
తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయరామ్ కొడుకు కాళిదాస్ పెళ్లి జరిగింది. తమిళంలో హీరోగా, నటుడిగా పేరు తెచ్చుకున్న ఇతడు.. గత కొన్నాళ్లుగా తరణి అనే మోడల్‌ని ప్రేమిస్తున్నాడు. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఒక్కటయ్యారు. కేరళలలోని గురవాయూర్ ఆలయంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆదివారం ఉదయం సింపుల్‌గా పెళ్లి జరిగిపోయింది.
(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలో రిలీజైన తెలుగు డబ్బింగ్ సినిమా)
'అల వైకుంఠపురములో', 'గుంటూరు కారం' తదితర చిత్రాల్లో నటించిన జయరామ్ కొడుకు కాళిదాస్ జయరామ్ కూడా నటుడే. రీసెంట్‌గా ధనుష్ తీసిన 'రాయన్' మూవీలో కీలక పాత్రలో కాళిదాస్ నటించాడు. అప్పుడప్పుడు హీరోగానూ పలు చిత్రాలు చేస్తున్నాడు. గత కొన్నిరోజులు తన పెళ్లి గురించి ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూనే ఉన్నాడు.
గురువారం సాయంత్రం చైన్నెలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరగ్గా.. పలువురు సెలబ్రిటీలు హాజరవ్వడం విశేషం. ఇక కాళిదాస్ పెళ్లాడిన తరణి విషయానికొస్తే.. స్వతహాగా మోడల్ అయిన ఈమె ఫ్యాషన్ షోలు, యాడ్స్ చేస్తోంది. మిస్ తమిళనాడు, మిస్ సౌత్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్‌గా నిలిచింది.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8: రోహిణి ఎలిమినేట్.. ఎన్ని లక్షలు సంపాదించింది?)



Comments
Please login to add a commentAdd a comment