హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు.
సుధాకర్ తనయుడి పెళ్లి
సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్‌లోనూ సందడి చేశాడు.
కొత్త జంటపై కేసు పెడతా
సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్‌గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు.
నడవలేని స్థితిలో..
కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు.
ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు.
చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు
Comments
Please login to add a commentAdd a comment