ceremony
-
Sakshi Excellence Awards 2025 : సందడిగా సాగిన సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ (ఫోటోలు)
-
Lasya Chittella: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గృహప్రవేశం (ఫోటోలు)
-
వేడుకగా భారత్ అన్మోల్ వుమెన్ అవార్డ్స్ వేడుక (ఫోటోలు)
-
పెళ్లి వేడుకలో సందడి చేసిన బలగం బ్యూటీ కావ్య కల్యాణ్ రామ్ (ఫోటోలు)
-
మెహందీ వేడుక ఫోటోలు షేర్ చేసిన హీరోయిన్ కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
ట్రంప్ ప్రమాణాస్వీకారోత్సవంలో చీరకట్టులో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్స్..!
-
సింగర్ గీతామాధురి కుమారుడి అన్నప్రాసన వేడుక (ఫోటోలు)
-
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం.. సెలబ్రిటీల సందడి (ఫోటోలు)
-
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన నాగచైతన్య- శోభిత ధూళిపాళ (ఫోటోలు)
-
రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ 'ఈ5వరల్డ్’ కు అంకురార్పణ
హైదరాబాద్, నవంబర్ 2024: ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ ఆధ్వర్యంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ సహకారంతో హైదరాబాద్‌లో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో లగ్జరీతో కూడిన రిసార్ట్ శైలి జీవనమే లక్ష్యంగా 'ఈ5వరల్డ్' కు అంకురార్పణ జరిగింది. ఈ వివరాలు తెలిపేందుకు బంజారాహిల్స్ లోని తాజ్ డెక్కన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఐకేఎఫ్ ఫైనాన్స్ వ్యవస్థాపకులు, ఈ5వరల్డ్ ప్రమోటర్ వీజీకే ప్రసాద్ మాట్లాడుతూ రిసార్ట్ స్టైల్ లివింగ్‌లో సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తున్నామని చెప్పారు. ఇది లగ్జరీ, వెల్నెస్, నేచర్ సమతుల్యతతో డిజైన్ చేయబడిందన్నారు. ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ రిసార్ట్ ప్రత్యేకంగా రూపొందించామని తెలిపారు. ప్రీమియం సౌకర్యాలు కలవన్నారు. ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందే ఆర్కిటెక్చర్ ఇక్కడ ప్రత్యేకత అన్నారు. దీనిని మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నామని చెప్పారు. మొదటి దశలో 1 నుంచి 5 ఎకరాలు, రెండో దశలో 2 నుంచి 10 ఎకరాలు, మూడో దశలో 3 నుంచి 5 ఎకరాలు అభివృద్ధి చేయనున్నామన్నారు. లగ్జరీ, వెల్నెస్, స్థిరమైన డిజైన్‌తో హైదరాబాదులో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేస్తున్నామని చెప్పారు. ఇది పచ్చని వాతావరణంలో ప్రశాంతతతో కూడిన ఉన్నత స్థాయి రిసార్ట్ జీవనానికి నిలయంగా ఉండనుందన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ రూ. 2,356.99 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన విశ్వసనీయ ఆర్థిక సంస్థ అన్నారు. హైదరాబాద్‌లో లగ్జరీ లివింగ్‌ను మలుపు తిప్పేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. ఇది కేవలం ఒక లగ్జరీ రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీ మాత్రమే కాదని, ఇది నాణ్యత, ఆవిష్కరణ, స్థిరమైన జీవనం తాలుకా నిబద్ధతను ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఆర్కిటెక్చర్ కీర్తి షా లగ్జరీ, నేచర్ కలయిక విజన్ అద్భుతమన్నారు. ఉన్నతమైన జీవన విధానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. ఇక్కడ నివసించే వారికి లగ్జరీ జీవనంతో పాటు పర్యావరణ అనుకూల వాతావరణాన్ని అందిస్తుందని తెలిపారు. ఈ లగ్జరీ రిసార్ట్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉందన్నారు. పెట్టుబడిదారులు దీర్ఘకాలంలో వృద్ధిపై ఆసక్తి చూపిస్తున్నారన్నారు. పెట్టుబడిదారులకు ఫ్రాక్షనల్ ఓనర్షిప్ అందించే ప్రత్యేక అవకాశాన్ని అందిస్తున్నామని చెప్పారు. ఈ మోడల్ ద్వారా పెట్టుబడిదారులు రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు.ఈ సందర్భంగా ఓపస్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం వుప్పుటూరి మాట్లాడుతూ ప్రాక్షనల్ ఓనర్షిప్ ద్వారా దీనిని అందరికి చేరువ చేయనున్నామని చెప్పారు. రూ.10 లక్షలలోపు మొత్తంతో రిసార్ట్‌లో భాగస్వామ్యం పొందవచ్చన్నారు. ఇది కుటుంబాలు సమయం గడిపేందుకు ఒక వీకెండ్ గమ్యస్థలంగా కూడా ఉంటుందన్నారు. ఇందులో ఉన్న విస్తృతమైన సౌకర్యాలు అన్ని వయస్సులు, వర్గాలకు అనుకూలంగా రూపొందించబడ్డాయని చెప్పారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికి అనుకూలంగా ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్ట్‌లో మూడు క్లబ్ హౌస్‌లు కలవన్నారు. వీటి విస్తీర్ణం 10,000, 30,000, 50,000 చదరపు అడుగులు అన్నారు. అందులో యోగా గదులు, వెల్నెస్ జోన్లు, స్విమ్మింగ్ పూల్స్, వినోద సౌకర్యాలు ఉన్నాయన్నారు. రెండు రెస్టారెంట్లు కలవన్నారు. ఈ రెస్టారెంట్లలో ప్రపంచ, స్థానిక వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. తాజా, సేంద్రీయ పదార్థాలను ప్రధానంగా ఉపయోగించనున్నామని తెలిపారు. విశాలమైన పచ్చని ప్రదేశాలు, గ్రీన్ గార్డెన్స్, నీటి వనరులు, నడక మార్గాలు ఉన్నాయన్నారు. పిల్లల కోసం ప్రత్యేక అడ్వెంచర్ ప్రదేశాలు, పెద్దలు, వృద్ధుల కోసం నేచర్ ట్రైల్స్, వెల్నెస్ లాంజ్‌లు ఉన్నాయని తెలిపారు. ఈ కమ్యూనిటీ ప్రత్యేక మెంబర్షిప్ ప్యాకేజీలను కూడా అందిస్తుందని చెప్పారు. హైదరాబాద్ నివాసితులు ప్రపంచ స్థాయి సదుపాయాలు ఆస్వాదించే అవకాశం ఉందన్నారు.ఈ సందర్భంగా ఈ5వరల్డ్ సేల్స్, బ్రాండ్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఈ5వరల్డ్ హైదరాబాద్ వాసులు ఆనందించే ఒక ప్రత్యేక గమ్యస్థలంగా మారనుందన్నారు. ఇది వివిధ వయస్సులు, వర్గాల ప్రజల అవసరాలను తీర్చబోతుందన్నారు.ఈ సందర్భంగా ఆర్కిటెక్ట్, అర్బన్ ప్లానర్, ఈ5వరల్డ్ వ్యవస్థాపక సభ్యులు కీర్తి షా మాట్లాడుతూ ఈ5వరల్డ్ స్థిరమైన నిర్మాణం, వెల్నెస్ ఆధారిత జీవనశైలిలో ఉంటుందన్నారు. ఆధునిక సౌకర్యాలు ఆస్వాదిస్తూ.. ప్రకృతితో మళ్లీ కనెక్ట్ అయ్యేలా చేయడం మా లక్ష్యమన్నారు. మా స్టాండ్ ఏమిటంటే.. పర్యావరణానికి అనుకూలంగా ఉంటూ విలాసవంతమైన జీవనానికి ఒక నమూనాగా, సమకాలీన సౌకర్యాలతో సహజ ప్రకృతి దృశ్యాలను మిళితం చేయడం అన్నారు. ఈ5వరల్డ్ భారతదేశంలో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపకల్పన చేసిన మొదటి రిసార్ట్ లివింగ్ కమ్యూనిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ వినూత్న పద్ధతిని క్యూలీడ్.ఏఐ డాక్టర్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో అమలు అవుతుందన్నారు. ఇందులో మార్కెట్ కమ్యూనికేషన్, ఉత్పత్తి మార్కెట్ సరిపోలిక, ఆదాయ అంచనాలు, వ్యూహాత్మక ప్రణాళిక వంటి ప్రతి అంశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సూచనలు ఉంటాయన్నారు. ఐకేఎఫ్ ఫైనాన్స్ ప్రమోటర్ల మద్దతుతో ఐఖ్యా ఇన్ఫ్రా డెవలపర్స్ లగ్జరీ రిసార్ట్ లివింగ్‌లో మొదటి ప్రయత్నంగా ఈ5వరల్డ్ కు పునాది పడింది. ఇది ఈ సంస్థ ఆర్థిక సేవలలో ఉన్న బలమైన పునాది నుంచి సహజ విస్తరణను ప్రతిబింబిస్తుంది. ఇది 1991లో స్థాపించబడింది. ఐకేఎఫ్ ఫైనాన్స్ నిరంతరం అగ్రగామిగా ఉంది. ఇది తన పోర్ట్‌ఫోలియోను వాహన, ఎంఎస్ఎంఈ, హౌసింగ్ ఫైనాన్స్‌లను కలుపుతూ విస్తరించింది. తొమ్మిది రాష్ట్రాలలో ప్రస్థానం కలిగి ఉంది. 613.76 కోట్ల రూపాయల అంచనా కలిగిన సమగ్ర టర్నోవర్‌తో ఐకేఎఫ్ ఫైనాన్స్ మద్దతుతో స్థిరత్వం, నాణ్యత, దీర్ఘకాలిక విలువకు హామీగా నిలుస్తుంది. ఈ సమావేశంలో బిజినెస్ కన్సల్టెంట్ దేవేంద్ర దాంగ్ పాల్గొన్నారు.ఐకేఎఫ్ ఫైనాన్స్ గురించిఐకేఎఫ్ ఫైనాన్స్ వీజీకే ప్రసాద్ చేత స్థాపించబడింది. పారదర్శకత, వృద్ధి, కస్టమర్ సేవల పట్ల నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా ఎదిగింది. కంపెనీ ట్రాక్ రికార్డ్ దాని తాజా వెంచర్ ఈ5వరల్డ్ హైదరాబాద్‌లో ప్రీమియర్ లైఫ్ స్టైల్ కు మద్దతు ఇస్తుంది.ఐకేఎఫ్ ఫైనాన్స్ వాహన ఫైనాన్సింగ్‌పై దృష్టి సారించడంతో ప్రారంభమైంది. భారతదేశంలో విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను అందించే పవర్ హౌస్‌గా ఎదిగింది. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ఐకేఎఫ్ ప్రతిష్టాత్మకమైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సుందరం ఫైనాన్స్, టెల్కో వంటి సంస్థలతో కలిసి పని చేస్తుంది. దీర్ఘకాల భాగస్వామ్యాలు, పరిశ్రమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంది.మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371/ 9963980259 -
సరికొత్త ప్రయాణం : నటి హన్సిక గృహప్రవేశ వేడుక (ఫొటోలు)
-
బాలయ్య అఖండ-2 పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన కూతురు బ్రాహ్మణి (ఫొటోలు)
-
J&K: ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
-
సింగపూర్‌లో వైభవంగా మనబడి స్నాతకోత్సవం
ఎన్నో వైవిధ్యమైన కార్యక్రమాలతో నిరంతరం సింగపూర్ లోని తెలుగు వారి కోసం సేవ చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం వారి ఆద్వర్యంలో మనబడి తెలుగు విద్యార్థుల స్నాతకోత్సవ కార్యక్రమం జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంబమైన కార్యక్రమం ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.మెరీనా బే సాండ్స్ ఎగ్జిబిషన్ హాల్లో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. 2022-23, 2023-24 విద్యా సంవత్సరములలో ప్రవేశం, ప్రస్తుత తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా తెల్లటి పైకండువా కప్పి, మెడల్ తోపాటు సిలికానాంధ్ర, సింగపూర్ తెలుగు సమాజం స్నాతకోత్సవ ధృవపత్రాలను బహుకరించినట్లు కార్యక్రమ నిర్వాహకులు స్వామి గోపి కిషోర్ తెలిపారు. మంచి అభిరుచితో తెలుగు నేర్చుకుంటున్న విద్యార్థులను అభినందిస్తూ, మనబడి కార్యక్రమానికి సహకారం అందిస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాస రెడ్డి ప్రారంభోన్యాసంలో ఈ తరం వారికి తెలుగు భాష అవసరాన్ని తెలుపుతూ అందరూ సమాజం సభ్యులుగా చేరి ఆ రకంగా తెలుగు సమాజం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.NRI ONE స్థిరాస్తి విక్రేతలు అందించిన సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి, స్థానిక GIG అంతర్జాతీయ పాఠశాల ఎక్జిక్యూటివ్ డైరక్టర్ సాంబశివ రావు ముఖ్య అతిథి గా విచ్చేసి ఉపాధ్యాయులకు జ్ఞాపికను బహుకరించారు. ఈ సందర్భంగా సాంబశివరావు మాతృభాష ఉన్నతి కోసం కృషి చేస్తున్న సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గాన్ని, నిస్వార్ధంతో సేవ చేస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ భవిష్యత్తులో మనబడి కార్యక్రమానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.తెలుగు బడి విద్యార్థులు ప్రదర్శించిన పద్య పఠనం, తెలుగు పాటలు, శాస్త్రీయ సంగీతం, నాట్య ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన చాణక్య సభికులను ఆకట్టుకుంటూ కార్యక్రమం ఆద్యంతం క్రమపద్ధతిలో జరిగేలా సహకరించారు. ఈ సందర్భంగా జీఐజీ రావు గారికి, NRI ONE శేఖర్‌కి జ్ఞాపికను బహుకరించారు.అనంతరం సింగపూర్ తెలుగు సమాజం గౌరవ కార్యదర్శి అనిల్ కుమార్ పోలిశెట్టి వందన సమర్పణ చేస్తూ కార్యక్రమం విజయవంతం చేయటానికి సహకరించిన, విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, NRI ONE వారికి, GIG రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మనబడి కార్యక్రమాలను మరింత మంది ఉపయోగించుకుని తద్వారా మాతృభాష అభివృద్ధికి దోహదం చేయాలని కోరారు.ఉపాధ్యక్షులు పాలెపు మల్లికార్జున్, కురిచేటి జ్యోతీశ్వర్ కార్యక్రమానికి మొదటి నుండి సహకారం అందిస్తూ వెన్నంటి నిలిచారు. కార్యక్రంలో సింగపూర్ తెలుగు సమాజం కార్యవర్గం శ్రీనివాసరెడ్డి పుల్లన్నగారి, టేకూరి నాగేష్, కురిచేటి స్వాతి, వైదా మహేష్, కొత్త సుప్రియ పాల్గొని సహకారం అందించారు. ఉపాధ్యాయులు ప్రతిమ, దేదీప్య, శ్రీలక్ష్మి, కిరణ్ కుమార్, గోపి క్రిష్ణ, రంగనాధ్, గీత, శ్రీలత, విజయ వాణి విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందచేసారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా 200 మంది, పరోక్షంగా 4000 మంది వీక్షించినట్లు నిర్వహకులు తెలిపారు.(చదవండి: అయోవాలో ప్రారంభమైన నాట్స్ ప్రస్థానం) -
'దళపతి 69' పేరుతో విజయ్ కొత్త సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
చిన్ననాటి కల.. ఇన్నాళ్లకు నెరవేరిందన్న హీరోయిన్ (ఫోటోలు)
-
జాతీయ అవార్డ్.. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి సన్మానం (ఫొటోలు)
-
విశ్వక్సేన్ కొత్త సినిమా ప్రాజెక్ట్ ప్రారంభం (ఫొటోలు)
-
అనంత్- రాధిక పెళ్లి: నిండు మనసుతో ఆశీర్వదించిన సినీతారలు (ఫోటోలు)
-
వరలక్ష్మి పెళ్లి వేడుకలో సినీతారల సందడి (ఫొటోలు)
-
హీరోయిన్ సోనాక్షిపెళ్లికి రెడీ,మెహెందీ ఫోటోలు వైరల్
-
'ధమాకా' కాంబో రిపీట్.. రవితేజ 75వ సినిమా ప్రారంభం (ఫోటోలు)
-
అర్జున్ సర్జా కూతురి పెళ్లి.. గ్రాండ్‌గా హల్దీ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
-
హీరోగా యూట్యూబర్ నిఖిల్.. సంగీత్ సినిమా లాంఛ్ (ఫోటోలు)
-
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
టీవీ నటి సురభి చందన-కరణ్ శర్మ, హల్దీ ఫంక్షన్ అదిరిందిగా( ఫోటోలు)
-
హల్దీ వేడుకల్లో టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి కొడుకుతో అలా!
రాశి ఖన్నా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. మనం సినిమాలో చిన్న పాత్రతో అడుగుపెట్టిన దిల్లీ భామ.. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో చేసింది. జోరు, సుప్రీమ్, బెంగాల్ టైగర్, హైపర్, రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కల్యాణం, ప్రతి రోజు పండగే లాంటి హిట్ చిత్రాల్లో కనిపిచింది. ప్రస్తుతం టాలీవుడ్ తెలుసు కదా అనే సినిమాలో నటించనుంది. అంతే కాకుండా బాలీవుడ్లో సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన యోధ విడుదలకు సిద్ధమవుతోంది. షూటింగ్‌కు కాస్తా గ్యాప్ ఇచ్చిన ముద్దుగుమ్మ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. తన కజిన్ పెళ్లి వేడుకలో పాల్గొని ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. తాజాగా హల్దీ వేడుకలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. రెండు రోజుల క్రితమే కజిన్ పెళ్లికి సంబంధించిన విషయాన్ని వెల్లడించింది. గత రెండు రోజులు ఎంతో ఆనందంగా గడిచాయని తెలిపింది. చాలా ఏళ్ల తర్వాత తెలిసిన వారిని చూడటం, వాళ్లతో జీవించిన క్షణాలను గుర్తు చేసుకోవడం అద్భుతంగా అనిపించిందని పేర్కొంది. నేను బాగా ఇష్టపడే చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నట్లు అనిపించిందంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన కుటుంబసభ్యులతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేసింది. View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ 'టీ-పాడ్' నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టెక్సాస్‌లోని ఇర్వింగ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో డాలస్ ప్రాంతీయులు, అన్ని స్థానిక, తెలుగు జాతీయ సంస్థల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజల్వన, గణపతి ప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. కొత్తగా ఎన్నికైన కార్యవర్గ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. టీ-పాడ్ 2024 అధ్యక్షురాలిగా కన్నయ్యగారి రూప, కార్యదర్శిగా అన్నమనేని శ్రీనివాస్, కోశాధికారిగా గణపవరపు బాలాలు ఎన్నికయ్యారు. ఫౌండేషన్ కమిటీ అధ్యక్షుడిగా జానకిరాం, ఉపాధ్యక్షుడిగా అజయ్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు ఛైర్మన్‌గా బుచ్చి రెడ్డిలు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి సభ్యులు అభినందనలు తెలిపారు. టీ-పాడ్ తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా జట్టు సభ్యులకు నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించడానికి వేదిక అయిందని సంస్థ అధ్యక్షురాలు పేర్కొన్నారు. టీ-పాడ్ ఏర్పాటు చరిత్ర, అనేక సంవత్సరాలుగా నిర్వహించిన స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాల గురించి ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యులు వివరించారు. తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించటం.. బతుకమ్మ, దసరా సంబరాలను వాటి సిగ్నేచర్ స్టైల్లో నిర్వహించడం గురించి వివరించారు. చివరగా ఈ ఏడాది టీపాడ్ చేపట్టాల్సిన కార్యక్రమాలపై నూతన కార్యవర్గం చర్చించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు ప్రాంతీయ, జాతీయ సంస్థల నాయకులు.. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను అభినందించారు. (చదవండి: న్యూయార్క్ టైమ్స్ స్వ్కేర్ రామ మయం) -
అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సైంటిస్ట్ సతీష్ రెడ్డికి ఆహ్వానం!
ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణకు నేరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవం దశాబ్దాల పోరాటం. ఇవాళ అది సాకారం కానుంది. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అట్టహాసంగా జరగనుంది. ఆ ప్రాణప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రుముఖ శిల్పి అరుణ్ యోగ రాజ్ చెక్కిన బలరాముడి శిల్పాన్ని అయోధ్యలో ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రారంబోత్సవ కార్యక్రమంలో యావత్త్ దేశం ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే పలువు ప్రముఖులు, సెలబ్రెటీలకు ఆహ్వానాలు అందాయి. తాజాగా రక్షణశాఖ శాస్త్రీయ సలహాదారు సైంటిస్ట్ సతీష్ రెడ్డిగారికి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగనున్న రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫు నుంచి ఆయనకు ఆహ్వానం అందడం విశేషం. కాగా, ఆయన రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా ఉండటమేగాక రక్షణ వ్యవస్థల, సాంకేతికతలలో భారతదేశ అభివృద్ధికి నాయకత్వం వహిస్తున్నారు. ఆయన క్షిపణులు, యుద్ధ విమానాలు, మానవ రహిత వైమానికి రక్షణ వ్యవస్థలు, రాడార్ వంటి వ్యవస్థల అభివృద్ధికి కృషి చేశారు. అంతేగాక ఆయన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ గవర్నింగ్ బాడీ చైర్మన్‌గా కూడా సేవలందించారు. (చదవండి: అయోధ్య ప్రాణ ప్రతిష్ట వేళ.. తెలుగు వారు గర్వపడే విషయం!) -
అయోధ్య రామ మందిర నిర్మాణం.. రామ్లాల్లా విగ్రహం ఖరారు.. సాధువుల సందడి..(ఫొటోలు)
-
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
వాటి గురించి ఆలోచించడం మానేశా
‘‘నన్ను అందరూ ‘ఇసైజ్ఞాని’ అని పిలుస్తుంటారు. నిజం చెప్పాలంటే ఆ పేరుకు నేను అర్హుడినా? అని ఆలోచిస్తే నాకే ప్రశ్నార్థకంగా ఉంటుంది’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా అన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ పుస్తకావిష్కరణ వేడుకలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ– ‘‘నాకు భాష, సాహిత్యంపై అంత పరిజ్ఞానం లేదు. కర్ణాటక సంగీతాన్ని ఔపోసన పట్టలేదు. కానీ, ప్రజలు నన్ను ఇసైజ్ఞాని అని పిలుస్తున్నారు. కానీ, నేను ‘ఇసైజ్ఞాని’ అనుకోవడం లేదు. నా గర్వాన్ని చిన్న వయసులోనే వదిలేశా. అన్నతో కలిసి నేను కచేరీలకు వెళ్లే సమయంలో హార్మోనియం వాయిస్తుంటే ప్రేక్షకులు చప్పట్లుకొడుతూ అభినందించేవారు. ఆ సమయంలో ఎంతో గర్వంగా ఉండేది. అయితే ఆ అభినందనలు నాకు కాదు.. నేను సృష్టించే బాణీలకు వస్తున్నాయని తెలుసుకున్నా. మనకు ఏ విషయంతో సంబంధం లేదని గ్రహించాను. అందుకే కీర్తి ప్రతిష్టల గురించి ఆలోచించడం మానేశాను’’ అని పేర్కొన్నారు. -
Actor Vishwa: బిగ్‌బాస్ కంటెస్టెంట్ విశ్వ రెండో కుమారుడి అన్నప్రాసన (ఫోటోలు)
-
స్టార్ హీరో కూతురి పెళ్లి.. మొదలైన సందడి..!
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇంట అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. ఆయన కూతురు ఐరా ఖాన్.. తన ప్రియుడు నుపుర్ శిఖరేతో గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకుంది. వచ్చే ఏడాది జనవరిలో వీరి పెళ్లి జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు నెలలు ముందుగానే ప్రీ వెడ్డింగ్ వేడుకలు మొదలయ్యాయి. పెళ్లికి ముందు జరిగే సంప్రదాయ వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొని సందడి చేశారు. దీనికి సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కెల్వన్ వేడుక అంటే.. మహారాష్ట్ర సంప్రదాయంలో భాగంగా వివాహానికి ముందు కెల్వన్ వేడుకను జరుపుకుంటారు. ఈ సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు తరఫున తల్లిదండ్రులు ఒకరి కుటుంబాలకు మరొకరు ఆహ్వాన పత్రికలను అందజేస్తారు. ఈ వేడుకలో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ వేడుకకు ఇరువైపులా బంధువులు, సన్నిహితులు హాజరై వధూవరులకు బహుమతులు అందజేస్తారు. తాజాగా ఐరా ఖాన్ దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. కాగా.. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే గత ఏడాది నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది జనవరి 3, 2024న వివాహా బంధంతో ఒక్కటి కానున్నారు. కాగా.. ఐరా ఖాన్ మానసకి సమస్యలతో బాధపడే వారికి అవగాహన కల్పిస్తోంది. తన తండ్రితో కలిసి ఆత్మహత్యల నివారణకు కృషి చేస్తోంది. View this post on Instagram A post shared by Ira Khan (@khan.ira) -
మొదలైన మెగా సందడి.. హల్దీ వేడుకలో వరుణ్ - లావణ్య!
ఇటలీలో మెగా ఇంట పెళ్లిసందడి మొదలైంది. మరికొన్ని గంటల్లో ఒక్కటి కాబోతున్న టాలీవుడ్ జంట పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ వేడుక జరుపుకున్నారు. ఇటలీలోని టుస్కానీలో జరుగుతున్న వీరి డెస్టినేషన్ వెడ్డింగ్‌కు మెగా కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా జరిగిన హల్దీ వేడుక ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఈ జంట నవంబర్ 1వ తేదీన పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. (ఇది చదవండి: కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్) అయితే వీరి పెళ్లి వేడుక కోసం ఇటలీ చేరుకున్న కుటుంబ సభ్యులు అక్టోబర్ 30న కాక్ టెయిల్ పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ పార్టీలో రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహాలు కూడా కలర్ఫుల్గా కనిపించారు. ఇప్పటికే పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇటలీ చేరుకున్నాయి. ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన దుస్తులను ధరించి వరుణ్ తేజ్- లావణ్య ఈ వేడుకలో పాల్గొన్నారు. కాగా.. ఈ ఏడాది జూన్ 9న నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఇటలీలో పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో నవంబర్ ఐదో తేదీన గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ ఓ చెత్త షో.. అల్లు అర్జున్ హీరోయిన్ ఫైర్!) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
పండుగరోజే గృహప్రవేశం చేసిన స్టార్ హీరోయిన్!
బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ బీటౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. అధిక పారితోషికం అందుకున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. 2005లో బ్లాక్ సినిమాకు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కించిన సావరియా సినిమాతో హీరోయిన్గా తెరంగేట్రం చేశారామె. ఈ సినిమాలోని ఆమె నటనకు ఫిలింఫేర్ ఉత్తమ డెబ్యూ నటిగా పురస్కారం లభించింది. (ఇది చదవండి: కావాలయ్యా సాంగ్.. తమన్నా స్టెప్పు చెండాలం అంటూ నటుడి విమర్శలు) అయితే తాజాగా ముంబయిలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. విజయదశమి సందర్భంగా గృహప్రవేశం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. సోనమ్ కపూర్ అహూజా పండుగ రోజే ముంబయిలోని కొత్త ఇంటికి చేరింది. ఆనంద్ అహుజాను పెళ్లాడిన సోనమ్‌కు ఏడాది వయసున్న వాయు కపూర్ అహుజా అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు సోనమ్‌కు అభినందనలు చెబుతున్నారు. సోనమ్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'మేము ఈ వారంలో మా కొత్త ఇంటికి మారాం . ఇప్పుడు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా మనసులు ఆశతో నిండి ఉన్నాయి. ఇక్కడ కొత్త జ్ఞాపకాలను కోసం మేము వేచి ఉండలేము' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌తో పాటు తాను ఇంట్లో కూర్చొని ఉన్న అందమైన ఫోటోలు పంచుకుంది. (ఇది చదవండి: ఒక్క వీడియోతో లక్షన్నర పొగొట్టుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) -
కొత్తింట్లో చేరిన బిగ్ బాస్ శివజ్యోతి.. వీడియో చూశారా?
తీన్మార్ వార్తలతో సావిత్రిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన తెలంగాణ ముద్దుబిడ్డ శివజ్యోతి. బిగ్ బాస్ షోలో పాల్గొన్ని అందరి దృష్టని ఆకర్షించింది. వెంటితెరపై యాంకర్‌గానే పరిచయమైన శివజ్యోతి.. తెలంగాణ యాస, కట్టుతో సావిత్రక్కగా గుర్తింపు దక్కించుకుంది. బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా మరింత ఫేమస్ అయింది. బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని టాప్ 6 కంటెస్టెంట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: తన ఇంటిని చూపించిన శివజ్యోతి.. ఆ బాధతో కంటతడి!) అయితే ప్రస్తుతం తన పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామానికి చెందిన చెందిన శివజ్యోతి.. గంగూలీ అలియాస్ గంగులుని ప్రేమ వివాహాం చేసుకుంది. వీరిద్దరి ప్రేమ పెళ్లి ఇరు కుటుంబాలకు నచ్చకపోవడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశామని గతంలో ఓ షోలో శివ జ్యోతి చెప్పింది. తాజాగా తన ఛానెల్ ద్వారా గృహా ప్రవేశానికి సంబంధించిన వీడియోను పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. వీడియో చూస్తే గేటేడ్ కమ్యూనిటీలో ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వేడుకలో శివజ్యోతి ఫ్రెండ్స్, బుల్లితెర నటీనటులు, బంధువులు పాల్గొన్నారు. ఈ వేడుకలో శివజ్యోతి, గంగూలీ దంపతులు అతిథులందరికీ అద్భుతమైన వంటకాలతో స్వాగతం పలికారు. అయితే గతంలోనూ ఓ ఇంటిని కొనుగోలు చేసిన శివజ్యోతి కొన్ని రోజులకే అమ్మేసిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!) -
జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక.. వేదికపై మెరిసిన అల్లు అర్జున్ (ఫొటోలు)
-
గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్.. వీడియో రిలీజ్ చేసిన శ్రీలీల
సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక డిసెంబరు 2న గోవాలో జరగనుంది. సంతోషం 22వ ‘సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డులు– 2023’ వేడుక గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరగనున్నట్లు, జాతీయ సినిమా దినోత్సవం సందర్భంగా శుక్రవారం హీరోయిన్ శ్రీలీల ఓ వీడియోలో వెల్లడించారు. ఇక గోవాలోని బాంబోలిం బీచ్ కు అతి చేరువలో ఉన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరగనుంది. ఇక అదే సమయంలో గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది. 150 దేశాల నుంచి సినీ ప్రేమికులు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఇక ఆ దేశాల సినీ ప్రేమికులు, మన ఇండియన్ సినీ లవర్స్ మోహరించి ఉన్న గోవాలో వేలాది ప్రేక్షకుల మధ్య సంతోషం 22వ సౌత్ ఇండియన్ ఇండియన్ ఫిలిం అవార్డుల వేడుక జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ మరియు బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నట్లు నిర్వాహకుడు, ‘సంతోషం’ పత్రికాధినేత సురేష్ కొండేటి పేర్కొన్నారు. Exciting news for all the film enthusiasts! 🎥 The Goa Santosham South Indian Film Awards 2023 is just 50 days away, and it's happening on December 2nd at Dr. Shyama Prasad Mukherjee Indoor Stadium, Goa. Can't wait to see what our favorite stars bring to the stage. Mark your… pic.twitter.com/zpvcBrr7aF — Suresh Kondeti (@santoshamsuresh) October 13, 2023 -
మరో సక్సెస్ఫుల్ హీరో వచ్చాడు – హీరో నాని
‘‘బబుల్గమ్’ టీజర్ చూస్తే చాలా బలమైన కథ అనిపించింది. రోషన్‌ని స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా కనిపించాడు. మరో సక్సెస్ఫుల్ హీరో తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడని నమ్మకంగా చెప్పగలను. టీజర్ చూసినప్పుడు నాకు ఆ నమ్మకం వచ్చింది’’ అని హీరో నాని అన్నారు. నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమల తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బబుల్గమ్’. రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మానసా చౌదరి కథానాయిక. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ విడుదల వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నాని మాట్లాడుతూ– ‘‘రవికాంత్‌కి ఒక యునిక్ స్టయిల్ ఉంది. అది టీజర్లో కనిపిస్తోంది. తెలుగులో క్వాలిటీ ఫిలిమ్స్‌కి మారుపేరుగా మారిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్లగారికి ‘బబుల్గమ్’ మరో హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘నాకు ఇష్టమైన పని (సినిమాలు) చేయడానికి ప్రోత్సహించిన అమ్మానాన్నలకి థ్యాంక్స్’’ అన్నారు రోషన్ కనకాల. ‘‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌తో పని చేయడం చాలా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రవికాంత్ పేరెపు. ‘‘బబుల్గమ్’ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్, సహనిర్మాత వివేక్ కూచిభొట్ల. హీరోయిన్ మానస, నటుడు రాజీవ్ కనకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్ పాకాల, కెమెరా: సురేష్ రగుతు, క్రియేటివ్ప్రోడ్యూసర్: దివ్య విజయ్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: మధులిక సంచన లంక. -
అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి – శర్వానంద్
‘‘మేం ఒక్క పాత్ర చేయడానికి చాలా కష్టపడుతున్నాం. అలాంటిది ‘మామా మశ్చీంద్ర’లో సుధీర్ ఏకంగా మూడు పాత్రలు చేశారు.. ఇలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు శర్వానంద్. సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఈషా రెబ్బా, మృణాళినీ రవి హీరోయిన్లు. సోనాలి నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీ విష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల అతిథులుగా హాజరయ్యారు. ‘‘సుధీర్ మూడు పాత్రలు చేశారంటే కథ ఎంత విలక్షణంగా ఉండి ఉంటుందో అర్థమవుతోంది’’ అన్నారు విశ్వక్ సేన్. ‘‘సుధీర్ కొత్త రకం కథలు ప్రయత్నిస్తుంటారు’’ అన్నారు శ్రీ విష్ణు. ‘‘మామా మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం.. అన్నీ ఉంటాయి’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘ఇది ఒక అమ్మ, తండ్రీకూతుళ్ల కథ’’ అన్నారు హర్షవర్ధన్. ‘‘రచయితల నుంచి డైరెక్టర్స్‌గా మారిన త్రివిక్రమ్, కొరటాల శివల్లా హర్షవర్ధన్ కూడా పెద్ద డైరెక్టర్ కావాలి’’ అన్నారు పుస్కూర్ రామ్మోహన్ రావు. -
పసుపు బోర్డు..గిరిజన వర్సిటీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: పాలమూరు పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రానికి పలు వరాలు ప్రకటించారు. రాష్ట్ర రైతులు ఎంతో కాలం నుంచి డిమాండ్ చేస్తున్న జాతీయ పసుపు బోర్డును, ఉమ్మడి ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో ఆదివారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో.. రూ.13,545 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతుంది. దేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేయడంతోపాటు వినియోగించేది, ఎగుమతి చేసేది ఈ పంటే. కరోనా తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. దీనిపై పరిశోధనలు పెరిగాయి. పాలమూరు సభ సాక్షిగా ఇక్కడి పసుపు రైతుల సంక్షేమం కోసం తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు (నేషనల్ టర్మరిక్ బోర్డు)ను ఏర్పాటు చేస్తాం. ములుగులో ట్రైబల్ వర్సిటీ.. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. రూ.900 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీకి సమ్మక్క–సారలమ్మ పేరు పెడుతున్నాం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో వివిధ భవనాలను ప్రారంభించాం. హెచ్సీయూకు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ హోదా కలి్పంచి, ప్రత్యేక నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. నారీశక్తి వందన్ చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించడం ద్వారా నవరాత్రులకు ముందే శక్తి పూజ స్ఫూర్తిని నెలకొల్పాం. వాణిజ్యం, పర్యాటకం, పరిశ్రమ రంగాలకు ప్రయోజనం తెలంగాణ ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేలా అనేక రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంబొత్సవాలు చేయడం సంతోషంగా ఉంది. నాగ్‌పూర్–విజయవాడ కారిడార్ వల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయి. ఈ మూడు రాష్ట్రాల్లో వాణిజ్యం, పర్యాటకం, పారిశ్రామిక రంగాలకు ప్రయోజనం చేకూరుతుంది. ఈ కారిడార్‌లో కొన్ని ముఖ్యమైన ఆర్థిక కేంద్రాలను కూడా గుర్తించాం. ఇందులో ఎనిమిది ప్రత్యేక ఆర్థిక మండళ్లు, ఐదు మెగా ఫుడ్ పార్కులు, నాలుగు ఫిషింగ్ సీఫుడ్ క్లస్టర్లు, మూడు ఫార్మా అండ్ మెడికల్ క్లస్టర్లు, ఒక టెక్స్టైల్ క్లస్టర్ ఉన్నాయి. దేశంలో నిర్మిస్తున్న ఐదు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. హన్మకొండలో నిర్మించే ఈ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వేలాది మందికి ఉపాధి ఇచ్చేలా.. ప్రపంచవ్యాప్తంగా ఇంధనం, ఇంధన భద్రతపై చర్చ జరుగుతోంది. కేవలం పరిశ్రమలకే కాకుండా ప్రజలకు కూడా ఇంధన శక్తిని అందిస్తున్నాం. దేశంలో 2014లో 14 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి 32 కోట్లకు పెరిగాయి. ఇటీవల గ్యాస్ సిలిండర్ల ధరలను కూడా తగ్గించాం. దేశంలో ఎల్పీజీ వినియోగాన్ని పెంచడంలో భాగంగా పంపిణీకి సంబంధించి నెట్‌వర్క్‌ను విస్తరించాల్సి ఉంది. ఇందులో భాగంగా హసన్–చర్లపల్లి ఎల్పీజీ పైప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఇది ఈ ప్రాంత ప్రజలకు ఎంతగానో దోహదపడుతుంది. కృష్ణపట్నం–హైదరాబాద్ మధ్య మల్టీ ప్రొడక్ట్ పైప్‌లైన్ వల్ల తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది..’’అని ప్రధాని మోదీ తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు. శంకుస్థాపనలు ఇవీ.. రూ.3,397 కోట్లతో మూడు ప్యాకేజీలుగా వరంగల్ నుంచి ఖమ్మం వరకు చేపట్టనున్న ఎన్‌హెచ్–163 పనులు రూ.3,007 కోట్లతో మూడు ప్యాకేజీలుగా ఖమ్మం నుంచి విజయవాడ వరకు నిర్మించే ఎన్‌హెచ్–163జీ పనులు కృష్ణపట్నం నుంచి హైదరాబాద్ వరకు రూ.1,932 కోట్లతో చేపట్టే మల్టీ ప్రొడక్ట్ పైపులైన్ నిర్మాణ పనులు ప్రారంభించినవి ఇవీ.. సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు రూ.2,457 కోట్లతో నిర్మించిన నాలుగు లేన్ల 365 బీబీ నంబర్ జాతీయ రహదారి మునీరాబాద్–మహబూబ్‌నగర్ రైల్వేలైన్‌లో భాగంగా జక్లేర్ నుంచి కృష్ణా వరకు రూ.505 కోట్లతో పూర్తి చేసిన కొత్త లైన్ రూ.81.27 కోట్లతో హెచ్‌సీయూలో నిర్మించిన స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మేథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ భవనాలు రూ.2,166 కోట్లతో హసన్ (కర్ణాటక) నుంచి చర్లపల్లి వరకు నిర్మించిన ఎల్పీజీ పైప్‌లైన్ జాతికి అంకితం నారాయణపేట జిల్లాలోని కృష్ణా స్టేషన్ నుంచి కాచిగూడ–రాయచూర్– కాచిగూడ డీజిల్, ఎలక్ట్రికల్ మల్టిపుల్ యూనిట్ (డెమూ) రైలు సర్విస్ ప్రారంభం -
శ్రీరామ్ కార్తీక్ హీరోగా కొత్త ప్రేమ కథా చిత్రం..!
కన్ని మేడమ్ చిత్రం ఫేమ్ శ్రీరామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజయ్ అర్జున్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అర్జున్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయన్ బాలా కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన 20 ఏళ్లుగా కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పలు చిత్రాలకు పని చేశారు. అదేవిధంగా 2017లో విడుదలైన ఆరు అధ్యాయం చిత్రంలో ఒక భాగానికి దర్శకత్వం వహించారు. (ఇది చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్..‘సలార్’పై ప్రభాస్ కీలక నిర్ణయం) కాగా.. ఈ చిత్రంలో నటి క్రిష్ గురూప్ నాయకిగా నటిస్తుండగా యోగిబాబు, మునీష్ కాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సిద్ధం కుమార్ సంగీతాన్ని, చెళియన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కొండ ప్రాంతంలో సాగే హృదయాన్ని హత్తుకునే అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. తమిళసినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్‌తో కలిసి చేస్తున్న చిత్రం ఇది అన్నారు. కథను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. తనకీ అవకాశాన్ని కల్పించిన నిర్మాత అర్జున్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. (ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్లో సగం సూపర్‌స్టార్‌కే! ) -
ముక్కోణపు ప్రేమకథ
అభినవ్ మదిశెట్టి, స్నేహా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని అన్నారు. -
చెర్రీ-ఉపాసనల మెగా ప్రిన్సెస్ బారసాల వేడుక (ఫొటోలు)
-
'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?
రిషబ్ శెట్టి ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో పరిచయం అక్కర్లేని పేరు. కాంతార సినిమాతో అంతలా ఫేమ్ సంపాదించాడు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాకు ముందు అసలు రిషబ్ శెట్టి అంటే చాలామందికి తెలియదు. కాంతార మూవీ తర్వాత ఇండియా మొత్తం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. గతేడాది సెప్టెంబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. (ఇది చదవండి: వాల్తేరు వీరయ్య భామకు అరుదైన అవార్డ్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్!) అయితే తాజాగా రిషబ్ ట్విటర్లో తన ఫ్యామిలీకి సంబంధించిన ఓ వీడియోను పంచుకున్నారు. ఇటీవల తన ముద్దుల కూతురు రాధ్యాకు చెవులు కుట్టే వేడుక నిర్వహించారు. ఈ వేడుకను కర్ణాటకలోని రిషబ్ చిన్ననాటి ఇంటిలో నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ఎమోషనలయ్యారు రిషబ్. ఈ వేడుకలో తన భార్య, కుమారుడుతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఈ కార్యక్రమానికి బంధువులు, సన్నిహితులు కూడా హాజరయ్యారు. ట్విటర్లో రిషబ్ రాస్తూ..'నేను పెరిగిన ఇప్పుడు ఇల్లు జ్ఞాపకాలతో నిండిపోయింది. నా కూతురు రాధ్యా చెవి కుట్టే వేడుకతో మా ఇల్లు మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు క్యూట్ బేబీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో కాంతార-2 కోసం వెయిటింగ్ పోస్టులు పెడుతున్నారు. మీరు కూడా రిషబ్ గారాలపట్టి చెవులు కుట్టే వేడుక చూసేయండి. కాగా.. కాంతార-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు గతంలో ఉగాది సందర్భంగా హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నాపై చాలా దారుణంగా ట్రోల్స్.. అయినా బాధపడను: హీరోయిన్) ನಾ ಹುಟ್ಟಿ ಬೆಳೆದ ಮನೆ ನನ್ನ ಬಾಲ್ಯದ ನೆನಪುಗಳ ಖಜಾನೆ. ಅದಕ್ಕೀಗ ರಾಧ್ಯಾಳ ಕಿವಿ ಚುಚ್ಚಿಸಿದ ಸಂಭ್ರಮದ ನೆನಪೊಂದು ಹೊಸದಾಗಿ ಜೊತೆ ಸೇರಿದೆ. The home where I grew up is filled with memories, and now Radhya's ear piercing ceremony added another special moment to it. pic.twitter.com/PnJDtZG4vy — Rishab Shetty (@shetty_rishab) June 25, 2023 -
NBK 109 Launch : గ్రాండ్‌గా బాలయ్య కొత్త సినిమా షురూ (ఫొటోలు)
-
CM Cup : అట్టహాసంగా సీఎం కప్ ఆరంభ వేడుకలు (ఫొటోలు)
-
మోదీకి పాదాభివందనం చేసిన ఆ దేశ ప్రధాని
ఫసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియాలో భారత ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ దేశ ప్రధానమంత్రి జేమ్స్ మరాపే.. మోదీని ఆలింగనం చేసుకుంటూ.. ఆయన పాదాలను తాకుతూ స్వాగతించారు. వాస్తవానికి పాపువా న్యూగినియాలో సాధారణంగా సూర్యాస్తమయం తర్వాత దేశంలోకి వచ్చే ఏ నాయకుడికి ఉత్సవ స్వాగతం ఇవ్వదు. కానీ మోదీ కోసం ఆ సెంటిమెంట్‌ను పక్కనపెట్టారు. అక్కడి కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 10 గంటలకు చేరకున్న ప్రధాని మోదీకి మాత్రం మినహయింపు ఇచ్చింది. అంతేగాదు పసిఫిక్ ద్వీప దేశాన్ని సందర్శించిన మొదటి భారత ప్రధాని అయిన మోదీకి న్యూగినియా ప్రధానిచే విశేష స్వాగతం లభించింది. ప్రధాని మోదీ ఇతర ప్రముఖులను కలిసేందుకు వెళ్లేముందు కూడా మరాపే మోదీని మరోసారి ఆలింగనం చేసుకున్నారు. ఈ మేరకు మోదీ ట్వీట్టర్ వేదికగా..నేను పాపువా న్యూగినియా చేరుకున్నాను. విమానాశ్రయంలో నన్ను స్వాగతించినందుకు ప్రధాని జేమ్స్ మరాప్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు స్వాగతం పలికేందుకు ఆయన చేసిన ప్రత్యేక అభివాదాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. నా పర్యటన సందర్భంగా ఈ దేశంతో భారత్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి నేనెంతగానో ఎదురు చూస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు. న్యూగినియాలో మోదీకి 19 తుపాకులు గౌరవ వందనం, లాంఛనప్రాయం స్వాగతం గార్డ్ ఆఫ్ హానర్ తోసహా ప్రధాని జేమ్స్ మరాపే చేసిన ప్రత్యేక అభివాదాన్ని స్వీకరించినట్లు విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ (ఎఫ్ఐపిఐసి-FIPIC) మూడో శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు ఆదివారం న్యూగినియా చేరుకున్నారు మోదీకి. సోమవారం ఈ శిఖరాగ్ర సమావేశాంలో నరేంద్ర మోదీ, జేమ్స్ మరాపే ఆతిధ్యం ఇవ్వనున్నారు. ఈ సమావేశంలో జేమ్స్ మరాపేతో ద్వైపాక్షిక చర్చలు జరపడం తోపాటు పాపువా న్యూగినియా గవర్నర్ జనరల్ బాబ్ దాడేతో భేటీ కానున్నారు మోదీ. అదీగాక సోమవారం నాటి చర్చల్లో వాతావరణ మార్పులు, అభివృద్ధిపైన ఎక్కువగా దృష్టిసారించనున్నట్లు సమాచారం. సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇలాంటి శిఖరాగ్ర సమావేశానికి భారత్ ఆతిథ్యమిచ్చింది. కాగా, అంతకుమునుపే మోదీ ఈ శిఖరాగ్ర సమావేశానికి హజరయ్యేందుకు 14 పసిఫిక్ ద్వీప దేశాలు(పీఐసీ) ఆహ్వానాన్ని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. 2014లో మోదీ ఫిజి పర్యటన సందర్భంగా ప్రారంభించిన ఎఫ్ఐపీఐసీ సదస్సులో మొత్తం 14 దేశాల నాయకులు పాల్గొంటారు. (చదవండి: జీ 7 సదస్సులో.. మోదీని ఆటోగ్రాఫ్ అడిగిన జో బైడెన్!) -
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)
-
భర్తల భరతం పట్టిన భార్యామణులు!
కారేపల్లి: భార్యామణులు భర్తల భరతంపట్టారు. ఇంకొందరు పచ్చ బరిగెలతో వరసైన వారి వీపులను విమానం మోత మోగించారు. చేసేదేం లేక పురుషపుంగవులు పరుగు లంకించుకున్నారు. హోలీ సందర్భంగా గిరిజన తండాల్లో ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. గత ఏడాది హోలీ నుంచి ఈ ఏడాది హోలీ మధ్యకాలంలో భూక్యా, లాకావత్, తేజావత్, వడిత్యా వంశస్తుల కుటుంబాల్లో ఎవరికైతే తొలి సంతానంగా మగబిడ్డ జన్మిస్తాడో ఆ ఇంట్లో డూండ్ వేడుక వైభవంగా నిర్వహిస్తారు. కారేపల్లి మండలం సామ్యతండాలో భూక్యా నగేష్, సుజాత దంపతులకు తొలి సంతానం మగబిడ్డ దర్శక్ జన్మించడంతో ఈ వేడుక నిర్వహించారు. డూండ్ అంటే గిరిజన భాషలో వెతకడం అని అర్థం కాగా, బాలుడిని ఒక ఇంట్లో దాచిపెట్టి గ్రామస్తులంతా వెతకడమే ఈ వేడుక! ఇదంతా హోలీ రోజు ముగియగా.. గురువారం గ్రామంలో ఓ గుంజ పాతి, తినుబండారాలు ఉన్న రెండు గంగాళాలను తాళ్లతో కట్టారు. గంగాళాలకు మహిళలు పచ్చి బరిగెలతో కాపలాగా ఉండగా, పురుషులు వాటిని ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. మహిళలు, పురుషులు సంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పాత్రలు ఎత్తుకెళ్లేందుకు వచ్చే పురుషులను మహిళలు సరదాగా కొడుతుండటం చూపరులకు ఆహ్లాదాన్ని పంచుతుంది. ఈ వేడుకలో బావ, బావమరిది వంటి వరసైనవారు మహిళల దెబ్బల రుచి చూడాల్సిందే. చివరకు పురుషులు గంగాళాలను ఎత్తుకెళ్లి ఆరగించడంతో వేడుక ముగిసింది. -
సింగర్ లిప్సిక ఇంటి గృహప్రవేశం ఫోటోలు చూశారా?
-
Gopichand Latest Photos: అసిస్టెంట్ గృహా ప్రవేశానికి హాజరైన గోపీచంద్.. ఫోటోలు వైరల్
-
గ్రాండ్‌గా భారత స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ హల్దీ ఫంక్షన్ (ఫొటోలు)
-
తండ్రికి కొత్త ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బాస్ విన్నర్ కౌశల్ (ఫోటోలు)
-
సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలపై మంత్రి కేటీఆర్ సన్నాహక భేటీ
సాక్షి, హైదరాబాద్: సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. నూతన సచివాలయం ప్రారంభోత్సవం, సభ నిర్వహణకు సంబంధించి గురువారం శాసనసభ కమిటీ హాల్లో కేటీఆర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డితో పాటు గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రజా ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. ఈనెల 12 వరకు అసెంబ్లీ వార్షిక బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్న నేపథ్యంలో 13న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. జన సమీకరణకు సంబంధించి 13న జరిగే సమావేశాల్లో ప్రణాళిక రూపొందించుకోవా లని సూచించారు. బహిరంగ సభను విజయవంతం చేసేందుకు అవసరమైన జన సమీకరణను పర్యవేక్షించేందుకు ఇతర జిల్లాలకు చెందిన సీనియ ర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను గ్రేటర్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలకు ఇన్చార్జిలుగా నియమించాలని నిర్ణయించారు. ఇన్చార్జిలుగా నియమితులయ్యే నేతలు ఈ నెల 13 నుంచి 17 వరకు తమకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లోనే ఉండి పర్యవేక్షిస్తారు. బహిరంగసభకు ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 10 వేల మందితో జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. కొత్త సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టిన నేపథ్యంలో అన్ని నియోజక వర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నేతలకు కేటీఆర్ సూచించారు. -
లయ తప్పిన రిట్రీట్ ధ్వని
గణతంత్ర దినోత్సవ ముగింపులో చేసే ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావనను మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చీకాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. అయితే ఎప్పటికీ ఈ ప్రాధాన్యం ఉంటుందా? మీరు ఎంత ముసలివాళ్లయితే, అంత ఎక్కు వగా గతాన్ని పట్టుకుని వేళ్లాడతారని చెబు తుంటారు. అది తప్పకుండా నిజమేనని నేను తలుస్తున్నాను. గత వారం గణతంత్ర దినోత్సవ ముగింపు వేళ జరిపే ‘బీటింగ్ రిట్రీట్’పై నా చికాకుతో కూడిన స్పందనకు ఇది ఒక విశ్వస నీయ వివరణలా కనిపిస్తుంది. నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ నేను ఈ విషయాన్ని తర్వాత పేర్కొంటాను. ఓ వారం క్రితం నేను చూసిన ఆ కార్యక్రమం నేపథ్యం గురించి మొదట నన్ను వివరించనీయండి. నేను దానిపై ఇలా అనుభూతి చెందుతున్నాను. బీటింగ్ రిట్రీట్ ఒక మిలిటరీ వేడుక. బహుశా రెండవ జేమ్స్ ఇంగ్లండ్ రాజుగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇది ప్రారంభమైంది. ఒక రాత్రిపూట సైనిక దళాలు తిరోగమిస్తున్నప్పుడు యుద్ధ ముగింపు నకు సంకేతంగా బీటింగ్ రిట్రీట్‌ని మొదలెట్టారు. 1950లలో భారత దేశం కూడా రిపబ్లిక్ డే ఉత్సవాలకు సంబంధించి మూడురోజుల ముగింపు సందర్భంగా ఈ భావనను బ్రిటిష్ సంప్రదాయం నుంచి అరువు తెచ్చుకుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఇంగ్లిష్ కవాతుల నుంచి భారతీయులే స్వయంగా స్వరపర్చడం వరకు ‘బీటింగ్ రిట్రీట్ మార్చ్’లో సంగీతం మారి ఉండవచ్చు, కానీ బీటింగ్ రిట్రీట్ భావ నను మాత్రం మనం పరిరక్షించుకుంటూ వచ్చాము. నిజానికి దాన్ని మనం ఆదరిస్తూ వచ్చాము. దాన్ని ఎన్నడూ విదేశీయమైనదిగా మనం భావించలేదు. అది భారతీయ సైన్యంలాగే భారతీయతతో కూడి ఉండేది. పైగా గుర్తుంచుకోండి. మనకు ఈరోజు ఉన్న సైన్యం కూడా బ్రిటిష్ వారు రూపొందించిందే. బీటింగ్ రిట్రీట్‌కి ఉన్న బ్రిటిష్ మూలం కారణంగా అది మనకు చికాకు కలిగించలేదు. నిజానికది వారసత్వంగా వచ్చిన విలువలకు, సంప్రదాయాలకు ప్రతీకగా గౌరవం పొందుతోంది కూడా. గణతంత్ర దినోత్సవ సందర్భంగా బీటింగ్ రిట్రీట్కే నేను ఎల్ల ప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంటాను. నిస్సందేహంగా, సైనికుల కవాతు కచ్చితత్వం చూసి ఆశ్చర్యపడుతుంటాను. భూమ్యాకర్షణ శక్తిని సైతం డేర్ డెవిల్స్ ధిక్కరించడాన్ని చూస్తూ ఆశ్చర్య చకితుడినవుతుంటాను. నేను దాన్ని తోసిపుచ్చలేను. కానీ రిట్రీట్ సంగీతం; నార్త్, సౌత్ బ్లాక్ వెనుక నిలిపి ఉంచిన బ్యాండ్ల వర్ణరంజితమైన యూనిఫాంలు, రక్షణ గోడ వద్ద ఉన్న ఒంటెలు, చివరగా దిగంతాల వద్ద సూర్యుడు అస్తమించే సమయం ఎల్లప్పుడూ నన్ను వెంటాడుతుంటుంది. నా జ్ఞాపకాల్లో ఎన్నటికీ నిలిచి ఉండిపోయింది ఏమిటంటే రైసినా హిల్స్‌ని అధిరోహిస్తూ, ‘సారే జహాసే అచ్ఛా... హిందూ సితా హమార హమారా’ అని ఆలపిస్తూ ఉండే రిట్రీటింగ్ బ్యాండ్లు. వారు శిఖరాన్ని సమీపిస్తున్నప్పుడు సూర్యుడు అస్తమించడం ప్రారంభమవుతుంది. వెంటనే లెక్కలేనన్ని పసుపు పచ్చ దీపాలు మొత్తం విస్టాను ప్రకాశవంతం చేసేవి. ఇది ప్రతి ఒక్కరినీ ఆనందంలో ముంచెత్తేది. నేటి పద జాలాన్ని ఉపయోగించి చెప్పాలంటే... అదొక విస్మయం కలిగించే క్షణం. అయ్యో... అది చాలావరకు ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది. ఇక అది జరగని పని. ప్రారంభ ప్రయత్నంగా మార్పు చేసిన సంగీతం భయానకమైనది కాకున్నా, కఠోరంగా ఉంటోంది. భార తీయ లేదా బ్రిటిష్ మూలానికి చెందినవైనా సరే పాదతాడనంతో చేసే సైనిక కవాతుల సంగీతం ఇకపై వినిపించదు. దీని స్థానంలో రాగాలు వచ్చి చేరాయి. సైనిక వేడుకల్లో వాటికి తావులేదు. వీటిని ఇంట్లో లేదా కాన్సర్ట్ హాల్లో అయితే బాగా ఆస్వాదించవచ్చు. విజయ్ చౌక్‌లో సైనిక బ్యాండ్లు ఆలపించేవి కాదు. మరీ ఘోరమైన విషయం ఏమిటంటే, ఈ సంవత్సరం ఆలపించిన బీటింగ్ రిట్రీట్ రాగం (ఇది సరైన పదమే అయితే) ఏమాత్రం లయబద్ధంగా లేదు. మాధుర్యంతోనూ లేదు. దీంట్లో సంగీతం కంటే రొద మాత్రమే ఎక్కువగా ఉండింది. అది నరకద్వారంలో ఎవరైనా ఊహించే రొదలా ఉండింది కానీ స్వర్గ లోకపు ద్వారాల వద్ద వినిపించే సంగీతంలా లేదు. ఈ ఒక్క మార్పు దాని అర్థాన్ని మాత్రమే కాదు, బీటింగ్ రిట్రీట్ తక్షణ సారాన్నే ధ్వంసం చేసిపడేసింది. అయినా సరే ఎవరైనా దీన్ని పరిగణిస్తారా? దీనిలోని ఇతర అంశాలు కూడా అదృశ్యమైపోయాయి. ఎత్తయిన ప్రాంతంలో ఉన్న గంటల నుంచి వినిపించే దాని శ్రావ్యమైన మాధుర్యం కూడా పరిత్యజించబడింది. భవనాలను వెలిగించే లక్ష లాది పసుపుపచ్చ బల్బుల స్థానంలో బహుళరంగులు గోడలపై ప్రదర్శితమవుతున్నాయి. అంతకు ముందున్నవి ధ్వనింపజేసే ఆశ్చర్యం, ఆనందం స్థానంలో ఇప్పుడు ఒక యాంటీ క్లైమేట్‌ని తలపించే నీరస మైన అసంతృప్తి చోటు చేసుకుంది. బీటింగ్ రిట్రీట్‌లోని ఆనాటి మ్యాజిక్ కనుమరుగైనట్లు కనిపిస్తోంది. ఒక సాధారణమైన, ఉత్తేజపూరితం కానిది మాత్రమే మనకు ఇప్పుడు మిగిలింది. ఒకప్పుడు బీటింగ్ రిట్రీట్‌కి చెందిన అద్భుతం కానీ, మనోహర దృశ్యం కానీ ఇప్పుడు లేవు. మనకు జ్ఞాపకాలు మాత్రమే మిగిలాయి. కాలంతోపాటు అవి కనుమరుగైపోతాయి. గత వారం రిట్రీట్ సందర్భంగా వర్షం కురిసినప్పుడు, దేవుళ్లు సైతం విలపిస్తున్నట్లుగా నేను అనుభూతి చెందాను. అది తగిన స్పందనలాగే కనిపించింది. ప్రపంచం మారుతోందనీ, ఆ మార్పు వెనకాలే నేను మిగిలిపోయాననీ గుర్తించాను. అందుకే నేను విషాదంతో ఉన్నాను. అందుకే నేను ఇంత ప్రతికూల దృక్పథంతో ఉంటుండవచ్చు. చివ రగా, నేను ముందుకేసి చూస్తున్నప్పుడు, నా మనస్సును రెండు ప్రశ్నలు చుట్టుముట్టాయి. ఇక్కడ చుట్టుముట్టడం అనేది సరైన పదం. ఎందుకంటే వాటికి నేను సమాధానం చెప్పలేను మరి. సారే జహా సే అచ్ఛా పాట పాడి ఎంతకాలమైంది! కచ్చితంగా దాని మూలాలే ఆ పాటను అనుమానించేలా చేశాయా? అలాగయితే బీటింగ్ రిట్రీట్ ఎప్పుడు ముగిసిపోతుంది? ఏమైనా దాని వలసవాద చరిత్రను మీరు తోసిపుచ్చలేరు కదా. పైగా అది ఆత్మనిర్భర్ కాదు కూడా మరి. కరణ్ థాపర్ ,వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఘనంగా గల్లా అశోక్ కొత్త సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)
-
ఆఫ్రిది కుమార్తెను పెళ్లి చేసుకున్న షాహీన్.. ఫోటోలు వైరల్
-
ఘనంగా యాంకర్ శ్రీముఖి కొత్త ఇంటి గృహ ప్రవేశం.. ఫోటోలు వైరల్
-
తెలుగు నేలపై చెరగని ముద్ర వేసిన వైఎస్సాఆర్
-
వైభవంగా వైఎస్ఆర్ అవార్డుల ప్రదానం
-
తెలుగు వర్సిటీలో సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం 26న
సాక్షి, హైదరాబాద్: శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఈ నెల 26వ తేదీన సాంస్కృతిక పురస్కార ప్రదానోత్సవం జరుగుతుందని వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సాహితీ, సంస్కృతుల వ్యాప్తికి దేశవిదేశాల్లో సేవలందించిన వారికి ఏటా ఈ పురస్కారం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది చెన్నైకి చెందిన ప్రొఫెసర్ చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి ఈ పురస్కారాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌తో అందిస్తున్నట్టు తెలిపారు. యూనివర్సిటీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పురస్కార ప్రదానోత్సవం గవర్నర్‌తో జరుగుతుందని పేర్కొన్నప్పటికీ.. ఆమె పేరును ప్రస్తావించడకపోవడం మీడియా వర్గాల్లో చర్చనీయాంశమైంది. -
క్రేజీ న్యూస్: 'పుష్ప 2'కు ముహుర్తం ఫిక్స్.. ఆ రోజే షూటింగ్ ప్రారంభం!
Allu Arjun Pushpa 2 Movie Pooja Ceremony Will Start On August 22: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప మూవీ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పాన్ వరల్డ్ స్థాయిలో పుష్పరాజ్ వైరల్ అయ్యాడు. డైలాగ్స్, సాంగ్స్, స్టెప్పులు.. ఇలా ప్రతీదీ ట్రెండ్ అయ్యాయి. ముఖ్యంగా ‘తగ్గేదేలే’ అనే డైలాగ్ ఓ స్వాగ్ క్రియేట్ చేసింది. ఈ ఒక్క డైలాగ్‌కు ప్రపంచంలోని సినీ ప్రియులంతా ఫిదా అయ్యారు. వాటిని రీల్స్ రూపంలో చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేశారు. ఇంకా సమంత గ్లామర్, తనతోపాటు అల్లు అర్జున్ డ్యాన్స్, ఫహాద్ ఫాజిల్ యాక్టింగ్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇక ఇప్పుడు ప్రేక్షకులంతా ఎదురు చూసేది 'పుష్ప 2' కోసమే. ఆ సినిమాను అప్పుడు స్టార్ట్ చేస్తాం.. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా అందులో విలన్‌గా ఆ స్టార్ హీరోలు, ఈ బాలీవుడ్ నటులు నటిస్తున్నారని అని ప్రచారం జరిగింది. మరోవైపు అసలు స్క్రిప్టే పూర్తి కాలేదు అని వార్తలు వినిపించాయి. అయితే ఎట్టకేలకు ఆ వార్తలన్నింటికి తెర దించుతూ 'పుష్ప: ది రూల్'ను స్టార్ట్ చేయనున్నాడు సుకుమార్. చదవండి: పాపం హిందీ హీరోలు!.. ఎరక్కపోయి ఇరుక్కున్న హృతిక్ రోషన్ సోమవారం అంటే ఆగస్టు 22న 'పుష్ప 2: ది రూల్' పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టనుంది చిత్రబృందం. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అలాగే ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆగస్టు 22నే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడం విశేషం. కాగా ఈ సినిమాను రూ. 400 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు ఆ మధ్య టాక్ వినిపించింది. చదవండి: తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం After September 15th... — Sarath Chandra Naidu (@imsarathchandra) August 21, 2022 -
తండ్రి, కొడుకుల మధ్య ఎమెషనల్ స్టోరీ.. సినిమాకు శ్రీకారం
Karthik Rathnam Hrithika Srinivas Movie: బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ బ్యానర్ పై కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కార్తిక్ రత్నం, హ్రితిక శ్రీనివాస్, పృథ్వీ (పెళ్లి సినిమా ఫేమ్), కాలకేయ ప్రభాకర్, మహేంద్రనాద్, సిఎంఆర్. శర్మ, కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. బెక్కం రవీందర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం (జులై 10) ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ మేకర్ సత్యానంద్.. చిత్ర హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాత బెక్కం రవీందర్ మాట్లాడుతూ.. 'స్టార్ మేకర్ సత్యానంద్ ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కొత్తవారైనా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్, సన్ ల మధ్య జరిగే ఏమోషనల్, క్రైమ్ కామెడీ స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి పది రోజులు వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్స్ లలో షూటింగ్ నిర్వహిస్తాం. ఆ తరువాత జరిగే రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేస్తాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మా సినిమాకు చాలా చక్కగా కుదిరారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు. -
అగ్నిమథనం.. ప్రతిష్ఠ
సాక్షి, యాదాద్రి: యాదాద్రిలో శ్రీ నృసింహస్వామివారి సప్తాహ్నిక పంచకుండాత్మక మహాకుంభాభిషేక ఉత్సవాలు రెండోరోజు అత్యంత వైభవంగా జరిగాయి. విశ్వశాంతి, లోకకల్యాణార్థం శ్రీ పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానాచార్యులు, యజ్ఞాచార్యులు, ఉప ప్రధానార్చకులు, అర్చకబృందం, పారాయణీకులు కనులపండువగా నిర్వహించారు. బాలాలయంలో ఉదయం 9 గంటలకు శాంతిపాఠం, యాగశాలలో చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, అగ్నిమ«థనం, అగ్నిప్రతిష్ఠ, యజ్ఞం ప్రారంభించారు. విశేష వాహనములు, మూర్తిమంత్ర హవనములు, నిత్యలఘు పూర్ణాహుతి నిర్వహించారు. 30 నిమిషాలపాటు అగ్నిమథనం ఉత్సవాల్లో భాగంగా మహా మండపంలో యాగశాల ముందు భాగంలో అగ్నిమథనం కార్యక్రమాన్ని జరిపించారు. 10 మంది అర్చక స్వాములు, యాజ్ఞీకులు సహజంగా అగ్ని వచ్చేటట్లు అగ్నిమథనం చేశారు. జమ్మి, రాగి చెట్టు కర్రల ద్వారా అగ్నిని పుట్టించారు. ఈ అగ్నిని పుట్టించేందుకు సుమారు 30 నిమిషాలపాటు సంప్రదాయ పద్ధతిలో వేదమంత్రాలతో ఆచార్యులు, పారాయణీకులు పూజలు చేశారు. వృత్త కుండంలో అగ్ని ప్రతిçష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం ఆ వృత్త కుండం నుంచి మిగతా అన్ని కుండాలకు అగ్నిని విస్తరించారు. విశేష యజ్ఞ హవనములు పంచకుండాత్మక మహా యాగంలో అధిష్టాన దైవమైన శ్రీమన్నారాయణుడిని ప్రస్తుతించే మంత్రాలు, మూల మంత్రాలతో దశాంశ, శతాంశ, సహస్రంశాది తర్పణాలు, శ్రీ లక్ష్మీనారసింహుని స్తోత్రాలతో బీజాక్షర మంత్రాలతో విశేష హోమం నిర్వహించారు. బాలాలయంలో రాత్రి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. నూతనంగా నిర్మించిన శ్రీ స్వామి వారి ప్రధానాలయంలో బింబ పరీక్ష, మన్నోమాన శాంతి హోమం చేశారు. బింబ పరీక్ష ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం నిర్మించిన నూతన శిలస్వరూపులైన దేవతలు శిల్పి ఉలి తాకిడికి ఏర్పడిన అపరాధాన్ని తొలగించడానికి మంత్రోచ్ఛరణతో సంప్రోక్షణ చేయడం, శాంతి హోమం ద్వారా ఆగమశాస్త్రం ప్రకారం ప్రధాన ఆలయంలోని ఆయా మూర్తుల తేజస్సును పెంపొందించే కార్యక్రమం నిర్వహించారు. నవకలశ స్నపనం ద్వారా సర్వాభీష్ట సిద్ధి, సర్వసంపదలు కలగాలని నిర్వహించారు. -
రెస్టారెంట్లో మోడల్స్ సందడి
సాక్షి,హైదరాబాద్: భోజన ప్రియులుకు రుచికరమైన పుడ్‌ని అందించేందుకు సివిల్ గ్రూప్ అతిధి దేవోభవ రెస్టారెంట్‌ని కొత్తపేట నుంచి నాగోల్ మార్గమధ్యంలో అందుబాటులోకి తీసుకువచ్చారు. అతిథి దేవో భవ రెస్టారెంట్‌ను డిప్యూటి స్పీకర్ పద్మారావు గౌడ్, కార్పొరేటర్స్ వెంకట నర్సింహ, పవన్ కుమార్, ప్రేమ్ మహేష్, సామల హేమ, కండి శైలజ, సినీనటులు సర్లీన్ కౌర్, ఫారీదా యూసఫ్ మోడల్స్ కలసి కొత్తపేటలో ప్రారంభించారు. ఈ సందర్భంలో సినీనటిలు మాట్లాడుతూ విభిన్న ఆహార రుచులను అందించేందుకు హైదరాబాద్ కేరాఫ్ గా నిలుస్తుందని అన్నారు. తనకు మటన్, చికెన్ చాలా ఇష్టం అన్ని చెప్పారు. రెస్టారెంట్ నిర్వాహకులు మహిచంద్ మాట్లాడుతూ త్వరలో బ్యాంకుట్ హాల్, రూమ్స్ కూడా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రెస్టారెంట్ డిజైన్ ధీమ్ ప్రత్యేకమని డైనింగ్ సెటఫ్లో కూర్చునే ఆహార ప్రియులకు ఫుడ్ సర్వ్ చేయనున్నట్లు తెలిపారు. -
చైనాతో ఢీ అంటే ఢీ అంటున్న తైవాన్.. అసలేం జరుగుతోంది!
చైనా ఆధిపత్యాన్ని తైవాన్ సవాల్ చేయాలనుకుంటోంది. ఇరు దేశాల మధ్య యుద్ధం కనుక వస్తే తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే సబ్ మెరైన్ ప్రాజెక్టును చేపట్టింది. 2023 నాటికి ఈ సబ్మైరైన్ను సముద్ర జలాల్లో పరీక్షించాలన్న లక్ష్యంతో ముందడుగు వేస్తోంది. చైనా వైఖరితో సహనం నశించిన తైవాన్ 2015లోనే అమెరికా, జపాన్ దేశాల్లో కీలకమైన సబ్‌మెరైన్ టెక్నాలజీ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గతేడాది సబ్మెరైన్ల తయారీని లాంఛనంగా ప్రారంభించింది. కాగా సబ్‌మెరైన్‌లో కీలక భాగాల తయారీ, పరీక్షలు విజయవంతమైనందునే కీల్ లేయింగ్ ఉత్సవాన్ని గత నెల నిర్వహించినట్లు తెలుస్తోంది. మొత్తం ఎనిమిది సబ్మెరైన్లు అందుబాటులోకి రానున్నాయని సమాచారం. మరోపక్క చైనా మాత్రం అడ్డగోలుగా నావికదళ బలాన్ని పెంచుకుంటోంది. దీంతో పట్టుదలగా ప్రయత్నించి తైవాన్ సొంతంగా సబ్మెరైన్ల తయారీని మొదలుపెట్టింది. ఈ ప్రాజెక్టుకు బ్రిటన్, అమెరికా, కెనడాల్లోని సంస్థలు సాయం చేస్తున్నట్లు ఇంగ్లీష్ మీడియా కథనం. కాగా తైవాన్ వద్ద పురాతన సబ్ మెరైన్లు ఉన్నాయి. కానీ చైనాతో యుద్దం జరిగితే కనుక అవి నిలువలేవు. దీంతో వాటిని తమ నేవీ శిక్షణ కోసం వినియోగిస్తోంది. ఇందుకు అమెరికా సైన్యం సహకరిస్తూ తమ కమాండోలతో శిక్షణ ఇస్తోంది. దీనికి తోడు సబ్మెరైన్ల తయారీకి అమెరికా, మిత్రదేశాలు సాయం చేస్తుండటం డ్రాగన్‌ను ఉకిరి బిక్కిరి చేస్తోంది. చదవండి: Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర అవమానం.. పరువు పాయే -
మంత్రి ట్రై చేశాడు కుదరలే.. పళ్లతో కట్ చేసేశాడు
కరాచీ: సాధారణంగా షాపులు ప్రారంభోత్సవం అంటే సెలబ్రిటీలు, సినీ తారలు, రాజకీయ నేతలను పిలుస్తుంటారు. ఇక వాళ్లు కార్యక్రమానికి వచ్చినప్పటి నుంచి నిర్వాహకులు ఏ లోటు లేకుండా చూసుకుంటారు. ఇదంతా ప్రతీ ఈవెంట్లో జరిగే తతంగమే. అయితే ఓ ఈవెంట్ నిర్వాహకులు చేసిన చిన్న పొరపాటు కారణంగా మంత్రి షాపు ఓపనింగ్ను కత్తితో గాక తన పళ్లతో కొరిక కట్ చేయాల్సి వచ్చింది. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. సెప్టెంబర్ 2 న, జైళ్ల శాఖ మంత్రి, పంజాబ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ఫయాజ్-ఉల్-హసన్ చోహన్ను రావల్పిండి నియోజకవర్గంలోని ఓ ఎలక్ట్రానిక్స్ షాపు ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. షాపు ఓపనింగ్ అంటే రిబ్బన్ కటింగ్ కామన్ అనే విషయం తెలిసిందే. కార్యక్రమానికి వచ్చిన ఆయనకు రిబ్బన్ కట్ చేసేందుకు ఇచ్చిన కత్తెర సరిగా కట్ కాలేదు. అది తుప్పు పట్టిపోవడంతో మరో సారి కట్ చేయాలని ప్రయత్నించినా ఆ రిబ్బన్ అసలు కట్ చేయలేకపోయాడు. దీంతో చేసేందేం లేక ఆ మంత్రి తన పళ్లతో ఆ రిబ్బన్‌ను కట్ చేశాడు.ప్రస్తుతం ఆ వీడియోను ఫయాజ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్‌గా మారి హల్చల్ చేస్తోంది. Ribbon cutting ceremony by Fayyaz ul Hsssan Chohan pic.twitter.com/lsaELc4WME — Murtaza Ali Shah (@MurtazaViews) September 2, 2021 చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్.. అయినా స్మోక్ చేయకూడదు! -
28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం
సాక్షి, అమరావతి: ఈ నెల 28న గిడుగు రామమూర్తి భాషా పురస్కార ప్రదానోత్సవం జరుగనుంది. 13 మందికి భాషా సేవా పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. శలాక రఘునాథ శర్మ, మొవ్వ వృషాద్రిపతి, డా.కోడూరి ప్రభాకర్‌రెడ్డి, వాడ్రేవు సుందరరావు, వెలమల సిమ్మన, డా.కంపల్లె రవిచంద్రన్, డా.ఉపద్రష్ట వేంకట రమణమూర్తి, ఎస్ సుధారాణి, జిఎస్ చలం, కెంగార మోహన్, షహనాజ్ బేగం, మల్లిపురం జగదీష్, పచ్చా పెంచలయ్య ఈ పురస్కారాలు అందుకోనున్నారు. -
రాజమహేంద్రవరంలో ‘టక్ జగదీష్’
రాజమహేంద్రవరం రూరల్: నగరంలో ‘టక్ జగదీష్’ సందడి చేశాడు. షైన్ స్క్రీన్స్ సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాతలుగా, శివ నిర్వాణ దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని, రీతూవర్మ హీరో హీరోయిన్లుగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా పరిచయ వేడుక వీఎల్ పురం మార్గాని ఎసేట్స్లో శనివారం రాత్రి ఘ నంగా జరిగింది. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ఈ సినిమా బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అన్నారు. సినిమాలోని ఒక్కో పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేశారు. సినిమా రిలీజ్ ఈవెంట్, సక్సెస్ మీట్లకు వెళ్లేటప్పుడు ఇంటి వద్ద అమ్మ ఆశీర్వాదం తీసుకోవడం అంటూ.. నాని వేదిక దిగి వచ్చి ఒక తల్లి కాళ్లకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నాడు. తల్లిదండ్రులు గర్వపడేలా తన అభిమానులు ఉండాలని ఫ్యాన్స్‌కు నాని సూచించాడు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం ఎంపీ, వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్‌రామ్ మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమకు నగరాన్ని హబ్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానన్నారు. టక్ జగదీష్ టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతూ, ఈ సినిమా సూపర్‌హిట్ అయ్యి, నాని సినీ జీవితంలో మైలురాయిగా నిలవాలని ఆకాంక్షించారు. దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, టక్ జగదీష్ చిత్రంలో జగపతిబాబు, నాని అన్నదమ్ములుగా నటించి అందరినీ అలరించనున్నారన్నారు. తొలుత ఎంపీ భరత్‌రామ్ చేతుల మీదుగా సినిమాలోని పాట ‘నీటి నీటి చుక్క’ లిరిక్‌ను విడుదల చేయించారు. నటుడు నరేష్, నిర్మాతలు సాహు గారపాటి, రాహుల్ పెద్ది, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకటరత్నం, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్, అనుశ్రీ ఫిలింస్ అధినేత ఆల్తి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టీ టైమ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ, భరత్‌రామ్ చేపట్టిన హరిత – యువత కార్యక్రమంలో భాగంగా మార్గాని ఎస్టేట్స్‌లో హీరో నాని మొక్క నాటారు. ఈ సందర్భంగా ఆయనను ఎంపీ భరత్‌రామ్ ఘనంగా సత్కరించారు. చదవండి: ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ మూవీ రివ్యూ చెర్రీ బర్త్‌డే: మరో సినిమా అప్డేట్ కూడా వచ్చేసింది -
ప్రియాంక మెరిసిపోతూ.. నిక్ మురిసిపోతూ
గ్లోబల్ కపుల్ ప్రియాంక చోప్రా-నిక్ జోనస్‌లు కొత్త ఇంట్లోకి మారారు. ఈ సందర్భంగా గృహప్రవేశం వేడుకను నిర్వహించారు. దీనికోసం ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా ప్రత్యేకంగా రూపొందించిన దుస్తుల్లో ప్రియాంక అందంగా ముస్తాబైంది. వైట్ ట్యునిక్పై ఆరెంజ్ కలర్ దుపట్టా జతచేసిన డిజైనర్ దుస్తుల్లో ప్రియాంక కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ముసాబా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక 2018లో డిసెంబర్ 2వ తేదీన నిక్ జోనస్‌ను ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియాంక కోసం ఆమె భర్త నిక్ ప్రత్యేకంగా లాస్ ఏంజెల్స్‌లో గతేడాది ఓ అందమైన విల్లాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 20 వేల చదరపు అడుగులు గల ఈ ఇంటి విలువ ఏకంగా దాదాపు రూ.144 కోట్లు(20 మిలియన్లు).లాక్డౌన్ సమయంలోనే ఈ దంపతులు కొత్త ఇంట్లోకి మారినట్లు ప్రియంక తన ఆటోబయోగ్రఫి ‘అన్ఫినిష్డ్’లో వివరించింది. 📸|| Some pics of Nick and Priyanka from her new book! pic.twitter.com/QzukPkW1MC — Daily Nick Jonas (@DailyNickJonas) February 8, 2021 భారతీయ సాంప్రదాయల ప్రకారం..గృహప్రవేశం వేడుకను నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక ప్రియాంక రాసిన ఈ పుస్తకాన్ని ఆమె తండ్రి అశోక్ చోప్రాకు అంకితం ఇస్తున్నట్లు పేర్కొంది. ఆత్మకథలో ప్రియాంక ప్రస్తావించిన కొన్ని సంఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంకా సైతం ఇలాంటి చేదు సంఘటనలను చుశారా! అని ఆమె ఆత్మకథ చదివిన వారంత విస్తుపోతున్నారు. View this post on Instagram A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) ఇక నిర్మోహమాటంగా తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడంతో ప్రియాంకపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రమోషన్లతో ప్రియాంక బిజీబిజీగా గడుపుతోంది. సినిమాల విషయానికి వస్తే.. ప్రియాంక నటించిన బాలీవుడ్ చిత్రం ‘ది వైట్ టైగర్’ జనవరి 13న విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. తను ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రం ‘టెక్ట్స్ ఫర్ యూ’ సినిమా షూటింగ్ ఇటీవల లండన్ పూర్తి చేసుకున్నారు. జిమ్ స్ట్రౌస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక భర్త నిక్ జోనస్ అతిథి పాత్రలో కనిపించనున్నారని సినీవర్గాల నుంచి సమాచారం.ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘సలార్’లో స్పెషల్ సాంగ్ కోసం చిత్రబృందం ప్రియాంకను సంప్రదించింది. చదవండి: (ప్రియాంక ఆత్మకథ: విస్తుపోయే విషయాలు వెల్లడి) (చర్మం రంగు ముఖ్యం కాదని తెలుసుకున్నా) View this post on Instagram A post shared by House of Masaba (@houseofmasaba) -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరితేజ సీమంతం వేడుక
-
విధ్వంసకర నిరసనలు మంచి పద్ధతి కాదు
సాక్షి, హైదరాబాద్: విధ్వంసకర, వినాశకర పద్ధతుల్లో నిరసనలు తెలపడం ప్రజాస్వామ్య దేవాలయమైన భారత్‌కు మంచిది కాదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న వేళ దేశం ఆయన చూపిన అహింసా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. ప్రజా ఉద్యమాల్లో హింసకు తావివ్వ రాదని, అర్థవంతమైన చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారాలు వెతకాలని సూచించారు. ఆదివారం శిల్పకళావేదికలో నిర్వహించిన మాజీ గవర్నర్, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి శత జయంతి వేడుకలకు ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెన్నారెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన వెంకయ్య, వివిధ అంశాలపై భిన్న అభిప్రా యాలు తప్పుకాదని, ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతిపక్షాలు చేసే విమర్శలకు సరైన సమాధానమివ్వడం ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ గవర్నర్ రోశయ్య, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
-
రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం
-
తల్లి్ల మరియా... కాచికాపాడుమమ్మా!
శ్రీకాకుళం మేత్రాసన పాలక పునీతురాలు, క్రైస్తవుల సహాయమాత మేరిమాత మహోత్సవం నేడు శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం సమీపంలోని యు.వెంకమ్మపేట వద్ద మరియగిరిపై జరుగుతోంది. ఈ కొండపై వెలసిన మరియమ్మకు శ్రీకాకుళం మేత్రాసనం పీఠాధిపతి అడ్డగట్ల ఇన్నయ్య ఆధ్వర్యంలో ఏటా జనవరి 30న ప్రత్యేక దివ్యపూజలు నిర్వహిస్తారు. ‘విశ్వ స్వరూపుడైన దేవదేవుని పుత్రుని నీ వరాల గర్భంబున ధరియించిన మేరిమాతా వందనం అభివందనం..’ అంటూ, ‘దేవునిచే ఎన్నుకొనబడిన ఓ సుధాభాషిణి నీకే వందనం.. దైవప్రజలారా.. దైవ జనమా..’ అంటూ బిషప్ ఇన్నయ్య స్తోత్రం పలికి పూజలు చేయడం ఇక్కడ ఆనవాయితీ. ఈ యాత్రకు ఒక రోజు ముందే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం జిల్లాలతో పాటు ఒడిశ్సా రాష్ట్రం నుండి తండోపతండాలుగా క్రైస్తవులు, హిందువులు తరలివచ్చి దివ్యపూజలో పాల్గొంటారు. అనంతరం మరియగిరి కొండను అధిరోహించి మేరిమాతను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కులమతాలకు అతీతం మరియగిరి యాత్ర రోజున ఈ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. మఠకన్యలు, పీఠాధిపతులు, క్రైస్తవ గురువుల ప్రత్యేక ప్రార్థనలతో మేరిమాత స్తోత్రం మారు మ్రోగుతుంది. ఈ సందర్భంగా మేరిమాతను దర్శించుకొనేందుకు కులమతాలకు అతీతంగా భక్తులు కొవ్వొత్తులు వెలిగించి, కొబ్బరికాయలు కొట్టి, హిందూ సంప్రదాయంలో ఉన్నట్లు తలనీలాలు అర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ‘ఓ తల్లీ మరియా.. మమ్మల్ని కాచికాపాడుమమ్మా’ అంటూ ప్రార్థనలు చేస్తారు. దివ్య పూజలో క్రైస్తవ గీతాలను ఆలపిస్తూ మరియమ్మను స్తుతిస్తారు. కుటుంబ సమేతంగా మేరీమాతను దర్శించుకున్న తర్వాత భక్తులు వనభోజనాలు చేస్తారు. ఏటా 25 వేల నుండి 30 వేల మంది భక్తులు హాజరై మేరీమాతను దర్శించుకుంటారు. ఈ ఏడాది కూడా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నేటి మరియగిరి యాత్రకు ఉత్తరాంధ్ర జిల్లాల నుండి తరలివచ్చే భక్తుల కోసం పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, సాలూరు, టెక్కలి, విజయనగరం తదితర ఆర్టీసీ డిపోల నుండి స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. ఈ ఏడాది సుమారు 35 వేలమంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న అంచనాతో మరియగిరి వద్ద ప్రత్యేక ఆర్టీసీ కంట్రోల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. -
ఆగస్టు 29 కాదు... సెప్టెంబర్ 25
న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్లో జరిగే క్రీడా అవార్డుల ప్రదా నోత్సవ కార్యక్రమం ఈసారి సెప్టెంబర్ 25న జరుగనుంది. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఆసియా క్రీడలు జరుగనుండటంతో క్రీడా మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఈ క్రీడల్లో సత్తాచాటిన వారి పేర్లను కూడా అవార్డులకు పరిశీలిస్తామని పేర్కొంది. నిజానికి ఏప్రిల్ 30వ తేదీలోపు వచ్చిన ఎంట్రీల ఆధారంగానే అవార్డులు ప్రకటిస్తారు. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. తేదీల మార్పు అంశాన్ని రాష్ట్రపతి భవన్ దృష్టికి తీసుకెళ్లగా అక్కడి నుంచి కూడా సానుకూల స్పందన వచ్చినట్లు క్రీడా కార్యదర్శి రాహుల్ తెలిపారు. దీంతో పాటు ఆసియా క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారి పేర్లను కూడా అవార్డుల కోసం పరిశీలించాలని కమిటీకి సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. -
రాష్ట్రం చాలా మారింది : మాలకొండయ్య
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎం.మాలకొండయ్య పదవీ విరమణ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులు ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. శనివారం మంగళగిరి బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 8వబెటాలియన్ పోలీసుల నుంచి మాలకొండయ్య గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందన్నారు. శాంతి భద్రతల విషయంలో అందరూ బాగా పనిచేశారని కితాబిచ్చారు. ఏపీకి నూతనంగా 6వేల మంది పోలీసు సిబ్బంది వచ్చారని, తద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతలు చక్కగా నెరవేర్చామని చెప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యాక్షన్, క్రైం ఎక్కువగా ఉండేదని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చాలా మార్పులు వచ్చాయని, క్రైం రేటు కూడా తగ్గిందని పేర్కొన్నారు. అనంతరం విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ.. డీజీపీగా మాలకొండయ్య మంచి సేవలు అందించారని చెప్పారు. ఆయన నాయకత్వంలో అందరూ బాగా పనిచేశారని అన్నారు. నూతన రాష్ట్రంలో శాంతి భద్రతలను మాలకొండయ్య ఆధ్వర్యంలో చక్కగా నిర్వర్తించారని కితాబిచ్చారు. ఆయన పదవీ విరమణ చేసినా వారి మనస్సులో ఉంటారని అన్నారు. మాలకొండయ్య 1985బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా. -
పెళ్లికొచ్చి...ప్లేట్ల కోసం తన్నుకున్నారు
బల్లియా, ఉత్తరప్రదేశ్ : పెళ్లికి వచ్చిన అతిథిలు మధ్య భోజన ప్లేట్ల కోసం జరిగిన గొడవలో ఒకరు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం..నాన్హు యాదవ్ అనే వ్యక్తి వివాహం విక్రమ్‌పుర్ ప్రాంతంలో బంధు మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పెద్దసంఖ్యలో అతిథులు హాజరయ్చారు. అంత సేపు సంతోషంగా ఉన్న పెళ్లి మంటప పరిస్థితులు ఉన్నట్టుండి ఒక్కసారి ఉద్రిక్తంగా మారాయి. భోజన ప్లేట్లు సరిపడా లేకపోవడంతో పలువురు అతిథులు నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. ఇది గొడవగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వంట సామగ్రితో కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా...విశాల్ అనే 20 ఏళ్ల యువకుడు మార్గమధ్యలోనే మృతి చెందాడు. సంఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు -
ఆర్ఎస్ఎస్ మూడో శిక్షావర్గ్ ముగింపు సదస్సు
-
రాకుమారి వేసిన ప్రశ్నలు
ఇరాన్ చక్రవర్తి తన ఏకైక కుమార్తె సనాకు తగ్గ వరుణ్ని ఎంపిక చేసేందుకు స్వయంవరం ఏర్పాటు చేశారు. స్వయంవరంలో రాజకుమారి అడిగే మూడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పాలి. అదే ప్రాంతానికి చెందిన గొప్ప పండితుడి కుమారుడు ఆజిమ్కు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనే తలంపు కలిగి, స్వయంవరానికి హాజరయ్యాడు. రాజకుమారి మొదటి ప్రశ్న.. రాజ దర్బారు నుంచి లేచి కుడిచేయి పైకెత్తి చూపుడువేలును ఆకాశానికెత్తి సైగలద్వారా ప్రశ్నించింది. దానికి ఆజిమ్ తన చేతిని పైకెత్తి చూపుడు వేలితోపాటు మరోవేలిని జతచేసి గాలిలో ఊపాడు. రాజకుమారి ‘సరైన సమాధానం’ అంటూ అభినందించింది. ఇక రెండో ప్రశ్న.. తన చేతిలో ఉన్న ఖడ్గంతో విన్యాసాలు చేసి దీనికి సమాధానమేమిటని సైగచేసింది. దానికి ఆజిమ్ తన జేబులో ఉన్న కలాన్ని తీసి ఊపాడు. ‘శభాష్’ అని మెచ్చుకుంది సనా. చివరి ప్రశ్నగా రాజదర్బారు మెట్లనుంచి కిందకు దిగి పరుగు పరుగున వెళ్లి తన ఆసనంలో కూర్చుండిపోయింది. సమాధానంగా ఆజిమ్ లేచి నిల్చొని తన గుండెపై చేయి వేసి రాజకుమారి వైపు చూడసాగాడు. అంతే! రాజకుమారి సిగ్గుబిడియాలతో రాజమహలులోకి వెళ్లిపోయింది. చక్రవర్తి ఆజిమ్ను పిలిచి ‘‘నువ్వు నా కుమార్తె సనాను నీ సమాధానాలతో ఎలా మెప్పించావు రహస్యమేమిటి’’ అని ఎంతో కుతూహలంగా అడిగాడు. దానికి ఆజిమ్ ‘మొదటి ప్రశ్నగా రాజకుమారి తన చూపుడువేలిని పైకెత్తి నువ్వు దేవుడు ఒక్కడేనని నమ్ముతావా? అని అడిగింది. దానికి నేను నా రెండు వేళ్లను పైకెత్తి చూపుతూ అల్లాహ్, ఆయన ప్రవక్త ముహమ్మద్ (సఅసం) పై నా విశ్వాసముందని చెప్పాను. రెండో ప్రశ్నగా రాకుమారి తన చేతిలో ఖడ్గాన్ని తిప్పుతూ దీనికంటే గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో ఉందా అని ప్రశ్నించింది. దానికి నేను నా చేతిలో ఉన్న కలాన్ని తీసి దీనికి మించిన గొప్ప ఆయుధం ఈ ప్రపంచంలో లేదు అని సమాధాన పర్చాను. మూడో ప్రశ్నగా రాకుమారి దర్బారు మెట్లు దిగి మళ్లీ తిరిగి వెళ్లి తన కుర్చీలో ఆసీనురాలైంది. అంటే, నేను ఎంతో అలసిపోయాను, కానీ నా దేహంలోని ఏ భాగం అలసిపోలేదు అని అడిగింది. దానికి జవాబుగా నా చేతిని నా గుండెపై వేసి ‘హృదయం’ అని జవాబు చెప్పాను’’ అని సమాధానమిచ్చాడు. ధన సంపద కంటే జ్ఞానసంపద ఎంతో మేలైనది. జ్ఞానం ఎంత వినియోగిస్తే అంతగా పెరుగుతుంది అని చెప్పడమే ఇందులోని అంతరార్థం. – ఉమైమా -
ఆన్లైన్ అయ్యోరు!
మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం తలపెట్టారా.. సమయానికి పురోహితుడు అందుబాటులో లేరా.. అయితే ‘పండిత్ పూజలు సర్వీసెస్’ సంస్థను ఆన్లైన్లో సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముహుర్తాలు పెట్టడానికి.. ఇతర శుభ కార్యాలు జరిపించాలంటే ‘అయ్యగారి’దే ప్రధాన భూమిక. ప్రత్యేక పూజలు, హోమాలు ఇతరత్రా పూజలు చేయించుకోవాలని అనుకునేవారు ఆన్లైన్లో సంప్రదిస్తే చాలు మీ పని ఇట్టే అయిపోతుందంటున్నారు ‘పూజలు.కామ్’ వెబ్ రూపకర్త రవికుమార్ శర్మ పెండ్యాల. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా దేశ విదేశాలకూ సేవలు విస్తరించారు. కుత్బుల్లాపూర్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడకు చెందిన రవికుమార్ శర్మ పెండ్యాల హైదరాబాద్ కేంద్రంగా ‘పూజలు.కామ్’ వెబ్ ద్వారా పౌరహిత్య సేవలను అందిస్తున్నారు. వివిధ పూజలకు పండితులను వెబ్ ద్వారా అరేంజ్ చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ 2014 నుంచి దాదాపు 500 మంది పురోహితులను అందుబాటులో ఉంచింది. ప్రత్యేక పర్వదినాల సందర్భాల్లో వివిధ ప్రాంతాల్లో పూజలు నిర్వహించాలనుకునే వారు ముందుగా ఈ సైట్లో బుక్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా ద్వారా క్రతువులు.. వివిధ దేశాలలో పండితులు అందుబాటులో ఉన్నా.. కొన్ని ప్రాంతాలలో మాత్రం పూజారులు అందుబాటులో ఉండరు. దీనికి పరిష్కారంగా పూజలు. కామ్ వారు వెబ్ క్యామ్‌ల ద్వారా పూజలు నిర్వహిస్తారు. ఎక్కువగా ముస్లిం దేశాల్లో ఈ విధానం పాటిస్తున్నారు. పూజలు నిర్వహించుకునే వారు వెబ్ క్యామ్‌లో పండితులు వేదామంత్రాలు పఠిస్తూ సూచనలు చేస్తారు. వీటిని ఫాలో అవుతూ పూజా కార్యక్రమాలు పూర్తి చేస్తారు క్లయింట్స్. అందరికీ అందుబాటులో పూజారులు.. పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో వేదపండితుల కొరత ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రం తెలిసిన పండితులు దొరకడం కష్టంగా మారింది. ఈ సమస్య పరిష్కారానికి పూజలు.కామ్ వెబ్‌ను ప్రారంభించాం. సోషల్ మీడియా వేదికగా పూజలు చేయిస్తాం. – రవికుమార్ శర్మ పెండ్యాల, పూజలు.కామ్ వ్యవస్థాపకుడు అంతా ఆన్లైన్ బుకింగ్.. వేద పండితులను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో స్టాండర్డ్, ప్రీమియం వంటి ఆప్షన్లుంటాయి. ఏ పూజకు ఎంత దక్షిణ ఇచ్చుకోవాలి, ఒకవేళ పూజా సామగ్రితో పంతులు కావాలంటే ఇందుకు సైతం ఆప్షన్లుంటాయి. తెలుగు పంతుళ్లు మాత్రమే కాదు ఉత్తర భారతీయుల కోసం హిందీ పండిత్‌లు కూడా ఈ వెబ్‌లో అందుబాటులో ఉన్నారు. అంతేకాకుండా ప్రత్యేకించి బ్రాహ్మణుల ఇంట పూజాది కార్యక్రమాలకు వేద పండితులతో పాటు క్యాటరింగ్ సేవలూ అందుబాటులో ఉన్నాయి. సంప్రదాయబద్ధంగా గృహ ప్రవేశం.. మేం తెలుగు వాళ్లం. మస్కట్‌లో స్థిరపడ్డాం. ఇక్కడ కొత్త ఇల్లు తీసుకున్నాం. ఈ తరుణంలో పూజలు.కామ్ వెబ్ ద్వారా సోషల్ మీడియా వేదికగా గృహ ప్రవేశం, సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకున్నాం. శాస్త్ర ప్రకారం మా గృహప్రవేశం జరిగింది. – సుస్మిత, మస్కట్ -
29న విజ్ఞాన్ వర్సిటీ స్నాతకోత్సవం
► ఇస్రో చైర్మన్ కిరణ్‌కుమార్, దర్శకుడు కె.విశ్వనాథ్‌లకు డాక్టరేట్లు చేబ్రోలు: విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఐదో స్నాతకోత్సవం ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు ఉప కులపతి ఎం.వై.ఎస్.ప్రసాద్ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో మంగళవారం విలేకరులతో ప్రసాద్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు స్నాతకోత్సవా నికి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్, ప్రముఖ సినీ దర్శకుడు కె.విశ్వనాథ్, కోయంబత్తూరులోని అరవింద్ కంటి ఆస్పత్రి చీఫ్ పీడియాట్రిక్ ఆప్తమాలజిస్టు డాక్టర్ కల్పనా నరేంద్రన్ గౌరవ అతిథులుగా హాజరవుతారని, వారికి గౌరవ డాక్టరేట్లు ప్రదా నం చేస్తున్నట్లు వెల్లడించారు. స్నాతకోత్సవం సందర్భంగా 1,114 మంది విద్యార్థులకు డిగ్రీలు, 20మందికి బంగారు పతకాల ప్రదానం ఉంటుందన్నారు. -
సాహితీవనంలో తులసిమొక్క ‘అద్దేపల్లి’
సంస్మరణసభలో ప్రముఖుల నివాళి ‘అల్లూరి’ వీరగాథ ఆవిష్కరణ కాకినాడ కల్చరల్ : ప్రజాకవి అద్దేపల్లి రామ్మోహనరావు సాహితీవనంలో తులసి మొక్కవంటి వారని ప్రముఖ సాహితీవేత్త గిడ్డి సుబ్బారావు అన్నారు. స్థానిక రోటరీ క్లబ్లో అద్దేపల్లి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో అద్దేపల్లి సంస్మరణ సభ గిడ్డి అధ్యక్షతన అదివారం జరిగింది. అద్దేపల్లి రచించిన వచనకవితా విప్లవ వీరకథాకావ్యం ‘అల్లూరి సీతారామరాజు’ను గిడ్డి ఆవిష్కరించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా గిడ్డి మాట్లాడుతూ అద్దేపల్లి నడిచే గ్రంథాలయం వంటి వారన్నారు.‘అల్లూరి సీతారామరాజు’ కావ్యంపై సాహిత విమర్శకులు మేడి రవికుమార్ సమీక్ష చేశౠరు. తెల్లదొరల పాలనపై పోరాడి, వీరమరణం పొందిన అల్లూరి సీతారామరాజు గాథ మనందరికి ఆదర్శంగా నిలిచే విధంగా అద్దేపల్లి రచించారన్నారు. అద్దేపల్లి కవిత్వమే శ్వాసగా జీవించారని మరో రచయిత డాక్టర్ శిరీష అన్నారు. దేశ విదేశాల్లో పేరుగాంచిన శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’పై అద్దేపల్లి సంధించిన విమర్మనాస్త్రం సంచలనం సృష్టించిందని కవి, విమర్శకులు కె.వి.రమణారెడ్డి అన్నారు. కవనలోకంలో వెలుగులు విరజిమ్మే ధృవతార అద్దేపల్లి మనల్ని వదిలి వెళ్ళి వసంతం గడిచినా, ఆయన రచనల గుబాళింపు తగ్గలేదని విమర్మకులు వాసా భూపాల్ అన్నారు. అద్దేపల్లి సాహిత్య వ్యవసాయంలో ఎందరో కవులు పుట్టుకొచ్చారని రచయిత పి.సీతారామరాజు అన్నారు. మహాకవి అద్దేపల్లి కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనని కవి సయ్యద్ సాలర్ అన్నారు. తెలుగు సాహిత్యంలో వచ్చిన అభ్యుదయవాదం, విప్లవ కవిత్వం, దిగంబర కవిత్వం, స్త్రీవాద కవిత్వం, దళితవాదం, ప్రపంచీకరణ మొదలైన అన్ని అంశాల మీదా, నాటి సమకాలీన పరిస్థితులపై ఆయన వందలాది వ్యాసాలను రచించి ప్రజలను ఉత్తేజపరిచారని కవి పద్మవాణి అన్నారు. అనేక మంది యువకవుల్ని తయారు చేసిన ఘనత అద్దేపల్లి సొంతమని రచయిత అద్దేపల్లి రాధాకృష్ణ అన్నారు. సమకాలీన పరిస్థితులపై అప్పటికప్పుడు రచనలు చేయడం ఆయన శైలి అని వక్తిత్వ వికాస సమాజం కో ఆర్డినేటర్ అద్దేపల్లి ఉదయభాస్కర్ అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితివేత్తలు, కవులు దేవదానంరాజు, భగవాన్, పి.వెంకటప్పయ్య, వీరలక్షీ్మదేవి తదితరులు పాల్గొన్నారు. -
ఆటల వేడుక
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం స్వర్గీయ ధ్యాన్‌చంద్‌కు నివాళి స్ఫూర్తి ప్రదాత: డీఎస్డీఓ కబీర్దాస్ ఖమ్మం స్పోర్ట్స్: హాకీ మాంత్రికుడు స్వర్గీయ ధ్యాన్‌చంద్ జయంతి ఉత్సవాలను ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఘనంగా జరిపారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. అథ్లెటిక్స్, వాలీబాల్, జిమ్నాస్టిక్స్, ఫుట్‌బాల్ తదితర క్రీడాంశాల్లో ఈ పోటీలు జరిగాయి. దాదాపు ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో తనకు సాటి మరెవరూ లేరని ధ్యాన్‌చంద్ నిరూపించారని డీఎస్డీఓ కబీర్దాస్ పేర్కొన్నారు. హాకీ క్రీడకు ఎనలేని ప్రాధాన్యం తీసుకొచ్చిన క్రీడాకారుడిగా ధ్యాన్‌చంద్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని పేర్కొన్నారు. ప్రతి ఒక క్రీడాకారుడికి స్ఫూర్తి ప్రదాన అన్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో క్రీడా ప్రాధికార సంస్థ శిక్షకులు ఎండీ గౌస్, ఎండీ గౌస్‌పాషా, ఎండీ అక్బర్అలీ, పీడీలు గంగాప్రసాద్, ఎల్లారెడ్డి, షఫీ, అహ్మద్, ఆదర్శకుమార్, భాగ్యలక్ష్మి, గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఇన్ స్టాగ్రామ్ లో లేటెస్ట్ హల్ చల్..
ఎప్పుడు ఏ పుణ్యం చేసుకున్నాయో ఏమో ఆ శునక రాజాలు రాజభోగాలు అనుభవించాయి. సంపన్న వ్యక్తుల వివాహాలకు ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకొని ఇప్పుడు సోషల్ మీడియాలో లక్షలమంది ఫాలోయర్లతో పాపులర్ అయిపోయాయి. అంతేకాదు ఈ ప్రత్యేక వేడుక వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్ గా కూడ ప్రఖ్యాతి చెందింది. ఇంతకూ ఈ వివాహం వెనుక పెద్ద చరిత్రే ఉంది. అదేమిటో మీరూ చూడండి. న్యూయార్క్ నగరంలోని ఒకప్పటి చారిత్రక ప్రాంత ఛల్సియా నైబర్ హుడ్ లోని.. హైలైన్ హోటల్ గతవారం రెండు శునక రాజాల కల్యాణ వైభోగానికి వేదికయ్యింది. వివాహానికి కస్టమ్ మేడ్ మార్చెసా డ్రెస్ ను ధరించి పోజిచ్చిన వధువు... కావలియర్ కింగ్ ఛార్లెస్ స్పానియల్.. సుమారు మూడు లక్షల నలభై వేలమంది ఇన్ స్టాగ్రామ్ ఫాలోయర్స్ ను సంపాదించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు లండన్ జ్యుయలర్స్ లో సుమారు లక్షా ముఫ్ఫై వేల డాలర్లకు కొన్ననెక్లెస్... ఆ శునకం నిశ్చితార్థం ఉంగరం స్థానాన్ని ఆక్రమించింది. ఇదిలా ఉంటే వరుడు శునకం ఫిన్.. మాత్రం 16 వేలమంది ఫాలోయర్స్ తో ఇన్ స్టాగ్రామ్ లో నిరాడంబరంగా కనపడింది. కుక్కలకోసం ప్రత్యేకంగా ఉండే ఖరీదైన దుకాణం రూపొందించిన తక్సేడో తో పాటు టోపీని ధరించి హుందాగా తయారయ్యింది. శునకాల వెడ్డింగ్ పార్టీకి... ఇరువైపుల యజమానులే కాక, వారి వారి బంధుమిత్రులతోపాటు వారి పెంపుడు కుక్కలూ హాజరయ్యాయి. సుమారు రెండు వందల మంది హాజరైన ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ హంగామా అంతా సామాజిక మీడియాలో స్థానం సంపాదించేందుకో, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకో కాదని నిర్వాహకులు అంటున్నారు. దీనంతటికీ వెనుక సేవా ధృక్పధం దాగుందని చెప్పారు. పెంపుడు జంతువుల సంరక్షణార్థం ఓ సేవా సంస్థకు సహాయం అందించేందుకే ఈ వేడుకను నిర్వహించినట్లు వారు చెప్పారు. ఒక్కో టికెట్ 150 డాలర్లకు అమ్మగా వచ్చిన విరాళాన్ని ఆ సంస్థకు అందించారు. -
ఘనంగా కొమురం భీం వర్థంతి
ఆదిలాబాద్: తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీం 75వ వర్థంతి వేడుకలు స్వగ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్లోని భీం సమాధి వద్ద ఆయన వంశీకులు ప్రత్యేక పూజలు చేసి నాలుగు రకాల జెండాలను ఎగురవేశారు. ప్రభుత్వం తరఫున ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్.ఇ.కరుణన్ పూజలు నిర్వహించి కొమురం భీంకు ఘనంగా నివాళులర్పించారు. -
భారీ ఈవెంట్‌గా ఏపీ రాజధాని శంకుస్థాపన
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని భారీ ఈవెంట్‌గా ప్రభుత్వం నిర్వహించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం... ప్రయివేట్ కన్సల్టెన్సీకి ఈ ఈవెంట్ బాధ్యతలు అప్పగించనుంది. విజ్క్రాప్ట్ కన్సెల్టెన్సీకి ఈవెంట్ నిర్వహణ కట్టబెట్టింది. ఇందుకోసం రూ.9.50కోట్లు చెల్లించేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. మరోవైపు రాజధాని శంకుస్థాపనను రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. కాగా అక్టోబర్ 22 విజయదశమి రోజున జరిగే ఈ కార్యక్రమాన్ని పూర్తి శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. ఈ శంకుస్థాపనకు భారత, సింగపూర్ ప్రధానమంత్రులతో పాటు జపాన్ విదేశాంగ మంత్రి హాజరవుతుండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
అమరుల త్యాగం వల్లే తెలంగాణ : నాయిని
-
ఓనమాలు నేర్పిన ఓనమ్
ఓనమ్... మళయాళీలు పది రోజుల పాటు... వేడుకగా, ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ... రకరకాల వంటలతో, సంప్రదాయ నృత్యాలతో... ఆటలతో... పడవల పోటీలతో... పులి వేషాలతో... తెలుగువారి దసరాలను త లపించే పండుగ... ఇంటికి పంటలు చేరి భోగభాగ్యాలతో తులతూగే పండుగ... రేపు ‘ఓనమ్’... తెలుగింటి కోడలుగా మనలో ఒకరైపోయిన పరహారణాల కేరళ కుట్టి సుమ ‘సాక్షి’కి చెప్పిన ఓనమ్ పండుగ కబుర్లు... మీరు మలయాళీ ఇంటి ఆడపడుచు! తెలుగింటి కోడలు! మరి ఓనమ్ బాగా సెలబ్రేట్ చేస్తారా? సుమ: నేను చిన్నతనం నుంచీ ఇక్కడే అంటే హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. మా పెళ్లయినప్పటి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి ఓనమ్ పండుగ వేడుకగా జరుపుకుంటున్నాను. మా ఇంట్లో అటు తెలుగు పండుగలు, ఇటు కేరళ పండుగలు - రెండూ బాగా చేసుకుంటాం. కిందటేడాది మానాన్నగారు పోవడంతో ఆ ఒక్క సంవత్సరమే చేయలేదు. పండుగను ఎలా జరుపుకుంటారు? సుమ: ఓనమ్ పండుగ పది రోజులూ ఇంటి ముందర కళ్లాపి జల్లి, నేల తడిగా ఉండగానే పువ్వులతో పూక్కళమ్ చేస్తారు. అంటే పూల ముగ్గులాంటిదన్నమాట. సాధారణంగా అందరూ పది రోజులూ చేస్తారు. అయితే నేను నా షూటింగులలో బిజీగా ఉంటాను కాబట్టి ఒక్కరోజు మాత్రమే రకరకాల పూలతో అందంగా అలంకరించి, ఆనందిస్తాను. ఓనమ్ సందర్భంగా ప్రత్యేక వంటలు ఏమేం చేస్తారు? సుమ: ఈ పండుగకు సాధారణంగా 13 రకాల వంటకాలు చేస్తారు. మేం మాత్రం అవియల్, ఓలెన్, ఇంజుప్పులి, పాలడ పాయసం, కరి (సెనగపప్పు వంటకం), అనాస లేదా మామిడికాయతో పచ్చడి చేస్తాం. ప్రతి ఏడాదీ ఈ వంటలన్నీ నేనే చేస్తాను. ఈసారి మా అమ్మ కూడా నా దగ్గరే ఉన్నారు కనుక ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓనమ్ నాడు మీ ఆచారవ్యవహారాలు ఎలా ఉంటాయి? సుమ: ఈ పండుగ నాడు అప్పడం కంపల్సరీ. అరటిపండు (వేందరప్పళన్) ను ఇడ్లీ రేకులలో ఉంచి ఆవిరి మీద ఉడికించి తింటాం. ఈ అరటిపండును నెల రోజుల పసి పాపలకు కూడా పెట్టచ్చు. ఇది చాలా బలాన్నిస్తుంది. ఆవిరి మీద ఉడకపెట్టడం వలన ఇందులోని పోషకాలు ఎక్కడికీ పోవు. ఓనమ్ పండుగకు తప్పనిసరిగా అరటి ఆకులోనే భోజనం చేస్తాం. నాకు అందులో తినడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆకులో పాలడ పాయసం వేసుకుని అది అటూ ఇటూ జారిపోతూ ఉంటే చేత్తో గబగబ దగ్గరకు లాక్కుంటూ తినడం భలే సరదాగా ఉంటుంది. నేను కొంచెం చిలిపి పనులు చేస్తుంటాను. నా ఆకు క్లీన్‌గా ఉండాలని, (నవ్వుతూ) నేను అన్నం తినడం పూర్తయిన తర్వాత, నా ఆకులో ఉన్న కరివేపాకు, పచ్చి మిర్చి వంటి వాటిని పక్క వాళ్ల ఆకులలోకి వాళ్లు చూడకుండా తోసేస్తాను. ఈ పండుగకు ప్రత్యేకంగా ముండుమ్ వేష్టి ధరిస్తాం (ఇది ఓనమ్ ప్రత్యేకం). ఇంతకీ మీరు మొట్టమొదటసారి వంట చేసినప్పుడు మీ అనుభవం ఏమిటి? సుమ: పెళ్లయిన పదిహేను రోజులకు మొదటిసారి రాజీవ్ నన్ను పచ్చి మిర్చి పచ్చడి చేయమన్నారు. ఆయన కోరిక మేరకు వంట చేయడానికి వంట గదిలోకి సంతోషంగానే అడుగుపెట్టాను. రాజీవ్ ఉద్దేశం కొబ్బరిలో పచ్చి మిర్చి కలిపిన పచ్చడి! కానీ నేను కేవలం పచ్చి మిర్చితో అనుకుని, పచ్చి మిర్చిలో ఉప్పు వేసి మిక్సీలో మెత్తగా తిప్పి అన్నంలో వడ్డించాను. ఆ పచ్చడి కలుపుకుని తినేసరికి, ఇంక చూడాలి... రాజీవ్ కళ్లల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా కళ్లలోనూ బాధతో నీళ్లు తిరిగాయి. రాజీవ్‌కి అందరు దేవుళ్లతో పాటు, మా కుటుంబ సభ్యులూ కళ్ల ముందు సాక్షాత్కరించారు. మరి, ఆ తరవాత వంట నేర్చుకున్నారా? సుమ: ఆ తరవాత అనుభవం మీద అదే వచ్చేసింది. వంట చేయడం నాకు ఇష్టమే. కానీ సమయం మాత్రం లేదు. పండుగలకు, వంటమనిషి ఊరెళ్లినప్పుడు, పిల్లలు అడిగితే చేసిపెట్టడం... అంతే తప్ప మిగతా సమయాల్లో వంట చేయాల్సిన అవసరం ఉండదు. మలయాళీలు అన్ని వంటల్లోనూ కొబ్బరి నూనె ఎక్కువగా వాడతారంటారు? సుమ: కొలెస్ట్రాల్ చింత పెరిగిపోవడంతో, ఇప్పుడు కొబ్బరి నూనెతో వంటలు చేయడం బాగా తగ్గిపోయింది. కొన్ని ప్రత్యేకమైన వంటకాలకు మాత్రమే కొబ్బరి నూనె వాడతున్నాం. మీ జీవితంలో ఓనమ్ పండుగ పోషించిన ప్రత్యేక పాత్ర గురించి ఎక్కడో విన్నాం... సుమ: అవును. సికింద్రాబాద్‌లో మలయాళీలకు ప్రత్యేకంగా ‘కేరళ అసోసియేషన్’ అని ఒకటి ఉంది. దానికి మా నాన్నగారు మేనేజర్‌గా ఉండేవారు. అక్కడ ప్రతి యేడూ ఓనమ్ పండుగనాడు ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఏమాత్రం భయపడకుండా నేను వాటిలో పాల్గొనేదాన్ని. అందువల్ల నాకు స్టేజ్ ఫియర్ పోయింది. అలా నా ప్రతిభ నిరూపించుకునే అవకాశం ఓనమ్ పండుగ వల్లే వచ్చింది. ఇప్పుడు యాంకర్‌గా ఇంత సక్సెస్ సాధించగలిగానంటే అందుకు కారణం ఓనమ్ పండుగే. అలా ఓనమ్ నుంచి ఓనమాలు నేర్చుకున్నాను. - సంభాషణ: డా. వైజయంతి పాలడ పాయసం కావలసినవి: పాలడ (రైస్ అడ) - ముప్పావు కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); నెయ్యి - 2 టీ స్పూన్లు; జీడిపప్పు పలుకులు - టేబుల్ స్పూను; కిస్మిస్ - టేబుల్ స్పూను; పాలు - 2 కప్పులు; బెల్లం తురుము - పావు కప్పు; ఏలకులపొడి - పావు టీ స్పూను తయారీ: రైస్ అడను రెండు కప్పుల వేడి నీళ్లలో సుమారు పది నిమిషాలు నానబెట్టాలి పది నిమిషాల తర్వాత అవి బాగా పొంగి కనపడతాయి. అప్పుడు నీళ్లు వడకట్టి చల్ల నీళ్లలో వేసి వార్చాలి బాణలిలో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి దోరగా వేయించి తీసేయాలి ఒక పాత్రలో పాలు, బెల్లం తురుము, ఏలకుల పొడి, నానబెట్టి తీసిన పాలడ వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి బాగా ఉడికిన తర్వాత దించి, వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకులు, కిస్మిస్ వేసి అందించాలి. ఇంజిప్పులి కావలసినవి: నూనె - 5 టేబుల్ స్పూన్లు; అల్లం - అర కేజీ (సన్నగా తురమాలి); ఉప్పు - తగినంత; ఆవాలు - టీ స్పూను; కొబ్బరి ముక్కలు - 2 కప్పులు; కరివేపాకు - 2 రెమ్మలు; చిన్న ఉల్లిపాయలు - పావు కేజీ; పచ్చి మిర్చి - 4 (ముక్కలు చేయాలి); పసుపు - అర టీ స్పూను; ధనియాల పొడి - 3 టేబుల్ స్పూన్లు; కారం - 2 టేబుల్ స్పూన్లు; చింతపండు - 100 గ్రా. (నానబెట్టాలి); బెల్లం తురుము - తగినంత తయారీ: బాణలిలో నూనె వేసి వేడి చేయాలి అల్లం తురుము వేసి వేయించి, ఉప్పు జత చేసి దోరగా వేయించి దించి పక్కన ఉంచాలి మిగిలిన నూనెను బాణలిలో వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి కొబ్బరి ముక్కలు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాక కరివేపాకు జత చేయాలి చిన్న ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగు వేసి వేయించాలి పసుపు, ధనియాల పొడి, కారం వేసి వేయించాలి వేయించి ఉంచుకున్న అల్లం తురుము, చింతపండు పులుసు వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉడికించాలి బెల్లం తురుము వేసి మరో ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. చక్క ఎరిసెరి కావలసినవి: పచ్చిగా ఉన్న పనస తొనలు - పావు కేజీ; కారం - అర టీ స్పూను; పసుపు - పావు టీ స్పూను; ఉప్పు - తగినంత; కొబ్బరి తురుము - అర కప్పు; జీలకర్ర - పావు టీ స్పూను; మిరియాల పొడి - పావు టీ స్పూను; పచ్చి మిర్చి - 2; కొబ్బరినూనె - టేబుల్ స్పూను; ఆవాలు - అర టీ స్పూను; ఎండు మిర్చి - 4; చిన్న ఉల్లి పాయలు - 5; కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు; కరివేపాకు - రెండు రెమ్మలు తయారీ: ముందుగా పనస తొనలలోని గింజలు వేరు చేసి తొనలను నాలుగైదు ముక్కలుగా కట్ చేయాలి ఒక పాత్రలో పనస ముక్కలు, కారం, పసుపు, ఉప్పు, నీళ్లు వేసి బాగా కలిపి స్టౌ మీద ఉంచి మూత పెట్టి ఉడకించాలి కొబ్బరి తురుము, పచ్చి మిర్చి, జీలకర్ర, మిరియాల పొడి, రెండు టీ స్పూన్ల నీళ్లు మిక్సీలో మెత్తగా చేసి పక్కన ఉంచాలి పనస ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించేయాలి మరొక బాణలిలో కొబ్బరినూనె వేసి కాగాక ఆవాలు వేసి చిటపటలాడించాలి ఎండు మిర్చి ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి తురుము, కరివేపాకు జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ఉడికించి ఉంచుకున్న పనస ముక్కల మిశ్రమం వేసి బాగా కలిపి దించేయాలి అన్నంలోకి వేడివేడిగా వడ్డించాలి. -
కారు పల్టీ.. తల్లి, కుమార్తె దుర్మరణం
విజయవాడకు చెందిన రెండు కుటుంబాల సభ్యులు కంచికచర్ల వెళ్లి శుభకార్యంలో పాల్గొని కారులో తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఓ మహిళ, ఆమె ఆరు నెలల కుమార్తె మరణించగా, మరో ఎనిమిదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కేతనకొండ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన వారు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇబ్రహీంపట్నం రూరల్/ విజయవాడ, న్యూస్‌లైన్ : వరుసకు బావ, బావమరిది అయిన ఇద్దరు కుటుంబసభ్యులతో కలిసి శుభకార్యం లో పాల్గొనేందుకు కారులో బంధువుల ఇంటి కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి, ఆమె ఆరునెలల కు మార్తె మరణించారు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇబ్రహీపట్నం కేతనకొండ వద్ద గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరి గింది. సేకరించిన వివరాల ప్రకారం.. విజయవాడ పూర్ణానందంపేటకు చెందిన కె.చంద్రశేఖర్, ఎస్.శ్రీనివాస్ వరుసకు బావ, బావమరిది. బంధువుల ఇంట్లో శుభకార్యంలో పాల్గొనేందుకు రెండు కుటుంబాలకు చెందిన 10 మంది కారులో కంచికచర్ల వెళ్లారు. వీరిలో న లుగురు పెద్దవారు, ఆరుగురు పిల్లలు ఉన్నా రు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత రెండు గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ వద్దకు వచ్చేసరికి కారు నడుపుతున్న ఎస్.శ్రీనివాస్ నిద్రావస్థకు చేరుకున్నాడు. దీం తో కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు మూడు పల్టీలు కొట్టింది. అందులో ప్రయాణిస్తున్న ఎస్.కృష్ణవేణి(26) అక్కడికక్కడే మరణిం చింది. ఈ ప్రమాదంలో కృష్ణవేణి కుమార్తె సాయి శిరీష(ఆరునెలలు), కె.బుజ్జమ్మ(50), ఎస్.శ్రీనివాస్(34), కె.చంద్రశేఖర్(30) కె.యశ్వంత్(10), కె.జాగృతి(6), కార్తీక్(12), సాయి(10), ఎస్.తేజ(5)కు గాయాలయ్యా యి. వీరిని అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిన్నారి సాయి శిరీష అక్కడ చికిత్స పొందు తూ కొద్దిసేపటికి మరణించింది. గాయపడినవారిలో బుజ్జమ్మ పరి స్థితి ఆందోళనకరంగా ఉంది. తీవ్రంగా గాయపడిన చిన్నారులు షాక్ కు గురై మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. కృష్ణవేణి మృతదేహాన్ని ఘటనాస్థలి నుంచి ఇబ్రహీంపట్నం పోలీసులు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం గురించి తెలిసిన బాధితుల బంధువులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నవారిని చూసి తీవ్ర ఆవేదన చెందుతున్నారు. సాయి శిరీష మృతదేహాన్ని చూసి వారు విలపిస్తుండటం అక్కడ ఉన్నవారిని కలచివేసింది. గాయపడిన వారినుంచి అవుట్‌పోస్టు పోలీసులు వివరాలు సేకరించి, ఇబ్రహీంపట్నం పోలీసులకు పంపించారు. -
రంగుల ప్రయాణం
పచ్చని తరువులే కాదు మోడువారిన చెట్లు సైతం రంగు పువ్వులను తొడుక్కునే మాసం ఇది. ప్రకృతిలోని రంగులన్నీ జీవితం నిండా విరబూయాలని కోరుకునేవారి ఆకాంక్షలకు నాంది ఇది. ఉత్తరం నుంచి దక్షిణం వరకు... పశ్చిమం నుంచి తూర్పు వరకు భరతఖండమంతా భాసిల్లే రంగుల కేళి హోలీ మన సంస్కృతిలో ఓ భాగం. మన శ్వాసలో ఓ ఉల్లాసమైన రాగం. రంగుల పొడులు, గులాల్ నింపిన నీరు.. ఒకరి మీద ఒకరు హుషారుగా చల్లుకుంటూ ఆనందనృత్యం చేసే పండుగ హోలీ! ప్రతి ఒక్కరూ మరొకరిపై మొదటగా రంగు చల్లాలని ఉత్సాహపడుతుంటారు. వారు చల్లేది రంగు కాదు... తమలోని ప్రేమను. ‘హోలీ హోలీల రంగ హోలీ చమ్మకేళిల హోలీ...’ అంటూ ఆడి, పాడే ఈ వినోదాత్మక క్రీడలో శత్రువులు సైతం మిత్రులుగా మారి నవ్వుల జల్లులు రువ్వుకుంటారు. అందుకే ఈ వేడుకను పిల్లా, పెద్దా అంతగా ఇష్టపడతారు. ఎద నిండుగా ప్రేమను నింపి ఆనందంగా జీవించమని ఆశీర్వదించే వేడుకకు మన దేశం వేదిక. హోలీ మన ఇంటి సంబరం. దక్షిణాన దీవెన హోలీ రోజు దేశమంతటా రాధాకృష్ణుల దేవాలయాలను సుందరంగా తీర్చిదిద్ది, సమూహాలుగా చేరి, నృత్యగానాలతో ఆనందిస్తారు. అయితే ఉత్తరభారతదేశంతో పోలిస్తే దక్షిణ భారతదేశంలో అంత వేడుకగా ఈ పండగను జరుపుకోరు. మనరాష్ట్రంలో హైదరాబాద్, కొన్ని ప్రాంతాలలో మినహా మిగతా చోట్ల చిన్న స్థాయిలోనే హోలీని జరుపుకుంటారు. పున్నమి రాత్రి కాముని దహనం పేరిట పెద్ద మంట వేసి, ఆ బూడిద పశువుల కొట్టాల్లో చల్లుకుంటారు. మరుసటి రోజు మోదుగ పువ్వులను ఉడకబెట్టగా వచ్చిన రంగు నీళ్లను, గులాల్ రంగును ఒకరి మీద ఒకరు చల్లుకుంటారు. కొన్ని చోట్ల పెద్దల పాదాలమీద గులాల్ చల్లి, వారి దీవెనలు తీసుకుంటారు. ఉత్తరాన ఉత్సవం రాధ పుట్టిన ప్రాంతంగా ఉత్తరప్రదేశ్‌లోని బర్సానా ఊరికి పేరు. ఈ ఊరు మథుర పట్టణానికి 42 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి పురుషుడూ కృష్ణుడిగా, ప్రతి స్త్రీ రాధగా భావించుకుంటారు. హోలీ రోజున స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడిస్తారు. పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కర్రలను అడ్డుకుంటారు. పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ హోలీ చాలా సరదాగా ఉంటుంది. కృష్ణుడి జన్మస్థలం అయిన మథురలో, బృందావన్‌లో హోలీ రోజు ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఫాల్గునమాసం చివరి రోజున వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ వేడుకను సంవత్సర ముగింపుగా కూడా భావిస్తారు. పూర్ణిమకు ముందు ప్రజలందరి సమక్షంలో పురోహితుడు మంటను వెలిగించి, శుభాకాంక్షలు తెలుపుతాడు. తరువాత రోజు ఈ పండగను అంతా కలిసి రంగులతో ఉల్లాసంగా జరుపుకుంటారు. తూర్పు-పడమరలను కలిపిన రంగులు బెంగాల్లో ‘బసంత్ ఉత్సవ్’ పేరిట వసంతకాలాన్ని ఆహ్వానిస్తూ అమ్మాయిలు, అబ్బాయిలు ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే వీరు రంగులు చల్లుకోరు. పాటలు, నృత్యాలు, శ్లోక పఠనం.. అంతా శాంతినికేతన్ పద్ధతుల్లో సాగుతుంది. పౌర్ణమి రోజు ఉదయాన్నే అమ్మాయిలు కుంకుమపువ్వు రంగు దుస్తులను, సువాసనలు వెదజల్లే పువ్వుల దండలను ధరించి సంగీత వాద్యాలను మీటుతూ, పాటలు పాడతారు. వీళ్లు హోలీని ‘డోల్ జాత్రా, డోలా పూర్ణిమ’గా ఊయలోత్సవంగా జరుపుకుంటారు. ముఖ్యమైన వీధులలో రాధాకృష్ణుల ప్రతిమలను అలంకరించి పల్లకిలో ఊరేగిస్తారు. కుటుంబ పెద్దలు కృష్ణుడిని, అగ్నిదేవుడిని ప్రార్థిస్తారు. ఒరిస్సాలో హోలీ సందర్భంగా జగన్నాథుడి విగ్రహాలను పూజిస్తారు. పంజాబ్‌లో సిక్కులు హోలీని ‘హోలా మోహల్లా’ అంటారు. మనదేశంలో పంజాబ్‌లో జరిగే ఆనంద్‌పూర్‌సాహిబ్ ఉత్సవం చాలా పేరు గడించింది. విదేశాల నుంచి కూడా ప్రజలు పంజాబ్‌కు వచ్చి ఇక్కడ హోలీ పండుగలో పాల్గొంటారు. వీధులలో భోగి మంటలు వేసి, చుట్టూ చేరి పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తారు. అహ్మదాబాద్‌లో ఒక కుండలో నీళ్ల పెరుగును వేసి, వీధిలో వేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగులకొట్టడానికి పోటీపడుతుంటే అమ్మాయిలు వారిపై నీళ్లు విసురుతారు. చివరకు ఏ యువకుడైతే ఆ కుండను పగులకొడతాడో అతడికి ‘హోలీ రాజు’ గా కిరీటాన్ని అలంకరిస్తారు. మహారాష్ట్రలో ఫాల్గున పౌర్ణమికి వారం ముందు మంటకు కావల్సిన చెక్కను సేకరిస్తారు. సాయంత్రం మంటలను వెలిగించి, తినుబండారాలను, భోజనాన్ని అగ్నికి అర్పిస్తారు. ఈ సమయంలో ‘హోలీరే హోలీ పురాణచి పోలీ’ అని పాడతారు. పంచమి రోజున రంగులతో ఆడుకుంటారు. వెన్నెల రాత్రులలో వసంతం మణిపూర్‌లో ఆరు రోజులు హోలీ పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పౌర్ణమి రోజు రాత్రి డోలు వాయిస్తూ జానపద పాటలు, నృత్యాలతో అలరిస్తారు. వెన్నెల రాత్రుల్లో ప్రజలు విందులలో పాల్గొంటారు. భోగిమంటలకు ఎండుగడ్డిని ఉపయోగిస్తారు. తెలుపు, పసుపు తలపాగాలను ధరించి గులాల్ ఆడుతూ నృత్యం చేస్తారు. చివరి రోజు గుడి ఆవరణలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. దక్షిణ కొచ్చిలోనూ, కాశ్మీర్‌లోనూ ఎండాకాలానికి ప్రారంభంగా, పంటలు కోయడానికి సూచనగా ఈ పండగను జరుపుకుంటారు. రంగునీళ్లను విసురుకుంటూ పాటలు పాడుకుంటూ, నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడుపుతారు. ఏ దేశమేగినా! నేపాల్‌లో హోలీ పండగ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటిస్తుంది అక్కడి ప్రభుత్వం. ప్రవాస భారతీయులు ఉంటున్న ఉత్తర అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఆసియా దేశాలలోనూ హోలీని వేడుకగా జరుపుకుంటారు. పురాణేతిహాసాలలో ప్రఖ్యాతిగాంచిన హోలికా దహనం, రాధాకృష్ణుల వసంతకేళీ కథనాలు దేశమంతటా వ్యాప్తి చెందాయి. గడప గడపకూ చేరి మన సంస్కృతిలో భాగమయ్యాయి. ఈ వేడుకలోని ఆంతర్యాన్ని తెలుసుకోవడానికి విదేశీయులు మన దేశానికి వరస కడుతున్నారు. ఫొటోలలో భద్రపరుచుకుంటున్నారు. చిత్రాలుగా రూపుకడుతున్నారు. తమ తమ దేశాల్లో హోలీ రోజున రంగుల పువ్వులను పూయించుకోవడానికి ఉత్సాహపడుతున్నారు. ఎక్కడైనా చెడు పై మంచి సాధించిన విజయానికి సూచికగా జరుపుకునే ఈ పండగ భారతీయ ఆత్మకు అచ్చమైన ప్రతీక. గిరిజనుల కోలాహలం... రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో ఉన్న గిరిపుత్రుల హోలీ పండగ ప్రత్యేకంగానూ, ఆసక్తికరంగానూ ఉంటుంది. మామిడిపూత, గింజధాన్యాల రాకతో కొత్త జీవితానికి గుర్తులుగా భావిస్తారు వీరు. అగ్ని చుట్టూ చేరి, బిగ్గరగా ఏడుస్తారు. ఆ విధంగా చెడు తమ నుంచి దూరం అవుతుందని భావిస్తారు. ఈ వేడుకలో భాగంగా యథేచ్ఛగా యువతీయువకుల లైంగిక సంబంధాలకు అనుమతిస్తారు. హోలీ పండగ తమ జీవితంలో అత్యంత గొప్ప ఆనందాన్ని నింపుంతుందని భావిస్తారు. -
శుభకార్యానికి వెళ్తుండగా...
ఎదురొచ్చిన మృత్యువు =ఇంటిల్లిపాదిని కబళించిన రోడ్డు ప్రమాదం =స్టేషన్‌ఘన్‌పూర్ వద్ద కారు, డీసీఎం ఢీ.. =నలుగురు అక్కడికక్కడే మృతి తెల్లారితే.. చెల్లెలు ఇంట్లో శుభకార్యం.. ఆ అక్క తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో బయలుదేరింది. ఆనందంగా బయలుదేరిన ఆ కుటుంబానికి మృత్యువు ఎదురొచ్చింది. ఇంటి నుంచి 30కిలోమీటర్లు వెళ్లారో లేదో.. ఘోరం జరిగిపోయింది. డీసీఎం వ్యాన్ రూపంలో యమపాశం.. కారులో ఉన్న నలుగురిని కబళించింది. బుధవారం.. ఇంకా పూర్తిగా తెల్లవారకముందే స్టేషన్‌ఘన్‌పూర్ ఎస్సీ కాలనీ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం వారి ప్రాణాలను బలిగొంది. స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, న్యూస్‌లైన్ : బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి హాజర య్యేందుకు వెళుతూ ఓ కుటుంబం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. ఈ సంఘటన స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలోని జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున ఆరుగంటలకు చోటుచేసుకుం ది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హసన్‌ప ర్తి మండలంలోని భీమారం గ్రామానికి చెందిన కొంగరి భాస్కర్(62) ఇరిగేషన్ శాఖలో ఈఈ గా విధులు నిర్వర్తించి ఏడాది క్రితం ఉ ద్యోగ విరమణ పొందాడు. ఈయనకు భార్య పుష్పలత(50), కుమారులు, జీవన్, గోపినాథ్(26), కూతురు హేమలత(24)ఉన్నారు. భాస్కర్ స్వ గ్రామం చేర్యాల కాగా ఉద్యోగ రీత్యా 25 ఏళ్ల క్రి తం ఆయన భీమారంలో సొంతింటిని నిర్మించుకుని కుటుంబంతో అక్కడే స్థిరపడ్డాడు. అయితే నల్లగొండ జిల్లాలోని కొలనుపాకలో ఉంటున్న మరదలు(భార్య చెల్లెలు) రమ, పురుషోత్తం దంపతులు గ్రామంలో కొత్త ఇల్లు కట్టుకునేం దుకు బుధవారం ముగ్గుపోసుకుంటున్నారు. ఈ మేరకు కార్యక్రమానికి హాజరుకావాలని వా రు అక్కబావను ఆహ్వానించారు. దీంతో అక్కడికి వెళ్లేందుకు భాస్కర్ తన భార్య పుష్పలత, కుమారుడు గోపినాథ్, కూతురు హేమలతతో కలిసి భీమారం నుంచి తన టాటా ఇండిగో కా రులో బయలుదేరారు. అయి తే కారును డ్రైవింగ్ చేస్తున్న గోపినాథ్ స్టేషన్‌ఘన్‌పూర్ శివారు ఎస్సీకాలనీ సమీపంలో రోడ్డుపై ఉన్న డివైడర్‌ను గమనించకుండా ఒక్కసారిగా కారును కుడివైపునకు మళ్లించాడు. ఈ క్రమంలో అదే సమయంలో సెర్లాక్ డబ్బాల లోడ్‌తో హైదరాబాద్ నుంచి హన్మకొండ వైపునకు వస్తున్న డీసీఎం వ్యాన్ అదుపుతప్పి కారును వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న భాస్కర్, పుష్పలత, గోపినాథ్ అక్కడికక్కడే మృతిచెందారు. కాగా, డీసీఎం వ్యాన్ డ్రైవర్ నాగేశ్వర్రావుకు స్వల్ఫగాయాలయ్యాయి. కొన ఊపిరితో కొట్టుకున్న హేమలత.. కాగా, రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, అన్న య్య అక్కడిక్కడే మృతిచెందగా హేమలత కొనఊపిరితో కొద్దిసేపు కొట్టుమిట్టాడినట్లు మార్నిం గ్ వాక్కు వెళ్లిన స్థానికులు తెలిపారు. ప్రమా దం జరిగిన వెంటనే తీవ్రంగా గాయపడిన హే మలత కారు అద్దాలు తీసేందుకు ప్రయత్నించి ఊపిరాడక మృతి చెందినట్లు వారు చెప్పారు. సంఘటనా స్థలాన్ని సీఐ వెంకటేశ్వర్‌రెడ్డి సందర్శించి గాయపడిన డీసీఎం డ్రైవర్‌ను 108 లో ఆస్పత్రికి తరలించా రు. కారు అద్దాలు పగులగొట్టి... కాగా, నుజ్జునుజ్జయిన కారులో ఇరుక్కున్న మృ తదేహాలను స్థానికుల సహకారంతో పోలీసు లు అతికష్టంగా బయటికి తీశారు. గడ్డపారతో కారు అద్దాలు, డోర్లు పగులగొట్టి తాడు సా యంతో మృతదేహాలను వెలికితీసి రోడ్డు పక్క న పెట్టారు. కాగా, రోడ్డుపై విగతజీవులుగా ఉ న్న భాస్కర్ కుటుంబ సభ్యులను చూసి స్థాని కులు కంటతడిపెట్టారు. ఇదిలా ఉండగా, మృతుడు భాస్కర్ పెద్ద కుమారుడు జీవన్‌కుమార్ బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు... రోడ్డు ప్రమాదంలో భాస్కర్, అతడి భార్యాపిల్లలు మృతిచెందిన సమాచారం తెలుసుకున్న బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలపై పడి బోరున విలపించారు. నెల రోజుల్లో హేమలత వివాహం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని.. ఇంతలోనే ఎంత ఘోరం జరిగిందని వారు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకు తరలించి పోస్టుమార్టం నిర్వహించినట్లు సీఐ తెలిపారు. -
పల్లెర్లమూడిలో భారీ చోరీ
పల్లెర్లమూడి(నూజివీడు రూరల్), న్యూస్‌లైన్ : మండలంలోని పల్లెర్లమూడిలోని ఓ ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారీ దొంగత నం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సొసైటీ అధ్యక్షుడు పెదర్ల సత్యవరప్రసాద్ శుభకార్యం నిమిత్తం మంగళవారం రాత్రి నూజి వీడు వచ్చారు. వివాహం ముగిసిన తరువాత రాత్రి ఒంటిగంట సమయంలో స్వగ్రామం చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూడగా ముఖద్వారానికి వేసిన తాళం పగులగొట్టి ఉంది. తలుపులు తెరిచి ఉన్నాయి. లోపల బీరువా తలుపులు కూడా తెరిచి ఉన్నాయి. అందులోని వస్తువులు, దుస్తులు మంచం మీద చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో దాచిన రూ.90 వేలు నగదు, 45 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆయన గుర్తించారు. ఆభరణాల విలువ రూ.11.25 లక్షలు ఉంటుందని బాధితుడు తెలిపారు. ఘటన జరిగిన రోజు వరప్రసాద్ భార్య వేరే ఊరికి వెళ్లారు. దొంగతనం గురించి సమాచారం అందుకున్న సీఐ సిహెచ్.వి.మురళీకృష్ణ, రూరల్ ఎస్సై బి.ఆదిప్రసాద్ సిబ్బందితో వచ్చి ఘటనాస్థలిని పరిశీలించారు. క్లూస్‌టీం ఆధారాలు సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. తెలిసినవారి పనే ? సంఘటన జరిగిన తీరును చూస్తే బాగా తెలిసిన వ్యక్తులే చోరికీ పాల్పడి ఉంటారని పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమ యం చూసుకుని అర్ధరాత్రి ఒంటిగంట లోపే తాళం పగులగొట్టి సొత్తు దొంగిలించుకుపోవడాన్ని బట్టి వీరు ఆ విధంగా అంచనాకు వచ్చారు. సత్యవరప్రసాద్ వివాహానికి వెళ్లిన సంగతిని, ఆయన భార్య ఊరికి వెళ్ళిన విషయాన్ని బాగా గమనించి ఈ చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు.