సాక్షి, శ్రీరాంపూర్(మంచిర్యాల) : భార్యను హత్య చేసిన కేసులో భర్తను శ్రీరాంపూర్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ సీతారాములు వివరాలు వెల్లడించారు. శ్రీరాంపూర్ గాంధీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికు డు ఉగ్గ కొమురయ్య కూతురు శారదకు, ఆర్కే 6 కొత్తరోడ్‌కు చెందిన కాళీ పోశం కుమారుడు కాళీ మహేందర్‌తో 6 నెలల క్రితం వివాహమైంది. ఈ దంపతులిద్దరు ఇక్కడి కటిక దుకాణాల వద్ద ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఈ నెల 18న అర్ధరాత్రి తాగి ఇంటికి వచ్చిన మహేందర్ భార్యతో కట్నం విషయమై గొడవ పడ్డాడు.
ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన మహేందర్ అక్కడున్న డంబెల్‌ను తీసి శారద మొఖంపై మోదడంతో తీవ్ర రక్తంస్రావం జరిగి ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం తన ఇంటికి సమీపంలో తిరుగుతుండగా అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన డంబెల్‌ను స్వాధీన పరుచుకున్నారు. నిందితున్ని ఘటన స్థలం వద్దకు తీసుకెళ్లగా ఎలా హత్య చేశాడో పోలీసులకు వివరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా మహేందర్‌తోపాటు కట్నం కోసం వేధించిన కేసులో అతని తల్లిదండ్రులు కాళీ మల్లక్క, పోశం, అతని బావ పెగిడి బాపుపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చూపించారు.. సమావేశంలో సీఐ ప్రవీణ్‌నాయక్, ఎస్సై రవిప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment