భార్యను ఎలా కొట్టాలంటే!
వాషింగ్టన్: ‘‘భర్తతో సమానంగా ఉండాలని కోరుకునే భార్యలను తప్పనిసరిగా కొట్టి అణచేయాలి. భార్యను కొట్టడమంటే ఏదో కోపం తీర్చుకోడానికి కాదు, ఆమెను క్రమశిక్షణతో ఉంచడానికే..’’ ఈ మాటలు ఏ టీవీ సీరియల్లోనివో కాదు. సాక్షాత్తూ కుటుంబ కలహాలను తీర్చే ఫ్యామిలీ థెరపిస్టు అన్నవి! పైగా ఆయనగారి ప్రసంగాన్ని ఏకంగా ప్రభుత్వ టీవీ చాన ల్లో ప్రసారం చేశారు.
ఈ వ్యవహారం ఫిబ్రవరిలో సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. సదరు ఫ్యామిలీ థెరపిస్టు పేరు ఖలీద్ అల్ సఖాబీ. ‘భార్యను కర్రతో, కత్తితో కొట్టకూడదు. పళ్లు తోముకునే పుల్ల, చేతిరుమాలు వంటి వాటితో కొట్టాలి. ఆమెను కొట్టేముందు.. భర్త తన హక్కులను, ఆమె బాధ్యతలను గుర్తుచేయాలి’ అని సఖాబీ అన్నాడు.