raja goutam
-
మరోసారి తాతైన బ్రహ్మానందం
టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం మరోసారి తాతయ్యాడు. బ్రహ్మీ తనయుడు, నటుడు రాజా గౌతమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. రాజా గౌతమ్- జ్యోత్స్న దంపతులకు ఇదివరకే పార్థ అనే బాబున్నాడు. తాజాగా ఈ జంట మరోపాపకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను అతడు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. పార్థ తన చెల్లిని ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి 'రెట్టింపైన సంతోషం' అంటూ క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది. View this post on Instagram A post shared by Raja Goutham (@rajagoutham) చదవండి: మూడేళ్లుగా డిప్రెషన్లో, ఇంతలో గుండెపోటు: డైరెక్టర్ సోషల్ మీడియాలోకి స్టార్ హీరో భార్య ఎంట్రీ -
'బ్రేక్ అవుట్'మూవీ ట్రైలర్ విడుదల చేసిన అల్లు అర్జున్
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు. టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. Happy to launch the trailer of #BreakOut. The concept of the movie looks interesting. It’s good to see a young team in TFI experimenting with such stories. My best wishes to #RajaGoutham, director @its_Subbu4U and the whole cast & crew.https://t.co/sJ6BlKpa4N — Allu Arjun (@alluarjun) August 29, 2022 -
బ్రహ్మానందం కొడుకు నటించిన తాజా చిత్రం.. ఫస్ట్‌లుక్ వచ్చేసింది
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్ అవుట్’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ మోదుగ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ని శనివారం విడుదల చేశారు. కిటికీ నుంచి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్న రాజా గౌతమ్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచుతోంది. ‘‘సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న చిత్రమిది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో చెబుతాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘చిత్రం’ శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మోహన్ చారీ, సంగీతం: జోన్స్ రూపర్ట్. -
నాన్నగారి ఆరోగ్యం బాగుంది
ప్రముఖ హాస్య నటులు బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముంబైలోని ఆస్పత్రిలో ఉన్నారు. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు కలవరపడ్డారు. అయితే బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగానే ఉందంటూ ఆయన తనయుడు, హీరో రాజా గౌతమ్ తెలిపారు. ‘‘కొన్ని నెలలుగా నాన్నగారికి ఛాతిలో అసౌకర్యంగా అనిపించడంతో హైదరాబాద్‌లోని ప్రముఖ డాక్టర్ని సంప్రదించారు. వారి సలహా మేరకు ముంబైలోని ‘ఏషియన్ హార్ట్ ఇన్‌స్టి్టట్యూట్’ లో సోమవారం (14.1.20 19 ) గుండె ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. శ్రీ రమాకాంత్ పాండాగారు శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతం నాన్నగారి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. ఐసీయు నుంచి సాధారణ గదికి మార్చాం. నాన్నగారి అభిమానులు, శ్రేయోభిలాషులు, సినీ పరిశ్రమలోని ప్రముఖుల ప్రేమాభిమానాలు, ఆశీస్సులు వల్ల నాన్నగారి ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది. వారందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు రాజా గౌతమ్. కాగా బ్రహ్మానందం కుమారులు రాజా గౌతమ్, సిద్ధార్థ్‌లు ప్రస్తుతం తండ్రితో పాటు ముంబైలో ఉన్నారు. -
మను జర్నీ లైఫ్‌లో మరచిపోలేను
‘‘బసంతి’ సినిమా తర్వాత ఆఫర్స్ వచ్చాయి. కానీ, నేను ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై బాగా ఫోకస్ పెట్టా. ఓ కొత్త తరహా సినిమాలో నేను భాగమవ్వాలనే తపన నా మనసులో బలంగా పాతుకుపోయింది. ఇవన్నీ వద్దనుకుని నాకు కావాల్సిన దాని కోసం వెతుక్కున్నాను. ఇందుకు టైమ్ పట్టింది. ఇకపై స్పీడ్ పెంచుతా’’ అని రాజా గౌతమ్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్‌ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. రాజా గౌతమ్ మాట్లాడుతూ... ► ఫణీంద్ర షార్ట్‌ఫిల్మ్స్ చూసి నచ్చడంతో ఫోన్ చేసి అభినందించా. ఆ తర్వాత కలిశాం. అప్పుడే ‘మను’ సినిమా గురించి చెప్పారు. ఇందులో నటించే వారికి మంచి పేరు వస్తుందని చెప్పా. ఫైనల్‌గా ఓ రోజు ఫోన్ చేసి నువ్వే హీరో అన్నారు. ఈ సినిమాతో మూడేళ్ల నుంచి ట్రావెల్ అవుతున్నా. డబ్బు కన్నా ఎక్కువ టైమ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుని ‘మను’ స్టార్ట్ చేశాం. ► ఈ కథతో నిర్మాతలదగ్గరికి వెళితే ప్రయోగాత్మక సినిమా కదా! అన్నారు. ఫణీంద్ర ఆలోచించి ఫేస్బుక్లో క్రౌడ్‌ఫండ్ పోస్ట్ పెట్టారు. అనూహ్య స్పందన వచ్చింది. ఈ రోజు వరకూ యూనిట్లో ఏ ఒక్కరూ పైసా కూడా తీసుకోలేదు. ► ఈ సినిమాలో మను అనే ఆర్టిస్టు(పెయింటర్) క్యారెక్టర్లో నటించాను. ఇదొక రొమాన్స్ థ్రిల్లర్. ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. సాంగ్స్ లేవు. పెద్దగా సీజీ వర్క్ లేదు. ‘మను’ జర్నీ నా లైఫ్‌లో మర్చిపోలేను. ఇదొక మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కూడా. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. ► బ్రహ్మానందంగారి అబ్బాయి అంటే ఫస్ట్ సినిమా చూస్తారు. అయితే యాక్టర్‌గా నేను ప్రూవ్ చేసుకోవాలి. కెరీర్ విషయంలో నాన్నగారు(బ్రహ్మానందం) సలహాలు ఇచ్చారు. ఇప్పటికీ వాటినే ఫాలో అవుతున్నా. తర్వాతి సినిమాకు ఇంకా కమిట్ కాలేదు. హీరో పాత్రలే కాదు. నటనకు ఆస్కారం ఉన్న ఏ పాత్ర అయినా చేయడానికి సిద్ధమే. -
ఇలాంటి సినిమా తీయాలనిపించింది
‘‘మను, కేరాఫ్ కంచరపాలెం’ సినిమాలు ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ‘మను’ ట్రైలర్ చూసిన తర్వాత ప్రివ్యూ వేస్తే నాకు చూపిస్తారా? అని సుజన్‌ని అడిగా. అంతేకాదు.. ఇలాంటి సినిమా నేను కూడా ఒకటి తీయాలనిపించింది’’ అని డైరెక్టర్ క్రిష్ అన్నారు. రాజా గౌతమ్, చాందినీ చౌదరి జంటగా ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించి ఈ సినిమా ఈనెల 7న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నేను, గౌతమ్అన్న ఒకే కాలనీలో పెరిగాం. ఆయన హీరో కావడానికి చాలా కష్టపడ్డాడు. తెలుగులో నాలుగు ఫైట్స్, సాంగ్స్‌తో సినిమాలు వస్తుంటాయి. కానీ, ఇలాంటి సినిమాలు తక్కువగా వస్తుంటాయి.. ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు. ‘‘క్రౌడ్ ఫండింగ్ అనేది డిగ్నిఫైడ్ అప్రోచ్ అని మా సినిమాతో నిరూపించాలనుకుంటున్నాం. సరైన సినిమా తీస్తే క్రౌడ్ ఫండింగ్ అనే ఓ ఫ్లాట్‌ఫాం ఉందని చెప్పే ప్రయత్నమిది’’ అన్నారు ఫణీంద్ర నర్సెట్టి. ‘‘ఈ మూడేళ్ల జర్నీని నా లైఫ్‌లో మరచిపోలేను. ఇది నా బెస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్. కొత్త కాన్సెప్ట్‌లకు నిర్మాతలెవరూ ముందుకు రాకపోతే.. క్రౌడ్ ఉందనే ధైర్యం మా సినిమా చూస్తే కలుగుతుంది’’ అన్నారు రాజా గౌతమ్. చాందినీ చౌదరి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ శివ్ కుమార్ పాల్గొన్నారు. -
నువ్వే మను అన్నాడు
‘‘మను’ సినిమా మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీ స్టార్ట్ కాకముందు చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్‌ని కలిశాను. 40 – 50 కథలు విన్నాను. ‘మధురం’ షార్ట్ ఫిల్మ్ చూసి ఫణిని అభినందించా. అప్పుడే ఫణి ‘మను’ కథ చెప్పాడు’’ అన్నారు రాజా గౌతమ్. నూతన దర్శకుడు ఫణీంద్ర నర్శెట్టి దర్శకత్వంలో రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మను’. నిర్వాణ సినిమాస్ సమర్పణలో క్రౌడ్ ఫండింగ్ మూవీగా నిర్మితమైంది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. గౌతమ్ మాట్లాడుతూ – ‘‘ఈ కథ విన్నాక బావుందని అప్రిషియేట్ చేశాను. కొన్ని రోజుల తర్వాత నువ్వే ‘మను’ క్యారెక్టర్ చేస్తున్నావన్నాడు ఫణి. చాలా సంతోషంగా అనిపించింది. 115 మంది డబ్బు పెట్టారు. ఎంతో బాధ్యతగా తీశాడు. సెప్టెంబర్ 7న సినిమాను రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ క్షణం కోసం ఎంతో ఎదురు చూశా. ట్రైలర్ కంటే సినిమా ఎన్నో రెట్లు బాగుంటుంది. ఫణి విజన్ ఉన్న దర్శకుడు’’ అన్నారు చాందిని. ‘‘నాకు ఎమోషనల్ మూమెంట్. నా ఇన్వెస్టర్స్‌ని మర్చిపోలేను. వాళ్లందరికీ థ్యాంక్స్. నా సినిమా ఎక్కువ మాట్లాడుతుందని నమ్ముతున్నాను. నిర్వాణ సినిమాస్ వాళ్ల నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుంది’’ అన్నారు దర్శకుడు. ‘‘ఒక సినిమా అందరికీ రీచ్ కావాలంటే మంచి కథ కావాలి. ఫణి అలాంటి కథతోనే వస్తున్నాడు. మంచి సినిమా ప్రేక్షకులకు అందించాల్సిన బాధ్యత మాపై ఉందనిపించింది’’ అన్నారు నిహార్. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్, సంగీతం: నరేశ్. -
రెండేళ్ల కష్టం
బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్, చాందినీ చౌదరీ జంటగా ‘మధురం’ షార్ట్‌ఫిల్మ్ ఫేమ్ ఫణీంద్ర నర్సెట్టి తెరకెక్కించిన చిత్రం ‘మను’. క్రౌడ్ ఫండింగ్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ నిర్వాణ సినిమాస్ రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడం గురించి నిర్వాణ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ – ‘‘మను’ చిత్రాన్ని రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్‌తో మేం చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాం. ఈ సినిమాలో చాలామంది కష్టం, కన్నీళ్లు, శ్రమ ఉన్నాయి. ఈ సినిమాను పూర్తి చేయడానికి సుమారు 20 మంది రెండేళ్లు కష్టపడ్డారు. దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టితో అసోసియేట్ అవ్వడం చాలా హ్యాపీ. వాల్ట్ డిస్నీ నమ్మే సిద్ధాంతాన్నే మేమూ నమ్ముతాం. ‘మేం డబ్బులు సంపాదించడానికి సినిమాలు తీయం, సినిమాలు తీయడానికి డబ్బులు సంపాదిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నరే‹శ్ కుమార్, కెమెరా: విశ్వనాథ్ రెడ్డి. -
బసంతి సాంగ్ టీజర్ ఫొటోలను విడుదల చేసిన ఎన్. టీ. ఆర్.