Brahmanandam
-
కర్నూలులో టీ షాప్ ప్రారంభించిన టాలీవుడ్ కమెడియన్ బ్రహ్మనందం (ఫొటోలు)
-
సంక్రాంతి బరిలో మరో టాలీవుడ్ సినిమా!
సుమంత్ హీరోగా నటిస్తోన్న చిత్రం మహేంద్రగిరి వారాహి. రాజశ్యామల బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర గ్లింప్స్‌ను ఇటీవల ప్రముఖ దర్శకుడు క్రిష్ విడుదల చేశారు. గ్లింప్స్ ఆసక్తికరంగా ఉందని తన ట్విట్టర్ ఖాతాలో యంగ్ హీరో విశ్వక్ సేన్ పోస్ట్ చేశారు. ఈ మూవీ గ్లింప్స్‌కు ఆడియన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది.కాగా.. మహేంద్రగిరి వారాహి సినిమాలో కమెడియన్ బ్రహ్మానందం నటిస్తున్నట్లు చిత్ర దర్శకుడు సంతోష్ జాగర్లపూడి, నిర్మాత కాలిపు మధు ఇటీవల వెల్లడించారు. ఈ మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా ఉందని బ్రహ్మానందం చేయబోతున్నారని దర్శకుడు సంతోష్ తెలిపారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నామని చిత్ర నిర్మాత పేర్కొన్నారు. ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.కాగా.. వచ్చే ఏడాది-2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. కాగా.. వచ్చే సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే!
విష్ణు మంచు హీరోగా రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మంచు మోహన్ బాబు ఈ చిత్రం నిర్మిస్తున్నారు. కాగా ప్రతి సోమవారం ‘కన్నప్ప’ నుంచి ఆయా పాత్రలను రివీల్ చేస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా ప్రముఖ నటుడు బ్రహ్మానందం, సప్తగిరి పాత్రల ఫస్ట్ లుక్స్‌ని విడుదల చేశారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం పిలక పాత్రలో నటించగా, సప్తగిరి గిలక పాత్రను పోషించారు. ‘చేపకు ఈత, పులికి వేట, కోకిలకి పాట.. నేర్పిన గుగ్గురువులు.. అడవికే పాఠాలు చెప్పడానికి వస్తే..’ అంటూ వీరి పాత్రలను పరిచయం చేసింది చిత్రయూనిట్. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ సినిమా డిసెంబరులో విడుదల కానుంది. -
వీళ్లూ ఎక్కారు... గిన్నిస్ రికార్డుల్లోకి!
నాలుగు దశాబ్దాలకుపైగా సినిమా ఇండస్ట్రీలో అగ్ర కథానాయకుడిగా మెగాస్టార్ చిరంజీవి ఉన్నారు. తన డ్యాన్స్, నటనతో కోట్లాదిమంది అభిమానులను ఆయన సొంతం చేసుకున్నారు. తన సినీ జర్నీలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న మెగాస్టార్ తాజాగా గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 156 సినిమాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో రికార్డ్ బ్రేక్ చేశారు. దీంతో ఆయనకు ఈ రికార్డు దక్కింది. సెప్టెంబర్ 22న గిన్నిస్ బుక్ ప్రతినిధులు హైదరాబాద్‌కు చేరుకుని బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేతులు మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. అయితే, చిరు కంటే ముందే మన టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వారు ఎవరో తెలుసుకుందాం.దాసరి నారాయణరావుతెలుగు, తమిళం, హిందీ భాషల్లో 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి దాసరి నారాయణరావు రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో అత్యధిక చిత్రాల దర్శకుడుగా ఆయనకు గుర్తింపు రావడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. 150 చిత్రాలకు దర్శకత్వం వహించాడంతో పాటు 53 సినిమాలను స్వయంగా నిర్మించారు. ఈయన 250 పైగా చిత్రాలకు కథ, మాటల రచయితగా, గీత రచయితగా పనిచేశారు. తెలుగు సినీ దిగ్గజంగా కీర్తిని పొందిన ఆయన 2017 మే 30న మరణించారు.ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంశ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. ఆయన్ను ఎస్పీ బాలు అని ఎంతోమంది ప్రేమతో పిలుస్తారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠ,మలయాళం భాషల్లో సుమారు 40 వేలకు పైగా పాటలు బాలు పాడారు. ఇలా ఎక్కువ సంఖ్యలో పాటలు పాడిన ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. బాలు నేపథ్య గాయకుడిగానే కాకుండా.. సంగీత దర్శకుడు, నటుడు, టెలివిజన్ వ్యాఖ్యాతగా కూడా గుర్తింపు పొందారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ , పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకుని రికార్డ్ క్రియేట్ చేశారు. 6 జాతీయ పురస్కారాలను కూడా ఆయన అందుకున్నారు. 2020 సెప్టెంబరు 25న బాలు మరణించగా.. 2021లో కేంద్ర ప్రభుత్వం బాలుకు పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.దగ్గుబాటి రామానాయుడుదగ్గుబాటి రామానాయుడు.. మూవీ మోఘల్‌గా ఆయన అందరికీ దగ్గరయ్యారు. ఒకే వ్యక్తి 100 చిత్రాలకు పైగా నిర్మాతగా తెరకెక్కించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేశారు. దీంతో రామానాయుడు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. పద్మ భూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. బెంగాలీలో ఆయన నిర్మించిన అసుఖ్ (1999) ఉత్తమ జాతీయ చలనచిత్ర పురస్కారం దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ వ్యాధితో ఆయన మరణించారు.విజయనిర్మల తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా సినిమాల్లో నటించిన విజయనిర్మల దర్శకురాలుగా కూడా తన ప్రతిభను చాటారు. డైరెక్టర్‌గా 44 చిత్రాలను తెరకెక్కించి రికార్డ్ సెట్ చేశారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక మహిళా దర్శకురాలిగా 2002లో గిన్నీస్ బుక్‌లో ఆమె చోటు సంపాదించారు. 11 ఏళ్ల ప్రాయంలోనే ‘పాండురంగ మహత్యం’ సినిమా ద్వారా సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఆమె.. 1971లో 'మీనా' చిత్రంతో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. సూపర్ స్టార్ కృష్ణతో ఆమె సుమారు 50కి పైగా సినిమాల్లో నటించారు. 2019లో విజయనిర్మల మరణించారు. పి. సుశీల ఆరు దశాబ్దాల పైగా భారతీయ సినీ పరిశ్రమలో ప్రసిద్ధురాలైన గానకోకిల పి. సుశీల పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చోటు దక్కింది. 12 భాషల్లో (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, ఒరియా, హిందీ, సంస్కృత, సింహళ, పడుగు, తుళు, బెంగాలీ, పంజాబీ) సినీ, ప్రైవేట్ పాటలన్నీ కలిపి దాదాపు 30 వేల పాటలు పాడినట్లు ఒక అంచనా. అయితే, గిన్నీస్ బుక్ వారు మాత్రం 1960ల నుంచి 6కు పైగా భారతీయ భాషల్లో 17,695 సోలో, డ్యూయట్, కోరస్ సహకారమున్న పాటలను మాత్రమే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేర్చారు. ఈ ఘనత సాధించిన ఏకైక ఫిమేల్ సింగర్‌గా ఈ ‘గాన సరస్వతి’కి దక్కింది. దీంతో ఆమెకు గిన్నీస్ బుక్‌లో చోటు దక్కింది. భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రఘుపతి వెంకయ్య అవార్డు’ ఇచ్చి గౌరవించాయి.బ్రహ్మానందంకన్నెగంటి బ్రహ్మానందం.. ప్రఖ్యాత తెలుగు హాస్య నటుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకే భాషలో 754 చిత్రాలలో నటించినందుకుగాను ఆయన పేరు ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో చేరింది. ఒకే భాషలో ఇన్ని సినిమాలు నటించిన నటులు ఇంతవరకు ఎవరూ లేరు. అయితే, వాస్తవంగా బ్రహ్మానందం ఇప్పటి వరకు 1250 సినిమాలకు పైగానే నటించారు. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఉత్తమ హాస్య నటుడిగా ఐదు నంది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్‌ను దక్కించుకున్నారు. రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నటించిన ఆహనా పెళ్ళంట సినిమా ద్వారా బ్రహ్మానందం సినీ రంగ ప్రవేశం చేశారు. -
బ్రహ్మానందం వీడియోలు చూస్తుండగా మహిళకు సర్జరీ
వయసుతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులకు కామెడీ ఇష్టం. యూట్యూబ్‌లో అయితే బ్రహ్మానందం, సునీల్ కామెడీ వీడియోలు తెగ చూసేస్తుంటారు. ఇప్పుడు అలానే 'అదుర్స్' సినిమాలోని బ్రహ్మీ కామెడీ వీడియోలు చూస్తుండగా 55 మహిళకు డాక్టర్స్ సర్జరీ చేశారు. కాకినాడలోని జీజీహెచ్‌లో ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: లైంగిక వేధింపుల కేసు.. పరారీలో జానీ మాస్టర్)కొత్తపల్లికి చెందిన 55 ఏళ్ల అప్పన్న అనంతలక్ష్మికి ఏడాదిగా కుడి కాలు, కుడి చెయ్యి లాగేస్తుండటం వల్ల బాధపడుతోంది. ఈ క్రమంలోనే ఆమెకు పలు పరీక్షలు చేయగా మెదడులో ఎడమవైపు ట్యూమర్ ఉందని గుర్తించారు. దీన్ని అలానే వదిలేస్తే పక్షవాదం వచ్చే ప్రమాదం ఉందని చెప్పి సర్జరీకి సిద్ధమయ్యారు. అయితే మత్తు మందు ఇవ్వకుండా ఆమెకు ఇష్టమైన బ్రహ్మానందం వీడియోలు చూపిస్తూ క్రైనీయాటమీ సర్జరీ పూర్తి చేశారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ సర్జరీ చేశారు. ఇది విజయవంతం కావడంతో వైద్యులపై ప్రశంసలు కురుస్తున్నాయి. అలానే శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు సదరు మహిళ బ్రహ్మానందం కామెడీ సీన్స్ చూస్తున్న ఆరు సెకన్ల వీడియో ఒకటి వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: ఎన్టీఆర్ నోట తమిళనాడు ఫేమస్ బిర్యానీ.. ఏంటంత స్పెషల్?) -
నవ్వులే నవ్వులు
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్ యాదవ్ సమర్పణలో స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.సోమవారం రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్ రిలీజ్ చే శారు మేకర్స్. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
మిమిక్రీ చేసి ఆశ్చర్యపరిచిన బ్రహ్మనందం..
-
బ్రహ్మానందంలో ఈ టాలెంట్ చూశారా? ఆయన ముందే మిమిక్రీ..
భారతీయుడు.. దశాబ్ధం క్రితం వచ్చిన ఈ సినిమాకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. జనాలను ఆలోచింపజేసిన ఈ మూవీకి సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తోంది. ఈ చిత్రం జూలై 12న థియేటర్లలో విడుదల కానుంది. కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, బ్రహ్మానందం, సముద్రఖని, బాబీ సింహా, గుల్షన్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఆదివారం ఘనంగా జరిగింది.లోకనాయకుడిని దింపేసిన బ్రహ్మానందంఈ ఈవెంట్లో బ్రహ్మానందం మాట్లాడుతూ.. ఈ విశ్వంలోనే కమల్ హాసన్‌లాంటి నటుడు మరొకరు ఉండరని, ఆయనతో నటించినందుకు గర్వపడుతున్నాని తెలిపారు. అలాగే కమల్ హాసన్ వాయిస్‌ను మిమిక్రీ చేశారు. 'ఈ రోజు నేను భారతీయుడు 2లో యాక్ట్ చేశాను. ఇండియన్ 1 మూవీని బాగా హిట్ చేశారు. అది మీ అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం అంతకంటే ఎక్కువ కష్టపడ్డాం. సౌత్ ఇండియన్స్ అందరూ నన్నెంతో ఆశీర్వదించారు, అభినందించారు. మాటలు రావడం లేదుచాలా సంతోషంగా ఉంది. మాటలు కూడా రావడం లేదు. మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఈ సినిమాను మీరంతా సక్సెస్ చేస్తే నేను హ్యాపీ.. ఆల్వేస్.. యువర్ కమల్ హాసన్' అంటూ విశ్వనటుడి వాయిస్‌ను దింపేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారగా బ్రహ్మానందంలోని ఈ టాలెంట్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కదా మిమ్మల్ని లెజెండ్ అనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. Brahmanandam Garu mimics Kamal Haasan Sir’s voice. Wow!!! #Bharateeyudu2 pic.twitter.com/ka16cyYMGB— Aakashavaani (@TheAakashavaani) July 7, 2024 చదవండి: కూతురు పేరు ప్రకటించిన మంచు మనోజ్, మౌనిక -
కుమారుడికి తాతగా నటించనున్న బ్రహ్మానందం
నిజ జీవితంలో తండ్రీ కొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రంలో తాత, మనవడిగా నటించనున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించనున్నారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్ కీలక పాత్రలో కనిపించనున్నారు.సావిత్రి, శ్రీ ఉమేష్ యాదవ్ సమర్పణలో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించనున్న ఈ సినిమాని ప్రీ–లుక్ పోస్టర్, వీడియోతో ప్రకటించారు. ‘‘బ్రహ్మా ఆనందం’ సినిమా పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఈ ఏడాది డిసెంబర్ 6న చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మితేష్ పర్వతనేని, సంగీతం: శాండిల్య పిస΄ాటి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పి. దయాకర్ రావు. -
హీరోల్.. ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా
హస్య నటులు, ప్రతినాయకులు, సహాయ నటులుగా కనిపించి, ఆకట్టుకునే నటులు ఫర్ ఎ చేంజ్ కథానాయకులుగా కనిపిస్తే ఆ సినిమాకి కావాల్సినంత క్రేజ్ ఏర్పడుతుంది. ఆ నటులకు కూడా రొటీన్ క్యారెక్టర్స్ నుంచి కాస్త మార్పు దక్కుతుంది. ఎక్కువగా కమెడియన్లు, విలన్లు, క్యారెక్టర్లు ఆర్టిస్టులుగా చేసే ఆ నటులు ఇప్పుడు హీ‘రోల్’లో కనిపించనున్నారు. ఆ ‘హీరో’ల్ చేస్తున్న చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. తొలిసారి నేపాలీ భాషలో... తెలుగు పరిశ్రమలో హాస్యబ్రహ్మగా పేరు తెచ్చుకున్నారు బ్రహ్మానందం. దాదాపు నలభై ఏళ్లుగా తనదైన హాస్యంతో ప్రేక్షకులను నవ్విస్తున్న ఆయన అడపాదడపా హీరోగానూ చేశారు. ‘బాబాయ్ హోటల్’ (1992), ‘జోకర్ మామ సూపర్ అల్లుడు’ (1992) వంటి చిత్రాల్లో సోలో హీరోగా చేసిన బ్రహ్మానందం ‘సూపర్ హీరోస్’ (1997), ‘హ్యాండ్సప్’ (2020) వంటి మరికొన్ని చిత్రాల్లో ఓ హీరోగా నటించారు. తాజాగా ‘హ్రశ్వ దీర్ఘ’ చిత్రంలో ఆయన ఓ లీడ్ రోల్ చేస్తున్నారు. చంద్ర పంత్ దర్శకత్వంలో తెలుగు, నేపాలీ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. బ్రహ్మానందం నటిస్తున్న ఈ తొలి నేపాలీ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఆరు పదులలో ప్రేమ ఆరు పదుల వయసులో ప్రేమలో పడ్డారు రాజేంద్రప్రసాద్, జయప్రద. ఈ ఇద్దరూ జంటగా నటించిన చిత్రం ‘లవ్ః65’. వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్ ఆ మధ్య విడుదలైంది. ‘ఈ ప్రపంచాన్నే బహిష్కరిద్దాం’ (రాజేంద్ర ప్రసాద్), ‘నాకోసం ఏడ్చింది నువ్వు ఒక్కడివే’ (జయప్రద) వంటి డైలాగులు టీజర్లో ఉన్నాయి. త్వరలో ఈ చిత్రం రిలీజ్ రానుంది. వినోదాల సుబ్రమణ్యం కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా రావు రమేశ్ ఏ రేంజ్లో విజృంభిస్తారో వెండితెరపై చూస్తుంటాం. ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ చిత్రంలో తొలిసారి ఆయన హీరోగా కనిపించనున్నారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రావు రమేశ్ సరసన ఇంద్రజ నటించారు. పూర్తి స్థాయి వినోదంతో, భావోద్వేగాలతో రూపొందిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. మధ్యవయస్కుడి కథ తెలుగులో దాదాపు 36 ఏళ్లుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పిస్తున్నారు రాజా రవీంద్ర. పలు చిత్రాల్లో లీడ్ రోల్స్‌లోనూ నటించిన ఆయన తాజాగా ‘సారంగదరియా’ సినిమాలో లీడ్ రోల్ చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి పరువుగా బతికితే చాలనుకుంటాడు. అయితే అతనికి తన కొడుకులు, కూతురు వల్ల సమాజం నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు అతను ఏం చేశాడు? అనే కథాంశంతో ‘సారంగదరియా’ చిత్రం రూపొందింది. మేలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తండ్రి విలువ తెలిపేలా... తెలుగులో శివాజీ రాజాది మూడు దశాబ్దాలకు పైగా ప్రయాణం. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, హీరోగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారాయన. ఇటీవల సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చిన శివాజీ రాజా ‘నాన్నా మళ్లీ రావా..!’లో లీడ్ రోల్ చేస్తున్నారు. ఆయనకు జోడీగా ప్రభావతి నటిస్తున్నారు. నిర్దేష్ దర్శకుడు. మనసుని హత్తుకునే బలమైన సెంటిమెంట్, భావోద్వేగాల నేపథ్యంలో తండ్రి విలువ తెలిపేలా ఈ చిత్రం రూపొందుతోంది. మ్యూజిక్ షాప్‌లో... ‘ప్రస్థానం’ (2010) సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు అజయ్ ఘోష్. కమెడియన్, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో నటించి, మెప్పించారాయన. తాజాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో హీరోగా చేశారు. శివ పాలడుగు దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మన జీవితాల్లో మనం ఏం కోల్పోయి ఏ స్థితిలో ఉన్నామో చూపించేలా ఈ చిత్రం ఉంటుందని యూనిట్ పేర్కొంది. -
స్వామీ బ్రహ్మానంద్ ఎవరు? ఎంపీ స్థాయికి ఎలా చేరారు?
దేశంలో 18వ లోక్‌సభకు ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. యోగి ఆదిత్యనాథ్ దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు (80) కలిగిన ఉత్తరప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశ రాజకీయాల్లో సాధువుల ప్రవేశం 90వ దశకంలో రామమందిర ఉద్యమం నుంచి ప్రారంభమైంది. ఇది నేటికీ కొనసాగుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా లోక్‌సభ సభ్యునిగా ఎన్నికైన స్వామి బ్రహ్మానంద్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. స్వామి బ్రహ్మానంద్ గోసంరక్షణ కోసం పాటుపడ్డారు. పార్లమెంటులో కూడా ఈ అంశంపై చర్చించారు. స్వాతంత్య్రానంతరం 1951-52లో తొలి సాధారణ ఎన్నికలు జరిగాయి. గోరఖ్‌నాథ్ పీఠానికి చెందిన మహంత్ దిగ్విజయ్నాథ్ 1952,1957 ఎన్నికలలో హిందూ మహాసభ నుండి పోటీ చేసినప్పటికీ, కాంగ్రెస్ ముందు సత్తా చాటలేకపోయారు. 1966లో స్వామి బ్రహ్మానంద్ స్వామి కర్పాత్రి మహారాజ్‌తో కలిసి లక్షలాది సాధువులతో కలసి గోహత్యను నిషేధించాలనే ఉద్యమాన్ని చేపట్టారు. దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఎదుట నిరసనలు చేపట్టారు. ఈ ఉద్యమ నేపధ్యంలో అప్పటి ప్రభుత్వం స్వామి బ్రహ్మానంద్‌ను అరెస్టు చేసి, జైలుకు తరలించింది. జైలు నుంచి విడుదలయ్యాక రాజకీయాల్లోకి రావాలని ఆయనను పలువురు కోరారు. దీంతో ఆయన జన్ సంఘ్‌లో చేరడం ద్వారా రాజకీయాల్లోకి కాలుమోపారు. 1967లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని హమీర్పూర్ లోక్‌సభ స్థానం నుండి స్వామి బ్రహ్మానంద్ పోటీ చేసి విజయం సాధించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక సాధు సన్యాసి లోక్‌సభ సభ్యునిగా ఎన్నికవడం అదే తొలిసారి. తరువాతి కాలంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ 1967లో బ్యాంకుల జాతీయకరణ అంశాన్ని లేవనెత్తినప్పుడు, స్వామి బ్రహ్మానంద్ అందుకు మద్దతుగా నిలిచారు. దీంతో జన్సంఫ్కు, స్వామి స్వామి బ్రహ్మానంద్కు మధ్య దూరం పెరిగింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో హమీర్పూర్ నుండి స్వామి బ్రహ్మానంద్ కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఈ విధంగా ఆయన రెండోసారి ఎంపీ అయ్యారు. -
బ్రహ్మనందం గొప్ప మనసు.. వారి కుటుంబానికి ఆర్థికసాయం!
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మనందం ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే విఐపీ దర్శన సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు తిరుమలలో ఘనస్వాగతం పలికిన వేద పండితులు.. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమలలో ఆయనను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మనందం అనంతరం పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ కళాకారుని కుటుంబాన్ని ఆదుకుని మంచి మనసును చాటుకున్నారు. కళాకారుడు మరణించిన కుటుంబానికి రూ.2.17 లక్షల ఆర్థికసాయం అందించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రహ్మనందం చేసిన పనిని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మనందం కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. -
Brahmanandam Latest Photos: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హాస్యబ్రహ్మ (ఫోటోలు)
-
కుమారుడిపెళ్లి.. మరింత బక్కచిక్కిపోయిన కమెడియన్ సుధాకర్
హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తర్వాత కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించాడు. దాదాపు మూడు దశాబ్దాలపాటు ఇండస్ట్రీని ఏలాడు సుధాకర్. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఆయన సినిమాలకు దూరమై సుమారు 17 ఏళ్లు అవుతోంది. తను నటనకు దూరమైనా తన ఒక్కగానొక్క కుమారుడు బెనిడిక్ మైఖేల్(బెన్నీ)ని టాలీవుడ్‌కు పరిచయం చేయాలనుకుంటున్నట్లు గతంలో వెల్లడించాడు. అది కూడా తన స్నేహితుడు చిరంజీవి చేతుల మీదుగానే బెన్నీ ఎంట్రీ ఉంటుందని హింటిచ్చాడు. సుధాకర్ తనయుడి పెళ్లి సినిమాల సంగతి పక్కనపెడితే ఇటీవల బెన్నీ పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి జగపతి బాబు, బ్రహ్మానందం, చంద్రబోస్ దంపతులు, రోజా రమణి వంటి కొందరు సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. బ్రహ్మానందం అయితే బెన్నీని పెళ్లికొడుకు చేసేటప్పుడు, వివాహ వేడుక, రిసెప్షన్లోనూ సందడి చేశాడు. కొత్త జంటపై కేసు పెడతా సరదా మాటలతో అక్కడున్న అందినీ నవ్వించాడు. ఈ హాస్యబ్రహ్మ సొంత ఇంటి మనిషిలా పెళ్లి పనులు మొదలైనప్పటి నుంచి అక్కడే ఉండటంతో సుధాకర్ ఇంటి సభ్యులు సంతోషంలో మునిగిపోయారు. రిసెప్షన్ స్టేజీపైకి ఎక్కి మైకు అందుకున్న బ్రహ్మానందం.. వీళ్లిద్దినీ చూస్తుంటే పోలీసు కేసు పెట్టాలనిపిస్తోంది. ఎందుకంటే ఇది బాల్యవివాహంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో ముదిరిపోయిన జంటల పెళ్లిళ్లు చూశాక వీళ్లను చూస్తుంటే చిన్నపిల్లల్లా, క్యూట్‌గా కనిపిస్తున్నారు అని మాట్లాడాడు. నడవలేని స్థితిలో.. కాగా బెన్నీ వివాహం క్రిస్టియన్ సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఫిబ్రవరి రెండో వారంలో ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. పెళ్లి ఫోటోలు, వీడియోల్లో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారినట్లు కనిపిస్తోంది. నడవలేని స్థితిలో ఉన్న ఆయనను ఇద్దరి సాయంతో స్టేజీపైకి తీసుకొచ్చారు. ఆయన మరింత బక్కచిక్కిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరుకున్నాడు. ఇది చూసిన అభిమానులు.. ఒకప్పుడు నవ్వులు పూయించిన సుధాకర్ ఇలా అయిపోయాడేంటి? అని విచారం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: సహజీవనం వేస్ట్.. ఇద్దరు తప్పు చేసినా ఒక్కరికే శిక్ష!: పక్కింటి కుర్రాడు -
తెలుగు, నేపాలీ భాషల్లో...
ప్రముఖ నటుడు బ్రహ్మానందం కీలక పాత్ర పోషిస్తున్న తొలి తెలుగు, నేపాలీ చిత్రం ‘హ్రశ్వదీర్ఘ’. చంద్ర పంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హరిహర్ అధికారి, నీతా దుంగన లీడ్ రోల్స్ చేస్తున్నారు. నీతా ఫిలిమ్స్ ప్రోడక్షన్‌పై నీతా దుంగన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఫిబ్రవరి 1న బ్రహ్మానందం పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘హ్రశ్వదీర్ఘ’లోని ఆయన పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేయడంతో పాటు ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
లారీలకు రంగులేసిన వ్యక్తి ఇప్పుడు నవ్వుల రేడు!
టాలీవుడ్ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించిన ఆయన తెలుగు సినీ ప్రేక్షకులను తన హావభావాలతో కట్టిపడేశారు. తాజాగా ఆయన నేడు 68వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఫిబ్రవరి 1న గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఇవాళ ఆయన బర్త్‌డే కావడంతో టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్లో ఆయన చేసిన సినిమాలకు ఏకంగా గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కిన తొలి నటుడిగా నిలిచారు. కేవలం ముఖ కవళికలతోనే నవ్వించే టాలెంట్ ఆయనకు మాత్రమే సొంతం. అందుకే అతన్ని హాస్య బ్రహ్మ అనే బిరుదు పొందారు. బహ్మనందం సినీ ఇండస్ట్రీలో 31 ఏళ్ల పాటు కమెడియన్‌గా అభిమానులను అలరించారు. ఆయన దాదాపు 1200లకు పైగా సినిమాల్లో నటించారు. గతేడాది రంగమార్తాండ చిత్రంలో కనిపించిన ఆయన అనారోగ్య సమస్యల కారణంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. బహ్మనందం ప్రస్థానమిది.. ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు ఇంత స్థాయికి ఎదుగుతాడని ఎవరూ ఊహించి ఉండరు. చెప్పులు కూడా కొనలేని స్థితిలో నుంచి లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగారు. అయితే తన వద్ద చదువుకోవడానికి డబ్బు లేకపోవడంతో ఇతరుల సాయంతోనే చదువు పూర్తి చేశారు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పీజీ చేసేందుకు తన దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అదే సమయంలో వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం టాలెంట్, కామెడీని చూసి ఎంఏ తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. లారీలకు రంగులు వేస్తూ.. పీజీ చదువుకునే రోజుల్లో నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలకు పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశారు. తాను చేసిన పనికి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా సొంతంగా పనులు చేసుకుంటూ.. దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. ఆ తర్వాత లెక్చరర్ స్థాయి నుంచి టాలీవుడ్లోనే ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగిన తీరు అద్భుతం. కళారంగంలో ఆయన ప్రతిభను గుర్తించిన కేంద్రం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది. ఎంత సంపాదించారంటే.. కొన్ని వందల సినిమాల్లో మెప్పించిన హాస్య బ్రహ్మ ఆస్తులు ఎంత సంపాదించారో తెలుసుకుందాం. చదువుకోవడానికి డబ్బుల్లేని స్థితి నుంచి వందల కోట్ల ఆస్తులు సంపాదించారు. ఇవాళ ఆయన బర్త్‌డే కావడంతో అభిమానుల్లో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఈ సందర్భంగా బ్రహ్మానందం ఆస్తుల వివరాలపై ఓ లుక్కేద్దాం. తాజా సమాచారం ప్రకారం.. ఆయన స్థిర, చరాస్థులు కలిపి దాదాపు రూ. 500 కోట్లకు పైగా ఉంటుందని ప్రాథమిక అంచనా. లగ్జరీ కార్లు.. ఆయనకు కోట్లు విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందట. దీనితో పాటు జూబ్లీహిల్స్‌లో ఓ లగ్జరీ ఇల్లు కూడా. కార్ల విషయానికొస్తే ఆడి క్యూ7, క్యూ8(ఆడి ఆర్8, ఆడి క్యూ7)తో పాటు మెర్సిడెజ్ బెంజ్ కారు ఉందట. ఇలా నటుడిగా బ్రహ్మీ బాగానే ఆస్తులు సంపాదించారట. అయితే వీటిపై అధికారిక సమాచారం మాత్రం లేదు. ఆత్మకథ రాసుకున్న హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కేవలం నటుడు మాత్రమే కాదు.. చిత్ర కళాకారుడనే విషయం తెలిసిందే. విరామ సమయంలో ఆయన దేవుళ్ల చిత్రాలను గీస్తూ వాటిని హీరోలకు, సన్నిహితులకు బహుమతిగా ఇస్తుంటారు. ఒకప్పుడు విద్యార్థులకు పాఠాలు బోధించిన బ్రహ్మనందం.. నేడు తిరుగులేని నటుడిగా తన పేరు చరిత్రలో లిఖించుకున్నారు. ఇటీవలే మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. ఆ పుస్తకాన్ని మెగాస్టార్, రామ్‌చరణ్‌కు అందించారు. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. -
తిరుమల లో టాలీవుడ్ నటుడు బ్రహ్మానందం
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుమ, బ్రహ్మానందం, సునీత (ఫోటోలు)
-
'గేమ్ ఛేంజర్' సెట్లో చరణ్.. ఆ పుస్తకంపై స్పెషల్ ట్వీట్
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ని ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మర్యాద పూర్వకంగా కలిశారు. బ్రహ్మీ.. తన జీవితంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలతో, అనుభవాలతో 'నేను' అనే పుస్తకాన్ని రాశారు. ఈ మధ్యే దీన్ని లాంచ్ చేశారు. ప్రస్తుతం ఇది ఆన్లైన్లో అందుబాటులో ఉంది. తాజాగా ఈ పుస్తకాన్ని హీరో చరణ్‌కి బ్రహ్మానందం బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన మెగాహీరో.. తన అభిప్రాయాన్ని కూడా క్యాప్షన్ రూపంలో రాసుకొచ్చాడు. (ఇదీ చదవండి: 10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) 'బ్రహ్మానందం.. తమ జీవితంలోని అనుభవాలతో 'నేను' రాశారు. అత్యద్భుతమైన ఆయన జీవిత ప్రయాణాన్ని ఇందులో సంక్షిప్తం చేశారు. అక్కడక్కడా చమత్కారంతో, మనసులోని ఎన్నెన్నో విషయాలను ఇందులో రాసుకున్నారు. ఓ వైపు జీవిత పాఠాలను నేర్పుతూ, అనుభవాలను పంచుకుంటూ, అక్కడక్కడా నవ్విస్తూ, ఎన్నో సినిమాల సంగతులను గుర్తుచేస్తూ, ఆద్యంతం అద్భుతంగా సాగింది ఈ పుస్తకం. బ్రహ్మానందంగారు రాసిన ఆటోబయోగ్రఫీ 'నేను' అందరికీ అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరూ చదవదగ్గ పుస్తకం ఇది' అని చరణ్ ట్వీట్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లో 'గేమ్ ఛేంజర్' కొత్త షెడ్యూల్ మొదలైంది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బ్రహ్మానందం కూడా ఓ పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన ఆటోబయోగ్రఫీని చరణ్‌కు బహుకరించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా చాలారోజుల తర్వాత బ్రహ్మీ-చరణ్ షూటింగ్లో పాల్గొనడం, సరికొత్త లుక్‌లో కనిపించారు. (ఇదీ చదవండి: అలాంటి డిజైనర్ చీరలో హీరోయిన్ శ్రీలీల.. రేటు ఎంతో తెలుసా?) Journeying through the incredible life of #Brahmanandam Garu in 'NENU,' his autobiography crafted with humor and heart. 📘 These pages hold the essence of laughter, life lessons, and the cinematic charm he brought to us all. Order the book through this link:… pic.twitter.com/kY7qgaFtrS — Ram Charan (@AlwaysRamCharan) January 10, 2024 -
బ్రహ్మానందం తొలి సంపాదన ఎన్ని రూపాయలో తెలుసా?
ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం. దగ్గర డబ్బులు లేవు ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు. లారీలకు రంగు వేసే పనిలో.. నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్‌తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు. చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు -
కమెడియన్ బ్రహ్మానందం మరో టాలెంట్.. మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బ్రహ్మానందం పేరు చెప్పగానే మనలో చాలామంది ముఖంపై ఆటోమేటిక్‌గా నవ్వు వచ్చేస్తుంది. 1000కి పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మీ.. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారిపోవడం, వయసు అయిపోవడంతో సినిమాలు బాగా తగ్గించేశారు. ఇలాంటి టైంలో తనలోని వేరే టాలెంట్స్‌ని బయటకు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు అలా ఓ పని చేయగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. (ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) బ్రహ్మానందం అనగానే కమెడియన్ అనే గుర్తొస్తుంది. అయితే ఆయనలో మంచి ఆర్టిస్టు కూడా ఉన్నాడు. చాలాసార్లు దేవుడి చిత్రాల్ని తన చేతులతో గీశారు. వాటిని పలువురు హీరోలకు బహుమతిగా ఇచ్చారు. లాక్డౌన్ టైంలో బ్రహ్మీలో డ్రాయింగ్ ప్రతిభ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఈయనలో రైటప్ ఉన్నాడని తెలిసింది. 'నేను' పేరుతో తన జీవితాన్నే పుస్తకంగా రాసి ప్రచురించేశారు. తాజాగా దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ పెట్టారు. 'నాకు అత్యంత ఆప్తుడు, ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ ఆనందాన్ని అందించిన వ్యక్తి మనందరి బ్రహ్మానందం. 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను కలిసిన వ్యక్తులు, పరిచయాలు, తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకు ఎదురైన ఎన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా 'నేను' అనే పుస్తకరూపంలో మనకు అందించడం ఆనందంగా ఉంది. ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం, మార్గదర్శకం కావొచ్చు. చదివే ప్రతిఒక్కరికీ ఈ బుక్ ఇన్సిపిరేషన్ అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, దీన్ని రాసిన ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను' అని చిరు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇకపోతే ఈ పుస్తకం ధర రూ.275. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇది అందుబాటులో ఉంది. (ఇదీ చదవండి: 'బబుల్ గమ్' సినిమా రివ్యూ) నాకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, తన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో తాను కలిసిన అనేక వ్యక్తులు, పరిచయాలు,తెలుసుకున్న విషయాలు,దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా… pic.twitter.com/0wg2p7LqNF — Chiranjeevi Konidela (@KChiruTweets) December 28, 2023 -
‘యానిమల్’లో హీరో బ్రహ్మానందం అయితే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో కమెడియన్ బ్రహ్మానందానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నెట్టింట యాక్టివ్‌గా ఉండరు కానీ..ఆయన మీమ్స్ మాత్రం వైరల్ అవుతుంటాయి. సినిమాపైనే కాదు ట్రెండింగ్‌లో ఏ అంశం ఉన్నా..బ్రహ్మానందంపై మీమ్స్ రెడీ అయిపోతుంటాయి. అవి చూస్తే చాలు.. సీరియస్ అంశం అయినా సరే..పగలబడి నవ్వేస్తాం. తాజాగా బ్రహ్మానందంకు సంబంధించిన ఓ స్ఫూప్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ‘యానిమల్’సినిమాపై చేసిన స్ఫూప్ వీడియా. రణ్‌బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1న విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ రావడంతో పాటు విమర్శకులు ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. ఇప్పటికే రూ. 600 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అనిల్ కపూర్ తండ్రి కొడుకులుగా నటించారు. ఈ సినిమా ట్రైలర్ లో రణబీర్‌కు బదులుగా బ్రహ్మీని పెట్టి ఓ వీడియోని రూపొందించారు. అందులో బ్రహ్మానందం నటించిన పలు సినిమాల్లోని సీన్లతో వాడేశారు. ఇక అనిల్ కపూర్ పాత్రకి బదులుగా నాజర్ని చూపించారు. బ్రహ్మానందం, నాజర్ తండ్రి కొడుకులైతే..యానిమల్ మూవీ ఇలా ఉంటుందంటూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘యానిమల్’ లోని కొన్ని సీన్లకి సరిగ్గా సూట్ అయ్యేలా బ్రహ్మానందం సినిమాల సీన్లను పెట్టారు. ఇది ఎవరు క్రియేట్ చేశారో తెలియదు కానీ.. అందరిని కడుపుబ్బా నవ్విస్తోంది. మీరు కూడా ఈ వీడియో చూసి నవ్వుకోండి. Bramhi in & as Animal😁✂️ Share & Follow @TeluguBroEdits .#brahmandam #AnimalTheMovie #AnimalPark @imvangasandeep @AnimalTheFilm pic.twitter.com/Cbc5VqwPQU — Telugu Bro (@TeluguBroEdits) December 9, 2023 -
ఓటేయడానికి వెళ్లిన బ్రహ్మానందం.. అక్కడ కూడా కామెడీయే
తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష.. అసెంబ్లీ ఎన్నికలు. ఈరోజు(నవంబర్ 30న) తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల వరకు అంతటా 50 శాతానికి పైగా పోలింగ్ జరగ్గా హైదరాబాద్, రంగారెడ్డి మాత్రం పోలింగ్‌లో వెనకబడ్డాయి. హైదరాబాద్‌లో ఇప్పటివరకు కేవలం 31% మాత్రమే పోలింగ్ జరగడం గమనార్హం. మరోవైపు సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకోండని చెప్తూ లైన్లలో నిలబడి మరీ ఓటేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మహేశ్‌బాబు, వెంకటేశ్, రానా, అల్లుఅర్జున్, నాని.. ఇలా పలువురు సినీతారలు కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాజాగా కామెడీ కింగ్ బ్రహ్మానందం తన కుటుంబంతో కలిసి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి.. ఓటు హక్కు ఉండి వినియోగించుకోలేనివాళ్లను ఏమంటారు? అని అడిగాడు. దీనికి బ్రహ్మానందం స్పందిస్తూ... 'ఏమంటామండీ.. ఓటు హక్కు ఉపయోగించుకోలేనివాళ్లు అంటాం' అని తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కామెడీ బ్రహ్మ అని ఊరికే అనలేదు.. పోలింగ్ బూత్ వద్ద కూడా కామెడీ పండిస్తున్నాడు మహానుభావుడు అని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. Legend 🔥😂 #brahmanandam #TelenganaElections2023 pic.twitter.com/aN5SbQO6Sw — Narasimha (@_narasimha___) November 30, 2023 చదవండి: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు- పోలింగ్.. తదితర కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఒకేసారి ఐదు సినిమాలు ఒక సంచలనం : బ్రహ్మానందం
‘‘ఒక సినిమా తీయడానికే ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో ఒకేసారి ఐదు సినిమాలు తీస్తుండటం ఓ సంచలనం. తన కుమారుడు ఉపేంద్రని హీరోగా పరిచయం చేయడంతో పాటు ఒకేసారి అతనితో ఐదు సినిమాలు తీస్తున్న అచ్యుతరావుకి అభినందనలు. దీనివల్ల పరిశ్రమను నమ్ముకున్నవారికి అవకాశాలు ఇచ్చి, భోజనం పెట్టినట్లవుతుంది. ‘ఉపేంద్రగాడి అడ్డా’ మంచి హిట్టవ్వాలి’’ అని సీనియర్ నటుడు బ్రహ్మానందం అన్నారు. కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్‌పై కంచర్ల అచ్యుతరావు నిర్మించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి బ్రహ్మానందం ముఖ్య అతిథిగా హాజరై, ‘ఉపేంద్రగాడి అడ్డా’ ట్రైలర్‌ను, ‘1920 భీమునిపట్నం’ ΄ోస్టర్‌ను విడుదల చేశారు. అలాగే ఉపేంద్ర హీరోగా ఇదే బ్యానర్లో తీస్తున్న ఐదు సినిమాల టీజర్లను విడుదల చేశారు. కంచర్ల అచ్యుతరావు మాట్లాడుతూ– ‘‘మా బ్యానర్లో నవంబర్ నుంచి ప్రతీ నెల ఒక సినిమాను విడుదల చేయబోతున్నాం’’ అన్నారు. ‘‘నా పుట్టిన రోజుకి ఇది వెలకట్టలేని పెద్ద బహుమతి’’ అన్నారు కంచర్ల ఉపేంద్ర. ‘‘సోషల్ మీడియా నేటి సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తోందో మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం’’ అన్నారు ఆర్యన్ సుభాన్ ఎస్కే. హీరోయిన్ సావిత్రీ కృష్ణ, సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
అల్లు అరవింద్ అనుకుంటే బ్రహ్మానందం చేశాడు!
అల్లు అరవింద్ పేరు చెప్పగానే గీతా ఆర్ట్స్ నిర్మాత, ఐకాన్ అల్లు అర్జున్ తండ్రి అని చాలామంది అంటారు. కానీ అప్పట్లో చిరంజీవితో కలిసి కొన్ని సినిమాల్లో నటించారని ఇప్పటి జనరేషన్ కుర్రాళ్లకు చాలామందికి తెలియదు. ప్రస్తుతం నిర్మాతగా బిజీగా ఉన్న ఆయనతో ప్రయోగం చేద్దామని టాలీవుడ్ యువ దర్శకుడు ఒకరు అనుకున్నారు. కానీ ఆ పాత్ర బ్రహ్మానందంతో చేయించాడు. ఇంతకీ ఏంటా సినిమా? (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) టతరుణ్ భాస్కర్ పేరు చెప్పగానే 'పెళ్లి చూపులు', 'ఈ నగరానికి ఏమైంది?' లాంటి క్రేజీ మూవీస్ గుర్తొస్తాయి. ఇప్పుడా డైరెక్టర్ చాలా ఏళ్ల తర్వాత తీస్తున్న సినిమా 'కీడా కోలా'. థ్రిల్లర్ ఎంటర్టైనింగ్ కాన్సెప్ట్‌తో తీస్తున్న ఈ సినిమాలో సాధారణ ఆర్టిస్టులే ఎక్కువగా నటించారు. సినిమా ఆసాంతం వీల్ ఛైర్లో కూర్చుని ఉండే వరదరాజులు అనే పాత్రలో మాత్రం బ్రహ్మానందం యాక్ట్ చేశాడు. అయితే స్టోరీ అంతా రెడీ కాగానే వరదరాజులు పాత్ర అల్లు అరవింద్ చేస్తే బాగుంటుందని తరుణ్ భాస్కర్ అనుకున్నాడు. తాజాగా 'కీడా కోలా' ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని రానాతో చెప్పాడు. అల్లు అరవింద్ దగ్గరకెళ్లి.. మీరు యాక్ట్ చేస్తారా అని తరుణ్ భాస్కర్ అడిగితే.. ఆయన సింపుల్‌గా నవ్వి ఊరుకున్నారట. దీంతో ఆ పాత్ర కోసం బ్రహ్మీ లైనులోకి వచ్చాడు. నవంబరు 3న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: 'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?)