ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే? | POR Movie Official Trailer Released At Prasad Labs In Chennai | Sakshi
Sakshi News home page

POR Movie: కళాశాల నేపథ్యంలో వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?

Published Wed, Feb 28 2024 3:20 PM | Last Updated on Wed, Feb 28 2024 3:32 PM

POR Movie Official Trailer Released at Prasad labs In Chennai - Sakshi

కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్‌, కాళిదాస్‌ జయరామ్‌ నటించిన తాజా చిత్రం పోర్‌. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్‌, మెర్విన్‌ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్‌, రూక్స్‌ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్‌ నంబియార్‌ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్‌, డేవిడ్‌, వాజీర్‌ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్‌ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

అర్జున్‌దాస్‌ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే  కాళిదాస్‌ జయరామ్‌ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్‌లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్‌ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్‌గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్‌ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్‌ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్‌ దాస్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement