Brahmanandam Son Goutham Raja Break Out Movie Trailer Is Out - Sakshi
Sakshi News home page

Break Out Movie Trailer : 'బ్రేక్ అవుట్'మూవీ ట్రైలర్‌ విడుదల చేసిన అల్లు అర్జున్‌

Published Mon, Aug 29 2022 5:15 PM | Last Updated on Tue, Aug 30 2022 12:34 AM

Brahmanandam Son Goutham Raja Break Out Movie Trailer Is Out - Sakshi

ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రేక్‌ అవుట్‌’. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్‌ మోదుగ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ ఈ సినిమా  కాన్సెప్ట్ చాలా ఆసక్తి కలిగిస్తోందని అన్నారు.

టాలీవుడ్ లో ఓ యంగ్ టీమ్ ఈ తరహా కథలతో ప్రయోగాత్మకంగా ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలిపారు. కాగా సర్వైవల్ హారర్ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో  రాజా గౌతమ్ తో పాటు కిరీటి దామరాజు, చిత్రం శ్రీను, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి, రమణ భార్గవ్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement