కొత్తింట్లో చేరిన బిగ్‌ బాస్‌ శివజ్యోతి.. వీడియో చూశారా? | Bigg Boss Contestant Shivajyothi New House Warming Ceremony | Sakshi
Sakshi News home page

Shivajyothi: బిగ్‌ బాస్‌ శివజ్యోతి నూతన గృహప్రవేశం.. హాజరైన బుల్లితెర నటులు!

Published Tue, Oct 17 2023 7:31 PM | Last Updated on Tue, Oct 17 2023 8:00 PM

Bigg Boss Contestant Shivajyothi New House Warming Ceremony - Sakshi

తీన్మార్ వార్తలతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలంగాణ ముద్దుబిడ్డ శివజ్యోతి. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని అందరి దృష్టని ఆకర్షించింది. వెంటితెరపై యాంకర్‌గానే పరిచయమైన శివజ్యోతి.. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్‌ కంటెస్టెంట్‌గా మరింత ఫేమస్ అయింది. బిగ్‌బాస్‌ సీజన్‌-3లో పాల్గొని టాప్‌ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: తన ఇంటిని చూపించిన శివజ్యోతి.. ఆ బాధతో కంటతడి!)

 అయితే ప్రస్తుతం తన పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట  గ్రామానికి చెందిన చెందిన శివజ్యోతి.. గంగూలీ అలియాస్ గంగులుని ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని గతంలో ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తాజాగా తన ఛానెల్‌ ద్వారా గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. 

వీడియో చూస్తే గేటేడ్ కమ్యూనిటీలో ఖరీదైన ఫ్లాట్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో శివజ్యోతి ఫ్రెండ్స్‌, బుల్లితెర నటీనటులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివజ్యోతి, గంగూలీ దంపతులు అతిథులందరికీ అద్భుతమైన వంటకాలతో స్వాగతం పలికారు. అయితే గతంలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసిన శివజ్యోతి కొన్ని రోజులకే అమ్మేసిన సంగతి తెలిసిందే. 

(ఇది చదవండి: పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement