
కన్ని మేడమ్ చిత్రం ఫేమ్ శ్రీరామ్ కార్తీక్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. అజయ్ అర్జున్ ప్రొడక్షన్స్ పతాకంపై డాక్టర్ అర్జున్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అజయన్ బాలా కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన 20 ఏళ్లుగా కథకుడిగా, స్క్రీన్ ప్లే రచయితగా పలు చిత్రాలకు పని చేశారు. అదేవిధంగా 2017లో విడుదలైన ఆరు అధ్యాయం చిత్రంలో ఒక భాగానికి దర్శకత్వం వహించారు.
(ఇది చదవండి: ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్..‘సలార్’పై ప్రభాస్ కీలక నిర్ణయం)
కాగా.. ఈ చిత్రంలో నటి క్రిష్ గురూప్ నాయకిగా నటిస్తుండగా యోగిబాబు, మునీష్ కాంత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీనికి సిద్ధం కుమార్ సంగీతాన్ని, చెళియన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది కొండ ప్రాంతంలో సాగే హృదయాన్ని హత్తుకునే అందమైన ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. తమిళసినిమాపై ఆసక్తి, ప్రతిభ కలిగిన యూనిట్‌తో కలిసి చేస్తున్న చిత్రం ఇది అన్నారు. కథను మాత్రమే నమ్మి రూపొందిస్తున్న ఈ చిత్రం టైటిల్, ఇతర వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు చెప్పారు. తనకీ అవకాశాన్ని కల్పించిన నిర్మాత అర్జున్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.
(ఇది చదవండి: రజనీకాంత్ రెమ్యునరేషన్ అన్ని కోట్లా? బడ్జెట్‌లో సగం సూపర్‌స్టార్‌కే! )
Comments
Please login to add a commentAdd a comment