తమిళ సినీపరిశ్రమలో అష్టావధానిగా పేరుగాంచిన టి.రాజేందర్ అష్టకర్మ చిత్రం కోసం పాట రాసి స్వయంగా పాడారు. సీఎస్ పదమ్‌చంద్, సి. హరిహంద్ రాజ్, కిషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిషన్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ఇందులో నందినీరాయ్, శ్రద్ధ నాయికలు.
విజయ్ తమిళ్ సెల్వన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఎల్వీ ముత్తు, ఎల్వీ గణేశ్ సంగీతాన్ని అందించారు. ఈ నెల 11వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించారు. దీనికి ప్రమోషన్ పాటను టి. రాజేందర్ పాడటం సంతోషంగా ఉందని దర్శకుడు విజయ్ తమిళ్ సెల్వన్, కథానాయకుడు కిషన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment