NRI
-
షార్లెట్‌లో ఘనంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలో ఘనంగా నిర్వహించారు. నార్త్ కరోలినాలోని షార్లెట్‌లో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకుడు, ఏపీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. జగన్ బర్త్‌డే సందర్భంగా పిల్లలూ, పెద్దలూ అంతా కేక్ కట్ చేసి తమ ప్రియతమ నేతలకు జన్మదిన శుభాకాంక్షలందించారు. జగనన్న అభిమానులు, శ్రేయోభిలాషులు, సానుభూతిపరులు పెద్ద సంఖ్యలో హాజరై.. జై జగన్, జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన పలు సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
బంధించేశారు, ఒక్కపూటే భోజనం..రక్షించండి: కువైట్‌లో ఏపీ మహిళ ఆవేదన
ఉపాధి కోసం కువైట్ వెళ్లి పనిప్రదేశంలో ఇబ్బందులు పడుతున్నమహిళ తనను కాపాడ్సాలిందిగా వేడుకుంటున్న సెల్ఫీ వీడియో ఒకటి ఆందోళన రేపుతోంది. తిరుపతి శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ చెందిన ఎల్లంపల్లి లక్ష్మి తన కుమార్తెను ఉద్దేశించి ఈ వీడియో చేసింది. కువైట్ లో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.మతిస్థిమితం లేని పిల్లవాడి సంరక్షణ కోసం కువైట్ వచ్చిన తనకు కనీసం కడుపు నిండి తిండి పెట్టకుండా, వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయింది. పిల్లవాణ్ని సరిగ్గా చూడటం లేదని ఆరోపిస్తూ తనను బాగా కొట్టిన యజమానులు గదిలో నిర్బంధించారని కన్నీళ్లు పెట్టుకుంది. తిండీ, తిప్పలు లేక, అనారోగ్యంతో బాధలు పడుతున్నట్టు వెల్లడించింది. అంతేకాదు రక్షించాలని ఎజెంటుకు విన్నవించుకుంటే 2.50 లక్షల రూపాయలు చెల్లించాలని చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితులో ఉన్నానని దయచేసిన తనను ఈ నరకంనుంచి రక్షించాలని సెల్ఫీ వీడియోలో కుమార్తెను వేడుకుంది. దీంతో లక్ష్మి కుమార్తె సుచిత్ర ఆందోళనలో మునిగిపోయింది. తల్లిని కాపాడాలని కోరుతూ స్టానిక శ్రీకాళహస్తి ఎమ్మెల్యేకు విజ్ఞపి చేసింది. కువైట్ నుండి తన తల్లిని త్వరగా ఇండియాకు తీసుకురావాలని కోరూతూ ఏమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి కుమార్తె సెల్ఫీ వీడియో ద్వారా వేడుకుంది. -
సిడ్నీలో ఘనంగా వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బర్త్ డే వేడుకలు ఆస్ట్రేలియాలో ఘనంగా జరిగాయి. సిడ్నీలో జరిగిన వేడుకల్లో వైసీపీ నాయకులు, జగనన్న అభిమానులు, పిల్లలు, పెద్దలు భారీ ఎత్తున్న పాల్గొన్నారు. వైసీపీ నాయకులు గాయం శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి అంక్కిరెడ్డిపల్లి, శ్రీనివాస్ బేతంశెట్టి, అమరనాథ్ రెడ్డి , శిరీష్ రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా జగనన్న చేసిన గొప్ప కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ప్రవాసులు ఆకాంక్షించారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
ఆస్ట్రేలియాలో ఘనంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ఆస్ట్రేలియాలోని ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. సిడ్నీ మెల్బోర్న్ బ్రిస్బేన్ లలో జరిగిన కార్యక్రమాల్లో ఆయా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్నారైలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు మాట్లాడుతూ రాష్ట్రానికి అనేక మేలు చేసినటువంటి వైఎస్ జగనన్న వెంట ఎల్లవేళలా ఉంటామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఆయన మార్గాన్ని విడవబోమని ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు పునరుద్ఘాటించారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసే దుర్మార్గపు చర్యలను ఆటవిక రాజ్యపు పోకడలను ప్రజలలోకి విరివిగా తీసుకెళ్తామని ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా జగనన్న వెంట ఉంటామని తెలియజేశారు.తెలుగుదేశం జనసేన కార్యకర్తల కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, ప్రవర్తించాలని ఈ సందర్భంగా ఎన్నారైలు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ జూమ్ కాల్ ద్వారా అనుబంధ విభాగాల అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు రోజా, శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అరే శ్యామల, ఎన్నారై లతో మాట్లాడి వారు చేస్తున్నా ఈ కార్యక్రమాలను కొనియాడారు. ఈ సందర్భంగా చేసే పోరాటంలో ఎన్నారైలు అందరూ సహకరిస్తున్నందుకు వారికి అన్ని విధాలుగా రుణపడి ఉంటామని నాయకులు తెలియజేశారు.అంకుఠిత దీక్షతో మద్దతుగా నిలుస్తున్న ఎన్నారైలు అందరికీ వైసీపీ నాయకులు జూమ్ కాల్ ద్వారా ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. బిస్మిన్ లో జరిగిన కార్యక్రమంలో వైసీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ చింతలచెరువు సూర్యనారాయణ రెడ్డి, ఇరువురి బ్రహ్మారెడ్డి, వంశీ చాగంటి, జస్వంత్ రెడ్డి బొమ్మిరెడ్డి, ఏరువ చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! -
గడ్డకట్టే చలిలోనూ... లెహంగాలో స్నాతకోత్సవానికి!
ఎలాంటి పరిస్థితుల్లోనైనా తగ్గేదేలే అంటారు కొందరు. ఆ విద్యార్థిని సరిగ్గా అలాంటి వారిలో కోవలోకే వస్తుంది. గడ్డ కట్టించే చలిలోనూ వస్త్రధారణలో రాజీ పడలేదు. స్నాతకోత్సవంలో సంప్రదాయ దుస్తులే ధరించింది! స్విట్జర్లాండ్‌లో ప్రస్తుతం చలి వణికిస్తోంది. మైనస్ డిగ్రీలతో సర్వం గడ్డ కట్టుకుపోతోంది. అయినా సరే, లక్ష్మీకుమారి అనే భారతీయ విద్యార్థిని అస్సలు రాజీ పడలేదు. స్నాతకోత్సవానికి లెహెంగా ధరించి ప్రశంసలు అందుకుంది. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ‘‘మైనస్ డిగ్రీల వాతావరణం. బయట ఎటు చూసినా మంచు. ఊహించలేనంతటి చలి! అయినా సరే, లెహంగా ధరించడంలో రాజీపడలేదు’’అని రాసుకొచ్చింది. ఆ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. జీవితంలో ప్రత్యేకమైన మైలురాయిని సంప్రదాయంతో మేళవించిందంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. అంతటిప్రతికూల వాతావరణంలోనూ గ్రాడ్యుయేషన్ కోసం సంప్రదాయ దుస్తులు ధరించడం బాగుంది. ఆమె నిజమైన భారతీయురాలు. అంతర్జాతీయ వేదికపై తన మూలాలను ఇంతందంగా చూపించింది’’అంటూ పొగుడుతున్నారు. View this post on Instagram A post shared by Lakshmi Kumari (@lakshmi.ch) -
కెనడాలో ఏపీకి చెందిన విద్యార్థి హఠాన్మరణం!
కెనడాలో ఉన్నత చదువులకోసం వెళ్లిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు పిల్లి ఫణి కుమార్(36) వైజాగ్‌లోని గాజువాక ప్రాంతానికి చెందినవాడుగా గుర్తించారు. దీంతో ఫణి కుమార్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయికాల్గరీలోని సదరన్ ఆల్బర్టా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (SAIT)లో సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎంఎస్ చదివేందుకు 2024 ఆగస్టు నెలలో వెళ్ళాడు ఫణి కుమార్. అయితే డిసెంబర్ 14న ఫణి కుమార్ రూమ్మేట్, ట్రక్ డ్రైవర్ తన కమారుడి మరణం గురించి సమాచారం అందించాడని తండ్రి, నాగ ప్రసాద్ తెలిపారు. గుండెపోటుతో చనిపోయినట్టు భావిస్తున్నప్పటికీ అయితే, ఈ మరణానికి గల కారణాలపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాల్గరీ పోలీసులు ఫణి కుమార్ వస్తువులను అతని ల్యాప్‌టాప్, పాస్‌పోర్ట్, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తన కుమారుడి మృతదేహాన్ని కెనడా నుంచి భారతదేశానికి తీసుకునేందుకు సహకరించాల్సిందిగా నాగప్రసాద్, కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
కెనడాలో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం!
కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (LMIA) మద్దతుతో ఉద్యోగ ఆఫర్‌కు సంబంధించినఎక్స్ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను రద్దు చేయాలని భావిస్తోంది. జాబ్ ఆఫర్పేరుతో జరుగుతున్న మోసపూరిత పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పాయింట్ల వ్యవస్థను త్వరలో తొలగించనున్నట్లు ఇమ్మిగ్రేషన్ మంత్రిత్వ ఇమ్మిగ్రేషన్ శాఖ మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు.ఇది కాంప్రహెన్సివ్ ర్యాంకింగ్ సిస్టమ్ (CRS) కట్-ఆఫ్ స్కోర్‌ను చేరుకోవడానికి , అక్కడ శాశ్వత నివాసం పొందే అసలైన లబ్ధిదారులను ప్రభావితం చేయనుందని నిపుణులు భావిస్తున్నారు.తాత్కాలిక విదేశీ వర్కర్ (TFW) ప్రోగ్రామ్‌లో సంస్కరణల్లో భాగంగా ఇది మొదటిసారిగా 2014లో ప్రవేశపెట్టారు. స్టీఫెన్ హార్పర్ ప్రభుత్వం "అర్హత కలిగిన కెనడియన్లు అందుబాటులో లేనప్పుడు తాత్కాలిక ప్రాతిపదికన పూర్తి తీవ్రమైన కార్మికుల కొరతను నివారించేం పరిష్కారంగా" భావించింది. అంటే సాధారణంగా దేశంలోని వివిధ సంస్థలు నిపుణులైన, అర్హులైన ఉద్యోగులను అందుబాటులో లేనపుడు అప్పటికే శాశ్వత నివాసం ఉన్నవారిలో లేకపోతే విదేశీ వ్యక్తులను నియమించుకునే వెసులుబాటు కలుగుతుంది. కెనడాలోని సంస్థలు ఒక విదేశీ ఉద్యోగిని నియమించుకోవాలనుకుంటే, వారు ముందుగా LMIA దరఖాస్తును పూర్తి చేయాలి. ఫెడరల్ ప్రభుత్వం అనుమతి పొందాలి. ఉద్యోగం చేయడానికి కెనడియన్లు లేదా ఇతర శాశ్వత నివాసితులు లేరని కూడా వారు ధృవీకరించాల్సి ఉంటుంది.అలా లేబర్ మార్కెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (ఎల్ఎంఏఐ) కింద దరఖాస్తు చేసుకుంటాయి. ఈ సందర్భంగా జాబ్ ఆఫర్ ద్వారా ఆయా వ్యక్తులకు ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పేరుతో 50 పాయింట్లు అదనంగా లభిస్తాయి. దీంతో.. ఆ వ్యక్తులు కెనడాలో శాశ్వత నివాసం లేదా తాత్కాలిక నివాసం కోరుకుంటే ఈ పాయింట్ల ద్వారా వారికి అదనపు ప్రయోజనం చేకూరుతుంది. అయితే ఈ పేరుతో పలు సంస్థలు మోసాలకు పాల్పడుతున్నాయని, విదేశీ వ్యక్తులు వీటిని కొనుగోలు చేసి.. శాశ్వత నివాసాలు పొందేందుకు అవకాశంకల్పిస్తున్నాయని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం భావిస్తోంది. దీనిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అయితే కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు జాబ్ ఆఫర్ల పేరిట మోసాలు జరుగు తున్నాయని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నిబంధనలను కఠినతరం చేయాలని నిర్ణయించింది. కొంతమంది ఇమ్మిగ్రేషన్ ఏజెంట్లు చట్టవిరుద్ధంగా LMIAలను వలసదారులకు లేదా శాశ్వత నివాసం పొందడానికి వారి CRS స్కోర్‌ను పెంచుకుంటోందన్న పలు నివేదికల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. -
సింగపూర్‌లో కిరణ్ ప్రభ-కాంతి కిరణ్ దంపతులతో ముఖాముఖీ
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు ఆద్వర్యంలో "కిరణ్ ప్రభ, కాంతి కిరణ్ దంపతులతో" ఇష్టాగోష్టి కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 18 డిసెంబర్, బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన ఆ ముఖాముఖీలో కౌముది మాసపత్రిక సంపాదకులు, కిరణ్ ప్రభ ప్రసంగించారు. అలాగే కౌమిది వెబ్ మాగజైన్ మొదలు పెట్టి 17 సంవత్సరాలు పూర్తి అయిందని, ఏ నెలా ఆలస్యం కాకుండా 1వ తేదీనే విడుదల అవ్వడం వెనుక ఎంతో శ్రమ ఉన్నప్పటికీ అది మనకు పని పట్ల ఉన్న నిభద్దతగా భావించి విడుదలలో జాప్యం రానివ్వమని అన్నారు. అలాగే దాదాపు 1300 టాక్ షోలను కూడా నిర్వహించామని, తెలిసినంతలో ఒక్క మన తెలుగు భాషలో తప్ప వేరే ఏ భాషలో కూడా ఇన్ని విభిన్న రంగాలను ఎంచుకుని రకరకాల సబ్జక్ట్ లలో ఒక్క మనిషి ఇన్ని టాక్ షోలను చేసింది లేదని అంతే కాకుండా ఇదంతా ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా, తెలుగు భాష మీద అబిమానంతో మాత్రమే చేస్తున్న కార్యక్రమం అని వివరించారు. అదే విధంగా వారి టాక్ షో లను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళే క్రమం ఎలా ఉంటుందో సోదాహరణలతో వివరించారు. ఎంతో మంది వింటున్న కార్యక్రమం కాబట్టి మాట్లాడే ప్రతి పదం నిజ నిర్ధారణతో, ఖచ్చితత్వం ఉండేలా చూసుకుంటానని వివరించారు, అదే విధంగా కౌముది పత్రిక నిర్వహణలో భార్య కాంతి కిరణ్ సహాయసహకారాలు ఎలా ఉంటాయో వివరించారు. కాంతి కిరణ్ మాట్లాడుతూ కౌముది పత్రిక ప్రారంభించినప్పుడు ఇంతమంది అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా మాకు అందిస్తుందని అస్సలు అనుకోలేదని, ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తదుపరి వచ్చిన ఆహూతుల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ దాదాపు 2 గంటల పాటు ముఖాముఖి కార్యక్రమంలో నిర్వహించారు.సుబ్బు వి పాలకుర్తి సభా నిర్వహణ గావించిన ఈ కార్యక్రమములో, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ కిరణ్ ప్రభతో గత 3 సంవత్సరాలుగా ఆన్లైన్ వేదికలు ద్వారా పరిచయం ఉన్నప్పటికీ వారిని సింగపూర్ లో ఇలా ఇష్టాగోష్టి కార్యక్రమములో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెపుతూ వారిని పరిచయం చేసిన తానా సాహిత్య సంఘం అధ్యక్ష్యులు తోటకూర ప్రసాద్ కి ధన్యవాదములు తెలియచేసారు. అలాగే సింగపూర్ లో సాహిత్య కార్యక్రమాలకు నాంది పలికిన వంగూరి చిట్టెన్ రాజుకి మరొక్కసారి ధన్యవాదములు తెలియచేస్తూ, వర్కింగ్ డే అయినా కానీ 30 మందికి పైగా ఈ కార్యక్రమములో పాల్గొనటం అది కేవలం కిరణ్ ప్రభ మీద ఉన్న అభిమానానికి నిదర్శనం అని తెలిపారు. ఈ కార్యక్రమములో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్ష్యులు జవహర్ చౌదరి, రంగా రవికుమార్, సీనియర్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్ వీరా, ధనుంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రామాంజనేయులు చామిరాజు, పాతూరి రాంబాబు, సునీల్ రామినేని, కోణాళి కాళీ కృష్ణ సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, సాంకేతిక సహకారం అందించారు. 30 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమములో పాల్గొన్న అతిధులందరికి విందు భోజన ఏర్పాట్లను సరిగమ బిస్ట్రో రెస్టారంట్ వారు కేశాని దుర్గా ప్రసాద్, సురేంద్ర చేబ్రోలు, మోహన్ నూకల ఏర్పాటు చేసారు. -
హెచ్-1బీ వీసా : భారతీయ టెకీలకు గుడ్ న్యూస్
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించిన తరువాత ఆమెరికాలో ఉండే భారతీయులు, అక్కడ చదువుకునే భారతీయ విద్యార్థుల భవితపై అనే సందేహాలు నెలకొన్ని నేపథ్యంలో యూఎస్ ప్రకటన లక్షలాది మంది భారతీయ టెకీల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అధికారం నుంచి వైదొలగడానికి కొద్ది రోజుల ముందు బైడెన్ ప్రభుత్వం హెచ్-1బీ నిబంధనలను సడలించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) H-1B వీసా ప్రోగ్రామ్‌ను ఆధునీకరించే నిర్ణయాన్ని ప్రకటించింది. 2025 జనవరి 17 నుంచి అమలులోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం యూఎస్‌లో F-1 వీసాలపై ఉన్న భారతీయ విద్యార్థులకు కూడా ఎక్కువ ప్రయోజనం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొత్త నియమాలు కొత్త ఉద్యోగాల్లోకి మారడానికి వారికి సహాయపడతాయి. అలాగే అత్యంత నిపుణులైన టెకీలను నిలుపుకోవడానికి యజమానులకు మరింత సౌలభ్యాన్ని అందిస్తుందని USCIS డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ చెప్పారు.హెచ్ 1 బీ వీసా : కీలకమైన అప్డేట్స్F-1 విద్యార్థి వీసాదారులు, ఉద్యోగాలు, H-1B స్థితికి మారడం, తద్వారా అమెరికాలో కొనసాగడం వంటి మార్పులు ఉండనున్నాయి.దరఖాస్తుదారులు తమ హెచ్-1బీ దరఖాస్తులను సమర్పించడానికి కొత్తగా ప్రవేశపెట్టిన ఐ-129 అప్లికేషన్ ఫారంను ఉపయోగించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ వీసా దరఖాస్తు తమ డిగ్రీతో నేరుగా ముడిపడి ఉన్న ఉద్యోగానికి సంబంధించినదని నిరూపించాలి. దీంతో వీసాల జారీలో దుర్వినియోగాన్ని తగ్గించాలనేది లక్ష్యం.అంతేకాదు హెచ్1 బీ వీసా నిబంధనలను పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకునే, జరిమానాలు విధించే, లేదా వీసా (VISA) లను రద్దు చేసే అధికారం మరింత ఉంటుంది. వ్యక్తిగతంగా ఇంటర్వ్యూకి రావాల్సిన అవసరం లేని విధానమైన డ్రాప్ బాక్స్ సిస్టమ్ ను మరింత సరళతరం చేయ నున్నారు. అభ్యర్థుల మునుపటి దరఖాస్తు రికార్డులపై ఆధారపడటాన్ని విస్తరించవచ్చు, పునరుద్ధరణలను వేగవంతం చేయవచ్చు.గతంలో H-1B వీసాకు అనుమతి లభించినవారి ప్రాసెసింగ్ వేగవంతం అవుతుంది. కొన్ని షరతులతో పిటిషన్ సంస్థపై నియంత్రణ ఆసక్తి ఉన్న లబ్ధిదారులకు అర్హతను పొడిగిస్తుంది.కాగా ఇండియా, చైనా వంటి దేశాల నుండి ప్రతీ ఏడాది వేలాదిమంది ఉద్యోగులను నియమించుకునేందుకు అమెరికా కంపెనీలు H-1B వీసాలపై ఆధారపడతాయి. హెచ్-1బీ వీసా హోల్డర్లలో సింహభాగం భారతదేశానికి చెందినవారే. 2023లో, జారీ చేసిన వీసాల్లో భారతీయులు 72.3శాతంఉన్నారు.H-1B వీసా దరఖాస్తులు తరచుగా వార్షిక పరిమితిని మించిపోవడంతో వీసాలు లాటరీ విధానంద్వారా కేటాయిస్తున్నారు. దీంతో కొంతమంది నష్టపోతున్న సంగతి తెలిసిందే. -
NRI: జాకీర్ హుస్సేన్ మృతిపై ఐఎఎఫ్ సంతాపం
డాలస్, టెక్సస్: తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ మృతి పట్ల ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ (ఐఎఎఫ్సి) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యవర్గ సమావేశంలో తీవ్ర సంతాపం ప్రకటించింది. ఐఎఎఫ్సి అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ "సంగీతరంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత పురస్కారంగా భావించే గ్రామీ పురస్కారన్ని నాల్గు పర్యాయాలు అందుకున్నవారు, ప్రపంచ ప్రఖ్యాత తబలా వాయిద్య విద్వాంసుడు, పద్మవిభూషణ్ జాకీర్ మృతి ప్రపంచంలోని సంగీత ప్రియులందరికీ తీరని లోటని అన్నారు. పసి ప్రాయంలో ఏడు సంవత్సరాల వయస్సునుండే ఎంతో దీక్షతో తన తండ్రి, సంగీత విద్వాంసుడు అయిన అల్లా రఖా వద్ద తబలా వాయించడంలో మెళుకువలు నేర్చుకుని, విశ్వ వ్యాప్తంగా మేటి సంగీత విద్వాంసులైన రవిశంకర్, ఆలీ అఖ్బర్ ఖాన్, శివశంకర శర్మ, జాన్ మేక్లెగ్లిన్, ఎల్. శంకర్ లాంటి వారెందరితోనో 6 దశాబ్దలాగా పలు మార్లు, ఎన్నో విశ్వ వేదికలమీద సంగీతకచేరీలు చేసి అందరి అభిమానాన్ని చూరగొన్న జాకీర్ మృతిపట్ల వారి కుటుంబ సభ్యులుకు తీవ్ర సంతాపం తెలియజేస్తూ, జాకీర్ తో తనకున్న ప్రత్యక్ష పరిచయాన్ని, తాను జరిపిన ముఖా-ముఖీ కార్యక్రమ లంకెను పంచుకున్నారు. ఈ సమావేశంలో ఐఎఎఫ్సి ఉపాధ్యక్షులు తాయబ్ కుండా వాలా, రావు కల్వ ల, కార్యదర్శి మురళి వెన్నం, కోశాధికారి రన్నా జానీ, బోర్డ్ సభ్యులు రాంకీ చేబ్రోలు హాజరయ్యారు. -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి
వాషింగ్టన్ : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన విద్యార్థిని నాగశ్రీ వందన పరిమళ మృతి చెందగా ఆమె ఇద్దరు స్నేహితులు గాయపడినట్లు స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీ వందన పరిమళ (26) ఉన్నత చదువుల కోసం 2022 డిసెంబర్లో అమెరికాకు వెళ్లారు. అక్కడ టెన్నెసీ రాష్ట్రంలోని మెంఫిస్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఎంఎస్)చదువుతున్నారు.అయితే ఈ తరుణంలో గత శుక్రవారం రాత్రి ఆమె తన స్నేహితులతో కలిసి కారులో వెళుతుండగా, రాక్‌వుడ్ ఎవెన్యూ సమీపంలో ట్రక్ వెనుక నుంచి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళతో పాటు ఆమె స్నేహితులకు పవన్, నికిత్లకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు అత్యవసర చికిత్స నిమిత్త ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వందన మరణించగా.. పవన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.కాగా, రోడ్డు ప్రమాదంలో నాగశ్రీ వందన పరిమళ మృతి చెందడంతో తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వందన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అక్కడి అధికారులు, తెలుగు సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఎన్ఆర్ఐ అకౌంట్లోని రూ.6.5 కోట్లు మాయం
పంజగుట్ట: ఓ ఎన్ఆర్ఐ ఖాతా నుండి రూ.6.5 కోట్ల నగదును బ్యాంకు సిబ్బంది మాయం చేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆ్రస్టేలియాకు చెందిన పరితోష్ ఉపాధ్యాయకు బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుండి ప్రీమియం అకౌంట్ ఉంది. బేగంపేట యాక్సిస్ బ్యాంకు సీనియర్ పార్టనర్ వెంకటరమణ పాసర్ల, వైస్ ప్రెసిడెంట్ హరివిజయ్, బ్రాంచ్ హెడ్ శ్రీదేవి రఘు, సురేఖ సైనాలు కలిసి పరితోష్ ఉపాధ్యాయ పేరుతో మొత్తం 42 నకిలీ చెక్కులను తయారు చేశారు. ఈ చెక్కుల ద్వారా గత రెండు సంవత్సరాలుగా ఆయన సంతకం ఫోర్జరీ చేసి బ్యాంకు నుండి పలుమార్లు మొత్తం రూ.6.5 కోట్లు విత్‌డ్రా చేసుకున్నారు. చెక్కులు డ్రా చేసుకునే సమయంలో ఖాతాదారునికి మెసేజ్ రాకుండా జాగ్రత్త పడ్డారు. అంతటితో ఆగకుండా పరితోష్ ఉపాధ్యాయ బ్యాంకు అకౌంట్‌ను పూర్తిగా క్లోజ్ చేశారు. బ్యాంకు అకౌంట్ క్లోజ్ అయిన విషయంపై పరితోష్‌కు మెయిల్ రావడంతో అతను వివరాలు ఆరా తీయగా తన బ్యాంకు అకౌంట్ నుండి రూ.6.5 కోట్లు మాయం అయిన విషయం తెలుసుకుని అవాక్కయ్యాడు. ఆన్లైన్ ద్వారా బ్యాంకు స్టేట్మెంట్ అడిగితే సిబ్బంది నిరాకరించారు. వెంటనే తన న్యాయవాది సాయంతో పంజగుట్ట పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్యూన్ పక్కా ప్లాన్.. రూ.10 కోట్ల మోసం -
అత్తగారి కుటుంబంతో సరదాగా.. అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడి ఫొటో వైరల్
వాషింగ్టన్ : అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, సతీమణి ఉష చిలుకూరి దంపతుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనా.. సాదాసీదాగా నీలిరంగు టీ షర్ట్ ధరించిన జేడీ వాన్స్ తన కుమారుడిని ఎత్తుకున్నారు. తన భార్య ఉష చిలుకూరి తరఫు బంధువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతవారం అమెరికాలో థ్యాంక్స్ గివింగ్ డే సందర్భంగా ఈ ఫొటో దిగినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోని సిలికాన్ వ్యాలీ వెంచర్ క్యాప్టలిస్ట్ ఆషా జెడేజా మోత్వాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. JD Vance at Thanksgiving -). Reminds me of the big fat Indian wedding…. pic.twitter.com/vzEjODMRZt— Asha Jadeja Motwani 🇮🇳🇺🇸 (@ashajadeja325) December 2, 2024జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడేఅమెరికా ఉపాధ్యక్ష పదవిని అధిరోహించబోతున్న రిపబ్లికన్ నేత జేడీ వాన్స్ తెలుగు వారి అల్లుడే. ఆయన భార్య చిలుకూరి ఉషాబాల తెలుగు సంతతికి చెందిన వారే కావడం విశేషం. 38 ఏళ్ల ఉషా అమెరికాలో జన్మంచినప్పటికీ ఆమె తాత, ముత్తాలది మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామమని ఆ గ్రామపెద్దలు చెబుతున్నారు. చిలుకూరి ఉషాబాల ముత్తాత రామశాస్త్రి కొంత భూమిని గ్రామంలో ఆలయం కోసం దానంగా ఇచ్చారు. ఆ స్థలంలోనే గ్రామస్తుల సహకారంతో సాయిబాబా ఆలయం, మండపాన్ని నిర్మించారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు శాంతమ్మ మరిది రామశాస్త్రి కుమారుడు రాధాకృష్ణ. ఆ రాధాకృష్ణ కూతురే ఉష. ఉషా తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980లలోనే అమెరికాలో స్థిరపడ్డారు. వీళ్ల సంతానం ముగ్గురిలో ఉషా ఒకరు. కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం సాయిపురం గ్రామంలోనూ ఉష పూరీ్వకులున్నారు. ఆమెకు తాత వరసైన రామ్మోహనరావు కుటుంబం ప్రస్తుతం ఈ గ్రామంలోనే నివసిస్తోంది. ఉష పూర్వీకులు దశాబ్దాల కిందటే ఇతర ప్రాంతాలకు వెళ్లిపోగా సాయిపురంలో 18వ శతాబ్దంలో చిలుకూరి బుచ్చిపాపయ్య శాస్త్రి నివసించారు. ఆయన వంశవృక్షమే శాఖోపశాఖలుగా, కుటుంబాలుగా విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై నగరాలుసహా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. ఉషా ముత్తాత వీరావధాన్లుకు ఐదుగురు సంతానం. రామశాస్త్రి, సూర్యనారాయణ శాస్త్రి, సుబ్రహ్మణ్యశాస్త్రి, వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణమూర్తి. వీరందరూ ఉన్నత విద్యావంతులే. తొలి భారత సంతతి ‘సెకండ్ లేడీ’ అమెరికా అధ్యక్షుడి భార్యను ప్రథమ మహిళగా, ఉపాధ్యక్షుడి భార్యను సెకండ్ లేడీగా సంబోధించడం అమెరికాలో పరిపాటి. భర్త వాన్స్ వైస్‌ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఉషా తొలి భారతసంతతి ‘సెకండ్ లేడీ’గా చరిత్ర సృష్టించనున్నారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా జన్మించారు. యేల్ విశ్వవిద్యాలయం నుంచి చరిత్రలో డిగ్రీ పట్టా సాధించారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. సహాయకురాలిగా న్యాయ సంబంధమైన విభాగాల్లో చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. సుప్రీంకోర్టు ఇద్దరు మాజీ న్యాయమూర్తుల వద్ద పనిచేశారు. గతంలో యేల్ లా జర్నల్‌కు ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ఎడిటర్‌గా పనిచేశారు. యేల్ వర్సిటీలో లా అండ్ టెక్ జర్నల్‌కు మేనేజింగ్ ఎడిటర్‌గా ఉన్నారు. చివరిసారిగా ముంగర్, టోల్స్,ఓల్సన్ సంస్థలో పనిచేశారు. యేల్ విశ్వవిద్యాలయంలో ఆమె అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉషా తల్లిదండ్రులు ఇద్దరూ విద్యావంతులే. తల్లి లక్ష్మి అణుజీవశాస్త్రంలో, జీవరసాయన శాస్త్రంలో పట్టబధ్రులు. ప్రస్తుతం ఆమె అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. శాన్‌డియాగోలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కార్యనిర్వాహక పదవిలోనూ కొనసాగుతున్నారు. ఉషా తండ్రి రాధాకృష్ణ వృత్తిరీత్యా ఏరోస్పేస్ ఇంజినీర్. ఆయన గతంలో ఐఐటీ మద్రాస్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. ఆయన ప్రస్తుతం యునైటెడ్ టెక్నాలజీస్ ఏరోస్పేస్ సిస్టమ్స్‌లో ఏరోడైనమిక్స్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. దాంతోపాటే కాలిన్స్ ఏరోస్పేస్లో అసోసియేట్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు. వాన్స్‌తో ఉష పరిచయం యేల్ లా స్కూల్లో ఉషా, వాన్స్ తొలిసారి కలిశారు. 2013లో ఇద్దరూ కలిసి వర్సిటీలో ఒక చర్చాకార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాతే ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీసింది. 2014 ఏడాదిలో వీరు పెళ్లాడారు. హిందూ సంప్రదాయం ప్రకారమే పెళ్లిచేసుకోవడం విశేషం. వీరికి కూతురు మీరాబెల్, కుమారులు ఎవాన్, వివేక్ ఉన్నారు. భర్త వాన్స్‌కు చేదోడువాదోడుగా ఉంటూ విజయంలో ఉషా కీలకపాత్ర పోషించారు. ‘భార్యే నా ధైర్యం. చెబితే నమ్మరుగానీ ఆమె నాకంటే చాలా తెలివైన వ్యక్తి’అని ఉషను పొగడటం తెల్సిందే. -
దిగ్విజయంగా ముగిసిన '9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు'
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా & ఆంధ్ర కళా వేదిక సంయుక్త నిర్వహణలో ఖతార్ దేశ రాజధాని దోహాలో నవంబర్ 22-23, 2024 తేదీలలో జరిగిన 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుఘనంగా ముగిసాయి. మధ్య ప్రాచ్య దేశాలలో జరిగిన తొలి తెలుగు సాహితీ సదస్సుగా 'తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్' లో స్థానం సంపాదించుకుంది. 9 తెలుగు సంస్థల సహకారంతో నిర్వహింపబడిన ఈ చారిత్రాత్మక సదస్సుకు ప్రధాన అతిధిగా భారత పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు విచ్చేశారు. ఖతార్ లో భారతదేశ రాయబారిశ్రీ విపుల్ కూడా సదస్సుకు హాజరై నిర్వాహకులను అభినందించారు. అమెరికా, భారత దేశం, ఉగాండా, స్థానిక ఆరబ్ దేశాలతో సహా 10 దేశాల నుంచి రెండు రోజుల పాటు సుమారు 200 మంది తెలుగు భాషా, సాహిత్యాభిమానులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సుమారు 18 గంటల సేపు 60 కి పైగా సాహిత్య ప్రసంగాలు, 30 మంది స్వీయ కవిత, కథా పఠనం, 34 నూతన తెలుగు గ్రంధాల ఆవిష్కరణ, మధ్యప్రాచ్య దేశాలలో తెలుగు ఉపాధ్యాయులకు సత్కారం, సినీ సంగీత విభావరి, స్థానిక దోహా కళాకారులు, చిన్నారుల నృత్య ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖా మంత్రి కందుల దుర్గేష్, MSME, SERP & NRI సాధికారత శాఖామంత్రి కొండపల్లి శ్రీనివాస్ సదస్సుకు ప్రత్యేక అభినందనలు వీడియో సందేశం రూపంలో తెలియజేశారు. రాధిక మంగిపూడి (ముంబై), విక్రమ్ సుఖవాసి (దోహా) ప్రధాన నిర్వాహకులుగా, శాయి రాచకొండ (హ్యూస్టన్), వంశీ రామరాజు (హైదరాబాద్) దోహా ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ సభ్యులైన సాయి రమేశ్ నాగుల, దాసరి రమేశ్, శేఖరం.ఎస్. రావు, గోవర్ధన్ అమూరు, ఆరోస్ మనీష్ మొదలైనవారు, శ్రీ సుధ బాసంగి, శిరీష్ రామ్ బవిరెడ్డి, రజని తుమ్మల, చూడామణి ఫణిహారం మొదలైన వ్యాఖ్యాతలు 14 ప్రసంగ వేదికలను సమర్ధవంతంగా నిర్వహించారు. ప్రముఖ సాహితీవేత్తలు డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, కవి జొన్నవిత్తుల, వామరాజు సత్యమూర్తి, అద్దంకి శ్రీనివాస్, కవి మౌనశ్రీ మల్లిక్, రాజ్యశ్రీ కేతవరపు, అత్తలూరి విజయలక్ష్మి, చెరుకూరి రమాదేవి, కలశపూడి శ్రీనివాస రావు, గంటి భానుమతి, గరికిపాటి వెంకట ప్రభాకర్, బి.వి. రమణ, ప్రభల జానకి, విశ్వవిద్యాలయ ఆచార్యులు అయ్యగారి సీతారత్నం, శరత్ జ్యోత్స్నా రాణి, త్రివేణి వంగారి, దేవీ ప్రసాద్ జువ్వాడి, కట్టా నరసింహా రెడ్డి, సినీ నిర్మాతలు వై.వి. ఎస్. చౌదరి, మీర్ అబ్దుల్లా, నాట్య గురువు ఎస్.పి. భారతి మొదలైన వక్తలు, కవులు వైవిధ్యమైన అంశాల మీద తమ సాహిత్య ప్రసంగాలను, స్వీయ రచనలను వినిపించారు. వరంగల్ కి చెందిన ప్రొ. రామా చంద్రమౌళి గారికి వంగూరి ఫౌండేషన్ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది, సదస్సులో భాగంగా శ్రీమతి బులుసు అపర్ణ చేసిన అష్టావధానం అందరినీ ప్రత్యేకంగా అలరించడమే కాకుండా, మధ్య ప్రాచ్య దేశాలలోనే జరిగిన తొలి అష్టావధానంగా రికార్డ్ ను సృష్టించింది. రెండవ రోజు సాయంత్రం జరిగిన ముగింపు సభలో నిర్వాహకుల తరఫున వందన సమర్పణ కార్యక్రమంలో వదాన్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. దుబై, అబుదాబి, బెహ్రైన్, ఒమాన్, ఖతార్ తదితర ప్రాంతాల తెలుగు సంఘాల అధ్యక్షులు తెలుగు భాషా, సాహిత్యాల పెంపుదలకి తమ వంతు కృషి చేస్తామని వివరించారు. -
డాల్లాస్‌లో మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
వాషింగ్టన్ : ఎక్కడి ఆంధ్రప్రదేశ్.. ఎక్కడి అమెరికా.. ఆంధ్రాలో ఉన్నన్ని సంప్రదాయాలు.. ఆధ్యాత్మికత అక్కడ ఎందుకు ఉంటుంది.. అది అమెరికా.. అక్కడి జనాలు వేరు.. అందరూ మనలా ఉండరు అని అనుకుంటారు. కార్తీకం అంటే తెలుగు రాష్ట్రాల్లో ఇల్లిల్లూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతుంది. నిత్యం శివారాధన.. ఆలయాల దర్శనాలు.. పూజలు.. ప్రతి ఊళ్లోనూ శివమాలలు వేసుకునే భక్తులు.. అయ్యప్ప దీక్షలు.. వీధుల్లో శరణుఘోష.. తెల్లారితే శివ స్తోత్రాలతో ఒక ప్రశాంత భావన ఉంటుంది.. ఇదే వాతావరణం అమెరికాలో ఉంటుందా ? ఆహా..అది సాధ్యమేనా .. అక్కడివాళ్లకు ఈ పూజలు భజనలు. మాలలు ఉంటాయా.. అంటే అక్కణ్ణుంచి ఒక పెద్దాయన లైన్లోకి వస్తారు.. భలేవారే మీరు అలా సులువుగా తీసిపడేయకండి. మన మాతృ భూమికి దూరంగా ఉన్నా సరే.. మెం మీకన్నా ఎక్కువగా మన సంప్రదాయాలు.. భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాం అంటారు. అంతేకాదు తనతోబాటు వందలమందికి ఈ ఆధ్యాత్మిక సౌరభాలను అందించి వారిని కూడా భక్తిమార్గంలో నడిపిస్తున్నారు.అటు కంప్యూటర్ పని ఇటు అయ్యప్ప భజనలు కొమండూరి రామ్మోహన్ .. అయన ఓ టెక్ కంపెనీ సీఈవో.. నిత్యం ప్రాజెక్టులు.. టీమ్ మీటింగులు.. కార్పొరేట్ డిస్కషన్స్ అంటూ ఏడాదంతా బిజీగా ఉంటారు. కానీ కార్తీకంలో మాత్రం అయన ఆ సీఈవో స్థానం నుంచి కాస్తా పక్కకు జరిగి గురుస్వామిగా మారతారు. అమెరికాలోని డల్లాస్.. టెక్సాస్... వాషింగ్టన్ మినియాపోలిస్ వంటి పెద్ద రాష్ట్రాల్లోని తెలుగు యువతను ఐక్యం చేసి వారిలో భక్తిభావాన్ని నింపుతారు. ఏటా కనీసం ఐదారు వందలమందికి అయ్యప్ప మాలధారణ చేస్తారు. అంతేకాకుండా తొలిసారిగా మాలవేసుకునే ప్రతి కన్నె స్వామి ఇంటికి వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న అయ్యప్ప పీఠాన్ని పర్యవేక్షించి నిత్య పూజలు భజనలు ఎలా చేయాలి.. ఎలాంటి ఆచారాలు పాటించాలి .. మాలధారణ తరువాత మన నడవడిక ఎలా ఉండాలి అనేది పూసగుచ్చినట్లు చెప్పి వారిని స్వాములుగా తీర్చిదిద్దుతారు. ఇప్పటికే పాతికసార్లకు పైగా మల ధారణ చేసిన రామ్మోహన్ గురుస్వామి తాను వీలు కుదిరినప్పుడల్లా శబరిమల వచ్చి అయ్యప్ప దర్శనం చేసుకుని మాల విసర్జన చూస్తుంటానని అన్నారు. అయితే అమెరికాలో ఉంటున్నవారి పరిస్థితి ఏమిటి ? వారు మల విసర్జన ఎలా అంటే.. అమెరికాలో ప్రతి పెద్ద నగరంలోనూ అయ్య్యప్ప ఆలయాలు ఉన్నాయని, అక్కడకు వెళ్లి మాలను విసర్జిస్తాం అని అన్నారు.అత్యంత నిష్ఠతో పూజలు భజనలు అమెరికావాళ్లకు అంత టైం ఉండదు.. ఏదో అలా పూజలు చేసేసి మామ అనిపిస్తారు అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా అమెరికాలోనే అత్యంత భక్తిప్రపత్తులతో అయ్యేప్ప మండల దీక్ష చేస్తారు. ఎక్కడా నిబంధనలు అతిక్రమించకుండా భక్తులంతా వీలును బట్టి ఇళ్లలోనే పీఠాలు పెట్టుకుంటారు. లేనిపక్షంలో పదిమంది కలిసి ఒక ఇంటిని వేరేగా అద్దెకు తీసుకుని అందులో పీఠం పెట్టుకుంటారు. కొంతమంది ఐతే ఇంట్లోని పీఠంలోనే 18 మెట్లతో కూడిన పీఠం పెట్టుకుని పూజలు చేస్తారు. ముఖ్యంగా అత్యంత ఖర్చుతోకూడిన పడిపూజ చేయడానికి ఎంతో వ్యయప్రయాసలకు సైతం సిద్ధం అవుతారు. జెపి మోర్గాన్‌లో పనిచేసే సిస్టమ్స్ ఆర్కిటెక్ సప్తగిరి పద్మనాభం, ఐటి కంపెనీ మేనేజర్ శ్రవణ్, ఉత్తమ్ కుమార్ అనే మరో సీనియర్ మేనేజర్ మాట్లాడుతూ తమకు ఈ నెలన్నారా అత్యంత ప్రశాంతమైన భావన కలుగుతుందని, అటు ఉద్యోగాలు.. ఆఫీస్ బాధ్యతలు చూస్తూనే అయ్యప్ప భజనలు.. పూజలు ఎక్కడా తప్పకుండా కొనసాగిస్తామని చెప్పారు. ఇదంతా తమ గురుస్వామి రామ్మోహన్ గారి ప్రోత్సహంతోనే సాధ్యం అయిందని అన్నారు. ఐటి ఉద్యోగులే కాకుండా హోటళ్లు, రెస్టారెంట్లు, మెడికల్ ప్రొఫెషన్ ఉండేవాళ్ళు సైతం అయ్యప్ప దీక్ష తీసుకుంటారు.శరణు ఘోషతో మార్మోగిన డల్లాస్ తొలిసారి దీక్ష తీసుకున్న సప్తగిరి స్వామి మాట్లాడుతూ ఈ దీక్ష ద్వారా మన మనసు ప్రశాంతత వైపు పయనిస్తుందని.. నిత్యం ధ్యానం చేయడం ద్వారా ఒత్తిడి నుంచి సైతం విముక్తి లభిస్తుందని అన్నారు. మొన్న భారీ ఎత్తున చేపట్టిన పడిపూజకు ఐదువందలమంది దీక్షాధారులతోబాటు కనీసం రెండువేలమంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. రామ్మోహన్ గురుస్వామి మాట్లాడుతూ తాము ఒక పెద్ద గ్రౌండ్ తీసుకుని అక్కడ పడిపూజ చేస్తామని.. ఇది యావత్ డల్లాస్ లో జరిగే పెద్ద కార్యక్రమం అని.. ఇది ఈ ప్రాంతం మొత్తానికి ఆధ్యాత్మిక శోభను తెస్తుందని అన్నారు. మనిషి ఆర్థికంగా ఎంత ఉన్నతంగా ఎదిగినా అద్దేఆత్మికత లేకపోతె జీవితానికి సార్థకత లేదని సెప్పే గురుస్వామి రామ్మోహన్ తనకు చేతనైనంత వరకు యువతలో భక్తిభావాన్ని పెంపొందిస్తుంటానని చెప్పారు. అమెరికాలోనూ అయ్యప్ప ప్రాచుర్యం పొందడం వెనుక ఆ దీక్షలో ఉండే నియమాలు.. ఆరోగ్యకరమైన జీవన విధానం వంటివే కారణముంది... అందుకే యువత పెద్దసంఖ్యలో ఈ దీక్ష తీసుకుంటున్నారని అయన చెప్పారు.-సిమ్మాదిరప్పన్న. -
అమెరికా ఎన్ఆర్ఐ కుటుంబానికి భారీ పరిహారం
హైదరాబాద్: విదేశాల్లో ఉన్న భారత విద్యార్థుల హక్కులను పరిరక్షించడంలో కోర్ ట్రాకర్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాలోని కాన్సాస్ రాష్ట్రంలోని లివ్ అపార్ట్మెంట్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద జరిగిన ఘటనలో మృతి చెందిన ఎన్ఆర్ఐ విద్యార్థి కొల్లి మణిదీప్ కుటుంబానికి ఆ సంస్థ స్ఫూర్తిదాయకమైన సేవలను అందించిందంటూ సంస్థ చైర్మన్ విక్రంసాగర్ పసాలను అభినందించారు.శనివారం మాదాపూర్ టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో మణిదీప్ కుటుంబానికి భారీ నష్టపరిహారం (5.4 కోట్ల రూపాయలు) చెక్కును మంత్రి ఆందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ ఐటీ టెక్నాలజీ సంస్థ కోర్ ట్రాకర్ కృషి ఫలితంగా బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందిందని పేర్కొన్నారు. అమెరికాలో ప్రముఖ న్యాయవాది, హైదరాబాద్‌కు చెందిన అబ్దుల్ క్యూ ఆరిఫ్ బలమైన ఆధారాలు సేకరించి అపార్ట్మెంట్ నిర్వాహకుల నిర్లక్ష్యమే ఈ దుర్ఘటనకు కారణమని వాదనను సమర్థవంతంగా వినిపించారని కొనియాడారు.చదవండి: కెనడా నుంచి అమెరికాలోకి.. చొరబాటుదారుల్లో ఇండియన్సే ఎక్కువ -
ఉన్నత చదువులకు వెళ్లి.. అనంతలోకాలకు
ఖమ్మంక్రైం: ఉన్నత చదువులు పూర్తి కాగానే తమ కుమారుడు ఉద్యోగంలో చేరి కుటుంబానికి ఆసరాగా నిలుస్తాడని భావిస్తున్న తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. కుమారుడిని గొప్ప స్థాయిలో చూడాలని ఆశించి వారు అమెరికాకు పంపించగా అక్కడ దుండుగులు జరిగిన కాల్పుల్లో మృతి చెందాడనే సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎంబీఏ చదివేందుకు వెళ్లిన ఐదు నెలల్లోనే జిల్లాకు చెందిన నూకారపు సాయితేజ(25) మృతి చెందినట్లు సమాచారం అందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.అక్క అక్కడే..ఖమ్మం రూరల్ మండలం రామన్నపేటకు చెందిన నూకారపు కోటేశ్వరరావు కుటుంబంతో కలిసి ఖమ్మం రాపర్తినగర్‌లోని రమణగుట్టలో నివాసం ఉంటున్నాడు. ఆయనకు భార్య వాణితో పాటు కుమార్తె ప్రియ, కుమారుడు సాయితేజ ఉన్నారు. కొన్నాళ్ల క్రితమే ప్రియ అమెరికాకు వెళ్లగా ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. కుమారుడైన సాయితేజ హైదరాబాద్‌లో ఇంటర్, బీబీఎం పూర్తిచేశాక అమెరికా ఎంబీఏ చేసేందుకు పంపించారు. ఆయనకు చికాగో ప్రాంతంలోని కాంకాడ్సి యూనివర్సిటీలో సీటు రావడంతో ఈ ఏడాది జూన్ 15వ తేదీన అక్కడకు బయలుదేరాడు. అమెరికా వెళ్లాక సాయితేజ మరికొందరు స్నేహితులతో కలిసి అద్దె గదిలో ఉంటూ పార్ట్‌టైం ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. ఖమ్మంలో ఉన్న తల్లిదండ్రులకే కాక అమెరికాలోని మరో ప్రాంతంలో ఉన్న తన సోదరి ప్రియకి ఫోన్ చేస్తుండేవాడు. వారంలో కనీసం మూడు రోజులైనా గ్రూప్ కాల్ మాట్లాడుకునేవారు. ఎంబీఏ పూర్తికాగానే మంచి ఉద్యోగం సాధిస్తానని, తల్లిదండ్రులను సైతం అమెరికా తీసుకెళ్తానని తరచుగా చెప్పేవాడు.ఏం జరిగింది...సాయితేజ అమెరికాలోని ఓ స్టోర్‌లో పార్ట్‌టైం ఉద్యోగం చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఆయన క్యాష్‌కౌంటర్‌లో ఉండగా తుపాకులతో వచ్చిన దుండగులు బెదిరించడంతో డబ్బులు ఇచ్చేసి పక్కన నిల్చున్నాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో కానీ దుండగులు అతి సమీపం నుంచి కాల్చడంతో సాయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు ఆయన స్నేహితులకు తెలపడంతో వారు కోటేశ్వరరావుకు ఫోన్లో సమాచారం ఇచ్చారు. కాగా, శుక్రవారం కూడా సాయితేజ తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడగా శనివారం ఫోన్ కోసం ఎదురుచూస్తుండగా పిడుగు లాంటి వార్త తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. తల్లి వాణికి మృతి చెందినట్లు కాకుండా గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అమెరికాలోని తానా సభ్యులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడి సాయి మృతదేహాన్ని త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో ఐదు రోజుల్లో మృతదేహం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.ఎంపీలు, ఎమ్మెల్సీ సంతాపంఖమ్మం మయూరిసెంటర్/ఖమ్మంవన్‌టౌన్: అమెరికాలో ఖమ్మం విద్యార్ధి నూకారపు సాయితేజ మృతి చెందడంపై ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. ఈ మేరకు ఆయన కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించారు. అలాగే, అమెరికా నుంచి సాయితేజ మృతదేహాన్ని త్వరగా రప్పించేలా కృషి చేస్తామని తెలిపారు. కాగా, సాయితేజ కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పరామర్శించారు. ఆయన మృతదేహాన్ని ఖమ్మం త్వరగా పంపించేలా ఏర్పాట్లు చేయాలని తానా బాధ్యులైన లావు అంజయ్య చౌదరి, లావు శ్రీనివాస్ తదితరులను ఫోన్లో కోరారు. ఎమ్మెల్సీ వెంట నాయకులు బెల్లం వేణుగోపాల్ తదితరులు ఉన్నారు. -
భార్యకోసం బంగారు గొలుసుకొన్నాడు.. దెబ్బకి కోటీశ్వరుడయ్యాడు!
భారతీయ సంతతికి చెందిన వ్యక్తి భార్య కోసం బంగారు గొలుసు కొనుగోలు చేసి జాక్‌పాట్ దక్కించు కున్నాడు. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8 కోట్ల లాటరీ గెల్చుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టోరీ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎక్కడ? ఎలా? అని ఆసక్తిగా ఉంది కదూ? అయితే క్షణం ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందాం పదండి! సింగపూర్‌లో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి రాత్రికి రాత్రికే కోటీశ్వరుడయ్యాడు. మూడు నెలల క్రితం భార్య సంతోషం కోసం సుమారు రూ. 3 లక్షల రూపాయలతో ఒక గోల్డ్ చైన్ కొన్నాడు. ప్రతీ ఏడాది నిర్వహించే లాటరీలో భాగంగా గత ఆదివారం (నవంబర్ 24) జ్యువెలరీ కంపెనీ నిర్వహించిన లక్కీ డ్రాలో 8 కోట్ల రూపాయలకు పైగా బహుమతిని గెలుచుకున్నాడు. దీంతో కుటుంబం అంతా సంతోషంతో పొంగిపోయింది. “ఈ రోజు మా నాన్నగారి నాలుగో వర్ధంతి.. ఇది ఆయన ఆశీర్వాదం’’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు చిదంబరం. సింగపూర్‌లో ఉన్న ఇన్నాళ్లకు అదృష్టం వరించిందనీ, తన తల్లితో ఈ శుభవార్త పంచుకోవాలంటూ సంతోషం వ్యక్తం చేశాడు. తనకు వచ్చిన ఈ డబ్బులో కొంత సమాజానికి విరాళంగా ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపాడు.ముస్తఫా జ్యువెలరీ షాపులో 250 సింగపూర్ డాలర్ల కన్నా ఎక్కువ విలువైన ఆభరణాలు కొనుగోలు చేసిన వారు లక్కీ డ్రాకి అర్హులు. ఈ లక్కీ డ్రాలో సింగపూర్‌లో 21 ఏళ్లుగా ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాలసుబ్రమణ్యం చిదంబరం టాప్ ప్రైజ్‌ని కైవసం చేసుకున్నట్లు ఆసియా వన్ తెలిపింది. ఈయనతోపాటు మరి కొంతమందికి కూడా భారీ బహుమతులను అందించినట్టు కంపెనీ తెలిపింది. View this post on Instagram A post shared by Mustafa Jewellery Singapore (@mustafajewellerysg) -
తానా ఆధ్వర్యంలో వైభవంగా 'మన భాష–మన యాస’ 'మాండలిక భాషా అస్తిత్వం'
డాలస్, టెక్సస్: తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం “నెల నెలా తెలుగు వెలుగ్ఙు పేరిట నిర్వహిస్తున్న 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “మన భాష మన యాస “మాండలిక భాషా అస్తిత్వం అనే కార్యక్రమం వైభవంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకు ఆత్మీయ స్వాగతం పలికి వివిధ ప్రాంతాల మాండలిక భాషలు వాటి సొగసును సోదాహరణంగా వివిరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “కేవలం మన తెలుగు రాష్ట్రాలలోనే గాక తెలుగునేలనుండి తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర మొదలైన రాష్ట్రాలతో పాటు శ్రీలంక, మయన్మార్, మారిషస్ మొదలైన దేశాలకు వలసవెళ్ళిన తెలుగు కుటుంబాలవారు కూడా వివిధ రకాల యాసలతో తెలుగు భాషను సజీవంగా ఉంచడానికి శతాబ్దాలగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మాండలిక భాషలోఉన్న సహజ సౌందర్యం నిరాదరణకు, నిర్లక్ష్యానికీ గురికాకుండా అస్తిత్వం నిలుపుకుంటూ మాండలిక భాషలో ఎంతో సాహిత్య సృజన చేయవలసిన అవసరం ఉందన్నారు మన దేశంలోనే ఒక లంబాడీ గిరిజన మహిళ ఒక విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎన్నికకాబడిన తొలి మహిళ ‘వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయ’ ఉపకులపతి ఆచార్య డా. సూర్యా ధనంజయ్ ముఖ్యఅతిథిగా పాల్గొని “ఇలాంటి ముఖ్యమైన అంశంమీద సమావేశం నిర్వహిస్తున్న తానా ప్రపంచసాహిత్యవేదిక కృషిని అభినందిస్తూ, మాండలిక భాషలతో పాటు, లిపిలేని లంబాడీ భాషల లాంటి భాషలకు లిపిని కల్పించి పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లిపి ద్వారా ఆయా తెగల జీవన విధానం, ఆచార వ్యవహారాలను సజీవంగా చిత్రీకరించవచ్చు అన్నారు.్ఙ విశిష్టఅతిథిగా పాల్గొన్న సుప్రసిద్ధ రచయిత, ఆంధ్రప్రదేశ్ పూర్వ భాషా, సాంస్కృతిక శాఖా నిర్దేశకులు డా. డి. విజయభాస్కర్ ‘ఉత్తరాంధ్ర యాస’ అస్తిత్వంపై శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం ప్రాంతాల ప్రజల యాసల మాధుర్యాన్ని, ఆ సాహిత్య సృజనచేసిన ఆయా ప్రాంత కవుల, రచయితల పాత్రను వివరించారు. లిపిలేని “రెల్ల్ఙి జాతికి చెందిన ప్రముఖ రచయిత మంగళగిరి ప్రసాదరావు పారిశుద్ధ్య కార్మికులుగా రెల్లి కులస్తులు చేస్తున్న సేవ, రెల్లి భాషకు లిపి కల్పిస్తేనే, ఇంకా ఎక్కువ సాహిత్యం వస్తేనే, వారి జీవనవిధానం పైన యితరులకు అవగాహన కలుగుతుంది అన్నారు. విద్యారంగంలో 50కు పైగా డిగ్రీలు సాధించిన అరుదైన విద్యావేత్త, వృత్తిపరంగా మానసిక వైద్యనిపుణులు, రాజమహేంద్రవరంవాసి, ‘అర్థంపర్థం’ అనే శీర్షికతో ఇప్పటికే ఏడువందలకు పైగా ఎపిసోడ్స్ రాసిన తెలుగు భాషాభిమాని డా. కర్రి రామారెడ్డి చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రముఖ రచయిత, సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డా. చింతకుంట శివారెడ్డి రాయలసీమ మాండలికంలో నిత్యం వాడుకలోఉండే అనేక పదాలకు అర్థాలు, వాటి విశిష్టతను ఆసక్తికరంగా పంచుకున్నారు. తెలంగాణ ప్రాంత వాసి, ప్రస్తుతం కాశీ హిందూ విశ్వవిద్యాలయం, వారణాశిలో భాషాశాస్త్రంలో సహయాచార్యులుగా ఉన్న డా. గట్ల ప్రవీణ్ తెలంగాణా భాషా మాధుర్యాన్ని, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మాండలిక భాషల వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ఉభయ తెలుగు రాష్ట్రాలలో వేర్వేరు ప్రాంతాల ప్రజల మాండలిక భాషను ఒకే వేదికమీద ఒకేసారి సమీక్షించడం ఒక్క తానా ప్రపంచసాహిత్యవేదికకు మాత్రమే సాధ్యమైంది అన్నారు. ఎంతో సమయం వెచ్చించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకె ద్వారా వీక్షించవచ్చును: https://youtube.com/live/pd6wroBTRLg -
జపాన్‌లో ‘తాజ్’ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు
పుణ్య కార్తీకమాసం సందర్భంగా వనభోజనాల కార్యక్రమాన్ని జపాన్‌లోని తెలుగు అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. జపాన్‌లో నవంబర్ 24, ఆదివారం, తాజ్ (Telugu Association of Japan) అధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా జరుపుకున్నారు. చిన్నా పెద్దా అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ వేడుక ఆద్యంతం ఆటపాటలతో ఆనందంగా గడిపారు. అనంతరం పిల్లలు, పెద్దలు విందు భోజనాన్ని ఆరగించారు. -
దుస్తుల నుంచి కర్రీ వాసనలు రాకూడదంటే..!
చాలామంది భారతీయులు ఎక్కువగా విదేశాల్లోనే స్థిరపడుతున్నారు. ఇక అక్కడ ఉండే మన వాళ్లకు కొన్ని విషయాల్లో మన భారత్‌లో ఉన్నట్లు కుదరదు. ఆ దేశ నియమ నిబంధనలకు అనుగుణంగా మలసుకోక తప్పదు. అలాంటి వాటికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమె ఆ వీడియోలో మన భారతీయ వంటకాల వాసనలు దుస్తుల నుంచి రాకూడదంటే ఏం చేయాలో.. కొన్ని చిట్కాలను షేర్ చేశారు.మన భారతీయులు వంట చేయగానే కూర వాసన చూస్తారు. ఆ తర్వాత రుచి ఎలా ఉందో చూస్తాం. పైగా ఆ ఘుమ ఘుమలు వండిన వాళ్ల శరీరం నుంచి రావడం మాములే. కానీ పాశ్చాత్యా దేశాల్లో ప్రజల తీరు చాలా క్లీన్‌గా.. క్రమపద్ధతిలో ఉంటుంది. అక్కడ ఆహారాలన్నీ మన వంటకాల మాదిరి ఘుమఘుమలు రావు. అందువల్ల బట్టలకు గనుక కూర వాసన వస్తే చాలు వాళ్లు భారతీయులు అన్నట్లు గుర్తించడమే గాక అదోలా ముఖాలు పెట్టుకుంటారు కూడా. అందువల్ల ఆ వాసన రాకుండా కాస్త జాగ్రత్తలు తప్పనిసరి ఆ విషయాన్నే కంటెంట్ క్రియేటర్ శివీ చౌహాన్ నెట్టింట షేర్ చేసింది. తనకు కూడా అలా దుస్తుల నుంచి కూరల వాసన రావడం ఇష్టముండదట. అలా కర్రీ వాసన రాకుండా ఎలా జాగ్రత్తపడాలో కొన్ని చిట్కాలు కూడా చెప్పుకొచ్చింది. మన భారతీయ వంటకాల్లో ఉల్లిపాయలు, మసాలాలు ఉంటాయి. వాటి ఘాటు వాసన దుస్తులను అంటిపెట్టుకుని ఉంటుంది. కాబట్టి వంట చేసేటప్పడు ధరించిన బట్టలనే బయటకు వెళ్లేటప్పడు ధరించొద్దని అంటున్నారు. అలాగే వంట చేసే సమయంలో జాకెట్లు ధరించకపోవడమే మంచిదని సూచించింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. ఆమెది శ్వేతజాతీయుల భావన అని తిట్టిపోస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Shivee Chauhan | Indian in USA | Desi Lifestyle (@shiveetalks) (చదవండి: గత 75 ఏళ్లుగా ఫ్రీ టిక్కెట్ సర్వీస్ అందిస్తున్న ఏకైక రైలు ఇదే..!) -
దుబాయ్‌లో ఘనంగా కార్తీక వనభోజన మహూత్సవం
క్రోధి నామ సంవత్సర బ్రాహ్మణ కార్తిక వనసమారాధనన కార్తీక సమో మాసః న దేవః కేశవాత్పరమ్ న చ వేద సమం శాస్త్రం, న తీర్థం గంగాయాన్సమమ్మాసాలన్నిటిలో మహిమాన్వితమైనది కార్తీకమాసం. హరిహరులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ మాసం. ఇటువంటి పవిత్ర కార్తీక మాసంలో, శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఉసిరి, రావి, తులసి, జమ్మి వంటి దేవతా వృక్షాల చెంత వనభోజనాలు, ఉసిరి కాయలతో దీపారాధన వంటివి భారతావనిలో సర్వసాధారణం. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అన్ని ఎమిరేట్స్ నుంచి వందలమంది ఉభయ రాష్ట్రాల తెలుగు బ్రాహ్మణులు అందరూ కలసి దుబాయిలోని అల్ మంజార్ బీచ్ పార్క్‌లో కార్తీక వనసమారాధనను నవంబర్ 17, ఆదివారం అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.గాయత్రి మహిళల భక్తి గీతాలు, దీపాధనలతో ప్రారంభం అయిన కార్యక్రమాలు పిల్లలు పెద్దల ఆత్మీయ పలకరింపులు, పాటలు, కేరింతలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొనసాగాయి. సంప్రదాయ తెలుగు రుచుల కార్తిక వనభోజనాల సందర్భంగా జరిగిన ధార్మిక ప్రశ్నావళి, ఆటలు, తంబోల, కామేశ్వరరావు హాస్యభరిత సందేశ కార్య్రాక్రమం, ఆదిభట్ల కామేశ్వరశర్మ ఉపదేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా పలువురు సాహితీవేత్తలకు ఆత్మీయ సన్మానం చేసి జ్ఞాపికలను బాహూకరించారు. యుఎఈలో సనాతనం, సంఘటితం, సత్సంగం, సహకారం, సత్సంబంధం అనే పంచ సూత్రాల ఆధారంగా ఏర్పడిన గాయత్రీ కుటుంబం (తెలుగు బ్రాహ్మణ సంఘం) ఆధ్వర్యంలో వనసమారాధన ఆధ్యంతం కన్నులపండువగా జరిగింది. కుటుంబ సభ్యులు కల్లేపల్లి కుమార్ చంద్రశేఖర్ ఆకస్మిక మృతి పట్ల సభ్యులు అందరూ ప్రగాఢ సహానుభూతి ప్రకటించి నివాళులు అర్పించారు. -
అమెరికాలో భారతీయ విద్యార్థుల హవా
ఉన్నత చదువులకు ఆకర్షణీయమైన గమ్యస్థానం అమెరికా. అగ్రరాజ్యంలో చదువుకోవడం, అక్కడే ఉద్యోగం సంపాదించుకోవడం ప్రపంచవ్యాప్తంగా యువత కల. అమెరికాకు విద్యార్థులను పంపించడంలో చైనా ముందంజలో ఉండేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భారత్ దక్కించుకుంది. అమెరికాలో ప్రస్తుతం 3.3 లక్షల మందికిపైగా భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. అమెరికాకు విద్యార్థులను పంపిస్తున్న దేశాల జాబితాలో భారత్ తొలిస్థానంలో నిలవడం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. ఈ విషయాన్ని ‘ఓపెన్ డోర్స్’సోమవారం తమ నివేదికలో వెల్లడించింది. 2022–23 విద్యా సంవత్సరంలో అమెరికాలో చైనా విద్యార్థులే అధికంగా ఉండేవారు. ఆ తర్వాతి స్థానం భారతీయ విద్యార్థులది. సంవత్సరం తిరిగేకల్లా పరిస్థితి మారిపోయింది. 2023–24 విద్యా సంవత్సరంలో మొదటి స్థానంలో భారతీయ విద్యార్థులు, రెండో స్థానంలో చైనా విద్యార్థులు ఉన్నారు. ⇒ 2023–24లో అమెరికాలో 3,31,602 మంది భారతీయ విద్యార్థులు చదువుకుంటున్నారు. 2022–23లో 2,68,923 మంది ఉన్నారు. విద్యార్థుల సంఖ్య ఈసారి ఏకంగా 23 శాతం పెరిగింది. ⇒అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 29 శాతం కావడం గమనార్హం. ⇒ఇండియా తర్వాత చైనా, దక్షిణ కొరియా, కెనడా, తైవాన్ దేశాలున్నాయి. ⇒చైనా విద్యార్థులు 2.77 లక్షలు, దక్షిణ కొరియా విద్యార్థులు 43,149, కెనడా విద్యార్థులు 28,998, తైవాన్ విద్యార్థులు 23,157 మంది ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ⇒2008/2009లో అమెరికాలోని మొత్తం విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అత్యధికంగా ఉండేవారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ పరిస్థితి పునరావృతమైంది. ⇒ ఒక విద్యా సంవత్సరంలో 3,31,602 మంది అమెరికాలో చదువుకుంటుండడం ఇదే మొదటిసారి. ⇒అంతర్జాతీయ గ్రాడ్యుయేట్(మాస్టర్స్, పీహెచ్డీ) విద్యార్థులను అమెరికాకు పంపుతున్న దేశాల జాబితాలో ఇండియా వరుసగా రెండో ఏడాది తొలిస్థానంలో నిలుస్తోంది. ఇండియన్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది 19 శాతం పెరిగి 1,96,567కు చేరుకుంది. ⇒ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల సంఖ్య 13 శాతం పెరిగి 36,053కు చేరింది. ఇండియన్ నాన్–డిగ్రీ విద్యార్థుల సంఖ్య 28 శాతం తగ్గిపోయి 1,426కు పరిమితమైంది. ఓపెన్ డోర్స్ రిపోర్టును ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్(ఐఐఈ) ప్రచురించింది. ఈ సంస్థను 1919లో స్థాపించారు. అమెరికాలోని విదేశీ విద్యార్థులపై ప్రతిఏటా సర్వే నిర్వహిస్తోంది. వారి వాస్త వ సంఖ్యను బహిర్గతం చేస్తోంది. 1972 నుంచి యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ స్టేట్స్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్, కల్చరల్ అఫైర్స్ కూడా సహకారం అందిస్తోంది. -
‘ఐక్యరాజ్య సమితి’లో ఎంపీ విజయసాయిరెడ్డి
ఢిల్లీ, సాక్షి: వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సందర్శించారు. అంతకు ముందు.. జనరల్ అసెంబ్లీ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. మహాత్మా గాంధీ ప్రవచించిన శాంతి, అహింస, ఐక్యత ప్రపంచానికి ఆదర్శమైందని ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్ కు భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి సభ్యులుగా వెళ్లిన సంగతి తెలిసే ఉంటుంది. ఈ అవకాశంపై ఆయన స్పందిస్తూ.. అంతర్జాతీయ వేదికల్లో భారత్ కు ప్రాతినిధ్యం వహించడం గర్వించదగ్గ విషయమన్నారు. This week, I am in New York as part of India’s Non-Official Delegation to the 79th Session of the UNGA. Engaging with global stakeholders on critical issues of peace and conflict, we have had the opportunity to interact with UN organizations and representatives from the Permanent… pic.twitter.com/2pMdbTiTvX— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024శాంతి, అంతర్యుద్ధాలు.. లాంటి ఎన్నో అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు సాధారణ అసెంబ్లీలో మాట్లాడతారు. నవంబర్ 23వ తేదీ దాకా ఈ సెషన్ జరగనుంది.Offered floral tributes at the Mahatma Gandhi Bust on the United Nations Lawn during the 79th Session of the UNGA. A moment to honor the ideals of peace, nonviolence, and unity that continue to inspire the world. #UNGA79 #MahatmaGandhi #PeaceForAll #GlobalUnity pic.twitter.com/elppFhiAun— Vijayasai Reddy V (@VSReddy_MP) November 19, 2024 -
సిమ్రత్ కేసులో కెనడా పోలీసుల కీలక ప్రకటన
భారత సంతతికి చెందిన యువతి గుర్సిమ్రత్ కౌర్(19).. ఓ ప్రముఖ స్టోర్‌లోని వాక్ ఇన్ ఒవెన్‌లో శవమై కనిపించడం తెలిసిందే. ఆమె మృతిపై తల్లితో సహా సహోద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ కేసు విచారణ జరిపిన కెనడా పోలీసులు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తైందని, అనుమానాస్పద హత్యగా అనిపించలేదని హాలీఫాక్స్ పోలీసులు సోమవారం ప్రకటించారు. అలాగే.. తప్పు జరిగిందనడానికి ఆధారాలు కూడా లేవని వెల్లడించారు. ‘‘ఈ కేసులో ఏం జరిగిందో అనేదానిపై అనేక మంది అనేక ప్రశ్నలు లేవనెత్తారు. కానీ, మా విచారణలో అలాంటి అనుమానాలేవీ మాకు కనిపించలేదు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు మాకు అనిపించడం లేదు. ఈ కేసు దర్యాప్తు పూర్తైంది’’ అని ఓ అధికారి వీడియో సందేశంలో తెలిపారు.Statement on Sudden Death Investigation pic.twitter.com/0IsyAfMkzX— Halifax_Police (@HfxRegPolice) November 18, 2024 పంజాబ్‌కు చెందిన 19 ఏళ్ల గురుసిమ్రన్.. గత రెండేళ్లుగా తన తల్లితో కలిసి హాలీఫాక్స్‌లోని వాల్‌మార్ట్ షోరూంలో పని చేస్తోంది. తండ్రి, సోదరుడు భారత్‌లోనే ఉంటారు. అయితే కిందటి నెలలో.. వాక్ ఇన్ ఒవెన్‌లో ఆమె అనుమానాస్పద రీతిలో శవమై కనిపించింది.సిమ్రన్ ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆమె స్టోర్ మొత్తం వెతికింది. చివరకు ఒవెన్ నుంచి పొగలు రావడం గమనించి స్టోర్ సిబ్బంది అనుమానంతో తెరిచి చూడగా అందులో కాలిపోయిన స్థితిలో గురుసిమ్రన్ మృతదేహం కనిపించింది. సిమ్రన్ మృతిపై తల్లి అనుమానాలు వ్యక్తం చేశారు. మరోవైపు ఆమెను బలవంతంగా అందులో ఎవరో నెట్టేసి హత్య చేసి ఉంటారని, వాక్ ఇన్ ఒవెన్ తలుపు లాక్ చేసి ఉండడమే తమ అనుమానాలకు కారణమని సిమ్రన్ సహోద్యోగులు చెప్పారు. కానీ, పోలీసులు మాత్రం అనుమానాలేవీ లేవని చెబుతుండడం గమనార్హం.