మరోసారి తాతైన బ్రహ్మానందం | Brahmanandam son Raja Goutham Blessed With Baby Girl | Sakshi
Sakshi News home page

Brahmanandam:పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బ్రహ్మానందం కోడలు

Published Sun, Nov 27 2022 7:08 PM | Last Updated on Sun, Nov 27 2022 7:58 PM

Brahmanandam son Raja Goutham Blessed With Baby Girl - Sakshi

టాలీవుడ్‌ స్టార్‌ కమెడియన్‌ బ్రహ్మానందం మరోసారి తాతయ్యాడు. బ్రహ్మీ తనయుడు, నటుడు రాజా గౌతమ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. రాజా గౌతమ్‌- జ్యోత్స్న దంపతులకు ఇదివరకే పార్థ అనే బాబున్నాడు. తాజాగా ఈ జంట మరోపాపకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను అతడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించాడు.

పార్థ తన చెల్లిని ముద్దాడుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి 'రెట్టింపైన సంతోషం' అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇకపోతే బ్రహ్మానందం ముఖ్యపాత్రలో నటించిన పంచతంత్రం సినిమా డిసెంబర్‌ 9న రిలీజ్‌ కాబోతుంది.

చదవండి: మూడేళ్లుగా డిప్రెషన్‌లో, ఇంతలో గుండెపోటు: డైరెక్టర్‌
సోషల్‌ మీడియాలోకి స్టార్‌ హీరో భార్య ఎంట్రీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement