bathukamm celebrations
-
TCUK ఆధ్వర్యంలో తొలిసారి యూకేలో బతుకమ్మ వేడుకలు
సౌతెండ్, యునైటెడ్ కింగ్డమ్లో TCUK ఆధ్వర్యంలొ ప్రప్రధముగా తెలంగాణ బతుకమ్మ దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఎస్సెక్స్ లోని సౌతెండ్, బాసిల్డ్న్ , చెల్మ్సఫోర్డ్ , తుర్రోక్ కౌన్సిల్ ఉంచి దాదాపు 450 మన తెలుగు వాళ్ళు అందరు ఒక్కదగ్గర చేరి బతుకమ్మ దసరా సంతోషంగా జరుపుకున్నారు. గుర్రం మల్లారెడ్డి, గుర్రం లావణ్య నేతృత్వంలో ఈ ఈవెంట్ స్వచ్చందంగా నిర్వహించారు.తెలంగాణ ఆడపడుచులు అందమైన బతుకమ్మ పేర్చికొని వచ్చారు. దసరా జమ్మి ఆకూ మొగవాళ్ళు ఇచ్చుకొని అలాయి బలయ్ చెప్పుకోవడం జరిగింది. ఈ ఈవెంట్ కి సౌత్జెండ్ కౌన్సిలర్స్ క్రిస్ వెబ్‌స్టర్ , పమేలా కిన్సేల్ల, సామ్ అల్లెన్, షాహిద్ నదీమ్, జేమ్స్ మొరిషన్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. చివరగా తెలంగాణ వంటకాలతో విందు ఆరగించి, దసరా, బతుకమ్మ సంబరాలు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఇలాంటి వేడుకలు భవిష్యత్తులోమరెన్నో జరగాలని అందరూ ఆకాంక్షించారు. -
జర్మనీలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ బెర్లిన్‌లో బతుకమ్మ పండుగా 10 వార్షికోత్సవం అలాగే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. శనివారం బెర్లిన్‌లో ఈ వేడుక అద్భుతంగా జరిగింది. దశాబ్దంగా ఈ బతుకమ్మ పండుగా బెర్లిన్‌లో జరుతుండటం మరింత విశేషం. ఈ వేడుకలో తెలంగాణకు చెందిన వారు, తెలుగు సంతతికి సంబంధించిన విభిన్న నేపథ్యల వారు పాల్గొని వేడుకగా జరుపుకున్నారు. బెర్లిన్ తెలంగాణ కమ్యూనిటీ అక్కడ దొరికే తాజా పూలతో అద్బుతంగా బతుకమ్మను తయారుచేశారు. ఈ పండుగ ఒక విధంగా మనలో దాగున్న కళను వెలికి తీయడమే గాక మన ఐక్యతను గుర్తు చేస్తుందని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో తెలుగంణ సంప్రదాయ వంటకాలు హైలెట్‌గా నిలిచాయి. పాకశాస్త్ర నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్న అతిధులకు తెలంగాణ వారసత్వ వంటకాలను తమదైన శైలిలో తయారుచేసి రుచిచూపించారు. ఈసారి బెర్లిన్ తెలంగాణ అసోషియేషన్ తమ కమ్యూనిటిలోకి విభిన్న సాంస్కృతిక కమ్యూనిటీ నాయకులను కూడా చేర్చకోంది. అంతేగాదు బెర్లిన్‌లో కాస్మోపాటిటన్ వాతావరణానికి అర్థం పట్టేలే ఈ బతుకమ్మ పండుగ వేడుకలో విభిన్న వర్గాల ప్రతినిధులు హాజరవ్వడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా బెర్లిన్‌లో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు జరిగాయి. జర్మనీలోని తెలంగాణ అసోసీయేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘ చలిగంటి ఈ వేడుకును ఇంతలా జయప్రదం చేసిన వాలంటీర్లకు, బెర్లిన్ తెలంగాణ అసోసీయేషన్ కమ్యూనిటీ బృందానికి హృదయపూర్వక ధన్వావాదాలు తెలిపారు. తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేలా ప్రోత్సహించడానికి వారి చేస్తున్న అచంచలమైన కృషిని, నిబద్ధతను కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో జర్మనీ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా రఘు చలిగంటి (అధ్యక్షుడు), బాల్‌రాజ్ అందె (కోశాధికారి), రమణ బోయినపల్లి (వైస్ ప్రెసిడెంట్), అలేక్య బి (సాంస్కృతిక కార్యదర్శి), శరత్ రెడ్డి (కార్యదర్శి), యోగానంద్ (మీడియా కార్యదర్శి), శ్రీనాథ్ (మీడియా కార్యదర్శి), నటేష్ అండ్ మిస్టర్ నరేష్ (ఆఫీస్ బేరర్స్) తదితరులు పాల్గొన్నారు. (చదవండి: సింగపూర్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరం!) -
Dallas Bathukamma : డాలస్‌లో సందడి చేసిన టీపాడ్ చిన్నబతుకమ్మ
తెలంగాణ సంస్కృతిని అమెరికా గడ్డపై వికసింపజేస్తున్న తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్ (TPAD).. ఈ ఏడాది మరింత ఉత్సాహంతో బతుకమ్మ వేడుకలకు శ్రీకారం చుట్టింది. దాదాపు వేయి మంది మహిళలు అందంగా తీర్చిదిద్దిన తమ బతుకమ్మలతో కుటుంబసభ్యులను వెంటబెట్టుకుని వచ్చి డాలస్‌లోని ఆండ్రివ్ బ్రోన్ పార్క్ ఈస్ట్‌లో సందడి చేశారు. మహిళలందరూ బృందవలయాలుగా ఏర్పడి పాటలు పాడుతూ బతుకమ్మను కొలుస్తూ పులకించిపోయారు. తెలంగాణ నేల నుంచి పూల పండుగే తరలివచ్చిందన్న చందంగా వేడుక సాగింది. పండుగ నిర్వహణకు ప్రత్యేక కమిటీలు చిన్నబతుకమ్మ పండుగను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బీవోటీ చైర్ సుధాకర్ కలసాని, ప్రెసిడెంట్ లింగారెడ్డి అల్వ, కోఆర్డినేటర్ రోజా ఆడెపు నేతృత్వం వహించారు. టీపాడ్ పూర్వ అధ్యక్షులు రమణ లష్కర్, ఉపాధ్యక్షులు అనురాధ మేకల, కార్యదర్శి రత్న ఉప్పల సూచనలు సలహాలు అందించారు. చిన్నబతుకమ్మ పండుగకు చైర్‌గా గాయత్రి గిరి, కో-చైర్‌గా అనుషా వనం, అడ్వయిజర్‌గా ఇంద్రాణి పంచెర్పుల తమ సేవలందించారు. హరిశంకర్‌రెడ్డి రేసు, ప్రశాంత్ నిమ్మని.. హాజరైన ప్రతి ఒక్కరికి పులిహోర, దద్దోజనం, మిఠాయిలు వడ్డించి తాము పుట్టిపెరిగిన ప్రాంతపు మధురజ్ఞాపకాలను గుర్తుకొచ్చేలా చేయడమే కాకుండా అందరి మన్ననలు అందుకున్నారు. ఆడియో, సౌండ్ సిస్టమ్ బాధ్యతలు స్వీకరించిన బాల గణపవరపు, నరేశ లింగంపల్లి.. మూడు గంటల పాటు బతుకమ్మ పాటలతో హుషారు నింపి హోరెత్తించారు. బతుకమ్మల నిమజ్జనం కోసం శ్రావణ్ నిడిగంటి, సుచేంద్రబాబు ప్రత్యేకంగా టబ్‌లు ఏర్పాటు చేయడం, నీటి సదుపాయం కల్పించడం వంటి పనులు చూసుకున్నారు. రవాణా వ్యవహారాలను సంతోష్ రేగొండ, భోజన సదుపాయాలను సంతోష్, సోషల్ మీడియా వ్యవహారాలను మధుమతి వైశ్యరాజు, ఆదిత్య గాదె చూసుకున్నారు. రిసెప్షన్ బాధ్యతలు మాధవి మెంట, దీపికారెడ్డి చూసుకోగా, శశిరెడ్డి, మాధవి ఓంకార్ డెకరేషన్ దగ్గరుండి చేయించారు. అక్టోబర్ 21న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలకు ఏర్పాటు అక్టోబర్ 15 ఆదివారం రోజున చిన్న బతుకమ్మ పండుగతో బతుకమ్మ-దసరా వేడుకలకు అంకురార్పణ చేసిన టీపాడ్.. అక్టోబర్ 21న మెగా వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఏటా పదివేల మందితో సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆకర్షించిన టీపాడ్.. ఈ దఫా మరింత వైభవంగా ఆర్గనైజ్ చేస్తున్నది. ఈ వేడుకలకు డాలస్‌లోని కొమెరికా సెంటర్ (పెప్పర్ ఎరెనా) వేదికగా నిలుస్తున్నది. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకలు అర్ధరాత్రి వరకు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. విశేష అతిథిగా సంయుక్తామీనన్, రాఫెల్ ప్రైజ్‌గా బీఎండబ్ల్యూ బైక్ సినీ కథానాయిక సంయుక్తామీనన్ విశేష అతిథిగా హాజరవనున్న ఈ పండుగలో సుప్రసిద్ధ గాయకులు తమ గాత్రంతో వీనులవిందు చేయనున్నారు. వేడుకల్లో భాగంగా రాఫెల్ ప్రైజ్‌లను అందజేయనున్నారు. వీటిలో బీఎండబ్ల్యు బైక్, బంగారు నాణేలు, పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్, ఆర్టిఫిషియల్ జువెల్లరీతో పాటు గిఫ్ట్ ఓచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యు బైక్ మరియు రాఫెల్ ప్రైజ్‌లను మాధవి లోకిరెడ్డి, హారిక పాల్వాయి అనౌన్స్ చేశారు. వేడుకల వివరాల కోసం టీపాడ్ వెబ్సైట్ టీపాడ్యూఎస్.ఓఆర్జీను బ్రౌజ్ చేయొచ్చు. -
Bathukamma: పండగ వెనుక ఎన్ని కథలున్నా.. బతుకమ్మ ప్రత్యేకత ఇదే
బతుకమ్మ అంటే ఒక సంబరం. ఒక సాంస్కృతిక వారసత్వం. ఒక ఆధ్యాత్మిక ఉత్సవం. అందుకే బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడుతూ ఉత్సాహంగా జరుపుకుంటారు. ప్రకృతిలో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు పల్లె మహిళలు. తెలంగాణ జిల్లాల్లో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగే ఇది. ఏటా భాద్రపద మాసంలో బహుళ అమావాస్య నుంచి ఆశ్వీయుజ మాసం శుద్ధ అష్టమి వరకు జరుగుతుంది. తొమ్మిది రోజులపాటు తీరొక్క పూలతో అందగా బతుకమ్మను పేరుస్తారు ఆడబిడ్డలు. బతుకమ్మ తెలంగాణ ప్రజల బతుకుల్లో భాగం. వారి జీవన విధానంలో మమేకమై ఆనాదిగా ఆచారంగా వస్తున్న పండుగే బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందంటే చాలు వారం, పది రోజులు ఒక్కటే సందడిగా మారుతుంది. కొత్త బట్టలు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో కష్టాసుఖాలను పాటల రూపంలో పలికే పండుగ ఇది. సిబ్బి లేదా పళ్ళెం, తాంబాలంలో అడుగున ఆకులు పరిచి, తంగేడు, గునుగు పూలతో పాటు ప్రకృతిలో దొరికే ఏ పువ్వయినా బతుకమ్మలో పేర్చుతారు. బతుకమ్మ మధ్యలో గౌరమ్మను అలకరించి పసుపు కుంకుమ అక్షింతలు వేసి, తమ ముత్తయిదువతానాన్ని నిలిపే గౌరవమ్మను భక్తిగా పూజిస్తారు. రకరకాల పువ్వులతో దేవతలను పూజించటం హైందవ సంప్రదాయం. అయితే పువ్వుల రాశినే దేవతా మూర్తిగా భావించి పూజ చేయటమే ఈ పండుగ ప్రత్యేకత. బతుకమ్మలను ఒకచోట చేర్చి.. ఆడపడుచులంతా చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతూ ఉత్సాహంగా వేడుక జరుపుకుంటారు. ప్రకృతితో మమేకమై తాము పడ్డ బాధలను కష్టాలను మర్చిపోతారు మహిళలు. బతుకమ్మ వెనుక ఎన్ని కథలున్నా.. ఎంత చరిత్ర ఉన్నా బతుకమ్మ అచ్చంగా మనదైన పండుగ, మన ఆడపడుచుల పండుగ. -
Dubai: బుర్జ్ ఖలీఫాపై బంగారు ‘బతుకమ్మ’
తెలంగాణ బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. మన సాంస్కృతిక వైభవం ‘జై బతుకమ్మ’, ‘జై తెలంగాణ’, ‘జై కేసీఆర్’ అంటూ బుర్జ్ ఖలీఫాపై జిగేల్మని మిరుమిట్లుగొలిపింది. పూల సంబురం విశ్వవిఖ్యాతికెక్కింది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ‘బతుకమ్మ’ను విశ్వ వేదికపై ప్రదర్శించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత చొరవతో దుబాయిలోని అతి ఎత్తయిన కట్టడం బుర్జ్ ఖలీఫా తెరపై బతుకమ్మ విశిష్టతను చాటేలా ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. బతుకమ్మ పండుగపై రూపొందించిన మూడు నిముషాలు నిడివిగల వీడియోను శనివారం రాత్రి 9.30కు, తిరిగి 10.30కు రెండు పర్యాయాలు ప్రదర్శించారు. ‘జై తెలంగాణ’, ‘జై హింద్’నినాదాలతో పాటు బతుకమ్మ చిత్రాలు, ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రాన్ని బుర్జ్ ఖలీఫా తెరపై ప్రదర్శించారు. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫా తెరపై కనిపించగానే కార్యక్రమానికి హాజరైన తెలంగాణ వాసులు హర్షం వ్యక్తం చేశారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు బతుకమ్మ వీడియోను తిలకించారు. దేశానికే గర్వకారణం: కవిత బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం దేశానికే గర్వకారణమని, చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహ్మాన్, ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది బతుకమ్మ పాటను రూపొందించడం పట్ల అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సురేశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎమ్మెల్యేలు షకీల్ అహ్మద్, జీవన్‌రెడ్డి, జాజుల సురేందర్, డాక్టర్ సంజయ్, బిగాల గణేష్ గుప్తా, తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్, దాస్యం విజయ్ భాస్కర్, యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస తెలంగాణ వాసులు పాల్గొన్నారు. -
పూలవనం.. వైభవంగా తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు
-
లండన్‌లో కన్నులపండువగా బతుకమ్మ వేడుకలు
లండన్: ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ సాగే బతుకమ్మ పాటలతో లండన్ నగర వాసులు పులకించిపోయారు. రంగురంగుల పూలతో చేసిన బతుకమ్మలు, వాటి చుట్టూ ఆడపడుచుల చప్పట్లు, కట్టె కోలాటాలతో ఆంగ్లేయుల రాజధాని కొత్త శోభను సంతరించుకుంది. ఈసారి జరిగిన వేడుకల్లో లండన్ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాదు లండన్ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, స్థానిక మేయర్ బిష్ణులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కోలాహాలంగా ఈ వేడుకలు జరిగాయి. 1500ల మందితో లండన్‌లో తెలంగాణ ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దాదాపు 1500ల మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీంతో ఈ ఏడాది కూడా యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ నిర్వహించి చరిత్ర సృష్టించారు. మొదట దుర్గా పూజతో వేడుకలు ప్రారంభించారు. అనంతరం ఇండియా నుంచి ప్రత్యేకంగా తెచ్చిన జమ్మి చెట్టు కు పూజ నిర్వహించారు. ఆ తర్వాత బతుకమ్మ ఆట, కట్టే కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన లండన్ డిప్యూటీ మేయర్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ... భారత దేశ సంస్కృతి, కళలని ప్రోత్సహిస్తున్న తెలంగాణ ఎన్నారై ఫోరంని అభినందించారు. పువ్వులనే దేవతగా పూజించే సంస్కృతి ఎంతో గొప్పదని కొనియాడారు. అరుదైన సందర్భం భారతీయ సంప్రదాయాలు కాపాడలిసిన బాధ్యత ఎన్నారైల పైన ఉందని లండన్ ఎంపీ వీరేంద్ర శర్మ అన్నారు. తొమ్మిదేళ్లుగా బతుకమ్మ కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేసినందుకు తెలంగాణ ఎన్నారైలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మరో లండన్ ఎంపీ సీమా మల్హోత్రా మాట్లాడుతూ.. వేల మంది మహిళలు ఒక్క చోట కలిసి పండుగ చేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుందని, అలాంటి సందర్భంగం బతుకమ్మతో వచ్చిందన్నారను. బతుకమ్మలో తనను భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కళలకు ప్రచారం ఈ వేడుకల్లో పాల్గొన్న స్థానిక మేయర్ బిష్ణు మాట్లాడుతూ... లండన్‌లో హిందూ పండుగల నిర్వహించడం, భారతీయ సంప్రదాయాలని సజీవంగా ఉంచడాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్ గౌడ్ అంతటి మాట్లాడుతూ.. యూరోప్ లోనే అతి పెద్ద బతుకమ్మ నిర్వహించేందుకు సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. సిద్ధిపేట గొల్లభామ, సిరిసిల్ల చేనేత, ఫిలిగ్రి , పెంబర్తి ఇత్తడి , నిర్మల్ బొమ్మలని వివిధ దేశాల్లో ప్రచారం చేస్తున్నామని వివరించారు. 2017 నుంచి లండన్‌లో బతుకమ్మ పండుగని ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ చెప్పారు. అందరి కృషితో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వ్యవస్థాపక చైర్మన్ గంప వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గంగసాని ప్రవీణ్ రెడ్డి, రంగు వెంకట్, కార్యదర్శి మహేష్ జమ్మల వెంకట్ స్వామి, బాలకృష్ణరెడ్డి, మహేష్ చాట్ల, నరేంద్ర వర్మ, స్వామి ఆశ రాజు కొయ్యడ, ఆకుల శ్రీనివాస్, వెంకట్‌రెడ్డిలు కృషి చేశారు. మహిళా విభాగం నుంచి మీనా అంతటి, వాణి అనసూరి, శౌరి గౌడ్, జయశ్రీ, సవిత జమ్మల, దివ్య, అమృతలు కీలకంగా వ్యవహరించారు. ఈ వేడుకల నిర్వాహణకు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారం అందించింది. వేడుకలు ముగిసిన తర్వాత బాలాజీ లడ్డూ ప్రసాదం అందించారు. -
అట్టహాసంగా పోలీస్ బతుకమ్మ సంబురాలు
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9న సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మిస్ యూనివర్స్ సింగపూర్ 2021గా గెలిచిన తెలుగు అమ్మాయి నందిత బన్నను సొసైటీ సభ్యులు సత్కరించారు. ప్రతీ ఏడూ సుమారు రెండు నుండి మూడు వేల మంది పాల్గొనే ఈ వేడుకల్లో పాల్గొనేవారు. ఈసారి కోవిడ్ నిబంధనల కారణంగా వర్చువల్‌గా నిర్వహించారు. సుమారు పదమూడేళ్ల నుంచి సింగపూర్ లో బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు పండుగ ప్రాముఖ్యతని తెలియజేస్తున్న టీసీఎస్ఎస్ని ఎమ్మెల్యే రఘునందన్ రావు అభినందించారు. ఈ వేడుకలు నిర్వహించడంలో టీసీఎస్ఎస్ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్‌రెడ్డి, కోశాధికారి లక్ష్మణ్ రాజు కల్వలతో పాటు కార్యవర్గ సభ్యులు కృషి చేశారు. -
బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు : హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట : రాష్ర్ట ప్రజలందరికీ మంత్రి హరీష్ రావు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుటుంబసమేతంగా సిద్ధిపేటలోని కోమటి చెరువు వద్ద జరుగుతున్న బతుకమ్మ సంబురాలను వీక్షించారు. ఇతర దేశాల్లోనూ ఘనంగా పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు. కరోనా వల్ల కొంత ఇబ్బంది ఉన్నా సోషల్ డిస్టన్స్ పాటిస్తూ ప్రజలు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారన్నారు. తెలంగాణలో వర్షాలు బాగా పడటంతో చెరువులు నిండుకుండటా మారి కళకళలాడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. కోవిడ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని మంత్రి హరీష్ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. (సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు: కల్వకుంట్ల కవిత) -
సంబురాల సద్దుల బతుకమ్మ
సాక్షి, వరంగల్ : జిల్లాలో సద్దుల బతుకమ్మ సంబురాలు జోరుగా సాగుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆడపడుచులు ఆనందోత్సవాల మధ్య ఆడిపాడి బతుమ్మ పండుగను జరుపుకున్నారు. అయితే ప్రతీ ఏడాది ఉండే కోలాహలం, రద్దీ మాత్రం కనిపించలేదు. చాలామంది మహిళలు వారి ఇళ్లలోనే బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఇక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శనివారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో బతుకమ్మ ఆడుతున్న ప్రదేశానికి చేరుకున్న మంత్రి కోవిడ్ ఆంక్షలు పాటిస్తూ పండుగ జరుపుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. -
గేట్స్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా వేడుకలు
గ్రేటర్ అట్లాంటా తెలంగాణ సొసైటీ (గేట్స్) ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలను న్యూయార్క్‌లోని రివర్స్‌సైడ్ పార్క్ నదీ తీరానా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మహిళలు రంగురంగుల బతుకమ్మలతో పెద్ద ఎత్తున హాజరై తమ ఆట పాటలతో అలరించారు. తర్వాత గేట్స్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి జమ్మిచెట్టుకు పూజ నిర్వహించి దసరా వేడుకలను ప్రారంభించారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి పల్లకీ ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన నవీన్ భాతిని, శ్రీధర్ కస్తూరి, చందు పెద్దపట్ల, మెహెర్ సరిదే, విష్ణు బైసాని, అథర్ బాలు, ఒలివియా, శ్రీనివాస్, హారికలను గేట్స్ అధ్యక్షుడు తిరుమల్ రెడ్డి ఘనంగా సన్మానించారు. వేడుకలకు సహకరించిన పలువురు స్పాన్సర్స్‌కు గేట్స్ కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ అనిల్ బోడిరెడ్డి , ఉపాధ్యక్షుడు రాహుల్ చికియాలా, ప్రధాన కార్యదర్శి కిషన్ తల్లాపల్లి, కోశాధికారి అనితా నెల్లూట్ల, జనార్దన్ పన్నేలా, గోటూర్ ఈవెన్ సెక్రటరీ సునీల్, పార్సా కార్యదర్శి శ్రీనివాస్, శ్రీధర్ నెల్వల్లి, రఘు బండా, చిత్తారి ప్రభ, రామాచారీ, గణేష్ కసం, చలపతి వెన్నెమనేని, సతీష్,కరుణ్ అసిరెడ్డి, గౌతమ్ గోలి, ప్రభాకర్ భోయిపల్లి, శ్రీధర్ జుల్లపల్లి, సతీష్ చెటి తదితరులు పాల్గొన్నారు. -
మైట ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. పూల పరిమళాలతో మలేషియా పరవశించింది. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలకు నిదర్శనమైన ఈ బతుకమ్మ పండుగను ప్రవాసులు పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్‌లోని ఎస్డబ్ల్యూ బాంక్వెట్ హాల్, టీఎల్‌కే కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు. సంప్రదాయ దుస్తులతో, ఆకర్షణీయమైన పూలతో చేసిన బతుకమ్మలను చిన్నా పెద్దా తేడా లేకుండా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాన్ని చాటేలా ఆడి పాడి సందడి చేశారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా మలేషియాలోని సెలంగోర్ స్టేట్ మినిస్టర్ గణపతి రావు, మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా. దాతో అచ్చయ్య కుమార్ రావు, మలేషియా తెలుగు పునాది ప్రెసిడెంట్ దాతో కాంతారావు, ఇండియన్ హైకమిషన్ లేబర్ వింగ్ సెక్రటరీ లక్ష్మీకాంత్, పిరమిడ్ సొసైటీ ప్రెసిడెంట్ లక్ష్మణ్, మలేషియా తెలంగాణ రాష్ట్ర సమితి వింగ్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, సాండ్స్టోన్ మనికంట పలువురు తెలంగాణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో మహిళలు, చిన్నారులు బతుకమ్మలను అక్కడ దొరికే రంగు రంగుల పువ్వులతో అందంగా పేర్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, చిత్తూ చిత్తుల బొమ్మ శివుడి ముద్దుల గుమ్మా, ఒక్కొక్క పువ్వేసి చందమామ, ఒక్క జాము ఆయే చందమామ, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. తెలంగాణ కళాకారుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య స్పాన్సర్ గా వచ్చిన సాండ్ స్టోన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్పాన్సర్స్ హెచ్‌యూ డెక్కన్, కేవీటీ గోల్డ్, జాస్ డెకొరేటర్స్, మినీ మార్ట్ అప్, టీఆర్ఎస్ మలేషియా, మలబార్ గోల్డ్, మై బిర్యానీ రెస్టారెంట్ , మై81 రెస్టారెంట్, ఏపీ భవన్ రెస్టారెంట్, ప్రబలీ రెస్టారెంట్, ఎమ్ఎస్ స్పైసెస్, ఎన్ఎస్ క్యాష్ పాయింట్, గాజా ఎట్ 8 రెస్టారెంట్, మోడరన్ స్టోర్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను, మైట సభ్యులను అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ చొప్పరి సత్య , వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, నరేంద్రనాథ్, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, జాయింట్ సెక్రటరీ సందీప్, ట్రేజరర్ మారుతీ జాయింట్ ట్రేజరర్ రవీందర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ రవి వర్మ, కృష్ణ వర్మ, కిరణ్ గాజంగి, హరి ప్రసాద్, వివేక్, రాములు, సుందర్, కృష్ణ రెడ్డి, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ కిరణ్మయి, వైస్ ప్రెసిడెంట్ స్వప్న, వైస్ ప్రెసిడెంట్-అశ్విత , యూత్ వింగ్ యూత్ ప్రెసిడెంట్ - కార్తీక్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - కిరణ్ గౌడ్, యూత్ వైస్ ప్రెసిడెంట్ - రవితేజ, కల్చరల్ వింగ్ మెంబర్స్ విజయ్ కుమార్, చందు, రామ కృష్ణ, నరేందర్, రంజిత్, సంతోష్, ఓం ప్రకాష్, అనూష, దివ్య, సాహితి, సాయిచరని, ఇందు, మైగ్రంట్ వింగ్ మెంబర్స్ ప్రతీక్, మధు, శ్రీనివాస్, రఘునాథ్ , సందీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
జర్మనీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
బెర్లిన్: తెలంగాణా సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబమైన సద్దుల బతుకమ్మ సంబరాలు జర్మనీలోని మ్యూనిక్ నగరంలో కన్నుల పండుగలా జరిగింది. ఈ పండుగను వరుసగా నాలుగోసారి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో 200లకుపైగా ఎన్నారై మహిళలు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో పరిసరాలు మార్మోగాయి. ఆడపడుచులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది.. ఉయ్యాల పాటలు పాడుతూ అందరినీ అలరించారు. పసందైన వంటకాలతో వేదిక గుమగుమలాడింది. చిన్న పిల్లలు సైతం తమ ప్రాంత సంస్కృతిని చూసి ఆనందించారు. | తెలంగాణలో జరుపుకునే బతుకమ్మ సంబరాలు జర్మనీలోనూ ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు. ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారందరు బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకోవాలని ఎన్నారైలు సుష్మ, శ్రీలత, మానస, కీర్తన, పుష్ప, మంజుల, సృజన, సంగీత, శైలజ, శిరీష తదితరులు కోరారు. కార్యక్రమాన్ని కన్నుల విందుగా జరిపిన దేవేందర్‌కు, కమిటీ సభ్యులకు ఎన్ఆర్ఐలు కృతజ్ఞతలు తెలియజేశారు. -
టీపీఏడీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు
డల్లాస్: తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నేతృత్వంలో గురువారం బొడ్డెమ్మ పూజను ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్‌లో ఘనంగా జరుపుకున్నారు. బతుకమ్మ పండగ నేపథ్యంలో వేడుకలకు తొమ్మిది రోజుల ముందు బొడ్డెమ్మ పూజ ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ఈ వేడుకకు ప్రత్యేకించి సెలవు లేకున్నా మహిళలు భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషం. తెలంగాణలో అనాధిగా వస్తున్నబతుకమ్మ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ అక్కడి మహిళలు, యువతులు బతుకమ్మ పాటలతో అందరిని అలరించారు. మట్టితో చేసిన బోడెమ్మను నీటిలో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ సభ్యులు మాట్లాడుతూ.. ఈ వేడుకలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తలిపారు. అలాగే సెప్టెంబర్ 27న కోపెల్లోని ఆండ్ర్యూ బ్రౌన్ పార్క్‌లో జరిగే చిన్న బతుకమ్మ, అక్టోబర్ 5న అలెన్ ఈవెంట్ సెంటర్లో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలను దిగ్విజయం చేయాలని కోరారు. కాగా, ఈ ఏడాది నిర్వహించే దసరా వేడుకలకు సుమారుగా 10,000 మంది ప్రవాసాంధ్రులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బతుకమ్మ సంబరాలకు సిద్ధమవుతున్న సింగపూర్
సింగపూర్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో అక్టోబర్ 13న సింగపూర్‌లోని సంబవాంగ్ పార్క్‌లో బతుకమ్మ పండుగ సంబరాలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సంబరాల్లో, ఉత్తమ బతుకమ్మలకు, ఉత్తమ సాంప్రదాయ వేషధారణలో వచ్చిన చిన్నారులకు ఆకర్షణీయమైన బహుమతులు ఉంటాయని, గ్రాండ్ లక్కీ డ్రాలో అదృష్ట విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇవ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్ఎస్ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ సంవత్సరం మాదిరిగానే సంబరాల్లో పాల్గొనే వారందరికి సరిపడే ఆహారం, ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, సింగపూర్‌లోని తెలుగువారే కాకుండా మిగతా రాష్ట్రాలకుచెందినవారు పెద్ద ఎత్తున రావాలని టీసీఎస్ఎస్ కోరింది. ఈ వేడుకలు విజయవంతంగా నిర్వహించడానికి అహర్నిశలు కష్టపడుతువారికి, దాతలకు టీసీఎస్ఎస్ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్, ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, జింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజులతోపాటూ పలువురికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వేడుకల కరపత్రాలని టీసీఎస్ఎస్ సభ్యులు విడుదల చేశారు. -
డల్లాస్‌లో ఘనంగా దసరా-బతుకమ్మ సంబరాలు
-
ఒమన్‌లో ప్రవాసుల బతుకమ్మ
మస్కట్: ఒమన్‌లోని ఇండియన్ సోషల్ క్లబ్, తెలంగాణ వింగ్ (ఒమన్ తెలంగాణ సమితి) ఆధ్వర్యంలో మస్కట్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు జరిగాయి. మాతృభూమికి దూరంగా ఓమాన్లో ఉన్న రెండువేలకు పైగా తెలంగాణ ప్రవాసులు మస్కట్‌లోని వాది కబీర్లోని మస్కట్ క్లబ్లో ప్రవాసి బతుకమ్మ సంబరాలు సంప్రదాయబద్దంగా ఘనంగా నిర్వహించారు. ఇండియా నుంచి వచ్చిన ప్రముఖ గాయకులు తేలు విజయ, రాంపూర్ సాయి తమ పాటలతో మస్కట్ లోని ప్రవాసులను అలరించారు. తంగేడు తదితర పూలను ఇండియా నుండి తెప్పించుకుని పేర్చిన బతుకమ్మలు పూల జాతరను తలపించాయి. బతుకు తెరువు కోసం ఎడారి దేశం వచ్చిన తామందరం ఒకే దగ్గర చేరి బతుకమ్మ వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, తమకు స్వదేశంలో ఉన్నఅనుభూతి కలిగిందని ఒమన్ తెలంగాణ సమితి అధ్యక్షుడు ఖానాపూర్ కు చెందిన ప్రముఖ భారతీయుడు గుండేటి గణేష్ తెలిపారు. -
ఎల్బీ స్టేడియంలో మహా బతుకమ్మ
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
-
సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
-
సింగపూర్‌లో బతుకమ్మ వేడుకలు
తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్ఎస్) ఆధ్వర్యంలో సింగపూర్ తెలుగు సమాజం (ఎస్టీఎస్)తో కలిసి జరుపుకున్న బతుకమ్మ వేడుకలు సంబవాంగ్ పార్క్‌లో వైభవంగా జరిగాయి. సుమారు వెయ్యిమందికి పైగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సంబరాలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేస్తూ సింగపూర్‌లో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కొనసాగిస్తున్న టీసీఎస్‌ఎస్‌ను అభినందించారు. ఇలా సింగపూర్‌లో ఉన్న రెండు సంఘాలు స్నేహపూర్వక వాతావరణంలో బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరు పాటలు, ఆటలతో హుషారుగా గడిపారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో సింగపూర్ బతుకమ్మ ఉయ్యాలో పాటలతో సంబరాలు మిన్నంటాయి. ఈ సంబరాల్లో ఎంతో మంది పంజాబీలు, సింగపూర్ స్థానిక తమిళులతో పాటు ఎంతో మంది వివిధ రాష్ట్రాల వారు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఇంత గొప్ప పండుగను వారికి పరచయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ నిర్వహించిన ఈ సంవత్సరపు క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ బతుకమ్మ, ఉత్తమ సంప్రదాయ వేషదారణకు బహుమతులు ఇవ్వడంజరిగింది. దీంతో పాటు సంబురాల్లో పాల్గొన్న ఓ అదృష్ట విజేతకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారి తరపు నుంచి డైమండ్ పెండేంట్స్ అందించారు. ఈ వేడుకలకు సమన్వయకర్తలుగా ముదం స్వప్న, మొగిలి సునిత రెడ్డి, నడికట్ల కళ్యాణి, గోనె రజిత, చిట్ల విక్రమ్, టేకూరి నగేష్, రాజ శేఖర్, ప్రదీప్‌లు వ్యవహరించారు. ఈ సంబురాలు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయని టీసీఎస్ఎస్ అధ్యక్షులు బండ మాధవ రెడ్డి, ఎస్టీఎస్ అధ్యక్షులు రవి రంగా తెలిపారు. ఈ విధంగా సింగపూర్‌లో ఉన్న తెలుగు వారందరూ కలిసి మెలసి జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ వేడుకలను టీసీఎస్ఎస్ ఉపాధ్యక్షులు బూర్ల శ్రీనివాస్, నీలం మహేందర్, పెద్ది చంద్ర శేఖర్ రెడ్డి, ముదం అశోక్, టీసీఎస్ఎస్ కార్యదర్శి బసిక ప్రశాంత్‌తో పాటు ఇరు సంస్థల కార్యవర్గ సభ్యులు గడప రమేష్ బాబు, శివ రామ్ ప్రసాద్, మొగిలి సునీత రాజేందర్, గర్రేపల్లి శ్రీనివాస్, నల్ల భాస్కర్, దుర్గా ప్రసాద్, వినయ్, చిలుక సురేష్, ప్రవీణ్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, ఎల్లా రాం , ఆర్సీ రెడ్డి, సీహెచ్. మహేశ్, దామోదర్, భరత్‌లు పర్యవేక్షించారు. ఈ సంబురాలు ఇంత ఘనంగా జరగడానికి తోడ్పాటు అందించిన ప్రతీ ఒక్కరికి పేరు పేరు న రెండు సంస్థల కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేశారు. -
మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. మలేషియా కౌలాలంపూర్‌లోని పీపీపీఎం ఈవెంట్ హాల్ బ్రిక్ ఫీల్డ్స్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస తెలంగాణ వాసులు భారీగా తరలి వచ్చారు. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా తెలంగాణ ఆడపడచు మిస్ ఆసియా ఇంటెర్నేషనల్, జాతీయ పోచంపల్లి ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీఠాకూర్, ఇండియన్ హై కమిషనర్ అఫ్ మలేషియా టిస్ తిరుమూర్తి, మలేషియా తెలుగు సంఘం ప్రెసిడెంట్ డా అచ్చయ్య కుమార్ రావుతో పాటూ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సంబరాలలో మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో కోలాహలంగా పాటలను పాడుతూ బతుకమ్మఆడారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఒక్క జాము అయై చందమామ, ఒక్కొక్క పువ్వేసి చందమామ,, వంటి పాటలతో మలేషియా మారుమోగింది. రుచికరమైన తెలంగాణ వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. అందంగా అలంకరించిన బతుకమ్మలకు ఈ సందర్భంగా మలేషియా తెలంగాణ అసోసియేషన్ 6 గ్రాముల బంగారాన్ని బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో దాదాపు వెయ్యి మందికి పైగా పాల్గొని విజయవంతం చేశారు. మిస్ ఆసియా రష్మీఠాకూర్ తెలంగాణ ఆడపడుచులతో బతుకమ్మ, కోలాటం ఉత్సహాంగా ఆడి పాడి సందడి చేశారు. రష్మీఠాకూర్ మాట్లాడుతూ ప్రవాస తెలంగాణ వాసులు తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా బతుకమ్మ సంబరాలు, తెలంగాణ పండుగలు జరుపోకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విదేశాల్లో తెలంగాణ సంస్కృతి కోసం కృషి చేస్తున్నందుకు మలేషియా తెలంగాణ అసోసియేషన్‌ను అభినందించారు. మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ ప్రత్యేకతను ఆయన వివరించారు. ఈ సంవత్సరం మూడు రోజుల పాటు తెలుగు వారు ఉండే ప్రతి చోట బతుకమ్మ వేడుకలను మన సంస్కృతికి అద్దం పట్టేలా ఎంతో ఘనంగా నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్‌గా వచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయడానికి సహకరించిన మైట కోర్ కమిటీని వాలంటీర్లుగా ముందుకి వచ్చిన సభ్యులను అయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి వైస్ ప్రెసిడెంట్ చోపరి సత్య, ముఖ్య కార్యవర్గ సభ్యులు కనుమూరి రవి వర్మ, చిట్టి బాబు చిరుత, బూరెడ్డి మోహన్ రెడ్డి, వెంకట్ రమణా రావు, రవి చంద్ర, కిరణ్మయి, గడ్డం రవీందర్ రెడ్డి, కృష్ణ ముత్తినేని, మారుతి, సుందర్, వివేక్, అశోక్, వెంకట్, కిరణ్ అనుగంటి, కార్తీక్, రవితేజ, అనిల్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. -
అమెరికాలో బతుకమ్మ వేడుకలు
సిరిసిల్ల: తెలంగాణ సాంస్కృతిక వైభవం బతుకమ్మ పండగ దేశవిదేశాల్లోనూ ఖ్యాతిని ఆర్జిస్తోంది. అమెరికాలోని న్యూజెర్సీలో బుధవారం బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. అమెరికాలోని ప్రవాస తెలంగాణ మహిళలు బతుకమ్మ పండుగను కన్నులపండువగా నిర్వహించారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఈ సంబురాలు జరిగాయి. మహిళలు పూలతో అత్యంత భక్తిశ్రద్ధలతో పేర్చిన బతుకమ్మలలో ఉత్తమమైన వాటికి టీడీఎఫ్ నిర్వాహకులు బహుమతులు అందించారు. అతిథులుగా సినీనటుడు విజయచందర్, సినీగేయ రచయిత డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ పాల్గొన్నారు. బతుకమ్మ పోటీలో దీప్తి, శైలజ విజేతలుగా నిలిచారని టీడీఎఫ్ ప్రతినిధులు మురళి, జమున ఓ ప్రకటనలో తెలిపారు.