రియాద్ : ఇటీవలి కాలంలో మహిళ స్వేచ్ఛకు ఊతమిచ్చేలా పలు నిర్ణయాలు తీసుకుంటున్న సౌదీ ప్రభుత్వం తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేశంలో పెరిగిపోతున్న విడాకుల కేసుల్లో మొబైల్ ఫోన్‌లే సాక్ష్యధారాలుగా నిలుస్తుండటంతో కొత్త యాంటీ సైబర్ క్రైమ్ చట్టాన్ని తీసుకొచ్చింది.
ఈ చట్టం ప్రకారం భార్య, భర్త ఎవరైనా తమ జీవిత భాగస్వామి ఫోన్‌లోని డేటాను దొంగచాటుగా పరిశీలిస్తే దానిని నేరంగా పరిగణించాల్సి ఉంటుందని సోమవారం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేరానికి పాల్పడే వారికి ఒక సంవత్సరం జైలు శిక్షతోపాటు, 5లక్షల సౌది రియోల్(దాదాపు రూ. 86.5 లక్షలు) జరిమానా విధించనున్నారు. వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకే ఈ చట్టం తీసుకొచ్చినట్టు ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment