ajay
-
‘CM పెళ్లాం’ సినిమా సాంగ్ లాంచ్ (ఫోటోలు)
-
ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతా
కరీంనగర్(రామగుండం): తనతో చనువుగా ఉన్న ఆమె ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని, ఆమె మాట్లాడితేనే టవర్ దిగుతానని, లేదంటే దూకి ఆత్మహత్య చేసుకుంటానని బిహార్‌కు చెందిన వలసకూలీ గేదెం అజయ్ భీష్మించుకు కూర్చున్నాడు. మంగళవారం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని హైటెన్షన్ విద్యుత్ టవర్ పైకి ఎక్కి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్‌కిరణ్, ఏసీపీ రమేశ్, సీఐ ప్రవీణ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసు అధికారులు మైక్‌సెట్ ద్వారా యువకుడిని సంప్రదించగా.. కొద్దిరోజులుగా ఆ యువతి తనతో మాట్లాడడం లేదన్నారు. స్పందించిన పోలీసులు యువతిని ఘటనా స్థలానికి తీసుకొచ్చి మైక్‌లో మాట్లాడించగా, అజయ్ టవర్ దిగాడు. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు.. అజయ్ తనను కొంతకాలంగా శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా, పోలీసుల అప్రమత్తంగా వ్యవహరించి సదరు యువతిని సంఘటనా స్థలానికి తీసుకొచ్చి మాట్లాడించడంతో యువకుడి ప్రాణాలు దక్కాయి. -
బడ్జెట్‌కు వెనకాడకుండా తీసిన సినిమా.. ట్రైలర్ చూశారా?
శ్రద్దా దాస్, మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి ముఖ్య పాత్రల్ని పోషించిన చిత్రం త్రికాల (Trikala Movie). మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. శనివారం నాడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ‘యుద్ధం రేపటి వెలుగు కోసం.. కానీ ఈ అంధకాసురిడి యుద్ధం వెలుగుని నాశనం చేయడానికి’.. అంటూ తనికెళ్ల భరణి డైలాగ్స్‌తో ట్రైలర్ ఆరంభమవుతుంది. యాక్షన్ సీక్వెన్స్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా అన్నీ కూడా హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ‘ఒక సైక్రియార్టిస్ట్‌గా ఛాలెంజింగ్ కేసుని చూస్తున్నా’ అంటూ శ్రద్దా దాస్ పాత్రను ఈ ట్రైలర్లో పరిచయం చేశారు. యాక్షన్ సీక్వెన్స్, ట్రైలర్ చివర్లో అజయ్ విశ్వరూపం, డైలాగ్స్ అదిరిపోయాయి. త్రికాల ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అజయ్ మాట్లాడుతూ.. ‘మణి గారు నాకు రెండు, మూడేళ్ల క్రితం త్రికాల కథ చెప్పారు. బడ్జెట్ ఎక్కువ అయ్యేట్టుంది ఎలా చేస్తారో అనుకున్నా. ఇంత వరకు నాకు ఏం చూపించలేదు. నేరుగా ఇక్కడే ట్రైలర్‌ను చూశాను. అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.మాస్టర్ మహేంద్రన్ మాట్లాడుతూ.. ‘త్రికాల సినిమా కోసం నిర్మాతలు చాలా కష్టపడ్డారు. ఈ మూవీ కోసం చాలా రీషూట్ జరిగింది. కానీ ఎప్పుడు కూడా వారు ప్రశ్నించలేదు. మా సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. సమ్మర్లో మా సినిమా రాబోతోంది. అందరూ మా చిత్రాన్ని సపోర్ట్ చేయండి’ అని అన్నారు. దర్శకుడు మణి మాట్లాడుతూ.. ‘ఈ కథను అజయ్ గారికే ముందుగా చెప్పాను. వీఎఫ్ఎక్స్ గురించి జాగ్రత్తగా చూసుకో అని ఆయన సలహా ఇచ్చారు. త్రికాల సినిమాటిక్ యూనివర్స్ అని ట్రైలర్లో పెట్టాం. అంబటి అర్జున్ ఒక్క రోజే షూటింగ్ చేశారు. అదేంటో ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈ మూవీ కోసం మేము చాలా వదులుకున్నాం. మా చిత్రాన్ని అందరూ సపోర్ట్ చేయండి’ అన్నారు. నిర్మాత రాధిక మాట్లాడుతూ.. ‘సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని, మన సూపర్ హీరోల్ని అందరికీ చూపించాలని త్రికాల సినిమా తీశాం. బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, స్పైడర్ మ్యాన్‌లా మన త్రికాల ఉంటుంది. టైంతో సంబంధం లేకుండా కాపాడేవాడే త్రికాల. ఇంకా త్రికాల గురించి తెలియాలంటే సినిమా చూడాల్సిందే’ అన్నారు.నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘త్రికాల మూవీకి సీజీ వర్క్ ఎక్కువగా అవసరం పడింది. అందుకే ఈ మూవీ లేట్ అవుతూ వచ్చింది. మన పురాణాల్లోనే హనుమాన్, భీమ్ వంటి సూపర్ హీరోలున్నారు. మనం ఓ ఫిక్షనల్ హీరోని సృష్టించాలని అనుకున్నాం. అలా పుట్టిందే ఈ త్రికాల’ అన్నారు. చదవండి: జీవితంలో కొత్త అధ్యాయం షురూ.. మెహబూబ్ దిల్సే ఎమోషనల్ -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
పెడన: కృష్ణా జిల్లాలో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బైక్‌ను లారీ ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం ఆర్తమూరు దళితవాడకు చెందిన పాపవర్తి శాంతరాజు (26)తోపాటు బాపట్ల విజయచందర్ (40), పీతల అజయ్ (24) పెయింటింగ్ పనికోసం గురువారం ఉదయం మచిలీపట్నం వెళ్లారు.పని ముగించుకుని సాయంత్రం ముగ్గురూ బైక్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పెడన సమీపంలోని పెడన– బంటుమిల్లి బైపాస్ రోడ్డులో వస్తుండగా మచిలీపట్నం వైపు వేగంగా వస్తున్న లారీ ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసేందుకు రాంగ్ రూట్లో వచ్చి, శాంతరాజు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దాదాపు వంద మీటర్ల దూరం బైక్‌ను ఈడ్చుకుపోయింది. విజయచందర్, శాంతరాజు, అజయ్ రోడ్డుపై పడిపోయారు. విజయచందర్, శాంతరాజు అక్కడిక్కడే చనిపోగా అజయ్‌ను మచిలీపట్నం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మచిలీపట్నం డీఎస్పీ సీహెచ్ రాజా, పెడన సీఐ కె నాగేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పుప్పాల పవన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఆ కుటుంబాలకు వారే ఆధారంమృతులు పెయింటింగ్ పనులు చేసి రోజువారీ కూలీతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. వీరు ముగ్గురి మృతితో ఆ కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. బాపట్ల విజయచందర్‌కు భార్య, ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగపిల్లాడు ఉన్నారు. వీరు పది, ఎనిమిది, ఐదో తరగతి చదువుతున్నారు. ఆ కుటుంబానికి దిక్కు విజయచందరే. శాంతరాజుకు తండ్రి లేడు. అన్న, శాంతరాజు సంపాదిస్తూ ఆఖరి తమ్ముడ్ని చదివించుకుంటున్నారు. పీతల అజయ్‌కి కూడా తండ్రి లేడు. సోదరుడితో కలిసి పెయింటింగ్ పనులు చేస్తూ కుటుంబానికి అండగా ఉన్నాడు. -
హుస్సేన్ సాగర్‌లో బోటు ప్రమాదం
-
టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ఎం. శ్రీలేఖవిడుదల తేదీ: 08 నవంబర్ 2024సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్‌తో దిగితే ప్రేక్షకులే సూపర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వచ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు. ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు? ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హత్య కేసు నుంచి బయటపడతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గానే వచ్చినప్పటికీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు.అయితే సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామర్, ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ కథకు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
అలాంటిపాత్రలు రెగ్యులర్‌గా రావు: అజయ్
‘‘విక్రమార్కుడు’ సినిమా తర్వాత ఆ స్థాయిలో విలన్ వేషాలు నాకు తక్కువగానే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళిగారి సినిమాల్లోనే ఉన్నాయి. టిట్ల (‘విక్రమార్కుడు’లో అజయ్పాత్ర) లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్‌గా రావు. ఇక ‘΄పొట్టేల్’ సినిమాలో నేను చేసిన పటేల్ క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉన్నాయి. నటుడిగా సంతోషం ఇచ్చినపాత్ర ఇది’’ అని అజయ్ అన్నారు. యువ చంద్రకృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘΄పొట్టేల్’. సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ అవుతోంది.ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేసిన అజయ్ మాట్లాడుతూ– ‘‘సాహిత్ చెప్పిన కథ, నాపాత్ర బాగా నచ్చాయి. పటేల్పాత్రని అద్భుతంగా చేయాలనిపించింది.పాప చదువు కోసం ΄ోరాటం చేసే నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. మూఢ నమ్మకాలు, వాటిని అడ్డం పెట్టుకుని బతికే మనుషులు, మొండితనం, గ్రామదేవతల గురించి ఈ సినిమా ఉంటుంది. ఇందులోని కొన్ని సన్నివేశాలకు ప్రేక్షకులు విజిల్స్ వేస్తారు. డైరెక్టర్స్ కొరటాల శివ, సందీప్ రెడ్డి వంగాగార్లకి ఈ సినిమా చూపించాను... వారికి బాగా నచ్చింది. ఇక హిందీలో అజయ్ దేవగన్గారితో ‘సింగం ఎగైన్’ చేశాను. ‘పుష్ప–2 ది రూల్’ చేస్తున్నాను. అలాగే తమిళ, మలయాళ సినిమాలు కూడా చేస్తున్నాను’’ అన్నారు. -
Russia-Ukraine war: రష్యా యుద్ధక్షేత్రంలో మరో భారతీయుడు మృతి
చండీగఢ్: ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యారు. రవాణా విధులకని తీసుకున్న రష్యా యుద్ధంలోకి పంపి తన సోదరుడిని పొట్టనబెట్టుకుందని హరియాణాకు చెందిన అజయ్ మౌన్ అనే వ్యక్తి సోమవారం ప్రకటించారు. బాధితుడు రవి మౌన్ జనవరి 13న రష్యా వెళ్లారు. కందకాలు తవ్వడంలో శిక్షణ ఇప్పించి నేరుగా యుద్ధక్షేత్రంలోకి పంపారని అజయ్ ఆరోపించారు. రవిని రష్యాకు పంపేందుకు ఎకరం భూమి అమ్మడంతోపాటు రూ.11.50 లక్షలు ఖర్చుపెట్టామని వాపోయారు. రవి మరణవార్తను మాస్కోలోని భారతీయ ఎంబసీ ధ్రువీకరించింది. యుద్ధంలో ఉన్న భారతీయులను వెనక్కి పంపేస్తామంటూ ప్రధాని మోదీ పర్యటన వేళ రష్యా ప్రకటించిన కొద్దిరోజులకే ఈ విషాదం వెలుగుచూడటం గమనార్హం. యుద్ధంలో పనిచేయడం రవికి సుతరామూ ఇష్టంలేదని, ఫోన్లో ముభావంగా మాట్లాడేవారని మార్చి 12వ తేదీ దాకా అతనితో టచ్‌లోనే ఉన్నామని సోదరుడు అజయ్ చెప్పారు. మృతదేహం గుర్తింపు కోసం డీఎన్ఏ నమూనాలను పంపాలని డిమాండ్ చేస్తున్నారని, అంత సొమ్ము తమ వద్ద లేదని, మృతదేహం రప్పించేందుకు భారత సర్కార్ సాయం చేయాలని ఆయన వేడుకున్నారు. -
ఆర్టీఐని బతకనివ్వరా?!
విధాన నిర్ణయాలపై అనవసర గోప్యత పాటించటం, నిజాలు రాబట్టే ప్రయత్నాలకు పాతరేయటం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పుట్టి దాదాపు రెండు దశాబ్దాలు గడిచింది. లోటుపాట్లు సరిదిద్దుకుంటూ మరింత పదునెక్కాల్సిన ఆ చట్టం కాస్తా ప్రభుత్వాల పుణ్యమా అని నానాటికీ నీరుగారుతోంది. తాజాగా ఆ చట్టం తమకు వర్తించదంటూ జవాబిచ్చి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆ జాబితాలో చేరింది. షోపూర్ జిల్లా కునోలో ఉన్న వన్యప్రాణి సంరక్షణకేంద్రం, మాందసార్ జిల్లాలో నెలకొల్పబోయే మరో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల గురించి, ముఖ్యంగా చిరుతల సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి సమాచారం కావాలంటూ అడిగిన సమాచార హక్కు కార్యకర్త అజయ్ దూబేకు కళ్లు తిరిగి కింద పడేలా ప్రభుత్వ అటవీ విభాగం సమాధానమిచ్చింది.అలాంటి సమాచారం వెల్లడిస్తే దేశ భద్రతకూ, సార్వభౌమత్వానికీ ముప్పు ఏర్పడుతుందట. దేశ సమగ్రత, వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయట. వేరే దేశంతో సంబంధాలు కూడా దెబ్బతినవచ్చట. కాబట్టి చట్టంలోని సెక్షన్ 8(1)(ఏ) ప్రకారం ఇవ్వడం కుదర దట. ఒక చిరుత కూన కాలికి కట్టు కట్టినట్టున్న ఫొటో చూసి మొన్న ఫిబ్రవరిలో పులుల జాతీయ సంరక్షణ ప్రాధికార సంస్థకు దూబే ఫిర్యాదు చేశాడు. ఎట్టకేలకు అటవీశాఖ స్పందించింది. కానీ ఆ సమాచారం వెల్లడిస్తే మిన్ను విరిగి మీదపడుతుందన్న స్థాయిలో సమాధానమిచ్చింది. ప్రభుత్వాల పనితీరుపై అవధుల్లేని సమాచారం పౌరులకు లభ్యమైనప్పుడే ప్రజాస్వామ్యానికి పునాదిగా భావించే స్వేచ్ఛ, సమానత్వాలు సాధించుకోవటం, వాటిని కాపాడుకోవటం సాధ్యమవు తుందని జగజ్జేత అలెగ్జాండర్‌కు గురువైన గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్ చెబుతాడు. అరిస్టాటిల్ క్రీస్తు పూర్వం రెండో శతాబ్దినాటివాడు. సమాచారం ఇవ్వటానికి ససేమిరా అంటున్న మన ప్రభుత్వాలు మానసికంగా తాము ఏకాలంలో ఉండిపోయామో తెలుసుకోవటం ఉత్తమం. ఇప్పుడే కాదు... 2005లో ఆర్టీఐ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడే దేశభద్రత పేరు చెప్పి 22 సంస్థలకు మినహాయింపు ఇచ్చి దాని స్ఫూర్తిని దెబ్బతీశారు. తర్వాత కాలంలో ఆ జాబితా పెరుగుతూ పోయింది. ఆర్టీఐ పరిధి లోకి రాబోమని వాదించే వ్యవస్థలు, విభాగాలు ఎక్కువవుతున్నాయి. రాజకీయ పార్టీలు మొదలు కొని న్యాయవ్యవస్థ వరకూ ఇందులో ఎవరూ తక్కువ తినలేదు. పారదర్శకత తమవల్ల కాదని అందరికందరూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. అసలు ఏ సమాచారమైనా కోరితే 30 రోజుల్లో దాన్ని అందజేయాలని ఆర్టీఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. అది ఎక్కడా అమలవుతున్న దాఖలా లేదు. అప్పీల్ కోసం వెళ్తే అక్కడ మరో కథ. చాలా రాష్ట్రాల్లో సమాచార కమిషనర్లు, ఇతర సిబ్బంది తగినంతమంది ఉండటం లేదు. కొన్నిచోట్ల ప్రధాన కమిషనర్ల జాడలేదు. అయిదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ల, కమిషనర్ల పదవీకాలం, వారి జీతభత్యాలు, సర్వీసు నిబంధనలు రూపొందించే నిర్ణయాధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ ఆర్టీఐకి సవర ణలు తెచ్చింది. ఈ సవరణలు సహజంగానే సమాచార కమిషన్ వ్యవస్థల స్వయంప్రతిపత్తిని దెబ్బ తీశాయి. పార్లమెంటులో తగిన సంఖ్యాబలం ఉన్నది కనుక చట్ట సవరణలకు సులభంగానే ఆమోదం లభించింది. కానీ సంబంధిత వర్గాలతో మాట్లాడాకే ఆ సవరణలు తీసుకురావాలన్న కనీస సంప్రదాయాన్ని పాలకులు విస్మరించారు. పౌరులు ప్రధానంగా ప్రభుత్వాల నుంచే సమాచారం రాబట్టాలని కోరుకుంటారు. ఆ ప్రభుత్వమే రకరకాల ప్రయత్నాలతో దానికి అడ్డుపుల్లలు వేయ దల్చుకుంటే ఇక ఆ చట్టం ఉండి ప్రయోజనమేమిటి? ఆర్టీఐ తీసుకొచ్చిన ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగే తర్వాత కాలంలో దాన్ని ‘మితిమీరి’ వినియోగిస్తున్నారంటూ మండిపడ్డారు. పార్టీలకు అతీతంగా పాలకులందరిదీ ఇదే బాణీ. పాలనలో పారదర్శకత కోసం, ప్రభుత్వాలకు జవాబుదారీతనం పెంచటం కోసం వచ్చిన చట్టం హద్దులు దాటుతున్నదని పాలకులతోపాటు ఉన్నతాధికార గణం కూడా విశ్వసిస్తోంది. ఆర్టీఐని వమ్ము చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కనుకనే సమాచారం కోరినవారి ఆనుపానులు క్షణాల్లో అవతలివారికి వెళ్తున్నాయి. సమాచార హక్కు ఉద్యమకారుల ప్రాణాలు గాల్లో దీపాలవుతున్నాయి. ఇప్పటివరకూ వందమందికి పైగా కార్యకర్తలను దుండగులు హత్యచేశారు. ఈ ఏడాది మొదట్లో ఎలక్టోరల్ బాండ్స్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పౌరుల సమాచార హక్కు ప్రాధాన్యతనూ, ప్రజాస్వామ్యంలో అది పోషించే కీలకపాత్రనూ తెలియజెప్పింది. రాజ్యాంగదత్తమైన ప్రాథమిక హక్కుల్లో దాన్నొకటిగా గుర్తించింది. ఏదైనా చట్టం వచ్చిన ప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వారున్నట్టే దుర్వినియోగం చేద్దామనీ, స్వప్రయోజనాలు సాధించు కుందామనీ ప్రయత్నించేవారు ఉంటారు. అంతమాత్రంచేత ఆ చట్టాన్ని నీరుగార్చ కూడదు. కార్గిల్ అమర జవాన్ల కుటుంబాలకు ఉద్దేశించిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలోకి రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు చొరబడి ఫ్లాట్లు కొట్టేసిన వైనం ఆర్టీఐ చట్టం లేకపోయివుంటే బయటి కొచ్చేదే కాదు. అలాగే మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం, పశ్చిమ బెంగాల్లో టీచర్ రిక్రూట్ మెంట్ల అక్రమాలు ఎప్పటికీ వెలుగుచూసేవి కాదు. వ్యక్తులుగా ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే శిక్షించే విధంగా నిబంధనలు తెస్తే తప్పులేదు. కానీ ఆ సాకుతో మొత్తం చట్టాన్నే నీరుగార్చాలని చూడటం, దేశ భద్రత పేరు చెప్పి అందరినీ బెదరగొట్టడం ప్రమాదకరమైన పోకడ. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యాన్నీ, జవాబుదారీతనాన్నీ దెబ్బతీస్తాయి. నిరంకుశత్వానికి బాటలు పరుస్తాయి. -
సస్పెన్స్... థ్రిల్
అజయ్, రవిప్రకాశ్, హర్షిణి, మాండవియా సెజల్, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను నటించిన చిత్రం ‘కేస్ నం. 15’. తడకల వంకర్ రాజేశ్ స్వీయ దర్శకత్వంలో బీజీ వెంచర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది.ఈ సందర్భంగా తడకల వంకర్ రాజేశ్ మాట్లాడుతూ– ‘‘సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘కేస్ నం.15’. అజయ్ మంచి పాత్ర చేశారు. ఆయనకు మంచి పేరు వస్తుంది. రవిప్రకాశ్ పోలీసాఫీసర్ పాత్ర చేశారు. ఈ చిత్రంలోని సన్నివేశాలు ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తాయి’’ అన్నారు. -
Indrani Trailer: విజువల్ వండర్లా ‘ఇంద్రాణి’
యానీయా, అంకిత, అజయ్ ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్.'ఇండియన్ సూపర్ ఫోర్స్' గురించి పవర్ ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ప్రారంభమైన ఈ ట్రైలర్.. అద్భుతమైన విజువల్స్ తో ఆద్యంతం అద్భుతంగా సాగింది. ట్రైలర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే 'ఇంద్రాణి' ఓ విజువల్ వండర్. దర్శకుడు స్టీఫెన్ పల్లం ఈ సినిమా కోసం క్రియేట్ చేసిన ఫ్యూచరిస్టిక్ వరల్డ్ మెస్మరైజింగా వుంది. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ హాలీవుడ్ స్థాయిలో ఉంటూ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఆకట్టుకున్నాయి. యానీయా, అంకిత, అజయ్, కబీర్ సింగ్ ఇలా మెయిన్ క్యారెక్టర్స్ అన్నీ సూపర్ పవర్స్ తో అలరించాయి. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ .. ఇవన్నీ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తానికి ట్రైలర్ సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ స్టీఫెన్ పల్లం మాట్లాడుతూ..'ఇంద్రాణి' ఒక ఎపిక్ లాంటి సినిమా. చాలా అద్భుతమైన కంటెంట్ వుంది ఇందులో. టాప్ క్లాస్ వీఎఫ్ఎక్స్ వర్క్ ప్రేక్షులని అలరిస్తుంది. ఇందులో లీడ్ రోల్ తో పాటు ఒక రోబోని కూడా క్రియేట్ చేశాం. ఆ ఇద్దరి జర్నీ చాలా అద్భుతంగా వుంటుంది. ఇందులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ కూడా ఉంది. వందేళ్ళ తర్వాత ఎలాంటి టెక్నాలజీ వుండబోతుందో ఇందులో చూపించడం జరిగింది. వందేళ్ళ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఎలాంటి పాత్ర పోషిస్తుందో ఇందులో సరికొత్తగా చూపించడం జరిగింది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. -
లోక్‌సభ ఎన్నికల బరిలో సమోసా బాబా
ఛత్తీస్‌గఢ్‌లో పలు దుకాణాలకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయించే అజయ్ పాలి అలియాస్ సమోసా బాబా లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. కవర్ధా జిల్లాకు చెందిన సమోసా బాబా.. రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ ఫారమ్‌ను కొనుగోలు చేశారు. కవర్ధా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఫుట్‌పాత్‌పై ఈ సమోసా బాబా 20 ఏళ్లుగా దుకాణం నిర్వహిస్తున్నారు. నగరంలోని జనం అజయ్పాలిని సమోసా బాబా అని పిలుస్తుంటారు. మొదట్లో ఒక సమోసా 50 పైసలకు విక్రయించే ఈయన ఇప్పుడు నగరంలోని పలు హోటళ్లకు తక్కువ ధరకు హోల్‌సేల్‌గా సమోసాలను విక్రయిస్తున్నారు. ప్రస్తుతం రూ. 5కు ఒక సమోసా విక్రయించే అతని దుకాణం ముందు జనం క్యూ కడుతుంటారు. ఈ సమోసా బాబా ఇప్పటివరకు 12కి పైగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో కౌన్సిలర్, ఎంపీ వరకు జరిగిన పలు ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇప్పుడు రాజ్‌నంద్‌గావ్ లోక్‌సభ నుంచి నాలుగోసారి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడి జనం బీజేపీ, కాంగ్రెస్‌ల పాలనను చూసి విసిగిపోయారని, ఇప్పుడు తనకు అవకాశం కల్పిస్తారని సమోసా బాబా చెబుతున్నారు. బడా నేతలు ప్రజా సమస్యలు పట్టించుకోరని సమోసా బాబా ఆరోపిస్తున్నారు. తనను ఇక్కడి జనం గెలిపిస్తే, తనకు వచ్చే ఎంపీ జీతాన్ని ప్రజా సేవకు ఖర్చు చేస్తానన్నారు. అజయ్ పాలీ 2008 నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మూడుసార్లు అసెంబ్లీ ఎన్నికలు, మునిసిపాలిటీ అధ్యక్ష, కౌన్సిలర్ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో సమోసా బాబా పోటీ చేశారు. తాజాగా ఆయన రూ. 25 వేలు వెచ్చించి లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ఫారం కొనుగోలు చేశారు. ఎన్నికల ఫలితాల గురించి పట్టించుకోకుండా సమోసా బాబా పోటీ చేస్తూ వస్తున్నారు. -
బోర్డ్ ఎగ్జామ్స్ కూడా రాయలేదు..కానీ ఏకంగా రూ. 41 కోట్లు..!
ఓ యువకుడు ఉన్నత చదువలు చదవకపోయినా కోట్లు సంపాదించి ఆశ్చర్యపరుస్తున్నాడు. డబ్బు సంపాదించగల సత్తువ ఉంటే అకడమిక్ చదువులతో పనిలేదని ఈ వ్యక్తి ప్రూవ్ చేసి చూపించాడు. మన వద్ద మంచి టాలెంట్ ఉంటే దానికే పదును పెడితే కోట్టు వచ్చి పడతాయని చెప్పకనే చెప్పాడు ఈ కుర్రాడు. ఎలా అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదిస్తున్నాడంటే.. ఫరిదాబాద్కి చెందిన అజయ్ నగార్ Aka (ఆల్సో నోన్ యాజ్ ) కైరీమినాటీ.. తన పీర్స్‌లో bae (బిఫోర్ ఎనివన్ ఎల్స్) కెరీర్ స్టార్ట్ చేశాడు. కేవలం పదేళ్ల వయసులోనే! STeaLThFeArzZ అనే యూట్యూబ్ అకౌంట్లో వీడియోలు పోస్ట్ చేస్తూ.. తన మెయిన్ యూట్యూబ్ చానెల్ అడిక్టిడ్ ఏ1కి మాత్రం 2014లో లాగిన్ అయ్యాడు. అలా వీడియో గేమ్ క్లిప్స్.. రియాక్షన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ! గతేడాది ఆగస్ట్ కల్లా 40 మిలియన్ సబ్‌స్క్రైబర్స్‌ని సంపాదించుకున్నాడు. తన అన్న యశ్ నగార్‌తో కలసి మ్యూజిక్ ఆల్బమ్స్కీ పనిచేస్తున్నాడు. అజయ్ నగార్ నెలకు 25 లక్షలు సంపాదిస్తున్నాడని, నెట్ వర్త్ దాదాపు 41కోట్లు ఉండొచ్చని పాపులర్ న్యూస్ సైట్ల అంచనా. హరియాణాలోని ఫరిదాబాద్కి చెందిన ఈ అబ్బాయి ఫెయిల్ అవుతానేమో అనే భయంతో ట్వల్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేదట. కానీ లైఫ్‌లో మాత్రం పాస్ అయ్యాడు కదా అని ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు. ఆ ఫాలోయింగే అజయ్‌ని 2020లో ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా లిస్ట్‌లోకి చేర్చింది. అపార్ట్ ఫ్రమ్ అకడమిక్స్ సమ్ అదర్ టాలెంట్ ఆల్సో ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశాడు కదా అజయ్ నగార్! (చదవండి: ఇదేం అడవి? రాళ్లు మొలవడం ఏంటీ..?) -
విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయాలని పలు కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా చెప్పారు. విభజన చట్టం 13వ షెడ్యూల్లో పేర్కొన్న అంశాల అమలు పురోగతిపై అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత కేంద్ర శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అజయ్ భల్లా మాట్లాడుతూ.. 13వ షెడ్యూల్లోని అంశాల అమలులో ఏమైనా మినహాయింపులు అవసరమైతే కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని చెప్పారు. పోర్టులు లాంటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశా నిర్దేశం చేసిన అంశాలను ఈ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. వాటిని త్వరగా అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కోరినవివీ.. విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పీపీపీ విధానంలో చేపడతామని, ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 40 శాతం గ్రాంట్‌గా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేయాలని, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని చెప్పింది. విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర సాయం తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించింది. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా్ల సానుకూలంగా స్పందించారు. -
సందేశంతో హెచ్చరిక
అఖిల్ సన్నీ, అజయ్ ఘోష్, సంజయ్ నాయర్, గిడ్డేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీసు వారి హెచ్చరిక’. బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్ధన్ నిర్మిస్తున్నారు. ‘‘సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో చిక్కు కుని అనాథలు నేరస్థులుగా మారే ప్రమాదం ఉందనే సందేశానికి కమర్షియల్ హంగులు మేళవించి ఈ సినిమా తీస్తున్నాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, రెండు ఫైట్స్‌ను చిత్రీకరించాం. డిసెంబరు కల్లా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
మార్పు కోసం..
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జనం’. వెంకటరమణ పసుపులేటి స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ అవుతున్న సందర్భంగా వెంకటరమణ పసుపులేటి మాట్లాడుతూ– ‘‘ప్రజలకు మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చే నాయకులు తప్పుదారి పట్టిన ప్రజల ఓట్ల కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నారు? అనే నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది’’ అన్నారు. -
ప్రజల్లో మార్పు కోసం వస్తోన్న 'జనం'!
సుమన్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న చిత్రం జనం. వెంకటరమణ పసుపులేటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా నవంబర్ 10న ప్రపంచం వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. కథ విషయానికొస్తే ప్రతీ తల్లి తన బిడ్డను గొప్ప లక్షణాలతో, ఉన్నత విలువలతో పెంచాలనుకుంటుంది. కానీ ఎలక్షన్స్‌లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం, మతం, ప్రాంతం, డబ్బు లాంటి ప్రలోభాలకు లోబడి తప్పు దారిలో వెళ్లేలా చేస్తుంది. ప్రజలకు ఎంతో మంచి చెయ్యాలనే రాజకీయాల్లోకి వచ్చే ప్రతీ నాయకుడు.. ప్రజల ఓట్ల కోసం, ఎలక్షన్స్‌లో గెలవడం కోసం ఎలా తప్పు దారి పడుతున్నాడన్న దానిపైనే ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కిషోర్, వెంకట రమణ, ప్రగ్య నయన్, మౌనిక, లక్కీ, జయవాని, రషీదా తదితరులు కీలక పాత్రల్లో నటించారు. -
ఓ యువకుడు పండుగ సెలవులకి వచ్చి.. ఒక్కసారిగా ఇలా..!
సాక్షి, వరంగల్: విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా నర్మెట మండలంలోని గండిరామారంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నీల రాజు కుమారుడు నీల అజయ్ (17) హనుమకొండ కృష్ణవేణి కళాశాలలో ఇంటర్ మీడియట్ చదువుతున్నాడు. పండుగ సెలవులు కావడంతో గురువారం గ్రామానికి చేరుకున్నాడు. ఈక్రమంలో తమ వ్యవసాయ బావివద్ద పంటచేనులోకి వచ్చిన కోతులను వెళ్లగొట్టే క్రమంలో పక్కపొలంలోని రైతు అడవిపందుల నుంచి రక్షణకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగలడంతో విద్యుదాఘాతానికిగురై మృతిచెందాడు. కాగా ఈ విషయమై ఎస్సై కన్నెబోయిన శ్రీకాంత్‌ను వివరణ కోరగా ఫిర్యాదు అందలేదని ఆయన తెలిపారు. -
యూట్యూబ్ ఛానల్‌తో కోటీశ్వరుడు అయ్యాడు, అలాంటి వీడియోలతొ..
‘అసాధ్యం’ అనే మాటలో కొందరు ‘అ’ అనే అక్షరాన్ని ఎప్పటికీ పట్టించుకోరు. అజయ్ అక్షరాలా అలాంటి కుర్రాడే. ‘మనం అనుకోవాలేగానీ సాధ్యం కానిది అంటూ ఏముంది’ అనేది అతడి నమ్మకం. అంతులేని బలం. చిన్న వయసులోనే యూట్యూబ్ ప్రపంచంలోకి వచ్చాడు హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అజయ్ నాగర్. ఇరవై ఏళ్లు దాటే లోపే వైరల్ యూట్యూబ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్ అయ్యాడు. చిన్నప్పుడు ఫుట్‌బాల్ ట్యుటోరియల్ వీడియోలు చూస్తూ వాటి నుంచి స్ఫూర్తి పొంది యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు అజయ్. ‘అడిక్టెడ్’ పేరుతో ఉన్న అతడి యూట్యూబ్ చానల్ ఆ తరువాత ‘క్యారీ డియోల్’గా పేరు మార్చుకుంది. కొత్త పేరే కాదు...కొత్త కంటెంట్ వచ్చింది. గేమ్‌ప్లే ఫుటేజిని అప్లోడ్ చేయడం నుంచి హీరో సన్నీ డియోల్‌ను అనుకరించడం వరకు ఎన్నో చేశాడు. అజయ్ వీడియో ‘యూట్యూబ్ వర్సెస్ టిక్ టాక్: ది ఎండ్’ ఆరు రోజుల్లోనే 72.2 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్ సృష్టించింది. అజయ్ ఫాలోవర్స్ ఒక రేంజ్‌కు చేరుకునే సమయానికి చానల్ పేరు ‘క్యారీమినటీ’గా మారింది. ‘ఇంతకీ క్యారీమినటీ అంటే?’ అని అడిగితే ‘నాకు కూడా తెలియదు. ఇట్ జస్ట్ సౌండ్స్ కూల్ అని అలా డిసైడైపోయాను’ నవ్వుతూ అంటాడు అజయ్. ఒక వీడియో హిట్ అయిన తరువాత సంతోషం మాటేమిటోగానీ దాని ప్రభావం చేయబోయే వీడియో మీద పడుతుంది. ‘గత వీడియోను మించి వ్యూస్ రావాలి’ అనుకునే సమయంలో ఒత్తిడి వచ్చి తల మీద కూర్చుంటుంది. దాన్ని కిందికి దించడం కష్టమైన పని. మరి ఈ సమస్యను అజయ్ ఎలా ఎదుర్కొన్నాడు? అతడి మాటల్లోనే... ‘వీడియోలు చేస్తుప్పుడు ఒత్తిడికి గురవుతుంటారా? అని నన్ను చాలామంది అడిగే వాళ్లు. ఒత్తిడి ఏమిటి! అని ఆశ్చర్యపడేవాడిని. అయితే అది ఒకప్పటి సంగతి. ఆ తరువాత నాలో కూడా మెల్లగా ఒత్తిడి మొదలైంది. ఎన్నో లక్షల మంది నా వీడియోలు చూస్తున్నారు. చాలా జాగ్రత్తగా చేయాలి. నెగెటివ్ కామెంట్స్ రావద్దు...అని ఒకటికి పదిసార్లు అనుకోవడం వల్ల విపరీతమైన ఒత్తిడికి గురయ్యేవాడిని. అయితే చివరి సమయంలో మాత్రం ఏదైతే అది అవుతుంది అనుకొని నా మనసుకు నచ్చినట్లు చేసేవాడిని. నా అంచనా ఎప్పుడూ తప్పలేదు’ఎవరి పిల్లలు వారికి ముద్దు అన్నట్లు ఎవరు చేసిన వీడియోలు వారికి మురిపెంగానే ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తన వీడియోలను యూట్యూబ్‌లోకి వదిలే ముందు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకుంటాడు. బయటి ప్రేక్షకుడు ఎవరో చూస్తున్నట్లుగా తన వీడియోను చూస్తాడు.జీవితం పర్సనల్ లైఫ్,ప్రొఫెషనల్ లైఫ్ అని రెండు ప్రపంచాలుగా విడిపోయిన కాలంలో ఉన్నాం మనం. ప్రొఫెషనల్ లైఫ్‌లోనే అజయ్ ఎక్కువ కాలం గడపడం వల్ల కాలేజీ, యూనివర్శిటీలలో చదువుకునే అవకాశం రాలేదు. ఫ్రెండ్స్‌తో సరదాలు లేవు. వినోదాలు లేవు. అయితే అజేయపథంలో దూసుకుపోతున్న అజయ్ నాగర్‌కు వాటి గురించి గుర్తు రావడం అరుదే. ‘అజయ్ నాగర్, క్యారీమినటీ ఇద్దరు మంచి స్నేహితులు. ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి బెస్ట్ ఫ్రెండ్ లేడు అనే బాధ నాకు లేదు’ అంటాడు అజయ్.‘చాలా కష్టసమయంలో మీ వీడియో ఒకటి చూశాను. ఉత్సాహం పుంజుకోవడానికి అది నాకు ఔషధంలా పనిచేసింది’ ఇలాంటి ఈమెయిల్స్ అజయ్‌కు వస్తుంటాయి. వాటిని చదివినప్పుడల్లా తన బలం రెట్టింపు కావడంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది.హార్డ్‌వర్క్, టాలెంట్‌తో అయిదు యూట్యూబ్ అవార్డ్‌లతో పాటు అజయ్ ఎన్నో అవార్డ్లు అందుకున్నాడు. ఆర్థిక కోణంలో కోటీశ్వరుడు అయ్యాడు. ఔత్సాహిక యూట్యూబర్లకు రోల్‌మోడల్‌గా మారాడు. -
ఆపరేషన్ అజయ్: భారత్ చేరిన ఐదో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు చేపట్టిన ఆపరేషన్ అజయ్ నిర్విరామంగా కొనసాగుతోంది. తాజాగా 286 మందితో కూడిన మరో విమానం భారత్ చేరుకుంది. ఇందులో 18 మంది నేపాలీలు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భారత్ తిరిగి వచ్చిన వారు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలను కూడా షేర్ చేశారు. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి A340 విమానం ఆదివారం టెల్ అవీవ్ నగరానికి చేరుకోగానే సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లి సమస్యను పరిష్కరించారు. ఫలితంగా సోమవారం రావాల్సిన విమానం మంగళవారం 286 మందితో ఢిల్లీ చేరుకుంది. ఇందులో 22 మంది కేరళ వాసులు ఉన్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వల్ల ఇటు ఇజ్రాయెల్, అటు పాలస్తీనాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధంతో అంతర్జాతీయ విమాన రాకపోకలు కూడా బంద్ అయ్యాయి. దీంతో స్వదేశానికి భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి కేంద్రం ఆపరేషన్ అజయ్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇప్పటికే నాలుగు విమానాల్లో సుమారు 900పైగా మందిని భారత్‌కు తరలించారు. తాజాగా ఐదో విమానం చేరుకుంది. ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి -
ఇంద్రజ హీరోయిన్గా కొత్త సినిమా.. ఆసక్తిగా టైటిల్!
అజయ్, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం సీఎం పెళ్లాం(కామన్ మ్యాన్ పెళ్లాం). వాకాడ అప్పారావు సమర్పణలో ఆర్కే సినిమాస్ బ్యానర్‌పై బొల్లా రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రమణారెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ నెలాఖరు వరకు ఈ సినిమా మొదటి షెడ్యూల్ జరగనుందని మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నగేష్, కోటేశ్వర రావు, సురేశ్ కొండేటి, భరత్, ప్రీతి నిగం, రూపాలక్ష్మి, ప్రజ్ఞ, శాంతి, దాసరి చలపతి రావు, బేబీ హర్షిత, సత్యనారాయణ మూర్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ..'ఇది వెరైటీ సినిమా అని కానీ చూశాక ప్రేక్షకులే చెబుతారు. డిఫరెంట్ యాంగిల్‌తో పాటు పొలిటికల్ పాయింట్స్ నేపథ్యంలో ఉంటుంది. నిజంగా పదేళ్ల తర్వాత రాజకీయాలు ఎలా ఉంటాయి? ఎలా ఉండబోతున్నాయి? అనే భిన్నమైన కోణంలో ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాం.'అని అన్నారు. -
ఆపరేషన్ అజయ్: ఒకే రోజు భారత్‌కు చేరిన రెండు విమానాలు
ఢిల్లీ: ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఓ రోజు రెండు విమానాలు భారత్ చేరాయి. 197 మందితో మూడో విమానం, 274 మందితో నాలుగో విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన భారతీయులకు జాతీయ జెండాలు ఇచ్చి కేంద్ర మంత్రి కౌషల్ కిషోర్ స్వదేశానికి స్వాగతం పలికారు. యుద్ధంతో సంక్షోభంలో ఉన్న ప్రాంతం నుంచి స్వదేశానికి తీసుకువచ్చినందుకు బాధితులు కేంద్ర ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ఆపరేషన్ అజయ్ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి, రెండో విమానంలో 212, 235 మందిని వరుసగా ఇండియాకి తరలించారు. నాలుగో విమానం 274 మందితో టెక్ అవీవ్ నుంచి శనివారం రాత్రి 11:45కి ఇప్పటికే బయలుదేరింది. ఇప్పటివరకు దాదాపు 918 మందిని భారత్‌కి తరలించారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులకు ఇజ్రాయెల్ దళాలు హెచ్చరికలు జారీ చేశాయి. హమాస్ దళాలపై భూతల, వాయు, జల మార్గాల్లో దాడులు చేస్తున్నారు. ఇళ్లలో, సొరంగాల్లో నక్కిన హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై పట్టు వీడకుండా పోరాడుతున్నాయి. ఈ యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3500 మంది ఇప్పటికే మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 పైగా పౌరులు మరణించగా.. పాలస్తీనాలో 2000కు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సర్వీసులు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఇదీ చదవండి: 235 మందితో రెండో విమానం రాక -
235 మందితో రెండో విమానం రాక
న్యూఢిల్లీ: సంక్షుభిత ఇజ్రాయెల్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ‘ఆపరేషన్ అజయ్’ పేరిట భారత సర్కార్ మొదలుపెట్టిన పౌరుల తరలింపు కార్యక్రమంలో భాగంగా శనివారం 235 మందితో ఇజ్రాయెల్ నుంచి బయల్దేరిన విమానం భారత్‌కు చేరుకుంది. ఢిల్లీకి ఈ విమానం చేరుకుందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్ బాగ్చీ శనివారం వెల్లడించారు. ఢిల్లీ విమానాశ్రయంలో పౌరులు చేరుకున్న ఫొటోలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో షేర్ చేశారు. టెల్ అవీవ్ నగరం నుంచి తొలి విమానం వచి్చన సంగతి తెల్సిందే. ఎయిర్ఇండియా ఆధ్వర్యంలో జరిగిన ఆ ఆపరేషన్ కింద తొలి విమానంలో 200కుపైగా భారతీయులు స్వదేశానికి రాగలిగారు. వీరికి విదేశాంగ శాఖ సహాయ మంత్రి రాజ్‌కుమార్ రంజన్ సింగ్ స్వాగతం పలికారు. ‘ మోదీ సర్కార్ తక్షణం స్పందించి తమ పౌరులను స్వదేశానికి తీసుకురావడం పట్ల వీరంతా సంతోషంగా ఉన్నారు’ అని మంత్రి ట్వీట్‌చేశారు. దీంతో శనివారంనాటికి మొత్తంగా 400కుపైగా భారత్‌కు చేరుకున్నారు. మరో రెండు విమానాలూ వస్తున్నాయ్ టెల్ అవీవ్ స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఐదింటికి, రాత్రి 11 గంటలకు మరో రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కు బయల్దేరతాయని టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ తెలిపింది. సాయంత్రం విమానంలో 230కిపైగా, రాత్రి విమానంలో 330కిపైగా ప్రయాణికులు స్వదేశానికి రానున్నారు. బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ నుంచి ఇవి బయల్దేరతాయి. సంబంధిత వివరాలను ఎంబసీ ట్వీట్‌చేసింది. విద్యార్థులు, ఐటీ వృత్తినిపుణులు, వజ్రాల వ్యాపారులు సహా పలు రంగాలకు చెందిన దాదాపు 18,000 మంది భారతీయపౌరులు ఇజ్రాయెల్‌లో ఉంటున్న విషయం తెల్సిందే. తీసుకొచ్చేందుకు వెళ్తున్నాయ్ భారత్ నుంచి చెరో విమానాన్ని ఇజ్రాయెల్‌కు నడపనున్నట్లు ఎయిర్ఇండియా, స్పైస్‌జెట్ విమానయాన సంస్థలు శనివారం ప్రకటించాయి. టెల్‌అవీవ్‌కు వెళ్లి అక్కడి భారతీయులను తీసుకొస్తామని సంస్థలు పేర్కొన్నాయి. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ఈ రెండు సరీ్వస్‌లు నడవనున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ఇండియా విమానం, అమృత్సర్ నుంచి స్పైస్‌జెట్ విమానం బయల్దేరతాయి. ఆదివారంకల్లా రెండూ ఢిల్లీకి వస్తాయి. -
ఆపరేషన్ అజయ్: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి భారతీయులను తీసుకురావడానికి ఉద్దేశించిన ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రెండో విమానం 235 మందితో ఢిల్లీ చేరుకుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా 212 మంది భారతీయులతో శుక్రవారమే మొదటి విమానం చేరుకున్న విషయం తెలిసిందే. సొంత ఖర్చులతో కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై బాధితులు ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా మొదటగా రిజస్టర్ చేసుకున్నవారిని స్వదేశానికి తీసుకువస్తున్నారు. రెండో విమానం రాత్రి 11.02కు ఢిల్లీ చేరుకుంది. ఆదివారం కూడా ఆపరేషన్ అజయ్ కార్యక్రమం కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇండియన్ ఎంబసీలో రిజస్టర్ చేసుకున్నవారికి నేడు ఈమెయిల్స్ ద్వారా సమాచారం అందించారు. నేడు కూడా మరో విమానం భారత్ చేరనుంది. ఇజ్రాయెల్ నుంచి భారతీయులను వెనక్కి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం 18,000 మంది భారతీయులు ఉన్నట్లు అంచనా. వెస్ట్‌బ్యాంకు, గాజాలోనూ కొందరు భారతీయులు నివసిస్తున్నారు. ఇజ్రాయెల్-హమాస్ మధ్య గత శనివారం ప్రారంభమైన యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇరుపక్షాల వైపు రాకెట్ దాడులు, బాంబుల మోతలతో మారణోమాన్ని సృష్టిస్తున్నారు. ఇరుదేశాల్లో కలిపి దాదాపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1300 మంది మరణించగా.. పాలస్తీనాలో 1900 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజాను ఖాలీ చేయాలని ఇజ్రాయెల్ దళాలు ఆదేశాలు జారీ చేశాయి. వరుసదాడులతో ఇరుపక్షాలు చెలరేగిపోతున్నాయి. ఇదీ చదవండి: 212 మంది భారతీయుల తరలింపు -
భూ రికార్డుల డిజిటలైజేషన్లో ఏపీ ఆదర్శం
సాక్షి, విశాఖపట్నం: భూ సంబంధిత వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు అద్భుతంగా ఉన్నాయని, ఇతర రాష్ట్రాలకు ఆదర్శమని కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ టిర్కీ, సంయుక్త కార్యదర్శి సోన్మోని బోరా ప్రశంసించారు. డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డుల మోడ్రనైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన విశాఖలోని ఓ హోటల్లో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలలో ప్రస్తుతం అమలు చేస్తున్న భూ విధానాలు, రికార్డుల నవీకరణ, ఇతర ప్రక్రియల గురించి ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు వివరించారు. దేశమంతటికీ ఒకే వేదికగా మాతృభూమి పేరుతో పైలట్ జియో పోర్టల్‌ను ఆవిష్కరించారు. అజయ్ టిర్కీ మాట్లాడుతూ సాంకేతికత సహకారంతో భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అన్ని రాష్ట్రాలు భూ రికార్డులను నవీకరించి మాతృభూమి పోర్టల్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల భూ రికార్డులను నవీకరించాలని, రాజ్యాంగంలో గుర్తించిన అన్ని భాషల్లోకి అనువదించాలని సూచించారు. ఇటీవల ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్‌తోపాటు అర్హత కలిగిన కొన్ని రాష్ట్రాలకు, జిల్లాలకు భూమి సమ్మాన్ ప్లాటినం సర్టిఫికెట్లను అందజేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రదర్శించిన ప్రజంటేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానాలను పలుమార్లు ప్రశంసించారు. ప్రధానంగా జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా చేపడుతున్న రీ సర్వే వల్ల భవిష్యత్తులో బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని టిర్కీ పేర్కొన్నారు. రీ సర్వే, ల్యాండ్ రికార్డుల నవీకరణ, మోడరన్ రికార్డు రూముల నిర్వహణ, భూ సంబంధిత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని ప్రకటించారు. సోన్మోని బోరా మాట్లాడుతూ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ ప్రాజెక్టుల్లో భాగంగా భూ సంవాద్–6 ప్రాజెక్టు విజయవంతమయ్యేలా అందరూ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న భూ సంబంధిత విధానాల గురించి ఏపీ సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగం కమిషనర్ సిద్ధార్థ జైన్, జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం గురించి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లఠ్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి, భూ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతా«దికారులు, ఎన్ఐసీ, ఐటీ టీం అధికారులు, విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, జాయింట్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
ఆపరేషన్ అజయ్: ఇజ్రాయెల్ నుంచి భారత్ చేరిన మొదటి విమానం
ఢిల్లీ: ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఆపరేషన్ అజయ్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 212 మందితో కూడిన మొదటి ఛార్టర్ ఫ్లైట్ ఢిల్లీకి చేరింది. స్వదేశానికి సురక్షితంగా చేరుకున్న భారతీయులను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. యుద్ధంతో అల్లకల్లోలంగా ఉన్న ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీకి బాధితులు ధన్వవాదాలు తెలిపారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్దం నేపథ్యంలో ఎయిర్ ఇండియా రాకపోకలను అక్టోబర్ 7నే రద్దు చేసింది. ఈ నేపథ్యంలో భారతీయులు అక్కడే చిక్కుకుపోయారు. ఆపరేషన్ అజయ్‌లో భాగంగా ప్రస్తుతం కేంద్రం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానాలలో భారతీయులను స్వదేశానికి తీసుకువస్తోంది. Welcome to the homeland! 1st #OperationAjay flight carrying 212 citizens touches down in New Delhi. pic.twitter.com/FOQK2tvPrR — Arindam Bagchi (@MEAIndia) October 13, 2023 ఇజ్రాయెల్‌లోని పౌరుల కోసం భారత్ చర్యలు ఇజ్రాయెల్ దేశంలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్నారు. దాదాపు 18000 మంది ఇజ్రాయెల్‌లో ఉన్నట్లు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ‘ఆపరేషన్ అజయ్’పేరుతో దేశ పౌరుల తరలింపు ప్రక్రియను గురువారం ప్రారంభించింది. ఆపరేషన్ అజయ్ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ‘ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు’ బుధవారం ట్విటర్లో ప్రకటించారు. భారతీయులు సురక్షితంగా దేశానికి తిరిగి రావడానికి ప్రత్యేక చార్టర్ విమానాలు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు పేర్కొన్నారు. విదేశాల్లోని తమ పౌరుల భద్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని కేంద్రమంత్రి తెలిపారు. పశ్చిమాసియాలో మారణహోమం.. ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్ట దిగ్బంధం చేసిన ఇజ్రాయెల్.. వైమానిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడుతోంది. ఇటు హమాస్‌కూడా ఇజ్రాయెల్ సైన్యంపై రాకెట్లతో ఎదురుదాడికి దిగుతోంది. హమాస్‌కు బెబనాన్, సిరియాలు చేతులు కలపడంతో ఇజ్రాయెల్ మూడు వైపుల నుంచి దాడులను ఎదుర్కొంటోంది. ఈ ప్రతీకార పోరులో ఇరువైపులా 2800 మంది మృత్యువాతపడ్డారు. ఇజ్రాయెల్‌లో 1,300, గాజాలో 1,355 మందికిపైగా బలయ్యారు. ఇదీ చదవండి: ఇజ్రాయెల్-గాజా యుద్ధం.. రంగంలోకి భారత్, ‘ఆపరేషన్ అజయ్’ ప్రారంభం -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్..!
కరీంనగర్: రాత్రి సమయంలో బైక్ స్పీడ్ బ్రేకర్ పైనుంచి వెళ్లడంతో ఓ యువకుడు ఎగిరి బండరాయిపై పడి, అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. చిగురుమామిడి మండలంలోని నవాబుపేట్‌కు చెందిన బోయిని అజయ్(27) శుక్రవారం ద్విచక్రవాహనంపై హుస్నాబాద్ వెళ్లాడు. రాత్రి 9.30 గంటల సమయంలో స్వగ్రామం వస్తున్నాడు. గ్రామ క్రాసింగ్ వద్ద స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా వెళ్లడంతో ఎగిరి బండరాయిపై పడ్డాడు. అతని తలకు తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనే ప్రాణాలు వదిలాడు. మృతుడికి తల్లి అనసూర్య, తండ్రి లక్ష్మయ్య, ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. అక్కకు వివాహం చేశారు. అజయ్ అవివాహితుడు కాగా హుస్నాబాద్‌లోని ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. -
వినూత్న కథాంశంతో తెరకెక్కిస్తోన్న 'రావెన్'!
అజయ్ కార్తీక్, అంజనా జంటగా నటిస్తోన్న చిత్రం 'రావెన్'. ఈ చిత్రం ద్వారా దర్శకుడు గణేష్ కె బాబు శిష్యుడు కళ్యాణ్ కె జగన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ మూవీని ఎంజీ స్టూడియోస్ అధినేత ఏపీవీ.మారన్‌తో కలిసి సంయక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర షూటింగ్ చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో నిర్మాత కలైపులి ఎస్ ధాను ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. వినూత్న కథాంశంతో కొత్త తరానికి చెందిన కథా చిత్రంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చిత్త షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల తదితర వివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ చిత్రంలో దర్శకుడు భాగ్యరాజ్, ఈటీవీ గణేష్, వీర, హిందూమతి, పి.అరుణాచలేశ్వరన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రవి శక్తి చాయాగ్రహణం, మనం రమీశన్ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ లలిత్ కుమార్, ఫైవ్ స్టార్ కదిరేసన్, ఫైవ్ స్టార్ సెంథిల్, రాక్ ఫోర్ట్ ఎంటర్టైన్మెంట్ మురుగానందం, అరుణ్ విశ్వ, డిస్ట్రిబ్యూటర్ కోవై అరవింద్, పోర్ తొళిల్ చిత్ర దర్శకుడు విగ్నేష్ రాజా, యాత్తిశై చిత్ర దర్శకుడు ధరణి రాజేంద్రన్, గుడ్ నైట్ చిత్ర దర్శకుడు వినాయక్ చంద్రశేఖరన్ తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. #Dada fame director #GaneshKBabu has penned the story and screenplay of a film called #Raven, which went on floors today! The film features newcomer Ajay Karthik and actor Nethra 's daughter Anchana in the lead. The film is being directed by Kalyan K Jegan. Produced by :-… pic.twitter.com/wsEZyUenfM — Cineobserver (@cineobserver) August 21, 2023 -
ఎర్ర చీర చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్
శ్రీరామ్, అయ్యప్ప పి. శర్మ, అజయ్ కీలక పాత్రల్లో బేబీ డమరి సమర్పణలో రూపొందిన చిత్రం ‘ఎర్ర చీర’. సుమన్ బాబు, ఎన్వీవీ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ చిత్రం దీపావళికి నవంబర్ 9న రిలీజ్ కానుంది. సుమన్ బాబు దర్శకత్వం వహించారు. ‘‘అమ్మ సెంటిమెంట్, హారర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూ΄పొందించాం. 36 నిమిషాల గ్రాఫిక్స్, లక్షలాది మంది అఘోరాలతో తీసిన క్లైమాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి’’ అన్నారు ఎన్వీవీ సుబ్బారెడ్డి, సుమన్ బాబు. -
జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా తెలుగమ్మాయి
ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్ర అమ్మాయికి పసిడి పతకం గతంలో ఏ భారతీయ అథ్లెట్‌కు సాధ్యంకాని ఘనతను తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ సాధించింది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి జ్యోతి స్వర్ణ పతకంతో మెరిసింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్ అథ్లెటిక్స్ హై పెర్ఫార్మెన్స్ సెంటర్లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్ జేమ్స్ హీలియర్ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ తన తడాఖా చూపించింది. అంచనాలకు అనుగుణంగా రాణించిన ఈ ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకంతో మెరిసింది. ఈ క్రమంలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది. వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత పొందింది. జ్యోతితోపాటు పురుషుల 1500 మీటర్ల విభాగంలో అజయ్ కుమార్ సరోజ్... పురుషుల ట్రిపుల్ జంప్‌లో అబ్దుల్లా అబూబాకర్ పసిడి పతకాలు నెగ్గారు. బ్యాంకాక్: గత రెండేళ్లుగా జాతీయ, అంతర్జాతీయస్థాయి మీట్లలో నిలకడగా రాణిస్తున్న భారత అథ్లెట్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి జ్యోతి యర్రాజీ తన కెరీర్లోనే గొప్ప విజయాన్ని సాధించింది. ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది. 12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది. స్వర్ణం నెగ్గిన జ్యోతికి కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్, రిలయెన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ అభినందనలు తెలిపారు. ♦ పురుషుల 1500 మీటర్ల ఫైనల్ రేసును అజయ్ కుమార్ సరోజ్ 3ని:41.51 సెకన్ల లో ముగించి బంగారు పతకాన్ని సాధించా డు. ఈ పోటీల్లో అజయ్కిది మూడో పతకం. 2017లో స్వర్ణం, 2019లో రజతం గెలిచాడు. ♦ పురుషుల ట్రిపుల్ జంప్‌లో కేరళ అథ్లెట్ అబ్దుల్లా అబూబాకర్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన అబూబాకర్ ఆసియా చాంపియన్‌షిప్‌లో 16.92 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచాడు. ♦ పది క్రీడాంశాల సమాహారమైన పురుషుల డెకాథ్లాన్‌లో తేజస్విన్ శంకర్ కాంస్య పతకాన్ని గెలిచాడు. ఢిల్లీకి చెందిన తేజస్విన్ 7,527 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచాడు. మహిళల 400 మీటర్ల విభాగంలో ఐశ్వర్య మిశ్రా 53.07 సెకన్లలో గమ్యానికి చేరి కాంస్య పతకాన్ని గెలిచింది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాను. ఈ మెగా ఈవెంట్ కోసం తీవ్రంగా శ్రమించా. పూర్తి ఫిట్నెస్తో ఉన్నా. ఆసియా చాంపియన్‌షిప్‌లో నా అత్యుత్తమ సమయాన్ని నమోదు చేస్తానని ఆశించా. అయితే రేసు మొదలయ్యే సమయానికి వర్షం కురవడంతో ఇబ్బంది పడ్డా. ఐదో హర్డిల్‌లో ఆధిక్యం అందుకోగా, ఆరో హర్డిల్‌ను కూడా అలవోకగా అధిగమించాను. అయితే ఏడో హర్డిల్ దాటే సమయంలో కాస్త తడబడటంతో 13 సెకన్లలోపు రేసును ముగించలేకపోయా. జపాన్ అథ్లెట్స్ నుంచి గట్టిపోటీ ఎదురవుతుందని భావించా. పతకాల గురించి ఆలోచించకుండా సాధ్యమైనంత వేగంగా పరిగెత్తాలనే లక్ష్యంతో బరిలోకి దిగా. పలు టోర్నీలలో నేను క్రమం తప్పకుండా 13 సెకన్లలోపు సమయాన్ని నమోదు చేశా. భవిష్యత్‌లో నా సమయాన్ని మరింత మెరుగుపర్చుకొని మరిన్ని పతకాలు సాధిస్తాననే నమ్మకం ఉంది. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత సాధించినందుకు ఆనందంగా ఉంది. –జ్యోతి యర్రాజీ -
ఉత్తమ చిత్ర పురుషోత్తమన్
న్యూయార్క్‌లోని టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించిన ఆ ఆర్ట్‌వర్క్ ప్రేక్షకులను బాగా ఆట్టుకుంటుంది. సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీసుకొంటూ ‘వావ్’ అన్నారు. ప్రేక్షకులే కాదు కళావిమర్శకులు కూడా ‘బ్రహ్మాండం’ అన్నారు. ఆ ఆర్ట్‌వర్క్‌ను సృష్టించింది బెంగళూరుకు చెందిన అజయ్ పురుషోత్తమన్... బెంగళూరులోని ఒక ఎడ్వర్టైజింగ్ కంపెనీలో ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అజయ్ పురుషోత్తమన్‌కు చిన్నప్పుడు చాలామంది పిల్లలలాగే బొమ్మలు వేయడం అంటే ఇష్టం. కార్టూన్ క్యారెక్టర్లు అంటే బోలెడు ఇష్టం. తన అభిమాన క్యారెక్టర్లను గీయడంలో ప్రాక్టిస్ చేస్తుండేవాడు. ఈ ఆసక్తి స్కూల్ రోజుల నుంచి కాలేజి రోజుల వరకు వచ్చింది. 2డీ ఆర్ట్, త్రీడి ఆర్ట్‌లతో ప్రయోగాలు చేస్తుండేవాడు. తనకు తెలిసిన కథలను యానిమేషన్ మరియు త్రీడి మోడలింగ్‌లోకి తీసుకువచ్చాడు. ఎన్నో సొంత ప్రాజెక్ట్‌లు చేసేవాడు. న్యూయార్క్‌లో జరిగే ‘ఎన్ఎఫ్టీ ఎన్వైసీ’ ప్రదర్శన ‘ఎన్ఎఫ్టీ’పై ఆసక్తి, ఉత్సాహం ఉన్నవారిని ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చే వేదిక. ఈ ఉత్సవానికి అజయ్ హాజరు కానప్పటికీ అతడి చిత్రాలు ప్రదర్శించబడ్డాయి. ప్రశంసలు అందుకున్నాయి. ‘మన ఆర్ట్‌ను ప్రపంచ వేదిక మీదికి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది’ అంటాడు అజయ్. న్యూయార్క్ టైమ్స్స్కైర్ బిల్‌బోర్డ్‌పై తన ఆర్ట్‌వర్క్ ప్రదర్శించడం అజయ్ పురుషోత్తమన్‌ని ఎంతో సంతోషానికి గురిచేసింది. మొదట దీని గురించి విన్నప్పుడు ‘కలా నిజమా!’ అనుకున్నాడు. ఆ దృశ్యాన్ని కళ్లారా చూడాలనుకున్నాడు. సన్నిహితుల సహాయంతో న్యూయార్క్‌కు వెళ్లి ‘ఇంతకు మించిన ఆనందం ఏమున్నది!’ అనుకున్నాడు. గత సంవత్సరం అజయ్ మొదలుపెట్టిన ‘టాయ్ స్టోరీస్ ప్రొఫైల్’ చాలామందిని ఆకట్టుకుంది. ఈ యానిమేషన్ సిరీస్‌లో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక హిప్–హప్ పాటకు డ్యాన్స్ చేస్తాడు. ‘షోలే’ సినిమాలోని క్యారెక్టర్లు అన్నీ కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేస్తాయి! నిజజీవితంలోని ప్రముఖ వ్యక్తులు ఈ సిరీస్‌లోని క్యారెక్టర్లు. ప్రతి క్యారెక్టర్‌కు తనదైన ప్రత్యేకత ఉంటుంది. రాబోయే ప్రాజెక్ట్‌ల విషయానికి వస్తే వెబ్3, ఎన్ఎఫ్టీకి సంబంధించి ఎగై్జటింగ్ ప్రాజెక్ట్ కోసం అర్జెంటీనా ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేస్తున్నాడు. ‘ఇది సవాళ్లతో కూడిన ప్రయాణం’ అంటున్నాడు అజయ్. సాధారణ ఆర్టిస్ట్ నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న అజయ్ పురుషోత్తమన్ ఆ సవాళ్లను అధిగమించి మరింత పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. మోస్ట్ పాపులర్ నాన్–ఫంగిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లు చిత్రకళ, సంగీతం, క్రీడా ప్రపంచంలోకి వచ్చాక ఎన్నో అవకాశాలకు దారులు తెరుచుకున్నాయి. ఈ అవకాశాన్ని, ట్రెండ్‌ను అందిపుచ్చుకొని మన దేశంలోని ‘మోస్ట్ పాపులర్ ఎన్ఎఫ్టీ క్రియేటర్’లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు అజయ్ పురుషోత్తమన్. తనకు వచ్చే కంటెంట్ ఐడియాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజీ మొదలుపెట్టాడు. తనలోని సృజనకు సంబంధించి అవతలి కోణాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. తాను రూపొందించిన ఎన్ఎఫ్టీలను రకరకాల డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌పై అమ్మకం మొదలు పెట్టాడు. తన ఆర్ట్ మన దేశానికి మాత్రమే పరిమితం కావాలని అజయ్ అనుకోలేదు. ‘అక్కడ ఏం జరుగుతుంది’ అంటూ అంతర్జాతీయ ఆర్ట్‌పై దృష్టి పెట్టాడు. ట్రెండ్ ఏమిటో తెలుసుకున్నాడు. హాలివుడ్ కలెక్షన్స్‌కు శ్రీకారం చుట్టాడు. అంతర్జాతీయంగా ప్రసిద్ధులైన గాయకుల త్రీడీ బాటిల్ ఆర్ట్‌ను రూపొందించాడు. ప్రయాణాలు అంటే అజయ్‌కు ఇష్టం. ఎందుకంటే స్థానిక సంస్కృతి, సంప్రదాయలను తెలుసుకోవచ్చు. అలా తెలుసుకున్నది తన కళలోకి వచ్చి చేరుతుంది. బలాన్ని ఇస్తుంది. -
జడేజా ఐపీల్ ఫైనల్లో వాడిన బ్యాట్ ఎవరికీ ఇచ్చాడో తెలుసా..!
-
ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్
IPL 2023 Winner CSK: చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ అజయ్ మండల్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ‘సర్ జడేజా’, సీఎస్కేకు ధన్యవాదాలు చెబుతూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఇందుకు కారణమేమిటంటే.. ఐపీఎల్-2023 ఫైనల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. క్యాష్ రిచ్ లీగ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌డేకు వాయిదా పడింది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య మే 29 నాటి రిజర్వ్‌డే మ్యాచ్‌లోనూ వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. జడ్డూ మ్యాజిక్ ఈ క్రమంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టైటాన్స్ సొంత మైదానం నరేంద్ర మోదీ స్టేడియంలో 214 పరుగులు భారీ స్కోరు నమోదు చేసింది. అయితే, సీఎస్కే లక్ష్య ఛేదనకు దిగిన కాసేపటికే వర్షం మొదలుకావడం.. ఎంతకూ తెరిపినివ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు వేచి చూశారు. వరణుడు కరుణించడంతో సుమారు 12.05 గంటల ప్రాంతంలో మళ్లీ మ్యాచ్‌ను మొదలుపెట్టారు. ఈ క్రమంలో డక్‌వర్త్ లూయీస్ పద్ధతిలో చెన్నై విజయలక్ష్యాన్ని 15 ఓవర్లలో 171 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో చెన్నై బ్యాటర్లు తలా ఓ చేయి వేయగా.. ఆఖరి రెండు బంతుల్లో విజయానికి 10 పరుగులు అవసరమైన వేళ రవీంద్ర జడేజా మ్యాజిక్ చేశాడు. విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ లభిస్తే తొలి బాల్‌కు సిక్సర్ బాదిన జడ్డూ.. మలి బంతిని బౌండరీకి తరలించి చెన్నైకి చిరస్మరణీయ విజయం అందించాడు. సీఎస్కే ఐదోసారి చాంపియన్‌గా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు. మరి.. జడ్డూ విన్నింగ్ షాట్ ఆడిన బ్యాట్ బహుమతిగా లభిస్తే ఎవరైనా ఎగిరి గంతేయాల్సిందే కదా! చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించిన జడ్డూ.. ఆ బ్యాట్‌ను అజయ్ మండల్‌కు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దీంతో అజయ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు అతడు. సీఎస్కేకు థాంక్స్ ‘‘సర్ రవీంద్ర జడేజా.. ఫైనల్ మ్యాచ్‌లో ఆఖరి రెండు బంతుల్లో 10 పరుగులు అవసరమైన వేళ సర్ జడేజా చేసిన అద్భుతం మీకు గుర్తుండే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్ తర్వాత జడేజా ఆ బ్యాట్‌ను నాకు ఆశీర్వాదంగా అందించాడు. జడ్డూ భాయ్‌తో డ్రెసింగ్ రూం షేర్ చేసుకునే అవకాశమిచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు ధన్యవాదాలు’’ అంటూ అజయ్ హార్ట్ ఎమోజీలు జతచేశాడు. కాగా దేశవాళీ క్రికెట్లో ఛత్తీస్‌గఢ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న 27 ఏళ్ల అజయ్ జాదవ్ మండల్‌ను.. సీఎస్కే ఐపీఎల్-2023 మినీ వేలంలో కొనుగోలు చేసింది. ఈ లెఫ్టాండర్ ఆల్‌రౌండర్ కోసం రూ. 20 లక్షలు వెచ్చించింది. అయితే, అజయ్‌కు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. టైటిల్ విజేత అయిన జట్టులో భాగమవడంతో పాటు జడేజా అందించిన బ్యాట్ రూపంలో మంచి బహుమతి మాత్రం లభించింది. చదవండి: #MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే సీఎస్కేకు ఫైనల్లో అడ్వాంటేజ్ అంటూ ట్వీట్! నీకెందుకంత అక్కసు? మరి ముంబై అయితే.. Happy Tears 🥹#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁pic.twitter.com/jf05fszEDA — Chennai Super Kings (@ChennaiIPL) May 30, 2023 -
హత్య కేసులో ఐదుగురు నిందితుల అరెస్ట్
పెనమలూరు : కానూరు వద్ద జరిగిన చెన్నూరి అజయ్‌సాయి(22) హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ పి.జాషువా తెలిపారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. తాడిగడప వసంతనగర్‌కు చెందిన చెన్నూరి అజయ్‌సాయి అదే గ్రామానికి చెందిన బొమ్మిడి మణికంఠ, పామర్తి మణికంఠ, పుట్టి శ్రీధర్, దొంపల ప్రశాంత్, పటమటకు చెందిన కగ్గా సాయినాగార్జునలు కలిసి ఈ నెల 7వ తేదీన పటమట రాజులబజార్లో ఉన్న స్నేహితుడు సంతోష్ ఇంట్లో మద్యం పార్టీ చేసుకున్నారు. ఆ సమయంలో బొమ్మిడి మణికంఠ ఇయర్ బడ్స్ కనిపించలేదు. అజయ్‌సాయిపై అనుమానంతో కొట్టారు. ఎనికేపాడు ఇంజినీరింగ్ కాలేజీ వద్ద బడ్స్ దాచానని అజయ్‌సాయి చెప్పడంతో అదే రోజు రాత్రి అతనిని బైక్ పై అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ బడ్స్ దొరక్క పోవడంతో అజయ్‌సాయిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్‌సాయిని సాయినాగార్జున, పామర్తి మణికంఠ పటమట డొంక రోడ్డులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అజయ్‌సాయి కంకిపాడు ఫ్లైఓవర్ వద్ద ప్రమాదంలో గాయపడినట్లు వైద్యులను నమ్మించారు. అయితే అజయ్‌సాయి 8న ఆస్పత్రిలో మృతి చెందాడు. మృతి వివరాలు కంకిపాడు పోలీసులకు అందడంతో.. వారు విచారణ నిర్వహించగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పెనమలూరు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితులను సీఐ కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకున్నాయి. నిందితులపై రౌడీషీట్ కూడా తెరుస్తామని ఎస్పీ చెప్పారు. కాగా, ఇందులో వీరు గంజాయి వాడారన్న వచ్చిన వార్తలో నిజం లేదని ఎస్పీ తెలిపారు. రాజకీయ నాయకులు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. పోలీసుల విచారణ జరక్క ముందే రాజకీయ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం తగదన్నారు. జీవన్‌కుమార్‌ది ఆత్మహత్యే పెదపులిపాక గ్రామంలో కాలినగాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జమ్మలమూడి జీవన్‌కుమార్(21)ది ఆత్మహత్యేనని ఎస్పీ జాషువా తెలిపారు. తన తండ్రి సుధాకర్ తీసుకున్న లోన్‌కు సంబంధించి ఈఎంఐ నగదులో రూ.12,500ను జీవన్‌కుమార్ ఖర్చు చేయడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపంతో ఉన్న జీవన్‌కుమార్ ఈ నెల 9న గురునానక్‌కాలనీలోని రెస్టారెంట్లో మిత్రుడు శ్యామ్ బర్త్‌డే పార్టీలో పాల్గొన్నాడు. అనంతరం అదే రోజు రాత్రి యనమలకుదురు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొన్నాడు. ఈ విషయం సీసీ కెమెరాలో నమోదైంది. తొలుత జీవన్‌కుమార్‌ది హత్యగా భావించామని, డీఎస్పీ జయసూర్య విచారణలో జీవన్ కదలికల్లో ప్రతి నిమిషాన్ని విచారించి సాంకేతిక సాక్ష్యాలు సేకరించినట్టు ఎస్పీ జాషువా చెప్పారు. -
విక్రమార్కుడు తర్వాత ఇంట్లో నన్ను దారుణంగా చూశారు: అజయ్
నటుడు అజయ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆడపదడపా చిత్రాలతో సరిపెట్టుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. చదవండి: నేను అలా అనడం నచ్చలేదేమో: ఆ వివాదంపై రష్మిక స్పందన ఈ సందర్భంగా విక్రమార్కుడు తర్వాత ఇంట్లో పిల్లలు తన దగ్గరికి రాలేదని, తనని దారుణంగా చూశారని చెప్పాడు. ఈ మూవీ వచ్చి 15 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ పిల్లలు ‘విక్రమార్కుడు టిట్లు’ అనే పిలుస్తారన్నాడు. దీంతో మీ భార్య కూడా భయపడ్డారా? అని హోస్ట్ చమత్కరించగా... మనం భయపడటం తప్పిదే.. వాళ్లు భయపడేది ఉండదంటూ ఫన్నిగా సమాధానం ఇచ్చాడు. ఇక హీరోలతో ఫైట్ సీన్స్ చేసేటప్పుడు తన హైట్ వల్లు ఇబ్బంది పడేవారన్నాడు. అందుకే తన సినిమాల్లో హీరోలు హైట్ ఉండాలని కోరుకునేవాడిని అని పేర్కొన్నాడు. చదవండి: స్టార్ హీరోపై నటి తీవ్ర ఆరోపణలు.. ‘నన్ను లైంగికంగా వేధించాడు’ ఇక షూటింగ్లో ఎప్పుడైన గాయపడ్డారా? అని అడగ్గా.. ఓ సినిమా షూటింగ్లో కొద్దిలో చనిపోయేవాడినని, తృటిలో ప్రమాదం తప్పిందన్నాడు. డైరెక్టర్ అయితే తాను చనిపోయేననే అనుకున్నాడంటూ షాకింగ్ విషయం బయటపెట్టాడు. ఇక సినిమాలకు ముందు ఇంట్లో నుంచి పారిపోయి నేపాల్ వెళ్లానన్నాడు. అసలు ఎందుకు పారిపోయానో కూడా తెలియదని, అక్కడ అన్ని ప్రాంతాలు తిరిగానన్నాడు. కొద్ది రోజులకు డబ్బులు అయిపోయాయని, దీంతో టిబెట్‌లోని ఓ రెస్టారెంట్లో పని చేశానన్నాడు. అక్కడ గిన్నెలు కడిగానని, ఆ తర్వాత వచ్చిన డబ్బులతో తిరిగి ఇండియాకు వచ్చానంటూ చెప్పుకొచ్చాడు. -
అజయ్ హీరోగా క్రైమ్ థ్రిల్లర్.. మరోసారి పోలీస్‌గా..
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘చక్రవ్యూహం’. ‘ది ట్రాప్’ అన్నది ఉపశీర్షిక. చెట్కూరి మధుసూదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సహస్ర క్రియేషన్స్ బ్యానర్‌పై సావిత్రి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సందర్భంగా చెట్కూరి మధుసూదన్, సావిత్రి మాట్లాడుతూ.. ‘‘మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. హత్య కేసును ఛేదించేందుకు హీరో ఎలాంటి వ్యూహం పన్నాడన్నది ఆసక్తిగా ఉంటుంది. పోలీస్ పాత్రలో అజయ్ నటన ఆకట్టుకుంటుంది’’ అన్నారు. -
క్రైమ్ థ్రిల్లర్‌గా 'చక్రవ్యూహం'.. ఆకట్టుకుంటున్న పోస్టర్
సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత సావిత్రి నిర్మిస్తున్న చిత్రం "చక్రవ్యూహం" ది ట్రాప్. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అజయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి చెట్కూరి మధుసూధన్ దర్శకత్వం వహిస్తున్నారు. అప్పట్లో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ చివరిసారిగా ఈ సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. పోస్టర్ గమనిస్తే పోలీస్ పాత్రలో ఇంటెన్స్ లుక్‌తో అజయ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాను మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సావిత్రి నిర్మాతగా, వెంకటేష్, అనూష సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి భరత్ మంచిరాజు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. -
లాటరీలో జాక్ పాట్.. రాత్రికి రాత్రే కోటీశ్వరుడు
-
అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్
నటుడు అజయ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్ హీరోలకు సమానమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు, ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన ఆయన ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉండే అజయ్ ఆ మధ్య నటనకు విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: లైగర్ ఫ్లాప్‌పై తొలిసారి స్పందించిన పూరీ, ఏమన్నాడంటే చాలా గ్యాప్ అనంతరం ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన అజయ్ ప్రస్తుతం ఆడపదడప చిత్రాలు చేస్తూ ఫ్యాన్స్‌ని పలకరిస్తున్నాడు. ఇక ఇటీవల 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించిన అజయ్ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆయన తాజాగా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా తన కెరీర్, పర్సనల్ లైఫ్ గురించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఈ మధ్య సినిమాలకు గ్యాప్ ఇవ్వడంపై స్పందించాడు. తనకు తగ్గ పాత్రలు రావడం లేదని, అందుకే ఈ గ్యాప్ వచ్చిందన్నాడు. చదవండి: రెమ్యునరేషన్ డిమాండ్ చేయను.. ఎంత ఇస్తే అంత తీసుకుంటా: నిధి అగర్వాల్ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నేనేప్పుడు పాత్రకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలే చేశాను. ఈ 22 ఏళ్లు అదే చేశాను. ఇకముందు కూడా పాత్ర నచ్చితేనే చేస్తాను. సినిమాలో మన రోల్ ఎంతసేపు ఉంది, ఎన్నిసార్లు కనిపించింది అనేది ముఖ్యం కాదు. అది ఎంత ప్రభావవంతంగా ఉందనేది పరిగణలోకి తీసుకుంటాను. అందుకు నేను చేసిన పాత్రలన్ని ప్రేక్షకుల్లో మదిలో అల నిలిచిపోయాయి’ అన్నాడు. ఆ తర్వాత విలన్ రోల్స్‌పై స్పందిస్తూ.. శ్రీ మహాలక్ష్మి మూవీ సమయంలో చోటు చేసుకున్న ఓ సంఘటనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ‘‘కల్యాణ్ రామ్, కాజల్ అగర్వాల్ ‘లక్ష్మీ కల్యాణం’ సినిమా సమయంలో ఒక సంఘటన జరిగింది. చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి అది నాకిప్పటికి గుర్తుంది. ఈ సినిమాలో ఓ రేప్ సీన్ ఉంది కదా. దానికోసం ఓ మోడల్‌ను తీసుకున్నారు. అయితే ఆమెకు అది రేప్ చేసే సీన్ అనే విషయం చెప్పలేదు. నేను వెళ్లి చేయిపట్టుకోగానే ఆమె గట్టిగా ఏడవడం ప్రారంభించింది. దాంతో నేను డైరెక్టర్‌కి ఆ సీన్ చేయలేను అని చెప్పా. వందల మంది ముందు రేప్ సీన్ చేయడం చాలా చిరాకుగా ఉంటుంది. ఆ తర్వాత నాకు మళ్లీ రేప్ సీన్లో నటించే అవసరం, సందర్భం రాలేదు. ఆ విషయంలో మాత్రం నేను చాలా సంతోషిస్తాను’ అంటూ చెప్పకొచ్చాడు. అయితే తనకు నచ్చిన పాత్రలు రాకుంటే శాశ్వతంగా సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తానంటూ అజయ్ ఓపెన్‌గా కామెంట్స్ చేశాడు. -
‘కొత్త కొత్తగా’ మూవీ రివ్యూ
టైటిల్: కొత్త కొత్తగా నటీనటులు: అజయ్ , వీర్తి వఘాని, ఆనంద్, కాశీ విశ్వనాధ్ ,తులసి, కల్యాణి నటరాజన్, పవన్ తేజ్, ఈరోజుల్లో సాయి తదితరులు నిర్మాణ సంస్థ: ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: మురళీధర్ రెడ్డి ముక్కర దర్శకత్వం: హనుమాన్ వాసంశెట్టి సంగీతం: శేఖర్ చంద్ర సినిమాటోగ్రఫీ: వెంకట్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేది: సెప్టెంబర్ 9,2022 అజయ్, వీర్తి వఘాని జంటగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బీజీ గోవింద రాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘కొత్త కొత్తగా’ కథేంటంటే.. రాజీ (వీర్తి వఘాని), సిద్దు (అజయ్) ఇద్దరూ ఒకే కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్. అబ్బాయికి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడానికి ఇష్టపడని రాజీ ని చూడగానే సిద్దు ఇష్టపడతాడు. మరో వైపు రాజీ అన్న కేశవ్ తన చెల్లికి దగ్గరి సంబంధం కాకుండా దూరం సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటాడు.అయితే కేశవ్ బామ్మర్ది రామ్ (పవన్ తేజ్) తన అక్క సత్య (లావణ్య రెడ్డి) తో రాజీ అంటే చాలా ఇష్టం తనని పెళ్లి చేసుకొంటాను అంటాడు. రామ్ తల్లి తండ్రులు రాజీవ్ ఫ్యామిలీ తో మాట్లాడడంతో మొదట కేశవ్ కు ఇష్టం లేకపోయినా చివరికి ఒకే అనడంతో రామ్ తో రాజీకి పెళ్లి ఫిక్స్ చేస్తారు. కానీ రాజీకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం ఉండదు. ఇంకా చదువుకోవాలని అనుకుంటుంది. అదే సమయంలో తనను సిద్దు ప్రాణంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని అతన్ని ఇష్టపడుతుంది. మరి రాజీ చివరకు ఎవరిని పెళ్లి చేసుకుంది? తల్లిదండ్రుల కోసం రామ్‌తో పెళ్లికి సిద్దమైందా? లేదా ప్రేమించిన సిద్దుతోనే జీవితాన్ని పంచుకుందా? తన ప్రేమను దక్కించుకోవడం కోసం సిద్దు ఎలాంటి త్యాగం చేశాడు? అనేదే మితతా కథ. ఎలా ఉందంటే.. నేటి తరాన్ని దృష్టిలో పెట్టుకొని ‘కొత్త కొత్తగా’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు హనుమాన్ వాసంశెట్టి. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బంది కలగకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా చూస్తున్నంత సేపు తర్వాత ఏం జరుగుతుందనే అనే క్యూరియాసిటీ ప్రేక్షకులకు కలిగిస్తుంది. ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ ఆకట్టుకున్నప్పటీకీ.. కొన్ని సాగదీత సీన్స్ పంటికింద రాయిలా ఉంటాయి. ఒకటి రెండు కామెడీ సీన్స్ బాగుంటాయి. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఇక నటీనటుల విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరోగా నటించిన అజయ్‌కి ఇది తొలి సినిమా. అయినప్పటికీ సిద్దు పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఒక పెద్దింటి పల్లెటూరు అమ్మాయి రాజీ గా వీర్తి వఘాని అద్భుతమైన నటనను ప్రదర్శించింది.రొమాన్స్ లోను, ప్రేమలోనూ తను అన్ని బావోధ్వేగాలను చాలా బాగా వ్యక్త పరచింది. రాజీ అన్నగా కేశవ్ (అనిరుద్ ) రఫ్ క్యారెక్టర్ లో ఒదిగిపపోయాడు ,రాజీ బావగా రామ్ (పవన్ తేజ్), రాజీ కి వదినగా సత్య (లావణ్య రెడ్డి) లు చక్కటి నటనను ప్రదర్శించారు. బస్ స్టాప్,ఈ రోజుల్లో ఫెమ్ సాయి హీరో ఫ్రండ్ క్యారెక్టర్ లో చాలా బాగా నటించాడు. అలాగే వాసు మంచి రోల్ చేశాడు.. ఇంకా ఈ సినిమాలో నటించిన వారంతా వారికీచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం పర్వాలేదు. ఒకటి రెండు పాటలు బాగున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ప్రియతమా పాట చిత్రానికి హైలెట్ గా నిలుస్తుంది. వెంకట్ సినిమాటోగ్రాఫర్ వెంకటర్ మంచి విజువల్స్ ఇచ్చాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
Extramarital Affair: అత్త హత్యకేసులో మేనల్లుడే నిందితుడు
బెంగళూరు: చెన్నపట్టణ పట్టణ పరిధిలోని మహదేశ్వర నగర్లో జులై 15న జరిగిన మహిళ హత్యోదంతాన్ని పోలీసులు ఛేదించారు. అత్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మేనల్లుడే ఆమెను కడతేర్చాడని నిర్ధారించారు. మహదేశ్వర నగర్‌లోని ఒక ఇంట్లో పడక గదిలో 33 సంవత్సరాల వయసున్న మహిళ హత్యకు గురైనట్లు సమాచారంతో పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి 25 రోజులపాటు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు అజయ్ సదరు మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. భర్త, పిల్లలను వదిలి తనతో వచ్చేయాలని అజయ్ ఆమెను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో కక్ష పెంచుకున్న అజయ్ జులై 15న భర్త లేని సమయంలో అత్తను హత్య చేశాడు. ఇంట్లో దొంగతనం జరిగినట్టు నమ్మించడానికి ఆమె మెడలో మాంగల్యం చైను, ఇతర విలువైన వస్తువులు, హతురాలి మొబైల్‌ను కూడా తీసుకెళ్లాడు. అయితే నిందితుడు మాంగల్యం చైను హలగూరులో ఒక దుకాణంలో తాకట్టు పెట్టడం, కాల్ రికార్డ్స్ నిందితుడిని సులభంగా పట్టించాయి. చదవండి: (ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం.. భర్త హత్యకు కుట్ర) -
హాట్‌స్టార్‌లో మరో కొత్త వెబ్‌సిరీస్, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
వినోదాన్ని అందించేందుకు ఓటీటీలు సై అంటున్నాయి. ఈ క్రమంలో ఆల్రెడీ థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలను మాత్రమే అందించకుండా ఒరిజినల్ కంటెంట్‌తో ముందుకు వస్తున్నాయి. సరికొత్త కథలు, వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్నాయి. దేశంలో మొదటి స్థానంలో దూసుకుపోతున్న ఓటీటీ ప్లాట్‌ఫామ్ హాట్‌స్టార్ తాజాగా 9 హవర్స్ అనే మరో కొత్త వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయనుంది. అందులో భాగంగా శనివారం నాడు 9 అవర్స్ టీజర్ విడుదలయింది. 'మర్చిపోకండి.. మళ్లీ హాజరు సమయానికి మీకు మధ్య 9 గంటలు మాత్రమే!' అన్న సింగిల్ డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ముగ్గురు ఖైదీలు తప్పించుకునేందుకు వేసిన ఒక్క ప్లానే 9 అవర్స్ అని టీజర్ చూస్తే అర్థమవుతోంది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్‌లో తారకరత్న, అజయ్, వినోద్ కుమార్, మధుషాలిని, రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించగా ప్రీతి, అంకిత, జ్వాల, మోనిక ముఖ్యపాత్రలు పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో జూన్ 2 నుంచి అన్ని ఎపిసోడ్లు ప్రసారం కానున్నాయి. చదవండి: జాన్ అబ్రహం, రకుల్ మూవీ 'యాక్షన్', ఎప్పటినుంచంటే? -
Prakasam District: ట్రిపుల్ ఐటీ విద్యార్థికి రూ.22 లక్షల ప్యాకేజీ
సాక్షి, చీమకుర్తి: ప్రకాశం జిల్లా సంతనూతలపాడులోని ట్రిపుల్ ఐటీ విద్యార్థి పంతగాని అజయ్ రూ.22 లక్షల ప్యాకేజీతో సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న సింగపూర్‌కు చెందిన గోజెక్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అజయ్.. ఏడాదికి రూ.22 లక్షల జీతంతో ఉద్యోగానికి ఎంపికైనట్లు కంపెనీ వారు ఆఫర్ లెటర్‌ను పంపారు. దీనిని ట్రిపుల్ ఐటీ కళాశాల డైరెక్టర్ బి.జయరామిరెడ్డి చేతుల మీదుగా విద్యార్థి అజయ్ మంగళవారం కళాశాలలో అందుకున్నారు. కాగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి మాట్లాడుతూ.. 2021–22 విద్యాసంవత్సరంలో ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పలు కంపెనీలు నిర్వహించిన రిక్రూట్మెంట్ డ్రైవ్‌లలో మొత్తం 774 మంది తమ విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు తెలిపారు. మరో 125 మంది విద్యార్థులు ఇప్పటికే ఇంటర్వ్యూలు పూర్తి చేసుకుని, ఆఫర్ లెటర్ల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. చదవండి: (అంతా నారాయణ ఆదేశాలతోనే..) -
అఖిల్- బిందు మధ్య బిగ్ ఫైట్... హీటెక్కిస్తున్న ప్రోమో
Bigg Boss Non Stop Latest Promo Is Out: బుల్లితెరపై బిగ్‌బాస్ నాన్‌స్టాప్ రసవత్తరంగా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24గంటల పాటు ప్రసారం అవుతున్న బిగ్‌బాస్‌లో వినోదంతో పాటు గొడవలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అప్పటి వరకు ఫ్రెండ్స్‌గా ఉన్న వారు కూడా టాస్క్‌లు వచ్చేవరకు ఎనిమీలుగా మారుతున్నారు. ఇక బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివను ఆ రౌండ్లో ఎలిమినేట్ చేసే ప్రక్రియలో అఖిల్, బిందు మాధవికి మధ్య పెద్ద గొడవ జరిగింది. నువ్వు ఇప్పటివరకు ఎన్ని సార్లు కెప్టెన్సీ కంటెండర్ అయ్యావని అఖిల్ ప్రశ్నించగా.. నీలా నాకు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయలేదు అంటూ బిందు కౌంటర్ వేసింది. 'ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా నువ్వు ఒక్క గేమ్ కూడా ఆడలేవు. ఫ్రెండ్స్ సపోర్ట్‌తో బతుకుతుంది నువ్వు.. నేను కాదు. ఫ్రెండ్స్ సపోర్ట్ లేకుండా అఖిల్ ఈ ఇంట్లో బతకలేడు'.. అంటూ మండిపడింది. 'ఈ మాటలు పడటానికి వచ్చానా నేను.. ఇష్టం వచ్చిన మాటలు అంటున్నావ్' అంటూ అఖిల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ ఫైట్‌లో అజయ్ తన ఫ్రెండ్స్ అఖిల్‌కి సపోర్ట్‌గా నిలుస్తాడు. మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడాలని బిందుతో గొడవకు దిగుతాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. -
ఈ విజయం ప్రతిపక్షాలకు గుణపాఠం
మారుతున్న మనోభావాలకు ప్రతిస్పందించడం ద్వారా బీజేపీ 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యామ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందించడం ద్వారా మాత్రమే ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసాన్ని పొందలేవు. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్ది నెలల పాటు ర్యాలీలను నిర్వహించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులూ పోటీపడేలా రాజకీయాలను మార్చేశాయి. సమాజంలో నిజమైన మార్పును తీసుకొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే ప్రతిపక్షాలకు ప్రయోజనకరం. భారతదేశ రాజకీయ పరిదృశ్యాన్ని బీజేపీ ఎంతగా మార్చివేసిందనే అంశాన్ని ఇటీవలే ముగిసిన అసెంబ్లీ ఎన్నికలు మరోసారి చర్చకు పెట్టాయి. ఎన్నికల ఫలితాలను ఇస్లామోఫోబియా అనే యధాలాప నిర్ధారణతో తేల్చి పడేయడం కంటే ఆ ఫలితాలపై సరైన గుణపాఠాలు తీసుకోవడానికి సిద్ధపడితే అందరికీ ప్రయోజన కరం. ఇస్లామోఫోబియా అనే భావన అనేక వర్ణనలు, వ్యూహాలతో కలిసి ఉంటుందని మనం అర్థం చేసు కోవాలి. ఇలాంటివన్నీ ఏకకాలంలో ప్రభావం కలిగిస్తుంటాయి. బీజేపీ దీర్ఘకాలంగా మనగలుగుతుండటానికి కారణం– సామాజిక, సాంస్కృతిక అంశాలు, రాజకీయాలను కలగలపడమే. మెజారిటీ వాదాన్ని ఎత్తిపట్టడం, నిర్మొహమాటంగా ముస్లింల పట్ల మినహా యింపులు కలిగి ఉండటం కొనసాగిస్తున్నప్పటికీ, దేశంలో సాంస్కృ తిక అంశాల గురించి ఆలోచించే సమర్థత కలిగిన ఏకైక పార్టీ బీజేపీనే అని ఒప్పుకోవాలి. సామాజిక రంగాన్ని చర్చించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఏదన్నది ప్రతిపక్షాల ముందు ప్రశ్నగా నిలుస్తోంది. సంస్కృతి గురించిన చర్చను పక్కన పెట్టడం లేదా దానితో ఆటాడటం పైనే లౌకిక పార్టీలు సతమతమవుతున్నాయి. బీజేపీ మతతత్వ పార్టీనే కావచ్చు, కానీ సంస్కృతిపరమైన, మతపరమైన వ్యత్యాసాల విష యంలో ఏం చేయాలని తాను కోరుకుంటోందో దాన్ని చేయగల స్థానంలో ఆ పార్టీ ఉంది. తన సాంస్కృతిక ప్రతీకాత్మత ద్వారా ఒక లోతైన అర్థాన్ని ఆ పార్టీ ప్రతిపాదిస్తోంది. మతపరమైన ద్వేష భావా నికి బీజేపీ ప్రజల నుంచి ఆమోదం పొందగలగడంలో వారి ఉనికికి సంబంధించిన భావన పనిచేస్తోంది. ఇలాంటి సానుకూలత ప్రతిపక్షా నికి అసలు లేదు. ముజఫర్ నగర్ దాడుల విషయంలో సమాజ్ వాదీ పార్టీ మౌనం పాటించింది. కాంగ్రెస్ కూడా దీనికి భిన్నంగా లేదు. ప్రతిపక్షం ఇక్కడినుంచే ప్రారంభం కావలసి ఉంది. రాజకీయ ప్రయోజనాలను పొందడానికి సామాజిక, సాంస్కృతిక అంశాలను ప్రతిపక్షం చర్చకు పెట్టాలి. వివిధ సామాజిక బృందాలను అవి ఏకం చేయాలి. క్రాస్ కల్చరల్ చర్చలను నిర్వహించి, ఉద్రిక్తతలను తగ్గించాల్సి ఉంది. రెడీ మేడ్‌గా అందుబాటులో ఉండదు కాబట్టి ఒక కొత్త దార్శనికతను ప్రతిపక్షాలు నిర్మించాల్సి ఉంది. భారత్‌లో రాజ్యాంగపరమైన నీతి అనేది ఉనికిలో లేదు కాబట్టి, దాన్ని నిర్మించాల్సి ఉందని అంబేడ్కర్ ఏనాడో సూచించారు. సౌభ్రాతృత్వం అనేది రాజ్యాంగపరమైన సూత్రంగా ఉండదని ఆయన చెప్పారు. నిర్దిష్ట వాస్తవికత నుంచి చేయ వలసిన అలాంటి నిఖార్సయిన పరిశీలనలు కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించడానికి ప్రారంభ బిందువుగా ఉంటాయి. హిందూ–ముస్లిం సంబంధాలు ఎలా ఉండాలి? రాబోయే దశా బ్దాల్లో కులాంతర సంబంధాలు ఎలా ఉండాలి? సామాజిక అంత రాలు, దురభిప్రాయాలను పట్టించుకోకుండా రాజకీయ పొత్తులతో అతుకులేసే రోజులు పోయాయి. ఇది బీజేపీ విజయంలోనే కాకుండా, మజ్లిస్, బీఎస్పీ పార్టీల పరాజయంలో కూడా స్పష్టంగా కనిపిస్తున్న ఆహ్వానించదగిన మార్పు. మతపరమైన వాక్చాతుర్యం రెడీమేడ్‌గా ఎవరికీ అందుబాటులో ఉండదు. ఆరెస్సెస్, దాని అనుబంధ సంస్థలు దాన్ని నిర్మించాయి. కోవిడ్–19 మహమ్మారిని అదుపు చేయడంలో బీజేపీ ప్రదర్శిం చిన నిర్లక్ష్యాన్ని మనం తప్పుపట్టవచ్చు. కానీ అఖిలేశ్ యాదవ్ కూడా దీనికి భిన్నంగా లేరు మరి. సెకండ్ వేవ్ విజృంభిస్తున్నప్పుడు అఖిలేశ్ కనిపించకపోవడం కూడా వ్యతిరేక భావనలను కలిగించింది. తాము విజయం సాధించడానికి ఇతరుల వైఫల్యాలను ఏకరువు పెట్టడం ఒక్కటే మార్గం కాదు. ఏం చేసినా తాము పడి ఉంటామనే భావనను ప్రజలు సవాలు చేస్తున్నారు. మారుతున్న మనోభావాలకు ప్రతిస్పం దించడం ద్వారా బీజేపీ ప్రజాగ్రహం నుంచి తప్పించుకుంది. ప్రత్యా మ్నాయ కృషిని ప్రజల ముందు ఉంచనంతవరకూ, మోదీని నిందిం చడం ద్వారా మాత్రమే ప్రజా విశ్వాసాన్ని పొందలేరు. పశ్చాత్తాపానికి చెందిన నిజమైన చర్యగా, నీళ్లు నిండిన కళ్లతో ప్రతిపక్షాలు జనం ముందుకు రావాలి. తాము పశ్చాత్తాపపడుతున్న ఉద్దేశాన్ని ప్రదర్శి స్తూనే వారు నేరుగా ప్రజలముందు స్పందించాలి. ప్రతిపక్షాలు ఇక్కడ పొందిన వైఫల్యమే పాలకపక్షం విజయంగా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తుండగా కొద్దినెలల పాటు ర్యాలీలను నిర్వ హించి ఊరుకోవడం ఇకపై పనిచేయదు. ఎందుకంటే బీజేపీ, ఆరెస్సెస్ కలిసి 365 రోజులు పోటీపడేలా రాజకీయాల యాంటె న్నాను మార్చిపడేశాయి. ఫలితాలకు అతీతంగా నిజాయితీగా పని చేయడానికి ఇప్పుడు ఇదే కొలమానమైపోయింది. ప్రజల దృష్టిలో కష్టించి పనిచేసేవారికే విలువ ఉంటుంది. అనియత రంగంలో పని చేసేవారే మనదేశంలో ఎక్కువమంది కాబట్టి రాజకీయాల్లో విరామం లేకుండా పనిచేసేవారిని సులభంగా గుర్తిస్తారు. ఒక్క మమతా బెనర్జీ తప్ప ఉత్తరాదిన ప్రతిపక్షాల్లో ఏ ఒక్క నాయకుడూ ప్రజల దృష్టిలో ఇలాంటి ఇమేజ్‌కి దగ్గర కాలేకపోయారు. సామాన్య ప్రజలతో మమేకం కావడం గొప్ప సెంటిమెంటును కలిగిస్తుంది. ప్రజల రోజువారీ జీవితాలను స్పృశించకుండా, సంవత్సరంపాటు ప్రజలతో మమేకం కాకుండా ఉండివుంటే బీజేపీకి ఇంత చక్కటి విజయాలు లభ్య మయ్యేవి కాదు. కులమత ప్రాతిపదికనే బీజేపీ రాజకీయం చేస్తోందన్నది వాస్తవమే కావచ్చు గానీ కుల మతాలకు అతీతంగా బీజేపీ ఈ దఫా ఎన్నికల్లో స్వరం పెంచడం దానిపట్ల సానుకూలతను పెంచింది. అయితే కులనిర్మూలన వంటి గంభీర పదాల జోలికి వెళ్ళకుండా ఆధిపత్య రాజకీయాల నుంచి బయటపడాలని చెబుతూ వచ్చింది. ఒక పార్టీకి, వ్యక్తికి మేలు చేసే తరహా కుల రాజకీయాలు తాను చేయ లేనని బీజేపీ గట్టిగా చెప్పింది. చరణ్‌జీత్ సింగ్ చన్నీ, మాయావతి, అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు ఈ ఎన్నికల్లో ఎందుకు వెనుక బడ్డారంటే తమది ఫలానా కులమనీ, మతమనీ ముద్ర వేయించు కుంటే నడిచే రాజకీయాలకు ఇప్పుడు కాలం కాదు. సామాజిక న్యాయం కుల ప్రాతినిధ్యంతో ఇక సిద్ధించదు. అలా ఎవరైనా చెబితే జనం నమ్మే పరిస్థితి పోయింది. మన సమాజం అంతరాలతో కూడిన అసమానతల సమాజం అని డాక్టర్ అంబేడ్కర్ మనకు మళ్లీ గుర్తు చేస్తున్నారు. వీళ్ల కోసం పనిచేయడమే, వీరికి మేలు చేకూర్చడమే నిజమైన మార్పునకు దారితీస్తుంది. తాజా అసెంబ్లీ ఎన్నికలను ఆర్థిక కష్టాలపై సంస్కృతి విజ యంగా భావించలేం. దానికి బదులుగా ఆర్థిక అవసరాలు సాంస్కృ తిక సులోచనాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. బీజేపీ సాంస్కృతిక విలువల పునాదిపైనే తన ఆర్థిక కార్యక్రమాలను తీసుకొచ్చింది. బీజేపీ ఉజ్వల పేరుతో పథకం ప్రకటించిందిగానీ సిలిండర్‌ని రీఫిల్ చేసుకోవాల్సిన బాధ్యతను లబ్ధిదారులపైనే పెట్టింది. విమర్శనాత్మక చింతనాపరుడు రేమాండ్స్ విలియమ్స్ ఒక విష యాన్ని స్పష్టంగా చెప్పారు. సమాజంలో నిజమైన మార్పును తీసు కొచ్చేది ఆశలను నెరవేర్చడమే గానీ నిరాశాపరులకు నచ్చజెప్పడం కాదు. ఇన్నాళ్లుగా మన ప్రతిపక్షాలు చేస్తూ వచ్చింది– నిరాశాజీవులకు నచ్చచెబుతూ రావడమే! ఊరకే బాధల గురించి ట్వీట్ చేయడం, నరేంద్ర మోదీ తప్పుల గురించి ఊదరగొట్టడం అనేవి ప్రతిపక్షాలకు ప్రత్యామ్నాయాన్ని సృష్టించిపెట్టవు. మెజారిటీ ప్రజల్లోని నిరాశకు మార్గాన్ని చూపిస్తూనే, జాతీయ భంగిమను ప్రదర్శించడం ద్వారా మోదీ ఏకకాలంలో అటు పాలకుడిగానూ, ఇటు ప్రతిపక్ష నేతగానూ వ్యవహరించారు. అదే ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి అసలు కారణం! అజయ్ గుడవర్తి వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్, జేఎన్‌యూ, ఢిల్లీ (‘ద వైర్’ సౌజన్యంతో) -
బిట్‌కాయిన్ చట్ట విరుద్ధమా? కాదా?
సాక్షి, న్యూఢిల్లీ: బిట్ కాయిన్ చట్ట విరుద్ధమో కాదో వైఖరి చెప్పాలంటూ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తనపై కేసు రద్దు చేయాలంటూ గెయిన్ బిట్‌కాయిన్ కుంభకోణం నిందితుల్లో ఒకరైన అజయ్ భరద్వాజ్ వేసిన పిటిషన్‌ను శుక్రవారం జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా బిట్‌కాయిన్‌పై కేంద్రం వైఖరి చెప్పాలని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. త్వరలోనే చెప్తామని అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్యభాటి తెలిపారు. పెట్టుబడి దారులకు భారీ మొత్తం రిటర్న్‌లు ఇస్తామంటూ అజయ్ భరద్వాజ్, అతని సోదరుడు అమిత్ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రారంభించారు. ఐఎన్‌సీ 42 సంస్థ వివరాల ప్రకారం తొలుత రూ.2వేల కోట్ల కుంభకోణం కాస్తా బిట్‌కాయిన్ విలువ పెరగడంతో అది రూ.20వేల కోట్ల కుంభకోణంగా మారింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదని, 87వేల బిట్ కాయిన్ల వ్యవహారానికి సంబంధించిందని ఐశ్వర్యభాటి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. పలు సమన్లు జారీ చేశామని తెలిపారు. పిటిషనర్లు దర్యాప్తునకు సహకరించాలని ధర్మాసనం ఆదేశించింది. నిందితులను అరెస్టు చేయొద్దని మధ్యంతర రక్షణ కల్పించింది. నాలుగు వారాలకు విచారణ వాయిదా వేసింది. -
వాస్తవ సంఘటనలతో ‘69 సంస్కార్ కాలనీ’
‘రొమాంటిక్ క్రైమ్ కథ, గల్ఫ్, వలస, హనీ ట్రాప్’ వంటి చిత్రాలు తీసిన దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం ‘69 సంస్కార్ కాలనీ’. ఎస్తర్ నోరోన్హా, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బి. బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల మూడో వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా బి. బాపిరాజు మాట్లాడుతూ– ‘‘నేను, సునీల్‌గారు ఒక సినిమా సెన్సార్ పని మీద ముంబై వెళ్లాం. అక్కడ మాకు ఎదురైన కొన్ని సంఘటనలతో పాటు పేపర్లో, సోషల్ మీడియాలో వచ్చిన వాస్తవ సంఘటనతో ‘69 సంస్కార్ కాలనీ’ నిర్మించాం’’ అన్నారు. ‘‘కమర్షియల్‌గా హిట్ చేయాలనే ఉద్దేశ్యంతో కాకుండా సామాజిక బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ‘69 సంస్కార్ కాలనీ’ తీశాం’’ అని సునీల్ కుమార్ రెడ్డి అన్నారు. కథారచయిత్రి గాయత్రి స్వాతి మంత్రిప్రగడ, ఎడిటర్ కృష్ణ మాట్లాడారు. -
Kotha Kothaga: ‘నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండ్ కానీవే’
అజయ్, వీర్తి వఘాని హీరో హీరోయిన్లుగా హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొత్త కొత్తగా’. బిజి గోవిందరాజు సమర్పణలో మురళీధర్ రెడ్డి ముక్కర నిర్మించిన ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘డైమండ్ రాణి’ పాటను దర్శకుడు మారుతి విడుదల చేశారు. ‘‘వాలు కన్నుల్లో మాగ్నెట్టు దాగుందే..’ అంటూ మొదలయ్యే ఈ పాట ‘నా డైమండు రాణివే నీ బాయ్ ఫ్రెండ్ కానీవే’.. అంటూ సాగుతుంది. కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. ఈ సినిమాకు సంగీతం: శేఖర్ చంద్ర. -
నటుడు అజయ్ భార్యను చూశారా, ఆమె ఎవరో తెలుసా!
నటుడు అజయ్.. టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన అజయ్ హీరోలకు సమానంగా గుర్తింపు పొందాడు. ఒక్కడు, విక్రమార్కుడు, సై, దేశ ముదురు,ఛత్రపతి వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో హీరోలకు ఫ్రెండ్‌గా, ప్రతినాయకుడి పాత్రలు పోషించిన అజయ్ ఈ మధ్య తెరపై అరుదుగా కనిపిస్తున్నాడు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా ఫుల్ బిజీగా ఉండే అజయ్ ప్రస్తుతం చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మమ అనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న అజయ్ తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు. తను సినిమాల్లోనే కాదు బయట కూడా తప్పులు చేశానంటూ టీనేజ్‌లో తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఈ మేరకు ‘నేను 19 ఏళ్ల వయసులో ఇంట్లో డబ్బులు తీసుకుని ఫ్రెండ్‌తో కలిసి నేపాల్ పారిపోయాను. అక్కడ మూడు నెలలు సరదాగా గడిపాం. ఆ తర్వాత తిరిగి రావడానికి డబ్బులు లేవు. తీసుకేళ్లిన డబ్బులు అయిపోయాయి. దీంతో ఓ హోటల్లో పని చేశాను. అక్కడ గిన్నెలు కడిగేవాడిని. డబ్బులు వచ్చాక తిరిగి ఇంటికి వచ్చాను. ఇవే కాదు జీవితంలో నేను చాలా తప్పులు చేశాను’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా కాలేజీ సమయంలో శ్వేత రావురిని ప్రేమించిన అజయ్ ఆమెను రహస్య వివాహం చేసుకున్నాడు. ఫస్ట్ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్న అజయ్ సెటిల్ అయ్యాక వారి విషయం ఇంట్లో చెప్పి పెద్దలను ఒప్పించారట. పెద్దల సమక్షంలో మరోసారి శ్వేతను వివాహం చేసుకున్నట్లు అజయ్ వివరించాడు. కాగా ప్రస్తుతం ఈ జంటకు కూతురు, కుమారుడు సంతానం. అయితే అజయ్ నటుడిగా బిజీగా ఉంటే భార్య శ్వేతా రావూరి పలు ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తూ యాక్టివ్‌గా ఉండేవారు. ఈ నేపథ్యంలో ఆమె 2017లో జరిగిన మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ పోటీల్లో పాల్గొని ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యారు. అంతేగాక 2018లో అంబాసిడర్ మిస్టర్ అండ్ మిస్టర్స్ సౌత్ ఇండియాగా కూడా ఎంపికయ్యారు. కానీ అజయ్ తన భార్యతో బయట కనిపించడం చాలా అరుదు. సినిమా ఈ వెంట్స్ కానీ, ఫంక్షన్స్‌కు సింగిల్‌గా హజరవుతాడు. దీంతో అతడి భార్య ఎవరూ ఎలా ఉంటుందనేది చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో అజయ్ తన భార్యతో, పిల్లలతో ఉన్న ఫొటొలు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. -
ఆర్టీసీ ఉద్యోగులకు 1నే జీతాలు!
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తారీఖునే జీతాలు అందేలా సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తానని ఆర్టీసీ కొత్త ఎండీ వీసీ సజ్జనార్ భరోసా ఇచ్చారు. ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి సరిగా లేక రాష్ట్ర ప్రభుత్వ సాయంపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. వీలైనంత త్వరలో ప్రభుత్వంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీకి ఎండీగా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్, బస్‌భవన్‌లోని తన చాంబర్లో శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. తర్వాత ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. బస్‌భవన్‌కు తిరిగొచ్చి మీడియాతో మాట్లాడారు. డీజిల్ ధరల పెరుగుదలతో పెనుభారం ‘గత రెండేళ్ల కాలంలో లీటరు డీజిల్‌పై రూ.22 పెరుగుదల నమోదైంది. ఇది ఆర్టీసీపై పెనుభారాన్ని మోపింది. అలాగే బస్సులకు వాడే విడిభాగాల ధరలు కూడా పెరిగాయి. రోజువారీ ఆదాయ వ్యయాల్లో రూ.8 కోట్ల వ్యత్యాసం కనిపిస్తోంది. దీన్ని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఇది జరగాలంటే సంస్థ ఆదాయం పెరగాలి. అది టికెట్ ద్వారా సాధించాలా, లేదా కార్గో విభాగం లాంటి ప్రత్యామ్నాయాల ద్వారా పొందాలా అన్నది ఆలోచిస్తాం. ఆర్టీసీ ఆదాయం ఎలా పెంచుకోవాలన్న దానిపై శాస్త్రీయ అధ్యయనం జరిపేందుకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ అధ్యయనంలో తేలిన అంశాల ఆధారంగా చర్యలు తీసుకుంటాం’అని సజ్జనార్ తెలిపారు. మూడు లక్ష్యాలు సాధించేలా.. ‘ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆదరించి దాని ఆదా యం పెరిగేందుకు సహకరించాలి. సురక్షితమైన ప్రయాణం చేయాలి. స్వయం సమృద్ధి సాధించ టం, ప్రయాణికులు సంతృప్తి చెందేలా సేవలందించటం, ఉద్యోగుల సంక్షేమం.. ఈ మూడు లక్ష్యాలు సాధించేలా పని ప్రారంభిస్తున్నాం. ఆర్టీసీని సంస్కరించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో మాజీ అధికారులతో కూడా మాట్లాడుతున్నాం. వారి సూచనలు కూడా పరిగణనలోకి తీసుకుంటాం..’అని చెప్పారు. సంక్షేమ మండళ్ల వైపే మొగ్గు గతంలో ఆర్టీసీ సమ్మె సమయంలో కార్మిక సంఘాల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి రెండేళ్లపాటు వాటిని దూరం పెట్టిన విషయం తెలిసిందే. రెండేళ్లు గడిచినా మళ్లీ కార్మిక సంఘాలను గుర్తించలేదు. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల దిశగా చర్యలు తీసుకోలేదు. కార్మిక సంఘాలకు ఉద్యోగులు దూరంగా ఉండేలా చూస్తోంది. అందులో భా గంగా డిపో స్థాయిలో ఉద్యోగులకు సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సజ్జనార్ కూడా సంక్షేమ మండళ్లవైపే మొగ్గు చూపు తున్నారు. కార్మిక సంఘాల గురించి ప్రశ్నించగా, ప్రస్తుతం డిపోల్లో సంక్షేమ మండళ్లు అందుబాటులో ఉన్నందున వాటితోనే కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే బస్సుల వివరాలు ప్రయాణికులకు తెలిసేలా జీపీఎస్ ఆధారిత ఆధునిక సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎర్ర తివాచీ స్వాగతం సజ్జనార్‌కు అధికారులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. బస్‌భవన్ ప్రాంగణమంతా ఆయన మినీ కటౌట్లు, పూల అలంకరణలతో ముస్తాబు చేశారు. ప్రధాన ద్వారం నుంచి లోపలివరకు ఎర్ర తివాచీ పరిచి దాని మీదుగా నడిచివచ్చేలా ఏర్పాటు చేశారు. దారికి రెండువైపులా ఉద్యోగులు నిలబడి పూలను చల్లుతూ ఆహ్వానం పలికారు. కాగా అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులతో సజ్జనార్ విడివిడిగా భేటీ అయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు బస్‌భవన్‌లోనే గడిపిన ఆయన.. రాత్రి తన కార్యాలయానికి వచ్చిన కుటుంబసభ్యులను అధికారులకు పరిచయం చేశారు. -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
థ్రిల్... కామెడీ
అజయ్, శ్రద్ధా దాస్, ఆమని ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘అర్థం’. పలు చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసిన మణికాంత్ తెల్లగూటి ఈ సినిమాకి రచయిత, దర్శకుడు. ‘నాటకం’ చిత్రనిర్మాతల్లో ఒకరైన రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయింది. ఈ సందర్భంగా రాధికా శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే కథాంశంతో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. త్వరలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నాం. రాకేందు మౌళి మా సినిమాకి మాటలు, పాటలు రాస్తున్నారు’’ అన్నారు. ‘‘కుటుంబ విలువలను కాపాడటంతో పాటు మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. సైకలాజికల్ థ్రిల్లర్ కథకి వినోదం మేళవించి ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నాం’’ అన్నారు మణికాంత్ తెల్లగూటి. ‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాల్లో బాలనటుడిగా అలరించిన మహేంద్ర, రామ్‌గోపాల్ వర్మ ‘మర్డర్’లో కథానాయికగా నటించిన సాహితీ అవంచ, దేవి ప్రసాద్, సాయి దీనా, వాసు విక్రమ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శేఖర్ గంగనమోని, సంగీతం: సన్నీ ఆస్టిన్, చిన్న స్వామి, అసోసియేట్ నిర్మాత: ఉమా కూచిపూడి, సహనిర్మాతలు: పవన్ జానీ, వెంకట రమేష్. -
నా బలం నాకు తెలుసు
‘‘ప్రయాణం అనేది ఎప్పుడూ ఒక్కడి వల్ల జరగదు. మనల్ని ప్రోత్సహించేవాళ్లు, సహాయం చేసేవాళ్లు.. ఇలా అందరి వల్లే మనం ముందుకు వెళ్లగలుగుతాం. నటుడిగా ఇరవై ఏళ్లు పూర్తయ్యాయంటే నమ్మబుద్ధి కావడం లేదు. చేయాల్సిన సినిమాలు, పాత్రలు ఇంకా ఎన్నో ఉన్నాయనే భావిస్తాను’’ అన్నారు నటుడు అజయ్. ఆయన కెరీర్ ప్రారంభం అయి 20 ఏళ్లు పూర్తయింది. ‘కౌరవుడు’ సినిమాతో పరిచయమయ్యారు అజయ్. ఆ తర్వాత ‘ఖుషీ, విక్రమార్కుడు, అతనొక్కడే, సారాయి వీర్రాజు.. దాదాపు 200కు పైనే సినిమాలు చేశారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించారు. ఈ ప్రయాణం గురించి ఆజయ్ చెప్పిన విశేషాలు. యాక్టర్ అయ్యే అదృష్టం కొద్ది మందికి మాత్రమే వస్తుంది. ఇంత పేరు, ప్రేమ పొందడం, ఇన్నేళ్లు కొనసాగడం కూడా అదృష్టమే. కళ్లుమూసి తెరిచేలోపు ఇరవైఏళ్లు అయిపోయాయి. కెరీర్ ప్రారంభంలో ఏం అర్థం కాకుండానే ఐదారేళ్లు గడిచిపోయాయి. పేరు రావడం కన్నా వచ్చినదాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ సమయంలోనే చాలా మంచి సినిమాలు, దర్శకులతో పని చేయడం నా లక్. నా దర్శకులు, నిర్మాతలు హ్యాపీగా ఉండాలని కోరుకునేవాణ్ణి. విలన్ అవుదాం అని వచ్చా. అయ్యాను. పాజిటివ్, నెగటివ్ అన్ని రకాల పాత్రలు చేశాను. ఇంకా విభిన్నమైన పాత్రలు చేయాలి. నాచ్యురల్‌గా చే యాలి. ప్రస్తుతం నా కెరీర్లో బెస్ట్ టైమ్ ఇది. మంచి పాత్రలు వస్తున్నాయి. నాకు రానిదాన్ని చేయను నేను చేసిన 95 శాతం పాత్రలు సెట్‌కి వెళ్లాక తెలుసుకున్నవే. హోమ్‌వర్క్ చేయాల్సిన పాత్రలకు కచ్చితంగా హోమ్ వర్క్ చేశాను. నటుడిగా నా బలమేంటో నాకు తెలుసు. నాకు రానిదాన్ని చేయను. ఒకవేళ చేయాల్సి వస్తే పూర్తిగా నేర్చుకుని కెమెరా ముందుకెళతాను. విభిన్న పాత్రలు చేయడం వల్ల మనిషిగా నాలో చాలా మార్పు వచ్చింది. ఇంతకు ముందు చాలా కోపం, ర్యాష్‌గా ఉండేవాణ్ణి. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఓపిక పెరిగింది. కృతజ్ఞతాభావం అలవడింది. క్వాలిటీ వర్క్ చేయాలి లాక్డౌన్లో అందరికీ ఆగి ఆలోచించే తీరిక దొరికింది. నేను నా పాత్రల గురించి ఆలోచించాను. ఇక మీదట ఇంకా మంచి పాత్రలు చేయాలి, క్వాలిటీ వర్క్ చేయాలనుకుంటున్నాను. మా పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు. వాళ్లకు చూపించడానికి మంచి పాత్రలు చేస్తా. ప్రస్తుతం ఆర్టిస్టులకు ఓటీటీలు ఓ వరం. వెబ్ సిరీస్‌లు చేయొచ్చు. ఇంకా భిన్న పాత్రలు చేయొచ్చు. ఏదైనా ఒకేలా తీసుకుంటా ప్రశంసలకు ఆనందపడిపోయి, విమర్శలకు కుంగిపోను. నా దారిలోకి ఏది వచ్చినా ఆనందంగా తీసుకుంటాను. బీ పాజిటివ్ అన్నది నా ఫిలాసఫీ. అలాగే ఇండస్ట్రీలో రిలాక్సేషన్ అనేది ఏదీ ఉండదు. నిరంతరం పరిగెడుతూనే ఉండాలి. ప్రస్తుతం నాలుగు వెబ్ సిరీస్‌లు చేస్తున్నాను. అలాగే నాలుగైదు పెద్ద సినిమాలు చేస్తున్నాను. పరిస్థితులు ఎలా ఉన్నా షో ఆగకూడదు. అందరూ పని చేస్తూనే ఉండాలి. నా సినిమాల్లో నాకు నచ్చినవి ‘ఖుషీ, విక్రమార్కుడు, అతనొక్కడే, పోకిరి, ఇష్క్, ఆర్య 2, దిక్కులు చూడకు రామయ్య’ ఇవి టాప్‌లో ఉంటాయి. ఇప్పుడున్న సూపర్‌స్టార్స్ అందరూ స్టార్ట్ అవుతున్నప్పుడే నేను నా కెరీర్ ప్రారంభించా. దాంతో అందరితో యాక్ట్ చేసే చాన్స్ ఈజీగా వచ్చింది. -
అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం
మేడిపల్లి: వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకునేందుకు పెద్దల నిర్ణయాన్ని అడిగారు. వివాహానికి వారు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బుధవారం మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పిర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న బోరెండల్ కిరణ్‌కుమార్ కూతురు శ్రావణి (23) స్థానికంగా ఉన్న బిగ్‌బజార్ సేల్స్ విభాగంలో పని చేస్తోంది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కోల్కొండ గ్రామానికి చెందిన తుమ్మల చంద్రయ్య కుమారుడు అజయ్ ఉప్పల్‌లోని బజాజ్ వెహికల్ షోరూంలో పని చేస్తున్నాడు. శ్రావణి, అజయ్‌లకు రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. ఇటీవల వీరు తమ ప్రేమ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు.(మేడ్చల్: ఓయో లాడ్జిలో దారుణం!) శ్రావణి కుటుంబికులు ఇందుకు అంగీకరించినా.. అజయ్ తల్లిదండ్రులు మాత్రం ఒప్పుకోలేదని పోలీసులు చెప్పారు. వారిని ఒప్పించేందుకు ప్రేమికులిద్దరూ కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం మేడిపల్లిలోని ఓ హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ రోజు రాత్రి బాత్రూంలో నీళ్ల చప్పుడు రావడంతో హోటల్ సిబ్బంది డోర్‌ను తట్టారు. అప్పటికే ఇద్దరూ క్రిమిసంహారక మందును తాగారు. అపస్మారక స్థితిలో ఉన్న అజయ్ డోర్ తీసి కిందపడిపోయాడు. అంతకు ముందే బెడ్‌పై శ్రావణి మృతిచెంది ఉంది. అజయ్‌ను చికిత్స నిమిత్తం ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
వైష్ణవి ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ ఆత్మహత్య
-
ప్రేమికురాలు మోసం చేస్తే?
‘‘ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తుంది. అందుకు కారణమైన వారిని తెలుసుకొని, వారిని మైండ్ రీడర్ ఎలా అంతం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘స్పెషల్’. విలన్‌గా, సహనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాత్సవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21 ప్రేక్షకుల ముందుకు రానుంది. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘మైండ్ రీడర్ స్టోరీ ఇది. ఫెంటాస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఉంటుంది. ‘గజిని’ టైప్ జోనర్ అయిన మా సినిమాలో లవ్, ఎమోషన్స్‌కి ప్రాధాన్యం ఇచ్చాం. ఇది చిన్న సినిమానేకానీ, మీరందరూ చూసిన తర్వాత పెద్ద సినిమాగా భావిస్తారు’’ అన్నారు. ‘‘చిన్నప్పటి నుంచి థ్రిల్లర్స్ అంటే ఇష్టం. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల్లో మార్పువచ్చింది. హీరో, హీరోయిన్స్కంటే కథకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. తప్పకుండా మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరోయిన్ అక్షిత శ్రీనివాస్. -
ఆ సినిమాలు చెడగొడుతున్నాయి
సహాయ నటుడిగా కెరీర్ మొదలు పెట్టి, విలన్‌గా, హీరోగా రాణిస్తున్న అజయ్ నటించిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందం శ్రీవాస్తవ్ నిర్మించిన ఈ సినిమాని జూన్ 7న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగులో ఈ జోనర్ చాలా అరుదు. తమిళంలో రెగ్యులర్‌గా వస్తున్నాయి. టేకింగ్ పరంగా ‘గజిని, పిజ్జా, సెవెన్త్ సెన్స్, కాంచన, అపరిచితుడు, హాలీవుడ్లో వచ్చిన సిక్త్స్ సెన్స్, అన్ బ్రేకబుల్, సైకో’ వంటి సినిమాలను తలపించేలా మా మూవీ ఉంటుంది. ఇది మన తెలుగు సినిమా అని గర్వంగా చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం బాధపడుతున్న ఓ విషయాన్ని చూపించబోతున్నాం. చిన్నసినిమా బూతు సినిమాలకు కేరాఫ్‌గా మారింది. ఈ సినిమాలు యూత్‌ని చెడగొడుతున్నాయి. వీటికి నాంది ‘అర్జున్ రెడ్డి, ఆర్ఎక్స్ 100’ సినిమాలే. ఈ సినిమాల వల్ల నెలకు ఒకటి చొప్పున ఈ తరహావి వస్తున్నాయి. దాసరి నారాయణరావుగారి తర్వాత తెలుగు మోడ్రన్ సినిమాకు గురువు అనిపించుకోవాల్సిన రామ్‌గోపాల్ వర్మగారు ‘జీఎస్టీ’ లాంటి బూతు సినిమాలు తీస్తున్నాడు. సామాజిక బాధ్యత ఉన్న తెలుగు సినిమాలు తీసిన ఏకైక దర్శకుడు కృష్ణవంశీగారు, హీరో చిరంజీవిగారు’’ అన్నారు. ‘‘క్షణం, గూఢచారి’ సినిమాలకు నాలుగు రెట్లు ఎక్కువగా ‘స్పెషల్’ ఉంటుంది. ప్రతి జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు బయ్యర్లు మా సినిమాని అడుగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేసే అవకాశం ఇచ్చిన వాస్తవ్గారికి ప్రత్యేక ధన్యవాదాలు’’ అని బాపిరాజు అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మణ్యం, కెమెరా: బి. అమర్ కుమార్. -
మైండ్ రీడింగ్ సైకో
అజయ్, రంగా, అక్షత ముఖ్య పాత్రల్లో నందమ్ శ్రీవాత్సవ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘స్పెషల్’. హైదరాబాద్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘ఓ క్రిమినల్ ఒక రకమైన ఇంజెక్షన్‌ను వాడుతూ చాలామందికి హాని తలపెడుతుంటాడు. అసలు ఆ ఇంజెక్షన్ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలుసుకునే పోలీస్ అధికారి పాత్రలో నటించాను. నా కెరీర్లో ఇది ప్రత్యేకమైన చిత్రం’’ అని అజయ్ అన్నారు. ‘‘మైండ్ రీడర్‌గా మారిన ఓ సైకో ఏం చేశాడు? అతన్ని పోలీసులు పట్టుకున్నారా? అనే అంశాలు ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. మైండ్ రీడర్ పాత్రలో రంగా నటించారు. కీలకపాత్రలో అక్షత కనిపిస్తారు. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నందమ్. ఈ చిత్రానికి విన్.వి.ఎస్. మణ్యం సంగీతం అందించారు. బి. అమరకుమార్ ఛాయాగ్రాహకుడు. -
అరంగేట్రంలో అత్యధిక స్కోరు
ఇండోర్: మధ్యప్రదేశ్ ఓపెనర్ అజయ్ రొహెరా బరిలోకి దిగిన తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (267 నాటౌట్) సాధించి రికార్డు పుటల్లోకెక్కాడు. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా హైదరాబాద్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 21 ఏళ్ల అజయ్ (345 బంతుల్లో 267 నాటౌట్; 21 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు ముంబై ఆటగాడు అమోల్ మజుందార్ (260; హరియాణాపై 1994లో) పేరిట ఉండేది. అజయ్, యశ్ దూబే (139 నాటౌట్; 18 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటికి మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను 562/4 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాట్స్‌మెన్ మరోసారి సమష్టిగా చేతులెత్తేయడంతో హైదరాబాద్ రెండో ఇన్నింగ్స్‌లో 185 పరుగులకే కుప్పకూలింది. దీంతో మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్ 253 పరుగులతో విజయం సాధించింది. హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 124 పరుగులకే ఆలౌటైంది. -
రెపరెపల దీపానికి కనురెప్పల కావలి
ఈ తల్లీబిడ్డల జీవితంలో పేదల బతుకులున్నాయి. నిరాదరణకు గురైన మహిళల జీవితాలున్నాయి. తండ్రి ఆలన, పాలనకు నోచుకోని పిల్లల కన్నీళ్లున్నాయి. వైద్యం ఆరోగ్యం పేదవాడికి అందని ద్రాక్ష అని చెప్పేందుకు సాక్ష్యాలున్నాయి. అన్నిటినీ మించి నిండు ప్రాణం కళ్లముందే కొట్టుమిట్టాడుతున్నా కనికరం చూపించలేని పాలకుల నిర్లక్ష్యపు నీలి ఛాయలున్నాయి. కష్టం వస్తే నేరుగా ఉన్నత న్యాయస్థానాన్ని వేడుకోవాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. రెపరెపలాడుతున్న దీపాన్ని కంటిరెప్పల మధ్య పెట్టి బతికించుకుంటున్న ఓ తల్లి వ్యథ ఇది. అజయ్‌కి పన్నెండేళ్లు. ‘గాచర్స్’ అనే అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. కోటి మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి ఏటా కోటి రూపాయలు ఉంటే తప్ప వైద్యం దొరకదు. మందులు, ఇంజెక్షన్లు కూడా విదేశాల నుంచే తెప్పించాలి! సూర్యకుమారి.. అజయ్ తల్లి.ఉపాధి పనులకు వెళుతూ వచ్చిన కూలీ డబ్బులతో బిడ్డను పోషిస్తోంది. కిడ్నీ వ్యాధి కబళిస్తున్నా, కట్టుకున్నవాడు కలిసిరాకపోయినా కన్నబిడ్డను కంటికి రెప్పలా కాసుకుంటోంది. మూడేళ్ల క్రితమే గుర్తించారు విజయనగరం జిల్లా వేపాడ మండలం నల్లబిల్లి గ్రామానికి వెళితే 2116 మంది జనాభా కనిపిస్తారు. వీరిలో ఐదేళ్ల వయసులోపు పిల్లలు 96 మంది ఉంటే ఆరేళ్ల నుండి 14 ఏళ్ల లోపు వయసు పిల్లలు 62 మంది వున్నారు. అరవై రెండు మందిలో ఒకడు పన్నెండేళ్ల వయసున్న పెదపూడి అజయ్. దేవరాపల్లి మండలం కాశీపురంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. పుట్టుకతోనే ఎంజైమ్ లోపంతో వచ్చే గాచర్స్ అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. అజయ్‌కు మూడో ఏటా నుండే ఆరోగ్యం సమస్యలు తలెత్తినప్పటికీ మూడేళ్ల క్రితమే ఆ సమస్యలకు గాచర్స్ కారణమని వైద్యులు గుర్తించారు. తనకు కడుపులో కాయ వచ్చిందని, ఎప్పుడుపడితే అప్పుడు అది కదులుతుంటుంటే నొప్పి వస్తోందని అంటున్న అజయ్ బాధను తల్లి సూర్యకుమారి కన్నీటిపర్యంతం అవుతూ సాక్షి ప్రతినిధికి చెప్పుకుంది. ఐదో నెల నుంచీ దగ్గు, జ్వరం ‘‘విశాఖ నగరంలోని మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన సన్యాసిరావుతో 2005లో నా పెళ్లి జరిగింది. 2006లో బాబు, 2008లో పాప పుట్టారు. ఐదు నెలల వరకు బాబు బాగానే ఉన్నాడు. తరువాత నుంచి దగ్గు రావడంతో పాటు జ్వరమూ వస్తుండేది. అప్పుడు అనకాపల్లిలో ఉమామహేశ్వరరావు అనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాం. రెండుమూడేళ్లు ఆయన దగ్గరే వైద్యం చేయించాం. తర్వాత కొత్తవలసలో శ్రీకాంత్ అనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లాం. అప్పటికీ ఫలితం లేకపోయింది. బాబుకి 8 ఏళ్లు వచ్చిన తరువాత విశాఖ కేజీహెచ్ దగ్గర ప్రేమ్‌కుమార్ దగ్గరకు తీసుకెళ్లాము. అక్కడ ఆస్మా తగ్గింది. కానీ అక్కడ నుంచి వాంతులు అవ్వడం ప్రారంభమైంది. ఆ సమయంలో ఊపిరి పీల్చుతుంటే బాబుకి బాగా నొప్పి వచ్చింది. ఆ సంగతి మాకు చెప్పకుండా అలాగే రెండురోజులు స్కూల్‌కి కూడావెళ్లాడు. అన్నం తినమంటే ఆకలిగా లేదని అన్నం తినేవాడుకాదు. ఏం తిన్నా, పాలు తాగిన బాబుకి వాంతులు అయిపోయేది. ఏడాదికి కోటి రూపాయలు! బాబుకి ఇలా అయిన దగ్గర నుంచి మా ఆయన బాబుని పూర్తిగా పట్టించుకోవడం మానేసాడు. ఆయన వైజాగ్ మద్దిలపాలెంలో వెల్డింగ్ చేస్తుంటాడు. బాబుకి నొప్పి వస్తే నాతో పాటు అమ్మ, తమ్ముడే హాస్పిటల్‌కు తీసుకెళుతుంటారు. నాక్కూడా ఆరోగ్యం బాగుండేది కాదు. చెరువు పనులు ఉంటే వెళ్తుంటాను. నాకు ఒంట్లో బాగోదని ఆ పనికి కూడా తమ్ముడు నన్ను పంపించేవాడు కాదు. నాకు, నా బిడ్డకు ఇంత కష్టం వచ్చిందని ఎవరినైనా సాయం అడగాలనుకున్నా.. అందరం పనులు చేసుకునే వాళ్లమేగా అని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నా. తర్వాత బాబును విశాఖ కె.జి.హెచ్.కు తీసుకెళ్లి ఆరునెలలపాటు చికిత్స చేయించాము. చివరికి అక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ లేదన్నారు. బెంగళూరు వెళ్లమన్నారు. బాబు ట్రీట్మెంట్కు మెడిసిన్ ఉంది కానీ ఒక్క ఇంజక్షను సుమారు లక్ష రూపాయలు ఉంటుందన్నారు. డాక్టర్‌ను అడిగితే మీరు లోకల్ ఎమ్మెల్యేను గానీ, లేదా ఇంకెవరినైనా ధన సాయం అడిగి చూడండి అన్నారు. హైదరాబాద్‌లో జెనిటిక్స్ మేడమ్ రాధా రమాదేవి గారిని కలిశాం. ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఉందని అయితే అది చాలా ఖరీదైనదని ఆమె ద్వారానే తెలిసింది. ఒక హాస్పిటల్లో ఈ వ్యాధికి అయ్యే ఖర్చు ఎంతో అంచనా వేసి ఏడాదికి కోటి రూపాయలు అవుతుందని చెప్పారు. అప్పులు తప్ప ఏమీ మిగల్లేదు బాబుకు పదిహేను రోజులకోసారి ఉదయంపూట నొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో ఏం తిన్నా వాంతులు అవుతుంటాయి. తిన్నగా కూర్చోలేడు. పడుకోలేడు. అప్పుడే డాక్టరు రాసిచ్చిన టానిక్ వేసేవాళ్లం.కేజీహెచ్ హాస్పిటల్లో మేడమ్ మమ్మల్ని ఇక హాస్పిటల్‌కి రానవసరం లేదన్నారు. ఎందుకంటే ఈ వ్యాధికి వైద్యం అందించే మందులు అక్కడ లేవు. పదేళ్ల పాప రిషిత, నా బాబు, వాడి కోసం చేసిన అప్పులు తప్ప నాకు ఇంకేమి లే దు. అజయ్ అమ్మమ్మ, తాతయ్య, మేనమామ అరిపాక సరోజిని, విశ్వనాథం, సతీష్‌లు నాకు తోడుగా ఉన్నారు. అజయ్‌కు అనారోగ్యం ఉందని తెలిసినప్పటి నుంచీ నా భర్త సన్యాసినాయుడు తాగుడుకు బాగా అలవాటు పడి మమ్మల్ని పట్టించుకోవటం మానేశాడు. కోర్టును కూడా ఆశ్రయించాం రిపోర్టుల ఆధారంగా అజయ్ వ్యాధి అరుదైనదని తెలిసింది. దానికి వైద్యం కేజీహెచ్‌లో అందించలేమని బెంగళూరు, సీఎంసీలో మందులు దొరికే అవకాశముందని వైద్యులు చెప్పారు. ఆరునెలలు పాటు అక్కడి సీఎంసీలో అనేక టెస్టులు చేయించి వైద్యసేవలు అందించారు. ఒక్క ఇంజక్షన్ ఖరీదు రూ.1.24 లక్షలన్నారు. అంత ఆర్థిక స్తోమత లేకపోవటంతో అక్కడి నుంచి వచ్చేశాం. అప్పుడే.. సీఎంసీ వైద్యులు సుమిత హైదరాబాద్ వెళ్లమంటే బంజారాహిల్స్‌లో డాక్టర్ రాధారమాదేవిని కలిశాం. అంత డబ్బంటే ఎలా! ప్రభుత్వం నుండి సహాయం చేయమని అడగడానికి అమరావతి వెళ్లాం. అక్కడ సిఎమ్ అందుబాటులో లేకపోవటంతో మా గోడు వినిపించలేక వెనుదిరిగాం. అప్పుడే నాకూ కిడ్నీలో రాళ్లున్న విషయం బయటపడింది. కిడ్నీ సమస్యతో ఏ పనిచేయలేకపోతున్నా. ఆరోగ్యం బాగున్నప్పుడు గ్రామంలో ఉపాధి పనికి వెళుతుంటాను. కోటాబియ్యం, కట్టెల పొయ్యితోనే జీవనం సాగిస్తున్నాను. ఇలాంటి స్థితిలో బాబుకి ఇంత ఖరీదైన వైద్యం చేయించలేను. అలాగని వాడిని అలా వదిలేయలేనని బాధపడుతున్న సమయంలో తెలిసిన వ్యక్తి సలహా మేరకు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాం. నా బిడ్డ ప్రాణాలను నిలిపేందుకు అవసరమైన వైద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా భావించి ఆ ఖర్చును భరించాలని పిటిషన్ వేశాం. ప్రభుత్వం నుంచి ఇంత వరకూ ఎలాంటి స్పందన లేదు’’ అని చెబుతూ సూర్యకుమారి బోరున విలపించింది. వ్యాధి లక్షణాలు గాచర్స్ వ్యాధినే గ్లూకోసెరిబ్రో సైడస్ అని కూడా అంటారు. ఎంజైము లోపం వల్ల కాలేయం పెరుగుతూ ఉంటుంది. ప్లేట్లెట్స్ ఉండాల్సిన మోతాదు కంటే తక్కువగా ఉంటాయి. ఎర్రరక్త కణాలను గాచర్స్ వ్యాధి ధ్వంసం చేస్తూ ఉంటుంది. గాయమైతే రక్తం గడ్డకట్టకుండా స్రవిస్తూనే ఉంటుంది. గాచర్స్ కణాలు ఎముకల్లో మూలుగను కూడా పీల్చేస్తూ ఉంటాయి. ఎర్రరక్త కణాలు తక్కువ కావడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గుతుంది. ఇనుప ధాతువు మోతాదు రోజు రోజుకూ పడిపోతూ ఉంటుంది. రక్తహీనత సమస్య ఉత్పన్నమవుతుంది. ఊపిరితిత్తుల సమస్యతో శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఎముకలు, కీళ్ల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఈ వ్యాధిని బెటా – గ్లూకోసైడస్ లుకోసైట్ (బీజీఎల్) అనే రక్తపరీక్ష ద్వారా గుర్తిస్తారు. సాయం అందించాలనుకున్నవారు... అజయ్ మేనమామ సతీష్‌ను 8500637917, 8374145443 నెంబర్లలో సంప్రదించవచ్చు. – బోణం గణేష్, సాక్షి, విజయనగరం -
మనసు చదివేస్తాడు
‘విక్రమార్కుడు’ సినిమాలో ప్రతినాయకుడిగా అందరి ప్రశంసలు అందుకున్నారు అజయ్. పలు చిత్రాల్లో హీరోగా, విలన్‌గా, సహాయ నటుడిగా నటిస్తున్న ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘స్పెషల్’. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మించారు. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ఇదొక మైండ్ రీడర్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒక అమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. ఆ అమ్మాయి అతన్ని మోసం చేయడానికి కారణమైన వాళ్ల మీద ఈ మైండ్ రీడర్ పగ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి, వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారాసైకాలజీ స్కిల్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ఇది. అజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు’’ అన్నారు. ‘‘ఫ్యాంటసీ లవ్ యాక్షన్ షేడ్స్‌తో నడిచే చిత్రమిది. కథ, కథనం, ట్విస్టులు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఇందులోని డైలాగ్స్ ప్రేక్షకులకు కొత్త ఫీలింగ్‌ని ఇస్తాయి. ఈనెల 29న టీజర్‌ను, నవంబర్ చివరి వారంలో సినిమాని రిలీజ్ చేస్తాం’’ అని శ్రీవాస్తవ్ అన్నారు. రంగ, అక్షత, సంతోష, అశోక్ కుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎన్వీఎస్ మన్యం, కెమెరా: బి అమర్ కుమార్. -
కథ విన్నాక ఏం మాట్లాడలేదు – ఆమని
‘‘అమ్మ దీవెన’ మంచి సబ్జెక్ట్. కుటుంబసభ్యులందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలో తల్లి బాధ్యత ఏంటి? పిల్లలను ఒక స్థాయికి తీసుకురావడానికి అమ్మ ఎంత కష్టపడుతుంది? అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించనున్నాం’’ అని నటి ఆమని అన్నారు. ఆమె కీలక పాత్రలో శివ ఏటూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘అమ్మ దీవెన’. పోసాని కృష్ణమురళి, అజయ్ ఘోష్, దినేష్, శరత్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పద్మ సమర్పణలో లక్ష్మమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై ఎత్తరి గురవయ్య రూపొందిస్తోన్న ఈ చిత్రం మంగళవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో శ్రీకాంత్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఆమని మాట్లాడుతూ– ‘‘దర్శక–నిర్మాతలు నన్ను కలిసి ‘అమ్మ దీవెన’ కథ చెబుతామన్నప్పుడు ఆలోచించాను. కానీ, కథ విన్నాక ఏం మాట్లాడలేదు.. చేస్తానని చెప్పా. ఇలాంటి కథను తీయడానికి నిర్మాతలు చాలా ధైర్యంగా ముందుకొచ్చారు. ఇప్పటిదాకా నేను చేసిన పాత్రలతో పోలిస్తే ఇది చాలా వైవిధ్యమైంది’’ అన్నారు. ‘‘ఉమ్మడి కుటుంబంలోని బంధాలను చక్కగా ఆవిష్కరించే చిత్రమిది’’ అన్నారు శివ ఏటూరి. ఎత్తరి గుర వయ్య, నటుడు అజయ్ ఘోష్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యస్.వి.హెచ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: పద్మజ నాయుడు, ఎత్తరి చినమారయ్య. -
అజయ్, సింధు శుభారంభం
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) ర్యాంకింగ్ టోర్నీలో తెలంగాణ క్రీడాకారులు అజయ్ పృథ్విక్, సింధు జనగాం శుభారంభం చేశారు. ఫతేమైదాన్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం ప్రారంభమైన ఈ టోర్నీలో సింగిల్స్ విభాగాల్లో వీరిద్దరూ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ తొలిరౌండ్లో అజయ్ 7–5, 6–1తో అభిషేక్ శుక్లాపై గెలుపొందగా... మహిళల విభాగంలో ఎనిమిదో సీడ్ సింధు 6–1, 6–2తో ఆకాంక్ష (మహారాష్ట్ర)ను చిత్తుగా ఓడించింది. ఇతర మహిళల తొలిరౌండ్ మ్యాచ్‌ల్లో స్మృతి 6–0, 6–0తో మేఘ ముత్తుకుమారన్ (తమిళనాడు)పై, సహజ (తెలంగాణ) 6–1, 6–3తో మౌలిక రామ్ (తెలంగాణ)పై, లిఖిత కాల్వ (తెలంగాణ) 6–0, 6–0తో శిల్పి స్వరూప దాస్ (ఒడిశా)పై, దీక్ష అజిత్ (ఏపీ) 6–0, 6–1తో వైశాలి ఠాకూర్ (తమిళనాడు)పై, లిఖిత లండా (ఏపీ) 6–0, 6–0తో ప్రియాంక రోడ్రిక్స్ (మహారాష్ట్ర)పై, ప్రతిభ (కర్నాటక) 6–2, 6–2తో అనీశ రాయుడు (ఏపీ)పై విజయం సాధించి రెండోరౌండ్‌కు చేరుకున్నారు. పురుషుల తొలిరౌండ్ మ్యాచ్‌ల ఫలితాలు శివదీప్ కొసరాజు (ఏపీ) 6–3, 2–6, 7–6 (5)తో కైవల్య వామనరావు (మహారాష్ట్ర)పై, హేవంత్ కుమార్ (తెలంగాణ) 7–6 (8/6), 6–1తో అమర్ (కర్ణాటక)పై, సాయి శరణ్‌రెడ్డి (ఏపీ) 6–4, 7–5తో శ్రీనివాస్ (ఏపీ)పై, అనికేత్ వెంకట్ (తెలంగాణ) 6–4, 3–6, 7–5తో అరవింద్ రెడ్డిపై, కృష్ణతేజ (తెలంగాణ) 6–4, 6–2తో సుభాష్‌పై, టి. వినయ్ కుమార్ (కర్నాటక) 6–3, 3–6, 6–3తో సౌరభ్ కుమార్‌పై, డి. అఖిల్ కుమార్ 3–6, 6–4, 6–2తో కె. రోహిత్‌పై, ఆయుశ్ (పంజాబ్)6–2, 6–3తో తరుణ్ కర్రా (తెలంగాణ)పై, పృథ్వీ శేఖర్ (తమిళనాడు) 7–5, 6–2తో దుర్గ హిమకేశ్ (తెలంగాణ)పై గెలుపొందారు. -
ప్రేమదేశం ప్రారంభం
‘నను నేనె మరచినా నీ తోడు.. విరహాన వేగుతూ ఈనాడు.. వినిపించదా ప్రియా నా గోడు.. ప్రేమా’ పాట వినగానే టక్కున ‘ప్రేమదేశం’ సినిమా గుర్తుకు రాకమానదు. అబ్బాస్, వినీత్, టబూ ప్రధాన పాత్రల్లో 1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ ఎంతటి బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ‘ప్రేమదేశం’ పేరుతో మరో సినిమా తెరకెక్కుతోంది. అజయ్, మాయ జంటగా శ్రీకాంత్ శిద్ధం దర్శకత్వంలో సిరి క్రియేషన్స్ వర్క్స్ పతాకంపై శిరీష, నీలిమ తిరుమల్ శెట్టి నిర్మిస్తున్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నటి జీవితా రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేయగా, హీరో ఆకాష్ పూరి క్లాప్ ఇచ్చారు. ఆనంద్ రవి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి మణిశర్మ సంగీత దర్శకునిగా, శేఖర్ గంగాణమోని సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. తనికెళ్ల భరణి, ‘వెన్నెల’ కిషోర్, అజయ్ కతుర్వ, మాయ, శివకుమార్ రామచంద్రవరపు, వైశాకి నటిస్తున్నారు. -
ప్రపంచ కప్ గెలిపించినా పట్టించుకోరా?
మాచర్ల: అజయ్ కుమార్ రెడ్డి... ఆంధ్రప్రదేశ్ క్రికెటర్... అంతేకాదు భారత అంధుల క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా... రెండుసార్లు (2012లో, 2014లో) తన అద్వితీయ ప్రతిభతో భారత జట్టుకు టి20, వన్డే ప్రపంచకప్ టైటిల్స్ దక్కడంలో కీలకపాత్ర పోషించాడు. మరో రెండుసార్లు (2017, 2018లో) కెప్టెన్ హోదాలో భారత జట్టును ముందుండి నడిపించి టి20, వన్డే వరల్డ్ కప్‌లలో విజేతగా నిలిపాడు. అయినప్పటికీ అతని విజయాలను గుర్తించే వారు కరువయ్యారు. అంధత్వం ప్రతిభకు అడ్డుకాదని... పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిన అజయ్ కుమార్‌కు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి గుర్తింపు దక్కకపోవడం గమనార్హం. నాలుగేళ్లుగా భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అజయ్... ఆంధ్రప్రదేశ్‌లో అంధుల కోసం ప్రత్యేక క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయాలని సంకల్పించాడు. ఈ విషయంలో తనకు ప్రభుత్వం సహాయం చేయాలని కోరేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసేందుకు అవకాశం కల్పించాలని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కొల్లూరి రవీంద్ర ద్వారా అనేకసార్లు ప్రయత్నించాడు. కానీ మంత్రి రవీంద్ర భారత జట్టు కెప్టెన్ అభ్యర్థనను పట్టించుకోలేదు. జాతీయ జట్టు కెప్టెన్‌గా తనకు కనీస గౌరవం ఇవ్వకపోవడం ఎంతో బాధ కలిగించిందని ‘సాక్షి’తో అజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అత్యంత వెనుకబడిన పల్నాటి ప్రాంతం నుంచి, అందునా పేద కుటుంబం నుంచి ఎంతో కష్టపడి పైకొచ్చి జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న తనతో పాటు అంధ క్రికెటర్లను ఆదరించకపోవడం తీవ్ర మనస్తాపానికి గురిచేసిందని 27 ఏళ్ల అజయ్ అన్నాడు. ప్రభుత్వం క్రీడాకారులందరినీ ఒకేలా ఆదరించాలని... చూపు లేని క్రీడాకారులను చిన్నచూపు చూడరాదని ప్రభుత్వ క్రీడాధికారులకు విజ్ఞప్తి చేశాడు. నాలుగేళ్ల ప్రాయంలో తలుపు గడి తగలడంతో అజయ్ ఎడమ కంటి చూపును పూర్తిగా కోల్పోయాడు. కుడి కన్నుతో అతను కేవలం రెండు మీటర్ల దూరంలో ఉన్న వాటిని మాత్రమే చూడగలడు. చిన్నతనంలోనే చూపు కోల్పోయినా అతని ఆత్మవిశ్వాసం మాత్రం దెబ్బతినలేదు. తోటి వారు అంధుడు అని ఎగతాళి చేస్తుంటే అజయ్ అవేమీ పట్టించుకోలేదు. కేవలం తన పట్టుదలను నమ్ముకున్నాడు. నరసరావుపేటలోని అంధుల స్కూల్లో ప్రవేశం పొంది చదువులోనే కాదు క్రికెట్ ఆటలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. 2006లో ఆంధ్రప్రదేశ్ అంధుల క్రికెట్ జట్టులో చోటు సంపాదించిన అతను 2010లో తొలిసారి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. అదే ఏడాది ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రెండు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు గెల్చుకున్నాడు. 2012లో తొలిసారి జరిగిన అంధుల టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు టైటిల్ దక్కడంలో అజయ్ కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను 33 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 2014లో భారత జట్టు కెప్టెన్‌గా ఎంపికైన అజయ్ తన నాయకత్వ పటిమతో భారత్‌కు అదే ఏడాది ఆసియా టి20 కప్ టైటిల్‌ను... 2017లో టి20, 2018లో వన్డే వరల్డ్ కప్ టైటిల్స్‌ను అందించాడు. -
టైసన్‌గా మారుతున్న ఆర్కే.సురేశ్
తమిళసినిమా: నిర్మాత, నటుడు ఆర్కే.సురేశ్ ఇప్పుడు తన చిత్రాలతో బిజీ అయ్యారు. తొలుత నిర్మాతగా రంగప్రవేశం చేసి ధర్మదురై లాంటి కొన్ని మంచి చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ప్రతి నాయకుడిగా అవతారమెత్తి మరుదు, తారైతప్పట్టై వంటి చిత్రాలలో దుమ్మురేపారు. ఇప్పుడు కథానాయకుడిగా బిజీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న బిల్లాపాండి,వేట్టైనాయ్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా టైసన్ అనే చిత్రాన్ని తన స్టూడియో 9 పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించడానికి రెడీ అయ్యారన్నది తాజా వార్త. దీనికి రత్తన్లింగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఆ మధ్య విడుదలై సినీ పరిశ్రమ వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న అట్టు చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఇది టైసన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం అవుతుంది. టైసన్ చిత్రం గురించి రత్తన్లింగా తెలుపుతూ ఆర్కే.సురేశ్ ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు నటుడు అజయ్ రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామని, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం అంతా ప్రముఖులే ఉంటారని దర్శకుడు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
వారిపై సీబీఐ విచారణకు ఆదేశించాలి: షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు అజయ్‌షా మీద వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించాలని శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 2జీలో స్కామ్ జరిగిందని బీజేపీ చేసిన ఆరోపణలకు అప్పటి యూపీఏ ప్రభుత్వం తక్షణమే స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించిందన్నారు. కోర్టు వారిని విచారణలో నిర్దోషులని తేల్చిందన్నారు. తమ పార్టీ నేతలపై ఆరోపణలు వస్తే సీబీఐ విచారణ జరిపించే సత్తా బీజేపీకి ఉందా అని షబ్బీర్ ప్రశ్నించారు. అమిత్‌షా కొడుకు అజయ్‌షా, విజయ్ మాల్యా, అదాని, ముఖేశ్ అంబానీ తదితరుల మీద వచ్చిన ఆరోపణలపై సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గుజరాత్ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల సెంటిమెంటును రెచ్చగొట్టి రాజకీయంగా ప్రయోజనం పొందారని విమర్శించారు. -
'నా భార్య వేధిస్తోంది.. ఆదుకోండి'
సాక్షి, జగిత్యాల: భార్య వేధిస్తోందంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు సెల్‌టవర్ ఎక్కాడు. జగిత్యాల పట్టణంలో అజయ్ అనే వ్యక్తి ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. భార్య వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని, విడాకులు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. అక్రమ కేసులు పెట్టి భార్య వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ సెల్‌టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. ' నా భార్య వేధిస్తోంది.. విడాకులు ఇప్పించి ఆదుకోండి..' అంటూ చిట్టీలు రాసి సెల్ టవర్ నుంచి కిందకు విసురుతూ నిరసన తెలుపుతున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకి చేరుకుని అజయ్ తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మైండ్ రీడర్ పగ
విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్. ప్రస్తుతం ఆయన హీరోగా రూపొందుతోన్న సినిమా ‘స్పెషల్’. అక్షిత కథానాయిక. వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘మైండ్ రీడింగ్ స్కిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న ఒక వ్యక్తిని కొందరు మోసం చేస్తారు. వారిని తన స్కిల్‌తో ఎలా పట్టుకున్నాడు? ఎలా పగ తీర్చుకున్నాడు? అన్నది ఆసక్తికరం. అజయ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా మైండ్ రీడర్ చేస్తున్న క్రైమ్‌ని, దాని వెనుక ఉన్న రీజన్స్‌ని వెతికి, వెలికి తీసే పాత్రలో నటించారు. ఈ సినిమాలో కొత్త అజయ్‌ని చూస్తారు. ఫొటోగ్రఫి, విజువల్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. సంతోష, అశోక్ కుమార్, చక్రపాణి, జబర్దస్త్ అప్పారావు, ప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: అమర్ కుమార్, సంగీతం: యస్వీయస్ మణ్యం. -
అడవుల్లో మరగధకాడు
తమిళసినిమా: పూర్తిగా అడవుల్లో చిత్రీకరణను జరుపుకున్న చిత్రం మరగధకాడు అని ఆ చిత్ర దర్శకుడు మంగళేశ్వరన్ తెలిపారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఆర్ఆర్.ఫిలింస్ పతాకంపై రఘునాథన్ నిర్మిస్తున్నారు. అజయ్, రంజనా, జయశ్రీ,మలయాళ దర్శకుడు ఇలియాస్ కాత్తవన్, జేపీ.మోహన్, పావాలక్ష్మణన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి జయప్రకాశ్ సంగీతాన్ని, నక్షత్ర ప్రకాశ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది పూర్తిగా అడవుల్లో చిత్రీకరించిన మంచి సందేశంతో కూడిన కథా చిత్రంగా ఉంటుందన్నారు. నానాటికి నశించి పోతున్న అడవులు, వాటిని నమ్ముకుని జీవించే అటవీవాసుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా మరగధకాడు చిత్రం ఉంటుందన్నారు. నాగరికత, నగరాభివృద్ధి పేరుతో అడవులను ఎలా హరింపజేస్తున్నారు? దాని వల్ల ప్రకృతి ఎలా బాధింపునకు గురవుతోంది? అన్న అంశాలను ఆవిష్కరించే చిత్రం ఇదన్నారు. ఇప్పుడు నీరు కొనుక్కుంటున్నట్లే ఇకపై గాలిని కొనుక్కునే పరిస్థితి రాకుడదని చెప్పే చిత్రంగా మరగథకాడు చిత్రం ఉంటుందన్నారు. ఇందులో ఒక చక్కని ప్రేమ కథ కూడా ఉంటుందన్నారు. ఒక పరిశోధన నిమిత్తం అడవికి వెళ్లిన కథానాయకుడికి అక్కడ ఒక అందమైన అమ్మాయి తారస పడుతుందన్నారు. వారి పరిచయం ప్రేమగా మారగా,అది ఎలాంటి పరిణామాలకు దారి తీసిందనే ఆసక్తికరమైన సన్నివేశాలతో తెరకెక్కిస్తున్న చిత్రం మరగధకాడు అని చెప్పారు. చిత్రాన్ని తమిళనాడు, కేరళ ప్రాంతాల్లోని దట్టమైన అడవుల్లో చిత్రీకరించినట్లు దర్శకుడు తెలిపారు. -
అప్పుడు మాకు నిద్రపట్టలేదు...!
అజయ్, రంగ, అక్షిత, సంతోష ముఖ్యతారాగణంగా నందనాల్ క్రియేషన్స్ పతాకంపై వాస్తవ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘స్పెషల్’. ద స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ అనేది ఉపశీర్షిక. ఎన్వీయస్ మణ్యం స్వరకర్త. ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ– ‘‘లవ్ అండ్ రివెంజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాం. మా చిత్రానికి అజయ్‌గారు బ్యాక్‌బోన్ లాంటి వారు. ఇన్వెస్టిగెటివ్ ఆఫీసర్‌గా ఆయన మేము ఊహించిన దాని కన్నా సూపర్‌గా నటించారు. సైకాలజీ డాక్టర్ అశోక్‌కుమార్, అక్షిత, సంతోష, రంగా బాగా నటించారు. మా సినిమా కాస్త షూటింగ్ జరిగిన తర్వాత ‘రాజుగారి గది 2’ లో నాగార్జున మైండ్ రీడర్‌గా చేస్తున్నారని తెలిసింది. అప్పుడు మాకు నిద్రపట్టలేదు. కానీ, సినిమా చూశాక నాగార్జునగారి క్యారెక్టర్ చూసి, హ్యాపీ ఫీలయ్యాం. ఆయన నటన ఎక్స్లెంట్. మా మైండ్ రీడర్‌కి, ‘రాజుగారి గది–2’ మైండ్ రీడర్‌కి పోలిక లేదు’’ అన్నారు. ‘‘కథ వినగానే ఇలాంటి కాన్సెప్ట్ చిత్రాలు ప్రేక్షకులు నచ్చుతాయా అని ఆలోచించాను. కానీ, అవుట్‌పుట్ బాగా వచ్చింది. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను’’ అన్నారు అజయ్. ‘ఈ చిత్రంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ క్యారెక్టర్ చేశాను’’ అన్నారు రంగా. అశోక్‌కుమార్, ఎస్వీయస్ మణ్యం, అక్షిత పాల్గొన్నారు. -
మనసుని చదువుతాడు!
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, అప్పుడప్పుడు హీరోగా నటిస్తున్న అజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘స్పెషల్’ (ద స్టోరీ ఆఫ్ ఎ మైండ్ రీడర్). వాస్తవ్ దర్శకత్వంలో నందలాల్ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవ్ మాట్లాడుతూ– ‘‘ద స్టోరీ ఆఫ్ మైండ్ రీడర్ అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది. ఒక ప్రత్యేక కథాంశంతో రూపొందుతున్న వైవిధ్యమైన ప్రయోగాత్మక చిత్రమిది. హాలీవుడ్ తరహా స్క్రిప్టుతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో అజయ్ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమాలో ఒకటే పాట ఉంటుంది. కథ డిమాండ్‌ను బట్టి మాల్దీవుల్లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాం. మూడు రోజుల క్లైమాక్స్ చిత్రీకరణ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో టీజర్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్, సంగీతం: మణ్యం యన్వియస్. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ఇసుక అన్వేషణలో ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. స్నేహితుడితో కలిసి బైక్‌లో బయల్దేరిన అతడిని రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబళించింది. ఆస్పత్రి వద్దకు చేరుకున్న తల్లి, చెల్లి గుండెలవిసేలా రోదించారు. గుంతకల్లు రూరల్: కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. ఇదే ప్రమాదంలో అతని స్నేహితుడు తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. గుంతకల్లుపట్ట ణంలోని హౌసింగ్‌బోర్డ్ కాలనీకి చెందిన శివ (22), అజయ్ స్నేహితులు. వీరిద్దరూ ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా వ్యాపారం చేసేవారు. రెండు,మూడు రోజులుగా చెదురుమదురు వర్షౠలు కురుస్తుండటంతో ఇసుక ప్రాంతాలను గుర్తించేందుకు ఇద్దరూ ఆదివారం ఉదయాన్నే ద్విచక్రవాహనంపై గూళ్యం గ్రామానికి వెళ్లారు. కాసేపటి తర్వాత తిరుగుపయనమయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అత్తిబెలగళ్ సమీపంలోకి రాగానే బైక్ నడుపుతున్న శివ కంట్లోకి ఏదో పడింది. దీంతో అదుపుతప్పి ముందు వెళుతున్న ఎద్దులబండిని వేగంగా ఢీకొన్నారు. శివ తీవ్రగాయాలతో అపస్మారకస్థితికి చేరుకోగా.. స్నేహితుడు అజయ్‌కు కాలు విరిగింది. క్షతగాత్రులిద్దరినీ స్థానికులు 108 వాహనంలో గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే శివ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అజయ్ చికిత్స పొందుతున్నాడు. -
క్వార్టర్స్‌లో అజయ్, రాజీవ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఓపెన్ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో అజయ్ భూషణ్, రాజీవ్ ఇనుగంటి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో అజయ్ 4–3 (21–63, 65–35, 43–44, 59–7, 76–38, 11–65, 87–38)తో రషీద్ ఖురేషిపై గెలుపొందగా, రాజీవ్ 4–2 (69–43, 73–01, 25–67, 65–17, 42–92, 61–34)తో ఖైజర్ రవూఫ్‌ను ఓడించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బాలకృష్ణ 4–1 (70–25, 56–21, 58–51, 44–64, 77–32)తో పి. హేమంత్ కుమార్‌పై, ఇ. పాండురంగయ్య 4–0 (65–26, 61–32, 59–37, 72–45)తో సయ్యద్ అహ్మద్ హుస్సేన్‌పై గెలుపొందారు. అంతకుముందు జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌ల్లో లక్కీ వత్నానీ 4–3 (51–78, 69–34, 59–24, 45–56, 71–55, 45–57, 49–37)తో జేమ్స్ సుందర్ రాజ్‌పై, నరేశ్ కుమార్ 4–3 (70–43, 45–59, 47–17, 49–35, 51–60, 54–13)తో క్లింటన్‌పై, కె. వెంకటేశం 4–3 (53–66, 82–33, 82–37, 54–12, 27–60, 52–62, 57–22)తో మొహమ్మద్ గౌస్‌పై, విశాల్ అగర్వాల్ 4–1 (87–33, 54–32, 51–63, 67–22, 60–58)తో బీఎల్ ధీరజ్‌పై, మీర్ అబిద్ అలీ 4–2 (62–24, 79–08, 54–32, 23–58, 30–60, 57–28)తో అశ్విన్ రావుపై గెలుపొంది ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. -
ఆదిమానవులు ఇతివృత్తంగా అరమ్వేట్రుమై
తమిళసినిమా: హాలీవుడ్ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో అరమ్ మేట్రుమై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు హరికృష్ణ అంటున్నారు. ఈయన తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్త్ సెన్స్ మూవీ మేకర్స్ పతాకంపై శక్తివేల్ నిర్మిస్తున్నారు. నూతన జంట అజయ్, గోపిక హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఇందులో యోగిబాబు, ఉమశ్రీ, అళగు, సూర్యకాంత్, చరణ్‌రాజ్, పరదేశీ భాస్కర్ ముఖ్యపాత్రలు పోషించారు. గణేశ్రాఘవేందర్ సంగీతాన్ని, అరివళగన్ ఛాయాగ్రహణం అందించారు. చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ, ఇది ఈ తరానికి చెందిన కథతో రూపొందించిన చిత్రం కాదన్నారు. సుమారు 900 ఏళ్ల క్రితానికి చెందిన ఆదిమానవుల జీవన విధానాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందని తెలిపారు. వారికి భాషే లేదని చెప్పారు. భాష, జాతి అంటే తెలియకుండా జీవించిన ఆదిమానవుల ఇతివృత్తంగా అరమ్ వేట్రుమై చిత్రం ఉంటుందని చెప్పారు. అలా మూడు కొండల్లో మూడు రకాల ఆదివాసుల జీవన విధానాన్ని ఎంతో వ్యయ ప్రాయాసాలకోర్చి రూపొందించామని తెలిపారు. కథపై నమ్మకంతో చిత్ర యూనిట్ అంతా కష్టపడి తమ ప్రయత్నానికి సహకరించారని అన్నారు. చిత్ర షూటింగ్‌ను నాగరికత చెందని అటవీ ప్రాంతాలను అన్వేషించి నిర్వహించామని చెప్పారు. ఇది హాలీవుడ్ చిత్రం అపోకలిప్టో చిత్రం తరహాలో చాలా వైవిధ్యంగా ఉంటుందని అన్నారు. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందని, చిత్రాన్ని చూసిన శ్రీముత్తమిళ్ లక్ష్మీ మూవీమేకర్స్ అధినేత ఆర్.బాలచందర్ చాలా బాగుందని విడుదల హక్కులను పొందారని దర్శకుడు వెల్లడించారు. -
‘మిసెస్ ఇండియా’ ఫైనల్‌కు అజయ్ భార్య
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు అజయ్ భార్య శ్వేత రావూరి మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 పోటీల్లో ఫైనల్ రౌండ్‌కు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్వయంగా అజయ్ తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నారు. తన భార్య తుది రౌండ్‌కు ఎంపిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని చెప్పిన అజయ్ ఆమె ఫేస్బుక్ పేజీని పోస్ట్ చేసి ఆమెను ఆశీర్వదించాలని కోరారు. అలాగే లైక్ కూడా కొట్టాలని విజ్ఞప్తి చేశారు. సాధారణంగా పెళ్లి అయిన తర్వాత మహిళలు ఫిట్నెస్గా ఉండటం అంత తేలికైన పనికాదు. ఇద్దరు పిల్లలకు తల్లైయ్యాక అందంపై దృష్టి సారించడం కూడా కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అయితే, ఈ సమస్యను సునాయాసంగా అధిగమించిన అజయ్ భార్య హౌట్ మోంద్ నిర్వహించిన మిసెస్ ఇండియా వరల్డ్ వైడ్ 2017 తుది రౌండ్ ఎంపికై ఆశ్చర్య పరిచింది. ఇప్పుడామెను అజయ్ కోరినట్లుగానే ఆశ్వీరదించి ఆల్‌ది బెస్ట్ చెప్పేద్దాం. -
ఈ టిట్లాకు తిక్క రేగితే!
ఉత్తమవిలన్ తన శత్రువును తాను ఎలా ద్వేషిస్తాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే ద్వేషించాలి. తన శత్రువుపై తాను ఎలా కసితో రగిలి పోతాడో మిగిలిన వాళ్లు కూడా అలాగే రగిలి పోవాలి. లేకుంటే తేడాలు వస్తాయి. ఇళ్లు కాలిపోతాయి. ‘నెత్తి మీద టోపీ. చేతిలో పవరు... మూతి మీద మీసం ఉందని... దేవుడు...దేవుడు అని భజన చేశారు. ఏకీ సీ గోలిసే...’ అంటూ మాటలతో మంటలు రేపగలడు టిట్లా.‘టిట్లా’ అంటే మాటలా?మాటల్లోనే తూటాలు పేలుతుంటాయి!‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’గా.... వేషంతో సహా క్రూర హావభావాలతో భయపెట్టించాడు అజయ్. ‘ఖుషి’ సినిమాలో ఈవ్ టీజర్‌గా ప్రేక్షకుల దృష్టిలో పడ్డ అజయ్ ‘ఒక్కడు’ ‘ఛత్రపతి’ సినిమాలలో ఆవేశం మూర్తీభవించిన పాత్రలలో నటించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘విక్రమార్కుడు’ సినిమాలో ‘టిట్లా’ అనే గట్టి విలన్‌గా ప్రేక్షకుల దృష్టిలో మిగిలిపోయాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అజయ్ ఎమ్సెట్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆ కాలేజీ పరిసరాల్లో తరచుగా సినిమా షూటింగ్‌లు జరుగుతుండేవి. షూటింగ్‌లను ఆసక్తిగా చూసేవాడుగానీ ‘నటించాలి’ అని పెద్దగా అనుకోలేదు. ఆ తరువాత మాత్రం నటించాలనే కోరిక బలపడడంతో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ‘కౌరవుడు’ సినిమా డైరెక్టర్, అజయ్ నాన్నకు తెలిసిన వ్యక్తి కావడంతో ఆ సినిమాలో నటించే ఛాన్సు దొరికింది. ‘పెద్దగా స్ట్రగుల్ కాకుండానే సినిమాల్లో నటించే ఛాన్సు వచ్చింది. ఇక ‘నల్లేరు మీద నడకే’ అనుకున్నాడు. అయితే తొమ్మిది నెలలు గడిచినా ఏ సినిమాలోనూ నటించే ఛాన్సు రాలేదు. ‘ఖుషి’ సినిమా సెలెక్షన్‌కు వెళ్లి, సెలెక్ట్ అయిన తరువాత మాత్రం ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. రాజమౌళి ‘సింహాద్రి’ సినిమాలో చిన్న విలన్ రోల్ పోషించాడు. షూటింగ్లో పాల్గొనడానికి కేరళకు వెళ్లినప్పుడు ‘మీ సినిమాలో గుర్తుండిపోయే పాత్రలో నటించాలని ఉంది’ డైరెక్టర్‌తో రిక్వెస్ట్‌గా అన్నాడు. ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆతరువాత మాత్రం ‘సై’ సినిమాలో విలన్ తమ్ముడిగా అజయ్‌కి పవర్ఫుల్ రోల్ ఇచ్చాడు రాజమౌళి. ఇక ‘విక్రమార్కుడు’ సినిమాలో చేసిన ‘టిట్లా’ పాత్రతో పెద్ద గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ‘ఉత్తమ విలన్’గా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. -
అఖిల్ సినిమాలో యంగ్ విలన్
తొలి సినిమాతో నిరాశపరిచిన అక్కినేని నట వారసుడు అఖిల్, రెండో సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. లాంగ్ గ్యాప్ తరువాత మనం ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రెండో సినిమాను ప్రారంభించాడు. ఈ సినిమాను కింగ్ నాగార్జున అనపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్డేట్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇష్క్, 24 సినిమాలో విలన్ గా నటించిన టాలీవుడ్ యంగ్ యాక్టర్ అజయ్, అఖిల్ సినిమాలోనూ విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే అఖిల్ సినిమా యూనిట్‌తో అజయ్ కూడా చేరిపోయాడు. అయితే ఈ సినిమాలో అజయ్, మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడా..? లేక మరో విలన్ కూడా ఉంటాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
'స్నేహితుల వేధింపులకు పారిపోయా'
హైదరాబాద్: హైదరాబాద్‌లో సోమవారం అదృశ్యమైన హాస్టల్విద్యార్థి మంగళవారం ఉదయం నల్లగొండలో ప్రత్యక్షమయ్యాడు. హయత్‌నగర్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల హాస్టల్లో ఉంటున్న 9వ తరగతి విద్యార్థి అజయ్ సోమవారం ఉదయం హాస్టల్ నుంచి అదృశ్యమయ్యాడు. హాస్టల్ వార్డెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అజయ్ నల్లగొండలో ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వెళ్ళిన పోలీసులు విద్యార్థిని తీసుకుని వచ్చారు. తోటి విద్యార్థుల వేధింపులకు తాళలేకే తాను హాస్టల్ నుంచి పారిపోయినట్టు అజయ్ చెప్పాడు. -
నలుగురు తమ్ముళ్లు.. ఓ అన్నయ్య... సూపర్ సెల్ఫీ
మెగా బ్రదర్స్ ముగ్గురిలో చిన్నోడు పవన్‌కల్యాణ్. రియల్ లైఫ్‌లోనే ఆయన తమ్ముడు. కొత్త సినిమాలో పెద్దన్న పాత్రను పోషిస్తున్నారు. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘కాటమరాయుడు’. కిశోర్ పార్ధసాని (డాలీ) దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నారు పవన్. నలభై రోజులుగా పొల్లాచ్చిలో జరుగుతోన్న షూటింగ్ చివరికి వచ్చేసిందట! పొల్లాచ్చి షెడ్యూల్లో పవన్ తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ, అజయ్, చైతన్యకృష్ణ, కమల్ కామరాజులు కూడా పాల్గొంటున్నారు. మంగళవారం లంచ్ టైమ్‌లో తమ్ముళ్లతో కలసి ఓ సెల్ఫీ తీసుకున్నారు పవన్. ఫొటోలో మీరు చూస్తున్నది ఆ సెల్ఫీనే. ‘‘పవన్ చూపించే ప్రేమ, ఆప్యాయతలకు హ్యాట్సాఫ్. ఆయన్ను కలసిన తర్వాత అభిమానించకుండా ఉండలేం. నలభై రోజులుగా ఆయనతో కలసి షూటింగ్ చేయడం ఆనందంగా ఉంది’’ అని ఈ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన చైతన్యకృష్ణ పేర్కొన్నారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ స్వరకర్త. -
భర్తతో చనువుగా ఉండటాన్ని తట్టుకోలేక..
జైపూర్: తన భర్తతో చనువుగా ఉంటుందనే అనుమానంతో చిన్ననాటి స్నేహితురాలిని పథకం ప్రకారం హతమార్చిందో యువతి. అనంతరం ప్రమాదవశాత్తు స్నేహితురాలు మరణించిదంటూ కట్టుకథలు అల్లింది. అయితే పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడటంతో ఆమె చివరకు కటకటాల పాలైంది. ఈ సంఘటన రాజస్తాన్ జైపూర్‌లోని చురులో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.... బబిత, మనీషా బాల్య స్నేహితులు కాగా, ఆర్మీ జవాన్ అజయ్‌తో మనీషా వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో తన భర్తతో బబితకు అక్రమ సంబంధం ఉందన్న అనుమానం కలిగింది. అంతేకాకుండా వారిద్దరూ గంటలకొద్ది ఫోన్లలో మాట్లాడుకుంటున్నారనే అనుమానంతో ఆమెపై మనీషా ఆగ్రహం పెంచుకుంది. దీంతో ఎలాగైనా స్నేహితురాలిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అజయ్ వస్తున్నాడని, తనకు తోడు రావాలంటూ మనీషా ఈ నెల 6న బబితను రతన్‌ఘర్ సమీపంలోని చర్న్వాసి బస్టాండ్‌కు తీసుకువెళ్లింది. ఈ సందర్భంగా ఇద్దరు స్నేహితురాళ్లు బస్టాండ్ సమీపంలోని ఓ చెరువు వద్ద కూర్చున్నారు. కొంత సమయం గడిచాక, మనీషా అనుకోకుండా పడిపోయినట్లుగా తన చేతికున్న ఉంగరాన్ని నీళ్లలోకి జారవిడిచింది. అది తన ఎంగేజ్మెంట్ రింగ్ అని అదిపోతే అజయ్ ఫీల్ అవుతాడని, తీసివ్వాల్సిందిగా బబితను కోరింది. రింగ్ కోసం చెరువులోకి దిగిన బబిత, లోతు ఎక్కువగా ఉండటంతో తాడు సాయంతో బయటకు వచ్చేందుకు యత్నించింది. అయితే మనీషా...స్నేహితురాలు పైకిరాకుండా గుండెలపై బలంగా కాలితో తన్నడంతో ఆమె నీళ్లలో మునిగిపోయింది. తన కుమార్తె మృతిపై బబిత కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. పోస్ట్‌మార్టం నివేదికతో పాటు మనీషాను తమదైన శైలిలోవిచారణ జరపటంతో నేరం అంగీకరించింది. దీంతో పోలీసులు బుధవారం మనీషాను అదుపులోకి తీసుకుని ఐపిసి సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు. -
జాతీయస్థాయి హాకీ పోటీలకు అజయ్
రేటూరు(కాకుమాను): హాకీ అండర్14 జాతీయ స్థాయి పోటీలకు రేటూరు విద్యార్థి కె.అజయ్ ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు వీరచంద్ర బుధవారం తెలిపారు. ఇటీవల కర్నూలులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో అండర్ 14 విభాగం నుంచి పాఠశాలకు చెందిన కె.అజయ్ అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. వచ్చే నెల హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో అతను పాల్గొంటారని చెప్పారు. ఈసందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజారత్నం, ఉపాధ్యాయులు, విద్యార్థులు అజయ్‌ను అభినందించారు. -
పవన్ తమ్ముళ్లు వీళ్లే..!
సర్థార్ గబ్బర్ సింగ్ సినిమాతో అభిమానులకు షాక్ ఇచ్చిన పవన్, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే డాలీ దర్శకత్వంలో కాటమరాయుడు సినిమాను ప్రారంభించిన పవన్ కళ్యాణ్ కీలక పాత్రలకు నటీనటుల ఎంపికను కూడా పూర్తి చేశాడు. తమిళ సూపర్ హిట్ సినిమా వీరంకు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్‌కు ముగ్గురు తమ్ముళ్లు ఉంటారు. అయితే ఈ పాత్రల్లో ఎవరు కనిపించనున్నారన్న చర్చ చాలా రోజులుగా జరుగుతోంది. ఫైనల్‌గా ఈ ముగ్గురు తమ్ముళ్ల పాత్రలకు నటీ నటుల ఎంపిక పూర్తయ్యింది. ఇప్పటికే గబ్బర్‌సింగ్ సినిమాలో పవన్ సోదరుడిగా నటించిన అజయ్ ఒక తమ్ముడిగా నటిస్తుండగా, కమల్ కామరాజు, శివబాలజీలు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. పవన్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను శరత్ మరార్ నిర్మిస్తున్నాడు. -
పేద విద్యార్థికి ఆర్థిక సాయం
హిందూపురం రూరల్ : మండలంలోని మిట్టమీదపల్లి గ్రామానికి చెందిన అజయ్ అనే పేద విద్యార్థికి కిరికెర సహకార సంఘం అధ్యక్షుడు బేవనహళ్లి ఆనంద్ శుక్రవారం రూ.5 వేలు ఆర్థికసాయం చేశారు. ఇంటర్మీడియట్లో 947 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన అజయ్ హిందూపురంలోని బిట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా విద్యాభ్యాసం కోసం విద్యార్థి తండ్రి ఆర్థికసాయం కోరగా ఆనంద్ స్పందించి రూ.5 వేల నగదు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లేష్, బాబు, మనోజ్ తదితరులు ఉన్నారు. -
ప్రాణాలను పణంగా పెట్టి తీశాం
కీకారణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి తగడు చిత్రాన్ని తెరకెక్కించామని ఆ చిత్ర దర్శకుడు ఎం.తంగదురై వెల్లడించారు. రాగదేవి ప్రొడక్షన్స్ పతాకంపై రాజేంద్రన్ కుప్పసామి నిర్మించిన చిత్రం తగడు. ప్రభ, అజయ్, సనంశెట్టి, దీపక్‌రాజ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎం.చార్లస్ మిల్విన్ సంగీతాన్ని, ఇళయకంభన్ పాటల్ని అందించారు. చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ ఏదైనా ఒక విషయాన్ని కొత్తగా చేసి సాధించాలన్న లక్ష్యంతో తపించే ముగ్గురు యువకులు, ఇద్దరు యువతులకు ఒక సీడీ దొరుకుతుందన్నారు. అందులోని సమాచారం ప్రకారం వివరాలు శోధించడానికి నడుం బిగించి అడవుల్లోకి వెళతారన్నారు. అక్కడ వారు ఎదుర్కొన్న సమస్యల నుంచి ఎలా బయటపడ్డారు? వారి లక్ష్యాన్ని సాధించారా? అన్న పలు ఆసక్తికరమైన సంఘటనలతో కూడిన చిత్రం తగడు అని తెలిపారు. కారరణ్యంలో ప్రాణాలను పణంగా పెట్టి చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు.అయితే చిత్రం చూసిన తరువాత కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కుతుందనే నమ్మకం కలిగిందని, ఈ నెల 19న తగడు చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. -
అజయ్‌కు ఆపన్నహస్తం
ప్రొద్దుటూరు టౌన్: అజయ్‌కి మేమున్నామంటూ దాతలు ముందుకొచ్చారు. సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘అజయ్‌ను ఆదుకుందాం’ కథనాన్ని చూసి చాలా మంది చలించిపోయారు. కొందరు సాక్షికి ఫోన్ చేసి వారి వివరాలను తెలుసుకోవడంతోపాటు కొందరు ఇంటి వద్దకు వెళ్లి కుటుంబ సభ్యులకు డబ్బు అందించారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర నాయకుడు శివచంద్రారెడ్డి కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్ ఇంటికెళ్లి రూ.10 వేలు సహాయం అందించారు. అజయ్ తల్లి శ్రీలక్ష్మి, తండ్రి బాలాజిలతోపాటు ఆ ప్రాంత డ్వాక్రా సంఘాల మహిళలు, శ్రీగోపికృష్ణ విద్యాసంస్థల చైర్మన్ రమణారెడ్డిని కలిసి అజయ్ పరిస్థితిని వివరించారు. పాఠశాల కరస్పాండెంట్ ప్రదీప్రెడ్డిచేత రూ.10 వేలు ఇప్పించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కూడా రమణారెడ్డి మాట్లాడారు. రెండు మూడు రోజుల్లో మరింత సాయం అందిస్తామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలల జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డితోపాటు పట్టణాధ్యక్షుడు రమణారెడ్డితో కూడా మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ సమావేశం ఉందని,ఆ సమావేశంలో అజయ్‌ని ఆదుకునేందుకు నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. విద్యార్థులు సాత్విక్ రెడ్డి, షణ్ముఖనందిని తండ్రి బండి రమణారెడ్డి పిల్లల పుట్టిన రోజు సందర్భంగా రూ.4వేలు సహాయం అందించారు. హైదరాబాద్‌కు చెందిన బిల్డర్ ప్రవీణ్ రూ.10 వేలు అందిస్తామని చెప్పారు. అలాగే అజయ్ ఇంటి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి రూ.10వేలు అందించారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు కృషి... మున్సిపల్ కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి ఉన్న విషయం తెలుసుకుని అజయ్ తల్లిదండ్రులు, డ్వాక్రా మహిళలు వైఎస్సార్సీపీ నాయకుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆయనను కలిశారు. సాక్షి దినపత్రికలో అజయ్ ఆరోగ్య పరిస్థితిపై వచ్చిన కథనాన్ని ఆయనకు చూపించారు. లింగారెడ్డి సీఎం పేషి క్లర్క్‌తో మాట్లాడారు. కేన్సర్‌తో బాధపడుతున్న అజయ్‌కి రూ.10 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వస్తే అక్కడి నుంచి ఎన్టీఆర్ కేన్సర్ ఆస్పత్రికి తీసుకెళుతామని, అజయ్ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చుకు సంబంధించి వైద్యులతో అంచనా వేయించి వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరయ్యేలా చూస్తానని లింగారెడ్డి హామీ ఇచ్చారు. డ్వాక్రా సభ్యుల విరాళం .. అజయ్ నివాసం ఉంటున్న బాలాజి నగర్–2 ప్రాంతంలో ఉంటున్న డ్వాక్రా సంఘాల మహిళలు అజయ్ పరిస్థితిపై చలించిపోయారు. సంఘాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని అజయ్‌కి ఆర్థిక సహాయం అందించేందుకు చర్చిస్తున్నారు. ఇప్పటికే రూ.13వేలు వీరు విరాళాలు వసూలు చేశారు. పట్టణంలో ఉన్న 2,400 సంఘాల సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసుకుని అజయ్‌కి శక్తిమేర ఆర్థిక సహాయం అందించేందుకు కృషి చేస్తున్నారు అజయ్‌కి ఆర్థిక సహాయం అందించే దాతలు తల్లి శ్రీలక్ష్మి సెల్ నెంబర్ 9052085893లో సంప్రదించాలని కోరారు. -
అంతర్జాతీయ స్మగ్లర్ అజయ్‌పై పీడీ యాక్టు
చిత్తూరు: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ అజయ్ (47)పై పీడీ యాక్టు నమోదుచేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. కేరళ రాష్ట్రం కాలికట్ జిల్లాలో ఏప్రిల్ 6న అజయ్‌ను చిత్తూరు పోలీసులు అరెస్టుచేశారు. ఎర్రచందనాన్ని దేశవిదేశాలకు సుమారు 200 టన్నుల వరకు అజయ్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. ప్రస్తుతం కడప జైలులో ఉన్న అతనిపై పీడీ యాక్డు పెట్టాలన్న పోలీసులు ప్రతిపాదనకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. ఇప్పటికే అజయ్‌పై 13 కేసులు నమోదై ఉన్నాయి. -
పవన్‌కి విలన్‌గా సూర్య ఫ్రెండ్
చత్రపతి, విక్రమార్కుడు సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజయ్, ఆ తరువాత ఆకట్టుకునే పాత్రల్లో కనిపించలేదు. ముఖ్యంగా టాలీవుడ్లో అజయ్ తరహా పాత్రలు చేసే నటీనటులు చాలా మంది ఉండటంతో పెద్దగా వెండితెర మీద కనిపించలేదు. అయితే ఇటీవల ఓ గోల్డెన్ ఛాన్స్‌తో వెండితెర మీద సత్తా చాటిన ఈ యువ నటుడు ఇప్పుడు భారీ ఆఫర్స్‌తో దూసుకుపోతున్నాడు. సూర్య హీరోగా తెరకెక్కిన 24 సినిమాలో విలన్ పాత్రకు నమ్మకస్తుడైన అనుచరుడు మిత్రాగా నటించాడు అజయ్. సినిమా అంతా కనిపించే కీలక పాత్రలో నటించిన అజయ్ తెలుగుతో పాటు తమిళ ఆడియన్స్‌నూ మెప్పించాడు. అదే జోరులో ఇప్పుడు టాలీవుడ్లో కూడా ఓ స్టార్ హీరో సినిమాలో నెగెటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్‌జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం అజయ్‌ను విలన్‌గా ఎంపిక చేశారు. ఈ సినిమా రిలీజ్ తరువాత తనకు మరిన్ని అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాడు అజయ్. -
ఆస్తికోసం నగ్న చిత్రాలు తీసి..
హైదరాబాద్: నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ వ్యక్తి సొంత మరదలిని కత్తితో బెందిరించి అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో వెలుగుచూసింది. ఓ యువకుడు తన మరదలి పేరిట ఉన్న ఆస్తిని తన పేరిట రాయక పోతే నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వివరాలు.. గుంటూరు జిల్లా తుళ్లూరుకు చెందిన అజయ్ ఇటీవలి సొంత మరదలి పేరుతో స్థలం కొన్నాడు. ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో.. ఒక్కసారిగా భూమికి ధర పెరిగింది. దీంతో ఆ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ప్లాన్ వేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మరదలిని కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడి, ఫొటోలను తీశాడు. అనంతరం ఎవరికైన చెప్పినా.. ఆస్తి తన పేరిట రాయక పోయినా నగ్నచిత్రాలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించాడు. దీంతో వేధింపులు భరించలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. నిందితుడికి గతంలోనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌తో వివాహం అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు. -
అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. గౌరపాలెం ప్రాంతానికి చెందిన కొణతాల అజయ్(8) శుక్రవారం సాయంత్రం నుంచి కనిపించడం లేదు. బాలుడి తల్లిదండ్రులు పలు చోట్లు వెతికినా లాభం లేకుండా పోయింది. అర్థ రాత్రయినా ఆచూకీ తెలియలేదు. అదే సమయంలో వారికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి అజయ్ తమ చెరలో ఉన్నాడని, రూ. లక్ష ఇస్తే విడిచి పెడతామని బెదిరించారు. దీనిపై బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన మేరకు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. -
రాజన్నకు సాయమందిస్తా: కేసీఆర్
కొడుకు వైద్యంతో పాటు కూతురి పెళ్లి కూడా జరిపిస్తానని హామీ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ కళాకారుడు, గాయకుడు, గేయ రచయిత సుందిళ్ల రాజన్న కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హామీ ఇచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్న కొడుకు అజయ్‌కి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా రాజన్న ప్రజల్లో చైతన్యం కలిగించారు. ‘తెలంగాణ వచ్చేదాకా తెగించి మాట్లాడుడే’ లాంటి పాటలెన్నో రాశాడు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే రాజన్నకు తెలంగాణ సాంస్కృతిక సారధిలో ప్రభుత్వం ఉద్యోగ అవకాశం కూడా కల్పించింది. అయితే ఇటీవల ఆయన కొడుకు అజయ్ తీవ్ర అనారోగ్యానికి గురికాగా, ఎంటెక్ చదివిన కూతురు శ్వేత వివాహం కూడా నిశ్చయమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాజన్న సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తో కలసి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎంను కలిసి పరిస్థితిని వివరించారు. స్పందించిన ముఖ్యమంత్రి కూతురు పెళ్లి జరిపిస్తానని, ఆర్థిక సహాయం కూడా అందిస్తానని, కుమారుడి వైద్య ఖర్చులన్నీ భరిస్తానని రాజన్నకు హామీ ఇచ్చారు. -
అందమైన ప్రేమ చిత్రం
దేశాన్ని పట్టి పీడిస్తున్న ఓ సామాజిక సమస్య కథాంశంగా రూపొందిన చిత్రం ‘అనగనగా ఓ చిత్రమ్’. శివ, మేఘశ్రీ జంటగా స్వీయదర్శకత్వంలో ‘ప్రేమకథా చిత్రమ్’ ఫేమ్ జె. ప్రభాకర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న విడుదల కానుంది. దర్శక-నిర్మాత జె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ- ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ‘బాహుబలి’ చిత్రానికి రచయితగా పని చేసిన అజయ్ కథా, కథనాలు ఈ చిత్రానికి ఓ హైలైట్. ఓ వాణిజ్య చిత్రానికి కావాల్సిన అన్ని హంగులూ ఇందులో ఉన్నాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వినోద్ యాజమాన్య, సహ-నిర్మాత: కొడాలి సుబ్బారావు, నిర్మాణ నిర్వహణ: నల్లూరి శ్రీనివాస్. -
ప్రేమ కథా చిత్రంగా కలైవేందన్
ఈ ఆధునిక కాలంలో ఏదో ఒక కొత్తదనం లేకపోతే సినిమాలు ఆడే పరిస్థితి లేదు.అలా ఒక కొత్త విలు విద్యతో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న చిత్రం కలైవేందన్. అజయ్, సనమ్‌శెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్కేపీఎస్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత కమల్‌కన్నన్ నిర్మిస్తున్నారు. కళాభవన్మణి, అనూమీనన్, కాదల్సుకుమార్, ఆర్తి, యువరాణి, సాధన ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతల్ని ఆర్కే పరశురామ్ నిర్వహిస్తున్నారు. చిత్రం వివరాలను ఆయన తెలుపుతూ కరాటే, జూడో తర హాలో వియత్నాం దేశంలో ప్రాచుర్యం పొందిన ఒలినాం అనే ఆత్మరక్షణ విలువిద్యలో శిక్షకుడైన హీరో హీరోయిన్‌కు మధ్య ప్రేమకు సమస్యలు ఎదురవుతాయన్నారు. ముఖ్యంగా హీరోయిన్ కుటుంబసభ్యులు వీరి పేమను వ్యతిరేకిస్తారన్నారు.అలాంటి పరిస్థితిలో హీరోయిన్ హత్యకు గురవుతుందని చెప్పారు. ఆమె హత్యకు కారకులైన వారిపై హీరో ఎలా ప్రతీకారం తీసుకున్నారన్నదే కలైవేందన్ చిత్రం అన్నారు. శ్రీకాంత్‌దేవా సంగీతం చిత్రానికి పెద్ద అసెట్ అవుతుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. -
ఆ ఇంట్లో ఏం జరిగింది?
రాజుగారి ఇల్లు అంటే ఆ ఊళ్లో అందరికీ హడల్. ఆ ఇంట్లోకి వెళ్లిన కొంత మంది వ్యక్తుల జీవితాల చుట్టూ తిరిగే చిత్రం ‘రాజుగారింట్లో 7వ రోజు’. భరత్‌కుమార్ పీలం నిర్మించిన ఈ చిత్రానికి ఫిరోజ్ రాజ దర్శకుడు. అజయ్ ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రంలో భరత్, అర్జున్, వెంకటేశ్, అక్షయ్, సుస్మిత ముఖ్యతారలు. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘అజయ్ పాత్ర హైలైట్‌గా నిలుస్తుంది. భయపెడుతూ, నవ్విస్తూ సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. కనిష్క స్వరపరచిన పాటలను, చిత్రాన్ని వచ్చే నెల విడుదల చేయాలనుకుంటున్నాం ’’ అని దర్శకుడు తెలిపారు. -
అనగనగా ఓ రాజుగారి ఇల్లు
అది రాజుగారి ఇల్లు. ఆ ఇంట్లో ఉండటానికి కొంత మంది వచ్చారు. కానీ సరిగ్గా ఏడో రోజు అనుకోని సంఘటనలు జరిగాయి. మరి తర్వాత ఏం జరిగింది...? అసలు రాజుగారు ఎవరు? అనేది తెలియాలంటే ‘రాజుగారింట్లో 7వ రోజు’ చూడాల్సిందే. అజయ్, భరత్, అర్జున్ ప్రధానపాత్రల్లో భరత్ ఫిలిం పతాకంపై భరత్ కుమార్ పీలం నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఫిరోజ్ రాజ దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా లీడ్ రోల్లో నటిస్తున్నా, హారర్, కామెడీ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: క్రాంతి కె,కుమార్, సంగీతం: కనిష్క్. -
చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి
నెల్లూరు: చేపల వేటకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పత్తెపల్లి కౌరుగుంట గ్రామపంచాయతీ పరిధిలోని సున్నంబట్టి చెరువు వద్ద జరిగింది. వివరాలు..సున్నంబట్టి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఆదివారం సెలవు దినం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఆరవ తరగతి చదువుతున్న బెల్లంకొండ వివేక్(11), గుంజు పవన్(11), నెల్లూరు అజయ్(13)లు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడటంతో ఈత రాకపోవడంతో మృతి చెందారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలురు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. -
రాలిన విద్యా కుసుమాలు
కూలి పనిచేస్తూ చదువుతున్న అజయ్ పెళ్లి పీటలు ఎక్కబోయి పాడెక్కిన హంస చిత్తూరు నగరంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. విగత జీవులుగా పడి ఉన్న విద్యార్థులను చూసి ఆస్పత్రికి వచ్చిన వారు చలించిపోయారు. వారి తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు.. కుటుంబ నేపథ్యం చూస్తే మృత్యువు కూడా ఎందుకు వీరిపై యమపాశాన్ని విసిరామా..? అని కన్నీరు పెట్టకతప్పదు. చిత్తూరు (అర్బన్): యాదమరి మండలం కొట్టాలకు చెందిన శ్రీనివాసులు, కమలమ్మ రెండో కుమారుడు అజయ్ (16). ఊహ తెలిసిన నాటికే నాన్న చనిపోయాడు. నిరుపేద కుటుంబం. ఉండడానికి సొంత ఇళ్లు లేకపోవడంతో బంధువుల ఇంట్లో తలదాచుకుంటున్నారు. తల్లి కూలి పనిచేస్తేనే ఇల్లు గడుస్తుంది. కొట్టాల ప్రభుత్వ పాఠశాలలో 9.2 మార్కులతో పదో తరగతి పాసయిన అజయ్ పెద్దయితే ఇంజనీరయ్యి పేదరికాన్ని జయించాలని ఎంపీసీలో చేరాలనుకున్నాడు. కానీ దానికి డబ్బులు ఎక్కువవుతుందని తెలుసుకుని రాజీపడి సీఈసీ చదవడానికి చిత్తూరు నగరంలోని ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక్కడా పేదరికం వెక్కిరించడంతో రెండు నెలలుగా కళాశాల ఫీజు కట్టలేక కూలి పనికి వెళుతూ మంగళవారం రూ.1,500 ఫీజు చెల్లించాడు. బుధవారం మరో రూ.వెయ్యి చెల్లించి హాల్‌టికెట్టు తీసుకోవడానికి కళాశాలకు వచ్చాడు. రూ.200 చెల్లిస్తే కళాశాల వార్షికోత్సవానికి అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో వార్షికోత్సవానికి వెళ్లలేక బయట తిరుగుతూ ఉన్నాడు. గురువారం వచ్చి రూ.1,500 చెల్లించి హాల్‌టికెట్టు తీసుకుంటానని స్నేహితులకు చెప్పి బస్టాండులో బస్సు ఎక్కడానికి వెళుతున్నాడు. దీంతో ఒక్కసారిగా వాహనం రూపంలో వచ్చిన మృత్యువు అజయ్‌ను ఢీ కొట్టింది. రక్తస్రావం మధ్య అజయ్‌ను స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తీసుకెళుతుండగా. ‘ నేను బతుకుతానా..? మా అమ్మను చూడాలి...’ అంటూనే కళ్లుమూశాడు. ఆస్పత్రిలో నిర్జీవంగా పడివున్న అజయ్ మృతదేహాన్ని చూసిన ఇతని తల్లి గుండెలు పగిలేలా రోదించడం పలువురిని కలచివేసింది. ఇక చిత్తూరు గ్రామీణ మండలం మర్రికుంటకు చెందిన నాగరత్నరాజు, రత్నమ్మ రెండో కుమార్తె హంస (21) నగరంలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతోంది. తాను.. తన చదువు.. కొందరు స్నేహితులు తప్ప హంసకు మరే ప్రపంచం తెలియదు. నెల రోజులుగా జ్వరంతో కళాశాలకు వెళ్లని హంస బుధవారం కళాశాకని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. తిరుపతిలో క్యాంపస్ సెలక్షన్ జరుగుతోందని తెలుసుకుని అక్కడి వెళ్లి ఇంటర్య్వూకు హాజరయ్యి చిత్తూరుకు చేరుకుంది. స్నేహితులతో కలిసి ఊరికి వెళ్లడానికి రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తూ వ్యాన్ కింద పడి అక్కడిక్కడే మృత్యుఒడికి చేరుకుంది. ‘ ఇన్ని రోజులూ ఇంటి దగ్గరే ఉండి ఈ రోజనంగా కాలేజీకని చెప్పి మమ్మల్ని వదిలివెళ్లిపోయావా చెల్లీ...’ అంటూ మృతురాలి అక్క గీత, ‘నెల రోజుల్లో పెళ్లి పందిరి ఎక్కాల్సిన దానివి పాడె ఎక్కావమ్మా...?’ అంటూ మృతురాలి తండ్రి నాగరత్నరాజు ఆర్తనాదాలు చూస్తూ గుండెలు అవిసేలా రోదించడం చూపరులకు కంటతడి పెట్టించింది. రోడ్డు ప్రమాదం దోషులు పోలీసులే ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని నడిపింది గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పీ.పురుషోత్తం. విషయాన్ని బుధవారం రాత్రి వరకు పోలీసుశాఖ గోప్యంగా ఉచింది. అప్పటికే విషయం బయటకు పొక్కడంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా వాహనం నడిపిన పురుషోత్తంను సస్పెండ్ చేస్తూ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రమాదానికి కారణమైన కేఏ 01-బీ 2141 వాహనం ఎర్రచందం తరలించే దొంగల నుంచి సీజ్ చేసిందని కొందరు, రికార్డులు సరిగా లేకపోవడంతో రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారని మరికొందరు చెప్పుకుంటున్నారు. పోలీసు స్టేషన్లో నెలల తరబడి కండిషన్లో లేనివాహనాన్ని కానిస్టేబుల్ పురుషోత్తంతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చిత్తూరుకు తీసుకొచ్చినట్లు విశ్వశనీయంగా తెలిసింది. పరారీలో ఉన్న కానిస్టేబుల్‌ను అరెస్టు చేయడానికి తూర్పు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఓ బృందాన్ని, వాహనం పోలీసు స్టేషన్ నుంచి ఎలా బయటకు వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవడానికి విచారణ అధికారిగా ఏఎస్పీ అన్నపూర్ణారెడ్డిని నియమిస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారని చిత్తూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీకాంత్ పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా మృతుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఎస్పీ శ్రీనివాస్ పరామర్శించారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో ఉన్న హసం, అజయ్ కుటుంబీకులను ఓదార్చారు. గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అవసరమైతే వేలూరు, తిరుపతి ఆస్పత్రులకు తరలించి చికిత్స డాక్టర్లను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికీ రూ.1.50 చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్యే సత్యప్రభ చేతులుమీదుగా అందజేశారు. -
ప్రాణం తీసిన పది రూపాయలు
ముంబై: పది రూపాయల విషయంలో చికెన్ షాపు యజమానికి, కస్టమర్లకు మధ్య తలెత్తిన గొడవ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది. మధ్య ముంబైలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో చికెన్ షాపు యజమాని ఫిరోజ్ షేక్(35) మరణించాడు.నిందితులు కుందన్ చౌదరి, సంజయ్ భారతి, దామోదర్ సాహూలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. వడ పావ్ షాపులో పనిచేసే నిందితులు, షేక్ షాపులో రూ. 105ల చికెన్ తీసుకున్నారు. కానీ, షేక్ 115 రూపాయలను వసూలు చేశాడు. దీంతో పది రూపాయల విషయంలో వివాదం చెలరేగింది. నిందితులు ముగ్గురు షేక్‌పై దాడికి దిగడంతో ఆయన స్పృహ కోల్పోయాడు. నిందితుల్లో చౌదరిని స్థానికులు అక్కడే పట్టుకోగా, మిగిలిన ఇద్దరు పారిపోయారు. షేక్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగిలిన ఇద్దర్ని వారి నివాసాల్లో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులకు కోర్టు ఈనెల 30 వరకు పోలీసు కస్టడీ విధించినట్లు సమాచారం. -
ఉసురు తీసిన ఈతసరదా
కొప్పెప్పాడు(సంతమాగులూరు): ఈత సరదా పసివారి ఉసురుతీసింది. ఆదివారం బడికి సెలవు కావడంతో సరదాగా ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు చెరువులో మునిగి ఊపిరాడక మృత్యువాత పడ్డారు. బల్లికురవ మండలం కొప్పెరప్పాడులో ఆదివారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన బుర్రి బుల్లియ్య ఏకైక కుమారుడు శ్రీను (8), గోరంట్ల గంగయ్య చిన్న కుమారుడు కుమారుడు అజయ్ (11)లు స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడు, ఐదు తరగతులు, బుర్రి ఆంజనేయులు చిన్న కుమారుడు అశోక్ (11) ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లాక మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైకిల్‌పై గ్రామం సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ముగ్గురూ ఒకేసారి చెరువులో దూకారు. చిన్నవాడైన శ్రీను ముందుగా నీట మునగడంతో అతడ్ని రక్షించేందుకు అశోక్, అజయ్ కూడా నీటి లోతులోకి వెళ్లారు. లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ మునిగిపోయి ఊపిరాడక చనిపోయారు. సాయంత్రం 6 గంటల సమయంలో చెరువు కట్టపై వస్తున్న స్థానికులు అక్కడ సైకిల్ మాత్రమే ఉండి..పిల్లలు కనిపించకపోవడంతో చెరువు నీటిలోకి చూశారు. అక్కడ పిల్లల మృతదేహాలు తేలుతూ కనిపించాయి. దీంతో వెంటనే వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పొలం పనుల నుంచి వచ్చిన వారు విషయం తెలుసుకుని బోరున విలపిస్తూ చెరువు వద్దకు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు. కన్నవారిని గుండెలకు హత్తుకుని రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ముగ్గురు చిన్నారులు సమీప బంధువుల బిడ్డలు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఘటనా స్థలాన్ని సందర్శించిన అద్దంకి సీఐ: ముగ్గురు బాలురు చెరువులో మునిగి మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న అద్దంకి సీఐ పి.సాంబశివరావు, బల్లికురవ ఎస్సై చౌడయ్యలు హుటాహుటిన కొప్పెరప్పాడు చేరుకుని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
డిమాంటి కాలనీ షూటింగ్ ప్రారంభం
హర్రర్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతోందనే చెప్పాలి. యువ హీరో అరుళ్‌నిధి సైతం హారర్ కథా చిత్రాల బాట పట్టారు. ఈయన నటిస్తున్న తాజా చిత్రం డిమాంటి కాలనీ. హర్రర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ద్వారా ఏఆర్ మురుగదాస్ శిష్యుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు మెగాఫోన్ పడుతున్నారు. ఈయన 7 ఆమ్ అరి వు, తుపాకీ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. మోహనా మూవీస్, శ్రీ తేనాండాళ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం చెన్నైలో జరిగాయి. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది మూడు కాల ఘట్టాల్లో జరిగే యథార్థ గాథ చిత్రంగా తెరకెక్కిస్తున్న చిత్రం అని చెప్పారు. భయానక సన్నివేశాలతో కూడిన హర్రర్ కథా చిత్రం డిమాంటి కాలనీ అని తెలిపారు. ఒక ప్రముఖ నటి హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రంలో రమేష్ తిలక్, అభిషేక్ సానత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారని చెప్పా రు. చిత్రం కోసం మూడు కాల ఘట్టాలను ఆవిష్కరించే విధం గా మూడు బ్రహ్మాండమైన సెట్స్‌ను వేస్తున్నట్లు తెలిపారు. చిత్రానికి సంతోష్ శివన్ శిష్యుడు అరవింద్ సింగ్ చాయాగ్రహణం, ఏఆర్ రెహ్మాన్ శిష్యుడు కెపాజరమియా సంగీతాన్ని అందిస్తున్నారని తెలిపారు. మా వీరన్, 7 ఆమ్ అరివు, నాన్ ఈ చిత్రాలకు అబ్బురపరిచే గ్రాఫిక్స్‌ను రూపొందించిన కమలకన్నన్ ఈ చిత్రానికి గ్రాఫిక్స్ అందిస్తున్నారని చెప్పారు. చిత్ర షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా చెన్నై, పొల్లాచ్చి ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఏ కే తమిళరసు, ఎన్.మురళి, ఏఆర్ మురుగదాస్, పాండియరాజ్ తదితరులు విచ్చేసి చిత్ర యూనిట్‌కు ఆశీసులు అందించారు. -
ముగ్గురిని బలిగొన్న ప్రమాదం
నేరేడ్మెట్: రామకృష్ణాపురం ఫ్లైఓవర్‌పై బుధవారం ఉదయం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలపై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు.నేరేడ్మెట్ ఎస్ఐ ప్రవీణ్‌బాబు కథనం ప్రకారం..... నెల్లూరు జిల్లా కొండాపుం మండలం, సాయిపేట గ్రామానికి చెందిన అజయ్ (25), అదే జిల్లా కొడవలూరు మండలం, గుండలమ్మపాలెం గ్రామానికి చెందిన జింకల వెంకటేశ్ (18) ఓల్డ్ సఫిల్‌గూడ పూలపల్లి బాలయ్య కాలనీలో అద్దెకుంటున్నారు. ఇద్దరూ బ్యాచిలర్స్. అజయ్ మేస్త్రీ పని చేస్తుండగా, సహాయకుడిగా వెంకటేశ్ పని చేస్తున్నాడు. కాగా బుధవారం ఉదయం ఎర్రగడ్డలో పని నిమిత్తం ఇద్దరూ కలిసి బైక్ (ఏపీ 29 ఏవై 7216)పై వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, షేక్‌పేట గాంధీనగర్‌కు చెందిన రాము నేరేడ్మెట్లోని యమహా షోరూంలో పని చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ప్రణయ్ (16) రాముకు మిత్రుడు. ప్రణయ్‌కు చెందిన బైక్ (ఏపీ 3072) సర్వీసింగ్ చేసేందుకు బుధవారం ఉదయం ఇద్దరూ కలిసి బైక్‌పై నేరేడ్మెట్లోని యమహా షారూమ్‌కు బయలుదేరారు. వీరిద్దరూ రామకృష్ణాపురం ఫ్లైవర్పైకి రాగానే వెనుకనుంచి అతివేగంగా వచ్చిన జీహెచ్ఎంసీకి చెందిన టిప్పర్ ( ఏపీ 12 డబ్ల్యూ1298) బలంగా ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న ప్రణయ్ చెత్త వాహనం కిందపడిపోగా.. వెనుక కూర్చున్న రాము పక్కన పడ్డాడు. ప్రణయ్ పైనుంచి టిప్పర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న అజయ్, వెంకటేష్‌ల బైక్‌ను వీరి యమహా బైక్ బలంగా ఢీకొట్టింది. దీంతో వారిద్దరూ కిందపడ్డారు. తలకు తీవ్రగాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ ప్రణయ్, స్వల్పగాయాలకు గురైన రామును స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రణయ్ మృతి చెందగా... రాము కోలుకున్నాడు. నేరేడ్మెట్ పోలీసులు అజయ్, వెంకటే శ్ల మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అదుపులోకి తీసుకొని, టిప్పర్‌ను, మృతుల ద్విచక్రవాహనాలను స్టేషన్‌కు తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తులో ఉంది. ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ జాం... రామకృష్ణాపురం బ్రిడ్జిపై ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కార్యాలయాలకు, కళాశాలలకు వెళ్లే వారి వాహనాలతో బ్రిడ్జిపై నుంచి నేరేడ్మెట్ చౌరస్తా వరకు సుమారు గంట సేపు ట్రాఫిక్ జాం అయింది. బ్రిడ్జి వెడల్పు తక్కువగా, రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఇక్కడ తరచూ ప్రమాదాలు జరిగి విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఇదీ అమ్మ మనసు
మూడు నెలల క్రితం కుమారుడి ఆత్మహత్య అప్పటి నుంచి తల్లడిల్లుతున్న తల్లి బెంగతో చనిపోయిన మాతృమూర్తి కామారెడ్డి : కొడుకు బాగా చదువుకుని ప్రయోజకుడవుతాడని కలలు కంది ఆ తల్లి...చెట్టంత ఎదిగిన కొడుకును చూసి ఎంతగానో మురిసిపోయింది. కుటుంబానికి చేదోడు వాదో డుగా ఉంటాడని, ఇక నుంచి తమ కష్టాలు తీరుతాయనుకుంది. కానీ, హఠాత్తుగా కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో ఆ తల్లి మనసు తల్లడిల్లిపోయింది. కొడుకు చనిపోయిననాటి నుంచి బెంగతో నిద్రాహారాలు మాని మంచం పట్టింది. చివరకు తను కూడా చివరి శ్వాస విడిచి కొడుకును వెతుకుతూ వెళ్లిపోయింది. హృదయాలను కలిచివేసిన ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. చీపురు శ్రీనివాస్, లత దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు అజయ్. ఇంటర్మీడియేట్ తర్వాత హోటల్ మేనెజ్మెంట్ చదవాలని ఆశించాడు. తనకు అంత స్థొమత లేదని, డిగ్రీ చదవాలని తండ్రి చెప్పడంతో మానసిక వేదనకు గురైన అజయ్ గత ఆగస్టు ఐదున ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. ఒక్కగానొక్క కొ డుకు మృతి చెందడంతో ఆ తల్లి తట్టుకోలేకపోయింది. అప్పటి నుంచి తిండి, తిప్పలు మానేసింది. ఎవరు ఎంత ధైర్యం చెప్పినా కొడుకు కావాలంటూ ఏడ్చేది. మూడు నెలలుగా ఏ పనిచేయకుండా కొడుకు ఫొటోను చూస్తూనే గడిపింది. అతడి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరయ్యేది. అదే బెంగతో మంచం పట్టిన ల త శుక్రవారం తుది శ్వాస విడిచింది. కొడుకు లేకపోవడంతో భర్త శ్రీనివాస్ ఆమెకు తలకొరివి పెట్టాడు. ఇది చూసి గ్రామస్తులు చలించిపోయి కంటతడిపెట్టారు. -
భయం వేసింది!
‘‘వాస్తవానికి ‘దిక్కులు చూడకు రామయ్య’ కథ వినగానే చాలా బాగుందనిపించింది. వెంటనే భయం కూడా వేసింది. ఇరవయ్యేళ్ల కొడుక్కి తండ్రిగా చేస్తూ ప్రేమలో పడటమనేది రిస్కే కదా. చిత్రీకరణ ఏమాత్రం తేడాగా ఉన్నా బోల్డన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కానీ, దర్శకుడు త్రికోటి అద్భుతంగా తెరకెక్కించారు.’’ అని అజయ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన పత్రికలవారితో ‘దిక్కులు చూడకు రామయ్య’లో తన పాత్ర గురించి మాట్లాడుతూ -‘‘నాలా ఎక్కువగా నెగటివ్ రోల్స్ చేసేవాళ్లు అంత త్వరగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి రీచ్ కారు. కానీ, ‘దిక్కులు చూడకు రామయ్య’లో చేసిన పాత్ర ఫ్యామిలీస్‌కి దగ్గరవుతుందని నమ్మి, చేశాను. అదే నిజమైంది’’ అన్నారు. తనలాంటి ఆర్టిస్టులు మాస్ కమర్షియల్ చిత్రాల్లో హీరోగా నటిస్తే, ప్రేక్షకులు అంగీకరించరని ‘సారాయి వీర్రాజు’తో అర్థమైందని, అందుకే ఆ తర్వాత ఆ తరహా చిత్రాలొచ్చినా చేయలేదని అజయ్ అన్నారు. కేరక్టర్ నటుడిగా కొనసాగుతూనే, కొత్త తరహా కుటుంబ కథా చిత్రాల్లో అవకాశం వస్తే, హీరోగా చేస్తానని అన్నారు. -
స్టార్ రిపోర్టర్@ అజయ్
-
నెం.1 స్టూడెంట్స్
రిపోర్టర్- అజయ్ కాలేజ్ ఏజ్‌లో యంగ్ తరంగ్‌ల ఆలోచనలు రాంగ్ రూట్లో దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంటాయి. కొంటె చూపుల అట్రాక్షన్కే.. ప్రేమంటే ఇదేరా..! అని ఫిక్సయిపోయి.. లక్ష్యం మరచి గమ్యం వెతికే వెర్రిబాగులోళ్లని అనుకుంటారంతా. కానీ, ఈ యంగిస్థాన్‌లు మాత్రం నిదానమే మా విధానం అంటున్నారు. తప్పు కాని ప్రేమ కోసం తప్పు చేయాల్సిన అవసరం లేదంటున్నారు. చదువుల్లో మెప్పించి.. పెద్దలను ఒప్పిస్తే.. ప్రేమికులు ప్రేమ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితే రాదని ఢంకా బజాయిస్తున్నారు. జెండర్ ఈక్వాలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ, పొలిటికల్ స్టుపిడిటీ.. ఇలా అన్ని అంశాలపై వారికంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. సాక్షి ‘సిటీప్లస్’ తరఫున ‘స్టార్ రిపోర్టర్’గా సినీ నటుడు అజయ్ విద్యార్థులను పలకరించిన వారంతా తమ అంతరంగాన్ని, తమలోని విలువల కోణాన్నీ ఇలా ఆవిష్కరించారు. అజయ్: మన దేశంలో ఆడపిల్లల మనుగడ కష్టంగా ఉందంటారా? మమత: ఉందండి. కాలం ఇంత మారాక కూడా ఉంది. చేతన్: బిడ్డ పుట్టగానే భవిష్యత్తుని ఊహించుకుని భయపడిపోతున్నారు. అమ్మాయి అయితే అన్నీ మనమే చూడాలి. అదే అబ్బాయి అయితే వాడే మనల్ని చూస్తాడు అనే ఆలోచనలు అసలు కారణం. అజయ్: ఆర్థిక స్తోమత లేనివారే కాదు.. చాలా డబ్బుండి, చక్కని పొజిషన్లో ఉన్న ఫ్రొఫెసర్ల వంటివారు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారని విన్నాం. ఆ మధ్య సత్యమేవ జయతే కార్యక్రమంలో ఇదే టాపిక్ వచ్చింది. చాలా వాస్తవాలను చూపించారు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వారుండటం చాలా దురదృష్టకరం. మరి దీనికి పరిష్కారం ఏంటి? చేతన్: ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి సార్. చిన్నప్పుడు పాఠాల్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ వంటి సబ్జెక్టులతో పాటు హ్యూమన్ వాల్యూస్‌ని తెలిపే ఒక సబ్జెక్ట్‌ని కూడా పెట్టాలి. మిగతా సబ్జెక్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. ముందు ఓ మనిషి సాటివారి పట్ల ఎలా మసులుకోవాలో స్కూల్ డేస్ నుంచే నేర్పించాలి. అజయ్: ఎగ్జాక్ట్లీ. సరే పురిట్లో రక్షణ గురించి అలా ఉంచితే.. పెద్దయ్యాక అమ్మాయికి ఉన్న రక్షణ గురించి మాట్లాడండి. మమత: రోజురోజుకీ సెక్యూరిటీ తగ్గిపోతోంది. కిడ్నాప్‌లు, రేప్‌లు.. దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. అజయ్: ఆపద సమయంలో కాంటాక్ట్ అవడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఓ యాప్ తయారుచేసింది కదా! శృతి: అసలు దాని గురించి ఎంతమందికి తెలుసు సార్. అజయ్: అకృత్యాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలున్నాయి. అయితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మమత: సామాజికంగా చైతన్యం తీసుకురావాలి. అప్పుడే వీటికి చెక్ పెట్టగలం. అజయ్: అవును. నా తర్వాతి ప్రశ్న.. కాలేజీ అనగానే చదువుకంటే ముందుగా గుర్తొచ్చే టాపిక్ ప్రేమ అయిపోయిందిప్పుడు. మీరుచెప్పండి.. ప్రేమ పెళ్లి మంచిదా? పెద్దవాళ్లు చేసే పెళ్లి బెటరా? సునీత: నా ఓటు మాత్రం అరేంజ్డ్ మ్యారేజ్‌కే ! అజయ్: ఏ.. ప్రేమ పెళ్లిళ్లు మంచివి కావంటారా? మమత: అలా అని కాదు. మా భవిష్యత్తు గురించి, భద్రత గురించి తల్లిదండ్రులకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది! మనోజ్: ప్రేమించడం తప్పు కాదు సార్. ప్రేమను దాచిపెట్టడం తప్పు. ప్రేమించి వదిలేయడం ఇంకా పెద్ద తప్పు. ప్రేమ గురించి పెద్దలకు చెప్పి వారిని ఒప్పించి పెళ్లి చేసుకోవాలి. ప్రేమ కోసం ఫ్యామిలీని వదులుకోవడం మాత్రం మంచిది కాదు. చేతన్: ప్రేమలో పడి కెరీర్‌ను స్పాయిల్ చేసుకోవడం తప్పంటాను. కానీ సార్, సినిమాల పుణ్యమా అని పదో తరగతి పిల్లలు కూడా ప్రేమలో పడిపోతున్నారు. అజయ్: నిజమే.. సినిమాల ప్రభావం అందరిపై ఉంటుంది. కానీ ఏది మంచో ఏది చెడో తెలుసుకోకుండా తప్పటడుగులు వేయకూడదు. చాలామంది అట్రాక్షన్‌ను ప్రేమగా భావించి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. మనోజ్: ఆ విషయాన్ని చెప్పే సినిమాలు ఎక్కువగా రావాలి సార్. అజయ్: రీడింగ్ అవర్స్ బాగా పెరిగిపోయాయి. మీరు తల్లిదండ్రులతో ఎంత సమయం గడుపుతున్నారు? శ్రుతి: చాలా తక్కువే. అయినా ఆ సమయం చాలా అమూల్యమైంది. నేను చంపాపేటలో ఉంటాను. అక్కడికి ఇక్కడికి రావాలంటే పొద్దున ఏడింటికల్లా బయలుదేరాలి. మళ్లీ ఇంటికెళ్లేసరికి రాత్రి ఎనిమిదవుతుంది. హాస్టల్లో ఉండమని సజెస్ట్ చేసేవాళ్లూ ఉన్నారు. హాస్టల్లో ఉంటే ఆ కాస్త టైం కూడా అమ్మను మిస్ అయిపోతాను. అందుకే ట్రావెల్ చేస్తున్నాను. అజయ్: గుడ్. ఇప్పుడున్న హడావుడి జీవితంలో అమ్మానాన్నల దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకునే సమయమే తక్కువ ఉందంటే.. ఈ కాస్త టైం పిల్లలు సెల్‌ఫోన్‌తో గడిపేస్తున్నారు. ఏమంటారు ? ప్రసాద్: నిజమే.. ఒకే ఇంట్లో ఉన్నవాళ్లూ వాట్సప్‌లో హాయ్.. హలో అంటూ పలకరించుకుంటున్నారు. అజయ్: నిన్న నేనొక స్టార్ హోటల్‌కి వెళ్లాను. అక్కడికి ఓ ముగ్గురబ్బాయిలు డిన్నర్‌కు వచ్చారు. అక్కడున్నంత సేపూ ఎవరి ఫోన్లలో వారు మాట్లాడుకున్నారు. దాని కోసం కలసి రావడం దేనికనిపించింది. శ్రీనివాస్: సెల్ ఫోన్ యూజ్ చాలా పెరిగిపోయింది. ఫ్రెండ్స్‌తో నేరుగా మాట్లాడటాన్ని ఎవరూ ఇష్టపడటం లేదు. వాట్సప్, ఫేస్‌బుక్‌లోనే దోస్తీ చేస్తున్నారు. అజయ్: స్టూడెంట్స్ ఎదుర్కొనే స్ట్రెస్ గురించి చెప్పండి. దాని కారణంగా చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ప్రసాద్: అవును. మొన్నామధ్య మా కజిన్ ఒకతను ఆత్మహత్య చేసుకున్నాడు. బాగా డబ్బున్న కుటుంబం. ఒక్కగానొక్క కొడుకు. తన బంధువులంతా పెద్ద చదువులతో విదేశాల్లో సెటిల్ అయ్యారు. వారిని అందుకోవాలనే తాపత్రయంలో సీరియస్‌గా చదవడం మొదలుపెట్టాడు. తన యాంబిషన్ చేరుకోలేనన్న ఒత్తిడిలో సూసైడ్ చేసుకున్నాడు. అజయ్: ఎదుటివారితో కంపారిజన్, పోటీ.. ఇవే ఇలాంటి పరిస్థితులకు కారణం. విద్య విషయంలో రెండో ఆలోచనకు చోటు ఇవ్వకపోవడం ఒత్తిడికి దారితీస్తోంది. ఓకే.. మీలో ఎవరైనా పొలిటికల్ లీడర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రసాద్: నో సార్. దానికి రెండు అర్హతలుండాలి. ఒకటి ఎవరేమన్నా పడే ఓపిక. ఎవరినైనా ఏమైనా అనే దమ్ము. అలా ఉన్నప్పుడే లీడర్ కాగలం. అజయ్: భలే కొటేషన్ చెప్పావ్ (నవ్వుతూ). ఇలా ఉండాలి అనడానికి అది ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ప్రొఫెషన్ కాదు కదా! సొసైటీకి సంబంధించింది. అజయ్: ఈ మధ్యకాలంలో సామాజిక అంశాలపై అందరూ బాగా స్పందిస్తున్నారు. రీసెంట్గా స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరుగుతోంది. మీరు పాల్గొన్నారా? మమత: అవును సార్. ప్రసాద్: నాకు చాలా రోజుల నుంచి ఒక కోరిక ఉండేది సార్. వారానికోసారి పిల్లలందరం కలసి మా కాలేజీని శుభ్రపరుచుకోవాలని. స్వచ్ఛభారత్ కూడా అలాంటిదే కదా సార్. అజయ్: అంతేగా...మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రపరుచుకుంటే చాలు. దేశమంతా క్లీన్ అండ్ నీట్‌గా మారిపోతుంది. ఓకే. సాక్షి తరఫున రిపోర్టర్‌గా మారి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్యూ. అజయ్: అబ్బాయిలూ.. మీలో 500 సీసీ బైక్ ఎవరికి ఉంది? అశోక్: నాకుంది సార్. అజయ్: చెప్పు అశోక్.. రోడ్డు ప్రమాదాల గురించి రోజూ వింటూనే ఉన్నాం. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డు యాక్సిడెంట్లు. సేఫ్ జర్నీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? అశోక్: మెహిదీపట్నం బిడ్జిపై స్పీడ్ లిమిట్ బోర్డులుంటాయి సార్. దాన్ని క్రాస్ చేస్తే స్పీడ్ లిమిట్ ఫైన్ పడుతుంది. సిటీ అంతటా అలాంటివి ఏర్పాటు చేయాలి. అజయ్: మీకు ఇంతవరకూ ఎన్ని ఫైన్లు పడ్డాయి? (నవ్వుతూ) అశోక్: అస్సలు పడలేదు. అజయ్: మామూలుగా ఏ స్పీడ్‌లో వెళతారు? (నిజం చెప్పాలి) అశోక్: అరవై. అప్పుడప్పుడు డెబ్బయ్. అజయ్: ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి ఏ స్పీడ్‌లో ఎంత టైం పడుతుంది ? అశోక్: డెబ్బయ్లో వస్తే ఐదు నిమిషాలు.. యాభైలో వస్తే ఏడు నిమిషాలు అజయ్: రెండు నిమిషాల తేడా అన్నమాట. ఈ టూ మినిట్స్‌పై ఎంతమంది ప్రాణాలు ఆధారపడి ఉంటాయో ఒకసారి మనకు మనం ఆలోచించుకోవాలి. ఏమంటారు? అశోక్: అంతే సార్. -
అందుకే ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా!
‘కత్తి పట్టేంత వయసు, స్థాయి... నాకిప్పుడు లేవు. అందుకే... ముందు పువ్వు పట్టుకుని వస్తున్నా. కుటుంబ ప్రేక్షకులను రంజింపజేయడమే నా ముందున్న లక్ష్యం’ అంటున్నారు యువ నటుడు నాగశౌర్య. చందమామ కథలు, ఊహలు గుసగుసలాడే... చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య ‘దిక్కులు చూడకు రామయ్య’తో నేడు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే... తండ్రి, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తే : ఈ కథే గమ్మత్తుగా ఉంటుంది. తండ్రీ, కొడుకు ఒకే అమ్మాయిని ప్రేమిస్తారు. పర్యవసానం ఏంటి? అనేది ఈ సినిమా కథ. నా తండ్రి పాత్రను అజయ్ పోషించారు. మా ఇద్దరి సన్నివేశాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. ఇంద్రజ చాలా రోజుల తర్వాత నటించిన సినిమా ఇది. ప్రతి సన్నివేశాన్నీ కలర్ఫుల్గా, మనసుల్ని తాకేలా తెరకెక్కించారు త్రికోటి. ‘ఈ సినిమా నీకు మంచి బ్రేక్ అవుతుంది’ అని చూసిన వెంటనే నిర్మాత సాయి కొర్రపాటి తొలి ప్రశంస అందించారు. కీరవాణిగారి చేతులమీదుగా తొలి చెక్ అందుకున్నా: నేను సోలో హీరోగా చేస్తున్న తొలి సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’కు కీరవాణిగారు సంగీతం అందించినందుకు చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. నేను నటునిగా తొలి చెక్కు ఆయన నుంచే అందుకున్నాను. ‘ఊహలు గుసగుసలాడే’ ఆడిషన్స్‌లో నేను హీరోగా సెలక్టయ్యానని నాకు తెలీదు. పిలిస్తే, ఆఫీస్‌కి వచ్చాను. కొబ్బరికాయ చేతికిచ్చి కొట్టమన్నారు. అందరూ బాగుండాలని కొబ్బరికాయ కొట్టాను. అప్పుడు కీరవాణిగారే చెక్కు నాకిచ్చారు. అప్పుడర్థమైంది సెలక్టయ్యానని. ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. కుటుంబ ప్రేక్షకులకు చేరువ అవ్వడమే నా లక్ష్యం: కత్తులు పట్టుకోవడానికి, యుద్ధాలు చేయడానికి చాలామంది హీరోలున్నారు. కానీ... పువ్వులు పట్టుకునే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారనేది నా అభిప్రాయం. అందుకే... ప్రస్తుతానికి ఇలాంటి పాత్రలే చేస్తాను. నాకు ఇమేజ్‌తో పనిలేదు. ఎలాంటి పాత్ర అయినా నాగశౌర్య చేయగలడు అనిపించుకుంటే చాలు. ఆమిర్‌ఖాన్ నాకు ఆదర్శం. ఆయనలా ఇమేజ్‌కి భిన్నంగా పేరు తెచ్చుకోవాలనుంది. -
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడలేదు: సినీనటుడు అజయ్
హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడలేదని సినీనటుడు అజయ్ వెల్లడించారు. తన ఫోటోతో వార్త రావడంతో అజయ్ మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. పలు మీడియా సంస్థలకు పోన్ చేసి తాను కాదని వివరణ ఇచ్చినట్టు సమాచారం. బంజారాహిల్స్ లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో అజయ్ అనే జూనియర్ ఆర్టిస్టుతోపాటు ఓ సినీ రచయిత కూడా పట్టుబడినట్టు వార్త బయటకు వచ్చింది. దాంతో విక్రమార్కుడు తదితర చిత్రాల్లో నటించిన అజయ్ పట్టుబడినట్టు పలు వెబ్ సైట్లలో వార్తలు వచ్చాయి. -
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ సినీ నటుడు!
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో పోలీసులు నిర్వహించిన డ్రంక్&డ్రైవ్‌లో జూనియర్ ఆర్టిస్ట్ అజయ్, రచయిత శ్రీనివాస్ లు పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్న వీరికి బంజారా హిల్స్ పోలీసులు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించారు. బ్రీత్ అనలైజర్ తనిఖీల్లో అజయ్, శ్రీనివాస్ లు మోతాదుకు మించి మద్యం సేవించినట్టు వెల్లడైంది. వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. రోజువారి తనఖీల్లో భాగంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్టు పోలీసులు తెలిపారు. -
రెణ్ణిమిషాల జాబితా
ప్రార్థన వరుసగా ‘ఐదు రోజులు’ సెలవులు రావడంతో- పిల్లలు ఊరెళ్లారు. పుస్తకాలు రంజింపజేయలేని ఒంటరితనం! ఈ ఆదివారపు నిరర్థకమైన పగటిపూటకు నన్ను అక్కున చేర్చుకోగలిగేవారెవరు? లక్కీగా అజయ్ ఖాళీగావున్నాడు. పైగా ఇలాంటి పిలుపుకోసమే ఎదురుచూస్తున్నాడు. ఇంకేం! ఇద్దరమూ అనంతగిరి వెళ్లిపోయాం. వికారాబాద్ ఎర్రటినేలలు, కడిగినట్టున్న నల్లటి రోడ్లు, పచ్చటి ఆకులు, మసక మసక కొండల అంచులు, ఊయలలూగనిచ్చే గిల్లీ తీగలు, గుహను తొలిచిన మున్యాశ్రమం, కోనేటిపక్కన వాల్చిన నడుము, అడ్డంగా పరుగెత్తిన ముంగిస, సాగినంత నడక, పీల్చుకోగలిగినంత గాలి, వర్షం పడీపడనట్టున్న సుతిమెత్తటి వాతావరణం... మేము ఆశించినదానికంటే దొరికింది చాలా ఎక్కువ! దానికి ‘కృతజ్ఞతగా’ మెట్లు ఎక్కీ దిగీ ఆలయంలోకి వెళ్లాం. సన్నని ద్వారంగుండా దిగువకు, లోపలికి ప్రవేశించాం. పలుచటి జనంతో అనంతపద్మనాభ స్వామి! పూజారి - మంత్రాలేవో చదువుతున్నాడు. ముందున్నవాళ్లు శ్రద్ధగా వింటున్నట్టున్నారు. నా పక్కనున్న అజయ్ దండం పెట్టుకోవడానికి చేతులు ముడుస్తున్నాడు. అయితే, దేవుడి దగ్గర తనకు అహం ఏమీలేదన్నమాట! నేనేం చేయను? ఒకటేదో కోరుకోవాలి; నాకు సంబంధించినవాళ్లందరికీ శుభం కలగాలి. రెండు నిమిషాలు(!) కళ్లు మూసుకున్నాను. అమ్మ, బాపు, తమ్ముడు, పిల్లలు, చెల్లి, వాళ్ల పిల్లలు- వారిని పట్టించే ఆహార్యాలతో నా లోపల కదలాడారు. బంధువులు- మేనత్తలు, మామయ్యలు, వాళ్ల కుటుంబం, మా అత్తవాళ్లు, వదినలు... మా ఆఫీసు సహచరులు- ఎం, వై, 1, 2, 3, 4, 5... అక్క, బావ... ఐదో తరగతి దోస్తులు- రా, బా, ఎ, కె... ఆ వీళ్లు- నీ, పు, అ, కి... టెన్తు ఫ్రెండ్సు- శి, ప్ర, క్రా, సు, సా... డిగ్రీ, పాతాఫీస్, అక్కడ, అరే ఇటు, అటు... స్థలాన్ని దాటి కాలపు వేగంతో పేర్లు నాకు తగులుతూవున్నాయి. రా, సం, కు, మ, శ్రీ, భ... పేరునుంచి మరో పేరుకూ, ఊరినుంచి మరో ఊరికీ, పట్నం నుంచి నగరానికీ స్మరణ దూకుతూవుంది. ఇంకా ఎవరు? ఎల్, జె, బి, పి, ఎస్... ఇంకా ఎవర్ని మిస్సయ్యాను! నిజంగా నేను కోరుకోవడం వల్లే వాళ్లందరికీ మంచి జరిగేట్టయితే, నేను వాళ్లపేరు తలుచుకోకపోవడం న్యాయం కాదు కదా! పేర్లను తలుచుకుంటున్నప్పుడు కూడా కాలాన్ని లెక్కగట్టడం ఆపలేదు. రెణ్నిమిషాల అంచనాతో కళ్లు తెరిచాను. దేవుడు నన్ను సూటిగా చూస్తున్నట్టున్నాడు! ఇంకా ఎన్నో పేర్లు స్ఫురిస్తున్నాయి. మామూలుగా రోజూ మాట్లాడేవాళ్లు ఇందాక గుర్తురాలేదు. డి, ఐ, జె, వి, బి, ఎన్... ఇంకా, వెళ్తున్నప్పుడు ఉప్పు రాసి జామకాయలమ్మిన ముసలాయన... మమ్మల్ని ఆటోలో అంతదాక మోసుకెళ్లిన అమ్జాద్... అక్కడే డిపార్టుమెంటులో పనిచేసే యాదగిరి... నేను కోరుకోవడం వల్లే మంచి జరిగేట్టయితే- ఏ ఒక్కరినీ వదలకూడదని కదా నా ఆలోచన! నా స్మరణ ఎంత వేగంగా జరిగినప్పటికీ, కొన్ని పదులకొద్దీ పేర్లను తలచుకున్నప్పటికీ, ఇంకా ఎన్నో పేర్లు నేను ఆ క్షణంలో మరిచిపోయాను. అలాంటిది, ఈ భూమ్మీది కోటానుకోట్ల మనుషుల్నీ, మనుషుల్నే కాకుండా సకల చరాచర జీవరాశుల్నీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడా? ఒకవేళ మరిచిపోతే? గుర్తుపెట్టుకుంటేగనక ఆయన కచ్చితంగా దేవుడే అయ్యుండాలి! - పూడూరి రాజిరెడ్డి -
'పండా అరెస్ట్ పెద్ద నాటకం'
భువనేశ్వర్: మావోయిస్టు అగ్రనేత సవ్యసాచి పండా అరెస్ట్ పెద్ద నాటకమని నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) ప్రకటించింది. ఒడిశా ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో పండా అరెస్ట్ ఓ భాగమని ఆ పార్టీ అభివర్ణించింది. మావోయిస్టులపై తమ ప్రభుత్వం పోరాడుతుందని చెప్పుకునేందుకు ఒడిశా ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని విమర్శించింది. ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రత్యేక జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అజయ్ ఈ మేరకు ఓ లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. పార్టీ నుంచి పండాను రెండేళ్ల క్రితమే బహిష్కరించినట్లు తెలిపారు. మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులు, ప్రభుత్వానికి చేరవేస్తున్నారనే అభియోగాలు వెల్లువెత్తిన నేపథ్యంలో పండాను బహిష్కరించిన సంగతిని అజయ్ ఈ సందర్భంగా లేఖలో వివరించారు. ఈ నెల 18వ తేదీన బరంపురం పట్టణంలో పండాను అరెస్ట్ చేసినట్లు ఒడిశా పోలీసులు ప్రకటించారు. అనంతరం ఆయన్ని పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు పండాకు 10 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. పండాపై నయాగఢ్, ఆర్ ఉదయ్గిరిలో ఆయుధాలు లూటీ, స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఇటాలియన్ జాతీయులు కిడ్నాప్ కేసులతోపాటు పలు కేసులలో పండా నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. పండాను పోలీసులు అరెస్ట్ చేసిన ప్రకటనపై మావోయిస్టు పార్టీపై విధంగా స్పందించింది. -
'గాల్లో తేలినట్టుందే' స్టిల్స్
-
place of దోశ
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీ... చుట్టూ కాంక్రీట్ జంగిల్... ఐటీ కంపెనీలు... అక్కడే ఓ ఖాళీస్థలంలో ఉన్న వ్యాన్.. వందల రుచులు పంచుతూ మీ మనసును ‘దోసె’స్తుంది. అందుకే ఆడీ కారు అబ్బాయి నుంచి అడ్డా కూలీ వరకు సాయంత్రం కాగానే అందరూ అక్కడికి చేరుకుంటారు.. రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకుంటూ తమకిష్టమైన దోసెలను రుచిచూస్తారు. - ప్రవీణ్‌కుమార్ కాసం రకరకాల దోశలతో మీ మనుసు దోచే రుచులను పంచుతున్న ఆ వ్యాన్ వెనక పెద్ద చరిత్రే ఉంది. ఏడేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి, కంపెనీ డెరైక్టర్‌గా పనిచేసిన అజయ్ అనే యువకుడి ఆలోచనల ప్రతిరూపమే ఈ దోశ ప్లేస్. కేవలం ఈ దోశలేయడానికి ఆయన ఐటీ జాబ్‌కు టాటా చెప్పి ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. ఇంట్లోవాళ్లు కాస్త తటపటాయించినా, తనపై తనకున్న నమ్మకంతో మాదాపూర్‌లో హైటెక్ హంగులతో ఈ ‘దోశ ప్లేస్’ను ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్లలో లాగా శుభ్రంగా ఉండాలి.. రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకొంటూ తినాలి అనుకోనేవారికి ఈ ప్లేస్ సరైన వేదిక. ఎల్ఈడీ లైట్లు, జనరేటర్, వాటర్సింక్లతో ప్రత్యేకంగా నిర్మించిన ఈ వ్యాన్‌లో మీరు 111 రకాల దోసెలకు ఆర్డరివ్వవచ్చు. జిహ్వకో రుచి... జనరల్ దోసెలు కాదు జనం మెచ్చే దోసెలు అందిచాలన్నది అజయ్ కోరిక. అందుకే వ్యాన్లోనే సెంచరీ ప్లస్ దోశలు తయారు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ తీన్మార్ దోశ చాలా ఫేమస్. అలాగే కేరళ ఓపెన్, డ్రైట్ ఫ్రూట్ దోశలాంటి వెరైటీలు కూడా లభిస్తాయి. చిన్నపిల్లలకోసం పిజ్జా దోసె, ముసలివాళ్ల కోసం ప్రకృతి దోశ ఇలా ప్రతి వయసు వారినీ దోచే దోశలూ ఉన్నాయి. అంతేకాదు టేస్టీ, క్వాలటీ విషయంలో రాజీపడకూడదనేది దోశ ప్లేస్ సిద్ధాంతం. అందుకే పరిశుభ్ర వాతావరణంలో మనముందే ఇక్కడ తయారు చేస్తారు. అక్కడి దోశలు రుచి చూస్తుంటే అజయ్ భార్య విద్య (దోశ ప్లేస్ డెరైక్టర్) మీ ఫీడ్‌బ్యాక్‌ను కూడా అడిగి తెలుసుకుంటుంటారు. అందరికీ కేరాఫ్... ఇక్కడ దోశలు తినాలంటే మరీ పర్సు తడుముకోవాల్సిన అవసరం లేదు. దోశ రకాలను బట్టి రూ.30 నుంచి రూ.120 లోపు మాత్రమే ఇక్కడ ధరలుంటాయి. రోజూ 300 మంది దోశ ప్రియులను ఈ చిన్న ట్రక్కు సంతృప్తి పరుస్తుంది. సాఫ్ట్వేర్లు, సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ వీల్-ఆన్-దోశకు పడిపోయారు. భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడి రుచులను ఆస్వాది స్తుంటారు. ఆరుబయట కూర్చొని కమ్మని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి దోశలు లాగించేయాలంటే మాదాపూర్‌లోని ఈ దోశ ప్లేస్ మీకు కరెక్ట్ ప్లేస్. ఎప్పటికప్పుడు కొత్తగా... నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆశయంతోనే ఈ దోశ ప్లేస్‌ను ఏర్పాటు చేశా. ఇక్కడ క్వాలిటీ, టేస్టీ, హైజెనిక్ ఈ మూడు పక్కా పాటిస్తాం. మరిన్ని రకాల దోశలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. ముంబై, బెంగళూరు తదితర పట్టాణాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. నగరంలో మరో పదిచోట్ల కూడా ఇలాంటివే ఏర్పాటు చేయబోతున్నాం. దీని వల్ల వందల మందికి ఉపాధినిస్తున్నాననే సంతృప్తి కలుగుతోంది. - అజయ్ కోనేరు, దోశ ప్లేస్ సీఈఓ -
ప్రేమలో ఎబిసి మూవీ పోస్టర్స్
-
ప్రేమలో ఏబీసి ఏంటి..?
అజయ్, రిషి, రూబీ పరిహార్, శ్రీఐరా ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసి’. తలారి నాగరాజు దర్శకుడు. జె.వి.రెడ్డి నిర్మాత. ఏలేందర్ బైగళ్ల స్వరాలందించిన ఈ చిత్రం పాటల ప్లాటినమ్ డిస్క్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. అతిథులుగా విచ్చేసిన వీఎన్ ఆదిత్య, మల్టీడైమన్షన్ వాసు చేతుల మీదుగా డిస్క్‌ల ప్రదానం జరిగింది. వి.సముద్ర, అశోక్‌కుమార్, స్టీవెన్ శంకర్, రామసత్యనారాయణ, డార్లింగ్ స్వామి తదితరులు ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. లవ్, యాక్షన్, ఎంటర్టైనర్ ఇదని, నెలాఖరున సినిమా విడుదల చేస్తామని దర్శకుడు చెప్పారు. ఈ సినిమాకు వచ్చే లాభాలను తన అమ్మానాన్నల పేరిట ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కి ఉపయోగిస్తానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఇ.ఎస్.హెచ్.ప్రసాద్. -
అమ్మ మాట..
సేతినిండా పని కల్పించాలె నా ఒక్కగానొక్క కొడుకు అజయ్ డిగ్రీ సదువుకుంట, తెలంగాణ కోసం పెట్టే మీటిం గులకు పోయేటోడు. తెలంగాణ అస్తలేదని బాధపడేటోడు. తెలంగాణ రాదని అందరూ చెప్పుకుంటుంటే ఏడ్చేటోడు. తెలంగాణ అస్తే ఉద్యోగమస్తది అనేటోడు. 2010 మే నెల 25న ఇంట్లోనే ఉరేసుకుని చచ్చిపోయిండు. ఇప్పడు తెలంగాణ అచ్చింది నా కొడుకు ఎలాగూ లేడు. కాబట్టి కనీసం సదువుకున్నోళ్లకు అయినా ఉపాధి అవకాశం సూపెట్టాలె. సొంతంగ రాష్ట్రం అచ్చెదాక ఎట్ల కొట్లాడిర్రో, అట్లే ప్రతి ఊరు బాగయ్యేదాక అందరు పాటుపడాలె. తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల కుటుంబాలకు ఇంటి కో ఉద్యోగం ఇయ్వాలె. స్వాతంత్య్ర సమరయోధులకు వచ్చే సదుపాయాలు కల్పించాలె. సేతి నిండ పని దొరుకుతనే కడుపు నిండ తిండి దొరుకుతది. ఉపాధి అవకాశాలు పెరుగుతనే అందరు పనిల పడతరు. సేకరణ : విజయేందర్‌రెడ్డి, చొప్పదండి -
ప్రేమలో ఎబిసి మూవీ స్టిల్స్
-
ప్రేమలో జాగ్రత్తగా ఉండాలి
పేమలో జాగ్రత్తగా ఉండకపోతే ఎదురయ్యే పరిణామాలు, ప్రమాదాల సమాహారంతో రూపొందిన చిత్రం ‘ప్రేమలో ఏబీసీ’. తలారి నాగరాజుని దర్శకునిగా పరిచయం చేస్తూ జేవీ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో అజయ్, రిషి, శ్రీఐరా, రూబీ ముఖ్య తారలు. ఎలెందర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -‘‘ఏబీసీ అంటే ‘ఆల్వేస్ బీ కేర్‌ఫుల్’ అని అర్థం. యాక్షన్ ఓరియంటెడ్ లవ్ థ్రిల్లర్ ఇది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రం టీనేజ్ పిల్లలతో పాటు పెద్దలు కూడా చూసే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఉన్న పాటల్లో ఓ పాటను కీరవాణిగారు పాడటం విశేషం’’ అని చెప్పారు. లవ్, ఎంటర్టైన్మెంట్, యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కావడం ఆనందంగా ఉందని నాగరాజు అన్నారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: హరిప్రసాద్‌రెడ్డి, మాటలు: శ్రీముత్యం ఇజ్జరౌతు, కెమెరా: ఇ.సి.హెచ్. ప్రసాద్. -
అజయ్, కాజోల్ దాంపత్య జీవితానికి 15 ఏళ్ళు
-
మార్చి నెలాఖరుకల్లా మెద క్లో ‘హైరిస్క్ కేంద్రం’
మెదక్‌టౌన్, న్యూస్‌లైన్ : మాతాశిశు మరణాలను నివారించేందుకు మార్చి నెలాఖరు కల్లా మెదక్‌లో ‘హైరిస్క్ కేంద్రం’ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్మితా సబర్వాల్ తెలిపారు. శుక్రవారం ఆమె, కేంద్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ అరుణ్‌సింగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీలతో కలిసి మెదక్ ఏరియా ఆస్పత్రిని సందర్శిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆస్పత్రిలో మార్చి 31లోగా ఏర్పాటు చేయనున్న హైరిస్క్ కేంద్రానికి కాంట్రాక్ట్ పద్ధతిన సిబ్బందిని నియమించుకోవడంతో పాటు అవసరమైన పరికరాలను కొనుగోలు చేసుకోవాలని సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆదేశిం చారు. ఆస్పత్రిలో ప్రస్తుతం నెలకు 125 కాన్పులు జరుగుతున్నాయనీ, వీటిని 250కి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం కావాల్సిన సిబ్బందిని, పరికరాలను సమకూరుస్తామన్నారు. ఆ స్పత్రి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికే సిద్దిపేటలో హైరిస్క్ కేంద్రం ప్రారంభించామని త్వరలోనే మరికొన్ని చోట్ల ప్రారంభించి మాతాశిశు మరణాలను తగ్గించేం దుకు కృషి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ సహానీ తెలిపారు. జి ల్లా కలెక్టర్ ఆరోగ్య విషయాలపై చూపిస్తున్న శ్రద్ధను ఆయన అభినందించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు జాయిం ట్ కలెక్టర్ మూర్తి, ఆర్డీఓ వనజాదేవి, డీసీహెచ్ వీణాకుమారి, డీఎం,హెచ్ఎం పద్మ, డీపీఎం జగన్నాథ్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, వైద్యులు చంద్రశేఖర్, శివదయాల్, హేమ్రాజ్ పాల్గొన్నారు. -
సిద్దిపేటలో హైరిస్క్ ప్రసవ కేంద్రం ఏర్పాటు
సిద్దిపేటటౌన్,న్యూస్‌లైన్: సిద్దిపేట మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆవరణలో ఈనెల 24న రాష్ట్రంలోనే తొలి హైరిస్క్ ప్రసవ కేంద్రానికి ప్రారంభోత్సవం చేస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్‌రావు తెలిపారు. ఆదివారం ఆయన సిద్దిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో శిశువులకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో గర్భిణుల బీపీ, షుగర్ లెవల్స్‌లో తేడాలు వచ్చినా, రక్తహీనత ఉన్నా వారిని వెంటనే హైదరాబాద్‌కు తరలించే వారన్నారు. బడుగు వర్గాలకు చెందిన మహిళలు ఎక్కువగా సిద్దిపేట ఆస్పత్రికి వస్తున్నందున వారి కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైరిస్క్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారన్నారు. వైద్య ఆరోగ్యపరిషత్ ఎండీ అజయ్ సహానితో పాటు పలువురు ప్రముఖులు ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇక నుంచి గర్భిణులకు ఇక్కడ అన్ని రకాల వైద్యసేవలు నిరంతరాయంగా అందుతాయన్నారు. అదేవిధంగా 30 రోజుల లోపు వయసు ఉన్న శిశువుల సంరక్షణ కోసం ఆధునిక పరికరాలతో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 13 మంది నర్సులు, గైనకాలజిస్టులు, 24 గంటలు పనిచేయడానికి ముగ్గురు ప్రత్యేక డాక్టర్లను నియమిస్తామన్నారు. ఆస్పత్రిలో రూ. 12 లక్షల విలువైన పరికరాలను ఏర్పాటు చేశారన్నారు. సీసీ కెమెరాలు, స్కైప్ ద్వారా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఇక్కడి సేవలను తనిఖీ చేస్తారన్నారు. గర్భిణుల స్కానింగ్ పరీక్షలు నిర్వహించడానికి శిక్షణ పొందిన డాక్టర్ లేనందున ప్రైవేట్ డయాగ్నసిస్ సెంటర్లో పేద గర్భిణులకు ఉచిత స్కానింగ్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిచ్చిన కలెక్టర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తక్కువ ధరలకే మందులు జీవనధార పథకం కింద సిద్దిపేట అర్బన్, రూరల్ సమాఖ్యల ద్వారా రెండు జనరిక్ మందుల దుకాణాలను ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 30 నుంచి 40 శాతం తక్కువ ధరలతో గుర్తించిన కంపెనీల మందులు ఇక్కడ లభిస్తాయన్నారు. తక్కువ ధరల్లో లభించే నాణ్యమైన మందులను ఎవరైనా కొనుగోలు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో వైద్యులు జగన్నాథరెడ్డి, శివరాం, శివానందం, కాశీనాథ్, ధర్మ, సుజాత, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సూపరింటెండెంట్‌పై ఎమ్మెల్యే ఫైర్ సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన మందుల చీటీలు కనిపించాయి. సర్కారు దవాఖాన నుంచి కొందరు డాక్టర్లు ప్రైవేటు దందాలో భాగస్వాములవుతున్నట్లు సాక్ష్యం లభించింది. ఆస్పత్రిలోని వైద్యుల గదిలో పుస్తకాల మధ్య ఈ చీటీ పుస్తకం కనిపించింది. అమృత పిల్లల ఆస్పత్రి చిరునామా, డాక్టర్ వివరాలు అందులో ఉన్నాయి. ఇక్కడి వైద్యులు రోగులను ప్రైవేటు ఆస్పత్రికి పంపించి వ్యాపారంలో భాగస్వాములవుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయమై ఎమ్మెల్యే హరీష్‌రావు దృష్టికి వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రి సూపరిండెంట్ శివరాంను ప్రశ్నించారు. ఆయన సరిగా సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. ఇలాంటి దందాను సహించేదిలేదన్నారు. ఇటువంటి సంఘటన పునరావృతం కారాదన్నారు. -
'ఇష్టసఖి' మూవీ స్పైసీ స్టిల్స్.
-
అదిరిందిరా బుజ్జి
-
‘ఇష్టసఖి’ స్టిల్స్
అజయ్, వరుణ్, శ్రీరామ్, భాస్కర్, అనుస్మృతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘ఇష్టసఖి’. శ్రీహరి ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రానికి భరత్ పారేపల్లి దర్శకుడు. వింజమూరి మధు నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది. -
రూ.50 కోట్ల విలువైన ప్లాటినం విగ్రహాలు స్వాధ్వీనం
ఉత్తరప్రదేశ్‌లో బరిచాలోని దొన్నక్క ప్రాంతంలో ఇద్దరు యువకుల నుంచి నాలుగు ప్లాటినం దేవత విగ్రహలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ మోహిత్ గుప్తా శుక్రవారం వెల్లడించారు. నిందితలు అజయ్, రామ్ కిషోర్‌లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి మరింత సమాచారం కోసం పోలీసులు తమదైన శైలీలో విచారిస్తున్నట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తి అందించిన సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్‌కు నిన్న దొన్నక్క ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు యువకుల నుంచి అత్యంత విలువైన విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బ్రహ్మ,లక్ష్మీ,గణేష్, నంది ప్లాటినం విగ్రహాలను సీజ్ చేసినట్లు తెలిపారు. బహిరంగ మార్కెట్లో ఆ విగ్రహాల విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని మోహిత్ గుప్తా తెలిపారు. -
ముగ్గురూ క్వార్టర్స్‌లోనే...
టోక్యో: తొలిసారి ఓ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ నుంచి ముగ్గురు క్రీడాకారులు క్వార్టర్ ఫైనల్ దశకు అర్హత పొందినా... ఒక్కరు కూడా ముందంజ వేయలేకపోయారు. శ్రీకాంత్, అజయ్ జయరామ్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలవ్వడంతో జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్‌లో భారత కథ ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో అన్‌సీడెడ్ కె.శ్రీకాంత్ 18-21, 9-21తో ఏడో సీడ్ కెనిచి టాగో (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. 39 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో శ్రీకాంత్ పోరాట పటిమను కనబర్చాడు. ఓ దశలో 13-18తో వెనుకబడ్డా నెట్ వద్ద మెరుగ్గా ఆడుతూ ప్రత్యర్థి ఆధిక్యాన్ని 17-18కి తగ్గించాడు. అయితే బలమైన స్మాష్‌లతో చెలరేగిన టాగో వరుసగా మూడు పాయింట్లు సాధించి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో మెరుగైన స్మాష్‌లతో ఆకట్టుకున్న ఈ ఏపీ కుర్రాడు నెట్ వద్ద విఫలమయ్యాడు. దీంతో గట్టిపోటీ ఇవ్వలేకపోయాడు. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రణయ్ 11-21, 22-20, 13-21తో హుయాన్ గో (చైనా) చేతిలో;అజయ్ జయరామ్ 18-21, 13-21తో ఐదోసీడ్ టియాన్ మిన్ గుయాన్ (వియత్నాం) చేతిలో ఓడిపోయారు. -
మూడు తరాలు... మూడు ప్రేమకథలు
ఒకే అపార్ట్మెంట్కి చెందిన మూడు తరాలకు సంబంధించిన మూడు జంటల ప్రేమకథతో రూపొందిన చిత్రం ‘చిన్ని చిన్ని ఆశ’. రాజీవ్ సాలూరి, అజయ్, అపర్ణానాయర్ ముఖ్య తారలు. డా.కిరణ్ దర్శకుడు. శ్రీనివాస్ గరిమెళ్ల నిర్మాత. దిగ్దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేక పాత్ర పోషించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘భావోద్వేగాల నేపథ్యంలో సాగే సినిమా ఇది. సింగీతంగారు పోషించిన పాత్ర సినిమాకే వన్నె తెచ్చింది. అన్ని వర్గాలనూ అలరిస్తుందీ చిత్రం’’ అన్నారు. ఈ నెలాఖరున కానీ, వచ్చే నెల తొలివారంలో గానీ సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ధన్య, బాలకృష్ణన్, వాసు ఇంటూరి తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ: వీఎన్ సతీష్, సంగీతం: కార్తీక్ ఎం., కూర్పు: మార్తాండ్ కె.వెంకటేష్, కెమెరా: దాము నర్రావుల, సహ నిర్మాత: ఇందుకూరి నరసింహరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వి.ఎస్.వి.శివసాయికృష్ణ.