comedian
-
'మిస్ యూ మై సన్'.. ప్రముఖ టాలీవుడ్ కమెడియన్ తీవ్ర భావోద్వేగం!
ప్రముఖ తెలుగు లేడీ కమెడియన్, కితకితలు హీరోయిన్ గీతాసింగ్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో గీతా సింగ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సరిగ్గా రెండేళ్ల క్రితం చేతికి అందివచ్చిన కుమారుడిని కోల్పోయిన గీతాసింగ్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఫిబ్రవరి 18న తన కుమారుడి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించింది. తన కొడుకు తనతో ఉన్న క్షణాలను గుర్తు చేసుకుంటూ.. మిస్ యూ రా అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. (ఇది చదవండి: కమెడియన్ గీతాసింగ్ ఇంట విషాదం)అయితే.. గీతాసింగ్ ఇప్పటివరకు అసలు పెళ్లే చేసుకోలేదు. తన సోదరుడి కుమారులను దత్తత తీసుకుని పోషిస్తున్నారు. వారిలో పెద్దబ్బాయి ఈ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇకపోతే కితకితలు, ఎవడిగోల వాడిది సినిమాలో గీతా సింగ్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దాదాపు 50కి పైగా చిత్రాలు చేసింది. ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటోంది. View this post on Instagram A post shared by Geeta Singh (@kithakithalu_geetasingh) -
అంపశయ్యపై MS నారాయణ.. చివరి క్షణాల్లో ఏం జరిగిందంటే?: బ్రహ్మానందం
కమెడియన్స్ చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకుంటాం. అయితే కొందరు హాస్యనటులు సినిమా తర్వాత కూడా మనల్ని వెంటాడుతూ ఉంటారు. వారి డైలాగులు, అవాక్కులు-చవాక్కులు, హావభావాలు గుర్తు చేసుకుని మనలో మనం కాసేపు నవ్వుకుంటూ ఉంటాం. అలా తెలుగువారి మనసులో చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ హాస్యనటుల్లో ఎమ్మెస్ నారాయణ (MS Narayana) ఒకరు. ఈయనకు హాస్య బ్రహ్మ, మీమ్ గాడ్ బ్రహ్మానందానికి మధ్య ఆత్మీయ అనుబంధం ఉంది.చివరి స్టేజీలో నాకోసం పరితపించాడుతాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బ్రహ్మానందం (Brahmanandam).. ఎమ్మెస్ నారాయణతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఎమ్మెస్ నారాయణ మంచానపడి అంతిమ ఘడియలకు దగ్గరవుతున్నప్పుడు ఆయన మెదడులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. తనకు ఎంతోమంది తెలుసు. రక్తసంబంధాలు, స్నేహసంబంధాలు ఎన్నో ఉన్నాయి. అయినా సరే చివరి స్టేజీలో ఉన్నప్పుడు నన్ను చూడాలనుకున్నాడు. నన్నెలాగైనా కలుసుకోవాలనుకున్నాడు.చెప్పాపెట్టకుండా వెళ్లిపోయా..మాట్లాడలేని స్థితిలో ఉన్న నారాయణ.. అతడి కూతుర్ని పిలిచి తెల్లకాగితం అడిగాడు. దానిపై బ్రహ్మానందం అన్నయ్యను చూడాలనుంది అని రాశాడు. అది చదివిన అమ్మాయి నాకు వెంటనే ఫోన్ చేసింది. అప్పుడు నేను గోపీచంద్ 'ఆరడుగుల బుల్లెట్' సినిమా షూటింగ్లో ఉన్నాను. శంషాబాద్‌లో షూటింగ్.. సడన్‌గా నేను వెళ్లాలి అని చెప్తే దర్శకుడు ఒప్పుకోకపోతే? ఎలా అన్న సంకోచం.. అందుకే ఎవరికి చెప్పకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోయాను.అదే ఆఖరి రోజునన్ను చూడగానే అంపశయ్యపై పడుకున్న ఎమ్మెస్ నారాయణ కళ్ల వెంట నీళ్లు కారాయి. అది ఎన్నటికీ మర్చిపోలేను. నన్ను చూసి నా చేయి గట్టిగా పట్టుకుని వదిలేశాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కాసేపటికి మళ్లీ కళ్లు తెరిచాడు. డబ్బు గురించి ఆలోచించొద్దని, ఎంతైనా పర్వాలేదు, నా మిత్రుడిని బతికించండని డాక్టర్స్‌ను కోరాను. ఇప్పటికీ మింగుడుపడదుషూటింగ్ మధ్యలో వచ్చేశానని, మళ్లీ వీలు చూసుకుని వస్తానని అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను. తిరిగి షూటింగ్‌కు వెళ్తుండగా మార్గమధ్యలోనే ఆయన మరణించారన్న వార్త వచ్చింది. అంతటి మేధావి తక్కువ వయసులో మమ్మల్ని వదిలి వెళ్లిపోవడం నాకిప్పటికీ మింగుడుపడదు అని బ్రహ్మానందం చెప్పుకొచ్చారు. ఎమ్మెస్ నారాయణ (63).. 2015 జనవరి 23న అనారోగ్యంతో మరణించారు.చదవండి: 'ఛావా' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
పెళ్లి సమయంలో భారీగా ట్రోల్స్.. ఇప్పుడు గుడ్‌న్యూస్‌తో సీరియల్ నటి
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2023 డిసెంబర్ 10న బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే, ఈ జంట ఇప్పుడు గుడ్‌న్యూస్ చెప్పింది. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించింది. వారి వివాహం తర్వాత అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. కానీ, సంగీతకు కూడా ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదంటూ మరికొందరు కామెంట్లు చేశారు.కొంతకాలంగా ప్రేమలో ఉన్న వారిద్దరూ.. ఒకరోజు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. అయితే, ఇప్పుడు కూడా అదేవిధంగా ఈ గుడ్‌న్యూస్ చెప్పారు. సంగీత సీమంతం వేడుక జరిగే వరకు ఎక్కడా కూడా ఈ విషయాన్ని వారు తెలుపలేదు. ఇలా సడెన్‌గా తాము తల్లిదండ్రులం కాబోతున్నామని చెప్పడంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. Toకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. బీస్ట్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది.సంగీతకు రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లిపై ఆ సమయంలో భారీగానే ట్రోల్స్ వచ్చాయి. ఈ వయసులో పెళ్లి అవసరమా..? అంటూ చాలామంది విమర్శించారు. వాటికి సమాధానంగా సంగీత ఇలా చెప్పింది. 'మానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను' అని పేర్కొంది. View this post on Instagram A post shared by Archana Saravanan (@archana_makeover_hair) -
టాలీవుడ్ కమెడియన్ అలీ పెళ్లి వేడుక.. సెలబ్రేషన్స్ చూశారా!
టాలీవుడ్ కమెడియన్ నటుడు అలీ గురించి పరిచయం అక్కర్లేదు. ఎంతోమంది స్టార్ హీరోల సినిమాల్లో తన కామెడీతో అభిమానులను ఎంటర్టైన్ చేశారు. తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. హీరోగా, హీరో స్నేహితుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా విభిన్న పాత్రలతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ తెలుగు సినిమాలు చేస్తూ ఫ్యాన్స్‌ను ఎంటర్టైన్ చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. సీతాకోకచిలుక చిత్రం ద్వారా హీరోగా మారారు. ఇప్పటివరకు వెయ్యికి పైగానే చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.జుబేదాను పెళ్లాడిన అలీ..అయితే జుబేదాను పెళ్లాడిన అలీకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2022 డిసెంబర్లో పెద్దకూతురు ఫాతిమా పెళ్లిని గ్రాండ్‌గా చేశారు. ఈ పెళ్లికి టాలీవుడ్ స్టార్స్‌తో పాటు రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో అప్పట్లో తెగ వైరలయ్యాయి. అయితే తాజాగా అలీ సైతం మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో మనం కూడా చూసేద్దాం.గ్రాండ్‌గా అలీ పెళ్లి వేడుక..ఇటీవల తన పెళ్లి రోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు అలీ దంపతులు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మరోసారి వివాహా వేడుక జరుపుకున్నారు. తమ ఇద్దరు కూతుర్ల సమక్షంలో ఈ పెళ్లి వేడుకను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన పెళ్లి వీడియో జుబేదా అలీ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసింది. వారి సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. -
యుద్ధ గాయాలకు ఉపశమనం
2023 అక్టోబరు 14. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక రాజప్రాసాదం ఓ అసాధారణ షోకు వేదికైంది. అది స్టాండప్ కామెడీ. ప్రఖ్యాత కమేడియన్ ఆంటోన్ టైమోషేంకో సోలో ప్రదర్శన ఇచ్చారు. ఆ ఘనత సాధించిన తొలి ఉక్రేనియన్‌గా నిలిచారు. దాదాపు మూడేళ్లుగా యుద్ధ విషాదంలో మునిగి తేలుతున్న ఉక్రెయిన్‌కు స్టాండప్ కామెడీ ఇప్పుడు తాత్కాలిక ఉపశమనంగా మారింది. ఒకప్పుడు విలాసవంతమైనవిగా గుర్తింపు పొందిన షోలు ఇప్పుడు ఉక్రెయిన్ సంస్కృతిలో భాగమయ్యాయి. స్టాండప్ కామెడీని సైకోథెరపీ బడ్జెట్ వర్షన్‌గా అభివర్ణిస్తున్నారు టైమోషేంకో . యుద్ధ సమయంలో కామెడీ చేయడం నిజానికి అంత్యక్రియల్లో జోక్ వేయడం వంటిదే. అయినా దేశ ప్రజల ముఖాల్లో మాయమైన నవ్వును తిరిగి తెచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు స్టాండప్ కమెడియన్లు. షెల్టర్ హోమ్స్‌లో, సాయుధ దళాల కోసం, ఔట్‌డోర్ స్టేజీలపై... ఇలా వీలైన చోటల్లా ప్రదర్శనలు ఇస్తున్నారు. రష్యా క్షిపణులు ఉక్రెయిన్ నగరాల్లోకి దూసుకొస్తున్నా ప్రజలను నవ్వించడానికి ప్రయత్నిస్తున్న స్టాండప్ కామిక్స్‌లో 30 ఏళ్ల టైమోషెంకో ఒకరు. క్లిష్ట సమయాలను అధిగమించడానికి, సమాజ భావనను నిర్మించడానికి, మనోధైర్యాన్ని పెంచడానికి ఈ హాస్యం ఉత్తమమైన మార్గం అంటున్నారాయన. గాయాలను గుర్తు చేయకుండా భయంకర ఘర్షణ వాతావరణంలో హాస్యం నవ్వించగలుగుతుందా? అంటే అవునంటున్నారు కమెడియన్లు. ప్రమాదాన్ని ఎగతాళి చేయడం వల్ల దాన్ని ఎదుర్కోగల శక్తి వస్తుందంటారు కమెడియన్ హన్నా కొచెహురా. యుద్ధ సమయంలో వేసే జోక్స్ సహజంగానే యుద్ధానికి సంబంధించినవే ఉంటాయి. ఫ్రాంక్ జానర్లాగా ఉండే స్టాండప్ కామెడీలో కమెడియన్లు తమ సొంత అనుభవాలు, ఆలోచనల్లోంచే మాట్లాడతారు. యుద్ధ సమయంలో జోక్స్ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయని అడిగితే, ఆకాశంలో రష్యా క్షిపణులను చూడగానే వాటంతటవే పుట్టకొస్తాయంటూ వ్యంగంగా బదులిస్తారు ఆంటోన్. పట్నంలో ఉన్న కొడుకుతో గ్రామంలో ఉంటున్న అమ్మ ఫోన్లో మాట్లాడుతూ, ‘బాబూ! ఈ రోజు మన ఇంటిపై నుంచి ఎన్ని రాకెట్లు వెళ్లాయో తెలుసా?’అంటూ బెదిరిపోతుంటుంది. ‘‘భయపడకులేమ్మా! అవన్నీ పట్నంలో ఉన్న నా వైపుకే వచ్చాయి’’అంటూ భయాన్ని పోగొడుతుంటాడు కొడుకు. ఇలా ఉంటుంది వారి కామెడీ. అయితే యుద్ధంపై జోక్ చేయడం కత్తిమీద సాము. ఆ క్రమంలో గాయాలను మళ్లీ రేపకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటారు వీళ్లు. విచారంగా, విషాదంగా అనిపించే విషయాలను కామెడీ చేయరు. సైన్యానికి సాయంగా.. ఉక్రెయిన్‌లో స్టాండప్ కామెడీకి మరో కోణమూ ఉంది. అది సైన్యానికి సాయం. యూరప్, ఉత్తర అమెరికా, ఆ్రస్టేలియాల్లోనూ వీళ్లు ప్రదర్శనలిస్తున్నారు. వచ్చిన డబ్బును సాయుధ దళాలకు సాయంగా ఇస్తున్నారు. ‘‘యుద్ధ సమయంలో ప్రతిదీ సైన్యానికి ఆచరణాత్మకంగా ఉపయోగపడాలి. దూసుకొస్తున్న క్షిపణుల మధ్య కళ గురించి మాత్రమే మాట్లాడటం మతిలేనితనం. కానీ నాకు తెలిసిన ఏకైక మార్గం కామెడీ. ఆ షోల ద్వారా నిధులు సేకరిస్తున్నా. ఇప్పటిదాకా రకూ రూ.6 కోట్లకు పైగా విరాళాలిచ్చా’’అని టైమోషేంకో చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాలీవుడ్ సెలబ్రిటీలకు వరుస బెదిరింపులు
బాలీవుడ్ సెలబ్రిటీలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan)కు బెదిరింపులు, సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటనలతో చిత్రపరిశ్రమలో ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ (Kapil Sharma)కు చంపుతామని బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. పాకిస్తాన్ నుంచి తనకు బెదిరింపులు వస్తున్నాయని ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ముంబైలోని అంబోలి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.రిప్లై రాలేదంటే తీవ్ర పరిణామాలుఈమెయిల్లో ఏముందంటే..? నువ్వేం చేస్తున్నావో ప్రతీది గమనిస్తున్నాం. ఓ సున్నిత విషయాన్ని నీ దృష్టికి తీసుకురావడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నాం. ఇదేం పబ్లిసిటీ స్టంట్ కాదు, అలా అని నిన్ను వేధించడమూ లేదు. ఈ మెసేజ్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అలాగే దీన్ని సీక్రెట్‌గా ఉంచాలని కోరుతున్నాం.. ఇట్లు బిష్ణు అని రాసుంది. అంతేకాకుండా ఎనిమిది గంటల్లో ఈ మెసేజ్‌కు రిప్లై ఇవ్వాలని లేదంటే వ్యక్తిగతంగా, వృత్తిపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు.వరుసగా బెదిరింపులుకపిల్ కంటే ముందు సుగంధ మిశ్ర, రెమో డి సౌజ, రాజ్‌పాల్ యాదవ్‌కు సైతం ఇటువంటి మెయిల్సే వచ్చాయి. సల్మాన్ ఖాన్ స్పాన్సర్ చేస్తున్న షోలో భాగమైన కపిల్ శర్మను, అతడి టీమ్ మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నదెవరు? అందుకు గల కారణాలేంటన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇకపోతే గత వారం సైఫ్ అలీఖాన్ ఇంట్లో అతడిపై దాడి జరిగింది. ఓ దుండగుడు సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. ఆటోలో ఆస్పత్రికి వెళ్లిన నటుడికి వైద్యులు సర్జరీ చేశారు. తన శరీరంలో నుంచి 2.5 అంగుళాల కత్తి మొననను తీసేశారు.చదవండి: నా పదేళ్ల కెరీర్లో సుబ్బు నా ఫేవరెట్ : అనుపమా పరమేశ్వరన్ -
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్‌లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్‌తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
ప్రముఖ కమెడియన్‌కు బ్రెయిన్ స్ట్రోక్
ప్రముఖ కమెడియన్ టీకు తల్సానియా (Tiku Talsania)కు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. దిల్ హై కీ మంతా నహీ (1991), కబీ హా కబీ నా (1993), ఇష్క్ (1997) చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు శుక్రవారం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది.గుండెపోటు కాదు!మొదటగా టీకూకు గుండెపోటు వచ్చిందని రూమర్లు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని, తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని నటుడి భార్య దీప్తి తల్సానియా పేర్కొంది. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఆయన ఓ సినిమా స్క్రీనింగ్‌కు వెళ్లాడు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో అస్వస్థతకు లోనయ్యాడు. వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించాం అని దీప్తి తెలిపింది.ఎవరీ టీకు?టీకు తల్సానియా.. ప్యార్ కె దో పాల్ (1986) సినిమాతో బాలీవుడ్లో నట ప్రస్థానం ప్రారంభించారు. కమెడియన్‌గా దిల్ హై కే మంతా నహీ, ఉమర్ 55కీ దిల్ బచ్పన్, బోల్ రాధా బోల్, అండాజ్ ఆప్న ఆప్న, మిస్టర్ బెహరా వంటి చిత్రాల్లో నటించాడు. తర్వాత కామెడీకి కాస్త బ్రేక్ ఇచ్చి వక్త్ హమారా హై మూవీలో సీరియస్ లుక్‌లో మెప్పించాడు. దేవదాస్ మూవీతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.కూతురు కూడా నటిగా..వీర్, కూలీ నెం.1, రాజా హిందుస్తానీ, రాజు చాచా, హంగామా, బడే మియా చోటే మియా, జుడ్వా.. ఇలా ఎన్నో చిత్రాలు చేశారు. చివరగా విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాలో కనిపించారు. టీకు కూతురు శిఖ తల్సానియా కూడా నటిగా రాణిస్తోంది. సత్యప్రేమ్ కీ కథ, వీరే దీ వెడ్డింగ్ వంటి చిత్రాల్లో నటించింది.చదవండి: చికెన్‌గున్యాతో బాధపడుతున్న సమంత.. ఒళ్లునొప్పులున్నా..! -
భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ (Punch Prasad) కొన్నేళ్లపాటు కిడ్నీ సమస్యతో బాధపడ్డాడు. డయాలసిస్ చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం మెరుగవలేదు. రెండు మూత్రపిండాలు పాడవడంతో వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని, లేకపోతే కష్టమని వైద్యులు హెచ్చరించారు. అలాంటి సమయంలో ప్రసాద్ భార్య సునీత నేనున్నానంటూ ముందుకు వచ్చింది. తన కిడ్నీ దానం చేసేందుకు సిద్ధమైంది. అయితే డాక్టర్లు అందుకు ఒప్పుకోలేదు. వేరే కిడ్నీదాతను వెతుక్కోమన్నారు. కిడ్నీ మార్పిడి విజయవంతంఅవసరమైతే భవిష్యత్తులో మళ్లీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ప్రసాద్ భార్య కిడ్నీ ఉపయోగిద్దామన్నారు. ఎంతో ఎదురుచూపులు, వెతుకులాట తర్వాత అతడికి కిడ్నీ దాత దొరికారు. ఆపరేషన్‌కు లక్షల్లో ఖర్చవుతుందన్నారు. అతడి విషయాన్ని అప్పటి మంత్రి ఆర్కే రోజా ఆనాటి సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాలతో చికిత్సకు కావాల్సిన డబ్బు సీఎం సహాయకనిధి ద్వారా మంజూరు చేశారు. అలా 2023లో అతడికి విజయవంతంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగింది.పంచ్ ప్రసాద్ ఎమోషనల్అప్పటి నుంచి ప్రసాద్ ఆరోగ్యంగా ఉంటున్నారు. తాజాగా అతడు తన భార్యతో కలిసి ఓ టీవీ షోకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఏ భర్తా చేయని పని తాను చేశాడు. సునీత గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యాడు. ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేమించుకున్నవాళ్లు కలిసి బతకడానికి పెళ్లి చేసుకుంటారు. కానీ నన్ను బతికించడం కోసమే ఆమె నన్ను పెళ్లి చేసుకుంది. నువ్వు చేసిన పనికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకున్న కమెడియన్మామూలుగా తల్లిదండ్రుల కాళ్లు కడిగి నెత్తిన చల్లుకుంటారు కదా.. నేనూ అదే చేయాలనుకుంటున్నా అన్నాడు. అనడమే ఆలస్యం.. భార్యను కూర్చోబెట్టి తాంబూలంలో ఆమె కాళ్లు కడిగి ఆ నీళ్లను తన నెత్తిన చల్లుకున్నాడు. అది చూసి సునీత సైతం కన్నీళ్లు పెట్టుకుంది. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆస్పత్రికి వెళ్లాలి. కానీ తన గురించి వదిలేసి నా చుట్టూ తిరిగింది అంటూ ప్రసాద్ భావోద్వేగానికి లోనయ్యాడు.చదవండి: ‘గేమ్ ఛేంజర్’ మూవీ ట్విటర్ రివ్యూ -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం (ఫొటోలు)
-
నా కాలేయం ఇచ్చి బతికించా.. చివరకు నా చేతుల్లోనే ప్రాణం..: ఏవీఎస్ కూతురు
కమెడియన్‌గా తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక పేరు సంపాదించుకున్నాడు ఏవీఎస్. ఆయన పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా పేరు తెచ్చుకున్న ఆయన మిస్టర్ పెళ్లాం చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మల్లీ మొదలైంది.. ఇలా ఎన్నో చిత్రాలు చేశాడు. దాదాపు 500 చిత్రాల్లో నటించి ప్రేక్షక హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. 2013లో ఏవీఎస్ మరణించాడు.ఇటీవలే అమ్మ కూడా..తాజాగా ఏవీఎస్ (AVS) కూతురు శాంతి- అల్లుడు చింటూ ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి (Comedian AVS Daughter Shanthi) మాట్లాడుతూ.. మా నాన్న 57 ఏళ్ల వయసులో మరణించాడు. అమ్మ 62 ఏళ్ల వయసులో (గతేడాది నవంబర్లోనే) కన్నుమూసింది. నిరంతరం షూటింగ్‌లోనే ఉంటూ నిద్రను పట్టించుకోకపోవడం వల్లే నాన్న ఆరోగ్యం దెబ్బతింది. కానీ బయటి వారు మాత్రం తాగడం వల్లే ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడని అపోహపడుతుంటారు.మందు అలవాటే లేదుమాది బ్రాహ్మణ కుటుంబం. నాన్న ఎగ్ కూడా తినేవారు కాదు. ఎగ్ ఉంటుందని కేక్ కూడా ముట్టుకోరు. సోడా కూడా పెద్దగా తాగకపోయేవారు. మందు జోలికి వెళ్లిందే లేదు. కానీ 2008లో నాన్న కాలేయం పాడైపోయింది. రక్తపు వాంతులు చేసుకున్నాడు. డాక్టర్స్ ఆయన్ను పరీక్షించి కాలేయం మార్పిడి చేయాలన్నారు. నేను కాలేయం ఇవ్వడానికి రెడీ అయ్యా.. కానీ లావుగా ఉన్నానని నాది సెట్టవదన్నారు. (చదవండి: సౌత్ సినిమాతో హీరోయిన్గా పరిచయం.. ఇప్పుడు దేశంలోనే టాప్!)1% మాత్రమే బతికే ఛాన్స్దాత దొరకాలంటే ఏడాది పడుతుందన్నారు. నాకేం అర్థం కాలేదు. ఏం చేయాలో తోచలేదు. ఇంతలో సడన్‌గా ఆయన జ్ఞాపకశక్తి కోల్పోయారు. మా అమ్మను కూడా గుర్తు పట్టలేదు. కేవలం నా ఒక్క పేరు మాత్రమే గుర్తుంది. నాన్న బతకడానికి ఒక్క శాతమే ఛాన్స్ ఉందన్నారు. ఆయన్ను ఐసీయూలో ఉంచి మమ్మల్ని ఇంటికి వెళ్లిపోమన్నారు. రాత్రంతా నిద్రపోకుండా దేవుడికి దండం పెట్టుకుంటూనే ఉన్నాం. తర్వాతి రోజు ఉదయం 6.30 గంటలకు నాన్న స్వయంగా కాల్ చేశాడు. నా భర్తే ఒప్పించాడుఎవరూ రాలేదేంట్రా? ఇక్కడ నేను ఒక్కడినే ఉన్నాను అని మాట్లాడాడు. ఒక్క రాత్రిలో తనకు పోయిన జ్ఞాపకశక్తి ఎలా తిరిగొచ్చిందో అర్థం కాలేదు. అయితే 20 రోజుల్లో కాలేయం ఆపరేషన్ చేయాలన్నారు. దాతల కోసం వెతికేంత సమయం లేదని నేనే రెడీ అయ్యాను. నాకు ఆరోగ్య పరీక్షలు చేసి అంతా బాగుందన్నారు. కానీ, నాన్న ఒప్పుకోలేదు. భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వస్తాయమోనని సందేహించాడు. అప్పుడు నా భర్తే దగ్గరుండి తనను ఒప్పించాడు. ఆయన సరే చెప్పేందుకు వారం రోజులు పట్టింది. (చదవండి: ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్)ఆరు నెలలు విశ్రాంతి తీసుకోమంటే..అలా నా కాలేయంలో 60 శాతం దానం చేశాను. ఆపరేషన్ తర్వాత నా శరీరంలో రక్తకణాల సంఖ్య పడిపోవడంతో ఒకరోజంతా అపస్మారక స్థితిలో ఉన్నాను. ప్లేట్లెట్స్ ఎక్కించడంతో కోలుకున్నాను. ఆపరేషన్ తర్వాత కనీసం ఆరు నెలలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు నాన్నకు సూచించారు. కానీ ఆయన వింటేగా! ఆపరేషన్ అయిన రెండో నెలకే మళ్లీ పనిలో పడిపోయాడు. సరిగా విశ్రాంతి తీసుకోలేదు.నా చేతిలో ప్రాణం పోయిందికాలేయం పెరగడం కోసం దాదాపు నాలుగేళ్లు గ్యాప్ ఇచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుకున్నాం. నాకు పిల్లలు పుడతారో, లేదోనని నాన్న భయపడిపోయాడు. అలాంటిది నాకు పాప పుట్టగానే నాన్న సంతోషంతో ఏడ్చేశాడు. ఆపరేషన్ అయిన ఆరేళ్లకు నాన్న పరిస్థితి విషమించి నా చేతిలోనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఆపరేషన్‌కు రూ.65 లక్షలదాకా ఖర్చయింది. అప్పుడు తెలుగు ఇండస్ట్రీ (Tollywood) చాలా సపోర్ట్ చేసింది అని శాంతి చెప్పుకొచ్చింది.చదవండి: క్లీంకారను అప్పుడే అందరికీ చూపిస్తా!: రామ్‌చరణ్ -
కడుపులో బిడ్డకు గ్యారెంటీ ఇవ్వమన్నారు: స్టెల్లా ఎమోషనల్
బుల్లితెర కమెడియన్ యాదమ్మరాజు తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య స్టెల్లా రాజ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. దీంతో ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోతో పంచుకున్నారు.బిడ్డకు గ్యారెంటీ ఇవ్వలేమన్న వైద్యులుస్టెల్లా మాట్లాడుతూ.. సాధారణ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా డెలివరీ చేయాలన్నారు. ఒక ఇంజక్షన్ తీసుకుని ఇంటికి వచ్చాను. తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ.. వెంటనే అడ్మిట్ అవాలన్నారు. కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం.అందుకే శ్రీమంతం క్యాన్సిల్తెలిసినవాళ్ల ద్వారా తర్వాతి రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. కానీ అక్కడి పరిస్థితులు చూశాక భయమేసి మరో ఆస్పత్రికి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. బిడ్డ గురించి ఎలాంటి ఆశ పెట్టుకోవద్దన్నారు. ఇందువల్లే శ్రీమంతం కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డేట్ కంటే దాదాపు 15 రోజుల ముందే డెలివరీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు నా డెలివరీ జరిగింది. బేబీ ఆరోగ్యంగా ఉంది అని స్టెల్లా రాజ్ చెప్పుకొచ్చింది. ఇకపోతే వీరికి బాబు పుట్టినట్లు తెలుస్తోంది.చదవండి: పాక్‌లో ఇండియన్ సినిమాల కోసం ఆరాటం.. ఏకంగా! -
నా కుమారుడి కోసం సిగ్గు విడిచి డబ్బులడిగా..: కమెడియన్
సామాన్యులకైనా, సెలబ్రిటీలకైనా కష్టాలు తప్పవు. బిగ్‌బాస్ కంటెస్టెంట్, కమెడియన్ మునావర్ ఫరూఖి తన జీవితంలో ఎదుర్కొన్న ఓ పెద్ద సమస్యను తాజా ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు. మునావర్ మాట్లాడుతూ.. నా కొడుడు మైఖేల్‌కు ఏడాదిన్నర వయసున్నప్పుడు కవసాకి అనే అరుదైన వ్యాధి సోకింది. దీనివల్ల రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. అరగంటపాటు షాక్లోఅలాగే గుండెకు సైతం హాని జరిగే ప్రమాదం ఉంది. వాడి పరిస్థితి గురించి చెప్పగానే అరగంటపాటు షాక్‌లో ఉండిపోయాను. ఒక్కో ఇంజక్షన్ ధర రూ.25,000 ఉంటుందన్నారు. నా దగ్గర చూస్తే రూ.700 మాత్రమే ఉన్నాయి. నా గర్వాన్ని పక్కనపెట్టి ముంబై వెళ్లా.. అందరి దగ్గరా చేతులు చాచి సాయమడిగాను. ట్రీట్మెంట్కు అవసరమైన డబ్బును మూడుగంటల్లో సమకూర్చి హాస్పిటల్లో కట్టేశాను. కానీ ఆ డబ్బు సేకరించడం కోసం పడ్డ కష్టం, వేదన మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను.నా ముఖంలో సంతోషం లేదుఅలాగే హాస్పిటల్లో డబ్బు కట్టేశాక కూడా నా ముఖంలో సంతోషం లేదు. ఎందుకంటే అది నా డబ్బు కాదు కదా! ఆరోజే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆరోజే నిర్ణయించుకున్నాను అని చెప్పుకొచ్చాడు. కాగా మునావర్ గతంలో జాస్మిన్ను పెళ్లాడాడు. వీరికి పుట్టిన సంతానమే మైఖేల్. ఇటీవలే మునావర్.. మెజబీన్ కోట్వాలా అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: పెళ్లిలో డ్యాన్స్.. షారూఖ్ ఎంత తీసుకున్నాడేంటి? -
ప్రముఖ లేడీ కమెడియన్ బేబీ షవర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'కళ్లకు గంతలు కట్టి, కారులో తోసి.. రూ.20 లక్షలు డిమాండ్ చేశారు'
ప్రముఖ బాలీవుడ్ కమెడియన్ సునీల్ పాల్ కిడ్నాప్‌కు గురయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే కిడ్నాప్ అయిన కొద్ది గంటలకే అతడిని విడుదల చేయడంతో క్షేమంగా ఇంటికి చేరుకున్నాడని అతడి భార్య తెలిపింది. ఈ విషయంలో పోలీసులను కూడా సంప్రదించినట్లు పేర్కొంది.నిజంగానే కిడ్నాప్..అయితే ఇది పబ్లిసిటీ స్టంట్ అయి ఉండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై కమెడియన్ సునీల్ పాల్ స్పందించాడు. ఇది ప్రాంకో, పబ్లిసిటీ స్టంటో కాదని, తనను నిజంగానే కిడ్నాప్ చేశారని స్పష్టం చేశాడు. తాజా ఇంటర్వ్యూలో సునీల్ పాల్ మాట్లాడుతూ.. అమిత్ అనే వ్యక్తి హరిద్వార్‌లో బర్త్‌డే పార్టీలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపాడు. ఇందుకోసం కాస్త అడ్వాన్స్ కూడా పంపాడు. దీంతో డిసెంబర్ 2న ఢిల్లీకి వెళ్లాను. బర్త్‌డే పార్టీకి వెళ్తుండగా మార్గమధ్యలో స్నాక్స్ తిందామని ఆగారు. రూ.20 లక్షలు డిమాండ్సరిగ్గా అప్పుడే నా అభిమాని అంటూ ఓ వ్యక్తి వచ్చి మాట్లాడుతూ ఓ కారులోకి తోశాడు. బలవంతంగా నన్ను కారులో తీసుకెళ్లారు. కళ్లకు గంతలు కట్టి ఓ బంగ్లాకు తీసుకెళ్లారు. అక్కడ నన్ను చాలారకాలుగా భయపెట్టారు. రూ.20 లక్షలు కావాలని డబ్బు డిమాండ్ చేశారు, నా ఫోన్ కూడా లాక్కున్నారు. నా దగ్గర ఏటీఎమ్ కార్డు లేదని చెప్పడంతో వారు బేరాలు మొదలుపెట్టారు. నా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసుకోవచ్చని చెప్పారు.ఖర్చుల కోసం రూ.20 వేలిచ్చారుఅలా రూ.7.5 లక్షలు సమకూర్చాను. దీంతో వాళ్లు మరుసటి రోజు విమాన ప్రయాణ ఖర్చుల కోసం రూ.20 వేలు చేతిలో పెట్టి ఇంటికి పంపించారు. ఈ సంఘటన గురించి ఎవరితోనూ చెప్పకూడదనుకున్నాను. కానీ నా భార్య అప్పటికే పోలీసులను సంప్రదించడంతో నేనూ నోరు విప్పాను. కానీ ఆ కిడ్నాపర్లు నా వ్యక్తిగత విషయాలన్నీ తెలుసుకున్నారు. వణికిపోయా..నా పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు? నా తల్లి ఎక్కడ నివసిస్తుంది? ఇలా ప్రతీది అడిగారు. నా కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలనేది భయంగా ఉంది. ఈ సంఘటనతో నేను వణికిపోయాను. పబ్లిసిటీ కోసం ఇదంతా చేశానంటున్నారు... అదే నిజమైతే మధ్యలో పోలీసులను ఎందుకు లాగుతాను. పైగా నా స్నేహితుల దగ్గర డబ్బు పంపినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా నేను ఇంకా బతికే ఉన్నందుకు సంతోషం అని సునీల్ చెప్పుకొచ్చాడు.చదవండి: కమెడియన్ ఆటో రామ్‌ప్రసాద్‌కు యాక్సిడెంట్ -
కమెడియన్ కిడ్నాప్?.. కొద్ది గంటల్లోనే!
నటుడు, కమెడియన్ సునీల్ పాల్ మంగళవారం కొన్ని గంటల పాటు అదృశ్యమయ్యాడు. ఈ విషయాన్ని సునీల్ భార్య సరిత ధృవీకరించింది. ఆమె మాట్లాడుతూ.. నా భర్త ఉన్నట్లుండి టచ్‌లో లేకపోయేసరికి కంగారుపడిపోయాను. అతడిని ఎవరో కిడ్నాప్ చేశారు. నేను పోలీసులను సంప్రదించగా వారు చాలా సహాయం చేశారు. ప్రస్తుతం ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. తనను కిడ్నాప్ చేసినవారి గురించి కూడా పోలీసులకు తెలియజేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తాను అని పేర్కొన్నారు.మిస్సింగ్..ఏదో షోలో పొల్గొనేందుకు వేరే నగరానికి వెళ్లిన సునీల్ మంగళవారం తిరిగి ఇంటికొస్తానన్నాడు. అయితే ఆరోజు ఎంతసేపు ఎదురుచూసినా ఆయన ఇంటికి చేరుకోలేదు. పైగా ఫోన్‌కాల్స్ కూడా కనెక్ట్ కాకపోవడంతో కంగారుపడిపోయిన సరిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ రిపోర్ట్ నమోదు చేసిన కొన్ని గంటల్లోనే సునీల్ తన కుటుంబంతో టచ్‌లోకి వచ్చాడు. మంగళవారం రాత్రికల్లా తిరిగి ఇంటికి చేరుకున్నాడు.కాగా సునీల్ పాల్ 2005లో ద గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ షో విజేతగా నిలిచాడు. హమ్ తుమ్, ఫిర్ హేరీ ఫెరి, ఆప్నా సప్నా మనీ మనీ, బాంబే టు గోవా వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: హత్య కేసులో హీరోయిన్ సోదరి అరెస్ట్.. 20 ఏళ్లుగా మాటల్లేవ్! -
బండ్ల గణేశ్ సినిమాకు ఓకే చెప్పా.. కానీ మోసం చేశాడు: టాలీవుడ్ కమెడియన్
టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తిరుపతి ప్రకాశ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో చిత్రాల్లో అభిమానులను మెప్పించారు. టాలీవుడ్ స్టార్ హీరోలైనా నాగార్జున, చిరంజీవి, వెంకటేశ్, బాలయ్య, మోహన్ బాబు, కృష్ణంరాజు లాంటి స్టార్స్ అందరితో కలిసి పనిచేశారు. సీనియర్ ఎన్టీఆర్‌తో తప్ప దాదాపు అందరితో సినిమాలు చేశానని వెల్లడించారు. ప్రస్తుతం సీరియల్స్‌లో చేస్తున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ కెరీర్లో తనకెదురైన అనుభవాలను పంచుకున్నారు.తాను సినిమాల్లో నటించే రోజుల్లో బండ్ల గణేశ్, తాను ప్రాణ స్నేహితులమని ప్రకాశ్ తెలిపారు. ఇద్దరం కలిసి చాలా సినిమాల్లో నటించామని పేర్కొన్నారు. అయితే బండ్ల గణేశ్ నిర్మాత అయ్యాక ఆయన సినిమాల్లో నాకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఓ సినిమాకు డేట్స్ తీసుకుని నాకు అబద్ధం చెప్పారని ఆ రోజులను గుర్తు చేసుకున్నారు.తిరుపతి ప్రకాశ్ మాట్లాడుతూ..'బండ్లగణేశ్ చేసిన ఒక్క సినిమాలో కూడా నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే ఒక సినిమాకు డేట్స్ తీసుకున్నాడు. దాదాపు 60 రోజులు షూట్ ఉంటుందని చెప్పాడు. రోజుకు 15 వేల పారితోషికం ఖరారు చేసుకున్నా. దీంతో వేరే సినిమాలకు నో చెప్పా. వినాయకచవితి పండగ మరుసటి రోజే కేరళలోని పొల్లాచ్చికి వెళ్లాలి. కానీ షూట్‌కు బయలుదేరాల్సిన ముందురోజే నాకు ఫోన్ కాల్ వచ్చింది. భారీ వర్షాలతో షూట్ క్యాన్సిల్ చేశామని ప్రొడక్షన్ మేనేజర్ చెప్పాడు. దీంతో షాక్ తిన్నా. మూడు సినిమాలు వదిలేశా. మూడు నెలలు ఖాళీగా ఎలా ఉండాలని ఆలోచించా. సరిగ్గా పది రోజుల తర్వాత శ్రీకాంత్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. వెంటనే రాజమండ్రికి వెళ్లా. అక్కడ రోలర్ రవి నన్ను కలిశాడు. ఏం ప్రకాశ్ అన్న మంచి సినిమా వదిలేశావ్ అన్నాడు. ఏ సినిమా అని అడిగా. కల్యాణ్ బాబు మూవీ అన్నాడు. వర్షం వల్ల షూట్ క్యాన్సిల్ అయిందని చెప్పారని చెప్పా. కానీ నాకంటే తక్కువకే ఎవరో దొరికారని నన్ను తీసేసినట్లు తెలిసింది. అప్పుడు నాకు బండ్ల గణేశ్‌పై కోపం వచ్చింది. ఆ తర్వాత మా నాన్న చనిపోయారని ఫోన్ చేశాడు. అవును అని చెప్పి వెంటనే పెట్టేశా' అని అన్నారు. -
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
Hyderabad: భార్యతో గొడవపడి అర్ధరాత్రి పోర్షే కారులో చక్కర్లు..
బంజారాహిల్స్: భార్యతో గొడవపడి అర్ధరాత్రి ఖరీదైన పోర్షే కారులో చక్కర్లు కొడుతూ మితిమీరిన వేగంతో దూసుకెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారకుడైన వ్యాపారి, స్టాండప్ కమేడీయన్ ఉత్సవ్ దీక్షిత్‌ను ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేయగా ప్రమాదానికి కారణమైన పోర్షేకారు కండీషన్ తెలియజేయాల్సిందిగా జర్మనీ కంపెనీకి బంజారాహిల్స్ పోలీసులు లేఖ రాయనున్నారు. ఇప్పటికే లేఖను సిద్ధం చేసిన పోలీసులు నేడో, రేపో ఈ కారు కండీషన్ తెలియజేయాల్సిందిగా కోరనున్నారు. ఈ కారు మరమ్మతులకు వచ్చిందని మూడునెలల క్రితమే సర్వీస్ కు తేవాలని చెప్పామని రోడ్లపైకి తీసుకెళ్ళవద్దని హెచ్చరించడం కూడా జరిగిందని షోరూం ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదేదీ పట్టని ఉత్సవ్ దీక్షిత్ మూడునెలల నుంచి కారును నడిపిస్తూనే ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.వేగంతో కారును నడపడంతో మూల మలుపు వద్ద కారు స్టీరింగ్‌కు లాక్ పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారు కండీషన్లో ఉందా లేదా తేల్చాల్సిందిగా పోర్షే కంపెనీకి లేఖ రాయాలని నిర్ణయించారు. సంబంధిత కంపెనీ నుంచి నిపుణులు వచ్చి కారు కండీషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు. ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు -
ఉత్సవ్ దీక్షిత్ అరెస్టు
బంజారాహిల్స్: రోడ్డు ప్రమాదానికి కారకుడైన స్టాండప్ కమెడియన్ ఉత్సవ్ దీక్షిత్ (33)ను ఆదివారం బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్డునంబర్–6లో నివసించే ఉత్సవ్ దీక్షిత్ గత నెల 31వ తేదీ అర్ధరాత్రి తన భార్యతో గొడవపడి పోర్షే కారులో బయటకు వచ్చి రాత్రంతా నగరంలో చక్కర్లు కొట్టాడు. కారులో మితిమీరిన వేగంతో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, మణికొండ ప్రాంతాల్లో తిరిగాడు. 1వ తేదీ తెల్లవారుజామున 5.45 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–12 నుంచి వెళ్తుండగా బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సమీపంలో కారు అదుపుతప్పి స్టీరింగ్ లాక్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి కేబీఆర్ పార్కు ఫెన్సింగ్‌ను దాటుకుని చెట్టు పైకి వెళ్లి కిందపడింది. స్వల్ప గాయాలతో ఉత్సవ్ బయటపడి పారిపోయాడు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. నిందితుడిపై ఎంవీ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవింగ్ లైసెన్స్‌ను సీజ్ చేసి రద్దు చేయాల్సిందిగా ఆర్డీఓకు లేఖ రాశారు. పోలీసుల విచారణలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే కారు అదుపు తప్పినట్లు తేలింది. కాగా.. ఉత్సవ్ దీక్షిత్ స్టాండప్ కమెడియన్‌గా సుపరిచితుడు. పలు కార్యక్రమాల్లో కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ప్రేమ వివాహం చేసుకున్న ఉత్సవ్ దీక్షిత్ ఇంట్లో భార్యతో గొడవ పడి ఆ కోపాన్ని కారు మీద చూపించినట్లుగా నిర్ధారణ అయింది. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కోపంతో జర్నలిస్ట్ ఫోన్ లాక్కున్న కమెడియన్.. వీడియో వైరల్
ఈ దీపావళి సినిమా వాళ్లకు బాగానే కలిసొచ్చింది. సౌత్‌లో లక్కీ భాస్కర్, క, అమరన్ సినిమాలకు హిట్ టాక్ రాగా బాలీవుడ్ భూల్ భులయ్యా 3, సింగం అగైన్ చిత్రాలు ఏకంగా రూ.100 కోట్లు దాటేశాయి. ఇకపోతే భూల్ భులయ్యా 3 సినిమాలో నటించిన రాజ్‌పాల్ యాదవ్ తాజాగా వార్తల్లో నిలిచాడు.దీపావళి అలా జరుపుకోవద్దు!దీపావళికి పటాసులు కాల్చవద్దని సూచిస్తూ ఆ మధ్య ఓ వీడియో షేర్ చేశాడు. టపాకాయలు కాల్చడం వల్ల గాలి, శబ్ధ కాలుష్యం పెరుగుతుందని పేర్కొన్నాడు. అతడి కామెంట్లపై విమర్శలు వెల్లువెత్తడంతో సదరు వీడియోను డిలీట్ చేశాడు. తన మాటల వల్ల మనోభావాలు దెబ్బతిన్నవారికి క్షమాపణలు చెప్తూ మరో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. నటుడి క్షమాపణలుదీపావళి పండగ సంతోషాన్ని తగ్గించాలన్నది నా ఉద్దేశం కాదు. నన్ను క్షమించండి. మన జీవితాల్లో వెలుగును, ఆనందాన్ని నింపేదే దీపావళి. ఈ పండగను అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ నటుడిని ఓ జర్నలిస్టు కొన్ని ప్రశ్నలడిగాడు. నెలన్నరకోసారి నన్ను చూస్తారుఈ ఇంటర్వ్యూని అతడి ఫోన్లోనే రికార్డ్ చేశాడు. ప్రస్తుతం మీ చేతిలో ఎన్ని సినిమాలున్నాయని అడగ్గా రాజ్‌పాల్.. ప్రతి నెలన్నరకోసారి మీరు నన్ను చూస్తూనే ఉంటారని బదులిచ్చాడు. దీపావళి పండగపై చేసిన కామెంట్ల గురించి జర్నలిస్టు ఆరా తీయగా రాజ్‌పాల్ అసహనం వ్యక్తం చేశాడు.ఫోన్ లాక్కున్న నటుడువెంటనే జర్నలిస్టు చేతిలోని ఫోన్‌ను లాక్కున్నాడు. ఇదంతా ఫోన్లో రికార్డవగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజ్‌పాల్ తన ఫోన్‌ను లాక్కోవడంతోపాటు విసిరేసేందుకు ప్రయత్నించాడని సదరు జర్నలిస్టు పేర్కొన్నాడు. लोगों को हंसाने वाले मशहूर फिल्म अभिनेता राजपाल यादव आखिर इतना क्यों भड़क गए?फिल्म अभिनेता राजपाल यादव आज यूपी के लखीमपुर खीरी जिले के पलिया कस्बे में पहुंचे थे, जहां एक पत्रकार के सवाल पर उनको इतना गुस्सा आ गया कि सवाल पूछ रहे पत्रकार के मोबाइल फोन पर झपट्टा मारकर मोबाइल फोन… pic.twitter.com/Gj7vCRTxEB— Zameer Ahmad (@zameerahmad_lmp) November 2, 2024 చదవండి: చిత్ర పరిశ్రమలో విషాదం.. దర్శకుడు అనుమానాస్పద మృతి -
US Elections 2024: చెత్త చుట్టూ అమెరికా ఎన్నికల సమరం
హోరాహోరీగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల సమరం చివరి ఘట్టంలో ‘చెత్త’ చుట్టూ తిరుగుతోంది. గత ఆదివారం రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భారీ బహిరంగ సభలో స్టాండప్ కమేడియన్ టోనీ హించ్‌క్లిఫ్ మాట్లాడుతూ ప్యూర్టోరీకోను నీటిపై తేలుతున్న చెత్తకుప్పగా అభివరి్ణంచడం తెలిసిందే. దానిపై అమెరికావ్యాప్తంగా ఇప్పటికీ నిరసనలు పెల్లుబుకుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 లక్షలకు పైగా ఉన్న ప్యూర్టోరీకో ఓటర్లలో ఆ వ్యాఖ్యలు ఆగ్రహం రగిల్చాయి. వారంతా నవంబర్ 5 నాటి పోలింగ్‌లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటేయవచ్చని, ఫలితంగా డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజయాన్ని నల్లేరుపై నడకగా మారనుందని విశ్లేషణలు వెలువడ్డాయి. అయితే ట్రంప్ అభిమానులనే ‘అసలైన చెత్త’గా అభివరి్ణస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దాంతో పరిస్థితి తారుమారైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. తన ఉద్దేశం అది కాదంటూ సోషల్ మీడియా సాక్షిగా బైడెన్ వివరణ ఇచ్చినా అప్పటికే హారిస్‌కు భారీ నష్టం జరిగిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అనుకోని అవకాశాన్ని గట్టి ఆయుధంగా వాడుకునేందుకు ట్రంప్‌తో పాటు ఆయన ప్రచార శిబిరం కూడా శాయశక్తులా ప్రయతి్నస్తోంది. అమెరికన్లను అవమానించడం డెమొక్రాట్లకు కొత్తేమీ కాదంటూ ఊరూవాడా హోరెత్తిస్తోంది...! ఎన్నికల ఘట్టం చివరి అంకంలో సొంత పార్టీ అభ్యర్థి హారిస్‌ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టి చిక్కుల్లోనే పడేశారు. ప్యూర్టోరీకోపై టోనీ వ్యాఖ్యలను తిప్పికొట్టే క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిస్పానిక్ గ్రూప్ వోటో లాటినో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బైడెన్ పాల్గొన్నారు. ప్యూర్టోరీకాపై ట్రంప్ సమక్షంలోనే టోనీ చేసిన దిగజారుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్యూర్టోరీకన్ల పట్ల పూర్తి సంఘీభావం ప్రకటించారు. ‘‘వారు చాలా మంచివాళ్లు. ఆత్మగౌరవమున్న వ్యక్తులు. అమెరికా అభివృద్ధిలో వారికి కీలక పాత్ర’’ అంటూ కొనియాడారు. ‘‘లాటిన్ అమెరికన్లను రాక్షసులుగా చిత్రించేందుకు ట్రంప్, ఆయన శిబిరం చేస్తున్న ప్రయత్నాలు దారుణం. ఇతర దేశాలను కించపరచడం అమరికా విధానమే కాదు. అమెరికా పాటించే విలువలకు అవి పూర్తిగా విరుద్ధం’’ అంటూ విమర్శించారు. అక్కడిదాకా బాగానే ఉన్నా, ‘‘నాకు తెలిసిన అసలైన చెత్త ఆయన (ట్రంప్) మద్దతుదారులు మాత్రమే. వారి రూపంలోనే అసలైన చెత్తాచెదారం కనిపిస్తోంది’’ అంటూ నోరుజారారు. వాటిపై అమెరికా అంతటా విమర్శలు చెలరేగుతున్నాయి. బైడెన్ అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేశారని విమర్శకులు కూడా భావిస్తున్నారు. ప్యూర్టోరీకాపై టోనీ తలతిక్క వ్యాఖ్యలతో తలపట్టుకున్న రిపబ్లికన్ పార్టీ నెత్తిన బైడెన్ పాలు పోశారంటున్నారు. ఆయన వ్యాఖ్యలను రిపబ్లికన్లు రెండు చేతులా అందిపుచ్చుకున్నారు. 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ చేసిన వ్యాఖ్యలతో ముడిపెట్టి మరీ, ‘అమెరికన్లను దారుణంగా అవమానించడం డెమొక్రాట్లకు అలవాటే’నంటూ జోరుగా ప్రచారం చేస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులైన కోట్లాది మంది అమెరికన్లను బైడెన్, హారిస్ దారుణంగా అవమానించారంటూ ట్రంప్ ప్రచార బృందం జాతీయ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ దుయ్యబట్టారు. వివరణ ఇచి్చనా... వ్యవహారం చేయి దాటుతోందని గ్రహించిన బైడెన్ వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారు. తాను చెత్త అన్నది ప్యూర్టోరీకోపై అసహ్యకర వ్యాఖ్యలు చేసిన ట్రంప్ మద్దతుదారును ఉద్దేశించి మాత్రమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అలాంటి వారిని దిగజారుడుతనాన్ని వర్ణించేందుకు అదే సరైన పదమని చెప్పుకొచ్చారు. కానీ బైడెన్ వ్యాఖ్యలపై దుమారం చల్లారడం లేదు. వాటిపై డెమొక్రాట్ నేతలను అమెరికా అంతటా ప్రజలు నిలదీస్తున్నారు. హారిస మద్దతుదారైన పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరోకు కూడా మంగళవారం సాయంత్రం ఒక ఇంటర్వ్యూలో దీనిపై వరుసబెట్టి ప్రశ్నలు ఎదురయ్యాయి. దాంతో, ‘ప్రత్యర్థి నేతలకు మద్దతిచి్చనా నేనైతే అమెరికన్లెవరినీ ఎప్పటికీ అవమానించబోను’’ అంటూ ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచి్చంది. నాడు హిల్లరీ ఏమన్నారంటే... 2016 అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కూడా ట్రంప్ మద్దతుదారులపై ఆయన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘‘ట్రంప్ మద్దతుదారుల్లో సగానికి సగం మంది ఎందుకూ పనికిమాలినవాళ్లే. వాళ్లంతా జాత్యహంకారులు. స్త్రీలు, ముస్లింలు, విదేశీయులతో పాటు స్వలింగ సంపర్కుల పట్ల విద్వేషం వెలిగక్కేవాళ్లు’’ అంటూ దుయ్యబట్టారు. ఆ వ్యాఖ్యల ద్వారా అమెరికన్లందరినీ హిల్లరీ తీవ్రంగా అవమానించారంటూ రిపబ్లికన్లు అప్పట్లో జోరుగా ప్రచారం చేశారు.డెమొక్రాట్లకు అలవాటేబైడెన్ తాజా వ్యాఖ్యలపై ట్రంప్ కూడా స్పందించారు. పెన్సిల్వేనియాలో ర్యాలీలో ఉండగా బైడెన్ వ్యాఖ్యలను ట్రంప్ ప్రచార బృందం ఆయన చెవిన వేసింది. దాంతో, ‘‘వావ్! ఇది దారుణం. కానీ వాళ్లకు (డెమొక్రాట్లకు) ఇది అలవాటే’’ అంటూ ట్రంప్ స్పందించారు. ‘‘2016లో నాతో తలపడ్డ హిల్లరీ కూడా నా మద్దతుదారులపై ఇలాంటి అవమానకర వ్యాఖ్యలే చేశారు. కానీ అవి ఫలించలేదు. ‘చెత్త’ వ్యాఖ్యలు వాటికంటే దారుణమైనవి. కాదంటారా?’’ అంటూ వివాదాన్ని మరింత పెద్దది చేసే ప్రయత్నం చేశారు. అమెరికన్లపై ఎవరూ క్రూర పరిహాసం చేయొద్దన్నదే తన అభిప్రాయమని చెప్పుకొచ్చారు. అమెరికన్లపై ప్రేమాభిమానాలు లేని డెమొక్రాట్లకు దేశానికి నాయకత్వం వహించే హక్కే లేదన్నారు. పనిలో పనిగా అంతేగాక టోనీ ‘ప్యూర్టోరీకో’ వ్యాఖ్యలకు దూరం జరిగేందుకు కూడా ట్రంప్ ప్రయతి్నంచారు. వాటితో తనకు ఏ సంబంధమూ లేదని చెప్పుకొచ్చారు. ‘‘ఎవరో కమేడియన్ ప్యూర్టోరీకోపై ఏదో అభ్యంతరకరమైన జోకు పేలి్చనట్టు నాకెవరో చెప్పారు. అతనెవరో నాకస్సలు తెలియదు. అతన్ని నేనెన్నడూ కనీసం చూడను కూడా లేదు’’ అని చెప్పుకొచ్చారు. అలాంటి వ్యక్తి ట్రంప్ ర్యాలీ వేదికపై ఎందుకున్నట్టన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రముఖ కమెడియన్ కన్నుమూత
ప్రముఖ కమెడియన్, మరాఠీ నటుడు ఇవాళ కన్నుమూశారు. ది కపిల్ శర్మ షో ఫేమ్ అతుల్ పర్చురే తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ మరణించారు. బాలీవుడ్లో సినిమాలతో పాటు పలు మరాఠీ సీరియల్స్‌లో నటించారు. అంతేకాకుండా పలు టీవీ రియాలిటీ షోల్లో కనిపించారు. గతేడాది కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన రూల్స్ రంజన్ చిత్రంలో కనిపించారు.అతుల్ పర్చురే మరణం పట్ల బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రసీమను దిగ్భ్రాంతికి గురిచేసింది. తనదైన నటనతో పాటు మరాఠీ సినిమాల్లోనే కాకుండా హిందీ సినిమాలు, టెలివిజన్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నారు. అతని కెరీర్లో టీవీ సీరియల్స్‌లో ఎక్కువగా నటించారు. అతని మరణ వార్త విన్న అభిమానులు, సహచరులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరాఠీ, హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయన చెరగని ముద్ర వేశారని గుర్తు చేసుకుంటున్నారు. -
బిగ్‌బాస్ షోలో ప్రముఖ కమెడియన్?
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ లాంచ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలతో బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులు జరుపుతోంది. కొందరిని ఆల్రెడీ ఫైనలైజ్ చేయగా మరికొందరికి ఇంకా ఏ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు షోలోకి వచ్చే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ పలువురి సెలబ్రిటీల పేర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..తాజాగా ఆ జాబితాలో సీనియర్ నటుడు, కమెడియన్ సెంథిల్ పేరు వినిపిస్తోంది. కేవలం తమిళంలోనే కాదు దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఈయనకు గుర్తింపు ఉంది. ఎక్కువగా పాపులర్ కమెడియన్ గౌండమణితో కలిసి వెండితెరపై నవ్వులు పూయించేవాడు.సెంథిల్ జర్నీ..సెంథిల్ 1970వ దశకంలో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో చిన్నాచితకా పాత్రలే చేసేవాడు. ఎప్పుడైతే కమెడియన్ గౌండమణితో కలిసి నటించడం మొదలుపెట్టాడో అప్పుడు తన దశ తిరిగిపోయింది. వీరి కాంబినేషన్లో వచ్చిన కరగట్టకరన్, మన్నన్, చిన్నతంబి, ఇండియన్.. వంటి ఎన్నో చిత్రాలు బ్లాక్బస్టర్లుగా నిలిచాయి. తెలుగులో తొలి ముద్దు, మనీ మనీ మోర్ మనీ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. దాదాపు 500 సినిమాల్లో యాక్ట్ చేసిన ఈయనను సినీప్రియులు ఎంతగానో ఇష్టపడతారు, గౌరవిస్తారు. అలాంటి ఈయన ఇప్పుడు బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని వార్తలు వస్తుండటంతో అతడి అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి అతడి ఎంట్రీ నిజమేనా? కాదా? అనేది తెలియాలంటే అక్టోబర్‌లో తమిళ బిగ్‌బాస్ 8 ప్రారంభమయ్యేవరకు వేచి చూడాల్సిందే!మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
సత్య టాలెంట్‌ను మొదట గుర్తించిన హీరో ఎవరో తెలుసా?
ఈ మధ్య కాలంలో పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్విస్తున్న కమెడియన్ ఎవరైనా ఉన్నారా? అంటే అందులో సత్య ముందు వరుసలో ఉంటాడు. 'మత్తు వదలరా' సీక్వెల్‌తో ప్రస్తుతం సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు. ఎక్కడ చూసినా సత్య కామెడీ క్లిప్పులే కనిపిస్తున్నాయి. ఇంత మంచి నటుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసింది.. తనలో కమెడియన్‌ను గుర్తించి ఎవరో తెలుసా? హీరో నితిన్.తెలిసేది కాదుఈ విషయాన్ని సత్య ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. హీరో నితిన్, రచయిత హర్షవర్ధన్, నిర్మాత డీఎస్ రావు.. వీళ్లే నాలో నటుడున్నాడని గ్రహించారు. మొదట్లోనేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసేవాడిని. అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదు. అందరితోనూ ఒకేలా మాట్లాడేవాడిని. సర్, షార్ట్ రెడీ.. అని పిలిచేవాడిని కాదు.. ఇదిగో మిమ్మల్ని రమ్మంటున్నారు.. వెళ్లండి.. ఇలా అమలాపురం యాసలోనే చెప్పేవాడిని. ఆ హీరో సలహా ఇవ్వడమేగాకనా మాటలు విన్నాక నితిన్ గారు నువ్వు యాక్టర్ అవ్వు, బాగుంటుంది అని సలహా ఇచ్చారు. అక్కడితో ఆగకుండా బలవంతంగా నాతో యాక్టింగ్ చేయించారు. అలా నెమ్మదిగా నటుడిగా మారాను అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన సత్య అభిమానులు.. ఇంత మంచి నటుడిని అందించిన నితిన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. కాగా నితిన్ ద్రోణ (2009) సినిమాకు సత్య అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు.కమెడియన్‌గా, హీరోగాఇతడు జబర్దస్త్ షోలోనూ పాల్గొన్నాడు. పిల్ల జమీందార్ చిత్రంతో గుర్తింపు అందుకున్నాడు. స్వామిరారా మూవీతో కమెడియన్‌గా పాపులర్‌గా అయ్యాడు. చలో సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడిగా సైమా అవార్డు అందుకున్నాడు. గతంలో మత్తు వదలరా చిత్రంతో, ఇప్పుడు దాని సీక్వెల్‌తో ఆడియన్స్‌కు నవ్వుల విందు వడ్డించాడు. Thanks @actor_nithiin anna oka manchi actor ni maku ichav #MathuVadalara2 #Satya #Devara pic.twitter.com/hYPSWUG5kP— surya k (@naistam2k) September 15, 2024 చదవండి: జాన్వీ కపూర్ టాలెంట్ చూసి షాకయ్యా..: జూనియర్ ఎన్టీఆర్ -
కమెడియన్ సత్య మరో సునీల్ అవుతాడా..?
-
ఒక్క టికెట్ రూ.25 వేలా? డబ్బు వెనక పరిగెడతాడనుకోలేదు!
ప్రముఖ సింగర్, నటుడు దిల్జిత్ దోసాంజ్ త్వరలో ఇండియాలోని పలు మెట్రో నగరాల్లో సంగీత కచేరి నిర్వహించనున్నాడు. 'దిల్ లుమినటి టూర్' పేరిట నిర్వహించబోతున్న ఈ కన్సర్ట్కు సంబంధించి లక్ష టికెట్లను సెప్టెంబర్ 10న అమ్మకానికి పెట్టగా కొద్ది నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయితే ఆ టికెట్ రేట్లు మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేవని కమెడియన్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లూయెన్సర్ సౌమ్య సాహ్ని ఫైర్ అయింది.అంత డబ్బు ఎక్కడిది?సంగీత కచేరిలో ఒక్క టికెట్ రూ.20-25 వేలా? ప్రేక్షకుల దగ్గర అంత డబ్బు ఎక్కడిది? పైగా ఎక్కువమంది నిరుద్యోగులే! మన భాషలో ఒకరు అద్భుతంగా పాడుతుంటే చూడాలని ఎవరికి ఉండదు.. కానీ టికెట్ రేట్లు ఆ రేంజ్లో ఉంటే దాన్ని కొనడం మధ్య తరగతి వాళ్లకు ఎలా సాధ్యమవుతుంది? పైగా పిల్లలతో కలిసే కుటుంబాలు కచేరీకి వెళ్తుంటాయి.బాగానే సంపాదిస్తున్నారు కదా!ఎలాగో విదేశాల్లో కచేరీలు పెట్టి బాగానే సంపాదిస్తున్నారు కదా! అలాంటప్పుడు కనీసం మనవాళ్ల దగ్గరైనా తక్కువ వసూలు చేయొచ్చుగా.. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా ఒక్క టికెట్ దాదాపు రూ.10 వేలకే అమ్ముతారు. అలాంటిది నువ్వు రూ. 15 వేలు, రూ.20-25 వేలకు టికెట్స్ అమ్మడమేంటో నీకే తెలియాలి' అని వీడియోలో మండిపడింది.రూ.500 పెట్టడమే ఎక్కువఈ వీడియో చూసిన నెటిజన్లు సౌమ్య అభిప్రాయానికే మద్దతిస్తున్నారు. 'ఒక్క టికెట్‌కు రూ.500 పెట్టడమే ఎక్కువ. నేనైతే ఆ కచేరీని యూట్యూబ్‌లో చూస్తాను', 'మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అయ్యుండి దిల్జిత్ ఇలా డబ్బు, పేరు వెనక పరిగెడతాడని అస్సలు ఊహించలేదు', 'అతడు కావాలనుకుంటే ఒక్క సిటీలోనే పలు షోలు చేయొచ్చు, కానీ అభిమానుల కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చాడు' అని కామెంట్లు చేస్తున్నారు. ఆరోజే కచేరీ ప్రారంభంకాగా దిల్జిత్ కచేరీ అక్టోబర్ 26 ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఆ తర్వాత హైదరాబాద్, అహ్మదాబాద్, లక్నో, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ఇండోర్, చంఢీగర్ వంటి నగరాల మీదుగా ఈ కచేరీ టూర్ సాగనుంది. View this post on Instagram A post shared by Saumya Sahni (@mrsholmes221b) బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కమెడియన్ అరుదైన ఘనత.. తొలి భారతీయ నటుడిగా రికార్డ్!
బాలీవుడ్ నటుడు వీర్ దాస్ అరుదైన ఘనత సాధించారు. ఇండస్ట్రీలో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వీర్ దాస్ ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్- 2024 ఎమ్మీ అవార్డ్స్ హోస్ట్‌గా ఆయనను ప్రకటించింది.గతంలో 2021లో కామెడీ విభాగంలో ఎమ్మీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యారు. అయితే 2023లో నెట్‌ఫ్లిక్స్ కామెడీ వెబ్ సిరీస్ ల్యాండింగ్‌కు గానూ వీర్ దాస్ అవార్డ్ గెలుచుకున్నారు. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కమెడియన్‌గా వీర్‌దాస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఏకంగా అంతర్జాతీయ ఈవెంట్‌కు హోస్ట్‌గా ఛాన్స్ కొట్టేశారు. దీంతో ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తొలి భారతీయుడిగా నిలిచారు. కాగా..ఈ అవార్డుల ప్రదానోత్సవం నవంబర్ 25న న్యూయార్క్‌లో జరగనుంది.(ఇది చదవండి: నా సినిమాకు జాతీయ అవార్డ్స్ రాకుండా అడ్డుకున్నారు: పా.రంజిత్)కాగా.. ప్రముఖ స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన వీర్‌దాస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అతను ఇటీవల ప్రైమ్ వీడియో సిరీస్ కాల్ మీ బేలో న్యూస్ యాంకర్‌గా కనిపించారు. అతను ప్రస్తుతం ఇంటర్నేషనల్ టూర్లో ఉన్న వీర్ దాస్ ఎమ్మీ అవార్డ్స్‌కు హోస్ట్‌గా ఎంపికకావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. -
నవ్వుతూ.. నవ్విస్తూ..
నలుగురితో నారాయణ అని కాకుండా నలుగురిలో నేను వేరయా అన్నట్లు ఆర్జేలలో ఆర్జే స్వాతి వేరయా అని నిరూపిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో అటు ఆర్జేగా ఇటు సోషల్‌మీడియా సెలబ్రిటీగా మరోవైపు ఇంట్లో ఇల్లాలిగా, పిల్లల ఆలనాపాలనతో పాటు పలు షోలను చేస్తూ తన సత్తాచాటుతోంది. ఆర్జేగా చేశామా అనేది కాకుండా కొంగొత్త థీమ్స్‌తో ఇంటర్వ్యూలు చేస్తూనే ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ రీల్స్ చేస్తూ.. తన గెటప్స్‌తో అదరగొడుతున్నారు. నవ్వించడం చాలా కష్టం.. అందులో ఎదుటువారిమీద జోక్వేసి నవ్వించడం ఒకతీరైతే.. తనమీద తానే జోక్స్ వేసుకొని డిఫరెంట్ గెటప్స్‌తో నవ్వించడం మరోతీరు. ఈ కోవకే చెందుతారు ఆర్జే స్వాతి. పేరడీ, రీమిక్స్‌తో లక్షల్లో వ్యూస్ సంపాదిస్తూ.. సోషల్ మీడియాలో సంచలనాలను సృష్టిస్తున్న ఆర్జే స్వాతి తన అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు.. టిపికల్ మిడిల్‌క్లాస్ ప్యామిలీ.. టిపికల్ మిడిల్‌క్లాస్, స్ట్రిక్ట్ ప్యామిలీ.. మాది. పుట్టింది వరంగల్.. అక్కడే స్కూలింగ్ చేశాను. హైదరాబాద్ రామాంతపూర్‌లో డిగ్రీ చేసి బీపీఓలో ఉద్యోగం చేసేదానిని. మొదట్లో హైదరాబాద్ కల్చర్‌ను అలవాటు చేసుకోవడానికి చాలా టైం పట్టింది. కానీ త్వరగా మేలుకొని అలవాటయ్యాను. నాకు మాట్లాడటం అలవాటు.. ఎదుటివారితో కలిసిపోవడం, నవి్వంచడం చాలా ఇష్టం. బీపీఓలో గడగడా మాట్లాడుతూ కస్టమర్ కేర్‌లో గడసరిగా పేరుతెచ్చుకున్నాను. అలా 2013లో ఆర్జేగా మీరు కూడా అవ్వొచ్చు అనే అడ్వర్టైజ్మెంట్ రావడంతో ఇంట్లో చెప్పకుండా ఆర్జే ఆడిషన్స్‌కి వెళ్లి ఆడిషన్ ఇచ్చాను. నా ఆడిషన్ రేడియో మిర్చి వారికి నచ్చి నన్ను ఆర్జేగా తీసుకున్నారు.ఇమిటేషన్, కొత్త థీమ్స్ ఇంటర్వ్యూలు.. అందరిలా ఆర్జే చేయడం కన్నా కొద్దిగా సరికొత్తగా చేయడం ఇష్టం. అలా గురు సినిమా హీరో వెంకటేష్‌తో హీరోయిన్ మాదిరి ఇమిటేషన్ ఇంటర్యూ చేయడం ఆయనకు నచి్చంది. సందర్భానుసారం మట్లాడుతూ, మిమిక్రీ చేస్తూ, సినిమా ఇంటర్యూలలో ఆ సినిమా తాలూకూ థీంని తీసుకొని ఇంటర్యూ చేసేదానిని. అలా ఆర్జేగా నాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది.ఇన్స్టాగ్రామ్ వీడియోలకు స్పందన.. సోషల్ మీడియా వచ్చాక ఇన్స్టాగ్రామ్ వేదికగా నవ్వించే వీడియోలు చేశాను. కానీ సరికొత్తగా చేయాలనే తపనతో రీమిక్స్ గెటెప్ల వైపు మొగ్గాను. ట్రెండింగ్‌లోని వీడియోలకు అచ్చం అలాగే గెటప్స్ వేసి రీమిక్స్ వీడియోలు చేయడం ప్రారంభించాను. నెటిజన్ల నుండి అనూహ్య స్పందన లభించింది. ట్రెండింగ్ వీడియోస్‌లోని వారిని అనుకరించడానికి వారి గెటప్స్‌కి పేరడీగా ఇంట్లో వంట వస్తువులు, కూరగాయలు, నూడిల్స్, మా కుంటుబసభ్యుల దుస్తులు వాడతాను. అలా చేయడం నెటిజన్లను మరింత ఆకర్షించింది. దీంతో రీమిక్స్‌కి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఇన్‌స్టాలో లక్షాపదివేల మంది ఫాలోవర్స్ వచ్చారు. కొంగొత్త కంటెంట్‌తో నవి్వంచడం నా కర్తవ్యం. ఓ రోజు మా స్టూడియోకి మాజీ మంత్రి కేటీఆర్ వచి్చనపుడు ర్యాప్ సాంగ్ పాడాను. ఆయనకు చాలా నచ్చి మీరు ర్యాపరా కూడానా అని మొచ్చుకున్నారు.లేడీ కమెడియన్ అవ్వాలి.. నేటితరంలో లేడీ కమెడియన్లు చాలా అరుదుగా ఉన్నారు. కోవై సరళలాగా తనమీద తనే జోకులు వేసుకుంటూ చేసే కామెడీని చేయాలన్నది నా కోరిక. లేడీ కమెడియన్‌గా అడుగులు వేస్తున్నాను. పలు టీవీ షోల వారితో సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో ఆర్జేగా, సోషల్ మీడియాతో పాటు బుల్లితెర, వెండితెరలలో నవ్వులు పూయించాలన్నదే నా ఆకాంక్ష.. నవ్వూతూ బ్రతకాలిరా.. నవ్వుతూ చావాలిరా.. నా చివరి శ్వాస వరకూ ప్రేక్షకులను నవి్వంచడానికి ప్రయతి్నస్తూనే ఉంటాను.. ఇట్లు.. మీ ఆర్జే స్వాతి. -
ప్రెగ్నెంట్ అని తెలీక పార్టీలకు వెళ్లి మందు తాగా: కమెడియన్
ప్రెగ్నెంట్ అన్న విషయం తెలియక కమెడియన్ భారతీ సింగ్ మందు తాగింది. నిజానికి ఏడు వారాల వరకు ఆమెకు తాను గర్భవతి అన్న విషయమే తెలియదు. ఈ విషయాన్ని భారతీ సింగ్ స్వయంగా వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నా ప్రెగ్నెన్సీని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎంజాయ్ చేశాఅప్పటిదాకా పార్టీలకు వెళ్తూ హాయిగా నచ్చింది తింటూ, తాగుతూ ఎంజాయ్ చేశాను. అనుకోకుండా ఓ రోజు ప్రెగ్నెన్సీ కిట్ కనిపించడంతో ట్రై చేద్దామనుకున్నాను. తీరా పరీక్షిస్తే పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని నా భర్త హార్ష్కు చెప్తే అతడు నమ్మలేదు. తర్వాత ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేస్తే గర్భవతినని నిర్ధారణ అయింది. ఆడవారిదే తప్పంటారు!గర్భంలో ఉన్న శిశువుకు ఏమాత్రం ఇబ్బంది వచ్చినా మహిళదే తప్పంటారు చాలామంది. అయితే భర్త మానసికంగా ధైర్యం చెప్తూ అండగా ఉంటే ప్రతి మహిళకు ప్రెగ్నెన్సీని హ్యాండిల్ చేయడం చాలా ఈజీ. నాకు అలా అర్థం చేసుకునే భర్త దొరికాడు అని చెప్తూ మురిసిపోయింది. ముచ్చటైన కుటుంబంకాగా భారతి సింగ్.. రచయిత, నిర్మాత, యాంకర్ హార్ష్ లింబాచియాను ప్రేమించింది. వీరిద్దరూ కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్నారు. 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2022లో గోలా పుట్టాడు. తన కుమారుడితో కలిసి దిగిన ఫోటోలు, వీడియోలను భారతీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్.. జోర్దార్ సుజాత కంటతడి
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేశ్ - నటి, యాంకర్ జోర్దార్ సుజాత దంపతులు గుడ్‌న్యూస్ చెప్పారు. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఏప్రిల్ నెలలో ఆమె సీమంతం కూడా జరిగింది. అయినా దాన్ని బయటకు చెప్పుకోలేదు. ఇన్నాళ్లకు తాను గర్భవతిని అని తెలియజేస్తూ ఓ వీడియోను యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది. 'ఈ మధ్య సోషల్ మీడియాలో ఏ వీడియో షేర్ చేసినా మీరు ప్రెగ్నెంటా? అని కామెంట్లు చేస్తూనే ఉన్నారు.ప్రెగ్నెన్సీఒక మంచి సందర్భం చూసుకుని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. మీరు ఆశీర్వదించినట్లే మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం చెప్తున్నందుకు సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్గానూ ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకూ ఆయనకు నేనే భార్యను కావాలి.ఇంటికి పంపలేదుమా ఇంట్లోని వీణ(తోటి కోడలు).. నన్నెంత బాగా చూసుకుంటుందో! నేను ఏ ఫుడ్ తీసుకోవాలనే విషయంలో మా ఆయనతో పోటీపడేది. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. అక్కడ రోడ్లు సరిగా లేవు, ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. View this post on Instagram A post shared by Rocking Rakesh (@jabardasthrakesh) View this post on Instagram A post shared by Sujatha P (@jordarsujatha) చదవండి: Mahima Makwana: పదేళ్ల వయసులోనే నటిగా మారింది! ఇప్పుడు -
విడాకుల రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన కమెడియన్ హర్ష
కమెడియన్ హర్ష ఇటీవల సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్‌లాంటిది. ఎత్తుపల్లాలు ఉంటాయి. ఎగ్జయిట్మెంట్, చికాకు, భయం, థ్రిల్.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ, ఏవీ మన చేతిలో ఉండవు. మనల్ని ఆపడానికి వస్తాయి. తర్వాత అవే వెళ్లిపోతాయి. అప్పటివరకు మనం బకెల్ పట్టుకుని కూర్చుని రైడ్‌ను ఎంజాయ్ చేయాల్సిందే!విడాకుల రూమర్స్‌పై క్లారిటీఅసలేదీ ఆశించకూడదు.. తర్వాత నిరాశ చెందకూడదు. జీవితం ఎటు వెళ్తే అటు పోవడమే అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన జనాలు హర్షకు ఏమైందని కంగారుపడ్డారు. కొందరైతే అతడు విడాకులు తీసుకోబోతున్నాడంటూ పుకార్లు సృష్టించారు. దీంతో హర్ష తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చాడు. తన వ్యక్తిగత జీవితం సాఫీగానే ఉందని, కెరీర్లోనే చిన్న ఆటంకాలని తెలిపాడు.హ్యాపీగా ఉన్నాఈ మేరకు మరో పోస్ట్ షేర్ చేశాడు. మనం కింద పడినప్పుడు లేచి నిలబడటం నేర్చుకుంటాం. ఇంకా స్ట్రాంగ్‌గా ముందుకు సాగుతాం.. నా గత పోస్టు గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు.. నా జీవితంలో యోగక్షేమాలను ఆరా తీసేవాళ్లు ఇంతమంది ఉన్నారా? అని సంతోషంగా అనిపించింది. విషయమేంటంటే.. వ్యక్తిగత జీవితంలో నేను హ్యాపీగా ఉన్నాను. పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నాను. అక్కడ పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. దానివల్లే ఇబ్బందులు పడుతున్నాను.చెత్త రాజకీయాలుఅయినా ఇవన్నీ ప్రతిచోటా ఉండేవే..! ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని ఎవరితోనో అనిపించుకునే స్థాయికి రాకండి.. ఒంటరిగా ఒక్కరే పూర్తి చేయండి. చేయగలను అన్న విశ్వాసం ఉంచండి. ఏదేమైనా నేను బాగానే ఉన్నాను. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్‌గా తిరిగొస్తాను. జీవితమంటే ఇంతే.. దానికి ఎవరూ ఎదురీదలేరు అని రాసుకొచ్చాడు. కాగా హర్ష తన ప్రియురాలు అక్షరను 2021లో పెళ్లాడాడు. View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) View this post on Instagram A post shared by Harsha (@harshachemudu) చదవండి: 12th ఫెయిల్.. అలాంటి పాత్రలే చేయాలని లేదు: హీరోయిన్ -
చావే దిక్కనుకున్నా.. కూతురి కోసం ఆగిపోయా: లేడీ కమెడియన్
ఆర్య.. లేడీ కమెడియన్. బడాయి బంగ్లా అనే కామెడీ షోతో తన పేరు కాస్తా ఆర్య బడాయిగా మారిపోయింది. నటిగా, హాస్య నటిగా, యాంకర్‌గా, జడ్జిగా ఇలా వివిధ పాత్రలు పోషించే ఆమె సినిమాలు, రియాలిటీ షోలతో ఫుల్ బిజీగా ఉంది. అందరినీ కడుపుబ్బా నవ్వించే ఆర్య జీవితంలో మాత్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. 2008లో ఐటీ ఇంజనీర్ రోహిత్ సుశీలన్ (నటి అర్చన సుశీలన్ సోదరుడు)ను పెళ్లాడగా వీరికి రోయ అనే కూతురు పుట్టింది. కూతురి పేరు మీద ఓ బొటిక్ కూడా ఓపెన్ చేసింది. అయితే ఏమైందో ఏమో కానీ 2019లో భర్తతో విడిపోయి కూతురితో ఒంటరిగా నివసిస్తోంది.బిగ్‌బాస్ తర్వాత డిప్రెషన్తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధను బయటపెట్టింది. బిగ్‌బాస్ నుంచి వచ్చాక డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడలేకపోయాను. చనిపోయేందుకు ప్రయత్నించాను. నిద్రమాత్రలు తీసుకున్నాను. కానీ నా కూతురిని చూసి ఆగిపోయాను. తనే నన్ను ఆ బాధలో నుంచి బయటపడేసింది. ఎప్పుడైనా సరే మనకు తట్టుకోలేనంత బాధ అనిపిస్తే దాన్నుంచి ఎలా బయటపడాలా? అని ఆలోచిస్తాం. చావు ఒక్కటే మార్గం అనుకుంటాం. మరణమే మార్గమనుకున్నాలాక్డౌన్లో నాకూ అలాంటి పరిస్థితే ఎదురైంది. మాట్లాడేందుకు కూడా ఎవరూ లేరు. చావే సరైన నిర్ణయమనుకున్నాను. కానీ నా కూతురు.. తన పరిస్థితి ఏం కావాలి? తనను చూసుకోవడానికి మా నాన్న కూడా లేరు. ఆయన ఉండుంటే కూతుర్ని ఆయన చూసుకుంటాడన్న ధీమాతో ఎప్పుడో ప్రాణాలు వదిలేసేదాన్ని. నేను, అమ్మ, వదిన, పాప.. వాళ్లకంటూ ఉన్నది నేనేగా! అందరినీ వదిలేసిపోతే వాళ్లుం ఏం చేస్తారు? నా కూతురు జీవితం ఏమైపోతుంది? పాపను తన తండ్రి బాగానే చూసుకుంటాడు.కూతురి కోసం ఆలోచించి ఆగిపోయాకానీ చుట్టూ ఉన్న సమాజం ప్రేమలో ఓడిపోయి మీ అమ్మ బలవన్మరణానికి పాల్పడిందంటూ కాకుల్లా పొడిచి మరీ చెప్తారు. అవన్నీ ఆలోచించి ఆగిపోయాను. నా కుటుంబంతో, ఫ్రెండ్స్‌తో మాట్లాడాను. మళ్లీ సరైన దారిలోకి వచ్చాను. పెళ్లి విఫలమవడాన్ని భరించాను, తర్వాత బ్రేకప్ బాధనూ తట్టుకున్నాను, ఆఖరికి నాన్న మరణాన్ని సైతం తట్టుకుని నిలబడ్డాను. అందుకే అందరూ నన్ను బోల్డ్ అని పిలుస్తుంటారు. కానీ నేను చాలా ఎమోషనల్.. అని ఆర్య చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Arya Babu (@arya.badai) చదవండి: నటుడి ఇంట మొన్న విషాదం.. అంతలోనే సంతోషం.. -
కామెడీ పేరుతో అవమానించారు, ఇంత నిర్దయగా ప్రవర్తిస్తారా?: నటి
కామెడీ పండించడం అంత ఈజీ కాదు. కానీ ఇది తనకు కొట్టిన పిండి అన్నట్లుగా అవలీలగా నవ్వులు పూయించగలదు కుశా కపిల. సోషల్ మీడియాతో స్టార్డమ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ ఘోస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్‌లో, ‘ప్లాన్ ఏ ప్లాన్ బి’, ‘సెల్ఫీ’, ‘థాంక్యూ ఫర్ కమింగ్’ వంటి పలు చిత్రాల్లోనూ నటించింది. ఇటీవల ప్రెట్టీ గుడ్ రోస్ట్ షోలో పాల్గొంది.అది నా తప్పేఅక్కడ స్టాండప్ కమెడియన్లు తన మీద కుళ్లు జోకులు వేయడాన్ని సహించలేకపోయింది. తన వ్యక్తిగత విషయాలైన విడాకుల గురించి కూడా సెటైర్లు వేయడాన్ని తట్టుకోలేకపోయింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. నా ఫ్రెండ్ ఒకరు చెప్పారని ఆ షోకి వెళ్లాను. నన్ను ఈరేంజ్‌లో రోస్ట్ చేస్తారనుకోలేదు. వాళ్లు ఏం ప్లాన్ చేశారనేది ముందుగానే అడిగి తెలుసుకోవాల్సింది. నా ఫ్రెండ్ మీద నమ్మకంతో నేనా పని చేయలేదు. అది నా తప్పే!అందరి ముందు చులకనగాఅక్కడున్న ప్రేక్షకులు, సాంకేతిక నిపుణుల ముందు నన్ను చులకన చేసి మాట్లాడారు. నాపై వేసిన జోక్స్ కూడా నన్ను అవమానించేట్లుగా ఉన్నాయి. వీరికి మానవత్వమే లేదా అనిపించింది. కామెడీ పేరుతో ఒక మనిషిని ఇంత దారుణంగా హేళన చేయడం కరెక్ట్ కాదు. ఆ ఎపిసోడ్ ప్రసారం చేసేందుకు కూడా నా మనసు అంగీకరించలేదు. కానీ దాన్ని అడ్డుకుంటే నేను పిరికిదాన్నని ట్రోల్ చేసేవారు. అందుకే ఆ ఎపిసోడ్ ప్రసారం కానిచ్చాను.అదే గమనించాఅయితే నా తర్వాత షూట్ చేసిన ఎపిసోడ్లలో మాత్రం వారు హద్దులు దాటలేదు. ముఖ్యంగా మహిళల విషయంలో నోటికొచ్చిన జోక్స్ వేయలేదు. ఈ ఆరు నెలల్లో నేను గమనించిందేంటంటే విడాకులు తీసుకున్న మహిళలను ఏమైనా అంటారు. వారిని విలన్లలాగా చూస్తారు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కుష కపిల లైఫ్ హిల్ గయి అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది.చదవండి: నేను చేసిన తప్పులకు కృతజ్ఞతలు: ధనుష్ -
ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్‌గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 -
యోగిబాబు హీరోగా.. 'కానిస్టేబుల్ నందన్'
తమిళసినిమా: చిన్న చిన్న పాత్రల నుంచి ప్రముఖ హాస్య నటుడిగా ఎదిగిన యోగిబాబు ఆ తరువాత కథానాయకుడి అవతారమెత్తి సక్సెస్‌పుల్‌గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఈయన లేని చిత్రం లేదంటే అతిశయోక్తి కాదు. అటు హాస్య పాత్రల్లోనూ, ఇటు హీరోగానూ రెండు పడవలపై విజయవంతంగా పయనిస్తున్న యోగిబాబు తాజాగా హీరోగా నటిస్తున్న చిత్రం కానిస్టేబుల్ నందన్. శంకర్ పిక్చర్స్ పతాకంపై డి.శంకర్ తిరువణ్ణామలై నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా భూపాల నటేశన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.ఈయన దర్శకుడు సుందర్.సి, శశికుమార్, ఎం.కళైంజయం వద్ద సహాయ దర్శకుడిగా పని చేశారు. కాగా ఈయన దర్శకుడిగా పరి చయం అవుతున్న చిత్రం కానిస్టేబుల్ నందన్ ఆదివారం ఉదయం తిరువణ్ణామలైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డి.శంకర్ తిరువణ్ణామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ పలువురు నటులకు స్ఫూర్తిగా నిలిస్తున్న నటుడు యోగిబాబు వంటి ఉత్తమ నటుడితో కలిసి చిత్రం చేయడం ఘనతగా భావిస్తున్నానన్నారు.కథ చెబుతున్నప్పుడే ఆయన చూపించిన ఆసక్తి నిజంగానే అభినందనీయమన్నారు. పలు వురు ప్రముఖ దర్శకుల వద్ద పని చేసి చాలా విషయాలు నేర్చుకున్న భూపాల నటేశన్ వంటి ప్రతిభావంతుడైన దర్శకుడితో కానిస్టేబుల్ నందన్ చిత్రాన్ని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాలను మరిన్ని చేయాలని కోరుకుంటున్నానన్నారు.దర్శకుడు భూపాల నటే శన్ పేర్కొంటూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న భావన కలిగిన నిర్మాతలను కనుగొనడం ఒక వరప్రసాదం అన్నారు. అలాంటి శంకర్ తన కథను చిత్రంగా నిర్మించడానికి ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులు, బయ్యర్లకు నచ్చిన నటుడు యోగిబాబుతో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.ప్రముఖ హాస్యనటుడిగా కొనసాగుతూనే హీరోగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న ఆయన కేరీర్ కానిస్టేబుల్ నందన్ చిత్రం ఒక మైలు రాయిగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇందులో యోగిబాబుకు విలన్‌గా ఓ బలమైన పాత్ర ఉంటుందన్నారు. ఆ పాత్ర కోసం ప్రతిభావంతుడైన నటుడిని ఎంపికచేసి త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు భూపాల నటేశన్ పేర్కొన్నారు.ఇవి చదవండి: 'మదర్ ఇండియా'కు సిద్ధం.. -
దీనస్థితిలో నటుడు.. ఆదుకున్న కమెడియన్..
ప్రముఖ కమెడియన్ వెంగళ్రావు దీన స్థితిలో ఉన్నాడు. తమిళంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఈయన కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల ఈయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు సైతం డబ్బుల్లేకపోవడంతో ఆదుకోవాలని కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఒక చేయి, కాలు పక్షవాతానికి గురైందని, పని చేసే స్థితిలో లేనని, చికిత్సకు డబ్బులిచ్చి సాయం చేయాలని సినిమా తారలకు విజ్ఞప్తి చేశాడు.కదిలిన సినీతారలుఇది చూసిన తమిళ హీరో శింబు రూ.2 లక్షలు, హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ రూ.25,000 ఆర్థిక సాయం చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కమెడియన్ వడివేలు.. నటుడిని ఆదుకునేందుకు ముందుకు వచ్చాడు. లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు తనను నేరుగా కలిసి యోగక్షేమాలు తెలుసుకోనున్నాడు.వడివేలుతోనే ఎక్కువ సినిమాలుకాగా వెంగళ్రావు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో స్టంట్‌మెన్‌గా పని చేశాడు. తర్వాత నటుడిగా మారాడు. కాంతస్వామి, తలై నగరం, పగిరి.. ఇలా అనేక చిత్రాలు చేశాడు. ఎక్కువగా వడివేలుతో కలిసి పని చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లోనే దాదాపు 30 సినిమాలున్నాయి. ప్రస్తుతం వెంగళ్రావు విజయవాడలో నివసిస్తున్నాడు. #வடிவேலு உடன் காமெடி வேடங்களில் நடித்த #வெங்கல்ராவ் ஒரு கை, ஒரு கால் செயல் இழந்து, சொந்த ஊரான விஜயவாடாவில் சிகிச்சை பெற்று வருகிறார்.மருத்துவச் செலவுக்கு நடிகர்கள் மற்றும் சினிமா தொழில்நுட்பக் கலைஞர்கள் தனக்கு உதவும்படி வீடியோ வெளியிட்டுள்ளார்.@GovindarajPro #VengalRao pic.twitter.com/6wkYJBVTqK— Actor Kayal Devaraj (@kayaldevaraj) June 24, 2024చదవండి: పెళ్లయిన ఐదురోజులకే ఆస్పత్రిలో హీరోయిన్.. ఏమైంది? -
Premgi Amaren: 45 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫోటోలు)
-
పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
ప్రముఖ కమెడియన్ కమ్ మ్యూజిక్ కంపోజర్ ప్రేమ్గీ పెళ్లి చేసుకున్నాడు. ఇందు అనే అమ్మాయితో ఏడడుగులు వేశాడు. జూన్ 9న తిరుత్తణి గుడిలో పెళ్లి చేసుకుంటాడని అన్నారు. కానీ శనివారం రాత్రి కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రేమ్ గీ సోదరుడు, ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు బయటపెట్టాడు. తన ఇన్ స్టాలో కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: బాలీవుడ్‌లోకి శ్రీలీల ఎంట్రీ.. ఆ స్టార్ హీరో కొడుకుతో కలిసి!)తమిళ ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభుకి సోదరుడే ప్రేమ్ గీ. ఇతడి ప్రస్తుత వయసు 45 ఏళ్లు. కానీ ఇన్నాళ్లు ఒంటరిగానే ఉన్నాడు. అలాంటిది కొన్నాళ్ల ముందు ప్రేమ్ గీ పెళ్లి చేసుకోబోతున్నాడని న్యూస్ వచ్చింది. చాలామంది దీన్ని రూమర్ ఏమో అనుకున్నారు. కానీ వెడ్డింగ్ కార్డ్ బయటకొచ్చేసరికి నిజమని తేలింది. అమ్మాయి పేరు ఇందు అని తప్పితే ఇంకే వివరాలు ప్రస్తుతానికైతే లేదు. తాజాగా జరిగిన పెళ్లి వేడుకకు యువ హీరోలు జై, వైభవ్ తదితరులు హాజరయ్యారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్) View this post on Instagram A post shared by Vaibhav Reddy (@vaibhav30) View this post on Instagram A post shared by Venkat Prabhu (@venkat_prabhu) -
'డబ్బు కోసమే 46 ఏళ్ల కమెడియన్‌తో పెళ్లి'.. నటి ఏమందంటే?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ గతేడాది పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో ప్రియురాలు, నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. వివాహం తర్వాత తన ఫస్ట్ బర్త్‌డేను భార్యతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. అంత పెద్ద వయసులో ఉన్నవాడిని సంగీత పెళ్లి చేసుకోవడానికి కారణం డబ్బేనని చాలామంది విమర్శించారు. ఇకపోతే సంగీతకు ఇదేమీ ఫస్ట్ మ్యారేజ్ కాదు. రెండో పెళ్లిగతంలో ఆమె క్రిష్‌ను పెళ్లాడగా వీరికి ఒక పాప కూడా ఉంది. వ్యక్తిగత కారణాల వల్ల వీరు విడాకులు తీసుకున్నారు. అనంతరం సంగీత రెడిన్తో ప్రేమలో పడగా ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. తన పెళ్లిపై వస్తున్న ట్రోల్స్‌పై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. సంగీత మాట్లాడుతూ.. ఈ వయసులో పెళ్లి అవసరమా? అంటున్నారు. మా వయసు పెరగలేదుమానసికంగా నా వయసు 18, తన వయసు 22! మేము ఆ ఏజ్‌లోనే ఉన్నట్లు ఫీలవుతున్నాం. అది మీకు చెప్పినా అర్థం కాదు. ఇంకేమన్నారు.. డబ్బు కోసం పెళ్లి చేసుకున్నానా? అదెలాగో కాస్త వివరించి చెప్తారా? మీ వల్ల కాదు! అతడిలో నాకు నచ్చింది సింప్లిసిటీ! చాలా నిరాడంబరంగా ఉంటాడు. అది చూసే తనను పెళ్లి చేసుకున్నాను అని పేర్కొంది.కమెడియన్‌గా గుర్తింపుకాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ చిత్రంతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. నెల్సన్ డైరెక్ట్ చేసిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.సీరియల్స్- సినిమాలుఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాల్లో నవ్వులు పూయించాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేయగా సీరియల్స్‌లోనే ఎక్కువగా నటించింది. -
మోదీపై పోటీ.. కమెడియన్ నామినేషన్ తిరస్కరణ
లోక్‌సభ ఎన్నికల వేళ అందరి చూపు వారణాసి పార్లమెంట్ స్థానం వైపే ఆకర్షిస్తోంది. అక్కడ పోటీ చేస్తేది.. ప్రధాని మోదీ కాబట్టి. అయితే మోదీపై పోటీ చేయడానికి కమెడియన్ శ్యామ్ రంగీలా వేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ప్రధాని నరేంద్ర మోదీ వాయిస్‌ను అనుకరించటం వల్ల ఫేమస్ అయిన శ్యామ్ రంగీలా.. మే 14న వారణాసి స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సెగ్మెంట్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా శ్యామ్ రంగీలా నామినేషన్ వేశారు. ఒక రోజు తర్వాత ఆయన నామినేషన్‌ను తిర్కరించినట్లు ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో పొందుపర్చింది. వారణాసిలో తనను నామినేషన్ వేయనీయకుండా ఇబ్బందులు కలిగిస్తున్నారని ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.‘‘నన్ను ప్రతిపాదించేవారు ఉన్నారు. సంబందిత పత్రాలు కూడా నింపాం. ఆమోదించడానిక ఎవరు ముందుకు రావటం లేదు. రేపు మళ్లీ ప్రయత్నం చేస్తాం’’ అని మే 13న శ్యామ్ రంగీలా అన్నారు. మరుసటి రోజు కూడా అధికారులు సహరించలేదని తెలిపారు. అనంతరం ఎట్టకేలకు నిబంధంనల మేరకు నామినేషన్ దాఖలు చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం శ్యామ్ రంగీలా నామినేష్‌ను తిరస్కరణకు గురైంది. దీనిపై బుధవారం శ్యామ్ రంగీలా స్పదించారు. ‘‘ప్రజాస్వామ్యం హత్యకు గురైంది. ఎన్నికల్లో పోటీ చేయటాన్ని ఎన్నికల సంఘం ఒక ఆటలా భావిస్తోంది. నా నామినేషన్‌ను తిరస్కరించారు. ప్రజల ముందు ఎన్నికల అధికారుల ఇలా ఎందుకు చేశారో? 24 గంటల్లోనే ప్రజలకు అర్థం అయింది. నేను సమర్పించిన పత్రాల్లో ఎటువంటి సమస్య లేదు. నాకు తెలుసు నేను అన్ని అవసరమైన పత్రాలు సమర్పించాను. నిన్నటి విజయం నేడు ఓడి పోయింది’’ అని శ్యామ్ రంగీలా అన్నారు.ఇక.. రాజస్థాన్‌లోని హనుమాన్‌గర్హ్ జిల్లాలోని మనక్తేరి బరనీ గ్రామంలో 1994లో పుట్టిన ఆయన అసలు పేరు శ్యామ్ సుందర్. యానిమేషన్ పట్టభద్రుడైన శ్యామ్ సరదాగా కామెడీ, మిమిక్రీ, స్టాండప్ కామెడీ చేస్తుండేవాడు. 2017లో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ పోటీలో నరేంద్ర మోదీ వాయిస్‌ను శ్యామ్ మిమిక్రీ చేశాడు. అప్పటి నుంచే ఆయన విశేష గుర్తింపు వచ్చింది. ప్రధాని మోదీ గొంతును మిమిక్రీ చేసిన తర్వాత శ్యామ్‌కు వేధింపులు మొదలయ్యాయి. శ్యామ్ 2022లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా మోదీని విమర్శలు చేస్తూ సంచలనం రేపారు. వారణాసి పార్లమెంట్ స్థానానికి ఏడో విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. జగిత్యాల జిల్లాలోని రాఘవపట్నం గ్రామానికి చెందిన ఈ కమెడియన్ అంచెలంచెలుగా ఎదిగి తనకంటూ పేరుప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. 2021లో అనూజతో పెళ్లి జరగ్గా గతేడాది ఆమె ప్రెగ్నెన్సీ వార్తను వెల్లడించాడు. కానీ ఈ ఏడాది ప్రారంభంలో అబార్షన్ అయిందని బ్యాడ్ న్యూస్ చెప్పాడు.ఐదు నెలల క్రితమే..తాజాగా ఓ ఇంటర్వ్యూలో అవినాష్ మాట్లాడుతూ.. నాది పెద్దలు కుదిర్చిన సంబంధం. 2021లో అనూజతో నా పెళ్లి జరిగింది. గతేడాది తను గర్భవతి. ఐదు నెలల క్రితమే బిడ్డను కోల్పోయాం. తెల్లవారితే డెలివరీ అనగా సడన్‌గా అనూజ కడుపులో బేబీ కదలికలు ఆగిపోయాయి. ఆస్పత్రికి తీసుకెళ్తే బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందన్నారు. ఉమ్మునీరు మింగడం వల్ల అలా జరిగి ఉండొచ్చన్నారు.అర్ధరాత్రి రోడ్డుపై..అప్పుడు నేను స్టేజీపై షూటింగ్లో ఉన్నాను. వెంటనే ఆస్పత్రికి వెళ్లి ఏదో ఒకటి చేయండని డాక్టర్ కాళ్ల మీద పడ్డాను. హార్ట్‌బీట్ ఆగిపోతే ఏం చేయలేమన్నారు. అర్ధరాత్రి ఒంటిగంటకు ఎటు వెళ్తున్నానో కూడా తెలీకుండా రోడ్డుపై ఏడ్చుకుంటూ ఒంటరిగా సాగిపోయాను. ఆ శిశువును బయటకు తీస్తే అచ్చం నాలాగే ఉన్నాడు. 2.75 కిలోల బరువుతో పుట్టాడు. కానీ వాడిలో ప్రాణం లేదు. ఇప్పటికీ నా భార్య అర్ధరాత్రిళ్లు కుమిలి కుమిలి ఏడుస్తోంది. తొమ్మిది నెలలు మోసింది కదా.. ఆ బాధ నుంచి బయటకు రాలేకపోతోంది' అని అవినాష్ ఎమోషనలయ్యాడు.చదవండి: Satish Joshi: స్టేజీపై కుప్పకూలి తుదిశ్వాస విడిచిన నటుడు -
ప్రముఖ కమెడియన్ మంచి మనసు.. ఏకంగా లక్షల సాయం
ప్రముఖ తమిళ హాస్య నటుడు అప్పుకుట్టి మంచి మనసు చాటుకున్నాడు. తాను చదివిన పాఠశాలకు రూ.11 లక్షలు విరాళం ఇచ్చి, తన ఔదార్యం చాటుకున్నాడు. అప్పుకుట్టి స్వస్థలం తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా నాథన్ కినరు. ఆ ప్రాంతంలోని ముత్తారమ్మన్ ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు అప్పుకుట్టి వెళ్లాడు. వేడుకల సందర్భంగా నాథన్ కినేరులోని తాను చదువుకున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్లాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్)గ్రామ ప్రజల కోరిక మేరకు అప్పుకుట్టి.. రూ.11 లక్షల ఖర్చుతో టేబుల్, కంప్యూటర్, టీవీ విద్యుత్ ఫ్యాన్లు, తదితర వస్తువులను కొని ఇచ్చాడు. దీని గురించి అప్పుకుట్టి మాట్లాడాడు. ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో తాను ఒకటి, రెండు తరగతులు చదివానని, అయితే ఇక్కడ కనీస వసతులు లేకపోవడంతో చదివే విద్యార్థుల సంఖ్య కూడా తక్కువగానే ఉందన్నారు. ఈ క్రమంలోనే పాఠశాలకు అవసరమైన సామగ్రి అందించానని అన్నాడు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉపాధి అవకాశాల్లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని అప్పుకుట్టి కోరాడు. అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మనం ఊరి బయట ఉన్నా, ఏడాదికి కొన్ని రోజులు ఊరిలోనే నివాసం ఉండాలని అప్పుకుట్టి తన అభిప్రాయం వెలిబుచ్చారు.(ఇదీ చదవండి: AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!) -
నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
తెలుగు వెండితెరపై టాప్ లేడీ కమెడియన్ ఎవరయా? అంటే అందరూ ముక్తకంఠంతో కోవై సరళ అని టక్కున సమాధానమిస్తారు. ఈ మలయాళ నటి హీరోయిన్గా, సహాయ నటిగా, కమెడియన్‌గా అలరించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో యాక్ట్ చేస్తూ కామెడీ క్వీన్‌గా పేరు తెచ్చుకుంది. తాజాగా ఓ షోలో పాల్గొన్న ఆమె ఆసక్తికర విషయాలు పంచుకుంది.అలా మొదలైంది'మూడుముళ్లు సినిమాను తమిళంలో తెరకెక్కించిన దర్శకుడు మా ఇంటి పక్కన ఉండేవారు. ఒకరోజు ఇంటి దగ్గర షూటింగ్ జరగ్గా అందులో నాకు అవకాశమిచ్చారు. ఆ మూవీ సూపర్ హిట్టయింది. అలా నా జర్నీ మొదలైంది. దాదాపు 15 చిత్రాల్లో హీరోయిన్గా చేశాను. 900కు పైగా సినిమాల్లో నటించాను. కోలీవుడ్ నా పుట్టినిల్లయితే టాలీవుడ్ నా మెట్టినిల్లు.పెళ్లెందుకు చేసుకోలేదు?స్వేచ్చ కోసమే నేను పెళ్లి చేసుకోలేదు. కచ్చితంగా వివాహం చేసుకోవాలని రూలేమీ లేదు కదా.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాం. ఇక్కడికి వచ్చాకే అన్ని బంధాలు ఏర్పడుతాయి. ఎంతోమంది పిల్లలు ఉన్నప్పటికీ చివరి రోజుల్లో ఒంటరి జీవితాన్ని గడుపుతుంటారు. మనల్ని చూసేందుకు ఒకరుండాలని ఎదురుచూడకూడదు. ధైర్యంగా ముందుకు సాగిపోవాలంతే!తెలుగులో బిజీసతీ లీలావతి సినిమా కోసం కమల్ హాసన్ పక్కన హీరోయిన్గా అవకాశం వచ్చింది. అప్పుడు నేను నమ్మలేదు. తర్వాత కమల్ ఫోన్ చేసి నా డేట్స్ కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. అయితే తెలుగులో బిజీగా ఉన్నానని చెప్తే నాకోసం ఐదు నెలలు వెయిట్ చేశారు. ఆ మూవీ చాలా బాగా వచ్చింది.ఆరోగ్యం బాగోలేదని రూమర్స్ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగోలేదని, ఖర్చులకు డబ్బుల్లేక దీన స్థితిలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. మా అక్కవాళ్లందరూ నన్ను ఇంట్లో నుంచి గెంటేశారని కూడా రాసేశారు. కానీ అలాంటివేమీ జరగలేదు. నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉన్నాను. అలాగే నాకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన కూడా లేదు' అని కోవై సరళ చెప్పుకొచ్చింది.చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. హీరోయిన్‌కు ఊహించని ప్రశ్న! -
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
కాలం వేగంగా పరిగెడుతోంది. ఒకప్పుడు వెండితెరపై వెలుగులు పంచిన ఎందరో తారలు తర్వాతి కాలంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. కమెడియన్ జనగరాజ్ కూడా ఇదే కోవలోకి వస్తాడు. అప్పట్లో తమిళ చిత్రపరిశ్రమలో సెంథిల్, గౌడమణి తర్వాత ఆ స్థాయిలో నవ్వులు పంచింది ఈయనే!కామెడీ రోల్స్‌తో..మొదట్లో దర్శకుడు భారతీరాజా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేశాడు. అలా భారతీరాజా సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. అందులో క్లిక్కవడంతో జనగరాజ్‌కు నటుడిగా అవకాశాలు వచ్చాయి. విలనిజం పండే పాత్రలు చేశాడు. కామెడీ రోల్స్‌తోనూ అదరగొట్టాడు. రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్స్‌తో కామెడీ సీన్లలో పోటీపడి నటించేవాడు. అప్పట్లో ఏడాదికి 15-20 సినిమాలు చేశాడు. జెట్ స్పీడులో మూవీస్ చేసిన ఆయన 2000వ సంవత్సరంలో అడుగుపెట్టేసరికి కాస్త స్లో అయ్యాడు.ఇండస్ట్రీకి దూరంతెలుగులో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో పోలీస్ ఇన్స్పెక్టర్గా నటించాడు. దాడి చిత్రంలోనూ యాక్ట్ చేశాడు. నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ పోయి తర్వాత ఇండస్ట్రీలోనే కనిపించకుండా పోయాడు. దీంతో అతడు అమెరికా వెళ్లి సెటిలైపోయాడని వార్తలు వచ్చాయి. కానీ ఓ ఇంటర్వ్యూలో అవన్నీ ఉట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు. దాదాపు పదేళ్ల తర్వాత విజయ్ సేతుపతి 96 మూవీతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల తాత అనే షార్ట్ ఫిలింలో నటించాడు.గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటుడుఈ షార్ట్ ఫిలింలో అతడు గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలాగే అతడి లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో నటుడు బక్కచిక్కిపోయి ఉన్నాడు. వయసు 68 ఏళ్లు కావడంతో వృద్ధాప్య చాయలు ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. నటుడి ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాకవుతున్నారు. ఒకప్పుడు ఎలా ఉండేవాడు.. ఇప్పుడేంటి? ఇలా అయిపోయాడని విచారం వ్యక్తం చేస్తున్నారు.చదవండి: భర్తతో విడిపోయిన టాలీవుడ్ హీరోయిన్.. ఒంటరినే అంటూ పోస్ట్ -
ప్రవీణ్‌తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
తెలుగు బుల్లితెర షోలలో ఒకప్పుడు మేల్ కమెడియన్లదే ఆధిపత్యం ఉండేది. రానురానూ పరిస్థితిలో మార్పు వచ్చింది. లేడీస్ తాము కూడా కామెడీ పండించగలమని నిరూపించుకున్నారు. కామెడీ క్వీన్స్‌గా పేరు తెచ్చుకుంటున్నారు. అలా పటాస్, జబర్దస్త్ షోలలో ఫటాఫట్ పంచ్‌లు పేలుస్తూ అందరికీ దగ్గరైంది ఫైమా. ప్రవీణ్‌తో లవ్!అదే షోలోని మరో కమెడియన్ ప్రవీణ్‌తో ఫైమా ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి రీల్స్ చేయడం, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకోవడం చూసి ఇదంతా నిజమే అని జనాలు ఫిక్సయిపోయారు. కానీ అంతలోనే బ్రేకప్ జరిగిందంటూ రూమర్స్ వచ్చాయి. ఆ మధ్య ప్రవీణ్ తన ప్రేమను ఫైమా రిజెక్ట్ చేసిందని వెల్లడించాడు. ఆ ఫేమ్ వాడుకున్నాంతాజా ఇంటర్వ్యూలో ఫైమా ఈ విషయం గురించి మాట్లాడింది. 'టీవీ షోలలో కనిపించే జోడీలేవీ నిజం కాదు. అవి నిజమని నమ్మొద్దు. ప్రవీణ్, నన్ను ఆన్‌స్క్రీన్‌లో జోడీగా చూపించారు. మా జంటను ఆదరించారు. దాన్ని వాడుకుంటూ యూట్యూబ్‌లో వీడియోలు చేశాం. ప్రవీణ్‌కు, నాకు మధ్య కొన్ని వ్యక్తిగత సమస్యలున్నాయి. అవి చెప్పుకోలేం.. అందుకే దూరం కావాల్సి వచ్చింది. మాట్లాడుకోవట్లేదు కూడా!వ్యక్తిగత విషయాల వల్లేమాకు గొడవ జరిగినప్పుడు దాన్ని పక్కనపెట్టేయాలే తప్ప దాన్ని అందరి ముందూ చెప్పుకుని గొడవను పెద్దది చెయ్యడం నాకిష్టం లేదు. అంతకుముందు మా రిలేషన్, అండర్స్టాండింగ్ అంతా బాగుండేది. వ్యక్తిగత విషయాల వల్ల మేము దూరమయ్యాం. అలాంటప్పుడు పర్సనల్‌గా నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి. సింపథీకానీ తనకు పేరెంట్స్ లేకపోవడంతో అతడు మీడియా ముందు మాట్లాడే మాటలు సింపథీకి దారి తీస్తున్నాయి. తన మీద నేను నింద వేయడం లేదు. కానీ తన మీద సింపథీతో అతడు ఏం చెప్పినా జనాలు నన్ను నెగెటివ్ చేస్తున్నారు. దయచేసి మా రిలేషన్‌కు ఏ పేరూ పెట్టకండి' అని ఫైమా చెప్పుకొచ్చింది.చదవండి: ఒక్క పొరపాటుతో జాతకమే మారిపోయింది! అసలు పేరేంటంటే? -
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
కోవై సరళ.. ఈ పేరు చెప్పగానే తెలుగు సినీ ప్రేక్షకుల పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆమె తెలుగు సినిమాల్లో కనిపించడం లేదు కానీ.. ఒకప్పుడు ఏ సినిమా రిలీజైన అందులో కోవై సరళ ఉండాల్సిందే. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్లో వచ్చే కామెడీని ఇష్టపడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అలాగే పలు సినిమాల్లో కమెడియన్ అలీకి జోడిగా నటించి నవ్వులు పూయించింది.చాలా కాలం తర్వాత ఈ సీనియర్ నటి బాక్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం మే3న ప్రేక్షులకు ముందుకు వచ్చింది. ఇందులో హీరోకి మేనత్తగా నటించిన కోవై సరళ.. తనదైన కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించింది.ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కోవై సరళ.. అలీ వ్యాఖ్యాతగా వ్యవహరించే ఓ షోలో పాల్గొని తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఒకప్పుడు కోయంబత్తూరుని షార్ట్‌కట్‌లో కోవై అని పిలిచేవారట. సరళ కోయంబత్తూరులోనే ఉండడంతో.. కోవై సరళ అని పిలవడం మొదలు పెట్టారట. అలా తనపేరు ఇండస్ట్రీలో కోవై సరళగా మారిందని ఈ స్టార్ కమెడిన్ చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. ‘నాకు నలుగురు సిస్టర్స్, ఒక బ్రదర్ ఉన్నాడు. అప్పట్లో నేను వరుస సినిమాలతో బిజీగా ఉండేదాన్ని. ఓ సినిమా షూటింగ్ కోసం ఊటీకి వెళ్లగా.. మా నాన్నగారు చనిపోయారనే విషయం తెలిసింది. అక్కడ ఓ పాట షూటింగ్ జరుగుతోంది. అందరూ వచ్చారు. ఆ పాటలో నేను బ్యాండ్ కొడుతూ సందడి చేయాలి. నాన్న మరణ వార్త తెలిసినా నేను ఆ పాటకు డ్యాన్స్ చేశా. ఎందుకంటే అది చిన్న ప్రొడక్షన్. ఆర్టిస్టులంతా వచ్చారు. నేను వెళ్లిపోతే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సివస్తుంది. దాని వల్ల నిర్మాతకు చాలా నష్టం వస్తుంది. అందుకే ఆ పాట షూటింగ్ కంప్లీట్ చేసి వెళ్లాను. మా నాన్నగారిని చివరి చూపు చూసుకోలేకపోయాను. బంధువులంతా నన్ను విమర్శించారు. నాన్న కంటే డబ్బులే ముఖ్యమని తిట్టుకున్నారు. అసలు విషయం వాళ్లకు తెలియదు’ అంటూ కోవై సరళ ఎమోషనల్ అయింది. -
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన పార్టీలు దూసుకుపోతున్నాయి. తమ అభ్యర్థుల గెలుపు కోసం అగ్రనేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటూ ప్రచార స్పీడ్ పెంచుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు కూడా మేము సైతం అంటూ.. ప్రధాని పార్టీల అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నారు. తాజాగా మిమిక్రీ ఆర్టిస్ట్, కమెడియన్ శ్యామ్ రంగీలా (29) ప్రధానమంత్రి నరేంద్రమోదీ పోటీ చేసే వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘ నేను వారణాసి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను. ఈ రోజుల్లో ఎవరినీ నమ్మడానికి లేదు. ఎప్పుడైనా నామినేషన్ ఉపసంహరించుకుంటారు’’ అని శ్యామ్ రంగీలా అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీని అనుకరిస్తూ పాపులారిటీ సంపాధించిన శ్యామ్ రంగీలా తన మద్దతుదారుకు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను వారణాసిలో పోటీ చేస్తానని ప్రకటించటంతో వచ్చిన స్పందనకు చాలా సంతోషంగా ఉంది. నేను నా వీడియోల ద్వారా నామినేషన్‌కు సంబంధించిన విషయాలు పంచుకుంటా’’ అని అన్నారు.वाराणसी से चुनाव लड़ने के ऐलान के बाद आप सबसे मिल रहे प्रेम से मैं उत्साहित हूँ, वाराणसी पहुँचने और नामांकन और चुनाव लड़ने को लेकर जल्द ही वीडियो के माध्यम से अपने विचार आप सबके सामने रखूँगावन्दे मातरम् - जय हिन्द #ShyamRangeelaforVaranasi #election— Shyam Rangeela (@ShyamRangeela) May 1, 2024 ‘‘2014లో నేను ప్రధాని మోదీ ఫాలోవర్ను.నేను మోదీకి మద్దతుగా వీడియోలు చేశాను. అదేవిధంగా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వీడియోలు షేర్ చేశాను. ఆ సమయంలోనే మరో 70 ఏళ్లు బీజేపీ ఓటు వేస్తాననుకున్నా. కానీ, గత పదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. నేను ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా వారణాసిలో ఎంపీగా పోటీ చేస్తున్నా. నేను వారం రోజుల్లో వారణాసికి వేళ్లి నామినేషన్ ఫైల్ చేస్తాను’’ అని కమెడియన్ శ్యామ్ రంగీలా తెలిపారు. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ పూర్వాంచల్‌లో బాహుబలి నేతగా పేరొందిన అజయ్‌రాయ్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. గత రెండు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగి మోదీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సీనియర్ నటి..!
సీనియర్ నటి కోవై సరళ మీకు గుర్తుందా? ఆమె పేరు వినగానే కామెడీ వెంటనే గుర్తుకొచ్చేస్తోందా? కోవై సరళ- బ్రహ్మానందం జోడీ చేసే కామెడీ ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెదలుతూనే ఉంటాయి. టాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తమిళనాడుకి చెందిన కోవై సరళ తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో నటించారు.ప్రస్తుతం చాలా తక్కువగా సినిమాల్లో కనిపిస్తున్నారు. చివరిసారిగా 2022లో వచ్చిన సెంబి చిత్రంలో కోవై సరళ నటించింది. తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సూపర్ హిట్ సిరీస్ అరణ్మనై పార్ట్-4 త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో తమన్నా, రాశిఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. బాక్ పేరుతో తెలుగులోనూ ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కు కోవై సరళ కూజా హాజరయ్యారు. సరికొత్త లుక్‌లో కనిపించి సందడి చేశారు. సినీ ప్రియులు గుర్తు పట్టలేని విధంగా ఆమె మారిపోయారు. కాగా.. ఈ చిత్రం మే3న థియేటర్లలో సందడి చేయనుంది. -
టాలీవుడ్లో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
టాలీవుడ్లో వరుస విషాదాలు నెలకొంటున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే చిత్రపరిశ్రమకు చెందిన గొప్ప వ్యక్తులు కన్నుమూయడం అందరినీ కలిచివేస్తోంది. ప్రముఖ రచయిత శ్రీ రామకృష్ణ, కాస్ట్యూమ్ డిజైనర్ దాసి సుదర్శన్ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా మరో నటుడు, కమెడియన్ విశ్వేశ్వర రావు(62) తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్ 2న) కన్నుమూశారు. వందలాది సినిమాల్లో.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. కాగా విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ. ఆరేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించారు. తన తొలి సినిమా పొట్టి ప్లీడరు. భక్తి పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్దోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, సిసింద్రీ చిట్టిబాబు, ఇంటి గౌరవం.. ఇలా బాలనటుడిగా 150కి పైగా సినిమాలు చేశారు. సొంతంగా యూట్యూబ్ ఛానల్ తర్వాతి కాలంలో కామెడీ, సహాయక పాత్రలతో పేరు గడించారు. ముఠా మేస్త్రీ, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి- ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు ఇలా దాదాపు రెండు వందల సినిమాల్లో తనదైన కామెడీ పండించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేసి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపారు. అందులో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవారు. చదవండి: నాలుగేళ్లుగా విడిగానే జీవిస్తున్నాం.. తను గొప్ప స్థాయిలో ఉంది: నటి మాజీ భర్త -
కమెడియన్ ఇంట వేడుకలు.. బెస్ట్‌ఫ్రెండ్‌ను పెళ్లాడిన నటి
కమెడియన్ రోబో శంకర్ ఇంట పెళ్లి వేడుకలు ఘనంగా జరిగాయి. అతడి కూతురు, నటి ఇంద్రజ పెళ్లిపీటలెక్కింది. 20 ఏళ్ల వయసులో తన క్లోజ్‌ఫ్రెండ్, డైరెక్టర్ కార్తీక్‌తో ఏడడుగులు వేసింది. ఫిబ్రవరి 2న ఎంగేజ్మెంట్ జరగ్గా ఆదివారం (మార్చి 24న) వీరి వివాహం కన్నులపండగ్గా జరిగింది. చెన్నైలో జరిగిన ఈ శుభకార్యానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు బంధుమిత్రులు, సెలబ్రిటీలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. గోరుముద్దలు.. 'దేవుడి ఆశీస్సులతో పెద్దల సమక్షంలో మనం ఒక్కటయ్యాం' అంటూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఇంద్రజ శంకర్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే పెళ్లి తర్వాత గోరుముద్దలు తినిపించుకున్న వీడియో సైతం పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఇంద్రజ.. తమిళ రియాలిటీ షో 'సర్వైవర్'తో గుర్తింపు పొందింది. తర్వాత బిగిల్(విజిల్) సినిమాలో నటించింది. తెలుగులో విశ్వక్ సేన్ 'పాగల్' మూవీలో 'ఈ సింగిల్ చిన్నోడే..' పాటలో కనిపించింది. కార్తీ 'విరుమాన్' చిత్రంలోనూ హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలి పాత్రలో యాక్ట్ చేసింది. స్టార్ హీరోలతో నటించిన కమెడియన్ ఆమె తండ్రి విషయానికి వస్తే.. రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయినందున శంకర్ కాస్తా రోబో శంకర్ అయ్యాడు. మిమిక్రీతో కెరీర్ ఆరంభించిన అతడు ఎప్పుడోగానీ సినిమాల్లో కనిపించేవాడు కాదు. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' సినిమాతో అందరి కంట్లో పడ్డాడు. ఈ మూవీ ద్వారా వచ్చిన క్రేజ్‌తో ఏడాదికి పది సినిమాలు చేసే స్థాయికి ఎదిగాడు. కోలీవుడ్‌లో దాదాపు అందరు హీరోలతోనూ నటించాడు. View this post on Instagram A post shared by sai sreedevi (@sai.sree.devi) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) View this post on Instagram A post shared by Behindwoods (@behindwoodsofficial) చదవండి: బాలీవుడ్ స్టార్స్.. తెలుగు సినిమాలకు ఎంత తీసుకుంటున్నారో తెలుసా? -
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
ఒక్క సీన్ కోసం 3 నెలలు వెయిట్ చేయించా.. చిరంజీవి కోపంతో!
టాలీవుడ్ టాప్ కమెడియన్లలో బాబూ మోహన్ ఒకరు. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా భిన్న రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించాడు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక సినిమాల సంఖ్య తగ్గించేశాడు. ఇటీవలే ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మూడు నెలలపాటు వెయిట్ చేయించా 'ముఠా మేస్త్రీ సినిమా సమయంలో జరిగిన సంఘటన ఇది. నా గురించి మూడు నెలలపాటు ఓ సీన్ షూటింగ్ ఆగిపోయింది. చిరంజీవికి విసుగెత్తిపోయి.. మీరేం చేస్తారో నాకనవసరం.. ఈరోజో, రేపో షూటింగ్ అయిపోవాలన్నాడు. రెండు గంటల సమయం ఎప్పుడిస్తారో చెప్పాలన్నాడు. ఓ టైం ఫిక్స్ చేసి రావాలని చెప్తే.. ప్రయత్నిస్తానన్నాను. ఇంకా ట్రై చేయడమేంటి? అని సీరియసయ్యాడు. నేను సారీ చెప్పాను. చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఆయనతో షూటింగ్ అంటే మహా ఇష్టం. కానీ బిజీగా ఉండటం వల్ల డేట్లు అడ్జస్ట్ చేయలేకపోయాను. ఓపక్క సంతోషం.. మరోపక్క బాధ ఇక అదంతా జరిగాక ఓ రోజు ఎలాగోలా టైం అడ్జస్ట్ చేసుకుని సారథి స్టూడియోలో అడుగుపెట్టాను. చిరంజీవి వచ్చేదాకా చెట్టు కింద పడుకుందామనుకున్నాను. తీరా అప్పటికే మెగాస్టార్ అక్కడున్నారు. షూటింగ్ నుంచి వచ్చావా? నీ కళ్లే చెప్తున్నాయి.. సినిమా వాళ్ల జీవితం ఇంతే.. అని బాధపడ్డాడు. బ్రష్ చేసుకోమని చెప్పి ఇంటి దగ్గరి నుంచి దోసెలు తెప్పించాడు. నేను ఆవురావురుమని తింటుంటే చూసి సంతోషించాడు, బాధపడ్డాడు. నాకూ తినాలని ఉంటుంది కానీ హీరోను కాబట్టి తినలేను కదా అని ఫీలయ్యాడు' అని చెప్పుకొచ్చాడు. రూ. 1 కోటి దాకా ముంచాడు తన ఆస్తి గురించి మాట్లాడుతూ.. 'డబ్బులు మంచం కింద పెట్టి మర్చిపోయేవాడిని. ఒకసారి నా బెడ్‌షీట్ దులిపితే రూ.12 లక్షలు బయటపడ్డాయి. క్షణం తీరిక లేకుండా కష్టపడేవాడిని. చాలామంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు. చెక్ బౌన్స్ అయ్యేవి. పోనీలే అని వదిలేసేవాళ్లం. ఒకసారి నేను మేనేజర్‌ను పెట్టుకున్నాను. కానీ అతడు కోటి రూపాయలు లెక్క చెప్పకుండా తినేశాడు. అప్పటినుంచి నేనే అన్నీ మెయింటైన్ చేసుకున్నాను' అని బాబూ మోహన్ తెలిపాడు. చదవండి: హృదయాలను మెలిపెట్టే సినిమా.. సడన్‌గా ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ అక్కడే! -
'అమ్మ కోసం పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు'.. జబర్దస్త్ శాంతి ఎమోషనల్!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. తన జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. గతంలో తన తల్లికి సర్జరీ కోసం ఇంటిని అమ్మేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. తాజాగా శాంతి తన మదర్‌కు మోకాలి సర్జరీ చేయించినట్లు వెల్లడించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ విషయాన్ని పోస్ట్ చేశారు. నెల్లూరులోని అపోలో ఆస్పత్రిలో అమ్మకు మోకాలి సర్జరీ విజయవంతంగా పూర్తైనట్లు శాంతి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా పంచుకున్నారు. డాక్టర్లు, ఆస్పత్రి సిబ్బంది తమను బాగా చూసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం మా అమ్మ ఆరోగ్యంతో ఉన్నారని శాంతి ఆనందం వ్యక్తం చేసింది. కాగా.. గతంలో అమ్మకు తెలియకుండానే సర్జరీ కోసం ఇంటిని అమ్మేస్తున్నట్లు చెబుతూ ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద ఏది ఉండదని అన్నారు. నా ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని శాంతి తెలిపింది. -
అప్పులబాధతో ఇంటిసామాన్లు అమ్మిన కమెడియన్.. ఎడమచేత్తో!
ఎక్కువమందికి కుడిచేతి వాటం, చాలా తక్కువమందికి ఎడమచేతి వాటం ఉంటుంది. కమెడియన్ రాళ్లపల్లి వెంకట నరసింహారావుది కుడిచేతివాటం.. కానీ ఆయన ఎడమచేత్తో భోజనం చేసేవారట! అంతేకాదు, పొరపాటున ఆయన తినేటప్పుడు ఎవరైనా అదేంటి? ఎడమ చేతితో భోజనం చేస్తున్నారు? అని అడిగారంటే వెంటనే తింటున్న ప్లేటు పక్కన పడేసి చేతులు కడుక్కునేవారట! ఎందుకయా.. అంటే తాను భోజనం చేసేటప్పుడు ఎవరైనా ఎడమచేత్తో తింటున్నావేంటని ప్రశ్నిస్తే ఆ భోజనాన్ని వదిలేస్తాను, ఇది నియమంగా పెట్టుకున్నాను అని గతంలో చెప్పారు. ఎవరైనా అడిగితే.. ఇదేం నియమం? అన్న ప్రశ్నకు.. ప్రతిసారి లెఫ్ట్ హ్యాండ్‌తోనే తింటానని అయ్యప్ప దేవునికి మొక్కుకున్నాను. మధ్యలో ఎవరైనా దానిగురించి అడిగితే అన్నం తినకుండా లేచేస్తాను. నేను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు ఈ నియమాన్ని దీక్షగా కొనసాగిస్తాను అని తెలిపారు. కానీ ఆ లక్ష్యమేంటనేది చెప్పలేదు. ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే జీవితాంతం ఇదే పాటిస్తానని నిర్ణయించుకోవడం గమనార్హం. ప్రతి ఏడాది.. బీకామ్ చదివిన రాళ్లపల్లి రైల్వేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఈయన అయ్యప్ప భక్తుడు. తన జీవితంలో దాదాపు 28 సార్లు శబరిమల వెళ్లారు. ఆగస్టు 15 ఆయన జన్మదినం. ప్రతి ఏడాది ఆరోజు ఓ పేదకళాకారుడికి సన్మానం చేసి 50 వేల రూపాయలు ఇచ్చేవారు. ఆర్థిక స్థితి అంతంతమాత్రంగా ఉన్న సమయంలోనూ ఈ నియమాన్ని తప్పలేదు. నాటకాలంటే ఆయనకు ప్రాణం.. ఒకానొక దశలో వాటికోసం అప్పులు కూడా చేశారు. ఏ స్థాయిలో అంటే ఓసారి ఇంట్లోని సోఫాను కూడా అమ్మేశారు. అప్పులవాళ్ల భయంతో ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లేవారు. ఇవన్నీ ఆయన శిష్యుడు తనికెళ్ల భరణి కళ్లారా చూశాడు. డబ్బు కోసం అంతలా ఇబ్బందిపడ్డారు. సినీ ఇండస్ట్రీకి వచ్చాకే ఆర్థిక పరిస్థితి మెరుగైంది. అదే బలహీనత ఆయనకున్న బలహీనత దానం చేయడం.. ఎంతోమందిని చదివించారు, పెళ్లిళ్లు చేశారు. ఆయన మంచితనాన్ని సొమ్ము చేసుకున్నవారూ ఉన్నారు. రాళ్లపల్లి జీవితంలో అత్యంత విషాదకర ఘటన.. పెద్ద కూతురు విజయమాధురి మరణం.. డాక్టర్ చదువు కోసం రష్యా వెళ్తూ చనిపోయింది. ఢిల్లీ వరకు ట్రైన్లో వెళ్తుండగా.. ఆ జర్నీలో తనకు బ్రెయిన్ ఫీవర్ వచ్చింది. ఆగ్రా రీచ్ అయ్యేలోపు చనిపోయింది. నీ పుట్టుకకు, నీ చావుకు కారణం నేనే అంటూ రాళ్లపల్లి గుండె పగిలేలా ఏడ్చారు. కూతుర్ని డాక్టర్ చేయాలన్నది ఆయన కల.. అందుకోసమే రష్యా పంపించాలనుకున్నారు. ఇంతలోనే కూతురు మరణించడంతో మానసికంగా కుంగిపోయారు. రాళ్లపల్లి సినిమాల సంగతి.. రాళ్లపల్లి స్త్రీ సినిమాతో కెరీర్ మొదలుపెట్టారు. శుభలేఖ, బడాయి బసవయ్య, జగన్నాథ రథచక్రాలు, అభిలాష, శ్రీవారికి ప్రేమలేఖ, అగ్నిపుత్రుడు, భలే మొగుడు, బామ్మ మాట బంగారు బాట, కూలీ నెం.1, చంద్రలేఖ, కలిసుందాం రా, నిన్ను చూడాలని, సింహాద్రి, నా అల్లుడు.. ఇలా అనేక సినిమాల్లో నటించారు. ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకుని అందుకోసం విశేషంగా కృషి చేశారు. రెండు నంది అవార్డులు అందుకున్న ఈ అనంతపురవాసి 2019 మేలో కన్నుమూశారు. చదవండి: పేద ప్రజల కోసం రజనీకాంత్ బిగ్ ప్లాన్..? -
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్‌గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
కోట్లాది ఆస్తి.. చివరి రోజుల్లో చేయిచాచి అడుక్కునే స్థాయికి..
ఆమె అంబాసిడర్ కారులో తిరుగుతుంటే మహారాణిలా బతుకుతోందనుకున్నారు. పెద్ద పెద్ద సినిమాలు వరుసపెట్టి చేస్తుంటే లెక్కలేనన్ని కోట్లు పోగేసిందనుకున్నారు. బంగ్లాలు కొంటుంటే.. తరాలు తరబడి కూర్చుని తిన్నా తరగని ఆస్తి సంపాదించిందనుకున్నారు. వెండితెరపై నవ్వులు పూయిస్తుంటే తనకు ఏ కష్టాలూ లేకుండా హాయిగా బతుకుతోందనుకున్నారు. కానీ, కంటికి కనిపించేదంతా, చెవులకు వినిపించేదంతా నిజం కాదు! ఇంతకీ ఆ నటి ఎవరో కాదు గిరిజ.. తిరుగులేని హాస్య నటిగా.. బ్లాక్ అండ్ వైట్ జమానాలో స్టార్ కమెడియన్ గిరిజ. మొదట్లో సెకండ్ హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తర్వాత కమెడియన్‌గా రాణించింది. కృష్ణా జిల్లాలోని కంకిపాడులో పుట్టిన ఈమెకు ఆమె తల్లి, నటి దాసరి రామతిలకం అన్ని వేళలా తోడుంది. తల్లి దగ్గరి నుంచి నటవారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది గిరిజ. ఆమె ప్రోత్సాహంతో కమెడియన్ కస్తూరి శివరావు 'పరమానందయ్య శిష్యులు' సినిమాలో హీరోయిన్గా నటించింది. తర్వాత రేలంగికి జోడీగా నటించి తిరుగులేని హాస్యనటిగా కీర్తి పొందింది. పాతాళ భైవరిలో 'నరుడా ఏమి నీ కోరిక' అన్న ఒకే ఒక్క డైలాగుతో జనాలకు కనెక్ట్ అయిపోయింది. 'కాశీకి పోయాను రామాహరి.. గంగ తీర్థంబు తెచ్చాను రామాహరీ..' ఈ పాట విన్నా గిరిజే గుర్తొస్తుంది. గిరిజపై రేలంగి ప్రత్యేక శ్రద్ధ ఆఫ్‌స్క్రీన్‌లో కూడా రేలంగి-గిరిజ సన్నిహితంగా ఉండేవారని అప్పట్లో ప్రచారం నడిచింది. రేలంగి ఆమెకు సినిమా ఆఫర్లు ఇప్పించేవాడు. తనకోసం కోసం ఓ ఇల్లు కూడా కొనిచ్చాడని చెబుతారు. 60వ దశకంలో కొత్త తారల రాకతో గిరిజకు కాస్త అవకాశాలు తగ్గాయి. అయితే నాలుగైదు మేడలు సంపాదించి దర్జాగా కార్లలో తిరిగే గిరిజ జీవితం పెళ్లి తర్వాత అత్యంత దుర్భరంగా మారింది. సన్యాసిరావు అనే వ్యక్తిని ఆమె తిరుపతిలో పెళ్లి చేసుకుంది. భర్త ఖాళీగా ఉంటే బాగోదని అతడి కోసం నిర్మాణ సంస్థ ప్రారంభించింది. అదే గిరిజ చేసిన అతి పెద్ద తప్పు! భర్తతో కలిసి భలే మాస్టారు, పవిత్ర హృదయాలు తీసి తీవ్రంగా నష్టపోపోయింది. ఆర్థికంగా చితికిపోయింది. పెళ్లయినప్పటి నుంచి కష్టాలే! అటు భర్త మాత్రం తన దగ్గరున్న ఆస్తిని నీళ్లలా ఖర్చుచేసేవాడు. ఆమె కొనుక్కున్న లగ్జరీ కార్లలో తిరుగుతూ జల్సాలు చేసేవాడు. తాగిన మైకంలో గిరిజ మీద చేయి చేసుకునేవాడు కూడా! ఒకరోజు అతడు తన చేతికందిన వస్తువుతో కొట్టడంతో గిరిజ తలకు పద్నాలుగు కుట్లు పడ్డాయి. భార్యనే కాదు, కూతురిని కూడా దగ్గరకు చేరదీసిన పాపాన పోలేదు. నాన్న అంటూ దగ్గరకు వెళ్తే కాలితో తన్నేవాడు. భార్యాపిల్లల్ని ముప్పుతిప్పలు పెట్టిన అతడు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాక ఒకరోజు ఉన్నట్లుండి చెప్పాపెట్టకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు, మళ్లీ తిరిగి రాలేదు. లంకంత ఇంట్లో ఏసీ రూముల్లో దర్జాగా బతికిన ఆమె తర్వాతి రోజుల్లో అప్పులపాలై తల్లి, కూతురితో కలిసి చెన్నైలో చిన్న గదిలోకి మారాల్సి వచ్చింది. చివరి రోజుల్లో కనీస అవసరాలకు ఇబ్బంది పడాల్సి వచ్చింది. బస్టాప్‌లో విగతజీవిగా ఆమె చివరి రోజులను కళ్లారా చూశానంటాడు డ్యాన్స్ మాస్టర్ సురేశ్ దాస. 'ఓరోజు గిరిజ చేతిలో మూటతో దీనస్థితిలో మా పెద్దమ్మవాళ్లింటికి వచ్చి తలుపు తట్టింది. డోర్ తీసిన నేను ఆమెను గుర్తుపట్టలేదు. దీంతో ఆమె తన పేరు గిరిజ అని చెప్పడంతో ఒక్కసారిగా షాకై.. లోపలకి రమ్మని కూర్చోమన్నాను. ఎంతో వైభవంగా బతికిన ఆమెనేనా ఇలాంటి దీన అవతారంలో ఉందని బాధపడ్డాను. కష్టాల్లో ఉన్నానంటూ పెద్దమ్మను డబ్బులు అడిగి తీసుకుంది. రెండు నెలల తర్వాత ఇలాగే వచ్చి కొంత డబ్బు తీసుకుంది. ఇది జరిగిన వారం రోజులకే ఆమె ఇంటికి దగ్గర్లోని బస్టాప్‌లో చనిపోయి కనిపించింది. ఆమె కూతురు ఎవరినో ప్రేమించి దుబాయ్ వెళ్లిపోయింది. గిరిజ చివరి రోజుల్లో చాలా ఘోరమైన బతుకు బతికింది. తన పరిస్థితిని నేను కళ్లారా చూశాను' అంటూ ఓ ఇంటర్వ్యూలో ఎమోషనలయ్యాడు. ఇండస్ట్రీ నుంచి పరామర్శించిందెవరంటే? అయితే గిరిజ కూతురు శ్రీగంగ మాత్రం ఆమె ఇంట్లోనే మరణించిందని పేర్కొంది. దీంతో ఇప్పటికీ ఆమె మరణం మిస్టరీగానే మిగిలిపోయింది. గిరిజ చనిపోయిన రోజు తనను చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్లలేదు. కానీ ఆ రోజు రాత్రి శోభన్‌బాబు ఫోన్ చేసి శ్రీగంగతో మాట్లాడారు. ఏ అవసరమున్నా తానున్నానంటూ అభయహస్తమిచ్చారు. ఆ మరుసటి రోజు అల్లు రామలింగయ్య స్వయంగా వెళ్లి పరామర్శించారు. శ్రీగంగ తర్వాతి కాలంలో తన పేరును సలీమాగా మార్చుకుంది. ఆమె తెలుగులో మేఘ సందేశం అనే సినిమా చేసింది. మలయాళంలో కొన్ని సినిమాలు చేసి అనంతరం రియల్ ఎస్టేట్ వైపు వెళ్లిపోయింది. -
హీరోగా మారిన కమెడియన్, నిజమైన పులితో యాక్టింగ్
హాస్యనటులు కథానాయకులుగా మారడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కోలీవుడ్‌లో వడివేలు, సంతానం, సూరి.. హాస్యనటులు కథానాయకులుగా అవతారమెత్తి రాణిస్తున్న విషయం తెలిసిందే. ఈ వరుసలో ఇప్పుడు నటుడు పుగళ్ చేరారు. 4 జే స్టూడియోస్ పతాకంపై ఎస్.రాజతంత్రం, జబాజాన్ కలిసి నిర్మించిన చిత్రం మిస్టర్ జూ కీపర్. పుగళ్ హీరోగా నటించిన ఇందులో నటి షెర్లిన్ కాంచాలా హీరోయిన్గా నటించారు. జె.సురేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. కథ చెప్పి మాయమయ్యాడు ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నటుడు సూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పుగళ్ మాట్లాడుతూ.. ముందుగా దర్శకుడు తనను కలిసి కథ చెప్పి ఆ తరువాత కనిపించలేదన్నారు. కొంత కాలం తరువాత మళ్లీ కనిపించి వెంటనే షూటింగ్‌కు బయలుదేరండి అని చెప్పారన్నారు. అలా ఈ మూవీలో అవకాశం వరించిందన్నారు. పులిని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించా ఈ మూవీలో నిజమైన పులితో నటించడం ముందు భయంగా అనిపించిందన్నారు. ఆ తరువాత దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నించానన్నారు. అలా ఈ చిత్రంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. సూరి మాట్లాడుతూ హీరోగా గెలవడం కంటే నిలబడడం కష్టమన్నారు. పుగళ్లో మంచి నటుడు ఉన్నాడని, హీరోగా వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకుంటారనే నమ్మకం ఉందని సూరి అన్నారు. చదవండి: 'వ్యూహం' విడుదల తేదీని ప్రకటించిన రామ్ గోపాల్ వర్మ -
కమెడియన్ కమ్ హీరో.. నిజ జీవితంలో రైతు!
సహజ నటనకు మారు పేరు నటుడు అప్పుకుట్టి. వెన్నెలా కబడీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఈయన పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి సినిమాకు అందం, రంగు కంటే అభినయం ముఖ్యం అని నిరూపించారు. అలా అళగర్‌సామియిన్ కుదిరై చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డు గెలుచుకున్నారు. ఇటీవల అవకాశాలు తగ్గినా.. శింబు హీరోగా నటించిన వెందు తనిందదుక్కాడు చిత్రంలో ముఖ్య భూమికను పోషించి లైమ్ టైమ్‌లోకి వచ్చారు. రెండు సినిమాలు ఇప్పుడు మళ్లీ కథానాయకుడిగా బిజీ అవుతున్నారు. ఈయన ప్రస్తుతం వాళ్గ వివసాయి, పిరందనాళ్ వాల్తుగళ్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో పాల్డిపో కదిరేశన్ నిర్మిస్తున్న చిత్రం వాళ్గ వివసాయి. పొన్ని మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసుంధర హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో అప్పుకుట్టి రైతుగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయన నటనకు మరోసారి జాతీయ అవార్డు అందుకుంటారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. స్టార్ హీరోల సినిమాలో చేయాలనుంది అప్పుకుట్టి మాట్లాడుతూ.. ఇలాంటి సినిమాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం. నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. అంతేకాదు, నేను కూడా రైతునే! పొలం దున్నడం, విత్తడం, ఎరువులు వేయడం, నీళ్లు పెట్టడం.. అన్నీ తెలుసు. అవన్నీ చేసినవాడినే కాబట్టి ఈ పాత్ర పెద్ద కష్టంగా అనిపించలేదు. ఇలా హీరోగా నటించడం సంతోషంగా ఉంది. అయితే రజనీకాంత్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది. చదవండి: గట్టిగానే కొట్టిన 'అంబాజీపేట మ్యారేజి బ్యాండు' కలెక్షన్స్.. నేడు ఈ థియేటర్స్‌లోకి హీరో,హీరోయిన్ -
కమెడియన్ కూతురి నిశ్చితార్థం.. నెల రోజుల్లో పెళ్లి!
తమిళ కమెడియన్ రోబో శంకర్ ఇంట త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. అతడి కూతురు ఇంద్రజకు డైరెక్టర్ కార్తీక్‌తో నిశ్చితార్థం జరిగింది. ఫిబ్రవరి 2న చెన్నైలో వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ శుభకార్యానికి ఇరు కుటుంబాలు సహా అతి దగ్గరి బంధుమిత్రులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇంద్రజ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నెల రోజుల్లోనే వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. విజిల్, పాగల్ సినిమాల్లో.. ఇందుకోసం రోబో శంకర్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. చెన్నైలో జరగబోయే ఈ వేడుకకుగానూ సినీ ప్రముఖులకు ఆహ్వానాలు అందనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇంద్రజ.. విజయ్ హీరోగా నటించిన బిగిల్(తెలుగులో విజిల్ పేరిట రిలీజైంది) మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించింది. తెలుగులో పాగల్ అనే సినిమా చేసింది. ఇందులో .ఈ సింగిల్ చిన్నోడే..' అనే పాటలో మాత్రమే కనిపిస్తుంది. కార్తీ 'విరుమాన్' మూవీలో హీరోయిన్ అదితి శంకర్ స్నేహితురాలిగా నటించింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేసే ఆలోచనలో ఉంది ఇంద్రజ. ఎవరీ రోబో శంకర్.. ఆమె తండ్రి రోబో శంకర్ విషయానికి వస్తే.. ఇతడు రోబో డ్యాన్స్‌తో ఫేమస్ అయ్యాడు. అందుకే ఆయనకు ఆ పేరు వచ్చింది. తనకు వచ్చిన మిమిక్రీతో సినిమాల్లో అడుగుపెట్టాడు. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ పోయాడు. కెరీర్ ప్రారంభించిన పదేళ్ల తర్వాతే అతడికి మంచి బ్రేక్ వచ్చింది. 'ఇదర్కుతనే ఆశైపట్టై బాలకుమార' అనే చిత్రంతో అందరి కళ్లలో పడ్డాడు. అప్పటివరకు ఏడాదికి ఒకటీరెండు సినిమాలు చేసే ఇతడు ఈ చిత్రం సక్సెస్ తర్వాత ఏకంగా 10 సినిమాలు చేసే స్థాయికి ఎదిగిపోయాడు. దాదాపు తమిళ స్టార్ హీరోలందరితోనూ కలిసి పని చేశాడు. View this post on Instagram A post shared by SmartDecors (EVENT PLANNERS) (@smart_decors.in) View this post on Instagram A post shared by @clicks_by_vishnu_kumar_ చదవండి: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఆమిర్‌తో, అతడి మాజీ భార్యతో.. నా రిలేషన్ ఎలా ఉందంటే? -
బ్రహ్మానందం తొలి సంపాదన ఎన్ని రూపాయలో తెలుసా?
ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. దగ్గర డబ్బులు లేవు ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు. లారీలకు రంగు వేసే పనిలో.. నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్‌తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
తెలుగులో తొలి స్టార్ కమెడియన్.. అనాథలా స్టేషన్లో శవం!
కమెడియన్ అనగానే బ్రహ్మానందం, సునీల్, వెన్నెల కిషోర్, అలీ.. ఇలా చాలామంది గుర్తొస్తారు.. అంతకు ముందు తరం అనగానే రేలంగి, రమణారెడ్డి, రాజబాబు గుర్తొస్తారు. కానీ వీళ్లందరి కన్నా ముందు వెండితెరపై నవ్వుల మాగాణిని పండించిన వ్యక్తి ఒకరున్నారు.. ఆయనే కస్తూరి శివరావు. తెలుగు సినీరంగంలో తొలి స్టార్ కమెడియన్‌గా కీర్తి గడించారు. నటుడిగా లెక్కపెట్టలేనంత డబ్బు సంపాదించారు. అదే రీతిలో దుబారా చేశారు. చివరకు కటిక పేదరికంలో ఒక అనామకుడిగా మరణించారు. ఆయన గురించి నేటి ప్రత్యేక కథనం.. స్టార్ కమెడియన్‌గా సాగిన ప్రస్థానం శివరావు 1913లో కాకినాడలో జన్మించారు. తండ్రి ఉపాధ్యాయుడు. తనయుడికేమో చదువు తప్ప అన్నింటా ఆసక్తే! శివరావు పద్యాలు, పాటలు పాడుతూ నాటక రంగంలో అడుగుపెట్టారు. అతడి కామెడీ మెచ్చి సినిమా ఛాన్సులు వచ్చాయి. 1939లో 'వరవిక్రయం'తో సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. 'స్వర్గసీమ' మూవీతో జనాలకు దగ్గరయ్యారు. బాలరాజు, గుణసుందరి కథ, లైలా మజ్ను, శ్రీ లక్ష్మమ్మ కథ, స్వప్న సుందరి.. అన్నీ సూపర్ హిట్ చిత్రాలే! పేరుకు పేరు.. డబ్బుకు డబ్బు. కస్తూరి పన్నీటితో స్నానం చేసేవారు. అప్పట్లో ఖరీదైన బ్యూక్ కారు కొని అందులో దర్జాగా తిరిగేవారు. స్క్రీన్‌పై ఆయన కనిపిస్తే ప్రేక్షకుల ముఖాల్లో తమకు తెలియకుండానే చిరునవ్వు వచ్చేది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలనుకున్న హీరోలు, నిర్మాతలు.. శివరావు తమ సినిమాలో ఉండాల్సిందేనని మంకు పట్టు పట్టేవారు. తనకు లక్ష రూపాయల పారితోషికం ఇవ్వడానికి కూడా వెనుకాడేవారు కాదంటే ఆయనకు ఎంత డిమాండ్ ఉందో ఊహించుకోవచ్చు. కార్లలో తిరిగిన కమెడియన్ సైకిల్ తొక్కే స్థాయికి ఏ ఆర్టిస్టూ కంటతడి పెట్టకూడదని ఈయన బలంగా నమ్మేవారు. జేబులో నోట్ల కట్టలు పెట్టుకుని తిరుగుతూ అడిగినవారికల్లా సాయం చేసేవారు. భూ, ధన.. దాన దర్మాలు చేశారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా.. సినిమా నిర్మించాలన్న ఆలోచనే ఆయన పాలిట శాపంగా మారింది. పరమానందయ్య శిష్యులు మూవీతో భారీ స్థాయిలో నష్టాలు, కష్టాలు అన్నీ చూశాడు. సైకిల్ తొక్కేచోట బ్యూక్ కార్లలో తిరిగిన శివరావు తిరిగి అదే పాత సైకిల్ తొక్కుకునే స్థాయికి పడిపోయారు. ఇల్లు, కారు, ఆస్తులు అన్నీ పోయాయి. ఒకప్పుడు కోట్ల ఆస్తులు అనుభవించిన శివరావుకి ఎవరినైనా అవకాశాలు అడగాలంటే నామోషీ! దీనికి తోడు తాగుడు అలవాటు కాస్తా వ్యసనమైపోయింది. అవకాశాలు తగ్గిపోవడంతో మళ్లీ నాటకరంగాన్ని నమ్ముకున్నారు. అయితే ఆయన మీద అభిమానంతో ఎన్టీ రామారావు కొన్ని సినిమాల్లో అవకాశాలు కల్పించారు. పొట్టకూటి కోసం నాటకానికి.. అదే చివరిది! కానీ షూటింగ్స్‌కు సైతం తాగివస్తుండటంతో తర్వాత ఛాన్సులు రావడమే గగనమైపోయింది. రాజకీయ కుట్రలకు బలైపోయి మరింత వెనకబడిపోయారు. తర్వాత శివరావు ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఆకలితో చావడం ఇష్టం లేక ఒంట్లో శక్తి లేకపోయినా నాటకాలు వేసేందుకు వెళ్లేవారు. అసలే బక్కప్రాణి.. పోషకాహారం లేక మరింత చిక్కి శల్యమైపోయాడు. చివరిసారిగా 1966లో తెనాలిలో ఓ నాటకంలో వేషం వేయడానికి వెళ్లారు. నాటకం ముగిశాక స్టేషన్‌కు చేరుకుని ఓ బల్ల మీద పడుకున్నాడు, తెల్లవారినా చలనం లేదు. ఎవరిదో అనాథ శవం అనుకున్నారంతా! కానీ ఓ ప్రయాణికుడు.. ఆయనను క్షుణ్ణంగా చూసి శివరావు అని గుర్తుపట్టాడు. ఈ విషయం ఆనోటా ఈనోటా స్టేజీ కళాకారుడు వెంకట్రామయ్యకు తెలిసింది. శివరావు దుస్థితి చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. మూడు రోజుల తర్వాత ఇంటికి చేరిన మృతదేహం ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపించేందుకు కారు మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ శవాన్ని తీసుకెళ్తే తన కారు మరెవరూ ఎక్కరని వాదించాడో కారు డ్రైవర్. దీంతో డిక్కీలో ఆయన మృతదేహాన్ని పెట్టారు. ఎన్నో అవాంతరాల మధ్య మూడు రోజుల తర్వాత కానీ ఆయన మృతదేహం ఇంటికి చేరకపోవడం విషాదం. స్టార్డమ్ లేదనో ఏమో కానీ చాలామంది తారలు ఆయన చివరి చూపుకు సైతం రాకపోవడం శోచనీయం. ఆఖరికి పాడె మోసేందుకు నలుగురు మనుషులకు డబ్బులిచ్చి పిలిపించడం అత్యంత దయనీయమైన విషయం! 'మొదటి రోజుల్లో మద్రాసులో సైకిలు తొక్కుతూ తిరిగేవాడిని. తర్వాత కార్లమీద తిరిగాను. ఇప్పుడు మళ్ళీ సైకిలు మీదనే తిరుగుతున్నాను. ఒకప్పుడు మా ఇంటి పేరైన కస్తూరి వాసనే నిత్యం గుప్పుమనేది. ఇప్పుడు ఇంటిపేరు కస్తూరి వారు - ఇంట్లో మాత్రం గబ్బిలాల కంపు' అని తన దుస్థితి మీద తానే జోకులు వేసుకునేవారు కస్తూరి శివరావు. చదవండి: యంగ్ హీరోకు బ్రేకప్ చెప్పేసిన సీనియర్ హీరోయిన్! -
ముచ్చటగా మూడో కారు కొన్న లేడీ కమెడియన్
సీరియల్ నటి, కమెడియన్ రోహిణి బుల్లితెర ప్రేక్షకులకు రౌడీ రోహిణిగానే బాగా సుపరిచితం. మొదట్లో సీరియల్స్‌లో కనిపించిన ఈమె ఆ తర్వాత జబర్దస్త్, అదిరింది వంటి కామెడీ షోలు సైతం చేసింది. 'మత్తు వదలరా', 'బలగం' వంటి సినిమాల్లో వినోదాన్ని పంచింది. 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్‌లో ఆమె చేసే కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే! ఆ టాలెంటెడ్ నటి తెలుగు బిగ్‌బాస్ మూడో సీజన్లోనూ పాల్గొంది. కొత్త కారు ధరెంతంటే? తాజాగా రోహిణి కొత్త కారు కొనుగోలు చేసింది. ఈ విషయాన్ని ఆమె యూట్యూబ్ ఛానల్ వేదికగా వెల్లడించింది. మొదటి కారు యాక్సిడెంట్లో దెబ్బతిందని, రెండో కారును ఈ మధ్యే అమ్మేయగా ఇప్పుడు ముచ్చటగా మూడో కారు కొన్నట్లు చెప్పింది. ఇది కియా సెల్టోస్ జీటీఎక్స్ ప్లస్ బ్రాండ్‌కు చెందినదంటూ తన కొత్త కారును చూపించింది. దానికి పూజ కూడా చేయించి. రోహిణి మాట్లాడుతూ.. 'మొదటి కారును రూ.9 లక్షలు పెట్టి తీసుకున్నాను. రెండో కారు కోసం రూ.14 లక్షలు పెట్టాను. ఇప్పుడీ కొత్త కారును రూ.25 లక్షలు పెట్టి తీసుకున్నాను. అదొక్కటే మిగిలుంది నిజానికి ఆడి కారు కొందామనుకున్నాను. కానీ దాని ప్రారంభ ధర రూ.57 లక్షల దాకా ఉంది. లోన్ పెట్టుకోవచ్చనుకున్నాను. కానీ ఎప్పుడెలా ఉంటుందోనని ఆ ఆలోచన విరమించుకున్నాను. చాలామంది నాకు మంచి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇండస్ట్రీలో పరిస్థితులు ఎప్పుడెలా ఉంటాయో తెలియవు కాబట్టి భూమి కొనుక్కోమని చెప్పారు. నిజమే కదా అనిపించింది. ఇప్పటికైతే ఇల్లు, కారు కొనేశాను.. ఎక్కడైనా ప్లాట్ తీసుకుని అది అమ్మానాన్న పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి వారికి బహుమతిగా ఇవ్వాలి. అదొక్కటే మిగిలి ఉంది' అని చెప్పుకొచ్చింది రోహిణి. చదవండి: ఒక్క పూట భోజనం.. ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించకుండా తినేవాడిని.. ప్రముఖ నటుడి కష్టాలు -
కమెడియన్ మృతి.. కుటుంబానికి సాయం చేసిన కెప్టెన్!
సీనియర్ సినీ హాస్యనటుడు బోండామణి (60) శనివారం రాత్రి చైన్నె సమీపంలోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. శ్రీలంకకు చెందిన ఈయన అక్కడ సైనికుల యుద్ధంలో కుటుంబ సభ్యులను కోల్పోగా తను మాత్రం తప్పించుకుని చైన్నెకి చేరుకున్నారు. చైన్నెలో సినీ ప్రయత్నాలు చేసి చివరకు 1981లో విడుదలైన పవును పవును దాన్ చిత్రం ద్వారా నటుడిగా రంగ ప్రవేశం చేశారు. ఆ చిత్రంలో చిన్న పాత్ర చేసి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మంచి హాస్యనటుడుగా గుర్తింపు పొందారు. వందల సినిమాల్లో నటించి.. అలా సుందర ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుధం, జిల్లా.. తదతిర చిత్రాల్లో నటించారు. దాదాపు 250కి పైగా చిత్రాలలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. వడివేలు వంటి హాస్యనటులతో కలిసి పలు చిత్రాలు చేశారు. కొంతకాలంగా బోండామణి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. తన రెండు కిడ్నీలు పాడవడంతో చైన్నె ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాదికి పైగా చికిత్స పొందుతూ వచ్చారు. తన ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో బోండామణికి పలువురు సినీ ప్రముఖులు ఆర్థిక సాయం అందించారు. స్వగృహంలో కన్నుమూత రోజూ డయాలసిస్ చేసుకుంటూ వచ్చిన బోండామణి డిసెంబర్ 23న రాత్రి 11 గంటల ప్రాంతంలో రాత్రి ఉన్నట్లుండి కింద పడిపోయారు. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా బోండామణి అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈయనకు భార్య మాధవి, కొడుకు సాయిరాం, కూతురు సాయికుమారి ఉన్నారు. బోండామణి మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాడ సంతాపాన్ని వ్యక్తం చేశారు. లక్ష సాయం కమెడియన్ మృతి పట్ల నటుడు, డీఎండీకే పార్టీ నేత విజయకాంత్ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ లక్ష రూపాయలను నటుడు మీసై రాజేంద్రన్ ద్వారా ఆయన భార్యకు అందించారు. కాగా ఆదివారం క్రోంపేటలోని శ్మశాన వాటికలో బోండామణి అంత్యక్రియలు నిర్వహించారు. బోండామణి కొడుకు సాయిరాం మీడియాతో మాట్లాడుతూ తమకు ఎలాంటి జీవనాధారం లేదని, అద్దె ఇంటిలోనే ఉంటున్నామని నడిగర్ సంఘం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశాడు. చదవండి: రొమాన్స్ సీన్లో నేనేం సిగ్గుపడలేదు కానీ..: ఆండ్రియా -
నవ్వుల రాజా.. ఇలా షాక్ ఇచ్చాడేంటి?
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ స్టాండ్‌అప్ కమెడియన్ నీల్ నందా(32) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన సన్నిహితుల్లో ఒకరు ట్వీట్ చేశారు. చిన్న వయసులోనే కమెడియన్ కన్నుమూయడంతో అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా మృతి పట్ల హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అయితే అతని మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. నీల్ నందా హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా రచయిత కూడా. నీల్ నందా ప్రధానంగా అట్లాంటాలో స్టాండప్ కామెడీ షోలను ప్రదర్శించారు. అతను కామెడీ సెంట్రల్, ఎంటీవీ, వైస్ల్యాండ్, హులు అనేక కామెడీ షోస్‌లో కూడా కనిపించాడు. అంతేకాకుండా వెస్ట్‌సైడ్ కామెడీ థియేటర్లో ప్రదర్శించిన అన్నెససరీ ఈవిల్ షో లాస్ఎంజిల్స్ వీక్లీ టాప్ -10లో చోటు దక్కించుకుంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం నీల్ నందా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఇంకా ధృవీకరించలేదు. 2013లో తన ప్రయాణాన్ని ప్రారంభించిన నీల్ ప్రముఖ షో జిమ్మీ కిమ్మెల్ షో ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్సైడ్ జోక్, హులు కమింగ్ టు ది స్టేజ్‌లో కూడా కనిపించాడు. నీల్ నందా మృతి చెందారనే వార్త సోషల్ మీడియాలో వ్యాపించడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ అభిమాన హాస్యనటుడికి సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. RIP Neel Nanda. Just at a total loss for words here. One of the nice and hardest working ones we had 💔 pic.twitter.com/unFtmN2xoU — Eli Olsberg (@EliOlsberg) December 23, 2023 RIP Neel Nanda 😔 you were one of the nicest, hardest working comedians I’ve ever called a friend and i hope you can be at peace brother ❤️🩹 — Matt Rife (@mattrife) December 23, 2023 -
ప్రముఖ హాస్య నటుడు మృతి.. సడన్‌గా అలా జరగడంతోనే
ప్రముఖ హాస్య నటుడు బొండా మణి (60) అకస్మాత్తుగా మృతి చెందారు. కొన్నిరోజుల క్రితం పలు అనారోగ్య సమస్యలతో ఈయన ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వచ్చాయి. పలువురు సాయం చేయగా కోలుకున్నట్లు కనిపించారు. ఇప్పుడేమో సడన్‌గా శనివారం రాత్రి 11:30 గంటల టైంలో ఇంట్లోనే కుప్పకూలిపోయారు. కుటుంబసభ్యులు.. ఈయన్ని హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: ఊరమాస్‌కి కేరాఫ్.. ఆ విషయంలో ఎక్స్పర్ట్.. ప్రశాంత్ నీల్ సక్సెస్ సీక్రెట్ ఇదే!) శ్రీలంకలో పుట్టిన బొండా మణి.. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేశారు. 1991లో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. 175కి పైగా సినిమాల్లో హాస్య పాత్రలు చేశారు. సుందర్ ట్రావెల్స్, మరుదమలై, విన్నర్, వేలాయుతం, జిల్లా తదితర చిత్రాలు.. ఈయనకు బాగా పేరు తెచ్చిపెట్టాయి. ఇకపోతే స్టార్ కమెడియన్ వడివేలుతో ఈయన కాంబోకి చాలా క్రేజ్ ఉంది. చాలా సీన్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని అలరిస్తుంటాయి. అయితే కొన్నాళ్ల ముందు మణి ఆరోగ్యం బాలేదని వార్తలొచ్చాయి. కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, డయాలసిస్ చేయించుకోవడానికి కూడా డబ్బుల్లేవని తెలియడంతో పలువురు తమిళ యాక్టర్స్.. ఆర్థిక సాయం చేశారు. దీంతో మణి కోలుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా అనుకోని విధంగా కుప్పకూలిపోయి తుదిశ్వాస విడిచారు. (ఇదీ చదవండి: 'సలార్' కలెక్షన్స్ రచ్చ.. రెండు రోజుల్లో ఏకంగా అన్ని కోట్లు) -
విభిన్నమైన కథాంశంతో వస్తోన్న స్టార్ కమెడియన్..!
నటుడు యోగిబాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం బోట్. నటి గౌరీ జీ.కిషన్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు వడివేలు హీరోగా హింసై అరసన్ 23 పులికేసి, విజయ్ హీరోగా పులి, ప్రకాష్ రాజ్, సంతానం, గంజా కరుప్పు ప్రధాన పాత్రలు పోషించిన అరై ఎన్ 305, రాఘవా లారెన్స్ హీరోగా నటించిన ఇరుంబు కోట్టై మురట్టు సింగం వంటి భారీ చిత్రాలను తెరకెక్కించారు. కాగా ఈ తాజా చిత్రాన్ని భారీ అండ్ మాన్వీ మూవీ మేకర్స్ పతాకంపై ప్రభా ప్రేమ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ బోట్ పూర్తిగా వైవిధ్య భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇది 1940 ప్రాంతంలో చైన్నెలో జపాన్ బాంబులతో దాడి చేసినప్పుడు పదిమంది తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బోట్ ఎక్కి తప్పించుకునే ప్రయత్నం చేస్తారన్నారు. అందులో నటుడు యోగి బాబు ఒకరిని చెప్పారు. అయితే ఆ బోట్ సముద్ర మధ్యలో ఆగిపోవడం, రంధ్రం పడి నీరు బోట్లోకి రావడం వంటి పలు కష్టాలను ఎదుర్కొంటారన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు ఎలా ప్రాణాలతో బయటపడ్డారు. వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిస్తున్న చిత్రమని చెప్పారు. షూటింగ్ ఎక్కువ భాగం సముద్రంలో చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు ఇది యాక్షన్, థ్రిల్లింగ్‌తో కూడిన పొలిటికల్ కామెడీ కథాచిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళం , కన్నడం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. కాగా.. ఈ జిబ్రాన్ సంగీతాన్ని, మాధేష్ మాణిక్యం ఛాయాగ్రహణం అందిస్తున్నారు. A uniquely intriguing #BOATTeaser that sparks curiosity. It's my pleasure to share this and extend congratulations to the entire crew ! https://t.co/qhgIovhnpJ#ThroughoutInMidSea @chimbu_deven @iYogibabu @Gourayy @Madumkeshprem @GhibranVaibodha @maaliandmaanvi @cde_off pic.twitter.com/OVc9evIXtx — chaitanya akkineni (@chay_akkineni) December 16, 2023 -
Redin Kingsley- Sangeetha: జైలర్ నటుడితో ఏడడుగులు.. పెళ్లి ఫోటోలు షేర్ చేసిన బుల్లితెర నటి (ఫోటోలు)
-
హనీమూన్ చెక్కేసిన నవదంపతులు.. పెళ్లి వీడియో చూశారా?
జైలర్ నటుడు, కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లి చేసుకున్నాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటి సంగీతను పెళ్లాడాడు. ఎటువంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా వివాహ శుభాకార్యాన్ని సింపుల్‌గా ముగించేశాడు. ఆదివారం నాడు (డిసెంబర్ 10న) బెంగళూరులో ఇరు కుటుంబాలు, అత్యంత దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. సడన్‌గా పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్న వీరు సడన్‌గా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేశారు. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు.. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన రెడిన్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ కొత్త జంట హనీమూన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. పెళ్లి తర్వాత తొలిసారి రెడిన్ కింగ్స్లీ తన భార్యతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. మరోవైపు సంగీత తన పెళ్లి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఇద్దరి బ్యాగ్రౌండ్ ఇదే.. రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్ర డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. అలాగే ఎల్కేజీ, సంతనాతిన్ ఏ1, జాక్‌పాట్, నెట్టికన్ వంటి పలు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. డాక్టర్, జైలర్ చిత్రాలతో మరింత గుర్తింపు సంపాదించుకున్నాడు. సంగీత విషయానికి వస్తే.. ఈ నటి అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాల్లో నటించింది. కానీ ఎక్కువగా బుల్లితెరపైనే సందడి చేసింది. పలు సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. View this post on Instagram A post shared by Redin Kingsly (@redin_kingsley) View this post on Instagram A post shared by ©️ Silvan Photography (@silvan__photography) చదవండి: కీరవాణితో వియ్యం.. నిజమేనన్న మురళీ మోహన్.. అప్పుడే పెళ్లి! -
46 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న కమెడియన్ (ఫొటోలు)
-
లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్
ప్రముఖ కమెడియన్ రెడిన్ కింగ్స్లీ లేటు వయసులో పెళ్లిపీటలెక్కాడు. 46 ఏళ్ల వయసున్న ఇతడు బుల్లితెర నటి సంగీత మెడలో మూడుముళ్లు వేశాడు. ఇరుకుటుంబ సభ్యులు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఆదివారం జరిగిన ఈ శుభకార్యానికి పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. నటుడు, డ్యాన్సర్ సతీష్ కృష్ణన్ నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త జంట పెళ్లి ఫోటోలను షేర్ చేశాడు. అలాగే ఇదేమీ సినిమా షూటింగ్ కాదని, వీళ్లు నిజంగానే పెళ్లి చేసుకున్నారని క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా రెడిన్ కింగ్స్లీ.. కోలమావు కోకిల అనే తమిళ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించాడు. ఈయన డైరెక్ట్ చేసిన దాదాపు అన్ని సినిమాల్లోనూ రెడిన్ యాక్ట్ చేశాడు. డాక్టర్ మూవీలో ఈయన పోషించిన భగత్ పాత్ర అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఎల్కేజీ, అన్నాత్తె, బీస్ట్, కాతువాకుల రెండు కాదల్, మార్క్ ఆంటోని, మట్టి కుస్తీ, జైలర్ వంటి పలు సినిమాలు చేశాడు. సంగీత విషయానికి వస్తే అరన్మనైక్కిలి, తిరుమల్ వంటి సినిమాలు చేసింది. ఎక్కువగా సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందింది. #RedinKingsley and #Sangeetha were in a relationship for more than an year or so ❤ They got married at chamundeshwari temple at Mysore pic.twitter.com/iDEQ9wtqaZ — Kollywood Pictures (@KollywoodPics) December 10, 2023 Actor #RedinKingsley sir married to a Serial Actress #Sangeetha mam.Congrats & Happy Marriage Life 💐❤️💫pic.twitter.com/ppMjGy0zmH — 𝘚𝘸𝘦𝘵𝘩𝘢™ (@Swetha_little_) December 10, 2023 చదవండి: క్యాసినో వల్ల డబ్బులు పోగొట్టుకున్నాం.. ఆ రోజు పోలీసులు.. -
Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..
కమెడియన్ కిర్రాక్ ఆర్పీ పెళ్లిపీటలెక్కాడు. ప్రేయసి లక్ష్మీ ప్రసన్న మెడలో మూడు ముళ్లు వేశాడు. బుధవారం (నవంబర్ 29న) నాడు విశాఖపట్నంలో ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ముందస్తు హడావుడి లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు ఆర్పీ. రహస్యంగా పెళ్లి చేసుకోవడం గురించి ఆర్పీ మాట్లాడుతూ.. 'అమ్మాయిది వైజాగ్. గతేడాది మా నిశ్చితార్థం జరిగింది. మేము ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటున్నాం. ఎంగేజ్మెంట్, తదితర కార్యక్రమాలకు సెలబ్రిటీలు, ఇతర వీఐపీలు వచ్చారు. ఈసారి కేవలం బంధుమిత్రుల సమక్షంలోనే పెళ్లి చేసుకోవాలని వైజాగ్ ఎంచుకున్నాం. అందుకే పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచాం' అని చెప్పుకొచ్చాడు. కాగా కిర్రాక్ ఆర్పీ, లక్ష్మీ ప్రసన్న మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతేడాది మేలో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకకు ధనరాజ్ సహా తదితరులు హాజరయ్యారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పెళ్లి చేసుకున్నారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించిన ఆర్పీ- లక్ష్మీ ప్రసన్నల జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆర్పీ ఏం చేస్తున్నాడు? జబర్దస్త్ కామెడీ షోలో వందల స్కిట్లు చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఆర్పీ. ఆ షో నుంచి తప్పుకున్న తర్వాత అతడు మరే ఇతర షోలలోనూ పెద్దగా కనిపించలేదు. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట కర్రీ పాయింట్ బిజినెస్ ప్రారంభించాడు. దీనికి అనూహ్యమైన స్పందన లభించింది. ఈ వ్యాపారం విజయవంతం కావడంతో ఆర్పీ ముందడుగు వేసి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పేరిట పలు బ్రాంచ్‌లు ఓపెన్ చేశాడు. చదవండి: ఫినాలే అస్త్ర గెలుపుకు దగ్గర్లో ఉంది ఈ నలుగురే! -
అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా?.. అదిరే అభి వీడియో వైరల్!
జబర్దస్త్ కామెడీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు అభినయ కృష్ణ. అభిమానులను ఆయనను అదిరే అభి అని పిలుస్తుంటారు. తన కామెడీ పంచ్‌లతో కామెడీ షోతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. 2002లో వచ్చిన ప్రభాస్ మూవీ ఈశ్వర్లో హీరో ఫ్రెండ్‌గా తొలిసారిగా నటించారు. ఆ తరువాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్ఎస్సీ, ఈగ చిత్రాలలో నటించారు. అయితే తాజాగా అదిరే అభి ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: చిన్నప్పుడే తండ్రి మరణం.. హోటల్లో వెయిటర్‌గా.. అత్తారింటికి దారేదీ నటుడి స్టోరీ!) అదిరే అభి వీడియోలో మాట్లాడుతూ..'మొన్ననే పక్కన టీ కొట్టుకు వెళ్లి టీ తాగుతున్నా. అప్పుడే టీ కొట్టు అతను మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ ఆ లాస్ట్ బాల్‌ను ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడుంటే సిక్స్ వెళ్లేది అన్నాడు. మిస్ చేశాడు కోహ్లీ అన్నాడు. నేను షాకయ్యా. విరాట్ కోహ్లీకి సిక్స్ ఎలా కొట్టాలో అతను చెబుతుంటే నాకు ఆశ్చర్యమనిపించింది. ఇంకో పక్కనున్న వ్యక్తి దేశంలో, రాష్ట్రంలో ఇలా చేసి ఉంటే వీళ్ల పార్టీ గెలిచేది అని అన్నాడు. అదోక షాక్. ఇంకొంతమంది సినిమాల గురించి చెప్పారు. ఈ సీన్ అలా కాకుండా ఇలా తీసి ఉంటే బాగుండేది అన్నారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..'నాకు అర్థం కానీ విషయం ఏంటంటే అంత నాలెడ్జ్ ఉన్నోడు ఇక్కడ టీ షాపు దగ్గర మాట్లాడాల్సిన అవసరమేంటి? అక్కడికెళ్లి కోహ్లీతో ఆడొచ్చు కదా? పాలిటిక్స్‌లో చేరి అధికారంలోకి రావొచ్చు కదా? సినిమాల్లో చేరి డైరెక్షన్ చేయొచ్చు కదా? బేసిక్‌గా ఏంటంటే మనం మనపని తప్పా అందరి పనులు చేసేస్తాం. అందరికంటే ఎక్కువ మనకే తెలుసనుకుంటాం. ఈరోజు కోహ్లీ ఎందుకు క్రికెట్ గ్రౌండ్లో ఉన్నాడు.. మనం టీ షాపు దగ్గర ఎందుకు ఉన్నామనేది రియలైజ్ చేసుకోవాలి. మనం మనపనిని ఫర్ఫెక్ట్గా చేసుకుంటే చాలు. ఎవరితో అవసరం లేదు. మన పని పక్కనపెట్టి.. అతను అలా ఆడితే బాగుండేది.. వాళ్లు ఇలా చేస్తే బాగుండేది.. అంటే మనల్ని నాశనం చేసుకున్నట్టే. అవతలి వాళ్లు అడిగితే చెప్పండి.. అంతేకానీ అడగకున్నా కూడా మనం మాట్లాడుతున్నామంటే టైం వేస్ట్ చేస్తున్నట్టు' అని అన్నారు. (ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న విజయ్ ఆంటోనీ క్రైమ్ థ్రిల్లర్..!) అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో అదిరే అభి మాటలకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అలాంటి వాళ్లతో మీకెందుకు అన్నా అని పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది మేధావులకు టైం కలిసిరాక అలా రోడ్లమీద తిరుగుతూ ఉంటారు అన్నా అంటూ నెటిజన్స్ రిప్లై ఇస్తున్నారు. ఏది ఏమైనా అదిరే అభి చెప్పిన మాటలు మనం కూడా ఎక్కడో ఒకచోట అలా మాట్లాడి ఉంటాం అని అనిపిస్తోంది. View this post on Instagram A post shared by Adhire Abhi (@abbhinav_actor) -
పెళ్లైన 13 రోజులకే కొట్టాడు, మరో అమ్మాయితో ఎఫైర్.. ఆత్మహత్య: నటి
విజయ్‌సాయి.. అమాయకపు చూపులతో అందరినీ నవ్వించాడు. హీరోగా, హీరో ఫ్రెండుగా, కమెడియన్‌గా.. భిన్న రకాల పాత్రలు పోషించి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యాడు. కానీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 2006లో నటి వనితా రెడ్డిని పెళ్లి చేసుకోగా ఓ పాప కూడా పుట్టింది. కానీ, కొంతకాలానికే విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. 2015లో ఇద్దరూ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. 2017లో తన గదిలో ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. తన చావుకు వనితాయే కారణమంటూ సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. పారిపోయి పెళ్లి చేసుకున్నాం.. ఇకపోతే ఇటీవల వనితా రెడ్డి ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమవివాహం- విడాకుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'వాల్‌పోస్టర్ మూవీ షూటింగ్లో విజయ్‌కు జంటగా నటించాను. ఆ సినిమా షూటింగ్‌లోనే క్లోజయ్యాం. ఇద్దరం ప్రేమించుకున్నాం. రైల్లో ఉన్నప్పుడే నాకు రింగు తొడిగాడు. ఇంట్లో మా ప్రేమను ఒప్పుకోలేదు. అప్పుడు శ్రీశైలం వెళ్లగా అక్కడ కారులోనే నాకు పసుపుతాడు కట్టేశాడు. నేను ఆ పసుపుతాడు ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. ఒకానొక సమయంలో మా అమ్మకు దొరికిపోయాను. దీంతో తను రోడ్డుపైనే నా తాళి తెంపేసి రచ్చ చేసింది. పెళ్లైన 13 రోజులకే కొట్టడం మొదలుపెట్టాడు ఇంతదాకా వచ్చాక చేసేదేముందని ఇంట్లో నుంచి డబ్బు, బంగారం తీసుకుని పారిపోయి విజయ్ దగ్గరకు వచ్చేశాను. అప్పుడు యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాం. కానీ తన నిజ స్వరూపం నెమ్మదిగా తెలిసి వచ్చింది. పెళ్లైన 13 రోజులకే నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. నాకు సినిమా ఛాన్సులు వస్తే చేయకూడదని కండీషన్ పెట్టాడు. మా ఇంటి నుంచి డబ్బు తీసుకురమ్మని హింసించేవాడు. అలా చాలా ఆస్తి తనకు ఇచ్చేశాను. అతడి వేధింపులు భరించలేక 2013లోనే విడాకులకు దరఖాస్తు చేశాను. మాకు ఓ పాప ఉంది. కోర్టు నిర్ణయం ప్రకారం ప్రతివారం పాపను చూపించాలన్నారు. అలా నా కూతురు వారంలో ఒకరోజు తనతో ఉండేది. చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చా నా మనసు ఎప్పుడు విరిగిపోయిందంటే.. నా స్థానంలో ఇంకొకరిని తీసుకు వచ్చినప్పుడు! పెళ్లి కాకముందే తనకు మరో అమ్మాయితో ఎఫైర్ ఉంది. ఈ విషయం తెలిశాక తన ముఖం కూడా చూడాలనుకోలేదు. కానీ చనిపోయినప్పుడు తనను పట్టుకుని ఏడ్చాను. ఎందుకు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నావని గుండెలవిసేలా ఏడ్చాను. ఇప్పటికీ కొన్ని కేసులు కోర్టులోనే ఉన్నాయి. నా కూతురి కోసం ఇప్పుడిప్పుడే నా కెరీర్‌ను తిరిగి ప్రారంభిస్తున్నాను' అని చెప్పుకొచ్చింది వనితా రెడ్డి. చదవండి: అమర్ చాలా మంచివాడు.. దయచేసి అలా మాట్లాడొద్దంటూ నటుడి తల్లి భావోద్వేగం -
హోటల్ బయట ఏడ్చిన కోవై సరళ.. పెళ్లి చేసుకోకపోవడానికి కారణమిదే!
కోవై సరళ.. చాలామందికి ఈ పేరు వినగానే పెదాలపై చిన్నటి చిరునవ్వు వస్తుంది. బ్రహ్మానందంతో జత కట్టి ఈమె పండించిన కామెడీకైతే పొట్టచెక్కలయ్యేలా నవ్వాల్సిందే! తమిళంలో వడివేలుకు జంటగా నటించి అక్కడా నవ్వుల రసాన్ని పంచింది. ఉత్తమ హాస్యనటిగా రెండు నందులు సహా అనేక అవార్డులు అందుకుంది. రాష్ట్రస్థాయిలోనూ బోలెడన్ని పురస్కారాలు అందుకున్న ఈ నటి తన జీవితంలో మాత్రం తోడు కావాలనుకోలేదు. అసలు తన సినీప్రస్థానం ఎలా మొదలైంది? ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిందో చూద్దాం.. ఆయన ప్రశ్నలకు వణికిపోయిన కోవై సరళ ఆరో తరగతి చదువుతున్నప్పుడు కోవై సరళ తన అభిమాన నటుడు ఎమ్జీఆర్ను చూసేందుకు కోయంబత్తూరులోని హోటల్ బయట నిలుచుంది. స్కూల్ డ్రెస్‌లో రెండు జళ్లు వేసుకుని ఉన్న ఆమె ఎమ్జీఆర్ను చూడలేకపోవడంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్జీఆర్ ఆమెను ఇంటికి పిలిచి మరీ తన గురించి ఆరా తీశాడు. ఏ స్కూలులో చదువుతున్నావని అడిగాడు. కొంత సంతోషం, మరికొంత భయంతోనే అన్నింటికీ సమాధానాలు ఇచ్చుకుంటూ పోయింది. తన మీద పాఠశాలలో ఫిర్యాదు చేస్తాడేమోనని వణికిపోయింది సరళ. కానీ సరిగ్గా నెల రోజులకు సరళ చదువుతున్న పాఠశాలకు ఆమె స్కూల్ ఫీజు పంపించాడు ఎమ్జీఆర్. పదో తరగతికే గర్భిణీగా అప్పటినుంచి అతడిని మరింత ఆరాధించింది. తనలాగే వెండితెరపైనా కనిపించాలనుకుంది. అనుకున్నది సాధించింది. పాఠశాలలో చదువుకునే రోజుల్లోనే వెళ్లి రత్తం(1979) చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. పదో తరగతికే గర్భిణీగా నటించింది. రెండో సినిమా ముందనై ముడిచ్చులో గర్భిణీ స్త్రీగా యాక్ట్ చేసింది. అంత చిన్న వయసులో గర్భిణీగా నటించే సాహసం చేసిందంటే తన అంకితభావం ఎటువంటిదో అర్థమవుతోంది. తనకు వచ్చిన అవకాశాలనల్లా కాదనకుండా చేసుకుంటూ పోయింది. పాత్రలకు ప్రాణం పోసింది.. తన కామెడీతో సినిమాలను విజయపథం వైపు నడిపించింది. ఎన్నో వందల సినిమాలు చేసిన ఆమె ప్రస్తుతం ఓపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ బుల్లితెరపై టీవీ యాంకర్‌గా, జడ్జిగానూ వ్యవహరిస్తోంది. 61 ఏళ్లొచ్చినా ఒంటరిగానే.. పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు, అఖండ విజయాలు కైవసం చేసుకున్న కోవై సరళ ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 61 సంవత్సరాలు. తన కుటుంబంలో కోవై సరళనే పెద్ద.. తన తర్వాత నలుగురు చెల్లెళ్లు ఉన్నారు. తను సంపాదించిందంతా కుటుంబానికే ఖర్చుపెట్టేది. ఏనాడూ స్వార్థంగా ఆలోచించేది కాదు. చెల్లెళ్లకు దగ్గరుండి పెళ్లి చేసిన ఈ హాస్యనటి వారికి పుట్టిన పిల్లల బాధ్యతను సైతం తన భుజాన వేసుకుంది. తన సొంత ఖర్చులతో వారిని చదివించింది. మనవరాళ్లను కూడా చూసుకుంటోంది. వారి కోసం జీవితాన్నే త్యాగం మరోవైపు నిరుపేదలకు, ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంది. తన చెల్లెళ్ల కోసం అనునిత్యం ఆలోచింది తన జీవితాన్నే త్యాగం చేసింది. తను కూడా ఇల్లాలిగా మారాలని ఏనాడూ ఆలోచించలేదు. ప్రస్తుతం కోవై సరళ వారి పిల్లలకు, మనవరాళ్లకు తన ప్రేమను పంచుతోంది. ఒంటరిగా ఉండటం కూడా ఈ హాస్యనటికి ఇష్టం. అందుకే ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గా మిగిలిపోయిందనీ అంటుంటారు! చదవండి: డబుల్ మీనింగ్ డైలాగ్స్.. కోరుకునేది ఒక్కటేనంటున్న గురు హీరోయిన్ -
ఆ కారణం వల్లే సినిమాలకు దూరమైన ఆర్య కమెడియన్, త్వరలో పెళ్లి!
చిత్రం సినిమాతో పేరు తెచ్చుకున్న కమెడియన్ బబ్లూ ఆర్య సినిమాతో అందరికీ దగ్గరయ్యాడు. తెలుగులో స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించిన అతడు తన కామెడీ టైమింగ్‌తో ఎందరినో నవ్వించాడు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతడు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. 5 ఏళ్లకే సినిమాల్లోకి.. 'నా మొదటి చిత్రం ముద్దుల మేనల్లుడు. అప్పుడు నా వయసు 5 ఏళ్లు. అందులో నాజర్ కొడుకిగా నటించాను. చైల్డ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేశాను. 11 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు సీరియల్ చేశాను. నా అసలు పేరు సదా ఆనంద్. ఈ సీరియల్ చేసేటప్పుడు జంధ్యాలగారు బబ్లూ అన్న పేరు పెట్టారు. అప్పటినుంచి అదే పేరు స్థిరపడిపోయింది. నేను 10వ తరగతి చదివేటప్పుడు చిత్రం మూవీ చేశాను. ఆ సినిమాతో బోలెడన్ని అవకాశాలు వచ్చాయి. మా నాన్న బాడీ బిల్డర్. ఆయన సినిమాలు చేయాలని ఎంతో ప్రయత్నించాడు, కానీ కుదర్లేదు. అయితే 'చిత్రం'లో నాతోపాటు ఓ సాంగ్‌లో నటించాడు. నాకిష్టమైన ముగ్గురూ చనిపోయారు 2012లో నాన్న చనిపోయాడు. గతేడాది చెల్లి మరణించింది. ఈ ఏడాది జనవరిలో నాన్న సోదరి కొడుకు చనిపోయాడు. అలా నాకు ఇష్టమైన ముగ్గురు చనిపోయారు. మా నాన్న మరణంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. అప్పుడు ఆఫర్స్ వదిలేసుకున్నాను. బ్యాంకాక్ వెళ్లిపోయి రెండేళ్లకుపైగా అక్కడే ఉన్నాను. అలా సినిమాలకు దూరమయ్యాను. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాల మీద దృష్టి పెట్టాను. ప్రస్తుతం సొంతంగా ఓ ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. అలాగే యాక్టింగ్ అకాడమీలోనూ పని చేస్తున్నాను. పెళ్లి వాయిదా పెళ్లి విషయానికి వస్తే.. లాక్డౌన్లో ఆ అమ్మాయిని ప్రేమించాను. మూడేళ్లుగా లవ్ చేసుకున్నాం. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను. నిజానికి ఈ ఏడాదే పెళ్లి చేసుకోవాల్సింది. కానీ చెల్లి మరణంతో అది వాయిదా పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నా పెళ్లి జరుగుతుంది' అని చెప్పుకొచ్చాడు బబ్లూ. చదవండి: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆనంద్ హీరో -
చనిపోయేవరకు నన్ను వదలవేమో.. ఏడ్చేసిన జబర్దస్త్ కమెడియన్
జీవితంలో కష్టసుఖాలు సర్వసాధారణం. అయితే తన లైఫ్‌లో మాత్రం చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కష్టాలే తిష్ట వేసుకుని కూర్చున్నాయంటున్నాడు జబర్దస్త్ కమెడియన్ జీవన్. బుల్లితెరపై కమెడియన్‌గా క్లిక్ అయిన సమయంలో అనారోగ్యానికి గురై షో నుంచి తప్పుకున్నాడు. అనారోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడు. చాలాకాలం తర్వాత తాజాగా ఓ షోలో హాజరై తన కన్నీటి కష్టాలను వివరించాడు. ఆటోకు డబ్బుల్లేక నడుచుకుంటూ వెళ్లేవాళ్లం 'ఒక పేరు వచ్చాక కష్టాలకు చెక్ పడుతుందనుకున్నాను. కానీ పేరు వచ్చిన తర్వాత కూడా ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీలోకి వచ్చాను. కృష్ణవంశీ 'మహాత్మ' సినిమాలో నీలపురి గాజుల ఓ నీలవేణి పాట పాడింది మేమే.. కానీ పాడింది మేమేనని ఎక్కడా పేరు వేయలేదు. అలా అక్కడ స్ట్రక్ అయిపోయాను. తర్వాత ఫణి అన్న అభి అన్నకు పరిచయం చేశాడు. అభి అన్న ఇంటికి వెళ్లడానికి డబ్బుల్లేక.. హైపర్ ఆది అన్న, నేను కృష్ణా నగర్ నుంచి బోయిన్పల్లి చౌరస్తా వరకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ షేర్ ఆటోలో వెళ్లేవాళ్లం. ఆ దేవుడు నాపై కరుణ చూపలేదు జబర్దస్త్ షోలో మంచి పేరొచ్చింది. టీం లీడర్ స్థాయికి వెళ్లాను. కానీ ఎందుకో నామీద దేవుడు కరుణ చూపలేదు. నన్ను చావు అంచుల వరకు తీసుకెళ్లాడు. చిన్నప్పటి నుంచి కష్టాలే.. నేను చనిపోయేవరకు ఈ కష్టాలు నన్ను వదిలిపోవేమో అనిపిస్తోంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు జీవన్. అక్కడే ఉన్న ఫణి సైతం తాను పడ్డ బాధలను చెప్పుకొచ్చాడు. సినిమాలు చేద్దామని జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాను. కానీ అక్కడ సినిమాల్లేవు. షోలు చేద్దామంటే అవి కూడా లేవు. ఆ సమయంలోనే నాన్నకు క్యాన్సర్ వచ్చింది అని చెప్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. చదవండి: స్టేజీపై యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన.. అమ్మాయి నోరు నొక్కేస్తారంటూ మండిపడ్డ చిన్మయి -
హీరో అవ్వాలనుకున్నా, సీక్రెట్‌గా పెళ్లి.. ఇండస్ట్రీలో కష్టాలు..: గడ్డం నవీన్
జబర్దస్త్ నవీన్.. బుల్లితెరపై, వెండితెరపై నవ్వుల జల్లు కురిపిస్తూనే ఉన్నాడు. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు.. ఇలా ఎన్నో పేర్లతో పాపులర్ అయ్యాడు. వరుస సినిమాలతో, విభిన్న పాత్రలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. 25 ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా వెలుగొందుతున్న జబర్దస్త్ గడ్డం నవీన్ బర్త్‌డే నేడు (సెప్టెంబర్ 1). ఈ సందర్భంగా తన గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ► ఇది 47వ పుట్టిన రోజు.. 1995లో సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాను. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఈ సంవత్సరం చాలా సంతృప్తికరమైన జర్నీ సాగుతోంది. గేమ్ చేంజర్, సైంధవ్ సహా 10 సినిమాలు చేస్తున్నాను. మా పెద్దబాబు డిగ్రీలో గోల్డ్ మెడల్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. ► పుట్టిపెరిగింది సికింద్రాబాద్. మా తల్లిదండ్రులు కృష్ణ, సక్కుబాయి. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. అయినా ఆర్థిక కష్టాలు మా కుటుంబాన్ని వెంటాడేవి. చదువుకుంటూనే మెకానిక్ షాపు, బట్టల షాపు, చిరు వ్యాపారాలు చేశాను. ఒకానొక సమయంలో ఆఫీస్ బాయ్‌గా కూడా పని చేశాను. ఆ క్రమంలోనే 1995 నుంచి సినీ అవకాశాల కోసం ప్రయత్నించాను. అప్పుడే పెళ్లిచేసుకున్నాను. నా భార్య పేరు బబితా. ఇద్దరు కొడుకులు పవన్ దినేష్, అక్షయ్ కుమార్. లోకల్ కాబట్టి సినీఇండస్ట్రీలో ఆకలి బాధలు పడలేదు కానీ.. మిగతా ఇబ్బందులు ఫేస్ చేశాను. ► సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండేది. సురేందర్ రెడ్డి గారు నన్ను సెలెక్ట్ చేసి అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ► హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇప్పటివరకు 150 సినిమాలు చేశాను. నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలన్న కల కూడా ఉంది. ► జబర్దస్త్, సినిమాలు, ఈవెంట్స్ చేస్తున్నాను కానీ.. ఆ పేమెంట్ నా కుటుంబ పోషణకు ఉపయోగపడుతుంది. అయితే ఉద్యోగం చేసేవాడిని, కానీ ఇప్పుడు వెళ్లడం లేదు. మా కంపెనీ యాజమానీ దినేష్ గారు.. ఎప్పుడు వెళ్లినా నాకు ఉద్యోగం ఇస్తారు. అందుకే ఆ కంపెనీకి ఇంకా రాజీనామా చేయలేదు. సొంత ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ ఉంది. అప్పటి వరకు మీ సహకారంతో కష్టపడుతూనే ఉంటాను. చదవండి: ఫోటో షేర్ చేసిన మంచు లక్ష్మి.. విష్ణుకు ఎందుకు రాఖీ కట్టలేదంటూ..? -
నటుడు వడివేలు ఇంట విషాదం..
తమిళనాడు: ప్రముఖ నటుడు వడివేలు ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమ్ముడు జగదీశ్వరన్(55) ఆదివారం(ఆగస్టు 27) కన్నుమూశారు. కాలేయ సంబంధిత సమస్యతో సతమతమవుతున్న ఆయన కొద్ది రోజులుగా తమిళనాడు మధురైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలేయ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతోనే ఆయన ఆరోగ్యం విషమించి చనిపోయారు. కాగా జగదీశ్వరీన్.. శింబు 'కాదల్ అలైవిట్టలై' సినిమాతో సహా పలు చిత్రాల్లో నటుడిగా తళుక్కుమని మెరిశారు. కానీ ఇండస్ట్రీలో అంతగా అవకాశాలు రాకపోవడంతో చెన్నై నుంచి మధురై వెళ్లిపోయాడు. అక్కడ ఒక వస్త్రాల షాపు పెట్టుకుని జీవనం కొనసాగించాడు. ఇదిలా ఉంటే కొద్ది నెలల క్రితమే వడివేలు తల్లి మరణించింది. ఈ విషాదం నుంచి తేరుకోమందే తమ్ముడు కూడా చనిపోవడంతో ఆయన ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: తాగమని బలవంతం, మందుకు బానిసయ్యా.. తాగుబోతునని నా కూతుర్ని కూడా.. -
ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ!
జబర్దస్త్ శాంతి అలియాస్ శాంతిస్వరూప్ పరిచయం అక్కర్లేని పేరు. ప్రేక్షకులందరికీ జబర్దస్త్ శాంతిగానే పేరు ముద్రపడిపోయింది. కామెడీ షోతో గుర్తింపు తెచ్చుకున్న శాంతి బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. తన కామెడీతో అందరినీ నవ్వించిన జబర్దస్త్ శాంతి.. అయితే ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. అతని తల్లికి ప్రస్తుతం సర్జరీ చేయాల్సి వచ్చిందని తెలిపారు. అమ్మ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులు లేకపోవడంతో ఏకంగా తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్ ) ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. అమ్మకు తెలియకుండానే ఇంటిని అమ్మేస్తున్నట్లు ఎమోషనలయ్యారు. అమ్మకు హెల్త్ బాగాలేకపోవడంతో నేను ఇంటిని అమ్మేయస్తున్నానంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ శాంతికి మద్దతు ప్రకటిస్తున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న పని చూస్తుంటే గర్వంగా ఉందని పోస్టులు పెడుతున్నారు. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది.. ఈ ప్రకృతిలో అమ్మకు మించిన ఆస్తి, సంపద, స్టేటస్ ఏది ఉండదని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇన్ని రోజులు నాకోసం ఉన్న ఇల్లు ఇప్పుడు నాకు లేకుండా పోతోంది.. కానీ ఈ ఇంట్లోకి ఎవరు వచ్చినా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) View this post on Instagram A post shared by Jabardasth Shanthi Swaroop (@jabardasthshanti)