Sudhakar Betha
-
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్‌గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
సుధాకర్ కొడుక్కి అండగా మెగాస్టార్, ఆ బాధ్యత చిరంజీవిదేనట!
కమెడియన్ బేత సుధాకర్.. ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు కానీ, ఓ ఇరవై ఏళ్ల క్రితం తెలుగు సినిమాలు రెగ్యులర్ గా చూసినవాళ్లకు పరిచయం అక్కర్లేదు. ‘అబ్బబ్బా..’అంటూ తనదైన పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన గొప్ప కమెడియన్ ఆయన. తమిళ్లో హీరోగా పలు సినిమాల్లో నటించిన సుధాకర్.. తెలుగులో మాత్రం కమెడియన్‌గా సెటిల్ అయిపోయాడు. 2000 సంవత్సరం వరకు బిజియెస్ట్ ఆర్టిస్ట్‌గా కొనసాగాడు. ఇక సంక్రాంతి(2005) తర్వాత సుధాకర్ తెలుగు సినిమాల్లో నటించలేదు. అనారోగ్యం కారణంగా ఆయన ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు. ఆయన వారసుడు బెనెడిక్ మైఖేల్ ఇండస్ట్రీలోకి రావాలని ట్రై చేస్తున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. త్వరలోనే తన వారసుడు టాలీవుడ్లో సినిమా చేయబోతున్నట్లు సుధాకర్ తెలిపాడు. తాజాగా ఓ టీవీ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా వెళ్లిన సుధాకర్.. తన వారసుడి ఇండస్ట్రీ ఎంట్రీ చిరంజీవి చేతుల మీదుగా జరుగుతుందని వెల్లడించాడు. (చదవండి: లిటిల్ మెగా ప్రిన్సెస్ గురించి చిరు ఏమన్నారంటే?) మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ బెస్ట్ ఫ్రెండ్స్. చెన్నైలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండేవారు. చిరంజీవి కంటే ముందు సుధాకరే హీరోగా మారి, సినిమాలు చేశాడు. కొన్నాళ్ల తర్వాత చిరంజీవికి సినిమా అవకాశాలు రావడం.. వరుస సూపర్ హిట్లతో మెగాస్టార్ స్థాయికి ఎదిగాడు. ఇక సుధాకర్ మాత్రం తెలుగులో కమెడియన్‌గా సెటిల్ అయ్యాడు. తన స్నేహితుడు చిరంజీవి హీరోగా నటించిన పలు సినిమాల్లో సుధాకర్ కమెడియన్‌గా నటించాడు. చిరంజీవితో ‘యముడికి మొగుడు’ సినిమాలో కలిసి నటించడమే కాకుండా.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతల్లో కూడా పాలు పంచుకున్నారు. మొదటి నుంచి సుధాకర్-చిరంజీవి మంచి స్నేహితులే కావడంతో.. వీళ్ల మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ బాధ్యతను చిరంజీవి తీసుకున్నాడు. ‘చిరంజీవి నా మిత్రుడు.. శ్రేయోభిలాభి. మా అబ్బాయి గురించి అప్పుడే చెప్పకూడదు కానీ.. చిరంజీవి గారే చేసి చూపిస్తారు’ అంటూ తన కొడుకు ఎంట్రీ గురించి సుధాకర్ చెప్పుకొచ్చాడు. గతంలో తన కొడుకు కాలేజీ సీటు విషయంలో కూడా చిరంజీవి సహాయం చేశాడని సుధాకర్ చెప్పారు. మొత్తానికి తన స్నేహితుడి కొడుకు కెరీర్‌ని తీర్చిదిద్దే బాధ్యత చిరంజీవి తీసుకున్నాడన్నమాట. ‘మెగా’ ఆశిస్సులతో ప్రారంభమయ్యే సుధాకర్ కొడుకు సినీ కెరీర్ బాగుండాలి కోరుకుందాం. (చదవండి: తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్) -
తమిళనాడులో ఆస్తులు ఉండేవి.. అన్నీ అమ్మేశా: సుధాకర్
ఇప్పుడు కామెడీ అంటే అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు, అవతలివారిని చులకన చేసే జోక్సే కనిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు స్వచ్ఛమైన కామెడీ కనిపించేది. మాటలతోనే కాదు, హావభావాలతో కూడా కామెడీ పండించేవాళ్లు. అలాంటి దిగ్గజ హాస్యనటులలో బేత సుధాకర్ ఒకరు. ఈ మధ్య ఆయన చనిపోయాడంటూ ఓ పుకారు గుప్పుమనగా తాను బతికే ఉన్నానంటూ వీడియో రిలీజ్ చేశాడు సుధాకర్. అయితే చాలాకాలం తర్వాత బుల్లితెరపై ఓ షోలో సందడి చేశాడు. ఇందులో కమెడియన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. పుకార్లు పుట్టించొద్దు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ముందుగా తనపై వచ్చే రూమర్లపై స్పందిస్తూ.. 'నేను చనిపోయానంటూ రూమర్స్ పుట్టించారు. నా ఆరోగ్యం బాగుంది. దయచేసి అలాంటి పుకార్లు సృష్టించవద్దు' అని కోరారు. తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. 'నేను వెనక్కు తిరిగి చూసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎన్నో మంచి పాత్రలు చేశాను. హీరో నుంచి కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పని చేశాను. ఏ క్యారెక్టర్ ఇచ్చినా సంతోషంగా చేసేవాడిని. నాకు ఇష్టమైన కమెడియన్ ఎమ్మెస్ నారాయణ. నాకు ఇష్టమైన ప్రదేశం ఊటీ. అప్పట్లో బ్రహ్మానందం మా ఇంటికి దగ్గర్లో ఉండేవారు. అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వచ్చేవారు. చిరంజీవి పట్టు పట్టడంతోనే.. చిరంజీవి, నేను ఇద్దరం ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. అలా మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. గతంలో యముడికి మొగుడు సినిమాలో నేను నటించాల్సిందేనని చిరంజీవి పట్టు పట్టాడు. అలా నేను ఆ సినిమా చేయాల్సి వచ్చింది. ఈ చిత్రంతో మంచి పేరు వచ్చింది. తమిళనాడులో నాకు ఆస్తులు ఉండేవి, కానీ అమ్మేశాను. తమిళం తర్వాత తెలుగులో ఎక్కువ అవకాశాలు వచ్చాయి. అలా ఇక్కడ సెటిలయ్యాను. నా కొడుకు కూడా త్వరలోనే ఇండస్ట్రీలో ఎంట్రీ ఇస్తాడు' అని చెప్పుకొచ్చాడు. సుధాకర్ ప్రస్థానం సాగిందిలా.. కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్లతో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. దర్శకుడు భారతీరాజాతో పరిచయం ఏర్పడగా ఆయన సుధాకర్‌ను హీరోగా పెట్టి కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్ సినిమా తీశాడు. ఇందులో రాధిక హీరోయిన్. ఈ సినిమా హిట్ కావడంతో వీరి కాంబినేషన్ కూడా రిపీటైంది. తమిళంలో వరుస సినిమాలు చేసిన ఆయన తర్వాత సడన్‌గా రూటు మార్చి తెలుగుపైనే పూర్తిగా దృష్టి సారించాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇక్కడే స్థిరపడిపోయాడు. చదవండి: స్టార్ కమెడియన్ సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? -
స్టార్ కమెడియన్ సుధాకర్ ఇలా అయిపోయారేంటి?
వేరే ఏ ఇండస్ట్రీకి లేని చాలా ప్లస్ పాయింట్స్ లో టాలీవుడ్ లో ఉన్నాయి. ప్రస్తుతానికి లెక్కకి మించిన పాన్ ఇండియా మూవీస్.. మన దర్శకులే తీస్తున్నారు. ఇప్పుడంటే తగ్గిపోయారు గానీ వేరే ఏ ఇండస్ట్రీలోనూ లేనంత మంది కమెడియన్స్ తెలుగులోనే ఉన్నారు. అలా ఓ ఫేడౌట్ అయిన హాస్యనటుడు చాలారోజుల తర్వాత ఓ రియాలిటీ షోలు సందడి చేశారు. ఫ్యాన్స్ ఆయన్ని చూసి హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పటి జనరేషన్ కు సుధాకర్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఓ 15-20 ఏళ్ల ముందు మూవీస్ చూసిన వాళ్లని అడిగితే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. కమెడియన్ గా మనల్ని తెగ నవ్వించిన ఆయన గత కొన్నేళ్లలో బయట ఎక్కడా కనిపించలేదు. ఈ మధ్య కొన్నిరోజుల ముందు సుధాకర్ చనిపోయారనే న్యూస్ ఒకటి బయటకొచ్చింది. వాటిని కొట్టిపారేస్తూ ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హీరోయిన్ హనీరోజ్ సాహసం.. అలాంటి ప్లేసులో ముద్దు!) తాను ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఓ ప్రముఖ ఛానెల్ లో ఫాదర్స్ డే సందర్భంగా 'నేను నాన్న' పేరుతో ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. సుధాకర్ ని ఈషోకి తీసుకొచ్చిన ఆర్గనైజర్స్.. నటుడిగా 45 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నందుకు గానూ సన్మానించారు. ఆయనతో కేక్ కూడా కట్ చేయించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అయింది. ఈ ప్రోమోలో కమెడియన్ సుధాకర్ ని చూసి చాలామంది ఫస్ట్ గుర్తుపట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన మూవీస్, నవ్వించిన సీన్స్ ని గుర్తుచేసుకుని మరీ సంతోషంగా ఫీలయ్యారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్యం సరిగా లేదు. దీంతో సన్నగా మారిపోయి, మరీ గుర్తుపట్టలేనంతగా ఉన్నారు. ఏదైతేనేం ఆయన ఇలా షోకి రావడం, అందరితో కలిసి ఎంజాయ్ చేయడం మాత్రం కనువిందుగా అనిపించింది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రిజల్ట్.. ఇలా జరగడానికి కారణాలేంటి?) -
ఆ వార్తలు నమ్మకండి.. నేను చనిపోలేదు
-
నేను ఆరోగ్యంగా ఉన్నాను.. ఆ వార్తలు నమ్మకండి: నటుడు సుధాకర్
సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సుధాకర్ అనారోగ్యంతో బాధడపడుతున్నారని, ఐసీయూలో ఉన్నారంటూ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయినట్లు ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్వయంగా స్పందించారు. కొంతకాలంగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని తెలిపారు. తాను ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నానని, తప్పుడు వార్తలను దయచేసి నమ్మవద్దని కోరారు. ఈ మేరకు స్వయంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ను క్రియేట్ చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా నటుడు సుధాకర్ చనిపోయినట్లు వార్తలు రావడం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు సర్యులేట్ అయ్యాయి. ఈమధ్యే నటుడు కోట శ్రీనివాసరావు కూడా చనిపోయినట్లు తప్పుడు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కూడా స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బతికున్న మనుషుల్ని కూడా చంపేస్తున్నారంటూ సినీ ప్రముఖులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కమెడియన్ సుధాకర్ చనిపోయాడంటూ ఫేక్ రూమర్స్..
ప్రముఖ హాస్యనటుడు బేతా సుధాకర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. కొందరైతే ఏకంగా ఆయన చనిపోయాడంటూ నివాళులు అర్పిస్తున్నారు. కొన్ని వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు సైతం ఆయన మరణించారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. దీంతో సుధాకర్‌పై తప్పుడు వార్తలను ప్రచారం చేసినవారిపై మండిపడుతున్నారు అభిమానులు. 'ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపేస్తున్నారు, కాస్తైనా సిగ్గనిపించడం లేదా?' అని ఫైర్ అవుతున్నారు. కాగా 1959 మే 18న జన్మించిన సుధాకర్ సినిమాలపై ఆసక్తితో మద్రాస్ వెళ్లాడు. అక్కడ చిరంజీవి, నారాయణరావు, హరిప్రసాద్లతో కలిసి ఒకే గదిలో ఉండేవారు. ఛాన్సుల కోసం వెతుకుతున్న సమయంలో దర్శకుడు భారతీరాజాతో ఆయనకు పరిచయమేర్పడింది. అలా భారతీరాజా డైరెక్షన్లో కిళుక్కెమ్ పొగుమ్ రెయిల్ సినిమాలో హీరోగా చేశారు. ఇందులో రాధిక హీరోయిన్గా నటించింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో తమిళంలో వరుస సినిమాలు చేశాడు. తర్వాత ఏమైందో ఏమోకానీ రూటు మార్చి టాలీవుడ్లో కమెడియన్‌గా, విలన్‌గా చేస్తూ ఇక్కడే స్థిరపడిపోయాడు. చదవండి: వెయ్యిమందిని దాటి హీరోగా.. కానీ వైవాహిక జీవితంలో మాత్రం శరత్‌బాబు..