Sri Simha Koduri Bhaag Saale Movie Release Date On July 7th, Deets Inside - Sakshi
Sakshi News home page

Bhaag Saale Release Date: ఇకపై భాగ్‌ సాలే సినిమా గుర్తొస్తుంది

Jun 27 2023 2:03 AM | Updated on Jun 27 2023 10:16 AM

Bhag Saale is gearing up for release on July 7 - Sakshi

కార్తికేయ, శ్రీసింహా, కాలభైరవ

‘‘భాగ్‌ సాలే ట్రైలర్‌ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్‌ సాలే అంటే మహేశ్‌ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్‌ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్‌ సాలే’ పెద్ద హిట్‌ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్‌ హీరోయిన్లుగా ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్‌ సాలే’. అర్జున్‌ దాస్యన్, యష్‌ రంగినేని, కల్యాణ్‌ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్‌ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్‌ దాస్యన్‌. ‘‘ఇది హైదరాబాద్‌ బేస్డ్‌ మూవీ. మంచి ఇరానీ చాయ్‌లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్‌ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్‌ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్‌ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement