బ్రహ్మానందం కొడుకు నటించిన తాజా చిత్రం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది | Raja Goutham Starrer Break Out Movie First Look Released | Sakshi
Sakshi News home page

బ్రహ్మానందం కొడుకు నటించిన తాజా చిత్రం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది

Published Sun, Aug 28 2022 2:28 PM | Last Updated on Sun, Aug 28 2022 2:28 PM

Raja Goutham Starrer Break Out Movie First Look Released - Sakshi

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్‌ అవుట్‌’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ మోదుగ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని శనివారం విడుదల చేశారు. కిటికీ నుంచి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్న రాజా గౌతమ్‌ పోస్టర్‌ క్యూరియాసిటీని పెంచుతోంది.

‘‘సర్వైవల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న చిత్రమిది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చిత్రం’ శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్‌ చారీ, సంగీతం: జోన్స్‌ రూపర్ట్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement