పాపులర్ యూట్యూబర్, తమిళ నటుడు ఎరుమసాని విజయ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. తన ప్రేయసి, మోడల్ నక్షత్రతో ఏడడుగులు నడిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫ్యాషన్ డిజైనర్‌గానూ రాణిస్తున్న నక్షత్రతో కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నాడు విజయ్. వీరిద్దరి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు.
ఇటీవలే వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. తాజాగా గ్రాండ్‌గా వివాహం జరగ్గా పలువురు సెలబ్రిటీలు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎంగేజ్‌మెంట్ దగ్గరి నుంచి పెళ్లి వరకు ప్రతి ఈవెంట్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు నటుడు. కాగా విజయ్‌కు ఎరుమై సాని అని సొంత యూట్యూబ్ ఛానల్ ఉంది. ఇందులో అతడు రకరకాల వీడియోలు పోస్ట్ చేస్తూ విశేష అభిమానులను సంపాదించుకున్నాడు.
హిప్ హాప్ ఆది డైరెక్ట్ చేసిన 'మీసై మురుకు' చిత్రంతో నటుడిగా వెండితెరపై రంగప్రవేశం చేశాడు. తర్వాత నాన్ సిరితాల్ సినిమాలో నటించాడు. అనంతరం డీ బ్లాక్ చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఇందులో అరుళ్ నిధి, అవంతిక మిశ్ర హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో అరుళ్ నిధి ఫ్రెండ్ పాత్రలోనూ మెరిశాడు విజయ్.
చదవండి: ఉదయ్‌కిరణ్ డెత్ మిస్టరీ.. అమాయకుల్లా నటిస్తున్నారే: తేజ
Comments
Please login to add a commentAdd a comment