
మలేషియా (malaysia) రాజధాని నగరం కౌలాలంపూర్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా శనివారం జరిగాయి. తెలంగాణా ఆడబిడ్డల గౌరవ ప్రతీక, ప్రకృతి పండుగ, బతుకమ్మలను వివిధ రకాల పూలతో అలంకరించారు. తెలుగు మహిళలు సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబై, బతుకమ్మ ఆటపాటలతో సందడిగా గడిపారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా ఆడిపాడారు. అనంతరం ప్రసాదాలను ఒకరికొకరు పంచుకొని గౌరమ్మను నిమజ్జనం చేశారు.


కౌలాలంపూర్‌లోని బ్రిక్స్‌ఫీల్డ్స్‌లోలోని కృష్ణా టెంపుల్‌లో ఈ వేడుకలను అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఎన్‌ఆర్‌ఐ కల్చరల్ అసోసియేషన్ మలేషియా (Federation of nri cultural association malaysia) ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు డిప్యూటీ హైకమీషనర్ సుభాషిణి నారాయణన్, పెరెక్ స్టేట్ లెజిస్లేటివ్ సభ్యురాలు శాంతి చిన్నసామి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ప్రతీ ఏడాది బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం తమకు ఆనవాయితీ అని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, వాసంతిసిన్ని సామిమలేషియాలో భారతీయవారసత్వాన్ని జీవం పోసేందుకు ఎఫ్ఎన్సీఏ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇండియన్ డిప్యూటీ హై కమీషనర్ శ్రీమతి సుభాషిణినారాయణన్ గారు మహిళలతో చేరి ఆడి పాడి సందడి చేసారు . అలాగే ప్రవాసీ భారతీయులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురయినా ఇండియన్ హై కమిషన్ ఎల్లపుడు సహాయం చేయడానికి ముందుంటుందని హామీ ఇచ్చారు.
అత్యంత అందంగా అలంకరించిన బతుకమ్మకు బంగారు నాణెం బహుమతి అందించారు. అలాగే బతుకమ్మలు తీసుకొచ్చిన మహిళలందరికీ వారందరికీ వెండి నాణేలు కానుకగా ఇచ్చారు. ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలకు వెండి బహుమతులు. మలేషియాలో ఉన్న తెలుగు రెస్టారెంట్లు స్పాన్సర్ చేసిన గొప్ప విందు, ఇందులో ప్రామాణిక తెలుగు వంటకాలు ప్రదర్శించారు.
తెలుగు ఎక్సపెట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్ , కోశాధికారి నాగరాజు , మలేషియా ఆంధ్రా అసోసియేషన్ విమెన్ప్రెసిడెంట్ శారదా , భారతీయ అసోసియేషన్ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ సత్య, విమెన్ప్రెసిడెంట్ గీత హజారే , భరత్ రాష్ట్ర సమితి మలేషియా వైస్ ప్రెసిడెంట్ అరుణ్, మలేషియా తెలుగుఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , మలేషియా తెలుగు వెల్ఫేర్ & కల్చరల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ మూర్తి గారు , తెలుగు ఇంటెలెక్చ్యువల్ సొసైటీ అఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు పాల్గొన్నారు.
ఎఫ్ఎన్సీఏ మలేషియా అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తన స్వాగత ప్రసంగంలో, విదేశాల్లో సాంస్కృతికసంప్రదాయాలను కాపాడుకోవడం మరియు భారతీయ ప్రవాసుల మధ్య ఐక్యతను పెంపొందించడం యొక్కప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమాన్నినిర్వహించడానికి సహకరించినస్పాన్సర్లు రాప్పినో టెక్ సొల్యూషన్స్ , టూట్కర్ సొల్యూషన్స్ ,సెంట్రల్ స్పైస్ ,టెక్మ్యాట్రిక్స్ ,రెడ్‌వేవ్ సొల్యూషన్స్ , టెక్‌డార్ట్ ,స్ప్రౌట్అకాడమీ ,బిఆర్ఎస్ మలేషియా ,జాస్ బెలూన్స్ అండ్ డెకరేటర్స్ ,లులు మనీ , బిగ్ సివెడ్డింగ్ కార్డ్స్ , శ్రీ రుచి రెస్టారెంట్, జబిల్లి , మై బిర్యానీ , శ్రీ బిర్యానీ ,స్పైసీ హబ్, ఫ్యామిలీ గార్డెన్, మైఫిన్ MY81 , MY81 , మెరిడియన్ , ఎన్ఎస్ టూర్స్ & ట్రావెల్స్ మరియు , స్వచ్ఛంద సేవకులు మరియు కోర్ కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞత లుతెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరెడ్డిమోహన్ రెడ్డి, సహాధ్యక్షులు కృష్ణముత్తినేని,ఉపాధ్యక్షులు రవి వర్మకనుమూరి,ప్రధాన కార్యదర్శి శివ సానిక,సంయుక్త కార్యదర్శిభాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజ శేఖర్ రావుగునుగంటి,యువజన విభాగం అధ్యక్షులు క్రాంతి కుమార్ గాజుల,సాంస్కృతికవిభాగం అధ్యక్షులు సాయి కృష్ణ జులూరి, కార్యనిర్వాహకసభ్యులు నాగరాజుకాలేరు,నాగార్జున దేవవరపు, ఫణీంద్రకనుగంటి,సురేష్ రెడ్డి మందడి , రవితేజ శ్రీదాస్యాం, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి ,మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా ప్రవళిక రాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యురాలు సూర్య కుమారి , రజిని పాల్గొన్నారు.