prisonment
-
జయప్రదకు బిగ్ షాక్.. జైలు శిక్ష విధించిన కోర్టు..
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు చెన్నై కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పును వెల్లడించింది. అలాగే, జరిమానా కూడా విధించింది. వివరాల ప్రకారం.. తమిళనాడులోని ఎగ్మోర్ కోర్టు జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. అయితే, చెన్నైకి చెందిన రామ్ కుమార్, రాజబాబుతో కలిసి జయప్రద అన్నారోడ్డులో ఓ సినిమా థియేటర్‌ను నడిపించారు. కాగా, ఈ సినిమా థియేటర్లో పనిచేసే కార్మికులు నుంచి వసూలు చేసిన ఈఎస్ఐ మొత్తాన్ని చెల్లించలేదని కార్మిక బీమా కార్పోరేషన్ కోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. అయితే, దీనిపై విచారణ జరిపిన కోర్టు.. జయప్రదతో పాటుగా మరో ముగ్గురికి ఎగ్మోర్ కోర్టు ఆర్నెళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. అలాగే, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించింది. ఇదిలా ఉండగా.. జయప్రద తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె.. తెలుగు సహా పలు భాషల చిత్రాల్లో నటించారు. రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్గా తన మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా దిగ్విజయంగా విజయ యాత్రను కొనసాగించారు. நடிகை ஜெயப்பிரதாவுக்கு 6 மாதம் சிறை#JayaPrada | #Jail pic.twitter.com/GKUcmO6ViJ — Kumudam Reporter (@ReporterKumudam) August 11, 2023 -
ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆదిలాబాద్ కోర్టు సంచలన తీర్పు
సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్ జిల్లా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పుపై బాధితులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉట్నూర్ బస్‌స్టేషన్ సమీపంలో ఈ ఏడాది ఏప్రిల్ 15వ తేదీన షేక్ ఖాలిద్(45) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించింది. కాగా, ఈ జైలు శిక్ష.. జీవిత ఖైదు కన్నా ఎక్కువ కావడం విశేషం. ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై పోలీసులు స్పందించారు. ఈ దారుణ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం, 60 రోజుల్లోనే ఛార్జ్‌షీట్ వేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత, పోలీసులందరూ టీమ్‌గా వర్క్‌గా పనిచేసి కోర్టుకు సకాలంలో అన్ని ఆధారాలను సమర్పించారు. కేవలం 135 రోజుల్లోనే కోర్టు విచారణ చేసినట్టు తెలిపారు. ఇక, నిందితుడి ఇలాంటి వేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతోనైనా భవిష్యత్త్‌లో ఇలాంటి దారుణాలు చేసేందుకు నిందితులు భయపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. -
దొంగచాటుగా ఫోన్ చూస్తే జైలుకే...
రియాద్ : ఇటీవలి కాలంలో మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ ఫోన్లే సాక్ష్యధారాలుగా నిలుస్తుండటంతో కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, 5లక్షల సౌది రియోల్(దాదాపు రూ. 86.5 లక్షలు) జరిమానా విధించనున్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది. -
దంపతులకు మూడేళ్ల జైలు
వరంగల్ లీగల్ : నగరంలోని మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో తొమ్మిది దొంగతనాలు, చైన్‌స్నాచింగ్ నేరాలకు పాల్పడిన ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి కాలనీకి చెందిన నేరస్తులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులకు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 10 వేల చొప్పున జరిమానా విధిస్తూ మంగళవారం మొదటి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి టి.అనిత తీర్పు వెల్లడించారు. డాబాపై నిద్రిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అర్ధరాత్రి లాక్కెళ్లడం, బతుకమ్మ ఆడి వస్తున్న మహిళలను టార్గెట్ చేసి ద్విచక్ర వాహనంపై వచ్చి విలువైన బంగారు ఆభరణాలను లాక్కెళ్లడం, శుభకార్యాలకు వెళ్లిన గృహిణులను దారివెంట వెంబడించి ఎవరూ లేని సమయంలో అడ్రసు అడిగే నెపంతో దగ్గరకు వచ్చి విలువైన బంగారు వస్తువులు లాక్కోవడం, కుటుంబ సమేతంగా వెళ్తున్న వారితో కలిసి ఆటోల్లో ప్రయాణం చేసి, ఆటో కుదుపుల సమయంలో బంగారు ఆభరణాలు ధరించిన మహిళలపైపడి అనుమానం రాకుండా ఆభరణాలు తీసుకోవడంవంటి ఘటనలు మిల్స్‌కాలనీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉర్సు, శివనగర్ రైల్వేగేట్ పెరుకవాడ, ఎస్‌ఆర్‌ఆర్‌తోట, క్రిస్టియన్‌కాలనీ తదితర ప్రాంతాల్లో వరుసగా జరిగాయి. 2013లో రెండు చోరీలు, 2014లో నాలుగు, 2015లో మూడు చైన్‌స్నాచింగ్‌లు జరగగా బాధితుల ఫిర్యాదు మేరకు మిల్స్‌కాలనీ పోలీసులు తొమ్మిది కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఇల్లెందు సింగరేణి కాలనీకి చెందిన దంపతులు బానోతు రవి, రాజేశ్వరి దంపతులు ఈ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు తేలింది. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరపరచగా విచారణలో నేరాలు రుజువు కావడంతో నేరస్తులకు అన్ని కేసుల్లో విధించిన శిక్షలు ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు. కేసు ప్రాసిక్యూషన్ తరఫున పీపీ డీవీ రామ్మూర్తి వాదించగా సీఐ కె.సత్యనారాయణ, ఎస్సై జి.శ్రీదేవి, బి.రవీందర్ పరిశోధించారు. లైజన్ ఆఫీసర్ నారాయణదాసు విచారణ పర్యవేక్షించగా సాక్షులను కానిస్టేబుల్ జి.జ్ఞానేశ్వర్ కోర్టులో ప్రవేశపెట్టారు. -
తాగి వాహనాలు నడిపిన 9 మందికి జైలు
తాగి వాహనాలు నడిపిన 9 మందికి జైలు ములుగు : మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డ 9 మందికి ములుగు సివిల్ కోర్టు జైలు శిక్ష విధించింది. వరంగల్‌కు చెందిన లింగంపల్లి సత్యనారాయణ, హన్మకొండకు చెందిన న న్నెబోయిన విజయ్‌కుమార్, హైదరాబాద్‌కు చెందిన ముక్కె విష్ణు, మెదక్‌కు చెందిన కాంతం కుమార్, నల్గొండకు చెందిన గాదం కిశోర్, పోతరాజుపల్లికి చెందిన మోకిడి నగేశ్, తాడ్వాయికి చెందిన మెట్టపల్లి సతీశ్, ఎండీ.నయీం , జనగామకు చెందిన నిడిగొండ నర్సింహులు కు రెండు రోజుల జైలు శిక్షతో పాటు రూ. 2,100 జరిమానా విధించారు. గత ఆది, సోమవారాల్లో నిర్వహించిన తనిఖీలలో మొత్తం 25 మంది పట్టుబడ్డారని పేర్కొన్నారు. వారిని కోర్టులో హాజరుపర్చగా 16 మందికి రూ.2,100 జరిమానా, తొమ్మిది మందికి జైలు శిక్ష విధించారని ఎస్సై మల్లేశ్‌యాదవ్ తెలిపారు. -
లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష
రంగారెడ్డి(తాండూరు): రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌కు ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధిస్తూ జిల్లా అదనపు న్యాయవాది రంగారావు గురువారం తీర్పు వెల్లడించారు. తాండూరు పట్టణ సీఐ వెంకట్రామయ్య కథనం ప్రకారం..2013 సంవత్సరంలో తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన దొరళ్ల చించేడి మాణెయ్య(55) సైకిల్‌పై వెళ్తుండగా వేగంగా వస్తున్న లారీ ఆయనను ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు లారీ డ్రైవర్ వీరప్పను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా, కొంతకాలం క్రితం తాండూరు మున్సిఫ్‌కోర్టు న్యాయమూర్తి నిందితుడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానాను విధిస్తూ తీర్పు చెప్పారు. జైలు శిక్షను తగ్గించాలని కోరుతూ లారీ డ్రైవర్ వీరప్ప వికారాబాద్‌లోని జిల్లా అదనపు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. గురువారం పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి కిందికోర్టుతీర్పును సమర్థిస్తూ అదే శిక్షను విధించారు.