family dispute
-
పోలీసులు అతిగా జోక్యం చేసుకోవద్దు
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వివాదాల్లో అతిగా జోక్యం వద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. మొదట సమస్యను పరిష్కరించుకునే అవకాశం వారికి ఇవ్వాలని... అది సాధ్యం కాకుంటే చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించింది.మోహన్‌బాబు ఇంటి వద్ద పోలీస్ పికెట్ సాధ్యం కాకుంటే.. ప్రతి రెండు గంటలకోసారి భద్రత పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసింది. అలాగే మోహన్‌బాబు, విష్ణులకు రాచకొండ పోలీసులు జారీ చేసిన నోటీసులను నిలిపివేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మోహన్‌బాబు పిటిషన్‌తో..: తనపై దాడి చేశారంటూ మోహన్‌బాబు కుమారుడు, నటుడు మంచు మనోజ్ ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీ షరీఫ్ పోలీసులు.. బుధవారం ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరుకావాలని మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌లకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటీసులను సవాల్ చేస్తూ మోహన్‌బాబు బుధవారం హైకోర్టులో లంచ్‌మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని, ఆస్పత్రిలో ఉన్నానని.. ఈ పరిస్థితుల్లో పోలీసుల విచారణకు హాజరుకాలేనని కోర్టుకు వివరించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున హోంశాఖ జీపీ మహేశ్‌రాజే వాదనలు వినిపిస్తూ.. పరస్పర ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసులు నమోదయ్యాయని వివరించారు. అలాగే జర్నలిస్టుపై దాడి చేసినందుకు మోహన్‌బాబుపై మరో క్రిమినల్ కేసు నమోదైందని తెలిపారు. ఇక మనోజ్ బౌన్సర్లను తీసుకొచ్చి మోహన్‌బాబు ఇంట్లో తగాదా సృష్టిస్తున్నారని మోహన్‌బాబు తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. బీఎన్ఎస్ఎస్, సెక్షన్ 126 ప్రకారం రాచకొండ పోలీస్ కమిషనర్ జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రాచకొండ పోలీసుల ఎదుట మోహన్‌బాబు, విష్ణు హాజరుకావాలన్న నోటీసులను నిలిపివేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా మోహన్‌బాబు ఇంటి చుట్టూ నిఘా ఉంచాలని పోలీసులను ఆదేశించారు. ఇక కుటుంబ వివాదంలో మీడియా ఎందుకింత హంగామా సృష్టిస్తోందని న్యాయమూర్తి ప్రశ్నించారు. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలతో పరువుకు నష్టం కలిగించొద్దని సూచించారు. -
అమ్మ ఇంట్లోనే ఉంది.. మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా: మనోజ్
రాచకొండ సీపీ ముందు విచారణకు హాజరైన మంచు మనోజ్ కీలక విషయాలు వెల్లడించారు. తానెప్పుడూ ఆస్తులు అడగలేదని.. నాపై కావాలనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మనోజ్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. జల్పల్లిలోని మా ఇంట్లోనే అమ్మ ఉందని.. ఆస్పత్రికి వెళ్లలేదని.. ఈ విషయంపై అబద్ధాలు చెబుతున్నారని మనోజ్ తెలిపారు.కూర్చోని మాట్లాడుకోవడానికి తాను ఎప్పటికీ సిద్ధమేనని మంచు మనోజ్ వెల్లడించారు. సిపీని కలిసి జరిగిందంతా వివరించినట్లు తెలిపారు. నా వైపు నుంచి ఎలాంటి గొడవ జరగదని సీపీకి చెప్పినట్లు వివరించారు. మీడియా ప్రతినిధులపై దాడి జరగడం దురదృష్టకరమని.. నాన్న తరఫున నేను క్షమాపణలు కోరుతున్నానని మనోజ్ అన్నారు. ఇవాళ సాయంత్రం ప్రెస్మీట్లో అన్ని వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు.కాగా.. మంగళవార మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద మనోజ్‌ను సెక్యూరిటీ అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఫ్యామిలీలో మొదలైన గొడవ తీవ్రరూపం దాల్చడంతో పోలీసుల అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు గన్స్ సీజ్ చేశారు. అంతేకాకుండా సీపీ ముందు హాజరవ్వాలని మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు, మనోజ్‌కు నోటీసులు జారీ చేశారు. -
రూ. 11వేల కోట్ల టుబాకో సామ్రాజ్యం : ముదిరిన తల్లీ కొడుకుల పోరు
పాపులర్ సిగరెట్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ మధ్య రగిలిన ఫ్యామిలీ వార్ మరింత ముదురుతోంది. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సమీర్ మోడీ తల్లి తనపై దాడికి పాల్పడిందని ఆరోపించారు. ఢిల్లీలోని జసోలా ఆఫీస్‌లో జరగాల్సిన బోర్డు మీటింగ్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించినందుకు గాడ్ఫ్రే ఫిలిప్స్‌కు చెందిన పలువురు డైరెక్టర్లు, తన తల్లి బీనా మోడీ వ్యక్తిగత భద్రతా అధికారి (పిఎస్ఓ) పలువురు డైరెక్టర్లు తనను తీవ్రంగా గాయపరిచారని ఆరోపిస్తూ సమీర్ శుక్రవారం ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రూ. 11,000 కోట్ల వారసత్వంపై కొనసాగుతున్న ఫ్యామిలీ వార్ మరింత తీవ్రమైంది.బోర్డ్ మీటింగ్‌కి హాజరయ్యే ప్రయత్నంలో, తల్లి బీనా పీఎస్‌ఓవో నెట్టివేయడంతో తన చూపుడి వేలుకి తీవ్ర గాయమైందనీ, అదిక పూర్తిగా పనిచేయదని వైద్యులు తెలిపారంటూ సరితా విహార్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదులో మోడీ పేర్కొన్నారు.‘‘నా సొంత కార్యాలయంలోనే దాడి జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. "షేర్ల సెటిల్మెంట్పై కోర్టు కేసు పెండింగ్‌లో ఉండగా, ఇప్పుడు నా వాటాను విక్రయించను. నన్ను బోర్డు నుండి తొలగించే ప్రయత్నాన్ని అడ్డుకుంటాను’’ అంటూ సమీర్ మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఆరోపణలను గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రతినిధి ఆరోపణలను ఖండించారు. ఇవి పూర్తిగా అబద్ధం, దారుణమైన ఆరోపణలని పేర్కొన్నారు. ఈ ఘటన ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యిందని, అవి చూస్తే ఈ ఘటనపై స్పష్టత వస్తుందన్నారు.కాగా 2019లో గాడ్ఫ్రే ఫిలిప్స్ అధినేత కేకే మోడీ మరణంతర్వాత కుటుంబం వారసత్వ సంపదపై వివాదం మొదలైంది. అప్పటినుంచి కలహాలుకొనసాగుతున్నాయి.గాడ్ఫ్రే ఫిలిప్స్ ప్రస్తుత సీఈఓ బీనా మోడీ ట్రస్ట్ డీడ్ నిబంధనలను ఉల్లంఘించి కంపెనీని తన ఆధీనంలోకి తీసుకున్నారని సమీర్ ఆరోపిస్తూ దావా వేశారు. అయితే మొదట తల్లి బీనా నిర్ణయానికి సమీర్, అతని సోదరి, చారు మోడీ మద్దతు ఇచ్చారు. అయితే, దీనిని వ్యతిరేకించిన లలిత్ మోడీ ట్రస్టు రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీంతో అతని వాటా అతని కిచ్చేశారు. తరువాత కుటుంబ సంపదను పంచమని కోరడంతో వచ్చిన విభేదాల నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉంది. సమీర్ మోడీ 1933లో తన తాత గుజర్మల్ మోడీ స్థాపించిన మోడీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలాగే గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా. -
భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు
సాక్షి, చెన్నై: బిర్యానీ పంచాయితీ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. క్షణికావేశంలో భర్త భార్యకు నిప్పటించడంతో ఆమె కన్నుమూసింది. ఈ ఘటన చెనైలోని ఠాగూర్‌నగర్, అయనవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కరుణాకరణ్ (75), పద్మావతి (66) దంపతులు. వారికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. ఎవరికి వారు భార్యబిడ్డలతో విడిగా ఉంటున్నారు. కరుణాకరణ్, పద్మావతి మరో చోట నివాసమంటున్నారు. ఒంటరిగా ఉండటం, వయసురిత్యా కారణాలతో పద్మావతి కొద్ది నెలలుగా మానసిక సమస్యలను ఎదుర్కొంటోంది. ఈక్రమంలోనే ఆ వృద్ధ భార్యభర్తలమధ్య సఖ్యత కొరవడింది. నిత్యం ఏదో ఒక విషయంలో గొడవపడుతుండేవారు. ఒకే ఇంట్లో ఉంటున్నా ఇద్దరూ మాట్లాడుకునేవారు కాదు. పిల్లలతో కూడా వారికి విభేదాలున్నాయి. ఇక మనస్పర్థల కారణంగా కరుణాకరణ్ కూడా భార్య బాగోగులు సరిగా చూసుకునేవాడు కాదు. ఆమెకు భోజనం కూడా ఉండేది కాదు. ఈ నేపథ్యంలో కరుణాకరణ్ మంగళవారం రాత్రి బయట నుంచి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఆయనొక్కడే ఆరగించాడు. దీంతో రగిలిపోయిన పద్మావతి తనకు కూడా బిర్యానీ కావాలని ఆయనతో గొడవపడింది. (చదవండి: ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం) ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వివాదానికి దారితీసింది. ఆవేశానికి లోనైన కరుణాకరణ్ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను పద్మావతిపై పోసి నిప్పటించాడు. ఆమె హాహాకారాలు చేస్తూ భర్తను పట్టుకుంది. ఇద్దరూ మంటల్లో తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఇంట్లో నుంచి పొగలు రావడంతో చుట్టుపక్కలవారు తలుపులు బద్దలు కొట్టి వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. కరుణాకరణ్‌కు 20 శాతం, పద్మావతికి 40 శాతం కాలిన గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ పద్మావతి మరణించారు. కరుణాకరణ్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అయనవరం పోలీసులు పేర్కొన్నారు. (చదవండి: ఓవైపు చంద్రగ్రహణం, మరోవైపు బిర్యానీ.. ఏంటిది? మీరు చెప్పేదేంటి? కొట్టుకునేవరకు వెళ్లిన పంచాయితీ) -
పక్కా ప్లాన్! జెండా వందనం చేశాక మాట్లాడాలని పక్కకు పిలిచి..
చిగురుమామిడి(హుస్నాబాద్): ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అనుమానమే పెనుభూతమై స్వాతంత్య్ర దినోత్సవం రోజు జెండా ఎగరవేశాక కత్తితో భార్య గొంతు కోసి, కడతేర్చాడు ఓ భర్త.. ఈ ఘటన చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామంలో కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కేవపట్నం మండల కేంద్రానికి చెందిన అరెపల్లి రవి–యాదమ్మ దంపతుల పెద్ద కూతురు శిరీష. ఈమెకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్ డిగ్రీ, శిరీష(27) ఇంటర్ చదివారు. చదువుకునే రోజుల్లోనే వీరికి పరిచయం ఏర్పడింది. ప్రవీణ్ ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, పెద్దల సమక్షంలో 2012లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కూతురు శరణ్య, కుమారుడు శశివర్దన్ ఉన్నారు. 2018లో శిరీష అంగన్వాడీ ఆయా ఉద్యోగానికి ఎంపికైంది. కొంతకాలం తన విధులను ఎలాంటి ఇబ్బందుల్లేకుండా నిర్వహించింది. ఈ క్రమంలో గత 6 నెలలుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ప్రవీణ్ నిత్యం శిరీషను అనుమానించేవాడు. విచక్షణారహితంగా కొట్టేవాడు. భరించలేని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. (చదవండి: వ్యభిచారం అంటూ హిజ్రాకు బెదిరింపులు.. ఎంతకూ మాట వినకపోవడంతో తోటి హిజ్రాలతో కలిసి..) పెద్ద మనుషులు ఒక్కటి చేసినాగొడవలు ఆగలేదు.. నిత్యం గొడవలు పడుతున్న వీరిని పెద్ద మనుషులు ఒప్పించి, ఒక్కటి చేశారు. దీంతో కొన్ని రోజులు కలిసిమెలిసి ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ గొడవలు మొదలయ్యాయి. దీంతో శిరీష 2 నెలలుగా పుట్టింట్లోనే ఉంటోంది. కోర్టును ఆశ్రయించి, భర్త ప్రవీణ్‌కు విడాకుల నోటీసు పంపించింది. కేశవపట్నం పోలీస్స్టేషన్లోనూ అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో 45 రోజులు అంగన్వాడీ విధులకు హాజరు కాలేదు. అధికారుల మందలింపుతో ఈ నెల 3 నుంచి తన తండ్రి రవిని వెంట తీసుకొని, కేశవపట్నం నుంచి బైక్‌పై అంగన్వాడీ సెంటర్‌కు వస్తోంది. అంగన్వాడీ సెంటర్ పక్కనే ఇల్లు అద్దెకు.. శిరీషను చంపాలని ప్రవీణ్ పథకం వేశాడు. ఇందుర్తిలో అతనికి ఇల్లు ఉన్నా అంగన్వాడీ సెంటర్ పక్కన మరో ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. అవకాశం కోసం చూసిన ప్రవీణ్ స్వాతంత్య్ర దినోత్సవం రోజు తన పథకాన్ని అమలు చేశాడు. వివరాలు తెలుసుకుంటున్న సీఐ, ఎస్సైలు చంపవద్దని బతిమిలాడినా వినలేదు సోమవారం స్వాతంత్య్ర వేడుకలకు వచ్చిన శిరీషను ప్రవీణ్ జెండా వందనం పూర్తయ్యాక మాట్లాడాలని పక్కకు తీసుకెళ్లాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతుపై దాడి చేశాడు. అడ్డుకోబోయిన ఓ యువకుడిపైనా అదే ఆయుధంతో దాడి చేసి, గాయపరిచాడు. తననేమీ చేయొద్దని శిరీష ఎంత బతిమిలాడినా వినకుండా ప్రాణాలు తీశాడు. ఆమె అరుపులు విన్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్‌ను పట్టుకునేలోపే పారిపోయి, చిగురుమామిడి పోలీసులకు లొంగిపోయాడు. ఘటనాస్థలిని తిమ్మాపూర్ సీఐ శశిధర్‌రెడ్డి, చిగురుమామిడి ఎస్సై దాస సుధాకర్‌లు పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్‌రావు ఆస్పత్రికి వెళ్లి, శిరీష మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె బంధువులతో మాట్లాడారు. మృతురాలి తండ్రి రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. (చదవండి: తమ్మినేని కృష్ణయ్య హత్య.. సంచలన నిజాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి) -
ఆస్తి పంచాయితీ.. రూ.50 వేలు సుపారీ ఇచ్చి సొంత తమ్ముడినే..
యశవంతపుర: అక్క సొంత తమ్మున్ని హత్య చేయించిన ఘటన కలబురిగిలో జరిగింది. నగరంలోని గాజీపూర లేఔట్‌కు చెందిన నాగరాజ్ మటమారి జులై 28న కలబురిగి నగరం నుండి ఆళంద వెళ్తూ మార్గమధ్యలో కెరెభూసగా గ్రామం వద్ద శవమై తేలాడు. దుండగులు తలపై బండరాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ తానే ఈ హత్య చేశానని పోలీసుల వద్ద లొంగిపోయాడు. ఆస్తి కలహాలతో నాగరాజ్ అక్క సునీత రూ.50 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయిందని చెప్పాడు. కేసు విచారణలో ఉంది. -
హృదయ విదారకం; నాన్నను చూడాలంటూనే.. మృత్యువొడికి
వడమాలపేట: భార్యపై కోపంలో కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఘటనలో చికిత్స పొందుతూ కోలుకోలేక బాలుడు మృత్యువొడి చేరాడు. వివరాలివీ.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ ఆది ఆంధ్ర వాడకు చెందిన రమేష్‌కు భార్య ఐశ్వర్యతో గత కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తరచూ గొడవ పడటం, విషయం పోలీసుస్టేషన్‌కు వెళ్లడం జరుగుతోంది. అయితే గత సోమవారం కూడా ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా ఐశ్వర్య అదే గ్రామంలోని పుట్టింటికి వెళ్లింది. అప్పటికే మద్యం మత్తులోని రమేష్.. ఆ కోపాన్ని కుమారుడు మహేష్(7)పై చూపుతూ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. రెండు రోజులుగా తిరుపతి రుయాలోని చిన్న పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి బుధవారం రాత్రి కన్నుమూశాడు. కన్న తండ్రే ఇంతటి ఘాతుకానికి పాల్పడినా.. ఆసుపత్రిలో చివరి శ్వాస వరకు నాన్నను చూడాలని కోరడం, ఆ కోరిక తీరకుండానే తుదిశ్వాస విడిచిన తీరు హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. అనుమానం పెనుభూతమై ఆ కుటుంబంలో రగిల్చిన చిచ్చు ఆ ప్రేమకు ప్రతిరూపమైన చిన్నారినే బలితీసుకోవడం శోచనీయం. -
భార్యపై కోపంతో.. ఎనిమిదేళ్ల కుమారుడికి నిప్పుపెట్టిన తండ్రి!
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. మనసులు కలిసి, మనుషులు ముడిపడే వరకు ఎంతకైనా తెగిస్తుంది. తల్లిదండ్రులను ఎదురిస్తుంది.. బంధుత్వాలను దూరం చేస్తుంది.. కల సాకారం చేసుకున్నా, ప్రేమను గెలిపించుకున్నా.. కొన్ని జీవితాలే కలకాలం నిలుస్తున్నాయి. ఇంకొన్ని రోజులు గడిచేకొద్దీ బలహీనపడి ప్రాణాలు తీసుకునే స్థాయికి చేరుతున్నాయి. ఈ కోవలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య పెరిగి పెద్దదైన అనుమానం వారి ప్రేమకు ప్రతిరూపంగా నిలిచిన కన్న కొడుకునే మంటల్లోకి నెట్టడం ప్రేమ‘కులం’లో కలంకం. భార్యపై కోపం కొడుకుకు శాపమైంది. ఈ రోజు చంపేస్తానని ఉదయం నుంచీ తిట్టిపోశాడు. పోలీసుల భయంతో పినాయిల్ తాపించాడు.. తాగిన మైకంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు.. ఒళ్లంతా కాలిన గాయాలు.. ఒకటే మంట.. ప్రాణం నిలుస్తుందో లేదో తెలియదు.. ఇప్పుడు కూడా నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికంటే ఆ చిన్నారి మనసు నాన్ననే కోరుకుంటోంది.. చంపేందుకు యత్నించినా ఆ పసి హృదయం నాన్నను చూడాలి, ఎక్కడని రోదిస్తున్న తీరు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. అతను డిగ్రీ పూర్తి చేస్తే.. ఆమె ఇంటర్ చదివింది. రెండేళ్ల పాటు ప్రేమించుకున్నారు. సామాజిక వర్గం ఒకటే కావడం.. పైగా బంధువులు, ఇరువైపులా ఎలాంటి పట్టింపులు లేకపోవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. కోరుకున్న జీవితం సాకారం కావడంతో ఆ ఇద్దరికీ మరో ఇద్దరు పిల్లలు.. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో అనుమానం పెనుభూతమైంది.. తాగుడు తోడై ఆ కుటుంబంలో చిచ్చు రగిల్చింది.. ఏకంగా కన్న కొడుకునే బలితీసుకునే వరకు వెళ్లింది.. ఈ హృదయ విదారక ఘటనకు బట్టికండ్రిగ( నారాయణపురం) పంచాయతీ ఆదిఆంధ్ర వాడ మౌన సాక్ష్యంగా నిలిచింది. వడమాలపేట: బట్టికండ్రిగ(నారాయణపురం) పంచాయతీ, ఆదిఆంధ్ర వాడకు చెందిన చెంగల్రాయుడు, లక్ష్మమ్మ కుమారుడు రమేష్ పుత్తూరులో డిగ్రీ పూర్తి చేశాడు. అదే గ్రామానికి చెందిన బుల్లయ్య, రమణమ్మ కుమార్తె ఐశ్వర్య తిరుపతిలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఒకే సామాజిక వర్గం, పైగా బంధుత్వం ఉండడంతో.. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల అనంతరం ఇరు కుటుంబాల సమ్మతితో ఇద్దరూ ఒక్కటయ్యారు. ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ జంటకు భవనశ్రీ(9), మహేష్(7) సంతానం. పాప నాలుగో తరగతి చదువుతుండగా, బాబు రెండో తరగతి. సంసారం సాఫీగా సాగిపోతున్న తరుణంలో రమేష్ కళ్లను అనుమాన భూతం కమ్మేయగా.. తాగుడుకు బానిసయ్యాడు. ఐశ్వర్యను మానసికంగా, శారీరకంగా హింసించసాగాడు. ఒకానొక సమయంలో ఆమె ఈ బాధలు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. వాళ్లు సర్దిచెప్పి పంపడం.. ఆ తర్వాత పలుమార్లు వేధింపులతో ఆ ఇద్దరి మధ్య దూరం పెరిగింది. భార్య కనిపించకపోవడంతో.. వారం రోజుల క్రితం రమేష్, ఐశ్వర్యల మధ్య చోటు చేసుకున్న గొడవలో ఆమె చేయి విరిగింది. నొప్పికి తాళలేక విషయాన్ని అదే ప్రాంతంలోని తల్లి ఇంటికి వెళ్లి చెప్పుకుంది. ఆమె కూతురిని ఓదార్చి పుత్తూరు సమీపంలోని ఈశలాపురంలో కట్టు కట్టించి ఇంటికి తీసుకెళ్లింది. ఎంతైనా భర్త, పిల్లల మీద ప్రేమ.. ఆదివారం తిరిగి మెట్టింటికి చేరుకుంది. అయితే సోమవారం ఉదయాన్నే రమేష్ ఫూటుగా మద్యం సేవించి ఇంకా వంట చేయలేదని చేయి చేసుకున్నాడు. తన చేయి విరిగిందని, నిదానంగా చేసి పెడతానని బతిమాలినా మద్యం మత్తు చెలరేగింది. విధిలేని పరిస్థితుల్లో కుమార్తెను తీసుకొని తిరిగి పుట్టింటికి వెళ్లింది. పోలీసులకు ఫిర్యాదుతో.. తన కుమార్తెను అల్లుడు తరచూ చితకబాదడాన్ని తట్టుకోలేకపోయిన ఐశ్వర్య తల్లి జరిగిన విషయాన్ని వడమాలపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు రమేష్‌కు ఫోన్ చేసి స్టేషన్‌కు రావాలని పిలిచారు. ఉదయం భార్య వెళ్లినప్పటి నుంచి ఈ రోజు నిన్ను చంపుతానని కొడుకుపై ప్రతాపం చూపించిన రమేష్.. ఇదే సమయంలో పోలీసుల నుంచి ఫోన్ రావడంతో తన కుమారుడు ప్రాణాపాయంలో ఉన్నాడని అప్పటికప్పుడు పినాయిల్ తాపించాడు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి పుత్తూరుకు చేరుకున్నాడు. అక్కడ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇద్దరూ ఇంటికొచ్చారు. అప్పటికీ భార్య కనిపించకపోవడంతో స్కూటర్‌పై పిల్లాడితో కలిసి పెట్రోల్ బంకులో ఓ బాటిల్ పెట్రోల్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఇంటికి సమీపంలో నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే కుమారునిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు. సమీప బంధువు నాగరాజు తేరుకొని తన లుంగీతో మంటలు ఆర్పేందుకు యత్నించాడు. ఇంతలో స్థానికులు తోడై మంటలను అదుపుచేసి 108లో బాలుడిని తిరుపతి రుయాకు తరలించారు. ప్రాణాప్రాయ స్థితిలో నాన్న కోసం.. భుజాలపై మోస్తూ.. బండిపై తిప్పుతూ.. అడిగిందల్లా కొనిస్తూ.. కోరిందల్లా తినిపిస్తూ ఎంతో ప్రేమ చూపించిన నాన్న, ఆ రోజు ఎందుకలా చేశాడో ఆ పసి హృదయానికి ఇప్పటికీ అర్థం కాలేదు. పినాయిల్ తాపించినా తాగేశాడు.. పెట్రోల్ పోసినా ఎందుకని అడగలేదు.. చివరకు నిప్పు పెట్టినా బెదరలేదు.. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఇప్పటి కీ నాన్ననే కలవరిస్తున్నాడు. నాన్న కావాలి, ఎక్కడ ని రోదిస్తున్న తీరుతో ఆ తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. మెరుగైన చికిత్సకు మంత్రి రోజా ఆదేశం ఈ హృదయ విదారక ఘటనతో మంత్రి రోజా చలించిపోయారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై రుయా వైద్యలతో ఆరా తీశారు. శరీరం బాగా కాలిపోయిందని, కొద్ది రోజులు గడిస్తే కాని ఏమీ చెప్పలేమనడంతో మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మండల తహసీల్దార్ రోశయ్య కూడా బాధిత కుటుంబాన్ని ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన విషయమై ఎస్ఐ రామాంజనేయులు విలేకరులతో మాట్లాడుతూ రమేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అతని మానసిక స్థితి బాగోలేదని, కేవలం భార్యపై అనుమానంతోనే ఇలా చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. -
ఇద్దరు పిల్లలను బావిలో పడవేసి హత్యచేసిన తండ్రి
-
పిల్లల్ని బావిలోకి తోసి.. తానూ రైలు కిందపడి
సాక్షి, వరంగల్/మహబూబాబాద్: తల్లిదండ్రుల మధ్య జరిగిన గొడవ ముక్కుపచ్చలారని ఇద్దరు బిడ్డలను బలి తీసుకుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఇద్దరు బిడ్డలను కల్లు తాగిస్తానని తీసుకెళ్లిన తండ్రి.. ఇద్దరినీ వ్యవసాయ బావిలో తోసేశాడు. నీట ముని గి వాళ్లిద్దరూ చనిపోయారు. అక్కడి నుంచి వెళ్లి తానూ రైలు కింద పడి ఆత్మహత్య చేసు కున్నాడు. మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సమీ పంలోని గడ్డిగూడెం తండాలో మంగళవారం ఈ విషాద ఘటన జరిగింది. మరో వారంలో పుట్టిన జరుపుకోవాల్సిన బాలుడిని విగతజీవిగా చూసిన బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పిల్లలతో ఆట ఆడినట్టు నటించి.. మడ్డిగూడెంతండాకు చెందిన భూక్య రాంకుమార్ (31), అదే తండాకు చెందిన శిరీష 9 ఏళ్ల క్రితం ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి కుమార్తె అమీజాక్సన్ (7), కుమారుడు జానీ బెస్టో (3) జన్మించారు. రాంకుమార్‌కు సీఐఎస్ఎఫ్లో ఉద్యోగం రావడంతో ఆరేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. రాంకుమార్, శిరీషల మధ్య కొద్దిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 4 రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చారు. సోమవారం రాత్రి, మంగళవారం ఉదయం ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. దీంతో భార్య శిరీష.. పిల్లలను విడిచిపెట్టి అదే తండాలో ఉన్న తన పుట్టింటికి వెళ్లింది. తండ్రి రాంకుమార్ ఇద్దరు పిల్లలను తన ద్విచక్రవాహనంపై కూర్చోబెట్టుకొని కల్లు తాగిస్తానని తండాకు దూరంగా ఉన్న వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ కొద్దిసేపు పిల్లలతో ఆట ఆడినట్లు నటించి ఇద్దరు పిల్లలను బావిలోకి నెట్టి తాను కూడా బావిలో దూకాడు. తర్వాత పిల్లలను బావిలోనే విడిచి పెట్టి తాను మాత్రం పైకి ఎక్కి ఏడ్చుకుంటూ తడి బట్టలతో బైక్‌పై పారిపోయాడు. దగ్గర్లో పని చేస్తున్న వాళ్లు ఇది గమనించి బావి దగ్గరకు వచ్చి చూడగా పిల్లల చెప్పులు కనిపించాయి. అనుమానం వచ్చి గాలించగా ఇద్దరు పిల్లలు బావిలో విగతజీవులుగా కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వవడంతో కేసు నమోదు చేశారు. పిల్లలు లేని జీవితం నాకెందుకు.. భార్యతో గొడవ పడి ఇద్దరు పిల్లలను బావిలో పడేసి వాళ్ల మరణానికి కారణమైన తండ్రి రాంకుమార్.. పిల్లలు లేని జీవితం తనకెందుకని ఎస్సీ గేట్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని భార్య శిరీష, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. 17న జానీ పుట్టినరోజు ఈ నెల 17న చిన్నారి జానీ బెస్టో పుట్టిన రోజు. పండుగకు, పుట్టినరోజుకు బట్టలు కొనేందుకు బుధవారం మహబూబాబాద్ వె ళ్లాలనుకున్నారు. ఇంతలోనే తండ్రి, ఇద్దరు బిడ్డలు కానరానిలోకాలకు వెళ్లిపోవడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్థికపరమైన గొడవలే కారణమా? ఏడాది నుంచి ఇంటి ఖర్చులకు కూడా రాంకుమార్ డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య నిలదీయసాగింది. శిరీషకు చెందిన 18 తులాల బంగారు ఆభరణాలు కూడా ఆయన తాకట్టుపెట్టాడు. జీతం రావడం లేదా అని భార్య అడిగితే బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని చెబుతూ వచ్చాడు. సమాధానం దాటవేస్తూ వస్తుండటం తో తన తమ్ముడు ధరావత్ సిద్ధు ద్వారా శిరీష బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించింది. దీంతో రాంకుమార్ రూ.15 లక్షలు బ్యాంకులో రుణం తీసుకున్నట్లు, రూ.40 వేల జీతంలో రూ.35 వేలు రుణం కింద కట్ అవుతున్నట్లు ఆమె తెలుసుకుంది. రుణం ఎందుకు తీసుకున్నట్టు? రాంకుమార్ బ్యాంకులో రూ.15 లక్షల రుణం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇటు భార్యకు, అటు తల్లిదండ్రులకు కూడా రుణం విష యం చెప్పలేదు. అంతపెద్ద మొత్తం డబ్బు అతడికి ఎందుకు అవసరమైంది, ఎన్ని రోజులుగా బ్యాంకులో డబ్బు కట్ అవుతుందో స్పష్టత లేదు. భార్య కు అనుమానం వచ్చి ఆరా తీస్తే గానీ రుణం విషయం బయటపడలేదు. -
Karimnagar: ‘ఖాకీ’ దిద్దిన కాపురం
‘కరీంనగర్‌కు చెందిన యువకుడికి పక్కజిల్లాకు చెందిన యువతితో రెండేళ్లక్రితం వివాహమైంది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తుండడంతో ఒకరిపై ఒకరి ఆధిపత్యం ఎక్కువైంది. చిన్న విషయాలకే పెద్దగొడవలు జరిగాయి. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు సైతం జరిగాయి. అయినా సమస్య సద్దుమణగకపోవడంతో మహిళా పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించారు. అక్కడి అధికారులు ఆ జంటకు కౌన్సెలింగ్ ఇచ్చి కాపురాన్ని నిలబెట్టారు.’ సాక్షి, కరీంనగర్: మూడుముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చటగా మారుతోంది. జీవితాంతం కలిసి ఉంటామని అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచిన ఆ జంటలు విడిపోతామంటూ ఠాణామెట్లు ఎక్కుతున్నారు. చిన్నగొడవలకే పంచాయితీల వరకు వెళ్తున్నారు. కలిసి ఉండమంటూ.. పచ్చటికాపురాన్ని కూల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ఠాణా మెట్లు ఎక్కుతున్న పలు జంటలకు పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇద్దరిమధ్య సయోధ్య కుదిరించి కాపురాలను నిలబెడుతున్నారు జిల్లా మహిళా పోలీసుస్టేషన్ అధికారులు. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు స్టేషన్‌కు 794 ఫిర్యాదులు రాగా.. 609 పరిష్కరించి వారికి కొత్తజీవితాలను అందించారు. వేరు కాపురాల్లోనే ఎక్కువ.. ► ప్రస్తుతం ట్రెండు మారింది. గతంలో పెద్దలతో కలిసి ఉన్నప్పుడు దంపతుల మధ్య చిన్న సమస్య వచ్చినా.. ఇంట్లోనే పరిష్కరించేవారు. ఇద్దరికీ సర్దిచెప్పేవారు. ఇప్పుడు అలా కాదు. పెళ్లయ్యాక చాలామందికి పెద్దలతో కలిసి ఉండడం రుచించడం లేదు. పెళ్లికి ముందే ఉద్యోగ, వ్యాపారరీత్యా వేరుకాపురం పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. పెళ్లయిన నాలుగు రోజులకే ఇంటివారికి దూరంగా వెళ్తున్నారు. ► అలా వెళ్లినవారు కొన్నాళ్లపాటు బాగానే ఉంటున్నా.. తరువాత దంపతుల మధ్య ఆధిపత్యం పెరుగుతోంది. అభిప్రాయభేదాలతో చిన్నగొడవలకే విడాకుల వరకు వెళ్తున్నారు. చాలాకేసుల్లో రెండు, మూడు నెలల్లోనే విడాకుల వరకు రావడం బాధాకరమని, ఇలాంటివి వేరుకాపురంలోనే ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని పోలీసులు చెబుతున్నారు. ► తల్లిదండ్రులు సైతం పిల్లలకు పెళ్లికి ముందు కొన్ని నైతిక విలువలు నేర్పించాలని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. దాంపత్యబంధం గురించి, అత్తవారింట్లో మెదలాల్సిన పద్ధతుల గురించిచెప్పాలని అంటున్నారు. చిన్న సమస్య రాగానే పెద్దలు కూడా ఆలోచన లేకుండా వ్యవహరించడం సరికాదని సూచిస్తున్నారు. ఇద్దరికి ప్రశాంతంగా సర్దిచెప్పాలని చెబుతున్నారు. ► దంపతులు పరస్పరం అర్థం చేసుకోవాల్సింది పోయి, అనుమానం పెంచుకోవడం, పట్టించుకోకపోవడం కాపురాల్లో చిచ్చుపెడుతుందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మద్యానికి బానిసకావడం, వివాహేతర సంబంధాలు సరికాదని అంటున్నారు. కౌన్సెలింగ్‌కు వచ్చేవారు చాలామంది ప్రేమ వివాహాలు చేసుకున్నవారే ఉంటున్నారని ఎస్సై సురేందర్ తెలిపారు. ► దంపతులు గొడవలతో కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌కు రాగానే.. వారికి వేర్వేరుగా కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తారు. భార్యాభర్తల బంధం గురించి వివరిస్తుంటారు.స్టేషన్‌లోని కౌన్సిలింగ్ సెంటర్ సైకాలజిస్టులు, న్యాయనిపుణులు, పోలీసులు కలిసి వారికి సర్దిచెబుతుంటారు. సమస్యను బట్టి అనుకూలమైన పరిష్కారాన్ని మార్గం చూపుతుంటారు. ఆవేశంగా వచ్చిన దంపతులు ఏకమై వెళ్లడం సంతోషంగా ఉందని పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి దంపతుల మధ్య ఏర్పడిన సమస్యను చిన్నదిగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ప్రతీ విషయంలో గొడవపడడం మానుకోవాలి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పరస్పరం గౌరవం ఇచ్చుకోవడంతో పాటు అత్తింటివారు, పుట్టింటి విలువలకు గౌరవం ఇవ్వాలి. ఇలా ముందకుసాగితే వివాహబంధం సంతోషంగా ఉంటుంది. గొడవలు పెట్టుకొని పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన కేసుల్లో కౌన్సెలింగ్ ఇస్తూ.. దంపతులను కలుపుతున్నాం. – శ్రీనివాస్, సీఐ, కరీంనగర్ మహిళా పోలీస్‌స్టేషన్ చదవండి: చలానా పెండింగ్ ఉంటే బండి సీజ్ -
పెళ్లై 15 నెలలు.. పిల్లలు పుట్టడం లేదని కానిస్టేబుల్..
సాక్షి,రాజేంద్రనగర్: వివాహం జరిగి 15నెలలు గడుస్తున్నా సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేషనల్ పోలీస్ అకాడామీలో వాసు(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వాసుకు 15నెలల కిందట నీలిమతో వివాహం జరిగింది. సంతానం కలగడం లేదని తరుచూ భార్యాభర్తల మధ్య గొడవజరుగుతుంది. ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవయింది. రాత్రి 9గంటల ప్రాంతంలో ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.11గంటల ప్రాంతంలో నీలిమకు మెలుకువ రావడంతో బెర్రంలో చూడగా వాసు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యు కు, చుట్టు పక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: భార్య అకౌంట్ నుంచి రూ.కోటి విత్ డ్రా.. టీవీ నటుడిపై కేసు -
భార్యను హతమార్చి.. పక్కనే వీడియో గేమ్ ఆడుతూ!
జోధ్‌పూర్: కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని మొబైల్లో వీడియో గేమ్ ఆడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాలు.. విక్రమ్ సింగ్(35) అనే వ్యక్తి, భార్య శివ కన్వర్ (30)తో కలసి బీజేస్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విక్రమ్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో భార్యతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపం పట్టలేని విక్రమ్ సింగ్ ఇంట్లోని కత్తెరతో భార్యను పదే పదే పొడుస్తూ హత మార్చాడు. అనంతరం పోలీసులు, అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే నిందితుడు వీడియో గేమ్ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు ఉన్నట్లు, సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని సీనియర్ పోలీస్ అధికారి కైలస్దాన్ వెల్లడించారు. -
అంతరాలను పెంచుతున్న ఆస్తులు
సాక్షి, హైదరాబాద్ : ఓ వ్యక్తికి ఇద్దరు కూతుర్లు, ముగ్గురు కొడుకులు. ఆయన ఆరేళ్లక్రితం చనిపోయారు. బతికి ఉండగా సంపాదించిన ఏడు గుంటల స్థలం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వత అగాధాన్ని పెంచింది. పాతికేళ్లక్రితం పెళ్లై, కట్నం కింద కొంతనగదు, ఇంటి స్థలాన్ని కూడా పొందిన ఆమె తల్లిదండ్రుల మరణానంతరం వాళ్ల ఆస్తిలో వాటాకావాలంటూ కోర్టు మెట్లెక్కింది. ఆస్తి పాస్తులు అయిన వాళ్ల మధ్య అంతరాలను పెంచుతున్నాయి. రక్త సంబంధాల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమాన హక్కు ఉందని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు నేపథ్యంలో ఇపుడు కోర్టు మెట్లు ఎక్కుతున్నవాళ్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయినవాళ్ల మధ్య అగాధాలు ఆస్తి పంపకాల సమయంలో వాటాలు కావాలని వివాదాలకు దిగుతున్న ఆడపిల్లల విషయంలో.. బంధుత్వాలు భారంగా మారుతున్నాయి. కొద్దిపాటి ఆస్తిలో కూడా వాటా కావాలని భీష్మించుకున్న సందర్భాల్లో విధి లేక వాటా అంటూ ఇస్తే ఇకపై రాకపోకలు బంద్ అని, ఏ రకమైన శుభకార్యాలకు ఆహ్వానాలు ఉండవు పరస్పరం హెచ్చరించుకుంటున్నారు. ఒçకే రక్తం పంచుకుని పుట్టిన అన్నా చెల్లెళ్ల మధ్య శాశ్వతమైన అగాధానికి ఈ ఆస్తి వివాదాలు కారణమవుతున్నాయి. తండ్రి మరణించినా సరే... సవరణ తేదీ నాటికీ కూతురు తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా ఆమెకు తండ్రి ఆస్తిలో హక్కు ఉంటుంది. తాజా తీర్పు ప్రకారం సవరణ తేదీ నాటికి కుమార్తె జీవించి లేకున్నా... ఆమె సంతానం ఆమెకు రావాల్సిన వాటాను కోరవచ్చు. దీంతో ఈ తీర్పు హిందూ అవిభాజ్య కుటుంబంలో ఆడపిల్లల ఆస్తి హక్కుపై ఉన్న సందేహాలన్నీ నివృత్తి అయ్యాయి. 1956 నాటి హిందూ వారసత్వ చట్టానికి 2005లో సవరణలు చేశారు. 2005 సెప్టెంబర్ 9న పార్లమెంట్ ఆమోదించింది. తండ్రి స్వార్జిత ఆస్తిలో ఆడ పిల్లలకు సమాన వాటా ఉంటుందని ఆ చట్టం చెబుతోంది. చట్టం కావాలంటోంది.. సంప్రదాయం వద్దంటోంది ఆడపిల్లలకు పెళ్లి చేసే సమయంలోనే తండ్రి తనకున్న దాంట్లో ఘనంగా వివాహం చేస్తూ కట్న కానుకలను సమర్పించుకుంటాడు. ఇంట్లో జరిగే ప్రతీ శుభకార్యాల సమయంలో కూడా కూతురుకు కట్నాల పేరుతో కొంత సమర్పిస్తారు. ఆస్తిలో వాటా అడగరు అనే అభిప్రాయంతోనే ఇవన్నీ చేస్తారు. ఆస్తుల విభజన సమయంలో ఆడపిల్లల కంటినీళ్లు శుభం కాదనే సెంటిమెంట్‌తో శక్తి మేరకు నగదునో, బంగారాన్నో కానుకగా ఇచ్చి అన్నదమ్ములు ఆస్తులు పంచుకుంటూ ఉండడం ఇప్పటివరకు వస్తున్న సామాజిక సంప్రదాయం. ఆస్తి హక్కులో ఆడపిల్లలకు వాటా అన్న నియమం వచ్చింతర్వాత కట్న కానుకలు తీసుకున్న వాళ్లు కూడా ఆస్తిలో వాటా సమయానికి వివాదాలకు తెరలేపడం, చట్టాన్ని కారణంగా చూపడం ప్రస్తుత వివాదాలకు కారణమవుతోంది. సుప్రీం ఏం చెప్పిందంటే.. కొడుకులతోపాటు కూతుర్లకు సమాన ఆస్తి హక్కు ఉంటుంది. హిందూ అవిభక్త కుటుంబానికి చెందిన ఆస్తిపై ఆడపిల్లలకు ఉన్న హక్కుపై సుప్రీంకోర్టు ఇటీవల చారిత్రక తీర్పునిచ్చింది. తండ్రి, కూతురు ఇద్దరూ జీవించి ఉంటేనే కుమార్తెకు సహ వారసత్వ హక్కు దాఖలు అవుతుందని 2005 సెప్టెంబర్ 9న ఇచ్చిన తీర్పును సవరించింది. 2005 కన్నా ముందే తండ్రి లేదా తల్లి మరణించినా వారసత్వంగా ఆస్తిని పొందే హక్కు ఉంటుందని జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టంపై అవగాహన పెంచుకోవాలి ఆస్తి హక్కుపై న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నది నిజమే. అవగాహన లేని కారణంగానే దగ్గర వాళ్లు కూడా చూసుకోలేనంతగా దూరం అవుతున్నారు. సమాన హక్కు అనే చట్టంపై విస్తృతంగా అవగాహన పెంచుకుంటే అంతరాలు తగ్గుతాయి. ఆడపిల్లకు పెళ్లి సమయంలోనే ఇవ్వదల్చుకున్న ఆస్తిపై స్పష్టత, రాతపూర్వక ఒప్పందాలు చేసుకుంటే అనంతర కాలంలో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ఉంటుంది. – ఆవునూరి రమాకాంత్‌రావు, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల బాధ్యతల్లోనూ సమానమని గుర్తించాలి వారసత్వపు ఆస్తిలో మాత్రమే ఆడపిల్లలకు హక్కు ఉంటుంది. హక్కుల గురించి మాట్లాడే సమయంలో బాధ్యతలు నిర్వహించాలనే కనీస జ్ఞానం కూడా ఉంటే సమాజానికి క్షేమం. రక్త సంబంధీకులు ఆర్థికంగా చితికిపోతే ఆదుకున్న ఆడపిల్లల సంఖ్య అరుదు అనే చెప్పాలి. కొడుకులతోపాటు కూతుర్లు సమానమే..కాదనం.. అది పంపకాల్లో మాత్రమే కాదు బా«ధ్యతల్లో కూడా ఉంటే ఇలాంటి కేసుల ప్రస్తావనే ఉండదని నా అభిప్రాయం. – చెక్కిళ్ల మహేశ్‌గౌడ్, సీనియర్ న్యాయవాది, సిరిసిల్ల -
పైశాచికత్వం : భార్యను వివస్త్రను చేసి..
సాక్షి, కామారెడ్డి : భిక్కనూరులో ఓ భర్త పైశాచికత్వం సంచలనం సృష్టించింది. భార్యను చితకబాదిన సదరు ప్రబుద్ధుడు ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపైకి గెంటేశాడు. బంధువులు, పరిచయస్తులు ఆమెకు దుస్తులు అందించారు. తీవ్ర అవమానాల నేపథ్యంలో ఆమె నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి భర్త పైశాచికత్వంపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
గల్ఫ్‌లో ఉన్న భార్యపై కోపంతో దారుణం
సాక్షి, పశ్చిమగోదావరి : నరసాపురం మండలం సార్వా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. గల్ఫ్‌లో ఉన్న భార్య ఫోన్ చేయలేదనే కోపంతో భర్త అలీష తన ఇద్దరు పిల్లలను చితకబాదాడు. దాంతోపాటు ఆ దృశ్యాల్ని వీడియో రికార్డు చేసి.. తనకు ఫోన్ చేయకుంటే పిల్లల్ని చంపేస్తానంటూ భార్యపై బెదిరింపులకు దిగాడు. వీడియో వైరల్ కావడంతో పిల్లల్ని రక్షించేందుకు పోలీసులు అలీష ఇంటికి వెళ్లారు. అయితే, వీడియో చూసిన వారి బంధువులు అప్పటికే పిల్లల్ని తీసుకెళ్లిపోయారు. పరారీలో ఉన్న నిందితుడు అలీష కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని ముగ్గురి ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు : జిల్లాలోని సంతపేటలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ కలహాలే ఘటనకు కారణంగా తెలుస్తోంది. సంతపేటలోని ఓబులంపల్లి కాలనీలో రవి భార్య భువనేశ్వరి, కూతురు గాయిత్రి (9), తల్లితో కలిసి నివాసముంటున్నాడు. ఓ స్థలం విషయంలో కుటుంబంలో రెండు మూడు నెలలుగా గొడవ జరుగుతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కూల్‌డ్రింక్‌లో విషం కలుపుకుని రవి, భువనేశ్వరి, గాయత్రి ప్రాణాలు తీసుకున్నారు. అయితే, స్థలం విషయంలో గొడవతో ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డారా.. మరేదైనా కారణముందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒకే కుటుంబలో ముగ్గురి ఆత్మహత్య
-
అమానుషం : పిల్లల్ని నరికి చంపిన తల్లి
సాక్షి, జనగామ : జిల్లాలోని నర్మెట్ట మండలం శివభూక్య తండాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత కన్న బిడ్డల్ని నరికి చంపి తనూ ఆత్మహత్యకు పాల్పడింది. భానోతు రమ పిల్లలు భాను శ్రీ (4), వరుణ్ (3)ను అతి దారుణంగా కత్తితో నరికి చంపింది. అనంతరం మెడ కోసుకుని తనూ చనిపోయేందుకు యత్నించింది. కొన ఊపిరితో ఉన్న రమను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు ఆర్థిక ఇబ్బందులే కారణమని ఆమె భర్త చెప్తుండగా.. భర్త వేధింపుల కారణంగానే రమ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిందని బంధువులు ఆరోపిస్తున్నారు. చిన్నారుల మృతితో తండా వాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
పోలీస్‌స్టేషన్‌పై మహిళ దాడి
-
భర్తపై కోపం.. పోలీసులపై చూపించింది..!!
టెక్కలి : పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారనే కోపంతో ఓ వివాహిత వారికి చుక్కలు చూపెట్టింది. అరెస్టైన భర్తను బెయిల్‌పై విడుదల చేయడంతో వీరంగం సృష్టించింది. ఏకంగా పోలీస్‌స్టేషన్‌పైనే దాడి చేసి కిటికీ అద్దాలు ధ్వంసం చేసింది. ఈ ఘటన టెక్కలి పోలిస్‌స్టేషన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. పాతపట్నానికి చెందిన వందనాదేవి, భవానీపురానికి నాగరాజు దంపతులు. వీరి మధ్య గత ఐదేళ్లుగా కుటుంబ వివాదాల కేసు నడుస్తోంది. ఈకేసులో నాగరాజుకు అరెస్టు వారెంట్ జారీ చేసి టెక్కలి పోలిస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే, అరెస్టు చేసిన వెంటనే నాగరాజును విడిచిపెట్టారనే కోపంతో దేవి రెచ్చిపోయింది. పోలిస్‌స్టేషన్ అద్దాలు పగులగొట్టి రోడ్డుపై బైఠాయించింది. తనకు న్యాయం చేయాలంటూ నిరసన తెలిపింది. -
గుంటూరు జిల్లా మోతుకూరులో దారుణం
-
కోర్టులో భర్త చేసిన పనికి భార్య షాక్..
చండీగఢ్ : విడాకులు తీసుకున్న భార్యను ఇబ్బంది పెట్టడానికి కొత్తపద్దతి ఎంచుకున్నాడో లాయర్ భర్త. భరణంగా ఇవాల్సిన డబ్బు ఇవ్వలేదని కోర్టు మెట్లెక్కిన భార్యకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. కోర్టులో భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకుంది ఆ భార్య. వివరాల్లోకి వెళితే.. చండీగఢ్‌కు చెందిన ఓ లాయర్ 2014లో భార్య నుంచి వేరుపడి కొద్ది సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నాడు. భార్యకు నెలవారీ ఖర్చుల నిమిత్తం భరణంగా నెలకు 25వేల రూపాయలు ఇవ్వాలని కోర్టు ఆదేశింది. అయితే రెండు నెలలుగా తన భర్త భరణం ఇవ్వటం లేదని భార్య కోర్టును ఆశ్రయించింది. కోర్టులో న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆమె భర్త డబ్బు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడే భార్యకు చుక్కెదురైంది. ఇవ్వాల్సిన 25వే రూపాయల్లో కేవలం నాలుగు వందలు మాత్రమే నోట్లుగా ఇచ్చి మిగిలిన 24,600కు రూపాయి, రెండు రూపాయల నాణేల చిల్లర రూపంలో ఇచ్చాడు. అంతే ఆ భార్య కోర్టులోనే గొల్లుమంది. భర్త తనను ఇబ్బంది పెట్టడానికే ఇలా చేస్తున్నాడని న్యాయమూర్తి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. తన వద్ద డబ్బులు లేవన్న భర్త వాదనను ఆమె తప్పుబట్టింది. కాగా లాయర్ భర్త తన పనిని సమర్థించుకుంటూ.. భరణం డబ్బులు ఇలా చిల్లర ఇవ్వకూడదని ఎక్కడా రాసిలేదని అన్నాడు. ఈ చిల్లర పనితో కంగుతిన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 27కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
ప్రాణం తీసిన చికెన్ గొడవ
చెన్నారావుపేట(నర్సంపేట): కొడుకే కాలయముడయ్యాడు.. చికెన్ కూర విషయంలో గొడవపడి చితకబాది తండ్రిని హత్య చేసిన సంఘటన వరంగల్ రూరల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్తుల ప్రకారం.. పాపయ్యపేటకు చెందిన మేర్గు సంజీవ(58), పద్మ దంపతులకు కుమారుడు నర్సయ్య ఉన్నాడు. గ్రామంలో సంజీవ నీరటిగా పనిచేస్తున్నాడు. వీరు ముగ్గురు మూడు నెలల క్రితం హైదరాబాద్ మాదాపూర్‌లోని అపార్ట్మెంట్లో పనిచేసేందుకు వెళ్లారు. నర్సయ్య మూడు రోజుల క్రితం పాపయ్యపేటకు రాగా, గురువారం సాయంత్రం సంజీవ, పద్మ కూడా వచ్చారు. జ్వరంతో ఇంట్లో పడుకొని ఉన్న నర్సయ్య తాను మూడు రోజులుగా అన్నం తినలేదని, వండి పెట్టాలని తల్లిని అడిగాడు. దీంతో తల్లి తన భర్త సంజీవకు చికెన్ తీసుకురమ్మని పంపింది. బయటికి వెళ్లిన సంజీవ రెండు గంటలు దాటిన తర్వాత చికెన్ తీసుకొని వచ్చాడు. తనకు ఆకలి అవుతోందని, చికెన్ ఎందుకు వండలేదని తల్లిని అడుగుతుండగా సంజీవ కల్పించుకుని కొడుకుపై కోపం చేశాడు. ఇప్పటిదాకా నువ్వు ఎక్కడికి వెళ్లావని కొడుకు తండ్రిని నిలదీయడంతో ఇరువురి మధ్య మాటామాట పెరిగి ఇంట్లో నుంచి బయటికి నెట్టేసుకుంటూ వచ్చారు. ఇంతలో నర్సయ్య గుడిసెలో ఉన్న పారను చేతిలోకి తీసుకొని తండ్రి తలపై కొట్టాడు. దీంతో అతడు పక్కనే ఉన్న రాళ్లపై పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఏసీపీ సునీతామోహన్, నెక్కొండ సీఐ వెంకటేశ్వర్రావు, ఎస్సై కూచిపూడి జగదీష్ పోలీస్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకోని పరిశీలించారు. జరిగిన ఘటన విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కూచిపూడి జగదీష్ తెలిపారు. నిందితుడు నర్సయ్య పరారీలో ఉన్నాడు. -
గన్నుతో భర్త చెవులు కాల్చేసి..
కోల్‌కతా : భర్త తనను వదిలి ఇంటి నుంచి తరుచూ పారిపోతున్నాడనే కోపంతో గన్నుతో అతని రెండు చెవులను కాల్చేసిందో భార్య. ఈ ఘటన మంగళవారం పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోల్‌కతాకు సమీపంలోని నర్కెల్‌గంగకు చెందిన తన్వీర్(20) రెండు సంవత్సరాల క్రితం తనకంటే వయస్సులో 20 సంవత్సరాలు పెద్దదైన ముంతాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ముంతాజ్ తన్వీర్‌ను తరుచూ చిత్రహింసలకు గురిచేసేది. ముంతాజ్ పెట్టే బాధలు భరించలేక అతను ఇంటి నుంచి పారిపోయిన ప్రతిసారి వెనక్కు పట్టుకువచ్చి చిత్రహింసలు పెట్టేది. తమ కొడుకును విడిచి పెట్టాల్సిందిగా తన్వీర్ తల్లిదండ్రులు ఆమెను బ్రతిమాలినా వినలేదు. భర్త ఇళ్లు అమ్మగా వచ్చిన డబ్బులు సైతం తీసుకుని అతన్ని ఇంటికి పంపించలేదు. తన్వీర్ గత కొద్దిరోజులుగా ముంతాజ్ ఇంట్లోనే ఉంటున్నాడు. అతన్ని సొంత ఊరికి పోనివ్వకుండా, తల్లిని కలవనీయకుండా ఆంక్షలు విధించింది. కొద్దిరోజుల క్రితం అతడు ఆ ఇంటి నుంచి మల్లిక్‌పుర్‌కు పారిపోయినా.. తన మనషుల సహాయంతో వెనక్కి రప్పించిన ముంతాజ్, ఆమె చెల్లెళ్లు అతన్ని తీవ్రంగా హింసించారు. మంగళవారం రాత్రి ముంతాజ్ గన్నుతో తన్వీర్ రెండు చెవులను కాల్చేసింది. దీంతో తన్వీర్ చనిపోయాడని అక్కాచెల్లెళ్లు భావించారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ తన్వీర్ అక్కడినుంచి తప్పించుకుని దగ్గరలోని ఆస్పత్రిలో చేరాడు. విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టారు. తన్వీర్ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ముంతాజ్, ఆమె చెల్లెళ్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.