Suicide
-
కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, కాకినాడ: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.డాక్టర్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, 21 నుంచి పరీక్షలు ఉన్నాయని.. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేదానిపై తెలియలేదన్నారు. ఎగ్జామ్స్ ముందు కౌన్సిలింగ్ ఉంటుంది. చాలా ఈజీ సబ్జెక్ట్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియాలి. ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చాయి.. స్పోర్ట్స్ కూడా బాగా ఆడతాడని ఉమామహేశ్వరరావు అన్నారు.రైలు కిందపడి..శ్రీకాకుళం జిల్లా: కాశీబుగ్గ ఎల్సీ గేటు దగ్గర గూడ్స్ రైలు క్రింద పడి గుర్తు తెలియని యువకుడు (30) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి వివరాల కోసం రైల్వే పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పలాస రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
తల్లి సెల్‌ఫోన్ ఇవ్వలేదని కూతురు..
కౌటాల(సిర్పూర్): తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వలేదని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కుమురంభీం జిల్లా కౌటాల మండల కేంద్రంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై మధుకర్ కథనం ప్రకా రం.. కౌటాలలోని ప్రగతి కాల నీకి చెందిన బొమ్మకంటి సదానందం, రమాదేవి దంపతులకు కుమారుడు, కుమార్తె స్ఫూర్తి (16) ఉన్నారు. స్ఫూర్తి స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువు తోంది. శనివారం మధ్యాహ్నం కాగజ్‌నగర్ నవోదయలో నిర్వహించిన ఇంటర్ ప్రవేశ పరీక్ష రాసింది. పరీక్ష అనంతరం తండ్రి సదానందం స్ఫూర్తిని ఇంటివద్ద దించి బయ టకు వెళ్లాడు. కాగా, పదో తరగతి స్టడీ మెటీరియల్‌ను చూసుకోవడానికి సెల్‌ఫోన్ ఇవ్వాలని స్ఫూర్తి తన తల్లి రమాదేవిని కోరింది. అయితే సెల్‌ఫోన్ ఇస్తే గేమ్స్ ఆడి సమయం వృథా చేస్తావని, మెటీరియల్‌ను జిరాక్స్ తీసుకు వస్తానని ఆమె తెలిపింది. కాసేపటి తర్వాత తల్లి జిరాక్స్ సెంటర్‌కు వెళ్లింది. ఈ క్రమంలో తల్లి తనకు సెల్‌ఫోన్ ఇవ్వ లేదని మనస్తాపం చెందిన స్ఫూర్తి.. ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జిరాక్స్ పత్రాలతో ఇంటికి వచ్చిన తల్లికి కుమార్తె ఉరి వేసుకుని ఉండడంతో భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వెంటనే ఇంటికి వచ్చిన అతను కుమార్తెను కిందకు దింపి కౌటాల పీహెచ్‌సీకి తరలించాడు. వైద్యులు పరీక్షించి సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడికి బాలికను తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సిర్పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో స్ఫూర్తి మృతదేహాన్ని ఎస్సై మధుకర్ పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
Hyderabad: నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
బౌద్ధనగర్,హైదరాబాద్: ప్రేమించిన వ్యక్తి తరచూ అనుమానిస్తూ..వేధింపులకు పాల్పడడంతో భరించలేక ఓ నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వారాసిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం..బౌద్ధనగర్‌లోని అంబర్‌నగర్‌కు చెందిన నాగయ్య కుమార్తె ప్రవళిక (23) కోఠి ఉమెన్స్ కాలేజీలో బీఎస్సీ ఫైనలియర్ చదువుతుంది. కాలేజీ అయ్యాక సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు వారాసిగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తుంది. కాగా నాలుగేళ్లుగా ప్రవళిక..సృజన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా సృజన్ ఆమెను వేధిస్తూ వేధింపులకు దిగాడు. మరో యువకుడితో మాట్లాడుతున్నావని అనుమానించేవాడు. ఇదే విషయంపై పలుమార్లు గొడవలు జరిగాయి. ఈ నెల 6వ తేదీన సాయంత్రం ఉస్మానియా యూనివర్సిటీలోని ఓ బేకరీలో ప్రవళిక, సృజన్‌ల మధ్య వాగి్వవాదం జరిగింది. దీంతో మరో స్నేహితుడు మధుకర్ వచ్చి ఇద్దరిని సముదాయించాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటికి వచ్చిన ప్రవళిక తన తండ్రి నాగయ్యకు ఫోన్ చేయగా, తాను ఫంక్షన్‌కు వెళ్తున్నానని ఆలస్యంగా వస్తానని చెప్పాడు. అర్థరాత్రి ఒంటి గంటకు ఇంటికి వచ్చిన నాగయ్యకు బెడ్రూమ్లో ప్రవళిక దుప్పటితో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. వెంటనే స్థానికుల సహాయంతో ప్రవళికను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ప్రవళిక స్నేహితుడు మధుకర్..సృజన్‌తో ప్రేమ, గొడవల గురించి నాగయ్యకు తెల్పగా..ఆయన ఫిర్యాదు మేరకు సృజన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాఠశాల భవనం పైనుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
షాద్‌నగర్‌రూరల్: ప్రిన్సిపాల్ మందలించాడని ఓ విద్యార్థి పాఠశాల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. పట్టణంలోని సీఎస్కే వెంచర్లో నివాసం ఉంటున్న హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతుల కుమారుడు నీరజ్(15) స్థానిక శాస్త్ర పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఉదయం స్కూల్‌కు వెళ్లిన నీరజ్ స్నేహితుడితో కలిసి క్లాస్‌రూం నుంచి కారిడార్‌కు వచ్చాడు. ఇది గమనించిన ప్రిన్సిపాల్ నరేందర్‌రాయ్ వారిని మందలించాడు. దీంతో సాయంత్రం 4గంటలకు సుమారు 20 ఫీట్ల ఎత్తులో ఉన్న స్కూల్ అంతస్తు పైనుంచి నీరజ్ కిందికి దూకాడు. రక్తపు మడుగులో.. పాఠశాల భవనం పైనుంచి దూకిన నీరజ్ రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుండగా.. పాఠశాల సిబ్బంది వెంటనే అతన్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేయడంతో వారు వెంటనే చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. విద్యార్థి నేతల ఆందోళన..విద్యార్థి ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ యువసత్తా యూత్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. పాఠశాల ఫర్నిచర్, అద్దాలు, బోర్డులు ధ్వంసం చేశారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పాఠశాల ఎదుట బైఠాయించారు. వార్షికోత్సవం మరుసటి రోజే విషాదం.. హరిభూషణ్ పటేల్, భాగ్య దంపతులకు నీరజ్‌తో పాటు ఓ కూతురు ఉన్నారు. మంగళవారం హరిభూషణ్ దంపతుల పెళ్లి రోజు కావడంతో వారు కుటుంబ సభ్యులతో ఘనంగా వేడుక జరుపుకొన్నారు. మరుసటి రోజే కొడుకు మృతిచెందడంతో గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆర్మీ జవాన్‌గా పని చేసిన హరిభూషణ్ రిటైర్మెంట్ తీసుకుని, ప్రస్తుతం ప్రస్తుతం బీజేపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. -
కేపీ చౌదరి ఆత్మహత్య.. టాలీవుడ్ నటి కూతురు ఎమోషనల్ నోట్
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి ఆత్మహత్యపై ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అతనితో ఉన్న చిత్రాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఇక్కడ సమాజం విఫలమైందని.. నిన్ను మిస్ అవుతున్నందుకు చాలా బాధగా ఉంది అన్న అంటూ తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఇక నుంచి నా బాధలు ఎవరికీ చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేసింది. నీ బాధలు కూడా వినడానికి లేకుండా చేశావ్ కదా అన్న అంటూ సుప్రీత తన నోట్లో రాసుకొచ్చింది.నీకోసం చెల్లి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటుంది.. వెనక్కి వచ్చేయ్ అన్న అంటూ తన బాధను వ్యక్తం చేసింది. 'మిస్ యూ కేపీ అన్న.. నువ్వు ఎక్కడ ఉన్నా సరే పులిలాగే ఉంటావ్.. ఐ లవ్ యూ సో మచ్.. రెస్ ఇన్ పీస్' అంటూ తీవ్ర భావోద్వేగంతో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సుప్రీత చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.(ఇది చదవండి: 'కబాలి' నిర్మాత కే.పీ చౌదరి ఆత్మహత్య.. కారణం ఇదే)కాగా.. కేపీ చౌదరి నిర్మాతగా కబాలి చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించారు. కబాలి’ తెలుగు వర్షన్‌కు నిర్మాతగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. అయితే గతేడాదిలో డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారు. 2016లో సినిమా రంగంలోకి వచ్చిన కేపీ చౌదరి తెలుగు, తమిళ చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఈ క్రమంలో సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను ఆయన డిస్ట్రిబ్యూషన్ చేశారు. View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) -
ఎస్సై ఆత్మహత్యకు ఆ ఫ్యాక్టరీయే కారణం: కారుమూరి
సాక్షి,పశ్చిమగోదావరిజిల్లా:తణుకు రూరల్ ఎస్సై మూర్తి తుపాకీతో కాల్చుకొని చనిపోవడం చాలా బాధాకరమని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కారుమూరి అన్నారు. ఈ విషయమై కారుమూరి ఆదివారం(ఫిబ్రవరి2) మీడియాతో మాట్లాడారు. ‘ఆ ఎస్సై చాలా మంచివాడు ధైర్యవంతుడు..కానీ అలా చేసుకోవడం బాధాకరం. దీనంతటికీ మూలకారణం తేతలిలో ఉన్న పశువధ ఫ్యాక్టరీనే అన్నది నూరు శాతం నిజం. కొన్ని నెలల క్రితం గేదెలు దొంగతనం జరిగిన ఘటనలో దొంగను పట్టుకొన్నారు ఎస్సై మూర్తి. గతంలో గేదెలు దొంగిలించినా గానీ దొరికేవి. ఇప్పుడు గేదెలు దొంగిలించిన ఐదు నిముషాల్లోనే తేతలి ఫ్యాక్టరీలో అమ్మేస్తున్నారు. ఫ్యాక్టరీ లోపలికెళ్లిన రెండునిముషాల్లో మాంసానికి మాంసం ఎముకలకు ఎముకలు చర్మానికి చర్మం వేరు చేసేస్తున్నారు.అలా గేదెలు దొంగను పట్టుకొన్నా కానీ అప్పటికే వాటిని ఫ్యాక్టరీలో అమ్మేశాడు. ఆ దొంగ నుంచి ఎమౌంట్ రికవరీ చేసి గేదెలు యజమానికి న్యాయం చేశారు ఎస్సై మూర్తి. గతంలో ఆ ఆరోపణలతో సస్పెండ్ అయినా ఎస్సై మూర్తి మనస్తాపంతో ఇలా బలవన్మరణం చెంది ఉండచ్చు. ఎస్సై ఆత్మహత్యకు కారణమైన పశువధ ఫ్యాక్టరీని ఇప్పటికైనా ఇక్కడి కూటమి ఎమ్మెల్యే మూయించాలి.ఇంకా ఎన్ని ప్రాణాలు బలికొంటారు. అక్కడ ప్రజలు అన్నం కూడా తినలేని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. కానీ ఇక్కడి కూటమి ఎమ్మెల్యే రాధాకృష్ణ ఉత్తర్ ప్రదేశ్ నుంచి వచ్చిన కసాయి వ్యాపారికి కొమ్ముకాస్తున్నాడు. పర్మిషన్లు లేని పశువధ శాలకు పోలీసులతో కాపలాకాయిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాడు.ఆ ఫ్యాక్టరీకి ఎటువంటి పర్మిషన్లు లేవని మేం ఎన్నిసార్లు నిరూపించాలి. ఇక్కడి ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు డబ్బే ప్రధానమా ప్రజలు అక్కర్లేదా’అని కారుమూరి ప్రశ్నించారు. -
అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..!
పెద్దపల్లి జిల్లా: ‘చదువుల్లో రాణించలేకపోతున్నా.. ఎంత చదివినా ఎక్కువ మార్కులు రావడం లేదు. టెన్త్‌లో 10 జీపీఏ సాధించాలనుకున్నా అది సాధ్యం అయ్యేలా లేదు. నా వల్ల కాదు.. నేను చనిపోతున్నా. అమ్మానాన్నా.. నన్ను క్షమించండి..’అంటూ చదువు ఒత్తిడిని తట్టుకోలేక పదో తరగతి విద్యార్థిని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణం రాంనగర్లో శనివారం చోటుచేసుకుంది. సీసీసీ నస్పూర్ ఎస్సై సుగుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలువేరి దేవేందర్, జ్యోతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంలో నివాసం ఉంటున్నారు. వీరి కూతురు యోగిత (15) చిన్నప్పటి నుంచి రాంనగర్లో ఉన్న అమ్మమ్మ వద్ద ఉంటోంది. స్థానిక ఆదిత్య స్కూల్లో టెన్త్ చదువుతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తుండటంతో ఆవేదన చెంది.. శనివారం తెల్లవారుజామున ఐదు గంటలకు వంట గదిలో ఉరేసుకుంది. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కూతురు మరణ వార్త తెలుసుకుని అమలాపురం నుంచి వచి్చ న తల్లిదండ్రులు మృతదేహంపై పడి బోరున విలపించడం అందరినీ కలచివేసింది. -
డబ్బులు తీసుకుని ఇవ్వడం లేదని..
జీడిమెట్ల: డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి ఇవ్వకపోవడం , ఈ విషయమై ఇంట్లో గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి లోనైన ఓ మహిళ ఉరివేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జీడిమెట్ల టీఎస్ఎస్ఐసీ కాలనీలో నివాసం ఉంటున్న చందు భార్య లావణ్య(35) స్థానికంగా టైలరింగ్ షాప్ నిర్వహిస్తోంది. కొద్ది నెలల క్రితం ఆమెకు శివరాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లావణ్యతో స్నేహంగా ఉండే శివరాం తన వ్యాపార నిమిత్తం రూ.5లక్షలు అప్పుగా ఇవ్వాలని కోరాడు. దీంతో ఆమె తన నగలు తాకట్టు పెట్టి రూ.5 లక్షలు ఇచ్చింది. నెలలు గడుస్తున్నా శివరాం డబ్బులు చెల్లించకపోవడంతో ఆమె ఈ విషయాన్ని తన భర్త దృష్టికి తీసుకెళ్లింది. దీంతో చందు శుక్రవారం శివరాంను ఇంటికి పిలిచి డబ్బుల విషయమై నిలదీయగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో లావణ్య శివరాంకు ఫోన్‌చేసి నువ్వు డబ్బులు ఇవ్వనందునే తమ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని నీ కారణంగానే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పింది. దీంతో ఆందోళనకు గురైన శివరాం, చందు ఇంటికి వెళ్లి చూడగా లావణ్య చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. ఇద్దరూ కలిసి ఆమెను కిందికి దింపి సమీపంలోని అస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో విషాద ఘటన
మిర్యాలగూడ అర్బన్: తను చదువుకున్న చదువుకు.. చేసే కొలువుకు సంబందం లేని ఉద్యోగం.. వచ్చిన ఉద్యోగం చేసేందుకు ఇష్టం లేని యువకుడు సాగర్ కాల్వలో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. త్రిపురారం మండలం బెజ్జికల్ గ్రామానికి చెందిన నూనె రాములు, నిర్మల రెండవ కుమారుడు ప్రవీణ్‌కుమార్ (30) బీటెక్ పూర్తి చేసి గ్రూప్–4 పరీక్ష ఫలితాల్లో మెరిట్ సాధించాడు. దీంతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికై గత డిసెంబర్ 28న మిర్యాలగూడ తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగంలో చేరి మిర్యాలగూడ పట్టణంలో నివాసం ఉంటున్నాడు.అయితే ప్రవీణ్ ఉద్యోగంలో చేరిన సమయంలోనే ప్రభుత్వ సంక్షేమ పధకాల క్షేత్రస్థాయి సర్వే ప్రారంభం కావడంతో క్షేత్ర స్తాయిలో పని ఒత్తిడి పెరిగి మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు పలు సందర్బాల్లో తన తల్లిదండ్రులతో చెప్పుకున్నాడు. అయితే తెలంగాణ జెన్కో నిర్వహించిన పరీక్షలో విద్యుత్ ఏఈ పోస్టు ఇంటర్వూకు 1:2 లో ఎంపికైన అతడు కొద్ది తేడాతో ఏఈ ఉద్యోగం చేజారింది. దీంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. అంతే కాకుండా వచ్చే నెలలో గ్రూప్స్ రిజల్ట్స్ కూడా ఉండటంతో తాను కచ్చితంగా గ్రూప్స్ సాధిస్తాననే నమ్మకం ఉందని.. ఈ ఉద్యోగం వదిలేస్తానని తల్లిదండ్రులకు చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే గ్రూప్స్ ఉద్యోగం వచ్చే వరకు ఎలాగైనా ఓపిక పట్టుకుని ఉండమని తల్లిదండ్రులు అతడిని సముదాయించారు. ఉన్నత చదువులు తనకు చదవుకు తగ్గ కొలువు దక్కలేదని గత కొద్ది రోజులుగా తన తోటి సిబ్బంది వద్ద వాపోయేవాడని కూడా కార్యాలయంలో చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం డ్యూటికి వచ్చిన ప్రవీణ్‌కుమార్ రాత్రి ఇంటికి ఫోన్‌చేసి తల్లితో తన భాదను చెప్పగా.. ఎప్పటిలాగే వారు సర్దిచెప్పారు. అయితే, బుధవారం ప్రవీణ్‌కుమార్‌కు తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్‌చేసినా కలవకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం రాత్రి 11గంటల సమయంలో వేములపల్లి సమీపంలోని సాగర్ కాల్వ వద్ద చివరి సారిగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ చూపించాయి. ప్రవీణ్‌కుమార్ స్కూటీ సాగర్ కాల్వ వద్ద నిలిపి ఉంచడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గురువారం దొండవారిగూడం వద్ద సాగర్‌కాల్వలో ప్రవీణ్‌కుమార్ మృతదేహం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్కుమార్ది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. -
పెళ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు పురిగొల్పినట్లు కాదు: సుప్రీం
న్యూఢిల్లీ: వివాహానికి ఆమోదం తెలపక పోవడాన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా భావించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. తన కుమారుడితో పెళ్లికి నిరాకరించడం వల్లే అతడి ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడిందంటూ ఓ మహిళపై దాఖలైన కేసుపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మల ధర్మాసనం ఈ మేరకు అభిప్రాయపడింది. ఐపీసీలోని సెక్షన్–306 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లుగా భావించలేమని స్పష్టం చేస్తూ కేసును కొట్టివేసింది. పిటిషనర్ కుమారుడు, అతడి ప్రియురాలికి మధ్య ఉన్న విభేదాలే ఆధారంగానే ఈ ఆరోపణలు చేసినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి చార్జిషీటు, సాక్షుల వాంగ్మూలాలు వంటి నమోదైన ఆధారాలు సరైనవే అని భావించినా, పిటిషనర్‌కు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని ధర్మాసనం పేర్కొంది. ఆత్మహత్యకు మినహా మరే ప్రత్యామ్నాయం కూడా మృతురాలికి లేకుండా పిటిషనర్ చేశారనే ఆరోపణలు కూడా లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా, పిటిషనర్, కుటుంబంతో కలిసి తన కుమారుడితో బంధం తెంచుకోవాలని మృతురాలిపై ఒత్తిడి చేసినట్లు కూడా చూపలేకపోయారని ధర్మాసం తెలిపింది. ప్రియురాలితో తన కుమారుడి వివాహానికి పిటిషనర్ నిరాకరించినా ఆమె ఆత్మహత్యకు పాల్పడేలా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఒత్తిడి చేసినట్లుగా భావించలేమని తెలిపింది. వాస్తవానికి మృతురాలి కుటుంబానికే ఈ పెళ్లి ఇష్టం లేదన్నది నిజమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘నా కుమారుడిని పెళ్లి చేసుకోకుండా నీవు బతకలేవా?’అంటూ పిటిషనర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఐపీసీలోని సెక్షన్ 306ను అనుసరించి తీవ్రమైన ఆత్మహత్య నిర్ణయానికి కారణమని చెప్పలేమంది. -
చెరువులోకి దూకిన వృద్ధ దంపతులు
-
ఉద్యోగం పోవడం, ఫైనాన్స్ వేధింపులతో మహిళా వాలంటీర్ సూసైడ్
-
భార్యపై అనుమానం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
ఆదోని అర్బన్: పట్టణంలోని పూలబజార్‌లో నివాసముంటున్న శైలజ (22) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ సీఐ శ్రీరామ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మూడున్నర సంవత్సరాల క్రితం విక్టోరియాపేటకు చెందిన కృష్ణ కుమార్తె శైలజ, శక్తిగుడి ప్రాంతంలో నివాసముంటున్న నాగరాజు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. నాగరాజు ఓ ప్రయివేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేస్తుండగా, శైలజ లేడీస్ కార్నర్లో పని చేస్తోంది. వీరికి రెండేళ్ల కుమార్తె మౌనిక ఉంది. భర్త ప్రతిరోజూ భార్యపై అనుమానం పడడం, లేడీస్ కార్నర్లో పనిచేయగా వచ్చిన డబ్బు తనకే ఇవ్వాలని వేధించేవాడు. దీంతో శైలజ మనస్తాపానికి గురై సోమవారం రాత్రి గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కాపేపటికి గమనించిన కుటుంబసుభ్యులు కిందకు దింపి ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు వన్‌టౌన్ సీఐ తెలిపారు. -
12 మందిని కాల్చి ఆపై ఆత్మహత్య
పొడ్గొరిక(మాంటెనెగ్రో): నూతన సంవత్సర సంబరాలు జరుగుతున్న వేళ మాంటెనెగ్రోలోని సెటింజె పట్టణంలో బుధవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. అకో మార్టినోవిక్(45) అనే వ్యక్తి ఉన్మాదిగా మారి బార్ యజమాని, అతడి ఇద్దరు పిల్లలతోపాటు సొంత కుటుంబ సభ్యులను సైతం పొట్టనబెట్టుకున్నాడు. స్థానిక బార్లో బుధవారం ఉదయం నుంచి మార్టినోవిక్ గడిపాడు. సాయంత్రం గొడవకు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. తిరిగి తుపాకీ తీసుకుని బార్లోకి ప్రవేశించిన అతడు బార్‌లోని వారిపైకి కాల్పులకు దిగాడు. అనంతరం బయటకు వెళ్లి మరో మూడు చోట్ల కాల్పులు జరిపాడు. పోలీసులు వెంబడించడంతో అక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొడ్గొరికకు వెళ్లాడు. పోలీసులు చుట్టుముట్టడంతో తనను తాను కాల్చుకున్నాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. హింసా ప్రవృత్తి, చంచల స్వభావి అయిన మార్టినోవిక్పై గతంలో పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు. యూరప్‌లోని చిన్న దేశం మాంటెనెగ్రో జనాభా 6.20 లక్షలు. ఆయుధాలను కలిగి ఉండటం ఇక్కడో సంప్రదాయం. తుపాకీ సంస్కృతి కారణంగా తరచూ నేరాలు జరుగుతుంటాయి. తాజా ఘటన జరిగిన సెటింజెలోనే 2022 ఆగస్ట్‌లో ఓ దుండగుడు ఇద్దరు చిన్నారులు సహా 10 మందిని కాల్చి చంపాడు. ఓ వ్యక్తి సకాలంలో అతడిని కాల్చి చంపడంతో మారణ హోమానికి పుల్‌స్టాప్ పడింది. -
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
-
పెళ్లైన ఆటో డ్రైవర్‌తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల బలవన్మరణం
సిద్దిపేటకమాన్/ కొల్చారం (నర్సాపూర్): ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆదివారం ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సిద్దిపేట పట్టణంలో అప్పుల బాధ భరించలేక ఒకరు, మెదక్ జిల్లా కొల్చారం మండలంలో తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మనస్తాపానికి గురై మరొకరు ఉరేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేటకు చెందిన బండారి బాలకృష్ణ (34).. భార్య మానస, ఇద్దరు కుమారులతో కలసి సిద్దిపేట పట్టణం కాళ్లకుంట కాలనీలో నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ రాజన్న సిరిసిల్ల జిల్లా 17వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఆర్మర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ సిద్దిపేట నుంచి విధులకు వెళ్లి వస్తుంటారు. కాగా, బాలకృష్ణ ఫోనిక్స్ అనే ఓప్రైవేటు కంపెనీలో ఫోన్ పే, గూగుల్ పే, నెఫ్ట్ ద్వారా పలు విడతలుగా సుమారు రూ.25 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. ఈ క్రమంలో చాలా అప్పులు చేశారు. అయితే పెట్టుబడులపై ఆశించిన ఆదాయం రాకపోవడంతో అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని భార్యతో చెప్పి శనివారం రాత్రి ఎలుకల మందు కలిపిన టీని ఇద్దరు పిల్లలకు తాగించి, భార్యాభర్తలు కూడా తాగారు. ఆదివారం తెల్లవారుజామున మేలుకున్న బాలకృష్ణ లేచి చూడగా అందరూ స్పృహలోనే ఉన్నారు. ఇది గుర్తించి అతడు పక్క గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాలకృష్ణ భార్య మానస, ఇద్దరు కుమారులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ వాసుదేవరావు తెలిపారు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారని..మరో ఘటనలో మెదక్ జిల్లా కొల్చారం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కాటూరి సాయికుమార్ (55) బలవన్మరణానికి పాల్పడ్డారు. ఎస్ఐ మహమ్మద్ గౌస్ కథనం ప్రకారం.. హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్ భార్య శైలజ, ఇద్దరు కుమార్తెలతో కలసి నర్సాపూర్‌లో ఉంటున్నారు. రోజూ అక్కడి నుంచే డ్యూటీకి వచ్చి వెళ్తుంటారు. శనివారం మధ్యాహ్నం కొల్చారం స్టేషన్‌కు డ్యూటీకి వచ్చారు. రాత్రి క్వార్టర్ రూమ్‌లో ఉన్నారు. ఆదివారం ఉదయం భార్య శైలజకు ఫోన్ చేసి, ‘నేను చనిపోతున్నాను. నన్ను కొందరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు’అని చెప్పి స్టేషన్ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకొన్నారు. విషయం తెలుసుకున్న మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారుతీవ్రంగా వేధించారు: మృతుడి భార్య శైలజకొంతకాలంగా నర్సాపూర్‌లోని ఓ మహిళతో సాయికుమార్ తరచూ ఫోన్లో మాట్లాడేవారని ఆయన భార్య శైలజ తెలిపారు. ఇది తెలిసిన ఆ మహిళ భర్త.. వివాహేతర సంబంధం అంటగట్టడంతోపాటు కేసు పెడతానంటూ వేధించేవాడని పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా అతడి అల్లుడితో కలసి చంపుతామంటూ తరచూ బెదిరించేవారని పేర్కొంది. తన భర్త మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదు చేశారు. -
అప్పుల బాధ తాళలేక.. రైతు కుటుంబం బలవన్మరణం
సాక్షి ప్రతినిధి, కడప/సింహాద్రిపురం (పులివెందుల రూరల్)/కడప కోటిరెడ్డి సర్కిల్: వైఎస్సార్ జిల్లాలో అప్పుల బాధతో ఓ రైతు కుటుంబం శుక్రవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. ఆశించిన స్థాయిలో దిగుబడులులేక ఆదాయం రాకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికమవడం.. కౌలుకిచ్చిన భూ యజమానులకు ముఖం చూపించలేక రాత్రి భార్యాపిల్లలను తన పొలానికి విడివిడిగా తీసుకెళ్లి రైతు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం దిద్దేకుంట్ల గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కలిసిరాని వ్యవసాయం..వ్యవసాయం చేసుకుంటూ సాఫీగా జీవనం సాగిస్తున్న నాగేంద్ర (45)కు భార్య వాణి (38), కుమారుడు భార్గవ్ (13), కుమార్తె గాయత్రి (11) ఉన్నారు. అతనికి భార్య వ్యవసాయ పనుల్లో చేదోడుగా ఉంటోంది. నాగేంద్ర తనకున్న 1.50 ఎకరాల సొంత పొలంతోపాటు ఆరేళ్ల క్రితం ఆరు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగుచేశాడు. కౌలు భూమిలో ఆశించిన దిగుబడి రాకపోవడంతో అప్పులపాలయ్యాడు. రెండేళ్ల క్రితం సుంకేసుల గ్రామానికి చెందిన మరో ఇద్దరి నుంచి 13 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సోయా చిక్కుడు పంట సాగుచేశాడు. ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.50 లక్షల పెట్టుబడి ఖర్చయింది. ఈసారీ ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు.మళ్లీ రబీలో కొర్ర పంటను సాగుచేసేందుకు ఎకరాకు రూ.20వేల చొప్పున మొత్తం రూ.2.60 లక్షలు ఖర్చుచేసి పంటను సాగుచేశాడు. తెగుళ్ల నివారణకు పెద్ద మొత్తంలో మందులు కొన్నాడు. అయినా, ఈ పంట కూడా దిగుబడి రాకపోవడంతో తీవ్రనష్టం చవిచూశాడు. అప్పటికే అప్పులు ఉండడంతో సొంత భూమి ఒకటిన్నర్ర ఎకరాల్లో సాగుచేసిన చీనీ పంట పొలాన్ని నాగేంద్ర కుదవపెట్టాడు. దీనికితోడు.. సేద్యం కోసం కొన్న ట్రాక్టర్‌ను కంతులు చెల్లించలేదని స్వాధీనం చేసుకున్నారు. అవమానభారంతో ఉన్న నాగేంద్రకు కౌలుకు ఇచ్చిన యజమానులకు మోహం ఎలా చూపించాలి.. అప్పులెలా తీర్చాలన్న ఆవేదన వేధిస్తోంది.క్రమం తప్పకుండా ఆర్థిక ఇబ్బందులు..వ్యవసాయానికి అనుబంధంగా పాడి ఉంటే వేడి నీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా ఉంటుందని నాగేంద్ర సుమారు రూ.4లక్షలతో నాలుగు పాడి గేదెలు కొని పోషించేవాడు. కానీ, రెండేళ్ల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దూడలతో సహా వీటిని అపహరించారు. వరుసగా ఇలా ఆటుపోట్లతో నాగేంద్ర ఆర్థికంగా బాగా చితికిపోయాడు. రూ.15 లక్షల వరకు అప్పులు పెరిగిపోయాయి. అప్పులిచ్చిన వారు సైతం పదేపదే అడగడం ప్రారంభించారు.ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన పొలంలో భార్య వాణి, ఇద్దరు పిల్లలకు ఉరివేసి నాగేంద్ర సైతం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటినుంచి వెళ్లిన వీరు ఎంతకు రాకపోయేసరికి తల్లి సిద్దమ్మ ఆందోళన చెందింది. ఇరుగు పొరుగు వారిని విచారించగా.. పొలం వైపు వెళ్లారని తెలుసుకుని అదే గ్రామంలో ఉన్న పెద్ద కొడుకు నాగరాజుకు తెలిపింది. గ్రామస్తులతో కలిసి అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే నలుగురూ విగతజీవులుగా మారారు.భార్య, పిల్లలు తనలాగ కష్టపడకూడదనే..విగతజీవులుగా పడిపోయి ఉన్న నాగేంద్ర కుటుంబాన్ని చూసిన బంధువులు, గ్రామస్తులు పోలీసు లకు సమాచారం ఇచ్చారు. డీఎస్పీ మురళీనాయక్, ఎస్ఐ ఓబన్న ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. తానుపడ్డ కష్టాలు తన భార్యకు, పిల్లలకు రాకూడదనే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు రైతు నాగేంద్ర తల్లి సిద్ధమ్మ కన్నీరుమున్నీరవుతోంది. మృతుడు ఉపయోగించిన తాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో దిద్దేకుంట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.అప్పుల బాధతోనే ఆత్మహత్య : డీఎస్పీఅప్పుల బాధతోనే రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు డీఎస్పీ మురళీ నాయక్ శనివారం మీడియాకు తెలిపారు. ముందు భార్యను.. ఆ తర్వాత కుమార్తెను, అనంతరం కుమారుడికి ఉరివేసి చివరికి రైతు ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. రాత్రి 10గంటలకు మృతుడి బావమరిది రాజేష్, బంధువులు సంఘటనాస్థలికి వెళ్లి పోలీసులకు సమాచారమిచ్చారని చెప్పారు. మృతదేహాలను పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ మార్చురీలోని మృతదేహాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. రైతు కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, రైతు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని, ఈ విషయమై కలెక్టర్, ఇన్చార్జి ఎస్పీతో మాట్లాడామని, విచారించాలని ఆదేశించినట్లు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరూ అధైర్యపడొద్దు.. మంచిరోజులొస్తాయి : ఎంపీ అవినాష్రైతు నాగేంద్ర కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అప్పుల బాధ తాళలేక రైతన్న తనతోపాటు భార్య, ముక్కుపచ్చలారని పిల్లలకు కూడా ఉరివేయడం బాధాకరమన్నారు. రైతన్నలు ఎవరూ అధైర్యపడొద్దని, దేవుడి దయతో మంచిరోజులు వస్తాయని, ధైర్యంగా ఉండాలని తెలిపారు.నంద్యాల జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకొత్తపల్లి : అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాకు చెందిన మరో రైతు కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొత్తపల్లి మండలం ఎం. లింగాపురం గ్రామానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న (68) తనకున్న ఐదెకరాలతో పాటు మరో 17 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వివిధ రకాల పంటలను సాగుచేసుకుంటున్నాడు. ఇందుకు నాలుగేళ్ల నుంచి సుమారు రూ.10 లక్షల వరకు అప్పుచేశాడు. దీంతోపాటు కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఇంటి నిర్మాణానికీ మరికొంత అప్పుచేశాడు. వీటిని తీర్చేందుకు తన ఐదెకరాల్లో మూడెకరాలను అమ్మి కొంతమేర అప్పులు కట్టాడు.ఇక ఈ ఏడాది సాగుచేసిన పొగాకు, మినుము, మొక్కజొన్న పంటలు అధిక వర్షాలతో దిగుబడిలేక నష్టపోయాడు. దీంతో అప్పులు ఎలా తీర్చాలో తెలీక మనోవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగాడు. కుటుంబ సభ్యులు మారెన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని కుమారుడు అల్లెన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఏఎస్ఐ బాబా ఫకృద్దీన్ తెలిపారు. తహసీల్దార్ ఉమారాణి, మండల వ్యవసాయాధికారి కె. మహేష్‌లు శనివారం లింగాపురం చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపజేస్తామన్నారు. -
హైదరాబాద్ నాచారంలో యువతి ఆత్మహత్య
-
నా చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణం.. యువతి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో యువతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చేయని తప్పునకు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. తన చావుకు కానిస్టేబుల్, ఆయన భార్యే కారణమని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాచారంలోని బాపూజీనగర్ సరస్వతి కాలనీకి చెందిన పులివర్తి దీప్తి హబ్సిగూడలోని ఐఐసీటీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ)లో ప్రాజెక్టు అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. దీప్తి తండ్రి సంగీతరావు ఐఐసీటీలో పని చేసి రిటైర్ అయ్యారు. తండ్రితో వేరుగా దీప్తి రెండు సంవత్సరాల నుండి తన తల్లితో కలిసి ఉంటోంది. సంగీతరావుకు డీజీపీ కార్యాలయంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బెల్లా అనిల్‌తో పరిచయముంది.అయితే, బిల్ల అనిల్ అనే వ్యక్తి తన భార్య కోసం ఐఐసీటీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కోసం, దీప్తి తండ్రి సంగీత రావుకు రూ.15 లక్షలు డబ్బులు ఇచ్చినట్లు సమాచారం. రెండేళ్ల క్రితమే ఈ డబ్బులు ఇచ్చినట్టు సమాచారం. అయితే, తన తండ్రి సంగీతరావు.. అనిల్ వద్ద డబ్బు తీసుకున్న విషయం దీప్తికి తెలియదు. కాగా, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకూ ఉద్యోగం ఇప్పించలేదు. దీంతో అనిల్ తన డబ్బు తిరిగివ్వాలని దీప్తిని అడిగేవాడు. డబ్బు తన తండ్రి తీసుకున్నాడని, ఆయన తమతో చాలా ఏళ్ల నుంచి కలిసి ఉండటం లేదని, తనను డబ్బులు అడగవద్దని అనిల్‌కు సమాధానం చెప్పింది. ఆయన పట్టించుకోకుండా నాచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించాడు. దీంతో, దీప్తి, సంగీత రావుపై ఛీటింగ్ కేసు నమోదైంది. అనిల్ దంపతులు న్యాయస్థానంలో సివిల్ దావా కూడా వేశారు.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన దీప్తి, బుధవారం రాత్రి 10 గంటల సమయంలో చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తల్లి వచ్చి చూసేసరికి దీప్తి మృతి చెందింది. ఆమె ఫోన్ చూడగా సెల్ఫీ వీడియో ఉంది. సెల్ఫీ వీడియో ప్రకారం ఆమె మాటలు.. ‘నేను చనిపోవడానికి అనిల్, ఆయన భార్య అనిత, ఆమె తండ్రి సోమయ్య కారణం. మా నాన్న డబ్బులు తీసుకుంటే నన్ను అడిగి నా మీద నకిలీ కేసు పెట్టారు. నా జీవితం నాశనం చేశారు. ఈ కేసుల మీద పోరాడే స్తోమత లేదు. నా మరణంతోనైనా కుటుంబానికి న్యాయం జరుగుతుంది. నా చావునకు కారణమైన వాళ్లకు శిక్షపడాలి. నా మృతదేహాన్ని వైద్య పరిశోధనకు ఇచ్చేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది. అనంతరం, పోలీసులు అనిత, అనిల్, సోమయ్య, సైదులు మీద కేసు బుక్ చేశారు. -
అశోక్‌నగర్‌లో గ్రూప్–2 అభ్యర్థి బలవన్మరణం
గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని అవుసులకుంట తండాకు చెందిన గిరిజన యువతి గుగులోత్ సురేఖ(22) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తండావాసులు తెలిపారు. యువతి ఉన్నత చదువులు చదివి హైదరాబాద్‌లో ఉంటూ వివిధ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంది. వారం క్రితం నిర్వహించిన గ్రూప్–2 పరీక్షలకు సైతం హాజరైనట్లు తెలిపారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. ఎంతో భవిష్యత్ ఉన్న యువతి ఆత్మహత్య చేసుకోవడంతో తండాలో విషాదచాయలు అలుముకున్నాయి. Hanumakonda: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య
హయత్‌నగర్ (హైదరాబాద్)/గోపాల్పేట: ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి జరిగిన ఈ సంఘటనపై పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం శానాయిపల్లికి చెందిన పండగ మధుసూదన్‌రెడ్డి రైతు. ఆయన కొడుకు లోహితస్యరెడ్డి (12) హయత్‌నగర్‌లోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి భోజనం అనంతరం 8 గంటలకు తోటి విద్యార్థులంతా స్టడీ అవర్‌లో చదువుకునేందుకు వెళ్లగా.. లోహితస్యరెడ్డి ఒక్కడే గదిలో ఉన్నాడు.స్టడీ అవర్ తర్వాత గదిలోకి వచి్చన విద్యార్థులకు.. ఫ్యాన్‌కు వేలాడుతూ లోహితస్యరెడ్డి కనిపించాడు. దీంతో వారు హాస్టల్ సిబ్బందికి చెప్పగా.. హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఉపాధ్యాయుల ఒత్తిడి, నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు ఆత్యహత్యకు పాల్పడ్డాడని మృతుని తండ్రి మధుసూధన్‌రెడ్డి ఆరోపించారు. ఇక్కడ చదవనంటే.. ఈ ఏడాది పూర్తయ్యేవరకు చదవమని నచ్చజెప్పానని చెప్పారు. సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూడా ఫోన్ చేసి మాట్లాడాడని.. ఆ తర్వాతే ఉరివేసుకుని మరణించాడనే వార్త తెలిసిందని వాపోయారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల గేటు ముందు ఆందోళన చేశారు. -
‘ఓయ్.. సుఖంగా ఉండు!’
యుక్తవయసులో మానసిక ఆరోగ్యంపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. క్షణాకావేశంలో తీసుకుంటున్న తీవ్ర నిర్ణయాలే అందుకు కారణం. నిన్నగాక మొన్న.. అతుల్ సుభాష్ అనే వ్యక్తి మరణ ఉదంతం ఇందుకొక ఉదాహరణగా నిలిచింది. తాజాగా.. గుజరాత్లో ఓ యువతి తన ప్రియుడిని సుఖంగా ఉండాలని కోరుకుంటూ బలవన్మరణానికి పాల్పడడం చర్చనీయాంశమైంది.27 రాధా ఠాకూర్‌కు గతంలోనే వివాహం, విడాకులు అయ్యాయి. ఆ తర్వాత తన సోదరితో బనస్కాంత జిల్లా పలాన్‌పూర్‌లో ఉంటూ ఓ బ్యూటీపార్లర్ నడిపిస్తోంది. ఈ క్రమంలో ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఏం జరిగిందో తెలియదు.. సోమవారం ఉదయం కల్లా రాధ తన గదిలో విగతజీవిగా పడి ఉంది. దీంతో ఆమె సోదరి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్లో.. రాధ ఫోన్లో కొన్ని రికార్డింగులు దొరికాయి. అందులో ఆమె ఎవరికో క్షమాపణలు చెప్పినట్లు ఉంది.‘‘ఏడు గంటలలోపు ఫొటో పంపకపోతే ఏం జరుగుతుందో చూస్తావు!’’ అంటూ ఓ ఆడియో క్లిప్‌ను సదరు వ్యక్తి వాట్సాప్ సందేశానికి తొలుత పంపినట్లు ఉంది. అయితే కాసేపటికే ఆమె సెల్ఫీ వీడియో చిత్రీకరించుకుంది.‘‘ ఓయ్.. నన్ను క్షమించమని రెండు చేతులు జోడించి వేడుకుంటున్నా. నిన్ను అడగకుండానే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నా. నేను ఆత్మహత్య చేసుకున్నా అని అనుకోకు. పని, జీవితంలో విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నా. నా ఈ పనితో నువ్వు బాధపడకు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు. అప్పుడే నా ఆత్మ సంతోషిస్తుంది అని వీడియోలో పేర్కొందామె. మృతిరాలి సోదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
యువతి ఆత్మహత్య.. ఆమెను రక్షించబోయి స్నేహితురాలి దుర్మరణం
పెనుకొండ: ఓ యువతి ఆత్మహత్యచేసుకుంటుంటే.. ఆమెను కాపాడుకునే క్రమంలో మరో యువతి దుర్మరణం పాలైంది. మృతులిద్దరూ ఒడిశాకు చెందిన యువతులు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సంధ్యారాణి మహారాజ్(24), సుల్లుబుల్లు బెహరా(28)లు స్నేహితులు. బతుకు తెరువు కోసం ఇద్దరూ బెంగళూరులోని ఓ గార్మెంట్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. 3 రోజుల కిందట సంధ్యారాణి తండ్రి కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న సంధ్యారాణి సొంతూరికి పయనమైంది. ఆమెకు తోడుగా సుల్లుబుల్లు బెహరా కూడా బయలుదేరింది. ఆదివారం బెంగళూరు నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లో వీరు బయలుదేరారు. తానూ నాన్న దగ్గరికే వెళతానంటూ స్నేహితురాలితో సంధ్యారాణి చెప్పింది. పెనుకొండ రైల్వేస్టేషన్‌కు రైలు చేరగానే సంధ్యారాణి రైలు దిగేసింది. బెహరా కూడా రైలు దిగి ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించింది. ఈ లోపు సంధ్యారాణి ప్లాట్ఫారం దాటి ముందుకు వెళుతుండడంతో వెనుకనే బెహరా అనుసరించింది. అటుగా వచి్చన గూడ్స్ రైలును గమనించగానే సంధ్యారాణి పట్టాల మీదికి దూకేసింది. ఆమెను పట్టుకునే క్రమంలో బెహరా సైతం అడుగు ముందుకేయడంతో.. రైలు ఇంజన్ ఢీకొట్టి బెహరా ఎగిరి పట్టాలు పక్కనే పడి ప్రాణాలు విడిచింది. రైలు కిందపడిన సంధ్యారాణి శరీరం ఛిద్రమై ప్రాణాలు కోల్పోయింది. -
పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలిచారని..
బౌద్ధనగర్: పోలీసులు కౌన్సెలింగ్‌కు పిలవడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వారాసిగూడ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అడ్మిన్ ఎస్సై సుధాకర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాంనగర్ రామాలయం ప్రాంతానికి చెందిన మచ్చ శ్రీకాంత్ (32) ముషీరాబాద్ జీహెచ్‌హెంసీ సర్కిల్లో కాంట్రాక్టు పారిశుద్ధ్య కారి్మకుడిగా పని చేస్తున్నాడు. అతడి భార్య శృతి క్యాటరింగ్లో పని చేస్తుంది. గత కొన్నాళ్లుగా మద్యానికి బానిసైన శ్రీకాంత్ తరచూ భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 13న ఆమె మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో 16న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని పోలీసులు శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. దీంతో భయాందోళనకు గురైన శ్రీకాంత్ ఆదివారం చున్నీతో ఉరేసుకుని అత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన అతడి తండ్రి స్థానికుల సహాయంతో కిందకు దించి 108కు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.