అటు పోట్లు ఎన్ని ఎదురైనా దృఢ సంకల్పం ఉంటే విజయం సాధించవచ్చు అని నటి నందిని రాయ్ నిరూపించింది. వరుస ఫ్లాప్‌లతో ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్య గురించీ ఆలోచించింది. మళ్లీ తనకు తానే ధైర్యం చెప్పుకుని అపజయాలను చాలెంజ్‌గా తీసుకుంది. ప్రస్తుతం వరుస విజయాలు చవిచూస్తోంది. ఆ విజేత పరిచయం..
► కెరియర్ మొదట్లో నా సినిమాలు అంతగా ఆడలేదు. దాంతో చాలా కుంగిపోయా. ఇంటి టెర్రస్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకోవాలనుకున్నా. తర్వాత ఆ ఆలోచన తప్పని గ్రహించా. మిత్రులతో రోజూ మాట్లాడుతూ ధైర్యం తెచ్చుకున్నా. సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకున్నా. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డా. జయాపజయాలకు పొంగిపోవడం.. కుంగిపోవడం కరెక్ట్ కాదని తెలుసుకున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ముందుకు సాగడమే జీవితమని అర్థం చేసుకున్నా
► పుట్టింది, పెరిగింది హైదరాబాద్‌లోనే. చిన్న వయసులోనే మోడల్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ టైమ్‌లోనే అంతర్జాతీయ మోడల్‌గా పేరు సంపాదించుకుంది. 2009లో అందాల పోటీల్లో పాల్గొని మిస్ హైదరాబాద్ కిరీటం దక్కించుకుంది. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్ విన్నర్ కూడా.
► ‘040’ అనే చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె ఆ తర్వాత ‘మాయ’, ‘ఖుషీ ఖుషీగా’, ‘మోసగాళ్లకు మోసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘శివరంజని’ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మళయాళ చిత్రాల్లోనూ నటించింది. అటు హిందీలో ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే సినిమాలో కనిపించింది.
► బిగ్ బాస్ 2 సీజన్‌లో పాల్గొని ఆడియన్స్‌కు మరింత దగ్గరైంది. ఇటీవల సాయికుమార్, సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘గాలివాన’ వెబ్ సిరీస్‌లో కూడా నటించి విమర్శల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో స్ట్రీమ్ అవుతున్న ‘పంచతంత్ర కథలు’, ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సిరీస్‌లతో వీక్షకులను అలరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment