Kalidas Jayaram
-
కాళిదాస్ వెడ్డింగ్ రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి (ఫొటోలు)
-
మోడల్ని పెళ్లి చేసుకున్న నటుడు జయరామ్ కొడుకు (ఫొటోలు)
-
సింపుల్‌గా గుడిలో పెళ్లి చేసుకున్న యంగ్ హీరో
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరామ్ కొడుకు కాళిదాస్ పెళ్లి జరిగింది. తమిళంలో హీరోగా, నటుడిగా పేరు తెచ్చుకున్న ఇతడు.. గత కొన్నాళ్లుగా తరణి అనే మోడల్ని ప్రేమిస్తున్నాడు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు. కేరళలలోని గురవాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం సింపుల్‌గా పెళ్లి జరిగిపోయింది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా)'అల వైకుంఠపురములో', 'గుంటూరు కారం' తదితర చిత్రాల్లో నటించిన జయరామ్ కొడుకు కాళిదాస్ జయరామ్ కూడా నటుడే. రీసెంట్గా ధనుష్ తీసిన 'రాయన్' మూవీలో కీలక పాత్రలో కాళిదాస్ నటించాడు. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. గత కొన్నిరోజులు తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నాడు.గురువారం సాయంత్రం చైన్నెలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు హాజరవ్వడం విశేషం. ఇక కాళిదాస్ పెళ్లాడిన తరణి విషయానికొస్తే.. స్వతహాగా మోడల్ అయిన ఈమె ఫ్యాషన్ షోలు, యాడ్స్ చేస్తోంది. మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?) -
ప్రముఖ నటుడు జయరామ్ ఇంట పెళ్లి సందడి
నటుడు జయరామ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈయన మలయాళ నటుడే అయినా, తెలుగు, తమిళం తదితర భాషల్లోనూ సుపరిచితుడే. కథానాయకుడిగా పలు చిత్రాల్లో నటించినా, ఆ తరువాత వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో ఈయన పోషించిన హాస్యపాత్ర అందరినీ అలరించింది. తెలుగులోనూ అల వైకుంఠపురం వంటి చిత్రాల్లో నటించారు. ఇకపోతే ఈయన భార్య పార్వతి కూడా నటినేన్నది గమనార్హం. పలు మలయాళ చిత్రాల్లో నటించారు. అంతే కాకుండా ఈమె ప్రముఖ నృత్యకళాకారిణిగా మెప్పించారు. వీరి కుమారుడు కాళిదాస్ జయరామ్ కూడా వర్ధమాన నటుడిగా రాణిస్తున్నారు. కాగా కాళిదాస్ జయరామ్ ఇప్పుడు పెళ్లి కొడుకు అవుతున్నారు. ధారణి అనే చిరకాల ప్రేమికురాలితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. వీరి పెళ్లి డిసెంబర్ 8న ఆదివారం గురువాయూర్ ఆలయంలో జరగనుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం చైన్నెలో వీరి ఫ్రీ వెడ్డింగ్ వేడుక నిర్వహించారు. కాళిదాస్ జయరామ్, ధారణిల వివాహానికి ఇప్పటికే ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్, రజనీకాంత్, దర్శకుడు మణిరత్నం వంటి ప్రముఖులకు జయరామ్ దంపతులు శుభలేఖలను అందించి, ఆహ్వానించారన్నది గమనార్హం. నటుడు కాళిదాస్ ఇటీవల నటుడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించిన రాయన్ చిత్రంలో ఆయనకు తమ్ముడిగా ముఖ్యపాత్రను పోషించారన్నది గమనార్హం. ఇకపోతే ధారణి కూడా తన కళాశాల కాలం నుంచే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించారు. ఫ్యాషన్ షోలు, వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో రన్నర్ అప్‌గా నిలిచారు. కాగా కొన్నేళ్లుగా నటుడు కాళిదాస్, ధారణిలు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి ఇరుకుటుంబ పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల 8వ తేదీన పెళ్లి జరగనుంది. వీరి వివాహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. -
సైలెంట్‌గా ఓటీటీకి యాక్షన్ ఎంటర్టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కోలీవుడ్ యంగ్ హీరో అర్జున్ దాస్ నటించిన చిత్రం పోర్. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు బిజోయ్ నంబియార్ దర్శకత్వంలో తెరకెక్కించారు. తమిళంతో పాటు హిందీలో ఏకకాలంలో నిర్మించారు. తమిళంలో అర్జున్ దాస్, కాళిదాస్ జయరామ్ కీలక పాత్రలు పోషించారు. హిందీ వర్షన్లో హర్షవర్ధన్ రాణే, ఎహాన్ భట్ హీరోలుగా నటించారు. మార్చి 1న థియేటర్లలో పోర్ మూవీ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. హిందీలో డంగే పేరుతో రిలీజ్ చేశారు. తాజాగా ఈ చిత్రం ఓటీటీకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. శుక్రవారం నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెల రోజులు కూడా కాకముందే ఓటీటీకి వచ్చేసింది. అయితే కేవలం తమిళం, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే మరిన్ని భాషల్లో తీసుకొచ్చే అవకాశముంది. కాలేజీ స్టూడెంట్స్ లవ్ స్టోరీస్, గొడవలు, సరదాల కాన్సెప్ట్‌తో దర్శకుడు బిజోయ్ నంబియార్ ఈ మూవీని తెరకెక్కించారు. కాగా.. గతంలో అర్జున్ దాస్ లోకేష్ కనకరాజ్ సినిమాతో ఫేమ్ తెచ్చుకున్నారు.. ఖైదీలో విలన్ గ్యాంగ్‌లో పనిచేసే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా మెప్పించారు. ఆ తర్వాత విజయ్ మాస్టర్‌తో పాటు కమల్‌హాసన్ విక్రమ్‌లోనూ అర్జున్ దాస్ కనిపించారు. -
ద్వి భాషా చిత్రంగా వస్తోన్న పోర్.. రిలీజ్ ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్స్ అర్జున్‌దాస్, కాళిదాస్ జయరామ్ నటించిన తాజా చిత్రం పోర్. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో డీజే భాను, సంజనా నటరాజన్, మెర్విన్ రోజారియో ప్రధాన పాత్రలు పోషించారు. టీ సిరీస్, రూక్స్ మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి బిజాయ్ నంబియార్ దర్శకత్వం వహించారు. ఆయన గతంలో సైతాన్, డేవిడ్, వాజీర్ వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పోర్ మార్చి 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అర్జున్‌దాస్ మాట్లాడుతూ.. ఈ చిత్ర కథను దర్శకుడు తనకు ఒక హోటల్లో చెప్పారన్నారు. అంతకుముందే కాళిదాస్ జయరామ్ ఎంపికయ్యారని చెప్పారు. ఇది కళాశాల నేపథ్యంలో సాగే వైవిధ్యమైన కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో కొంచెం స్నేహం సన్నివేశాలు చోటు చేసుకుంటాయన్నారు. ఈ చిత్రంలో నటించిన దర్శకుడు తమకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని చెప్పారు. సాధారణంగా రెండు భాషల్లో రూపొందించే చిత్రాల షూటింగ్లో ఒక భాషలో నటించే నటులకు మరో భాషా సన్నివేశాలను చూపించరన్నారు. అయితే ఈ చిత్ర దర్శకుడు హిందీ వెర్షన్ సన్నివేశాలను చూసే అవకాశం కల్పించడంతో తాను మరింత పర్ఫెక్ట్గా నటించినట్లు చెప్పారు. కాళిదాస్ జయరామ్‌తో మళ్లీ కలిసి నటిస్తానా అనేది సందేహామే అన్నారు. ఆయన కెమెరా ముందుకు వచ్చేవరకు అందరితోనూ ఎంతో సరదాగా ఉంటారని అంత జోవియల్ వ్యక్తి అని చెప్పారు. మంచి స్నేహశీలి అని కూడా అర్జున్ దాస్ పేర్కొన్నారు. -
చిన్న సినిమా.. కానీ నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్!
కాళిదాస్ జయరాం హీరోగా నటించిన మూవీ 'అవళ్ పేర్ రజినీ'. తమిళ, మలయాళ భాషల్లో తీసిన ఈ చిత్రాన్ని నవరస ఫిలిమ్స్ పతాకంపై శ్రీజిత్ కేఎస్, జెస్సీ శ్రీజిత్ నిర్మించారు. వినీల్ స్కరియా వర్గీస్ దర్శకత్వం వహించగా.. నమిత ప్రమోద్, రెబా మోనికా జాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. నలుగురు సంగీత దర్శకులు పని చేసిన ఈ మూవీకి పనిచేయడం విశేషం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తాజాగా చెన్నైలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా 'లియో' డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ వచ్చారు. ట్రైలర్ బాగుందని, చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నట్లు లోకేశ్ చెప్పకొచ్చాడు. హీరో కాళిదాస్ జయరామ్ మాట్లాడుతూ.. ఇదే వేదికపైకి కమలహాసన్ తనని చేయిపట్టుకుని తీసుకొచ్చి పరిచయం చేశారని అన్నాడు. 'విక్రమ్'లో అవకాశమిచ్చినందుకు డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌కి ధన్యవాదాలు చెప్పాడు. కొత్త మూవీలో తాను ఇప్పటి వరకు చేయని పాత్రను ఇందులో పోషించినట్లు కాళిదాస్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి ఆ తెలుగు సినిమా!)