స్టార్‌ హీరోలతో యాక్టింగ్‌.. ఆ కమెడియన్‌ ఇలా అయిపోయాడేంటి! | Actor Janagaraj Latest Look is Unrecognisable | Sakshi
Sakshi News home page

బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్‌ కమెడియన్‌

Published Wed, May 8 2024 7:23 PM | Last Updated on Wed, May 8 2024 7:57 PM

Actor Janagaraj Latest Look is Unrecognisable

కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్‌ జనగరాజ్‌ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్‌, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!

కామెడీ రోల్స్‌తో..
మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్‌తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి స్టార్స్‌తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్‌ స్పీడులో మూవీస్‌ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.

ఇండస్ట్రీకి దూరం
తెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్‌ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్‌ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్‌ ఫిలింలో నటించాడు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడు
ఈ షార్ట్‌ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్‌ ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్‌ హీరోయిన్‌.. ఒంటరినే అంటూ పోస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement