చేపల వేటకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు.
నెల్లూరు: చేపల వేటకు వెళ్లిన ముగ్గురు బాలురు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన ఆదివారం నెల్లూరు జిల్లా దగదర్తి మండలం పత్తెపల్లి కౌరుగుంట గ్రామపంచాయతీ పరిధిలోని సున్నంబట్టి చెరువు వద్ద జరిగింది. వివరాలు..సున్నంబట్టి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు ఆదివారం సెలవు దినం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు.
ఆరవ తరగతి చదువుతున్న బెల్లంకొండ వివేక్(11), గుంజు పవన్(11), నెల్లూరు అజయ్(13)లు చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు చెరువులో పడటంతో ఈత రాకపోవడంతో మృతి చెందారు. విషయం తెలిసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికితీశారు. అనంతరం పోస్ట్‌మార్టంకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు బాలురు చనిపోవడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.