
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.10.20 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పుబ్బ తె.5.40 వరకు (తెల్లవారితే శుక్రవారం), తదుపరి ఉత్తర, వర్జ్యం: ప.12.39 నుండి 2.19 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.12 నుండి 11.00 వరకు, తదుపరి ప.2.59 నుండి 3.47 వరకు, అమృతఘడియలు: రా.10.56 నుండి 12.39 వరకు, హోలి పండుగ; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.15, సూర్యాస్తమయం: 6.05.
మేషం.... ముఖ్య నిర్ణయాలు వాయిదా పడతాయి. ఆలోచనలు ఎంతకీ కొలిక్కిరావు. బాధ్యతలు పెరుగుతాయి. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.
వృషభం... వ్యవహారాలలో ప్రతిబ«ంధకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో తగాదాలు. దైవచింతన. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందిపెట్టవచ్చు.
మిథునం.... పాతమిత్రుల కలయిక. నూతన వ్యవహారాలు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.
కర్కాటకం.. చేపట్టిన పనులు ముందుకు సాగవు. సోదరులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు తప్పవు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
సింహం.... దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఎంతోకాలంగా వేచిచూస్తున్న ఉద్యోగాలు దక్కవచ్చు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య.... మిత్రుల నుండి సమస్యలు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ప్రయాణాలను వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
తుల.... పరిచయాలు మరింత పెరుగుతాయి. స్థిరాస్తివృద్ధి. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృశ్చికం... రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం కాగలవు.
ధనుస్సు... మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా మారవచ్చు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మకరం... మిత్రులు, శ్రేయోభిలాషులతో వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా పడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు ఉద్యోగాలలో కొంత ఒత్తిడులు.
కుంభం... కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
మీనం... ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. సమావేశాలలో పాల్గొంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.
Comments
Please login to add a commentAdd a comment