పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్ Comedian Premgi wedding And Bride Details | Sakshi
Sakshi News home page

Premgi: 45 ఏళ్ల కమెడియన్ పెళ్లి సందడి.. అమ్మాయి ఎవరంటే?

Published Sat, Jun 8 2024 9:04 PM | Last Updated on Sat, Jun 8 2024 9:14 PM

Comedian Premgi wedding And Bride Details

ప్రముఖ కమెడియన్ కమ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్‌గీ పెళ్లి చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. జూన్ 9న తిరుత్తణి గుడిలో పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రేమ్ గీ సోదరుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు.

(ఇదీ చదవండి: బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!)

తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుకి సోదరుడే ప్రేమ్ గీ. ఇతడి ప్రస్తుత వయసు 45 ఏళ్లు. కానీ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాడు. అలాంటిది కొన్నాళ్ల ముందు ప్రేమ్ గీ పెళ్లి చేసుకోబోతున్నాడని న్యూస్ వచ్చింది. చాలామంది దీన్ని రూమర్ ఏమో అనుకున్నారు. కానీ వెడ్డింగ్ కార్డ్ బయటకొచ్చేసరికి నిజమని తేలింది. అమ్మాయి పేరు ఇందు అని తప్పితే ఇంకే వివరాలు ప్రస్తుతానికైతే లేదు. తాజాగా జరిగిన పెళ్లి వేడుకకు యువ హీరోలు జై, వైభవ్ తదితరులు హాజరయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement