
టాలీవుడ్ స్టార్ నటి అనసూయ ఇటీవల నూతన గృహ ప్రవేశం చేసింది. తన జీవితంలో మరో కొత్త అధ్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను పంచుకుంది. అంతేకాకుండా తన కలల సౌధానికి శ్రీరామసంజీవని అని పేరు కూడా పెట్టింది. ఈ సంతోషకర విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
తాజాగా తన కొత్త ఇంటిలో జరిగిన పూజా కార్యక్రమం విశేషాలను వివరిస్తూ అనసూయ పోస్ట్ చేసింది. ఇంట్లో జరిగిన పూజా కార్యక్రమాలైన హోమాలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం గురించి వివరిస్తూ సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. మా ఇంటికి సంజీవని అని పేరు పెట్టాలనుకున్నామని.. కానీ గురువు(పూజారి) సూచనలతో శ్రీరామసంజీవని అని పెట్టుకున్నామని తెలిపింది. ఆ రోజే మా ఇంటికి ఆంజనేయుడు వచ్చాడని గురువు తన ఫోన్‌లో ఫోటోను చూపించారని భావోద్వేగానికి గురైంది.
నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారి నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం గురించి అనసూయ రాసుకొచ్చింది. సంతోషంలో, విషాదంలో, భయాందోళనలో, అనారోగ్యంలో, ప్రేమలో ఉన్నా జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయగలను అని తండ్రి చెప్పేవారని తెలిపింది. నా తండ్రి తర్వాత తండ్రిగా భావించేది ఆ హనుమంతుడినే.. అందుకే నా పెద్ద కొడుకుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం అని వివరించింది. ముక్కోటి దేవతలకు వార్తాహరుడు అగ్ని దేవుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారానే చెప్పుకుంటాం.. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్ మా ఇంటి పేరుని.. మా ఇంటికి ఆహ్వానించాడనికి వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేసింది. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించిందని అనసూయ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.