
లండన్: ప్రతిష్టాత్మక రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్(ఆర్‌సీపీ) 124వ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన డాక్టర్ ముంతాజ్ పటేల్ ఎన్నికయ్యారు. యూకే వైద్య నిపుణుల సంఘంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులుగా పేరున్న 40 వేల మంది వైద్యులు సభ్యులుగా ఉన్నారు.
ఇక, ఇంగ్లండ్‌లోని లంకాషైర్‌లో డాక్టర్ పటేల్ జన్మించారు. ఈమె తల్లిదండ్రులు భారత్‌కు చెందిన వారు. మాంచెస్టర్‌లో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్‌గా డాక్టర్ ముంతాజ్ పనిచేస్తున్నారు. ఆర్‌సీపీకు మొట్టమొదటి ఇండో–ఆసియన్ ముస్లిం ప్రెసిడెంట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. 16వ శతాబ్దంలో ఆర్‌సీపీ ఏర్పాటయ్యాక ఐదో మహిళా అధ్యక్షురాలుగా ముంతాజ్ పటేల్ నిలిచారు. సోమవారం ముగిసిన ఎన్నికలో డాక్టర్ ముంతాజ్ గెలుపొందారు. నాలుగేళ్ల పదవీకాలం ప్రారంభం ఖరారు కావాల్సి ఉంది. ఆర్‌సీపీ వైస్ ప్రెసిడెంట్(ఎడ్యుకేషన్–ట్రెయినింగ్)గా, తాత్కాలిక ప్రెసిడెంట్‌గా 2024 జూన్ నుంచి కొనసాగుతున్నారు. ఆర్‌సీపీ ప్రెసిడెంట్‌గా కౌన్సిల్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు. బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యురాలుగా ఉంటారు.