తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ బెర్లిన్‌లో బతుకమ్మ పండుగా 10 వార్షికోత్సవం అలాగే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. శనివారం బెర్లిన్‌లో ఈ వేడుక అద్భుతంగా జరిగింది. దశాబ్దంగా ఈ బతుకమ్మ పండుగా బెర్లిన్‌లో జరుతుండటం మరింత విశేషం. ఈ వేడుకలో తెలంగాణకు చెందిన వారు, తెలుగు సంతతికి సంబంధించిన విభిన్న నేపథ్యల వారు పాల్గొని వేడుకగా జరుపుకున్నారు.
బెర్లిన్ తెలంగాణ కమ్యూనిటీ అక్కడ దొరికే తాజా పూలతో అద్బుతంగా బతుకమ్మను తయారుచేశారు. ఈ పండుగ ఒక విధంగా మనలో దాగున్న కళను వెలికి తీయడమే గాక మన ఐక్యతను గుర్తు చేస్తుందని నిర్వాహకులు అన్నారు. ఈ వేడుకలో తెలుగంణ సంప్రదాయ వంటకాలు హైలెట్‌గా నిలిచాయి. పాకశాస్త్ర నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్న అతిధులకు తెలంగాణ వారసత్వ వంటకాలను తమదైన శైలిలో తయారుచేసి రుచిచూపించారు.
ఈసారి బెర్లిన్ తెలంగాణ అసోషియేషన్ తమ కమ్యూనిటిలోకి విభిన్న సాంస్కృతిక కమ్యూనిటీ నాయకులను కూడా చేర్చకోంది. అంతేగాదు బెర్లిన్‌లో కాస్మోపాటిటన్ వాతావరణానికి అర్థం పట్టేలే ఈ బతుకమ్మ పండుగ వేడుకలో విభిన్న వర్గాల ప్రతినిధులు హాజరవ్వడం విశేషం. ఒకరకంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటేలా బెర్లిన్లో అంగరంగ వైభవంగా ఈ బతుకమ్మ సంబరాలు జరిగాయి. జర్మనీలోని తెలంగాణ అసోసీయేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ రఘ చలిగంటి ఈ వేడుకును ఇంతలా జయప్రదం చేసిన వాలంటీర్లకు, బెర్లిన్ తెలంగాణ అసోసీయేషన్ కమ్యూనిటీ బృందానికి హృదయపూర్వక ధన్వావాదాలు తెలిపారు.
తెలంగాణ సంస్కృతిని పరిరక్షించేలా ప్రోత్సహించడానికి వారి చేస్తున్న అచంచలమైన కృషిని, నిబద్ధతను కొనియాడారు. ఇక ఈ కార్యక్రమంలో జర్మనీ తెలంగాణ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా రఘు చలిగంటి (అధ్యక్షుడు), బాల్‌రాజ్ అందె (కోశాధికారి), రమణ బోయినపల్లి (వైస్ ప్రెసిడెంట్), అలేక్య బి (సాంస్కృతిక కార్యదర్శి), శరత్ రెడ్డి (కార్యదర్శి), యోగానంద్ (మీడియా కార్యదర్శి), శ్రీనాథ్ (మీడియా కార్యదర్శి), నటేష్ అండ్ మిస్టర్ నరేష్ (ఆఫీస్ బేరర్స్) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment