trailer released
-
వన్ అండ్ ఓన్లీ దేవా
షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘దేవా’. ఈ చిత్రంలో పోలీసాఫీసర్ దేవా పాత్రలో షాహిద్ కపూర్ నటించారు. పూజాహెగ్డే హీరోయిన్గా నటించిన ఈ మూవీతో మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రూ హిందీ చిత్ర పరిశ్రమకు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.సిద్ధార్థ్ రాయ్ కపూర్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘దేవా’ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో షాహిద్ మాసీ విజువల్స్ మాత్రమే కనిపిం చాయి. కానీ చివర్లో వన్ అండ్ ఓన్లీ దేవా వస్తున్నాడు అని చూపించారు. పావైల్ గులాటి, ప్రవేవ్ రాణా, కుబ్రా సైట్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి విశాల్ మిశ్రా స్వరకర్త. -
'డాకు మహారాజ్' ట్రైలర్ రిలీజ్
-
తెర వెనక 'ఆర్ఆర్ఆర్' ఇన్నాళ్లకు.. అటు తారక్ ఇటు చరణ్! (ఫొటోలు)
-
ఓ సీక్రెట్ చెప్పనా..!
వరుణ్ ధావన్, సమంత లీడ్ రోల్స్‌లో నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీబన్నీ’. ‘ది ఫ్యామిలీమేన్’ సిరీస్ ఫేమ్ రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌ను రూపొందించారు. అమెరికన్ సిరీస్ ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ రానుంది. ఈ సిరీస్ ట్రైలర్ విడుదలైంది. ‘ప్రతి రోజూ ఓ ప్రమాదం ముంచుకొస్తుంది.ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటుంది. సవాల్ ఏంటంటే... ఈ ప్రమాదాలను మనం అంతం చేస్తామా? లేక అవి మనల్ని అంతం చేస్తాయా? అన్నది, నాడియా... నీకొక సీక్రెట్ చెప్పనా.. నేనొక ఏజెంట్’ వంటి డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ఈ సిరీస్‌లో సినీ నటి హనీగా సమంత, స్టంట్ కొరియోగ్రాఫర్ బన్నీగా వరుణ్ ధావన్ కనిపిస్తారు. కానీ ఈ ఇద్దరూ ఏజెంట్స్. ఈ ఇద్దరూ ఓ మిషన్ కోసం ఎలాంటి పోరాటాలు చేశారన్నది సిరీస్‌లో ఆసక్తికరమైన అంశం. అమెజాన్ ఓటీటీలో నవంబరు 7 నుంచి ఈ సిరీస్ స్ట్రీమ్ కానుంది. -
బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు!
ధనుష్ టైటిల్ రోల్లో నటించి, దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘రాయన్’. సందీప్ కిషన్, కాళిదాసు జయరామ్ ఇతర లీడ్ రోల్స్‌లో నటించిన ఈ సినిమాలో సెల్వరాఘవన్, ప్రకాశ్‌రాజ్, ఎస్జే సూర్య, అపర్ణా బాలమురళి, దుషారా విజయన్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రల్లో నటించారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పి తెలుగు వెర్షన్‌ను రిలీజ్ చేయనుంది.ఈ సందర్భంగా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో మంగళవారం ‘రాయన్’ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ‘రాయన్... అడవిలో ప్రమాదమైన జంతువు ఏదో తెలుసా’, ‘సింహం,’ ‘అడవిలో బలమైన జంతువులు పులి, సింహమే. కానీ ప్రమాదమైన జంతువు తోడేలు. రెండూ ఎదురుగా నిలబడితే సింహమే గెలుస్తుంది. కానీ తోడేలు చాలా జిత్తులమారిది. గుంపుగా చుట్టిముట్టి, ఓ పథకం వేసి సింహాన్ని ఓడిస్తాయి’, ‘వస్తాడు... బ్రహ్మరాక్షసుడిలా వస్తాడు... దహనం చేస్తాడు’, ‘రావయ్యా... రాయన్... వెళ్లి ఏం చెప్పావ్... టక్కున కేసు వెనక్కు తీసుకున్నాడు’ అనే డైలాగ్స్ తెలుగు ట్రైలర్లో ఉన్నాయి. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. -
రిస్క్ చేశారు.. సక్సెస్ కావాలి
‘‘ఆపరేషన్ రావణ్’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. వెంకట సత్యగారు వాళ్ల అబ్బాయి రక్షిత్ కోసమే ‘పలాస 1978’ మూవీ చేసి హిట్ అందుకున్నారు. ఇప్పుడు ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి రిస్క్ చేశారు... ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ కావాలి’’ అన్నారు హీరో విశ్వక్ సేన్. రక్షిత్ అట్లూరి, సంగీర్తనా విపిన్ జంటగా వెంకట సత్య దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆపరేషన్ రావణ్’. ధ్యాన్ అట్లూరి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 2న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకలో అతిథి విశ్వక్ సేన్ మాట్లాడుతూ– ‘‘రక్షిత్‌కు నేను చెప్పే సలహా ఒక్కటే. ఇండస్ట్రీలో చివరి చాన్స్ అనేది ఏమీ ఉండదు. ఇంకో చాన్స్ ఉంటుంది. మనం నమ్మకం వదిలేసినప్పుడే అనుకోని ఫలితాలు వస్తుంటాయి. నమ్మకంతో ప్రయత్నిస్తుంటే తప్పకుండా విజయం వస్తుంది’’ అన్నారు. ‘‘మీ ఆలోచనల ప్రభావం వల్లే మీరు మంచివాళ్లా? చెడ్డ వాళ్లా? అనేది నిర్ణయిస్తారు. మీరు ఎలా ఉండాలో మీ ఆలోచనలే నిర్ణయిస్తాయి. ఆ ΄ాయింట్తోనే ‘ఆపరేషన్ రావణ్’ రూ΄÷ందించా’’ అన్నారు వెంకట సత్య. రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సెట్లోకి వెళితే నేను యాక్టర్... నాన్న డైరెక్టర్ అంతే. ‘ఆపరేషన్ రావణ్’ ప్రేక్షకులను అల రిస్తుంది. ‘పలాస 2’ సినిమాకు చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
రికార్డ్స్ చూసుకో..!
‘ఈ భూమ్మీద మొదటి నగరం.. ఈ వరల్డ్‌లో చివరి నగరం కాశీ’ అనే డైలాగ్‌తో ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ ప్రారంభమైంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటించారు. వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ మూవీ ట్రైలర్‌ని సోమవారం రిలీజ్ చేశారు మేకర్స్.తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్తో సహా పలు భాషల్లో ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘నువ్వు ఇప్పుడు కనబోయేది మామూలు ప్రాణం కాదమ్మా.. సృష్టి.. నేను కాపాడతా’(అమితాబ్ బచ్చన్), ‘పాయింట్ ఏంటంటే నేనొక్కడినే ఆ అమ్మాయిని తీసుకురాగలను.. రికార్డ్స్ చూసుకో ఇంతవరకూ ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు.. ఇది కూడా ఓడిపోను’(ప్రభాస్), ‘ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకోని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి’(దీపికా పదుకోన్), ‘భయపడకు.. మరో ప్రపంచం వస్తుంది’(కమల్‌హాసన్) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి.ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ– ‘‘ఒక ఫిల్మ్ మేకర్‌గా ఇండియన్ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ పట్ల నాకు చాలా ΄్యాషన్ ఉంది. ‘కల్కి 2898 ఏడీ’లో ఈ రెండు ఎలిమెంట్స్‌ని మెర్జ్ చేయడం మా ఆర్టిస్ట్‌లు, టీం అద్భుతమైన ప్రతిభ, అంకితభావం వల్ల సాధ్యమైంది. ఈ కలని సాకారం చేసుకోవడానికి మాకు చాలా టైమ్ పట్టింది. ఈ ట్రైలర్ తెలుగు ప్రేక్షకులను, యావత్ దేశాన్ని గర్వించేలా చేస్తుందని, సినిమా కోసం వారిని ఎగై్జట్ చేసేలా ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
రాక్షసులపై యుద్ధం .. ట్రెండింగ్‌లో ‘భీమా’ ట్రైలర్
‘శ్రీ మహా విష్ణువు దశావతారాలలో పరశురాముడు ఆరవ అవతారం. తన గొడ్డలితో సముద్రాన్ని వెనక్కి పంపి పరశురామ క్షేత్రం అనే అద్భుతమైన భూమిని సృష్టించాడు. రాక్షసులు తమ క్రూరత్వంతో అమాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు భగవంతుడు వారిని ఆపడానికి బ్రహ్మ రాక్షసుడిని పంపిస్తాడు. అతను రాక్షసులపై యుద్ధం ప్రకటించే కరుణలేని పోలీసు’ అంటూ సాగుతుంది ‘భీమా’ ట్రైలర్. గోపీచంద్ హీరోగా ఎ. హర్ష దర్శకత్వంలో కేకే రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘భీమా’. ప్రియా భవానీ శంకర్, మాళవికా శర్మ కథానాయికలు. మార్చి 8న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘చాలా మంచి సినిమా. తప్పకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రేక్షకులు ఒక డిఫరెంట్ గోపీచంద్‌ని చూస్తారు’’ అన్నారు ఎ. హర్ష. ‘‘శివరాత్రికి శివుని ఆశీస్సులతో ఈ సినిమా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను’’ అన్నారు రాధామోహన్. -
ఇంద్రాణి ట్రైలర్ బాగుంది
‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్టైన్ మెంట్స్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని. -
గామి మూవీ ట్రైలర్
-
గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్
-
ఏలియన్ మూవీ ట్రైలర్ రిలీజ్
-
ఈగల్ మూవీ ట్రైలర్ వచ్చేసింది
-
వ్యూహం... నేను నమ్మిన రియాలిటీ
‘‘నేను తీసినటువంటి విభిన్న రకాలైన సినిమాలు ఎవరూ తీయలేదు. రాజకీయ నాయకులు, పోలీసులు.. ఇలా ఎవరైనా కావొచ్చు. నాకు పవర్ఫుల్ వ్యక్తుల బయోపిక్‌లు తీయడం అంటే ఇష్టం’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. అజ్మల్, మానస ముఖ్య తారలుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామధూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘వ్యూహం’. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ‘వ్యూహం: 1’ ఈ నెల 29న విడుదల కానుంది. మలి భాగం ‘శపథం’ పేరుతో జనవరి 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం: 1’ రెండో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. ‘వ్యూహం’ సినిమా రిలీజ్‌ను ఎవరూ ఆపలేరు అని నేను గతంలోనే చెప్పాను. ఇప్పుడు నేను, కిరణ్‌గారు కలిసి నిరూపించాం. క్లీన్ యూతో మాకు సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది? అనేది సీక్రెట్. వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారు మరణించిన సమయం నుంచి 2023 వరకు ‘వ్యూహం’ సినిమా మొత్తం కథనం ఉంటుంది. వైఎస్ జగన్‌గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తొలి భాగం ఉంటుంది. ఈ క్రమంలో ఎవరెవరు ఏయే వ్యూహాలు రచించారు వంటి ప్రధాన ఘటనలు ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ తొలి భాగంలో ఏవైనా సందేహాలు కలిగితే అవి రెండో భాగంలో నివృత్తి అవుతాయి. నిజ జీవితంలోని వ్యక్తులు, వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుంది. కానీ నేను నమ్మిన రియాలిటీతోనే ‘వ్యూహం’ ఉంటుంది. సినిమా అంటేనే నాటకీయత. కాబట్టి ఈ సినిమాలో ఆ నాటకీయత కూడా ఉంటుంది. ప్రేక్షకులకు తెలియని విషయాలు కూడా ఈ సినిమాలో ఉంటాయి. ‘వ్యూహం’ సినిమాలో కామెడీ పాత్ర కూడా ఉంది. ఆ పాత్ర సర్ప్రైజింగ్గా ఉంటుంది. భవిష్యత్తులో ‘వ్యూహం’ తరహా సినిమాలను నేను తీస్తానా? అంటే చెప్పలేను. ఎందుకంటే నా మాటపై నేను నిలబడను’’ అని అన్నారు. ‘‘రామ్‌గోపాల్ వర్మగారితో నేను గతంలో ‘వంగవీటి’ సినిమా చేశాను. ఆ తర్వాత మళ్లీ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘వ్యూహం’, ‘శపథం’ ్రపాజెక్ట్స్ మొదలయ్యాయి. ప్రతి వారం థియేటర్స్‌లోకి మూడు నాలుగు సినిమాలు రావడం సహజమే. అన్నింటికీ థియేటర్లు దొరుకుతాయి. మా ‘వ్యూహం’ సినిమాను ఎక్కువ థియేటర్స్‌లోనే రిలీజ్ చేస్తాం’’ అన్నారు నిర్మాత దాసరి కిరణ్. ఆంధ్రప్రదేశ్ సీయం వైఎస్ జగన్‌గారితో నాకు పరిచయం లేదు. అయితే జగన్‌గారంటే నాకు పాజిటివ్ అభిప్రాయాలు ఉన్నాయి. సీబీఎన్గారంటే కూడా నాకు ఇష్టమే. విలన్స్ అన్నా నాకిష్టమే. ‘నా వెనక ఉండే నీకు అర్థం కాదు తమ్ముడు (ఓ పాత్రధారి).. తన ఊపు చూస్తుంటే ఏదో కొత్త పార్టీ పెట్టేసేలా ఉన్నాడు (మరో పాత్రధారి). క్షవరం అయితే కానీ వివరం తెలియదు అని ఊరికే అనలేదు పెద్దలు (ఓ పాత్రధారి)’ అనే డైలాగ్స్ సినిమాలో ఉన్నాయంటే... చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇంట్లో పని చేసినవారిని సంప్రదించి, నేను నమ్మిన అంశాలతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ పెట్టాం. అసలు.. జనసేనలో పవన్‌కల్యాణ్ టీడీపీ కోవర్ట్‌గా పని చేస్తున్నాడని నా అభిప్రాయం. పవన్ పార్టీ పెట్టినప్పుడు అతన్ని అభిమానిస్తున్నట్లుగా మాట్లాడాను. కానీ అతనిలో స్థిరత్వం లేదు. ఇక తెలంగాణలో ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌లో బలమైన ప్రతిపక్ష పార్టీ లేదని నా అభిప్రాయం. ఎన్నికల్లో ఎవరెవరు నిలబడుతున్నారు? వారు ఏమేం హామీలు ఇస్తున్నారనే రాజకీయ పరిజ్ఞానం నాకు లేనప్పుడు ఎన్నికల్లో ఓటు వేయడం కరెక్ట్ కాదని, ఓ బాధ్యత గల పౌరుడిగా నేనిప్పటి వరకూ ఓటు వేయలేదు. – రామ్‌గోపాల్ వర్మ -
హారరా? థ్రిల్లరా?
భాను శ్రీ, సోనాక్షీ వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కలశ’. కొండా రాంబాబు దర్శకత్వంలో శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ–‘‘కలశ’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా థ్రిల్లరా? లేక హారరా? అనే సందేహం కలిగేలా ట్రైలర్‌ను కట్ చేశారు. యూనిట్‌కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు. ‘‘కలశ’ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుంది. థియేటర్స్‌లో చూడండి’’ అని యూనిట్ పేర్కొంది. -
అడవి అందంగా ఉంటుంది
అప్సరా రాణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘తలకోన’. నగేశ్ నారదాసి దర్శకత్వంలో స్వప్న శ్రీధర్ రెడ్డి సమర్పణలో దేవర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నవంబరు రెండో వారంలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్ వర్మ, నటుడు శివాజీరాజా, నిర్మాత రామారావు అతిథులుగా హాజరై పాటలు, ట్రైలర్‌ను విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ– ‘‘నాకు అందమంటే చాలా ఇష్టం. అడవి కూడా చాలా అందంగా ఉంటుంది. అందమైన అడవిలో అప్సరా రాణి డ్యాన్స్, ఫైట్లు చేస్తుంటే చూడటానికి అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘నటనకు స్కోప్ ఉన్న ‘తలకోన’లాంటి సినిమా చేయడం నా అదృష్టం’’ అన్నారు అప్సరా రాణి. ‘‘ప్రకృతిలో ఏం జరుగుతుందో ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాం’’ అన్నారు నగేశ్. ‘‘చాలా రిస్క్ చేసి, ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేశాం’’ అన్నారు దేవర శ్రీధర్ రెడ్డి. -
వ్యూహం మూవీ ట్రైలర్ విడుదల
-
‘బ్రో’ మూవీ ట్రైలర్
-
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
Rudrangi trailer: నేను ఎరేసి వేటాడతా
జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బాహుబలి’ ప్రభాకర్, ఆర్ఎస్ నంద ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ‘బాహుబలి, ఆర్ఆర్ఆర్’ చిత్రాలకు డైలాగ్స్ రాసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమా జూలై 7న విడుదలకానుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ని యూనిట్ విడుదల చేసింది. తెలంగాణ చారిత్రక నేపథ్య కథతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో భీమ్ రావ్ దొరగా జగపతిబాబు, జ్వాలా భాయిగా మమతా మోహన్ దాస్, మల్లేష్‌గా ఆశిష్ గాంధీ నటించారు. ‘ఒకడు ఎదురుపడి వేటాడతాడు.. ఒకడు వెంటపడి వేటాడతాడు.. నేను ఎరేసి వేటాడతా’ అంటూ జగపతిబాబు చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ సాగుతుంది. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్ శనమోని, సంగీతం: నాఫల్ రాజా. -
సర్దార్ నాకు పోటీ వచ్చినా పర్లేదు..‘మిస్టేక్’ హిట్టుకొట్టాలి: శ్రీకాంత్
‘‘అభినవ్ సర్దార్ చాలా రంగాల్లో విజయం సాధించాడు. ఇండస్ట్రీలో నిర్మాతగా ఉండాలంటే కష్టం. కానీ, ‘మిస్టేక్’ కథని నమ్మి సర్దార్ నిర్మాతగా మారాడు. ఈ మధ్య చిన్న సినిమాలు మంచి సక్సెస్ సాధిస్తున్నాయి. ట్రైలర్ చూశాక ‘మిస్టేక్’ కూడా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’. విలన్‌గా సర్దార్ నాకు పోటీ వచ్చిన పర్లేదు కానీ ఈ చిత్రం విజయం సాధించాలి’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించిన చిత్రం ‘మిస్టేక్’. అభినవ్ సర్దార్ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్‌ని శ్రీకాంత్ విడుదల చేశారు. ‘‘భరత్ చెప్పిన కథపై నమ్మకంతో ‘మిస్టేక్’ సినిమా నిర్మించాను’’ అన్నారు అభినవ్ సర్దార్. ‘‘జూలైలో ఈ చిత్రం విడుదలకి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు భరత్ కొమ్మాలపాటి. -
పిల్లి బొమ్మ వస్తుంది!
‘నెక్ట్స్ టెన్ డేస్‌లో చాలా పెద్ద డీల్ ఉంది. దుబాయ్ నుంచి ముంబైకి ఒక పిల్లి బొమ్మ వస్తుంది. దాన్ని చాలా సేఫ్‌గా మన దగ్గరకు చేర్చాలి’ అనే డైలాగ్‌తో ‘నారాయణ అండ్ కో’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సుధాకర్ కోమాకుల హీరోగా చిన్నా పాపిశెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘నారాయణ అండ్ కో’. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా బ్యానర్లపై పాపిశెట్టి బ్రదర్స్‌తో కలిసి సుధాకర్ కోమాకుల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను హీరో విశ్వక్ సేన్ రిలీజ్ చేశారు ‘‘చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘నారాయణ అండ్ కో’ రూపొందింది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ట్రైలర్
-
నిజం కచ్చితంగా గెలుస్తుంది
‘నిన్ను సీఎం సెక్యూరిటీకి అని పంపిస్తే.. నువ్వు ఆవిడ బండినే ఆపేస్తావా?’ అనే డైలాగ్‌తో ‘కస్టడీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. నాగచైతన్య, కృతీ శెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని శుక్రవారం విడుదల చేశారు. ‘నిన్ను కోర్టుకి తీసుకెళ్లి అప్పగిస్తాను.. లేకపోతే ట్రై చేస్తూ చస్తాను’, ‘ఒక్కసారి న్యాయం పక్క నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది’, ‘నిజం గెలవడానికి లేట్ అవుతుంది.. కానీ కచ్చితంగా గెలుస్తుంది’ (నాగచైతన్య), ‘నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు కానీ ఎలాగైనా నన్ను తీసుకెళ్లు.. లేకపోతే నా చావు నేను చస్తా’ (కృతీ శెట్టి) వంటి డైలాగులు ట్రైలర్లో ఉన్నాయి. ఈ చిత్రంలో ప్రియమణి ముఖ్యమంత్రిగా, అరవింద్ స్వామి విలన్‌గా, శరత్ కుమార్ పోలీసాఫీసర్‌గా నటించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా, కెమెరా: ఎస్ఆర్ కతీర్, సమర్పణ: పవన్ కుమార్. -
Rudhrudu: కనిపెట్టాలి.. కొట్టాలి!
‘‘కూర్చున్న చోటే స్కెచ్ వేసి మనుషుల్ని లేపేసేవాడివి. నిన్నే వాడు బయటకు లాక్కొచ్చాడంటే వాడెంత తోపై ఉంటాడు’’ అనే డైలాగ్‌తో మొదలవుతుంది ‘రుద్రుడు’ సినిమా ట్రైలర్. దర్శక–నిర్మాత, నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవా లారెన్స్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘రుద్రుడు’. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కదిరేశన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో నిర్మాత ‘ఠాగూర్’ మధు రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు. ‘ఒకడి జీవితంలో ఏవేవి జరగకూడదో అవన్నీ రుద్ర జీవితంలో జరిగాయి’, ‘మావ.. మన చుట్టూ పెద్దగా ఏదో జరుగుతోంది రా.. మనమే వెతకాలి. మనమే కనిపెట్టాలి. మనమే కొట్టాలి’ అనే డైలాగ్స్ ట్రైలర్లో ఉన్నాయి. ‘‘కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు లారెన్స్. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్‌ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్‌కుమార్ అతని లైఫ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలవుతాయి. అయినప్పటికీ దృఢంగా నిలబడి, క్రిమినల్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం సాగుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.