వైవిధ్యభరిత కథాంశంతో రూపొందుతున్న చిత్రం 'వన్స్ అప్పాన్ ఏ టైమ్ మద్రాస్'. ఫ్రైడే ఫిలిం ఫాక్టరీ కెప్టెన్ ఆనంద్, బాలా, ట్రీమ్ హౌస్ హరున్, పీజీఎస్ ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రశాంత్ మురుగన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది హైపన్ లూప్ విధానంలో రూపొందుతున్న థ్రిల్లర్ కథా చిత్రమని డైరెక్టర్ చెప్పారు. ఈ సినిమాలో భరత్, షాన్, రాజాజీ హీరోలుగా, విరుమాండి అభిరామి, అంజలి నాయర్, పవిత్రాలక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
మానవ జీవితంలో సందర్భమే హీరో, విలన్ అని పేర్కొన్నారు. ఆయుధం ఎలాంటి పరిస్థితుల్లో మనిషి చేతికి వస్తుందన్న దాన్ని బట్టి.. ఆయుధాన్ని అతను మంచికి ఉపయోగిస్తాడా? లేదా చెడుకోసం వాడతాడా? అన్న దాన్ని బట్టే అతని జీవితం ఉంటుందన్నారు. అలా నలుగురి చేతికి అనూహ్యంగా ఒక తుపాకీ వస్తుందన్నారు.
వేర్వేరు జీవన విధానంతో పయనించే ఆ నలుగురు వ్యక్తుల చేతుల్లో ఆ తుపాకీ ఎలా మారుతుంది? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రం కథ సాగుతుందన్నారు. చిత్ర షూటింగ్‌ను చైన్నె పరిసర ప్రాంతాలో నిర్వహించి పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు దర్శకుడు తెలిపారు. ఈ చిత్రంలో కన్నిక, తలైవాసల్ విజయ్, అరుళ్ టి.శంకర్, పోర్కొడి, పీజీఎస్, కల్కి, సయద్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కాళిదాస్, కన్నన్ ద్వయం ఛాయాగ్రహణం, నడునల్వాడై చిత్రం ఫేమ్ జోస్ ప్రాంక్లిన్ సంగీతాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment