Nandini Ray
-
మరోసారి మోకాళ్లపై 'తిరుమల కొండ' ఎక్కిన తెలుగు హీరోయిన్
సినిమాల కోసం మాత్రమే గ్లామర్ లుక్‌లో కనిపించే నందిని రాయ్(Nandini Rai) సోషల్ మీడియాలో ఎప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కానీ, ఆమెలో ఆధ్యాత్మికత చింతన చాలా ఎక్కువని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆమె చాలాసార్లు తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. గతంలో ఒకసారి మోకాళ్లపై వెళ్లి కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నందిని.. తాజాగా మరోసారి మోకాళ్లపై అలిపిరి నుంచి తిరుమల కొండ (Tirumala Temple) చేరుకున్నారు. ఇన్‌స్టాలో ఎప్పుడూ ఆమె గ్లామర్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెలో దాగివున్న భక్తికి ఫిదా అవుతున్నారు.( ఇదీ చదవండి: గాయం నుంచి ఎప్పుడు కోలుకుంటానో ఆ దేవుడికే తెలియాలి: రష్మిక)టాలీవుడ్లో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించిన నందినీ రాయి.. బిగ్ బాస్ 2 తెలుగు సీజన్‌తో చాలామందికి దగ్గరైంది. అయితే, 2011లోనే 'ఫ్యామిలీ ప్యాక్' బాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో మాత్రం '040' మూవీతో అడుగుపెట్టింది. కోలీవుడ్‌లో విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మించిన వారసుడు చిత్రంలో శ్రీకాంత్‌కు జోడిగా నందిని రాయ్ నటించింది. తెలుగులో మాయ,మోసగాళ్లకు మోసగాడు,సిల్లీ ఫెలోస్,భాగ్ సాలే,శివరంజని వంటి చిత్రాల్లో ఆమె మెరిసింది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని నందిని రాయ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అలిపిరి నుంచి మెట్ల మార్గం ద్వారా వెళ్లారు. మోకాళ్ల పర్వతం వద్ద ఆమె కెమెరాలకు కనిపించారు. అక్కడ మోకాళ్లపై ఎక్కుతూ కనిపించడంతో చాలామంది అభినందించారు. అయితే, సుమారు రెండేళ్ల క్రితం కూడా నందిని రాయ్ మోకాళ్లపై నుంచే కొండ మీదకు వెళ్లి శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. ఆమె ఫోటోల కింద గోవిందా గోవిందా అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు.నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో ..దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చానని చెప్పిన నందిని రాయ్ పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు.అప్పుడు సూసైడ్ చేసుకోవాలనుకున్న నందినిగతంలో తను ఓ ఇంటర్వ్యూలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని ఇలా చెప్పింది. 'కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా' అని చెప్పింది. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) -
ఇకపై భాగ్ సాలే సినిమా గుర్తొస్తుంది
‘‘భాగ్ సాలే ట్రైలర్ వినోదాత్మకంగా ఉంది. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేశ్ బాబుగారి పాట గుర్తుకొచ్చేది. ఇకపై భాగ్ సాలే అంటే ఈ సినిమా గుర్తొస్తుంది. శ్రీ సింహాకి ‘భాగ్ సాలే’ పెద్ద హిట్ ఇవ్వాలి’’ అని హీరో కార్తికేయ అన్నారు. శ్రీ సింహా కోడూరి హీరోగా, నేహా సోలంకి, నందినీ రాయ్ హీరోయిన్లుగా ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భాగ్ సాలే’. అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించిన ఈ చిత్రం జూలై 7న విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ చిత్రం ట్రైలర్‌ను కార్తికేయ విడుదల చేశారు. ‘‘క్రైమ్ కామెడీగా రూపొందిన చిత్రమిది’’ అన్నారు అర్జున్ దాస్యన్. ‘‘ఇది హైదరాబాద్ బేస్డ్ మూవీ. మంచి ఇరానీ చాయ్లాంటి సినిమా’’ అన్నారు ప్రణీత్ బ్రాహ్మాండపల్లి. ‘‘ఈ చిత్రంలో అర్జున్ అనే టక్కరి దొంగ పాత్ర చేశాను. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఆసక్తిగా ఉంటుంది’’ అన్నారు శ్రీ సింహా. -
మంగ్లీ పాడిన 'ప్రేమ కోసం' మాస్ సాంగ్ విన్నారా?
శ్రీ సింహా, నేహా సోలంకి హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భాగ్ సాలే’. ప్రణీత్ సాయి దర్శకత్వంలో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కల్యాణ్ సింగనమల నిర్మించారు. కాల భైరవ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ప్రేమ కోసం..’ అనే మాస్ పాటను విడుదల చేశారు. ‘సన్ లైటు.. మూన్ లైటు.. మించిందేరా లవ్ లైటూ, వద్దు చాటు.. వద్దు లేటు.. ఉంటే చాలు కొంత చోటు...’ అంటూ సాగే ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించగా, మంగ్లీ పాడారు. ఈ పాటలో నటి నందినీ రాయ్ నర్తించారు. ‘‘ప్రేక్షకులను ఆద్యంతం థ్రిల్ చేసే కథతో రూపొందిన చిత్రం ‘భాగ్ సాలే’. యువతని ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని ప్రణీత్ సాయి తెరకెక్కించారు’’ అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రమేష్ కుషేందర్. -
టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా : హీరోయిన్
అటు పోట్లు ఎన్ని ఎదురైనా దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చు అని నటి నందిని రాయ్ నిరూపించింది. వరుస ఫ్లాప్‌లతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య గురించీ ఆలోచించింది. మళ్లీ తనకు తానే ధైర్యం చెప్పుకుని అపజయాలను చాలెంజ్‌గా తీసుకుంది. ప్రస్తుతం వరుస విజయాలు చవిచూస్తోంది. ఆ విజేత పరిచయం.. ► కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా ► పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్‌లోనే అంతర్జాతీయ మోడల్‌గా పేరు సంపాదించుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. ► ‘040’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ‘మాయ’, ‘ఖుషీ ఖుషీగా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజని’ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ నటించింది. అటు హిందీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాలో కనిపించింది. ► బిగ్ బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ఇటీవల సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గాలివాన’ వెబ్ సిరీస్‌లో కూడా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లతో వీక్షకులను అలరిస్తోంది. -
బిగ్‌బాస్ బ్యూటీ నందిని బర్త్‌డే సెలబ్రేషన్స్, టాలీవుడ్ తారల సందడి
బిగ్‌బాస్ ఫేం, హీరోయిన్ నందిని రాయ్ బర్త్‌డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. నిన్న(సెప్టెంబర్ 18) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా టాలీవుడ్ సినీ సెలబ్రెటీలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్ మధ్య ఆమె బర్త్‌డే వేడుక జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ బర్త్‌డే సెలబ్రెషన్స్‌లో నటుడు సాయి కుమార్, వరుణ్ సందేశ్, రాజ్ తరుణ్, తనిష్, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ సోహెల్, రాహుల్ సిప్లిగంజ్, లహరి శారి, యాంకర్, నటి భాను శ్రీ, వైవా హర్ష, పూజిత, చాందినీ చౌదరి, దర్శకులు సతీష్, కృష్ణ, రఘులు హాజరయ్యారు. ఇక వారందరి సమక్షంలో కేక్ కట్ చేసి తన కోసం వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంతోషం వ్యక్తం చేసింది ఆమె. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి కాగా నందిని రాయ్.. అతి చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో పలు అందాల పోటీల్లో పాల్గొన్న ఆమె తక్కువ సమయంలోనే మోడల్‌గా మంచి గుర్తింపు పొందింది. 2011లో వచ్చిన 040 అనే చిత్రంలో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాతా మాయ, ఖుషి ఖుషిగా, మోసగాళ్లకు మోసగాడు, సిల్లీ ఫెలోస్, శివరంజని వంటి హిట్ చిత్రాల్లో నటించింది.ఈ క్రమంలో బిగ్‌బాస్ 2 సీజన్లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. బిగ్‌బాస్ అనంతరం వరుస ఆఫర్లు కొట్టేసి బిజీగా మారింది నందిని. ఇటీవల ఆమె సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్‌లు ప్రధాన పాత్రలో వచ్చిన గాలివాన వెబ్ సిరీస్‌లో నటించి తన నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. -
ఓటీటీలో పంచతంత్ర కథలు, స్ట్రీమింగ్ అప్పుడే!
బాల్యంలో చదువుకున్న పంచతంత్ర కథల ఇన్స్పిరేషన్తో తెరకెక్కిన ఆంథాలజీ మూవీ పంచతంత్ర కథలు. నోయల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించగా ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. ఇందులో అడకత్తెర, అహల్య, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, నర్తనశాల, అనగనగా అని ఐదు కథలు ఉంటాయి. వాటి సమాహారమే ఈ సినిమా. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వస్తోంది. ఆగస్టు 31 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఆహా అనిపించిన అనౌన్స్మెంట్ ఇది అంటూ నోయల్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. Bittersweetness of love is the most beautiful part being in marriage. Here's such a story "Happy Married Life." #PanchatantraKathaluOnAha from August 31st. @creations_madhu @ShekarPhotos @syedkamran @mrnoelsean @ImNandiniRai@saironak3 @nihalkodhaty1 @ajaykathurvar pic.twitter.com/jx53GqsLqM — ahavideoin (@ahavideoIN) August 27, 2022 చదవండి: బాలీవుడ్లో నా స్నేహితులే నన్ను పక్కన పెట్టేశారు సీతారామం సినిమా అన్ని కోట్లు వసూలు చేసిందా? -
‘పంచతంత్ర కథలు’ మూవీ రివ్యూ
టైటిల్: పంచతంత్ర కథలు నటీనటులు: నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ తదితరులు నిర్మాణ సంస్థ: మధు క్రియేషన్స్ నిర్మాత: డి. మధు రచన-దర్శకత్వం: గంగనమోని శేఖర్ సంగీతం: కమ్రాన్ సినిమాటోగ్రఫి: గంగనమోని శేఖర్, విజయ్ భాస్కర్ సద్దల ఎడిటర్: శ్రీనివాస్ వరగంటి బాల్యంలో మనం పంచతంత్ర కథలు పుస్తకం చదువుకుని... వాటి నుంచి ఎంతో కొంత నీతిని నేర్చుకున్నాం. అలాంటి కథల ఇన్సిపిరేషన్ తో తెరకెక్కిన ఆంథాలజీ చిత్రం ‘పంచతంత్ర కథలు’. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త డి. మధు నిర్మించారు. నోయెల్, నందిని రాయ్, సాయి రోనక్, గీత భాస్కర్, ప్రణీత పట్నాయక్, నిహాల్ కోదర్తి, సాదియ, అజయ్ కతుర్వర్ ముఖ్య పాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది? ఆ ఐదు కథలు ఏంటి? అవి ప్రేక్షకులను ఎలాంటి నీతిని భోధించాయో రివ్యూలో చూద్దాం. ఈ చిత్రంలో మొత్తం ఐదు కథలు ఉన్నాయి. 1) అడ్డకత్తెర కథేంటంటే.. కృష్ణ(నిహాల్) అనే యువకుడు క్షవర వృత్తి చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అదే వీధిలో ఉంటున్న యువతిని సత్య(సాదియ అన్వర్) ప్రేమిస్తాడు. వేరు వేరు కులాలకు చెందిన వీరిద్దరి ప్రేమకు పెద్దల నుంచి ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి? చివరకు వీరి ప్రేమకు శుభం కార్డు ఎలా పడిందనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఇప్పటికీ సమాజంలో కుల పిచ్చి అనేది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు.కులామ మధ్య ఉండే అంతరాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో రోజూ చూస్తూనే ఉన్నాం. దాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ కథను తెరకెక్కించారు. మనం చేసే వృత్తుల వల్ల కులాలను నిర్ణయించారని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగంలేదని ఇద్దరి ప్రేమికులను ఒకటి చేసే క్రమంలో పెద్దలకు వివరించి చెప్పారు.ఇందులో నిహాల్, సాదియాల నటన అందరినీ ఆకట్టుకుంటుంది. 2) అహల్య కథేంటంటే.. రేవతి (ప్రణీత పట్నాయక్) ఓ వేశ్య. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి పడుపు వృత్తిని ఎంచుకుంటుంది. ఆమెకు పెయింటింగ్ ఆర్టిస్ట్ అయోధ్య(అజయ్ )పరిచయం అవుతాడు. అతని పరిచయంతో ఆమె తనలో మార్పు వస్తుంది. వేశ్య వృత్తిని వదిలేసి మంచి మనిషిగా బతకాలనుకుంటుంది. అలాంటి సమయంలో సమాజం నుంచి రేవతికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? చివరకు ఆమె జీవితం ఎలా ముగిసింది? అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. ఈ కథ అందరి హృదయాలను హత్తుకుంటుంది. ఓ వేశ్య మాములు మనిషిగా బతకాలని చూస్తే ఆమెను సమాజం ఎలా చూస్తుంది? అనేదానిని తెరపై చక్కగా చూపించారు. వేశ్య వృత్తికి ఎంత దూరంగా ఉండాలని చూసినా.. ఆ మార్పును సమాజం అంగీకరించదు. అందు కోసం వాళ్లు పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోందనేది ఈ కథ ద్వారా చూపించారు. వేశ్య వృత్తిని వదిలేసి వచ్చిన చిన్నచూపు చోడొద్దనేది ఈ కథ ఇచ్చే సందేశం. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. వేశ్యగా ప్రణీత పట్నాయక్ తనదైన సహజ నటనతో ఆకట్టుకుంది. 3) హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కథేంటంటే: మధ్యతరగతి కుటుంబానికి చెందిన కీర్తిక (నందిని రాయ్)కి డబ్బు అంటే పిచ్చి. బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం సుఖంగా ఉంటుందని భావించి ప్రాణంగా ప్రేమించిన ప్రశాంత్(నోయల్)ని వదిలేస్తుంది. అనుకున్నట్లే బాగా డబ్బు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత కీర్తిక జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. భర్తతో సుఖంగా జీవించిందా లేదా? లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిన కీర్తికకి ప్రశాంత్ ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనేదే మిగతా కథ. ఎలా ఉదంటే.. డబ్బుకు ఆశపడి నమ్ముకున్నోళ్లను మోసం చేయొద్దని అనేది ఈ కథ సారాంశం. ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిని కాదని, తండ్రి మాట కూడా లెక్క చేయకుండా కేవలం డబ్బున్న అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయిన అమ్మాయికి ఓ భగ్న ప్రేమికుడు చెప్పే గుణపాఠం అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ కథలో రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువవడం.. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపిస్తుంది. 4 ) నర్తనశాల ఇందులో ఓ వింత లవ్‌స్టోరీని చూపించారు. డ్యాన్స్ స్కూల్ నడిపించే ఓ డ్యాన్స్ మాస్టర్(సాయి రోనక్)కు ఫోన్ ద్వారా శిరీష అనే యువతి పరిచయం అవుతుంది. ఆమెను చూడకుండా ప్రేమలో పడిపోతాడు. కొద్ది రోజుల తర్వాతను ఆమె చూడాలని ఉందని చెప్పి బీజ్కి రమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. మరి బీచ్‌లో వీరిద్దరు కలిశారా? అసలు ఫోన్ కాల్ మాట్లాడిన వ్యక్తి ఎవరు? వీరిద్దరు కలిశాక ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డ్యాన్స్ మాస్టర్‌తో ఫోన్లో మాట్లాడింది ఎవరనే సస్పెన్స్‌ని క్లైమాక్స్ వరకు కొనసాగించి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా చేశాడు. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ అయితే అదిరిపోతుంది. వేగంగా పెరిగిపోతున్న టెక్నాలజీ కారణంగా ఎలాంటి మోసాలు జరుగుతాయి? ఫోన్ పరిచయాల ద్వారా మోససోయిన వ్యక్తులను నిత్యం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారికి ఇది నచ్చుతుంది. 5) అనగనగా వృద్ధురాలు కమలక్క (గీతా భాస్కర్)ది ఇద్దరి కుమారుల మధ్య నలిగిపోయే జీవితం. భర్త ఉన్నప్పుడు ఎంతో హుందాగా బతికిన ఆమె.. వృద్ధాప్యంలో ఇద్దరు కొడుకులు చెరో నెల అని ఆమెను పంచుకుంటారు. దాని వల్ల ఆమెకు ఎదురయ్యే సమస్యలేంటి? వృద్దాప్యంలో ఆమె జీవితం ఎలా సాగిందనేదే ఈ కథ. ఎలా ఉదంటంటే.. ఆస్తులను పంచుకున్నట్లుగా తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు నేటి పిల్లలు. చెరో నెల అంటూ వంతులు పెట్టికొని మరీ వారిని పోషిస్తున్నారు. దీని వల్ల పేరెంట్స్ పడే బాధ ఏంటి అనేది కళ్లకు కట్టినట్లు చూపించారు.సగటు తల్లి పడే బాధ ఏంటో గీతా భాస్కర్ ద్వారా తెరపై చక్కగా చూపించారు. మొత్తంగా ఈ ఐదు కథలుగా తెరకెక్కిన ఈ పంచతంత్రకథలు.. మంచి సందేశాన్ని ఇచ్చాయి. ఒక్కో కథలో ఓక్కో నీతి ఉంది. దర్శకుడు ఎంచుకున్న కథలు... వాటిని నడిపించడానికి రాసుకున్న స్క్రీన్ ప్లే బాగున్నాయి.సయ్యద్ కమ్రాన్ అందించిన సంగీతం చిత్రానికి బాగా ప్లస్ అయింది. మొదటి కథలో వచ్చే మోతెవారి పాటతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతుంది. మిగిలిన పాటలు కూడా బాగున్నాయి. చిత్ర దర్శకుడు గంగనమోని శేఖర్ యే సినిమాటోగ్రాఫర్ కావడంతో మంచి విజువల్స్ తీశారు. దీనికి మరో సినిమాటోగ్రాఫర్ విజయ్ భాస్కర్ సద్దల కూడా తన వంతు సహకారం అందించారు. శ్రీనివాస్ వరగంటి ఎడిటింగ్ పర్వాలేదు. సాధారణంగా ఏ నిర్మాత అయినా తన తొలి చిత్రాన్ని కమర్షియల్ ఫార్మెట్లో నిర్మిస్తాడు. అలాంటి చిత్రాలను నిర్మిస్తే.. సేఫ్ జోన్లోకి వెళ్లొచ్చు. కానీ నిర్మాత డి మధు మాత్రం.. తొలి చిత్రంగా మంచి సందేశాత్మకమైన అంశాలు ఉన్న ‘పంచతంత్రకథలు’ ఎంచుకోవడం అభినందనీయం. -
అష్టకర్మకు అష్టావధాని టీఆర్ పాట!
తమిళ సినీపరిశ్రమలో అష్టావధానిగా పేరుగాంచిన టి.రాజేందర్ అష్టకర్మ చిత్రం కోసం పాట రాసి స్వయంగా పాడారు. సీఎస్ పదమ్‌చంద్, సి. హరిహంద్ రాజ్, కిషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఇందులో నందినీరాయ్, శ్రద్ధ నాయికలు. విజయ్ తమిళ్ సెల్వన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఎల్వీ ముత్తు, ఎల్వీ గణేశ్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి ప్రమోషన్ పాటను టి. రాజేందర్ పాడటం సంతోషంగా ఉందని దర్శకుడు విజయ్ తమిళ్ సెల్వన్, కథానాయకుడు కిషన్ అన్నారు. -
శవం ముందు డ్యాన్స్ చేసిన నందినీ రాయ్!
పాట విన్నా, సంగీతం చెవిన పడినా కొందరికి కాళ్లు ఆగవు. ఎవరేమనుకుంటారు అనేదాన్ని పక్కనపెట్టి వాళ్లకు నచ్చిన రీతిలో దుమ్మురేపే రేంజ్లో డ్యాన్సులు చేస్తుంటారు. తెలుగు నటి నందినీ రాయ్ కూడా ఇదే కోవలోకి చెందుతుంది. 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్' వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ఈ సిరీస్ షూటింగ్ మధ్యలో చేసిన అల్లరి పనులకు సాంపుల్‌గా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో పాత చీర కట్టుకున్న నందినీ ధనుష్ 'జగమే తంత్రం' సినిమాలోని రకిట రకిట పాటకు వీర లెవల్లో స్టెప్పులేసింది. నచ్చిన పాటకు డ్యాన్స్ చేయడంలో ఆశ్చర్యమేముందీ అనుకుంటున్నారేమో.. అక్కడికే వస్తున్నాం.. ఆమె ఆషామాషీగా చిందులేయలేదు. ఓ శవం ముందు డ్యాన్స్ చేసింది! అయితే అక్కడ నిజంగా ఎవరూ చనిపోలేదు, కేవలం అది షూటింగ్లో భాగంగా వేసిన సెట్. కానీ చాలామంది నెటిజన్లకు ఈ ఐడియా నచ్చనేలేదు. దీంతో కొందరు ఆమెను సమర్థిస్తుండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. డెడ్ బాడీ ముందు డ్యాన్స్ ఏంటి?, అది కేవలం సెట్టే కావచ్చు, అయినా అక్కడ అలా డ్యాన్స్ చేయడం ఏమీ బాగోలేదు అంటూ పెదవి విరుస్తున్నారు. మరికొందరు మాత్రం డ్యాన్స్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) చదవండి: -
అతడు చెంప వాచిపోయేలా కొట్టాడు: నటి
ఎమోషనల్ సీన్లలో నటిస్తే సరిపోదు, జీవించాలి. ఆ సన్నివేశాలు సహజంగా రావడానికి ఎంతో కష్టపడుంటారు నటీనటులు. ఈ క్రమంలో పరిణీతి చోప్రా కూడా తను నటించిన 'సందీప్ ఔర్ పింకీ పరార్' సినిమా కోసం రెండు రోజులు స్నానం చేయలేదు. అనుకోకుండా అబార్షన్ జరిగినప్పుడు షాక్‌లో ఉండిపోయిన మహిళగా సహజంగా కనిపించేందుకు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. తాజాగా నటి నందినీ రాయ్ కూడా "ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్" వెబ్ సిరీస్ కోసం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామంటోంది. "ఈ సినిమాలో నేను, నా సహ నటుడు వికాస్ ఒకరినొకరం కొట్టుకోవాలి. ఇది చాలా సహజంగా రావాలన్నది డైరెక్టర్ ఆదేశం. మొదట వికాస్ నన్ను పైపైన కొట్టినట్లు చేశాడు కానీ అది అంత బాగా రాలేదు. దీంతో తామిద్దం ఓ అండర్‌స్టాండింగ్‌కు వచ్చి నిజంగానే చెంపలు వాచిపోయేలా కొట్టుకుందామని ఫిక్సయ్యాం. అప్పుడుగానీ ప్రేక్షకులు మా కన్నీళ్లు నిజమని ఫీలవరు. మేం ప్రతాపం చూపిస్తూ కొట్టుకోవడంతో చెంపలు వాచిపోయాయి. దీంతో దర్శకుడు ఆ వాపు తగ్గేవరకు వేచి చూసి ఆ తర్వాతే మరో సీన్ షూట్ చేశారు' అని నందినీ చెప్పుకొచ్చింది. కాగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న "ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్" సిరీస్‌లో నందినీ పల్లెటూరి పడుచు పిల్లగా అలరిస్తోంది. నటన మీద ఉన్న ఆసక్తితో ఊరి నుంచి పట్నంకు వెళ్లిన అమ్మాయిలా ఆమె నటన ఆకట్టుకుంటోంది. శుక్రవారం రిలీజైన ఈ సిరీస్ ఆహాలో ప్రసారమవుతోంది. చదవండి: ఆ సీన్ కోసం రెండు రోజులు స్నానం చేయలేదు : హీరోయిన్ -
డ్యాన్స్ ఇరగదీసిన శ్రీముఖి, షాకిస్తానంటోన్న నందినీ
♦ షాకవ్వడానికి రెడీగా ఉండండని హెచ్చరిస్తోన్న నందినీ రాయ్ ♦ అద్దం ముందు లాస్య ఫోజులు ♦ మీరు ఈగో చూపిస్తే నేను యాటిట్యూడ్ చూపిస్తానంటోన్న అరియానా గ్లోరీ ♦ డ్యాన్స్‌తో అదరగొట్టిన శ్రీముఖి ♦ క్యూట్‌గా నవ్వుతోన్న నజ్రియా నజీమ్ ♦ పూల మధ్య ముఖం దాచుకుంటోన్న రష్మిక మందన్నా ♦ రెడ్ గౌన్‌లో జిగేలుముంటున్న ఈషారెబ్బా ♦ చందమామ ఆకాశాన్ని తాకేవేళ.. తోటచుక్కలా దివి మెరిసేనేలా అంటోన్న దివి వాద్యా ♦ ఇది నా యాటిట్యూడ్ కాదు.. స్టైల అంటోన్న అఖిల్ సార్థక్ View this post on Instagram A post shared by Nandini Rai (@nandini.rai) View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by Mehaboob Shaik (@mehaboobdilse) View this post on Instagram A post shared by 𝐀𝐊𝐇𝐈𝐋𝐒𝐀𝐑𝐓𝐇𝐀𝐊 (@akhilsarthak_official) View this post on Instagram A post shared by Adaa (@adaakhann) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Abijeet (@abijeet11) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) -
శ్రీవారిని దర్శించుకున్న నందినీ రాయ్
సాక్షి, తిరుమల: సినీ నటులు నందినీ రాయ్, గజల్ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదాలు అందుకున్నారు. ఆలయ అధికారులు వీరిని పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తర్వాత నందినీ రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన ప్రతి భక్తుడికి శానిటైజేషన్ అందేలా టీటీడీ చేసిన ఏర్పాట్లను కొనియోడారు. స్వామి వారిని చాలా రోజుల తర్వాత దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార ప్రవేశం చేశానని, తర్వాత స్వామి వారిని దర్శించుకుని వెళ్లాక నాకు మొత్తం ఎనిమిది సినిమా ఆఫర్లు రావడంతో దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకునేందుకు మళ్లీ వచ్చానన్నారు. ఇక తిరుమలలో శ్రీవారి వైభవాన్ని చాటి చెప్తూ 40 నిమిషాల నిడివి గల పాటను రూపొందిస్తున్నట్లు గజల్ శ్రీనివాస్ తెలిపారు. (చదవండి: కానిస్టేబుల్ ఆర్షద్‌కు టీటీడీ చైర్మన్ అభినందనలు) -
ఈ ఎన్నికల్లో వారికే ఓటు వేద్దాం..
సాక్షి, హిమాయత్‌నగర్: సిటీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. మహిళల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఒకరోజు నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బంజారాహిల్స్ వస్తుండగా.. రోడ్డు పక్కన ఒక్క టాయ్‌లెట్ కూడా కనిపించలేదు. దీంతో నేను ఎంతో సఫరయ్యాను. నాలాగే చాలామంది మహిళలు టాయ్‌లెట్స్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు. బయటికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. మనకు ఒక అవకాశం వచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మహిళలను ప్రగతిపథంలో నడిపించే వారిని గుర్తించి, షీ టాయ్‌లెట్స్‌ని ఏర్పాటు చేసే వారికి ఓటు వేద్దాం. అదే విధంగా చెత్త గార్బేజ్ విషయంలో కూడా మార్పులు రావాలి. దీంతో సిటీని మరింత ఆకర్షణీయంగా తీర్చేదిద్దే వారిని మన ఓటు ద్వారా ఎన్నుకుందాం. – నందిని రాయ్, సినీనటి చదవండి : బెస్ట్ సిటీగా మార్చుకుందాం: ఈషా రెబ్బ ఓటర్లలో రావాలి చైతన్యం.. ఓటుహక్కు అన్నది బ్రహ్మాస్త్రం. ఓటు ద్వారా మన ప్రశ్నలకు సమాధానం దొరికినా, దొరక్కపోయినా లీడర్స్‌కి మనం ఇచ్చే విలువ ఏంటి అంటే ఓటు వేయడం. ఓటు అనేది ఎప్పుడూ ఎంతో ముఖ్యమైనది. హైదరాబాద్‌లో ఉన్న వాతావరణానికి ఇంకొంచెం అభివృద్ధి జరిగితే బాగుంటుంది. మణికొండలాంటి ప్రాంతాల్లో మాటిమాటికీ బోర్లు వేయడం వల్ల కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న గ్రౌండ్‌వాటర్‌ని ఎక్కువగా తోడేస్తున్నాం.. అంతేకాదు.. భారీ కన్స్ట్రక్షన్స్ చేపట్టడం, ఎక్కడ చూసినా సిమెంటు రోడ్లు వేసేస్తున్నాం.. హైదరాబాద్‌లోని పర్యావరణాన్ని మనం ఇంకొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీనిపై ముఖ్యంగా ప్రజల్లో అవగాహన ఉండాలి.. చైతన్యం రావాలి. – అడివి శేష్ -
అలాంటి నిర్మాతలు అవసరం
‘‘శివరంజని’ టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ మూవీ మంచి విజయం సాధించాలి’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. రష్మి గౌతమ్, నందు జంటగా నందినీరాయ్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శివరంజని’. నాగ ప్రభాకరన్ దర్శకత్వంలో యూ అండ్ ఐ ఎంటరై్టన్మెంట్స్ బ్యానర్లో ఎ. పద్మనాభరెడ్డి, నల్లా అయ్యన్ననాయుడు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసిన వినాయక్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన పద్మనాభరెడ్డి చిన్న చిత్రాలకు అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. వీరికి మంచి విజయాలు వస్తే ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు ఇంకా ఎక్కువగా షైన్ అవుతాయి’’ అన్నారు. నాగ ప్రభాకరన్ మాట్లాడుతూ–‘‘హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి. ఊహించని కథ, కథనాలు ఆశ్చర్యపరుస్తాయి. ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. పద్మనాభరెడ్డి మాట్లాడుతూ– ‘‘శివరంజని’ తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నాను. మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయి’’ అని చెప్పారు. -
నవ్వుకునే చిత్రాలను ఆదరించాలి
‘‘సిల్లీ ఫెలోస్’ చిత్రంలో నాలుగైదు రోజుల పాత్ర చేశాను. భీమనేని శ్రీనివాస్‌తో 26 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. తను హార్డ్ వర్కర్ కాబట్టే సినిమాలన్నీ సూపర్ హిట్స్ అవుతున్నాయి. నరేశ్, సునీల్.. ఎవరో ఒకరుంటేనే కామెడీ పరంగా తట్టుకోవడం కష్టం. అలాంటిది ఇద్దరూ కలిసి నటించారంటే కామెడీ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. హాయిగా నవ్వుకునే సినిమాలను ఆదరించాలి’’ అని నటుడు డా. బ్రహ్మానందం అన్నారు. ‘అల్లరి’ నరేశ్, సునీల్, చిత్రాశుక్లా, పూర్ణ, నందినీరాయ్ ముఖ్య పాత్రల్లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సిల్లీ ఫెలోస్’. కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ‘అల్లరి’ నరేశ్ మాట్లాడుతూ– ‘‘16 ఏళ్ల నా సినీ ప్రయాణంలో ‘సుడిగాడు’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన భీమనేనిగారితో మళ్లీ సినిమా చేయడం ఆనందంగా ఉంది. సునీల్‌గారు, నేను ఈగోస్ లేకుండా నటించాం. ప్రేక్షకులు ‘సుడిగాడు’ రేంజ్ హిట్ అందిస్తారని నమ్మకంగా ఉన్నాం’’ అన్నారు. ‘‘నరేష్‌గారు, నేను అన్నదమ్ముల్లా కలిసిపోయాం. ‘తొట్టిగ్యాంగ్’ సినిమాకు ఎంత ఎంజాయ్ చేశానో ‘సిల్లీ ఫెలోస్’కి కూడా అంతే ఎంజాయ్ చేశా. ఇందులో ఫుల్ లెంగ్త్ కామెడీ పాత్ర చేశా’’ అన్నారు సునీల్. ‘‘సిల్లీ ఫెలోస్’ సినిమా వెనుక చాలా కష్టం ఉంది. మా కష్టాన్ని ఈరోజు తెరపై చూస్తారు. ‘సుడిగాడు’ తర్వాత నేను ఒక సినిమా చేస్తే.. నరేష్‌గారు 12 చిత్రాలు చేశారు’’ అన్నారు భీమనేని శ్రీనివాస్. ‘‘భీమనేని మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. పెద్ద హీరోలందరూ తమ సినిమాల్ని కనీసం ఒక షెడ్యూల్ అయినా ఆంధ్రప్రదేశ్‌లో షూటింగ్ చేయాలని కోరుకుంటున్నా. ఇందుకు దర్శక–నిర్మాతలను, హీరోలను రిక్వెస్ట్ చేస్తున్నా’’ అన్నారు ఆంధ్రప్రదేశ్ ఎఫ్డీసీ చైర్మన్ అంబికాకృష్ణ. ఈ వేడుకలో డైరెక్టర్ కె.నాగేశ్వర్ రెడ్డి, నటి నందినీరాయ్ పాల్గొన్నారు. -
బిగ్‌బాస్ : అనుకున్నదే నిజమైంది.. నందిని ఔట్!
అనూహ్య పరిణామాలతో బిగ్‌బాస్ అలా దూసుకెళ్తోంది. 50 రోజులు దాటిన ఈ కార్యక్రమం జనాల్లోకి బాగానే ఎక్కేసింది. సోషల్ మీడియాలో కంటెస్టెంట్ల ఫ్యాన్స్ రచ్చ మరీ పెరిగిపోతోంది. చివరకు బిగ్‌బాస్ షో మొత్తం వన్ సైడ్గేమ్లా వచ్చేట్టు కనిపిస్తోంది. ఇంటి సభ్యులందరిలోకెల్లా డిఫరెంట్ యాటిట్యూడ్‌తో ఉండే కౌశల్‌కు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభిస్తోంది. కౌశల్‌కు సపోర్ట్‌గా లెక్కలేనన్ని పేజీలు క్రియేట్ అయ్యాయి. వీరంతా కలిసి గేమ్‌ను తమ చేతుల్లోకి తెచ్చుకున్నారు. వీరు ఆడిందే ఆటా పాడిందే పాట అనే స్థాయికి వచ్చేశారు. ఇదివరకే ఈ విషయం ఎన్నో సార్లు బహిర్గతం అయింది. కిరీటీ, భాను, తేజస్వీలను ఎలిమినేట్ అయ్యేలా చేసింది వీరే. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి హడావిడే కనిపిస్తోంది. గత రెండు వారాల ఎపిసోడ్స్‌లో చాలానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బాబు గోగినేని, గీతా మాధురి, కౌశల్, నందిని, దీప్తి వీరందరి మధ్య జరిగిన గొడవలతో ప్రేక్షకులకు కావలిసినంత మజా దొరికేసింది. ఈ గొడవలపై గత వారం నాని వీరికి క్లాస్ కూడా పీకేశాడు. ఇదంతా గతం. కానీ శనివారం నాటి ఎపిసోడ్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. హౌజ్‌మేట్స్‌లో ప్రత్యేకంగా ఉండే కౌశల్.. నిన్న నాని చేతికి అడ్డంగా దొరికిపోయాడు. టాస్క్‌లో భాగంగా కౌశల్, నందిని మధ్య జరిగిన సంభాషణను మళ్లీ ప్లే చేశాడు. దీంతో కౌశల్ తెల్లబోయాడు. అప్పటి వరకు తనకు తాను సమర్దించుకుంటూ చెప్పిన మాటలకు.. వీడియోలో చూపించిన దానికి భిన్నంగా ఉండటంతో కౌశల్ మాటమార్చేశాడు. ఇలా కౌశల్ అడ్డంగా దొరికేసరికి.. నాని కాస్త మందలించాడు. తనకు బయట చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారని, చాలా సపోర్ట్ చేస్తున్నారని, అలా గేమ్ ప్లే చేసి.. ఫ్లిప్ అవుతూ ఉంటే.. బయట ఫ్యాన్స్ కూడా ఫ్లిఫ్ అవుతారంటూ కౌశల్‌ను హెచ్చరించాడు. కౌశల్ నిజాలే మాట్లాడుతాడని, ధైర్యంగా ఏదైనా చెప్పగలడని, తన వ్యక్తిత్వానికి సోషల్ మీడియాలో భారీగానే ఫాలోయింగ్ పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే షో దశాదిశను నిర్ణయించేది కౌశల్ ఫాలోవర్సే అనేంత వరకు వచ్చింది. ఎలిమినేట్ అయిన ఆరుగురు కంటెస్టెంట్లను తిరిగి ఇంటిలోకి పంపించే అవకాశం వస్తే.. యాక్టివ్‌గా ఉండే తేజస్వీ, ఎందరినో ఆకట్టుకున్న భాను శ్రీలు కాకుండా రెండో వారమే ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడును ఇంటిలోకి తిరిగి పంపారు. ఎందుకంటే భాను, తేజస్వీలు తరుచూ గొడవ పడుతుంటారు. కౌశల్ అంటేనే గిట్టదన్నట్టుగా వ్యవహరించేవారు. దీంతో కౌశల్ ఫాలోవర్స్.. ఆయనతో సన్నిహితంగా ఉండే నూతన్ నాయుడిని ఇంట్లోకి పంపించారు. ఎలాంటి ఫాలోయింగ్ లేని నూతన్ ఎలా రీఎంట్రీ ఇచ్చాడని ఇంటి సభ్యులు కూడా మాట్లాడుకోవడం మనం చూశాం. కానీ వారికి తెలీదు కదా.. బయట ఒక ఆర్మీ ఉందని. సో.. ఇక ఆదివారం ఉదయం నుంచే నందిని ఎలిమినేట్ కాబోతోంది అని ప్రచారం సాగింది. ఈ మధ్య నందిని డబుల్ గేమ్‌ప్లే చేస్తోందని, కావాలనే కౌశల్‌ను టార్గెట్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఆమెపై నెగెటివిటీ ఎక్కువైంది. తనీష్‌తో క్లోజ్ అవడం.. వారిద్దరు కలిసి చేసే ఎక్సాట్రాలు.. నాని కూడా ఈ విషయంపై తరచూ అడగడం చూస్తూనే ఉన్నాం. సోషల్ మీడియాలో నందినిపై పెరుగుతోన్న నెగెటివిటీ కూడా ఎలిమినేషన్‌కు కారణమైంది. ఎలిమినేట్ అయిన నందినికి.. హౌజ్‌లోని ఓ ఇద్దరితో మాట్లాడడానికి నాని అవకాశమిచ్చాడు. గీతా మాధురి, దీప్తిలతో తను మాట్లాడిన అనంతరం.. బిగ్ బాంబ్ వేయాల్సిన సమయం వచ్చిందంటూ.. గార్డెన్ ఏరియాలో రాబోయే వారంపాటు ఓ మసాజ్ పార్లర్ ఉంటుందని.. హౌజ్ మేట్స్ అందరికీ హెడ్ మసాజ్ చేస్తూ.. ఇంట్లో ఉండే సమస్యల గురించి మాట్లాడలని ఇదే ఈ వారం బిగ్‌బాంబ్ అంటూ నాని పేల్చేశాడు. ఇక ఈ బిగ్‌బాంబ్‌ను రోల్ రైడాపై నందిని వేసింది. సోమవారం జరిగే షోలో.. ఎలిమినేషన్ ప్రక్రియ షురూ అయింది. మరి తొమ్మిదో వారం బిగ్‌బాస్ కార్యక్రమంలో ఏం జరుగనుందో.. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో.. చూద్దాం.. ఏదైనా జరుగొచ్చు! ఎందుకంటే...ఇది బిగ్‌బాస్. -
బిగ్‌బాస్ : మరోసారి కౌశల్ టార్గెట్
ఆరో వారం తేజస్వీ ఎలిమినేట్ అనంతరం బిగ్‌బాస్ హౌస్‌లో ఆసక్తి పరిమాణాలు చోటు చేసుకున్నాయి. ఇక ఈ వారం నామినేషన్లో భాగంగా ఒక ఇంటి సభ్యుడు తనకు ఇష్టంలేని మిగతా సభ్యుడిని ఎంచుకుని అందుకు గల కారణాలు తెలిపి అనంతరం వారి నెత్తిపై గుడ్డు పగలగొట్టాలని ఆదేశించాడు. తనీష్ కెప్టెన్ అయినందున అతని పేరును ఎవరూ చెప్పకూడదనీ బిగ్‌బాస్ ఆదేశించాడు. ఇక ఎవరి నెత్తిపై అధిక గుడ్లు పగులుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ కౌశలే టార్గెట్ అయ్యాడు. అమిత్, రోల్ రైడా, తనీష్, నందిని, బాబు గోగినేని, గణేష్‌లు కౌశల్‌పై గుడ్లు పగలగొట్టారు. కౌశల్ వంతు వచ్చినప్పుడు నందిని, బాబు గోగినేనిపై గుడ్లు పగలగొట్టాడు. సోమవారం షోలో నందిని వర్సెస్ కౌశల్ హైలైట్‌గా నిలిచింది. తనకు అనవసరంగా అడ్వైజ్ చేస్తున్నాడని, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసానని ఎప్పటికీ గుర్తు చేస్తున్నాడంటూ కౌశల్ గురించి ఇంటి సభ్యులతో చెప్పుకుంటూ వచ్చింది. నామినేషన్ టైమ్‌లో కూడా నందిని ఇదే విషయం ప్రస్తావించి కౌశల్‌పై గుడ్డు పగలగొట్టింది. కాగా.. నందిని ఫ్రెండ్షిప్ విషయంలో మోసం చేసిందని, బాబు గోగినేని రాజమౌళి విషయంలో తప్పుగా మాట్లాడాడని, అందుకే నామినేట్ చేస్తున్నాని వారిద్దరిపై గుడ్లు పగలగొట్టాడు. అయితే దీనిపై బాబు గోగినేని ఇంటి సభ్యులతో చర్చిస్తూ.. అదంతా నటనా అని, రాజమౌళి అభిమానులు తనకు సపోర్ట్ చేయాలని అలా చేశాడని చెప్పుకొచ్చాడు. అనూహ్య ఎంట్రీ.. అర్దరాత్రి బిగ్‌బాస్ హౌస్‌లోకి అనూహ్యంగా ఓ కొత్త వ్యక్తి ప్రవేశించారు. ఆమె ఎవరో కాదు స్వామిరారా ఫేం పూజా రామచంద్రన్. అయితే ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ లేక యాంకర్ ప్రదీప్‌లా గెస్ట్ అన్న విషయం మంగళవారం ఎపిసోడ్లో రివీల్ కానుంది. ఈవారం ఎలిమినేషన్ లేదు.. అయితే ఈ వారం హౌస్ మేట్స్ ఎలిమినేషన్ లేదని ఎపిసోడ్ చివర్లో బిగ్‌బాస్ ప్రకటించాడు. ‘ఇన్ని వారాలు మీ పేవరేట్ హౌస్ మేట్స్‌ను సేవ్ చేయడానికి ఓట్లేశారు. కానీ ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లను మళ్లీ హౌస్‌లోకి పంపించడానికి ఓట్లేయబోతున్నారు.. సంజనా, నూతన నాయుడు, కిరీటి, శ్యామల, భానుశ్రీ, తేజస్వీ ఇందులో ఎవరినైనా మీ ఓట్లతో బిగ్‌బాస్ హౌస్‌లోకి పంపించవచ్చు. ఛాయిస్ ఈజ్ యువర్స్! ఏదైనా జరగొచ్చు’ అని నాని ప్రేక్షకులకు మరో అవకాశం ఇచ్చాడు. ఎలిమినేట్ అయిన వారి కోసం ఓటింగ్ లైన్‌ను ప్రారంభించినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే తేజస్వీని బిగ్‌బాస్ హౌస్‌లోకి తీసుకునేందుకే మళ్లీ ఇలా చేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు తేజస్వీ సోషల్ మీడియా ద్వారా ఆన్‌లైన్‌లోకి వచ్చి తనకు సపోర్ట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై వస్తున్న ట్రోలింగ్‌కు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇక ఈ సందర్భంలో కొందరు తేజస్వీపై మండిపడగా, మరికొందరు సపోర్ట్‌గా నిలిచారు. పరిస్థితి కౌశల్ ఆర్మీ వర్సెస్ తేజస్వీ ఫ్యాన్స్‌గా మారిపోయింది. మరి ఇదంతా దాటుకుని తేజస్వీ ఇంట్లోకి అడుగుపెడుతుందా? లేక మరెవరైనా అడుగుపెడతారా? అనేది మాత్రం వేచి చూడాల్సిందే.. అసలే బిగ్‌బాస్ ఏదైనా జరగొచ్చు. బిగ్‌బాస్ : తేజస్వీ సంచలన వ్యాఖ్యలు! -
బిగ్‌బాస్ : కన్నీటి పర్యంతమైన నందిని..
ఆరో వారం బిగ్‌బాస్ షో సరదాగా సాగిపోతోంది. బిగ్‌బాస్ ఆదేశం మేరకు ఇంటి సభ్యులంతా కలిసి తెరకెక్కించిన సినిమాకు ప్రశంసలు దక్కాయి. సినిమాను అద్భుతంగా తెరకెక్కించినందుకు బిగ్‌బాస్ నిర్మాత బాబు గోగినేని, దర్శకుడు అమిత్‌కు కొంత డబ్బును ఇవ్వగా... దానిని సినిమా కోసం పనిచేసిన మిగతా బృందానికి నటీనటులు, సాంకేతిక బృందానికి తగిన పారితోషకం ఇవ్వాల్సిందిగా వారిని ఆదేశించారు. సభ్యులందరిలో ఎక్కువ డబ్బు ఎవరి దగ్గర ఉంటుందో వారే విజేతలని బిగ్‌బాస్ చెప్పగా.. ఎక్కువ మొత్తంలో డబ్బు ఉన్న బాబు గోగినేని, తనీష్, అమిత్‌లను ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హులుగా ప్రకటించారు. కెప్టెన్‌గా తనీష్.. టమాటలను తొక్కుతూ.. వాటి నుంచి జ్యూస్ తీయాలని టాస్క్‌ను ఇవ్వగా.. ఎవరు ఎక్కువ రసం తీస్తే వారే విజేతలని బిగ్‌బాస్ తెలిపాడు. ఈ టాస్క్‌లో ఎవరైనా ఒక ఇంటి సభ్యుడి సహాయం తీసుకోవచ్చు అని చెప్పగా...అమిత్.. రోల్ రైడా, బాబు గోగినేని.. తేజస్వీ, తనీష్.. సామ్రాట్ల సహాయాన్ని తీసుకొన్నారు. ఈ టాస్క్‌లో తనీష్ చురుగ్గా పాల్గొనగా.. ఎక్కువ రసాన్ని తీసి కెప్టెన్‌గా బాధ్యతను తీసుకున్నారు. బిగ్‌బాస్ ఏర్పాటుచేసిన క్విజ్‌పోటీలు.. ఈ క్విజ్‌పోటీల్లో.. ఇచ్చిన స్టేట్మేంట్లు ఇంటిసభ్యుల్లో ఎవరికి సరిపోతుందో.. సరైన సమాధానం చెబితే వారికిష్టమైన ఫుడ్‌ను బిగ్‌బాస్ అందిస్తాడు. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు.. అన్న దానికి సమాధానంగా ఇంటి సభ్యులు నందిని పేరును సజెస్ట్ చేయగా.. సరైన సమాధానమంటూ నందినికీ ఇష్టమైన ఫుడ్‌ను ఇచ్చాడు. ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుసు.. కానీ బిగ్‌బాస్ హౌజ్ గురించి తెలియదు అనే ప్రశ్నకు బాబు గోగినేని పేరును చెప్పారు. కొండంత మనిషి.. కానీ మనసు వెన్న అనే దానికి అమిత్.. అసలు దాన్ని వదిలేసి కొసరును పట్టుకుని వేలాడుతుంది అనే దానికి గీతా మాధురి, ప్రేమ పూజారి అనే దానికి తనీష్, కొంచెం మంచి కొంచెం చెడుగా కౌశల్, ఎలిమినేషన్ అంటే భయపడే వ్యక్తిగా దీప్తి, లడ్డుబాబుగా గణేష్, అలరిస్తూ..ఆనందించే వాడుగా రోల్ రైడా, చిన్నదానిలా వచ్చి ఘాటు మిర్చిగా మారింది అనే దానికి దీప్తి సునయన పేర్లను కరెక్ట్‌గా చెప్పిన ఇంటి సభ్యులు సామ్రాట్, తేజస్వీ విషయాల్లో సరైన సమాధానాలు చెప్పలేకపోయారు. కన్నీరు పెట్టిన నందిని.. మేడిపండు చూడ మేలిమై ఉండు.. పొట్టవిప్పి చూడ పురుగులుండు అనే స్టేట్మేంట్ తనకు ఇచ్చినందుకు నందిని రాయ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటి సభ్యులందరూ ఓదార్చసాగారు. ఇంటి సభ్యులకు స్టేట్మెంట్స్ను ఊరికే ఇవ్వలేదని.. ఇంట్లో సభ్యులు ప్రవర్తించే తీరును గమనించే ఇచ్చాడని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు. -
బిగ్‌బాస్-2.. ఎవరీ నందిని?
బిగ్‌బాస్-2 హౌజ్‌లోకి కొత్త ఎంట్రీ. ఎలిమినేట్ అయిన సంజన స్థానంలో నందిని రాయ్ హౌజ్‌లోకి రానున్నారు. ఇప్పటికే ఆమె ఎంట్రీకి సంబంధించిన ప్రోమోను నిర్వాహకులు వదిలారు. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ఏవీని రిలీజ్ చేశారు. 27 ఏళ్ల నందిని రాయ్. పుట్టింది.. పెరిగింది... హైదరాబాద్‌లోనే. ఉన్నత చదువులు విదేశాల్లో అభ్యసించారు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైంలోనే అంతర్జాతీయ మోడలింగ్‌గా పేరు సంపాదించుకున్నారు. 2009లో మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకున్నారు. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా. తెలుగుతోపాటు ఓ తమిళ్, కన్నడ, మళయాళం చిత్రంలో ఆమె నటించారు. హిందీలో ఫ్యామిలీ ప్యాక్ చిత్రంతో సినిమాల్లోకి అడుగుపెట్టారు. తెలుగులో హర్మోన్స్, మాయా, మోసగాళ్లకు మోసగాడు తదితర చిత్రాల్లో నటించినట్లు చెబుతున్నారు. దివంగత నటి సౌందర్య ఇన్సిపిరేషన్‌తో సినిమాల్లోకి వచ్చారంట. అమ్మాయిలంటే ధృడ సంకల్పంతో ఉండాలని, బిగ్‌బాస్ సీజన్-2లో తాను గెలిచి తీరతానన్న ధీమాతో ఆమె ఉన్నారు. మరి హౌజ్‌లో పరిస్థితులను ఆమె ఏమేర తట్టుకుంటారో చూడాలి. -
అనుభూతినిచ్చే మాయ
మనుషుల్లో ఉండే అతీంద్రియ దృష్టి నేపథ్యంలో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ ‘మాయ’. నీలకంఠ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హర్షవర్దన్ రాణే, అవంతిక, సుష్మారాజ్, నందినిరాయ్ ప్రధాన పాత్రధారులు. ఎంవీకే రెడ్డి, మధుర శ్రీధర్ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 1న విడుదల కానుంది. వైవిధ్యమైన థ్రిల్లర్ ఇదని, ఈ సినిమా కథ, కథనం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయని నీలకంఠ అన్నారు. నీలకంఠ దర్శకత్వంలో ఇంత మంచి సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నానని, సాంకేతికంగా తెలుగు సినిమాను మరో మెట్టుపై నిలబెట్టే సినిమా ఇదని మధుర శ్రీధర్ చెప్పారు. నాగబాబు, ఝాన్సీ, అనితా చౌదరి, వేణు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: బాల్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, కూర్పు: నవీన్ నూలి, నిర్మాణం: షిర్డి సాయి కంబైన్స్.