
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి.
తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.
దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment