
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్‌చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్‌సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు.
స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్‌లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment