ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్‌రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది.
2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్‌క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్‌రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.


