ఇప్పుడు కామెడీ అంటే అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు, అవతలివారిని చులకన చేసే జోక్సే కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్వచ్ఛమైన కామెడీ కనిపించేది. మాటలతోనే కాదు, హావభావాలతో కూడా కామెడీ పండించేవాళ్లు. అలాంటి దిగ్గజ హాస్యనటులలో బేత సుధాకర్ ఒకరు. ఈ మధ్య ఆయన చనిపోయాడంటూ ఓ పుకారు గుప్పుమనగా తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు సుధాకర్. అయితే చాలాకాలం తర్వాత బుల్లితెరపై ఓ షోలో సందడి చేశాడు. ఇందులో కమెడియన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు.
పుకార్లు పుట్టించొద్దు
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముందుగా తనపై వచ్చే రూమర్లపై స్పందిస్తూ.. 'నేను చనిపోయానంటూ రూమర్స్ పుట్టించారు. నా ఆరోగ్యం బాగుంది. దయచేసి అలాంటి పుకార్లు సృష్టించవద్దు' అని కోరారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'నేను వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో మంచి పాత్రలు చేశాను. హీరో నుంచి కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సంతోషంగా చేసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ. అప్పట్లో బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు.
చిరంజీవి పట్టు పట్టడంతోనే..
చిరంజీవి, నేను ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో యముడికి మొగుడు సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టాడు. అలా నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తమిళనాడులో నాకు ఆస్తులు ఉండేవి, కానీ అమ్మేశాను. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలా ఇక్కడ సెటిలయ్యాను. నా కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడు' అని చెప్పుకొచ్చాడు.
సుధాకర్ ప్రస్థానం సాగిందిలా..
కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్‌లతో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడగా ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్ సినిమా తీశాడు. ఇందులో రాధిక హీరోయిన్. ఈ సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కూడా రిపీటైంది. తమిళంలో వరుస సినిమాలు చేసిన ఆయన తర్వాత సడన్‌గా రూటు మార్చి తెలుగుపైనే పూర్తిగా దృష్టి సారించాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment