Kollywood Film
-
ఓటీటీకి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. అది కూడా నెల రోజుల్లోపే!
ఓటీటీల్లో హారర్, యాక్షన్ థ్రిల్లర్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇలాంటి సినిమాలను ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. అందుకే ఇటీవల అలాంటి కంటెంట్ సినిమాలే ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా మరో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీకి వచ్చేస్తోంది. అదే తమిళంలో తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ కడైసీ ఉలగ పోర్. హిప్ హాప్ తమిళ ఆది స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు కథ అందించడంతోపాటు డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో అన్నీ అతడే కావడం విశేషం.ఈ తమిళ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ అక్టోబర్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. గతనెల సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాలో నాజర్, నట్టీ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్ల వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం ఓటీటీలోనూ అలరిస్తుందేమో వేచి చూడాల్సిందే. Directing a movie changes your perspective on various things. #KadaisiUlagaPor was one such experience. pic.twitter.com/NNsn7H9dEv— Hiphop Tamizha (@hiphoptamizha) September 29, 2024 -
డైరెక్ట్‌గా ఓటీటీకి కీర్తి సురేశ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరోయిన్ కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రఘుతాత. ఈ మూవీకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళంలో తెరకెక్కించిన ఈ మూవీని తెలుగులోనూ థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. కానీ అనివార్య కారణాలతో టాలీవుడ్లో విడుదల కాలేదు.తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 13 నుంచి తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రఘు తాత అందుబాటులోకి రానుంది. ఈ సినిమా హక్కులను జీ5 దక్కించుకోగా.. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 ట్విటర్ వేదికగా పంచుకుంది.ఆగష్టు 15న తమిళంలో విడుదలైన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలతో ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో కీర్తి సురేశ్ హిందీకి వ్యతిరేకంగా పోరాడే మహిళ పాత్ర పోషించింది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు నిర్ణయం తీసుకుందో ఈ మూవీ చూస్తేనే తెలుస్తుంది. Kayal is coming to your home for blasting entertainment!😂🔥 #RaghuThatha will be streaming from September 13th only on ZEE5 in Tamil, Telugu, and Kannada. @KeerthyOfficial @hombalefilms @vkiragandur @sumank @vjsub @yaminiyag @RSeanRoldan @rhea_kongara @editorsuresh pic.twitter.com/XY1fO7HT55— ZEE5 Telugu (@ZEE5Telugu) September 9, 2024 -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
దళపతి సైన్స్ ఫిక్షన్ మూవీ.. సెన్సార్ పూర్తి
కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సెన్సార్ పూర్తయింది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెంకట్ ప్రభు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. గోట్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించారు.ఇప్పటికే రిలీజైన ది గోట్ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో విజయ్‌ని పాతికేళ్ల కుర్రాడిగా చూపించనున్నారు. ఈ మూవీలో విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో మీనాక్షీ చౌదరి హీరోయిన్గా కనిపించనుంది. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా కీలక పాత్రల్లో పోషించారు. ది గోట్.. తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నారు.And it’s a U/A for #TheGreatestOfAllTime pic.twitter.com/TG8y3Retxy— venkat prabhu (@vp_offl) August 21, 2024 -
స్టార్ హీరో కాళ్లు మొక్కిన సందీప్ కిషన్!
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం రాయన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ధనుశ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సందీప్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీ జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అద్భతమైన రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్.. ధనుశ్‌పై ప్రశంసలు కురిపించారు. తనకు అన్న, గురువు అన్నీ ధనుశ్ అని అన్నారు. ఈ సినిమాలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. గురువుకు గురుపౌర్ణమి రోజున ధన్యవాదాలు అంటూ ధనుశ్ కాళ్ల మొక్కారు. అయితే ఇద్దరం సినిమాలో నటిస్తున్నప్పటికీ ఆయన ఫోన్ నంబర్ కూడా తన వద్ద లేదని సందీప్ అన్నారు. కాగా.. రాయన్‌లో ధనుశ్ హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, కాళిదాస్ జయరాం, ఎస్జే సూర్య, సెల్వ రాఘవన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. With a special gesture, actor #SundeepKishan expressed his love for #Dhanush at #Raayan Pre-Release Event.Event by @shreyasgroup ✌️#RaayanPreReleaseEvent #RaayanFromJuly26 #ShreyasMedia #ShreyasGroup pic.twitter.com/qbUBEm8yg3— Shreyas Media (@shreyasgroup) July 22, 2024 -
కోలీవుడ్ లో జనతా గ్యారేజ్ రీమేక్...
-
20 ఏళ్ల క్రితం నాటా.. ఇప్పుడు చూస్తే : రాఘవ లారెన్స్
తమిళ స్టార్ హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విభిన్నమైన పాత్రలు, సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు సమాజసేవలోనూ దూసుకెళ్తున్నారు. మాత్రం సంస్థ పేరుతో తమిళనాట సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పదిమంది పేద రైతు కుటుంబాలకు ట్రాక్టర్లు అందజేశారు. వారిని ప్రత్యేకంగా కలిసి మరి రాఘవ లారెన్స్ ట్రాక్టర్ తాళాలు అందించారు.తాజాగా తాను సొంత ఖర్చులతో చదివించిన విద్యార్థులను కలిశారు. దాదాపు 20 ఏళ్లుగా వారి అన్నీ తానే నడిపిస్తున్నారు. ఆ విద్యార్థులంతా చదువుల్లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా వారిని కలిసి రాఘవ లారెన్స్ ఎమోషనల్ అయ్యారు. తాను కూడా వారితో పాటు కలిసిపోయి ఆటలు ఆడారు. వారిని చూస్తే తనకు గర్వంగా ఉందంటూ ట్వీట్ చేశారు. వారిని కలిసి సమయం వెచ్చించడం నా హృదయం సంతోషంతో నిండిపోయిందంటూ వీడియోను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్ మీరు గ్రేట్ సార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. The seeds I planted 20 years ago have now grown into these beautiful souls and are being a good example in society. I’m extremely proud of my boys and girls for the kind of persons they have grown into. My heart is so full after spending some beautiful and quality time with them.… pic.twitter.com/XjytGqj2OW— Raghava Lawrence (@offl_Lawrence) May 19, 2024 -
సత్యరాజ్ ప్రధాన పాత్రలో వస్తోన్న యాక్షన్ థ్రిల్లర్!
సత్యరాజ్, వసంతరవి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం వెపన్. మిలియన్స్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎంఎస్ మన్సూర్ నిర్మించిన ఈ చిత్రానికి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించారు. దర్శకుడు రాజీవ్ మీనన్ ప్రతినాయకుడిగా ఫవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఇందులో నటి తాన్య హోప్ నాయకిగా నటించారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెలలోనే తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా చిత్రబందం ప్రెస్ మీట్ నిర్వహించింది.దర్శకుడు గుహన్ సెన్నియప్పన్ మాట్లాడుతూ..' సూపర్ హ్యూమన్ ఎలిమెంట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగే యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం కోసం యూనిట్ సభ్యులందరు శ్రమించారన్నారు. వెపన్ చిత్రం కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నిర్మాతలు ఎస్ మన్సూర్, ఎంఎస్ అబ్దుల్ ఖాదర్, ఎంఎస్ ఐజీష్ సహకారం లేకపోతే ఈ చిత్రం సాధ్యం కాదన్నారు. వారు తనకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారని.. సత్యరాజ్ తొలిసారిగా సూపర్ హ్యూమన్ పాత్రను అద్భుతంగా పోషించారన్నారు. ఆయన అంకిత భావం, సహకారం తనను ఎంతగానో ఉత్సాహ పరిచాయన్నారు.ఇక నటుడు వసంతరవి స్క్రీన్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంటుందని చెప్పారు. కాగా.. ఈ సినిమాలో యషికా ఆనంద్, రాజీవ్ పిళ్లై, మైమ్ గోపి, కనిక, గజరాజ్, సయ్యద్ సుభన్, భరద్వాజ్, రంగన్, వేలు ప్రభాకరన్, మాయా కృష్ణన్, శ్యామ్ కరీమ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందిస్తుండగా.. ప్రభు రాఘవ్ సినిమాటోగ్రఫీ అందించారు. కాగా.. ఈ సినిమా ఈనెల 23న రిలీజ్ కానుంది. -
కుమారునితో స్టార్ హీరోయిన్.. వీడియో పోస్ట్ చేసిన భర్త!
ప్రేమకు చిరునామా అమ్మ. మమతకు మారు పేరు అమ్మ. అమ్మ ఎవరికైనా అమ్మే. ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా కన్న పిల్లల లాలనలో తరించిపోయోది అమ్మ. నటి నయనతార ఇప్పుడు అలాంటి మాతృత్వ మధుర్యాన్నే ఆస్వాదిస్తున్నారు. హీరోయిన్గా అగ్రస్థానంలో రాణిస్తున్న నయనతార ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.కాగా, గత 2022లో దర్శకుడు విఘ్నేశ్ శివన్‌కు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి ఆరేళ్ల ప్రేమకు నిర్వచనం ఈ పెళ్లి. కాగా అదే ఏడాది అక్టోబర్ నెలలో నయనతార, విఘ్నేశ్ శివన్‌లు సరోగసీ విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వీరికి ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టిన సంగతి తెలిసిందే. కాగా నయనతార, విఘ్నేశ్ శివన్‌లో తమ జీవితంలో రీల్ విషయం, రియల్ విషయం గానీ సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటారు.తమ పెళ్లి వేడుకను మాత్రం ఒక ఓటీటీ సంస్థకు విక్రయించి వార్తల్లోకి ఎక్కారు. ఇక పుట్టిన రోజు గాని, ఇతర వేడుకలు గాని సామాజిక మాధ్యమాల ద్వారా తమ ఆనందాన్ని పంచుకుంటారు. అలాగే తమ పిల్లల అన్నప్రాసన వేడుక ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మాతృదినోత్సం సందర్భంగా నటి నయనతార తన చిన్నపిల్లగా మారిపోయారు.వారి ముద్దు మురిపాల్లో మురిసిపోయారు. పిల్లలను భుజాలపై మోస్తూ పరవశించిపోయారు. పిల్లలను లాలించి, మురిపించి అమ్మతనాన్ని అనుభవించారు. వారి చేతులు పట్టుకుని బుడి బుడి అడుగులు వేయిస్తూ ఆనందంతో పరవశించిపోయారు. ఈ వీడియోను నయనతార భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. అందులో నయనతారను ఉద్ధేశించి విఘ్నేశ్‌శివన్ పేర్కొంటూ నువ్వే నా ప్రాణం, నా లోకం అని పేర్కొన్నారు. ఈ వీడియో చాలా క్యూట్‌గా ఉంది. అమ్మకు కన్నపిల్లల ముందు తన స్థాయి అస్సలు గుర్తుకురాదని ఈ వీడియోతో నయనతార మరోసారి నిరూపించారు. ఇది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
లవ్ టుడే హీరో మరో చిత్రం.. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్!
నటుడు జయంరవి హీరోగా నటించిన కోమాలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యి హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ ఆ తరువాత లవ్‌టుడే చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి సూపర్‌హిట్‌ను అందుకున్నారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా ఇదే సంస్థలో ప్రదీప్ రంగనాథన్ మరోసారి కథానాయకుడిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా తన కాలేజ్‌మేట్ అశ్వంత్ మారిముత్తు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయన ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలింస్ చేశారు. దీని గురించి ఏజీఎస్ సంస్థ నిర్వాహకులు గురువారం ఒక వీడియోను విడుదల చేశారు. అందులో నటుడు ప్రదీప్ రంగనాథన్ తన కాలేజ్‌మేట్, మిత్రుడు అశ్వంత్ మారిముత్తుతో కలిసి చిత్రం చేయాలన్నది దశాబ్దం కల అని పేర్కొన్నారు. అది ఇప్పటికి నెరవేరబోతోందని అన్నారు. కాగా ఈయన ప్రస్తుతం విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఆ తరువాత ఏజీఎస్ ఎంటర్‌టైయిన్‌మెంట్ సంస్థ నిర్మించనున్న చిత్రంలో నటించనున్నారు. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 26వ చిత్రం అవుతుంది. ఈ చిత్రం షూటింగ్ మే నెలలో ప్రారంభం కానుందని చెప్పారు. కాగా ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ ప్రస్తుతం విజయ్ హీరోగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో గోట్ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించే చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు. Dedicated to all those who have a dream :) Joining hands with my brother , friend , well wisher @Dir_Ashwath and my home ground @Ags_production once again ❤️#AGS26 #PR03 Announcement video : https://t.co/JwLjs8n5HI#KalpathiSAghoram#KalpathiSGanesh#KalpathiSSuresh pic.twitter.com/hKxBbns9TB — Pradeep Ranganathan (@pradeeponelife) April 10, 2024 -
కబాలి భామ సరికొత్త లేడీ ఓరియంటెడ్ చిత్రం!
2006లో తిరుడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అయిన నటి సాయి దన్సిక. అయితే 2009లో జయం రవితో నటించిన ఐదుగురు హీరోయిన్లలో ఒకరిగా నటించారు. తరువాత మాంజావేలు, నిల్ గమనీ సెల్లాదే, పరదేశీ వంటి చిత్రాల్లో కథానాయకిగా సత్తాచాటారు. 2016లో రజనీకాంత్ హీరోగా పా.రంజిత్ దర్శకత్వం వహించిన కబాలి చిత్రంలో ఆయనకు కూతురిగా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత కొన్ని మలయాళ చిత్రాల్లోనూ నటించిన ఈమె ఇప్పటికీ మంచి స్థాయి కోసం పోరాడుతూనే ఉన్నారు. కాగా తాజాగా ఉమెన్ సెంట్రిక్ కథా పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. ఈమె నటించిన ది ప్రూఫ్ చిత్రాన్ని నృత్య దర్శకురాలు రాధిక తెరకెక్కించడం విశేషం. ఈమె మెగాఫోన్ పట్టిన తొలి చిత్రం కావడం గమనార్హం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. కాగా నిర్మాణ దశలో ఉన్న ఈ చిత్ర ట్రైలర్‌ను నటుడు శశికుమార్ బుధవారం ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ చిత్రంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. View this post on Instagram A post shared by சாய் தன்ஷிகா (@saidhanshika) -
'40 రోజులు వనవాసం'.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర పోస్ట్!
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. గతేడాది దసరా మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కెరీర్ ప్రారంభంలోనే జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కీర్తి తన శక్తికి మించిన పాత్రల్లోనూ నటించి మెప్పించింది. మహానటిగా అభిమానుల గుండెల్లో తన పేరును లిఖించుకుంది. తెలుగు, తమిళ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తూ తాజాగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి కూడా అడుగుపెట్టారు. తాజాగా అక్కా అనే వెబ్ సిరీస్‌లో నటి రాధిక ఆప్టేతో కలిసి నటించారు. ధనరాజ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ షూటింగ్ కోసం కేరళలో మకాం పెట్టిన కీర్తి సురేష్ తాజాగా తన ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. దాదాపు 40 రోజులు వనవాసం పూర్తి చేసి ఇప్పుడే సోషల్ మీడియాలోకి తిరిగివచ్చానని రాసుకొచ్చారు. అక్కా వెబ్ సిరీస్‌లో నటించడం చాలా సంతోషంగా ఉన్నారు. ఈ షెడ్యూల్‌ని ముగించుకుని ఇంటికి తిరిగిరావడం సరి కొత్త అనుభూతిగా ఉందని పేర్కొన్నారు. ఇకపై ఇతర మూవీ షూటింగ్‌లకు హాజరవుతానని తెలిపారు. కాగా.. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తమిళంలో రఘు తాత, రివాల్వర్ రీటా, కన్నివెడీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ మూడు ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలు కావడం విశేషం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. చివరి చిత్రం డైరెక్టర్‌గా ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్‌లో వినిపిస్తున్నాయి. వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్‌తో పాటు, వెట్రిమారన్, కార్తీక్‌సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్‌తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్‌కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్‌గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే. -
సైలెంట్‌గా ఓటీటీకి యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హిందీ వర్షన్లో హర్షవర్ధన్ రాణే, ఎహాన్ భట్ హీరోలుగా నటించారు. మార్చి 1న థియేటర్లలో పోర్ మూవీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెల రోజులు కూడా కాకముందే ఓటీటీకి వచ్చేసింది. అయితే కేవలం తమిళం, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో తీసుకొచ్చే అవకాశముంది. కాలేజీ స్టూడెంట్స్ లవ్ స్టోరీస్, గొడవలు, సరదాల కాన్సెప్ట్‌తో దర్శకుడు బిజోయ్ నంబియార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. గతంలో అర్జున్ దాస్ లోకేష్ కనకరాజ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు.. ఖైదీలో విలన్ గ్యాంగ్‌లో పనిచేసే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఆ తర్వాత విజయ్ మాస్టర్‌తో పాటు కమల్‌హాసన్ విక్రమ్‌లోనూ అర్జున్ దాస్ కనిపించారు. -
భిన్నమైన కాన్సెప్ట్‌తో వస్తోన్న చిత్రం.. రిలీజ్ ఎప్పుడంటే?
జీవితాల్లోని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాల్లో జీవం ఉంటుంది. అలాంటి కథలకు కాస్త సినిమా టిక్ సన్నివేశాలను కలిపితే అది మరింత జనరంజక చిత్రంగా మారుతుంది. ఈ తరహా చిత్రాలకు పెద్దగా క్యాస్టింగ్ గురించి పట్టించుకోరు. కథ, కథనాలు బిగువుగా ఉంటే చాలు.. అలాంటి కథాంశంతో తెరకెక్కిన చిత్రం వెప్పమ్ కుళీర్ మళై. హాష్ ట్యాగ్ ఎఫ్డీఎఫ్ఎస్ పతాకంపై ధీరవ్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ఇస్మత్ భాను హీరోయిన్గా పరిచయమవుతోంది. పస్కల్ వేదముత్తు ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యంగా పిల్లల పుట్టుక గురించి ఆవిష్కరించిన చిత్రమిది. పెళ్లి తరువాత ఆ దంపతులకు పిల్లలు పుట్టక పోతే కుటుంబ సభ్యుల నుంచి, ఊరు జనం వరకూ ఎలాంటి అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఆధునిక సమాజంలో ప్రకృతికి విరుద్ధంగా కలిగి సంతానం కారణంగా ఎలాంటి మనోవేదనకు గురవుతారు? వంటి అంశాలను, సహజ సిద్ధంగా పిల్లలు పుట్టడానికి కారణాలు అంటూ పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రమే వెప్పమ్ కళీర్ మళై. ఈ సినిమాలో ఎంఎస్ భాస్కర్, నటి రమ, మాస్టర్ కార్తీకేయన్, దేవ్హబిబుల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శంకర్ రంగరాజన్ సంగీతాన్ని, పృధ్వీ రాజేంద్రన్ ఛాయాగ్రహణం అందించారు. దర్శకుడు ఒక గ్రామీణ నేపథ్యాన్ని తీసుకుని వైవిధ్యంగా తెరకెక్కించారు. ఆధ్యంతం ఆసక్తిని రేకెత్తించేలా రూపొందిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. -
హీరో డైరెక్షన్లో నటించనున్న స్టార్ హీరోయిన్..!
కోలీవుడ్ నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార పచ్చజెండా ఊపారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది. సుబ్రమణ్యపురం చిత్రం ద్వారా కథానాయకుడు, దర్శకుడిగా పరిచయమైన శశికుమార్ ఆ తరువాత నాడోడిగళ్ చిత్రంలో నటించారు. ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించడంతో శశికుమార్ హీరోగా స్థిరపడిపోయారు. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఈయన ఈ మధ్య కథానాయకుడిగా నటించిన అయోథి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఇక నటి నయనతార విషయానికి వస్తే లేడీ సూపర్‌స్టార్‌గా ఆమె రాణిస్తున్నారు. ఇటీవల జవాన్ చిత్రంతో బాలీవుడ్‌లోనూ విజయాన్ని అందుకున్నారు. గతేడాది ఆమె ఎన్నో అంచనాలు పెట్టుకున్న తన 75వ చిత్రం అన్నపూరణి తీవ్ర నిరాశ పరిచింది. అంతే కాకుండా వివాదాల్లో చిక్కుకుని కేసుల వరకూ వెళ్లి ఓటీటీలో నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా.. నయన్‌కు అవకాశాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే విజయాలే ముఖం చాటేస్తున్నాయి. ప్రస్తుతం టెస్ట్ అనే క్రికెట్ నేపథ్యంలో సాగే చిత్రంతో పాటు మన్నాంగట్టి అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా తాజాగా నటుడు శశికుమార్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్త సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరలవుతోంది. ఇదీ హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నయనతార పాత్ర చాలా బలంగా ఉంటుందని తెలిసింది. ఈ చిత్రానికి శశికుమార్ దర్శకత్వం మాత్రమే చేయనున్నట్లు.. నటన జోలికి వెళ్లడం లేదని సమాచారం. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్‌ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్‌గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్‌బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఆ సూపర్ హిట్ కాంబో.. మళ్లీ రిపీట్ చేస్తామంటోన్న మేకర్స్!
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సూర్యకు నిర్మాతగానూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2డీ ఎంటర్‌టైయిన్‌మెంట్ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా సూర్య హీరోగా గతంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబో రిపీట్ కాబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఇందులో సూర్యతో పాటు, దుల్కర్ సల్మాన్, విజయ్‌వర్మ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. నటి నజ్రియా నాయకిగా నటించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత సూర్య, దర్శకురాలు సుధా కొంగర సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పురనానూరు చిత్రానికి అదనంగా సమయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తాము కలిసి పని చేయడం చాలా ప్రత్యేకమన్నారు. ఇది తమ మనసులను హత్తుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. మీకు మంచి చిత్రాన్ని అందించాలని పని చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో నటుడు సూర్య పురనానూరు చిత్రానికి ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
వైవిధ్యభరిత కథాంశంతో వస్తోన్న సరికొత్త థ్రిల్లర్ మూవీ..!
వైవిధ్యభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'వన్స్ అప్పాన్ ఏ టైమ్ మద్రాస్'. ఫ్రైడే ఫిలిం ఫాక్టరీ కెప్టెన్ ఆనంద్, బాలా, ట్రీమ్ హౌస్ హరున్, పీజీఎస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హైపన్ లూప్ విధానంలో రూపొందుతున్న థ్రిల్లర్ కథా చిత్రమని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో భరత్, షాన్, రాజాజీ హీరోలుగా, విరుమాండి అభిరామి, అంజలి నాయర్, పవిత్రాలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మానవ జీవితంలో సందర్భమే హీరో, విలన్ అని పేర్కొన్నారు. ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో మనిషి చేతికి వస్తుందన్న దాన్ని బట్టి.. ఆయుధాన్ని అతను మంచికి ఉపయోగిస్తాడా? లేదా చెడుకోసం వాడతాడా? అన్న దాన్ని బట్టే అతని జీవితం ఉంటుందన్నారు. అలా నలుగురి చేతికి అనూహ్యంగా ఒక తుపాకీ వస్తుందన్నారు. వేర్వేరు జీవన విధానంతో పయనించే ఆ నలుగురు వ్యక్తుల చేతుల్లో ఆ తుపాకీ ఎలా మారుతుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం కథ సాగుతుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో కన్నిక, తలైవాసల్ విజయ్, అరుళ్ టి.శంకర్, పోర్కొడి, పీజీఎస్, కల్కి, సయద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాళిదాస్, కన్నన్ ద్వయం ఛాయాగ్రహణం, నడునల్వాడై చిత్రం ఫేమ్ జోస్ ప్రాంక్లిన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. -
72 గంటల పాటు షూటింగ్.. చాలా కష్టాలు పడ్డాం: సలార్ నటుడు
పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాళ చిత్రం ఆడుజీవితం. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అమలాపాల్ హీరోయిన్గా నటించిది. ఈ సినిమా ది గోట్ లైఫ్ అనే పేరుతో ఇంగ్లీష్‌లోనూ విడుదల కానుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పృథ్వీ రాజ్ మాట్లాడుతూ.. 'ఇందులో నేను నజీబ్ అనే బానిస పాత్రలో నటించా. దాని కోసమే 31 కిలోలు బరువు తగ్గా. జిమ్ ట్రైనర్, పోషకాహార నిపుణులు, డాక్టర్స్ పర్యవేక్షణలో ఇదంతా చేశా. వారంతా విశ్రాంతి తీసుకోమని నాకు సలహాలు ఇచ్చేవారు. కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్‌లోనే ఉండాల్సి వచ్చేది. కరోనా లాక్‌డౌన్‌తో చిత్రబృందం చాలా ఇబ్బందులు పడింది. పశ్చిమాసియాలోని జోర్డాన్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు. ఈ సినిమా కోసం మేం చాలా కష్టపడ్డాం. వీటిని మీతో పంచుకునేందుకు ఇదే సరైన సమయమని భావించా. అందుకే చెప్పాను' అని అన్నారు. కాగా.. ప్రభాస్ నటించిన సలార్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన సంగతి తెలిసిందే. -
నా బాధలు చెప్పుకోవడానికి ఎవరూ లేరు: స్టార్ హీరో ఎమోషనల్
కోలీవుడ్‌లో స్వయం కృషితో స్టార్‌గా ఎదిగిన నటుడు శివ కార్తికేయన్. ఒక టీవీ యాంకర్‌గా కెరియర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత నటుడిగా పరిచయమై సపోర్టింగ్ పాత్రలు చేస్తూ ఆపై హీరోగా ఎదిగారు. ధనుశ్ కథానాయకుడిగా నటించిన మూడో చిత్రంలో శివ కార్తికేయన్ ఆయనకు ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మనం కొత్తి పరవై చిత్రం ద్వారా హీరోగా అవతారం ఎత్తారు. అలా ఇప్పటికి 20 చిత్రాల్లో కథానాయకుడుగా నటించారు. ఇందులో పలు చిత్రాలు సూపర్ హిట్ కాగా అభిమానులు మెచ్చిన స్టార్‌గా ఎదిగారు. తాజాగా నటిస్తున్న 21వ చిత్రం అమరన్. నటి సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇందులో శివ కార్తికేయన్ సైనిక కమెండోగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం చాలా కసరత్తులు చేశారు. చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్ర ఓటీటీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ రూ.60 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషం. శివ కార్తికేయన్ నటించిన చిత్రాలన్నింటిలో అత్యధిక మొత్తానికి ఓటీటీ హక్కులు అమ్ముడుపోయిన చిత్రం ఇదే కానుంది. ఇంతకుముందే శివ కార్తికేయన్ నటించిన మావీరన్ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ రూ.33 కోట్లు చెల్లించింది. దీంతో అమరన్ చిత్రంపై అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. శివ కార్తికేయన్ ఆదివారం తన అభిమానులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ ‘మీరు దేని గురించి ఆలోచించకండి. మీ కోసం నేనున్నాను. నాకు అంతా మీరే. జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నా. వాటి బాధ ఉంటుంది. కొన్ని మీకు తెలిసినా, చాలా విషయాలు తెలియదు. సమస్యలు చెప్పుకోవడానికి నాకు నాన్న లేరు. సపోర్ట్ చేయడానికి అన్నయ్య లేరు. నాకిప్పుడు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అయినా అంతా మీరే’. అంటూ నటుడు శివకార్తికేయన్ భావోద్వేగానికి గురయ్యారు. -
ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్, కాళిదాస్ జయరామ్ నటించిన తాజా చిత్రం పోర్. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్, మెర్విన్ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్, రూక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్, డేవిడ్, వాజీర్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌దాస్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే కాళిదాస్ జయరామ్ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్ దాస్ పేర్కొన్నారు. -
'నువ్వు ప్రపోజ్ చేసిన క్షణం.. కళ్లార్పకుండానే': సీనియర్ హీరోయిన్
సీనియర్ నటి ఖుష్బు దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలతో మెప్పించింది. 1990లో సౌత్‌లోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ స్టార్ హీరోల సినిమాల్లో మెప్పించింది. కాగా.. 1995లో మురై మామన్ చిత్రంలో నటిస్తుండగానే డైరెక్టర్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాద ఐదేళ్లకు మార్చి 9న 2000 ఏడాదిలో దర్శకుడు సుందర్‌ను పెళ్లాడింది. ప్రస్తుతం ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే తాజాగా తన మధురమైన జ్ఞాపకాలను పంచుకుంది. తన భర్త ప్రపోజ్ చేసిన తేదీని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఆయన ప్రపోజ్ చేసిన రోజు నుంచి ఇప్పటివరకు నా జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని పోస్ట్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో మీరు ప్రపోజ్ చేయగానే ఎలాంటి ఆలోచన లేకుండా అంగీకరించానని రాసుకొచ్చింది. 29 ఏళ్ల క్రిత నేను తీసుకున్న ఆ నిర్ణయం అత్యుత్తమమని ఖుష్బు ఎమోషనలయ్యారు. ఖుష్బు తన ట్వీట్లో రాస్తూ..'22 ఫిబ్రవరి 1995 నుంచి.. 22 ఫిబ్రవరి 2024 వరకు ఏమీ మారలేదు. కేవలం నా వయసు మాత్రమే పెరిగింది అంతే. మీలో ఉప్పు, మిరియాల సువాసన అలానే ఉంది. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం.. మన తప్పులను అంగీకరించడం.. ఒకరినొకరు ప్రోత్సహించడం. ఆపద సమయంలో అండగా నిలవడం. ఒకరి చేయి ఒకరం పట్టుకుని.. మన అందమైన కుటుంబాన్ని నిర్మించే మార్గంలో నడుస్తున్నాం. మీరు నాకు ప్రపోజ్ చేసి ఈ రోజుకు 29 సంవత్సరాలైంది. ఎలాంటి కెమెరాలు, ఫోటోలు, సోషల్ మీడియా లేని రోజుల్లో నీ ప్రేమను అంగీకరించా. ఒక్కసారి ఆలోచించకుండా.. కను రెప్పవేయకుండానే ఓకే చెప్పా. కొన్నిసార్లు ఉత్తమ నిర్ణయాలు గట్స్ ఫీలింగ్‌తో తీసుకోబడతాయి. ఈ రోజు మీరు అది నిరూపించారు. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. మీ ప్రపోజల్‌ను అంగీకరించడం నా జీవితంలోనే అత్యుత్తమ నిర్ణయం. నీపై 29 ఏళ్ల క్రితం మొదలైన ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది.' అంటూ పోస్ట్ చేసింది. కాగా.. ఖుష్బు గతేడాది తెలుగులో గోపించంద్ చిత్రం రామబాణంలో కనిపించింది. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు. అందువల్లే సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో అగ్ర దర్శకుల్లో ఒకరైన దర్శకుడు సుందర్ తమిళంలో 32 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు. అంతే కాదు 20కి పైగా సినిమాల్లో నటించారు. ఉల్లతై అల్లిత, అరుణాచలం, అన్బే శివం, విన్నర్, గిరి, కలకలప్పు, తీయ వేళై సెయ్యనుం కుమారు, అరణ్మనై, అంబాల, వంత రాజావతాన్ వరువేన్ సినిమాలు చేశారు. From then on, 22nd Feb 1995, to now, 22 Feb 2024, nothing has changed. Except that I have grown older and you have salt n pepper sauciness now. The love, respect for each other, accepting each other with our minuses, encouraging each other to give and do our best. Standing by… pic.twitter.com/j0H5DNzuXP — KhushbuSundar (@khushsundar) February 21, 2024 -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్‌తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్‌లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్‌లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024