చిక్కుకుపోయారు. దీంతో ఆ కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కువైట్, దుబాయ్, సౌదీ, బహ్రెయిన్, ఒమన్, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లిన కడప జిల్లా వాసులు సుమారు రెండులక్షల మంది ఉన్నట్టు సమాచారం. ప్రవాసాంధ్రులు 12 లక్షల మంది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.ఆయా దేశాల్లో యుద్ధం నేపథ్యంలో బాంబుల వర్షం కురుస్తుండడంతో వీరంతా బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్న బంధువులకు చేరవేస్తున్నారు. జనావాసాల మధ్య క్షిపణులు, బాంబు దాడులు జరుగుతుండడంతో భయం గుప్పెట్లో బతుకుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గదులకే పరిమితం యుద్ధ వాతవరణం నేపథ్యంలో చాలామంది ప్రవాసాంధ్రులు (Telugu NRIs) స్వగ్రామాలకు తిరిగి వచ్చేందుకు సామగ్రితో విమానాశ్రయాలకు వెళ్లినా ఫలితం లేకపోయిందని సమాచారం. విమానాలు రద్దవడంతో ఏం చేయాలో పాలుపోక అక్కడే ఉండిపోయినట్టు తెలుస్తోంది. బాంబు దాడుల నేపథ్యంలో తమ గదులకే పరిమితమవుతున్నట్టు సమాచారం. అప్రమత్తంగా ఉండాలని అక్కడి భారత రాయబార కార్యాలయాల అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రవాస భారతీయుల కోసం.. ప్రవాస భారతీయుల కోసం భారత రాయబార శాఖ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఎప్పటికప్పుడు గల్ఫ్‌దేశాల్లో పరిస్ధితిని సమీక్షిస్తూ, బాధితులకు అవసరమైన సాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈమేరకు ఇప్పటికే వివిధ దేశాల్లో అత్యవసర హెల్ప్‌లైన్ (Helpline) నంబర్లను అధికారులు ప్రకటించారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొటుంటే వెంటనే సంప్రందించాలని కూడా సూచించారు. చదవండి: భారతీయులను రప్పించే ప్రయత్నాలు షురూదోహాలో ఉన్న మా కుమార్తెను క్షేమంగా తీసుకురండి ప్రభుత్వానికి బాధితురాలి తల్లిదండ్రుల విజ్ఞప్తినరసన్నపేట: ఖతర్ రాజధాని దోహాలో తమ కుమార్తె బంకుపల్లి సంజనా చంద్ ఉందని, అక్కడ బాంబు దాడుల నేపథ్యంలో ప్రాణ భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతోందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సూరజ్ నగర్‌కు చెందిన బంకుపల్లి చంద్రశేఖర్, సుమబాల ఆందోళన వ్యక్తం చేశారు. తమ కుమార్తెను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దోహాలో తమ కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోందని పేర్కొన్నారు.జర్మనీ వెళ్తుండగా..బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లా సింగుపురానికి చెందిన వెంకటగౌతం కంపెనీ పనిపై జర్మనీ వెళ్తుండగా మధ్యలో ఖతార్ దేశ రాజధాని దోహాలో దిగి అక్కడ చిక్కుకుపోయాడు. -
అమెరికా తెలుగువారి ఆత్మీయుడు
ఫిబ్రవరి 7వ తేదీన వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో చనిపోయారు. దాదాపు 40 ఏళ్ళకుపైగా కలిసి ఉండిన తెలుగు సాహితీ ప్రియులకు ముఖ్యంగా అమెరికాలో ఉన్నవారికి ఓ పెద్దదిక్కు, ఓ గురుతుల్యుడు, ఓ ఆప్తుడు, ఓ అల్లరి మాటకారి దూరమయ్యారు. ఓ నిలువెత్తు సాహిత్య విగ్రహం, ప్రచురణలో లేని సాహిత్య కథనాలు, సుదీర్ఘ ప్రయాణ ముచ్చట్లు, అపరిమిత జిజ్ఞాస, ఇంకా మరెన్నో ఆయనతో పాటు నిష్క్రమించాయి. వేలూరి గారంటే...లింక్డిన్లో చూస్తే ఈయన ఓ చికాగో యూనివర్సిటీలో 25 ఏళ్ళు పని చేసిన భౌతిక శాస్త్రవేత్త అని తెలుసుకోవచ్చు. 1971లో అటామిక్, మాలిక్యులర్ విభాగంలో చేసిన పరిశోధనతో డాక్టరేట్ చేశారని తెలుసుకోవచ్చు. విశాఖపట్టణంలో మొదలైన భౌతికశాస్త్రంతో వృత్తిగా చివరంటా దాంతోనే ఉన్నారని తెలుస్తుంది. కానీ, ఆయనతో మూడు దశాబ్దాల పరిచయం ఉన్న నేను ఒక్కసారి కూడా ఆయనతో సైన్సు గురించిన మాట్లాడిన గుర్తులేదు. ఆయన జీవనోపాధికి ఏం చేశాడో నాబోటి వాళ్ళకు పెద్దగా తెలీదు కానీ, మాకు తెలిసిన వేలూరి పూర్తిగా సైన్సుకు బయటివాడు. వేలూరి స్నేహాలు ఈయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ స్నేహ బృందాన్ని తయారు చేసుకున్నారు. ముఖ్యంగా ఏలూరు కథలు వేలూరి గారే చెప్పాలి. వేల్చేరు నారాయణరావు, పెమ్మరాజు వేణుగోపాలరావు, పోణంగి రామకృష్ణారావు, సూర్యనారాయణ రాజు కొన్నిపేర్లు. దశాబ్దాలూ, సముద్రాలూ, సాహిత్య శిబిరాలన్నింటినీ దాటి సమాంతరంగా చివరంటా సాగిన స్నేహాలు అవి. యవ్వనంలో ఉండే అల్లరి, ఆవేశం, బేఖాతర్ జీవన శైలి నించి వైజ్ఞానికులుగా, పెద్దలుగా, గౌరవనీయులుగా ఎదిగి నిష్క్రమించే దాకా సాగిన స్నేహాలు ఇవి. ఆయన విశాఖపట్టణం వెళ్ళాక అక్కడ స్నేహితులతో చేసిన ‘కావ్య దహనోత్సవం’ పేరుతో చేసిన అల్లరి బహుశా తెలుగు సాహిత్య చరిత్రలో నిలిచిపోయే ప్రహసనం.వేలూరి వేంకటేశ్వరరావు (Veluri Venkateswara Rao) సంభాషణల్లో తరచూ దొర్లే కొన్ని విశాఖపట్నం పేర్లు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జ్యేష్ఠ, రత్నం, రావిశాస్త్రి, చేకూరి రామారావు. ఒరిస్సాలో ఉన్న రోజుల్లో ఒరియా సాహిత్యంతోనూ, కొంత బెంగాలీ సాహిత్యంతోనూ, సాహిత్యకారులతోనూ ఈయనకి అక్కడ పరిచయం లభించింది. ఎంతలా అంటే అయ్యో ఫలానా విషయం తెలుగులో లేదే అని బాధపడేంత. ఆయన అమెరికా చేరిన తర్వాత ఇంటర్నెట్ రాక ముందు నుంచే చేతిరాతలతోనూ, డయల్ ఫోన్లతోనూ పరిచయాలని నెరిపి దాదాపు మొదటితరం తెలుగు సాహిత్యానికీ, సాహిత్య స్నేహాలకీ పునాది వేశారు. నేను 1996, 1997 ప్రాంతాల్లో ఈ సమూహాల్లో ప్రవేశం మొదలెట్టేటప్పటికే ఈయన పరుచూరి శ్రీనివాస్, జంపాల చౌదరి, సురేష్ కొలిచాల, చంద్ర కన్నెగంటి, రామారావు కన్నెగంటి, పాణిని శంఖవరం వంటి వాళ్ళచే పెద్దవారిగా, గురుస్థానంలో ఉన్నారు.ఆయనతో విభేదించినా, గొడవ పడ్డా, వాదించినా, సలహా అడిగినా అవన్నీ ఆయన్ని గురుస్థానంలో ఉంచే జరిగేవి అని నా అభిప్రాయం. ఇప్పటికీ పబ్లిక్‌గా ఉన్న రచ్చబండ, తెలుసా ఇంటర్నెట్ గ్రూపుల పాతపోస్టులనీ, చర్చలనీ చూస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ‘తెలుగు డయాస్పోరా’ (Telugu Diaspora) అన్న మాటని మొదట తీసుకు వచ్చింది వేలూరి అని అంటారు. ఆ డయాస్పోరా అన్నా, డయాస్పోరా సాహిత్యం అన్నా ఏమిటి అనే నిర్వచనాలని స్పష్టంగా ఆయన చెప్పారు.వేలూరికి మనుషులు కావాలి! వేలూరి ఈ ప్రపంచాన్ని వదిలే సమయానికి ఆయన్ని స్నేహితుడిగా చెప్పుకునే వాళ్ళ వయసులు 15 నించి 100 దాకా ఉంటాయని నా నమ్మకం. మనకి ఓపిక ఉండాలిగానీ ఆయన మాట్లాడుతూనే ఉండగలడు. తిలక్, కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, రావిశాస్త్రులూ మా ఫ్రెండ్‌కి ఫ్రెండే అనేంత దగ్గరగా తీసుకురాగలడు. వేలూరి మంచి హోస్టు. మన ఇండియా, తెలుగు భోజనలకి ఎలాంటి వైన్ పక్కన ఉండాలో చెప్పినవాళ్ళు లేరు. పెసరట్టుకి ఎలాంటి వైన్, గోంగూర పచ్చడి అన్నం పక్కన ఎలాంటి వైన్ లాంటివి మనం అడగాలేగానీ ఆయన చెప్పేస్తారు. ఇప్పుడనిపిస్తోంది ఎందుకు మేమెవ్వరం ఆయన్ని ఈ విషయాల మీద రాయమని అడగలేదా అని! కానీ ఆయన నాలుక ఎంత పదునంటే ఏదో ఒకటి సడెన్‌గా కోపమొచ్చేలా అంటారు. ఆ నిర్మొహమాటమే ఆయనకి బలం, బలహీనత. మొదట్లో ఉడుక్కునేవాణ్ణి. కానీ ఆయనకి ఎలా సముదాయించాలో కూడా తెలుసు. ఈ వ్యాసాన్ని పూర్తిగా వేలూరి అనే ఓ వ్యక్తి పరిచయంగా జ్ఞాపకాల్లోంచి రాద్దామని మొదలెట్టినా, చివరి పేరా వచ్చేసరికి కళ్ళు చెమరుస్తున్నాయి. వేలూరి నాకు తెలుసు అని చెప్పుకోవడం గొప్ప మర్యాద. ఆయన ఇప్పుడు లేరు అని గుర్తుంచుకుని బాధ పడాలని లేదు. ఆయన జీవితాన్ని ఎంతలా సెలబ్రేట్ చేసుకోగలమూ, ఎలాంటి పాఠాల్ని నేర్చుగోగలమూ అన్నదే ప్రశ్న. 👉 సోల్‌మేట్ కథ చదివారా? న్యూయార్కర్ లాంటి సాహిత్య పత్రిక ఉండాలనీ, ‘ఈమాటా’ వెబ్ పత్రికని ఆ టెంప్లేట్లో రూపొందించాలనీ ఆయన చాలా కృషి చేశారు. సైన్సు పేపర్లకి ముందు ఉండే పియర్ రివ్యూ లాంటి పద్ధతి సాహిత్యానికి కూడా ఉండాలని ఆయన స్థిరాభిప్రాయం. నృత్యం చేసేవాడూ, పెయింటింగ్ వేసేవాడూ, పాట పాడేవాడూ ఏదో ఒకటి నేర్చుకుని, బోల్డెంత ప్రాక్టీస్ చేస్తారు. రచయితకి మాత్రం ఎందుకు అలాంటి శిక్షణ, క్రమశిక్షణ లేదు అనేది ఆయన ప్రశ్న. – అక్కిరాజు భట్టిప్రోలు, రచయిత -
13 ఏళ్ల టీనేజర్ అమెరికాలో మైనర్లపై వేధింపులు, దొంగతనాలు
అమెరికాలో మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఒక భారతీయుడిని అరెస్టు చేశారు. ఓదెల యశస్వి కొత్తపల్లిగా గుర్తించబడిన నిందితుడు అక్రమ వలసదారు అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. న్యూజెర్సీలో పిల్లలపై లైంగిక వేధింపులతోపాటు, దొంగతనానికి సంబంధించిన ఆరోపణలు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించింది.సరైన పత్రాలు లేకుండా అమెరికాలోని ప్రవేశించిన నిందితుడు యశస్విని చైల్డ్ రేపిస్తూ అని పేర్కొంది. అతడిపై యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టం ప్రకారం తొలగింపు చర్యలు పెండింగ్‌లో ఉన్నాయని యుఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఈసీఇ) ఎక్స్‌లో ప్రకటన విడుదల చేసింది. ఇదీ చదవండి: ఎప్స్టీన్ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలుమైనర్లపై లైంగిక నేరాలకుపాల్పడినట్లు అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అలాగే, దొంగతనం, శాంతిభద్రతలకు భంగం కలిగించడం వంటి నేరాలతోనూ అతనికి సంబంధాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే నిందితుడిపై కేసు ఎప్పుడు, ఎక్కడ నమోదైంది, ఎప్పుడు అరెస్టు చేశారనే విషయాలపై స్పష్టతనివ్వలేదు.—SEXUAL ASSAULT OF A CHILD UNDER 13 —SHOPLIFTING —PUBLIC DISORDER Vodela Yashaswi Kottapalli, a criminal illegal alien from India, has pending charges for sexual assault and larceny in New Jersey. We’ll keep him in custody pending removal proceedings. pic.twitter.com/VM97e9KUD9— U.S. Immigration and Customs Enforcement (@ICEgov) February 16, 2026 ఇదీ చదవండి: పెళ్లయ్యి ఆరునెలలే.. వాలెంటైన్స్‌డే రోజే హత్య -
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో శివాలయాల సందర్శన యాత్ర
తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో మహా శివరాత్రి పర్వదినం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది కూడా శివాలయాల సందర్శన యాత్ర ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఫిబ్రవరి 16వ తేదీ ఉదయం 6.30 గంటల వరకు నిర్వహించారు. సింగపూర్‌లోని జురాంగ్ ఈస్ట్ ,బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్- పుంగ్గోల్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్రను నిర్వహించారు. సుమారు 230 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెనలు పొందారు. భక్తుల శివనామస్మరణలతో ప్రముఖ దేవాలయాలు కిటకిటలాడాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సురక్షితంగా యాత్రను నిర్వహించిన సొసైటీ వారికి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులు తమ కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి లాభాపేక్ష, ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ, భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా ప్రాంతీయ కార్యదర్శులు సంతోష్ వర్మ మాదారపు, భాస్కర్ నడికట్ల, శశిధర్ ఎర్రమ రెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ , సంతోష్ కుమార్ జూలూరి మరియు ప్రశాంత్ బసిక, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి మిర్యాల మరియు ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము మొదలగు వారు ఉన్నారు.వీరితో పాటు యాత్రలో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్,సమ్మయ్య మొలుగూరి, లక్ష్మణ్ రాజు కల్వ, వేణు గోపాల్ ఐరేని, రావుల సుగుణాకర్ రెడ్డి మరియు అందరికి కృతజ్ణతలు తెలియజేశారు. ఈ వేడుకలకు ఆర్థిక సహకారం అందించిన నాగులపల్లి శ్రీనివాస్ గారికి సొసైటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రతిఒక్కరికి సొసైటీ అధ్యక్షులు గడప రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి రాము బొందుగుల మరియు కోశాధికారి నంగునూరి వెంకట రమణ , సొసైటీ ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, దుర్గ ప్రసాద్, భాస్కర్ గుప్త నల్ల, జూలూరి సంతోష్ కుమార్ ఉపాధ్యక్షురాలు మిర్యాల సునీత రెడ్డి, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు బొడ్ల రోజా రమణి, నడికట్ల భాస్కర్, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్,సంతోష్ వర్మ మాదారపు మరియు కార్యవర్గ సభ్యులు శివ ప్రసాద్ ఆవుల, పెరుకు శివ రామ్ ప్రసాద్, భాస్కర్ రావు పులిగిళ్ల, విజయ మోహన్ వెంగళ, ప్రవీణ్ మామిడాల, సతీష్ పెసరు, మణికంఠ రెడ్డి, రావుల సుగుణాకర్ రెడ్డి , చల్ల కృష్ణ మొదలగు వారు గత సంవత్సరం లాగే ఈ సారి కూడా భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులందరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. -
అమెరికాలో అదృశ్యమైన శ్రీనివాసయ్య మృత దేహం లభ్యం
అమెరికాలోని కాలిఫోర్నియాలో కనిపించకుండా పోయిన 22 ఏళ్ల భారతీయ విద్యార్థి ఉదంతం విషాదాంతమైంది. తప్పిపోయిన ఆరు రోజుల తర్వాత కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) మృతదేహం లభ్యమైంది. పోలీసులు అతని మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధృవీకరించింది. దీంతో అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.అతని మృతదేహాన్నివీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యంత క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి, ప్రియమైనవారికి తమ హృదయపూర్వక సానుభూతిని తెలియ జేస్తున్నామని ప్రకటనలో పేర్కొంది.Consulate General of India in San Francisco is deeply concerned about the disappearance of Saketh Sreenivasaiah, an Indian post-graduate student of UC Berkeley, hailing from the State of Karnataka. The Consulate is in touch with the family and also is in contact with the…— India in San Francisco (@CGISFO) February 14, 2026 కాలిఫోర్నియా బర్కిలీ విశ్వవిద్యాలయంలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు.మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. తమ కొడుకు ఎలాగైనా క్షేమంగా తిరిగి వస్తాడని ఎదురు చూసిన కుటుంబీకుల్లో శ్రీనివాసయ్య మరణవార్త తీరని విషాదాన్ని మిగిల్చింది. -
అమెరికాలో కర్నాటక విద్యార్థి అదృశ్యం
న్యూయార్క్/బెంగళూరు: అమెరికాలోని కాలిఫోరి్నయాలో పీజీ చదువుకునే భారతీయ విద్యార్థి ఒకరు కనిపించకుండా పోయారు. కర్నాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య(22) అమెరికాలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ బర్కిలీలో కెమికల్, బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ పీజీ చేస్తున్నాడు. మద్రాస్ ఐఐటీ నుంచి ఇతడు 2025లో కెమికల్ ఇంజనీరింగ్ పట్టా అందుకున్నాడు. సాకేత్ మంగళవారం చివరిసారిగా డ్వైట్ వేలోని 1700 బ్లాక్ వద్ద కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ల్యాప్‌టాప్, పాస్‌పోర్టు తదితరాలున్న సాకేత్ బ్యాగు లేక్ ఆంజా ప్రాంతంలోని పార్క్హిల్స్లో ఓ ఇంటి ఆవరణలో పడి ఉండగా గుర్తించారు. ఈ విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ ధ్రువీకరించింది. సాకేత్ అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. అతడి ఆచూకీ కనుగొనే విషయమై స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, కర్నాటకలోని కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నామని శనివారం వెల్లడించింది. ఈ నెల 9వ తేదీ నుంచి సాకేత్ కనిపించకుండాపోయాడంటూ అతడి రూమ్మేట్ బనీత్ సింగ్ ఈ నెల 13వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అన్ని చోట్లా వాకబు చేసిన తను ఎటువంటి ఫలితం కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపినట్లు బనీత్ తెలిపాడు. ప్రభుత్వానికి సాకేత్ తండ్రి వినతి అమెరికాలో గల్లంతైన తమ కుమారుడిని కనుగొనేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపన అందజేసినట్లు తండ్రి శ్రీనివాసయ్య తెలిపారు. చివరిసారిగా తమ కుమారుడితో ఈ నెల 9వ తేదీన ఫోన్లో మాట్లాడామన్నారు. 12వ తేదీ నుంచి కనిపించడం లేదంటూ అతడి రూమ్మేట్ తమకు తెలిపాడన్నారు. కుమారుడి కోసం అమెరికా వెళ్లే విషయమై తాము ఆలోచిస్తున్నామన్నారు. సాకేత్ విషయంలో కాలిఫోర్నియాలోని భారత కాన్సులేట్ అధికారులు అక్కడి పోలీసులతో మాట్లాడాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కర్నాటక ప్రభుత్వం శనివారం కేంద్ర విదేశాంగ శాఖను కోరింది. -
అమెరికాలో జాహ్నవి మృతి కేసు : రూ. 262 కోట్ల పరిహారం
అమెరికాలోని సియాటిల్‌లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు సంతతికి చెందిన గ్రాడ్యుయేట్ జాహ్నవి కందులకుటుంబానికి భారీ పరిహారం లభించనుంది. జాహ్నవి మృతి చెందిన దాదాపు మూడేళ్ల తర్వాత, ఆమె కుటుంబానికి గణనీయమైన ఆర్థిక పరిహారం అందనుంది.ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవిది ఒక సాధారణ మధ్యతరగతి నేపథ్యం. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని మరెంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న కోటి కలలతో సియాటెల్‌లోని నార్త్ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు 2021లో అమెరికాకు వెళ్లింది.కానీ 2023, జనవరి 23వ తేదీ రాత్రి ఒక మలుపు దగ్గర రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల జాహ్నవిని, కెవిన్ డవే అనే పోలీస్ అధికారి నడుపుతున్న పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. ఆ ధాటికి దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన తర్వాత బయటకు వచ్చిన వీడియో సంచలనం రేపింది. ప్రమాదం జరిగిన తర్వాత మరో పోలీస్ అధికారి డేనియల్ ఆడరర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఏముంది మామూలు మనిషేగా...11 వేల డాలర్లు చెల్లిస్తే సరిపోతుందిగా అంటూ ఎద్దేవా చేశాడు. అయితే తన బాడీ కెమెరా ఆన్ చేసి ఉందనే సంగతి మరిచిపోయాడు. అతని మాటలు వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగిలాయి.మరోవైపు సియాటిల్‌లో ప్రమాదం, తమ బిడ్డ మృతిపై జాహ్నవి కుటుంబం దావా వేసింది. ఈ సంఘటన తెలుగు, భారతీయ వర్గాల నుండి మాత్రమే కాకుండా, స్థానికులు కూడా ప్రజల ఆగ్రహాన్ని వ్యతిరేకతను రేకెత్తించింది. దీంతో భారీ పరిహారంతో ఈ కేసును పరిష్కరించు కుంది. సియాటిల్ నగరం దాదాపు రూ. 262 కోట్ల (28 మిలియన్ డాలర్ల) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పోలీసు అధికారి ఎటువంటి నేరారోపణలు లేకుండా, 5000 డాలర్లు జరిమానా విధించారు. అలాగే విధుల నుండి గత ఏడాది సస్పెండ్ చేశారు. సియాటెల్ ప్రకటనకందుల మరణం "హృదయ విదారకం" అని సియాటెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిష్కారం ఆమె కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆమె నష్టం ఊహించలేని బాధను మిగిల్చింది. ఆమె కుటుంబానికి, ఆమె స్నేహితులకు మరియు మా సమాజానికి కూడా జాహ్నవి కందుల జీవితం చాలా ముఖ్యమైనదే అంటూ విచారం వ్యక్తం చేసింది. ఈ ఆర్థిక పరిష్కారం కందుల కుటుంబానికి కొంత ఆత్మవిశ్వాసాన్ని తెస్తుందని నగరం ఆ శాభావాన్ని వ్యక్తం చేసింది. కందుల దుర్మరణం జాతీయ ఆగ్రహాన్ని రేకెత్తించింది. ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ సర్వీసెస్ (ICS)తో సహా న్యాయవాద సంఘాలు విస్తృత పోలీసు సంస్కరణల కోసం పిలుపునిచ్చాయి. 110 మిలియన్ డాలర్ల నష్టపరిహారం కావాలని డిమాండ్ చేశాయి. అలాగే ఆ పోలీసు అధికారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని చెప్పడం సరికాదని, స్పష్టమైన మార్గదర్శకాలను డిమాండ్ చేస్తున్నామని IACS లలితా ఉప్పల అన్నారు.ఇదీ చదవండి: ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా -
ఎన్ఆర్ఐకి అక్రమ జైలు శిక్ష : సుమారు రూ. 210 కోట్ల దావా
అమెరికాలోని జార్జియాలో ఉండే భారతీయ అమెరికన్‌కి చేదు అనుభవం ఎదురైంది. చేయని నేరానికి ఆరు వారాల జైలు శిక్ష అనుభవించారు. కానీ విచారణలో కోర్టు ఈ కేసు కొట్టి వేసింది. దీంతో ఆయన న్యాయాపోరాటానికి సిద్ధపడ్డారు. జార్జియాలోని వాల్‌మార్ట్ స్టోర్‌లో ఒక చిన్నారిని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడనే తప్పుడు ఆరోపణతో ఆరు వారాల పాటు జైలు శిక్ష అనుభవించిన భారతీయ అమెరికన్ 57 ఏళ్ల మహేంద్ర పటేల్ ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.జార్జియాలోని అక్వర్త్లోని వాల్‌మార్ట్‌లోతన కొడుకును కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించా డని రెండేళ్ల బాలుడి తల్లి కరోలిన్ మిల్లర్ ఆరోపించింది. ఈ సంఘటనను వాల్‌మార్ట్ ఉద్యోగికి, తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 57 ఏళ్ల మహేంద్ర పటేల్‌ను 2025, మార్చి 24న అరెస్టు చేశారు. ఈ విషయంలో తనకి, పటేల్‌కి మధ్య బాబు కోసం "టగ్ ఆఫ్ వార్" జరిగిందని కూడా పేర్కొంది. అయితే తాను నిరపరాధి నని మొదటినుంచి గట్టిగా వాదించారు మహేంద్ర పటేల్. 2025 మార్చి 18న, తాను వాల్‌మార్ట్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు, టైలెనాల్ (టాబ్లెట్స్) ఎక్కడ ఉన్నాయోమిల్లర్‌ను దిశానిర్దేశం చేయమని అడిగానని పటేల్ చెప్పాడు. అప్పుడు ఆమె కొడుకు బ్యాలెన్స్ కోల్పోతున్నాడని గమనించి, అతను పడిపోకుండా ఉండటానికి చేయి చాచానని చెప్పుకొచ్చాడు.SHOCKING & SAD !! Mahendra Patel has filed a federal civil rights lawsuit after being jailed for 47 days over a Walmart incident.He was arrested after a shopper accused him of trying to kidnap her child. Police video later showed no force, no injury, and no kidnapping… pic.twitter.com/cRlPZfwvEH— M9 USA🇺🇸 (@M9USA_) February 11, 2026 తప్పుడు ఆరోపణల వల్ల పటేల్ 46 రోజుల పాటు కాబ్ కౌంటీ జైలులో గడపాల్సి వచ్చింది. ఆరు వారాల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. చివరికి ఆగస్టు 2025లో జిల్లా అటార్నీ కార్యాలయం ఈ కేసును కొట్టివేసింది. రెండు పార్టీలు ఒక పరిష్కారానికి వచ్చాయని కోబ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ చెప్పింది.నిజం నిరూపించిన సీసీటీవీ ఫుటేజ్అతను బిడ్డను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించలేదని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిరూపితమైంది.పటేల్ చాలా ప్రశాంతంగా ఆమె పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లడం, ఆమె అతనికి 'థంబ్స్ అప్' చూపించడం స్పష్టంగా కనిపించింది. అలాగే మిల్లర్ చెప్పినట్లుగా అక్కడ ఎలాంటి పెనుగులాట జరగలేదు. ఇదీ చదవండి: రైల్లో శాండ్విచ్...నెటిజన్ల రియాక్షన్స్ వైరల్ వీడియో మానసిక వేదన, వ్యాపార నష్టం ఈ అనుభవాన్ని "పీడకల"గా అభివర్ణించారు. ఈ దారుణమైన అనుభవం తనను మానసికంగా కుంగ దీసిందనీ, ఆర్థికంగా దెబ్బతీసిందని పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. "టైలెనాల్ కోసం వెళ్తే, నా జీవితంలోనే అతిపెద్ద తలనొప్పి ఎదురైంది" అని ఆయన పేర్కొన్నారు. తన కుటుంబం కూడా నరకం చూసిందన్నారు. ఒకవేళ వాల్‌మార్ట్ వీడియో లేకపోయి ఉంటే. ఆమె మాట వర్సెస్ నా మాటగా మారింది. నేనిక జైల్లో మగ్గిపోవాల్సి వచ్చేదన్నారు. ఆ ఫుటేజ్‌అక్షరాలా తన ప్రాణాన్ని కాపాడిందన్నారు.సుమారు రూ. 210 కోట్లుతాను అనుభవించిన మానసిక క్షోభకు పరిహారం చెల్లించాల్సిందిగా ఆయన దావా వేశారు. తనను అన్యాయంగా అరెస్ట్ చేసిన ఆక్వర్త్ నగరంపై, తప్పుడు ఫిర్యాదు చేసిన మిల్లర్‌పై , పోలీసులపై 25 మిలియన్ల డాలర్లు ( సుమారు (రూ.210 కోట్లు) నష్టపరిహారం కోరుతూ ఆయన దావా వేశారు.ఇదీ చదవండి: ఇండియన్ ఫోటోగ్రాఫర్‌కు చిక్కిన తొమ్మిది రంగుల అద్భుతంసీసీటీవీ ఫుటేజ్‌లో ఎలాంటి తప్పు కనిపించకపోయినా పోలీసులు కేసు నమోదు చేయడం అధికార దుర్వినియోగమేనని పటేల్ తరపు న్యాయవాది మార్క్ గ్రాస్మన్ అన్నారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డ్ పోయింది.. కానీ ఒక్క క్షణం కూడా : జర్మనీ యువతి వైరల్ వీడియో -
అంబటి, జోగి ఇళ్లపై దాడి.. ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ
వైఎస్సార్సీపీ నేతలు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై టీడీపీ గూండాల దాడిని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ వింగ్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు ప్రజలు.. ఏపీలో జరుగుతున్న చంద్రబాబు సర్కార్ అరాచకాలను గమనిస్తున్నారని పేర్కొంది. కూటమి సర్కార్.. ప్రజా సంక్షేమాన్ని విస్మరించి, అభివృద్ధిని అడ్డుకుందని.. కేవలం రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యం ఇస్తోందని వైఎస్సార్సీపీ సెంట్రల్ సౌదీ అరేబియా ఎన్ఆర్ఐ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు.అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన విధ్వంసం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని పార్టీ కన్వీనర్ సయ్యద్ రబ్బానీ మండిపడ్డారు. ఈ అక్రమ చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో చట్టం ముందు తప్పకుండా జవాబుదారీగా నిలబడాల్సిందేనన్నారు. న్యాయం తప్పక గెలుస్తుందని మేము దృ ఢంగా విశ్వసిస్తున్నామన్నారు. ఇవాళ వైఎస్ జగన్ గుంటూరు పర్యటనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. ప్రజలు ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ముందడుగు వేసి.. ఈ అన్యాయ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఎదుర్కొని ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ జగన్ చూపిన సంక్షేమ మార్గమే.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అని.. మేమంతా ఆయన వెంటే ఉంటామని సయ్యద్ రబ్బానీ ఒక ప్రకటనలో తెలిపారు. -
వైఎస్సార్సీపీ గల్ఫ్ దేశాల కన్వీనర్ల నియామకం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. గల్ఫ్ దేశాలలో వైఎస్సార్సీపీ కన్వీనర్లను నియమిస్తూ.. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.కువైట్-ముమ్మడి బాలిరెడ్డి, రియాధ్(సౌదీ అరేబియా)-ప్రొఫెసర్ సయ్యద్ రబ్బానీ, జుబైల్- శేఖ్ మహెబూబ్ ఇలాహీ, బహ్రెయిన్- ఒర్సు నాగరాజు, దుబాయి-సయ్యద్ అక్రం, ఒమాన్- జి.జి. భాస్కర్‌రావులను కన్వీనర్లుగా పార్టీ నియమించింది. -
చాట్‌జీపీటీతో చిక్కుల్లో పడ్డ గొట్టుముక్కల మధు
ఏఐ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. వీలైనన్ని ఎక్కువ మార్గాల్లో వినియోగించుకుంటున్నారు యూజర్లు. ఈ క్రమంలో అమెరికాలో సంచలనం చోటు చేసుకుంది. అమెరికా సైబర్ ఏజెన్సీ అధికారి ఒకరు చాట్‌జీపీటీ వినియోగంతో చిక్కుల్లో పడ్డారు. ఆయన భారతీయ మూలాలు, అందునా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి కావడం ఇక్కడ విశేషం. అమెరికా ప్రభుత్వ నెట్‌వర్క్‌లను రక్షించే బాధ్యత కలిగిన సీఐఎస్ఏ(Cybersecurity & Infrastructure Security Agency) చూసుకుంటుంది. దానికి తాత్కాలిక డైరెక్టర్ ఉన్న డాక్టర్ మధు గొట్టుముక్కల(Madhu Gottumukkala) ఏఐతో కొత్త తలనొప్పి తెచ్చి పెట్టుకున్నారు. చాట్‌జీపీటీలో ఆయన సంస్థకు చెందిన కీలకమైన పత్రాలను అప్లోడ్ చేశారట. అది పబ్లిక్ వెర్షన్లో కావడంతో వివాదం రాజుకుంది. పొలిటికో నివేదిక ప్రకారం.. కిందటి ఏడాది జులై-ఆగస్టు మధ్యకాలంలో మధు గొట్టుముక్కల కాంట్రాక్టింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన పత్రాలను చాట్‌జీపీటీకి అప్లోడ్ చేశారు. అవి అంత గోప్యమైనవి కాకపోయినా.. కేవలం అధికారిక సంబంధిత పత్రాలే(For Official Use Only) కావడంతో రచ్చ మొదలైంది. ఆయన అలా అప్లోడ్ చేయగానే.. ఆటోమేటెడ్ సెక్యూరిటీ అలర్ట్ మోగింది. దీంతో డీహెచ్ఎస్ (Department of Homeland Security) అప్రమత్తమైంది. మధు గొట్టుముక్కల చేసిన పని వల్ల ఏదైనా నష్టం జరిగిందా? అనేదానిపై డీహెచ్ఎస్ సమీక్ష జరిపింది. అయితే ఆ ఇంటర్నల్ రివ్యూలో ఏం తేలిందో మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఆయనపై ఏమైనా చర్యలు ఉంటాయా? అనేదానిపైనా స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా.. డీహెచ్ఎస్ పరిధిలోని ఉద్యోగులకు చాట్‌జీపీటీ, ఇతర ఏఐ టూల్స్‌ను ఉపయోగించడానికి యాక్సెస్ ఉండదు. కానీ, మధు గొట్టుముక్కల మాత్రం ప్రత్యేక అనుమతి తీసుకున్నారట. ప్రత్యేక అనుమతులతో పరిమితంగా ఉపయోగించేందుకు వీలుందట. అయితే అందులో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయడం అభ్యంతరాలకు దారి తీసింది. ఈ క్రమంలో ఆయనపై సస్పెన్షన్ వేటు లేదంటే బదిలీ వేటులాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. లేదంటే.. ఏఐ టూల్స్ వినియోగంపై మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మధు గొట్టుముక్కల.. భారతీయ మూలాలు కలిగిన అమెరికన్ అధికారి. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంగా తెలుస్తోంది. కుటుంబం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. రష్యా, చైనా వంటి దేశాల నుండి వచ్చే అధునాతన సైబర్ ముప్పులను సీఐఎస్ఏ డైరెక్టర్ ఎదుర్కోవడం ఆయన బాధ్యత. డకోటా స్టేట్ యూనివర్సిటీలో పీహెచ్డీ, డల్లాస్‌లో ఎంబీఏ, అర్లింగ్టన్లో ఎంఎస్, విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో బీఈ చేశారు. ఆయన చేసిన పని అమెరికా సైబర్ సెక్యూరిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రభుత్వ సున్నితమైన పత్రాలను AI ప్లాట్‌ఫారమ్‌లలో ఉపయోగించడం ఎంతవరకు సురక్షితం అనే ప్రశ్న ముందుకు తెచ్చింది. -
తెలుగు ఎన్నారైలపై ‘మీనింగ్లెస్’ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ విషయం చాలాకాలంగా అందరికీ తెలుసు కానీ.. తాజాగా దావోస్‌లో ఆయన తెలుగుదేశం అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్య మాత్రం ప్రవాస భారతీయులను బిత్తరపోయేలా చేసింది. ఎందుకంటే.. 195 దేశాల్లో ఈరోజు తెలుగు వాళ్లు ఉండేందుకు తానెప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే కారణమి ఆయనగారు వాకృచ్ఛారు మరి!. నిజానిజాలతో సంబంధం లేదు.. ఎవరు ఏమనుకుంటారన్న విషయమూ పట్టదు!. చదువుకోసం లేదంటే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఆయా కుటుంబాలు తీసుకునే నిర్ణయం. వారి కష్టం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?. ఉన్నచోట లేదా దేశంలో సరైన అవకాశాలు లేకపోతేనే కదా!. విదేశాల నుంచి యువత భారత్‌కు రాకపోవడానికి కూడా అక్కడ మంచి అవకాశాలు ఉండటమే కారణం. బతుకుతెరువు కోసం చాలామంది తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. వెళుతున్నారు కూడా. అది తప్పు కాదు కానీ.. అదంతా తనవల్లే అని చంద్రబాబు వంటి వారు చెప్పడం మాత్రం దారుణం.అమెరికాలో తెలుగువాళ్లు కాస్తో, కూస్తో మెరుగ్గా ఉండవచ్చు. పైగా డాలర్ మారకపు విలువ ఎక్కువ ఉండటం కూడా ఒక ఆకర్షణ. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీసా దొరకడమే పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక కారణాలను పక్కనబెడితే ఏ దేశంలోనైనా విదేశీయులు రెండో తరగతి పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి, ఆ దేశ పౌరుడు అయ్యేందుకు ఎంత వ్యయం చేయాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో అందరికి తెలుసు.అదేమీ గొప్ప సంగతి కాదు. పైగా విదేశాలకు వెళ్లడం అన్నది చంద్రబాబు కనిపెట్టింది కాదు!!. స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్నదే.. ..1970వ దశకంలో భారత ప్రభుత్వం మేధో వలసను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అంటే మన మేధస్సు ఇతర దేశాలకు కాకుండా దేశాభివృద్ధికి దోహదపడాలన్న ఆలోచనలు చేశారు. అయినా వలసలు ఆగలేదు. ఇది నిజానికి భారత్‌కు ప్రతిష్ట కాదు. ఉదాహరణకు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆ కంపెనీ విస్తరణలో భాగంగానే మన దేశంలో కూడా పెట్టుబడులు పెడుతుండవచ్చు. అలాగే గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటివారు మరికొందరు ఉండవచ్చు. కాని అలాంటి మేధావులను మనం ఎందుకు ఇక్కడే ఉంచి వారికి అవకాశాలు కల్పించలేకపోయాం అన్నదాని గురించి ఆలోచించకుండా అదే గొప్ప విషయం అన్నట్లు చెబుతుండడం యువతను మభ్య పెట్టడమే. అమెరికా తర్వాత మన భారతీయులు, అందులోను తెలుగువారు ఇంగ్లండ్, సింగపూర్, దుబాయి వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. గల్ఫ్ దేశాలలో ప్రత్యేకించి అంతగా చదువు లేనివారు వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నది తెలిసిందే. ఒంటెలు, గొర్రెలు కాపలా కాసే ఉద్యోగాలలో ఉంటున్నారు. నిర్మాణ రంగంలో చాకిరి చేస్తున్నారు. చివరికి అక్కడి షేక్‌లు, ఇతర వ్యాపారుల వద్ద బానిసలుగా బతుకుతున్న ఘట్టాలు కోకొల్లలు.విదేశీ వ్యామోహాన్ని అడ్డు పెట్టుకుని పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అటు చీపురు ఇటు వేయడానికి నామోషీగా ఫీల్ అయ్యేవారు అమెరికా తదితర దేశాలకు వెళ్లినప్పుడే వారే బాత్రూములు శుభ్రం చేయవలసిన పరిస్థితికి బాధ పడుతుంటారు. మాల్స్‌లో, పెట్రోల్ బంకుల్లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలామంది ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సైబర్ ఫ్రాడ్ కారణంగా కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని మన దేశం వెనక్కి తీసుకు వస్తుంటుంది. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం వేరు. వ్యాపారం, లేదా మంచి ఉద్యోగం వస్తే వెళ్లవచ్చు. కాని విదేశాలపై మోజుతో వెళ్లి చాలామంది అవస్థలు పడుతున్నారు. అలాంటప్పుడు.. అమెరికా నుంచి వెనక్కి రావచ్చు కదా అని అడిగితే మన తెలుగువారు ఏమి చెబుతారో తెలుసా! ఇక్కడ రూల్స్ సరిగా ఉండవు. భారత్‌లో అవినీతి ఎక్కువ అని. వాటిని సరి చేయడానికి చంద్రబాబు వంటివారు చేసిన కృషి ఏమి ఉంది? పైగా అబద్దపు హామీలు, అక్రమాలతో ఎన్నికలలో గెలవడం వంటివి చేయడానికి వెనుకాడరు. తెలంగాణ ఉద్యమం రావడానికి నిరుద్యోగం కూడా ఒక కారణం అని ఈ రాష్ట్ర నేతలు చెబుతారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి యువత అరేబియా దేశాలకు వెళ్లి నానా అగచాట్లు పడుతున్నారని, ముంబై వంటి నగరాలకు వలస పోతున్నారని వారందరిని వెనక్కి వచ్చేలా చేస్తామని అనేవారు. పాలమూరులో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఆ వలసలను ఆపగలిగామని అంటారు. మరి ఏపీలో సైతం కోనసీమసహా పలు ప్రాంతాల యువకులు లక్షల మంది ఎక్కడైనా సరే ఉద్యోగమంటూ వస్తే చాలని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. అవన్నీ ఎందుకు హైదరాబాద్ నగరంలో స్థిపరడిన ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చాయి?. పొట్టచేత పట్టుకుని వచ్చారని, కడుపు కొడుతున్నారని ఎందుకు తెలంగాణ ఉద్యమంలో విమర్శించే వారు. తెలంగాణలోనే ఆంధ్రులు ఒకరకంగా రెండో తరగతి పౌరులుగా ఉండే పరిస్థితి ఉండిందా? లేదా?. చంద్రబాబు వాదన ప్రకారం మన రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, కూలి, నాలి చేసుకుని బతకడం కూడా ఆయన గొప్పే అనుకోవాలి. కుప్పం నుంచి రోజూ వేల మంది బెంగుళూరు వెళుతుంటారు. బీహారు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వేల మంది ఏపీ, తెలంగాణలకు వచ్చి నిర్మాణ పనులు, ఇతర చిన్న,చిన్న కూలీ పనులు చేసుకుంటున్నారు. వారంతా అలా వెళ్లడం తన ఘనతే అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించగలుగుతారా? అలాగే చంద్రబాబు చెప్పేది కూడా అర్థంలేని విషయం. పోనీ చంద్రబాబు వల్లే విదేశాలకు వెళ్లారన్నది కూడా అర్ధరహితం. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్.టి.రామారావు విదేశాలలో ఉన్న తెలుగు వారు వెనక్కి రావాలని పిలుపు ఇచ్చి వారితో పెట్టుబడులు పెట్టించడానికి ఎన్ రిచ్ అనే ఎన్.ఆర్.ఐ. సంస్థను స్థాపించారు. 1960లలోనే అనేక మంది వైద్యులు భారత్ నుంచి అమెరికా తదితర దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1992లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి టైమ్ లో అమీర్‌పేటలో ఉన్న మైత్రివనం భవనంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఉండేది. అక్కడ నుంచి మాదాపూర్ వైపు తరలించడానికి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీని తీసుకు వచ్చి శంకుస్థాపన చేయించారు. భారత్ కంప్యూటర్ యుగం ఆరంభమైంది అప్పటి నుంచి. చంద్రబాబు 2000వ సంవత్సంలో హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అప్పటికే దేశంలోని బెంగుళూరు, ముంబై, చెన్నై నగరాలు ఐటి రంగంలో ప్రసిద్ది గాంచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌తో ఇంజనీరింగ్ విద్య పేద వర్గాలకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ కారణంగానే తాము చదువుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డామని పలువురు చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2000 సంవత్సరం నాటికే లక్షలాది మంది తెలుగువారు విదేశాలలో ఉద్యోగార్థం వెళ్లారన్నది వాస్తవం. కాని అదంతా తమ క్రెడిట్ అని ఆరోజుల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. కాని చంద్రబాబు మాత్రం ప్రతిదానిని, తమ తల్లిదండ్రుల శ్రమని సైతం తన క్రెడిట్లో జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే 195 దేశాలలో తెలుగువారు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా?::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
సంక్రాంతి సంబరాలను చూడటానికి వచ్చిన జనసందోహం, మరోవైపు తమ ఆట, పాటలతో మైమరపింపజేసిన చిన్నారులతో తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ నిర్వహించిన సంక్రాంతి సంబరాలు సూపర్ హిట్టయింది. వెస్ట్ చెస్టర్ లో జనవరి 17వ తేదీన జరిగిన ఈ సంక్రాంతి సంబరాల్లో దాదాపు 1500మందికిపైగా వచ్చిన జనసందోహం నిర్వాహకులకు, కళాకారులకు ఉత్సాహాన్ని ఇచ్చింది. దానికితోడు సంక్రాంతి థీమ్ ను ప్రతిబింబించేలా చేసిన కార్యక్రమాలు, పోటీలు అందరిలోనూ పాల్గొనేలా చేశాయి.తానా మిడ్ అట్లాంటిక్ కు చెందిన బోర్డ్ డైరెక్టర్ రవిపొట్లూరి ఆధ్వర్యంలో తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగుల మార్గదర్శకత్వంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే మరోవైపు చిన్నారులు పాడిన సినిమా పాటలు ఎంతోమందిని అలరింపజేశాయి. యాంకర్లు శ్వేత కొమ్మోజి, మనీషా మేక కూడా కార్యక్రమాల విజయానికి తమవంతుగా వ్యాఖానాలను జోడించి ప్రేక్షకుల మనస్సులను దోచుకున్నారు. సాంప్రదాయ భోగిపళ్లు కార్యక్రమంలో ఎంతోమంది పిల్లలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దలు వారిపై భోగిపళ్ళు పోసి ఆశీర్వదించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ముగ్గుల పోటీలు, కిడ్స్ విలేజ్ థీమ్ కాంటెస్ట్ కు మంచి స్పందన వచ్చింది. ఎంతోమంది తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఈ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్నవారిని తానా నాయకులు అభినందించారు. ఇటీవల తానా మిడ్ అట్లాంటిక్ తన సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ఫుడ్ బ్యాంకుల కోసం 7,000 పౌండ్లకు పైగా ఆహారాన్ని విరాళంగా సేకరించడంలో ప్రతిభ కనబరిచిన యువ వలంటీర్లను ఈ సంక్రాంతి వేడుకల్లో సత్కరించడం హైలైట్ గా నిలిచింది. వెస్ట్ వైట్ ల్యాండ్ టౌన్ షిప్ బోర్డ్ ఆఫ్ సూపర్ వైజర్స్ వైస్-ఛైర్ మిస్టర్ రాజేష్ కుంభార్దరే ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి వలంటీర్లను సత్కరించారు.తానా అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి తదితరులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించిన తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ను అభినందించారు. ఈవెంట్ కోఆర్డినేటర్లు సురేష్ యలమంచిలి, కృష్ణ నందమూరితోపాటు మిడ్ అట్లాంటిక్ టీమ్ నాయకులు, వలంటీర్లు ఈ వేడుకల విజయవంతానికి కృషి చేశారు. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన క్రాస్ రోడ్స్, గోల్డెన్ స్పాన్సర్స్ గా ఉన్న శ్రీధర్ అంచూరి మరియు సురేష్ బందుగులకు, కమలం ది డెకర్ కంపనీకి, అతిథులకు, వలంటీర్లకు కమ్యూనిటీ నాయకులకు, ఈ వేడుకకు సహకరించిన అందరికీ తానా మిడ్-అట్లాంటిక్ టీమ్ ధన్యవాదాలు తెలియజేసింది.తానా మిడ్ అట్లాంటిక్ టీమ్`సరోజ పావులూరి, దీప్తి కోక, మనీషామేక, శైలజ కస్తూరి, సునీత వాగ్వాల, మైత్రి నూకల, బిందు ఆలపాటి, రమ్య మాలెంపాటి, ఇందు సందడి, రాణి తుమ్మల, భవానీ క్రొత్తపల్లి, అనుపమ యలమంచి, భవానీమామిడి, నీలిమ వోలేటి, రవీన తుమ్మల, శ్రావణి రాయలతోపాటు, విశ్వనాథ్ కోగంటి, శ్రీధర్ సాధినేని, శ్రీకాంత్ గూడురు, గోపి వాగ్వాల, ప్రసాద్ క్రొత్తపల్లి, కోటి యాగంటి, వెంకట్ ముప్పా, రమేష్ గుట్ట, శ్రీనివాస్ కోట, శ్రీనివాస్ అబ్బూరి, ప్రసాద్ కస్తూరి, రంజిత్ కోమటి, రంజిత్ మామిడి, మూర్తి నూతనపాటి, చందు భాతుస్కర్, సంతోష్ రౌతు, సత్య పొన్నగంటి, రాజు గుండాల, రాధాకృష్ణ మూల్పూరి, నాయుడమ్మ యలవర్తి, చలం పావులూరి, మోహన్ మల్ల ఈ వేడుకల విజయవంతానికి సహకరించారు. -
భార్యను, బంధువులను కాల్చి చంపాడు!
న్యూయార్క్: అమెరికాలో ఘోరం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా ఓ భారత సంతతి వ్యక్తి క్షణికావేశంలో విచక్షణ కోల్పోయాడు. భార్య, ఆమె తరఫు ముగ్గురు బంధువులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కళ్లముందే జరిగిన దారుణం చూసి బెంబేలెత్తిపోయిన అతని 12 ఏళ్ల కొడుకు, బంధువుల తాలూకు మరో ఇద్దరు పిల్లలు వెంటనే ఓ గదిలోకి దూరి గడియ పెట్టుకుని బతికిపోయారు. కొడుకు 911కు ఫోన్ చేయడంతో పోలీసులు సకాలంలో స్పందించి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే పారిపోయిన నిందితున్ని కొద్ది దూరంలోనే అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణం అందరినీ కలచివేస్తోంది. నిందితున్ని విజయ్‌కుమార్ (51)గా, మృతులను అతని భార్య మీమూ డోగ్రా (43), మిగతా వారిని గౌరవ్ కుమార్ (33), నిధీ చందర్ (37), హరీశ్ చందర్ (38)గా గుర్తించారు. ఇది మాటలకందని ఘోరమని అట్లాంటాలోని భారత కాన్సులేట్ జనరల్ పేర్కొంది. బాధిత కుటుంబానికి అన్నివిధాల సాయమూ అందిస్తున్నట్టు పేర్కొంది. గదిలో దాక్కున్న పిల్లలు విజయ్‌కుమార్ దంపతులు జార్జియా రాష్ట్రంలోని అట్లాంటాలో నివసిస్తుండేవారు. శుక్రవారం అర్ధరాత్రి ఏదో విషయమై ఇద్దరూ తీవ్రంగా గొడవ పడ్డారు. ఘర్షణ నడుమే కొడుకుతో కలిసి శివారు నగరమైన లారెన్స్విలేలోని బ్రూక్స్ ఐవీ కోర్ట్‌లో ఉంటున్న డోగ్రా తాలూకు బంధువులు గౌరవ్, నిధి, హరీశ్ ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే ఘర్షణ శ్రుతిమించి కాల్పులకు దారితీసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవకు దారితీసిన కారణమేమిటో తెలియాల్సి ఉందని చెప్పారు. ‘‘విజయ్ దంపతుల 12 ఏళ్ల కొడుకు తెల్లవారుజాము 2:30 ప్రాంతంలో మాకు కాల్ చేసి దారుణం గురించి చెప్పాడు. రాపిడ్ రెస్పాన్స్ బృందం నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకుంది. నలుగురు వ్యక్తు లు ఇంట్లో తూటా గాయాలతో పడిపోయి కన్పించారు. ముగ్గురు పిల్లలు సకాలంలో స్పందించి పక్క గదిలోకి పరుగెత్తి దాక్కోవడంతో దాడి నుంచి బయ ట పడ్డట్టున్నారు’’అని పోలీసులు వివరించారు. -
TPAD అధ్యక్షురాలిగా వరుసగా మూడోసారీ మహిళకే పట్టం
డల్లాస్, టెక్సాస్‌లో శక్తివంతమైన, ప్రభావవంతమైన తెలుగు సంస్థగా అక్కడి తెలుగు ప్రజల మన్ననలు పొందుతున్న “డల్లాస్ తెలంగాణ ప్రజా సమితి (TPAD)”.. 2026 సంవత్సరానికి గాను తన నూతన కార్యవర్గ బృందానికి బాధ్యతలు అప్పగించింది. గత 12 ఏళ్లలో టీప్యాడ్, డల్లాస్‌లోని తెలుగు సమాజంలో స్వచ్ఛంద సేవకులు, కమ్యూనిటీ సభ్యులను విస్తృతంగా ఆకర్షిస్తూ అనేక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. బలమైన సంస్థాగత నిర్మాణం ద్వారా అనేక మందిని నాయకులుగా తీర్చిదిద్దింది.సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణతో పాటు మంచి నాయకులను తీర్చిదిద్దడంలో అద్భుతమైన చరిత్ర కలిగిన టీప్యాడ్, ఫ్రిస్కో, టెక్సాస్‌లోని ఎలిగెన్స్ బాల్రూమ్లో స్థానిక కమ్యూనిటీ నాయకులు, మద్దతుదారుల సమక్షంలో తన 13 వ ఎగ్జిక్యూటివ్ టీమ్ తో ప్రమాణస్వీకారం చేయించింది. టీప్యాడ్ అధ్యక్షురాలిగా లక్ష్మి పోరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మహిళలే అధ్యక్ష పీఠాన్ని అధిరోహించడం ఇది వరుసగా మూడోసారి కావడం విశేషం. మహిళా సాధికారతకు, మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడానికి టీప్యాడ్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం.టీప్యాడ్ చరిత్ర, నేపథ్యంపై విస్తృత అవగాహన కలిగిన వీణా యలమంచిలి కార్యక్రమాన్ని సాఫీగా నిర్వహించారు. సీనియర్ టీప్యాడ్ నాయకులు మరియు ఫౌండేషన్ కమిటీ సభ్యుడు రావు కల్వాల — రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్)లతో ప్రమాణ స్వీకారం చేయించారు. టీప్యాడ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యుడు సుధాకర్ కలసాని — కార్యవర్గ సభ్యులు మరియు పదాధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు.కొత్త కమిటీ సభ్యులు లక్ష్మి పోరెడ్డి (అధ్యక్షురాలు), శ్రీనివాస్ అన్నమనేని (ఉపాధ్యక్షుడు), గాయత్రి గిరి (కార్యదర్శి), శివ కొడిత్యాల (సహ కార్యదర్శి), ఆదిత్య రెడ్డి (ఖజాంచీ), దీపిక దీపికా రెడ్డి (సహ ఖజాంచీ) .నూతన ఈసీ సభ్యులు:బాల గణపవరపు, మాధవి ఓంకార్, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, తిలక్ కుమార్ వన్నంపుల.రవికాంత్ మామిడి, అశోక్ పొద్దుటూరి, రోజా అడెపు, మాధవి సుంకిరెడ్డి, రామ్ అన్నాడి, అశోక్ కొండాల, పాండురంగ రెడ్డి పల్వాయి, బుచ్చి రెడ్డి గోలితో ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే రవికాంత్ మామిడి (BOT ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్)లకు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకార అనంతరం మాట్లాడిన FC ఛైర్ రఘువీర్ బండారు, BOT ఛైర్ రవికాంత్ మామిడి, అధ్యక్షురాలు లక్ష్మి పోరెడ్డి, కోఆర్డినేటర్ లింగా రెడ్డి ఆల్వా, BOT వైస్ ఛైర్ రోజా అడెపు-రక్తదాన శిబిరాలు, ఆహార పంపిణీ కార్యక్రమాలు, తెలంగాణ సాంస్కృతిక వేడుకల నిర్వహణ, బతుకమ్మ, దసరా సంబరాలను డీఎఫ్‌డబ్ల్యూ తెలుగు సమాజం ఆశించే స్థాయిలో ఘనంగా నిర్వహించేందుకు నూతన బృందం కట్టుబడి ఉందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా టీప్యాడ్‌కు నిరంతర మద్దతు అందిస్తున్న సపోర్టర్లు, స్పాన్సర్లకు టీప్యాడ్ నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.టీప్యాడ్ 2026 కార్యవర్గం:ఎగ్జిక్యూటివ్ కమిటీ:లక్ష్మి పోరెడ్డి (President), అనురాధ మేకల (Past President), శ్రీనివాస్ అన్నమనేని (Vice President), గాయత్రి గిరి (Secretary), శివ కొడిత్యాల (Joint Secretary), ఆదిత్య రెడ్డి (Treasurer), దీపిక దీపికా రెడ్డి (Joint Treasurer), స్వప్న తుమ్మపాల, నిఖిల్ కందుకూరి, ప్రశాంత్ నిమ్మని, మాధవి ఓంకార్, స్నేహా రెడ్డి, సంతోష్ రెగొండ, సాధన రెడ్డి, ధాత్రి బల్లమూడి, బద్రి బియ్యపు, శ్రవణ్ కుమార్ నిడిగంటి, హరిక పల్వాయి, తిలక్ కుమార్ వన్నంపుల, రత్న వుప్పల, బాల గణపవరపు.బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్:రవికాంత్ మామిడి (BOT ఛైర్), రోజా అడెపు (BOT వైస్ ఛైర్), లింగా రెడ్డి ఆల్వా (BOT కోఆర్డినేటర్), మాధవి సుంకిరెడ్డి, రమణ లష్కర్, పాండురంగ రెడ్డి పల్వాయి, రామ్ అన్నాడి, బుచ్చి రెడ్డి గోలి, అశోక్ కొండాల, పవన్ గంగాధర, సుధాకర్ కలసాని, అశోక్ పొద్దుటూరి.ఫౌండేషన్ కమిటీ:రఘువీర్ బండారు (FC ఛైర్), అజయ్ రెడ్డి (FC వైస్ ఛైర్), జనకిరామ్ మండాది, ఉపేందర్ తెలుగు, రాజ్ గోంధి, మహేందర్ కమిరెడ్డి -
అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి బిగ్ అలర్ట్!
ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక చేసిన మొదటి పని.. వలసవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం. ఇందుకోసం డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) తరపున ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE) అన్లిమిటెడ్ పవర్ కట్టబెట్టారు. అమెరికా భద్రత పేరిట లైంగిక దాడులు, గృహ హింస, మాదక ద్రవ్యాల కేసులు, మానవ అక్రమ రవాణా వంటి తీవ్ర నేరాలకు పాల్పడినవారిని ఐస్ లోకల్ పోలీసులతో గుర్తించి అరెస్టులు చేసి చర్యలు తీసుకునేది. అయితే ఇప్పుడు ఆ దృష్టి పార్ట్‌టైం జాబులు చేసే భారతీయ విద్యార్థులు.. ప్రొఫెషనల్ జాబులు చేసేవాళ్లపైకి మళ్లడం ఇండియన్ కమ్యూనిటీలో ఆందోళన రేకెత్తిస్తోంది..తాజాగా.. మిన్నెసోటాలోని సెయింట్ లూయిస్ పార్క్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఇద్దరు భారతీయ విద్యార్థులను ఐస్ (Immigration and Customs Enforcement) అధికారులు అరెస్టు చేశారు. అలాగే.. ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పని చేసే ఉద్యోగిని ఏకంగా కంపెనీలోకి వెళ్లి మరీ బేడీలు వేసి లాళ్లినట్లు ఓ ప్రచారం నడుస్తోంది. ఈ రెండు కేసుల్లో తమ వద్ద అధికారిక ప్రతాలు చూపించినా.. తమకేం తెలియదని వాళ్లు ఎంత మొత్తుకున్నా అక్కడి అధికారులు వినలేదు. అధ్వాన్నమైన పరిస్థితులు ఉండే డిటెన్షన్ సెంటర్లో గంటల తరబడి కూర్చోబెట్టి.. చివరాఖరికి పంపించేశారు.అమెరికాకు ఉన్నత విద్య కోసం భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన లక్షల మంది విద్యార్థులు వెళ్తుంటారు. ముఖ్యంగా F1 స్టూడెంట్ వీసాపై ఉన్నవారు ఖర్చులు తీర్చుకోవడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే, అమెరికా వీసా నిబంధనల ప్రకారం క్యాంపస్ వెలుపల నిర్దిష్ట గంటలకు మించి పనిచేయడం చట్టవిరుద్ధం. అలా అక్రమంగా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేస్తే అరెస్టులు తప్పవని ఐస్ గత కొంతకాలంగా హెచ్చరిస్తూ వస్తోంది. అయితే..ట్రంప్ పదవిలోకి వచ్చాక ఐస్ తన తనిఖీలను మరింత ఉధృతం చేసింది. గత ఏడాది వేలాది మందిని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసింది. అందులో అక్రమంగా చొరబడిన భారతీయులు కూడా ఉన్నారు. అమెరికాలో రాజకీయ నాయకుల వ్యాఖ్యలు.. సోషల్ మీడియా వేదికలలోని చర్చలు భారతీయులపై పెరిగిపోతున్న వ్యతిరేకతకు సంకేతాలను ఇస్తున్నాయి. అందుకే ప్రత్యేకించి భారతీయులే మీద ఐసీఈ ఫోకస్ పెట్టిందన్న చర్చ జోరందుకుంది. ఈ పరిస్థితుల్లో భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. కాబట్టి.. చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు చేయవద్దని విద్యార్థులను నిపుణులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త.. తెలుగోడా!పైన చెప్పిన రెండు అరెస్టులలో.. బాధితులు తెలుగువాళ్లే కావడం గమనార్హం!. వాళ్లను ఎందుకు నిర్బంధించారో కూడా అధికారులు వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. అంటే.. ఏ రకంగా వాళ్ల దృష్టిలో పడ్డ తాట తీస్తారనే సంకేతాలు పంపించినట్లయ్యిందన్నమాట. ఈ పరిస్థితుల్లో న్యూమన్ గ్రూప్ లాయర్లు ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది..మా నాయకుడు గొప్పని.. మా కులం గొప్పని కొందరు దేశంకాని దేశంలో ఉంటూ వ్యాఖ్యలు చేస్తుండడం, సోషల్ మీడియాలో పోస్టులు తరచూ చూస్తుండేదే. అలా అమెరికాలో ఉండి ఇక్కడి సినిమాలు, రాజకీయాల కోసం అడ్డగోలుగా మాట్లాడడం, సో.మీ.లో పోస్టులు చేయడం ఏమాత్రం మంచిది కాదని న్యూమన్ గ్రూప్ లాయర్లు సూచిస్తున్నారు. అలాగే కులం పేరిట అతి ప్రదర్శనలు కూడా చేయొద్దంటున్నారు. ఇవి చట్ట విరుద్ధమైన చర్యలు కావు కదా అని ఫీల్ అయిన కూడా.. అక్కడి అధికారుల దృష్టిలో పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఈ హెచ్చరికను బేఖాతరు చేస్తే అరెస్టు, డిపోర్టేషన్ ప్రమాదం తప్పదని కుండబద్ధలు కొడుతున్నారు.మనిషి చచ్చాక యమ భటులు వచ్చి లాక్కెళ్తారు కదా.. ఒకవేళ భారతీయులు గనుక అదుపులో ఉండకపోతే ఐస్(ICE) అధికారులు అంతకు మించి ట్రీట్మెంట్తో లాక్కెళ్లే ప్రమాదం ఉందనేది సోషల్ మీడియాలో ఓ యూజర్ చేసిన పోస్ట్ సారాంశం.. అమెరికాలో అటు రాజకీయ నాయకుల్లో, ఇటు సోషల్ మీడియాలో భారతీయుల మీద పెరుగుతున్న వ్యతిరేకత..ఇలాంటి సమయాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అంటున్న అమెరికా లాయర్ న్యూమన్ గ్రూప్..అమెరికాలో సినిమాల కోసం, రాజకీయాల కోసం అతి చేయొద్దు అని ముఖ్యమైన సలహా ఇస్తున్న లాయర్లు..సినిమా ఇంకా… pic.twitter.com/uIZKc9TGKD— UttarandhraNow (@UttarandhraNow) January 21, 2026 -
ఎన్నారై సుప్రియ కేసులో బిగ్ ట్విస్ట్
ఆస్ట్రేలియా అడిలైడ్‌లో జరిగిన ఎన్నారై మహిళ సుప్రియ హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆమె భర్త విక్రాంత్ ఠాకూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. ఉద్దేశపూర్వకంగా తన భార్యను చంపలేదని.. తన కొడుకు కోసమైనా తనను క్షమించి వదిలేయాలని కోర్టును బతిమిలాడుకుంటున్నాడు.భారత మూలాలు ఉన్న విక్రాంత్ ఠాకూర్(42), భార్య కొడుకుతో అడిలైడ్‌లో స్థిరపడ్డాడు. గతేడాది డిసెంబర్ 21వ తేదీన తన నివాసంలో సుప్రియ(36) అపస్మారక స్థితిలో కనిపించింది. ఎమర్జెన్సీ టీం ప్రయత్నాలు చేసినా ఆమెను కాపాడలేకపోయింది. ఈ ఘటనలో అనుమానాల కింద భర్తను అప్పటికప్పుడు అదుపులోకి తీసుకన్నారు స్థానిక పోలీసులు. ఆపై హత్య కేసు నమోదు చేసి స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే.. అదే ఏడాది(డిసెంబర్ 23) జరిగిన కోర్టు విచారణలో విక్రాంత్ నోరు విప్పలేదు. బెయిల్ కోసం కూడా అప్లై చేసుకోలేదు. దీంతో భార్యను అతనే చంపి ఉంటాడని అంతా భావించారు. ఆ సమయంలో డీఎన్ఏ రిపోర్ట్స్, పోస్ట్‌మార్టం నివేదిక వంటి ఆధారాలు సిద్ధం కావడానికి సమయం కావాలని ప్రాసిక్యూటర్లు కోరారు. దీంతో విచారణ వాయిదా పడింది. తాజాగా జనవరి 14న మరోసారి విచారణ జరగ్గా.. తన భార్యను తాను కావాలని హత్య చేయలేదంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన మరణం(manslaughter). నేనేమీ కావాలని ఆమెను చంపలేదు అంటూ వాదించాడు. తన బిడ్డ కోసం తనను వదిలేయాలంటూ వేడుకున్నాడు. ఈ కేసులో తదుపరి విచారణను ఏప్రిల్‌కు వాయిదా వేసింది కోర్టు. విక్రాంత్-సుప్రియ కొడుకు సంరక్షణను అక్కడి ఇండియన్ కమ్యూనిటీ చూసుకుంటోంది. ఫండ్ రైజింగ్ ద్వారా విరాళాలు సేకరిస్తోంది. "సుప్రియా తన కొడుకు భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసింది. నర్సుగా మారి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యం ఆమెకు ఉండేది. ఆమె ఆకస్మిక మరణం కుమారుడి జీవితాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది" అని ఆ పేజీలో పేర్కొన్నారు. -
ఇంటర్నెట్ లేదు.. ఇరాన్లో ఇదీ పరిస్థితి
ఇరాన్లో అల్లకల్లోల పరిస్థితుల వేళ.. భారతీయుల తరలింపును భారత ప్రభుత్వం చేపట్టింది. ఆ ఆపరేషన్‌లో భాగంగా పలువురితో బయల్దేరిన రెండు విమానాలు గత అర్ధరాత్రి సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటూ విదేశీ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీళ్ల ద్వారా అక్కడి పరిస్థితులను లోకల్ మీడియా సంస్థలు అడిగి తెలుసుకుంటున్నాయి.ఢిల్లీకి చేరుకున్నవాళ్లలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. తాము సురక్షితంగా రావడానికి కేంద్రం అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అక్కడి భారతీయులతో సంప్రదింపులు జరుపుతోందని.. పలు సూచనలు జారీ చేస్తోందని వివరించారు. ఎంబీబీఎస్ చదువుతున్న ఓ విద్యార్థి మాట్లాడుతూ.. ‘‘నిరసనల గురించి విన్నాను. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఇంటర్నెట్ లేకపోవడం పెద్ద సమస్యగా అనిపించింది’’ అని తెలిపింది. మరో యువకుడు మాట్లాడుతూ.. ‘‘వీధుల్లోకి వెళ్తే నిరసనకారులు కార్లను అడ్డుకునేవారు. ఇంటర్నెట్ లేకపోవడంతో కుటుంబాలకు కూడా సమాచారం ఇవ్వలేకపోయాం. చాలా భయమేసింది’’ అని అన్నాడు. ఇక.. ఇరాన్లో ఉద్యోగం కోసం వెళ్లిన ఒక ఇంజనీర్ ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడిందని చెప్పాడు. ‘‘ఇరాన్లో పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కానీ, పరిస్థితి మరీ ఘోరంగా ఏం లేదు. నెట్వర్క్ సమస్య తప్ప పెద్ద ఇబ్బందులేం లేవు’’ అని అన్నాడు. మరో యువతి మాట్లాడుతూ.. టెహహ్రాన్ నిరసనలు ప్రమాదకరంగానే సాగాయని, ఘర్షణల్లో పలు భవాలకు నిప్పు పెట్టారని.. ఆ పరిస్థితుల్లో భయంగా గడిపామని తెలిపింది. అదే సమయంలో.. ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినవారు ఎక్కువగానే కనిపించారు అని వివరించింది. డిసెంబర్ చివరిలో అయతొల్లా ఖమేనీ పాలనకు వ్యతిరేకంగా ఇరాన్లో మొదలైన భారీ నిరసనలు.. భద్రతా బలగాల ప్రతిఘటనలతో 3,000 మందిని బలిగొన్నాయి. ఇందులో సిబ్బంది కూడా పెద్ద సంఖ్యలోనే మరణించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో వేల మందిని అరెస్ట్ చేయించింది ఖమేనీ ప్రభుత్వం. ఒకానొక తరుణంలో.. నిరసనకారులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకోవడం, ఇరాన్ ఖండన, మాటల యుద్ధం.. సైనిక ఘర్షణకు దారి తీయొచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఆ సమయంలో భారత ప్రభుత్వం తన పౌరులకు ఇరాన్ ప్రయాణాలు మానుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. సరిగ్గా అదే సమయంలో.. జనవరి 15న ఇరాన్ గగనతలం తాత్కాలికంగా మూసివేయడంతో కొన్ని భారతీయ విమానాలు ప్రభావితమయ్యాయి. అయితే గల్ఫ్ దేశాల మధ్యవర్తిత్వంతో ప్రస్తుతం పరిస్థితి కొంత చల్లారింది. అయినప్పటికీ భారతీయులు స్వదేశానికే వచ్చేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇరాన్లో సుమారు 10 వేలమంది భారతీయులు(విద్యార్థులు, ఉద్యోగులు, భారత మూలాలు ఉన్నవాళ్లు) ఉన్నట్లు విదేశాంగ గణాంకాలు చెబుతున్నాయి. భారతీయుల్ని తీసుకొచ్చిన రెండు విమానాలు కమర్షియల్ ప్లైట్సే. అయితే ఇవి రెగ్యులర్ విమానాలేనని.. ఎలాంటి ప్రత్యేక తరలింపు కాదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ ఈ తరలింపును నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. -
కెంట్ అయ్యప్ప ఆలయంలో వైభవంగా ‘మకరవిళక్కు మహోత్సవం’
కెంట్: ఇంగ్లండ్‌లోని కెంట్ అయ్యప్ప ఆలయంలో నిన్న (జనవరి 14, బుధవారం) మకరవిళక్కు మహోత్సవం వైభవంగా జరిగింది. పూజా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంగ్లండ్ నుంచి వచ్చిన అయ్యప్ప భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం 7 గంటలకు ఆలయం తెరవడంతో ఉత్సవం ప్రారంభమైంది. ఆ తర్వాత ఉదయం 7:10 గంటలకు నిర్మాల్య దర్శనం. ఉదయం 7:30 గంటలకు ఉష పూజ, ఉదయం 8 గంటలకు గణపతి హోమం, ఉదయం 9 గంటలకు ఉచ్చ పూజ నిర్వహించారు.సాయంత్రం 5.30 గంటల నుంచి విశేష అభిషేకం, పూజ, దీపారాధన, సహస్రనామార్చనలు నిర్వహించారు. రాత్రి ఉత్సవాల్లో రాత్రి 9 గంటలకు అథజా పూజ, 9.30 గంటలకు పడిపూజ, 9.45 గంటలకు హరివరాసనం నిర్వహించారు. అభిజిత్, తాజూరు మన హరినారాయణన్ నంబితీశ్వరర్ పూజలు నిర్వహించారు. వెల్లిఒత్తిల్లం అద్రిత్ వాసుదేవ్ కూడా పూజలు నిర్వహించారు. విశ్వజిత్ త్రిక్కాకర సోపాన సంగీతం, తత్త్వమసి బృందం, భజనలు, రమ్య అరుణ్ కృష్ణన్ భరతనాట్యం ప్రదర్శించారు. -
ఇరాన్ ఆందోళనల్లో భారతీయుల అరెస్ట్?!
ఇరాన్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఆందోళనకారులను అణచివేస్తే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే సైనిక చర్యకు దిగుతామని ట్రంప్.. తమ దేశ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే అంతు చూస్తామంటూ ఖమేనీ సవాల్-ప్రతిసవాల్ విసురుకుంటున్నారు. అయితే ఆందోళనలతో ఇరాన్ నెత్తురోడుతున్న వేళ.. ఆ దేశంలోని ఇతర దేశాల పౌరుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇరాన్ సంక్షోభంలో(Iran Crisis) మరణాలను అక్కడి ప్రభుత్వం తక్కువగా చూపెడుతోందంటూ మానవ హక్కుల సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇప్పటిదాకా 548 మరణించారని.. అందులో 48 భద్రతా సిబ్బంది ఉన్నారని తెలుస్తోంది(హెచ్ఆర్ఏఎన్ఏ అనే అమెరికా మానవ హక్కుల సంఘం లెక్కల ప్రకారం). అలాగే 10 వేల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారని సమాచారం. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో ఇతర దేశా పౌరులు ఉన్నట్లు పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. నిరసనల్లో పాల్గొనకపోయినా.. కొందరి చేతులకు బేడీలు వేసి తీసుకెళ్తన్నట్లుగా దృశ్యాలు అందులో ఉన్నాయి. అందులో భారతీయులు, అఫ్గనిస్థాన్ జాతీయులు ఎక్కువగా ఉన్నట్లు ఆ ప్రచార సారాంశం. పైగా విదేశీ వ్యవహారాల శాఖ సంబంధిత పేర్లతో ఉన్న అకౌంట్లలో ఆ వీడియోలు పోస్టు కావడం గమనార్హం. దీంతో.. ఆ దేశంలో పనుల నిమిత్తం వెళ్లిన భారత పౌరులు.. విద్యార్థుల భద్రతపై ఢిల్లీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే.. భారత్‌లో ఇరాన్ రాయబారి మహ్మద్ ఫతాలి(Mohammad Fathali) ఆ కథనాలను ఖండించారు. అలాంటిదేమీ.. ఇరాన్‌లోని భారతీయులతో సహా ఇతర దేశాల పౌరుల భద్రతకు వచ్చిన ముప్పేమీ లేదని స్పష్టత ఇచ్చారు. సోషల్ మీడియాలో జరిగిన ఫేక్ ప్రచారం ఆధారంగానే ఆ కథనాలు పుట్టుకొచ్చాయని అంటున్నారు. పుకార్లను నమ్మొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఆయన క్లారిటీగా ఓ పోస్ట్ చేశారు. అయితే.. అటు ఇరాన్ ఈ తరహా కథనాలు మొదటి నుంచే ఖండిస్తోంది. ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్న కుట్ర అని ఆరోపించింది. ఇరాన్ నిరసనలను కొందరు విదేశీ నటులు.. మీడియా వక్రీకరిస్తున్నాయని.. తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తోంది. మన పిల్లలు సేఫ్!భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. ఇరాన్లో 10,000 నుంచి 12,000 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో పనుల నిమిత్తం వెళ్లేవాళ్లు, భారతీయ మూలాలు ఉన్నవాళ్లు కూడా ఉన్నారు. అయితే అక్కడికి భారత్ నుంచి అత్యధికంగా వెళ్లేది వైద్య విద్య అభ్యసించేందుకు వెళ్లే విద్యార్థులే. ఈ నేపథ్యంలో.. వాళ్ల భద్రతపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే.. వాళ్లు సురక్షితంగా ఉన్నారని ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA), ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్స్ (FAIMA) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో భారత రాయబార కార్యాలయం, సీనియర్ అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారని.. విద్యార్థులతో, అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని పేర్కొంది. -
అలస్కాలో ‘గుంటూరు విద్యార్థి’ అదృశ్యం
అలాస్కా: అమెరికాలోని అలాస్కాకు ఒంటరిగా బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి అదృశ్యం కావడం మిస్టరీగా మారింది. ప్రకృతి అందాలను తిలకించడానికి వెళ్లి.. మంచు కొండల మధ్య ఆచూకీ లేకుండా పోయాడు. గుంటూరు జిల్లా అద్దంకికి చెందిన హరి కరసాని హ్యూస్టన్‌లో నివాసం ఉంటున్నారు. క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హరి డిసెంబర్ 22, 2025న ఒంటరిగా అలాస్కా పర్యటనకు వెళ్లారు.అక్కడ హీలీ పట్టణంలోని ఔరోరా డెనాలి లాడ్జ్‌లో బస చేశారు జనవరి 4 నాటికి తిరిగి వస్తానని తన రూమ్‌మేట్స్‌కు కూడా సమాచారం ఇచ్చారు. అయితే, డిసెంబర్ 30న చివరిసారిగా కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన హరి.. ఆ మరుసటి రోజు డిసెంబర్ 31 హోటల్ నుంచి చెక్-ఔట్ కాగా.. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది.డిసెంబర్ 31న ఆయన హోటల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక క్యాబ్ సర్వీస్ వాడినట్లు సమాచారం. హరికి డ్రైవింగ్ రాకపోవడంతో ఆయన క్యాబ్‌లు, స్థానిక రవాణాపైనే ఆధారపడ్డారు. హోటల్ నుంచి బయలుదేరిన హరి ఆ క్యాబ్‌లో ఎక్కడికి వెళ్లారు? ఆ డ్రైవర్ ఎవరు? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిసెంబర్ 31 తర్వాత డెనాలి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల ఫారన్‌హీట్ వరకు పడిపోయాయని, హరి గురించి ఎలాంటి సమాచారం లభించలేదని అతని స్నేహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అమెరికాలో తెలుగు దంపతుల దుర్మరణం
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు రాష్ట్రానికి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. ఈరోజు(సోమవారం) వాషింగ్టన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణ కిషోర్, ఆశలు మృతిచెందారు. అమెరికాలో కృష్ణకిషోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తన్నాడు. ఓ కార్యక్రమం మీద బయటకు వెళ్లి తిరిగి కారలో వస్తుండగా వీరు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతించెందారు. ఈ ప్రమాదంలో వారి కుమారుడు, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిది భారత్‌లోని తెలుగు రాష్ట్రం ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుగా గుర్తించారు. పది రోజుల క్రితమే కిషోర్ పాలకొల్లుకు వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తన్నారు. పాలకొల్లు వచ్చిన సమయంలో తమ కలిసి వెళ్లాడని పలువురు స్నేహితులు గుర్తు చేసుకుంటున్నారు. -
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్య!
అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. న్యూ ఇయర్ వేడుకల రోజున అదృశ్యమైన నికితా గోడిశాల అనే యువతి తన మాజీ ప్రియుడు ఫ్లాట్‌లో శవమై కనిపించింది. మేరీల్యాండ్లోన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఫ్లాట్‌లో ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దాంతో అర్జున్ శర్మనే ఆమెన హత్య చేసినట్లు పోలీసుల భావిస్తున్నారు. ప్రస్తుతం అర్జున్ శర్మ పరారీలో ఉన్నాడు. అతని కోసం యూఎస్ పోలీసులు గాలిస్తున్నారు.ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన నిఖిత.. ప్రస్తుతం ఆమె హోవర్డ్ కౌంటీలో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా మరియు స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేస్తుంది.మాజీ ప్రియుడిపై ఫస్ట్- సెకండ్ డిగ్రీ హత్య అభియోగాలు మోపుతూ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. జనవరి 2వ తేదీన ఆమె అవృశ్యమైన ఫిర్యాదు తమకు వచ్చిందని, ఈ మేరకు విచారణ చేపడితే ఆమె హత్య గావించబడ్డ విషయం తాజాగా వెలుగుచూసిందన్నారు. మేరీల్యాండ్ సిటీలోని అర్జున్‌శర్మ ఫ్లాట్‌లో ఆమె డిసెంబర్ 31వ తేదీన చివరిసారి కనిపించినట్లు పోలీసులకు అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. అదే అపార్ట్మెంట్లో సెర్చ్ వారెంట్ అమలు చేసి దర్యాప్తు ప్రారంభించగా, కత్తిపోట్లతో పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. ఆమెది తెలంగాణ రాష్ట్రంగా అనుమానిస్తున్నారు. ఆమె స్వస్థలంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే అర్జున్ శర్మది కూడా ఇండియానే. హత్య చేసిన తర్వాత అర్జున్ శర్మ భారత్‌కు వచ్చేశాడు.హత్యోదంతం తర్వాత భారత్‌కు వచ్చేసిన అర్జున్ శర్మను తమిళనాడులో అరెస్టు చేశారు. అర్జున్ శర్మది తమిళనాడు రాష్ట్రంగా తెలుస్తోంది. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఆత్మీయ సమ్మేళనం
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం శుక్రవారం సాయంత్రం సింగపూరులోని నేషనల్ పబ్లిక్ స్కూలు ఆవరణలో దాదాపు 400 మంది ఆహూతులు సమక్షంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ అధ్యక్షత వహిస్తూ మాట్లాడుతూ, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ ప్రారంభమే వెంకయ్య నాయుడు ఆశీస్సుల సందేశంతో జరిగిందని, అప్పటి నుంచి ప్రతి దశలోనూ వారి మార్గదర్శకత్వం, సూచనలు, ప్రోత్సాహం తమకు నిరంతరం లభిస్తూనే ఉన్నాయని తెలిపారు. అలాగే అతి తక్కువ సమయంలో సమాచారం అందించినప్పటికీ, సమయాన్ని సర్దుబాటు చేసుకుని కార్యక్రమానికి హాజరైన సింగపూరు భారతీయ హైకమిషనర్ డా. శిల్పక్ అంబులే గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్య అతిథి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కుటుంబంలో, సమాజంలో, దేశంలో ఐక్యత ఉన్నప్పుడే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. దేశంలో ఉన్న ప్రతిఒక్కరూ, నేతలందరూ ఐక్యంగా ఉండాలి. ఎన్నికల వరకే ప్రత్యర్థులు. ఆ తర్వాత అందరం భారతీయులం. ఐక్యంగా ఉంటే శాంతి ఉంటుంది. ‘‘భాష పోతే శ్వాస పోతుంది" అంటూ మాతృభాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను శ్రీ వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. తెలుగులోని గొప్ప సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి అనువదించి ప్రపంచానికి అందించాలని విదేశాల్లోని తెలుగువారికి పిలుపునిచ్చారు.శ్రీ సాంస్కృతిక కళాసారథి గాయని–గాయకులు ఆలపించిన “మా తెలుగు తల్లికి” గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది. సింగపూరులోని ప్రముఖ తెలుగు సంస్థలైన తెలంగాణ కల్చరల్ సొసైటీ, తెలుగుదేశం ఫోరమ్, కాకతీయ సంస్కృతిక పరివారం, APNRT ప్రతినిధులు హాజరై శ్రీ వెంకయ్య నాయుడు గారిని ఘనంగా సన్మానించారు.తదుపరి కార్యక్రమానికి హాల్‌ను సమకూర్చిన కొత్తమాస్ వెంకటేశ్వర రావు (KV Rao, SIFAS) , నేషనల్ పబ్లిక్ స్కూల్ సిబ్బందిని అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి స్పాన్సర్షిప్ అందించిన హనుమంత రావు మాదల, నాగులపల్లి శ్రీనివాసు, శివప్రసాద్ టీమ్, సరిగమ గ్రాండ్, సూపర్ డీలక్స్, కూల్ టైం, వీర ఫ్లేవర్స్, దివ్యజ్యోతి ప్రొడక్షన్స్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. గాయని–గాయకులు సౌభాగ్యలక్ష్మి తంగిరాల, చంద్రహాస్ ఆనంద్, శేషుకుమారి యడవల్లి, ఉషాగాయత్రి నిష్టల, అలాగే శరజ అన్నదానం, సౌమ్య ఆలూరు, కృష్ణ కాంతి లను శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా శాలువాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాంబాబు పాతూరి, శ్రీధర్ భరద్వాజ, రామాంజనేయులు చామిరాజు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి సుబ్బు వి. పాలకుర్తి వ్యాఖ్యానం అందించగా, వంశీ కృష్ణ శిష్ట్లా, కుమారస్వామి గుళ్లపల్లి సాంకేతిక సహకారం అందించారు. అలాగే మాధవి పాలకుర్తి, మమత మాదాబత్తుల సత్య జాస్తి, రేణుక చామిరాజు, ప్రసన్న భరద్వాజ్, శ్రీలలిత తదితరులు వాలంటీర్ సేవలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమానంతరం విచ్చేసిన ఆహుతులందరికీ సరిగమ గ్రాండ్ వారు ఏర్పాటు చేసిన విందు భోజనంతో కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో ముగిసింది. -
ఇరాన్‌ను ఈసీఆర్ కేటగిరీలో చేర్చిన భారత ప్రభుత్వం
భారత ప్రభుత్వం ఇటీవల ఇరాన్ దేశాన్ని ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వయిర్డ్ – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు అనుమతి అవసరమైన) దేశాల జాబితాలో చేర్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ & ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ విభాగం గత ఏడాది ఆగస్టున సర్కులర్‌ను జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18గా ఉన్న ఈసీఆర్ దేశాల సంఖ్య 19కి పెరిగింది.ఈ నిర్ణయం ప్రకారం, ఈసీఆర్ పాస్‌పోర్టు కలిగిన భారతీయ కార్మికులు ఉద్యోగం కోసం ఇరాన్‌కు వెళ్లాలంటే ఇక నుంచి తప్పనిసరిగా భారత ప్రభుత్వ ఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ-మైగ్రేట్ పోర్టల్‌లో నమోదైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (బీఓఐ) ద్వారా ఎయిర్‌పోర్టులలోని ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల (ఐసీపి) వద్ద ధృవీకరణ జరుగుతుంది.ఇవే 19 ఈసీఆర్ దేశాలుఎమిగ్రేషన్ యాక్ట్–1983 ప్రకారం భారత ప్రభుత్వం నోటిఫై చేసిన ఈసీఆర్ దేశాలు ఇవి: ఈ దేశాలను స్పెసిఫైడ్ / నోటిఫైడ్ ఈసీఆర్ కంట్రీస్ గా కూడా పిలుస్తారు.గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాలు (6): బహరేన్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఓమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ).ఇతర దేశాలు (13): ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, జోర్డాన్, లెబనాన్, లిబియా, మలేసియా, సుడాన్, సౌత్ సుడాన్, సిరియా, యెమెన్, ఇండోనేసియా, థాయిలాండ్, ఇరాన్.ఈసీఆర్ పాస్‌పోర్ట్ అంటే ఏమిటి?ఈసీఆర్ (ఎమిగ్రేషన్ చెక్ రిక్వాయిర్డ్) పాస్‌పోర్ట్ అంటే – ఈ 19 దేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే ముందు, భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని అర్థం.సాధారణంగా 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత ఉన్నవారికి ఈసీఆర్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. తక్కువ చదువు, తక్కువ లోకజ్ఞానం కలిగిన బలహీన వర్గాల కార్మికులను విదేశాల్లో దోపిడీ నుంచి రక్షించడమే ఈ విధాన ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా విదేశాల్లో శారీరక శ్రమ చేసే 'బ్లూ కాలర్ వర్కర్స్' సంక్షేమం కోసం ఈసీఆర్ వ్యవస్థను అమలు చేస్తున్నారు.ఎమిగ్రేషన్ క్లియరెన్స్ ఎలా?ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారు ఈ దేశాలకు ఉద్యోగానికి వెళ్లే ముందు, లైసెన్స్ పొందిన రిక్రూటింగ్ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్ లోని 'ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్' (పిఓఈ) కార్యాలయంలోఎమిగ్రేషన్ క్లియరెన్స్ తీసుకోవాలి.వలస కార్మికుని పాస్‌పోర్ట్, ఉద్యోగ సంస్థ, జీతం ఒప్పందం, రిక్రూటింగ్ ఏజెన్సీ వివరాలు అన్నీ ఈ-మైగ్రేట్ సిస్టమ్‌లో నమోదు అవుతాయి.అలాగే, ఈసీఆర్ పాస్‌పోర్ట్ కలిగిన వారికి ప్రవాసి భారతీయ బీమా యోజన (పిబిబివై) కింద రూ.10 లక్షల ప్రమాద బీమా తప్పనిసరిగా వర్తిస్తుంది.రెండేళ్ల బీమాకు కేవలం రూ.325 ప్రీమియం చెల్లించాలి. ఆ తర్వాత ఆన్లైన్లో పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈసీఎన్ఆర్ పాస్‌పోర్ట్ అంటే?ఈసీఎన్ఆర్ (ఎమిగ్రేషన్ చెక్ నాట్ రిక్వయిర్డ్) అంటే – విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు భారత ప్రభుత్వ అనుమతి అవసరం లేదు అన్నమాట.ఈసీఎన్ఆర్ కేటగిరీకి వీరు అర్హులు:* 10వ తరగతి ఉత్తీర్ణులు* విదేశాల్లో కనీసం 3 ఏళ్ల అనుభవం ఉన్నవారు* ఆదాయపు పన్ను చెల్లింపుదారులు* 50 సంవత్సరాల పైబడిన వారువీరు లోకజ్ఞానం కలిగినవారు, అవసరమైతే తమను తాము రక్షించుకునే సామర్థ్యం ఉన్నవారిగా ప్రభుత్వం భావిస్తుంది. వీరు కూడా ఐచ్చికంగా ప్రవాసి భారతీయ బీమా యోజన పొందవచ్చు.విజిట్ / టూరిస్ట్ వీసాలకు వర్తించదుఏ పాస్‌పోర్ట్ కలిగిన వారైనా – విజిట్ వీసా, టూరిస్ట్ వీసా, వైద్య అవసరాలు లేదా విహారయాత్రల కోసం ఈ 19 దేశాలకు వెళ్లేవారికి ఎమిగ్రేషన్ క్లియరెన్స్ అవసరం లేదు.రాను–పోను విమాన టిక్కెట్, చెల్లుబాటు అయ్యే వీసా ఉంటే సరిపోతుంది.–మంద భీంరెడ్డి, గల్ఫ్ వలస వ్యవహారాల విశ్లేషకులు 91 98494 22622 -
జర్మనీలో తెలుగు విద్యార్థి మృతి
విదేశాల్లో మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. జర్మనీలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు చనిపోయినట్లు అక్కడి అధికారులు ధృవీకరించారు. మరణించిన విద్యార్థి పేరు తోకల హృతిక్ రెడ్డి.హృతిక్ స్వస్థలం తెలంగాణ జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం. ఉన్నత విద్య కోసం అతను జర్మనీకి వెళ్లాడు. అయితే.. బుధవారం అతను నివాసం ఉంటున్న భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో భవనం నుంచి దూకి గాయాలతో మరణించాడని తెలుస్తోంది.తీవ్రంగా గాయపడిన అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న హృతిక్ కుటుంబం బోరున విలపిస్తోంది. తమ బిడ్డ మృతదేహాన్ని రప్పించాలని ప్రభుత్వాల్ని వేడుకుంటోంది. ఈ ఘటనతో మల్కాపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
త్వరలోనే పెళ్లి, గుండెపోటుతో ఎన్ఆర్ఐ మృతి
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ఎన్నారైల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. అమెరికాలో నివసిస్తున్న తెలంగాణకు చెందిన యశ్వంత్ కుమార్ గోషిక (33) శనివారం డల్లాస్‌లో గుండెపోటుతో మరణించారు. యశ్వంత్ ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. స్నేహితులను, తెలుగు ఎన్నారై సమాజాన్ని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.యశ్వంత్ కుమార్ తెలంగాణలోని చౌటప్పల్ గ్రామంలోని దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు. అమెరికాలోనే మాస్టర్స్ పూర్తి చేశాడు. ఆ తరువాత టాప్ MNCలో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటున్నారు. స్లీప్ అప్నియాకు సంబంధించిన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడని, ఆకస్మిక గుండెపోటు కారణంగా నిద్రలోనే మరణించాడని సన్నిహితులు వెల్లడించారు. తోటి తెలుగువారితో సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకొని కంటతడి పెట్టుకున్నారు. మరోవైపు యశ్వంత్ మృతదేహాన్నిఅంతిమ సంస్కారాల కోసం భారతదేశానికి తిరిగి పంపడానికి NRI సంఘం ప్రయత్నాలు చేస్తోంది.విషాదం ఏమిటంటేయశ్వంత్కు ఇటీవలే పెళ్లి నిశ్చయమైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21న వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబాలు పెళ్లి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. పెళ్లికోసం స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేసుకున్న తరుణంలో, పెళ్లికొడుకుగా చూడాలనుకున్న యశ్వంత్ అకాలమరణం వారిని తీరని విషాదంలోకి నెట్టేసింది. -
భారతీయులు సహ వలసదారుల్లో సరికొత్త భయం!
H-1B వీసాలపై అమెరికాకు వెళ్లిన భారతీయులు గుబులు.. గుబులుగా కనిపిస్తారు. ఇప్పటికే కఠినమైన నియమాలు అమలు చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. ఇంకా ఏం మెలికలు పెడుతుందా? అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారతీయులే కాదు.. విదేశీ వలసదారులు సైతం ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడటానికి ఇష్టపడడం లేదు. ఎందుకైనా మంచిదని టోటల్‌గా ప్రయాణాలు రద్దు చేసుకొని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం వలస నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేస్తుండటంతో.. వలసదారులు దేశీయంగా, అంతర్జాతీయంగా ప్రయాణాలకు భయపడుతున్నారట. కైసర్ ఫ్యామిలీ ఫౌండేషన్ (KFF)-న్యూయార్క్ టైమ్స్ సంయుక్తంగా నిర్వహించిన 2025 సర్వేలో ఈ విషయం బయటపడింది. ప్రస్తుతం అమెరికాలోని వలసదారులలో 27% మంది జర్నీలు చేయకుండా జాగ్రత్త పడుతున్నారన్నది ఈ సర్వే సారాంశం. ఈ క్రమంలో.. చట్టబద్ధంగా ఉన్నవారు కూడా భయాందోళన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సరైన H-1B వీసాలు కలిగినవారు (32 శాతం), పౌరసత్వం పొందినవారు (15 శాతం) కూడా ప్రయాణాలకు వెనుకడుగు వేస్తున్నారు. ఇక.. అక్రమ వలసదారులలో ఈ సంఖ్య 63% గా ఉంది. ఇటు దేశీయంగానూ ప్రయాణాలపై వలసదారుల్లో భయం నెలకొంది. ఇందుకు కారణం లేకపోలేదు.. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ (TSA) దేశీయ విమాన ప్రయాణికుల వివరాలను ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ICE)కు షేర్ చేస్తోంది. దీంతో వలస దారులు తమపై దృష్టి పడకుండా ఉండేందుకు ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారని సర్వేలో వెల్లడైంది. టెక్సాస్‌లో పనిచేస్తున్న భారతీయ ఐటీ నిపుణురాలు శిఖా ఎస్.. తన తల్లిదండ్రులను చూసేందుకు భారత్‌కి రావాలనుకుంటోంది. అయితే.. H-1B వీసా దారులపై పెరుగుతున్న పరిశీలన, ఆలస్యమవుతున్న ఇంటర్వ్యూల కారణంగా తన ప్రయాణాన్ని అర్ధాంతరంగా వాయిదా వేసుకుంది.ఈ ఏడాది జూలైలో H-1B వీసా రీన్యువల్స్‌ను స్వదేశంలోనే చేయాలని నిబంధన విధించగా.. సెప్టెంబర్‌లో కొత్త H-1B దరఖాస్తులపై 100,000 డాలర్ల ఫీజు విధించారు. అటుపై ట్రంప్ ప్రభుత్వం డిసెంబర్లో సోషల్ మీడియా స్క్రీనింగ్‌ను కూడా కఠినతరం చేసింది.ఇక.. వీసా ఇంటర్వ్యూలు 2026–2027 వరకు వాయిదా పడటంతో.. వందలాది మంది ఉద్యోగాలు, కుటుంబాల నుండి దూరమయ్యారు. దీనితో మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి కంపెనీలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు వలసదారులు అత్యవసర పరిస్థితులు తప్ప విదేశీ ప్రయాణం చేయవద్దని సూచిస్తోంది. ఈ మొత్తం పరిణామాలన్నీ అమెరికాలో వలసదారులలో భయాన్ని పెంచి.. వారి రోజువారీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉద్యోగాలు, కుటుంబాలు, చట్టబద్ధ స్థితి కాపాడుకోవడానికి, వలసదారులు ప్రయాణం పూర్తిగా నివారించడం సురక్షిత మార్గంగా భావిస్తున్నారని సర్వేలతో స్పష్టమవుతోంది. -
ఘనంగా 'GTA మెగా కన్వెన్షన్ 2025'
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) ఆధ్వర్యంలో 'GTA మెగా కన్వెన్షన్ 2025' వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ లోని అక్షయ కన్వెన్షన్‌లో శని, ఆదివారం పలు కార్యక్రమాలతో వేడుకలు ఘనంగా జరిగాయి.కార్యక్రమంలో త్రిదండి చినజీయర్ స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి వివేక్ వెంకట్ స్వామి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణా రెడ్డి, పైడి రాకేష్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గువ్వల బాలరాజు, బొల్లం మల్లయ్య యాదవ్ తదితర రాజకీయ, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కాన్వెన్షన్ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని జిటీఎ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా సుమారు 30 దేశాల నుండి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.జీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అలుమల్ల మల్లారెడ్డి, యూఎస్ఏ ఫౌండర్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వల, ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి పాడురి, ప్రెసిడెంట్ ఎలక్ట్ కంకణాల అభిషేక్ రెడ్డి, అడ్వైజరీ చైర్ ప్రతాప్ రెడ్డి పెండ్యాల, సహ వ్యవస్థాపకుడు శ్రవణ్ రెడ్డి పాడురు, యూఎస్ఎ ప్రెసిడెంట్ ప్రవీణ్ రెడ్డి, వాషింగ్టన్ ప్రెసిడెంట్ రాము ముండ్రాతి, తదితరులు GTA లో కీలక పాత్ర పోషిస్తూ ఈ వేడుకలను విజయవంతం చేయడంలో తోడ్పాడ్డారు.తెలంగాణలో జిల్లాల వారిగా GTA చాప్టర్లు ప్రారంభించారు. జిల్లాల కార్యవర్గాన్ని ఈ వేదికపై పరిచయం చేశారు. కార్యక్రమంలో 100 మందికి పైగా కళాకారులతో తెలంగాణ జానపద, శాస్త్రీయ కళారూపాల ప్రదర్శనలు జరిగాయి. మిట్టపల్లి సురేందర్, రసమయి బాలకిషన్, మంగ్లీ లైవ్ మ్యూజికల్ నైట్, మోహన భోగరాజు ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఆహా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఎంటర్టైన్మెంట్ షో నిర్వహించారు.రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, ఎన్ఆర్ఐ లీగల్ అంశాలు, ఆరోగ్య రంగ ఆవిష్కరణలపై ప్రత్యేక సెషన్లు ఏర్పాటు చేయడం విశేషం. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ కింద - రాష్ట్ర అభివృద్ధి, గ్లోబల్ భాగస్వామ్యం, పెట్టుబడుల ఆహ్వానం వంటి అంశాలపై లోతైన చర్చలు జరిగాయి. లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, జిటీఎ కొత్త నాయకత్వ ప్రమాణ స్వీకారం, గ్రాండ్ లైవ్ కన్సర్ట్‌తో ఈ వేడుకలు ఘనంగా ముగిసాయి. ప్రపంచ తెలంగాణ బిడ్డలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈ మహాసభలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో ఓరుగల్లు ఆడబిడ్డ
సాక్షి ప్రతినిధి, వరంగల్: హనుమకొండ జిల్లా పరకాల మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన యారాల ఆదిరెడ్డి సతీమణి యారాల హరిత సౌత్ ఆస్ట్రేలియాలో లిబరల్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆమె 2011 నుంచి సౌత్ ఆస్ట్రేలియా లిబరల్ పార్టీకి బలమైన మద్దతురాలిగా ఉన్నారు. 2023లో టోరెన్స్ ఎస్ఈసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం రెండోసారి ఆ పదవిలో కొనసాగుతున్నారు. అక్కడి తెలుగు వారందరినీ ఐక్యపరచి తెలుగు సంప్రదాయాన్ని చాటుతున్నారు. మార్చి 18న జరగనున్న ఎన్నికల్లో ఎంపీగా గెలిచి తెలుగు వారి సత్తా చాటుతామంటున్నారు. 2022లో క్లెమ్ జిగ్ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. -
విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో డిసెంబర్ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “TTA సేవా డేస్ - 2025” సేవా కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు, అవసరమైన సామగ్రి పంపిణీ వంటి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు రెండు వారాల పాటు పలు జిల్లాల్లో నిర్వహించారు.హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్, ములుగు, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్‌నగర్, సూర్యాపేట, నల్గొండ, మెదక్ సహా పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ లైబ్రరీలు, కంప్యూటర్ ల్యాబ్‌లు ప్రారంభించి, బెంచీలు, యూనిఫామ్‌లు, ఎగ్జామ్ ప్యాడ్లు, జ్యామెట్రీ బాక్సులు అందజేశారు. పాఠశాలల మరమ్మతులు, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆలయాల పునర్నిర్మాణం కూడా చేపట్టారు. గచ్చిబౌలి స్టేడియంలో 10కే రన్‌ను కూడా నిర్వహించారు. వృద్ధుల కోసం రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన క్యారం బోర్డు ఛాంపియన్షిప్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ మహా సేవా కార్యక్రమాలను టీటీఏ (TTA) అధ్యక్షుడు నవీన్ రెడ్డి మల్లిపెడ్డి నాయకత్వంలో టీటీఏ సేవా డేస్ కోఆర్డినేటర్ విశ్వ కంది, ఫౌండర్ డా. పైళ్ళ మల్లా రెడ్డి, అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డా. విజయపాల్ రెడ్డి, కో-చైర్ మోహన్ రెడ్డి పటలోల్ల, అడ్వైజరీ సభ్యులు భరత్ రెడ్డి మాదడి, శ్రీని అనుగు, పూర్వ అధ్యక్షుడు వంశీరెడ్డి కంచరకుంట్ల, ఇండియా కోఆర్డినేటర్ డా. ద్వారకానాథ రెడ్డి, ఇండియా సేవా డేస్ కోఆర్డినేటర్ మధుకర్ రెడ్డి బీరాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు సభ్యుల మార్గదర్శకత్వం ఈ భారీ సేవా కార్యక్రమాలకు తోడ్పడింది.అమెరికా నుండి వచ్చి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న టీటీఏ టీమ్ సభ్యులకు, ఈ మహోన్నత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీటీఏ మహాసభలు “టీటీఏ మెగా కన్వెన్షన్ - 2026” జూలై 17–19, 2026లో షార్లెట్, నార్త్కరోలైనాలో జరుగనున్నట్లు టీటీఏ నాయకులు వెల్లడించారు -
మానసిక అస్వస్థతతో అబుదాబిలో తెలంగాణా కార్మికుడు, ప్రజావాణిలో వినతి
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పెరుమాల్ల గ్రామానికి చెందిన గిరిజన కార్మికుడు మాలోత్ శ్రీరాం యూఏఈ రాజధాని అబుదాబి ముసఫ్ఫా ప్రాంతంలో ఆశ్రయం, ఆహారం లేక రోడ్లపై భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. గ్రామంలో చెడు అలవాట్లకు బానిసై దాన్నుంచి బయటపడాలని గల్ఫ్ దేశానికి వెళ్లి అక్కడ దుర్భర జీవితాన్ని వెళ్ల దీస్తున్నాడు.నవంబర్ 11న క్లీనర్ వీసాపై అబుదాబికి వెళ్లిన శ్రీరాం, రెండు రోజులకే మతిస్థిమితం కోల్పోయి లేబర్ క్యాంప్ నుంచి అదృశ్యమయ్యాడు. నెల రోజుల అనంతరం అతడిని గుర్తించి క్యాంప్‌కు తీసుకువచ్చినా, కంపెనీ మానవత్వం మరిచి లోపలికి అనుమతించకుండా బయటకు తోసివేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అమానుష వైఖరి కారణంగా అతడు మళ్లీ రోడ్ల పాలయ్యాడు.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, కంపెనీ అతడిపై ‘అబ్స్కాండింగ్’ కేసు నమోదు చేసి, స్వదేశానికి పంపాలంటే 4,500 దిర్హముల (సుమారు రూ.1.10 లక్షలు) జరిమానా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఆందోళన చెందిన బాధితుడి భార్య సునీత మంగళవారం (23.12.2025) హైదరాబాద్‌లోని ‘సీఎం ప్రవాసీ ప్రజావాణి’లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పేరిట వినతిపత్రం సమర్పించారు. ఈ వినతి ప్రతులను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె. మదన్ మోహన్ రావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, తెలంగాణ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి లకు అందజేశారు.మంద భీంరెడ్డి వెంట రాగా, బాధితుడి భార్య సునీత 'సీఎం ప్రజావాణి' ఇంచార్జి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జి. చిన్నారెడ్డిని కలిసి తన ఆవేదనను వ్యక్తం చేశారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వి. శేషాద్రికి లేఖ రాశారు.ఇదిలా ఉండగా, శ్రీరాంను స్వదేశానికి పంపించే ప్రయత్నాల్లో అబుదాబి తెలంగాణ సామాజిక సేవకురాలు, వేములవాడకు చెందిన ప్రియా సింగిరెడ్డి కంపెనీ యాజమాన్యం, భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నారు.“నా భర్తను తక్షణం స్వదేశానికి తీసుకువచ్చి, కుటుంబ సభ్యుల సమక్షంలో మానసిక వైద్యం, పునరావాసం కల్పించండి. అత్యంత పేద గిరిజన కుటుంబం. ఈ ఖర్చులు భరించే స్థితిలో లేము” అంటూ సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, అబుదాబి లోని భారత రాయబార కార్యాలయంకు లేఖ రాశారు. -
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు -
ఏఐలో నార్కట్‌పల్లివాసికి అంతర్జాతీయ గుర్తింపు
యాదాద్రి: నార్కట్‌పల్లి మండలం మాధవ యడవెల్లి గ్రామానికి చెందిన కందగట్ల జయచందర్‌రెడ్డి ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్(ఏఐ) రంగంలో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. జయచందర్‌రెడ్డి ప్రస్తుతం అమెరికాలోని ఓ ప్రముఖ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఏఐ రంగలో చేస్తున్న కృషికి గాను 4 ప్రతిష్టాత్మక మార్కమ్ గోల్డ్ అవార్డులు, డావీ సిల్వర్ అవార్డులు పొందారు.గ్రామీణ ప్రజలు ఇంగ్లిష్ వైద్య నివేదికలు అర్థం చేసుకోవడంలో పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన హెల్త్ నీమ్ అనే ఏఐ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు. ఈ ప్లాట్‌ఫామ్ సంక్షిప్త వైద్య సమాచారాన్ని తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లోకి అనువదించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వివరిస్తుంది. అంతేకాకుండా.. గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్, నాసా వ్యోమగాములు సభ్యులుగా ఉన్న ప్రతిష్టాత్మకమైన ఐఈఈఈహెచ్‌కెఎన్ హారన్ సొసైటీలో జయచందర్‌రెడ్డికి సభ్యత్వం లభించడం విశేషం. తనకు వచ్చిన అవార్డులు, గుర్తింపును తన తల్లిదండ్రులు యాదవరెడ్డి-రజితలకు, సొంతూరికి అంకితమిస్తున్నట్లు జయచందర్‌రెడ్డి తెలిపారు. -
అక్లాండ్లో ఘనంగా వైఎస్ జగన్ బర్త్‌డే సెలబ్రేషన్స్
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు వైఎస్సార్సీపీ న్యూజిలాండ్ (ఎన్ఆర్ఐ విభాగం) ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అక్కడి పార్టీ కన్వీనర్ బుజ్జి బాబు నెల్లూరి నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు, జగన్ అభిమానులు పాల్గొన్నారు.ఈ వేడుకలకు రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే, ఈ కార్యక్రమానికి మౌంట్ ఆల్బర్ట్ నియోజకవర్గ పార్లమెంట్ సభ్యురాలు హెలెన్ వైట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇంకా ఈ కార్యక్రమంలో.. గోవర్ధన్ మల్లెల, NZICA అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ కళ్యాణ్ కసుంగాటి, సైంటిస్ట్ బాల బీరమ్, లింక్ టు గ్రూప్ సర్వీసెస్‌కు చెందిన ఇందిరా సిరిగిరి, ఎస్జి కన్సల్టెన్సీ వాసు కునపల్లి, ప్రవీణ్ మోటుపల్లి, యూనివర్సల్ గ్రానైట్స్ శివ కిలారి, NZTA అధ్యక్షుడు జనక్, NZTA మాజీ అధ్యక్షుడు అరుణ్ రెడ్డి, TANZ అధ్యక్షుడు చంద్రశేఖర్ కొడూరి , నిధి చిట్స్ మురళి, ట్రాన్స్ఫసిఫిక్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రోహిత్‌రెడ్డి, రామ్ మోహన్ దంతాల, లుక్స్ స్మార్ట్ డైరెక్టర్ పండు, ప్యారడైస్ ఇండియన్ రెస్టారెంట్ ప్రదీప్, మ్యాంగో బైట్ డైరెక్టర్ నిర్మల్ పాండే, కృష్టా రెడ్డి, శ్రీనివాస్ పనుగంటి తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. -
కువైట్‌లో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు
-
మరోసారి అందరి మనసులు దోచేసిన దుబాయ్ క్రౌన్ ప్రిన్స్
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యుఏఈ ఉప ప్రధాని మరియు రక్షణ మంత్రి షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఓ రెస్టారెంట్లో అందరి బిల్లులు చెల్లించి దాతృత్వాన్ని చాటుకున్న ఆయన.. తాజాగా తన సింప్లిసిటీతో మరోసారి అందరి మనసులు దోచేశారు.సామాజిక సంబంధాలను బలపరిచేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన ‘దుబాయ్ లంచ్’ ప్రాజెక్ట్‌లో భాగంగా షేక్ హమ్దాన్ బిన్, దెయ్రా ప్రాంతంలోని 200 కుటుంబాలను కలిశారు. అల్ ఖవానీజ్ మజ్లిస్ వద్ద జరిగిన సమావేశంలో వారితో చాలాసేపు గడిపారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అయినా ఏమాత్రం ఆడంబరాలకు పోకుండా సాధారణ వ్యక్తిలా ప్రజలతో మమేకమైపోయారు. లంచ్ చేస్తూ వారిలో ఒకరయ్యారు. అందరిని పలకరిస్తూ విశేషాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన ఓ చిన్నారిని కౌగిలించుకున్న హృద్యమైన దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతుంది. షేక్ హమ్దాన్ సింప్లిసిటీకి నెటిజన్లు ముగ్దులవుతున్నారు. షేక్ హమ్దాన్ను అతని తండ్రి, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్‌తో పోలుస్తున్నారు. రాజకుటుంబం మంచితనాన్ని, సింప్లిసిటీని కొనియాడుతున్నారు. షేక్ హమ్దాన్ తండ్రి షేక్ మహమ్మద్ కూడా దుబాయ్ వాసులందరితో సాధారణ వ్యక్తిలా కలిపోతారు. తాను రాజునన్న అహంకారాన్ని ఎక్కడా ప్రదర్శించరు.దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం ఏంటంటే..?దుబాయ్ లంచ్ కార్యక్రమ లక్ష్యం స్థానిక కమ్యూనిటీ మజ్లిస్ల ద్వారా సామాజిక ఐక్యతను పెంపొందించడం. పరస్పర సహకారం, స్నేహాన్ని బలపరచడం. మజ్లిస్ల పూర్వపు సంప్రదాయ ప్రాధాన్యాన్ని తిరిగి తీసుకురావడం. ప్రజలతో నేరుగా సంభాషణకు వేదిక కల్పించడం.దుబాయ్ లంచ్ సందర్భంగా షేక్ హమ్దాన్ వ్యాఖ్యలు..దుబాయ్ లంచ్ కార్యక్రమ సందర్భంగా షేక్ హమ్దాన్ ఇలా అన్నారు. దుబాయ్ శక్తిని భవనాలతో కాదు, ప్రజల మధ్య ఐక్యతతో కొలవాలి. దుబాయ్ చరిత్రను కారుణ్యం, అతిథి సత్కారం, బాధ్యతా భావం నిర్మించాయి. ఈ విలువలను భవిష్యత్ తరాలకు అందించడానికి ఇలాంటి సమావేశాలు అవసరం.2026.. కుటుంబ సంవత్సరంకమ్యూనిటీ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ హెస్సా బింత్ ఈసా బుహుమైద్ తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయ్ 2026ను కుటుంబ సంవత్సరంగా జరుపుకోడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో దుబాయ్‌లోని వివిధ ప్రాంతాల్లో ‘దుబాయ్ లంచ్’ కార్యక్రమాలు జరుగుతాయి. -
ప్రవాస భారతీయులకు ప్రాణ గండం.. అసలేం జరుగుతోంది?
విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల భద్రత ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సిడ్నీ నుండి టొరంటో వరకు.. అక్కడి ప్రవాస భారతీయులు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. విదేశాలకు వెళ్లడమంటే ప్రాణాలను పణంగా పెట్టడమేనా? అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా సిడ్నీలోని బోండి బీచ్‌లో భారతీయ విద్యార్థులపై జరిగిన దాడి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఇటువంటి ఘటనల నేపధ్యంలో విదేశాల్లో ఉంటున్న తమవారు ఎలా ఉన్నారోనని భారతదేశంలోని వారి కుటుంబ సభ్యులు అనునిత్యం ఆవేదన అనుభవిస్తున్నారు.జాత్యహంకార కోరలుకొన్ని పాశ్చాత్య దేశాల్లో జాత్యహంకారం అధికంగా కనిపిస్తుంది. ఈ జాబితాలోని దేశాలలో అమెరికా, కెనడా పేర్లు ముందుగా వినిపిస్తాయి. ఈ దేశాల్లో ఇటీవలి కాలంలో భారతీయులపై ద్వేషపూరిత నేరాలు (Hate Crimes) మునుపెన్నడూ లేనంతగా పెరిగాయి. కెనడాలో భారతీయుల పట్ల విద్వేషం మరింతగా పెరగడం వెనుక సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారం ప్రధాన పాత్ర పోషిస్తోంది. అమెరికాలో 2024 నుంచి ఇప్పటివరకు 11 మందికి పైగా భారతీయ విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది స్థానిక భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. డబ్లిన్‌లో ఒక భారత సంతతి వ్యక్తిపై జరిగిన పాశవిక దాడి, సభ్య సమాజం తలదించుకునేలా చేసింది.అభద్రతా భావంవిద్యా కేంద్రాల్లో అభద్రతా భావం మరింతగా పెరిగిపోయింది. భారతీయ విద్యార్థులు ఎక్కువగా వెళ్లే ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో ఇది ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఆయా దేశాల్లో భారతీయ విద్యార్థులకు క్యాంపస్ భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల టెహ్రాన్‌లోని భారతీయ వైద్య విద్యార్థులు తమపై దాడులు జరుగుతున్నాయని మొరపెట్టుకున్నా, స్థానిక అధికార యంత్రాంగం స్పందించలేదనే వార్తలు వచ్చాయి. ఈ ఘటన దౌత్యపరమైన వైఫల్యంగా కనిపిస్తోంది. విద్యాభ్యాసం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి, వెళ్తున్న విద్యార్థులు, అక్కడ కనీస రక్షణ లేక జాత్యహంకార దాడులకు బలవుతుండటం గమనార్హం.సైద్ధాంతిక విద్వేషంవిదేశాల్లో భారతీయులపై దాడులకు జాత్యహంకారం ఒక్కటే కాదు.. రాజకీయం, మతం లేదా సామాజిక పరమైన అసహనం కూడా కారణంగా నిలుస్తోంది. ఈ తరహా దాడులు కేవలం దొంగతనాలు లేదా స్థానిక గొడవలకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఆన్లైన్ వేదికలపై భారతీయులకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాలు పలుచోట్ల హింసకు దారితీస్తున్నాయి. దీనికి తోడు నేరస్తులకు సరిహద్దులు దాటి ఉన్న సంబంధాలు దర్యాప్తు సంస్థలకు పెద్ద సవాలుగా మారాయి. సిడ్నీ ఘటనలో హైదరాబాద్ లింకులు బయటపడటం దీనికి ఉదాహరణగా నిలిచింది. విదేశాంగ శాఖ అప్రమత్తం విదేశాలలో పెరుగుతున్న ఈ హింసాత్మక ధోరణిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) తీవ్రంగా పరిగణిస్తోంది. గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే భారతీయులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రభుత్వం అంగీకరించింది. ఇటువంటి సందర్భాల్లో విదేశీ ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మార్పు అనుకున్నంతగా కనిపించడం లేదు. భారతీయ రాయబార కార్యాలయాలు విద్యార్థులకు, వలసదారులకు రక్షణ కల్పించడంలో మరింత చురుకైన పాత్ర పోషించాలని పలువురు అంటున్నారు.భద్రతా సంక్షోభం?ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు ఆయా దేశాలు తక్షణ చర్యలు తీసుకోకుంటే ఇవి పునరావృతం అవుతాయని పలువురు అంటున్నారు. ప్రవాస భారతీయులు ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలకు వెన్నెముకగా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు. దీనిని గుర్తించి అయినా అక్కడి ప్రభుత్వాలు వారికి రక్షణ కల్పించాలనే వాదన వినిపిస్తుంటుంది. ప్రవాస మేధావులు, విద్యార్థులపై దాడులు కొనసాగితే, అది ప్రపంచ భద్రతా సంక్షోభానికి దారితీస్తుందనేవారూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో కేవలం నిరసనలు తెలపడమే కాకుండా, అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చని పలువురు సూచిస్తున్నారు. లేనిపక్షంలో విదేశీ కలలు కనే వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే ప్రమాదం ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: బోండి బీచ్ ఘటన: వృద్ధ దంపతుల త్యాగం.. వీడియో వైరల్ -
అంతర్జాతీయ వేదికపై డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వంశీ ఇంటర్నేషనల్ & శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, అంతర్జాలంలో శనివారం సాయంత్రం, ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు, వంశీ అధ్యక్షురాలు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారునవంబర్ 23వ తేదీ హైదరాబాదులో స్వర్గస్తులైన, డా. తెన్నేటి సుధాదేవి (Dr.Tenneti Sudha Rani), వంశీ సంస్థల వ్యవస్థాపకులైన డా. వంశీ రామరాజు ధర్మపత్ని. "సుధాదేవి స్మరణలో, వివిధ దేశాల తెలుగు ప్రవాస సంస్థల ప్రతినిధులు, భారతదేశంలో చెన్నై ముంబై విశాఖపట్నం మొదలైన ప్రాంతాలలో ఉండే ప్రముఖులు ఆప్తులు కలిసి ఆమెకి నివాళులు అర్పించే విధంగా ఈ అంతర్జాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని నిర్వహకులు వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్, కార్యక్రమ సమన్వయకర్త రాధిక మంగిపూడి తెలియ జేశారు.సుమారు నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో శిరోమణి డా వంశీ రామరాజు అంతర్జాల వేదిక మాధ్యమంగా అన్ని దేశాలనుండి తమ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ నుండి మాత్రమే కాక సుమారు పది దేశాల నుండి 50 మంది వరకు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.భారతదేశం నుండి వంశీ సంస్థలతో అవినాభావ సంబంధం ఉన్న పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు తదితర వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో అమెరికా, సింగపూర్, ఖతార్, కువైట్, సౌదీ అరేబియా, ఉగాండా, మలేషియా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుండి కృష్ణవేణి శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల , తాతాజీ & పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వర రావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరిరాధ కాసినాథుని, కె ధర్మారావు గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి , డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ పాల్గొని వంశీ సంస్థలతో సుధ గారితో తమకున్న అనుబంధాన్ని గురించి నెమరు వేసుకుంటూ ఆమెను స్మరించు కున్నారు. కల్చరల్ టీవీ వారు సాంకేతిక సహకారం అందించగా ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం చేశారు. -
FIA అమెరికా అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి
న్యూయార్క్: 1970లో స్థాపించిన అమెరికా ఈస్ట్‌కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి, ఎన్నరైలకు ప్రతినిధిగా భావించే అతిపెద్ద గ్రాస్‌రూట్ నాన్–ప్రాఫిట్ సంస్థ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ USA (FIA NY–NJ–CT–NE) తన 2026 నాయకత్వ బృందాన్ని ప్రకటించింది. స్వతంత్రంగా నియమితులైన ఎన్నికల సంఘం సభ్యులు అలోక్ కుమార్, జయేష్ పటేల్, కెన్నీ దేశాయి ఎంపిక చేసిన తర్వాత సూచించిన పేర్లకు FIA బోర్డు ఆమోదం తెలిపింది. ప్రస్తుత అధ్యక్షుడు సౌరిన్ పరిక్ స్థానంలో 2026 అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా శ్రీకాంత్ అక్కపల్లిని ఎంపిక చేశారు.ఉపాధ్యక్షురాలిగా పృత్యి రే పటేల్, జనరల్ సెక్రటరీగా శృష్టి కౌల్ నరులా కొనసాగనున్నారు. ఈ సంవత్సరం FIA కార్యవర్గాన్ని కుదించి, కౌన్సిల్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. సంస్థకు స్వతంత్రంగా షా అకౌంటెంట్స్ ట్రెజరర్‌గా పనిచేయనున్నారు.కొత్త కార్యవర్గం 2026 జనవరి 1 నుంచి బాధ్యతలు స్వీకరించనుంది. టెక్నాలజీ, రియల్ ఎస్టేట్, మీడియా, హెల్త్‌కేర్, ట్రాన్సిట్ టెక్నాలజీ, స్పోర్ట్స్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి అనేక రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం నిర్మించిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తగా శ్రీకాంత్ అక్కపల్లి పేరు నిలిచింది. అమెరికా–భారత దేశాల్లో ఆయన చేపట్టిన వివిధ రంగాల వ్యాపారాల విజయాలు ఆయన ప్రతిభకు నిదర్శనం.అధ్యక్షుడిగా ఎంపికైన అనంతరం, అక్కాపల్లి బోర్డు తనపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. FIA చైర్మన్ అంకుర్ వైద్యకు తనకు “పెద్ద కుటుంబం లాంటి సంస్థలో చోటు కల్పించినందుకు” ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తొలి తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా FIA అధ్యక్షుడిగా అవతరించడం చారిత్రాత్మకమని పేర్కొంటూ, ఇన్స్టిట్యూషన్ పట్ల నిబద్ధత, నైతికత, సేవా భావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు.అనేక దశాబ్దాలుగా సంస్థతో ఉన్న సీనియర్ సభ్యులు ఆయనను ప్రశంసిస్తూ.. “నిజాయితీ, కష్టపడి పనిచేసే స్వభావం, నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం అక్కపల్లి ఎంపిక FIA లో విస్తృతమైన ప్రాంతీయ వైవిధ్యానికి నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. పూర్తిగా సేవా భావంతో నడిచే ఈ 55 ఏళ్ల సంస్థకు అమెరికా కాంగ్రెస్ రికార్డ్‌లో అధికారిక గుర్తింపు ఉంది. భారత దేశ ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డుతో పాటు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించింది. అనేక గౌరవాలను అందుకుంది. -
ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడుపంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు. I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK— Mayukh (@mayukh_panja) December 5, 2025 సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. -
ఓవర్సీస్ మొబిలిటీ బిల్లులో ప్రవాసీల హక్కులు కాపాడాలి
భారతదేశం నుంచి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే లక్షలాది మంది వలస కార్మికుల జీవితాలను ప్రభావితం చేసే ఓవర్సీస్ మొబిలిటీ (విదేశీ వలస) బిల్లు–2025 లో ప్రవాసీల హక్కులు రక్షించబడేలా చూడాలని, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు చెన్నమనేని శ్రీనివాస రావులతో కూడిన ప్రతినిధి బృందం తమ నాలుగు రోజుల ఢిల్లీ పర్యటనలో తెలంగాణకు చెందిన ఏడుగురు పార్లమెంటు సభ్యులను కలిసి వినతిపత్రాలను సమర్పించారు. భారతీయ వలస కార్మికులు విదేశాల్లో గౌరవంగా, భద్రతతో నివసించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.42 ఏళ్లుగా అమలులో ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్–1983 స్థానంలో భారత ప్రభుత్వం కొత్త చట్టం చేయనున్న నేపథ్యంలో... విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాండింగ్ కమిటీ సభ్యులు, బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డి, కాంగ్రేస్ ఎంపీలు మల్లు రవి (నాగర్ కర్నూల్), సురేష్ షెట్కార్ (జహీరాబాద్), డా. కడియం కావ్య (వరంగల్), గడ్డం వంశీక్రిష్ణ (పెద్దపల్లి), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మాజీ ఎంపీ మధు యాష్కీలతో వారు చర్చించారు. 2021 ముసాయిదాలో ప్రవాసీ కార్మికులకు ప్రతిపాదించిన అనేక రక్షణలు కొత్త బిల్లులో లేవు. అధికారాలు కేంద్రీకృతమవడం ద్వారా దోపిడీ ప్రమాదం పెరుగుతుందని భీంరెడ్డి, శ్రీనివాస రావులు ఎంపీలకు వివరించారు.ప్రవాసుల హక్కులు బలహీనం కావద్దుబాధిత ప్రవాసీ కార్మికులు నేరుగా కోర్టులను ఆశ్రయించే హక్కు తొలగింపు.. మహిళలు, పిల్లల రక్షణలను ‘సున్నిత వర్గాలు’ అనే అస్పష్ట వర్గంలో విలీనం. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు వసూలు చేసే ఫీజుల వివరాల వెల్లడి నిబంధన రద్దు వలన రుణ బానిసత్వానికి దారి తీస్తుంది. విదేశాలకు పంపిన అనంతరం కార్మికులపై ఏజెన్సీల బాధ్యత లేకపోవడం, విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి పునరేకీకరణ నిబంధనలు బలహీనపడ్డాయి. 182 రోజుల (ఆరు నెలల) లోపు విదేశాల నుండి వాపస్ పంపబడ్డ (డిపోర్ట్) అయిన వారిని ‘రిటర్నీలు’గా పరిగణించకపోవడం లాంటి విషయాలను భారత ప్రభుత్వ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసికెళ్లాలని వారు కోరారు.‘ఎమిగ్రంట్’, ‘ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్’, ‘లేబర్’ వంటి పదాల నిర్వచనాల్లో విద్యార్థులు, ఆధారితులు, డిజిటల్ కార్మికులు వంటి వర్గాల వెలివేత. ‘మానవ అక్రమ రవాణా’ (హ్యూమన్ ట్రాఫికింగ్) కు స్పష్టమైన నిర్వచనం లేకపోవడం. కేంద్రీకృత పాలన – రాష్ట్రాలకు, కార్మిక సంఘాలకు చోటు లేదు. ప్రతిపాదిత 'ఓవర్సీస్ మొబిలిటీ & వెల్ఫేర్ కౌన్సిల్' లో వలస కార్మికులను విదేశాలకు పంపే రాష్ట్రాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంస్థలకు ప్రాతినిధ్యం లేదు. రాష్ట్ర స్థాయి నోడల్ కమిటీలు తొలగించబడటం వల్ల స్థానిక సమస్యల పరిష్కారానికి ఆటంకం ఏర్పడుతుందని మంద భీంరెడ్డి, చెన్నమనేని శ్రీనివాస రావులు ఆందోళన వ్యక్తం చేశారు.డిమాండ్లుబిల్లుపై లోతుగా అధ్యయనం చేయాలిఎమిగ్రేషన్ చెక్ పోస్టులు రద్దు అయినప్పటికీ ప్రత్యామ్నాయ నియంత్రణ వ్యవస్థ లేదు.ప్రయాణానికి ముందు శిక్షణ, విదేశాల్లో సహాయక సేవల ప్రమాణాలు స్పష్టంగా లేవు.ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ — హక్కుల కంటే పర్యవేక్షణపైనే దృష్టి.24/7 హెల్ప్లైన్లు, విమానాశ్రయ–ఎంబసీ సహాయం తప్పనిసరి కాదని ముసాయిదా చెబుతోంది.శిక్షలు కేవలం రిక్రూట్మెంట్ ఏజెంట్లపైనే; విదేశీ యాజమాన్యాలపై చర్యలు లేవు.ట్రాఫికింగ్, చట్ట విరుద్ధ ఆన్లైన్ రిక్రూట్మెంట్పై ప్రత్యేక నిబంధనలు లేకపోవడం.విధించే జరిమానాల్లో బాధితులకు పరిహారం కేటాయింపు లేదు. -
'నైటా' కొత్త అధ్యక్షుడిగా రవీందర్ కోడెల
ప్రపంచ వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లో నివసిస్తున్న తెలుగువారు ఏర్పాటు చేసుకున్న సంస్థ న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా). రానున్న ఏడాది (2026) కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నైటా కొత్త అధ్యక్షుడుగా ప్రముఖ ఫార్మసిస్ట్ రవీందర్ కోడెల ఎంపికయ్యారు. ఏడాది పాటు ఆయన న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ కు నాయకత్వం వహించనున్నారు.అమెరికా ప్రధాన నగరమైన న్యూయార్క్ లో వేల సంఖ్యలో తెలుగు, తెలంగాణ ఎన్నారైలు కుటుంబాలతో సహా స్థిరపడ్డారు. వీరందరూ వివిధ వృత్తుల్లో పనిచేస్తూ ఒక సామాజిక సమూహంగా కలిసి ఉండేందుకు నైటాను ఆరేళ్లకిందట ఏర్పాటుచేసుకున్నారు. ఇప్పటివరకూ ఆరు సార్లు ఏర్పాటైన కార్యవర్గాలు తమ ప్రాంత సంస్కృతి, సంప్రదాయాలను పాటించటంతో పాటు, అమెరికాలోనే పుట్టిపెరిగిన తమ పిల్లలకు తెలుగు, తెలంగాణ పండగల ప్రాధాన్యత తెలిసేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అలాగే అమెరికా సమాజంలో భాగమై వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రానున్న ఏడాదిలో కొత్త కార్యవర్గం సహకారంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తామని నూతన అధ్యక్షుడు రవీందర్ కోడెల (Ravinder Kodela) వెల్లడించారు. ఇటీవల మరణించిన ప్రజాకవి అందెశ్రీకి నైటా సభ్యులు సంతాపం ప్రకటించారు. వాణి అనుగు నేతృత్వంలోని తాజా మాజీ కార్యవర్గానికి వీడ్కోలు విందును ఏర్పాటుచేశారు.కార్యక్రమంలో న్యూయార్క్ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్ రాజ్ కుమార్, ప్రముఖ ఎన్నారై పైళ్ల మల్లారెడ్డి, ఇతర కార్యవర్గ సభ్యులు, నైటా (NYTTA) సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొన్నారు.రవీందర్ కోడెల ప్రస్థానంఉమ్మడి వరంగల్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం వాస్తవ్యులు. బాల్యం నుంచి పదవ తరగతిదాకా అక్కడే గడిచింది. ఆతర్వాత హన్మకొండలో ఇంటర్, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మాస్టర్స్ చదివారు. ఆ తర్వాత ఫెలోషిప్ (CSIR)తో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేశారు. చదవండి: ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే.. వచ్చేస్తున్నా!తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలోనూ వివిధ వేదికల ద్వారా తన వంతు పాత్ర పోషించారు. ఆ తర్వాత డాక్టర్ రెడ్డీస్ తో పాటు పలు ప్రముఖ సంస్థల్లో పనిచేస్తూ అమెరికా వెళ్లి అక్కడే న్యూయార్క్‌లో స్థిరపడ్డారు. సిటీ కాలేజీ ఆఫ్ న్యూయార్క్ (మెడికల్ స్కూల్)తో పాటు సౌత్ వెస్ట్రర్న్ మెడికల్ సెంటర్లలో ప్రముఖ ఫార్మాసిస్టుగా క్యాన్సర్ నివారణ ఔషధాల తయారీలో గుర్తింపు పొందారు. -
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్‌గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్‌గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
యూకేలో ప్రోస్టేట్ కాన్సర్పై అవగాహన
బిబిసి (బెర్క్‌షైర్ బాయ్స్ కమ్యూనిటీ) ఆధ్వర్యంలో ఇటీవల బ్రిట్‌వెల్ లైబ్రరీలో మువెంబర్ డేని ఘనంగా నిర్వహించారు. యూకె నలుమూలనుండి యువత పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రోస్టేట్ కాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రము ద్వారా మగవాళ్ళ లో తరచుగా వచ్చే ప్రోస్టేట్ కాన్సర్ పైన అవగాహన కల్పించి , దాన్ని ఎలా నిర్ములించుకోవాలో సూచనలు చేసి ,చారిటీ ప్రోగ్రాం నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రోగ్రాంతో ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన వంద మందికి పైగా పురుషులు హాజరైనారు. .ఈ ఈవెంట్లో భాగంగా మేము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన ఛారిటీ మొత్తానికి 809 GBP(85 K INR)** పౌండ్స్ కు పైగా సేకరించారు.. నవంబరు నెల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు అంకితం చేయబడినందున తాము ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహన నడకను కూడా ప్రారంభించామని నిర్వాహకుతు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించి ,చారిటీ ద్వారా వచ్చిన ఆర్ధిక సహాయంతో ప్రోస్టేట్ కాన్సర్ వ్యాధితో బాధ పడుతున్న వారికి , రెండు తెలుగు రాష్ట్రాలలో, యుకెలో ఆర్ధికంగా ఆదుకుంటున్నామనీ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇలాంటి మంచి ఆలోచనతో ప్రోగ్రామ్స్ నిర్వహించడం తెలుగు వారందరికీ గర్వకారణమని పలువురు ప్రశంసించారు. ఈ ఈవెంట్ విజయానికి సహకరించిన సభ్యులు బి.బి.సి కోర్ టీం ఉన్నారు. ఈ కార్యక్రమానికి చేయూతనిచ్చిన స్పాన్సర్స్ అందరికి వినమ్ర పూర్వక అభినందనలు అని కమిటీ సభ్యులు తెలిపారు. -
ఆస్ట్రేలియాలోని ఎన్నారైల సహకారం మరువలేనిది : లక్ష్మీపార్వతి
గత కొన్ని సంవత్సరాలుగా వైఎస్ఆర్సిపి పార్టీకి జగనన్నకు మద్దతుగా నిలుస్తున్నటువంటి ఆస్ట్రేలియా వైయస్సార్సీపీ ఎన్నారై లకి పార్టీ సీనియర్ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి అభినందనలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆస్ట్రేలియాలోనీ మెల్బోర్న్ పర్యటనలో ఉన్న లక్ష్మీపార్వతి గారు మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీనియర్ నాయకులని ఉద్దేశించి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు చూపిస్తున్న ఆధారాభిమానాలకు పార్టీ ఎల్లప్పుడూ కృతజ్ఞతగా ఉంటుందని తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ జగన్ గారు తన పరిపాలన హయాంలో ప్రజలకు ఎంతో మేలు చేశారని తమలో చాలామంది వారి తండ్రి పెట్టిన పథకాలను ఉపయోగించుకుని వచ్చి విదేశాల్లో స్థిరపడ్డామని వారి రుణం జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లప్పుడూ మద్దతు తీర్చుకుంటామని తెలియజేశారు. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ పార్టీకి ఇదేవిధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యకర్తలకు అన్ని విధాలాగా భరోసా ఉంటుందని పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైసిపి నాయకులు నాగార్జున యలగాల, అనీల్ పెదగాడ, హరి చెన్నుపల్లి, శరత్ కుమార్ రెడ్డి తోట్లీ, విష్ణు వర్ధన్ రెడ్డి వాకమల్ల తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మెల్బోర్న్ టీం వైయస్ఆర్సీపీ సభ్యులకు ఆస్ట్రేలియా సీనియర్ వైసీపీ లీడర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు -
17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్
డాలర్ల వేటలో చాలామంది విదేశాల బాటపడతారు. కానీ అన్ని దేశాల్లోనూ, అన్ని రకాలుగా మనకు సౌకర్యంగా ఉండదు. కొన్నిచోట్ల కొన్ని సమస్యలు తప్పవు. ఇందులో అక్కడి నిబంధనలు, భాషా సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆరోగ్యం ఇలా ఈ జాబితాలోనే చాలానే ఉంటాయి. కొన్ని కావాలంటే కొన్ని సర్దుబాట్లు తప్పవు అని ఎడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ అమెరిలో ఒకటిన్నర దశాబ్దానికి పైగా ఉన్న జంట ప్రవాస భారతీయ (NRI) జంట ఇండియాకు తిరిగి వచ్చేసింది.ఎందుకు? అనుకుంటున్నారా? పదండి తెలుసుకుందాం ఈ కథనంలోఅమెరికాలో ఆరోగ్య ఖర్చులు బీమా భారం కావడంతో దాదాపు 17 ఏళ్ల తరువాత అమెరికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేసింది భారతేదేశానికి చెందిన ఎన్ఆర్ఐ జంట. వీరికి కవల పిల్లలు. యూఎస్‌లోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ తమ ఆర్థిక స్థితిపై ఒత్తిడి తెస్తోందని, బీమా చాలా ఖరీదైనదని, దీంతో అక్కడ హాస్పిటల్‌కి వెళ్లాలంటేనే భయం వేస్తోందని ఇన్‌స్టా పోస్ట్‌లో వెల్లడించారు.అమెరికాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆరోగ్య బీమా సేవలకంటే ముందు, మీ జేబుకు చిల్లు తప్పదు. అంటే ఏ డాక్టర్ దగ్గరికెళ్లినా, ఎలాంటి పరీక్షలు చేయించుకున్నా, మినిమం డిడక్టబుల్ ఎమౌంట్ కట్టాల్సిందే అంటూ తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తాము ఎంచుకున్న చౌకైన పథకం నెలకు 1,600 డాలర్ల ప్లాన్. ఇందులో 15వేల డాలర్లు డిడక్టబుల్ ఎమౌంట్. అయితే ఈ కవర్లో ట్విన్స్ యాడ్ అవ్వలేదు.దీంతో పిల్లలకి ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చిన ఖర్చులు విపరీతం, దీనికి ఒత్తిడి ఎక్కువగా ఉంటోంది. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కున్నాం. మంచి వైద్యులు, వేగవంతమైన సంరక్షణ, చికిత్స అందుబాటులో ఉండేలా చక్కటి వ్యవస్థ ఉంది. మేం ఇండియాకు రావడం అంటే సమస్య నుంచి పారిపోవడం కాదు, ఆరోగ్య సంరక్షణ భరించేదిగా ఉండటంతోపాటు, ఒంటరిగా మాతృత్వ భారాన్ని భరించాల్సిన అవసరం లేని జీవితం వైపు పరుగెత్తడం అని వివరణ ఇచ్చారు. తాము కోల్పోతున్న సమన్వయం, మనశ్శాంతిని వెదుక్కోవడం అని పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Dhara (@twinsbymyside) దీంతో నెటిజన్లు ఈ జంటతో ఏకీభవించారు. వారికి మద్దతుగా నిలిచారు. చక్కటి నిర్ణయం తీసుకున్న మీకు అభినందనలు అంటూ ప్రశంసించారు. అలాగే కొంత సర్దుబాటు అవవసరం అని కొందరు వ్యాఖ్యానిస్తే. ఇండియాలో 30వేలతో అయిపోయే అపెండిక్స్ ఆపరేషన్‌కు రూ. 3.74 కోట్లు అయిందంటూ ఒకరు,అక్కడ సాధారణ కట్టు , కుట్లు వేయడానికి చాలా ఖర్చవుతుంది అని మరొకరు తమ అనుభవాల్ని పంచుకున్నారు. రెండు దేశాల్లో వాటి ప్లస్‌లు మైనస్లూ ఉన్నాయి. కానీ చిన్న పిల్లలున్న కుటుంబాలకు ఇండియాలో మంచి ఆరోగ్య వ్యవస్థ ఉందన్నారు. ఎక్కడా పెర్ఫెక్ట్గా ఉండదు. కానీ మీకు మంచి జీవితం ఉండాలని భావిస్తున్నాను అని ఒకరు వ్యాఖ్యానించారు. వీడియో 10.6 లక్షలకు పైగా వీక్షణలు మరియు వందలాది వ్యాఖ్యలను సంపాదించింది. -
వచ్చేనెలలో తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఆటా వేడుకలు
గత ఇరవై సంవత్సరాలుగా ఆటా వేడుకలు పేరుతో అమెరికా తెలుగు సంఘం ఒక వినూత్న కార్యక్రమాన్ని మొదిలిపెట్టి నిర్విరామంగా నిర్వహిస్తుంది. తెలుగు భాష, సాహిత్యాలను ప్రేమిస్తూ విశేష కృషి చేస్తూ వస్తున్నది. ఉమ్మడి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమై నేడు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆటా వేడుకలు ఘనంగా జరగటం విశేషం.ఆటా సేవల్లో భాగమైన సాహిత్య, సాంస్కృతిక, విద్యా, ఆధ్యాత్మిక, వ్యాపార రంగాల్లాంటి మరెన్నో రంగాల్లో పలు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాల ద్వారా ఆటా తన మిషన్ లక్ష్యాలను చేరుకోవడమే కాకుండా, ఆటా తెలుగు తేజాన్ని నాలుగు దిశల విస్తరింప చేస్తూ ఉన్నది. విశ్వఖ్యాతిగా మన తెలుగును బహుళ ప్రచారం చేస్తూ భవిష్యత్తు తరాలను ప్రభావితపరుస్తూ ఉన్నది. తేనెలొలుకు తెలుగు తియ్యదనాన్ని ప్రచారం చేస్తూ తెలుగు మాతృభాష గల ప్రజలను, భాషాభిమానులను ఆకర్షిస్తూ ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే భవిష్యత్తు నిర్మాణానికి ఎంతగానో ఈ ఆటా వేడుకలు ఉపయోగపడుతున్నాయి.ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లసహాయ సహకారాలతో, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్ & ఆటా వేడుకల కమిటీ చైర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆటా వేడుకలు జరగబోతున్నాయి.డిసెంబర్ 12 - రంగా రెడ్డి జిల్లాలో స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి మరియు సాంస్కృతిక కార్యక్రమాలు డిసెంబర్ 13: – సంగారెడ్డి - ఐఐటీలో స్టార్ట్ అప్ పిచ్ డిసెంబర్ 14: – హైదరాబాద్ లో సాహిత్య కార్యక్రమండిసెంబర్ 16–17: బిజినెస్ సెమినార్స్ - హైదరాబాద్, విశాఖపట్నండిసెంబర్ 20–23: స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ కార్యక్రమాలు , స్కూల్ మౌలిక సదుపాయాల.అభివృద్ధి , ,వాటర్ ప్లాంట్ మరియు ఉమెన్స్ హెల్త్ క్యాంప్స్.డిసెంబర్ 24–25: పిల్లల కొరకు హెల్త్ క్యాంప్స్ మరియు చారిటబుల్ ప్రోగ్రామ్స్డిసెంబర్ 27: గ్రాండ్ ఫినాలే రవీంద్ర భారతి లో - సాంస్కృతిక కార్యక్రమాలు మరియు ఆటా అవార్డ్స్ ప్రధానంరెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్ని కార్యక్రమాలని ముగించుకుని హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో చక్కటి వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు ఎందరో కళాకారులు. చివరగా రుచికరమైన విందు భోజనంతో ముగియబోయే ఈ వేడుకలు అమెరికాలో బాల్టిమోర్ నగరంలో జులై 31 - ఆగష్టు 2 జరగబోయే ఆటా మహాసభల సన్నాహాల కోసం అందరిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఆటా ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు రెండూ రాష్ట్రాలలో నిర్వహిచటం గమనార్హం. డిసెంబర్ మాసంలో నిర్వహించే ఆటా వేడుకలలో ప్రవాసులు పెద్ద ఎత్తున పాల్గోవాలిసిందిగా ఆటా బోర్డ్ విజ్ఞప్తి చేసింది. తమ గ్రామాలూ, పట్టణాలలో సేవ కార్యక్రమాలు చేయాలనుకునే వారు www.ataworld.org సంప్రదించవలిసిందిగా కోరారు. -
40 ఏళ్ల సేవలు, రూ. 35 లక్షలు..ఎన్ఆర్ఐకి అరుదైన గౌరవం!
ఒక ఉద్యోగికగా తాను చేసిన సేవలకు గుర్తింపు లభించడం అంటే ఆస్కార్ వరించినంత ఆనందం. అది వ్యక్తిగత లేదా,బహిరంగ ప్రశంస అయినా, అవార్డులు, రివార్డు, నగదు బహుమతి అయినా, ఏదైనా ఎంత చిన్నదైనా కూడా గొప్ప గౌరవమే. అది వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడమే కాదు, నిబద్దతను పెంచుతుంది. తమ కృషికి విలువ లభిస్తుందనే భావన, ఆరోగ్యకరమైన పోటీ, పనితీరును మెరుగుకు దారితీస్తుంది. అంతిమంగా ఇది సంస్థకు ఎనలేని మేలు చేస్తుంది. ఇపుడు ఇదంతా ఎందుకూ అంటే.. భారత సంతతి వ్యక్తికి తన సంస్థనుంచి లభించిన అరుదైన గౌరవంగా నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.మెరికాలోని మసాచుసెట్స్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేస్తున్న భారత సంతతికి చెందిన ఉద్యోగి బల్బీర్ సింగ్‌ను సంస్థ చాగా గొప్పగా సత్కరించుకుంది 40 ఏళ్ల పాటు అంకిత భావంతో పనిచేసిన మెక్‌డొనాల్డ్స్ ఫ్రాంచైజ్ లిండ్సే వాలిన్కు సుమారు రూ. 35 లక్షల బహుమతిని (40 వేల డాలర్లు) అందించింది. ఈవెంట్ వేదిక వద్దకు బల్బీర్ సింగ్‌ను లిమోజిన్ కారులో తీసుకువచ్చి, రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికి మరీ దీనికి సంబంధించిన చెక్కును అందించారు. అలాగే సేవా పురస్కారం, స్మారక "వన్ ఇన్ ఎయిట్" జాకెట్నుకూడా అందుకున్నారు. ఈసందర్బంగా ఫ్రాంచైజ్ యజమాని లిండ్సే వాలిన్ మాట్లాడుతూ, బల్బీర్ సింగ్ తమ సంస్థకు గుండెలాంటి వారని కొనియాడారు. మొత్తం తొమ్మిది అవుట్లెట్లను కలిగి ఉన్న లిండ్సే వాలిన్, సింగ్ ఈ విజయాన్ని ఇతర ఉద్యోగులతో ఘనంగా సెలబ్రేట్ చేశారు. బల్బీర్ తనతో కలిసి చేసిన 40 ఏళ్ల ప్రయాణం గురించి చెప్పలేమని చెప్పలేననీ, తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగు రెస్టారెంట్లను చాలా గొప్పగా, అచంచల దృష్టితో నడుపుతున్నాడు ఆమె ప్రశంసించారు. చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరుబల్బీర్ సింగ్ కెరీర్బల్బీర్ సింగ్ 40 ఏళ్ల క్రితం భారతదేశం నుండి అమెరికాకు వచ్చిన కొద్ది రోజులకే మెక్‌డొనాల్డ్స్‌లో కెరీర్ ప్రారంభించారు. తొలుత 1985లో సోమర్విల్లేలోని రెస్టారెంట్ కిచెన్‌లో పనిచేశారు. అలా కష్టపడి, పూర్తి నిబద్ధతతో పనిచేసి, ఒక్కో మెట్టు ఎదుగుతూ తాను పనిచేస్తున్న సంస్థలోని తొమ్మిది రెస్టారెంట్లలో నాలుగుంటిని పర్యవేక్షించే స్థాయికి చేరుకోవడం విశేషం. మొదట బల్పీర్ సింగ్ తన తండ్రి బాబ్కింగ్ వద్ద పనిచేసేవారని కంపెనీ మోటో అయిన వై నాట్ అనే పద్ధతిని స్వీకరించారని, ఇంకా ఎదగాలి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్న ఆలోచనా విధానమే మా విజయానికి కారణమని లిండ్సే వాలిన్. మరోవైపు ఈ కంపెనీలో పనిచేయడం తనకు చాలా గర్వకారణమంటూ సంతోషాన్ని ప్రకటించారు బల్బీర్ సింగ్ . -
అమెరికాలో ఆంధ్రా తల్లి,కొడుకుల హత్య కేసులో ట్విస్ట్
అనూహ్య పరిస్థితుల్లో భార్య బిడ్డలు చనిపోయి కనిపించారు. తీరని దుఃఖంలో ఉండగానే నువ్వే నిందితుడని బంధువులు ఆరోపించారు. అనుమానాలున్నాయంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల తరువాత అసలు నిజం తెలిసింది. సంచలనంగా మారిన ఈ స్టోరీ వివరాలు తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవాల్సిందే.2017, మార్చి 23, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్రా శశికళ, ఆమె కుమారుడు అనిష్ న్యూజెర్సీలోని వారి అపార్ట్మెంట్లోశవాలై కనిపించారు. మహిళ భర్త నర్రా హనుమంతరావునే ప్రాథమికంగా నిందితుడిగా భావించారు. కానీ అనూహ్యం ఎనిమిదేళ్ల తరువాత నజీర్ హమీద్ అనే వ్యక్తిపై అభియోగాలు మోసారు. న్యూజెర్సీలోని ఒక కంపెనీలో శశికళ నర్రా భర్త సహోద్యోగే ఈ హత్యలకు పాల్పడినట్టు ప్రాసిక్యూటర్లు తెలిపారు.శశికళ, అనిష్ హత్యఏపీకి చెందిన నర్రా హనుమంతరావు న్యూజెర్సీలోని మాపుల్ షేడ్‌లోని ఫాక్స్ మేడో అపార్ట్‌మెంట్స్‌లో భార్య శశికళ నర్రా(38), 6 ఏళ్ల కుమారుడు అనిష్‌తో కలిసి ఉండేవారు. ఒక రోజు ఆఫీసునుంచి ఇంటికి వచ్చేసరికి భార్య, కుమారుడు ఒళ్లంతా రక్తమోడుతూ తీవ్రమైన కత్తిపోట్లతో చనిపోయి కనిపించారు. వెంటనే హనుమంత రావు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్న నేపథ్యంలోనే ఈ హత్యలకు పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు హనుమంతరావును అరెస్ట్ చేశారు. ఈ సమయంలో దర్యాప్తు అధికారులు తమ విచారణలో భాగంగా సంఘటనా స్థలంనుంచి రక్తపు మరకల నమూనాలను సేకరించి, డీఎన్ఏ పరీక్షలు చేయించారు. అయితే అది హనుమంతరావు డీఎన్ఏతో మ్యాచ్ కాకపోవడంతో ఇది మరో మలుపు తిరిగింది.ఎలా ఛేదించారంటే..బర్లింగ్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఆఫీస్ చీఫ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ పాట్రిక్ థోర్న్టన్ అందించిన వివరాల ప్రకారం హనుమంతరావు ఇంటికి సమీపంలోనే ఉండే హమీద్ మధ్య గొడవలు ఉన్నట్టు గురించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో పనిచేస్తున్న సమయంలో హను నర్రాను వేధించినట్లు గతంలో నజీర్ హమీద్ పై ఆరోపణలు రావడంతో ఆ వైపుగా దర్యాప్తు మెుదలుపెట్టారు. డీఎన్ఏ నమూనాను సేకరించాలనే ఉద్దేశంతో అధికారులు 2024లో కోర్టుకు వెళ్లారు. కాగ్నిజెంట్ కంపెనీ,హమీద్‌కు జారీ చేసిన ల్యాప్‌టాప్‌ను తమకు పంపమని కోరారు. చివరికి ల్యాప్‌టాప్ నుండి డీఎన్ఏ సేకరించారు అధికారులు. నేరస్థలంలో దొరికిన నమూనాతో హమీద్ డీఎన్ఏ సరిపోలడంతో గుట్టు రట్టయింది.మరోవైపు జంట హత్యలు జరిగిన 6 నెలల తర్వాత హమీద్ ఇండియాకు చెక్కేశాడు. అయినా కాగ్నిజెంట్ ఉద్యోగిగా కొనసాగాడు. అంతేకాదు అమెరికా పోలీసులు హమీద్ డీఎన్ఏ కోసం చాలాసార్లు ప్రయత్నించారు. భారతీయ అధికారుల ద్వారా సంప్రదించినా స్పందించలేదు. చివరికి అతడి ల్యాప్‌ట్యాప్ మీద నమూనాల ఆధారంగా కేసును ఛేదించారు. మరోవైపు హమీద్‌ను అమెరికాకు రప్పించేందుకు భారత విదేశాంగశాఖ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరుఈ దారుణమైన హత్యల వెనుక హమీద్ ఉద్దేశం ఏమిటనేది దర్యాప్తు అధికారులకు స్పష్టత లేదు కానీ హనుమంతరావుపై కోపంతోనే అతడి భార్య శశికళ, కుమారుడిపై ప్రతీకారం తీర్చుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది! -
BMW కారు బీభత్సం: భారత సంతతి గర్భిణి దుర్మరణం
డ్రైవింగ్ సరిగ్గా రాకుండానే స్టీరింగ్ పట్టుకున్న ఒక మైనర్ అత్యుత్సాహం ఒక కుటుంబాన్ని అంతులేని విషాదంలోకి నెట్టేసింది. రెండో బిడ్డ రాక కోసం కలలు కంటున్న నిండు గర్భిణి తన కల తీరకుండానే అనంత లోకాలకు చేరింది.ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగిన ఘోర కారు ప్రమాదంలో 33 ఏళ్ల గర్భిణి భారతీయ మహిళ కన్నుమూసింది. ఎనిమిది నెలల గర్భిణి అయిన సమన్విత ధరేశ్వర్ తన భర్త, మూడేళ్ల కొడుకుతో కలిసి నడుచుకుంటూ వెళుతుండగా అదుపు తప్పిన లగ్జరీ BMW కారు ఢీకొట్టింది. గత వారం ఈ విషాదం చోటు చేసుకుంది.శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో హార్న్స్బైలోని జార్జ్ సెయింట్ వెంబడి ఉన్న ఫుట్‌పాత్‌పై వాకింగ్ చేస్తోంది ధరేశ్వర్. వేగంగా వస్తున్న BMW కారు, ముందున్న కియా కార్నివాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కియా కారు ధరేశ్వర్‌ను బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ధరేశ్వర్ కు తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే వెస్ట్ మీడ్ ఆసుపత్రికి తరలించినా, వారిని కాపాడలేక పోయామన్నారు. ఈ ఘటనలో రెండు కార్ల డ్రైవర్లకు ఎలాంటి గాయాలు కాలేదు. ధరేశ్వర్ భర్త, ఆమె మూడేళ్ల బిడ్డ ఎలా ఉన్నారనే దానిపై సమాచారం లేదు. ఇదీ చదవండి: మాజీ ప్రియుడి లైంగిక వేధింపులు, నాలుక కొరికేసిన యువతినిందితుడు 19 ఏళ్ల P-ప్లేటర్ (తాత్కాలిక లేదా ప్రొబేషనరీ లైసెన్స్ ఉన్న డ్రైవర్) ఆరోన్ పాపాజోగ్లుగా గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బెయిల్ నిరాకరించారు. కాగా మృతురాలు ధరేశ్వర్ IT సిస్టమ్స్ ఎనలిస్ట్‌గా పని చేస్తున్నారు. చదవండి: అరగంటలో రూ. 10 లక్షలు : సేల్స్‌మేన్‌కు దిమ్మ తిరిగింది -
సౌదీలో ఘోర ప్రమాదం.. హైదరాబాదీలు దుర్మరణం!
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో ఘోర ప్రమాదం సంభవించింది(Saudi Arabia Bus Accident). మక్కా నుండి మదీనాకు ఉమ్రా యాత్రికులతో వెళ్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయి అందులోని 45 మంది సజీవ దహనం అయ్యారు. మృతులంతా హైదరాబాద్(తెలంగాణ) వాసులేనని తేలింది.స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం అర్ధరాత్రి దాటాక 1.30గం. ప్రాంతంలో ముఫ్రిహాత్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడంతో అగ్నికి ఆహుతి అయ్యారు. మక్కా యాత్ర ముగించుకుని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ఘోరం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 11 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలంలో అత్యవసర సేవలు కొనసాగుతున్నాయి. డ్రైవర్‌తో పాటు షోయబ్ అనే యువకుడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం యువకుడికి ఐసీయూలో చికిత్స అందుతోంది.సీఎం రేవంత్ దిగ్భ్రాంతిఈ ఘోర ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. కేంద్రం, సౌదీ ఎంబసీతో మాట్లాడాలని సూచించారు. ఈ నేపథ్యంలో విదేశాంగ మంత్రిత్వ శాఖతో ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంప్రదింపులు జరుపుతున్నారు. కంట్రోల్ రూమ్ నెంబర్లు సౌదీలో బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాలు, సహయచ చర్యల వివరాలు తెలుసుకునేందుకు తెలంగాణ సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాలు 24X7 సమాచారం కోసం +91 79979 59754, +91 99129 19545 ఫోన్నెంబర్లను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్‌తో సమన్వయం చేయాలని అధికారులకు ఇప్పటికే సీఎస్ అదేశాలు జారీ చేశారు. జెడ్డా హెల్ప్‌లైన్ నెంబర్ ఇదే.. సౌదీ అరేబియాలో మదీనా సమీపంలో జరిగిన దుర్ఘటనలో భారతీయ ఉమ్రా యాత్రికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో జెడ్డాలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో 24x7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నంబర్: 8002440003 ద్వారా బాధితుల సమాచారం కోసం ఎప్పుడైనా సంప్రదించవచ్చని అధికారులు సూచిస్తున్నారు. -
ఆస్ట్రేలియాలో లక్ష్మీపార్వతికి వైఎస్సార్సీపీ శ్రేణుల ఘనస్వాగతం
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతికి అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. లక్ష్మీపార్వతికి నాయకులు చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి ,గజ్జల చంద్ర ఓబుల రెడ్డి,వీరం రెడ్డి శ్రీధర్ రెడ్డి ,దూడల కిరణ్ రెడ్డి, కామరాజు కృష్ణ చైతన్య ,కోటా శ్రీనివాసరెడ్డి, దుగ్గింపుడి కిరణ్ రెడ్డి, సిద్ధన సురేష్ రెడ్డి తదితరులు ఘనస్వాగతం పలికారు. ప్రస్తుతం బ్రిస్బేన్‌లో ఉన్న లక్ష్మీపార్వతి.. వారం రోజుల పాటు ఆస్ట్రేలియాలోనే ఉంటారు. అక్కడ వివిధ నగరాల్లో జరిగే ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమాకు ఆమె హాజరుకానున్నారు. -
ఫీనిక్స్‌లో సాంస్కృతిక వేడుకలు.. శంకర నేత్రాలయ యూఎస్ఏకు భారీ విరాళం
మెసా(అరిజోనా): ఫీనిక్స్‌లోని భారతీయ యువత ఆధ్వర్యంలో మెసా ఆర్ట్స్ సెంటర్లోని వర్జీనియా జి. పైపర్ రిపర్టరీ థియేటర్ వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, హాస్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించడమే కాకుండా.. సేవా సంకల్పానికి నిదర్శనంగా నిలిచింది. ఈ వేడుక ద్వారా శంకర నేత్రాలయ యూఎస్ఏ నిర్వహించే గ్రామ దత్తత కార్యక్రమం కోసం 1,45,000 డాలర్లు విరాళంగా సమీకరించబడ్డాయి.“డాన్స్ ఫర్ విజన్” కార్యక్రమంలో 160 మంది యువ కళాకారులు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల నృత్య రూపకాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. యువ నాయకులు యోగాంశ్, విశాల్, జోషిత, ఆదిత్య తదితరులు సమర్థంగా కార్యక్రమాన్ని నడిపారు. మహిళా కమిటీ సమన్వయంతో నిర్వహణ విజయవంతమైంది. నృత్య గురువులకు సన్మాన పతకాలు, విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.దాతలకు సన్మానంగ్రామ దత్తత కార్యక్రమానికి ముఖ్యంగా పది మంది దాతలు తమ విరాళాలతో మద్దతు అందించారు. వీరిని వేదికపై ఘనంగా సన్మానించారు. వారి సేవా దృక్పథం, అరిజోనా బృందం సమిష్టి కృషికి పలువురు అభినందనలు తెలిపారు.హాస్యంతో హృదయాల హరివిల్లు“విజన్ కోసం నవ్వులు” పేరుతో రామ్‌కుమార్ నిర్వహించిన తమిళ స్టాండ్‌అప్ హాస్య ప్రదర్శన ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. కార్యక్రమం అనంతరం ఆయన అభిమానులతో ఫొటోలు దిగారు, శాలువా, సత్కార పతకంతో సన్మానితులయ్యారు.శంకర నేత్రాలయ సేవా లక్ష్యం1978లో ప్రారంభమైన శంకర నేత్రాలయం, గ్రామీణ భారతదేశంలో కంటి చికిత్స అందించడంలో అగ్రగామిగా నిలుస్తోంది. 1988లో స్థాపితమైన శంకర నేత్రాలయ యూఎస్ఏ, మెసు ద్వారా మొబైల్ నేత్ర శిబిరాలు నిర్వహిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తోంది.నిర్వాహకుల కృషివంశీ కృష్ణ ఇరువారం, ఆది మోర్రెడ్డి, శ్రీని గుప్తా, డాక్టర్ రూపేష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమ విజయానికి కీలకంగా వ్యవహరించారు. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవకులు, కళాకారులు, గాయకులు, నృత్య పాఠశాలలు అందరూ తమదైన పాత్ర పోషించారు. ఈ సందర్భంగా.. టికెటింగ్, ప్రచారం, ఫోటోగ్రఫీ, ఫ్లయర్ రూపకల్పన వంటి విభాగాల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. చివరగా, పాల్గొన్నవారందరికీ భోజన పెట్టెలు అందజేయడం ద్వారా కార్యక్రమాన్ని ముగించారు. -
రష్యాలో ఇండియా విద్యార్థి అదృశ్యం : విషాదాంతం
రష్యాలో గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయిన భారతీయ MBBS విద్యార్థి కథ విషాదాంతమైంది. రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందిన 22 అజిత్ సింగ్ చౌదరి మృతదేహం ఆనకట్టలో లభ్యమైంది. దీంతో బాధిత విద్యార్థి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.రష్యాలో దాదాపు మూడు వారాలుగా తప్పిపోయిన వైద్య విద్యార్థి అజిత్ సింగ్ చౌదరి మృతదేహాన్ని ఉఫా నగరంలోని ఆనకట్ట సమీపంలో గుర్తించారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఈ సంఘటన గురించి కుటుంబ సభ్యులకు , అల్వార్‌లోని స్థానిక ప్రతినిధులకు సమాచారం అందించింది.అజిత్ సింగ్ చౌదరి 2023 నుండి రష్యాలోని బష్కిర్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో M ఎంబీబీఎస్ డిగ్రీ చదువుతున్నాడు. అక్టోబర్ 19న ఉదయం 11 గంటల ప్రాంతంలో తన హాస్టల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అజిత్ అదృశ్యమయ్యాడు. పాలు కొనుక్కుని అరగంటలోపు తిరిగి వస్తానని స్నేహితులకు చెప్పి వెళ్లిన అతను ఎంతకీ తిరిగిరాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.స్థానిక అధికారులు వైట్ నది సమీపంలో అతని బట్టలు, ఫోన్ ,బూట్లు కనుగొన్నారు. పంతొమ్మిది రోజుల తరువాత, అదే నదికి ఆనుకుని ఉన్న ఆనకట్ట వద్ద అజిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.తోటి విద్యార్థులు మృతదేహాన్ని గుర్తించారు పోస్ట్‌మార్టం అనంతరం అతని మృతదేహాన్ని ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భారత రాయబార కార్యాలయం, రష్యన్ అధికారుల మధ్య సమన్వయంతో స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ రెండు మూడు రోజుల్లో పూర్తి కావచ్చని అధికారులు తెలిపారు.చదవండి: నటికి జర్నలిస్టు అవమానకర ప్రశ్న : సిగ్గుచేటంటూ నెటిజన్లు ఫైర్కన్నీరుమున్నీరవుతున్న కుటుంబం అజిత్ అనుమానాస్పద మరణంతో అజిత్ తల్లిదండ్రులు రూప్ సింగ్ ,సాంత్రా దేవి శోకానికి అంతులేకుండా పోయింది. వైద్యవిద్య కోసం మూడెకరాల భూమి అమ్మినట్టు బంధువులు తెలిపారు. ఎన్నో కలలతో అజిత్‌ను విదేశాలకు పంపించాం, కానీ మనిషినే కోల్పోతామని అనుకోలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీ రవుతున్నారు. ఎలా చనిపోయాడనే దానిపై వివరణాత్మక దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.మరోవైపు అజిత్ గ్రామస్తులను కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. అజిత్ అదృశ్యం పట్ల త్వరగా స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతదేహాన్ని త్వరగా తిరిగి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతూ కమ్యూనిటీ సభ్యులు అల్వార్ జాట్ హాస్టల్లో సమావేశం నిర్వహించారు.దీనిపై కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర సింగ్ అల్వార్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏదో అనుమానాస్పదంగా అనిపిస్తోందంటూ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని తరలించేలా ఏర్పాటు చేయాలనీ, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కోరారు. ఇదీ చదవండి: Betting App Case: శిఖర్ ధావన్, రైనాపై సజ్జనార్ ఆగ్రహం -
NRI భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్.. పోలీసుల ఓవరాక్షన్!
NRI భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్డేట్స్...విజయవాడ..విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో ఎన్నారై భాస్కర్ రెడ్డి, అతని సోదరుడు ఓబుల్ రెడ్డికి ముగిసిన వైద్య పరీక్షలువైద్య పరీక్షల అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రి నుంచి కోర్టుకు తరలింపుకోర్టుకు తీసుకొచ్చిన సమయంలో నడవలేని స్థితిలో భాస్కర్ రెడ్డితనను పోలీసులు తీవ్రంగా కొట్టారంటున్న భాస్కర్ రెడ్డిసోషల్ మీడియా పోస్టుల కేసుతో పాటు భాస్కర్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు.సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టానని ఒప్పుకోవాలంటూ కోర్టు ప్రాంగణంలో భాస్కర్ రెడ్డిపై పోలీసుల ఒత్తిడిపోలీసుల బెదిరింపులపై ఆగ్రహం వ్యక్తం చేసిన భాస్కర్ రెడ్డి👉కూటమి ప్రభుత్వం ఎన్నారైలపై కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఎన్నారైలపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ వేధింపులకు గురిచేస్తోంది. తాజాగా వైఎస్సార్సీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఓ ఎన్నారైను అక్రమంగా అరెస్ట్ చేసింది. దీంతో, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.👉వివరాల ప్రకారం.. మాలపాటి భాస్కర్ రెడ్డి లండన్‌లో సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. భాస్కర్ రెడ్డి స్వగ్రామం కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలోని చోడవరం. అయితే, భాస్కర్ రెడ్డి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీకి అనుకూలంగా పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో భాస్కర్ రెడ్డిని టార్గెట్ చేసిన కూటమి సర్కార్ ఆయనపై కక్ష సాధింపు చర్యలకు దిగింది. ఈనెల ఒకటో తేదీన తన తండ్రి మరణంతో భాస్కర్ రెడ్డి.. లండన్ నుంచి స్వగ్రామం చోడవరం చేరుకున్నారు.👉అనంతరం, వైద్య పరీక్షల కోసం తాడిగడపలోని కామినేని ఆసుపత్రికి భాస్కర్ రెడ్డి వెళ్లారు. ఈ క్రమంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు.. భాస్కర్ రెడ్డితో పాటు అతని సోదరుడు ఓబుల్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో తనను అరెస్ట్ చేశారో.. ఎక్కడికి తీసుకువెళ్లారో అనే కనీస సమాచారం కూడా భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులు ఇవ్వలేదు. అరెస్ట్‌పై ప్రశ్నిస్తే పెనమలూరు పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. ఇక, తాజాగా వారిద్దరినీ వైద్య పరీక్ష నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు. -
శ్రీ శ్రీ రవిశంకర్‌కు వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు
బోస్టన్ గ్లోబల్ ఫోరం (The Boston Global Forum (BGF) , AI వరల్డ్ సొసైటీ (AIWS) నుంచి 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డును శ్రీ శ్రీ రవిశంకర్ ప్రదానం చేశారు.. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపన, వివాదాల పరిష్కారం, మానవతా సేవలలో ఆయన చేసిన అసామాన్య సేవలను గుర్తిస్తూ ఈ గౌరవం లభించింది. ఈ పురస్కార ప్రదాన కార్యక్రమం హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రముఖ శాస్త్రవేత్తలు, విశిష్ట అతిథుల సమక్షంలో జరిగింది.గత సంవత్సరం ఈ అవార్డు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్‌కు యూరప్ లోను , ప్రపంచవ్యాప్తం గాను శాంతి మరియు భద్రతను ప్రోత్సహించే దిశగా చేసిన నాయకత్వ కృషికి గుర్తింపుగా ప్రదానం చేశారు. ఇంతకుముందు ఈ ప్రతిష్టాత్మక గౌరవాన్ని అందుకున్నవారు:జర్మనీ ఛాన్సలర్ ఆంగెలా మెర్కెల్ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్జపాన్ మాజీ ప్రధాన మంత్రి షింజో అబేఫిన్లాండ్ అధ్యక్షుడు సౌలి నినిస్టోఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోడిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ ప్రజలతోఈ అవార్డు ప్రపంచ శాంతి కోసం కృషి చేసే అత్యున్నత గ్లోబల్ నాయకులకు అందించే అరుదైన గౌరవాల్లో ఒకటి. -
ఆటా, ఎస్ఏఐ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆటా (American Telugu Association ATA) అమెరికాలోని తెలుగు విద్యార్థులకు మద్దతుగా మరో అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించింది. స్టూడెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా -SAI తో కలిసి స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్, మిల్వాకీలో ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్‌కు స్టూడెంట్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. విద్యార్థుల అవగాహన, భద్రత, మరియు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారిస్తూ ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పలువురు నిపుణులు, కమ్యూనిటీ నాయకులు, ప్రొఫెసర్స్ తో పాటు పలువురు ప్రముఖులు పలు అంశాలపై ప్రసంగించారు. డీన్ , ప్రొఫెసర్ అరోరా.. విద్యార్థి జీవితాన్ని నావిగేట్ చేయడంతో పాటు విద్యార్థుల అకడమిక్ మరియు వ్యక్తిగత జీవితంలో విజయవంతం కావడానికి అవసరమైన మార్గదర్శకత్వం చేశారు. విద్యార్థుల భద్రత మరియు సెక్యూరిటీ వంటి ముఖ్యమైన అంశాలపై మిల్వాకీ పోలీస్ లెఫ్టినెంట్ కీలక సూచనలు చేశారు. హెల్త్ మరియు లైఫ్ ఇన్సూరెన్స్ ప్రాముఖ్యత గురించి ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ నిపుణులు కృష్ణ రంగరాజు వివరించారు. ప్రముఖ అటార్నీ సంతోష్ రెడ్డి సోమిరెడ్డి, ప్రముఖ అటార్నీ ప్రశాంతి రెడ్డి, ఇమ్మిగ్రేషన్ పాలసీలపై కీలక సూచనలు చేశారు. ఇమిగ్రేషన్ విషయంలో చేయవలసినవి, చేయకూడనవి విద్యార్థులకు చాలా చక్కగా వివరించారు.అమెరికా సాంస్కృతిక వాతావరణంలో ఎలా కలవాలి, స్థానిక కమ్యూనిటీలతో అనుసంధానం ఎలా పెంచు కోవాలి వంటి అంశాలపై ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లాతో పాటు పలువురు ప్రముఖులు ప్రసంగించారు. యూనివర్సిటీ క్యాంపస్ లైఫ్‌ని ఎలా సమర్థంగా ఎదుర్కోవాలి, ఇంటర్న్షిప్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి ప్రముఖులు రవి కాకి రెడ్డి, కె.కె. రెడ్డి వివరించారు. అలాగే కిరణ్ పాశం జూమ్ కాల్ ద్వారా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆటా సెక్రటరీ సాయినాథ్, ఆటా చికాగో సభ్యులు భాను, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఆటా విస్కాన్సిన్ రీజినల్ డైరెక్టర్స్ పోలిరెడ్డి గంట, చంద్ర మౌళి సరస్వతి, ఆట విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్స్ తో పాటు నిఖిల, కీర్తిక తదితరులు పాల్గొని ప్రసంగించారు.ఆటా మిల్వాకీ టీమ్ మరియు SAI సహకారంతో నిర్వహించిన ఈ స్టూడెంట్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. విద్యార్థుల అవగాహన, ఆత్మవిశ్వాసం, భద్రత వంటి అంశాల్లో బలమైన పునాది వేస్తూ.. ఇటువంటి కార్యక్రమం ఆటా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందని చెప్పవచ్చు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మార్గదర్శకంగా, ప్రేరణగా ఆటా నిలబడుతుందనడంలో సందేహం లేదు. -
బహ్రెయిన్‌లో మృతి చెందిన ఐదేళ్లకు గల్ఫ్ కార్మికుడి అంత్యక్రియలకు సన్నాహాలు
ఐదేళ్ల క్రితం బహ్రెయిన్‌లో మృతి చెందిన జగిత్యాల జిల్లా మెటుపల్లి కి చెందిన శ్రీపాద నరేష్ మృతదేహం అతిశీతల శవాగారంలో మగ్గుతోంది. భౌతికకాయాన్ని భారత్‌కు పంపించడం చేయడం సాధ్యం కాదని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేయడంతో... బహ్రెయిన్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు సమ్మతిస్తూ, మృతుని భార్య శ్రీపాద లత (మునికోట నాగమణి) నిరభ్యంతర పత్రంపై సంతకం చేశారుతదుపరి చర్యలకు కోసం కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట సంజయ్, మంగళవారం ప్రజా భవన్ లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణిని సందర్శించి మృతుడి సోదరుడు ఆనంద్ తో కలిసి నోటరీ అఫిడవిట్ (నిరభ్యంతర పత్రం) ను సీఎం ప్రజావాణి ఇంచార్జి డా. జి. చిన్నారెడ్డికి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డికి అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం, బహరేన్ లోని ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి అక్కడే అంత్యక్రియలు జరిగేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. మృతుడి సోదరుడు ధర్మపురి ఆనంద్ బహ్రెయిన్ వెళ్ళి అంత్యక్రియలకు హాజరుకానున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై అడ్వయిజరీ కమిటీ మెంబర్లు నంగి దేవేందర్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, సామాజిక సేవకులు మొరపు తేజ, ఆకుల ప్రవీణ్, బొజ్జ అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, బహరేన్ లోని సామాజిక కార్యకర్తలు డి.వి. శివకుమార్, కోటగిరి నవీన్ కుమార్, నోముల మురళి భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేసి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నారు. -
కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్‌రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్‌క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్‌రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. -
కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..
ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
ఘనంగా 'ఆటా' 19వ మహాసభల కిక్ ఆఫ్ వేడుక
బాల్టిమోర్: అమెరికా తెలుగు సంఘం (ATA) తన 19వ మహా సభలను పురస్కరించుకుని బాల్టిమోర్‌లో సన్నాహక కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు, 30 మంది ట్రస్టీలు, 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే తమ భారీ సదస్సును లాంఛనంగా ప్రారంభించినట్లు ప్రకటించారు. దేశం నలుమూలల నుండి సుమారు 300 మందికి పైగా ఆటా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.అమెరికా అంతటా వివిధ సేవా కార్యక్రమాలతో జాతీయ తెలుగు సంఘంగా పేరుపొందిన 'ఆటా' బాల్టిమోర్‌లో తన 19వ మహాసభలను, యువజన సదస్సును నిర్వహిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఈ మహాసభలు జరగనుంది. ఆటా బోర్డు సమావేశం తాజాగా బాల్టిమోర్‌లోని రెనైసాన్స్ హార్బర్ ప్లేస్ హోటల్లో విజయవంతంగా జరిగింది.ఆటా మహాసభల కిక్-ఆఫ్ ఈవెంట్లో స్థానిక తెలుగు కమ్యూనిటీకి చెందిన 450 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకలో ఉల్లాసభరితమైన సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రసంగాలు జరిగాయి. కిక్-ఆఫ్ మీట్ విజయవంతంగా రికార్డు స్థాయిలో 1.4 మిలియన్ల డాలర్లను సేకరించిందని ఆటా నాయకులు ప్రకటించారు. ఇది తెలుగు అమెరికన్ల ఐక్యత, అంకితభావాన్ని నొక్కి చెబుతూ ఒక ముఖ్యమైన నిధుల సేకరణ ప్రారంభాన్ని సూచించిందని తెలియజేశారు.ఆటా అధ్యక్షుడు జయంత చల్లా మాట్లాడుతూ, ‘‘బాల్టిమోర్, స్థానిక ఆర్గనైజింగ్ టీమ్‌లు అసాధారణమైన నిబద్ధతను అభిరుచిని ప్రదర్శించాయి. ఈ స్థాయి టీమ్‌వర్క్, కమ్యూనిటీ మద్దతుతో, 19వ ఆటా మహాసభ తెలుగు గుర్తింపును జరుపుకోవడంలో, యువ నాయకత్వాన్ని సాధికారికం చేయడంలో నిస్సందేహంగా కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతుంది’’ అని అన్నారు.బోర్డు సమావేశం, కిక్-ఆఫ్ ఈవెంట్‌ను అద్భుతమైన విజయవంతం చేసినందుకు బాల్టిమోర్ ఆర్గనైజింగ్ టీమ్, స్పాన్సర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ మద్దతుదారులకు ఆటా నాయకత్వం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది.తెలుగు సంస్కృతి, భాష, విద్య, యువత సాధికారత, వ్యాపార నెట్వర్కింగ్ అమెరికాలోనూ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మానవతా సేవను ప్రోత్సహించడానికి ఆటా అంకితమైందన్న విషయాన్ని తెలియజేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆటా నాయకత్వం బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌ను సందర్శించింది. ఇది 425,000ం చదరపు అడుగుల విస్తీర్ణంతో, అనేక సమావేశ గదులు, ఎగ్జిబిట్ హాళ్లు, స్థానిక హోటళ్లకు ప్రత్యక్ష ప్రవేశంతో విస్తరించి ఉంది.ఈ కిక్ ఆఫ్ మీటింగ్ లోనే 19వ ఆటా మహాసభల టీంను కూడా ప్రకటించింది. 19వ ఆటా మహాసభల కన్వీనర్‌గా మేరీలాండ్ కు చెందిన శ్రీధర్ బానాలను నియమించింది. కో ఆర్డినేటర్‌గా వర్జీనియాకు చెందిన రవి చల్లాను నియమించింది. నేషనల్ కో ఆర్డినేటర్‌గా శరత్ వేములను, డైరెక్టర్ గా సుధీర్ దమిడి, కో కన్వీనర్ గా అరవింద్ ముప్పిడి, కో కోఆర్డినేటర్ గా జీనత్ కుందూర్, కో నేషనల్ కో ఆర్డినేటర్ గా కౌశిక్ సామ, కాన్ఫరెన్స్ రీజినల్ కో ఆర్డినేటర్ తిరుమల్ మునుకుంట్ల, కో డైరెక్టర్ కిరణ్ అల తదితరులను నియమించింది.అలాగే మహాసభ కోర్ టీమ్‌కు వ్యూహాత్మక పర్యవేక్షణ, సహాయం అందించడానికి అనుభవజ్ఞులైన నిర్వాహకులు, వివిధ నైపుణ్యం కలిగిన సభ్యులతో కూడిన అడ్ హాక్ మానిటరింగ్ అండ్ సపోర్ట్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. రామకృష్ణ ఆల – నాష్విల్లే, టెన్నెస్సీ, రఘువీర్ మారిపెద్ది- టెక్సాస్, విజయ్ కుండూరు – న్యూజెర్సీ, జేపీ ముద్దిరెడ్డి – టెక్సాస్, రాజు కాకర్ల – పెన్సిల్వేనియా, మహీధర్ ముస్కుళ – ఇల్లినాయిను నియమించారు -
తెలివైన వాళ్లు ఇండియాను ఎందుకు వీడుతున్నారు?
డాలర్ డ్రీమ్స్...బీటెక్ చదవాలి.. అమెరికాకో..కెనడాకో.. జర్మనీకో ఎగిరిపోవాలి..ప్రతిష్టాత్మక యూనివర్శిటీలో చదువుకోవాలి. మంచి పేరు సంపాదించాలి. మంచి విజ్ఞనాన్ని ఆర్జించాలి. ఇలా ప్రతి సంవత్సరం లక్షలాది మంది తమ ఊరు, తమ నేల, తమ మనుషుల్ని వదిలి విదేశాలకు వెళ్తున్నారు. ఎవరో కలల కోసం, ఇంకెవరో అవకాశాల కోసం, మరెవరో గౌరవం కోసం..! కానీ ఆ ప్రయాణం ప్రతి ఒక్కరి గుండెల్లో ఒకే ప్రశ్నను లేపుతోంది. మన దేశం మన కలలను ఎందుకు ఆపలేకపోతోంది? భారతదేశం ఒక నేల మాత్రమే కాదు.. ఒక అనుభూతి..! జ్ఞానం, ధైర్యం, సంస్కారం కలిసిన ఒక శ్వాస..! అయినా కూడా ఈ పవిత్ర గడ్డపైనే పుట్టినవాళ్లు బయటకు ఎందుకు పరుగెడుతున్నారు? ఇది కేవలం వలస కథ కాదు.. ఇది మనసుల వేదన.. ఇది ఆశల కొత్త దిశలో పుట్టిన తపన..! ఇంతకీ ఎందుకిలా జరుగుతోంది? భారతీయులు ఇండియాను ఎందుకు వదిలి వెళ్లిపోతున్నారు? నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడకుందాం.. కాసేపు దేశభక్తిని పక్కనపెడదాం.. దేశంపట్ల బాధ్యత కలిగిన వ్యక్తులగానే చర్చించుకుందాం.. అసలు ఈ సమస్యకు కారణమేంటి తెలుసుకుందాం. నిజానికి భారత్ నుంచి బయలుదేరే ఈ ప్రయాణం కొత్తది కాదు.. బ్రిటీష్ కాలం నుంచే విదేశాలకు వెళ్లే మార్గం తెరుచుకుంది.. ఆ రోజుల్లో జీవనోపాధి కోసం సముద్రాలు దాటారు. తరువాతి కాలంలో బెంగళూర్, హైదరాబార్, గురుగ్రామ్ నగరాలనుంచి యువత విదేశాల తరలిపోయారు. చాలామంది అక్కడే స్థిరపడిపోయారు కూడా. మన దేశంలో చిన్న వయసు నుంచే పోటీ జీవితంలో ఒక భాగమవుతుంది.ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ సీటు కోసం పోటీ. ఇక చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం కొత్త పోరాటం. టాలెంట్ ఉన్నవాడికి తగిన గౌరవం దక్కడం అరుదుగా మారిపోయింది. ఇక్కడ పరిచయాలు చాలా సార్లు ప్రతిభ కంటే పెద్దవిగా మారుతాయి. అసలు కష్టపడి పనిచేసిన వాడే అవకాశాలు కోల్పోతున్నాడు. అదే మనసులో మిగిలిన నిరాశ ఆలోచనగా మారుతోంది. ఇక్కడ కష్టపడి పనిచేస్తే ఫలితం రాదని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. జీవన ప్రమాణాలూ కారణమా?అంతేకాదు.. ఇండియాలో జీవన ప్రమాణాలు కూడా చాలా నాసిరకంగా ఉంటాయి. నగరాల్లో కాలుష్యం, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. వాతావరణం, పరిశుభ్రత, నకిలీ మందులు. కచ్చిత పనిగంటల పనివిధానం. మరోవైపు విదేశాల్లో జీవన విధానం మనకు కొత్త ప్రపంచంలా అనిపిస్తుంది. నిబంధనలు స్పష్టంగా ఉంటాయి.. ప్రతి ఒక్కరి శ్రమకు గౌరవం ఉంటుంది. ఎవరైనా కష్టపడి పనిచేస్తే, ఆ కష్టం వృథా కాదనే నమ్మకం అక్కడ బలంగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలూ ఎక్కువే. టెక్నాలజీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, పరిశోధన లాంటి రంగంలో ప్రపంచం తలుపులు తెరుస్తోంది. సమాన అవకాశాలు, సమాన గౌరవం అనే వాతావరణం విదేశాల్లో కనిపిస్తోంది. మరోవైపు భారతీయులు విదేశాలకు వెళ్లడానికి ఆర్థిక భద్రత కూడా ఒక పెద్ద కారణం. నిజానికి ఇతర దేశాల్లో కూడా పన్నులు ఎక్కువే ఉంటాయి. అయితే అవి ఎక్కువగా ఉన్నా వాటి వినియోగాన్ని ప్రజలు చూస్తారు. ఇక్కడ పన్నులు చెల్లించినా అభివృద్ధి కనిపించదు. రోడ్లకు గుంతలే కనిపిస్తాయి. విద్యుత్ కోతలు కూడా వేధిస్తాయ్.. ఆస్పత్రుల సేవల్లో ఆలస్యం ఉంటుంది. చెప్పాలంటే ప్రభుత్వ రంగసంస్థల్లో పనిచేస్తున్న వాళ్లలో చాలామందికి బాధ్యత ఉండదన్న అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయింది. ఇటు కొంతమంది నిబద్ధతతో పనిచేయాలన్న ఆసక్తి ఉన్నా వ్యవస్థ దాన్ని అడ్డుకుంటుంది. ప్రతిభకు గౌరవం దక్కకపోవడం, అవినీతి పెరగడం, భవిష్యత్తుపై అనిశ్చితి లాంటివి భారతీయులను విదేశాలవైపు వెళ్లేలా చేస్తున్నాయి.ఒక్కసారి మీరే ఆలోచించండి... మన దగ్గర మంచి చదువు చదివిన వాళ్లు, తెలివైన వాళ్లు బ్యాగ్ వేసుకుని విదేశాలకు ఎందుకు వెళ్లిపోతున్నారు? అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా.. ఇలా ఎక్కడైనా ఛాన్స్ దొరికితే వెళ్లిపోతున్నారు. వారి తెలివితేటలు, విజ్ఞానం మనకెందుకు దూరంగా పోతున్నాయి? ఇది చూసి చాలామందికి 'అబ్బే డబ్బుల కోసం వెళ్లిపోతున్నారు' అని అనిపించవచ్చు. కానీ అది నిజం కాదు. చదువుల్లో టాపర్స్, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్ లాంటి సంస్థల్లో సీట్లు సాధించిన వారు, చదువు పూర్తి చేసిన వెంటనే అమెరికా అనీ, యూరప్ అనీ, ఆస్ట్రేలియా అంటూ పక్క దేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్తున్నారంటే దీనికి కారణం కేవలం విలాసంగా బతకాలన్న కోరికా కాదండి. అలా వెళ్లేవాళ్లని అడిగితే 'ఇండియాలో నేను ఎంత పని చేసినా గుర్తింపు లేదు', 'రీసెర్చ్ చేయాలన్నా ఫ్రీడమ్ లేదు', 'నన్ను నమ్మే వాతావరణమూ లేదు' అని చెబుతున్నారు. వాస్తవానికి చాలామంది మేధావులు తమ టాలెంట్‌ను ఉపయోగించుకోవటానికి, అభివృద్ధి చేసుకోవటానికి సరైన ప్లాట్‌ఫామ్ కోసం వెతుకుతుంటారు. వారి పరిశోధనలకు అవసరమైన వనరులు, స్వేచ్ఛ, ప్రోత్సాహం లాంటివి ఇండియాలో లేవన్నది ఎక్కువగా వినిపిస్తున్న విమర్శ. ఇదీ చదవండి: క్యాబ్ డ్రైవర్ నుంచి కోటీశ్వరుడిగా.. ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీఎంతమంది?ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 2022లో 2,25,260 మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదిలేశారు. 2023లో కూడా దాదాపు 2,16,219 మంది అదే పని చేశారు. 2014లో ఈ సంఖ్య 1,29,234 మాత్రమే ఉండగా, 2011 నుంచి 2023 మధ్య మొత్తం 19 లక్షల మంది భారతీయులు ఇండియా పాస్‌పోర్ట్‌ను వదిలేశారు. మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ ప్రకారం 2014 నుంచి ఇప్పటి వరకు 23,000 మంది భారతీయ మిలియనీర్లు దేశం వదిలి వెళ్లిపోయారు. ఇదే సమయంలో, 2014 నుంచి 2022 మధ్యలో భారత బిలియనీర్ల ఆస్తులు 280శాతం పెరిగాయి, అంటే దేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటుకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఒకవైపు మధ్యతరగతి, ప్రతిభావంతులు అవకాశాల కోసం దేశం వదిలిపెడుతుంటే, మరోవైపు అత్యంత ధనవంతులు తమ భవిష్యత్ భద్రత కోసం విదేశాల్లో స్థిరపడుతున్నారు.ఇక బ్రెయిన్ డ్రెయిన్ అంటే కేవలం ఒక గణాంకం కాదు.. ఇది దేశం కోల్పోతున్న మేధస్సు! ప్రతి ప్రతిభావంతుడు బయటకు వెళ్లినప్పుడల్లా మన భవిష్యత్తు కొంత వెనుక్కు వెళ్లిపోతుంది. ఇక్కడ అసలైన ప్రశ్న ఏంటంటే.. మన దేశం ఇలా మేధస్సును పోగొట్టుకోవడం ఆపాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా, ఇక్కడే ఉన్నత స్థాయి అవకాశాలు కల్పించాలి. పరిశోధనకు పెట్టుబడి పెట్టాలి. యువతను ప్రోత్సహించే విధానాన్ని అభివృద్ధి చేయాలి. టాలెంట్‌ను గుర్తించి, ప్రోత్సహించాలి. అవార్డులు, గ్రాంట్లు, రిస్క్ తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. సొంతదేశంలోనే అందరూ గర్వంగా ఎదిగేలా చేయాలి. ఎందుకంటే.. ఒకరు దేశాన్ని వదిలి వెళ్ళినప్పుడు, అది కేవలం వ్యక్తిగత నిర్ణయం కాదు. అది సమాజం, వ్యవస్థ ఇచ్చిన సిగ్నల్ కూడా. ఈ సిగ్నల్‌ను మార్చేది మనమే..కానీ అది ఎప్పటికి సాధ్యమవుతుందో కాలమే నిర్ణయించాలి.


